found dead
-
‘మ్యాన్ ఈటర్’ హతం..ఇతర పులుల దాడిలోనే..!
తిరువనంతపురం:కేరళలో మనుషులపై దాడి చేసి చంపుతున్న మ్యాన్ ఈటర్ ఆడపులి మృతిచెందింది. పులి కళేబరాన్ని సోమవారం ఉదయం వయనాడ్‌లో అటవీశాఖ అధికారులు గుర్తించారు. కళేబరం తాము వెతుకున్న మ్యాన్ ఈటర్దేనని ధృవీకరించారు. 6నుంచి7 ఏళ్ల వయసు ఉండి ఒంటిపై గాయాలున్న ఆడపులి కళేబరాన్ని తాము స్వాధీనం చేసుకున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. గత వారం పులి 45 ఏళ్ల గిరిజన మహిళపై దాడి చేసి చంపిందని కేరళ అటవీశాఖ మంత్రి ఏకే శశీంద్రన్ తెలిపారు. దీంతో దానిని కాల్చి చంపేందుకు ఆదేశాలిచ్చినట్లు చెప్పారు. మ్యాన్ ఈటర్ పులిని పట్టుకునేందుకు తాము సాగించిన వేట దాని కళేబరం దొరకడంతో ముగిసినట్లు ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ తెలిపారు. పులి ఒంటిపై ఉన్న గాయాలు కొన్ని పాతవి కాగా మరికొన్ని తాజాగా అయినవని వెటర్నరీ డాక్టర్లు తెలిపారు. ఇతర పులుల దాడిలోనే అది మరణించి ఉండొచ్చని చెప్పారు. తమపై వన్యమృగాల దాడులు ఎక్కువయ్యాయని,వాటిని ఆపేందుకు చర్యలు తీసుకోవాలని వయనాడ్‌లో గిరిజనులు ఇటీవల ఆందోళనలు నిర్వహించడం గమనార్హం.ఇదీ చదవండి: జగిత్యాలలో పులి సంచారం.. భయాందోళనల్లో ప్రజలు -
నాన్‌వెజ్ తినొద్దని వేధించి..
ఎయిరిండియా పైలట్ అనుమానాస్పద కలకలం రేపింది. దీనికి ఆమె బాయ్ ఫ్రెండే కారణమని బంధువులు ఆరోపించారు. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు..ఎయిరిండియాలో పైలట్‌గా పనిచేస్తున్న 25ఏళ్ల సృష్టి తులి ఈనెల 25న ముంబైలోని అంధేరీ ఈస్ట్‌లోని ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఆదిత్య పండిట్ తరచూ ఆమెను వేధించేవాడని, ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించేవాడని సృష్టి కుటుంబం ఆరోపించింది. నాన్ వెజ్ తినవద్దు అంటూ కట్టడి చేసేవాడని తెలిపింది. అతనే హత్య చేసి ఉంటాడని ఫిర్యాదు చేశారు. దీంతో నవంబర్ 26న కేసు నమోదు చేసిన పోలీసులు పండిట్‌ను అరెస్టు చేశారు. కోర్టు అతడిని నవంబర్ 29 వరకు పోలీసు కస్టడీకి పంపింది. పోలీసుల సమాచారం ప్రకారం ఆమె మృతదేహానికి సమీపంలో లేదా ఆమె ఫ్లాట్‌లో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. సృష్టి కమర్షియల్ పైలట్. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆమె గత ఏడాది జూన్ నుంచి ఉద్యోగ నిమిత్తం ముంబైలో నివసిస్తోంది. రెండేళ్ల క్రితం కమర్షియల్ పైలట్ లైసెన్స్ కోసం శిక్షణ పొందుతున్న సమయంలో సృష్టి, పండిట్లు ఢిల్లీలో కలిశారు. ఆ పరిచయం ప్రేమగా మారింది. అయితే ఈ ట్రైనింగ్‌లో ఆదిత్య పండిట్ పైలట్‌గా ఎంపిక కాలేదు.ఘటనకు ముందు దాదాపు ఐదు నుంచి ఆరు రోజుల పాటు పండిట్ సృష్టితో కలిసి అంధేరి ఫ్లాట్‌లో ఉన్నాడు. సోమవారం (నవంబర్ 25) అర్ధరాత్రి దాటిన తర్వాత అతను కారులో ఢిల్లీకి బయలుదేరాడు. ఈ సమయంలో సృష్టి అతనికి ఫోన్ చేసి, ఆత్మహత్య చేసుకుంటానని చెప్పింది. అతడు ముంబైకి తిరిగి వచ్చేసరికి డోర్ లాక్ చేసి ఉంది. ఎంత పిలిచినా తీయకపోవడంతో ఆమె స్నేహితురాలు ఉర్వి పంచల్‌ను సంప్రదించి, కీమేకర్ సాయంతో తలుపు తెరిచారు. కానీ అప్పటికే కేబుల్ వైర్‌తో ఉరి వేసుకుంది. అంధేరీ ఈస్ట్‌లోని సెవెన్ హిల్స్ ఆసుపత్రికి తరలించగా, ఆమె చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.సృష్టి మామ ఆరోపణలు'పండిట్‌ను సృష్టి చాలా గాఢంగా ప్రేమించింది. కానీ అతడు ఆమెను బాగా వేధించేవాడు. బహిరంగంగా దుర్భాషలాడేవాడు. మాంసాహారం తినడం మానేయాలని కూడా ఒత్తిడి చేశాడు. ఆమె పట్ల పండిట్ అసభ్యంగా ప్రవర్తించడం ఇతర బంధువులు కూడా చూశారు. అలాగే ఒక పార్టీలో మాంసాహారం తిన్నందుకు అందరిముందూ అరిచాడు. ఆమె కారును పాడు చేసి, రోడ్డుపై ఒంటరిగా వదిలేసివెళ్లిపోయాడు. ఇటీవల పండిట్ సోదరి నిశ్చితార్థం ఫంక్షన్‌కు సృష్టి వెళ్లలేకపోవడంతో దాదాపు 10 రోజుల పాటు మాట్లాడలేదు. దీంతో సృష్టి మానసికంగా కృంగి పోయింద'ని సృష్టి మామ ఆరోపించారు. -
పాపం ఏ కష్టమొచ్చిందో.. వ్యాపారి కుటుంబమంతా ఒకేసారి!
తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. తిరుచ్చి-కరైకుడి జాతీయ రహదారిపై పాడుబడిన కారులో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. వీరిని స్థానిక వ్యాపారవేత్త కుటుంబంగా పోలీసులు గుర్తించారు.నామనసముద్రం గ్రామ సమీపంలో పార్క్ చేసిన వాహనం మంగళవారం సాయంత్రం నుంచి అదే స్థలంలో ఉండడం స్థానికుల పోలీసులకు సమాచారం వచ్చారు. దీంతోప రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు. అయితే బాధితులు విషం సేవించి ఉంటారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.మృతులను మణికందన్ (50) కుటుంబ సభ్యులగా గుర్తించారు. చనిపోయిన వారిలో అతని భార్య నిత్య, తల్లి సరోజ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారు నివాసముండే సేలానికి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో వీరి మృతదేహాలు కనిపించాయి. మెటల్ వ్యాపారంలో నష్టాలు రావడంతోనే వీరు ఆత్మహత్యకు పాల్పడినట్టు భావిస్తున్నారు. కారులోంచి సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్థిక కష్టాలు, ముఖ్యంగా వడ్డీ వ్యాపారుల ఒత్తిళ్లే ఈ నిర్ణయానికి దారితీసాయా అనే కోణంలో చర్యకు నెట్టివేసి ఉంటాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
ఆస్ట్రేలియాలో తెలుగు వ్యక్తి అనుమానాస్పద మృతి
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి అనుమానాస్పదం మరణం కలకలం రేపింది. షాద్ నగర్‌కి చెందిన అరటి అరవింద్ యాదవ్ అయిదు రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. మిస్సింగ్ కేసు కూడా నమోదైంది. ఈ క్రమంలో అరవింద్ సముద్రంలో శవమై తేలడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.ఇంటినుంచి వెళ్లిన అరవింద్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. సోమవారం అతని మృతదేహం సముద్రంలో కనిపించింది. సిడ్నీలోని సముద్ర తీరానికి కొద్ది దూరంలో అరవింద్ కారును కూడా గుర్తించిన పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు. అతనిది హత్యా, ఆత్మహత్యా అనేకోణంలో ఆరాతీస్తున్నారు. కుటుంబ సమస్యల కారణంగానే అరవింద్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తోంది. ఆస్ట్రేలియా పోలీసులు మృతుడి స్నేహితులు, సహా ఉద్యోగులను విచారిస్తున్నారు. అతని భార్య ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉంది.కాగా ఉద్యోగం నిమిత్తం 12 ఏళ్లుగా సిడ్నీ లో స్థిరపడ్డాడు అరవింద్ 18నెలల క్రితం వివాహం చేసుకున్న అరవింద్ భార్య, తల్లితో కలిసి ఆస్ట్రేలియా వెళ్లాడు. ఆరు రోజుల క్రితమే తల్లి షాద్‌నగర్‌కు తిరిగి వచ్చింది. ఇంతలోనే అరవింద్ కన్నుమూయడంతో మృతుడి కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.2006 ఏప్రిల్ 7న ఏలూరులో జరిగిన లారీ ప్రమాదంలో బీజేపీ నాయకుడు, అరవింద్ తండ్రి ఆరటి కృష్ణ యాదవ్ మరణించారు. ఆయన ప్రయాణిస్తున్న కారు లారీని ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. కృష్ణ భార్య, అరవింద్ తల్లి ఉషారాణి షాద్‌నగర్‌లో నివసిస్తున్నారు. భర్త మరణం తరువాత ఒక్కగానొక్కకొడుకును పెంచి పెద్ద చేసింది. పెళ్లి చేసి అంతా బావుంది అనుకుంటున్న సమయంలోనే ఇపుడు అరవింద్ కూడా దూరం కావడంతో ఆమె కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. -
ఫాంహౌస్‌లో శవమై తేలిన వ్యాపారవేత్త భార్య
కర్ణాటక: వ్యాపారవేత్త భార్య ఫాంహౌస్‌లో శవమై కనిపించింది. ఈ ఘటన రామనగర జిల్లా కగ్గలీపుర పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. శాంతి స్టీల్ ఇండస్ట్రీస్ కంపెనీ యజమాని ఉగ్రప్ప తన భార్య శాంతమ్మ(50)పేరుతో పలు వ్యాపారాలు చేస్తుండేవారు. ఉగ్రప్ప కొన్నేళ్ల క్రితం గుండెపోటుతో మృతిచెందారు. ఉన్న ఒక్క కుమారుడు కూడా రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. దీంతో శాంతమ్మ గిరిగౌడనదొడ్డిలోని ఫాంహౌస్‌లో నివసిస్తుండేది. శాంతమ్మ అక్క కుమారుడు డాక్టర్ నంజేశ్ ఆమెకు కేర్‌టేకర్‌గా ఉండేవాడు. ఏం జరిగిందో ఏమో శాంతమ్మ ఫాంహౌస్‌లో రక్తపు మడుగులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కగ్గలీపుర పోలీసులు వచ్చి పరిశీలించారు. తలపై బలంగా రాతితో బాదిన ఆనవాళ్లు కనిపించాయి. హత్య జరిగినట్లు అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. -
అమెరికాలో అదృశ్యమైన భారతీయ విద్యార్థి మృతి
అమెరికాలో భారతీయుల విద్యార్ధుల మరణాలు కలకలం రేపుతున్నాయి. జార్జియాలోని లిథోనియా నగరంలో 25 ఏళ్ల భారతీయ విద్యార్థి వివేక్ సైనీ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఓ దుండగుడు సైనీ తలపై 50 సార్లు సుత్తితో కొట్టి హతమార్చాడు. ఈ ఘటన మరవకముందే మరో విద్యార్ధి అమెరికాలో ప్రాణాలు విడిచాడు. ఇండియానా రాష్ట్రంలోని పర్డ్యూ యూనివర్సిటీలో చదువుతున్న భారతీయ విద్యార్థి నీల్ ఆచార్య మృతి చెందినట్లు మంగళవారం అధికారులు తెలిపారు. జాన్ మార్టిన్సన్ హానర్స్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్‌లో మాస్టర్స్చేస్తున్న ఆచార్య ఆదివారం నుంచి కనిపించకుండా పోయాడు. అయితే క్యాంపస్ నుంచి అదృశ్యమైన ఆచార్య మృతి చెందినట్లు పోలీసులు ధృవీకరించారు. క్యాంపస్‌లోని మారిస్ జే జుకక్రో లాబొరేటరీస్ సమీపంలో ఆదివారం ఉదయం 10:30 గంటలకు మృతదేహం లభ్యమైనట్లు తెలిపారు. మృతదేహం వద్దనున్న ఐడీ ఆధారంగా అతన్ని గుర్తించినట్లు చెప్పారు. పర్డ్యూ యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ విభాగం అధిపతి క్రిస్ క్లిఫ్టన్ కూడా నీల్ ఆచార్య మరణాన్ని ధృవీకరించారు. అయితే నీల్ ఆచార్యను ఎవరో హత్య చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. మరోవైపు 10 రోజుల వ్యవధిలో ఇద్దరు భారతీయ విద్యార్ధులు అమెరికాలో ప్రాణాలు విడవడం కలకలం రేపుతోంది. Our son Neel Acharya is missing since yesterday Jan 28( 12:30 AM EST) He is studying in Purdue University in the US. He was last seen by the Uber driver who dropped him off in Purdue university. We are looking for any info on him. Please help us if you know anything. pic.twitter.com/VWIS5uyJde — Goury Acharya (@AcharyaGoury) January 29, 2024 తల్లి విజ్ఞప్తి చేసిన మరుసటి రోజే.. తన కొడుకు ఆచూకీ కనుక్కోవాలని ఆదివారం నీల్ తల్లి గౌరీ ఆచార్య ఇన్‌స్టాగగ్రామ్ ద్వారా విజ్ఞప్తి చేశారు. తమ కొడుకు జనవరి 28 నుంచి కనిపించడం లేదని, అతను యూఎస్‌లోని పర్డ్యూ యూనివర్సిటీలో చదవుతున్నట్లు తెలిపారు. తమ కుమారుడికి సంబంధించిన సమాచారం తెలిస్తే చెప్పాలని వేడుకున్నారు. ఈ క్రమంలో చికాగోలోని భారత కాన్సులేట్ జనరల్ అప్రమత్తమయ్యారు. తాము పర్డ్యూ విశ్వవిద్యాలయ అధికారులతో మాట్లాడుతున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. అనంతరం నీల్ మృతదేహాన్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. -
బ్రహ్మ కుమారి ఆశ్రమంలో కలకలం.. ఇద్దరు మహిళల మృతి
ఆగ్రాలోని బ్రహ్మ కుమారి ఆశ్రమంలో కలకలం రేగింది. శుక్రవారం (నవంబర్ 10) రాత్రి ఇద్దరు మహిళలు (సిస్టర్స్) మృతి చెందారు. వారు ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుల దగ్గర సూసైడ్ నోట్స్ లభ్యమయ్యాయి. ఆశ్రమానికి చెందిన నలుగురు సిబ్బంది పేర్లు అందులో ఉన్నాయి. వారే తమ చావుకు కారణమని మృతులు పేర్కొన్నారు. పోలీసుల కథనం ప్రకారం.. చనిపోయిన ఇద్దరు మహిళలకు, వారి బంధువులకు మధ్య విభేదాలు ఉన్నాయి. వారు బ్రహ్మ కుమారి సంస్థ నుంచి రూ. 25 లక్షలతో పారిపోయి పొరుగున ఉన్న మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఉన్న మరొక ఆశ్రమానికి వెళ్లారు. బ్రహ్మకుమారి ఆశ్రమంలో ఇద్దరు మహిళలు చనిపోయినట్లు సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నట్లు ఖేరాఘర్ ఏసీపీ మహేష్ కుమార్ తెలిపారు. ఆ మహిళలు ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నామని, మృతుల దగ్గర సూసైడ్ నోట్లు లభ్యమయ్యాయని చెప్పారు. మృతుల దగ్గర నుంచి సూసైడ్ నోట్లు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించినట్లు పేర్కొన్నారు. దర్యాప్తు కొనసాగుతోందని, ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. -
నరహంతకుడు చచ్చాడు..ఇపుడు ఊపిరి పీల్చుకుంటున్నా!
అమెరికాలోని మైనేలో కాల్పులతో విధ్వంసం సృష్టించిన నిందితుడు శవమై తేలాడు. మైనేలో రెండు వేర్వేరు చోట్ల జరిపిన కాల్పుల్లో 16 మందిని పొట్టనపెట్టుకున్న నిందితుడు బౌడోయిన్కు చెందిన రాబర్ట్ కార్డ్ (40) తుపాకీతో తననుతాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. రెండు రోజులుగా పోలీసులు, FBI ఏజెంట్లు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే అతని మృతదేహాన్ని గుర్తించారు. కార్డ్ మృతదేహం లూయిస్టన్కు ఆగ్నేయంగా ఉన్న లిస్బన్ ఫాల్స్‌లో రీసైక్లింగ్ సెంటర్‌కు సమీపంలో గుర్తించామని మైనే పబ్లిక్ సేఫ్టీ కమీషనర్ మైక్ సౌషుక్ తెలిపారు. రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ అయిన కార్డ్ ఇంతకు ముందు పనిచేసిన చోట ఉద్యోగం కోల్పోయినట్టు తెలుస్తోందన్నారు. అతను మానసికసమస్యలకు చికిత్స పొందుతున్నట్టు సమాచారం ఉందని తెలిపారు. అలాగే కార్డ్‌కు చెందిన తెల్ల ఎస్యూవీ కారును స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. అటు ఈ ఘటనపై గవర్నర్ జానెట్ మిల్లిస్ మాట్లాడుతూ ఆ దుర్మార్గుడు మరణంతో చాలా ఇకపై ఎవరికి ముప్పు లేదని తెలిసి చాలా ఊరటగా ఉంది...కాస్త ఊపిరి పీల్చుకోగలుగుతున్నానని మిల్లిస్ ఒక వార్తా సమావేశంలో ప్రకటించారు. కాగా బుధవారం (అక్టోబరు 25) రాత్రి మైనేలోని లెవిస్టన్లోని బౌలింగ్ అల్లే, రెస్టారెంట్లో రాబర్ట్ విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో 16 మందిని చని పోయారు. వీరిలో 70 ఏళ్ల భార్యాభర్తలు, తండ్రితో పాటు హత్యకు గురైన 14 ఏళ్ల బాలుడి వరకు బాధితులను అధికారులు శుక్రవారం గుర్తించారు. ఈ ఘటనలో మరో 50-60 మంది దాకా గాయ పడిన సంగతి తెలిసిందే. 2017లో లాస్ వెగాస్ మ్యూజిక్ ఫెస్టివల్లో 60 మంది మరణించిన ఘటన, అలాగే 2022లో టెక్సాస్‌లోని ఉవాల్డేలోని ఒక ప్రాథమిక పాఠశాలలో ముష్కరుడు కాల్పులు జరిపి, 19 మంది పిల్లలు, ఇద్దరు ఉపాధ్యాయులను చంపిన ఘటన తరువాత ఇదే అత్యంత ఘోరమైన కాల్పులు కావడంతో ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. #WATCH | Maine, US: The Maine state police find the body of the suspect, Robert Card, in the shooting at multiple locations. At least 16 people were killed and 50-60 wounded in mass shootings in Lewiston, Maine in the US on Wednesday. Department Of Public Safety Commissioner… https://t.co/6g3iEBeCL8 pic.twitter.com/X73QdSNBgy — ANI (@ANI) October 28, 2023 -
బిడ్డకు ఐస్‌క్రీం కోసం వెళ్లి తల్లి దుర్మరణం: రాత్రంతా తల్లి శవం వద్దే చిన్నారి
మహారాష్ట్రలో కనిపించకుండా పోయిన గర్భిణి ఉదంతం చివరికి విషాదాంతమైంది. రాజురా-బల్లార్పూర్ రోడ్డులోని వార్ధా నది వంతెన సమీపంలో సుష్మ మృతదేహం కనిపించడంతో స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అంతేకాదు సుష్మ మృతదేహం పక్కనే ఆమె నాలుగేళ్ల కుమారుడు ఏడుస్తూ కనిపించిన దృశ్యం మరింత కలిచి వేస్తోంది. ఈ ఘనటపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన పూర్వాపరాలను పరిశీలిస్తే చంద్రాపూర్‌కు చెందిన సుష్మా కక్డే బుధవారం రాత్రి అదృశ్యమైంది. ఐస్‌క్రీం కోసం తన నాలుగేళ్ల కుమారుడితో ఇంటినుంచి బైటికి వెళ్లి ఆమె తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆమె భర్త, బ్యాంక్ ఉద్యోగి పవన్‌కుమార్, బంధువులు ఆమె కోసం వెతికారు. కానీ ఫలితం లేక పోవడంతో, బల్లార్పూర్ పోలీసులను ఆశ్రయించారు. గురువారం ఉదయం నది వంతెన సమీపంలో మృతదేహాన్ని గుర్తించామని పోలీసు ఉన్నతాధికారి రవీంద్ర సింగ్ పర్దేసి వెల్లడించారు. బుధవారం అర్థరాత్రి వంతెనపై నుండి పడి బురద ప్రాంతంలో కూరుకుపోయి ఉంటుందని పోలీసుల ప్రాథమిక అంచనా. అయితే, అన్ని కోణాల్లోనూ పరిశీలిస్తున్నామిన పరదేశి చెప్పారు. -
వివాదాస్పద యూ ట్యూబర్ అనుమానాస్పద మృతి
కొరియాకు చెందిన వివాదాస్పద యూ ట్యూబర్ , మాజీ ఎంటర్టైన్మెంట్ రిపోర్టర్,కిమ్ యోంగ్ హో అనుమానాస్పదంగా శవమై తేలాడు. కిమ్‌పై లైంగిక వేధింపుల కేసుతోపాటు అనేక క్రిమినల్ కేసులుకూడా ఉన్నట్టు తెలుస్తోంది. లైంగిక వేధింపుల కేసు విచారణలో భాగంగా బుసాన్‌లో ఉన్నాడు. మరణానికి ఒక రోజు ముందు విచారణ జరిగింది. ఈ కేసు తీర్పు నేపథ్యంలోనే అతను ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుమానిస్తున్నారు. 2019, జూలైలో హేయుండే రెస్టారెంట్లో ఒక మహిళను లైంగికంగా వేధించిన కేసులో తాజాగా ఎనిమిది నెలల జైలు శిక్ష, రెండేళ్లపాటు సస్పెన్షన్ కూడా ఖరారైంది. ఈ తీర్పు వెలువడిన తరువాత బుసాన్‌లోని హాయుండే జిల్లాలోని హోటల్లోని నాల్గవ అంతస్తులోని హోటల్ చనిపోయి కన్పించాడు. మృతదేహాన్ని స్వాధీనంచేసుకుని కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆత్మహత్యే కావచ్చని ప్రాథమికంగా అంచనా వేశారు. కిమ్ యోంగ్ హోపై లంచం, బ్లాక్ మెయిల్అనేక అరోపణలున్నాయి.వాటిలో చాలా వరకు చట్టబద్ధంగా నిజమని నిరూపితమైనాయి కూడా. ప్రధానంగా సెలబ్రిటీలను రహస్యాలను బహిర్గతం చేస్తాననంబెదిరించడం, పెద్ద మొత్తంలో డబ్బు,లగ్జరీ బ్యాగులు డిమాండ్ చేయడంలాంటి ఆరోపణలు వచ్చాయి. అలాగే కిమ్ యోంగ్ హోపై ప్రముఖ కొరియన్ నటి హాన్ యే సీల్ కూడా కేసు పెట్టారు. చివరికి 2021లో తన యూట్యూబ్ ఛానెల్‌ని కూడా మూసివేశాడు. నేనొక రాక్షసుడ్ని కాగా తన చానెల్ మూసివేత సందర్భంగా తన తప్పు ఒప్పుకుంటూ కన్నీటి పర్యంతయ్యాడు. తన మాటలతో మనుషులను పొడిచి చంపడం అలవాటు అయి పోయిందనీ, చాలామంది సబ్స్క్రైబర్లు, వ్యూస్ రావడంతో క్రూరంగా, ఒక రాక్షసుడిగా మార్చేసింది అంటూ ప్రకటించాడు. ఎవరి బలవంతం మీద తానీ పనిచేయడం లేదనీ, సిగ్గుతో శాశ్వతంగా ఈ ప్లాట్ఫారమ్నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
విషాదం : యువ సీఈవో దారుణ హత్య
ఫోర్బ్స్ అండర్ - 30 జాబితాలో స్థానం సంపాదించుకున్న టెక్ కంపెనీ సీఈవో, 26 ఏళ్ల పావ లాపెరే దారుణ హత్యకు గురయ్యారు. ఆమె నివసిస్తున్న అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లో చనిపోయి ఉండటాన్ని పోలీసులు గుర్తించినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. డేటా-క్యూరేటింగ్ కంపెనీ ఎకోమ్యాప్ టెక్నాలజీస్ కో-ఫౌండర్ లాపెరే అమెరికాలోని బాల్టిమోర్ సిటీ కౌంటీలోని ప్రముఖ అపార్ట్మెంట్ మౌంట్ వెర్నాన్లో నివసిస్తున్నారు. అయితే ఆ అపార్ట్మెంట్ సర్వీస్ విభాగం నుంచి సమాచారం అందుకున్న బాల్టిమోర్ పోలీస్ డిపార్ట్మెంట్ (BPD)అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తలమీద తీవ్ర గాయమై మరణించిన పోలీసులు గుర్తించారు. అనంతరం ఆమె మృత దేహాన్ని స్వాధీనం చేసుకొని కేసు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల అదుపులో జాసన్ డీన్ సీఈవో హత్యలో ప్రమేయం ఉందని అనుమానిస్తున్న జాసన్ డీన్ బిల్లింగ్స్లీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అధికారుల ప్రకారం, జాసన్ డీన్ అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి. హత్య చేస్తాడు. అఘాయిత్యాలకు పాల్పడతాడు. ఇతరులకు హాని కలిగించేలా అతను చేయాల్సినందతా చేస్తాడని’ తాత్కాలిక పోలీసు కమిషనర్ రిచర్డ్ వర్లీ తెలిపారు. It is with profound sadness and shock that EcoMap announces the passing of our CEO, Pava LaPere. We'll honor her legacy; please keep her family and loved ones in your thoughts and prayers. pic.twitter.com/W8PKWOCKt3 — EcoMap Technologies | The Ecosystem Company (@EcoMapTech) September 26, 2023 ఇది ఊహించ లేని విషాదం లాపెరే మరణంపై ఈ-కోమ్యాప్ టెక్నాలజీ సిబ్బంది విచారం వ్యక్తం చేస్తున్నారు.ఊహించలేని విషాదం. ఆమె మరణానికి కారణమైన పరిస్థితులు తీవ్ర బాధని కలిగిస్తున్నాయని ట్వీట్ చేసింది. ఈకోమ్యాప్ వృద్దిలో లాపెరే దూరదృష్టి, అంకిత భావం కలిగిన గొప్ప లీడర్’ అంటూ కొనియాడింది. వెలుగులోకి వచ్చిన నివేదికల ప్రకారం.. లాపెరే స్టార్టప్ కంపెనీ ఈకోమ్యాప్ టెక్నాలజీ సీఈవోగా బాధ్యతలు నిర్వహించే వారు. ఫోర్బ్స్ అండర్ 30 ధనవంతుల జాబితాలో స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ ఏడాది ఆగస్టులో, ఈకోమ్యాప్ విలువ 8 మిలియన్లకు చేరుకుందని వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. -
యూపీలో దారుణం.. హోటల్ గదిలో విగతజీవిగా వైద్యాధికారి
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో దారుణం వెలుగుచూసింది. ప్రయాగ్‌రాజ్ డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ సునీల్ కుమార్ ఓ హోటల్ గదిలో ఉరి వేసుకుని విగతజీవిగా కనిపించారు. ప్రయాగ్‌రాజ్‌లోని విఠల్ హోటల్లో సోమవారం ఉదయం జరిగింది ఈ ఘటన. హోటల్ సిబ్బంది మెడికల్ అధికారి గది తలుపులు కొట్టగా.. లోపలి నుంచి సమాధానం రాలేదు. దీంతో బలవంతంగా డోర్స్ తెరిచి చూడటంతో డిప్యూటీ సీఎంవో మృతదేహం వేలాడుతూ కనిపించిందని చెప్పారు. సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాఫీ హౌస్‌లో ఈ హోటల్ విఠల్ ఉంది. కాగా బనారస్‌కు చెందిన సునీల్ కుమార్.. అంటువ్యాధుల నోడల్ అధికారిగా నియమితులయ్యారు. ఆయన చాలాకాలంగా డిప్రెషన్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తు అనంతరం సునీల్ కుమార్ మరణానికి సంబంధించిన వివరాలు వెల్లడవుతాయని పోలీస్ అధికారులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. చదవండి: Munawar Faruqui: స్టాండప్ కమెడియన్‌కి ఊరట -
లేడీస్ హాస్టల్ సమీపంలో ఆడ శిశువు మృతదేహం కలకలం..
సాక్షి, వరంగల్: వరంగల్‌లో ఆడ శిశువు మృతదేహం కలకలం సృష్టించింది. అప్పుడే పుట్టిన బిడ్డను రోడ్డుపై పడేయడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఆడ శిశువుని పడేశారో, మరేదైనా కారణమో తెలియదు కానీ, రంగంపేటలోని డాక్టర్ గన్నుకృష్ణ మూర్తి హాస్పిటల్ పక్క వీధిలో పసి పాప మృతదేహం చూపరుల హృదయాలను ద్రవింపజేసింది. చుట్టు పక్కల హాస్పిటల్, లేడీస్ హాస్టల్ ఉండడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ సంబంధంతో పుట్టిన బిడ్డని పడేశారో, పురిట్లోనే శిశువు మృతితో పడేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంఘటన స్థలాన్ని పోలీసులు సందర్శించి శిశు మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. శిశువు పడేసిన విషయంపై ఆరా తీస్తున్నారు. చదవండి: పెళ్లయ్యాక ఆమెతో భర్త ఒక్కరోజు గడపలేదు.. మరో మహిళతో రీల్స్.. -
ఒడిశాలో మరో రష్యా పౌరుడు మృతి.. రెండు వారాల్లో మూడో ఘటన
భువనేశ్వర్: ఒడిశాలో రష్యా పౌరుల మిస్టరీ మరణాలు కలకలం సృష్టిస్తున్నాయి. ఒకే హోటల్లో ఇద్దరు రష్యన్లు మృతి చెందిన మిస్టరీ వీడకముందే రష్యాకు చెందిన మరో పౌరుడు మృతి చెందాడు. రెండు వారాల వ్యవధిలో ముగ్గురు రష్యన్లు మరణించటంతో ఇంతకి ఒడిశాలో ఏం జరుగుతోందనే ఆందోళన నెలకొంది. జగత్సింఘ్పూర్ జిల్లాలోని పారాదిప్ పోర్టులో ఓ షిప్లో మంగళవారం రష్యా పౌరుడి మృతదేహం లభ్యమైంది. ‘ఎంబీ అల్ద్నాహ్’ షిప్లో చీఫ్ ఇంజినీర్‌గా పని చేస్తున్న 51 ఏళ్ల మిలియాకోవ్ సెర్గేగా పోలీసులు గుర్తించారు. ఆ నౌక బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ పోర్టు నుంచి పారాదీప్ పోర్టు మీదుగా ముంబైకి వస్తోంది. నౌకలోని తన ఛాంబర్లో మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో మరణించినట్లు సమాచారం. అయితే, అతడి మృతికి గల కారణాలు తెలియరాలేదని, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఒకే హోటల్లో ఇద్దరు.. గతంలో దక్షిణ ఒడిశాలోని రాయగడ నగరంలో ఓ హోటల్లో ఇద్దరు టూరిస్టులు రెండు రోజుల వ్యవధిలో మరణించారు. అందులో ఒకరు రష్యా చట్ట సభ్యుడు కూడా ఉండటం గమనార్హం. వారు ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు వ్యతిరేకంగా గతంలో మాట్లాడటం చర్చకు దారి తీస్తోంది. రష్యా చట్ట సభ్యుడు పావెల్ ఆంటోవ్(65) డిసెంబర్ 24న హోటల్ మూడో అంతస్తు నుంచి పడి చనిపోయాడు. అంతకు ముందు డిసెంబర్ 22న ఆయన స్నేహితుడు వ్లాదిమిర్ బిదెనోవ్(61)హోటల్ గదిలో మృతి చెందాడు. ఈ రెండు కేసులపై ఒడిశా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి: ‘పుతిన్’ను వ్యతిరేకిస్తే అంతేనా? ఒడిశాలో మరో రష్యన్ మిస్సింగ్! -
ఈషా యోగా సెంటర్ నుంచి అదృశ్యం.. బావిలో శుభశ్రీ మృతదేహం
సాక్షి, చెన్నై : కోయంబత్తూరు ఈషాయోగా కేంద్రంలో యోగా శిక్షణకు వెళ్లి అదృశ్యమైన శుభశ్రీ మరణించింది. ఓ బావిలో ఆమె మృతదేహం ఆదివారం మధ్యాహ్నం బయట పడింది. వివరాలు.. తిరుప్పూర్‌కు చెందిన పళణి కుమార్ భార్య శుభశ్రీ గత ఏడాది డిసెంబర్లో వారం రోజుల పాటుగా ఈషాయోగా కేంద్రంలో శిక్షణ నిమిత్తం వెళ్లారు. గత నెల 18వ తేదీన ఆమె అదృశ్యమయ్యారు. ఆమె భర్త ఇచ్చిన ఫిర్యాదుతో కోయంబత్తూరు పోలీసులు తీవ్రంగా గాలించారు. సీసీ కెమెరాలలో ఆమె ఈషా యోగా కేంద్రం నుంచి బయటకు ఓ రోడ్డు మార్గంలో వెళ్తుండటం వెలుగు చూసింది. దీంతో ఆ పరిసరాలలో ఆమె కోసం గాలిస్తూవచ్చారు. ఆదివారం మధ్యాహ్నం సెమ్మేడు గాంధీ కాలనీలోని ఓ పాడు పడ్డ బావిలో మహిళ మృత దేహం బయట పడింది. పరిశీలనలో ఆ మృతదేహం శుభశ్రీగా తేలింది. శిక్షణకు వెళ్లిన శుభశ్రీ, యోగా కేంద్రం నుంచి బయటకు వచ్చేయడం, ఆ తర్వాత అదృశ్యం కావడం, ప్రస్తుతం మృతదేహంగా బావిలో తేలడం మిస్టరీగా మారింది. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోయంబత్తూరు ఆసుపత్రికి తరలించిన పోలీసులు విచారణను వేగవంతం చేశారు. -
కాలేజీకి వెళ్లి కనబడకుండా పోయిన నవ వధువు.. చివరికి!
బెంగళూరు: కాలేజీకి వెళ్లి కనబడకుండాపోయిన నవ వధువు నదిలో శవంగా లభించిన సంఘటన కలబుర్గి జిల్లా కమలాపుర తాలూకా కురికోటా గ్రామంలో చోటుచేసుకుంది. నావదగి గ్రామానికి చెందిన సృష్టి మారుతి (21) మృతి చెందిన నవ వివాహిత. డిగ్రీ 5వ సెమిస్టర్ చదువుతున్న సృష్టికి ఇటీలే వివాహం జరిగింది. ఇంట్లో ఉంటూ చదువు కొనసాగిస్తున్న సృష్టి ఈనెల 13న కాలేజీకి వెళ్లి వస్తానని చెప్పి తిరిగి రాలేదు. ఆ రోజంతా బంధువుల ఇళ్లు, చుట్టుపక్కల ప్రాంతాలు వెదికిన కుటుంబ సభ్యులు మరసటి రోజు మహాగాంవ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసారు. ఇలా ఉండగా శనివారం సృష్టి మృత కురికోటా వంతెన వద్ద నదిలో లభించింది. సృష్టి ఆత్మహత్య చేసుకుందా? లేక ఎవరైనా హత్య చేసారా అనే విషయం తెలియాల్సి ఉంది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: చిన్నమ్మతో బుజ్జమ్మ ఢీ -
గుట్టలు గుట్టలుగా కోతుల మృతదేహాలు.. అసలు ఏం జరిగింది?
కవిటి(శ్రీకాకుళం జిల్లా): కవిటి మండలంలోని శిలగాం వద్ద అల్లేరు కాలనీ సమీపంలో మంగళవారం ఉదయం 45 వానరాల(కోతులు) కళేబరాలు కనిపించడం స్థానికంగా కలకలం సృష్టించింది. ఇక్కడికి సమీపంలోని ఉద్దానం ప్రాంతంలో సాధారణంగా కొండముచ్చులు ఎక్కువగా తిరుగుతుంటాయి. కోతుల సంచారం తక్కువగా ఉంటుంది. అలాంటిది శిలగాం గ్రామం వెలుపల ముళ్లపొదల్లో ఒకేచోట 45 వానరాల మృతదేహాలు గుట్టగా కనిపించడంతో స్థానికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. చదవండి: విజయవాడ మీదుగా 100 ప్రత్యేక రైళ్లు గ్రామ సచివాలయ ఉద్యోగులు ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించారు. ఈ కోతులను చనిపోయాక ఎవరో సోమవారం అర్ధరాత్రి తీసుకువచ్చి పడేసినట్లుగా ఉందని స్థానికులు చెబుతున్నారు. మండల పశువైద్యాధికారి డాక్టర్ బి.శిరీష బృందం వానర కళేబరాలకు పోస్టుమార్టం నిర్వహించింది. నమూనాలను ప్రయోగశాలకు పంపించినట్లు డాక్టర్ తెలిపారు. వానరాల శరీరం అంతా తీవ్రగాయాలతో ఉన్నాయని, వాటిలో గర్భం దాల్చినవి కూడా ఉన్నాయని చెప్పారు. చాలావరకు వానరాల పిల్లలే మృత్యువాత పడ్డాయన్నారు. -
కారు బ్యాక్ సీట్లో విగతజీవిగా ప్రముఖ సింగర్..
ప్రముఖ సింగర్ వైశాలి బల్సారా అనుమానాస్పద రీతిలో మృతిచెందడం కలకలం రేపుతోంది. గుజరాత్‌లోని వల్సాద్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. వివరాల్లోకి వెళ్లితే.. గుజరాత్‌లోని వల్సాద్ జిల్లాలో ప్రముఖ గాయని వైశాలి బల్సారా మృతదేహం అనుమానాస్పద రీతిలో ఓ కారులో లభ్యమైంది. పార్ నదీ ఒడ్డున కారు చాలాసేపు ఆగి ఉండటంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కారు డోర్ లాక్ ఓపెన్ చేసి చూడగా బ్యాక్ సీట్లో ఓ మృతదేహం కనిపించింది. అది గాయని వైశాలి బల్సారాగా పోలీసులు గుర్తించారు.పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. కాగా వైశాలి భర్త హితేశ్ కూడా సింగరే. ఇద్దరూ కలిసి పలు స్టేజ్ షోల్లో పాల్గొన్నారు. శనివారం అర్థరాత్రి 2గంటలకు తన భార్య కనిపంచడం లేదని హితేశ్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సింగర్ వైశాలి అనుమానాస్పద మృతి వెనుక ఎవరి హస్తం ఉందన్నదానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా సింగర్ వైశాలి మృతి పట్ల సినీ ప్రముఖులు సహా నెటిజన్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. -
మహంత్ నరేంద్ర గిరి అనుమానాస్పద మృతి.. ప్రధాని సంతాపం
-
మహంత్ నరేంద్ర గిరి అనుమానాస్పద మృతి.. ప్రధాని సంతాపం
అలహాబాద్: అఖిల భారతీయ అఖాడా పరిషత్ అధ్యక్షుడు మహంత్ నరేంద్ర గిరి సోమవారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అలహాబాద్‌లోని బాగంభరీ మఠంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మఠంలో ఓ గెస్టుహౌస్‌లోని గదిలో ఉరికి వేలాడుతుండగా ఆయన శిష్యులు గుర్తించినట్లు ఐజీ కె.పి.సింగ్ చెప్పారు. ఘటనా స్థలంలో ఎనిమిది పేజీల సూసైడ్ నోట్ లభించినట్లు తెలిపారు. మానసికంగా కృంగిపోయానని, అందుకే తనువు చాలిస్తున్నట్లు ఆ లేఖలో నరేంద్ర గిరి రాశారని వెల్లడించారు. తన శిష్యుల్లోని ఆనంద్ గిరి, మరికొందరి తీరు పట్ల మనస్తాపానికి గురయ్యానంటూ అందులో ఉందని అన్నారు. ‘సమాధి’ గురించి రాశారని వివరించారు. శిష్యులు నిర్వర్తించాల్సిన బాధ్యతలను సదరు సూసైడ్ నోట్లో ప్రస్తావించారని పేర్కొన్నారు. ప్రాథమిక ఆధారాలను బట్టి చూస్తే ఇది ఆత్మహత్య అని తెలుస్తోందని చెప్పారు. పోస్టుమార్టం, ఫోరెన్సిక్ టెస్టుల నివేదిక అందిన తర్వాత పూర్తి స్పష్టత వస్తుందని తెలిపారు. నరేంద్ర గిరి అంత్యక్రియలపై అఖాడా పరిషత్ పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. నరేంద్ర గిరి ఈ ఏడాది ఏప్రిల్‌లో కరోనా వైరస్ బారినపడ్డారు. ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. ఆయన నిరంజనీ అఖాడాకు కూడా అధినేతగా వ్యవహరిస్తున్నారు. చదవండి: రన్నింగ్ ట్రైన్ ఎక్కుతూ కింద పడిపోయిన మహిళ.. అదృష్టం బాగుండి.. సూసైడ్ నోట్లో నరేంద్ర గిరి ప్రస్తావించిన ఆనంద్ గిరి అనే శిష్యుడిని ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. గురూజీ ఆత్మహత్య చేసుకోలేదని, ఆయనతో 15 రోజుల క్రితం మాట్లాడానని, డబ్బు కోసం ఆయనను కొందరు వేధించారని, తనకు వ్యతిరేకంగా పెద్ద కుట్ర జరుగుతోందని, ఈ కుట్రలో పోలీసులు, ల్యాండ్ మాఫియా భాగస్వాములని, విచారణకు సహకరిస్తానని, తాను తప్పు చేసినట్లుగా తేలితే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని ఆనంద్ గిరి చెప్పాడు. దేశంలో సాధువులకు సంబంధించి అతిపెద్ద సంస్థ అఖిల భారతీయ అఖాడా పరిషత్. మహంత్ నరేంద్ర గిరి మరణం పట్ల ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. చదవండి: కుటుంబం ఆత్మహత్య: అతని వివాహేతర సంబంధమే కారణమా? अखाड़ा परिषद के अध्यक्ष श्री नरेंद्र गिरि जी का देहावसान अत्यंत दुखद है। आध्यात्मिक परंपराओं के प्रति समर्पित रहते हुए उन्होंने संत समाज की अनेक धाराओं को एक साथ जोड़ने में बड़ी भूमिका निभाई। प्रभु उन्हें अपने श्री चरणों में स्थान दें। ॐ शांति!!— Narendra Modi (@narendramodi) September 20, 2021 -
మరో విషాదం: ప్రముఖ టీవీ నటుడు ఆత్మహత్య
TV Actor Ramesh Valiyasala Death: సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మలయాళ సినీ, టీవీ నటుడు రమేశ్ వలీయశాల (54) ఆత్మహత్య చేసుకున్నారు. ఇటీవల బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ శుక్లా అకాల మరణం మరవక ముందే మరో నటుడి మృతి సినీ పరిశ్రమలో కలకలం రేపుతోంది. 22 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ఈ సీనియర్ నటుడు శనివారం (సెప్టెంబర్ 11) ఉదయం తిరువనంతపురంలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఆయన మరణ వార్తతో మాలీవుడ్ చిత్ర పరిశ్రమ విషాద ఛాయలు అలుముకున్నాయి. చదవండి: Sai Dharam Tej: దాని వల్లే తేజ్‌కు ప్రాణాపాయం తప్పింది సోషల్ మీడియా వేదికగా నటీనటులు, దర్శక-నిర్మాతలు ఆయన కుటుంబానికి సంతాపం తెలుపుతూ రమేశ్ మృతికి నివాళులు ఆర్పిస్తున్నారు. కేరళ పరిశ్రమలో వరుసగా సీరియల్స్, సినిమాలు చేస్తూ నటుడిగా ఫుల్ బిజీగా ఉండే ఆయన ఆత్మహత్య చేసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా రెండు రోజుల క్రితం రమేశ్ వలీయశాల షూటింగ్ నుంచి తిరిగి ఇంటికి వచ్చారని, ఇలా ఈ రోజు జీవిచ్చవంలా కనిపించడంతో అతడి సహ నటీనటులు జీర్ణించుకోలేకపోతున్నారు. చదవండి: కన్స్ట్రక్షన్ కంపెనీ, మున్సిపాలిటీపై కూడా కేసు పెట్టాలి: ఆర్పీ -
బాలుడి మిస్సింగ్ కేసు విషాదాంతం.. ప్రమాదమా? హత్యా?
సాక్షి, హైదరాబాద్: రాజేంద్ర నగర్లో కలకలం రేపిన బాలుడి మిస్సింగ్ విషాదాంతమైంది. జలాల్‌బాబానగర్‌లో శుక్రవారం ఉదయం రెండేళ్ల బాలుడు అబుబకర్ కిడ్నాప్‌నకు గురైన విషయం తెలిసిందే. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి ఒక్కసారిగా కనిపించకపోవడంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు చుట్టుపక్కలంతా గాలించారు. అయినా ఆచూకీ తెలియకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇంతలోనే విషాద ఘటన వెలుగుచూసింది. ఇంటి సమీపంలోని స్మశాన వాటిక నీటి గుంటలో శనివారం బాలుడు శవమై తేలాడు. వెంటనే బాలుడి తల్లిదండ్రులు రాజేంద్ర నగర్లో పోలీసులకు సమాచారమివ్వడంతో బాలుడిది హత్యా లేక ప్రమాదమా అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు. తమ చిన్నారి విగతజీవిగా కనిపించడంతో కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. బాలుడిని చంపేసి నీటి గుంటలో పడేసి ఉంటారని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. -
బిట్స్ పిలానీ డిప్యూటీ రిజిస్ట్రార్ అనుమానాస్పద మృతి
జైపూర్: బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) డిప్యూటీ రిజిస్ట్రార్ అనుమానాస్పద మరణం కలకలం రేపుతోంది. హర్యానాకు చెందిన ఆర్సీ డాగర్ బిట్స్ క్యాంపస్‌లోని అతని నివాస గృహంలో ఉరివేసుకుని చనిపోయారు. రాజస్థాన్‌లోని జుంజు జిల్లాలో గురువారం ఉదయం ఈ విషాదం చోటు చేసుకుంది. డాగర్ ప్రస్తుతం యాక్టింగ్ రిజిస్ట్రార్ బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నారు. డాగర్ మరణం సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్య చేసుకున్నట్టుగా అనుమానిస్తున్నామనీ పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలిపారు. పనిభారం కారణంగా డాగర్ మానసిక ఒత్తిడికి గురయ్యాడని అతని సోదరి ఆరోపించారని పేర్కొన్నారు. ఈ విషయంపై విచారణ జరుగుతోందన్నారు. -
భారీ కుంభకోణం : బ్యాంకు మాజీ సీఈఓ ఆత్మహత్య?
సాక్షి, బెంగళూరు : కోట్ల రూపాయల బ్యాంకు కుంభకోణం కేసులో నిందితుడు, గురు రాఘవేంద్ర బ్యాంక్ మాజీ సీఈఓ వాసుదేవ్ మైయా (70) అనుమానాస్పద మరణం కలకలం రేపుతోంది. సోమవారం సాయంత్రం నగరంలోని తన ఇంటి వెలుపల పార్క్ చేసిన కారులో చనిపోయి కనిపించారు. దీనిపై కేసు నమోదు చేసిన సుబ్రమణ్యపుర పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్య చేసుకున్నారనే అనుమానాలు వ్యక్తమవు తున్నప్పటికీ, కారణాలను పోలీసులు ఇంకా నిర్ధారించలేదు. 2012-2018వరకు పదవీలో కొనసాగిన వాసుదేవ్ పైభారీ అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై ఆర్బీఐ దర్యాప్తులో1400 కోట్ల రూపాయల అవకతవకలు వెలుగు చూశాయి. ఈ క్రమంలో అతనిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ తదితర విభాగాలు మోసం, ఫోర్జరీ కేసు నమోదు చేసాయి. ఈ కేసు దర్యాప్తులో భాగంగా జూన్ 18 న అవినీతి నిరోధక బ్యూరో (ఏసీబీ) శ్రీ గురు రాఘవేంద్ర కోఆపరేటివ్ బ్యాంక్ కు చెందిన ఐదు కార్యాలయాలు, బ్యాంక్ చైర్మన్ కె రామకృష్ణ నివాసాల వద్ద కూడా శోధనలు జరిపినట్లు తెలుస్తోంది. దీంతో దర్యాప్తునకు భయపడిన వాసుదేవ్ మైయా విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. కాగా రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా 1400 కోట్ల రూపాయల ఆర్థిక అవకతవకలపై ఈ ఏడాది జనవరిలో దర్యాప్తు ప్రారంభించింది. అలాగే ఆర్బీఐ ఆరు నెలలపాటు ఆంక్షలు విధించింది. డిపాజిటర్ ఉపసంహరణ మొత్తాన్ని35 వేల రూపాయలకు పరిమితం చేసింది. ఆ తరువాత గత నెలలో ఈ పరిమితిని ఒక లక్ష రూపాయలకు పెంచింది. ఈ సందర్భంగా కరోనా వైరస్ ఆంక్షలు ఉన్నప్పటికీ, చాలా మంది సీనియర్ సిటిజన్లు తమ డబ్బులను ఉపసంహరించుకునేందుకు బ్యాంకు ముందు క్యూలు కట్టారు. -
కరోనా భయం : ఐఆర్ఎస్ అధికారి ఆత్మహత్య
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రత్యక్షంగా పరోక్షంగా మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. తన మూలంగా కుటుంబానికి కరోనా వైరస్ సోకుతుందేమో అన్న భయంతో ఢిల్లీలో ఒక సీనియర్ అధికారి ఆత్మహత్యకు పాల్పడిన వైనం విషాదాన్ని నింపింది. నెగిటివ్ రిపోర్ట్ వచ్చినప్పటికీ మహమ్మారి సోకుతుందేమోనని ఆందోళన అధికారి ప్రాణాలను బలిగొంది. పోలీసు ఉన్నతాధికారి అందించిన సమాచారం ప్రకారం ఆదాయపు పన్నుఅధికారి శివరాజ్ సింగ్ (56)కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నారు. దీంతో గతవారం కోవిడ్-19 పరీక్ష చేయించుకున్నారు. అయితే కరోనా వైరస్ పాజిటివ్ రిపోర్టు వస్తుందనే భయంతో శివరాజ్ ఆదివారం విషం (యాసిడ్ లాంటి ద్రవం) తాగి ఉసురు తీసుకున్నారు. అంతేకాదు తన కుటుంబానికి కూడా ఈ ఘోరమైన వైరస్ సోకుతుందన్న భయం ఆయనను వెంటాడింది. ఈ మేరకు ఆయన రాసిన ఒక సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని, పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబానికి అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. కాగా 2006 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి శివరాజ్ సింగ్ ఢిల్లీ ఆర్కె పురంలో ఆదాయపు పన్ను కమిషనర్‌గా (సీఐటిగా) పనిచేస్తున్నారు. చదవండి : మరో విషాదం : 2020.. దయచేసి ఇక చాలు! -
గర్భిణీ సహా రెండు ఏనుగుల మృతి
రాయ్‌పూర్ : కేరళలో గర్భంతో ఉన్న ఏనుగు మృతి ఘటన మరువక ముందే ఛత్తీస్‌గడ్‌లోనూ మరో ఘటన వెలుగు చూసింది. రాయ్‌పూర్‌కు దాదాపు 400 కిలోమీటర్ల దూరంలో ప్రతాపూర్ అటవీ ప్రాంతంలో రెండు ఏనుగుల మృతదేహాలు లభించినట్లు బుధవారం అటవీ అధికారులు పేర్కొన్నారు. వీటిలో ఒకటి 20 నెలల గర్భంతో ఉన్నట్లు తెలిపారు. ప్రతాపూర్ అటవీ పరిధిలోని గణేష్‌పూర్ ప్రాంతంలో వేర్వేరు ప్రదేశాల్లో రెండు ఏనుగుల మృతదేహాలు లభ్యమయ్యాయని అటవీశాఖ అదనపు ఛీప్ అరుణ్ కుమార్ పాండే పేర్కొన్నారు. గర్భంతో ఉన్న ఏనుగు కాలేయ సంబంధిత సమస్యలతో చనిపోయినట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలిందని చెప్పారు. మృతదేహాల వద్ద భారీగా మిగతా ఏనుగులు గుమి కూడటంతో మరో ఏనుగు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించలేకపోయామని జిల్లా అటవీ అధికారి ఒకరు వెల్లడించారు. (పరిస్థితి ఆందోళనకరం: అమిత్ షాతో భేటీ ) Two female elephants have died in Surajpur Forest Division in the State of Chhattisgarh. CWLW, Chhattisgarh is visiting the area and ascertaining the facts. State Forest Department is requested to take action as appropriate and appraise the facts to the Ministry, immediately. — MoEF&CC (@moefcc) June 10, 2020 గత కొన్ని రోజులుగా ఏనుగుల మంద సంచరిస్తుందని మరో ఏనుగు మృతికి గత కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని అటవీ అధికారులు తెలిపారు. ఇక ఈ ఘటనపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఛత్తీస్గడ్ అటవీ శాఖ అధికారులను కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన నివేదికను సమర్పించాల్సిందిగా కోరింది. ఇక కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో పేలుడు పదార్థం నిండిన పైనాపిల్ తినడంతో గర్భిణీ ఏనుగు చనిపోయిన సంగతి తెలిసిందే. (జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు: గడ్కరీ ) . -
శవాల గుట్టలా గొర్రెకుంట బావి..
-
నటుడు, అతడి ప్రియురాలు మృతి
లాస్‌వెగాస్: హాలీవుడ్లో విషాదం చోటు చేసుకుంది. నటుడు గ్రెగొరీ టైరీ బోయ్స్(30), అతడి ప్రియురాలు నటాలీ అడెపోజు(27) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. లాస్వెగాపస్లోని గ్రెగొరీ టైరీ బోయ్స్ నివాసంలో వీరిద్దరి మృతదేహాలను గుర్తించారు. వీరు ఆత్మహత్య చేసుకున్నారా, మరేదైనా కారణం ఉందా అనేది తెలియరాలేదు. వీరిద్దరి మృతదేహాలు పక్కపక్కనే ఉన్నాయి. ఘటనా స్థలంలో పౌడర్ లాంటి తెల్లటి పదార్థం దొరికిటనట్టు స్థానిక మీడియా వెల్లడించింది. అయితే ఇది క్రిమినల్ సంఘటన కాదని పోలీసులు పేర్కొన్నారు. టాక్సికాలజీ నివేదిక కోసం తాము ఎదురు చూస్తున్నామని తెలిపారు. వీరిద్దరూ ఏడాది కాలంగా కలిసివుంటున్నారని సమాచారం. బోయిస్‌కు పదేళ్ల కుమార్తె, అడెపోజుకు కొడుకు ఉన్నాడు. 2008లో వచ్చిన ట్విలైట్ సినిమాలో గ్రెగొరీ టైరీ బోయ్స్ తొలిసారిగా నటించాడు. ఈ సినిమాలో టైలర్ క్రౌలీ పాత్రలో అతడు కనిపించాడు. బోయిస్ మృతి పట్ల అతడి కుటుంబ సభ్యులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. నన్ను ఎందుకు వదిలి వెళ్ళావు? అంటూ బోయిస్ తల్లి లిసా వేన్ తల్లడిల్లారు. బోయిస్, అడెపోజు వెస్ట్ కోస్ట్ రాపర్స్ పేరిట చికెన్ వింగ్స్ వ్యాపారాన్ని ప్రారంభించే పనిలో ఉన్నారని ఆమె వెల్లడించారు. బోయిస్ మృతి పట్ల ట్విలైట్ అభిమానులు సంతాపం తెల్పుతున్నారు. -
మైనర్ అదృశ్యం: ‘జూ’ బోనులో ముక్కలై
లాహోర్ : కనిపించకుండాపోయిన బాలుడు స్థానిక జూలోని సింహపుబోనులో ముక్కలై కనిపించడం కలకలం రేపింది. లాహోర్ సఫారి పార్క్‌లో సోమవారం ఈ విషాదం చోటు చేసుకుంది. సఫారి పార్క్ లాహోర్ డైరెక్టర్ చౌదరి షాఫ్కత్ అందించిన సమాచారం ప్రకారం మరణించిన మైనర్ బాలుడిని బిలాల్ (18) గా గుర్తించారు. అతని బట్టలు ఆధారంగా బాలుడుని తండ్రి గుర్తించగా, అయితే బోనులోకి బిలాల్ ఎలా ప్రవేశించాడనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలుడిని హత్య చేసి అనంతరం బోనులోకి విసిరి వుంటారా అనే అంశంపై కూడా ఆరా తీస్తున్నారు. సోమవారం నుంచి తమ కుమారుడు కనిపించకుండాపోవడంతో కుటుంబ సభ్యులు బుధవారం ఉదయం పార్క్ అధికారులను సంప్రదించారు. దీంతో మృతదేహానికి సంబంధించిన తల, చేతులు లాంటి శరీర భాగాలను సింహం బోనులో జూ అధికారులు కనుగొన్నారు. దీంతో పాటు కొడవలి, గడ్డిని కూడా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. గడ్డి కోసుకునేందుకు జూ ఫెన్సింగ్ గోడ ఎక్కి పార్కులోకి ప్రవేశించినపుడు బాలుడిపై సింహాలు దాడి చేసి వుంటాయని జూ అధికారులు భావిస్తున్నారు. కాగా బిలాల్ మామయ్య ఇదే పార్కులో ఉద్యోగిగా ఉన్నాడు. -
విషాదం : మాజీ సీఎం కుమారుడి అనుమానాస్పద మృతి
ఇటానగర్: అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కలిఖో పుల్ కుమారుడు షుబన్సో అనూహ్య రీతిలో మరణించారు. కెనడా విశ్వవిద్యాలయంలో చదువుతున్న షుబన్సో ఫుల్ (20) అనుమానాస్పద పరిస్థితులలో చనిపోయినట్లు కుటుంబ వర్గాలు మంగళవారం తెలిపాయి. దీంతో 2016లో ఆత్మహత్యకు పాల్పడిన కలిఖో ఫుల్ ఇంట్లో తీరని విషాద ఛాయలు అలుముకున్నాయి. కలిఖో మొదటి భార్య డాంగ్విమ్సాయ్ కుమారుడైన షుబాన్సో సస్సెక్స్‌లోని బ్రైటన్‌లోని తన అపార్ట్మెంట్లో శవమై కనిపించడం కుటుంబ వర్గాలను కలవరపర్చింది. అతని మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు యూకేలోని భారత హైకమిషన్‌తో సంప్రదిస్తున్నామని తెలిపారు. కాగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డావంటూ 2015 ఏప్రిల్‌లో షో కాజ్ నోటీసు కూడా యివ్వకుండా కాంగ్రెస్ పార్టీ ఫుల్‌ను ఆరేళ్లపాటు పార్టీ నుంచి బహిష్కరించడంతో 19 ఫిబ్రవరి 2016న 30మంది రెబెల్ ఎమ్మెల్యేలు, బీజేపీ మద్దతుతో కలిసి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. అయితే, ఈ నియామకానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ఆవేదనకు లోనైన ఫుల్ ఆగస్టు 9, 2016 న నీతి విహార్‌లోని తన అధికారిక నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం ఒక విషాదం. ఈ సందర్భంగా రాష్ట్రంలోచోటుచేసుకున్న భారీ అవినీతిపై ''మేరే విచార్'' (నా ఆలోచనలు) పేరుతో అనే 60 పేజీల సూసైడ్ నోట్ రాశారు. ఈ నోట్లో పేర్కొన్న అవినీతి ఆరోపణలపై దర్యాప్తు కోరుతూ మొదటి భార్య డాంగ్విమ్సాయ్ పుల్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే ఆ తరువాత జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ తరపున ఆయన మూడవ భార్య దాసాంగ్లు విజయం సాధించారు. -
అంబానీ ఇంట్లో అనుమానాస్పద మృతి
సాక్షి, ముంబై: రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఇంట్లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) కమాండో అనుమానాస్పద మృతి కలకలం రేపింది. అంబానీ సెక్యూరిటీ కోసం నియమించిన ఆయన అనూహ్యంగా శవమై తేలారు. దక్షిణ ముంబైలోని వ్యాపారవేత్త విలాసవంతమైన ‘ఆంటాలియా’ నివాసంలో కానిస్టేబుల్ బొతారా డి రాంభాయ్ తుపాకీతో తనని తాను కాల్చుకుని బుధవారం రాత్రి చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే అతడు ఆత్మహత్య చేసుకున్నాడా, లేక అతని చేతిలోని ఆయుధం ప్రమాదవశాత్తూ పేలి చనిపోయాడా అనేది అధికారులు పరిశీలిస్తున్నారు. అయితే ప్రాథమికంగా ఆత్మహత్యగా భావిస్తున్నామన్నారు. మృతుడిని గుజరాత్‌లోని జునాగడ్ జిల్లాకు చెందిన రాంభాయ్గా గుర్తించారు. అతను 2014లో సీఆర్పీఎఫ్లో చేరాడు. వీఐపీ సెక్యూరిటీలో భాగంగా అంబానీకి 'జెడ్ +' కేటగిరీ కింద సెక్యూరిటీ కల్పిస్తోంది సీఆర్పీఎఫ్. అంబానీ భార్య నీతా అంబానీకి కూడా 'వై' కేటగిరీ కల్పిస్తున్నసంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ముకేశ్ అంబానీ సెక్యూరిటీ బృందంలో రాంభాయ్ని సీఆర్పీఎఫ్ నియమించింది. అయితే అనూహ్యంగా రాంభాయ్ శవంగా మారడం ఆందోళన రేపింది. అసలు ఏం జరిగిందనే దానిపై పూర్తి సమాచారం అందాల్సి వుంది. -
విహారయాత్రలో విషాదం
ఖాట్మండ్ : విహారయాత్ర వారి జీవితాలనే బలితీసుకుంది. నేపాల్ సందర్శనకు వెళ్లిన 8 మంది భారతీయులు అక్కడి హోటల్ రూమ్‌లో విగత జీవులుగా కనిపించారు. వారిని ఎయిర్ అంబులెన్స్‌లో ఖాట్మండ్‌లోని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. మృతుల్లో నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు. వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన 15 మంది హాలిడే కోసం నేపాల్ వెళ్లారు. అక్కడ ఎవరెస్ట్ పనోరమ హోటల్లో 4 రూమ్‌లను బుక్ చేసుకున్నారు. వారిలో ఎనిమిది మంది ఒక రూమ్‌లో.. మిగిలినవారు ఇతర రూమ్‌ల్లో ఉన్నారు. ఒక రూమ్‌లో ఉన్న 8 మంది గదిలో వెచ్చదనం కోసం గ్యాస్ హీటర్‌ను ఆన్ చేశారు. అయితే అది సరిగా పనిచేయకపోవడంతో గ్యాస్ లీకైంది. దీంతో ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారడంతో వారు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మరణించినవారిలో ప్రవీణ్ కృష్ణన్ నాయర్, అతని భార్య శరణ్య వారి ముగ్గురు పిల్లలు శ్రీభద్ర, అర్చన, అభి నాయర్, ప్రవీణ్ స్నేహితుడు రెంజిత్ కుమార్, అతని భార్య ఇందు, వారి కుమారుడు వైష్ణవ్ ఉన్నారు. అయితే కుమార్, ఇందుల మరో కుమారుడు మాధవ్ వేరే రూమ్‌లో పడుకోవడంతో.. అతనికి ప్రాణప్రాయం తప్పినట్టుగా సమాచారం. కాగా, ప్రవీణ్ దుబాయ్‌లో ఉద్యోగం చేస్తుండగా.. శరణ్య మాత్రం కొచ్చిలో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న కేరళ సీఎం పినరయి విజయన్ విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్‌తో మాట్లాడారు. మృతదేహాల తరలింపుతోపాటు, మిగిలిన పర్యాటకులకు సాయం అందించాల్సిందిగా కోరారు. -
అనుమానాస్పద స్థితిలో జర్నలిస్ట్ మృతి
హరిద్వార్ : ఢిల్లీకి చెందిన జర్నలిస్ట్ అనుజ గుప్తా అనుమానస్పద స్థితిలో మృతిచెందారు. శనివారం నుంచి కనిపించకుండా పోయిన అనుజ్ గుప్తా ఉత్తరాఖండ్‌లోని హరిద్వారాలో శవమై కనిపించారు. గంగ్నహర్ కాలువపై ఉన్న పాత్రి పవర్‌హౌజ్ వద్ద ఆయన మృతదేహాన్ని గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. అనుజ్ ఢిల్లీ ద్వారకాలోని సత్యం అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. అయితే శనివారం సాయంత్రం ఆయన హరిద్వార్‌లోని ఓ హోటల్‌కి వెళ్లారు. ఆ తర్వాత బయటకు వెళ్లిన అనుజ్.. రాత్రి సమయంలో హోటల్ రూమ్‌కు తిరిగివచ్చారు. అయితే ఆదివారం ఉదయం 11 గంటలైనప్పటికీ అతను తన రూమ్ డోర్ తీయలేదు. దీంతో అనుమానం వచ్చిన హోటల్ సిబ్బంది.. డోర్లు కొట్టి చూసినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదు. వెంటనే హోటల్ సిబ్బంది బుకింగ్‌లో అనుజ్ ఇచ్చిన ఫోన్ నెంబర్‌కు కాల్చేశారు. కానీ ఆ ఫోన్ ఎత్తిన అనుజ్ కుమారుడు తన తండ్రి శనివారం నుంచి కనిపించడం లేదని, ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశామని హోటల్ సిబ్బందికి తెలిపాడు. దీంతో హోటల్ సిబ్బంది.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం వారి సమక్షలంలో అనుజ్ రూమ్‌ను తెరిచారు. అందులో అతడు కనిపంచలేదు.. అయితే ఫ్లోర్‌పై మాత్రం రక్తపు మరకలను పోలీసులు గుర్తించారు. అనంతరం సీసీటీవీ దృశ్యాలు పరిశీలించిన పోలీసులు గుప్తా రాత్రి 11 గంటలకు హోటల్ రూమ్ నుంచి బయటకు వెళ్లినట్టు గుర్తించారు. కాగా, అనుజ్ ఎడమ చేతి మణికట్టుపై బ్లేడుతో కోసిన గాయాలు ఉండటం, హోటల్ రూమ్‌లో బ్లేడ్ లభించడంతో అతను అత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అయితే అన్ని కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. పోస్టుమార్టమ్ అనంతరం అనుజ్ మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
అమెరికాలో నలుగురు తెలుగువారు దుర్మరణం
వెస్ట్‌డెస్ మోయిన్స్: అమెరికాలోని ఐయోవా రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. ఇక్కడి వెస్ట్‌డెస్ మోయిన్స్‌లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు తెలుగువారు అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. మృతుల శరీరంపై తుపాకీ బుల్లెట్ల గాయాలున్నాయి. ఈ విషయమై నగర పోలీస్ సార్జంట్ డాన్ వేడ్ మాట్లాడుతూ..‘యాష్‌వర్త్ రోడ్డు–అస్పెన్ డ్రైవ్‌ల మధ్య ఉన్న 65 స్ట్రీట్‌లోని ఓ ఇంట్లో సమస్య ఉందని శనివారం ఉదయం 10 గంటలకు(స్థానిక కాలమానం ప్రకారం) 911కు ఫోన్‌కాల్ వచ్చింది. దీంతో మా యూనిట్లు ఘటనాస్థలికి చేరుకున్నాయి. ఇంట్లో బుల్లెట్ గాయాలతో రక్తపు మడుగులో ఉన్న నలుగురి మృతదేహాలను గుర్తించాం. ఈ దుర్ఘటనలో చంద్రశేఖర్ సుంకర(44), లావణ్య సుంకర(41)తో పాటు 15, పదేళ్ల వయసున్న ఇద్దరు అబ్బాయిలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఎలా జరిగిందన్న విషయమై ఇంకా స్పష్టత రాలేదు. వీరి ఇంటికి వచ్చిన బంధువుల్లో ఒకరు నలుగురి మృతదేహాలను చూడగానే భయంతో బయటకు పరుగులు తీశారు. అనంతరం అటుగా వెళుతున్నవారి సాయంతో పోలీసులకు సమాచారం అందించారు’అని తెలిపారు. రియల్ ఎస్టేట్ రికార్డుల ప్రకారం లావణ్య–చంద్రశేఖర్ ఈ ఇంటిని 2019, మార్చి 25న కొనుగోలు చేశారని వెల్లడించారు. పోస్‌మార్టం తర్వాతే మరణానికి గల కారణాన్ని అధికారికంగా చెప్పగలమన్నారు. ఈ దుర్ఘటనపై విచారణ కొనసాగుతోందని పేర్కొన్నారు. వెస్ట్‌డెస్ మోయిన్స్‌లో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయనీ, ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని చెప్పారు. కాగా, ముగ్గురు కుటుంబ సభ్యులను చంద్రశేఖరే కాల్చిచంపాడనీ, అనంతరం తనను తాను కాల్చుకున్నాడని కొందరు స్థానికులు తెలిపారు. ఆయన గతకొంతకాలంగా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారని వెల్లడించారు. అయితే ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించలేదు. -
అదృశ్యమైన మహిళ.. ఇంట్లోని వాటర్ సంపులో..
-
అదృశ్యమైన మహిళ.. ఇంట్లోని వాటర్ సంపులో..
సాక్షి, హైదరాబాద్ : మూడు రోజుల కిత్రం అదృశ్యమైన గృహిణి వారింట్లోనే శవమై కనిపించింది. ఈ ఘటన హఫీజ్‌పేటలోని సాయినగర్‌లో బుధవారం రాత్రి వెలుగుచూసింది. స్థానికంగా తన భర్తతోపాటు నివాసముంటున్న షాజియా ఈ నెల 21 మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయింది. తన భార్య కనిపించడం లేదని ఆమె భర్త సాజోద్దీన్ మియాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే సాజోద్దీన్ ఇంట్లో కూడా తనిఖీలు చేపట్టగా.. నీటి సంపులో షాజియా మృతదేహం లభ్యమైంది. విషయం తెలుసుకున్న ఆమె పుట్టింటివారు ఘటనాస్థలానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. సాజియాను హత్యచేసింది సాజోద్దీనే అని ఆరోపిస్తూ దాడికి దిగారు. దొరికిన వారిని దొరికినట్టు చితకబాదారు. దీంతో సాయినగర్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానికులు కూడా సాజియా తరపు వారిపై ప్రతిదాడి చేసేందుకు యత్నించగా.. పోలీసు బలగాలు రంగంలోకి వారిని అడ్డుకున్నారు. సాజోద్దీన్‌తో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. -
మీటూ : మహిళా న్యాయవాది అనుమానాస్పద మృతి
సాక్షి, బెంగళూరు : 'మీటూ' ఉద్యమంలో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లోని మహిళలు తమపై జరుగుతున్న లైంగిక వేధింపులకు సంబంధించి సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. అలాగే సంబంధిత పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదవుతున్నాయి. ఈ తరుణంలో వేధింపులపై ఫిర్యాదు చేసిన ఒక మహిళా న్యాయవాది పుష్ప అర్చనా లాల్ (26) అనుమానాస్పద రీతిలో శవమై తేలడం కలకలం రేపింది. లైంగిక వేధింపులకు సంబంధించి సీనియర్ న్యాయవాదులపై ఫిర్యాదు చేసిన రోజుల్లో వ్యవధిలోనే అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోవడం అనేక అనుమానాలను తావిచ్చింది. మల్లేశ్వరంలోని పేయింగ్ గెస్ట్‌గా ఉంటున్న గదిలో అర్చన అపస్మారక స్థితిలో వుండటాన్ని పనిమనిషి ముందుగా గుర్తించారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే చనిపోయినట్టుగా వైద్యులు ధృవీకరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకోసం తరలించారు. అయితే నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడినట్టుగా భావిస్తున్నామని, పోస్ట్‌మార్టం నివేదిక అనంతరం వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందన్నారు. అండమాన్ & నికోబార్ దీవులకు చెందిన అర్చనా ఎల్ఎల్బీ పూర్తి చేసిన అనంతరం 2017లో బెంగళూరుకు వచ్చారు. స్థానిక జయంత్ పట్టాన్‌శెట్టి అసోసియేట్స్‌లో లా ఇంటర్న్‌గా జాయిన్ అయ్యారు. ఈ క్రమంలో కర్ణాటక హైకోర్టు న్యాయవాది చంద్ర నాయక్ వద్ద తన ఇంటర్నషిప్‌ను మొదలుపెట్టారు. ఇక్కడే ఆమెకు వేధింపుల పర్వం మొదలైంది. ఆఫీసులో పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడిన చంద్ర నాయక్ ప్రభుత్వ న్యాయవాది చేతన్ దేశాయ్‌తో మరింత వేధింపులకు పాల్పడ్డారని అర్చన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు బలవంతంగా తనతో మద్యం తాగించి వేధింపులకు పాల్పడ్డారంటూ నవంబరు 20న వ్యాలికావల్ పోలీస్ స్టేషన్లో అర్చన ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు చేసిన నాలుగురోజుల కాలంలోనే ఈ విషాదం చోటు చేసుకుంది. అటు పేయింగ్ గెస్ట్ ఓనర్ కూడా అర్చన మరణంపై దర్యాప్తు చేయాల్సిందిగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె మృతికి, లైంగిక వేధింపుల ఫిర్యాదుకు సంబంధం ఉందన్న అనుమానాలను వ్యక్తం చేస్తూ, సమగ్ర దర్యాప్తు చేపట్టాల్సిందిగా పోలీసులను కోరారు. మరోవైపు ఈ వ్యవహారంపై జయంత్ పట్టన్‌శెట్టి అసోసియేట్స్ ఇంకా స్పందించలేదు. -
నిందితుడెవరో తేలిపోయింది!
సాక్షి, ముంబై: అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ప్యాషన్ డిజైనర్ సునీత సింగ్ (45) కేసులో నిందితుడెవరో తేలిపోయింది. గురువారం ఉదయం సునీత బాత్రూమ్లో శవమై కనిపించారు. ఈ ఘటన లోఖండ్‌వాలాలోని క్రాస్‌గేట్ బిల్డింగ్‌లో జరిగింది. ఆ సమయంలో ఫ్లాట్‌లో ఆమెతో పాటు కొడుకు లక్ష్య సింగ్ (22), అతనికి కాబోయే భార్య అషుప్రియ ఉన్నారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. కథ చెప్పాడు.. సునీత సింగ్ మరణంపై ఆమె కుమారుడు పోలీసులకు చెప్పిన వివరాలు.. బాత్రూమ్లోకి వెళ్లిన అమ్మ.. ఎంతసేపటికీ బయటికి రాలేదు. ఎంత పిలిచినా స్పందన లేదు. అనుమానం వచ్చి నేను బాత్రూమ్ డోర్‌ను బలవంతంగా తెరిచాను. అప్పటికే ఆమె కిందపడిపోయి ఉంది.. ఫ్లోర్‌పై రక్తపు మరకలు కూడా ఉన్నాయి. అది చూసి తీవ్ర ఆందోళనకు గురయ్యాను. వెంటనే దగ్గర్లో ఉన్న ఆభరణాల వ్యాపారికి విషయం చెప్పాను. అతను పోలీసులకు సమాచారమివ్వమని సూచించాడు. ఆ తర్వాత ఓ ప్రైవేటు అంబులెన్స్‌కు ఫోన్ చేశాను. అంతేకాకుండా ఢిల్లీలోని బంధువులకు ఈ విషయం తెలిపాను. నేను తిరిగి వచ్చేలోపే పోలీసులు అక్కడికి చేరుకున్నారని లక్ష్య వెల్లడించాడు. పోస్టుమార్టం రిపోర్టు పోస్టుమార్టం రిపోర్టు సునీత మృతిపై అనుమానాలు రేకెత్తించింది. తమదైన శైలిలో పోలీసులు లక్ష్యని ప్రశ్నించడంతో నిజం బయకొచ్చింది. అమ్మతో బాత్రూత్‌లో చిన్నపాటి ఘర్షణ చోటుచేసుకుందనీ, కోపంతో ఆమెను నెట్టేయడంతో వాష్‌బేసిన్‌కి పడిపోయిందని లక్ష్య తెలిపాడు. సునీత తలకు తీవ్ర గాయాలు కావడంతో స్పృహ కోల్పోయింది. కొన ఊపిరితో ఉన్న బాధితురాలిని ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు విడిచిందని పోలీసులు వెల్లడించారు. నిందితుడిపై కేసు నమోదు చేసుకున్నామనీ, దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. (చదవండి : బాత్రూమ్లో శవమై కనిపించిన ప్యాషన్ డిజైనర్) -
బాత్రూమ్లో శవమై కనిపించిన ప్యాషన్ డిజైనర్
ముంబై: ప్యాషన్ డిజైనర్‌గా పనిచేస్తున్న సునీత సింగ్ తను నివాసం ఉంటున్న ప్లాట్లోనే అనుమానస్పద స్థితిలో మరణించారు. వివరాల్లోకి వెళ్తే ముంబైలోని లోఖండ్వాలాలో తన కొడుకు లక్ష్య, అతనికి కాబోయే భార్య అషుప్రియ బెనర్జీలతో కలిసి సునీత నివాసం ఉంటున్నారు. కాగా, గురువారం ఉదయం ఆమె బాత్రూమ్లో శవమై కనిపించారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అలాగే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ‘గురువారం ఉదయం అమ్మ బాత్రూమ్లోకి వెళ్లింది. ఆ తర్వాత కొంత సేపటికి నేను పలిచిన ఆమె నుంచి స్పందన రాలేదు. దీంతో నేను బాత్రూమ్ డోర్‌ను బలవంతంగా ఓపెన్ చేశాను. అప్పటికే ఆమె కిందపడిపోయి ఉంది.. ఫ్లోర్‌పై రక్తపు మరకలు కూడా ఉన్నాయి. దీంతో నేను ఆందోళనకు గురయ్యాను. గుడికి వెళ్లి, అక్కడి నుంచి తెలిసిన ఆభరణాల వ్యాపారి వద్దకు వెళ్లి విషయం చెప్పాను. అతడు పోలీసులకు ఈ విషయం చెప్పమని సూచించాడు. ఆ తర్వాత ఓ ప్రైవేటు అంబులెన్స్‌కు ఫోన్ చేశాను. అంతేకాకుండా ఢిల్లీలోని బంధువులకు ఈ విషయం తెలిపాను. నేను తిరిగి వచ్చేలోపే పోలీసులు అక్కడికి చేరుకున్నార’ని సునీత కొడుకు పోలీసులకు తెలిపాడు. ఈ ఘటనపై ఓ సీనియర్ పోలీస్ అధికారి మాట్లాడుతూ.. ఈ కేసును అనుమానస్పద మృతిగా నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని తెలిపారు. ప్రస్తుతం లక్ష్య, అశుప్రియలను విచారిస్తున్నామని.. లక్ష్య కలిసిన ఆభరణాల వ్యాపారితో పాటు, ప్రైవేటు అంబులెన్స్‌ను తీసుకొచ్చినవారిని కూడా విచారిస్తామని పేర్కొన్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆమె తలకు గాయం కావడం వల్ల మృతిచెందినట్టుగా తెలుస్తోందన్నారు. ఆమె ముఖంపై కూడా చిన్న చిన్న గాయాలు ఉన్నట్టు వెల్లడించారు. పోస్ట్‌మార్టమ్ నివేదిక వస్తేగానీ ఆమె ఎలా మృతి చెందిందో చెప్పాలేమని ఆయన తెలియజేశారు. -
వృద్దురాలిని గొంతు కోసి చంపిన దుండగులు
-
ఫ్రిజ్, సూట్‌కేసు, బీరువాలో శవాలు
లక్నో: ఒక కుటుంబంలోని మొత్తం ఐదుగురు సభ్యులు చనిపోయి వుండడం కలకలం సృష్టించింది. ఉత్తరప్రదేశ్, అలహాబాద్, ధుమాంగంజ్ ప్రాంతంలో సోమవారం రాత్రి ఈ విషాదం వెలుగులోకి వచ్చింది. అనుమానాస్పద పరిస్థితిలో మృతదేహాలు పడివుండటం పలు సందేహాలకు తావిస్తోంది. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ఇంటి తాళం వేసి వుండటంతో పగుల గొట్టి ప్రవేశించిన పోలీసులు అనుమానాస్పద స్థితిలో ఐదు మృతదేహాలను గుర్తించారు. ఒక వ్యక్తి (భర్త) ముందుగదిలో ఉరికి వేలాడుతూ కనిపించగా, లోపల ఫ్రిజ్‌లో మహిళ (భార్య) మృతదేహం కనిపించింది. ఇద్దరు కుమార్తె శవాలు సూట్‌కేస్‌లో, బీరువాలో కుక్కి వుండగా, మూడువ కుమార్తె శవం మరో గదిలో పడి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. మతృదేహాలను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశామని సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. భార్య, ముగ్గురు కుమార్తెలను హత్య చేసి భర్తకూడా ఆత్మహత్య చేసుకొని వుండొవచ్చనే సందేహాన్ని అలహాబాద్ సీనియర్ సూపరింటెండెంట్ నితిన్ తివారీ వ్యక్తం చేశారు. దర్యాప్తు జరుగుతోందన్నారు. -
హరియాణాలో ప్రముఖ సింగర్ అనుమానాస్పద మృతి
-
ప్రముఖ సింగర్ అనుమానాస్పద మృతి
రొహతక్: హరియాణాలో మహిళలపై దారుణాలు ఆగడం లేదు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ పూర్వికుల గ్రామంలో మహిళ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం సంచలనం రేపింది. నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన ప్రఖ్యాత హరియాణావి గాయకురాలు మమతా శర్మ రొహతక్ జిల్లా బాలియాని గ్రామంలో శవమై కనిపించారు. జనవరి 14న గొహనాలో కార్యక్రమం ఉందని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన ఆమె తర్వాత కనిపించకుండా పోయారు. బాలియాని గ్రామంలోని పొలాల్లో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. ఆమెను హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఆమె గొంతు కోసిన ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. కల్‌నౌర్ ప్రాంతవాసి అయిన మమత ప్రముఖ హరియాణావి గాయకురాలిగా సుపరిచితులు. భజన పాటలు పాడటంలో ఆమె పేరుగాంచారు. గత ఐదు రోజుల్లో ఆరు రేప్ కేసులు, గ్యాంగ్ రేప్ చోటు చేసుకోవడంతో హరియాణా పేరు జాతీయస్థాయిలో పతాక శీర్షికల్లో నిలిచింది. మహిళలపై అఘాయిత్యాలను నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
హాకీ ప్లేయర్ అనుమానాస్పద మృతి
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో ఓ కాలేజీ విద్యార్థి అనుమానాస్పద మరణం కలకలం రేపింది. దక్షిణ ఢిల్లీలోని సరోజినీ నగర్లో తన సొంత కారులో చనిపోయి ఉన్నాడు. జామి మిల్లియా ఇస్లామియా కాలేజీలో బీఏ చదువుతున్నా రిజ్వాన్‌ఖాన్(22) స్టేట్ లెవల్ హాకీ క్రీడాకారుడు కూడా. హతుడి కుడిచేతికి బుల్లెట్ గాయాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే రిజ్వాన్ ది హత్యా, ఆత్మహత్యా అనేది ఇంకా తేలాల్సి వుంది. ప్రేమ వ్యవహారమే కారణమా అనే సందేహాలను పోలీసులు వ్యక్తం చేశారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రోమిల్ బానియా రిపోర్ట్ ప్రకారం రిజ్వాన్‌ఖాన్ సుభాష్ నగర్ నివాసి. బైక్ కొనుక్కుంటానని చెప్పి సోమవారం సాయంత్రం రిజ్వాన్ ఇంటినుంచి రూ.2 లక్షలు తీసుకొని వెళ్లాడు. రాత్రి ఇంటికి రాలేదు. మొబైల్ స్విచ్ ఆఫ్ లో వుంది ఇంతలో, మంగళవారం ఉదయం10.30 గంటలకు ఎవరో ఫోన్ చేసి రిజ్వాన్‌బ్యాగ్ తమ దగ్గర ఉందని వచ్చి తీసుకెళ్లమని చెప్పారని రిజ్వాన్ తండ్రి చెప్పారు. వెంటనే అక్కడికి వెళ్లామనీ, స్విఫ్ట్ కారు పార్క్ చేసి ఉండడాన్నిగమనించి , పరిశీలించగా రక్తపు మడుగులో పడివున్న రిజ్వాన్ మృతదేహాన్ని గుర్తించామని తెలిపారు. రిహ్వాన్ రోహతాక్లోని కళాశాలలో చదువుతున్న ఓ అమ్మాయితో మహిళతో ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆమెను కలవడానికి వెళ్లాడని, అయితే ఆమె ఒడిషా వెళ్లడంతో రాత్రంతా కారులో కూర్చున్నాడని పోలీసులు చెప్పారు. ఆమెను సంప్రదించడానికి ప్రయత్నించినట్లు, పలుమార్లు ఆమెకు ఫోన్ చేసినట్టు గుర్తించామని తెలిపారు. దేశపు తుపాకీ,, రూ.2 లక్షలు నగదు, మొబైల్ ఫోన్‌తోపాటు అమ్మాయి ఫోటో కూడా ఉన్న బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్పారు. ఎలాంటి సూసైట్‌నోట్ లభించలేదని విచారణ నిర్వహిస్తున్నాని చెప్పారు అయితే అమ్మాయి తరపువారే తమ కుమారుడిని హత్య చేసి వుంటారని రిజ్వాన్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. -
ఇన్ఫోసిస్ ఉద్యోగి అనుమానాస్పద మృతి
చెన్నై: చెన్నై లో ప్రముఖ ఐటీ సంస్థ ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఇన్ఫోసిస్ లో పనిచేస్తున్న టెకీ అనుమానాస్పద పరిస్థితుల్లో శవమై తేలారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇళయ రాజా అరుణాచలం (30) కార్యాలయ రెస్ట్ రూంలో మృతదేహాన్ని కనుగొన్నారు. ఆయన మృతదేహం నగ్నంగా పడివుండటంతో ఇది హత్యా, ఆత్మహత్యా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. బుధవారం ఉదయం చెన్నై మహీంద్ర వరల్డ్ సిటీలో ఇన్ఫీ కార్యాలయంలోని బాత్ రూంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇళయ రాజా నగ్నంగా పడి వుండడాన్ని కనుగొన్నారు. ఉదయం స్లీపర్ శుభ్రం చేయడానికి వచ్చినపుడు ఈ విషయం వెలుగు చూసింది. దీంతో పోలీసులుకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన చనిపోయినట్టు వైద్యులు ధృవీకరించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని కాంచీపురం ఎస్పీ చెప్పారు. మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవని, కానీ అనుమానాస్పద మరణం కేసు నమోదు చేశామని చెప్పారు. పోస్ట్‌మార్టం నివేదిక కోసం ఎదురు చూస్తున్నామన్నారు. అటు ఈ వార్తతో్ తాముషాక్ కు గురైనట్టు ఇన్ఫోసిస్ మేనేజ్ మెంట్ ప్రకటించింది. దర్యాప్తునకు పూర్తిగా సహకరించనున్నట్టు తెలిపింది. -
షీనా బోరా కేసు విచారణాధికారి భార్య అనుమానాస్పద మరణం
ముంబై: షీనా బోరా హత్య కేసులో విచారణ అధికారి భార్య ఆకస్మికమరణం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ కేసును విచారిస్తున్న పోలీసు అధికారి భార్య అనుమానాస్పద రీతిలో మరణించింది. దర్యాప్తు బృందంలోని పోలీస్ అధికారి ధ్యానేశ్వర్ గనోర్ భార్య దీపాలి గనోర్ శాంతక్రూజ్ ప్రాంతంలోని ఇంటిలో మంగళవారం రాత్రి చనిపోయారు. విధులు ముగించుకొని ఇంటికి వచ్చిన ధ్యానేశ్వర్ చనిపోయి వున్నభార్యను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ముంబై పోలీస్ ప్రెస్ నోట్ ప్రకారం పోలీస్ అధికారి ఉదయం 03:30 గంటలకు ఇంటికి వచ్చి భార్య ఎంతకీ తలుపు తీయలేదు. ఫోన్ చేసినా ఫలితం లేదు. చివరకి ఏదో విధంగా తలుపు తెరిచి చూడగా రక్తపు మడుగులోఉన్న భార్య ను చూసి షాకైన అధికారి పై అధికారులకు సమాచారం అందించారు. మరోవైపు ఈ సంఘటన అనంతరం కొడుకు కూడా కనిపించకుండా పోయాడు. అతని మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉంది. సంఘటనా స్థలంలో హత్య సమయంలో ఉపయోగించిన ఆయుధంగా భావిస్తున్న కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన దర్యాప్తు మొదలుపెట్టారు. -
ఐఎఎస్ అధికారి అనుమానాస్పద మృతి
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో అనుమానాస్పద స్థితిలో ఐఏఎస్ అధికారి మృతిచెందారు. మార్నింగ్ వాక్కు వెళ్లిన కర్నాటక కేడర్‌కు చెందిన ఐఎఎస్ అధికారి అనురాగ్ తివారి (35) బుధవారం అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం కలకలం రేపింది. 2007 బ్యాచ్‌కు చెందిన అనురాగ్ తివారీ కర్ణాటక ఫుడ్, పౌర సరఫరా మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ కుచెందిన తివారి లక్నో యూనివర్శిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీర్. అయితే గత రెండు రోజులుగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని మీరాబాయి మార్గంలోని ప్రభుత్వ అతిథి గృహంలో ఉన్నారు.మార్నింగ్ వాక్కు వెళ్లిన తివారీ కుప్పకూలిపోయినట్టు పోలీసులు అందించిన సమాచారం. గడ్డం మీద ఒక చిన్న కట్ తప్ప పెద్ద గాయాలు లేవని పోలీసు అధికారి ఏకే షాహి తెలిపారు. కానీ, రోడ్డు మీద కొంత రక్తం కనిపించిందన్నారు. దర్యాప్తుకొనసాగుతోందని చెప్పారు. పోస్ట్ మార్టం రిపోర్టు తరువాత మాత్రమే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని చెప్పారు. కాగా అయిన తివారి ఇటీవల విడాకులు తీసుకున్నారు. బిదార్ డిప్యూటీ కమిషనర్‌గా, మధుగిరి సహాయక కమిషనర్‌గా, కొడగు డిప్యూటీ కమీషనర్ గా, బెంగళూరు డిప్యూటీ సెక్రెటరీ (ఫైనాన్స్) పనిచేశారు. -
ప్రముఖ హిప్నాటిస్ట్ అనుమానాస్పద మరణం
న్యూఢిల్లీ: ప్రసిద్ధ పారానార్మల్ పరిశోధకుడు, హిప్నాటిస్ట్ గౌరవ్ తివారీ (32 )అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఢిల్లీలోని తన ఫ్లాట్ లో అనుమానాస్పద పరిస్థితుల్లో గత గురువారం చనిపోయారు. భారత పారానార్మల్ సొసైటీ వ్యవస్థాపక సీఈవో తివారీ ద్వారక ప్రాంతంలో తన ఫ్లాట్ లోని బాత్రూమ్ లో శవమై కనిపించారు. బాత్రూమ్ నుంచి దబ్ మన్న శబ్దం బిగ్గరగా వినిపించడంతో కుటుంబ సభ్యులు ఎలర్ట్ అయ్యారు. బలవంతంగా తలుపు తెరిచి అపస్మారక స్థితిలో ఉన్న అతణ్ని ఆసుపత్రికి తరలించారు కానీ అప్పటికే గౌరవ్ చనిపోయినట్టు వైద్యులు ధృవీకరించారు. ఈ ఏడాది జనవరిలో వివాహం అయిన గౌరవ్ తల్లిదండ్రులు, భార్యతో కలిసి నివసిస్తున్నారు. అయితే ఆత్మహత్య చేసుకునేంత పెద్ద సమస్యలేవీ లేవని తెలుస్తోంది. ప్రాథమిక పోస్ట్ మార్టం నివేదికలో మెడ చుట్టూ నల్ల లైన్ ఉండడంతో , ఊపిరి ఆడక చనిపోయి వుంటాడని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు ఒక ప్రతికూల శక్తి తన వైపు లాక్కుంటోందని గౌరవ్ తివారి ఒక నెల క్రితం భార్యతో చెప్పినట్టు తెలుస్తోంది. ఎంత ప్రయత్నించినా... అదుపు చేయడం కష్టంగా ఉందని భార్య దగ్గర ఆందోళన వ్యక్తం చేశారు. అయితే పనిలో ఒత్తిడికారణంగా అలా అలోచిస్తున్నారని తాను పెద్దగా పట్టించుకోలేదని పోలీసులకు తెలిపింది. పారానార్మల్ (విపరీత మానసిక ప్రవర్తన గల) సమాజం ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 2009 లో ఏర్పాటు పారానార్మల్ సొసైటీని స్థాపించి తన సేవలను అందిస్తున్నారు. విపరీత మానసిక ప్రవర్తన గల దాదాపు6000 ప్రదేశాలను సందర్శించి.. దర్యాప్తు చేపట్టారు. ఇంతలో ఆయన మరణం పలు అనుమానాలకు తావిస్తోంది. పోలీసుల విచారణ కొనసాగుతోంది. -
హూద్దాబేగాన్ని ఎందుకు చంపినట్లు?
-
అదృశ్యమై...శవమైన బాలిక
-
స్కూల్‌పై దాడి.. నిప్పు
-
రెండురోజుల ఆడశిశువు మృతదేహం లభ్యం
నిజామాబాద్ (బిచ్కుంద) : నిజామాబాద్ జిల్లా బిచ్కుంద మండలంలోని అయ్యప్ప గుడి పక్కన రెండు రోజుల వయసు గల ఆడ శిశువు మృతదేహం శుక్రవారం లభ్యమైంది. గమనించిన స్థానికులు సమాచారాన్ని పోలీసులకు చేరవేయటంతో వారు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం శిశువు మృతదేహాన్ని బిచ్కుంద ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం శిశువు మృతదేహాన్ని ఖననం చేస్తామని పోలీసులు తెలిపారు. కాగా ఆడశిశువు చనిపోతే అక్కడ పడవేశారా? లేక ఆడపిల్ల పుట్టిందని చంపేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల్లో ఇటీవల డెలివరీ అయిన మహిళల వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. -
టీవీ నటుడి అనుమానాస్పద మృతి
కోలకతా: బెంగాల్ లో ప్రముఖ టీవీ నటుడు రోనెన్ చక్రవర్తి అనుమానాస్పద పరిస్థితిలో మరణించారు. తన ఇంటికి సమీపంలోని స్విమ్మింగ్ పూల్ లో ఆయన శవమై కనిపించారు. దీంతో బెంగాలీ టీవీ పరిశ్రమ షాక్ కు గురైంది. శుక్రవారం అర్ధరాత్రి తరువాత సుమారు ఒంటిగంట ప్రాంతంలో స్నేహితులతో కలిసి స్విమ్మింగ్‌కు వెళ్లి గల్లంతయ్యాడని కుటుంబ సభ్యులు తెలిపారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చేపట్టారు. తెల్లవారుజామున నాలుగు గంటలకు రోనీ మృతదేహాన్ని కనుగొన్నామని పోలీసు అధికారులు తెలిపారు. వెంటనే అతడ్ని స్థానిక ఎంఆర్ ఆసుపత్రికి తరలించగా మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారని తెలిపారు. కాగా టీవీ యాంకర్ గా కెరరీ మొదలుపెట్టిన రోనెన్ బెంగాలీ బుల్లి తెరకు రోనీగా పరిచయమైన ప్రస్తుతం జోల్ నూపుర్ అనే ఒక మెగా సీరియల్లో నటిస్తున్నట్టు సమాచారం. -
విజయవాడ రైల్వేస్టేషన్లో వృద్ధుడు మృతి
విజయవాడ టౌన్: నిత్యం రద్దీగా ఉండే విజయవాడ రైల్వే స్టేషన్లో రైల్వే విచారణ కేంద్రం వద్ద అరవై సంవత్సరాల వృద్ధుడు మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మరణించాడు. బుధవారం ఉదయం 7 గంటల వరకు అతనిని ఎవరూ పట్టించుకోలేదు. ప్రయాణికులు దాటుకుని వెళ్తున్నారే తప్ప అతని గురించి కనీసం పోలీసులకు సమాచారం కూడా ఇవ్వలేదు. చనిపోయిన వ్యక్తి ఎవరు? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు? అనే వివరాలు తెలియాల్సి ఉంది. -
మూగబోయిన గాంధీజన సంగం
నెల్లూరు : పర్వతారోహకుడు మల్లి మస్తాన్‌బాబు మృతితో అతడి స్వగ్రామం నెల్లూరు జిల్లా గాంధీజన సంగం మూగబోయింది. మస్తాన్‌బాబు మరణవార్త మీడియాలో చూసి అతడి బంధువులు, కుటుంబు సభ్యులు రోదిస్తున్నారు. అయితే మస్తాన్‌బాబు మృతి చెందారని అధికారికంగా తమకు ఎలాంటి సమాచారం అందలేదని మిత్రులు బంధువులు తెలిపారు. మల్లి మస్తాన్ బాబు మృతి పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మస్తాన్ బాబు కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. మార్చి 24న పర్వతారోహణ చేస్తూ అతను చిలీలోని సెర్రో ట్రస్క్ క్రూసెస్ బేస్ క్యాంప్ వద్ద ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో చిక్కుకున్నాడు. అతని ఆచూకీ కోసం దక్షిణ అమెరికాలోని అర్జెంటీనా, చిలీ రెండు దేశాల వైపు నుంచి కూడా రెస్క్యూ బృందం ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా మస్తాన్ బాబు మృతదేహాన్ని ఏరియల్ సర్వే బృందాలు గుర్తించారు. -
వరకట్నదాహానికి యువతి బలి!
-
VTPS కూలింగ్ కెనాల్లో బాలుని డెడ్‌బాడీ
-
రైలు పట్టాల పై వ్యక్తి మృతి
-
అమెరికాలో భారత సంతతి విద్యార్థిని ఆత్మహత్య
న్యూయార్క్: అమెరికాలో ఆచూకీ తెలియకుండా పోయిన భారత సంతతి విద్యార్థిని మరణించింది. న్యూయార్క్‌లో నివసిస్తున్న 22 ఏళ్ల జాస్మిన్ జోసెఫ్ ఫిబ్రవరి నుంచి కనిపించకుండా పోయింది. ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు మంగళవారం గుర్తించారు. ఓ షాపింగ్ సెంటర్లో పార్కింగ్ చేసిన కారులో విగతజీవిగా ఉన్న జోసెఫ్ శరీరాన్ని కనుగొన్నారు. ఫిబ్రవరి 24న ఆమె చివరి సారి ఇంటి నుంచి వెళ్లింది. న్యూయార్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యాంపస్‌కు కారులో బయల్దేరింది. అదే రోజు సాయంత్రం కాలేజీ లైబ్రేరీలో ఉన్నట్టు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పింది. ఆ తర్వాత ఆమె జాడ కనిపించలేదు. కాగా గతేడాది నుంచి ఆమె కాలేజీకి రావడం లేదని యాజమాన్యం తెలిపింది. ప్రస్తుత సెమిస్టార్లో ఆమె పేరు లేదని చెప్పారు. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియదని, వ్యక్తిగత కారణాలతోనే జోసెఫ్ ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు చెప్పారు. -
బాసర ట్రిపుల్ ఐటిలో విషాదం
-
గుర్తుతెలియని మహిళ శవం లభ్యం
-
అమెరికాలో ఎన్నారై మహిళ అనుమానాస్పద మృతి
అమెరికాలో కొన్ని రోజుల క్రితం అదృశ్యమైన భారత సంతతి మహిళ ఒకరు అనుమానాస్పద స్థితిలో ఓ కారులో మరణించి కనిపించారు. ఆమె ఇద్దరు బిడ్డల తల్లి. అమెరికాలోని పెన్సల్వేనియా రాష్ట్రంలో ఉండేవారు. నాదియా మాలిక్ (22) ప్రీ మెడికల్ విద్యార్థిని. ఫిలడెల్ఫియాలో అత్యంత రద్దీగా ఉండే ఓ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న కారులో ప్రయాణికుల సీట్లో మరణించి కనిపించారు. మాలిక్ స్నేహితుడు భూపీందర్ సింగ్‌ను పోలీసులు గతంలో పెరోల్ ఉల్లంఘన కేసులో అరెస్టు చేశారు. అతడిని ఓహియో నుంచి ఫిలడెల్ఫియా తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అతడికి గతంలో నేరచరిత్ర ఉండటంతో అతడిని ప్రశ్నించాలని యోచిస్తున్నారు. వీరిద్దరి మధ్య సంబంధం ఉందని అధికారులు అంటున్నారు. ఆ కారు ఆ ప్రాంతంలో 12 రోజులుగా పడి ఉన్నా.. నాదియా మాలిక్ మృతదేహాన్ని మాత్రం ఎవరూ గుర్తించలేదు. చివరకు కారును అక్రమంగా పార్కింగ్ చేసినందుకు పోలీసులు తనిఖీ చేయగా విషయం తెలిసింది. మంచు దట్టంగా అలముకోవడంతో దాన్ని తొలగించే యంత్రాలకు అడ్డుగా ఉందని కారును వేరే ప్రదేశానికి తరలించారు కూడా. అప్పుడూ ఆమె మృతదేహాన్ని గుర్తించలేదు. ఆమె శవం ఓ బ్యాగ్, దుస్తుల కింద దాచిపెట్టి ఉండటంతో ఎవరికీ తెలియలేదు. ఈనెల పదోతేదీ నుంచి ఆమె అదృశ్యమైనట్లు ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. నాదియా పిల్లలిద్దరికీ తండ్రి అయిన భూపీందర్ సింగ్‌తో చివరిసారిగా ఆమె కనిపించినట్లు తెలిసింది. తాను భూపీందర్తో ఉన్నానని, అతడు తనను బయటకు వెళ్లనివ్వట్లేదని తనకు చెప్పినట్లు నాదియా స్నేహితుడు థామస్ సింగ్ పోలీసులకు తెలిపాడు. -
ఆస్కార్ విజేత ఫిలిప్ హఫ్‌మన్ అనుమానాస్పద మృతి
ఆస్కార్ అవార్డు విజేత, అమెరికన్ నటుడు ఫిలిప్ హఫ్‌మన్ మన్‌హట్టన్‌లోని తన అపార్టుమెంట్లో అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఈ విషయాన్ని న్యూయార్క్ పోలీసు అధికారులు తెలిపారు. 'కాపోట్' చిత్రంలో నటనకు ఆస్కార్ అవార్డు సాధించిన ఈ 46 ఏళ్ల నటుడు డ్రగ్ ఓవర్‌డోస్ కారణంగా మరణించినట్లు తెలుస్తోంది. అయితే.. ఆయన మరణానికి కారణం ఏంటన్న విషయాన్ని మాత్రం ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. 911 నెంబరుకు ఎమర్జెన్సీ కాల్ రావడంతో పోలీసులు వెళ్లి చూసేసరికే హఫ్‌మన్ మరణించి ఉన్నాడు. వాల్‌స్ట్రీట్ జర్నల్ ముందుగా ఈ కథనాన్ని ఇచ్చింది. తన భుజానికి ఒక హైపోడెర్మిక్ సూది గుచ్చుకుని ఉన్న ఆయన మృతదేహం అపార్టుమెంట్‌లోని బాత్రూంలో పడి ఉండగా ముందుగా ఓ స్క్రీన్ రైటర్ చూశారు. పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన హఫ్‌మన్.. 2005 సంవత్సరంలో ప్రముఖ రచయిత కాపోట్ జీవితచరిత్రగా తీసిన చిత్రంలో నటనకు ఆస్కార్ అవార్డు పొందారు. -
చిన్న వివాదానికే హత్య