
సాక్షి, హైదరాబాద్ : మూడు రోజుల కిత్రం అదృశ్యమైన గృహిణి వారింట్లోనే శవమై కనిపించింది. ఈ ఘటన హఫీజ్‌పేటలోని సాయినగర్‌లో బుధవారం రాత్రి వెలుగుచూసింది. స్థానికంగా తన భర్తతోపాటు నివాసముంటున్న షాజియా ఈ నెల 21 మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయింది. తన భార్య కనిపించడం లేదని ఆమె భర్త సాజోద్దీన్ మియాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు.
ఈ క్రమంలోనే సాజోద్దీన్ ఇంట్లో కూడా తనిఖీలు చేపట్టగా.. నీటి సంపులో షాజియా మృతదేహం లభ్యమైంది. విషయం తెలుసుకున్న ఆమె పుట్టింటివారు ఘటనాస్థలానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. సాజియాను హత్యచేసింది సాజోద్దీనే అని ఆరోపిస్తూ దాడికి దిగారు. దొరికిన వారిని దొరికినట్టు చితకబాదారు. దీంతో సాయినగర్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానికులు కూడా సాజియా తరపు వారిపై ప్రతిదాడి చేసేందుకు యత్నించగా.. పోలీసు బలగాలు రంగంలోకి వారిని అడ్డుకున్నారు. సాజోద్దీన్‌తో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment