Prayagraj
-
ట్రెండింగ్ బ్యూటీ.. తల్లితో కలిసి కుంభమేళా స్నానం! (ఫోటోలు)
-
ముగిసిన మహా కుంభమేళా
మహాకుంభ్‌నగర్: ప్రపంచంలోనే అతిపెద్ద సామూహిక వేడుకగా రికార్డుకెక్కిన మహా కుంభమేళా శివరాత్రి పర్వదినం సందర్భంగా బుధవారం ముగిసింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ త్రివేణి సంగమంలో పుణ్యస్నానాల ఘట్టానికి తెరపడింది. 144 సంవత్సరాల తర్వాత వచి్చన ఈ మహా కుంభమేళాకు దేశ విదేశాల నుంచి భక్తులు పోటెత్తారు. 45 రోజులపాటు వైభవంగా సాగిన పుణ్యక్రతువులో ఉత్సాహంగా పాల్గొన్నారు. చివరి రోజు బుధవారం భక్తుల పుణ్యస్నానాలతో గంగ, యమున, సరస్వతి నదుల సంగమస్థలి కిక్కిరిసిపోయింది. ఒక్కరోజే 1.32 కోట్ల మంది తరలివచ్చారు. హరహర మహాదేవ అనే మంత్రోచ్ఛారణలతో ఈ ప్రాంతమంతా మార్మోగిపోయింది. చివరి రోజు కావడంతో భక్తులపై హెలికాప్టర్ల ద్వారా పూలవర్షం కురిపించారు. ఈ ఏడాది జనవరి 13న పౌష్య పూర్ణిమ రోజు మహా కుంభమేళా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 26 వరకూ 66.21 కోట్ల మందికిపైగా జనం స్నానాలు ఆచరించారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ సంఖ్య ప్రపంచంలోని చాలా దేశాల ఉమ్మడి జనాభా కంటే అధికం కావడం గమనార్హం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, ప్రముఖ వ్యాపారవేత్తలు, సినీ నటులు మహా కుంభమేళాలో పాలుపంచుకున్నారు. భూటాన్ రాజు సైతం పుణ్నస్నానం ఆచరించారు. మహా కుంభమేళాను విజయవంతం చేయడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈసారి పటిష్టమైన చర్యలు చేపట్టింది. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించింది. డ్రోన్లు, కృత్రిమ మేధ కెమెరాలను రంగంలోకి దించింది. మహాకుంభ్‌నగర్‌లో ప్రత్యేకంగా టెంట్ సిటీని నిర్మించింది. ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని అపశ్రుతులు చోటుచేసుకున్నాయి. -
మహాకుంభ్‌లో పుణ్య స్నానం ఆచరించిన టీమిండియా మాజీ బౌలర్ అశోక్ దిండా
-
కుంభమేళా నుంచి వస్తుండగా కారు ప్రమాదం.. ఎంపీకి తీవ్ర గాయాలు
లతేహార్: ప్రయాగ్‌రాజ్‌లో అత్యంత వైభవంగా మొదలైన మహాకుంభమేళా నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో భక్తులు భారీ సంఖ్యలో కుంభమేళాకు వచ్చారు. ఇక, తాజాగా కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించి తిరిగి వెళ్తుండగా రాజ్యసభ ఎంపీ మహువా మాజీ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఎంపీకి గాయాలు కావడంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు.వివరాల ప్రకారం.. జార్ఖండ్‌కు చెందిన ఎంపీ మహువా మాజీ కుంభమేళాకు వెళ్లారు. అక్కడ నుంచి తిరిగి వస్తున్న సమయంలో జార్ఖండ్‌లోని లతేహర్ వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. హాట్‌వాగ్ గ్రామ సమీపంలోని NH-75పై బుధవారం తెల్లవారుజామున ఆగి ఉన్న ట్రక్కును ఆమె కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎంపీ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, వెంటనే ఆమెను రాంచీలోకి రిమ్స్‌కు తరలించారు. కారు ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఎంపీ కుమారుడు, కోడలు కూడా ఉన్నారు. ఈ ప్రమాద ఘటనపై ఎంపీ కుమారుడు మాట్లాడుతూ.. ప్రస్తుతం వైద్య చికిత్స జరుగుతోంది. ఉదయం 3:45 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో ఆమె ఎడమ చేతికి బలమైన గాయమైనట్టు వైద్యులు తెలిపారు. కొన్ని టెస్టులు కూడా చేశారు. కాసేపట్లో చేతికి సర్జరీ చేయనున్నారు. ప్రస్తుతం ఆమె మాతో మాట్లాడుతున్నారు. ఆరోగ్యం నిలకడగానే ఉందని అన్నారు. #WATCH | Jharkhand: JMM Rajya Sabha MP Mahua Maji's son Somvit Maji says "We were returning from Maha Kumbh, Prayagraj when this accident took place...My mother (Mahua Maji) and wife were in the back seat. I was driving the car, and around 3:45 AM, I fell asleep, and the car hit… https://t.co/Rz1MXP3tAZ pic.twitter.com/6yswYEnkuH— ANI (@ANI) February 26, 2025ఇదిలా ఉండగా.. ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13న మొదలైన మహాకుంభమేళా నేటితో ముగియనుంది ఈక్రమంలో బుధవారం మహా శివరాత్రి (Maha siva rathri) పర్వదినం సందర్భంగా భక్తులు తరలివస్తున్నారు. ఈ కుంభమేళాలో నేడు చివరి అమృత్ స్నానం కావడంతో భక్తులు పెద్దసంఖ్యలో హాజరవుతున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన ఏర్పాట్లుచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అధికారులు భక్తులకు ప్రత్యేక సూచనలు జారీ చేశారు. భద్రతా నియమాలు పాటించి తమతో సహకరించాలని కోరారు.శివరాత్రి రోజున భక్తులు ట్రాఫిక్‌లో చిక్కకుపోకుండా ఉండేందుకు కుంభమేళా ప్రాంతాన్ని నో వెహికల్ జోన్ (No Vehicle Zone)గా అధికారులు ప్రకటించారు. మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి దీన్ని అమలుచేశారు. కుంభమేళా ముగిశాక భక్తులు క్షేమంగా తిరుగు పయనం అయ్యేలా ప్రయాగ్‌రాజ్ నుంచి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు బుధవారం 350 రైళ్లను నడపనున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. ఇక, ఇప్పటివరకు 64 కోట్ల మంది భక్తులు వచ్చినట్లు రాష్ట్రప్రభుత్వం తెలిపింది. -
హర హర మహాదేవ్.. చివరిరోజు మహా కుంభమేళాకు పోటెత్తిన భక్తజనం (ఫొటోలు)
-
కుంభమేళాలో ఇషా అంబానీ దంపతుల పుణ్యస్నానాలు (ఫోటోలు)
-
ఫోన్‌కు పుణ్యస్నానం..భర్తకు ప్రేమతో!
ప్రయాగ్ రాజ్: ఇప్పుడు ఏదైనా ఆన్ లైనే. ఆనాడు ఓ కవి.. కాదేదీ కవితకు అనర్హం అన్నట్లు.. ఇప్పుడు ఆన్ లైన్ కు కాదు ఏదీ అనర్హం అన్న పరిస్థితులు దాదాపు వచ్చేశాయి. ఇప్పటికే ఆన్ లైన్ నిశ్చితార్థాలు, ఆన్ లైన్ పిండ ప్రదానాలు వంటివి ఎన్నో చూశాం. అయితే తాజాగా ఆన్ లైన్ పుణ్యస్నానం కూడా వచ్చేసింది. మహా కుంభమేళాలో కొందరు వ్యాపార కోణంలో ఆన్ లైన్ పుణ్యస్నానాలకు శ్రీకారం చుడితే. మరికొందరు తమ బంధువులు ఎవరైనా అక్కడకు రాలేని పరిస్థితి ఉంటే ఫోన్ తోనే పుణ్యస్నానం పూర్తి చేయిస్తున్నారు. ఫోన్ ను నీటిలో ముంచి భర్తకు పుణ్య స్నానం చేయించిన ఒక వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇంట్లో బెడ్ పై ఉన్న భర్తకు వీడియో కాల్ చేసిన సదరు మహిళ.. ఫోన్ ను నీటిలో పలుమార్లు ముంచింది. ఇలా భర్త పుణ్యస్నానాన్ని పూర్తి చేయించింది ఆ మహిళ. దీనికి సంబంధించిన వీడియోను శిల్పా చౌహాన్ అనే మహిళ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ పోస్ట్ చేయగా, అది వైరల్ గా మారింది. View this post on Instagram A post shared by ❣️Shilpa Chauhan Up54❣️ (@adityachauhan7338) మహా కుంభ్‌లో డిజిటల్ స్నానం రూ.1100 మాత్రమేనట.. ఏం బిజినెస్ ఐడియా గురూ..! -
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి కాసులు కురిపిస్తున్న మహా కుంభమేళా
-
Mahakumbh: వెలుపల లక్ష వాహనాలు.. 60 కోట్లు దాటిన పుణ్యస్నానాలు
ప్రయాగ్‌రాజ్: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో ఈరోజు ఆఖరి ఆదివారం. దీంతో సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు లెక్కకుమించిన రీతిలో భక్తులు తరలివస్తున్నారు. ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్ వెలుపల ఎంట్రీపాయింట్(Entry point)ల వద్ద లక్షకుపైగా వాహనాలు నిలిచివున్నట్లు సమాచారం.శనివారం సాయంత్రం నుంచే కుంభమేళా ప్రాంతంలో అత్యంత రద్దీ నెలకొంది. ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. దీనికితోడు రాబోయే మహాశివరాత్రికి అత్యధిక సంఖ్యలో భక్తులు తరలిరానున్న దృష్ట్యా స్థానిక అధికారులు ముందస్తు ఏర్పాట్లుపై దృష్టి సారించారు. ప్రయాగ్‌రాజ్‌లోని ఏడు ఎంట్రీపాయింట్ల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. శనివారం సాయంత్రం సంగమం మెయిన్ ఎంట్రీ పాయింట్‌లోని డాక్టర్ శ్యామా ప్రసాద్ సేతు(Dr. Shyama Prasad Sethu) చౌరస్తా వద్ద ఐదు కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ నిలిచిపోయింది.మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లో రీవా పరిధిలోని చాక్ఘాట్లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాగ్‌రాజ్‌లోని ఏడు ఎంట్రీపాయింట్లను మూసివేయడంతో భక్తులు ఇక్కడి నుంచి 12 కిలోమీటర్ల దూరం నడిచి సంగమస్థలికి చేరుకుంటున్నారు. శనివారం నాటికి కుంభమేళాలో పవిత్రస్నానాలు చేసినవారి సంఖ్య 60 కోట్లు దాటింది. మహాకుంభమేళాకు ముందు సీఎం యోగి ఆదిత్యనాథ్ కుంభమేళాకు 45 కోట్లమంది వస్తారని అంచనా వేశారు. అయితే ఆ అంచనా ఇప్పటికే దాటిపోయింది. 73 దేశాల ప్రతినిధులు ప్రయాగ్‌రాజ్‌కు తరలివచ్చి పుణ్యస్నానాలు చేయడాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇది కూడా చదవండి: Mahakumbh: ముఖ్యమంత్రి యోగి మరో రికార్డు -
మహా కుంభ్‌కు 60 కోట్ల మంది..!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు జన జాతర కొనసాగు తోంది. జనవరి 13వ తేదీన మే ళా అధికారికంగా ప్రారంభం కాక ముందు నుంచే మొదలైన భక్తుల రాకడ రోజురోజుకూ పెరుగుతోంది. మొత్తం 45 కోట్ల మంది వరకు రావచ్చన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అంచనా తలకిందులైంది. ఇప్పటికే 60 కోట్ల మార్కును దాటినట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ శనివారం ప్రకటించారు. 26వ తేదీన కుంభమేళా ముగిసేసరికి ఇది 75 కోట్లకు చేరుకునే అవకాశముందని అధికార యంత్రాంగం చెబుతోంది. చివరి రోజైన 26వ తేదీన మహా శివరాత్రి పర్వదినం, ఆఖరి షాహీ స్నాన్ ఉండటంతో త్రివేణీ సంగమంలో స్నానమాచరించేందుకు ఎక్కువ సంఖ్యలో భక్తులు తరలివస్తారని యంత్రాంగం అందుకు తగినట్లుగా భారీ ఏర్పాట్లలో తలమునకలై ఉంది. ఇలా ఉండగా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కుటుంబసభ్యులతో పాటు శనివారం త్రివేణీ సంగమంలో పుణ్యస్నానమాచరించారు. ఆయనతోపాటు యూపీ సీఎం ఆదిత్యనాథ్ ఆయన మంత్రివర్గ సహచరులు కూడా స్నానాలు చేశారు. -
మహా ’కాసుల’ మేళా!
సాక్షి, బిజినెస్ బ్యూరో: మహా కుంభమేళా కాసులు కురిపిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు కోట్లాది మంది భక్తులను ఆకర్షిస్తున్న ఈ వేడుక.. వస్తువులు, సేవల ద్వారా రూ.3 లక్షల కోట్లకు పైగా వ్యాపారం నమోదు చేయనుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) అంచనా వేసింది. ఇది భారత్‌లో అతిపెద్ద ఆర్థిక కార్యక్రమాలలో ఒకటిగా నిలిచిందని సీఏఐటీ సెక్రటరీ జనరల్, చాందినీ చౌక్ ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు. 144 ఏళ్లకోసారి జరిగే మహా కుంభమేళా జనవరి 13న ప్రారంభం కాగా ఈ నెల 26 వరకు కొనసాగనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద మతపర, ఆధ్యాత్మిక సమావేశంగా గుర్తింపు పొందిన ఈ కుంభమేళాలో కోట్లాదిమంది భక్తులు పాల్గొన్నారు. అంచనాలను మించి..విశ్వాసం, ఆర్థిక వ్యవస్థ మధ్య సంబంధాన్ని ఈ కార్యక్రమం దృఢంగా నిర్వచించిందని ఖండేల్వాల్ అన్నారు. ‘డైరీలు, క్యాలెండర్లు, జనపనార సంచులు, స్టేషనరీ తదితర మహాకుంభ నేపథ్య ఉత్పత్తులకు డిమాండ్ పెరగడం స్థానిక వాణిజ్యాన్ని పెంచుతోంది. కచి్చతమైన బ్రాండింగ్ కారణంగా అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. మహా కుంభమేళా ప్రారంభానికి ముందు 40 కోట్ల మంది ప్రజలు వస్తారని అంచనా వేశారు.అలాగే దాదాపు రూ.2 లక్షల కోట్ల విలువైన వ్యాపార లావాదేవీలు జరుగుతాయని భావించారు. అయితే దేశవ్యాప్తంగా నెలకొన్న అపూర్వ ఉత్సాహం కారణంగా.. ఉత్సవాలు ముగిసే నాటికి ఇంకా భారీ సంఖ్యలో ఈ మహా కుంభమేళాలో పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. తద్వారా భారీ స్థాయిలో రూ.3 లక్షల కోట్లకు పైగా వ్యాపారం నమోదు అయ్యే అవకాశం ఉందని ఖండేల్వాల్ చెప్పారు. భారీగా ఆర్థిక కార్యకలాపాలుఉత్తరప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు ఈ కార్యక్రమం గణనీయ ప్రోత్సాహాన్ని అందించిందని, కొత్త వ్యాపార అవకాశాలను సృష్టించిందని సీఏఐటీ వెల్లడించింది. ఆతిథ్యం, వసతి, ఆహారం, పానీయాలు, రవాణా, మతపర దుస్తులు, పూజా సామగ్రి, హస్తకళలు, వ్రస్తాలు, దుస్తు లు, వినియోగ వస్తువులు, ఆరోగ్య సంరక్షణ, వెల్నెస్ సేవలు, మీడియా, ప్రకటనలు, వినోదం, పౌర సేవలు, టెలికం, మొబైల్, ఏఐ ఆధారిత సాంకేతికత, సీసీటీవీ కెమెరాలు, ఇతర పరికరాలు వంటి అనేక వ్యాపార విభాగాల్లో పెద్ద ఎత్తున ఆర్థిక కార్యకలాపాలు నమోదయ్యాయని వివరించింది. 150 కిలోమీటర్ల పరిధిలో లబ్ధిమహాకుంభ మేళా ఆర్థిక ప్రయోజనాలు ప్రయాగ్‌రాజ్‌కు మాత్రమే కాకుండా 150 కిలోమీటర్ల పరిధిలో ఉన్న నగరాలు, పట్టణాలకు కూడా విస్తరించాయి. అయోధ్య, వారణాసి, ఇతర మతపర ప్రదేశాలకు యాత్రికులు వెల్లువెత్తారు. మహాకుంభ మేళా భారత్‌లో వ్యాపారం, వాణిజ్యం, సాంస్కృతిక వ్యవస్థ రూపురేఖలను సానుకూలంగా మారుస్తుందని, ఏళ్ల తరబడి కొత్త రికార్డును సృష్టిస్తుందని భావిస్తున్నారు. -
Maha Kumbh : పవిత్ర త్రివేణీ సంగమం వద్ద యాంకర్ సుమ
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో మహాకుంభమేళా (Maha Kumbh Mela) అత్యంత ఉత్సాహంగా కొన సాగుతోంది. ఇప్పటికే 60కోట్ల మంది భక్తులు తరలి వచ్చారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం త్వరలో ముగియనున్న నేపథ్యంలో భక్తుల సందడి మరింత పెరిగింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది భక్తులు పవిత్ర త్రివేణీ సంగమం (Triveni Sangam)లో స్నానాలు చేసిన తమభక్తిని చాటుకున్నారు. రాజకీయ, వ్యాపారం, క్రీడారంగ ప్రముఖులతోపాటు, పలువురు సినీ స్టార్లు మహాకుంభమేళాను దర్శించు కున్నారు. ఇపుడు ఈ కోవలో ప్రముఖ యాంకర్ సుమ (sumakanakala) నిలిచారు. మహాకుంభ మేళా సందర్శనకు సంబంధించిన వివరాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తొలిసారి మహాకుంభమేళాకు వచ్చాను అంటూ సంతోషాన్ని ప్రకటించారు. ఇదీ చదవండి:ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాశ్ పటేల్ లవ్‌స్టోరీ : అందంలోనే కాదు టాలెంట్‌లోనూ!కాగా ప్రపంచంలోని అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా. ఈ మహా వేడుక జనవరి 13న కుంభమేళా ప్రారంభమైంది. ఇది ఫిబ్రవరి 21 వరకు సాగనుంది. ఇప్పటిదాకా మొత్తం 60 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు.ఓదెల -2 టీజర్ లాంచ్ సందర్బంగా మహాకుంభకు వెళ్లిన సుమ అక్కడ పవిత్న స్నానం ఆచరించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా మూవీ టీంకు అభినందనలు తెలిపారు. మహా కుంభమేళాలో ‘ఓదెల 2’ మూవీ టీజర్‌ను మేకర్స్ లాంచ్ చేసారు. మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ మూవీలో హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ నటిస్తున్నారు. నాగ సాధు పాత్రలో ఆమె స్టన్నింగ్ లుక్ లో కనిపించింది. 2022లో వచ్చిన 'ఓదెల రైల్వే స్టేషన్' సినిమాకి సీక్వెల్. View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) -
Maha Kumbh : అయ్యో తల్లీ! పుణ్యానికి పోతూ ఇదేం పనిరా కొడకా!
మహాకుంభమేళా(Maha Kumbh Mela) పవిత్ర త్రివేణి సంగమంలో మూడు మునుగులు మునిగితే సర్వపాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. మహాకుంభమేళా స్నానాన్ని రాజస్నానం (Holybath)గా పరిగణిస్తారు. ఇక్కడ స్నానం చేస్తే ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయనీ, పాపాలు తొలగి మోక్షం సిద్ధిస్తుందనీ భక్తుల నమ్మకం. అందుకే ఎన్నికష్టాలకోర్చి అయినా కుంభమేళాలో స్నానం చేయడానికి వెళతారు. అంతేకాదు 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహాకుంభమేళాకు వృద్ధులైన తల్లిదండ్రులను కూడా తోడ్కొని వెడతారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా సందర్భంగా ఇలాంటి దృశ్యాలెన్నింటినో మనం చూశాం కూడా. అయితే జార్ఖండ్‌లోని ఒక వ్యక్తి ఇందుకు భిన్నంగా, సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించాడు. 65 ఏళ్ల తల్లిని నిర్దాక్షిణ్యంగా ఇంట్లో వదిలి మహాకుంభమేళాకు వెళ్లాడు. దీంతో ఆకలి బాధకు తట్టుకోలేక, ఆ వృద్ధతల్లి నానా యాతన పడింది. మూడు రోజుల పాటు అటుకులను ఆహారంగా సేవించింది. ఆఖరికి అవి కూడా అయిపోవడంతో ప్లాస్టిక్‌ను తినేందుకు కూడా ప్రయత్నించింది. ఈ విషయం ఎలా బయటికి వచ్చింది.జన్మనిచ్చిన తల్లి, అనారోగ్యంతో బాధపడుతోందున్న కనికరం కూడా లేకుండా ఆమెను ఇంట్లో బంధించి భార్యా పిల్లలు, అత్తామామలను వెంటబెట్టుకొని మహా కుంభమేళాకు వెళ్లిపోయాడు. మూడు రోజులపాటు అటుకులతో కడుపు నింపుకుంది. ఉన్న కాసిన్ని అటుకులూ అయిపోవడంతో ఇక ఆకలి బాధకు తాళలేక ఆమె గట్టిగా కేకలు వేసింది. బిగ్గరగా రోదించడం మొదలు పెట్టింది. దీంతో ఇరుగుపొరుగు తక్షణమే స్పందించారు. చుట్టుపక్కల వారిచ్చిన సమాచారంతో పోలీసులొచ్చి తాళం పగులగొట్టి బాధితురాలిని బయటకు తెచ్చారు. ఆమెకు ఆహారం ఇచ్చి, సేద తీరిన తరువాత, చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాధితురాలి కుమార్తె చాందినీ దేవికి సమాచారం అందించారు.(వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? బెస్ట్ టిప్స్ ఇవే!)బాధితురాలు రామ్‌గఢ్ జిల్లా కేంద్రానికి చెందిన 65 ఏళ్ల సంజూదేవి. ఆమె కుమారుడు అఖిలేశ్ కుమార్ ప్రజాపతి. సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (CCL) ఉద్యోగి. అయితే తల్లికి ఇంట్లో భోజనం, తదితర ఏర్పాట్లన్నీ చేసే, తాము ప్రయాగ్ రాజ్ వెళ్లామని కుమారుడు అఖిలేశ్ వాదిస్తున్నాడు. అనారోగ్యంతో ఉందనే ఆమెను తమవెంట తీసుకెళ్లలేదని చెప్పాడు. మరోవైపు రామ్‌గఢ్ సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (SDPO) పరమేశ్వర్ ప్రసాద్ తల్లిని సీసీఎల్ క్వార్టర్ లోపల బంధించాడని ధృవీకరించారు. ఇదీ చదవండి: నీతా అంబానీ లుక్: వందేళ్లకు పైగా చరిత్ర, తయారీకి రెండేళ్లుకాగా మహా కుంభమేళా 40వ రోజు, సంగమంలో భక్తులు స్నానాలు ఉత్సాహంగా అప్రతిహతంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు జైలులో ఉన్న ఖైదీలు కూడా ఇక్కడ పవిత్ర స్నానాలు ఆచరించనున్నారు. ఇప్పటివరకు 58 కోట్లకు పైగా భక్తులు పవిత్ర గంగానదిలో స్నానం చేశారని జాతర నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ నెల 26వ తేదీవరకు మహా కుంభమేళా జరగనుంది. -
మహా కుంభమేళాకు ఒక్కసారిగా పోటెత్తిన భక్తజనం
లక్నో: ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం.. మహా కుంభమేళా మరో ఐదురోజుల్లో ముగియనుంది. చివరి వారాంతం కావడంతో ప్రయాగ్‌రాజ్‌కు భక్తులు ఒక్కసారిగా పోటెత్తారు. ఇవాళ 40వ రోజు ఉదయం రికార్డు స్థాయిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించిట్లు అధికారులు ప్రకటించారు.కుంభమేళా ముగుస్తుండడంతో ప్రయాగ్‌రాజ్(Prayagraj) సంగమంకు భక్తుల తాకిడి ఒక్కసారిగా పెరిగింది. మేలా ప్రాంతంలో హోటల్స్, ధర్మశాలలు కిక్కిరిసిపోయాయి. గురువారం సాయంత్రం గణాంకాల ప్రకారం.. మొత్తంగా 58 కోట్ల మంది పుణ్యస్నానాలు పూర్తి చేసుకున్నారని అధికారులు ప్రకటించారు. శని, ఆది వారాల్లో భక్తుల తాకిడి మరింత అధికంగా ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా.. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు.గత వారంగా కుంభమేళా భక్తుల సంఖ్య👇ఫిబ్రవరి 13, గురువారం: 80 లక్షల 46 వేలుఫిబ్రవరి 14 శుక్రవారం: 94 లక్షల 98 వేలుఫిబ్రవరి 15 శనివారం: కోటి 36 లక్షల మందిఆదివారం: కోటి 49 లక్షల మందిసోమవారం: కోటి 35 లక్షల మందిమంగళవారం : కోటి 26 లక్షల మందిబుధవారం: కోటి 19 లక్షల మందిగురువారం: కోటి 55 లక్షల మంది..ఇక.. కుంభమేళా(KumbhmelaI నిర్వహణపై రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. జనవరి చివరి వారంలో మౌనీ అమవాస్య సందర్బంగా జరిగిన తొక్కిసలాట 30 మంది మరణించిన సంగతి తెలిసిందే. దీంతో రాబోయే రద్దీని నియంత్రించేలా అధిక సిబ్బందిని నియమించారు. మరోవైపు.. పరిసరాలను, సంగమ నీటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చూసుకుంటున్నారు. ఇప్పటికే వీఐపీ పాస్‌లను రద్దు చేసిన అధికారులు.. వాహనాల రాకపై కూడా కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు.రైల్వే శాఖ కీలక నిర్ణయంమహా కుంభమేళా(Maha Kumbh Mela) ముగుస్తుండడంతో భక్తులు అధిక సంఖ్యలో ప్రయాగ్‌రాజ్ వెళ్తున్నారు. రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా పలు స్టేషన్లలో ప్రత్యేక హోర్డింగ్‌లను ఏర్పాటు చేయించింది. సురక్షిత ప్రయాణం కోసం తాము సూచించే మార్గదర్శకాలను పాటించాలని అందులో విజ్ఞప్తి చేస్తోంది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట చోటు చేసుకుని 18 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. -
మమతా బెనర్జీపై యోగి ఆదిత్యానాథ్ ఆగ్రహం
లక్నో: మహా కుంభమేళాపై వ్యాఖ్యలతో రాజకీయ విమర్శలు ఎదుర్కొంటున్న టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీపై ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కోట్ల మంది మనోభావాల్ని దెబ్బతీసేలా ఆమె మాట్లాడారాంటూ బుధవారం అసెంబ్లీ వేదికగా మండిపడ్డారాయన.పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) మహా కుంభమేళాను మృత్యు కుంభమేళాగా అభివర్ణించిన విషయం తెలిసిందే. కుంభమేళా నిర్వహణలో యూపీ ప్రభుత్వం(UP Government) ఘోరంగా విఫలమైందని తీవ్ర విమర్శలే గుప్పించారామె. అయితే ఆమె వ్యాఖ్యలపై అసెంబ్లీలోసీఎం యోగి ఇవాళ స్పందించారు. మహా కుంభమేళా(Maha Kumbh Mela) ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటిదాకా 56 కోట్ల మంది సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు. నిరాధారమైన ఆరోపణలతో ఆమె వాళ్లందరి విశ్వాసాలతో ఆటాడుకున్నారు అని సీఎం యోగి మండిపడ్డారు. జనవరి చివర్లో ప్రయాగ్‌రాజ్ కుంభమేళా ఘాట్ల వద్ద తొక్కిసలాట జరిగి 30 మంది మరణించారు. కుంభమేళా తొక్కిసలాట మృతులకు, వివిధ రాష్ట్రాల నుంచి కుంభమేళాకు వచ్చి మృత్యువాత చెందిన వాళ్లకు అసెంబ్లీ వేదికగా సంతాపం ప్రకటించారాయన. ఈ క్రమంలో.. దీదీ వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు.#WATCH | Lucknow: In the UP assembly, CM Yogi Adityanath says, "While we are participating in the discussion here, at that time more than 56.25 crore devotees have already taken their holy dip in Prayagraj... When we make any baseless allegations or snow fake videos against… pic.twitter.com/VYNnzPn4w1— ANI (@ANI) February 19, 2025కుంభమేళా మృతులకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అన్నివిధాల అండగా ఉంటుంది. కానీ, ఇలాంటి సున్నితమైన అంశాన్ని కూడా రాజకీయం చేయడం ఏంటి?. ఈ కుంభమేళాలో దేశం.. ప్రపంచమే పాల్గొంటోంది. అలాంటప్పుడు ఇలాంటి తప్పుడు ప్రచారాలను పట్టించుకోవాల్సిన పనేముంది? అని అన్నారాయన. ఇదిలా ఉంటే.. యోగి మాత్రమే కాదు పలువురు బీజేపీ నేతలు కూడా మమత వ్యాఖ్యలపై మండిపడ్డారు. బీహార్ బీజేపీ చీఫ్ దిలీప్ జైశ్వాల్ మాట్లాడుతూ.. మత విశ్వాసాలు లేనివాళ్లే అలాంటి సిగ్గుమాలిన ప్రకటనలు చేస్తారంటూ మండిపడ్డారు. మరోవైపు హిందూ సంఘాలు కూడా దీదీపై విరుచుకుపడుతున్నాయి. దీదీ వ్యాఖ్యలతో ఏకీభవిస్తూ..మహా కుంభమేళాపై వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. అయితే.. దీదీ వ్యాఖ్యలకు ఓ అనూహ్య మద్దతు లభించింది. ఉత్తరాఖండ్ జ్యోతిష్ పీఠ్ 46వ శంకారాచార్య అయిన స్వామి అవిముక్తేశ్వరానంద్ సరస్వతి(సద్గురు) మమత వ్యాఖ్యలతో ఏకీభవించారు. ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే మార్గాల్లో వందల కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ ఉంటోంది. భక్తులకు సరైన సదుపాయాలు కల్పించలేకపోతున్నారు. ఇది నిర్వహణ లోపం కాకుంటే మరేమిటి?. మహా కుంభమేళా రాబోతోందని మీకు తెలియదా?. అలాంటప్పుడు మీరు చేసే ఏర్పాట్లు ఇవేనా? అంటూ యోగి ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారాయన.#WATCH | Bemetara, Chhattisgarh: On West Bengal CM Mamata Banerjee's 'Mrityu Kumbh' remark, Jagadguru Shankaracharya Swami Avimukteshwaranand Saraswati Maharaj says, "... There was a traffic jam of 300 kilometres, if this is not mismanagement then what is it? People had to walk… pic.twitter.com/pxDXWI5og7— ANI (@ANI) February 19, 2025 -
మహా కుంభ్‌కు 55 కోట్ల మంది
మహాకుంభ్ నగర్: ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభ్ మేళా సందర్భంగా త్రివేణీ సంగమంలో ఇప్పటి వరకు 55 కోట్ల మంద పుణ్య స్నానాలు ఆచరించారని యూపీ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. దేశంలోని 143 కోట్ల జనాభాలో 110 కోట్ల మంది సనాతన ధర్మ పరాయణులు కాగా వీరిలో దాదాపు సగం మంది పుణ్నస్నానాలు ఆచరించినట్లయిందని తెలిపింది. మొత్తం జనాభాలో ఇది 38 శాతంతో సమానమని తెలిపింది.26వ తేదీకల్లా ఈ సంఖ్య 60 కోట్లకు మించిపోనుందని అంచనా వేసింది. జనవరి 13న ప్రారంభమైన కుంభ మేళా ఈ నెల 26వ తేదీన మహా శివరాత్రి పర్వదినంతో ముగియనుండటం తెలిసిందే. ఈ కుంభమేళా ప్రపంచంలోనే అతిపెద్ద మత, సాంస్కృతిక, సామాజిక కార్యక్రమంగా నిలిచిపోనుందని యూపీ ప్రభుత్వం తెలిపింది. హోటల్ పరిశ్రమకు పెద్ద ఊతం మహాకుంభ మేళాకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ప్రయాగ్‌రాజ్‌లోని అన్ని రకాల హోటళ్లు, రెస్టారెంట్ల పరిశ్రమ 20 నుంచి 30 వృద్ధి నమోదు చేసుకుందని ప్రభుత్వం తెలిపింది. అదాయ మార్జిన్లు కూడా 5 నుంచి 10 శాతం పెరిగాయంది. సందర్శకుల రాకతో టూర్, ట్రావెల్ పరిశ్రమ కూడా బాగా లబ్ధి పొందిందని వివరించింది. ఈ నెల 26వ తేదీ వరకు ప్రయాగ్‌రాజ్‌లోని మూడు, నాలుగు నక్షత్రాల హోటళ్లు, లాడ్జీలు, లగ్జరీ టెంట్ హౌస్‌లు పెద్ద సంఖ్యలో ముందుగానే బుక్కయ్యాయన్నారు.కుంభ మేళా పొడిగింపు అబద్ధం భక్తుల రద్దీ కొనసాగుతున్న దృష్ట్యా మహా కుంభ్ మేళాను మరికొద్ది రోజులు పొడిగించనున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలపై ప్రయాగ్‌రాజ్ జిల్లా మేజి్రస్టేట్ రవీంద్ర మందర్ స్పష్టతనిచ్చారు. పవిత్ర దినాలను పరిగణనలోకి తీసుకుంటూ ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం కుంభ మేళా 26వ తేదీ వరకు మాత్రమే కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ తేదీల్లో ఎలాంటి మార్పులూ ఉండవని కుండబద్దలు కొట్టారు. పొడిగింపు అంటూ వస్తున్న వార్తలను పట్టించుకోవద్దని ఆయన ప్రజలను కోరారు. కుంభమేళా కారణంగా ప్రయాగ్‌రాజ్‌లో విద్యార్థులెవరూ పరీక్షలను నష్టపోలేదని కూడా ఆయన పేర్కొన్నారు. అనివార్య కారణాలతో ఎవరైనా సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పరీక్షలను మిస్సయినా వారి కోసం ప్రత్యేకంగా నిర్వహించాలని కోరామన్నారు.కాశీకి 17 రోజుల్లో కోటి మంది ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభ మేళా జరుగుతున్న వేళ ఫిబ్రవరి 1 నుంచి 17వ తేదీ వరకు కాశీ విశ్వనాథుని ఆలయాన్ని కోటి మంది భక్తులు దర్శించుకున్నారని మంగళవారం అధికారులు తెలిపారు. అత్యంత రద్దీ ఉండే శివరాత్రినాడు కూడా ఇంత రద్దీ లేదన్నారు. ఈ నేపథ్యంలో వారణాసిలోని స్కూళ్లలో 8వ తరగతి వరకు తరగతులను ఈ నెల 27వ తేదీ వరకు రద్దు చేశామన్నారు. వారణాసిలోని రైల్వే స్టేషన్లు, బస్టాండ్లతోపాటు మైదాగిన్, గొడొవ్లియా, దశాశ్వమేథ వంటి ముఖ్య ప్రాంతాల్లో తీవ్రమైన రద్దీ నెలకొందని వివరించారు. ప్రాముఖ్యమున్న గంగా ఆరతి కార్యక్రమాన్ని నామమాత్రంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 27 నుంచి తిరిగి ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో చేపడతామని వివరించారు. -
టిక్కెట్ లేకున్నా వెళ్లొచ్చని మోదీయే చెప్పారు!
పట్నా: ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళాకు జన జాతర కొనసాగుతోంది. ఈ నెల 26వ తేదీ వరకు ఈ మేళా సాగనుంది. ఇక ముఖ్యమైన దినాలేవీ లేనప్పటికీ జనం లక్షలు, కోట్ల సంఖ్యలో ప్రయాగ్‌రాజ్‌కు తరలి వెళ్తూనే ఉన్నారు. ముఖ్యంగా రైళ్లలో రద్దీ తీవ్రంగా ఉంటోంది. ఇదే అదనుగా జనం టిక్కెట్ లేకుండానే రైలు ప్రయాణం కానిచ్చేస్తున్నారు. ఇందుకు ఉదాహరణ ఈ ఘటనే..! బిహార్‌లోని దానాపూర్ డివిజన్ రైల్వే మేనేజర్ జయంత్ కుమార్ ప్రయాణికుల రద్దీతో నెలకొన్న పరిస్థితిపై రెండు రోజుల క్రితం బక్సార్ రైల్వే స్టేషన్‌ను పరిశీలించారు. అదే సమయంలో గ్రామీణ మహిళల బృందం ఒకటి ఆయనకు తారసపడింది. వారిని వివరాలడగ్గా కుంభమేళాకు వెళ్తున్నట్లు చెప్పారు. టిక్కెట్లు కొన్నారా అని ప్రశ్నించగా ముక్తసరిగా లేదని బదులిచ్చారు. టిక్కెట్లు కొనకుండానే రైలు ప్రయాణం చేయవచ్చని ఎవరు చెప్పారని జయంత్ కుమార్ ప్రశ్నించారు. ప్రధాని మోదీయే అలా తమకు చెప్పారంటూ ఆ మహిళలు ఠకీమని ఇచ్చిన సమాధానంతో ఆయన షాక్‌కు గురయ్యారు. కొద్దిసేపు ఏమీ మాట్లాడలేకపోయారు. చివరికి, ‘అలాంటిదేమీ లేదు. ప్రధాని మోదీయే కాదు, ఏ అధికారి కూడా టిక్కెట్ లేకుండా ప్రయాణం చేయనివ్వరు. ప్రయాణం చేయాలంటే టిక్కెట్ కొనాల్సిందే. లేకుంటే చట్టాన్ని ఉల్లంఘించినందుకు చర్యలు తీసుకుంటాం’అంటూ వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అనంతరం డీఆర్ఎం జయంత్ కుమార్ మీడియాతో మాట్లాడారు. పండగ సీజన్లప్పుడు చేసినట్లుగానే కుంభ్ మేళాకు కూడా ఏర్పాట్లు చేశామన్నారు. అయితే, జనం రద్దీ తగ్గాల్సిన వేళ పెరుగుతుండటాన్ని తామస్సలు ఊహించలేదన్నారు. లేకుంటే, మరింతగా ఏర్పాట్లు సిద్ధం చేసి ఉండేవారమని వివరించారు. -
భక్తిపారవశ్యంలో బుల్లితెర సెలబ్రిటీలు (ఫోటోలు)
-
బుజ్జి.. ఇక పోట్లాడుకుంది చాలు.. ఇప్పటికైనా..! (ఫోటోలు)
-
కుంభమేళాకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి
ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. మీర్జాపుర్- ప్రయాగ్‌రాజ్ రహదారిపై బొలేరో వాహనం బస్సును ఢీకొన్న ప్రమాదంలో దాదాపు 10 మంది భక్తులు మృతిచెందారు. ఈ ఘటనలో మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డినట్టు తెలుస్తోంది. వీరంతా మహాకుంభామేళకు వెళ్తున్న సమయంలోనే ప్రమాదం జరిగింది.వివరాల ప్రకారం.. మీర్జాపుర్-ప్రయాగ్‌రాజ్(Prayagraj) జాతీయ రహదారిపై మహా కుంభమేళా(Maha KumbhaMela)కు భక్తులతో వెళ్తున్న బొలెరో వాహనం ఓ ట్రావెల్ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పది మంది భక్తులు అడికక్కడే మృతిచెందారు. మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇక, మృతులందరూ ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారిగా అధికారులు గుర్తించారు. అర్థరాత్రి రెండు గంటల సమయంలో మేజా సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. అతి వేగంగా వచ్చిన బొలెరో బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో బొలెరో నుజ్జునుజ్జయింది. మరణించిన భక్తులందరూ బొలెరోలో ప్రయాణిస్తున్నవారేనని పోలీసులు తెలిపారు. 19 మంది బస్సులో ఉన్నవారు గాయపడినట్టు చెప్పుకొచ్చారు. ఈ ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను బయటకు తీశారు. చనిపోయిన వారంతా ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లా నివాసితులని తెలిపారు. మృతుల్లో అందరూ పురుషులే ఉన్నట్టు వెల్లడించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. VIDEO | At least 10 people have been killed and several injured in a head-on collision between a car and a bus in Prayagraj. More details awaited.(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/06t5TkNd4m— Press Trust of India (@PTI_News) February 15, 2025 -
ఇప్పటి వరకు త్రివేణి సంగమంలో 50 కోట్ల మంది పుణ్యస్నానాలు
-
#MahaKumbh2025 : మాఘ పూర్ణిమ స్నానాలు కుంభమేళాకు పోటెత్తిన జనం (ఫొటోలు)
-
పిల్లలకేం చెప్పాలి.. దేవుడా..
ఉప్పల్/మలక్‌పేట: మహాకుంభ మేళాకు వెళ్లి తమవాళ్లు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారనుకున్న ఆ కుటుంబ సభ్యులకు రోడ్డు ప్రమాదం వార్త తీరని శోకాన్ని మిగిల్చింది. ఆనందంతో బయలుదేరి విగత జీవులుగా మారి తిరిగి రావడం తీరని దుఃఖాన్నే మిగిల్చింది. కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయిన బాధితులు భోరుమంటూ విలపిస్తున్నారు. తాము కుశలమేనంటూ ఫోన్లో మాట్లాడిన కొన్ని గంటల్లోనే పిడుగులాంటి వార్త వారి గుండెలను పిండేసింది. మహా కుంభ మేళా నుంచి మినీ బస్సులో తిరిగి వస్తుండగా మధ్యప్రదేశ్ జబల్పూర్ వద్ద ట్రక్కు ఢీకొట్టిన ప్రమాదంలో ఏడుగురు నగర వాసులు మృత్యువాత పడ్డారు. నాచారం ప్రాంతానికి చెందిన ఆరుగురు, మూసారంబాగ్‌కు చెందిన ఒకరు దుర్మరణం చెందారు. మరొకరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రయాగ్ రాజ్ కుంభ మేళాకు వెళ్లిన వారంతా స్నేహితులే కావడం గమనార్హం. కాగా.. మృత దేహాలు బుధవారం మధ్యాహ్నం వరకు నగరానికి చేరుకోవచ్చని భావిస్తున్నారు.బై బై అంటూ బయలుదేరి.. మూసారంబాగ్‌కు చెందిన గోల్కొండ ఆనంద్‌కుమార్ (47) ఇంటి నుంచి బయలుదేరే ముందు భార్యా పిల్లలకు బై బై అని చెప్పి కుంభ మేళాకు వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. ఆనంద్ కుమార్ సలీంనగర్లో గోల్డ్ వర్క్‌షాప్ నిర్వహిస్తున్నాడు. స్నేహితులతో కలిసి శనివారం ఉదయం నాచారం నుంచి మినీ బస్సులో కుంభమేళాకు బయలుదేరారు. త్రివేణి సంగమంలో స్నానం చేశామని, ట్రాఫిక్ జామ్ ఉందని, వస్తే ఇక్కడ ఇబ్బంది పడతారని, ట్రాఫిక్ క్లియర్ కావడానికి 24 గంటలు పడుతుందని, ఎవరూ రావొద్దని సోమవారం రాత్రి ఫోన్ చెసి చెప్పాడని బంధువులు తెలిపారు. పెళ్లి రోజుకు ఒక్క రోజు ముందే.. భోరంపేట సంతోష్ భార్య గత ఏడాది క్రితం కన్నుమూశారు. బుధవారం ఆయన పెళ్లి రోజు. వచ్చే నెల్లో భార్య సంవత్సరీకం నిర్వహించాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన ఇద్దరు కుమారులు హాస్టల్లో ఉంటున్నారు. తన పెళ్లి రోజుకు ఒక్క రోజు ముందే భార్య వద్దకే వెళ్లిపోయాడంటూ కుటుంబీకులు విలపిస్తున్నారు. బతుకు బండికి డ్రైవర్.. వృత్తిరీత్యా డ్రైవర్ అయిన కల్కూరి రాజు కుటుంబ పరిస్థితి దయనీయం. ఆయన డ్రైవింగ్ చేస్తేనే వారి ఇల్లు గడిచేది. సంపాదించే పెద్ద దిక్కును కోల్పోయామని, అంతా రోడ్డునపడ్డామంటూ కుటుంబం విలపిస్తోంది. రాజు మరణ వార్త తెలియడంతోనే శ్రీరామ్ కాలనీ బస్తీ శోకసంద్రంలో మునిగిపోయింది. భర్త లేడన్న వార్త తెలిసి రాజు భార్య మహేశ్వరి గుండెలు పగిలేలా రోదిస్తోంది. కాలనీ సమస్యలపైనే దృష్టి మా నాన్న అందరికి రోల్ మోడల్‌గా ఉండేవారు. అందరికీ సాయపడే వ్యక్తి ఆయన. అందరితో కలిసి మెలిసి ఉండే వారు. నిత్యం స్థానికులతోనే గడిపే వారు. కాలనీయే ఆయనకు సర్వస్వం. సోమవారం గంగ స్నానం అయిందంటూ మాట్లాడారు. తిరిగి వచ్చేస్తున్నా అని కూడా చెప్పాడు. కాని నాన్న ఇంక రాలేరు. – మల్లారెడ్డి కుమారుడు శ్రావణ్ రెడ్డిపిల్లలకేం చెప్పాలి.. దేవుడా.. ‘నా కొడుకు పిల్లలు హాస్టల్లో ఉన్నారు. తండ్రి మరణ వార్త వారికి ఇంకా తెలియదు. గత ఏడాది వారి తల్లి మృతి చెందింది. ఇప్పుడు తండ్రి కూడా చనిపోయాడు. పిల్లలు హాస్టల్ నుంచి వస్తే నేనేం సమాధానం చెప్పాలి దేవుడా’ అంటూ సంతోష్ తల్లి భోరున విలపిస్తోంది. – విలపిస్తున్న సంతోష్ తల్లి -
మహా కుంభమేళాలో అంబానీ ఫ్యామిలీ (ఫోటోలు)
-
45 కోట్ల ‘మహా’ కుంభ్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రయాగ్‌రాజ్(Prayagraj)లో జరుగుతున్న కుంభమేళాకి భక్తులు ఊహించని స్థాయిలో పోటెత్తుతున్నారు. కుంభమేళా(Kumbh Mela) జరిగే 45 రోజుల్లో మొత్తంగా 45 కోట్ల మంది భక్తులు పవిత్ర గంగా నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తారని ప్రభుత్వం అంచనా వేయగా, కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఆ సంఖ్య దాటిపోయింది.ఈ నెల 11 నాటికే కుంభమేళాకు వచ్చిన భక్తుల సంఖ్య 45 కోట్లకు చేరిందని, మహా కుంభమేళా చరిత్రలో అతిపెద్ద మతపరమైన సమావేశాలలో ఇది ఒకటిగా మారిందని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, గొప్ప ఆచారాలు, అత్యాధునిక సాంకేతిక సమ్మిళితంగా, ఈ కుంభమేళా జనసమూహ నిర్వహణ, పారిశుధ్యం, డిజిటల్ సౌకర్యాలలో కొత్త ప్రమాణాలను నెలకొల్పిందని ప్రకటించింది. నేడు నో వెహికిల్ జోన్‌గా మేళా ప్రాంతం.. కాగా బుధవారం మాఘ పూర్ణిమ(Magha Purnima) సందర్భంగా కోట్ల మంది భక్తులు అమృత్ స్నానాలను ఆచరించే అవకాశం ఉందని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. మాఘ పూర్ణిమ స్నానం, గురు బృహస్పతి పూజతో సంబంధం కలిగి ఉండటం, గంధర్వుడు స్వర్గం నుండి పవిత్ర సంగమానికి దిగుతాడనే నమ్మకానికి ప్రసిద్ధి చెందడంతో ఈ స్నానమాచరించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు రానున్నారు.ఈ నేపథ్యంలో మాఘ పూర్ణిమ స్నానం సమయంలో జనసమూహ నిర్వహణను నిర్ధారించడానికి , రాష్ట్ర ప్రభుత్వం నెల 11 ఉదయం 5 గంటల నుంచే మేళా ప్రాంతాన్ని ’వాహనాలు నిషేధించబడిన ప్రాంతం’(నో వెహికిల్ జోన్’)(No Vehicle Zone)గా ప్రకటించింది. అవసరమైన, అత్యవసర సేవలను అందించే వాహనాలను మాత్రమే అనుమతిస్తుంది. మాఘ పూర్ణిమ తర్వాత ఈ నెల 26 శివరాత్రి రోజున అధిక సంఖ్యలో భక్తులు స్నానమాచరిస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. 7 లక్షల మందికి పైగా వైద్య సేవలు.. ఇక మేళాకు వచ్చే భక్తులకు విస్తృతమైన ఆరోగ్య సంరక్షణ సేవల ద్వారా 7 లక్షలకు పైగా యాత్రికులు వైద్య సంరక్షణ పొందారని యూపీ ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో 23 అల్లోపతి ఆసుపత్రులలో 4.5 లక్షలకు పైగా వ్యక్తులకు చికిత్స అందించామని, 3.71 లక్షలకు పైగా పాథాలజీ పరీక్షలు చేయించుకున్నారని తెలిపింది. -
‘మహా’ విషాదం.. మరణంలోనూ వీడని స్నేహబంధం
ఉప్పల్/మల్లాపూర్: మహా కుంభమేళా ప్రయాణం హైదరాబాద్‌కు చెందిన ఏడు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి తిరుగుప్రయాణంలో ఉన్న ఆ ఇంటి పెద్దల్ని రోడ్డు ప్రమాదం కబళించింది. మరో ఇద్దరిని తీవ్రంగా గాయపర్చింది. మహా కుంభమేళా నేపథ్యంలో వివిధ ప్రాంతాలకు చెందిన 8 మంది స్నేహితులు ఈనెల 8న నాచారం కార్తికేయ నగర్ నుంచి మ్యాక్సీ క్యాబ్‌లో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లారు. ఈ వాహనంలో డ్రైవర్ సహా తొమ్మిది మంది ఉన్నారు. వీరంతా వారివారి కుటుంబాలను పోషించే వారే కావడం గమనార్హం. సోమవారం ప్రయాగ్‌రాజ్‌లో పుణ్యస్నానాలు ఆచరించి, చుట్టుపక్కల ఉన్న ఆలయాల్లో దర్శనాలను పూర్తి చేసుకుని మంగళవారం హైదరాబాద్‌కు తిరుగుపయనమయ్యారు. ఈ విషయం తమ కుటుంబీకులకు ఫోన్ ద్వారా తెలిపారు. అయితే వీరి తిరుగు ప్రయాణం ప్రారంభమైన కొన్ని గంటల్లోనే ట్రక్కు రూపంలో మృత్యువు ముంచుకొచ్చింది. మధ్యప్రదేశ్‌లోని సిహోరా పోలీసుస్టేషన్ పరిధిలోని మోహ్లా–బార్గీ గ్రామాల మధ్య వీరి మ్యాక్సీ క్యాబ్ వాహనం ఘోర ప్రమాదానికి గురైంది. కత్నీ వైపు నుంచి జబల్పూర్ వైపు వస్తుండగా.. ఓ వంతెనపై ఎదురుగా అతివేగంతో దూసుకొచ్చిన ఓ ట్రక్ బలంగా వారి వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు అక్కడిక్కడే చనిపోగా... తీవ్రగాయాలపాలైన శ్రీరాం బాలకిషన్ (62), నవీన్‌చారి జబల్పూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దుర్ఘటనతో నాచారంలోని కార్తికేయ నగర్, శ్రీరాంనగర్, చైతన్యపురిలో విషాదఛాయలు అలముకొన్నాయి. కుంభమేళాకు వెళ్లిన వీరంతా ప్రాణ స్నేహితులని, మంచిచెడులను పంచుకుంటూ కలివిడిగా ఉంటుండేవారని స్థానికులు చెబుతున్నారు. ఎక్కడకు వెళ్లినా కలిసే వెళ్తారని, మరణంలోనూ వీరి స్నేహబంధం వీడలేదని అంటున్నారు. సీఎం రేవంత్ దిగ్భ్రాంతి మధ్యప్రదేశ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని నాచారం ప్రాంతానికి చెందిన వారు చనిపోయినట్లు సమాచారం అందడంతో వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య అందేలా అందేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందడంపై కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వ అధికారులతో మాట్లాడి మృతుల కుటుంబాలకు అవసరమైన సహాయ, సహకారాలను అందించాలని, గాయపడిన వారికి సరైన చికిత్స అందించాలని కోరారు. ఫోన్లో బాధిత కుటుంబసభ్యులతో మాట్లాడి పరామర్శించారు. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ప్రమాద ఘటనపై విచారం వ్యక్తం చేశారు. అమ్మా... నాన్నకు ఏమైంది? ప్రమాదమృతుల్లో ఒకరైన శశికాంత్ కుమార్తె శ్రీ మూడో జన్మదిన వేడుకల్ని సోమవారం ఇంట్లో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ దృశ్యాలను భార్య కళ్యాణి వీడియో కాల్ ద్వారా శశికాంత్‌కు చూపించారు. మంగళవారం పిడుగులాంటి వార్త రావడంతో కళ్యాణి సహా కుటుంబీకులంతా కన్నీరుమున్నీరయ్యారు. ఇది చూసిన శ్రీ అమాయకంగా అమ్మా... నాన్నకు ఏమైందంటూ ప్రశి్నస్తుండగా... ఏం చెప్పాలో అర్థం కాక విలపించడంతో అందరూ కంటతడిపెట్టారు. వస్తానని చెప్పాడు.. కానీ.. నా భర్త రాజు ఈ రోజు ఉదయాన్నే ఫోన్ చేసి మాట్లాడాడు. ఇంటికి వస్తున్నా అంటూ నాకు మాట ఇచ్చాడు. కానీ ఇప్పుడు తిరిగిరాని లోకాలకు వెళ్లాడని తెలిసింది. నేను ఇద్దరు చిన్న పిల్లలతో ఎలా బతికాలి. మమ్మల్ని విడిచి ఎలా వెళ్లిపోయాడో తెలియడం లేదు. - రాజు భార్య మహేశ్వరి మృతులు: 1. సూరకంటి మల్లారెడ్డి (64), నాచారం కార్తికేయనగర్ కాలనీ అధ్యక్షుడు. స్థానికంగా పాల వ్యాపారం చేస్తున్నారు. 2. రాంపల్లి రవి కుమార్ (56) కార్తికేయనగర్ తిరుమల రెసిడెన్సీ వాసి. స్థానికంగా తిరుమల మెడికల్ షాపు నిర్వహిస్తున్నారు. 3. బోరంపేట సంతోష్ (47), కార్తికేయ నగర్ సాయిలీలా రెసిడెన్సీ నివాసి. 4. కల్కూరి రాజు (38), నాచారం శ్రీరాంనగర్ కాలనీ, వాహనం డ్రైవర్. 5. సోమవారం శశికాంత్ (38), నాచారం రాఘవేంద్రానగర్ వాసి, సాఫ్ట్వేర్ ఉద్యోగి. 6. టి.వెంకట ప్రసాద్ (55) తార్నాక గోకుల్ నగర్ వాసి. బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగి. 7. గోల్కొండ ఆనంద్ కుమార్ (47) దిల్‌సుఖ్‌నగర్‌లోని వివేకానందనగర్ వాసి -
Mahakumbh: స్టేషన్లో రద్దీ.. ఏసీ కోచ్ అద్దాలు బద్దలు కొట్టి..
సమస్తీపూర్: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళా ఫిబ్రవరి 26తో ముగియనుంది. ఈ మహోత్సవానికి ఇంకా కొద్దిరోజులే మిగిలివుండటంతో చాలామందిలో కుంభమేళాకు ఇప్పటికైనా వెళ్లాలన్న ఆలోచన తలెత్తింది. దీంతో ఏ వాహనం దొరికితో ఆ వాహనంలో కుంభమేళాకు చేరుకోవాలనే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ముఖ్యంగా రైళ్లలో ప్రయాగ్ రాజ్‌కు చేరుకోవాలని పలువురు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపధ్యంలో బీహార్‌లోని రైళ్లన్నీ ప్రయాణికులతో నిండిపోతున్నాయి. రైల్లో కూర్చొనేందుకు స్థలం దొరకకపోవడంతో ప్రయాణికులు రైలుపై దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. ప్రయాగ్‌రాజ్‌లో కుంభస్నానానికి వెళుతున్న యాత్రికులు రైలులో ఎలాగైనా ఎక్కాలనే ఆతృతలో స్వతంత్ర సేనాని సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలులోని అన్ని ఏసీ కోచ్‌ల అద్దాలను బద్దలు కొట్టారు. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయాలపాలయ్యారు. ఈ ఘటన నవాడా స్టేషన్లో జరిగింది. ఈ రైలులో ప్రయాణిస్తున్నవారు తెలిపిన వివరాల ప్రకారం జయనగర్ నుంచి న్యూఢిల్లీకి వెళ్లే ఈ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఎక్కేందుకు లెక్కకుమించినంతమంది ప్రయాణికులు స్టేషన్‌కు చేరుకున్నారు. అయితే జనరల్ కంపార్ట్మెంట్ మొదలుకొని ఏసీ కోచ్ వరకూ దేనీలోని కాలు మోపేందుకు కూడా స్థలం లేకపోవడంతో స్టేషన్‌లోని ప్రయాణికుల్లో అసహనం మొదలయ్యింది.బయట స్టేషన్లో ఉన్న జనాన్ని చూసిన రైలులోని వారు కోచ్ తలుపులను మూసివేశారు. దీంతో ముధుబని స్టేషన్లో రైలు కోసం వేచిచూస్తున్న ప్రయాణికులు ఏసీ కోచ్ అద్దాలను బద్దలుకొట్టారు. ఆ సమయంలో రైల్వే పోలీసులు అక్కడే ఉన్నా వారు ఏమీ చేయలేకపోయారు. ఈ ఘటన నేపధ్యంలో రైలు 25 నిముషాల పాటు నవాడా స్టేషన్లో నిలిచిపోయింది. ఇది కూడా చదవండి: Madhya Pradesh: మహిళలకు నెలకు రూ. 3000.. సీఎం ప్రకటన -
Mahakumbh-2025: పోటెత్తిన భక్తులు.. ప్రయాగ్‌రాజ్ సంగమం స్టేషన్ మూసివేత
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలో పవిత్రస్నానాలు ఆచరించేందుకు ఈరోజు(సోమవారం) భారీ సంఖ్యలో భక్తులు త్రివేణీ సంగమానికి తరలివస్తున్నారు. ఈ నేపధ్యంలో అప్రమత్తమైన అధికారులు ఎటువంటి ప్రమాదకర ఘటన జరగకుండా ఉండేందుకు ప్రయాగ్‌రాజ్ సంగమం రైల్వే స్టేషన్‌ను తాత్కాలికంగా మూసివేశారు. దీంతో రైలు ప్రయాణికులు ప్రయాగ్‌రాజ్ జంక్షన్‌ను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇక్కడి పరిస్థితి సాధారణ స్థితికి చేరుకున్నాక, సంగమం స్టేషన్‌ను తిరిగి తెరుస్తామని అధికారులు చెబుతున్నారు.ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు ప్రతిరోజూ భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు. దీంతో ప్రయాగ్‌రాజ్‌లోని రోడ్లపై విపరీతమైన ట్రాఫిక్‌జామ్ ఏర్పడుతోంది. ఇదేతరహాలో సంగమం రైల్వే స్టేషన్ వద్ద ప్రయాణికుల భారీ రద్దీ ఏర్పడుతోంది. దీనిని నివారించేందుకు ఈస్టేషన్‌ను మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. మరోవైపు భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు రైల్వేశాఖ అదనపు రైళ్లను నడుపుతోంది. అలాగే కుంభమేళాకు వచ్చే భక్తులకు రైల్వే స్టేషన్లలో ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. ఇది కూడా చదవండి: Maha Kumbh: ‘కుంభమేళా’ అనగానే 15 ఏళ్ల గతం గుర్తుకువచ్చి.. -
ప్రయగ్ రాజ్ లో పుణ్యస్నానం చేసిన కోమటిరెడ్డి
-
మహాకుంభ మేళాలో పాల్గొన్న రాష్ట్రపతి ముర్ము
-
కుంభమేళాకు రాష్ట్రపతి ముర్ము
-
మేళా కిటకిట
ప్రయాగ్‌రాజ్ (యూపీ): మహా కుంభమేళాకు వేదికైన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ కనీవినీ ఎరగనంతగా వచ్చి పడుతున్న జనసందోహంతో కిటకిటలాడుతోంది. దాంతో కొద్ది రోజులుగా నగరానికి నాలుగు వైపులా ఎటు చూసినా పదుల కొద్దీ కిలోమీటర్లు ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోతోంది. జనం తాకిడిని తట్టుకోలేక ప్రయాగ్‌రాజ్ రైల్వే స్టేషన్‌ను ఇప్పటికే మూసేశారు. ప్రయాగ్‌రాజ్, లక్నో మధ్య 30 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి! వాహనదారులు గంటలపాటు పడిగాపులు కాస్తున్నారు. షాహీ స్నానాల వంటి విశేషమైన ప్రత్యేకత ఏదీ లేకున్నా ఆదివారం భక్తులు త్రివేణి సంగమానికి పోటెత్తారు. సాయంత్రం 6 గంటలకే 1.42 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు ఆచరించారు. దీంతో కుంభమేళాలో ఇప్పటిదాకా పుణ్య స్నానాలు ఆచరించిన వారి సంఖ్య 42 కోట్లు దాటినట్టు అధికార యంత్రాంగం తెలిపింది. ఇంతటి రద్దీని ఇప్పటిదాకా ఏ కుంభ మేళాలోనూ చూడలేదని అధికారులే విస్తుపోతున్నారు. ‘‘షాహీ స్నాన్, పర్వదినాలు మినహాయిస్తే ఇతర రోజుల్లో భక్తుల రద్దీ తక్కువగానే ఉండేది. ఈసారి సాధారణ రోజుల్లోనూ విపరీతంగా వస్తున్నారు’’ అని చెబుతున్నారు. రద్దీని తట్టుకునేందుకు ప్రయాగ్‌రాజ్ స్టేషన్లో సింగిల్ డైరెక్షన్ ట్రాఫిక్ సిస్టమ్‌ను అమల్లోకి తెచ్చారు. -
స్నేహితులతో కలిసి మహాకుంభ మేళాకు ఉపాసన.. పోస్ట్ వైరల్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభ్ మేళాకు వెళ్లారు. తన సోదరి, మరికొందరు స్నేహితులతో కలిసి కుంభమేళాకు వెళ్తున్న ఫోటోలను ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి బయలుదేరి ఉదయం ఆరు గంటలకే ప్రయాగ్ రాజ్ విమానాశ్రయం చేరుకున్నట్లు పోస్ట్‌లో తెలిపింది. యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో కొద్ది రోజులు పలువురు సినీ ప్రముఖులు సైతం గంగానదిలో పవిత్రస్నానాలు ఆచరించారు. మూడు లడ్డూలతో కలిసి కుంభ్ మేళాను వెళ్తున్నానంటూ తన ఫ్రెండ్స్‌ను ఉద్దేశించి ఫన్నీగా రాసుకొచ్చింది. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా.. రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్సీ16తో బిజీగా ఉన్నారు. ఇటీవల షూటింగ్ సెట్లోని ఫోటోను కూడా షేర్ చేశారు. ఈ చిత్రానికి బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్లో బిజీగా ఉన్నందున రామ్ చరణ్ యాత్రకు వెళ్లలేదు. ఈ ఏడాది సంక్రాంతికి గేమ్ ఛేంజర్ మూవీతో అభిమానులను పలకరించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించినంత స్థాయిలో రాణించలేకపోయింది.యూపీలో జరుగుతున్న కుంభ మేళాకు దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులు హాజరవుతున్నారు. రానా దగ్గుబాటి భార్య మిహీకా బజాజ్ తన తల్లితో కలిసి ప్రయాగ్‌రాజ్‌ను సందర్శించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ సైతం తన తల్లి మాధవితో కలిసి మహాకుంభ్ మేళాకు హాజరయ్యారు. కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి ఇటీవలే కుంభ్ మేళాలో కనిపించారు. -
విమానం ఆలస్యం..హీరో విజయ్ దేవరకొండ సహా పలువురి ఎదురుచూపులు
సాక్షి,హైదరాబాద్:శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. శుక్రవారం(ఫిబ్రవరి7) ఉదయం 9 గంటలకు ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లాల్సిన విమానం మధ్యాహ్నం 2 గంటల వరకు బయలుదేరలేదు. విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతోనే టేకాఫ్ కాలేదని స్పైస్‌జెట్ సంస్థ తెలిపింది. దీంతో ఆ విమానంలో వెళ్లాల్సిన వారంతా ఉదయం నుంచి విమానాశ్రయంలోనే వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.విమానంలో ప్రముఖ టాలీవుడ్ హీరో విజయదేవరకొండతో పాటు పలువురు ఇతర సినీ ప్రముఖులు ఐఏఎస్‌లు,ఐపీఎస్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. విమానం ఎప్పుడు వెళుతుందో తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారంతా స్పైస్‌జెట్ విమానయాన సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూ.30 వేలు పెట్టి టికెట్ కొన్నా తమకు ఈ ఇబ్బందులేంటని ప్రశ్నిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ప్రస్తుతం కుంభమేళా జరుగుతున్న విషయం తెలిసిందే. కుంభమేళాలో పవిత్ర స్నానమాచరించేందుకు హైదరాబాద్ నుంచి చాలా మంది కుంభమేళాకు వెళుతున్నారు. ఈ క్రమంలోనే పలువురు ప్రముఖులు శంషాబాద్ నుంచి విమానంలో ప్రయాగ్‌రాజ్‌కు వెళుతున్నారు. -
ప్రయాగ్ రాజ్‌లో పుష్పరాజ్.. పోలీసులు ఫిదా!
అల్లు అర్జున్ పుష్ప సినిమాకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం ఇండియాలోనే కాదు.. అంతర్జాతీయ స్థాయిలో పుష్పరాజ్ హవా కొనసాగుతోంది. ఇటీవల పుష్ప-2 ఓటీటీలో విడుదలవగా.. క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్‌పై తెగ చర్చింకుంటున్నారు. హాలీవుడ్ అభిమానులు సైతం పుష్ప ఫైట్ సీన్‌పై వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. సినిమాలో డైలాగ్ చెప్పినట్లే పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్ అని బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.ఇక ఇండియావ్యాప్తంగా బన్నీ క్రేజ్ గురించి మనందరికీ తెలిసిందే. పుష్ప-2 నార్త్‌లో ప్రభంజనం సృష్టించింది. ఏకంగా రూ.800 కోట్లకు పైగా నెట్ వసూళ్లు రాబట్టింది. గతంలో ఏ హిందీ సినిమాకు సాధించని ఘనతను సొంతం చేసుకుంది. దీంతో సౌత్ కంటే నార్లోనే పుష్పరాజ్ హవా ఎక్కువగా కొనసాగింది. దీంతో ఉత్తరాది ఫ్యాన్స్ బన్నీ మేనరిజానికి ఫిదా అయిపోయారు. పుష్ప స్టైల్లో డైలాగ్స్ చెబుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.తాజాగా ఓ అభిమాని అచ్చం పుష్పరాజ్ స్టైల్లో కనిపించి సందడి చేశారు. మహారాష్ట్రకు చెందిన ఓ అభిమాని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభ్ మేళాకు వచ్చాడు. పవిత్ర స్నానం చేసిన అల్లు అర్జున్ అభిమాని అచ్చం పుష్ప సినిమాలో దుస్తులు ధరించి డైలాగ్స్‌తో అదరగొట్టాడు. ఇది చూసిన పోలీసులు అతని స్టైల్‌కు ఫిదా అయ్యారు. అతన్ని చెప్పే డైలాగ్స్ వింటూ ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.(ఇది చదవండి: పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా?.. ఇంటర్నేషనల్!)కాగా.. గతేడాది డిసెంబర్ 5న విడుదలైన పుష్ప-2 ది రూల్ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. తొలి రోజు నుంచే కలెక్షన్ల సునామీ సృష్టించిన పుష్ప-2 ఓవరాల్‌గా రూ.1831 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో హీరోయిన్గా రష్మిక మందన్నా నటించింది. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్, టాలీవుడ్ నటులు జగపతి బాబు, సునీల్, అనసూయ కీలక పాత్రల్లో మెప్పించారు.Prayagraj: A fan of Allu Arjun, who came from Maharashtra to take the Maha Kumbh bath.During this, the fan also recited many dialogues from the movie Pushpa while acting, which became a topic of discussion among the devotees present there.#Prayagraj #AlluArjunFan #Mahakumbh pic.twitter.com/mK0s1wtasA— Our North East (@1OurNortheast) February 6, 2025महाकुम्भ स्नान करने के लिए महाराष्ट्र से आए अल्लू अर्जुन के एक फैन ने संगम में आस्था की डुबकी लगाई। इस दौरान फैन ने पुष्पा फिल्म की एक्टिंग करते हुए कई डायलॉग भी सुनाए, जो वहां मौजूद श्रद्धालुओं के बीच चर्चा का विषय बने। #Prayagraj #AlluArjunFan #Mahakumbh @MahaaKumbh pic.twitter.com/wxetmRuQoH— Dinesh Tiwari 🇮🇳 (@TiwariDineshTi1) February 5, 2025 -
త్రివేణి సంగమంలో ప్రధాని మోదీ పుణ్యస్నానం
-
Watch Live: కుంభమేళాలో ప్రధాని మోదీ
-
ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాకు భూటాన్ రాజు జింగ్మే ఖేసర్
-
మోదీ పుణ్య స్నానం
ఢిల్లీ: మహా కుంభమేళా సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రయాగ్‌రాజ్(Prayagraj త్రివేణి సంగమంలో పుణ్య స్నానమాచరించారు. అనంతరం ఆయన గంగాదేవికి ప్రత్యేక పూజలు చేశారు. ఆ సమయంలో ప్రధాని వెంట ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఉన్నారు. జనవరి 13న మొదలైన మహాకుంభ మేళా ఈ నెల 26న మహా శివరాత్రి రోజున ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఇవాళ మహా కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించేందుకు ప్రధాని మోదీ ప్రయాగ్‌రాజ్ వచ్చారు. హెలికాప్టర్లో అరైల్ ఘాట్ వద్దకు.. అక్కడి నుంచి బోట్లో సంగమం వద్దకు చేరుకున్నారు.ప్రధాని రాక నేపథ్యంలో అరైల్ ఘాట్ నుంచి సంగమం వరకు భారీ భద్రతా మోహరించారు. #WATCH | Prime Minister Narendra Modi to shortly take a holy dip at Triveni Sangam in Prayagraj, Uttar Pradesh(Source: ANI/DD) #KumbhOfTogetherness pic.twitter.com/3F2guB1ElQ— ANI (@ANI) February 5, 2025 -
కుంభమేళాకు వ్యతిరేకంగా కుట్రలు
ప్రయాగ్‌రాజ్: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌తోపాటు సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే కొందరు వ్యక్తులు మహా కుంభమేళాలో భారీ విషాదం జరగాలని కోరుకున్నారని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ధ్వజమెత్తారు. ఆయన బుధవారం ప్రయాగ్‌రాజ్‌లో మీడియాతో మాట్లాడారు. ఇక్కడ జరుగుతున్న సనాతన ధర్మ వేడుకను చూసి దేశ ప్రజలు గర్వస్తున్నారని చెప్పారు. కొందరు దుష్టులు మాత్రం ఈ కార్యక్రమానికి వ్యతిరేకంగా కుట్రలు సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. కుంభమేళా గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రజల్లో అనుమానాలు సృష్టిస్తున్నారని విమర్శించారు.ఖర్గే, అఖిలేష్ యాదవ్‌లు పార్లమెంట్లో మాట్లాడిన మాటలు చూస్తే వారి అసలు అజెండా ఏమిటో తెలిసిపోయిందని అన్నారు. కుంభమేళాపై వారు మొదటి నుంచే దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమాన్ని అప్రతిష్టపాలు చేయడమే పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటపై అధికారులు ఇచ్చిన గణాంకాలనే తాను విడుదల చేశానని తెలిపారు. ఇందులో ఎలాంటి దాపరికం లేదన్నారు. తొక్కిసలాటపై సమాచారం అందిన వెంటనే తమ ప్రభుత్వం చాలా వేగంగా స్పందించిందని చెప్పారు. విశ్వాసానికి, సనాతన ధర్మానికి కుంభమేళా ఒక ప్రతీక అయోధ్యలో రామమందిర నిర్మాణం, ప్రజలకు కోవిడ్–19 వ్యాక్సిన్ ప్రభుత్వం ఉచితంగా ఇవ్వడం పట్ల అసంతృప్తితో ఉన్న కొన్ని గ్రూప్‌లు మహా కుంభమేళాను వ్యతిరేకిస్తున్నాయని సీఎం యోగి ఆదిత్యనాథ్ విమర్శించారు. ఆయన మంగళవారం సాయంత్రం ప్రయాగ్‌రాజ్‌లోని జగద్గురు రమణానందాచార్య స్వామి రామ్ భద్రాచార్య క్యాంప్‌ను సందర్శించారు. 151 కుండ్లీ అఖండ్ భారత్ సంకల్ప్ మహా యజ్ఞంలో పాల్గొన్నారు. అనంతరం భక్తులను ఉద్దేశించి మాట్లాడారు.మన విశ్వాసానికి, సనాతన ధర్మానికి మహా కుంభమేళా ఒక ప్రతీక అని ఈ సందర్భంగా స్పష్టంచేశారు. మన ఆధ్యాత్మిక శక్తిని ప్రపంచానికి చాటుతున్న గొప్ప వేడుక అని అన్నారు. లక్షలాది మంది సాధువులు, యోగులు సనాతన ధర్మాన్ని చక్కగా కాపాడుతున్నారని చెప్పారు. మారీచులు, సుబాహులు మన సనాతన ధర్మాన్ని ఏమీ చేయలేరని తేల్చిచెప్పారు. కుంభమేళాలో ఇప్పటిదాకా 38 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. -
నేడు మహాకుంభ మేళాకు మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్(Prayagraj)లో జరుగుతున్న మహాకుంభ మేళా(Maha Kumbh Mela)కు ప్రధాని మోదీ(Narendra Modi)5న హాజరవుతున్నారు. ఈ మేరకు మంగళవారం ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. బుధవారం ఉద యం ఢిల్లీ నుంచి ప్రత్యేక వి మానంలో ఆయన ప్రయాగ్ రాజ్‌కు చేరుకుంటారు.ఉదయం 11 గంటల సమయంలో త్రివేణి సంగమంలో మోదీ స్నానమాచరించి, గంగాదేవికి పూజలు చేస్తారు. జనవరి 13న మొదలైన మహాకుంభ మేళా ఈ నెల 26న మహా శివరాత్రి రోజున ముగియనుంది. -
కుంభమేళాలో అయోధ్య రాముని రెప్లికా
మహా కుంభమేళాకి వెళ్తున్నారా? వెళ్లట్లేదా! అయోధ్య నుంచి బాలరాముడు కూడా మహాకుంభమేళా కోసం ప్రయాగ్‌రాజ్ (Prayagraj) చేరుకున్నాడు. నిజమా! అవును నిజమే. అయోధ్య వెళ్లలేని వాళ్ల కోసం రాముడే స్వయంగా త్రివేణి సంగమానికి (Triveni Sangam) తరలి వచ్చాడని సంబరపడుతున్నారు భక్తులు. అచ్చం అయోధ్యలోని బాలరాముడి ఆలయాన్ని పోలిన నిర్మాణాన్ని యూపీలోని కుంభమేళాలో ఆవిష్కరించాడు మన హైదరాబాదీ. ఆయన పేరు రమణ వంక (Ramana Vanka). సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్‌గా సొబగులద్దే రమణ ఈ మహాకుంభమేళా సందర్భంగా అయోధ్యరాముడి ఆలయాన్ని, బాలరాముడి విగ్రహాన్ని తీర్చిదిద్దారు. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్‘భీమ సినిమాకు టెంపుల్ సెట్ వేసిన అనుభవం ఉంది. అది తెలిసి ఆద్యశ్రీ ఎన్ఫోటైన్మెంట్, శ్రీ గరుడ రామ్‌మందిర్ వారు పిలిచారు. ‘శతమానం భవతి’ సినిమా కోసం దాదాపు యాభై రోజులు నియమనిష్ఠలు పాటించాను. అలాగే రాముడి మందిరానికి భూమి పూజ చేసిన డిసెంబర్ 26 నుంచి నిష్ఠలో ఉన్నాను. ఫిబ్రవరి 26తో మహాకుంభమేళా (Maha Kumbh Mela) ముగుస్తుంది. కానీ శ్రీరామనవమి వేడుకల వరకూ (మార్చి 15) మందిరాన్ని ఉంచాలని అనుకుంటున్నారు. అప్పటి వరకూ నిష్ఠను కొనసాగిస్తాను’ అన్నారు రమణ వంక.అయోధ్య మందిరాన్ని చూడలేదు.. అయోధ్య మందిరానికి ప్రతిరూప నిర్మాణాన్ని 25 రోజుల్లో పూర్తి చేశారు రమణ. ఒక ఆలయానికి రూపకల్పన చేయాలంటే శాస్త్రాలను, మత విశ్వాసాలను, నిర్మాణశైలిని అధ్యయనం చేయాలి. ప్రతి చిన్న డీటెయిలింగ్ వెనుక ఒక అధ్యయనం ఉంటుంది. అప్పటికే ఉన్న ఆలయానికి రెప్లికా కాబట్టి రోజుల్లోనే చేయగలిగానని, ఇది నా అదృష్టమని రమణ చెబుతున్నారు. అయితే ‘అయోధ్య మందిరాన్ని సందర్శించలేదని, కానీ నిర్మాణాన్ని ఫొటోలో చూడగానే ఒక అవగాహన వచ్చిందని, ఈ నిర్మాణంలో వెదురు, ఫైబర్, ఫోమ్, క్లాత్ వాడామని, ఎనిమిది డిగ్రీల చలిలో, మంచుతో తడిసిన వెదురు కర్రల మీద 80 అడుగుల ఎత్తులో పని చేస్తున్నప్పుడు ఆందోళనగా ఉండేదని, ఎటువంటి చిన్న ప్రమాదం లేకుండా పని పూర్తి చేయగలిగామని, అవకాశం వచ్చినప్పుడే మనల్ని మనం నిరూపించుకోవాలి’ అని చెబుతున్నారు రమణ. కాగా కుంభమేళాలో అయోధ్య రాముడి నమూనా నిర్మాణం చేపట్టిన ఘనత హైదరాబాదీది, పైగా తెలుగువాడిది కావడం గర్వకారణం.అయోధ్యలో సగం! ప్రయాగ్‌రాజ్ రామ మందిరానికి అయోధ్య మందిరం కొలతల్లో యాభై శాతం తీసుకున్నారు. 161 అడుగుల ఎత్తును 81 చేశారు. 360 అడుగుల పొడవు, 161 అడుగుల వెడల్పు 140, 120గా తీసుకున్నారు. రాముడి విగ్రహాన్ని అసలు రూపం కంటే మూడు అంగుళాలు తక్కువగా తీసుకున్నారు. ప్రాణ ప్రతిష్ఠ బదులు జల ప్రతిష్ఠ చేశారు. నిత్యపూజలు దర్శనాలు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ ఉంటాయి. రోజుకు 15 నుంచి 20 వేల మంది దర్శనం చేసుకుంటున్నారు.చదవండి: ప్రత్యక్ష దైవమా.. ప్రణామంసర్వమతం.. శ్రీరామం.. ప్రయాగ్‌రాజ్ రామమందిరం రూపశిల్పి రమణ తెలుగు వాడు. అయితే హిందీ, బెంగాలీ వాళ్లు మొత్తం రెండు వందల మంది కళాకారులు ఇందులో పాల్గొన్నారు. నిత్యం ‘జై శ్రీరామ్’ అంటూ దీక్షగా పని చేసుకుపోయిన వారిలో వివిధ భాషలే కాదు, మతాలు కూడా ఉన్నాయి. ఈ 200 మందిలో హిందూ, క్రిస్టియన్, ముస్లింలు ఉన్నారు. ప్రయాగ్‌రాజ్‌లో త్రివేణి సంగమానికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో చుంగ్లీ అనే ప్రదేశంలో ఉంది. త్రివేణి సంగమం, సెక్టార్ 1, గ్రౌండ్ 17లో ఉంది.రాముడే పిలిచాడు! బీఎస్సీ చదివి 10–5 జాబ్ చేశాను. సంతృప్తినివ్వలేదు. దీంతో నాకిష్టమైన డ్రాయింగ్‌లో ఎమ్ఎఫ్ఏ చేశాను. ఆర్ట్ డైరెక్టర్‌గా పాతికకు పైగా సినిమాలకు పనిచేసి నేషనల్ అవార్డు అందుకున్నాను. నా కెరీర్లో ది బెస్ట్ టాస్క్ అయోధ్య ఆలయ రెప్లికా నిర్మాణం. వెనక్కి తిరిగి చూసుకుంటే నా చరిత్రలో రాముడున్నాడు. జీవితానికి ఇది చాలు. – రమణ వంక, సినీ ఆర్ట్ డైరెక్టర్ -
Mahakumbh-2025: ఈ బావిలో అదృశ్య ‘సరస్వతి’ ప్రవాహం
ప్రయాగ్‌రాజ్: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు మనదేశం నుంచి కాకుండా విదేశాల నుండి కూడా పర్యాటకులు తరలివస్తున్నారు. ఇక్కడికి వచ్చిన వారంతా త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అలాగే ఇక్కడి పర్యాటక ప్రాంతాలను కూడా సందర్శిస్తున్నారు. వీటిలో ‘సరస్వతి బావి’ అందరినీ అమితంగా ఆకట్టుకుంటోంది. ప్రయాగ్‌రాజ్‌లోని గంగా, యమున, అదృశ్య సరస్వతి(Invisible Saraswati) నదుల త్రివేణి సంగమంలో స్నానం చేయడం ద్వారా మోక్షాన్ని పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. త్రివేణి సంగమానికి కొద్ది దూరంలోని సరస్వతి బావి ఇక్కడికి వచ్చే భక్తులను ఆకట్టుకుంటోంది. ఇక్కడ సరస్వతి మాత జలాన్ని నేరుగా దర్శనం చేసుకోవచ్చని పండితులు చెబుతున్నారు.ప్రయాగ్‌రాజ్ కోటలో కనిపించే ఈ సరస్వతి బావి.. సరస్వతి నదికి రహస్య వనరు అని పండితులు చెబుతుంటారు. ఈ బావి నుంచి ఊరుతున్న నీటి ప్రవాహం నేరుగా త్రివేణి(Triveni) సంగమానికి అనుసంధానమై ఉంది. 2016లో శాస్త్రవేత్తలు, పరిశోధకులు సాగించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడయ్యింది. ఈ సరస్వతి బావికి ప్రధాన పూజారిగా వ్యవహరిస్తున్న సుబేదార్ మేజర్ రామ్ నారాయణ్ పాండే మాట్లాడుతూ ఇక్కడి నీటి ఊట బావి ఆకారంలో ఉన్నందున దీనికి సరస్వతి బావి అనే పేరు వచ్చిందన్నారు. సరస్వతి నది మానా గ్రామంలో ఉద్భవించిందని చెబుతుంటారు.పురాణాలలోని వివరాల ప్రకారం మహర్షి వేద వ్యాసుడు(Maharishi Veda Vyas) చెబుతుండగా గణేశుడు 18 పురాణాలను రాస్తున్నాడు. అయితే అదే సమయంలో సరస్వతి నది ప్రవాహ ధ్వని కారణంగా గణేశునికి వినికిడి సమస్య ఏర్పడిందట. దీంతో సరస్వతి మాత తన నీటి ప్రవాహాన్ని పాతాళం వైపు ప్రవహించాలని ఆదేశించిందట. సరస్వతి ప్రవాహం ప్రయాగ్‌రాజ్ చేరుకున్న సమయంలో విష్ణువు ఆ నీటిని సంగమంలో విలీనం చేయమని సరస్వతి మాతను కోరాడట. దీనికి సర్వస్వతి మాత సమ్మతించిందట. మహా కుంభమేళాకు తరలివచ్చే భక్తులు సరస్వతి బావిని తప్పకుండా సందర్శిస్తుంటారు.ఇది కూడా చదవండి: Delhi Elections: ఆప్‌కు భారీ షాక్.. -
భారత సామాజిక చేతనకు మహాకుంభమేళా నిదర్శనం : రాష్ట్రపతి
-
మహా కుంభమేళా.. విమాన ఛార్జీలు తగ్గింపు
మహా కుంభమేళా సందర్భంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు రాకపోకలు సాగిస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ తరుణంలో కొన్ని విమాన సంస్థలు ఇప్పటికే ఛార్జీలు పెంచాయి. దాంతో ప్రయాణికుల రద్దీ పెరగడం వల్ల సహేతుకమైన విమాన ఛార్జీలు ఉండాలనేలా ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన పిలుపు మేరకు ఆకాసా ఎయిర్ స్పందించింది. విమాన ఛార్జీలను గణనీయంగా తగ్గిస్తున్నట్లు, ప్రయాగ్‌రాజ్‌కు విమానాల సంఖ్యను పెంచుతున్నట్లు ప్రకటించింది.ఛార్జీల తగ్గింపు, విమానాల సంఖ్య పెంపుఆకాసా ఎయిర్ ప్రయాగ్‌రాజ్‌కు విమానాల టికెట్ ధరలను 30-45% తగ్గించింది. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం భక్తులకు విమాన ప్రయాణాన్ని మరింత అందుబాటులోకి తెచ్చింది. ముంబై, ఢిల్లీ నుంచి రోజువారీ డైరెక్ట్ సర్వీసులతో పాటు పుణె, హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు వంటి నగరాల నుంచి ప్రత్యేక విమానాలను నడుపుతుంది. మహా కుంభమేళా సందర్భంగా విమానాలను పెంచాలని, సహేతుకమైన ఛార్జీలను నిర్వహించాలని విమానయాన సంస్థలను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. దాంతో కంపెనీ ఈమేరకు స్పందించినట్లు తెలిపింది.ప్రభుత్వ జోక్యంవినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడుకు గతంలో లేఖ రాశారు. ప్రయాగ్‌రాజ్ విమాన ప్రయాణానికి అధిక ఛార్జీలు ఉన్నాయనే ఫిర్యాదులను ఆ లేఖలో హైలైట్ చేశారు. తరువాత ఛార్జీలను తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆర్థికపరమైన ప్రయాణ ఇబ్బందులు లేకుండా మహా కుంభమేళాకు భక్తులు వెళ్లేందుకు వీలుగా ప్రభుత్వం జోక్యం చేసుకుంది.ప్రయాణికులపై ప్రభావం..ఛార్జీల తగ్గింపు, విమానాల పెంపు నిర్ణయం మహా కుంభమేళాకు వెళ్లే ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు. గతంలో విమాన ఛార్జీలు 300-600% పెరగడంతో, చాలా మంది రోడ్డు లేదా రైలు రవాణా మార్గాలను ఎంచుకుంటున్నారు. ఈ పీక్ పీరియడ్‌లో ప్రయాణాన్ని సులభతరం చేయడానికి ఆకాసా ఎయిర్ చేస్తున్న ప్రయత్నాలను ప్రయాణికులు స్వాగతిస్తున్నారు.ఇదీ చదవండి: బ్లాక్ బడ్జెట్ గురించి తెలుసా?: ఎప్పుడు ప్రవేశపెట్టారంటే..ఇప్పటికే చాలా సంస్థలు..యాత్రికుల రాకపోకలను మరింత మెరుగ్గా నిర్వహించేందుకు చేసే ప్రయత్నాల్లో ఆకాసా ఎయిర్ ఒక్కటే కాదు.. ఇండిగో, స్పైస్ జెట్ సహా ఇతర విమానయాన సంస్థలు కూడా ప్రయాగ్‌రాజ్‌కు తమ విమానాల సంఖ్యను పెంచాయి. విమానయాన పరిశ్రమ నుంచి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల లక్షల మంది భక్తుల ప్రయాణం సులభతరం అవుతుందని భావిస్తున్నారు. ఫిబ్రవరి 26 వరకు మహా కుంభమేళా కొనసాగుతుంది. -
కుంభమేళాలో మరో తొక్కిసలాట!
మహాకుంభ్ నగర్: ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా సందర్భంగా మౌని అమావాస్య రోజు బ్రహ్మముహూర్తంలో పుణ్యస్నానాల కోసం వేచి ఉన్న భక్తులపై వెనకవైపు భక్తులు పడటంతో జరిగిన తొక్కిసలాటలో 30 మంది ప్రాణాలు కోల్పోయారన్న వార్తలో కొంత నిగూఢార్థం ఉందని ఆలస్యంగా వెల్లడైంది. మరణాలన్నీ ఈ సంగం ఘాట్ వద్దే సంభవించలేదని కొన్ని సమీపంలోని ఝాసీ ఘాట్ వద్ద సంభవించాయన్న వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంగం ఘాట్‌లో భారీ తొక్కిసలాట జరిగిన కొద్దిసేపటి తర్వాత ఝాసీ ఘాట్‌లో తొక్కిసలాట జరిగిందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. సంగం ఘాట్ విషాదం నుంచి భక్తులు తేరుకునేలోపే మరోచోట కూడా తొక్కిసలాట జరిగిందన్న వార్త తెలిస్తే భయంతో భక్తులు వెనుతిరగడమో, గందరగోళంతో పరుగెత్తడమో చేస్తే మళ్లీ సంగం ఘాట్‌లో మరో అపశృతి చోటుచేసుకుంటుందన్న అనుమానంతో అధికారులు ఈ విషయాన్ని వెంటనే బయటకు చెప్పలేదని తెలుస్తోంది. భక్తులను శాంతపరచడమే తమ ముఖ్య ఉద్దేశమని అక్కడి అధికారులు చెప్పారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. సంగం ఘాట్‌కు ఉత్తరాన కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో గంగ ఒడ్డుకు ఆవలివైపు ఈ ఘాసీ ఘాట్ ఉంది. సంగం ఘాట్ వద్ద మంగళవారం అర్ధరాత్రి దాటాక 1.30 గంటల ప్రాంతంలో తొక్కిసలాట జరిగింది. ఝాసీ ఘాట్‌లో దాదాపు ఉదయం ఆరు గంటలకు తొక్కిసలాట జరిగింది. మధ్యాహ్నం దాకా మృతదేహాలు అక్కడే! ‘‘ఝాసీ ఘాట్‌లో తొక్కిసలాటలో ఊపిరాడక చనిపోయిన భక్తుల మృతదేహాలు అక్కడే పడి ఉన్నాయి. వాటిని పట్టించుకున్న నాథుడే లేడు. ఉదయం ఆరు గంటలకు తొక్కిసలాటలో చనిపోతే మధ్యాహ్నం 1.30 గంటలకు మృతదేహాలను ఇక్కడి నుంచి తీసుకెళ్లారు. తొక్కిసలాట జరిగిన నాలుగు గంటల తర్వాత ఒక మహిళా కానిస్టేబుల్ వచ్చింది. అప్పటికే అక్కడి భీతావహ పరిసరాలను తమ స్మార్ట్‌ఫోన్ కెమెరాల్లో బంధిస్తున్న జనాలను పోలీసులు వారించారు’’అని ఝాసీ ఘాట్‌లో హల్దీరామ్ దుకాణం నడుపుతున్న నేహా ఓఝా స్థానిక మీడియాతో చెప్పారు. ‘‘ఊహించనంతగా భక్తులు వచ్చారు. అడ్డుగా ఉన్న కర్ర బ్యారీకేడ్లను విరగ్గొట్టి ముందుకు రావడంతో ఘోరం జరిగింది. ఇదే అదనుగా అక్కడ నిద్రిస్తున్న వాళ్లకు చెందిన ఐఫోన్లు, ల్యాప్‌టాప్‌లను కొందరు కొట్టేశారు’’అని ప్రత్యక్ష సాక్షి హర్షిత్ అన్నారు. ‘‘మా దుకాణం చుట్టూతా ఒక్కసారిగా జనం పోగయ్యారు. పరిస్థితి పూర్తిగా అదుపుతప్పింది. మా దుకాణంలోకీ జనం చొచ్చుకొచ్చారు. ఇదే అదనుగా ఎవరో మా హల్దీరామ్ దుకాణం క్యాష్ కౌంటర్ నుంచి రూ.1,80,000 కొట్టేశారు. ఇక్కడ గుట్టలుగా పడి ఉన్న భక్తుల బ్యాగులు, చెప్పుల కుప్పల నుంచే కొందరు వృద్ధుల మృతదేహాలను బయటకు తీశారు. నా ముందే ఈ టెంట్లో ఇద్దరు చనిపోయారు’’అని నేహా ఓఝా చెప్పారు. ‘‘వెంటనే ఝాసీ ఘాట్‌కు అంబులెన్సు వచ్చే సౌకర్యం కూడా లేదు. ఏ సాయం అందాలన్నా నది ప్రవాహం మీదుగా పడవల్లో వచ్చి సాయపడాల్సిందే’’అని మరో ప్రత్యక్ష సాక్షి మెయిన్ బహదూర్ సింగ్ చెప్పారు. ‘‘బస్సులో వచి్చన ఒక 20 మంది యువకులు బ్యారీకేడ్లను విరగొట్టి, అందర్నీ తోసేసి ముందుకెళ్లారు. ఈ సమయంలోనే తొక్కిసలాట జరిగింది’’అని మరో ప్రత్యక్ష సాక్షి అయిన ఒక సాధువు చెప్పారు. ఝాసీ ఘాట్‌లో తొక్కిసలాట కారణంగా ఏర్పడిన చెత్తను తొలగించేసరికి సాయంత్రం ఆరు అయిందని ఒక కార్మికుడు చెప్పారు. అగ్నిప్రమాదంలో 15 టెంట్లు దగ్ధం మహాకుంభ్ నగర్: ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో మరోసారి అగ్నప్రమాదం సంభవించింది. సెక్టార్ 22 సమీప ఛామన్గంజ్ చౌకీ వద్ద చెలరేగిన అగ్నికీలల్లో 15 టెంట్లు కాలిపోయాయని ప్రధాన అగ్నిమాపక దళ అధికారి(కుంభ్) ప్రమోద్ శర్మ చెప్పారు. విషయం తెలియగానే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని మంటల్ని ఆర్పేశారు. సరైన రోడ్డు మార్గంలేకపోవడంతో త్వరగా ఘటనాస్థలికి చేరుకోవడం కష్టంగా మారింది. అగ్నిప్రమాద ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఎవరూ గాయపడలేదని అధికారి స్పష్టంచేశారు. కలిపోయిన టెంట్లు కుంభమేళాలో భాగంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసినవి కాదని, అక్రమంగా వెలిశాయని వెల్లడించారు. అగ్నికీలలు చెలరేగడానికి గల కారణాలపై దర్యాప్తు మొదలెట్టారు. -
Maha Kumbh Mela 2025 : గర్ల్ ఫ్రెండ్ సలహాతోనే పెట్టుబడిలేని వ్యాపారం
ప్రముఖ ఆధ్యాత్మిక కార్యక్రమం మహా కుంభమేళా అశేష భక్తకోటితో ఉత్సాహంగా సాగుతోంది. పవిత్ర త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. అందుకే సుదూర తీరాల నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా (MahaKumbhMela 2025)కు తరలివస్తున్నారు. ఈ సందర్భంగా హృదయాలను హత్తుకునే సంఘటనలు, కథనాలు ఆకర్షిస్తున్నాయి. మరోవైపు బడా వ్యాపరస్తులతోపాటు ఇక్కడ చిన్నా, చితకా వ్యాపారం చేసుకునేందుకు అనేకమంది ప్రయాగరాజ్‌కు వస్తున్నారు. వీరిలో రుద్రాక్ష మాలలు, పూసలు అమ్ముకునే మోనాలీసాలాగా పాపులర్ అవుతున్నారు. ఈ కోవలో ఒక ప్రేమికుడు నిలవడం విశేషం. స్నేహితురాలు ఇచ్చిన సలహాను తు.చ. తప్పకుండా పాటించి ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు.దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ అయింది. ప్రస్తుతం ఇది నెట్టింట సందడి చేస్తోంది. పెట్టుబడి లేని వ్యాపారంగా వేప పుల్లల్ని విక్రయిస్తూ ఆకర్షణీయమైన ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. ప్రియురాలిచ్చిన సలహా ఆధారంగా రంగంలోకి దిగిన అతగాడు రోజూ పొద్దున్నే అక్కడ వేపపుల్లల్ని విక్రయిస్తున్నాడు. తద్వారా గత ఐదు రోజుల్లో 40వేల రూపాయలు సంపాదించాడు. ఈ సందర్భంగా సంతోషం నిండిన కళ్లతో అతను చెబుతున్న మాటలు అనేకమంది హృదయాలను హత్తుకుంటున్నాయి.‘‘ఆమె(తన ప్రేయసి) కారణంగా నేను ఇక్కడ ఉన్నాను. తానే మహాకుంభ మేళాకు వెళ్లమని చెప్పింది. పెట్టుబడి అవసరం లేదు కాబట్టి ఆ క్షేత్రంలో వేపపుల్లలు అమ్మమని సలహా ఇచ్చింది. నేను ఆమె కారణంగా ఇంత సంపాదించాను’’ అంటూ చెప్పుకొచ్చాడు సంతోషంగా.“నిజమైన బంధం” అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాలో షేర్ అయిన ఈ కథనంపై నెటిజన్లు వారి ప్రేమను అభినందించారు. నిజమైన ప్రేమ, ఎంత హృద్యంగా ఉంది లాంటి కామెంట్లు వెల్లువెత్తాయి. "ఇంత అద్భుతమైన స్నేహితురాలిని ఎప్పుడూ వదులుకోవద్దు లేదా మోసం చేయవద్దు" అని ఒక ఇన్స్టాగ్రామ్ వినియోగదారుడు రాశారు."చాలా అమాయకత్వంతో నిజం మాట్లాడుతున్నాడు. మీరు జీవిత మార్గంలో విజయంలో అగ్రస్థానానికి చేరుకుంటారు" అని మూడవ వ్యక్తి వ్యాఖ్యానించాడు.ఒక్క క్షణం కూడా తన స్నేహితురాలికి క్రెడిట్ ఇవ్వడానికి వెనుకాడలేదు సూపర్ అని మరొకరన్నారు. చూశారా.. ప్రియురాలు గురించి చెప్పేటపుడు అతని ముఖంలో వెలుగు, మాటల్లో గర్వం, ఆ స్వరంలో ప్రేమ ఎంత కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయో..ఇదే రా ప్రేమంటే అంటూ మరికొంతమంది కమెంట్ చేశారు. ఇదీ చదవండి: ఉద్యోగులకు బంపర్ ఆఫర్ : తీసుకున్నోడికి తీసుకున్నంత! View this post on Instagram A post shared by Adarsh Tiwari (@adarshtiwari20244) ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమాహారంగా భావించే మహాకుంభమేళా జనవరి 13న ప్రారంభమైంది. ఇది ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుంది. ఈ పవిత్ర కార్యంలో సన్యాసులు, సాధువులు, సాధువులు, సాధ్విలు ప్రముఖంగా నిలుస్తుండగా, దేశ విదేశాలకు చెందిన పలువురు భక్తులతోపాటు, అన్ని వర్గాల ప్రజలు తరలివస్తున్నారు. గంగా, యమున ,సరస్వతిల పవిత్ర సంగమమైన సంగమంలో స్నానం చేసి తరలించాలని భక్తుల ఆకాంక్ష.ఇదీ చదవండి: సినిమాను మించిన సింగర్ లవ్ స్టోరీ : అదిగో ఉడుత అంటూ ప్రపోజ్! -
మహా కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం
ప్రయాగ్‌రాజ్: మహా కుంభామేళాలో మరో అపశృతి చోటుచేసుకుంది. కుంభామేళా వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సెక్టార్-22లో మంటలు చెలరేగాయి. ఎగసిపడుతున్న మంటల ధాటికి టెంట్లు కాలిపోతున్నాయి. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెలుస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. వివరాల ప్రకారం.. ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో తొక్కిసలాట జరిగిన మరుసటి రోజే మరో ప్రమాదం జరిగింది. గురువారం మధ్యాహ్నం కుంభమేళా జరుగుతున్న సెక్టార్-22లో మంటలు చెలరేగాయి. ఎగిసిపడుతున్న మంటల ధాటికి అక్కుడున్న టెంట్లు కాలిపోయాయి. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెస్తున్నారు. మంటలు చెలరేగిన స్థలంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. సీనియర్ అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే, వరుస ప్రమాదాల నేపథ్యంలో భక్తులు ఆందోళన చెందుతున్నారు. प्रयागराज महाकुंभ महाकुंभ 2025 फिर से आग। झूसी छतनाग घाट नागेश्वर घाट सेक्टर 22 के पास महाकुंभ मेले में लगी भीषण आगमहाकुंभ के सेक्टर 22 में भीषण आग लगने से कई टेंट जलकर हुए राख pic.twitter.com/wvYZQWyIbC— Gaurav Shukla (@shuklaagaurav) January 30, 2025ఇదిలా ఉండగా.. కుంభమేళాలో బుధవారం తొక్కిసలాట కారణంగా 30 మంది భక్తులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మరో 60 మంది భక్తులు త్రీవంగా గాయపడ్డారు. ఇక, కొద్దిరోజుల క్రితమే కుంభమేళా వద్ద అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ గుడారంలో రెండు గ్యాస్ సిలిండర్లు పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. అక్కడి నుంచి క్రమంగా మంటలు వ్యాపించడంతో 18 టెంట్లు ఆహుతయ్యాయని తెలిపారు. మరోవైపు, దట్టమైన పొగ వ్యాపించడంతో భక్తులు భయంతో పరుగులు తీశారు.प्रयागराज महाकुंभ मेला क्षेत्र में लगी भीषण आग की घटना अत्यंत दुर्भाग्यपूर्ण है। प्रशासन से अपील है कि राहत और बचाव कार्य में तुरंत तेजी लाएं। #KumbhMelapic.twitter.com/sbp6bOeb1X— Hansraj Meena (@HansrajMeena) January 30, 2025సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 15 ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. మహా కుంభమేళాలోని సెక్టార్ 19 వద్ద గుడారంలో రెండు గ్యాస్ సిలిండర్లు పేలాయి. ఆ మంటలు ఇతర గుడారాలకు వ్యాపించాయి. కుంభమేళా (Kumbh Mela) వద్ద భద్రతా ఏర్పాట్లలో భాగంగా అప్పటికే ఉంచిన అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశాయి. సమీపంలోని టెంట్లలో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని పోలీసులు తెలిపారు. -
తొక్కిసలాట ఘటనపై సుప్రీం కోర్టులో పిల్
న్యూఢిల్లీ: యూపీ ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా తొక్కిసలాట ఘటనపై సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ ఘటనకు బాధ్యత యూపీ ప్రభుత్వానిదేనంటూ ఓ అడ్వొకేట్ సుప్రీం కోర్టులో పిల్ వేశారు. త్రివేణి సంగమం వద్ద మంగళవారం అర్ధరాత్రి దాటాక తొక్కిసలాట కారణంగా 30 మంది భక్తుల మృతి, 60 మందికి గాయాలైన సంగతి తెలిసిందే. అయితే..మహా కుంభమేళా దుర్ఘటనకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బాధ్యత వహించాలంటూ అడ్వొకేట్ విశాల్ తివారీ సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేశారు. ఘటనపై సమగ్ర నివేదికను సమర్పించేలా యూపీ సర్కార్‌ను ఆదేశించాలని, అదే సమయంలో తమ నిర్లక్య వైఖరితో మరణాలకు కారకులైన అధికారులపై చర్యలకు ఉపక్రమించాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారాయన. అంతేకాదు.. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు చోటు చేసుకోకుండా రాష్ట్రాలకు స్పష్టమైన, విధానపర మార్గదర్శకాలు ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం కొనసాగుతున్న మహా కుంభమేళాలో అన్ని రాష్ట్రాల సమన్వయంతో వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయించేలా అధికార యంత్రాగాన్ని ఆదేశించాలని కోరారాయన.మరోవైపు తీవ్ర విషాదం నేపథ్యంతో.. మహా కుంభమేళా నిర్వహణలో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీవీఐపీ పాస్‌లను పూర్తిగా రద్దు చేసింది. బుధవారం అర్ధరాత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశం తర్వాత కీలక నిర్ణయాలను వెల్లడించారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు మహా కుంభమేళా జరుగుతున్న ప్రాంతంలోకి ఎలాంటి వాహనాలు ప్రవేశించకుండా యోగి సర్కారు నిషేధం విధించింది. ఈ ప్రాంతాన్ని ‘నో వెహికల్ జోన్’గా ప్రకటించింది. అలాగే.. వాహనాల ప్రవేశానికి ఎలాంటి మినహాయింపులు లేవని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇంకోవైపు.. వీవీఐపీ, స్పెషల్ పాస్‌లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ప్రయాగ్‌రాజ్ పొరుగునున్న జిల్లాల నుంచి వచ్చే వాహనాలను సరిహద్దుల వద్దే నిలిపివేయనుంది. వాహనాల రద్దీని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఇక.. ఫిబ్రవరి 4వ తేదీ వరకు ప్రయాగ్‌రాజ్ నగరంలోకి ఫోర్ వీలర్ వాహనాలు ప్రవేశించకుండా నిషేధం విధించింది. భక్తుల సౌకర్యార్థం కుంభమేళా జరుగుతున్న ప్రాంతంలో వన్‌వే రూట్ ట్రాఫిక్ వ్యవస్థను అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించింది. చిరు వ్యాపారులు రోడ్లపై దుకాణాలు పెట్టుకుంటే వాటిని వెంటనే ఖాళీ స్థలాల్లోకి మార్చాలని స్థానిక యంత్రాంగాన్ని ఆదేశించింది. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా చూడాలని సూచించింది. మేళా ప్రాంతంలో పెట్రోలింగ్‌ను పెంచాలని పోలీసు అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. మౌనీ అమావాస్య సందర్భంగా అమృత స్నానం కోసం భారీగా భక్తులు తరలిరావడంతో సంగం ఘాట్‌వద్ద బుధవారం తెల్లవారుజామున తొక్కిసలాట జరిగింది. బుధవారం తెల్లవారుజామున 1, 2 గంటల మధ్య అఖాడాల కోసం ఏర్పాటు చేసిన సంగం స్నాన ఘాట్‌కు వెళ్లేందుకు అఖాడా మార్గ్వద్ద ఉన్న బారికేడ్లపైకి భక్తులు ఎక్కడంతో ఈ ఘటన జరిగిందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. -
Mahakumbh-2025: కుంభ స్నానం కోసం 21 కి.మీ నడిచి.. బ్యాంకు ఉద్యోగి విషాదాంతం
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో మౌని అమావాస్య నాడు తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 30 మంది మృతిచెందారు. ఒకరు కుమారుడిని కోల్పోగా, మరొకరు తల్లిని, ఇంకొకరు సోదరుడిని కోల్పోయారు. ఈ ప్రమాదంలో గాయపడిన 60 మంది బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.ఈ ఘటన అనంతరం మృతులకు సంబంధించిన విషాదగాథలు వెలుగు చూస్తున్నాయి. జార్ఖండ్ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు వచ్చిన ఒక వ్యక్తి త్రివేణి సంగమంలో స్నానం చేసేందుకు 21 కిలోమీటర్ల దూరం నడిచాడు. అయితే పుణ్య స్నానం చేయడానికి ముందే జీవితాన్ని ముగించాడు. వివరాల్లోకి వెళితే జార్ఖండ్‌లోని ఘట్శిల ప్రాంతం నుండి పలువురు భక్తులు పుణ్య స్నానాలు ఆచరించేందుకు ప్రయాగ్‌రాజ్ వచ్చారు. వారిలో ఒకరే బ్యాంకు ఉద్యోగి శివరాజ్ గుప్తా(58). బుధవారం తెల్లవారుజామున ఒంటి గంటకు జరిగిన తొక్కిసలాటలో శివరాజ్ గుప్తా మరణించారు.శివరాజ్ గుప్తా 16 మంది భక్తుల బృందంతో కలిసి ప్రయాగ్‌రాజ్(Prayagraj)కు వచ్చారు. తొక్కిసలాట జరగడానికి కొద్దిసేపటికి ముందే శివరాజ్ గుప్తా తన స్నేహితులతో కలిసి సంగమం తీరానికి చేరుకున్నాడు. అతను త్రివేణీ సంగమంలో స్నానం చేసేలోపే, మృత్యువు అతనిని చుట్టుముట్టింది. బుధవారం తెల్లవారుజామున ఒంటి గంటకు జనం పెరగడంతో శివరాజ్ గుప్తా తన స్నేహితుల బృందం నుండి విడిపోయాడు. సరిగ్గా అదే సమయంలో జరిగిన తొక్కిసలాటలో శివరాజ్ గుప్తా జనసమూహం కాళ్ల కింద నలిగి, ఊపిరాడక మరణించాడు. ఈ తొక్కిసలాట(Stampede)లో అతని బృందంలోని ఇతర సభ్యులు కూడా గాయపడ్డారు. శివరాజ్ గుప్తా భార్య పూనమ్ మీడియాతో మాట్లాడుతూ మంగళవారం రాత్రే తన భర్తతో మాట్లాడానని తెలిపారు. తన భర్త సంగమతీరం చేరుకునేందుకు 21 కిలోమీటర్లు నడవాల్సి వచ్చిందన్నారు. మర్నాటి ఉదయం తొక్కిసలాట వార్త తెలియగానే పూనమ్ తన భర్తకు ఫోన్ చేశారు. కానీ ఎటువంటి స్పందన రాలేదు. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు శివరాజ్ గుప్తా మృతి చెందినట్లు పూనమ్‌కు సమాచారం అందింది. శివరాజ్ గుప్తా జార్ఖండ్(Jharkhand) రాష్ట్ర సహకార బ్యాంకు ఉద్యోగి. అతని కుమార్తె స్వర్ణ ఢిల్లీలో ఉద్యోగం చేస్తుండగా, కుమారుడు శివమ్ బెంగళూరులో ఉంటున్నాడు.ఇది కూడా చదవండి: Mahakumbh-2025: తొక్కిసలాట అనంతరం భద్రత పెంపు -
కుంభమేళా ఘటనకు అసలు కారణం ఇదే
-
ఏమిటీ సంగం నోస్?
మహాకుంభమేళాలో సంగం నోస్ అనే ఘాట్ సమీపంలో మంగళవారం అర్ధరాత్రి దాటాక తొక్కిసలాట జరగడంతో ఈ ఘాట్ వద్దే జనం ఎందుకు ఎక్కువగా పోగుబడ్డారు? అసలు ఈ ఘాట్ విశేషాలు ఏంటీ? అనేవి ఇప్పుడు చర్చనీయాంశాలు అయ్యాయి. గంగా, యమునా, సరస్వతి నదులు కలిసే ప్రాంతాన్ని త్రివేణి సంగమ స్థలిగా పేర్కొంటారు. పైన ఉత్తరం దిక్కు నుంచి గంగా నది, ఎడమ వైపు దక్షిణ దిక్కు నుంచి యమునా నది వచ్చి ఒక వంపు వద్ద కలుస్తాయి. ఈ ప్రాంతం ఆకాశం నుంచి చూస్తే దాదాపు మనిషి ముక్కులాగా కనిపిస్తుంది. అందుకే త్రిభుజాకారంలో ఉండే ఈ ప్రాంతానికి జనబాహూళ్యంలో ‘సంగం నోస్(ముక్కు)’అనే పేరు కూడా ఉంది. అంతర్వాహిణిగా సరస్వతి నదీ ప్రస్తావనను పక్కనబెడితే ప్రయాగ్‌రాజ్ నగర శివారులో రెండు నదులు కలవకముందు విస్తరించి ఉన్న సువిశాల నదీ తీరాల పొడవునా కోట్లాది మంది భక్తులు కుంభమేళాలో భాగంగా పుణ్యస్నానాలు చేస్తున్నారు. అయితే నదులు కలవకముందు ప్రవాహాల తీరాల వెంట పుణ్యస్నానాలు ఆచరించడం కంటే మూడు నదులు కలిసే ఈ ‘సంగం నోస్’వద్ద పుణ్నస్నానం ఆచరిస్తేనే మోక్షం లభిస్తుందనే వాదనా బలంగా వినిపిస్తోంది. చాలా మంది భక్తులు సైతం దీనినే విశ్వసిస్తారు. సాధువుల స్నానాలు ఇక్కడే సాధారణ భక్తుల విషయం పక్కనబెడితే నాగ సాధువులు, అఖాడాల సభ్యులు, ప్రముఖులు అంతా దాదాపు ఈ సంగం నోస్ వద్దే స్నానాలు చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. శతాబ్దాల క్రితం జనాభా తక్కువ, అందులోనూ ఇంతటి భక్తజనకోటి లేరుకాబట్టి ఆనాడు కుంభమేళాకు విచ్చేసిన భక్తులంతా కేవలం ఈ త్రివేణి సంగమ స్థలి వద్దే పవిత్ర స్నానాలు ఆచరించేవారని స్థానికులు చెబుతున్నారు. దీంతో తాము కూడా ఈ సంగం నోస్ వద్దే పుణ్నస్నానాలు ఆచరించాలని ఈ విషయం తెల్సిన చాలా మంది భక్తులు భావిస్తారు. సంగం నోస్ వద్ద వేర్వేరుగా వచ్చి గంగా, యమునా నదీ ప్రవాహాలు ఒక్కటిగా కలిసిపోయి ముందుకుసాగడం చూడొచ్చు. ఇక్కడ రెండు నదులు వేరువేరు రంగులలో కనిపిస్తాయి. యమునా నదీజలాలు లేత నీలం రంగులో, గంగాజలం కొద్దిగా బురదమయంగా కనిపిస్తుంది. యమునా నది ఇక్కడ గంగానదిలో కలిసి అంతర్థానమవుతుంది. అంతర్వాహిణిగా సరస్వతి నది సైతం సంగమించే ఈ ప్రాంతాన్నే కుంభమేళాలోని ప్రధాన సంగం ఘాట్‌గా చాలా మంది భావిస్తారు. వివిధ సంప్రదాయాలకు చెందిన అఖాడా సాధువులు తమ ఆచారాలు, అమృత స్నానాలను సంగం నోస్ వద్దే ఆచరించడం ఆనవాయితీగా వస్తోంది. ఇరుకు ప్రాంతాన్ని విశాలంగా విస్తరించి.. సంగం నోస్ వాస్తవానికి ముక్కు చివరలాగా కాస్తంత ముందుకు సాగినట్లు ఉండే నదీతీర ప్రాంతం. ఇక్కడ ఎక్కువ మంది స్నానాలు ఆచరించడానికి వీలుపడదు. కానీ జనం ఇక్కడే ఎక్కువగా స్నానాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుండటంతో యోగి ఆదిత్యనాథ్ సర్కార్ దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఒడ్డు వెంట ఇసుక బస్తాలు వేసి, డ్రెడ్జింగ్ చేసి ఎక్కువ మంది కొనదాకా వచ్చి స్నానాలు చేసేలా దీనిని పెద్ద ఘాట్‌గా మార్చారు. ఇలా సంగం నోస్ వద్ద తూర్పువైపుగా శాస్త్రి వంతెన సమీపంలో 26 హెక్టార్ల భూభాగం అదనంగా అందుబాటులోకి తెచ్చారు. మరో కిలోమీటరున్నర పొడవునా ఇసుక బస్తాలు వేసి ఘాట్‌ను విస్తరించారు. దీంతో సంగం నోస్ ఘాట్ వద్ద ఒకేసారి ఎక్కువ మంది స్నానాలు చేసే వెసులుబాటు లభించింది. గతంలో 2019 ఏడాది కుంభమేళాలో ఈ ఘాట్‌లో ప్రతి గంటకు 50,000 మంది స్నానాలు చేశారు. విస్తరణ తర్వాత ఈసారి ఇక్కడ గంటకు ఏకంగా 2,00,000 మంది భక్తులు స్నానాలు చేయవచ్చని అధికారులు చెబుతున్నారు. జనవరి 13, 14 తేదీల్లో ఇక్కడే గంటకు 3,00,000 మంది పుణ్యస్నానాలు చేశారు. అయితే సాధువులు హాజరయ్యే ’అమృత స్నానం’ రోజున సాధారణ భక్తులను ఈ సంగం నోస్ ఘాట్‌లోకి రాకుండా ఆపేస్తారు. ’అమృత స్నానం’ కాకుండా మిగతా రోజుల్లో ఆవలి వైపు ఒడ్డు నుంచి వేరే ఘాట్ల నుంచి పడవల్లో ఇక్కడికి చేరుకుని స్నానాలు చేస్తుంటారు. అయితే అమృత స్నానం వంటి రోజుల్లో మాత్రం సంగం నోస్ ఘాట్ల వద్దకు పడవలను అనుమతించబోరు. వాస్తవానికి 4,000 హెక్టార్లలో విస్తరించిన ఘాట్లలో సంగం నోస్ కూడా ఒకటి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Maha Kumbh Mela 2025: మహా విషాదం
తెల్లవారుజామున మూడు గంటల సమయం.. బ్రహ్మ ముహూర్తంలో పుణ్యస్నానాలు చేసేందుకు ‘సంగమ్ నోస్’ ఘాట్ వద్ద వేచిచూస్తున్న లక్షలాది మంది భక్తులు.. ఒక్కసారిగా బారికేడ్లకు అటువైపు పెరిగిన భక్తుల రద్దీ.. వారంతా పక్కన కూర్చున్న వారిపై పడటంతో అంతా హాహాకారాలు.. ఏం జరిగిందో తెలియని పరిస్థితి.. పోలీసులు కిందపడినపోయిన 90 మందిని తాత్కాలిక సెంట్రల్ ఆస్పత్రికి తరలించారు. వారిలో 30 మంది ప్రాణాలు వదిలారు. 60 మంది గాయపడ్డారు. అత్యంత పవిత్రమైన మౌని అమావాస్య రోజు భక్తిశ్రద్ధలతో పుణ్యస్నానాలు ఆచరిద్దామని మహాకుంభమేళాకు వచ్చిన కొందరు భక్తులు అనూహ్యంగా జరిగిన తొక్కిసలాటకు బలవటం విషాదాన్ని మిగిల్చింది. స్నానఘట్టాల్లో భక్తకోటి శరణుఘోషకు బదులు మృత్యుఘోష వినిపించింది. మహాకుంభ్ నగర్: అత్యంత పవిత్రమైన మౌని అమావాస్య రోజు భక్తిశ్రద్ధలతో పుణ్యస్నానాలు ఆచరిద్దామని మహాకుంభమేళాకు వచ్చిన కొందరు భక్తులు అనూహ్యంగా జరిగిన తొక్కిసలాట(stampede)కు బలయ్యారు. గత కొద్దిరోజులుగా అశేష జనవాహినితో జనసంద్రమైన ప్రయాగ్‌రాజ్(Prayagraj) మహాకుంభమేళా(Maha Kumbh Mela) స్నానఘట్టంతో భక్తకోటి శరణఘోషకు బదులు మరణమృదంగం వినిపించింది. మంగళవారం అర్ధరాత్రిదాటాక 1–2 గంటల ప్రాంతంలో త్రివేణి సంగమ స్థలి సమీపంలో జరిగిన తొక్కిసలాటలో 30 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. 60 మంది గాయపడ్డారు. దీంతో కొద్దిసేపు పుణ్యస్నానాల క్రతువును మధ్యాహ్నందాకా ఆపేశారు. మృతుల్లో కర్ణాటక, అస్సాం, గుజరాత్ నుంచి వచ్చిన భక్తులున్నారు. మౌని అమావాస్య రోజు ఒక్కరోజే 10 కోట్లమంది భక్తులు రావొచ్చన్న ముందస్తు అంచనాతో యోగి ఆద్యిత్యనాథ్ ప్రభుత్వం అత్యంత పటిష్ట ఏర్పాట్లుచేసినా అపశృతి చోటుచేసుకోవడంతో అక్కడ అంతా విషాదం అలుముకుంది. 30 మంది మృతుల్లో 25 మందిని గుర్తించారు. వారిలో నలుగురు కర్ణాటక వాసులున్నారు. అస్సాం, గుజరాత్ నుంచి చెరో భక్తుడిని గుర్తించారు. గాయపడిన వారిలో 36 మందికి ఇంకా చికిత్స కొనసాగుతోంది. మిగతా వారిని డిశ్చార్జ్‌చేశారు.అంతా గందరగోళం, హాహాకారాలుతెల్లవారుజామున మూడుగంటలకు బ్రహ్మ ముహూర్తంలో స్నానాలు చేయడానికి లక్షలాది మంది భక్తులు త్రివేణి సంగమ స్థలిలోని సంగమ్ నోస్ ఘాట్ వద్ద కూర్చుని వేచి చూస్తుండగా ఒంటిగంట దాటాక బ్యారీకేడ్లకు అటువైపుగా ఉన్న భక్తులు కిటకిట ఎక్కువ కావడంతో ఇటువైపు దూకారు. ఎక్కివస్తున్న, నెడుతున్న జనం ధాటికి బ్యారీకేడ్లు విరిగిపోయాయి. దీంతో కూర్చున్న వారిపై అటువైపు నిల్చున్న భక్తులు పడ్డారు. వారిపై పక్కనున్న వాళ్లు పడటంతో కిందనున్న వాళ్లు ఊపిరాడక చనిపోయారు. అప్పటికే అక్కడ ఉన్న పోలీసులు వెంటనే అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నంచేసినా కోట్లాది జనం కావడంతో అది వెంటనే సాధ్యపడలేదు. కిందపడిన దాదాపు 90 మంది భక్తులను పోలీసులు ఆ జనం మధ్యే భుజాలపై ఎత్తుకుని, అంబులెన్సుల్లోకి ఎక్కించి మేళా ప్రాంగణంలోనే ఏర్పాటుచేసిన తాత్కాలిక సెంట్రల్ ఆస్పత్రికి తరలించారు. అయినాసరే వారిలో 30 మంది చనిపోయారని మహాకుంభ్ డీఐజీ వైభవ్ కృష్ణ ప్రకటించారు. తొక్కిసలాట కారణంగా వెంటనే పుణ్నస్నానాలను పోలీసులు, సహాయక సిబ్బంది ఆపేశారు. పరిస్థితి అదుపులోకి వచ్చిందని నిర్ధారించుకున్నాక మధ్యాహ్నం రెండున్నర గంటలకు 13 అఖాడాల అమృత్ స్నాన్తోపాటు భక్తుల పుణ్యస్నానాలకు అనుమతి ఇచ్చారు.జనం మధ్య చిక్కుకున్న అంబులెన్సులుభయంతో భక్తులు చిందరవందరగా పరుగెత్తడంతో బ్యాగులను వెంటేసుకొచ్చిన కొందరు వాటిని అక్కడే పడేశారు. అవి తగిలి ఇంకొందరు పడ్డారు. చెత్త కోసం ఏర్పాటుచేసిన ఇనుప చెత్త డబ్బాలు తగిలి చాలా మంది పడ్డారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. తొక్కిసలాటలో కిందపడి స్పృహకోల్పోయిన భక్తులను వెంటనే అంబులెన్సుల్లో ఎక్కించినా జనం మధ్యలో ముందుకు కదల్లేక అవి చాలాసేపు అక్కడే ఆగిపోయాయి. పోలీసులు రంగంలోకి దిగి ఎట్టకేలకు వాటికి దారి కల్పించారు. వీఐపీల కోసం కొంత మేర స్థలాన్ని వదిలేయడంతో పక్కన రద్దీ పెరుగుతోంది. ఇకపై వీఐపీ ప్రోటోకాల్ పేరిట జనాన్ని పక్కకు నెట్టేసే విధానాన్ని పాటించబోమని అక్కడి అధికారి ఒకరు చెప్పారు. సాధారణ భక్తులు, అఖాడాల కోసం వేర్వేరుగా ఏర్పాటుచేసిన వరసలు, బ్యారీకేడ్ల వద్ద ఘటన జరిగిందని అధికారి పేర్కొన్నారు. కుప్పలుగా భక్తుల దుస్తులు, దుప్పట్లు, బ్యాగులు, చెప్పులు పడి తొక్కిసలాట ప్రాంతం చిందరవందరగా తయారైంది. స్పృహ కోల్పోయిన తమ వారిని తట్టిలేపేందుకు ప్రయత్నిస్తున్న కుటుంబ సభ్యులతో ఆప్రాంతంలో ఒక్కసారిగా నిర్వేదం నెలకొంది. ‘‘ కర్ణాటక నుంచి మేం 60 మంది బృందంగా వచ్చాం. అన్ని వైపుల నుంచి తోశారు. తప్పించుకునే ఆస్కారం లేకుండాపోయింది’’ అని కర్ణాటక నుంచి వచ్చిన సరోజిని అనే భక్తురాలు ఏడుస్తూ చెప్పారు. ‘‘ బ్రహ్మముహూర్తంలో స్నానం చేద్దామని కూర్చుని, పడుకుని వేచిచూస్తున్న వారిపైకి వెనక నుంచి ఒక్కసారిగా జనం మీదపడ్డారు. దాంతో తొక్కిసలాట జరిగింది’’ అని అస్సాం నుంచి వచ్చిన బాదామా దేవి చెప్పారు. ఇలా జరగాలని గంగమ్మ తలచిందేమో అని జార్ఖండ్‌లోని పలాము నుంచి వచ్చిన రామ్ సుమిరాన్ అనే భక్తుడు అన్నాడు. తొక్కిసలాటకు ముందే ఏదైనా ఉపద్రవం జరగొచ్చని ఊహించిన ప్రయాగ్‌రాజ్ డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్ మాట్లాడుతున్న వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఘాట్ వద్ద కూర్చుని వేచిచూస్తున్న భక్తులకు ఆయన ‘‘ లేవండి. లేవండి. త్వరగా స్నానంచేసి వెళ్లపొండి. వెనక నుంచి ఊహించనంత మంది జనం వచ్చేస్తున్నారు’’ అని ఆయన అక్కడి భక్తులకు ముందే హెచ్చరిస్తుండటం ఆ వీడియోలో ఉంది. ‘‘ భక్తుల్లో పోకిరీలూ ఉన్నారు. చిన్నారులు ఉన్నారన్న ఇంగితజ్ఞానం లేకుండా నవ్వుతూ మమ్మల్ని తోసేశారు. తొక్కిసలాటలో మా పిల్లలు గాయపడ్డారు’’ అని ఆస్పత్రిలో ఉన్న ఒక మహిళ తెలిపింది. విచారం వ్యక్తం చేసిన ప్రముఖులుఘటన జరిగిన విషయం తెల్సి వెంటనే ప్రధాని మోదీ సీఎం యోగికి ఉదయం, మధ్యాహ్నం నాలుగైదు సార్లు ఫోన్‌చేసి తాజా పరిస్థితిపై వాకబు చేశారు. భక్తుల మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ‘‘ మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలి’’ అని మోదీ అన్నారు. రాష్ట్రపతి ముర్ము సైతం దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బుధవారం ఒక్కరోజే 7.5 కోట్ల మంది పుణ్యస్నానాలు చేసినట్లు ప్రాథమిక సమాచారం. ప్రయాగ్‌రాజ్‌లో బుధవారమే దాదాపు 10 కోట్ల మంది జనం వచ్చేశారని వారు బయటికెళ్లేదాకా కొత్తవారిని అనుమతించొద్దని సీఎం యోగి అధికారులను ఆదేశించారు. సంగమ్ నోస్ ఘాట్ వైపు వెళ్లొద్దని భక్తులకు యోగి విజ్ఞప్తిచేశారు. ప్రయాగ్‌రాజ్‌కు దారితీసే మార్గాలను మూసేసినట్లు తెలుస్తోంది. వెనక్కి వచ్చే భక్తుల కోసం రైల్వేశాఖ అదనపు రైళ్లను నడపనుంది.ముగ్గురు సభ్యులతో జుడీషియల్ కమిషన్ఘటనకు కారణాలను తెల్సుకునేందుకు జస్టిస్ హార్ష్ కుమార్, మాజీ డీజీ వీకే గుప్తా, రిటైర్డ్ ఐఏఎస్ వీకే సింగ్‌లతో యోగి ప్రభుత్వం ఒక జుడీషయల్ కమిషన్‌ను నియమించింది. మృతుల కుటుంబాలకు సీఎం యోగి తలో రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ స్వయంగా ఘటనాస్థలికి వచ్చి సమీక్ష జరపనున్నారు.దుమ్మెత్తి పోసిన విపక్షాలునిర్వహణ లోపాలు, వీఐపీల స్నానాల మీదే అధికారుల ధ్యాస, ఘనంగా నిర్వహిస్తున్నామని అతి ప్రచార ఆర్భాటాలతో తొక్కిసలాట జరిగిందని విపక్షాలు యోగి, మోదీ ప్రభుత్వాలపై దుమ్మెత్తిపోశాయి. ‘‘ వీఐపీ సంస్కృతి వదిలేయండి. సాధారణ భక్తులను పట్టించుకోండి. ప్రచారంపై దృష్టిపెట్టి పటిష్ట భద్రతను గాలికొదిలేయడం వల్లే తొక్కిసలాట జరిగింది’’ అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎస్పీ, టీఎంసీ, శివసేన(యూబీటీ), బీఎస్పీ పార్టీలు యోగి, మోదీ సర్కార్‌పై విమర్శలు గుప్పించాయి. -
‘చెల్లాచెదురైన’ బతుకులు.. కుంభమేళా ఘటనలో హృదయవిదారక దృశ్యాలు
లక్నో: చెల్లాచెదురుగా పడి ఉన్న చెప్పులు.. బ్యాగులు.. దుస్తులు.. దుప్పట్లు.. మహా కుంభమేళా తొక్కిసలాట ఘటన జరిగిన ప్రయాగ్‌రాజ్ సెక్టార్-2లో ప్రస్తుతం దృశ్యాలివే. మరోవైపు తమ వారి జాడ తెలియక వందల మంది ప్రయాగ్‌రాజ్ ఆస్పత్రుల ముందు కంటతడి పెడుతూ కనిపిస్తున్న దృశ్యాలు హృదయవిదారకంగా కనిపిస్తున్నాయి.ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమంగా పేరొందిన మహా కుంభమేళాలో ఈ ఉదయం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా త్రివేణి సంగమం వద్దకు అమృత స్నానం కోసం భక్తులు పోటెత్తగా.. బారికేడ్లు విరిగిపోవడంతో భక్తులు చెల్లాచెదురయ్యాయి. ఈ క్రమంలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో పలువురు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు తీవ్ర గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తొక్కిసలాట జరిగిన ప్రాంతంలో రద్దీ తగ్గిపోగా.. ప్రస్తుతం అక్కడి దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రాణ భయంతో పరుగులు తీసిన ప్రజలు.. తమ చేతుల్లోని వస్తువులను కింద పారేశారు. వాటి మీది నుంచే అందరూ పరుగులు తీసినట్లు అక్కడి దృశ్యాలు చూస్తే అర్థమవుతోంది. మరోవైపు.. ఘటనకు అక్కడ ఏర్పాటు చేసిన ఇనుప చెత్తకుండీలే కారణమని అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.అఖాడాల స్నానం కోసం ఏర్పాటు చేసిన ఘాట్ల వద్ద ఈ ఘోరం చోటు చేసుకుంది. అఖాడాల కంటే ముందు స్నానాలు ఆచరించాలని భక్తులు ముందుకు వెళ్లారు. ఈ క్రమంలో బారికేడ్లు విరిగిపోయాక.. తొక్కిసలాట చోటు చేసుకుంది. చీకట్లో ఆ చెత్తకుండీలు గమనించక చాలామంది కిందపడిపోయారని, వాళ్ల మీద నుంచే మిగతా వాళ్లు తొక్కుకుంటూ పరుగులు పెట్టినట్లు భావిస్తున్నారు. మరోవైపు.. ఊపిరి ఆడని పరిస్థితుల నుంచి తాము క్షేమంగా బయటపడ్డామని కొందరు చెబుతున్నారు.ప్రయాగ్‌రాజ్ ఆస్పత్రుల ప్రాంగణాలు బాధితుల కుటుంబాల రోదనలతో మారుమోగుతున్నాయి. తమ వాళ్లు కనిపించకుండా పోవడంతో హెల్ప్ సెంటర్ల వద్దకు కొందరు పరుగులు తీస్తున్నారు. ఎంత మంది చనిపోయారు, ఎంత మందికి గాయాలయ్యాయనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఘటన సమయంలో.. బారికేడ్లు, ఫెన్సింగ్‌ల మీద నుంచి దూకి ప్రాణభయంతో కొందరు పరుగులు పెట్టిన కొన్ని దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. सरकार को पहले से ही पता था इतनी भीड़ आएगी तो फिर पूरा प्रबंध सरकार ने सेना को क्यों नहीं दे दिया... #MahakumbhStampede #MouniAmavasya #AmritSnan #MahaKumbh2025 #Prayagraj #Stampedepic.twitter.com/ZAF2zW0iov— Prerna Yadav (@prerna_yadav29) January 29, 2025A daughter is hugging her father and crying because her mother has left this world💔But only those who have experienced such loss can truly understand the pain of a family.#MahakumbhStampede pic.twitter.com/2dGo0OQKxQ— هارون خان (@iamharunkhan) January 29, 2025CM Yogi Adityanath should watch this video and feel some shame 👇#MahakumbhStampede pic.twitter.com/t0l3aUldGc— Dhruv Rathee (Parody) (@dhruvrahtee) January 29, 2025#MahakumbhStampede15 pilgrims have paid with thier lives in a stampede in #MahaKumbh2025 #Mahakumbh #MahaKumbhMela2025 pic.twitter.com/0f26oBgnMH— Sanghamitra Bandyopadhyay (@SanghamitraLIVE) January 29, 2025 -
Maha Kumbh Mela 2025 : ఏకంగా ఇంటినే వెంట తెచ్చుకున్న దంపతులు!
‘‘ఆలోచనల్లో పదును ఉండాలేగాని ఆవాసాలకు కొదవేముంది?’’ అన్నట్టుగా ఉంది ఆ దంపతలు తీరు. కాదేదీ నివాసానికి అనర్హం అంటూ వారు సృష్టించిన సరికొత్త కదిలే ఇల్లు అందరినీ ఆకట్టుకుంటోంది. ఆధ్యాత్మిక యాత్రకు సృజనాత్మకత రంగరించిన వారి ప్రయాణం చూపరుల ప్రశంసలకు నోచుకుంటోంది.ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభ్ ప్రస్తుతం ఓ జంటకు నివాసంగా మారింది. అక్కడి రద్దీని దృష్టిలో ఉంచుకుని నివాసాలకు ఇబ్బందిని ముందే గ్రహించిన కర్ణాటకకు చెందిన దంపతులలు ఓ వినూత్న తరహా ఇంటికి రూపకల్పన చేశారు. ఇప్పుడు ఆ నివాసం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. అంతేకాదు డబుల్ డెక్కర్ కారును ప్రదర్శించేలా ఉన్న వీరి ఇంటి వీడియో పారిశ్రామిక ప్రముఖులను కూడా ఆకర్షిస్తోంది. అదే విధంగా ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా దృష్టిని సైతం ఆకట్టుకుంది. విశిష్టమైన మార్పులు ఆవిష్కరణలతో వైవిధ్యానికి ప్రసిద్ధి చెందిన మహీంద్రా ఈ క్రియేషన్ వెనుక ఉన్న చాతుర్యం పట్ల తన ఇష్టాన్ని వ్యక్తం చేసింది, ‘అవును, నేను అలాంటి మార్పులు ఆవిష్కరణలకు నేను ఆకర్షితుడిని అవుతాను అనేది ఖచ్చితంగా నిజం. అయితే అది మహీంద్రా వాహనంపై ఆధారపడినప్పుడు, నేను మరింత ఆకర్షితుడని అవుతా‘ అని మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఈ వీడియోను ఉద్దేశించి హిందీలో ఒక పోస్ట్‌లో తెలిపారు.ఇన్నోవాయే ఇల్లుగా మారింది...ఈ కారు పేరు టయోటా ఇన్నోవా కాగా అదే వీరి మొబైల్ హోమ్‌గా రూపాంతరం చెందింది.ఈ రకమైన మార్పు చేర్పులు, సవరణలకు దాదాపు రూ. 2 లక్షలు పైగానే ఖర్చయిందని ఆ ‘ఇంటికా’కారు యజమాను వెల్లడించారు. రూఫ్‌టాప్ టెంట్‌కు రూ. 1 లక్ష .. పూర్తిస్థాయి వంటగదికి రూ.1లక్ష పర్యావరణ హితమైన రీతిలో వారి విద్యుత్ అవసరాలను తీర్చడానికివాహనం సోలార్ ప్యానెల్‌ను కూడా వీరు ఏర్పాటు చేసుకున్నారు.ఈ జంట తమ అనుకూలీకరించిన సెటప్‌ను పూర్తిగా ఉపయోగించుకుని, వీలైనంత ఎక్కువ కాలం కుంభమేళాలో ఉండాలని ప్లాన్ చేస్తున్నారు. ఇంటిని మిస్ అవుతున్న ఫీలింగ్ ఏమీ రాకపోవడం వల్లనో ఏమో... కుంభ్ మేళా అనంతరం కూడా తమ ఇంటికారులో షికారు కంటిన్యూ చేయాలని వీరు భావిస్తున్నట్టు కనిపిస్తోంది.రోడ్ ట్రిప్‌కు సై...ఈవెంట్లో ఆథ్యాత్మిక సౌరభాలను ఆస్వాదించిన తర్వాత, ఈ వాహనం మీద వారు ఆరు నెలల పాటు సుదీర్థమైన రోడ్ ట్రిప్‌ను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు, అందులో భాగంగా వీరు విదేశాల్లోకి అంటే... నేపాల్‌లోకి కూడా ప్రవేశించవచ్చు. ఈ వాహనానికి అభిమాని అయిన భర్త తాను రాబోయే రోడ్ ట్రిప్ కోసం మరింత ఆసక్తిగా ఉన్నట్టుగా తన ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు భార్య తమ వంట అవసరాల కోసంఇ–కామర్స్ ప్లాట్‌ఫారమ్ ద్వారా సౌకర్యవంతంగా తాజా కూరగాయలను ఆర్డర్ చేస్తూన్నానని తెలిపారు.ఈ భార్యాభర్తల ఐడియాను చూపిస్తున్న వీడియో ఆన్లైన్లో అనేకమంది ప్రశంసలకు నోచుకుంది. ఈ జంట సృజనాత్మకత, సమయానుకూలతను నెటిజన్లు కొనియాడుతున్నారు. మరీ ముఖ్యంగా ‘జుగాద్‘ (వినూత్న పరిష్కారాలు)లో ఇటీవల భారతీయులు బాగా రాణిస్తున్నారనే విషయాన్ని పలువురు హైలైట్ చేస్తూ వారి వనరులను ప్రశంసిస్తూ చేసే కామెంట్స్ వెల్లువెత్తాయి. మరికొందరు ‘పర్ఫెక్ట్ క్యాంపింగ్ వ్యాన్‘ అనే భావనను మెచ్చుకున్నారు వినూత్న తరహాలో వాన్ లైఫ్ డ్రీమ్‌ను జీవించినందుకు జంటను అభినందించారు. ఓ అవసరం నుంచి పుట్టిన సృజనాత్మకత వాహనాలను చక్రాలపై అసాధారణ నివాసాలుగా మార్చింది. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలకు నోచుకుంది.Haan, yah bilkul sach hai ki main aise sanshodhanon aur aavishkaaron se mohit hoon. lekin mujhe yah sveekaar karana hoga ki jab ve mahindra vaahan par aadhaarit hote hain to main aur bhee adhik mohit ho jaata hoon!! 🙂 pic.twitter.com/rftq2jf2UN— anand mahindra (@anandmahindra) January 23, 2025 -
మహా కుంభమేళా తొక్కిసలాట ఘటనపై ప్రధాని విచారం
న్యూఢిల్లీ, సాక్షి: మహా కుంభమేళాలో ఈ ఉదయం ప్రయాగ్‌రాజ్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ఆయన.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మహా కుంభమేళా ప్రయాగ్ రాజ్(Prayagraj)లో జరిగిన ప్రమాదం బాధాకరం. ఘటనలో తమ వారిని కోల్పోయిన వాళ్లకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడినవాళ్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా. క్షతగాత్రులకు సాయం అందించడంలో అధికారులు ఉన్నారు. ఘటనకు సంబంధించి యూపీ ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నా. ముఖ్యమంత్రి యోగితో ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉన్నా అని ప్రధాని మోదీ(PM Modi) ట్వీట్ చేశారాయన. ఘటనపై ఎప్పటికప్పుడు ప్రధాని సమీక్ష జరుపుతున్నారని ఇటు యూపీ సీఎం యోగి, అటు పీఎంవో వర్గాలు చెబుతున్నాయి. प्रयागराज महाकुंभ में हुआ हादसा अत्यंत दुखद है। इसमें जिन श्रद्धालुओं ने अपने परिजनों को खोया है, उनके प्रति मेरी गहरी संवेदनाएं। इसके साथ ही मैं सभी घायलों के शीघ्र स्वस्थ होने की कामना करता हूं। स्थानीय प्रशासन पीड़ितों की हरसंभव मदद में जुटा हुआ है। इस सिलसिले में मैंने…— Narendra Modi (@narendramodi) January 29, 2025మరోవైపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ప్రయాగ్‌రాజ్ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు. ఘటనపై ఉప రాష్ట్రపతి, పలువురు కేంద్ర మంత్రులు, పలువురు ముఖ్యమంత్రులు, ఇతర రంగాల ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. మహా కుంభమేళాలో మౌనీ అమావాస్య సందర్భాన్ని పురస్కరించుకుని భారీ సంఖ్యలో భక్తులు ప్రయాగ్‌రాజ్ సెక్టార్-2 వద్ద అమృత స్నానాల కోసం వచ్చారు. ఈ క్రమంలో తోపులాటలో బారికేడ్లువిరిగిపడగా.. తొక్కిసలాట జరిగింది. తీవ్రంగా గాయపడిన భక్తులను ఆంబులెన్స్‌లలో ఆస్పత్రలకు తరలించారు. అయితే మరణాలపై రకరకాల ప్రచారం జరిగినప్పటికీ అక్కడి అధికారులెవరూ దానిని ధృవీకరించలేదు. చివరకు ప్రధాని మోదీ ప్రకటనతో ఈ విషయం నిర్ధారణ అయ్యింది. అయితే ఎంత మంది మరణించారన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికే అక్కడికి భారీగా భక్తులు చేరుకోవడంతో ఆందోళన వ్యక్తం కాకూడదనే యూపీ ప్రభుత్వం మరణాల విషయంలో ప్రకటనేదీ చేయలేదని ఓ అధికారి జాతీయ మీడియాతో చేసిన వ్యాఖ్యలతో స్పష్టమవుతోంది. మరోవైపు ఈ ఘటనతో విపక్షాలు యూపీ సర్కార్‌ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నాయి.ఇదీ చదవండి: నిర్వహణ లోపాల వల్లే తొక్కిసలాట ఘటన.. యూపీ సర్కార్‌పై సంచలన ఆరోపణలు -
మౌని అమవాస్య రద్దీ.. మహా కుంభమేళాలో తొక్కిసలాట (ఫొటోలు)
-
మహా కుంభమేళాలో తొక్కిసలాట..
-
Mahakumbh-2025: నాలుగు నిముషాలకు ఒక రైలు.. మౌని అమావాస్యకు ప్రత్యేక ఏర్పాట్లు
ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా జరుగుతోంది. ఈరోజు (జనవరి 29) మౌని అమావాస్య సందర్భంగా మహా కుంభమేళాలో రెండవ అమృత స్నానం నిర్వహిస్తున్నారు. ఇందుకోసం భక్తులు ముందుగానే సంగమస్థలికి చేరుకుంటున్నారు. మహా కుంభమేళా పాల్గొనేందుకు ప్రయాగ్‌రాజ్‌కు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు భారతీయ రైల్వే విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ప్రయాగ్‌రాజ్ స్టేషన్ నుండి 190 ప్రత్యేక రైళ్లు, 110 సాధారణ రైళ్లు, 60 మెమూ రైళ్లు సహా 360 రైళ్లను రైల్వేశాఖ నడుపుతోంది. దీనికి సంబంధించిన వివరాలను రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్ మీడియాకు తెలిపారు.కుంభమేళాకు భారీ సంఖ్యలో వచ్చే యాత్రికుల ప్రయాణ అవసరాలను తీర్చడంపై భారత రైల్వేశాఖ దృష్టిసారించిందన్నారు. మౌని అమావాస్య నాడు పుణ్య స్నానాలు చేసేందుకు వచ్చే భక్తుల రద్దీని తట్టుకునేందుకు ప్రతి నాలుగు నిమిషాలకు ఒక రైలును నడుపుతున్నామని తెలిపారు. ప్రయాగ్‌రాజ్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను కల్పించామన్నారు. ప్రతి స్టేషన్లో తాగునీరు, ఫుడ్ కోర్టులు, టాయిలెట్లు ఏర్పాటు చేశామన్నారు.అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు ప్రథమ చికిత్స బూత్‌లు, వైద్య పరిశీలన గదులను ఏర్పాటు చేశామని, ప్రయాగ్‌రాజ్ జంక్షన్, ప్రయాగ్‌రాజ్ ఛోకిలలో యాత్రి సువిధ కేంద్రాల్లో వీల్చైర్లు, లగేజ్ ట్రాలీలు మందులు మొదలైనవి అందిస్తున్నామని తెలిపారు.ఇది కూడా చదవండి: కుంభమేళా రైలుపై రాళ్ల దాడి.. పలువురు ప్రయాణికులకు గాయాలు -
ఒక్క రోజులో 1.5 కోట్ల మంది పుణ్యస్నానాలు
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. తాజాగా జనవరి 27 (సోమవారం) రాత్రి 10 గంటల వరకు ఒక్కరోజులో 1.5 కోట్లకు పైగా భక్తులు త్రివేణీ సంగమంలో స్నానమాచరించారు.జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేళాలో ఇప్పటివరకూ 14 కోట్ల మంది భక్తులు పవిత్ర స్నానాలు చేశారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుంభమేళాలో పాల్గొని, పవిత్ర స్నానం చేశారు. ఈ సమయంలో ఆయన వెంట ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బాబా రామ్‌దేవ్ తదితరులు ఉన్నారు.మహా కుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు తరలివస్తున్నారు. ఇటాలియన్ భక్తుడైన ఆంటోనియో తాను భారతదేశంలో జరిగే కుంభమేళాను చూడాలనే తన కలను నెరవేర్చుకున్నానని తెలిపారు. 10 సంవత్సరాలుగా ఇక్కడికి రావాలనుకుంటున్నానని, ఇప్పుడు కుంభమేళా సమయంలో వచ్చానని మీడియాకు తెలిపారు. కుంభమేళా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అలాంటి 12 కుంభమేళాల తరువాత వచ్చిన మహా కుంభమేళా ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతోంది. జనవరి 13న ప్రారంభమైన ఈ కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది.ఇది కూడా చదవండి: ఎవరెస్ట్ ఎక్కాలంటే రూ. 21 లక్షలు కట్టాల్సిందే -
Mahakumbh Mela 2025 పవిత్ర స్నానం గురించి బాధపడకండి..ఇలా చేస్తే పుణ్యఫలం!
మహా కుంభమేళా (Maha Kumbh Mela 2025) ఒక ప్రత్యేకమైన శక్తివంతమైన సమారంభం. ఎందరో సాధువులు, బాబాలు, అవధూతలు, సిద్ధులు, యోగులు, వైష్ణవులు, శాక్తులు, ఇలా హైందవ ధర్మంలో ఉన్న అనేక ఆచారాలకు సంబంధించిన ఎందరో మహిమాన్వితులు మహాకుంభ మేళాకు తరలి వెళతారు. ప్రపంచ నలుమూలల నుండి లక్షలాదిగా భక్తులు ఆ దివ్య మహోత్సవ సందర్శనార్థం ప్రయాగ చేరుకుంటారు. నదులకు సహజ సిద్ధంగా దివ్యశక్తిని ఆకర్షించే గుణం ఉంటుంది. ఈ కారణంగానే ఎన్నో దివ్య క్షేత్రాలు, ధామాలు పుణ్యనదుల పరీవాహక ప్రాంతాల్లో కొలువుదీరి ఉంటాయి. ఈ సంవత్సరం మహా కుంభమేళ ప్రయాగలో జరుగుతుంది. భూమాతను ఆసురీ శక్తుల ప్రభావం నుండి కాపాడేందుకు, దివ్యశక్తిని పెంచేందుకు ఎందరో యోగులు, సిద్ధులు, గురువులు ప్రత్యక్ష, పరోక్ష రూ΄ాలతో కృషి చేస్తుంటారు. మహా కుంభమేళా సమయంలో ఎందరో సాధువులు, మహా యోగులు నదీ గర్భంలోకి తమ త΄ోశక్తులను కూడా ప్రవహింపచేసి, అక్కడికి వచ్చిన అనేక మంది భక్తులను అనుగ్రహిస్తారు. నదిలోని దివ్య శక్తి, విశ్వంలో గ్రహాల అమరిక వల్ల ఉత్పన్నమయ్యే విశ్వశక్తి, మహాయోగుల తపోశక్తి వెరసి, దివ్య ప్రకంపనలు భూ గ్రహమంతా విస్తరిస్తాయి. అక్కడికి చేరుకున్న వ్యక్తులకే కాకుండా, ఈ దివ్య ప్రకంపనలు సామూహిక చైతన్యానికి కూడా ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. యోగవిద్యలో చెప్పిన ఇడా, పింగళ, సుషుమ్న నాడులకు, ప్రయాగరాజ్ లోని త్రివేణి సంగమం వద్ద గంగా, యమున, సరస్వతీ నదుల కలయికకు మధ్య అవినాభావ సంబంధం ఉంది. త్రివేణి సంగమం వద్ద మూడు పుణ్యనదులు కలిసి ఒక పవిత్ర తీర్థంగా మారినట్లే, మానవుడిలో ఇడా, పింగళ సుషుమ్న నాడులు భృకుటీ మధ్య భాగంలో సంగమిస్తాయి. అందుకే బొట్టు పెట్టుకునే ప్రదేశాన్ని జ్ఞాన త్రివేణిగా అభివర్ణిస్తారు. ఈ మూడు నాడులు ఏకీకృతం అయినప్పుడు చైతన్య జాగృతి కలుగుతుంది. అందుకే భకుటీ మధ్యంలో గంధం, కుంకుమ, పసుపు లేదా భస్మాన్ని బొట్టుగా ధరిస్తారు. భ్రూ మధ్యంలో మూడు నాడుల కలయిక అన్నది యోగంలో చెప్పే అమృతత్వ స్థితిని ప్రదానం చేసేందుకు మార్గం అవుతుంది. ఈ సంవత్సరం సంక్రాంతి నుండి శివరాత్రి వరకు దాదాపు 45 రోజుల పాటు సాగే ఈపవిత్ర సమయంలో ఆధ్యాత్మిక చింతనతో పాటుగా మనసును క్లేశ రహితంగా మార్చుకోవడం వల్ల దివ్య శక్తిని ఎక్కడ ఉన్నా పొందవచ్చు. త్రివేణి సంగమ స్థలికి చేరుకోలేని వారు, ఇంటి వద్దే 45 రోజుల పాటు ధ్యాన సాధన చేయడం ద్వారా కూడా అమృతతత్వాన్ని సిద్ధింపచేసుకోవచ్చు. – మాతా ఆనందమయి,ఆధ్యాత్మిక గురువు చదవండి: రూ. కోటి జాబ్ కాదని..తొలి ప్రయత్నంలోనే సివిల్స్ : తండ్రి భావోద్వేగ క్షణాల్లో -
Mahakumbh Mela 2025: భారత్ యువకుడిని పెళ్లాడిన గ్రీకు అమ్మాయి
144 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ మహాకుంభమేళ ఆశ్చర్యకర ఘటనలకు, అద్భుతాలకు నిలయంగా మారింది. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు ఎందరెందరో దేశ విదేశాల నుంచి తరలివస్తున్నారు. అందులో ఎందరో ఉన్నత విద్యావంతులు బాబాలుగా మారిన వారిని వెలుగులోకి తెచ్చింది. అందరివీ వేరు దారులైన అంతా కలిసేది ఈఆధ్యాత్మిక సాగరంలోనే అని చాటిచెబుతోంది. ఈ మహాకుంభమేళలో రెండు వేర్వురు దేశాలకు చెందిన అమ్మాయి అబ్బాయి ఒక్కటయ్యేందుకు వేదికగా మారింది. వాళ్లెవరు..? మన హిందూ వివాహ పద్ధతిలోనే పెళ్లి చేసుకుంటున్నారు ఎందుకు..? తదితరాల గురించి తెలుసుకుందామా..!.మన భారత్‌కి చెందిన యువకుడి గ్రీకు అమ్మాయిని పెళ్లాడింది. అది కూడా మన హిందూ వైవాహిక సాంప్రదాయంలోనే వివాహం చేసుకోవడం విశేషం. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో ఆదివారం ఈ అద్భుతం చోటుచేసుకుంది. గ్రీకు యువతి పెన్లోప్ భారత్‌కు చెందిన సిద్ధార్థ్ అనే యువకుడిని వివాహం చేసుకుంది. అయితే వారిద్దరూ మన హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకోవాలని భావించి అత్యంత పుణ్యప్రదమైన ప్రయాగ్‌రాజ్‌లోని ఈ మహాకుంభమేళాని ఎంచుకున్నట్లు తెలిపారు ఇరువురు. ఇక గ్రీకు యువతి పెన్లోప్ కొన్నేళ్ల క్రితం సనాతనధర్మం సంప్రదాయాలను అవలంభిస్తోందని, శివుని భక్తురాలిగా మారిందని జూనా అఖారాకు చెందిన దర్వి చెప్పారు. ఇక సిద్ధార్థుడు కూడా మా భక్తుడే, ఆయన యోగాను వ్యాప్తి చేయడానికి, సనాతన సేవ చేయడానికి వివిధ విదేశాలకు వెళ్లి వచ్చినట్లు తెలిపారు. అలాగే వారి వారి వివాహ క్రతువు జూనా అఖారాకు చెందిన మహామండలేశ్వర్ స్వామి యతీంద్రానంద గిరి ఆధ్వర్యంలో జరిగింది. ఇక కన్యాదాన ప్రక్రియ వధువు తల్లి, ఆమె బంధువులు కలిసి నిర్వహించారు. ఈ పుణ్యప్రదమైన సమయంలోనే పెళ్లిచేసుకోవాలని ప్రగాఢంగా కోరుకున్నామని ఆ జంట తెలిపింది. ఇక పెన్లోప్ కూడా కొత్త సంస్కృతిని స్వీకరించడం పట్ల తాను ఉత్సాహంగా ఉన్నానని చెప్పారు. తానెప్పుడు భారతీయ వివాహం చూడలేదన్నారు. అందువల్ల తనకు ప్రతీది కొత్తగా ఉందన్నారు. ఈ జంట ఈ మహాకుంభమేళ అయ్యే వరకు ఇక్కడే ఉండి స్నానాలు ఆచరిస్తామని చెప్పారు. అలాగే రానున్న మౌని అమావాస్య జనవరి 29 పవిత్ర స్నానాలు ఆచరిస్తామని చెప్పారు. గ్రీకు యువతి పెన్లోప్ తల్లి కూడా తాము కూడా ఈ పుణ్యకార్యక్రమాన్ని మిస్ చేసుకోవాలని అనుకోవట్లేదని అన్నారు. ఈ మహాకుంభ మేళ ప్రారంభం నుంచి ఇక్కడే ఉన్నామని, పూర్తి అయ్యే వరకు ఇక్కడే ఉండేలా ప్లాన్ చేసుకుంటన్నట్లు తెలిపారు.(చదవండి: ఐఐటీ గ్రాడ్యుయేట్, టాటా స్టీల్ కంపెనీలో ఉద్యోగం..కట్‌చేస్తే ఇవాళ..!) -
Maha Kumbh Mela 2025: ఆధ్యాత్మిక బాటపట్టిన సురేశ్ రైనా.. సతీసమేతంగా..(ఫొటోలు)
-
మహా కుంభమేళా ఎఫెక్ట్.. పెరిగిన ఛార్జీలు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా 2025(Maha Kumbh 2025) ఉత్సవానికి లక్షల సంఖ్యలో భక్తులు పోటెత్తుతున్నారు. ఇదే అదనుగా విమాన సంస్థలు ఛార్జీలను గణనీయంగా పెంచేశాయి. ప్రధాన నగరాల నుంచి ప్రయాగ్‌రాజ్ వెళ్లి రావడానికి రౌండ్ ట్రిప్ టిక్కెట్లు(roundtrip tickets) రూ.50,000 వరకు చేరుకున్నాయి. డిమాండ్ పెరుగుదలకు అనుగుణంగా టికెట్ ధరలను నియంత్రించాలని, ఎయిర్‌క్రాఫ్ట్‌ల సంఖ్యను పెంచాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విమానయాన సంస్థలను ఆదేశించింది.ముందున్న శుభదినాలు..జనవరి 29న మౌని అమావాస్య, ఫిబ్రవరి 3న బసంత్ పంచమి, ఫిబ్రవరి 12న మాఘీ పూర్ణిమ, 26న మహా శివరాత్రి వంటి పుణ్యస్నానాల కోసం ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లాలని చాలామంది భావిస్తున్నారు. ఇదే అదనుగా విమాన సంస్థలు భారీగా ఛార్జీలు పెంచుతున్నాయి. చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి ప్రధాన నగరాల నుంచి ప్రయాగ్‌రాజ్ వెళ్లి రావడానికి రౌండ్ ట్రిప్ టికెట్ల ధరలు మునుపెన్నడూ లేనంతగా పెరిగాయి. నగరాన్నిబట్టి సాధారణ టికెట్లు రూ.50,000 వరకు చేరుకున్నాయి.డీజీసీఏ స్పందన..పెరుగుతున్న ఛార్జీలకు ప్రతిస్పందనగా డీజీసీఏ 2025 జనవరి 23న విమానయాన ప్రతినిధులతో సమావేశం నిర్వహించింది. ఛార్జీల హేతుబద్ధీకరణ, విమానాల సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. ప్రయాగ్‌రాజ్(Prayagraj)కు ప్రయాణించేందుకు డీజీసీఏ జనవరిలో 81 అదనపు విమానాలను ఆమోదించింది. దీనితో దేశవ్యాప్తంగా ప్రయాగ్‌రాజ్‌కు మొత్తం విమానాల సంఖ్య 132కు చేరుకుంది. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల నుంచి పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడమే లక్ష్యంగా ఈ చర్యకు పూనుకుంది.ఇదీ చదవండి: స్వతంత్ర డైరెక్టర్ల నియామకాలు ప్రారంభంప్రయాణికులపై ప్రభావం..దేశవిదేశాల నుంచి యాత్రికులను ఆకర్షించే మహా కుంభమేళా ఉత్సవానికి భక్తుల తాకిడి పెరుగుతోంది. అధిక రద్దీ కారణంగా విమాన ఛార్జీలు పెరిగాయి. స్థానికంగా వసతికి కూడా డిమాండ్ అధికమవుతుంది. ప్రయాగ్‌రాజ్ విమానాశ్రయం మొదటిసారి రాత్రి సమయాల్లోనూ అంతర్జాతీయ విమానాలు నడుపుతూ రికార్డు స్థాయిలో ప్రయాణీకుల రద్దీని నిర్వహిస్తోంది. -
త్రివేణి సంగమం భక్తజనసాగరం
మహాకుంభ్ నగర్: మౌనీ అమావాస్య దగ్గర పడుతుండటంతో మహాకుంభమేళాలో భక్తుల రద్దీ మరింత పెరిగింది. శుక్రవారం, శనివారం ఏకంగా 1.25 కోట్లకుపైగా జనాలు త్రివేణి సంగమ స్థలిలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఆదివారం మధ్యాహ్నంనాటికే 1.17 కోట్ల మంది పవిత్ర స్నానాలుచేశారని అధికారులు చెప్పారు. జనవరి 29వ తేదీన మౌనీ అమావాస్య రోజు పవిత్ర స్నానాలు ఆచరించేందుకు వస్తున్న భక్తులతో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ సమీప రైల్వేస్టేషన్లు, బస్స్టేషన్లు, జాతీయరహదారులు కిక్కిరిసిపోయాయి. మౌనీఅమావాస్య రోజున 10 కోట్ల మంది పుణ్యస్నానాలు చేయొచ్చని అంచనావేస్తున్నారు. భక్తులు నడిచే వచ్చేందుకు అనువుగా వాహనాలను చాలా దూరంలోనే ఆపేస్తున్నారు. ప్రతిచోటా ‘నో వెహికల్’ జోన్ ప్రకటించారు. ఎక్కువ మంది భక్తులు పోటెత్తితే ప్రమాదం జరక్కుండా ఉండేందుకు మరో వరస బ్యారీకేడ్లను ఏర్పాటుచేస్తున్నారు. అమృత్‌స్నాన్ నేపథ్యంలో స్నానానికి వెళ్లేవాళ్లు, తిరిగొచ్చే వాళ్లకు ఇబ్బంది రాకుండా అదనపు ఏర్పాట్లూ చేస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ అండ్ కమాండ్ సెంటర్‌ను క్రియాశీలం చేశారు. ఇసకేస్తే రాలనంత జనం పోగుబడే చోట అత్యయక స్పందనా దళాలను రంగంలోకి దింపారు. అనుమానాస్పద వ్యక్తులను గమనించేందుకు నిఘాను పటిష్టంచేశారు. నడిచేందుకు ఉద్దేశించిన ప్రాంతాల్లో ఎవరైనా అక్రమంగా చిన్నపాటి తాత్కాలిక దుకాణాలు తెరిస్తే వెంటనే మూయించేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. కుదిరినంత వరకు సమీప పార్కింగ్ ప్రాంతాలకు వాహనాలను అనమతించి, ఆ తర్వాత దూరంగా ఉన్న ప్రత్యామ్నాయ పార్కింగ్ జోన్లకు వాహనాలను తరలిస్తున్నారు. భక్తులు త్రివేణి సంగమ స్థలిలో గందరగోళ పడకుండా అదనంగా మరో 2,000 మార్గసూచీ బోర్డ్లను ఏర్పాటుచేశారు. మహాకుంభమేళా సమస్త సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించే ఏఐ చాట్‌బాట్‌ను స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోవాలని అక్కడి యంత్రాంగం భక్తులను ప్రోత్సహిస్తోంది. సరైన మార్గం చూపేందుకు సహాయక సిబ్బంది అనుక్షణం అందుబాటులో ఉంటున్నారు. ఆదివారం సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ పుణ్యస్నానంచేశారు. ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ కేబినెట్‌పై విమర్శలు గుప్పించారు. ‘‘ కేబినెట్ భేటీ తర్వాత మంత్రులంతా పుణ్యస్నానాలు చేయడంతోపాటు ఒకరిపై మరొకరు నీళ్లు చిమ్ముకుంటూ వాటర్ గేమ్స్ ఆడుతున్నారు. జనం ఇక్కడికొచ్చేది భక్తిశ్రద్ధలతో. మీలా ఆటలాడటానికి కాదు’’ అని చురకలంటించారు. -
కుంభమేళాలో మళ్లీ అగ్ని ప్రమాదం
మహాకుంభ్ నగర్(యూపీ): ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభమేళా ప్రాంతంలో మరో అగ్ని ప్రమాదం సంభవించింది. శనివారం చోటుచేసుకున్న ఘటనలో రెండు కార్లు దగ్ధమయ్యాయి. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. వారణాసికి చెందిన ఓ కారులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని ఫైర్ అధికారి వివరించారు. అందులోని వారందరినీ కాపాడి, మంటలను వెంటనే అదుపులోకి తెచ్చామన్నారు. ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదన్నారు. ఈ నెల 19న మహాకుంభ్ నగర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు 18 క్యాంపులు భస్మీపటలమయ్యాయి. మంటలను సకాలంలో ఆర్పివేయడంతో ప్రాణనష్టం తప్పింది. ఒకటిన 73 దేశాల దౌత్యవేత్తల రాకరష్యా, ఉక్రెయిన్ సహా 73 దేశాలకు చెందిన దౌత్యవేత్తలు మహాకుంభ్ మేళాలో మొదటిసారిగా పుణ్యస్నానాలు చేయనున్నారు. ఫిబ్రవరి ఒకటో తేదీన వీరంతా రానున్నారని మేళా అధికారి విజయ్ కిరణ్ ఆనంద్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్ల కోసం విదేశాంగ శాఖ యూపీ చీఫ్ సెక్రటరీకి ఒక లేఖ రాసిందన్నారు. జపాన్, అమెరికా, జర్మనీ, నెదర్లాండ్స్, కామెరూన్, కెనడా, స్విట్జర్లాండ్, స్వీడన్, పోలండ్, బొలీవియా తదితర దేశాల దౌత్యాధికారులు పాల్గొంటారని చెప్పారు. బోట్లో సంగం వద్దకు చేరుకుని పుణ్యస్నానాలు చేస్తారన్నారు. అనంతరం, అక్షయ్వట్, బడే హనుమాన్ ఆలయాలను దర్శించుకోనున్నారు. డిజిటల్ మహాకుంభ్ ఎక్స్పీరియన్స్ సెంటర్లో వీరికి మహాకుంభ్ ప్రాశస్త్యాన్ని వివరించనున్నామన్నారు.సొంత అఖాడాకు సీఎం యోగి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ శనివారం ప్రయాగ్‌రాజ్‌లోని తన సొంత శ్రీ గురు గోరక్షా నాథ్ అఖాడాను సందర్శించారు. ధర్మ ధ్వజ్‌కు స్వయంగా ఉత్సవ పూజ జరిపారు. ఈ సందర్భంగా సీఎం యోగి దేశం నలుమూలల నుంచి మహాకుంభ్‌కు విచ్చేసిన సిద్ధ యోగులతో చర్చలు జరిపారని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఇది గురు గోరక్షా నాథ్ సంప్రదాయాన్ని కొనసాగించే సీఎం యోగి సొంత అఖాడా అని యోగి మహాసభ ప్రత్యేక ఉపాధ్యక్షుడు మహంత్ బాలక్ నాథ్ యోగి చెప్పారు. యోగుల బసకు ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లున్నాయన్నారు. -
సొంతూరు వెళ్లిపోయిన 'మోనాలిసా'.. కారణం ఇదే
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో 'మోనాలిసా'(16) అనే యువతి అకస్మాత్తుగా రాత్రికి రాత్రి స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. అతిసాధారణ యువతి తన సహజ సౌందర్యంతో అందరినీ కట్టిపడేసింది. దీంతో రెండు మూడ్రోజులుగా సామాజిక మాధ్యమాల్లో ఆమె ఫోటోలు, రీల్స్ పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ఆమెతో ఫోటోలు దిగాలిని, దగ్గరగా చూడాలని చాలామంది ఎగబడుతున్నారు. కనీసం మెనాలిసా అన్నం తినేందుకు కూడా అవకాశం లేకుండా అక్కడి వారు చేస్తుండటంతో ఆమె తండ్రి కీలక నిర్ణయం తీసుకున్నారు.రుద్రాక్షలు, పూసలు అమ్ముకుందామని మహా కుంభమేళాకు మెనాలిసా కుటుంబం వచ్చింది. ఇప్పుడు ఆమె అందమే తన కుటుంబాన్ని ఇబ్బందుల్లో పడేసింది. వారి వ్యాపారాన్ని పక్కన పెట్టేసి కూతురుని కాపాడుకునే పనిలో తండ్రి ఉన్నాడు. దీంతో ఆమెను తమ స్వస్థలం అయిన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు పంపించారు. ఇదే విషయాన్ని తాజాగా ఆమె ఒక వీడియో ద్వారా ఇలా పంచుకుంది. 'రుద్రాక్షలు, పూసల దండలు అమ్మేందుకే ఇక్కడకు వచ్చాను, నా వల్ల మహా కుంభమేళాలో కాస్త అసౌకర్య వాతావరణం నెలకొంది. ఆపై నా కుటుంబంతో పాటు నాకు కూడా రక్షణ లేదు. మా ఫ్యామిలీ కొంతమేరకు ఇబ్బంది పడుతుంది. దీంతో ఇక్కడి నుంచి మా ఊరికి వెళ్లిపోతున్నా. అవకాశం ఉంటే మహా కుంభమేళా చివరన వచ్చి ఇక్కడ పుణ్యస్నానం చేస్తా. నాపై మీరు చూపిన ప్రేమ, మద్దతు ఎప్పటికీ మరిచిపోను. అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు.' అని చెప్పింది. ప్రయాగరాజ్‌లో నిన్న కొందరు దుండగులు మెనాలిసా కుటుంబం పట్ల ఇబ్బందికరంగా ప్రవర్తించారని తెలుస్తోంది. ఈ కారణం వల్లే ఆమె తమ గ్రామానికి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.మధ్యప్రదేశ్ ఇండోర్ సమీపంలో ఉన్న మహేశ్వర్ ప్రాంతానికి చెందిన మోనాలిసా భోంస్లే కుటుంబం ఈనెల 13న మహాకుంభమేళా ప్రారంభానికి ముందే ప్రయాగరాజ్ చేరుకుంది. అక్కడ రుద్రాక్ష దండల అమ్ముతూ కనిపించిన ఆ యువతిని అంతర్జాతీయ న్యూస్ ఛానల్ ప్రతినిధి ఇంటర్వ్యూ చేసి దానిని వివిధ సోషల్ మీడియా వేదికల్లో పోస్టుచేశారు. అంతే.. ఆ వీడియోకు విపరీతమైన క్రేజ్ రావడంతో ఆ తర్వాత దేశంలోని ఇతర మీడియా సంస్థలు ఆమెకు విస్తృత ప్రచారం కల్పించి ఆకాశానికెత్తేశాయి. परिवार और अपनी सुरक्षा के लिए मुझे बापस इंदौर जाना पड़ रहा है, हो सका तो अगले साही स्नान तक बापस मिलते हैं, प्रयागराज महाकुंभ में।सभी के सहयोग और प्यार के लिए दिल से धन्यवाद 🙏 pic.twitter.com/GiRDmfSsDu— Monalisa Bhosle (@MonalisaIndb) January 23, 2025 -
మహా కుంభమేళాకు పోటెత్తుతున్న భక్తులు
-
మేఘాలే తాకింది ఆ ‘మోనాలిసా’..
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో అత్యంత వైభవోపేతంగా సాగుతున్న మహా కుంభమేళాలో ఇప్పుడో అతిసాధారణ యువతి తన సహజ సౌందర్యంతో రెండు మూడ్రోజులుగా సామాజిక మాధ్యమాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. అకస్మాత్తుగా రాత్రికి రాత్రి స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. రోజూ కనీసం కోటి మంది సందర్శకులు వచ్చే ఈ మహా కుంభమేళాలో రుద్రాక్షలు, పూసల దండలు అమ్ముకునేందుకు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నుంచి ప్రయాగరాజ్‌కు (Prayagraj) వచ్చిన 16 ఏళ్ల యువతి ఇప్పుడు ఇంటర్నెట్, సోషల్ మీడియాలో తన అందంతో కేక పుట్టిస్తోంది. కుంభమేళాకు వస్తున్న పర్యాటకులు, భక్తులు, యాత్రికులు.. చూడగానే ఎవరినైనా ఇట్టే అకర్షించేలా ఉన్న ఈ తేనెకళ్ల సుందరి నుంచి రుద్రాక్షలు, పూసలు కొనుగోలు చేయడానికి కంటే ఆమెతో ఓ సెల్ఫీ తీసుకునేందుకు తెగ ఆరాటపడుతున్నారు. ఇందుకోసం ఆమె ఎక్కడ ఉంటే అక్కడ ఎగబడుతున్నారు. ఆ ఇంటర్వ్యూతో యమా క్రేజ్.. ఈనెల 13న మహాకుంభమేళా ప్రారంభానికి ముందే ఇండోర్ నుంచి ప్రయాగరాజ్ చేరుకుని రుద్రాక్ష దండల వ్యాపారం చేసుకునే ఆ యువతిని, మహా కుంభమేళా న్యూస్‌ను కవర్ చేసే అంతర్జాతీయ న్యూస్ ఛానల్ ప్రతినిధి ఇంటర్వ్యూ చేసి దానిని వివిధ సోషల్ మీడియా వేదికల్లో పోస్టుచేశారు. అంతే.. ఆ వీడియోకు విపరీతమైన క్రేజ్ రావడంతో ఆ తర్వాత దేశంలోని ఇతర మీడియా సంస్థలు ఆమెకు విస్తృత ప్రచారం కల్పించి ఆకాశానికెత్తేశాయి. ఆమె ఫొటో పెడితే చాలు, లక్షల్లోనే ఫాలోవర్స్.. వాస్తవానికి.. ఇండోర్ నుంచి రుద్రాక్ష మాలలు అమ్మకునేందుకు వచ్చిన ఆ యువతి పేరు మోనాలిసా భోంస్లే. చూసీచూడగానే ఎవరినైనా కట్టిపడేసేలా మనోహరంగా ఉన్న మోనాలిసా (Monalisa) ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా (Social Media) కార్యకర్తల దృష్టిని ఆకర్షించింది. ఆమె ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టుచేసే వారి సంఖ్య వేల సంఖ్యలోనే ఉండడం, వాటిని చూసి లైక్‌లు కొట్టేవారు లక్షల్లో ఉండడంతో సోషల్‌మీడియా వేదికగా ఆమె కీర్తి ఊహించని స్థాయికి చేరుకుంది. ఆ యువతి మీడియా ప్రతినిధులతో తానేమి చదువుకోలేదని చెప్పినప్పటికీ.. యూట్యూబ్, ఇన్‌స్టా, ఎక్స్, ఫేస్బుక్ తదితర సోషల్ మీడియా వేదికల్లో ఆమె పేరుతో ఏర్పాటైన పేజీలతో పాటు ఆమె ఫొటోలు పోస్టుచేసిన దాదాపు అందరికీ కొత్త ఫాలోవర్స్ వరదలా పెరుగుతున్నారు. చదవండి: వీళ్లంతా.. రాత్రికి రాత్రే సోషల్ మీడియా స్టార్లయిపోయి..అప్పటివరకు వందల్లో కూడా ఫాలోవర్స్ లేనివారికి మోనాలిసా కవరేజీతో వేల, లక్షల సంఖ్యలో ఫాలోవర్స్ చేరిపోతున్నారు. ఇక సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మను లియోనార్డో డా విన్సీ పెయింటింగ్ ‘మోనాలిసా’తో పోలుస్తున్నారు. పలువురు టాలీవుడ్, బాలీవుడ్ తారల కన్నా ఆమె అందం పదుల రెట్లు ఎక్కువంటూ కామెంట్లు చేస్తున్నారు. ఉపాధికి గండికొట్టిన పాపులారిటీ.. ఇదిలా ఉంటే.. అందం, కళ్లు ఆమెకు ఓ వైపు విపరీతమైన పాపులారిటీని తెచ్చిపెట్టగా.. మరోవైపు అదే క్రేజ్ ఆమె ఉపాధికి గండికొడుతోంది. ఆమె అమ్ముతున్న రుద్రాక్షలు, పూసల దండలు కొనడంకంటే ఆమెతో సెల్ఫీలకే జనం ఎక్కువ ఆసక్తి చూపిస్తుండడంతో ఆమె కుటుంబ సభ్యులు అమ్మకాల్లేక, ఆదాయం రాక ఆందోళన చెందుతున్నారు. ఈ హడావుడితో వారు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే మోనాలిసాను ఇండోర్‌కు తిరిగి పంపాలని ఆమె తండ్రి నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. (ప్రయాగరాజ్ త్రివేణి సంగమం నుంచి సాక్షి ప్రతినిధి) -
MahaKumbh 2025: 10 రోజులు..10 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ/మహాకుంభ్ నగర్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో 10 రోజుల్లోనే ఏకంగా 10 కోట్లమంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. త్రివేణి సంగమ స్థలికి భక్తులు బారులు తీరుతున్నారు. కుంభమేళాకు చేరుకోవడానికి రైళ్లు, విమానాలపై ఆధారపడుతున్నారు. వెయ్యికి పైగా రైళ్లు రాకపోకలు సాగిస్తున్నా భక్తులకు ఇక్కట్లు తప్పడంలేదు. ప్రతి రైల్లోనూ చాంతాడంత వెయిటింగ్ లిస్టులు ఉంటున్నాయి. జనరల్ బోగీల పరిస్థితైతే వర్ణనాతీతం! ఒక్కో రైలుకు నాలుగైదు చొప్పున జనరల్ బోగీలున్నా అడుగు తీసి అడుగు వేయలేని దుస్థితి! ఢిల్లీ, ముంబై, బెంగళూర్ వంటి నగరాల నుంచి విమాన సర్వీసులు ప్రయాణికుల అవసరాలకు ఏమాత్రం చాలడం లేదు. పైగా అప్పటికప్పుడు ప్రయాణ వేళలు మార్చడం, టికెట్ ధరలను విపరీతంగా పెంచడంతో బెంబేలెత్తిపోతున్నారు. ఇవి పాటించాలి కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించే విషయంలో పలు అంశాలు దృష్టిలో పెట్టుకోవాలని వేద పండితులు సూచిస్తున్నారు. కుంభమేళాలో స్నానం మనసులోని మాలిన్యాన్ని తొలగించుకోవడానికని గుర్తుంచుకోవాలి. స్నానం ఆచరించే ముందు సంగమ జలాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. మేళాలో తొలి స్నానం క్షేమం కోసం, రెండోది తల్లిదండ్రుల పేరుతో, మూడోది గురువు పేరుతో ఆచరించాలి. త్రివేణి సంగమ పవిత్ర జలాన్ని ఇంటికి తెచ్చుకోవాలి.యోగి పుణ్యస్నానం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం తన మంత్రివర్గ సహచరులతో కలిసి మహా కుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించారు. అంతకుముందు ప్రయాగ్‌రాజ్‌లోనే కేబినెట్ సమావేశం నిర్వహించారు. రాజకీయ, పాలనాపరమైన అంశాలపై చర్చించారు. ప్రయాగ్‌రాజ్‌లో రెండు నూతన వారధుల నిర్మాణానికి ఆమోదం తెలిపారు. అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. ఏరోస్పేస్, రక్షణ రంగంలో భారీగా పెట్టుబడులను ఆకర్శించబోతున్నట్లు తెలిపారు. యూపీ యువతకు స్మార్ట్ఫోన్లు, ట్యాబ్‌లు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. సరిగ్గా ఏడాది క్రితం అయోధ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ట సందర్భంగా కూడా త్రివేణి సంగమంలో యోగి పుణ్యస్నానం ఆచరించారు.అంతరిక్షం నుంచి కనువిందు కోట్లాది భక్తుల పుణ్యస్నానాలతో సందడిగా కనిపిస్తున్న మహా కుంభమేళా దృశ్యాలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) బుధవారం విడుదల చేసింది. వీటిని అంతరిక్షం నుంచి శాటిలైట్ ద్వారా చిత్రీకరించా రు. టెంట్ సిటీ ఏర్పాటవక ముందు, ఏర్పాటైన తర్వాతి ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. ఇసుకేస్తే రాలనంత జనం కనిపిస్తున్నారు. మేళా పరిసర ప్రాంతాలు సైతం ఆకర్షిస్తున్నాయి. 2023 సెపె్టంబర్లో, 2024 డిసెంబర్ 29న చిత్రీకరించిన ఫొటోలు కూడా వీటిలో ఉన్నాయి. కొత్తగా ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలు దర్శనమిస్తున్నాయి. -
అంతరిక్షం నుంచి మహాకుంభ మేళా ఎలా కనిపిస్తుందంటే?.. ఫొటోలు విడుదల చేసిన ఇస్రో
ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్(Prayagraj)లో మహా కుంభమేళా(Maha Kumbh Mela)కు భక్తులు పోటెత్తుతున్నారు. జనవరి 13న మొదలైన కుంభమేళా ఫిబ్రవరి 26వ తేదీన పూర్తికానుంది. మౌని అమావాస్య (రెండో షాహీ స్నానం) వచ్చే జనవరి 29న , ఫిబ్రవరి మూడో తేదీన వసంత పంచమి రోజు (మూడో షాహీ స్నానం), ఫిబ్రవరి 12న (మాఘ పూర్ణిమ) అధిక సంఖ్యలో జనం రావచ్చని అంచనా.. ఫిబ్రవరి 26న మహాశివరాత్రితో కుంభమేళా ముగుస్తుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర గణాంకాల ప్రకారం జనవరి 20 నాటికి 8.81 కోట్ల మందికిపైగా భక్తులు పుణ్య స్నానాలు చేశారు.భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) తాజాగా మహాకుంభ మేళాకు సంబంధించిన కొన్ని చిత్రాలను విడుదల చేసింది. స్పేస్ సెంటర్ నుంచి కుంభమేళా ఏరియాను ఉపగ్రహాలు తీసిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. మహాకుంభ మేళాకు సంబంధించిన ఏర్పాట్లు చేయకముందు, తర్వాత తీసిన ఫొటోలను షేర్ చేసింది. ఆ ఫొటోల్లో గతేడాది ఏప్రిల్‌లో మహాకుంభ్ ప్రాంతం మొత్తం నిర్మానుష్యంగా కనబడగా, డిసెంబర్ 22 నాటికి నిర్మాణాలతో కనిపించింది. ఈ నెల 10న తీసిన ఫొటోల్లో ఓ పెద్ద నగరాన్ని తలపించేలా మహాకుంభ్ ప్రాంతం దర్శినమిచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఇదీ చదవండి: స్వచ్ఛ కుంభమేళాకాగా, అశేష భక్త జనవాహిని తరలివస్తోన్న ప్రయాగ్‌రాజ్‌లోని కుంభమేళాలో ప్రధాని నరేంద్ర మోదీ సైతం పాల్గొనబోతున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఫిబ్రవరి ఐదో తేదీన ప్రధాని మోదీ త్రివేణి సంగమ స్థలిలో పుణ్యస్నానం ఆచరిస్తారని ఆయా వర్గాలు మంగళవారం తెలిపాయి. మరోవైపు ఈనెల 27వ తేదీన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా త్రివేణి సంగమంలో పవిత్రస్నానం ఆచరించనున్నారు. గంగా హారతి కార్యక్రమంలోనూ పాల్గొంటారు. అధికారులతో భేటీ కానున్నారు. అమిత్ షా వారంరోజుల్లో వస్తుండటంతో కుంభమేళాలో భద్రతను మరోసారి సమీక్షించారు. ప్రధాన కూడళ్ల వద్ద మరోసారి తనిఖీలుచేశారు. Maha Kumbh Tent City, Prayagraj, India as viewed by EOS-04 (RISAT-1A) satellite. 🛰️#MahaKumbh2025 #ISRO pic.twitter.com/J9nT6leYIJ— ISRO InSight (@ISROSight) January 22, 2025 -
Mahakumbh: నాగసాధువులుగా మారిన మహిళా సాధకులు
ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా అత్యంత వైభవంగా జరుగుతోంది. కుంభమేళాకు తరలివచ్చిన నాగ సాధువుల గురించి సర్వత్రా చర్చ జరుగుతోంది. వీరు చేసే సాధన వివరాలు తెలుసుకోవాలని పలువురు ఆసక్తి చూపిస్తున్నారు.ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాలో వందలాది మంది మహిళా సాధకులు నాగ సన్యాసత్వాన్ని స్వీకరించారు. వీరు నాగ సన్యాసం తీసుకునే ముందు గంగా నదిలో స్నానం చేసి, తమ కుటుంబ సభ్యులతో పాటు తమకు తాము పిండప్రదానం చేసుకున్నారు. ఆ తరువాత వారికి విజయ సంస్కారం నిర్వహించారు.ఈ సంప్రదాయాలన్నీ పూర్తయ్యాక నాగ సన్యాసినులుగా మారబోయే ఈ స్త్రీలకు జునా అఖాడాకు చెందిన ఆచార్య మహామండలేశ్వర్ స్వామి అవధేశానంద్ మహారాజ్ గురు దీక్ష ఇచ్చారు. దీంతో వారంతా నాగ సన్యాసినులుగా మారారు.జునా అఖాడాకు చెందిన మహామండలేశ్వర్ లాంవీ విశ్వరి మాత ఈ దీక్షా కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయ సంస్కారం తర్వాత, సన్యాసం స్వీకరించే స్త్రీలు గంగానదిలో స్నానం చేసి, గురువు ముందు దీక్ష తీసుకున్నారని, సన్యాసం స్వీకరించిన వీరంతా కాషాయ రంగు దుస్తులు మాత్రమే ధరించి, ధర్మ మార్గాన్ని అనుసరిస్తారని విశ్వరి మాత తెలిపారు.దీక్ష తీసుకున్న నాగ సన్యాసినులు అన్ని అనుబంధాలను త్యజించాలి. కాగా విదేశీయులతో సహా వందలాది మంది మహిళలు నాగ సన్యాసం తీసుకున్నారని అవధేశానంద్ మహారాజ్ తెలిపారు.ఇది కూడా చదవండి: Mahakumbh: సంస్కృతంలో సంభాషిస్తున్న విదేశీ స్వాములు -
సంస్కృతి సంప్రదాయం మహాసమ్మేళనం
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం...సాంస్కృతిక–సామాజిక మేలుకలయికదాదాపుగా 40కోట్లమంది పుణ్యస్నానాలు...నాగసాధువుల ప్రత్యేక ఆకర్షణ.ప్రయాగ ప్రత్యేకతమకరే యే దివానాథే వృషగే చ బృహస్పతౌ ‘కుంభయోగో భవేత్తత్ర ప్రయాగే చాతిదుర్లభః ‘‘అంటే మాఘ అమావాస్యనాడు బృహస్పతి వృషభరాశిలో ఉన్నప్పుడు ప్రయాగలో కుంభపర్వం జరుగుతుంది. (prayaga)ప్రయాగలో మూడు కుంభస్నానాలు ఉన్నాయి. ఇక్కడ మొదటి కుంభస్నానం (makara sankranti)మకర సంక్రాంతి నుండిప్రారంభమవుతుంది. రెండవ స్నానం మౌని అమావాస్య నాడు జరుగుతుంది. మూడవ స్నానం వసంత పంచమి రోజున జరుగుతుంది. ఈ మూడింటి కలయికే (kumbh mela)’కుంభమేళా’.నీటి నుంచే ఈ సమస్త విశ్వాన్ని సృష్టించాడట సృష్టికర్త. అందుకేప్రాణులన్నింటికీ నీరు తల్లిలాంటిదని చెబుతున్నాయి పురాణాలు. ఆ నీరే గలగలా పారే నదులుగా దర్శనమిస్తోంది. నదుల వల్లనే నాగరికతలు ఏర్పడ్డాయి. మనిషి మనుగడకు, సంస్కతి సాంప్రదాయాలకు, వైభవానికి నదులు సాక్షిభూతంగా నిలిచాయి. వేదభూమిగా పిలిచే ఈదేశంలో ప్రవహించే నదులు తీర్థము అనే పేరుతో దైవస్వరూపాలుగా వర్ణించబడి, గంగా గోదావరి నర్మదా కావేరి మొదలైన పేర్లతో గౌరవింపబడుతున్నాయి. అలాంటి తీర్థాలెన్నో ఈ భూమిపై ప్రవహిస్తూ ఈ భూమిని దివ్యభూమిగా మారుస్తున్నాయి.తీర్థం అంటే పుణ్యమైన, లేదా పవిత్రమైన నీరు అని అర్థం. అటువంటి తీర్థాలని సేవించి వాటిలో స్నానం చేస్తే పాలు తొలగి అంతఃకరణ శుద్ధి కూడా కలుగుతుంది. తీర్థాలన్నింటిలోకీ ప్రధానమైనది గంగానది. గంగానదిని తలిచినా చాలు... సకల పాలు తొలగుతాయని మనకి పురాణాలు చెబుతున్నాయి. నదీజలాల్లో అమతత్వం ఉందని అవి రోగాలను నివారించి దీర్ఘాయుష్షును కలిగిస్తాయని యజుర్వేదంలో చెప్పబడింది. ‘ఓ జలమా! పవిత్రమైన నీటితో మాకు తప్తి కలిగించు’’ ‘‘అఫ్స్వంతరమత మఫ్సుభేషజం’’ అంటూ ప్రార్థించడం ఈ వేదంలోని పవిత్రభావన. నదీ స్నానంవల్ల శారీరక శుద్ధి, ఆయుర్వృద్ధి కలుగుతాయి.మహాకుంభమేళా అంటే?దేవతలు–రాక్షసులు క్షీరసాగరాన్ని చిలుకగా అందులోనుంచి అమతం పుట్టింది. శ్రీమహావిష్ణువు మోహినీ అవతారం ధరించి దేవతలకు అమతాన్ని పంచుతున్నప్పుడు దానినుంచి నాలుగు చుక్కలు హరిద్వార్‌లోని గంగానదిలో, ఉజ్జయినిలోని క్షి్రపా నదిలో, నాసిక్‌లోని గోదావరిలో, ప్రయాగలోని త్రివేణి సంగమంలో పడ్డాయి. జ్యోతిష్యశాస్త్రం సూచించిన కొన్ని ప్రత్యేకమైన రోజులలో, ఆయా ప్రదేశాలలోని నదుల్లో స్నానం చేయడం వల్ల మనం కూడా అలా పడ్డ ఆ అమతత్వాన్ని పొందవచ్చని పెద్దలు చెబుతారు. ఆ ప్రత్యేకమైన రోజులకే కుంభమేళ అని పేరు. కుంభమేళా సమయంలో అమృతస్నానం చేయడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. ఋగ్వేదంలో దీని ప్రస్తావన కనిపిస్తుంది.దాస్యవిముక్తికి...అమృతబిందువులు నేలపై పడటం వెనుక మరో పురాణకథనం కూడా ఉంది. గరుత్మంతుడు తన తల్లి దాస్యవిముక్తికోసం అమృతాన్ని తేవలసిన అవసరం ఏర్పడింది. అలా అమృతాన్ని తెస్తున్న మార్గంలో నాలుగుచుక్కలు ఆ అమృతభాండం నుంచి నేలజారి నాలుగు పుణ్యతీర్థాలలో పడ్డాయి. ఆ ప్రదేశాలలోనే కుంభమేళాలను ఆచరిస్తున్నారు.విస్తృత ఏర్పాట్లు– స్థానికులకు ఉపాధిప్రపంచం వ్యాప్తంగా కుంభమేళాకు తరలివస్తున్న ఆధ్యాత్మిక జిజ్ఞాసులందరినీ దష్టిలో పెట్టుకొని ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. తాత్కాలిక వసతులతో ఏకంగా ఒక టెంట్ గ్రామాన్ని ఏర్పాటు చేసింది ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం. అందులోకి ప్రవేశిస్తే చాలు ఆధ్యాత్మిక ప్రపంచంలోకి కళ్ళ ముందర నిలబడుతుంది. అనేక ఆధ్యాత్మిక సంస్థలు అక్కడికి వచ్చినటువంటి వారందరికీ లోటు లేకుండా ఉచితంగా అన్న ప్రసాదాలను అందజేస్తూ భక్తుల ఆకలిని తీరుస్తున్నాయి. ఆధ్యాత్మికతోపాటు ఆర్థిక పరిపుష్టిని కూడా కలిగించనుంది కుంభమేళ. ప్రస్తుతం జరుగుతున్న కుంభమేళా కోసం సుమారుగా 7,500 కోట్లతో ప్రభుత్వం ఏర్పాట్లు చేయగా కుంభమేళా జరిగినన్ని రోజులు సుమారు 2లక్షల కోట్ల మేర వ్యాపారం జరగనుందని ఆల్ ఇండియా ట్రేడర్స్ ఫెడరేషన్ అంచనా వేస్తోంది. దీని ద్వారా 30 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం సమకూరనుంది.కుంభమేళా టెంట్ గ్రామంలోకి ప్రవేశించినప్పటి నుండి వయోవద్ధులను, నడవలేని వారిని స్నాన ఘాట్ ల వరకు చేర్చేందుకు, నదీ మధ్యలోకి వెళ్లి వద్దకు వెళ్లి స్నానం చేయడానికి పడవ వారికి, తినుబండారాల దుకాణాల వారికి యాత్రికులద్వారా ఆదాయం కూడా బాగా సమకూరుతోంది.యాత్రికుల భద్రత –పరిసరాల పరిశుభ్రత విషయంలో ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది. కోట్ల కొద్ది జనం వస్తోన్నా పరిశుభ్రత విషయంలో ఇబ్బందులేమీ లేవని కుంభమేళాకు వెళ్లి స్నానం చేసిన వారు చెబుతున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు ఈ విషయంలో పర్యవేక్షణ చేస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారని వారంతా సంతోషం వెలిబుచ్చుతున్నారు.జలమార్గాన్నీ క్రమబద్ధీకరిస్తోందిసంగమ స్థలం వరకు ప్రయాణించే పడవల విషయంలో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. బోట్లతో నిరంతరం పోలీసులు నదిలో పహార కాస్తు నదిలో పడవలు బోట్లు జామ్ ఏర్పడకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. ట్రైన్లు విమానాలు బస్సులు అన్నింటిలోనూ టికెట్లు దొరికే పరిస్థితి లేకపోవడంతో సొంత ఏర్పాట్లతో కుంభమేళాకి వెళుతున్న వారికి తగినట్టుగా పార్కింగ్ వ్యవస్థని ఏర్పాటు చేసింది. ఆనందకరమైన వాతావరణంలో ఆధ్యాత్మిక అనుభూతితో కొత్త విషయాలను తెలుసుకున్నామన్న సంతప్తితో భక్తులు తిరుగు ప్రయాణమవుతున్నారు → కుంభమేళాలో స్నానం ఎందుకు చేయాలి?కార్తీకమాసంలో వెయ్యిసార్లు గంగాస్నానం, మాఘమాసంలో వందసార్లు గంగాస్నానం, వైశాఖంలో నర్మదానదిలో కోటిసార్లు స్నానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో, ప్రయాగలో కుంభమేళా జరిగే సమయంలో ఒక్కసారి స్నానంచేస్తే ఆ పుణ్యఫలాన్ని పొందవచ్చని స్కాందపురాణం చెబుతోంది.→ నాగసాధువులుఆది శంకరాచార్యులవారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాధు,సంతు సమాజమును ఒక్క చోటికి చేర్చి,13 అఖారాలను ఏర్పరిచి సనాతన ధర్మరక్షక వ్యవస్థను ఏర్పరిచారు. తరువాత కాలములో అనేక ధర్మాచార్యులు ఈ వ్యవస్థను దశదిశలా విస్తరింపజేసారు. అటువంటి సాధువులలో కొందరిని నాగసాధువులని పిలుస్తారు. వీరు కుంభమేళాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. వీరికి శరీరంతో తాదాత్మ్యం ఉండదు. మనం జీవిస్తున్న సమాజానికి అతీతంగా ఉండే ఆ యోగుల తత్త్వం మనకు అంతుపట్టదు. అందుకే వారు మనకు సాధారణ సామాజిక జీవితంలో ఎదురుపడరు.→ స్నానం చేసేటప్పుడు ఏం చేయాలి?భక్తితో గంగను తలచుకుంటూ నదిలో మూడు మునకలు వేయాలి. పవిత్రమైన నదిని అపరిశుభ్రం చేయకుండా జాగ్రత్త తీసుకోవాలి. స్నానం తరువాత దగ్గరలో ఉన్న ఆలయాలను దర్శించుకోవాలి.→ కుంభమేళాకి పోలేనివారికి...పురాణాలు, జ్యోతిష్యశాస్త్రం కుంభమేళాలో చేసే పవిత్ర స్నానవిశిష్టతను ఎంతో కీర్తించాయి. అయితే ఆరోగ్యరీత్యా, వయోభారంవల్ల అక్కడికి పోలేనివారు అక్కడినుంచి తెచ్చిన నీటిని తాము స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం చేయవచ్చు. అదీ కుదరకపోతే తామున్న చోటే గంగానదీ పేరును తలచుకుని స్నానం చేయవచ్చు.ఐక్యత మరియు ఏకత్వాల పండుగ కుంభమేళా. శాశ్వతమైన, అనంతమైన దివ్య స్వభావాన్ని కుంభమేళాలో అనుభవించగలం. నదీ ప్రవాహంలాగే జనప్రవాహం కూడా కుంభమేళా వైపు సాగి సముద్రంలో నదులు సంగమించినట్టు వివిధ ప్రదేశాలవారు ఏకమయ్యే సంగమస్థలం కుంభమేళా.→ అందరి చూపు–కుంభమేళా వైపుగత కొద్ది రోజులుగా ప్రయాగలో జరుగుతున్న మహాకుంభమేళా భారతదేశంలోని ప్రజలనే కాదు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల ప్రజల దష్టిని ఆకర్షిస్తోంది. పలు మతాలకు చెందినవారు కుంభమేళా కోసమే ఇక్కడికి వచ్చి, పవిత్ర స్నానం చేసి ఆనందపరవశులవుతున్నారు. భారతీయ ఆధ్యాత్మికత పట్ల ఆకర్షితులవుతున్నారు.స్టీవ్ జాబ్స్ భార్య కుంభమేళాపై ఆసక్తితో కుంభమేళాలో ఉండే గురువులు సాధువుల వద్ద సనాతన ధర్మంలోని పలు అంశాలనుతెలుసుకుంటూ మోక్షమార్గాన్ని అన్వేషిస్తున్నారు. ఎంతోమంది విదేశీ పరిశోధకులు ఈ కుంభమేళాను ఆసక్తితో గమనిస్తున్నారు.→ ఆధ్యాత్మిక ప్రపంచంప్రపంచం నలుమూలల నుంచి చేరుతున్న జన సందోహంతో అక్కడ నూతన ప్రపంచం ఏర్పడింది. కుంభమేళా కి వచ్చినవారు ముఖ్యంగా యువతరం ఈ వాతావరణాన్ని ఆసక్తిగా గమనిస్తోంది. ఆధ్యాత్మిక గురువుల నుంచి ఆసక్తిగా అనేక అంశాలను తెలుసుకుంటున్నారు యువత.నాలుగు రకాల కుంభమేళాలు4 సం.ల కొకసారి జరిగేది – కుంభమేళా6 సం.ల కొకసారి జరిగేది – అర్ధ కుంభమేళా12 సం.ల కొకసారి జరిగేది – పూర్ణ కుంభమేళా12 సం.ల కొకసారి జరిగే పూర్ణ కుంభమేళాలు 12 సార్లు పూర్తయితే (144 సం.లకు) – మహా కుంభమేళా.ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని మరియు నాసిక్ ఈ నాలుగు పుణ్యక్షేత్రాలలో ఈ నాలుగు కుంభమేళాలు జరుగుతాయి. బహస్పతి వృషభ రాశిలో ఉన్నప్పుడు ప్రయాగలో, కుంభ రాశిలో ఉన్నప్పుడు హరిద్వార్‌లో, సింహ రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయిని మరియు నాసిక్‌లో కుంభమేళాలు జరుపుకుంటారు.– అప్పాల శ్యాంప్రణీత్ శర్మ వేద పండితులు -
కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా(Kumbh Mela)లో ఆదివారం(జనవరి19) అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అక్కడి సెక్టార్ 19లో భక్తులు, సాధువుల కోసం వేసిన గుడారాల్లో రెండు వంట గ్యాస్ సిలిండర్లు ప్రమాదవశాత్తు పేలి మంటలు చెలరేగాయి. దీంతో గుడారాల్లోని భక్తులు భయంతో పరుగులు తీశారు. మొత్తం ముప్పై దాకా గుడారాలు మంటల్లో దగ్ధమయ్యాయి.అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. మంటల ధాటికి గుడారాల్లో ఉన్న వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. కుంభమేళాకు ఆదివారం ఒక్కరోజు 17 లక్షల మంది భక్తులు విచ్చేశారు. ఇప్పటివరకు 7 కోట్లకుపైగా భక్తులు కుంభమేళాకు విచ్చేసి పవిత్ర స్నానమాచరించారు. #WATCH | Prayagraj, Uttar Pradesh | A fire breaks out at the #MahaKumbhMela2025. Fire tenders are present at the spot. More details awaited. pic.twitter.com/dtCCLeVIlN— ANI (@ANI) January 19, 2025యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశాన్ని సందర్శించారు. ఆదివారం రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ మహా కుంభమేళాలో పుణ్య స్నానం చేశారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ ద్వారా తెలియజేశారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శనివారం సంగమంలో స్నానం చేసి, మహా కుంభమేళాను విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను ప్రశంసించారు. -
7 కోట్ల రుద్రాక్షలతో... ద్వాదశ జ్యోతిర్లింగాలు
మహాకుంభ్‌నగర్/లఖ్నో: ఇసుకేస్తే రాలని భక్తజన సందోహం నడుమ ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా కన్నులపండువగా కొనసాగుతోంది. వేడుకకు వేదికైన త్రివేణి సంగమానికి ప్రపంచం నలుమూలల నుంచీ భక్తులు వెల్లువెత్తుతూనే ఉన్నారు. శనివారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మేళాలో పాల్గొన్నారు. వీఐపీ ఘాట్‌లో పుణ్యస్నానం ఆచరించారు. అనంతరం అక్షయ వటవృక్షం, పాతాళ్పురీ మందిర్, సరస్వతీ కూప్‌ను సందర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. బడే హనుమాన్ మందిర్‌లో ప్రత్యేక పూజలు చేశారు. ఇంతటి వేడుకలో పాల్గొనడం తన అదృష్టమన్నారు. ‘‘మహా కుంభమేళా ఏ మతానికో, ప్రాంతానికో చెందినది కాదు. భారతీయతను ప్రతిబింబించే అతి పెద్ద సాంస్కృతిక పండుగ. భారత్‌ను, భారతీయతను అర్థం చేసుకునేందుకు చక్కని మార్గం’’అని అభిప్రాయపడ్డారు. మహా కుంభమేళాలో పలు విశేషాలు భక్తులకు కనువిందు చేస్తున్నా యి. మహాకుంభ్‌నగర్ సెక్టర్ 6లో ఏకంగా 7.51 కోట్ల రుద్రాక్షలతో రూపొందించిన ద్వాదశ జ్యోతిర్లింగాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఒక్కో లింగాన్ని 11 అడుగుల ఎత్తు, 9 అడుగుల వెడ ల్పు, 7 అడుగుల మందంతో రూపొందించారు. వాటి తయారీలో వాడిన రుద్రాక్షలను 10 వేల పై చిలుకు గ్రామాల్లో పాదయాత్ర చేస్తూ సేకరించినట్టు నిర్వాహకుడు మౌనీ బాబా తెలిపారు. వాటిలో ఏకముఖి నుంచి 26 ముఖాల రుద్రాక్షల దాకా ఉన్నట్టు చెప్పారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం 22న ప్రయాగ్‌రాజ్‌లో సమావేశం కానున్నట్టు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. ప్రయాగ్‌రాజ్ అభివృద్ధికి సంబంధించి భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అంతకుముందు యోగి కుంభమేళాలో పాల్గొని పుణ్యస్నానం ఆచరించనున్నారు. -
నాగ సాధువుగా తొలి విదేశీయుడు..!
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా(Maha Kumbh 2025) జరుగుతోంది. దేశం నుంచే నుంచే కాకుండా ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు కుంభమేళాకు తరలివస్తున్నారు. ఈ కుంభమేళలో ఎందరో విచిత్రమైన బాబాలు, వారి నేపథ్యం విస్తుగొలిపే విధంగా ఉండటం చూశాం. యావత్తు భారతావనిలో ఆద్యాత్మికత శోభ ఎంతగా తనలోకి మేధావులు, మహా మహులను ఆకళింపు చేసుకుని కాంతిలీనుతోందనేది ఈ మహోత్సవం ఎలుగెత్తి చాటుతోంది. తాజాగా అలాంటి మరో ఆశ్చర్యకర ఘటన వెలుగులోకి వచ్చింది. తొలిసారిగా ఓ విదేశీయుడు నాగసాధువుగా మారి ఈ కుంభమేళలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అతడు ఏ దేశస్తుడంటే..భారతదేశపు ప్రాచీన జునా అఖారాకు(Juna Akhara) చెందిన నాగసాధుగా దీక్ష పొందిన తొలి విదేశీయుడు. ఆ వ్యక్తి పేరు బాబా రాంపురి(Baba Rampuri,). అమెరికాకు చెందిన వ్యక్తి. చికాగోలోని పిల్లల వైద్యుడు డాక్టర్ స్టీఫెన్ ఎల్. గాన్స్కు జన్మించిన విలియం ఎ. గాన్స్ ఈ బాబా రాంపురి. అతడు భారతీయ తత్వశాస్త్రం పట్ల అమితంగా ఆకర్షితుడయ్యాడు. భారతీయ తత్వశాస్త్రాన్ని అర్థం చేసుకోవడంలో ప్రసిద్ధిగాంచిన అలాన్ వాట్స్ వంటి మహోన్నత వ్యక్తుల నుంచి ప్రేరణ పొంది 1969లో భారతదేశానికి వచ్చాడు.ఇక్కడ బాబా రాంపరి యోగా హరిపురి మహారాజ్ శిష్యుడయ్యాడు. అలా ఆయన భారత్‌లోని నిగూఢమైన నాగ సాధువులకు చెందిన జునా అఖారాలో నాగబాబాగా దీక్ష తీసుకున్నాడు. ఆ విధంగా ఆయన ఆది శంకరుల కాలంలోని యోగుల గురువు అయిన భవాన్ దత్తాత్రేయుడికి సంబంధించిన గౌరవనీయ వంశంలో దీక్ష పొందిన తొలి విదేశీయడుగా నిలిచాడు బాబా రాంపురి.అంతేగాదు ఆయన రాసిన "ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ సాధు: యాన్ ఆంగ్రేజ్ అమాంగ్ నాగ బాబాస్" పుస్తకంలో 1971లో అలహాబాద్ మహా కుంభమేళా సమయంలో తాను నాగసాధువుగా మారిన క్రమం గురించి చెప్పుకొచ్చారు. తన ఆత్మకథలో భారతదేశాన్ని ఉనికిలోని తీసుకరావాలని కలలు కంటున్నానని, ఈ ప్రదేశం మనసుకు శాంతినిచ్చే యోగా వంటి ఆధ్యాత్మికతకు నిలయం అని రాశారు. ఈ భూమి మీద వినిపించే శబ్దాలు, కనిపించే ముఖాలు అన్ని తనకు పరిచయమున్నట్లుగా అనిపిస్తుందని, ఈ దేశంతో ఏదో తెలియని రక్తసంబంధం ఉంది అంటూ ఆ పుస్తకంలో రాసుకొచ్చారు. ఇక బాబా రాంపురికి 2010 హరిద్వార్‌లో జరిగిన కుంభమేళాలో, బాబాకు జూనా అఖారా కౌన్సిల్లో శాశ్వత స్థానంతో సత్కారం లభించింది. అలాగే ఆయనకు 'అంతరాష్ట్రీయ మండల్ కా శ్రీ మహంత్' అనే బిరుదుని కూడా పొందారు. (చదవండి: 'ఇంజనీర్ బాబా': ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఫోటోగ్రఫీ వదిలి మరీ..) -
కుంభ మేళాకు బాబా @ 100 ఏళ్లు
మహాకుంభ్ నగర్: యూపీలోని ప్రయాగరాజ్‌లో నాలుగు రోజులుగా జరుగుతున్న మహా కుంభ మేళాకు కోట్లాదిగా జనం తరలివస్తున్నారు. ఈ క్రతువులో బయటి ప్రపంచంలోకి అరుదుగా అడుగుపెట్టే సాధువులు, మునులు సైతం పాలుపంచుకోవడం తెలిసిందే. అలాంటి కోవకు చెందిన వారే పద్మ శ్రీ అవార్డు గ్రహీత, యోగ సాధకుడు స్వామి శివానంద బాబా. 1896లో జన్మించిన స్వామి శివానంద బాబా గత వందేళ్లుగా ప్రయాగరాజ్, నాసిక్, ఉజ్జయిని, హరిద్వార్‌లలో జరిగే ప్రతి కుంభమేళాలోనూ హాజరవుతున్నారు. తాజాగా, మహాకుంభమేళాకు సైతం వచ్చారు. సంగంలోని 16వ నంబర్ సెక్టార్‌లోని టెంట్లో ఈయన బస చేస్తున్నారు. టెంట్ బయట బాబా ఆధార్ కార్డు, పుట్టిన రోజు సర్టిఫికెట్ కాపీని ఆయన శిష్యులు ప్రదర్శనకు ఉంచారు. బాబా శిష్యుడు, బెంగళూరుకు చెందిన ఫల్గుణ్ భట్టాచార్య వారిలో ఒకరు. ‘బాబా బిచ్చగాళ్ల కుటుంబంలో పుట్టారు. ఆయన తల్లిదండ్రులు సాధువుల బోధనలకు తరచూ వెళ్లేవారు. ఆ క్రమంలోనే వారు నాలుగేళ్ల వయస్సులో బాబాను సాధువులకు అప్పగించేశారు. ఆరేళ్ల వయస్సులో బాబా తిరిగి సొంతింటికి చేరుకున్న కొన్ని రోజులకే ఆయన సోదరి మరణించింది. మరికొద్ది రోజులకు తల్లిదండ్రులు సైతం తనువు చాలించారు. వారి కర్మకాండలు పూర్తయ్యాక బాబా ఒంటరయ్యారు’అని భట్టాచార్య వివరించారు. ‘అప్పటి నుంచి జీవితమే మారిపోయింది. రాత్రి 9 గంటలకు పడుకుని, వేకువజామున 3 గంటలకే నిద్ర లేవడం మిగతా దినమంతా యోగా, ధ్యానంలోనే గడపడం దినచర్యంగా మార్చుకున్నారు’అని తెలిపారు. ఇప్పటి వరకు ఆయన అనారోగ్యం బారిన పడిన దాఖలాలు లేవన్నారు. కానుకలు స్వీకరించరని చెప్పారు. పాలు, పాల ఉత్పత్తులకు దూరంగా ఉంటారని, ఉడికిన ఆహారాన్ని ఉప్పు, నూనె లేకుండానే తీసుకుంటారని తెలిపారు. వారణాసిలోని దుర్గాకుండ్ ప్రాంతం కబీర్ నగర్‌లోని ఆశ్రమంలో ఉంటున్నారని తెలిపారు. 2022 మార్చి 21వ తేదీన అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మీ శ్రీ అవార్డును స్వీకరించారు. బాబా వయస్సు 125 ఏళ్లని రాష్ట్రపతి భవన్ అప్పట్లో పేర్కొంది. కాగా, ప్రజల ఇబ్బందులకు అనారోగ్యకర అలవాట్లు, శారీరక శ్రమే కారణమన్నది స్వామి శివానంద బాబా అభిప్రాయం. అందుకే, ఉదయాన్నే మేల్కొనడం, కాసేపు నడక, కనీస అరగంటపాటు యోగ సాధనతోపాటు సరైన ఆహార నియమాలతో జీవితాన్ని సుఖమయం చేసుకోవాలని ఆయన సూచిస్తున్నారని ఫల్గుణ్ భట్టాచార్య తెలిపారు. -
అంబరాన మహాకుంభ సంబరం
ఆకాశం అంటే అనంతం... అనంతమైన భక్తి కూడా ఆకాశం లాంటిదే. తనలోని అనంతమైన భక్తిని ఆకాశ వేదికగా చాటింది ఇరవై నాలుగు సంవత్సరాల అనామికాశర్మ...ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన స్కైడైవర్ అనామికా శర్మ బ్యాంకాక్ మీదుగా 13 వేల అడుగుల ఎత్తులో మహాకుంభ్ అధికారిక జెండాను ఎగరేసి చరిత్ర సృష్టించింది. అనామిక డేరింగ్ ఫీట్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. విమానం ఎక్కే ముందు ఆత్మవిశ్వాసంతో మహాకుంభ్ జెండాను అనామిక పట్టుకున్న దృశ్యాలు వైరల్ వీడియోలో ఉన్నాయి. అనామిక విమానం నుండి దూకడం, జెండా ఎగరవేస్తూ ‘మహాకుంభ్ 2025’కు ప్రపంచానికి స్వాగతం పలికే దృశ్యాలు, బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించే కుంభమేళ న్ట అబ్బురపరుస్తాయి.‘ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సమ్మేళనమైన మహాకుంభ్ 2025కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలను ఆహ్వానిస్తున్నాను’ అని అనామిక శర్మ ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియోనే చూస్తూ నెటిజనులు అనామికను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.వాటిలో కొన్ని...‘అపూర్వ సాహసం, భక్తిభావం మేళవించిన దృశ్యం’‘మన సంస్కృతిని మరింత ఎత్తుకు తీసుకెళ్లారు’‘ఇది స్టంట్ కాదు. ప్రపంచానికి అందించిన శక్తిమంతమైన సందేశం’అనామిక తండ్రి మాజీ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్. తండ్రి ఒడిలో సాహసాల ఓనమాలు నేర్చుకున్న అనామికకు ధైర్యంగా ముందుకు దూసుకెళ్లడమే తెలుసు. తాజా ఫీట్‌తో తన సాహసాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకువెళ్లింది.పవిత్ర క్షేత్రమైన ప్రయాగ్‌రాజ్‌కు చెందిన అనామిక మన సంస్కృతి, సంప్రదాయాలను వింటూ పెరిగింది. ‘మన సంస్కృతిలోని గొప్పదనం ఏమిటంటే, ఒక మంచి పని కోసం అందరూ ముందుకు వస్తారు. నేనేమిటి? నా స్థాయి ఏమిటి అని ఎప్పుడూ ఆలోచించరు. రామాయణంలో ఉడుత కథ దీనికి ఉదాహరణ. భరతమాత బిడ్డను అని చెప్పడానికి నేను చాలా గర్వపడతాను’ అంటుంది అనామిక.భవిష్యత్‌లో మరెన్నో సాహసాలు చేయడానికి సిద్ధం అవుతున్న అనామిక ట్రైన్డ్ స్కూబా డైవర్ కూడా. మన దేశంలో ‘స్కై సి లైసెన్స్’ ఉన్న యంగెస్ట్ ఫీమెల్ స్కైడైవర్‌గా కూడా తన ప్రత్యేకతను చాటుకుంది.‘వీడియోను చూసి చాలామంది... మీకు భయంగా అనిపించలేదా అని అడిగారు. నిజం చెప్పాలంటే భక్తి భావంతో నాకు భయం కలగలేదు. ఒకటికి పదిసార్లు మనసులో మేరా భారత్ మహాన్ అనుకున్నాను’ అంటోంది అనామిక. -
Mahakumbh 2025: చూపుతిప్పుకోనివ్వని దృశ్యాలు
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా సందర్భంగా పవిత్ర సంగమం ప్రాంతంలో ఏర్పాటు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కటౌట్లు ఇక్కడికి వచ్చేవారిని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. కుంభమేళాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.మహాకుంభమేళా సందర్భంగా పంచాయితీ అఖాడా ఇస్తున్న బడా హారతి భక్తులను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం జరుగుతున్న మహా కుంభమేళాలో 40 నుండి 50 కోట్ల మంది భక్తులు పాల్గొంటారని అంచనా.మహా కుంభమేళా సందర్భంగా ఆపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ భార్య లారెన్ పావెల్ జాబ్స్ అలియాస్ కమల అఖాడ శ్రీ నిరంజని అధిపతి స్వామి కైలాసానంద గిరి నుండి ఆధ్యాత్మిక దీక్షను పొందారు.2025 మహా కుంభమేళా సందర్భంగా జరిగిన శోభా యాత్రలో ఇస్కాన్ భక్తులు పాల్గొంటున్నారు. ఇతర దేశాల నుండి కూడా పెద్ద సంఖ్యలో ఇస్కాన్ భక్తులు కుంభమేళాకు తరలివస్తున్నారు. వారు చేసే కీర్తనలు, భజనలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.మహా కుంభమేళా ప్రాంతంలో తీవ్రమైన చలి ఉన్నప్పటికీ భక్తులు అత్యంత ఉత్సాహంతో త్రివేణి సంగమంలో స్నానాలు చేస్తున్నారు. ‘హర్ హర్ మహాదేవ్’, ‘జై శ్రీరామ్’, ‘జై గంగా మాతా’ అని నినాదాలు చేస్తూ భక్తులు సంగమం వద్ద స్నానాలు ఆచరిస్తున్నారు.మహాకుంభ ఉత్సవంలో సాధుసన్యాసులు భజన కీర్తలను ఆలపిస్తూ, ఆధ్యాత్మిక ప్రసంగాలు సాగిస్తున్నారు. వీరిని దర్శించుకునేందుకు జనం క్యూ కడుతున్నారు. మహా కుంభమేళాలో లక్షలాది మంది సాధువులు పాల్గొంటున్నారు.విహంగ వీక్షణలో మహా కుంభమేళా వేదిక అత్యంత అద్భుతంగా కనిపిస్తోంది. ఫొటోలోని కొంతభాగమే ఇంత అందంగా ఉంటే.. పూర్తి చిత్రం ఎలా ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.దేశ విదేశాల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన పర్యాటకులు మహా కుంభమేళాలో సంగమం దగ్గర స్నానాలు ఆచరించారు. మంగళవారం మకర సంక్రాంతి సందర్భంగా వివిధ అఖాడాలకు చెందిన సాధువులు తొలి అమృత స్నానం చేశారు. మకర సంక్రాంతి నాడు త్రివేణి సంగమంలో దాదాపు 3.5 కోట్ల మంది భక్తులు స్నానమాచరించారు.ఇది కూడా చదవండి: Mahakumbh 2025: స్నానానికి 45 నిముషాలు.. ఆర్ఎఫ్ రిస్ట్ బ్యాండ్‌లో వెల్లడి -
Mahakumbh 2025: నేడు అంతర్జాతీయ ప్రతినిధుల బృందం పవిత్ర స్నానాలు
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా అత్యంత వైభవంగా కొనసాగుతోంది. దీనిలో దేశవిదేశాలకు చెందినవారు పాల్గొని పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈరోజు (గురువారం) పవిత్ర తీవేణీ సంగమంలో పది దేశాల నుంచి వచ్చిన 21 మంది సభ్యుల అంతర్జాతీయ ప్రతినిధి బృందం పవిత్ర స్నానాలు ఆచరించనుంది. వీరి పర్యటనను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పర్యావేక్షిస్తోంది.నేడు ప్రయాగ్‌రాజ్(Prayagraj)లో పవిత్ర స్నానాలు ఆచరించే ప్రతినిధి బృందంలో ఫిజీ, ఫిన్లాండ్, గయానా, మలేషియా, మారిషస్, సింగపూర్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, ట్రినిడాడ్, టొబాగో, యూఎఈ దేశాలకు చెందినవారు ఉన్నారు. ఈ పుణ్యస్నానాలు ఆచరించే ముందు ఈ బృందం సభ్యులు వారసత్వ నడకను చేపట్టారు. ఈ సందర్భం వీరు ప్రయాగ్‌రాజ్‌కు చెందిన సాంస్కృతిక, చారిత్రక వారసత్వాన్ని తెలుసుకున్నారు. వీరు బస చేసేందుకు ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ టెంట్ సిటీని ఏర్పాటు చేసింది.ఈ ప్రతినిధి బృందం పుణ్యస్నానాలు ఆచరించిన అనంతం హెలికాప్టర్(Helicopter) ద్వారా మహా కుంభ్ ప్రాంతాన్ని ఏరియల్ సర్వే చేయనుంది. కాగా గంగా, యమున, పౌరాణిక సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమంలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మహా కుంభమేళా జరుగుతుంది. ఈ సంవత్సరం ఈ కుంభమేళా జనవరి 13న ప్రారంభమై ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. ఈ కుంభమేళాకు 45 కోట్ల మంది వరకూ యాత్రికులు వస్తారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేస్తోంది.ఇది కూడా చదవండి: Jammu and Kashmir: వణికిస్తున్న అంతుచిక్కని వ్యాధి.. 15 మంది మృతి