ప్రయాగ్‌ రాజ్‌లో పుష్పరాజ్‌.. పోలీసులు ఫిదా! | Allu Arjun Fan Video Viral In Social Media Pushpa 2 Movie Style | Sakshi
Sakshi News home page

Pushpa 2 The Rule Movie: ప్రయాగ్‌ రాజ్‌లో పుష్పరాజ్‌.. పోలీసులు ఫిదా!

Published Thu, Feb 6 2025 2:49 PM | Last Updated on Thu, Feb 6 2025 4:27 PM

Allu Arjun Fan Video Viral In Social Media Pushpa 2 Movie Style

అల్లు అర్జున్‌ పుష్ప సినిమాకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం ఇండియాలోనే కాదు.. అంతర్జాతీయ స్థాయిలో పుష్పరాజ్‌ హవా కొనసాగుతోంది. ఇటీవల పుష్ప-2 ఓటీటీలో విడుదలవగా.. క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్‌పై తెగ చర్చింకుంటున్నారు. హాలీవుడ్ అభిమానులు సైతం పుష్ప ఫైట్ సీన్‌పై వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. సినిమాలో డైలాగ్ చెప్పినట్లే పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్ అని బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ  అవుతున్నారు.

ఇక ఇండియావ్యాప్తంగా బన్నీ క్రేజ్‌ గురించి మనందరికీ తెలిసిందే. పుష్ప-2 నార్త్‌లో ప్రభంజనం సృష్టించింది. ఏకంగా రూ.800 కోట్లకు పైగా నెట్ వసూళ్లు రాబట్టింది. గతంలో ఏ హిందీ సినిమాకు సాధించని ఘనతను సొంతం చేసుకుంది. దీంతో సౌత్‌ కంటే నార్‌లోనే పుష్పరాజ్‌ హవా ఎక్కువగా కొనసాగింది. దీంతో ఉత్తరాది ఫ్యాన్స్‌ బన్నీ మేనరిజానికి ఫిదా అయిపోయారు. పుష్ప స్టైల్లో డైలాగ్స్ చెబుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

తాజాగా ఓ ‍అభిమాని అచ్చం పుష్పరాజ్‌ స్టైల్లో కనిపించి సందడి చేశారు. మహారాష్ట్రకు చెందిన ఓ ‍అభిమాని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభ్‌ మేళాకు వచ్చాడు. పవిత్ర స్నానం చేసిన అల్లు అర్జున్ అభిమాని అచ్చం పుష్ప సినిమాలో దుస్తులు ధరించి డైలాగ్స్‌తో అదరగొట్టాడు. ఇది చూసిన పోలీసులు అతని స్టైల్‌కు ఫిదా అయ్యారు. అతన్ని చెప్పే డైలాగ్స్ వింటూ ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

(ఇది చదవండి: పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా?.. ఇంటర్నేషనల్!)

కాగా.. గతేడాది డిసెంబర్‌ 5న విడుదలైన పుష్ప-2 ది రూల్ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. తొలి రోజు నుంచే కలెక్షన్ల సునామీ సృష్టించిన పుష్ప-2 ఓవరాల్‌గా రూ.1831 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా రష్మిక మందన్నా నటించింది. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్, టాలీవుడ్ నటులు జగపతి బాబు, సునీల్, అనసూయ కీలక పాత్రల్లో మెప్పించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement