లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో దారుణం వెలుగుచూసింది. ప్రయాగ్‌రాజ్ డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ సునీల్ కుమార్ ఓ హోటల్ గదిలో ఉరి వేసుకుని విగతజీవిగా కనిపించారు. ప్రయాగ్‌రాజ్‌లోని విఠల్ హోటల్‌లో సోమవారం ఉదయం జరిగింది ఈ ఘటన. హోటల్ సిబ్బంది మెడికల్ అధికారి గది తలుపులు కొట్టగా.. లోపలి నుంచి సమాధానం రాలేదు. దీంతో బలవంతంగా డోర్స్ తెరిచి చూడటంతో డిప్యూటీ సీఎంవో మృతదేహం వేలాడుతూ కనిపించిందని చెప్పారు.
సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాఫీ హౌస్‌లో ఈ హోటల్ విఠల్ ఉంది. కాగా బనారస్‌కు చెందిన సునీల్ కుమార్.. అంటువ్యాధుల నోడల్ అధికారిగా నియమితులయ్యారు. ఆయన చాలాకాలంగా డిప్రెషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తు అనంతరం సునీల్ కుమార్ మరణానికి సంబంధించిన వివరాలు వెల్లడవుతాయని పోలీస్ అధికారులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
చదవండి: Munawar Faruqui: స్టాండప్ కమెడియన్‌కి ఊరట
Comments
Please login to add a commentAdd a comment