
ముంబై: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) చీఫ్ మెడికల్ ఆఫీసర్ అభిజిత్ సాల్వీ తన పదవికి రాజీనామా చేశారు. భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో టెస్ట్ ముగిసిన వెంటనే సాల్వి తన పదవికి రాజీనామా చేసిన్పటికీ.. బీసీసీఐ ఆ విషయాన్ని గోప్యంగా ఉంచింది. కరోనా సమయంలో కీలకంగా వ్యవహరించిన సాల్వి.. టీమిండియా మొత్తానికి వైద్య పరీక్షలు నిర్వహించారు. భారత జట్టుకు ఎంపికయ్యే ఆటగాళ్ల వయసును నిర్ధారణ చేసే ఆఫీసర్‌గా, యాంటీ డోపింగ్ విభాగాధిపతిగా ఆయన పని చేశారు. 2011 నుంచి బీసీసీఐలో విధులు నిర్వహిస్తూ వచ్చిన సాల్వి.. దాదాపు 10 సంవత్సరాల పాటు భారత క్రికెట్ బోర్డుకు సేవలందించారు.
చదవండి: Ashes 2nd Test: స్టార్క్ విజృంభణ.. ఆసీస్‌కు భారీ అధిక్యం