పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా?.. ఇంటర్నేషనల్! | International audience reacts to Allu Arjun action scene from Pushpa 2 | Sakshi
Sakshi News home page

Pushpa 2 The Rule: పుష్ప-2 క్లైమాక్స్ సీక్వెన్స్.. ఇంటర్నేషనల్ ఫ్యాన్స్ రియాక్షన్‌ చూశారా?

Published Tue, Feb 4 2025 5:05 PM | Last Updated on Tue, Feb 4 2025 5:24 PM

International audience reacts to Allu Arjun action scene from Pushpa 2

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రం పుష్ప-2 ది రూల్. గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా వరల్డ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. 2021లో వచ్చిన పుష్ప మూవీకి సీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

ఇటీవల పుష్ప-2 ది రూల్‌ ఓటీటీకి కూడా వచ్చేసింది. జనవరి 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అదనంగా యాడ్ చేసిన సీన్స్‌తో పాటు ఓటీటీలో సందడి చేస్తోంది. అయితే ఈ చిత్రంలోని క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్‌ మాత్రం అడియన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. అల్లు ‍అర్జున్‌ గాల్లోకి ఎగిరే ఫైట్ సన్నివేశాలు ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. దీంతో పలువురు నెటిజన్స్‌ సోషల్ మీడియా వేదికగా ఆ ఫైట్ సీక్వెన్స్ వీడియోలను షేర్ చేస్తున్నారు.

బన్నీ ఫైట్ సీక్వెన్స్ వీడియోను ఓ నెటిజన్‌ పోస్ట్ చేయగా.. ఇంటర్నేషనల్ ఫ్యాన్స్ సైతం స్పందించారు. అమెరికా చిత్రాల కంటే బాగానే ఉందని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. మార్వెల్‌లో కూడా ఈ క్రియేటివీటీ సాధ్యం కాలేదు.. కానీ వాళ్లు చేసి చూపించారు అని మరో నెటిజన్ రిప్లై ఇచ్చాడు. మరికొందరైతే పుష్ప-2 గ్లోబల్, ఇంటర్నేషనల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఏదేమైనా పుష్పరాజ్‌ మూవీలోని డైలాగ్‍ను నిజం చేశారు. పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్‌ అంటూ బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement