
సాక్షి, హైదరాబాద్: హఫీజ్‌పేటలోని సర్వే నంబర్ 78కి సంబంధించి ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేయడానికి వీల్లేదని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) 2007లో జీవో నంబర్ 863 జారీ చేయడంతోపాటు 2012లో సర్క్యులర్ జారీ చేసినా రెవెన్యూ అధికారులు వందలాది రిజిస్ట్రేషన్లు చేశారని, ఎన్‌ఓసీలు ఇచ్చారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆరోపించారు. అలాగే ఆయా భూముల్లో నిర్మాణాలకు జీహెచ్‌ఎంసీ అధికారులు అనుమతులు మంజూరు చేశారన్నారు. నిబంధనలున్నవి సామాన్యులు, పేదలకేనా అని ప్రశ్నించారు.
ఈ మేరకు ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారికి లేఖ రాశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ లేఖను విడుదల చేశారు. ఓ నగల వ్యాపారి ఎగ్గొట్టిన రూ. 119 కోట్ల రికవరీలో భాగంగా అతను తనఖా పెట్టిన ఆ సర్వే నంబర్‌లోని 8 ఎకరాలను బ్యాంకులు వేలం వేసేందుకు ప్రయతి్నస్తే సుప్రీంకోర్టు దాకా వెళ్లి అడ్డుకున్న అధికారులు.. వారికి నచి్చన సంస్థలకు మాత్రం రిజిస్ట్రేషన్లు చేస్తున్నారన్నారు.
చదవండి: 'దక్షిణాదిన కేసీఆర్.. ఉత్తరాదిలో కేజ్రీవాల్.. చీల్చే పని వీళ్లదే..'
Comments
Please login to add a commentAdd a comment