Chief Medical Officer
-
యూపీలో దారుణం.. హోటల్ గదిలో విగతజీవిగా వైద్యాధికారి
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో దారుణం వెలుగుచూసింది. ప్రయాగ్‌రాజ్ డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ సునీల్ కుమార్ ఓ హోటల్ గదిలో ఉరి వేసుకుని విగతజీవిగా కనిపించారు. ప్రయాగ్‌రాజ్‌లోని విఠల్ హోటల్లో సోమవారం ఉదయం జరిగింది ఈ ఘటన. హోటల్ సిబ్బంది మెడికల్ అధికారి గది తలుపులు కొట్టగా.. లోపలి నుంచి సమాధానం రాలేదు. దీంతో బలవంతంగా డోర్స్ తెరిచి చూడటంతో డిప్యూటీ సీఎంవో మృతదేహం వేలాడుతూ కనిపించిందని చెప్పారు. సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాఫీ హౌస్‌లో ఈ హోటల్ విఠల్ ఉంది. కాగా బనారస్‌కు చెందిన సునీల్ కుమార్.. అంటువ్యాధుల నోడల్ అధికారిగా నియమితులయ్యారు. ఆయన చాలాకాలంగా డిప్రెషన్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తు అనంతరం సునీల్ కుమార్ మరణానికి సంబంధించిన వివరాలు వెల్లడవుతాయని పోలీస్ అధికారులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. చదవండి: Munawar Faruqui: స్టాండప్ కమెడియన్‌కి ఊరట -
దారుణం: డాక్టర్ నిర్వాకం.. మహిళ కడుపులో టవల్ ఉంచేసి..
ప్రసవ వేదనతో ప్రైవేట్ ఆస్పత్రికి వచ్చిన మహిళ కడుపులో టవల్ ఉంచేసి నిర్లక్ష్యంగా ఆపరేషన్ చేశాడో వైద్యుడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలోని బాన్స్ ఖేరీ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్లే... నజరానా అనే మహిళ ప్రసవ వేదనతో సైఫీ నర్సింగ్ ప్రైవేటు ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యింది. ఐతే వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా.. ఆమె కడుపులో టవల్ ఉంచేసి ఆపరేషన్ చేశారు డాక్టర్ మత్లూబ్. కానీ ఆ తర్వాత మహిళకు కడుపు నొప్పి ఎక్కువ అవ్వడంతో తాళలేక సదరు డాక్టర్‌కి ఫిర్యాదు చేసింది. ఐతే బయట చలి ఎక్కువగా ఉండటం వల్లే అలా అనిపిస్తుందని చెప్పి మరో ఐదు రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉంచేశారు సదరు మహిళని. కానీ ఆమెకు ఇంటికి వచ్చినా..ఆరోగ్యం మెరుగవ్వకపోవడంతో.. భర్త షంషేర్ అలీ ఆమెను అమ్రెహాలోని మరో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. అక్కడ అసలు విషయం తెలుసుకుని బాధితురాలి భర్త ఆలీ తెల్లబోయాడు. బాధితురాలి కడుపులో టవల్ ఉందని, ఆపరేషన్ చేసి తీసేసినట్లు అక్కడి ఆస్పత్రి వైద్యులు అలీకి తెలిపారు. దీంతో అలీ చీఫ్ మెడికల్ ఆఫీసర్(సీఎంఓ)కు సదరు ఆస్పత్రి నిర్వాకంపై ఫిర్యాదు చేశాడు. మీడియా కథనాల ద్వారా విషయం తెలుసుకున్న చీఫ్ మెడికల్ ఆఫీసర్(సీఎంఓ) రాజీవ్ సింఘాల్ ఈ విషయంపై సమగ్ర విచారణ చేయమని నోడల్ అధికారి డాక్టర్ శరద్‌ను ఆదేశించారు. ఐతే అలీ ఈ విషయమై లిఖితపూర్వకంగా తనకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని తెలిపారు. విచారణ నివేదిక రాగనే పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభిస్తారని సీఎంవో అధికారి సింఘాల్ చెప్పడం గమనార్హం. విచారణలో..వైద్యుడు మత్లూబ్ అమ్రోహాలో సైఫీ నర్సింగ్ హోమ్‌ని ఎలాంటి అనుమతి లేకుండా నడుపుతున్నట్లు తేలింది. (చదవండి: షాకింగ్ ఘటన: విమానంలో ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన.. టాటా చైర్మన్‌కు లేఖ) -
బీసీసీఐ కీలక అధికారి రాజీనామా
ముంబై: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) చీఫ్ మెడికల్ ఆఫీసర్ అభిజిత్ సాల్వీ తన పదవికి రాజీనామా చేశారు. భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో టెస్ట్ ముగిసిన వెంటనే సాల్వి తన పదవికి రాజీనామా చేసిన్పటికీ.. బీసీసీఐ ఆ విషయాన్ని గోప్యంగా ఉంచింది. కరోనా సమయంలో కీలకంగా వ్యవహరించిన సాల్వి.. టీమిండియా మొత్తానికి వైద్య పరీక్షలు నిర్వహించారు. భారత జట్టుకు ఎంపికయ్యే ఆటగాళ్ల వయసును నిర్ధారణ చేసే ఆఫీసర్‌గా, యాంటీ డోపింగ్ విభాగాధిపతిగా ఆయన పని చేశారు. 2011 నుంచి బీసీసీఐలో విధులు నిర్వహిస్తూ వచ్చిన సాల్వి.. దాదాపు 10 సంవత్సరాల పాటు భారత క్రికెట్ బోర్డుకు సేవలందించారు. చదవండి: Ashes 2nd Test: స్టార్క్ విజృంభణ.. ఆసీస్‌కు భారీ అధిక్యం -
పుట్టినా.. గిట్టినా తిప్పలే..
ధ్రువీకరణ పత్రాల జారీలో ఇబ్బందులు జీహెచ్ఎంసీలో చీఫ్‌మెడికల్ ఆఫీసర్ లేక అవస్థలు సాక్షి, సిటీబ్యూరో : విదేశాల్లో జరిగే జనన, మరణాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు పొందలేక నగరానికి చెందిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరానికి చెందిన వారు విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడ జననం లేదా మరణం సంభవిస్తేఅందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను స్థానిక జీహెచ్ఎంసీ అందజేయాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన ఆధారాలు, పత్రాలు పరిశీలించి, అన్నీ నిర్ధారించుకున్న తర్వాత ఎక్కడైతే జననం లేదా మరణం జరిగిందో దానిని ధ్రువీకరిస్తూ జీహెచ్ఎంసీ ధ్రువపత్రాలు జారీ చేస్తుంది. అయితే ఇందుకు సంబందించి రిజిస్ట్రార్‌గా వ్యవహరిస్తున్న చీఫ్‌మెడికల్ ఆఫీసర్(సీఎంఓ) పోస్టు దాదాపు ఏడాదిగా ఖాళీగా ఉండటంతో సదరు సర్టిఫికెట్లు అవసరమైన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటితోపాటు స్థానికంగా జరిగే జనన, మరణ ధ్రువీకరణ పత్రాల్లో దొర్లే పొరపాట్ల సవరణ, పిల్లల దత్తత తదితర కార్యక్రమాలకు సైతం ఆయనే ప్రధాన రిజిస్ట్రార్‌గా వ్యవహరిస్తారు. అయితే జీహెచ్ఎంసీలో సీఎంఓ గత మేలో రిటైర్కావడంతో అప్పటి నుంచి ఇంతవరకు ఎవరినీ నియమించకపోవడంతో సర్టిఫికెట్ల జారీ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ఆర్నెళ్లుగా అడిషనల్ కమిషనర్ సీఎంఓహెచ్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీంతో వివిధ సర్కిళ్ల నుంచి వస్తున్న దరఖాస్తుల పరిష్కారంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీనిని ఆసరా చేసుకున్న కొందరు అర్హత లేని వారు తమకు ఈ అధికారాన్ని కట్టబెట్టాల్సిందిగా కొంతకాలం క్రితం కమిషనర్‌కు దరఖాస్తు చేసుకోగా అందుకు అంగీకరించనట్లు సమాచారం. ఇదిలా ఉండగా సంబంధిత అడిషనల్ కమిషనర్ (ఆరోగ్యం-పారిశుధ్యం) ఇన్‌ఛార్జి సీఎంఓహెచ్ విధులు కూడా నిర్వహిస్తున్నప్పటికీ.. రవాణా, ఎంటమాలజీ, వెటర్నరీ, ఘనవ్యర్థాల నిర్వహణ, తదితర విభాగాల అదనపు బాధ్యతలు నిర్వహిస్తుండటమేగాకుండా, సెంట్రల్‌జోన్ కమిషనర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. దీంతో సంబంధిత సర్టిఫికెట్ల జారీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీన్ని ఆసరా చేసుకున్న కొందరు దిగువస్థాయి సిబ్బంది సర్టిఫికెట్లు ఇప్పిస్తామంటూ అందినకాడికి దండుకుంటున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. దీంతో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు పొందేందుకు, పొరపాట్లను సవరించుకునేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అవినీతికి తావు లేకుండా.. సర్టిఫికెట్లు సత్వరం జారీ చేసేందుకు కమిషనర్ తగుచర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.