Hafeezpet
-
నిషేధం ఉన్నా రిజిస్ట్రేషన్లు చేశారు: రఘునందన్‌రావు
సాక్షి, హైదరాబాద్: హఫీజ్‌పేటలోని సర్వే నంబర్ 78కి సంబంధించి ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేయడానికి వీల్లేదని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) 2007లో జీవో నంబర్ 863 జారీ చేయడంతోపాటు 2012లో సర్క్యులర్ జారీ చేసినా రెవెన్యూ అధికారులు వందలాది రిజిస్ట్రేషన్లు చేశారని, ఎన్ఓసీలు ఇచ్చారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆరోపించారు. అలాగే ఆయా భూముల్లో నిర్మాణాలకు జీహెచ్ఎంసీ అధికారులు అనుమతులు మంజూరు చేశారన్నారు. నిబంధనలున్నవి సామాన్యులు, పేదలకేనా అని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారికి లేఖ రాశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ లేఖను విడుదల చేశారు. ఓ నగల వ్యాపారి ఎగ్గొట్టిన రూ. 119 కోట్ల రికవరీలో భాగంగా అతను తనఖా పెట్టిన ఆ సర్వే నంబర్లోని 8 ఎకరాలను బ్యాంకులు వేలం వేసేందుకు ప్రయతి్నస్తే సుప్రీంకోర్టు దాకా వెళ్లి అడ్డుకున్న అధికారులు.. వారికి నచి్చన సంస్థలకు మాత్రం రిజిస్ట్రేషన్లు చేస్తున్నారన్నారు. చదవండి: 'దక్షిణాదిన కేసీఆర్.. ఉత్తరాదిలో కేజ్రీవాల్.. చీల్చే పని వీళ్లదే..' -
బేబీ కేర్ కేంద్రాల తరహాలో వృద్ధాశ్రమాలు అవసరం
హఫీజ్‌పేట్: పిల్లల బేబీ కేర్ కేంద్రాల తరహాలో వృద్ధాశ్రమాల ఏర్పాటు అవసరమని హైకోర్టు జస్టిస్ జి.రాధారాణి అన్నారు. ఆదివారం కొండాపూర్‌లోని సీఆర్ ఫౌండేషన్‌లోని వృద్ధాశ్రమ 23వ వార్షికోత్సవ సభను నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హైకోర్టు జస్టిస్ రాధా రాణి, సీఆర్ ఫౌండేషన్ గౌరవ అధ్యక్షుడు, సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, అధ్యక్షుడు, సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ హాజరై మహాత్మాగాంధీ, చండ్ర రాజేశ్వర్రావుల విగ్రహాలకు నివాళుల ర్పించారు. ఈ సందర్భంగా జస్టిస్ రాధారాణి మాట్లాడుతూ దేశంలో 15 కోట్ల వృద్ధుల జనాభా ఉందని, 2050 నాటికి అది మరో మూడింతలు పెరుగుతుందని తెలిపారు. సీఆర్ ఫౌండేషన్ నిర్వహించే వృద్ధాశ్రమంలో పెద్ద పెద్ద వారు ఉంటున్నారన్నారు. సురవరం సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ వృద్ధాశ్రమాలంటే అనాథాశ్రమాల నడం పొరపాటు అన్నారు. ఉద్యోగాల పేరుతో పిల్లలు దూరంగా ఉన్నప్పుడు, అనేక కారణాల తో పిల్లలు సుదూర ప్రాంతాలకు వెళ్లినప్పుడు, వారి తల్లిదండ్రులకు తగిన సమయాన్ని కేటాయించలేకపోతున్న నేపథ్యంలో వృద్ధాశ్రమాలు అవసరమని వ్యాఖ్యానించారు. చండ్ర రాజేశ్వర్‌రావు గొప్ప దేశ భక్తుడని కొనియాడారు. రాజేశ్వర్‌రావు మరణానంతరం ఆయన కోరిక మేరకు సీఆర్ ఫౌండేషన్ చిన్న వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేసిందన్నారు. చికిత్సా లయం, గ్రంథాలయం, నీలం రాజశేఖర్‌రెడ్డి రీసెర్చ్ సెంటర్, మహిళా స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాలను సీఆర్ ఫౌండేషన్ నిర్వహిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో సీఆర్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, కార్యద ర్శులు చెన్నమనేని వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరా వు, కార్యదర్శి చెన్నకేశవరావు, హెల్త్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ రజినీ తదితరులు పాల్గొన్నారు. -
భర్తతో గొడవలు.. బ్యూటీషియన్ ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: భర్తతో విభేదాలు రావడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఓ బ్యూటీషియన్ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రవీంద్ర ప్రసాద్ తెలిపిన ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌కు చెందిన ఆన్‌మిట్ లేప్చా (39) భర్తకు హైదరాబాద్‌లో ఉద్యోగం రావడంతో కుటుంబ సభ్యులతో కలిసి మాదాపూర్‌లోని విఠల్‌రావు నగర్‌లోని అలియన్స్ బ్లెండ్ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. చదవండి: (భార్యను భరించలేను.. విడాకులు కావాల్సిందే: సాఫ్ట్వేర్ ఇంజనీర్) భర్తతో గొడవలు రావడంతో ఇద్దరు పిల్లలతో కలిసి రెండు సంవత్సరాలుగా విడిగా ఉంటోంది. ఈ నెల 3వ తేది అర్ధరాత్రి గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె స్నేహితురాలి ఫిర్యాదుతో మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. చదవండి: (భర్త కుట్టిన బ్లౌజ్ నచ్చలేదని భార్య ఆత్మహత్య) -
హఫీజ్‌పేట భూవివాదం: హైకోర్టు సంచలన వ్యాఖ్యలు!
హైదరాబాద్: హఫీజ్‌పేట్‌లోని సర్వే నంబర్ 80లోని భూమి విషయంలో ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తులకు మధ్య గత కొన్నేళ్లుగా నడుస్తున్న వివాదానికి హైకోర్టు ముగి ంపు పలికింది. ఈ సర్వే నంబర్లోని 50 ఎకరాల భూమి ప్రైవేటు వ్యక్తులదేనని తేల్చిచెప్పింది. ఈ భూమిని వక్ఫ్‌బోర్డుకు చెందినదిగా పేర్కొంటూ చేసిన తీర్మానాన్ని కొట్టేసింది. అలాగే రెవెన్యూ రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా పేర్కొనడాన్ని తప్పుబడుతూ ఎంట్రీలను రద్దు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎంఎస్.రామచందర్‌రావు, జస్టిస్ టి.వినోద్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పునిచ్చింది. తమ భూములను వక్ఫ్‌బోర్డు భూములుగా పేర్కొంటూ ఇచ్చిన నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ హైదరాబాద్‌కు చెందిన కటికనేని ప్రవీణ్‌కుమార్‌తో పాటు మరికొందరు దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది. ‘గిఫ్ట్ సెటిల్మెంట్ డీడ్ ఆధారంగా పిటిషనర్ల పేర్లను రెవెన్యూ రికార్డుల్లో చేర్చండి. అలాగే పిటిషనర్ల భూమి పొజిషన్ విషయంలో ప్రభుత్వం, వక్ఫ్‌బోర్డు జోక్యం చేసుకోరాదు. పిటిషనర్లకు ఒక్కొక్కరికి రూ.50 వేలు ప్రభుత్వం, వక్ఫ్‌బోర్డు జరిమానాగా చెల్లించాలి’అని తీర్పులో పేర్కొంది. ఈ భూమి కోసమే కిడ్నాప్ యత్నం హఫీజ్‌పేటలోని ఈ భూమిని తమ పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్న కుట్రలో భాగంగానే ఏపీ మాజీ మంత్రి అఖిల ప్రియ, ఆమె భర్త భార్గవ్‌రామ్ మరికొందరితో కలసి కె.ప్రవీణ్‌కుమార్, ఆయన సోదరులను కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కిడ్నాపర్లు పరారయ్యారు. తర్వాత అఖిలప్రియతో పాటు కిడ్నాప్ కుట్రలో పాల్గొన్న మరికొందరిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అఖిలప్రియ తదితరులకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయగా.. భార్గవ్‌రామ్ తదితరులు హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందిన విషయం తెలిసిందే. -
చార్మినార్‌నూ రిజిస్టర్ చేస్తారా?
సాక్షి, హైదరాబాద్: దానం చేస్తున్న వ్యక్తికి సదరు ఆస్తిపై హక్కులు ఉన్నాయా లేదా అన్నది చూడకుండా దానం ఇస్తే చార్మినార్, రాజ్భవన్లను కూడా రిజిస్టర్ చేసుకుంటారా? అని వక్ఫ్‌బోర్డును హైకోర్టు ప్రశ్నించింది. వక్ఫ్‌బోర్డుకు 65 ఏళ్ల కిందట ఇచ్చిన భూమిని 2014 వరకు ఎందుకు రిజిస్టర్ చేసుకోలేదని నిలదీసింది. హఫీజ్‌పేటలోని సర్వే నెంబర్ 80లోని భూములను వక్ఫ్‌బోర్డు భూములుగా పేర్కొంటూ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ను సవాల్‌చేస్తూ కె.ప్రవీణ్‌కుమార్, సాయిపవన్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తోపాటు మరొకరు దాఖలు చేసిన పిటిషన్లను న్యాయమూర్తులు జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు, జస్టిస్ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. ఈ భూములు మునీరున్నీసా బేగంకు చెందినవని, 1966లో వాటిని విక్రయించిందని పిటిషనర్ల తరఫు న్యాయవాది నివేదించారు. 2006లో ఈ భూములపై తుది డిక్రీ వచ్చిందని, సుప్రీంకోర్టులో సైతం రాష్ట్రానికి చుక్కెదురైందని తెలిపారు. 1955లో మునీరున్నీసా వక్ఫ్‌నామాగా ప్రభుత్వం పేరొంటున్నా అందులో ఆమె సంతకంలేదని, అయితే 1966లో ఆమె ఆ భూమిని విక్రయించినప్పుడు సంతకాలు చేసిందని తెలిపారు. 2014 నవంబర్‌లో ఈ భూమిని వక్ఫ్‌బోర్డు భూమిగా పేర్కొంటూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీచేసిందన్నారు. హఫీజ్‌పేట భూములు ప్రభుత్వానికి చెందినవని, 1963లో నిజాం వారసులుగా పేర్కొంటూ కొందరు ఈ ఆస్తులను పంచుకున్నట్లుగా తప్పుడు పత్రాలు సృష్టించారని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచందర్‌రావు నివేదించారు. మునీరున్నీసా చనిపోయిన తర్వాత తప్పుడు పత్రాలతో ఈ రిజిస్ట్రేషన్ జరిగిందని ముతవల్లీ తరఫు న్యాయవాది అనుమానం వ్యక్తంచేశారు. ఈ వ్యవహారంలో వక్ఫ్‌బోర్డు తరఫు న్యాయవాది వాదనలకోసం ధర్మాసనం విచారణను బుధవారానికి వాయిదావేసింది. చదవండి: కెనడా నుంచి వచ్చి ఇంట్లో ఉరేసుకుని.. -
ఆ భూమి ప్రైవేటు వ్యక్తులదే: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం హఫీజ్‌పేట పరిధిలోని సర్వే నెంబర్ 78లో 8.07 ఎకరాలను ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ నిషేధిత జాబితాలో చేర్చడాన్ని హైకోర్టు తప్పు బట్టింది. ఈ భూమి ప్రైవేట్‌దే అని 2014లో అప్పటి తహసీల్దార్ నిర్ధారించిన నేపథ్యంలో భూమిని రిజిస్ట్రేషన్ చేయాల్సిందేనని స్పష్టం చేసింది. క్రాఫ్ట్ అల్లాయ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ భూమిని మరో సంస్థ వేసిన వేలంలో కొనుగోలు చేసిన నేపథ్యంలో రిజిస్ట్రేషన్ చేయాల్సిందేనని చెప్పింది. పట్టాదార్ పాస్ బుక్స్‌ను అడగకుండా సదరు ఫైనాన్స్ సంస్థ జారీచేసిన సేల్ సర్టిఫికెట్‌ను రిజిస్ట్రేషన్ చేయాలని, వారం రోజుల్లో మ్యుటేషన్ ప్రక్రియనూ పూర్తి చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ సర్వే నంబర్‌ను నిషేధిత జాబితాలో పెట్టడంతోపాటు గత ఏడాదిగా రిజిస్ట్రేషన్ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు తహసీల్దార్ కమ్ సబ్ రిజిస్ట్రార్.. పిటిషనర్‌కు రూ.50 వేలు 4 వారాల్లో చెల్లించాలని తీర్పులో పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు, జస్టిస్ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది. ఆశి రియల్టర్స్, నిహారిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ హఫీజ్‌పేట్‌లోని 78 సర్వే నెంబర్ లోని 8.07 ఎకరాల భూమిని కుదవపెట్టి ఓ ప్రైవేటు సంస్థ నుంచి రూ.110 కోట్లు రుణం తీసుకుంది. అయితే రుణం చెల్లించకపోవడంతో సదరు సంస్థ ఈ భూమిని చట్టబద్ధంగా కోర్టు అనుమతి తీసుకొని వేలం వేసింది. ఈ వేలంలో ఎక్కువ మొత్తం కోట్ చేసి క్రాఫ్ట్ అల్లాయ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కొనుగోలు చేసింది. అయితే ఏడాదిగా ఆ సేల్‌ను రిజిస్ట్రేషన్ చేయాలని సంబంధిత తహసిల్దార్ కమ్ సబ్‌రిజిస్ట్రార్‌ను కోరినా స్పందన లేదు. ఈ నేపథ్యంలో అల్లాయ్ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. చదవండి: 3 నెలల నిరీక్షణ: నేడు హైకోర్టులో విచారణ చదవండి: పిటిషనర్లకు షాకిచ్చిన హైకోర్టు.. రూ.10 వేల జరిమానా -
అక్రమార్కుల చెరలో హఫీజ్‌పేట్ కాయిదమ్మకుంట
-
అక్రమార్కుల చెరలో హఫీజ్‌పేట్ కాయిదమ్మకుంట
సాక్షి, సిటీబ్యూరో/హఫీజ్‌పేట్: గ్రేటర్లో చెరువుల అభివృద్ధికి గ్రహణం పట్టింది. జీహెచ్ఎంసీ పరిధిలోని మొత్తం 185 చెరువులకు గానూ..19 చెరువులనుతొలివిడతగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ఏడాది క్రితం నిర్ణయించింది. ఇందుకోసం రూ.280 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు ప్రకటించింది. కానీ ఏడాదిగా ఇందులో కేవలం 30 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. మిగతా పనులుఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పూర్తి చేసిన పనులకు గాను రూ.10 కోట్ల మేర పెండింగ్ బిల్లులు పేరుకుపోవడంతో కాంట్రాక్టర్లు పనులు నిలిపివేశారు. మరో వైపు డంపింగ్ యార్డులుగా మారిన ఆయా చెరువుల్లో తాము తొలగించిన ఘన వ్యర్ధాల పరిమాణం ఆధారంగా బిల్లులు చెల్లించడం లేదని పనులు చేపట్టిన ఏజెన్సీలు వాపోతున్నాయి. మరోవైపు పలు చెరువులు అక్రమార్కుల చెరలో చిక్కి డంపింగ్ యార్డులుగా మారుతున్నాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా హఫీజ్‌పేట్‌లోని కాయిదమ్మకుంట నిలుస్తుంది. శాఖల మధ్య సమన్వయ లేమి.. తొలి విడతగా చేపట్టిన 19 చెరువుల అభివృద్ధి పనులను జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో..మిషన్ కాకతీయ పథకం కింద చేపట్టటంతో నీటిపారుదల శాఖ పర్యవేక్షణ సైతం ఈ పనులకు తప్పనిసరిగా మారింది. అయితే ఈ రెండు శాఖల మధ్య సమన్వయం కొరవడటంతో పనులు నత్తనడకన సాగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బల్దియా ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఈ చెరువుల విభాగాన్ని ఇరిగేషన్ శాఖకు బదిలీ చేస్తేనే పనులు ముందుకు సాగుతాయని నీటి పారుదల శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ అంశంపై మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించాలని కోరుతున్నారు. డంపింగ్ యార్డ్‌గాకాయిదమ్మ కుంట... హఫీజ్‌పేట్‌లోని కాయిదమ్మకుంట జలాశయం బఫర్ జోన్లో అక్రమార్కులు ఇష్టానుసారంగా చెలరేగిపొతున్నారు. ఓ వైపు ప్రైవేట్ వ్యక్తులు మట్టితో పూడ్చి చదును చేస్తుంటే, జీహెచ్ఎంసీ అధికారులు దీన్ని చెత్త డంపింగ్ స్థలంగా మార్చారు. మరో వైపు కుంట సమీపంలోని స్థలం ఉన్న వారు నిర్మాణ వ్యర్థాలతో డంపింగ్ చేస్తున్నారు. ఇదే తరహాలో మరికొద్ది రోజులు అక్రమాలు కొనసాగితే కాయిదమ్మ కుంట కానరాదేమోనని పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కాయిదమ్మ కుంట బఫర్ జోన్ ప్రైవేట్ వ్యక్తులకు ఫలహరంగా మారింది. కొద్ది సంవత్సరాలుగా బండరాళ్లు, మట్టితో యధేచ్ఛగా పూడ్చుతూ చదును చేస్తున్నారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ మార్చేందుకు కుట్ర పన్నుతున్నారు. ఇంత జరిగినా ఇరిగేషన్, శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. బఫర్ జోన్లో అక్రమంగా చెత్తను ఆటోల ద్వారా డంపింగ్ చేస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బంది తాజాగా కొందరు వ్యక్తులు ట్రాక్టర్లతో నిర్మాణ వ్యర్థాలను చెరువు సమీపంలో ప్రైవేట్ స్థలంలో డంపింగ్ చేస్తున్నారు. దీంతో వరద రాకపోవడమే కాకుండా వర్షాకాలంలో వచ్చే వరదనీరు కలుషితమై చెరువులో కలిసే వీలుంది. బఫర్ జోనల్లో కొంత మంది అక్రమంగా సెల్‌టవర్ ఏర్పాటు చేశారు. విద్యుత్ కనెక్షన్ కోసం ఏకంగా అధికారులను సంప్రదించకుండా దొడ్డి దారిన విద్యుత్ స్థంభాలను ఏర్పాటు చేసి కేబుల్ వైర్లను లాగి ఉంచారంటే టీఎస్‌సీపీడీసీఎల్ అధికారుల తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అపర్ణ కౌంటీ గేటెడ్ కమ్యూనిటీ ప్రహరీ దగ్గరగా స్తంభాలు వేశారని, దీంతో సెక్యూరిటీ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని స్థానికులు టీఎస్పీడీసీఎల్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. కేసు నమోదు చేసి..మట్టి తొలగిస్తాం కాయిదమ్మ కుంట బఫర్ జోన్లో చెరువు స్థలాన్ని మట్టితో పూడ్చివేస్తున్న విషయం మా దృష్టికి రాలేదు. బఫర్ జోనల్లో మట్టితో పూడ్చి చదును చేస్తే కేసులు నమోదు చేస్తాం. మట్టిని తొలగిస్తాం. విషయం తెలిసిన వెంటనే పూడ్చివేతను అడ్డుకోవాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాం.– వంశీమోహన్, శేరిలింగంపల్లి తహసీల్దార్ -
అదృశ్యమైన మహిళ.. ఇంట్లోని వాటర్ సంపులో..
సాక్షి, హైదరాబాద్ : మూడు రోజుల కిత్రం అదృశ్యమైన గృహిణి వారింట్లోనే శవమై కనిపించింది. ఈ ఘటన హఫీజ్‌పేటలోని సాయినగర్‌లో బుధవారం రాత్రి వెలుగుచూసింది. స్థానికంగా తన భర్తతోపాటు నివాసముంటున్న షాజియా ఈ నెల 21 మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయింది. తన భార్య కనిపించడం లేదని ఆమె భర్త సాజోద్దీన్ మియాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే సాజోద్దీన్ ఇంట్లో కూడా తనిఖీలు చేపట్టగా.. నీటి సంపులో షాజియా మృతదేహం లభ్యమైంది. విషయం తెలుసుకున్న ఆమె పుట్టింటివారు ఘటనాస్థలానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. సాజియాను హత్యచేసింది సాజోద్దీనే అని ఆరోపిస్తూ దాడికి దిగారు. దొరికిన వారిని దొరికినట్టు చితకబాదారు. దీంతో సాయినగర్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానికులు కూడా సాజియా తరపు వారిపై ప్రతిదాడి చేసేందుకు యత్నించగా.. పోలీసు బలగాలు రంగంలోకి వారిని అడ్డుకున్నారు. సాజోద్దీన్‌తో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. -
సెప్టిక్ ట్యాంక్‌లో ట్రాక్టర్ బోల్తా ; కార్మికుడి మృతి
సాక్షి, హైదరాబాద్ : హఫీజ్‌పేట్ డివిజన్లోని జనప్రియనగర్ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. సెప్టిక్ ట్యాంక్‌లో ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో.. జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికుడు ప్రాణాలు కొల్పోయాడు. మృతున్ని వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన వెంకటేశ్‌గా గుర్తించారు. శుక్రవారం జనప్రియ కాలనీలో ఉన్న సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేయడంతో పాటు, పక్కనే ఉన్న మురికి కాలువలోని మట్టిని తొలగించడానికి జీహెచ్ఎంసీ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ట్రాక్టర్ అదుపు తప్పి సెప్టిక్ ట్యాంక్‌పైకి రావడంతో ఒక్కసారిగా ట్యాంక్‌పైనున్న సిమెంట్ బిల్లలు పగిలిపోయాయి. దీంతో ట్రాక్టర్ అందులో పడిపోయింది. ట్రాక్టర్లో ఉన్న వెంకటేశ్ సెప్టిక్ ట్యాంక్‌లో పడి గల్లంతయ్యాడు. ఆ కాలనీ మొత్తానికి అదొక్కటే సెప్టిక్ ట్యాంక్ కావడం, 10మీటర్లకు పైగా లోతు ఉండటంతో వెంకటేశ్ ఆచూకీని గుర్తించడం కష్టంగా మారింది. ఘటన స్థలానికి చేరుకున్న జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ సహాయక చర్యలను పర్యవేక్షించారు. ట్యాంక్‌లోని నీటిని మోటర్ పంపుల ద్వారా బయటకు పంపించారు. మూడు గంటలపైగా శ్రమించిన అధికారులు వెంకటేశ్ మృతదేహాన్నిబయటకు తీసి బంధువులకు అప్పగించారు. -
మళ్లీ రెచ్చిపోతున్న‘రియల్’ గ్యాంగ్స్
సాక్షి, హైదరాబాద్ : నగర శివార్లలో రియల్టీ బిజినెస్ స్పీడ్‌తో పాటు నయా గ్యాంగ్‌లు రెచ్చిపోతున్నాయి. ఉపయోగంలోకి రాని భూములపై కన్నేస్తూ... డబుల్ రిజిస్ట్రేషన్లకు తెగబడుతున్నాయి. ఇటీవల గ్రేటర్ పరిధిలోని భూముల ధరలకు రెక్కలు రావటంతో కొందరు గ్యాంగ్స్టర్లు ఎన్నారైలు, పారిశ్రామికవేత్తలు, చిరుద్యోగులు కొనుగోలు చేసి ఉపయోగంలోకి రాని భూములపై కన్నేశారు. వాటి డబుల్ రిజిస్ట్రేషన్లతో.. డబ్బుల పంటను పండించేస్తున్నారు. ఈ అక్రమ దందాకు పొలిటికల్, పోలీస్, సబ్‌రిజిస్ట్రార్ విభాగాలు పూర్తిగా సహకరిస్తుండటంతో ఎంతో మంది బాధితులు న్యాయం కోసం రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల మెట్లు ఎక్కుతున్నారు. పోలీస్ కమిషనరేట్‌కు వస్తున్న ప్రతి పది ఫిర్యాదుల్లో ఏడు నుంచి ఎనిమిది వరకు ఇలాంటి కేసులే వస్తుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో యాదాద్రి–భువనగిరి, ఎల్బీనగర్, బాలానగర్ డివిజన్ పరిధిలో అత్యధిక భూ సంబంధ వివాదాలు వస్తుండటం అందులో స్థానిక ప్రజాప్రతినిధులు, వారి సమీప బంధువులు, పోలీస్ అధికారుల ప్రమేయంపై ఫిర్యాదులు వస్తుండటం విశేషం. డబుల్ అంటే.. వెరీ స్పీడ్ డబుల్ రిజిస్ట్రేషన్స్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డబ్బులు వెదజల్లుతున్నాయి. ఒక మారు తన భూమిని విక్రయించిన వ్యక్తి,.. మరోసారి పాత రికార్డులతో యధేచ్ఛగా విక్రయిస్తున్నాడు. ఇందుకు డాక్యుమెంటు రైటర్లు, సబ్రిజిస్ట్రార్లు సహకరించి డబుల్ రిజిస్ట్రేషన్‌కు పాల్పడుతున్నారు. సంబంధిత ఆస్తి ఎవరి పేరు మీద ఉన్నదన్న విషయాన్ని తెలుసుకునే వీలు ఉన్నప్పటికీ..టైటిల్ వెరిఫికేషన్ వివరాల్లోకి సబ్రిజిస్ట్రార్లు వెళ్లకుండా లింక్ డాక్యుమెంట్ల ఆధారంగా పని కానిచ్చేస్తున్నారు. వాస్తవానికి నిషేధిత భూముల(ప్రభుత్వ, వక్ఫ్, భూదాన, దేవాలయ తదితరాలు)ను రిజిష్ట్ర్రేషన్ చేసే విషయంలో ఇటీవలి కాలంలో జాగ్రత్త పడుతున్న సబ్రిజిస్ట్రార్లు. ప్రైవేటు భూముల డబుల్ రిజిస్ట్రేషన్లలో మాత్రం ఏ మాత్రం తగ్గటం లేదు. ఈ విషయమై ఓ ఉన్నతాధికారిని ప్రశ్నిస్తే టైటిల్ వెరిఫికేషన్ తమ పరిధిలోకి రాదని చెబుతూ, ఆన్లైన్లోనే, ఒక మారు రిజిస్టర్ చేసిన భూములను మళ్లీ అదే వ్యక్తులు చేయకుండా నిరోధించే సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. అలా ఐతేనే అక్రమాలకు చెక్ చెప్పే చాన్స్ ఉంటుందన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో మళ్లీ అలజడి గ్యాంగ్‌స్టర్ నయీం ఆగడాలతో వణికిపోయిన యాదాద్రి భువనగిరి జిల్లాలో మళ్లీ రియల్ గ్యాంగ్‌లు రెచ్చిపోతున్నాయి. ఈ మారు పొలిటికల్ బాస్‌లు...వారి కనుసన్నల్లో నడిచే కొందరు పోలీస్ అధికారుల చర్యలతో ఆ ప్రాంతంలో భూములు కొనుగోలు చేసిన ఎన్నారైలు, పారిశ్రామికవేత్తలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా రాచకొండ పోలీస్ కమిషనర్‌ను దుబాయ్‌లో స్థిరపడ్డ ఫిలిప్స్ ఆనే ఎన్నారై కలిసి యాదగిరిగుట్టలో అక్కడి రాజకీయనాయకులు–ఒక పోలీస్ అధికారి తనను ఇబ్బందులకు గురి చేస్తున్న వైనాన్ని వివరించి న్యాయం చేయాలని వేడుకున్నాడు. తాను యాదగిరిపల్లిలో సర్వే నెంబర్ 146/ఎఎ/1లో 15.9.2000లో ఆకుల చిననర్సయ్య అనే వ్యక్తి నుండి ఐదెకరాలు భూమిని కొనుగోలు చేశానని, ఈ భూములకు సంబంధించిన మ్యుటేషన్, పాసుబుక్కుల పొందడం చేశానని, అలాగే కబ్జాలోనూ తానే ఉన్నానని వివరించాడు. అయితే అదే చిన నర్సయ్యతో కొందరు మళ్లీ భూమిని డబుల్ రిజిస్ట్రేషన్ చేయించుకుని, ఆలేరు నియోజకవర్గానికి చెందిన ఓ రాజకీయ నాయకుడు, ఓ పోలీస్ అధికారి అండతో తనను ఆ భూమి అమ్మేయాలని, లేదా సెటిల్ చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీనిపై సత్వరం స్పందించిన సీపీ మహేష్‌భగవత్ పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు. అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి భర్త అక్రమ భూ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. మరోవైపు ఇదే తరహాలో యాదాద్రి –భువనగిరి జిల్లా నుండి భారీఎత్తున రాచకొండ పోలీస్ కమిషనరేట్‌కు ఫిర్యాదులు వస్తుండటం విశేషం. హఫీజ్‌పేటలో భూముల వేట హఫీజ్‌పేట సర్వే నంబర్ 80లోని సుమారు 600 ఎకరాలను నిజాం హయాంనాటి ‘పైగా’ భూములుగా గుర్తించారు. ఈ భూములనూ కబ్జాచేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. వాస్తవంగా ఈ భూములను సర్వే నంబర్ 80(ఎ),80(బి),80(సీ),80(డీ)గా విభజించగా, ఈ భూముల్లో 80(డీ) భూములకు మాత్రమే కోర్టు అనుకూల ఉత్తర్వులు, ఆపై డిక్రీలున్నట్లు రెవెన్యూ అధికారుల నివేదికలు చెబుతున్నాయి. మిగిలిన మూడు సర్వే నెంబర్లకు డిక్రీలు లేవు. ఇందులో 80(ఎ) ఆక్రమణలకు గురికాగా, 80(బీ),80(సీ)ల సంబంధించిన వివాదాలు న్యాయస్థానాలు, ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. అయితే మియాపూర్ భూ కుంభకోణ సూత్రధారులే 80(డీ) పత్రాలను 80(బి)కి వర్తించేలా ఏర్పాట్లు చేస్తూ వాటిని విక్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఇక అందులో అధికారపార్టీ ప్రజాప్రతినిధులు, కొందరు పోలీస్ అధికారులు, ల్యాండ్ మాఫియా గ్యాంగ్స్టర్లకు వాటాలు ఇస్తామంటూ, మిగిలిన భూమిని ఓ బడా కంపెనీకి కట్టబెట్టే ఏర్పాట్లు చేసున్న అంశం ఉన్నతాధికారుల దృష్టికి చేరింది. అయినా ఈ భూములను ఎలాగైనా దక్కించుకునే దిశగా ప్రైవేటు వ్యక్తులు ప్రయత్నాలు చేస్తుండడం సైబరాబాద్ పోలీస్ అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది. -
బస్సు, బొలేరో ఢీ.. ముగ్గురు మృతి
అచ్చంపేట: మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట మండలం హఫీజ్‌పూర్ వద్ద సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు, బోలేరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో బోలెరోలో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా..మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను దగ్గరలో ఉన్న ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హఫీజ్‌పేటలో యువతిపై సామూహిక అత్యాచారయత్నం
హైదరాబాద్: మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్‌పేట్‌లో ఓ యువతిపై నలుగురు యువకులు అత్యాచారయత్నం చేశారు. ఆ నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం శ్రీకాకుళంకు చెందిన యువతిపై ఆటో డ్రైవర్, అతని స్నేహితులు ముగ్గురు కలసి సామూహిక అత్యాచారం చేయడానికి ప్రయత్నించారు. వారిని పోలీసులు అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రెండు వేల రూపాయల నగదు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ** -
హఫీజ్‌పేటలో ఉద్రిక్తత
హైదరాబాద్ నగరంలోని హఫీజ్‌పేటలో బుధవారం ఉదయం ఉద్రిక్తత నెలకొంది. స్థానికంగా నిర్మించిన అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. దాంతో అధికారుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తు... కూల్చివేస్తున్న నిర్మాణాలకు అడ్డంగా నిల్చున్నారు. ఆ క్రమంలో అధికారులు, స్థానికుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. దాంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. అయితే స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకోంది. అయితే హఫీజ్రపేటలో భారీగా పోలీసులు మోహరించారు.