land Registrations
-
4 వేల లావాదేవీలు.. రూ.20.8 కోట్ల ఆదాయం
సాక్షి, హైదరాబాద్: భూములు, ఆస్తుల క్రయ విక్రయాలు సర్వసాధారణంగా జరిగేవే. భూమిని అమ్ముకోవాలన్నా, కొనుక్కోవాలన్నా ప్రభుత్వ కార్యాలయంలో అధికారికంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందే. హక్కుల రికార్డు మ్యుటేషన్ జరగాల్సిందే. ఇలాంటి రిజిస్ట్రేషన్లు రాష్ట్రంలో రోజుకు ఎన్ని జరుగుతాయో తెలుసా.. తెలంగాణ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ తాజాగా విడుదల చేసిన అధికారిక నివేదిక ప్రకారం మన రాష్ట్రంలో రోజుకు సగటున 4 వేల వరకు క్రయవిక్రయ లావాదేవీలు జరుగుతున్నాయి. ఈ లావాదేవీల కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి రోజుకు సగటున రూ.20.8 కోట్ల ఆదాయం సమకూరుతోంది. ఈ పదేళ్లలో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తులకు సంబంధించి మొత్తం 1,46,18,601 లావాదేవీలు జరగ్గా, వీటిద్వారా రూ.76,201.17 కోట్ల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు సమకూరింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిన 2014–15 సంవత్సరంలో 8,27,374 లావాదేవీల ద్వారా రూ. 2,746 కోట్ల ఆదాయం రాగా, ఇటీవల ముగిసిన 2023–24 ఆర్థిక సంవత్సరంలో 18,41,324 లావాదేవీల ద్వారా రూ.14,588.06 కోట్ల ఆదాయం వచ్చిందని రిజిస్ట్రేషన్ల శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ పదేళ్లలో అత్యధికంగా 2021–22లో ఎక్కువ రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఆ ఏడాదిలో 20 లక్షల కంటే ఎక్కువ లావాదేవీలు జరగడం గమనార్హం. కాగా, మన పొరుగున ఉన్న రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో రిజిస్ట్రేషన్ల వృద్ధి కొంచం తక్కువగానే కనిపిస్తోంది. తెలంగాణలో టాప్ 30 సబ్‌రిజి్రస్టార్ కార్యాలయాలివే.. రిజిస్ట్రేషన్ల విషయంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల నుంచే సింహభాగం లావాదేవీలు జరుగుతాయి. ఆదాయం కూడా ఎక్కువగా ఇక్కడి నుంచే వస్తుందని గణాంకాలు చెపుతున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 144 సబ్‌రిజి్రస్టార్ కార్యాలయాల్లో 30 చోట్ల ఎక్కువగా లావాదేవీలు జరుగుతుంటాయి. ఈ జాబితాలో రంగారెడ్డి (ఆర్వో), గండిపేట, పఠాన్‌చెరు (ఆర్వో), కుత్బుల్లాపూర్, బంజారాహిల్స్, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, ఉప్పల్, మేడ్చల్ (ఆర్వో), కూకట్పల్లి, వరంగల్ (ఆర్వో), మహేశ్వరం, బాలానగర్, మల్కాజిగిరి, ఎల్బీనగర్, ఎస్ఆర్నగర్, చంపాపేట, ఆజంపుర, గోల్కొండ, నారపల్లి, సరూర్‌నగర్, వనస్థలిపురం, చిక్కడపల్లి, కాప్రా, వల్లభ్‌నగర్, కీసర, శంకర్పల్లి, ఇబ్రహీంపట్నం, ఖమ్మం (ఆర్వో), చేవెళ్ల ఉన్నాయని వార్షిక నివేదిక వెల్లడించింది. -
‘అసైన్డ్’ ఆగడం! రిజిస్ట్రేషన్లను నిలిపివేసిన చంద్రబాబు సర్కారు
సాక్షి, అమరావతి: అసైన్డ్ భూములపై వైఎస్సార్ సీపీ హయాంలో యాజమాన్య హక్కులు (ఫ్రీ హోల్డ్) పొందిన రైతన్నలపై కూటమి సర్కారు కక్ష సాధింపులకు దిగింది. దశాబ్దాల తర్వాత తమ భూములపై ఆంక్షలు తొలగిపోవడంతో సంతోషంగా సాధారణ రైతులుగా సాగు చేసుకుంటున్న వారిని మళ్లీ కష్టాల్లోకి నెట్టింది. గత ప్రభుత్వ హయాంలో అసైన్డ్ భూముల చట్ట సవరణ ద్వారా ఫ్రీ హోల్డ్ అయిన భూముల రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలని సీఎం చంద్రబాబు ప్రభుత్వం తాజాగా కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. అంతేకాకుండా ఫ్రీ హోల్డ్ అయిన భూములన్నింటిపైనా విచారణ నిర్వహించాలని, రీ వెరిఫికేషన్ చేయాలని స్పష్టం చేసింది. వాస్తవానికి టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లను అనధికారికంగా నిలిపివేసింది. ఇప్పుడు దాన్ని అధికారికంగా ప్రకటించింది. దీంతో లక్షలాది రైతు కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గత ప్రభుత్వం ఒరిజినల్ అసైనీలకు న్యాయబద్ధంగా, ఇష్టపూర్తిగా అమ్ముకునే హక్కు కల్పించింది. అసైన్డ్ పేదలకు భూములపై పూర్తి హక్కులతోపాటు అవసరాలకు విక్రయించుకునే అవకాశమిచ్చింది. ఒకవేళ ఇప్పటికే చేతులు మారినా ఒరిజినల్ అసైనీలకే హక్కులు ఉండేలా చర్యలు తీసుకుంది. మరి అలాంటప్పుడు అది బడుగు, బలహీన వర్గాల రైతులకు మేలు చేసినట్లా? కీడు చేసినట్లా? అని కూటమి ప్రభుత్వాన్ని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.చిరకాల వాంఛ నెరవేర్చిన వైఎస్ జగన్ ప్రభుత్వాల నుంచి భూములు పొందిన లక్షలాది మంది నిరుపేద రైతుల చిరకాల కోరికను నాడు వైఎస్ జగన్ ప్రభుత్వం నెరవేర్చింది. పేదలకు అసైన్ చేసిన (కేటాయింపు) భూములపై వారికి కేటాయించిన తేదీ నుంచి 20 సంవత్సరాల తర్వాత హక్కులు లభించేలా 1977–అసైన్డ్ భూముల చట్టానికి 2023లో కీలక సవరణ చేసింది. దీంతో 27 లక్షల మంది అసైన్డ్ భూముల రైతన్నలు తమ భూములపై హక్కులు (ఫ్రీ హోల్డ్) పొందే అవకాశం కలిగింది. అయితే అసైన్డ్ భూములు చాలా వరకు అన్యాక్రాంతమయ్యాయనే ఫిర్యాదుల నేపథ్యంలో ఒరిజినల్ అసైనీ (ఒరిజినల్ కేటాయింపుదారు)కే యాజమాన్య హక్కులు కల్పించింది. ఎవరు పడితే వారు అసైన్డ్ భూములను సొంతం చేసుకునే ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకుంది. చట్ట ప్రకారం ప్రభుత్వం నుంచి భూములు పొందిన వారు లేక వారి వారసులకు మాత్రమే అసైన్డ్ భూములపై హక్కులు కల్పించింది. ఈ క్రమంలో పూర్తి వెరిఫికేషన్ తర్వాత 9 లక్షల ఎకరాలపై సంబంధిత రైతులకు హక్కులు కల్పించి ఆ భూములను 22 ఏ జాబితా నుంచి తొలగించింది. మిగిలిన భూములపైనా వెరిఫికేషన్ పూర్తి చేసి 22 ఏ జాబితా నుంచి తొలగించాల్సి ఉండగా కూటమి సర్కారు ఆ పని నిలిపివేసింది. అంతటితో ఆగకుండా గత ప్రభుత్వం 22ఏ జాబితా నుంచి తొలగించిన భూములకు చెందిన రైతులపైనా విచారణ పేరుతో కక్ష సాధింపులకు దిగింది. విచారణలో సక్రమమని తేలిన భూములపైనా ఆంక్షలు కొనసాగించాలని, ప్రభుత్వానికి తెలియకుండా వాటిని 22 ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించకూడదని స్పష్టం చేయడాన్ని బట్టి చంద్రబాబు సర్కారు పేద అసైన్డ్ రైతులపై ఎంత క్షక్ష పూరితంగా వ్యవహరిస్తోందో అర్థం చేసుకోవచ్చు.రైతుల చేతుల్లోనే 97.22 శాతం భూములు వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో పేదల అసైన్డ్ భూములు ఫ్రీ హోల్డ్ కావడం, వాటిపై వారికి సంపూర్ణ హక్కులు లభించడంతో ఏదో గోల్మాల్ జరిగిందని, అన్యాక్రాంతమయ్యాయని కూటమి సర్కారు దుష్ప్రచారం చేస్తోంది. వాస్తవానికి 22 ఏ జాబితా నుంచి తొలగించిన 9 లక్షల ఎకరాల్లో విక్రయాలు జరిగింది కేవలం 25 వేల ఎకరాలు (2.78 శాతం) మాత్రమే. అంటే ఒరిజినల్ అసైనీలు మాత్రమే ప్రయోజనం పొందారు. మిగిలిన 97.22 శాతం భూములపై కూడా హక్కులు ఒరిజినల్ రైతుల చేతుల్లోనే ఉన్నాయి. దీన్ని చంద్రబాబు ప్రభుత్వం తప్పుగా చిత్రీకరిస్తూ అసైన్డ్ భూముల చట్ట సవరణను తప్పు పడుతోంది. అదే సమయంలో చట్ట సవరణను కొనసాగిస్తామని ప్రకటించింది. దీన్నిబట్టి అసైన్డ్ భూములపై దళితులకు, బడుగులకు హక్కులు దక్కకూడదన్నదే చంద్రబాబు సర్కారు లక్ష్యంగా కనపడుతోంది.విస్తృత అధ్యయనం తర్వాతే చట్ట సవరణఅసైన్డ్ భూములపై పేద రైతులకు యాజమాన్య హక్కులు కల్పించటానికి ముందు వైఎస్ జగన్ ప్రభుత్వం విస్తృతంగా అధ్యయనం చేసింది. అప్పటి రెవెన్యూ మంత్రి నేతృత్వంలో ఎమ్మెల్యేలతో కమిటీని నియమించింది. వివిధ రాష్ట్రాల్లో పర్యటించిన కమిటీ అసైన్మెంట్ భూముల చట్టాలు, నియమ నిబంధనలను క్షుణ్నంగా పరిశీలించి గత ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అసైన్ చేసిన 20 ఏళ్ల తర్వాత ఒరిజినల్ లబ్ధిదారులకు లేదా వారి వారసులకు అవసరమైనప్పుడు అమ్ముకునేందుకు వీలు కల్పించాలని, అందుకు అనుగుణంగా ఏపీ అసైన్మెంట్ చట్టం (పీఓటీ)– 1977కి సవరణలు చేయాలని కమిటీ సిఫారసు చేసింది.పీఓటీ 1977 చట్టం స్ఫూర్తిని గౌరవిస్తూ.. అసైన్డ్ భూములపై లబ్ధిదారులకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పించాలని గత ప్రభుత్వానికి కమిటీ సిఫారసు చేయగా దీనికి నాటి మంత్రివర్గం ఆమోదం తెలిపి చట్టానికి సవరణలు చేసింది. 20 ఏళ్లకు ముందే ఎవరైనా పేద రైతుల నుంచి భూములు కొనుక్కుంటే వారికి ఎలాంటి ప్రయోజనం దక్కని విధంగా కూడా అదే సందర్భంలో చట్ట సవరణ చేసింది. తద్వారా అసైన్డ్ భూములు అన్యాక్రాంతం కాకూడదన్న ఒరిజినల్ పీఓటీ (ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్)–1977 చట్టం స్ఫూర్తిని గౌరవించింది. తద్వారా అసైన్మెంట్ అయిన దగ్గర నుంచి 2023లో చట్ట సవరణ జరిగే వరకూ అసైన్డ్ భూమిలో వ్యవసాయం చేసుకుంటున్న నిరుపేద బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చెందిన రైతులకు మాత్రమే మేలు జరుగుతుంది. ఇలా ఒరిజనల్ అసైనీలకు మాత్రమే ప్రయోజనం దక్కేలా చర్యలు తీసుకున్నారు.పేద రైతులను రోడ్డుకీడ్చేసి..గత ప్రభుత్వం ఇంత పకడ్బందీగా చట్ట సవరణ చేసి అసైన్డ్ భూములపై విప్లవాత్మక నిర్ణయం తీసుకుంటే దాన్ని వక్రీకరించి భూములన్నీ అన్యాక్రాంతమైనట్లు ఆరోపణలు చేయడం వెనుక రాజకీయ కుట్ర మినహా మరేమీ లేదని స్పష్టమవుతోంది. వైఎస్సార్సీపీ నేతలు అసైన్డ్ భూములను సొంతం చేసుకున్నట్లు కూటమి సర్కారు అభాండాలు మోపుతోంది. ఫ్రీ హోల్డ్ అయిన 9 లక్షల ఎకరాల్లో రిజిస్ట్రేషన్లు జరిగింది కేవలం 25 వేల ఎకరాలే. అందులో ఎక్కడైనా తేడాలున్నాయని భావిస్తే విచారణ నిర్వహించుకోవచ్చు. అంతేగానీ ఒరిజినల్ అసైనీల చేతుల్లో ఉన్న మొత్తం ఫ్రీహోల్డ్ భూములన్నింటిలోనూ తప్పులు జరిగాయని వితండవాదం చేస్తూ ఆ రైతులను రోడ్డు కీడ్చడం కచ్చితంగా పేదలపై కక్ష సాధించడమే. పేదలంతా వైఎస్ జగన్‌కు అండగా ఉండడాన్ని జీర్ణించుకోలేని కూటమి సర్కారు వారిని ఇక్కట్లకు గురి చేస్తూ బురద జల్లడానికి సిద్ధపడినట్లు స్పష్టమవుతోంది. ఆ ఉత్తర్వులు అన్యాయం..ఏళ్ల తరబడి అనుభవంలో ఉన్న అసైన్డ్ భూములపై రైతులకు సంపూర్ణ హక్కులను మాజీ సీఎం వైఎస్ జగన్ కల్పించారు. పేద రైతులపై కక్ష సాధించేలా అసైన్డ్ భూములను రిజిస్ట్రేషన్ చేయకూడదని, వాటిపై విచారణ జరపాలని కూటమి ప్రభుత్వం ఆదేశించడం దారుణం. చిప్పాడ పంచాయితీలో మా అమ్మ వెంకాయమ్మ పేరుతో 2 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. రిజిస్ట్రేషన్ కోసం మేం చేసుకున్న దరఖాస్తు పెండింగ్‌లో ఉండగా నిలిపివేయాలని ఆదేశిచడం అన్యాయం.– కొయ్య అప్పల సూర్యనారాయణరెడ్డి, పాత మూలకుద్దు, భీమిలి మండలంబ్యాంకు రుణాలు రాకుండా చేసింది..ప్రభుత్వం పంపిణీ చేసిన భూములు 20 ఏళ్లకు పైబడి లబ్ధిదారుల అధీనంలో ఉంటే సంపూర్ణ యాజమాన్య హక్కులు దక్కేలా గత ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఆ ప్రక్రియ కొనసాగుతుండగా టీడీపీ కూటమి ప్రభుత్వం రిజిస్ట్రేషన్లను నిలుపుదల చేయడం దారుణం. భూములు చేతిలో ఉన్నా అవసరానికి బ్యాంకు రుణాలు పొందేందుకు అవకాశం లేకుండా చేసింది. గత ప్రభుత్వం కల్పించిన వెసులుబాటును రద్దు చేయడం సరికాదు. – ఆండ్రా వెంకట సుబ్బారెడ్డి, రైతు, ఆత్మకూరుమళ్లీ కష్టాలు మొదలుఏళ్ల తరబడి అసైన్డ్ భూములను అనుభవిస్తున్న రైతులకు మేలు కలిగేలా గత ప్రభుత్వం చొరవ తీసుకుని యాజమాన్య హక్కులు కల్పించింది. ఇప్పుడు రైతులకు కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. భూములను తనఖా పెట్టి రుణాలు పొందేందుకు అవకాశం లేకుండా చేసింది.– మెట్టుకూరు చంద్రశేఖర్‌రెడ్డి, రైతు, గోవిందంపల్లి, అనంతసాగరం మండలంనిలిపివేయడం అన్యాయం..గత ప్రభుత్వం అసైన్డ్ భూములపై పేదలకు కల్పించిన యాజమాన్య హక్కులను కూటమి సర్కారు హరించడం దారుణం. ఇది పేద రైతుల కడుపు కొట్టడమే. అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లతో ఎంతో మంది పేద రైతులు ఆర్ధికంగా నిలదొక్కుకున్నారు. – బోస నర్సింగరావు, జేవి అగ్రహారం, భీమిలి నియోజకవర్గంరోడ్ల పైకి రైతులుమాకు భూములున్నా యాజమాన్య హక్కులు కల్పించకుండా కూటమి ప్రభుత్వం అడ్డుపడటం సరికాదు. సక్రమంగా రిజిస్ట్రేషన్లు జరిగిన వాటిని కూడా పెండింగ్‌లో ఉంచాలని నిర్ణయించడం ఏమిటి? కూటమి ప్రభుత్వం దీన్ని ఉపసంహరించుకోకుంటే లక్షల మంది పేద రైతులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది.– పెద్దాడ వెంకటప్పారావు, జేవి అగ్రహారం, భీమిలి నియోజకవర్గం. పేదల కడుపుకొడుతున్నారు..మాకు తిరుపతి సమీపంలో నాలుగు ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. గత ప్రభుత్వం సర్వ హక్కులు కల్పిస్తూ ఉత్తర్వులు ఇవ్వడంతో ఎంతో సంతోషపడ్డాం. గతంలో ఎంతో మంది పాలకులు హామీలిచ్చినా నెరవేర్చలేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం మాత్రమే రిజిస్ట్రేషన్‌కు అనుమతి ఇచ్చింది. కొత్త ప్రభుత్వం రాగానే ఫ్రీ హోల్డ్ పేరుతో అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్‌ను నిలుపుదల చేయడం దారుణం. పేదల పట్ల ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సమంజసం కాదు. చంద్రబాబు నిరుపేదల కడుపు కొడుతున్నారు. –ప్రభాకర్, భైరాగిపట్టెడ, తిరుపతి అన్యాయం చేయొద్దు..మాకున్న అసైన్డ్ భూమికి గత ప్రభుత్వంలో సర్వహక్కులు కల్పించారు. రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు కూడా అవకాశం కల్పించారు. చాలా ఆనందం వేసింది. చాలా ఏళ్లుగా ఉన్న సమస్య గత ప్రభుత్వంలో పరిష్కారమైంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం నిలిపి వేయడం వల్ల ఎంతో మంది రైతులు నష్టపోతారు. సీఎం చంద్రబాబు రైతులకు మేలు చేయాలే కానీ అన్యాయం చేయకూడదు. ప్రీహోల్డ్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి. – సుబ్బానాయుడు, రైతు, 50 బసివిరెడ్డిపల్లి గ్రామం, గంగాధర నెల్లూరు, చిత్తూరు జిల్లా రైతులకు తీవ్ర ఇబ్బందులు..ఫ్రీ హోల్డ్ అయిన చుక్కల భూములు, అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లు నిలిపివేయడం దారుణం. దీనివల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. గత ప్రభుత్వం అన్ని రకాల విచారణలు నిర్వహించాకే అనుమతించింది.– జీ రామయ్య, రైతు, పొదలకూరు మండలంకథ మళ్లీ మొదటికే..దశాబ్దాల తర్వాత రైతులు కష్టాలు తీరాయనుకుంటే మళ్లీ మొదలవుతున్నాయి. అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లు నిలుపుదల చేయడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని సంతోషపడుతున్న సమయంలో రిజిస్ట్రేషన్లు నిలిపివేయడం వల్ల కథ మొదటికి వస్తుంది. ప్రభుత్వం దీనిపై పునరాలోచించాలి.– వి.దయాకర్‌రెడ్డి, పొదలకూరు మండలం -
నిర్ణయమే మిగిలింది.. రిజిస్ట్రేషన్ విలువల సవరణ క్షేత్రస్థాయి కసరత్తు పూర్తి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ల విలువల సవరణ కసరత్తు క్షేత్ర స్థాయిలో పూర్తయింది. గత నెల 18వ తేదీ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. కాగా రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తీసుకునే తుది నిర్ణయం కోసం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఎదురుచూస్తోంది. క్షేత్రస్థాయి కమిటీల ప్రతిపాదనలను కొత్త కమిషనర్ జ్యోతి బుద్ధప్రకాశ్ ఇటీవల జిల్లా రిజిస్ట్రార్లు, డీఐజీలతో కలిసి సమీక్షించారని, అన్ని కేటగిరీలు, స్థాయిల్లో ప్రతిపాదించిన కనిష్ట, గరిష్ట విలువలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సి ఉందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. వీలున్నంత త్వరలోనే రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి ఈ విలువల ప్రతిపాదనలను వివరిస్తామని, ఆ తర్వాత రెవెన్యూ మంత్రితో కలిసి ముఖ్యమంత్రితో భేటీ కావాల్సి ఉందని, ఆ భేటీలో తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉందని వివరిస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయం పూర్తి కాగానే మిగిలిన షెడ్యూల్ మేరకు ముందుకెళతామని, క్షేత్రస్థాయి కమిటీల ప్రతిపాదనలకు ఆమోదం తీసుకుని, శాఖా పరమైన సాఫ్ట్‌వేర్‌లో అప్డేట్ చేస్తే సరిపోతుందని అంటున్నారు. సీఎం స్థాయిలో నిర్ణయం తీసుకుంటే వచ్చే నెల 1వ తేదీ నుంచే సవరించిన విలువలను అమల్లోకి తెస్తామని అధికారులు చెబుతున్నారు. గతానికి భిన్నంగా క్షేత్రస్థాయిలో.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ల విలువలను ఒకేసారి సవరించారు. అప్పుడు క్షేత్రస్థాయి నుంచి కసరత్తు చేయకుండా, రాష్ట్ర స్థాయిలో నిర్ణయించిన మార్గదర్శకాల ప్రకారం విలువలు నిర్ణయించారు. కాగా ప్రభుత్వం మరోసారి భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ల విలువల సవరణకు నిర్ణయం తీసుకోవడంతో..గత నెల 15వ తేదీన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు వెలువరించింది. వాటి ప్రకారమే క్షేత్రస్థాయి నుంచి కసరత్తు ప్రారంభమైంది. వ్యవసాయ భూములు, వ్యవసాయేతర భూములు (ఖాళీ నివాస స్థలాలు), ఆస్తుల (అపార్ట్మెంట్లు, వాణిజ్య భవనాలు) విలువలను క్షేత్రస్థాయిలో ఉన్న మార్కెట్ ధరలకు అనుగుణంగా పెంచాలని సూత్రప్రాయంగా తీసుకున్న నిర్ణయం మేరకు రిజిస్ట్రేషన్ విలువల కసరత్తు జరిగింది. ఖాళీ స్థలాలు, అపార్ట్మెంట్ల విషయంలో ప్రస్తుతం మార్కెట్ ధర ఎంత ఉందో చూసి అందులో సగం మేరకు విలువలను సవరించే ప్రయత్నం జరిగింది. మూడు కేటగిరీల్లో నిర్ధారణ వ్యవసాయ భూముల విలువలను మూడు కేటగిరిల్లో నిర్ధారించారు. గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూములకు ఒక విలువ, వెంచర్లు చేసేందుకు సిద్ధంగా ఉన్న భూములకు ఇంకో విలువ, హైవేల పక్కన ఉండే వ్యవసాయ భూములకు మరో విలువను ప్రతిపాదించారు. అందులో భాగంగా ఏజెన్సీ ప్రాంతాలు మినహాయించి వ్యవసాయ భూమి కనిష్ట విలువ రూ.5 లక్షలుగా ప్రతిపాదించారు. ఆపై రూ.50 లక్షల వరకు వ్యవసాయ భూముల విలువలను ప్రతిపాదించగా, వెంచర్లకు సిద్ధంగా ఉన్న భూములు, హైవేల పక్కన ఉండే భూములను అక్కడి విలువల ప్రాతిపదికన రూ.40 లక్షల నుంచి 2.90 కోట్ల వరకు ప్రతిపాదించారు. ఈ విలువల మేరకు 7.5 శాతం రిజిస్ట్రేషన్ చార్జీలు చెల్లించే విధంగా ప్రతిపాదనలను సిద్ధం చేశారు. ఇక నివాస స్థలాల చదరపు గజం కనీసం రూ.500, అపార్ట్మెంట్ల చదరపు అడుగు కనీసం రూ.1000గా ప్రతిపాదించారు. ప్రజాభిప్రాయం లేకుండానే..? క్షేత్రస్థాయి కమిటీల ప్రతిపాదనలకు ఆమోదం లభించిన అనంతరం ఈనెల ఒకటో తేదీ నుంచే సవరించిన విలువల వివరాలు ఆన్లైన్లో అందుబాటులో ఉంచాల్సి ఉంది. ఈ మేరకు గత నెల 15వ తేదీన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వెలువరించిన మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఈ మార్గదర్శకాల ప్రకారం రిజిస్ట్రేషన్ల శాఖ ప్రతిపాదించిన విలువలపై ఈ నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రజల అభిప్రాయాలు, అభ్యంతరాలను స్వీకరించి వాటిపై సమీక్ష చేసిన అనంతరం తుది విలువలను నిర్ధారించాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు కూడా క్షేత్రస్థాయి కమిటీల ప్రతిపాదనలను ఆన్లైన్లో పెట్టలేదు. అయితే గతంలో రిజిస్ట్రేషన్ విలువలను సవరించిన రెండుసార్లు ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదు. ఈసారి ప్రజల అభిప్రాయాలను తీసుకోవాలనుకున్నా సమయం సరిపోయేలా లేదని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల అభిప్రాయాలు తెలుసుకునే గడువును కుదిస్తారని లేదంటే ఈసారి కూడా ప్రజాభిప్రాయం లేకుండానే తుది విలువలను నిర్ధారించే అవకాశాలున్నాయని ఆ శాఖ అధికారులు చెబుతుండడం గమనార్హం. -
కోడ్ మూడ్‌లోనే రెవెన్యూ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెవెన్యూ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు మినహా ఆ శాఖ పరిధిలో ఎలాంటి లావాదేవీలు జరగడం లేదని, ఎన్నికల కోడ్ కారణంగా గత రెండున్నర నెలలుగా ఇదే పరిస్థితి నెలకొందని తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిందన్న సాకుతో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ధరణి సమస్యలను పరిష్కరించేందుకు కూడా రెవెన్యూ వర్గాలు ముందుకు రాకపోవడం గమనార్హం. ధరణి పోర్టల్‌తో పాటు జీవో 59 కింద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై నిర్ణయాలు తీసుకోవాల్సిన కలెక్టర్లు ఆ ఫైళ్లన్నింటినీ పక్కన పెట్టేయడం, తాజాగా ఎన్నికల కోడ్ ముగిసిన తర్వా త కూడా వాటిని పరిశీలించకపోవడంతో ఏం చేయాలో పాలుపోని స్థితి నెలకొందని రెవెన్యూ వర్గాలే అంటున్నాయి. దీనికి తోడు భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) కార్యాలయం కూడా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి సుప్త చేతనావస్థలోకి వెళ్లిపోయిందని, కనీసం క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో కూడా ఆరా తీసే పరిస్థితి లేకుండా పోయిందని రెవెన్యూ సిబ్బంది వాపోతున్నారు. కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు ఈ ఏడాది సెపె్టంబర్ నుంచే రాష్ట్రంలో ఎన్నికల సందడి ప్రారంభమయింది. అక్టోబర్‌లో ఎన్నికల షెడ్యూల్రాగా, నవంబర్‌లో నోటిఫికేషన్ వెలువడింది. అయితే షెడ్యూల్ వెలువడిన నాటి నుంచే కోడ్ అమల్లోకి రావడంతో అప్పటి నుంచి రెవెన్యూ లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎన్నికల నిర్వహణలో రెవెన్యూ సిబ్బందిదే కీలక పాత్ర కావడం, తహసీల్దార్లు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా, ఆర్డీవోలు రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరించాల్సి ఉండటంతో వారు రెవెన్యూ పనులన్నింటినీ పక్కన పెట్టి ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యారు. ఇక కలెక్టర్లు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారులుగా ఈనెల 4వ తేదీ వరకు (ఎన్నికల కోడ్ ముగిసే వరకు) బిజీబిజీగా ఉన్నారు. దీంతో తహసీల్దార్ నుంచి కలెక్టర్ స్థాయి వరకు రెవెన్యూ వ్యవహారాలు పూర్తి స్థాయిలో నిలిచిపోయాయి. కనీసం విరాసత్, పెండింగ్ డిజిటల్ సంతకాల దరఖాస్తులను కూడా పరిష్కరించలేదు. దీంతో ప్రస్తుతం ధరణి, జీవో 59 (ప్రభుత్వ భూముల క్రమబద్ధికరణ)లకు చెందిన లక్షలాది మంది దరఖాస్తుదారులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. తదుపరి ఆదేశాల వరకు పెండింగ్‌లోనే? రాష్ట్రంలో అధికారం చేతులు మారిన నేపథ్యంలో రెవెన్యూ శాఖకు సంబంధించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు రెవెన్యూ కార్యకలాపాలు ముట్టుకో వద్దని, అన్ని ఫైళ్లు పెండింగ్‌లో పెట్టాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయని, ఈ మేరకు కలెక్టర్లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో చెప్పా రని అంటున్నారు. మరోవైపు రెవెన్యూ కార్యకలాపాలపై ఎలాంటి నిర్ణయాలూ తీసుకోవద్దని సీసీఎల్ఏ కార్యాలయానికి స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయని కూడా సమాచారం. అయితే ఇవి కేవలం మౌఖిక ఆదేశాలు మాత్రమేనని స్పష్టం చేస్తున్నారు. ఈ ఆదేశాల నేపథ్యంలోనే రెవెన్యూ వ్యవహారాలు స్తబ్దుగా మారాయని ఆ శాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ‘రెవెన్యూ వ్యవహారాలపై ప్రభుత్వం ఆదేశాలివ్వడం కొత్తేమీ కాదు. కానీ అధికారంలో ఉన్న పార్టీ మారడంతో రెవెన్యూ సిబ్బందిలో కొంత కంగాళీ ఉన్న మాట మాత్రం వాస్తవం. ఏం చేస్తే ఏం జరుగుతుందోననే ఆందోళనతో ప్రభుత్వ ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు..’ఈ శాఖ ముఖ్య అధికారి ఒకరు చెప్పారు. అయితే ‘ఎప్పటివో పాత దరఖాస్తులు పరిష్కరించేందుకు అడ్డు వచ్చిందెవరు? జీవో 59 కింద దరఖాస్తులు స్వీకరించి ఆరు నెలలు దాటిపోయింది. వాటి పరిష్కారం వద్దని ప్రభుత్వం ఎందుకు అంటుంది?’అని ప్రశ్నించారు. పైగా వీటి పరిష్కారం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కదా? ’అని అన్నారు. -
సర్వే నంబర్ల స్థానంలో ఎల్పీఎం నంబర్లు
సాక్షి, అమరావతి : వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేపట్టిన భూముల రీ సర్వేతో రాష్ట్రంలోని భూమి రికార్డుల స్వరూపం పూర్తిగా మారిపోనుంది. ప్రస్తుతం ఉన్న సర్వే నంబర్లు కనుమరుగై, వాటి స్థానంలో ల్యాండ్ పార్సిల్ మ్యాప్ (ఎల్‌పీఎ) నంబర్లు రానున్నాయి. ఇప్పటికే సర్వే పూర్తయిన 2 వేల గ్రామాల్లో ఎల్పీఎం నంబర్లతోనే కార్యకలాపాలు జరుగుతున్నాయి. భూముల రిజిస్ట్రేషన్లు కూడా కొత్త నంబర్లతోనే జరగనున్నాయి. బ్రిటిష్ కాలంలో భూములను సర్వే చేసి ఇచ్చిన నంబర్లే ఇప్పటికీ రికార్డుల్లో ఉన్నాయి. ఒక సర్వే నంబరులో 2 నుంచి 10 అంతకంటె ఎక్కువ మంది భూయజమానులు ఉన్నారు. ఒక సర్వే నంబరులో 30 ఎకరాల భూమి ఉంటే అందులో 10, 15 మంది పేర్లు కూడా ఉన్నాయి. దీనివల్ల లెక్కలేనన్ని భూ సమస్యలు, వివాదాలు ఏర్పడ్డాయి. భూముల రీ సర్వే ద్వారా వైఎస్ జగన్ ప్రభుత్వం దీనికి పరిష్కారం చూపింది. ప్రతి భూ కమతానికి ఎల్పీఎం నంబరు, ప్రతి యజమానికి ఆధార్ తరహాలో ఒక ఐడీ నంబరు ఇస్తోంది. మారనున్న 1.96 కోట్ల సర్వే నంబర్లు రాష్ట్రంలో 17,460 రెవెన్యూ గ్రామాలు, వాటి పరిధిలో 90 లక్షల మంది పట్టాదారులు (భూ యజమానులు) ఉన్నారు. ఈ పట్టాదారులకు చెందిన 2.26 కోట్ల ఎకరాల భూమి 1.96 కోట్ల సర్వే నంబర్లుగా రికార్డుల్లో విభజించి ఉంది. రీ సర్వేలో ఈ మొత్తం విస్తీర్ణాన్ని డ్రోన్, ఏరియల్ సర్వే, అవి చేయలేని చోట డీజీపీఎస్ సర్వే ద్వారా కొలుస్తున్నారు. కొలిచిన తర్వాత ప్రతి ల్యాండ్ పార్సిల్‌కు ఎల్పీఎం నంబరు, ఆధార్ మాదిరిగానే భూదార్ పేరుతో విశిష్ట గుర్తింపు సంఖ్య, జియో కోఆర్డినేట్స్‌ను ప్రభుత్వం కేటాయిస్తోంది. సర్వే అనంతరం ప్రతి రైతుకి ప్రభుత్వం ఇచ్చే భూ హక్కుపత్రంలో ఆ వివరాలు నమోదు చేస్తున్నారు. ఇందులోనే యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్, యజమాని ఫొటో, క్యూఆర్ కోడ్ ఉంటాయి. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే ఆ రైతుకు సంబంధించిన భూమి కొలతలు, భూ విస్తీర్ణం వంటి వివరాలన్నీ కనపడతాయి. ఈ ఎల్ï³ఎం నంబర్ల ప్రకారమే క్రయ విక్రయ రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ రికార్డుల్లో అప్డేట్లు జరుగుతాయి. దీనివల్ల మోసపూరిత రిజిస్ట్రేషన్లకు, రికార్డుల ట్యాంపరింగ్‌కు అవకాశం ఉండదు. వెబ్‌ల్యాండ్–2లో ఎల్పీఎం నంబర్లు రీ సర్వే ద్వారా కొత్తగా తయారు చేస్తున్న డిజిటల్ రెవెన్యూ రికార్డుల్లో ఇకపై ఎల్పీఎం నంబర్లే ఉంటాయి. సర్వే పూర్తయిన 2 వేల గ్రామాల్లోని రెవెన్యూ రికార్డులన్నీ ఇప్పటికే ఎల్పీఎం నంబర్లతో అప్డేట్ చేశారు. ఆ గ్రామాల్లో రిజిస్ట్రేషన్లు వీటి ద్వారానే నిర్వహిస్తున్నారు. రెవెన్యూ శాఖ రీ సర్వే పూర్తయిన గ్రామాల వివరాలతో ఇప్పటికే వెబ్‌ల్యాండ్–2 ఆన్లైన్ పోర్టల్‌ను అందబాటులోకి తెచ్చింది. ఆ రికార్డుల ద్వారా రిజిస్ట్రేషన్ల శాఖ సాఫ్ట్‌వేర్‌ను అనుసంధానించారు. సర్వే పూర్తయ్యే గ్రామాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఆ గ్రామాల్లో ఎల్పీఎం ఆధారిత రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. త్వరలో మరో 2 వేల గ్రామాల్లో రీ సర్వే పూర్తవుతోంది. ఆ గ్రామాలను కూడా వెబ్‌ల్యాండ్–2కి మార్చనున్నారు. ఇలా విడతల వారీగా రాష్ట్రమంతా వెబ్‌ల్యాండ్–2కి మారిపోతుంది. భవిష్యత్తులో ఎల్పీఎం నంబర్ల ద్వారానే భూముల్ని గుర్తిస్తారు. -
AP: ఆస్తుల రిజిస్ట్రేషన్లు సులభతరం.. స్పెషల్ సాఫ్ట్వేర్ ‘కార్డ్ ప్రైమ్’
సాక్షి, అమరావతి: ఇది టెక్నాలజీ యుగం. అన్ని పనులు ఆన్లైన్లోనే, అరచేతిలోనే నిమిషాల్లో అయిపోతున్నాయి. ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. వేచి ఉండాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇకపై ఆస్తుల రిజిస్ట్రేషన్లు కూడా ఆన్లైన్లోనే చేసుకోవచ్చు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖను రాష్ట్ర ప్రభుత్వం టెక్నాలజీ వైపు నడిపిస్తోంది. కంప్యూటర్ ఎయిడెడ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డిపార్టుమెంట్ (కార్డ్)ను ఆధునీకరించి కార్డ్ 2.0కు రూపకల్పన చేస్తోంది. ‘కార్డ్ ప్రైమ్’ పేరుతో ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందిస్తోంది. దీని ద్వారా స్టాంపు పేపర్లు, సంతకాలతో పనిలేకుండా రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. డాక్యుమెంట్‌ను ఎవరికివారే ఆన్లైన్లో తయారు చేసుకుని, ఆన్లైన్లోనే చలానా (స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు) కట్టి, ఒక టైం స్లాట్‌ను (అపాయింట్మెంట్) బుక్ చేసుకుని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, లేదా గ్రామ, వార్డు సచివాలయానికి వెళితే అక్కడ వెంటనే రిజిస్ట్రేషన్ పూర్తి చేసే విధానం త్వరలో అందుబాటులోకి రానుంది. కొత్త విధానంలో సులభంగా రిజిస్ట్రేషన్లు ప్రస్తుత విధానంలో డాక్యుమెంట్ తయారీ, చలానా కట్టడం వంటివన్నీ రిజిస్ట్రేషన్ల శాఖతో సంబంధం లేకుండా బయట జరుగుతున్నాయి. వీటిని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇస్తే అక్కడ రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇదో పెద్ద ప్రహసనం. కార్డ్ ప్రైమ్ విధానంలో చాలా తక్కువ సమయంలో సులభంగా రిజిస్ట్రేషన్లు ప్రక్రియ పూర్తవుతుంది. కేవలం బయోమెట్రిక్ ద్వారా వేలిముద్ర వేయడానికి 5 నుంచి 10 నిమిషాలు ఉంటే సరిపోతుందని అధికారులు చెబుతున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం బయట జరిగే పనిని సులభంగా ఆన్లైన్లో చేసుకోవచ్చు. దీన్ని పబ్లిక్ డేటా ఎంట్రీ ఇంటిగ్రేషన్ అంటారు. అంటే వినియోగదారులే ఆన్లైన్లో డాక్యుమెంట్ తయారు చేసుకోవచ్చు. ఆస్తి వివరాలు, పేరు, ఆధార్, సాక్షులు వంటి సమాచారాన్ని ఆన్లైన్లో ఎంటర్ చేస్తే వెంటనే ఆస్తి మార్కెట్ విలువ, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, యూజర్ ఛార్జీలు ఎంత కట్టాలో చూపిస్తుంది. ఆ సొమ్మును ఆన్లైన్లో చెల్లించొచ్చు. ఆఫ్‌లైన్, స్టాక్‌హోల్డింగ్ ద్వారా కూడా చలానా కట్టొచ్చు. అనంతరం రిజి్రస్టేషన్కి టైమ్ స్లాట్ బుక్ చేసుకోవాలి. ఆ సమయానికి సబ్ రిజి్రస్టార్ కార్యాలయం లేదా గ్రామ/వార్డు సచివాలయానికి వెళితే అక్కడ అప్లికేషన్లో నమోదు చేసిన ఆధార్ వివరాలను సరి చూస్తారు. బయోమెట్రిక్ ద్వారా వినియోగదారుని వేలిముద్ర తీసుకుంటారు. రిజిస్ట్రేషన్‌తోపాటే సబ్ డివిజన్, మ్యుటేషన్ ఇదంతా అయిన తర్వాత ఆ ఆస్తిని సబ్ డివిజన్ చేయాల్సి వస్తే వెంటనే చేస్తారు. పాత విధానంలో రిజి్రస్టేషన్ పూర్తయ్యాక దాన్ని రెవెన్యూ శాఖలో సబ్ డివిజన్ చేయించడం ఓ పెద్ద ప్రహసనం. కార్డ్ ప్రైమ్‌లో రిజిస్ట్రేషన్ సమయంలోనే సబ్ డివిజన్ (అవసరమైతే) పూర్తవుతుంది. వ్యవసాయ భూములైతే మ్యుటేషన్ కూడా ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది. దానికోసం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. రెవెన్యూ రికార్డుల్లో పేరు కూడా వెంటనే మారిపోతుంది. ఇందుకోసం కార్డ్ 2.0ని రెవెన్యూ శాఖ వెబ్‌ల్యాండ్ సాఫ్ట్వేర్కి అనుసంధానం చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత రిజిస్ట్రేషన్లు డాక్యుమెంట్‌ను ప్రింట్ తీసి ఇస్తారు. గతంలో మాదిరిగా స్టాంప్ పేపర్ల అవసరం ఉండదు. వినియోగదారుడు కోరుకొంటే స్టాంప్ పేపర్లపై ప్రింట్ ఇస్తారు. ఈ విధానంలో వినియోగదారుడు ఎక్కడా సంతకం పెట్టాల్సిన అవసరం ఉండదు. ఈ–సైన్‌తోనే పని పూర్తవుతుంది. సులభం.. పారదర్శకం.. కార్డ్ ప్రైమ్ ద్వారా రిజిస్ట్రేషన్ల విధానం మరింత సులభమవుతుంది. మొత్తం ప్రక్రియ ఆన్లైన్లోనే పూర్తవుతుంది. రిజిస్ట్రేషన్లు చాలా తక్కువ సమయంలో సులభంగా, పారదర్శకంగా జరుగుతాయి. అవకతవకలకు ఆస్కారం ఉండదు. ప్రభుత్వ అనుమతితో త్వరలో దీన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. – వి. రామకృష్ణ, కమిషనర్ అండ్ ఐజీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ. ఇది కూడా చదవండి: ఏపీకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వరద.. టీడీపీకి షాకిచ్చిన రిపోర్ట్! -
ఓవైపు ధరణి.. మరోవైపు బట్వాడా సమస్యలు.. అధికారుల తీరు గిట్లుండాలే!
రాష్ట్రంలో భూముల లావాదేవీలు జరిగి నెలలు గడుస్తున్నా రైతులకు పట్టాదారు పాస్‌బుక్‌లు అందడం లేదు. ఇదేమిటని రెవెన్యూ కార్యాలయాలకు వెళితే తపాలా శాఖ ఆపేసిందని.. అక్కడికి వెళితే రెవెన్యూశాఖ నుంచి తమకు రానేలేదని చెప్తుండటంతో తీవ్ర గందరగోళం నెలకొంది. అసలు వాస్తవం ఏమిటంటే.. లక్షల కొద్దీ పాస్‌బుక్కులు రెవెన్యూ కార్యాలయాల్లోనే గుట్టలుగా పడి ఉన్నాయి. వాటిని తపాలాశాఖ ద్వారా రైతులకు బట్వాడా చేసేందుకు సంబంధించిన చార్జీలను రెవెన్యూ శాఖ చెల్లించకపోవడమే దీనికి కారణం. పాస్బుక్ల ముద్రణ, బట్వాడా కోసం రైతుల నుంచే రూ.300 వసూలు చేస్తున్న రెవెన్యూ శాఖ.. తపాలా శాఖకు చార్జీలు చెల్లించకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సాక్షి, హైదరాబాద్: భూముల రిజిస్ట్రేషన్లు అయ్యాయి.. పాస్బుక్ల ముద్రణ, తపాలా ద్వారా ఇంటికి చేర్చేందుకు బట్వాడా ఖర్చును రైతులు అప్పుడే రెవెన్యూ శాఖకు చెల్లించారు. కానీ నెలలు గడుస్తున్నా పాస్‌బుక్ మాత్రం చేతికి అందడం లేదు. ఒకరిద్దరు కాదు.. రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది రైతులకు పాస్‌బుక్‌లు అందాల్సి ఉంది. ఎప్పుడో రైతుల ఇళ్లకు చేరాల్సి ఉన్న ఈ పాస్‌బుక్‌లు రెవెన్యూ శాఖ కార్యాలయాల్లోని బీరువాల్లో మూలుగుతున్నాయి. ఏప్రిల్ నుంచి ఇదే పరిస్థితి. ఇప్పటికే ధరణి సమస్యలు గందరగోళంతో రైతులు ఇబ్బంది పడుతుండగా.. ఇప్పుడు పాస్‌బుక్‌లు రాకపోతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. చెల్లింపులు లేక బకాయిలు.. వ్యవసాయ భూములను కొనుగోలు చేసిన రైతుల నుంచి రిజిస్ట్రేషన్ సమయంలోనే రూ.300 చొప్పున రెవెన్యూ శాఖ వసూలు చేస్తోంది. ఆ మొత్తంతో పాస్‌బుక్‌ను ముద్రించి, తపాలా శాఖ ద్వారా రైతుల ఇళ్లకు పంపాల్సి ఉంటుంది. ఇందుకోసం రైతుల నుంచి వసూలు చేసిన సొమ్ములో ఒక్కో పాస్బుక్కు రూ.40 చొప్పున తపాలాశాఖకు చార్జీగా చెల్లించాలి. కానీ ఏడాది నుంచి ఈ చెల్లింపుల్లో రెవెన్యూ శాఖ నిర్లక్ష్యం చూపుతోంది. తపాలా శాఖ పాస్‌బుక్‌లను ఠంచనుగా బట్వాడా చేస్తున్నా.. అందుకు సంబంధించిన చార్జీలను ఎప్పటికప్పుడు చెల్లించడం లేదు. అప్పుడప్పుడు ఎంతో కొంత మొత్తం ఇస్తూ వస్తోంది. దీనితో బకాయిలు రూ.3 కోట్ల వరకు చేరుకున్నాయి. చార్జీల సొమ్ము చెల్లించాలని తపాలా శాఖ ఎన్నిసార్లు కోరినా రెవెన్యూ శాఖ నుంచి స్పందన లేదు. అయినా ఇప్పుడు కాకున్నా తర్వాత అయినా డబ్బులు వస్తాయన్న ఉద్దేశంతో తపాలా అధికారులు బట్వాడాను కొనసాగిస్తూ వచ్చారు. ఆడిట్ అభ్యంతరాలతో.. ఇంతగా బకాయిలు పేరుకుపోతున్నా.. ఇంకా సేవలు ఎలా అందిస్తున్నారంటూ తపాలా శాఖను అంతర్గత ఆడిట్ అధికారులు ఇటీవల అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో తపాలా శాఖ బకాయిల వసూలుపై దృష్టిపెట్టింది. బకాయిలు చెల్లించకుంటే ఏప్రిల్ ఒకటి నుంచి బట్వాడా నిలిపేస్తామని రెవెన్యూ శాఖకు తేల్చి చెప్పింది. అయినా రెవెన్యూ ఉన్నతాధికారులు స్పందించలేదు. దీంతో తపాలాశాఖ ఏప్రిల్ ఒకటి నుంచి పాస్బుక్ల బట్వాడాను నిలిపేసింది. ఇకపై పాస్‌బుక్‌లను పంపవద్దని స్పష్టం చేసింది. అప్పటి నుంచి రెవెన్యూ కార్యాలయాల్లోనే లక్షల సంఖ్యలో పాస్‌బుక్‌లు పేరుకుపోయాయి. తప్పుడు సమాచారంతో అటూ ఇటూ.. పాస్‌బుక్కులు అందకపోవడంలో తప్పు తమది కాదని.. తపాలా శాఖనే దగ్గరపెట్టుకుని పంపటం లేదంటూ కొందరు అధికారులు తప్పుడు సమాచారం ఇస్తుండటంతో రైతులు పోస్టాఫీసులకు వెళ్తున్నారు. అసలు పాస్ పుస్తకాలు తమ వద్దకు రానేలేదని, రెవెన్యూ అధికారుల వద్దనే ఉంటాయని తపాలా సిబ్బంది స్పష్టం చేస్తుండటంతో మళ్లీ రెవెన్యూ కార్యాలయాలకు పరుగులు పెడుతున్నారు. ఇదంతా గందరగోళంగా మారిపోయింది. చార్జీల బకాయిలు, పాస్బుక్ల బట్వాడా నిలిపివేత అంశాలపై రెవెన్యూ, పోస్టల్ అధికారులను ‘సాక్షి’ సంప్రదించగా.. స్పందించేందుకు నిరాకరించారు. ఇంతకు ముందు రవాణాశాఖలోనూ.. గతంలో డ్రైవింగ్ లైసెన్సుల విషయంలోనూ ఇదే తరహాలో ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. డ్రైవింగ్ లైసెన్స్ బట్వాడా కోసం వాహనదారుల నుంచి ఫీజులు వసూలు చేసిన రవాణాశాఖ.. తపాలా శాఖకు ఆ చార్జీలను చెల్లించలేదు. ఎన్నిసార్లు అడిగినా రవాణాశాఖ స్పందించకపోవటంతో.. గతేడాది తపాలా శాఖ డ్రైవింగ్ లైసెన్సుల బట్వాడాను నిలిపేసింది. అప్పట్లో ఆ విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో.. రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ స్పందించారు. ట్రాన్స్‌పోర్టు అధికారులతో మాట్లాడి అప్పటికప్పుడు బకాయిల్లోంచి దాదాపు రూ.కోటి వరకు చెల్లించేలా చర్యలు చేపట్టారు. దానితో తపాలా శాఖ బట్వాడాను పునరుద్ధరించింది. ఇప్పుడు రెవెన్యూ శాఖ వంతు వచ్చింది. -
వీడిన ‘షరతుల’ చెర
భూమి(తల) రాత మార్పు నాలుగైదు తరాల నుంచి వారసత్వంగా వచ్చిన ఆ భూమి ఉన్నట్టుండి ప్రభుత్వ భూమిగా మారిపోయింది. చెమటోడ్చి సంపాదించిన సొమ్ముతో కష్టపడి అలాంటి భూమిని కొనుక్కుని, రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు అన్యాయమైపోయారు. ఆ భూమిలో పంటలు పండిస్తూ సంతోషంగా ఉన్న రైతులు ఒక్కసారిగా కుదేలైపోయారు. తమకు న్యాయం చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఇలా వేలాది మంది రైతులకు అన్యాయం జరిగింది. ఈ సమస్యలను వైఎస్ జగన్ ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరించింది. బ్రిటీష్ కాలం నుంచి రైతుల చేతుల్లో ఉండి, రిజిస్ట్రేషన్లు కూడా జరిగిన భూములను నిషేధిత జాబితాలో చేర్చడం దారుణమని.. ఆ జాబితా నుంచి వాటిని తొలగించింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 17,730 సర్వే నంబర్లకు సంబంధించి 33 వేలకుపైగా ఎకరాలను 22ఏ నుంచి తీసేసింది. మోడు వారిన సుమారు 50 వేల మంది రైతుల జీవితాల్లో వెలుగులు నింపింది. ఒక్క కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోనే 18 వేలకుపైగా ఎకరాలను 22ఏ నుంచి తీసివేశారు. కోడూరు మండలంలో 9,600 ఎకరాలను తొలగించారు. బొల్లికొండ ఫణికుమార్ – సాక్షి, అమరావతి: ఆర్‌ఎస్‌ఆర్‌లో షరతులు గల పట్టా అని ఉన్న 33 వేల ఎకరాల భూములను 2016లో తెలుగుదేశం ప్రభుత్వం 22ఏ (1)ఇ జాబితాలో చేర్చడంతో రైతులు కుదేలయ్యారు. 1910లో బ్రిటీష్ ప్రభుత్వం ఈ భూములను రైతులకు వేలం ద్వారా ఇచ్చినట్లు రెవెన్యూ శాఖ భావిస్తోంది. వేలం కాదు రైతులకు అసైన్డ్ చేసిందనే వాదన కూడా ఉంది. ఏదైనా వందేళ్లకు ముందు నుంచే ఆ భూములు రైతుల చేతుల్లో ఉన్నాయి. వారికి పట్టాలుండటంతోపాటు,ఆర్‌ఎస్‌ఆర్‌లో వారి పేర్లు నమోదయ్యాయి. అప్పటి నుంచి శిస్తు కడుతూనే ఉన్నారు. అవసరానికి వాటిని అమ్ముకున్నారు. రిజిస్ట్రేషన్లు కూడా జరుగుతున్నాయి. బ్రిటీష్ హయాం నుంచి లావాదేవీలున్న ఆ భూములను 2016 మే 5న జీఓ ఎంఎస్ నెంబర్ 196 ద్వారా టీడీపీ ప్రభుత్వం 22ఏ(1)ఇ కేటగిరీలో పెట్టేసింది. అప్పటి వరకు సర్వ హక్కులతో ఏళ్ల తరబడి ఆ భూములను అనుభవించిన రైతులు ఒక్కసారిగా రోడ్డున పడ్డారు. అమ్మకాలు, కొనుగోళ్లు నిలిచిపోయాయి. బ్యాంకు రుణాలు కూడా ఆగిపోయాయి. అప్పటికే బేరం కుదుర్చుకున్న వారు కొనడానికి ముందుకు రాలేదు. కొందరైతే కొంత డబ్బు తీసుకుని భూమిని వదులుకున్నారు. తమ కూతుళ్లకు ఆ భూమిని ఇచ్చిన తండ్రులు కొందరు అల్లుళ్లకు సమాధానం చెప్పలేక నానా బాధలు పడ్డారు. గత ప్రభుత్వం ఆ భూములపై పంట నష్టం కూడా ఇవ్వలేదు. తహశీల్దార్ నుంచి కలెక్టర్ వరకు, ఎమ్మెల్యే నుంచి మంత్రుల వరకు అనేక మంది చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు. ధర్నాలు చేసినా అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం కనికరించలేదు. దీంతో వేలాది రైతు కుటుంబాలకు తీరని కష్టంగా మారింది. జగన్ రాకతో మంచి రోజులు 2019లో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వారిలో ఆశలు చిగురించాయి. తమ సమస్యను వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులకు చెప్పుకున్నారు. అప్పటికే ఈ సమస్యపై పోరాడిన అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ ఈ విషయాన్ని సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లి రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. ఈ సమస్యను పరిష్కరించి రైతులకు న్యాయం చేయాలని సీఎం ఆదేశించడంతో రెవెన్యూ శాఖ షరతులు గల పట్టా భూములపై ప్రత్యేకంగా దృష్టి సారించి అధ్యయనం చేసింది. వందేళ్ల నుంచి రైతులు అనుభవిస్తున్న భూములను 22ఏ కేటగిరీలో చేర్చడం తప్పని నిర్ధారించింది. ఒకవేళ ప్రభుత్వం రైతులకు అసైన్డ్ చేసిందనుకున్నా.. 1954కు ముందే అది జరిగింది కాబట్టి నిరభ్యంతరంగా వాటిపై రైతులకు హక్కులు ఉంటాయని తేల్చింది. దీంతో ప్రభుత్వం వాటిని రిజిస్ట్రేషన్ల చట్టం 1908 22ఏ(1)ఇ కేటగిరీ నుంచి తొలగిస్తూ 2022 అక్టోబర్ 7న జీఓ ఎంఎస్ నంబర్ 667ను జారీ చేసింది. గత ఏడాది అక్టోబర్ 20న అవనిగడ్డలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్.. నిషేధిత భూముల జాబితా నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించి కొందరికి పట్టాలిచ్చారు. ఇప్పుడు ఆ భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. బ్యాంకు రుణాలు వస్తున్నాయి. ఆ భూములను సర్వ హక్కులతో రైతులు అనుభవిస్తున్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలోని ఈ షరతుల బారిన పడిన ఏ రైతును కదిలించినా జగన్ ప్రభుత్వం తమకు చేసిన మేలు మరచిపోలేమని భావోద్వేగంతో చెబుతున్నారు. నా జీవితాన్ని నిలబెట్టారు.. షరతులు గల పట్టా పేరుతో నా లాంటి వేల మంది రైతుల జీవితాలను గత ప్రభుత్వం తలకిందులు చేస్తే, ప్రస్తుత సీఎం జగన్ మళ్లీ జీవితాలు ఇచ్చారు. నాకు 7.21 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. మా తాత అల్లపర్తి రామబ్రహ్మం నుంచి మా నాన్న రాధాకృష్ణకు, ఆయన నుంచి నాకు ఆ భూమి వచ్చింది. 1920 నుంచి ఆ భూమిని మా కుటుంబం సాగు చేసుకుంటోంది. అప్పటి నుంచి శిస్తు కట్టాం. అవసరమైనప్పుడు బ్యాంకుల్లో తనఖా పెట్టాం. ఏటా పంట రుణాలు తీసుకున్నాం. మూడు తరాల నుంచి మాకున్న భూమిని 2016లో ఉన్నట్టుండి ప్రభుత్వ భూమిగా ప్రకటించారు. బ్యాంకు రుణం కోసం వెళితే ప్రభుత్వ భూమి కాబట్టి ఇవ్వమన్నారు. పంట దెబ్బతింటే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. తనఖా పెట్టడానికి, అమ్ముకోవడానికి అవకాశం లేదు. భూమి చేతిలోనే ఉంది.. కానీ ఎందుకూ పనికిరానిదిగా మారిపోయింది. నా కూతురు పెళ్లి చేసినప్పుడు ఉన్న భూమిలో కొంత ఆమెకు ఇచ్చా. అది విలువ లేనిదంటూ ఆమె ఇబ్బందులు ఎదుర్కొంది. ఎంత మంది చుట్టూ తిరిగామో లెక్కలేదు. మేం పడిన బాధలు అన్నీ ఇన్నీ కావు. ఆ సమయంలో వైఎస్ జగన్ ఆపద్భాందవుడిలా మమ్మల్ని ఆదుకున్నారు. ఇప్పుడు సర్వ హక్కులూ వచ్చాయి. చాలా సంతోషంగా ఉంది. – అల్లపర్తి హరి మోహనరావు, భావదేవరపల్లి, నాగాయలంక మండలం, కృష్ణా జిల్లా మా పొలం మాకు దక్కింది కోడూరు మండలం మాచవరంలో సర్వే నంబర్ 446/ఏలో నాకు 83 సెంట్ల పొలం ఉంది. 2006లో బడే వాసుదేవరావు నుంచి కొనుగోలు చేశాం. రిజిస్ట్రేషన్ కూడా అయింది. ఏడాది క్రితం నా భర్తకు గుండె సమస్య రావడంతో బైపాస్ చేయాలని చెప్పారు. రూ.6 లక్షలు అవసరమవడంతో పొలం అమ్ముదామని బేరం పెడితే ఇది రిజిస్ట్రేషన్‌కు పనికిరాదన్నారు. కో ఆపరేటివ్ సొసైటీ రుణం కోసం వెళ్లినా ఇవ్వలేదు. పంట నష్టం కూడా ఇవ్వలేదు. చాలా బాధపడ్డాం. ఈ ప్రభుత్వం వచ్చాక మా పొలాన్ని మాకు దక్కేలా చేశారు. షరతులు గల పట్టా నుంచి తీసి దానిపై మాకు పూర్తి హక్కు కల్పించారు. చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రభుత్వం మేలు మరచిపోము. – సనకా గోవర్ధన, వి.కొత్తపాలెం, కోడూరు మండలం పనికి రాదన్న భూమికి విలువ వచ్చింది నా తండ్రి సనకా కృష్ణమూర్తి నాకు 2.20 ఎకరాలు ఇచ్చారు. 2003లోనే దాన్ని నా పేరుతో రిజిష్టర్ చేసి అప్పగించారు. అప్పటి నుంచి ఆ పొలాన్ని సాగు చేసుకుంటూ అన్ని హక్కులతో ఉపయోగించుకున్నాం. 2018లో పెద్ద రుణం (ఎల్టీ లోన్) కోసం బ్యాంకుకు వెళితే ఈ భూమి 22ఏ జాబితాలో ఉందని, రాదని చెప్పారు. చాలా బాధలు పడ్డాం. ఇప్పుడు దాన్ని సరి చేశారు. జగన్ ప్రభుత్వానికి ఎంతో రుణ పడి ఉంటాం. పనికిరాదన్న మా భూమికి తిరిగి విలువ కల్పించారు. – రేపల్లె నాగరాజ, వి.కొత్తపాలెం, కోడూరు మండలం ఎంతో సంతోషంగా ఉన్నాం 2001లో మా గ్రామంలోని సర్వే నంబర్ 226/1, 228/1లో 3.31 ఎకరాలు కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. 2017 తర్వాత అందులో ఒక ఎకరం మా అబ్బాయి పేరు మీద మార్చాలని వెళితే ఇది 22–ఏ జాబితాలో ఉన్నందున కుదరదన్నారు. చాలా మంది చుట్టూ తిరిగాం. ఎవరూ పట్టించుకోలేదు. అన్నం పెట్టే భూమిని ఇలా చేశారేంటని చాలా బాధ పడ్డాం. ఇప్పుడు దాన్ని సరి చేశారు. అమ్ముకోవడానికి, నా కొడుకు పేర రాయడానికి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. సంతోషంగా ఉంది. – చిట్టిప్రోలు రామ్మోహనరావు, లింగారెడ్డిపాలెం, కోడూరు మండలం, కృష్ణా జిల్లా -
నిషేధిత జాబితా (22A)పై తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి వివరణ
సాక్షి, తిరుపతి: భూముల రిజస్ట్రేషన్ కు సంబంధించిన నిషేధిత జాబితా (22A)పై తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మంగళవారం వివరణ ఇచ్చారు. గత ఐదు రోజులకు ముందు తిరుపతిలో భూముల రిజిస్ట్రేషన్ కు సంబంధించి గందరగోళం ఏర్పడిందని తెలిపారు. కొంతమంది బాధితులు తన దగ్గరకు వచ్చి జరిగిన విషయాన్ని తెలియజేశారని చెప్పారు. ఒక బాధ్యత గల శాసనసభ్యుడుగా బాధితుల ముందరే ముఖ్యమంత్రి కార్యాలయంతోను, ఐ.జి రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ వారితోను, ఎండోమెంట్ కమిషనర్ గారితోను మాట్లాడానని పేర్కొన్నారు. తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు ‘సమస్య గురించి నేను మాట్లాడిన తర్వాత వారు టి.టి.డీ అధికారులకు, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ కు తగిన ఆదేశాలు ఇచ్చారు. టి.టి.డి జె.ఇ.ఓ, ఎస్టేట్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్‌ని సమావేశపరచి సమస్యను వెను వెంటనే సరిదిద్దమని ఆదేశిస్తూ.. అందుకు సంబంధించి ఒక లేఖను జె.ఇ.ఓ గారి ద్వారా ఎండోమెంట్ కమిషనర్ గారికి రాయించడం కూడా జరిగింది. టి.టి.డి. కూడా జరిగిన పొరబాటును సరిదిద్దే ప్రక్రియ చేపట్టింది. వేగవంతంగా ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఈ సమస్యను పరిష్కరించి రిజిస్ట్రేషన్ లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత నాది. నేను ఎప్పుడూ ప్రజా ప్రయోజనాల కోసమే పనిచేసేవాడినే కానీ స్వప్రయోజనాల కోసం పనిచేసే వాడిని కాదు. కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు తమ రాజకీయ స్వలాభం కోసం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిపక్షాలు చేసే అవాస్తవ ప్రచారం నమ్మొద్దు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలిగినా నేను ఎంతకైనా పోరాడే వ్యక్తినీ. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ సమస్యను పరిష్కరించే బాధ్యత నాది’అని భూమన పేర్కొన్నారు. -
నిషేధం ఉన్నా రిజిస్ట్రేషన్లు చేశారు: రఘునందన్‌రావు
సాక్షి, హైదరాబాద్: హఫీజ్‌పేటలోని సర్వే నంబర్ 78కి సంబంధించి ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేయడానికి వీల్లేదని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) 2007లో జీవో నంబర్ 863 జారీ చేయడంతోపాటు 2012లో సర్క్యులర్ జారీ చేసినా రెవెన్యూ అధికారులు వందలాది రిజిస్ట్రేషన్లు చేశారని, ఎన్ఓసీలు ఇచ్చారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆరోపించారు. అలాగే ఆయా భూముల్లో నిర్మాణాలకు జీహెచ్ఎంసీ అధికారులు అనుమతులు మంజూరు చేశారన్నారు. నిబంధనలున్నవి సామాన్యులు, పేదలకేనా అని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారికి లేఖ రాశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ లేఖను విడుదల చేశారు. ఓ నగల వ్యాపారి ఎగ్గొట్టిన రూ. 119 కోట్ల రికవరీలో భాగంగా అతను తనఖా పెట్టిన ఆ సర్వే నంబర్లోని 8 ఎకరాలను బ్యాంకులు వేలం వేసేందుకు ప్రయతి్నస్తే సుప్రీంకోర్టు దాకా వెళ్లి అడ్డుకున్న అధికారులు.. వారికి నచి్చన సంస్థలకు మాత్రం రిజిస్ట్రేషన్లు చేస్తున్నారన్నారు. చదవండి: 'దక్షిణాదిన కేసీఆర్.. ఉత్తరాదిలో కేజ్రీవాల్.. చీల్చే పని వీళ్లదే..' -
Telangana: కొత్త రెవెన్యూ చట్టం.. రెండేళ్లయినా బాలారిష్టాలే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి వచ్చి రెండేళ్లు అవుతోంది. 1971 నాటి ఆర్వోఆర్ చట్టం స్థానంలో 2020 అక్టోబర్ 30 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రెవెన్యూ చట్టం ఇంకా బాలారిష్టాలను దాటని పరిస్థితి. భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ విషయంలో కొత్త చట్టంతో మేలు జరిగినా.. అదే సమయంలో భూముల సమస్యలు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోందని నిపుణులు అంటున్నారు. ఇందుకోసం చట్టంలో మరిన్ని మార్పులు చేయాల్సి ఉందని, స్పష్టమైన అధికారాలను కల్పించి రెవెన్యూ యంత్రాంగాన్ని పటిష్టం చేసినప్పుడే ఈ చట్టం మంచి ఫలితాలు ఇస్తుందని పేర్కొంటున్నారు. కొత్త చట్టం లక్ష్యం ఇదీ.. రాష్ట్రంలో మొత్తం 124 రెవెన్యూ చట్టాలు అమల్లో ఉన్నాయి. ఇందులో రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్వోఆర్) చట్టం భూసంబంధిత అంశాల్లో చాలా ప్రధానమైంది. 1971 నుంచి 2020 అక్టోబర్ 29 వరకు అమల్లో ఉన్న ఈ చట్టానికే రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేసి కొత్త రెవెన్యూ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. భూముల మ్యుటేషన్, రిజిస్ట్రేషన్ ప్రక్రియలను సులభతరం చేయడం.. భూసంబంధ సమస్యలన్నీ పరిష్కరించడం.. రెవెన్యూ పాలనలో పారదర్శకత తీసుకురావడం.. రెవెన్యూ యంత్రాంగానికి ఉన్న విచక్షణాధికారాలు ఎత్తివేసే విధంగా మార్పులు చేయడం లక్ష్యంగా కొత్త చట్టాన్ని అమల్లోకి తెస్తున్నట్టు ప్రకటించింది. మరి ఏం జరిగింది? ఈ చట్టం అమల్లోకి వచ్చిన రెండేళ్లలో రైతులకు జరిగిన ప్రయోజనం ఏమిటంటే.. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియలు వేగంగా జరిగి పాసు పుస్తకాలు త్వరగా చేతికి అందడమే. రిజిస్ట్రేషన్ల తర్వాత గతంలోలా నెలల తరబడి మ్యుటేషన్ కోసం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా పోయింది. రికార్డు పూర్తిగా కంప్యూటర్లో నిక్షిప్తమవుతోంది. కానీ ఈ చట్టం పరిధిలోకి వచ్చే ధరణి పోర్టల్ కారణంగా సమస్యలు భారీగా పెరిగాయి. 2006లో వచ్చిన కోనేరు రంగారావు కమిటీ నివేదిక ప్రకారం 2012– 13లో జరిగిన రెవెన్యూ సదస్సుల్లో అందిన దర ఖాస్తుల ప్రకారం ప్రతి గ్రామంలో 50 నుంచి 100 వరకు భూసమస్యలు ఉండగా.. అవి ఇప్పుడు 200 వరకు చేరాయన్నది ఓ అంచనా. సిద్దిపేట జిల్లా లోని ఓ గ్రామంలో దరఖాస్తులు స్వీకరిస్తే 277 భూసంబంధిత సమస్యల దరఖాస్తులు వచ్చాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. గతంలో ఉన్న ఆర్డీవో, జేసీ కోర్టులు రద్దు కావడంతో భూసమస్యలు వస్తే సివిల్ కోర్టులకు వెళ్లడం మినహా మరో మార్గం లేకుండా పోయింది. ఇక ధరణి పోర్టల్‌లో నమోదవుతున్న సమస్యలను పరిష్కరించే అధికారాలు చ ట్టం ప్రకారం కలెక్టర్లకు లేవు. అయినా వారు పరిష్కరిస్తున్నారు. కానీ లక్షలకొద్దీ సమస్యలను 33 మంది కలెక్టర్లు పరిష్కరించడం సాధ్యం కాదని నిపుణులు అంటున్నారు. ఇక కొత్త చట్టంలో సాదాబైనామాల క్రమబద్ధీకరణకు ఎలాంటి నియమం పొందుపరచలేదని, దీంతో దాదాపు 9లక్షల సాదాబైనామా దరఖాస్తులు పెండింగ్‌లో పడ్డాయని తెలుస్తోంది. ఆ చట్టాల అనుభవాలను పరిగణనలోకి తీసుకోవాలి ఇప్పటివరకు రాష్ట్రంలో నాలుగు ఆర్వోఆర్ చట్టాలు అమల్లో ఉన్నాయి. ఈ చట్టాల అమలు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. కేవలం ఆర్వోఆర్ చట్టం మాత్రమే కాకుండా మిగతా 123 చట్టాలను కూడా మార్చి ఒకే చట్టాన్ని అమల్లోకి తేవాలి. అప్పుడే భూసమస్యలకు పరిష్కారం దొరుకుతుంది – భూమి సునీల్‌కుమార్, భూచట్టాల నిపుణుడు ఎన్నో రకాల సమస్యలతో.. ఇక భూయజమాని బయోమెట్రిక్ లేకుండా రికార్డుల్లో మార్పులు జరగవని, కొత్త చట్టం అమలుతో కోర్ బ్యాంకింగ్ తరహాలో రెవెన్యూ వ్యవస్థ ఏర్పాటవుతుందని ప్రభుత్వం చెప్పింది. కానీ భూయజమానికి తెలియకుండానే రికార్డులు మారిన ఘటనలు అనేకం కనిపించాయి. భూరికార్డుల ప్రక్షాళన సమయంలో పార్ట్–బి కింద నమోదు చేసిన సుమారు 10లక్షల ఎకరాల భూముల సమస్యలు ఇప్పటివరకు పరిష్కారం కాలేదు. ఇనాం, పీవోటీ కేసులు, 38(ఈ) కింద రక్షిత కౌలుదారులకిచ్చే సర్టిఫికెట్, ఎల్టీఆర్ (భూబదలాయింపు చట్టం) అధికారాలను ఈ చట్టం తమకు కల్పించలేదని రెవెన్యూ యంత్రాంగం చెప్తోంది. గత చట్టంలో రెవెన్యూ సిబ్బందికి ఉన్న అధికారాలను కొత్త చట్టం ద్వారా ఎత్తివేయడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని పేర్కొంటోంది. ఇప్పుడేం చేయాలి? కొత్త చట్టం ద్వారా రాష్ట్రంలోని భూసమస్యల పరిష్కారానికి వెంటనే కొన్ని మార్పులు చేయాల్సి ఉందని భూచట్టాల నిపుణులు చెప్తున్నారు. ఆర్వోఆర్ చట్టం కింద రాసుకునే రికార్డు (ధరణి రికార్డు)ను సవరించే అధికారాన్ని క్షేత్రస్థాయి రెవెన్యూ యంత్రాంగానికి అప్పగించాలని.. ఈ అధికారాలు ఇప్పుడున్న అధికారులకు అప్పగించడమా లేక ట్రిబ్యునల్ లాంటి వ్యవస్థలను ఏర్పాటు చేయడమా అన్నదానిపై నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. సాదాబైనామాల క్రమబద్ధీకరణకు ఆర్వోఆర్ చట్టంలో నియమాన్ని అత్యవసరంగా చేర్చాలని, 1971 ఆర్వోఆర్ చట్టంలో ఉన్న సెక్షన్ 5(ఏ)ను యథాతథంగా కొత్త చట్టంలోకి సంగ్రహించాలని.. ఈ చట్టం కింద ధరణిలో మార్పులను గ్రామాలకు పంపి సవరించాలని స్పష్టం చేస్తున్నారు. -
చాలా రిచ్.. కోతుల పేరు మీద 32 ఎకరాల భూమి.. ఎక్కడో తెలుసా?
విదేశాల్లో పెంపుడు జంతువుల పేర్ల మీద కోట్ల ఆస్తులు వీలునామా రాసిన ఘటనలు విన్నాం. కానీ మనదేశంలో కోతుల పేరు మీద భూమి ఉండటం అరుదే. మహారాష్ట్ర ఉస్మానాబాద్ జిల్లాలోని ఉప్లా గ్రామంలో కోతుల పేరు మీద 32 ఎకరాల భూమి ఉంది. ఈ విషయం గ్రామ పంచాయతీ రికార్డుల్లో స్పష్టంగా రాసి ఉంది. అటవీ శాఖ మొక్కలు నాటిన ఆ భూమిలో శిథిలావస్థలో ఉన్న ఓ ఇల్లు కూడా ఉంది. ఈ భూమి కోసం గొడవలవుతున్నాయి. నగరాల్లో గజం జాగ కొనాలంటే గగనమవుతోంది. అలాంటిది కోతులకు 32 ఎకరాల భూమి ఎలా వచ్చింది? అసలు జంతువుల పేరు మీద రిజిస్టర్ ఎలా చేశారు? ఎవరు రిజిస్టర్ చేశారు? అనేక సందేహాలు వస్తున్నాయి కదా! ‘కానీ.. ఎవరు రిజిస్టర్ చేశారు? ఎలా చేశారు?’అనే విషయం మాత్రం ఎవ్వరికీ తెలియదని చెబుతున్నాడు ఆ గ్రామ సర్పంచ్ బప్పా పడ్వాల్. అక్కడ కోతుల పేరుమీద భూమి ఉండటమే కాదు, వాటికి ఎనలేని గౌరవం కూడా ఉంది. ఉప్లా గ్రామవాసులు కోతులకు ఒకప్పుడు ఇంకా ఎక్కువ మర్యాద ఇచ్చేవారు. వేడుక ఏదైనా కోతులకు ప్రత్యేక స్థానం ఉండేది. పెళ్లిళ్లు అయితే.. ముందు వాటికి కానుకలు ఇచ్చిన తరువాతే వేడుక మొదలయ్యేది. ఇప్పుడు ఆ ఆచారాన్ని తక్కువ మంది పాటిస్తున్నారు. అయినా ఇప్పటికీ... కోతులు ఇంటిముందుకొస్తే ఆహారం మాత్రం కచ్చితంగా పెడతారు. -
భూ హక్కుకు.. శ్రీరామరక్ష!
సాక్షి, అమరావతి: భూముల హక్కుదారుల భద్రతే లక్ష్యంగా ప్రభుత్వం కీలక అడుగులేస్తోంది. భూమిపై కచ్చితమైన యాజమాన్య హక్కులను నిర్థారించేందుకు సరికొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తోంది. ధ్రువీకరించిన భూ యాజమాన్య హక్కుల(కన్ఫర్మ్డ్ టైటిల్ విధానం) వివరాలతో ప్రత్యేక రిజిస్టర్ల నిర్వహణకు పక్కా ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం భూ హక్కు యాజమాన్య చట్టంలో కేంద్ర ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా కీలక మార్పులు చేసింది. కొత్తగా రూపొందించిన భూ హక్కు యాజమాన్య చట్టానికి శాసనసభ ఆమోదం తెలిపింది. వివాదాల పరిష్కారానికి సరికొత్త మార్గం పలు వివాదాలతో ప్రస్తుతం భూముల యాజమాన్యం అత్యంత సంక్లిష్టంగా మారిన విషయం తెలిసిందే. వివాదాలు లేకుండా ఉన్న కచ్చితమైన భూ హక్కుదారుల వివరాలు తెలుసుకోవడం క్లిష్టంగా మారింది. కన్ఫర్మ్డ్ టైటిల్ విధానంలో ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని భూ పరిపాలన ప్రధాన కమిషనర్(సీసీఎల్ఏ) సాయిప్రసాద్ చెప్పారు. దేశంలో భూమిపై హక్కుల్ని నిర్థారించే అధికారం సివిల్ కోర్టులకు మాత్రమే ఉంది. ఒక వ్యక్తి అంతా సక్రమంగా ఉందని భావించి భూమి కొనుగోలు చేశాక, దానిపై తనకూ హక్కు ఉందని ఎవరైనా కోర్టుకు వెళితే అది వివాదంలో కూరుకుపోతోంది. అన్ని ఆధారాలు పరిశీలించి సివిల్ కోర్టు చేసిన నిర్థారణే ఇలాంటి కేసుల్లో అంతిమం. ఆ భూమిపై పలానా వ్యక్తికి మాత్రమే హక్కు ఉందని కచ్చితంగా చెప్పే వ్యవస్థ రెవెన్యూ శాఖలో లేదు. రెవెన్యూ రికార్డులు, ఆస్తుల్ని రిజిస్టర్ చేసే విధానం కూడా ఇలాంటి వివాదాలకు పరష్కారాలు సూచించేలా లేదు. వీటన్నింటికీ కన్ఫర్మ్డ్ టైటిల్ విధానం పరిష్కారం చూపనుంది. భూ యాజమాన్య హక్కుల రిజిస్టర్లు భూముల రీ సర్వే జరుగుతున్న క్రమంలో ప్రతి గ్రామంలో ధ్రువీకరించిన భూ యాజమాన్య హక్కుల రిజిస్టర్లు తయారవుతాయి. ఆ రిజిస్టర్లలో ఆ గ్రామానికి చెందిన పక్కా యాజమాన్య హక్కులున్న భూముల వివరాలుంటాయి. ఎవరైనా ఆ భూములపై వివాదాలు సృష్టించేందుకు కోర్టుకెళ్లినా.. ఈ రిజిస్టర్ల ఆధారంగా కోర్టు వాటిని కొట్టేస్తోంది. దీనివల్ల భూ యజమానులకు భద్రత ఏర్పడుతుంది. ఇందుకోసమే అనేక మార్పులతో కొత్త భూ హక్కు యాజమాన్య చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. దీని ప్రకారం రాష్ట్రంలో ఉన్న స్థిరాస్తుల రికార్డులను తయారు చేసి వాటిని పక్కాగా నిర్వహిస్తారు. ఈ హక్కుల రికార్డుల ఆధారంగా భూముల రిజిస్ట్రేషన్లు సక్రమంగా జరిగేందుకు వీలవుతుంది. భూములకు సంబంధించిన డిజిటల్ రికార్డులు తయారవుతాయి. ఈ రికార్డుల నిర్వహణ బాధ్యతలు చూసేందుకు కొత్తగా రాష్ట్ర స్థాయిలో భూ ప్రాధికార సంస్థను ఏర్పాటు చేయనున్నారు. దీని చైర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేదా ముఖ్య కార్యదర్శి హోదాకు తగ్గని ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిని ప్రభుత్వం నియమిస్తుంది. ఈ సంస్థ భూమి హక్కుల రియల్ టైమ్ డేటాను తయారు చేసి వాటిని నిర్వహిస్తుంది. హామీతో కూడిన హక్కుల యాజమాన్య విధానం అమల్లోకొస్తుంది. -
‘ధరణి’ దారికొచ్చేనా..? రెండేళ్లయినా పరిష్కారం కాని సమస్యలు
సాక్షి,మేడ్చల్ జిల్లా: రాష్ట్రంలో భూ సంబంధిత సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ధరణి పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. 2020 అక్టోబర్ 20న మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని మూడుచింతపల్లి మండల కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పోర్టల్‌ను ప్రారంభించారు. పైసా లంచం చెల్లించకుండా పారదర్శకంగా భూ సమస్యలు పరిష్కారమయ్యేలా ధరణి పోర్టల్‌ను రూపొందినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే అదే పోర్టల్ పెద్ద సమస్యగా మారింది. ధరణితో రెవెన్యూ సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయని భావిస్తే కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. వాటిని పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో 50 శాతం ఫిర్యాదులు ధరణి పోర్టల్‌కి సంబంధించినవే వస్తున్నాయి. సమస్యల పరిష్కారం కోసం బాధితులు నెలల తరబడి కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం కొన్ని కొత్త ఆప్షన్లు ధరణిలో పొందుపర్చినా అవసరమైనవి లేకపోవడంతో భూమి కొనుగోళ్లు, అమ్మకాలు, మ్యూటేషన్లపై తీవ్ర ప్రభావం పడుతోంది. ధరణి సమస్యలపై తొలుత తహసీల్దార్ రికార్డులను పరిశీలించి సరైన నివేదికను కలెక్టర్‌కు పంపిస్తే పరిష్కారం లభిస్తోంది. అయితే తహసీల్దార్ కార్యాలయం నుంచి కలెక్టర్‌కు నివేదికలు పంపించడంలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది. ఇందుకు పోర్టల్‌లోని సాంకేతిక లోపాలే కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల సర్కారు కొన్ని మాడ్యూల్స్‌కు అవకాశం కల్పించినా అమల్లో అనేక చిక్కులు ఎదురవుతున్నాయి. దీంతో ఆశించిన స్థాయిలో పనులు జరగడం లేదు. పని చేయని కొత్త ఆప్షన్.. ప్రభుత్వం ఇటీవల టీ ఎం–33 (పాసు పుస్తకాల్లో డేటా కరెక్షన్) ఆప్షన్ ద్వారా చేర్పులు, మార్పులు చేసేందుకు అవకాశం కల్పించింది. విస్తీర్ణంలో హెచ్చుతగ్గుల సవరణకు రైతులు మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే తహసీల్దార్ పరిశీలన చేసి కలెక్టర్‌కు పంపించాల్సి ఉంది. అయితే ఈ ఆప్షన్ సరిగా పనిచేయనందున ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా పరిస్థితి మారింది. దీంతో దరఖాస్తుదారులకు ఆరి్థక ఇబ్బందులు తప్పడం లేదు. మీసేవాలో దరఖాస్తు చేసుకునేందుకు రూ.1500 వరకు ఖర్చు అవుతోందని, అయినా పని కావడం లేదని ఓ రైతు వాపోయాడు. ఈసీ ధ్రువపత్రాల జారీకి అవకాశం కల్పించి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అప్డేట్ చేయించినా సిస్టమ్‌లో జనరేట్ కావడం లేదు. నిషేధిత జాబితా(పీవోబీ) మాడ్యుల్లోని భూముల పరిస్థితి సైతం ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. కొనుగోలుదార్లకు ఇబ్బందులు.. ధరణి పోర్టల్ ప్రారంభ సమయంలో తలెత్తిన లోపాలను సవరించే క్రమంలో భూ లబ్ధిదారులకు తిప్పలు తప్పట్లేదు. కొందరు రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ భూమి జాబితాలో పట్టా భూములు, సర్వే నంబర్లలో లోపాలతో ఎన్నో ఏళ్లుగా ఉన్న భూములను అవసరానికి అమ్ముకోలేని దుస్ధితి ఏర్పడింది. గతంలో అమ్మిన వారి పేరుపైనే పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేస్తుండడంతో కొనుగోలుదార్లు ఇబ్బందులకు గురవుతున్నారు. ధరణి సమస్యల పరిష్కారానికి పలుమార్లు దరఖాస్తు చేసుకున్నా పలు రకాల కారణాలు చెప్పి అధికారులు తిరస్కరిస్తున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూములు అమ్ముకోలేక పోతున్నాం గత కొన్నేళ్లుగా దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని కుందనపల్లిలో 20 మంది కలిసి ఇంటి స్థలాలు తీసుకున్నాం. గోధుమకుంటలో ఇదే సర్వే నంబర్‌తో ఉన్న వ్యవసాయ భూమి నిషేధిత జాబితాలో ఉండటంతో మా ఇంటి స్థలాలను సైతం అదే జాబితాలో చేర్చారు. దీంతో క్రయవిక్రయాలు చేయలేక ఇబ్బందులు పడుతున్నాం. – శ్రీనివాస్‌రావు, దమ్మాయిగూడ మొర పెట్టుకున్నా పరిష్కారం లేదు ఏన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న తన మూడు ఎకరాల వ్యవసాయ భూమిలోని 25 గుంటలు ధరణి పోర్టల్‌లో నమోదు కాలేదు. సరి చేయాలని మీసేవా ద్వారా దరఖాస్తు చేసుకుని తహసీల్దార్, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. – ఎన్.కృష్ణయాదవ్, కీసర మండలం -
అడ్డగోలుగా రిజిస్ట్రేషన్లు.. నిషేధిత భూములనూ వదలని వైనం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: అడ్డుగోలుగా రిజిస్ట్రేషన్ల దందా సాగించారు. నిబంధనలతో నిమిత్తం లేదు. ఫీజు టూ ఫీజ్ చెల్లించి ఆపైన భారీగా ముట్టచెప్పితే చాలు ప్రభుత్వ భూములు కూడా రిజిస్ట్రేషన్ల చేస్తా రు. రెడ్‌మార్క్‌లో ఉన్నా, నిషేధిత భూములైనా, నాన్ లేఅవుట్ అయినా ఇలా ఏ భూమి అయినా కా సులు ఇస్తే ఉమ్మడి పశ్చిమగోదావరిలో రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. జిల్లాలోని 9 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో గడిచిన మూడేళ్లలో 500కుపైగా ఈ తరహా రిజిస్ట్రేషన్లు జరిగాయి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖపై వరుస ఫిర్యాదులు అందుతుండటంతో ప్రభు త్వం సీరియస్‌గా తీసుకుంది. దీనిలో భాగంగా విజి లెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సమగ్ర దర్యాప్తు నిర్వహించగా ప్రతి సబ్ రిజిస్ట్రా్టర్ కార్యాలయాల్లో పదుల సంఖ్యలో అడ్డగోలు రిజిస్ట్రేషన్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అవినీతికి చిరునామాగా.. జిల్లాలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాలు అవినీతికి చిరు నామాగా మారాయి. నిబంధనలకు విరుద్ధంగా ఉండే భూములకు డాక్యుమెంట్లు సృష్టించి మరీ రిజిస్ట్రేషన్లు చేసేస్తున్నారు. ప్రభుత్వం 22ఏ, రెడ్‌మార్క్, నిషేధిత భూములు, నాన్ లేఅవుట్ సర్వే నంబర్లు అ న్ని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు పంపి ఆ రిజిస్ట్రేషన్లను చేయకూడదని ఆదేశాలు ఇచ్చింది. నిషేధిత భూములు, 22ఏ భూములు కలెక్టర్ అనుమతితో నిషేధిత జాబితా నుంచి తొలిగించిన తరువాత మాత్రమే సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయించాలి. అయితే జిల్లాలో భిన్నంగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ప్రధానంగా ఏలూరు, పాలకోడేరు, ఉండి, వీరవాసరం, మొగల్తూరు, నరసాపురం, పాలకొల్లు, అత్తిలి, భీమవరం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పదుల సంఖ్యలో అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్లుగా నిర్ధారించారు. మరీ ముఖ్యంగా కోర్టు వివాదాల్లో ఉన్న భూములను కూడా రిజిస్ట్రేషన్లు చేశారు. దీనిపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ 2019 నుంచి 2022 వరకు పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించింది. దీనిలో భాగంగా అన్ని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నిషేధిత భూముల జాబితాను తీసుకుని ఆ జాబితాలోని నంబర్లతో జరిగిన రిజిస్ట్రేషన్లను పరిశీలించారు. దాదాపు మూడు నెలలకుపైగా విజిలెన్స్ అధికారులు శ్రమించి పూర్తిస్థాయిలో రికార్డులు పరిశీలించారు. అయితే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అనేక అక్రమాలు జరిగినట్లు తేలింది. సగటున 30కి పైగా.. ప్రధానంగా నాన్‌లేఅవుట్ భూముల్లో ప్లాట్ల కొనుగోలుపై ప్రభుత్వం నిషేధం విధించింది. నాన్‌లేఅవుట్‌ను ముందుగా ల్యాండ్ కన్వర్షన్ చేసి సంబంధిత రుసుం చెల్లించి డీటీసీపీ నుంచి అనుమతి తీసుకుని అప్రూవ్ లేఅవుట్‌గా మార్చి విక్రయాలు చేయాలి. అయితే దీనికి విరుద్ధంగా నాన్ లేఅవుట్లల్లో పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు జరిగాయి. నిషేధిత భూములు, నాన్‌లేవుట్ రిజిస్ట్రేషన్లు ఎక్కువగా మొగల్తూరు, నరసాపురం, అత్తిలి, భీమవరం, ఏలూరులో అత్యధికంగా జరిగాయి. ఈ ఐదు కార్యాలయాల్లో సగటున 30కుపైగా అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు నిర్ధారించారు. మొత్తంగా 9 కార్యాలయాల్లో 500లకుపైగా అక్రమ రిజిస్ట్రేషన్లు చేయగా, భీమవరంలోనే ఎక్కువగా జరిగినట్టు సమాచారం. భారీ గోల్మాల్ ఏలూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో అయితే వట్లూరు గ్రామంలో ఒక ఎన్ఆర్ఐకు చెందిన 8 ఎకరాల భూమి విషయంలో భారీ గోల్మాల్ జరిగినట్టు విజిలెన్స్ అధికారులు నిర్ధారించారు. ప్రధానంగా ఎకరా నుంచి 5 ఎకరాలలోపు నాన్‌లేఅవుట్లు వేసి పదుల సంఖ్యలో వ్యక్తులకు విక్రయించి రిజిస్ట్రేషన్లు చేయించేశారు. దీనిపై ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని ప్రత్యక్షంగా గండికొట్టారు. 500లకుపైగా డాక్యుమెంట్లల్లో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సమగ్ర విచారణ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక పంపినట్టు సమాచారం. అలాగే కొందరు సబ్రిజిస్ట్రార్లు, కొన్ని కార్యాలయాల్లో సీనియర్ అసిస్టెంట్లపైనా చర్యలకు సిఫార్సు చేశారు. (క్లిక్: ఏలూరులో ఏసీబీ సోదాలు.. రికార్డుల తనిఖీ) -
జూన్ నాటికి రూ.109 కోట్లతో రిజిస్ట్రేషన్స్
పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో భూ రిజిస్ట్రేషన్లు జోరుగా జరుగుతున్నాయి. గతంలో కరోనా వల్ల కొంత వెనుకబడినా ఈ ఏడాది మాత్రం రిజిస్ట్రేషన్స్ దూకుడు కొనసాగుతోంది. రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేలా అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం తీసుకువస్తుండడంతో మొదటి మూడు నెలల త్రైమాసికంలో రూ.2 కోట్ల రాబడిని రిజిస్ట్రేషన్ శాఖ రాబట్టింది. రాష్ట్ర ప్రభుత్వం అన్నిరంగాలకు చేయూతనిస్తుండడంతో రిజిస్ట్రేషన్స్‌కు సంబంధించి క్రయవిక్రయాలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. రానున్న రోజుల్లో మరింత వేగంగా రిజిస్ట్రేషన్స్ జరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. నెల్లూరు(సెంట్రల్): జిల్లాలో రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా రాబడి పెరుగుతోంది. జిల్లాలోని కందుకూరు, అల్లూరు, ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెం, ఇందుకూరుపేట, కావలి, కోవూరు, ముత్తుకూరు, పొదలకూరు, రాపూరు, ఉదయగిరి, వింజమూరు, నెల్లూరు, నెల్లూరులోని స్టౌన్‌హౌస్‌పేట, బుజబుజనెల్లూరులలో మొత్తం 15 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. కాగా ఏప్రిల్ నుంచి జూన్ నెల మొదటి త్రైమాసికంలో టార్గెట్‌ను ఆ శాఖ అధికారులు పరిశీలించారు. ఈ మూడు నెలలకు గాను 15 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో రూ.107 కోట్లు టార్గెట్ రావాల్సి ఉంది. కాగా రూ.109 కోట్ల టార్గెట్‌ను పూర్తి చేయడం గమనార్హం. 37 వేల రిజిస్ట్రేషన్స్ జిల్లాలోని 15 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు సంబంధిచి గతేడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు పరిశీలిస్తే 16 వేల డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్స్ కాగా, కేవలం రూ.60 కోట్లు మాత్రమే రాబడి వచ్చింది. గతేడాది కరోనా ప్రభావంతో రాబడి తగ్గిందని తెలుస్తోంది. కానీ ఈ ఏడాది 37,700 డాక్యుమెంట్స్ రిజి స్ట్రేషన్స్ కాగా, రూ.109 కోట్ల రాబడిని రిజి స్ట్రేషన్స్ శాఖ రాబట్టడం గమనార్హం. నెల్లూరు ముందజ.. రాపూరు వెనుకంజ రిజిస్ట్రేషన్స్ పరంగా జూన్ వరకు పరిశీలిస్తే 15 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో నెల్లూరు ప్రధాన రిజిస్ట్రేషన్ కార్యాలయం రూ.40.79 కోట్లతో ముందంజలో ఉండగా రాపూరు కార్యాలయం రూ.53.58 లక్షలతో వెనుకంజలో ఉంది. మిగిలిన కార్యాలయాలు కూడా అన్నింటిలో రాబడిలో దూకుడుగా ఉన్నాయని తెలుస్తోంది. ప్రభుత్వ ప్రోత్సాహం రాష్ట్ర ప్రభుత్వం చిన్నా, పెద్ద పరిశ్రమలతోపాటు ఇతర నిర్మాణ రంగానికి ఎక్కడా ఇబ్బందులు లేకుండా చేస్తుండడంతో క్రయవిక్రయదారులు ముందుకువస్తున్నారు. అన్నివర్గాల ప్రజలు క్రయవిక్రయాలు చేస్తుండడంతో రిజిస్ట్రేషన్స్ ద్వారా రాబడి పెరుగుతోంది. ప్రధానంగా పెండింగ్‌లో ఉన్న నాన్ టీడీసీపీ లేఅవుట్లకు కూడా ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో కొనుగోలుదారులకు ఇబ్బందులు లేకుండాపోయాయి. రానున్న రోజుల్లో కూడా రిజిస్ట్రేషన్స్ మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు – 15 మొదటి త్రైమాసికంలో రాబడి – రూ.109 కోట్లు అన్నివిధాలుగా సేవలు అందిస్తున్నాం జిల్లాలోని 15 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో వినియోగదారులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందిస్తున్నాం. అన్నివర్గాల ప్రజలకు సంబంధించి, ఎలాంటి రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలన్నా, చిన్నచిన్న సాంకేతి సమస్యలు వస్తే తప్ప, ఎక్కడా ఇబ్బందులు లేకుండా చేస్తున్నాం. – కిరణ్‌కుమార్, డీఐజీ, రిజిస్ట్రేషన్స్ -
దారికొచ్చిన ‘ధరణి’..! వెబ్సైట్లో కొత్త ఆప్షన్లు
మోర్తాడ్ బాల్కొండ/నిజామాబాద్: వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, తక్షణ మ్యుటేషన్ కోసం రూపొందించిన ధరణి వెబ్సైట్లో కొత్త ఆప్షన్లను ఇచ్చారు. ఫలితంగా కొంత కాలంగా పరిష్కారం కాని అనేక సమస్యలకు దారి చూపడానికి అవకాశం ఏర్పడిందని అధికార యంత్రాంగం చెబుతుంది. ధరణి వెబ్సైట్ అందుబాటులోకి వచ్చి ఏడాదిన్నర కాలం అవుతుంది. కొన్ని ఆప్షన్లను ఇవ్వడంతో కేవలం డిజిటల్ పట్టా పాసు పుస్తకం ఉండి ఎలాంటి తప్పు లు లేని భూమి పట్టా మార్పిడి మాత్రమే జరిగింది. చదవండి👉 Teenmar Mallanna: బీజేపీకి తీన్మార్ మల్లన్న గుడ్ పార్ట్–బీలో ఉన్న భూముల సమస్యలను పరిష్కరించి పట్టా పాసు పుస్తకాలను జారీ చేయడం, పట్టా మార్పిడి చేయడం వీలు పడలేదు. కొన్ని ఆప్షన్లు ఇచ్చి ప్రధాన ఆప్షన్లను ఇవ్వకపోవడంతో భూముల పట్టా మార్పిడి జరగకపోవడం, వివాదాలు పరిష్కారం కాకుండా ఉండిపోయాయి. ధరణిలో తాజాగా పాస్ బుక్కులలో పేర్ల మార్పు, భూమి స్వభావం, వర్గీకరణ, భూమి రకం, విస్తీర్ణం లెక్కలను సరి చేయడం, మిస్సింగ్ సర్వే నంబర్లను గుర్తించి వాటిని ఎక్కించడం, సబ్ డివిజన్ల చేర్పు, నేషనల్ ఖాతా నుంచి పట్టా భూమి మార్పు, భూమి అనుభవంలో మార్పులకు అవకాశం ఏర్పడింది. ఇలా పలురకాల ఆప్షన్లను ఇవ్వడంతో అనేక సమస్యలను త్వరితగతిన పరిష్కరించడానికి మా ర్గం సుగమమైందని తహసీల్దార్లు చెబుతున్నారు. చదవండి👉🏻 దయాకర్‌కు నోటీసులు.. మదన్మోహన్కు హెచ్చరిక కొత్త ఆప్షన్లను పరిశీలిస్తున్నాం ధరణిలో ఇచ్చిన కొత్త ఆప్షన్లను పరిశీలిస్తున్నాం. గతంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలను ఎంత మేరకు పరిష్కరించవచ్చో క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు తీసుకుంటాం. కొత్త ఆప్షన్లతో ప్రధాన సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నాం. – శ్రీధర్, తహసీల్దార్, మోర్తాడ్ -
‘మామూలు’ ఇస్తే.. ఆ ఒక్కటీ సరైపోతుందని హింట్
సాక్షి, ఆదిలాబాద్: ఓ సినిమాలో ఓ పోలీస్ ఆఫీసర్.. ఎర్ర చందనం అక్రమ రవాణాకు భారీగా లంచం తీసుకుంటాడు. డబ్బంతా లెక్కబెట్టిన తర్వాత ఒక్కటి తగ్గింది అంటాడు.. అన్నీ సరిగానే ఉన్నాయి కదా అని చెప్పినా.. ఒక్కటి తగ్గింది అంటూ టార్చర్ పెడతాడు.. అచ్చం ఇలాగే ఉంది ఆదిలాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అధికారుల తీరు. భూమి రిజిస్ట్రేషన్ కోసం అన్ని పత్రాలు సక్రమంగా తీసుకుని వెళ్లినా.. ఒక్కటి తగ్గింది అంటూ కొర్రీలు పెడుతున్నారు. డాక్యుమెంట్‌పైనే కోడ్ రాసి డాక్యుమెంట్ రైటర్ ద్వారా ఏం తగ్గిందో హింట్ ఇస్తారు. ఆమేరకు ముట్టజెబితే డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ సాఫీగా అయిపోతుంది. లేదంటే అంతే.. ఆంగ్ల అక్షరమే కోడ్.. ఆంగ్ల అక్షర రూంలో ‘ఏ’ అంటే రూ.వెయ్యి, ‘బీ’ అంటే రూ.2 వేలు, ‘సీ’ అంటే రూ.3 వేలు, ‘డీ’ అంటే రూ.4 వేలు, ‘ఇ’ అంటే రూ.5 వేలు.. ఏ పక్కన ఒక జీరో పెడితే అది రూ.10 వేలు, బీ పక్కన జీరో పెడితే రూ.20 వేలు, సీ పక్కన జీరో పెడితే రూ.30 వేలు.. ఇలా ఆదిలాబాద్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో కోడ్ భాషలో లంచం వసూలు చేసుకుంటూ డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. డబ్బులు గుంజేందుకు ఎత్తులు గతంలో పేదలు సాగు చేసుకునేందుకు ఇచ్చిన అసైన్డ్ భూములు వెంచర్లుగా మారి ప్లాట్లుగా విక్రయాలు జరిపే క్రమంలో వీటికి సంబంధించి ప్రభుత్వం నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ) జారీ చేశారు. అవి అప్పుడు హోదాలో ఉన్న వివిధ రెవెన్యూ అధికారుల ద్వారా జారీ అయ్యాయి. వీటికి సంబంధించి పలుమార్లు ప్లాట్లు చేతులు మారి రిజిస్ట్రేషన్ కూడా జరిగాయి. ఇప్పుడు ఎవరైనా ఎన్ఓసీ ఉన్న ప్లాట్‌కు సంబంధించి రిజిస్ట్రేషన్‌కు వచ్చినప్పుడు ఆ డాక్యుమెంట్‌పై రిజిస్ట్రేషన్ అధికారులు డబ్బులు గుంజేందుకు ఎత్తులు వేస్తున్నారు. ఈ ఎన్ఓసీ విషయంలో జిల్లా అధికారుల నుంచి అభ్యంతరాలు ఉన్నాయని, వాళ్ల నుంచి మాకు మళ్లీ క్లియరెన్స్ రాలేదని, జాబితా పంపలేదని.. ఇలా రకరకాలుగా చెప్పడం ద్వారా రిజిస్ట్రేషన్‌కు వచ్చిన పార్టీని డైలమాలో పడేస్తారు. ఒకవేళ తాము డాక్యుమెంట్‌పై రాత ద్వారా సూచించిన విధంగా డబ్బులిస్తే రిజిస్ట్రేషన్ అయిపోతుందని చెబుతారు. ఇలా వ్యవసాయ భూములను వెంచర్లుగా మార్చేందుకు ఉద్దేశించిన నాలా కన్జర్వేషన్, ఇండ్ల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి మున్సిపల్ సంబంధిత పత్రాలు, ఇలా అనేక రకాలుగా డాక్యుమెంట్‌కు ఏదో ఒక అభ్యంతరం చూయించి పార్టీ నుంచి డబ్బులు వసూలు చేయడం ద్వారా ఆదిలాబాద్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో అధికారుల తీరు హద్దు మీరిపోయిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీరికంటే జలగలే నయమన్న పరిస్థితి పలువురిలో వ్యక్తమవుతోంది. వసూళ్లకు దళారులు సాధారణంగా ఎస్ఆర్ఓ కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్లకు ప్రవేశం లేదు. అయితే పార్టీలు డాక్యుమెంట్ రైటర్లను మొదట దస్తావేజు రూపొందించేందుకు ఆశ్రయిస్తారు. అదే సమయంలో ఈ డాక్యుమెంట్ రైటర్ దాన్ని రూపొందించిన తర్వాత సబ్‌రిజిస్ట్రార్ దగ్గరికి పంపించినప్పుడు పరిశీలన చేసిన తర్వాత దాంట్లో ఏదో ఒక లోపం చూపిస్తూ ఆంగ్ల అక్షరం రాసి పంపిస్తారు. కోడ్ పద్ధతిలో డాక్యుమెంట్‌పై రావాల్సిన లంచం రూపం చెప్పిన తర్వాత దానికి పార్టీ ‘సై’ అంటే సబ్‌రిజిస్ట్రార్‌కు సంబంధించిన ఇద్దరు ముగ్గురు వ్యక్తులు రంగంలోకి దిగుతారు. ఆ ఆంగ్ల అక్షరం మేరకు లంచం డబ్బులు వసూలు చేస్తారు. ఆ తర్వాతే ఆ డాక్యుమెంట్ మళ్లీ సబ్‌రిజిస్ట్రార్ టేబుల్‌పైకి వెళ్తుంది. ఇదంతా రోజూ మామూలుగా జరిగే తతంగమే. ఏసీబీకి పట్టుబడినా తీరు మారలే.. ఆదిలాబాద్‌లో ప్రస్తుతం ఇన్చార్జి సబ్‌రిజిస్ట్రార్‌గా వ్యవహరిస్తున్న ఓ అధికారి గతంలో ఇలాగే లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. దీనికి సంబంధించి ఈ మధ్యకాలంలో శాఖ పరంగా సర్వీస్ రిమూవల్ జరిగిందనే ప్రచారం సాగింది. అయితే రిజిస్ట్రేషన్ శాఖలో ఉన్నతాధికారులను మచ్చిక చేసుకుని దీనినుంచి బయటపడ్డాడని శాఖలో చెప్పుకుంటున్నారు. అయినప్పటికీ ఆ అధికారి తీరు మారలేదు. ప్రస్తుతం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ కోడ్ పద్ధతిని అమలులోకి తీసుకొచ్చి యథేచ్ఛగా వసూలు చేస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. ప్రతీరోజు ఈ అధికారి లక్షల రూపాయలు లంచం రూపంలో వసూలు చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు. చేతులెత్తేసిన రిజిస్ట్రార్ ఆదిలాబాద్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో విచ్చలవిడిగా సాగుతున్న అక్రమాలపై కొంతమంది డాక్యుమెంట్ రైటర్లు ఇటీవల జిల్లా రిజిస్ట్రార్ ఫణీంద్రను కలిసి ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే జిల్లా రిజిస్ట్రార్ మా టలు వారిని విస్తుపోయేలా చేశాయి. ప్రధానంగా ఆదిలాబాద్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో రెగ్యులర్ సబ్రిజిస్ట్రార్లు పనిచేసేందుకు ముందుకు రావడం లేదని, పనిచేసేవారిని ఇక్కడ ఉన్నవారు పనిచేయనివ్వడం లేదని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం చేస్తున్న వారితోనే వ్యవస్థను నడిపియ్యాల్సి వస్తుందని చెప్పారు. దీంతో అక్కడ వ్యవస్థ పరమైన లోపమా? లేనిపక్షంలో జిల్లా రిజి స్ట్రారే ఇలాంటి అక్రమాలకు పాల్పడే అధికారులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాడా? అన్న అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ‘సాక్షి’ జిల్లా రిజిస్ట్రార్ ఫణీంద్రను వివరణ కోరేందుకు గురువారం సాయంత్రం ఫోన్ చేయగా ఆయన అందుబాటులోకి రాలేదు. -
చనిపోయిన వ్యక్తి లేచొచ్చాడా?
నగరంలోని సర్వే నెం.173లో మూడు ఎకరాలపైనే ఉన్న భూమిని 143 గజాల భూమిగా చూపి రిజిస్ట్రేషన్ చేశారు. గమ్మత్తైన విషయమేమంటే ఆధార్ కార్డులో తండ్రి పేరు మార్చి రిజిస్ట్రేషన్ చేయడం గమనార్హం. సాక్షి, నిజామాబాద్: జిల్లాలో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్లకు పై ఉదంతాలే నిదర్శనం. ముగ్గురు రాజకీయ నాయకులు, రెవెన్యూ సిబ్బంది, ఆధార్ సెంటర్ నిర్వాహకులు, ఉద్యోగ సంఘం నాయకుడు కలిసి భారీగా అక్రమాలకు పాల్పడ్డారు. ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్‌తో కలిసి పేదల భూములకు ఎసరు పెట్టారు. అలాగే, సర్కారు ఆదాయానికి గండి కొట్టారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వ అధికారే మాఫియా అవతారం ఎత్తి అక్రమాలకు లైసెన్స్ ఇవ్వడం గమనార్హం. సస్పెండైన ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్ అక్రమాలు బయటకు వస్తూనే ఉన్నాయి. అక్రమ సంపాదనకు దండిగా అలవాటు పడిన ఆ అధికారి ఏడాది వ్యవధిలోనే రూ.కోట్లు వెనకేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. 50 ఏళ్ల క్రితం మృతి చెందిన వ్యక్తి రిజిస్ట్రేషన్ చేయడం, లేని వారసులు ఉన్నట్లు నకిలీ పత్రాలు సృష్టించి భూములు ఇతరులకు కట్టుబెట్టిన భారీగా దండుకున్నట్లు తెలిసింది. నగరంలోని కంఠేశ్వర్ ఏరియాలో గల సర్వే నెం.268లో 2.11 ఎకరాల భూమి ఉంది. ఈ మొత్తం స్థలాన్ని కేవలం 110 గజాలుగా చూపి ఇటీవల వేరే వారి పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. విచిత్రమేమిమంటే ఈ భూమి యజమాని బంటు ఎర్రన్న 1973లో చనిపోయాడు. ఆయన కుటుంబ సభ్యులు 2004లోనే డెత్ సర్టిఫికెట్ కూడా తీసుకున్నారు. అయితే కొంత మంది అక్రమార్కులు కలిసి 2.11 ఎకరాల భూమిని కాజేయాలని ప్లాన్ చేశారు. ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్‌తో కుమ్మక్కై బంటు ఎర్రన్న తన భూమిని ఇతరులకు విక్రయించినట్లు డాక్యుమెంట్లు సృష్టించి రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు. అయితే, 50 ఏళ్ల క్రితం చనిపోయిన ఎర్రన్న గత సెప్టెంబర్ 3న తన భూమిని ఇతరుల పేరిట ఎలా రిజిస్ట్రేషన్ చేశారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. విచారణలో నిగ్గుతేలేనా..? సస్పెండైన ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్ చేసిన రిజిస్ట్రేషన్లపై ఇప్పటికే విచారణ కొనసాగుతోంది. ఇష్టారాజ్యంగా అక్రమాలకు పాల్పడిన సదరు అధికారి తనకేమీ తెలియదన్నట్లుగా ఆ శాఖ డీఐజీ, జిల్లా రిజిస్ట్రార్ ఎదుట అయామక చక్రవర్తిగా నటించినట్లు ఆ శాఖ సిబ్బంది చెబుతున్నారు. మరోవైపు, తన సస్పెన్షన్‌ను ఎత్తి వేయించుకునేందుకు రెండు ప్రధాన పార్టీలకు చెందిన నాయకులతో హైదరాబాద్‌లో పైరవీలు చేస్తున్నట్లు తెలిసింది. అంతేకాదు, తన ముఠా సభ్యులు తనను కాపాడతారన్న ధీమాతో ఉన్నట్లు రిజిస్ట్రేషన్ శాఖ సిబ్బంది చెబుతున్నారు. -
‘మాన్సాస్’లో మరో మాయ
సాక్షి, అమరావతి: హైకోర్టు ఆదేశాలతో వివిధ ఆలయాలు, సత్రాలకు సంబంధించిన భూములను రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు లేకుండా నిషేధిత జాబితాలో ఉంచేందుకు దేవదాయ శాఖ కసరత్తు చేస్తున్న రోజులవి. 2016 ఏప్రిల్ 11వ తేదీ.. విజయనగరం కార్పొరేషన్ పరిధిలోని ధర్మపురి రెవెన్యూ గ్రామ పరిధిలో గల 474.44 ఎకరాల భూములు మాన్సాస్ ట్రస్టుకు చెందనవిగా పేర్కొంటూ అప్పటి ట్రస్టు ఈవో ఆ జిల్లా దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్‌కు నివేదిక ఇచ్చారు. దాని ప్రకారం జిల్లా అసిస్టెంట్ అప్పటి దేవదాయ శాఖ కమిషనర్ ద్వారా ఆ భూములకు ఎటువంటి ప్రైవేట్ రిజిస్ట్రేషన్లు జరగడానికి వీలు లేకుండా నిషేధిత జాబితాలో చేర్చాలంటూ లేఖ రాశారు. ఇది జరిగిన ఏడాదికే.. 2017 ఏప్రిల్ 19వ తేదీన ధర్మపురి రెవెన్యూ గ్రామంలో మాన్సాస్ ట్రస్టు భూములుగా నిర్ధారించిన 474.44 ఎకరాల భూములలో 145.78 ఎకరాలు ట్రస్టువి కాదంటూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ కమిషనర్, ఇన్స్పెక్టర్ జనరల్‌కు అప్పటి దేవదాయ శాఖ కమిషనర్ లేఖ రాశారు. అవి ట్రస్టు భూములని పేర్కొన్నప్పుడు, అందులో 145.78 ఎకరాలు ట్రస్టువి కాదని తిరిగి లేఖ రాసినప్పుడు దేవదాయ శాఖ కమిషనర్‌గా ఉన్నది ఒక్కరే. మొత్తంగా ఏదో మాయ చేసినట్టుగా.. ట్రస్టు ఆస్తుల జాబితా నుంచి బాగా ఖరీదైన 145.78 ఎకరాల భూములు ఎగిరిపోయాయి. మాన్సాస్ ట్రస్టుకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో మొత్తం 14,418 ఎకరాల భూములుండగా.. 2015–16, 2018–19లలో 150 ఎకరాలను మెడికల్ కళాశాల–ఆస్పత్రి పేరుతో విక్రయించేసిన బాగోతం ఇప్పటికే వెలుగు చూసిన విషయం తెలిసిందే. విజయనగరం జిల్లా కొత్తవలస, చిప్పాడ, బాకురపాలెం, డాబా గార్డెన్స్, సంతపేటలో ఉడా ద్వారా ఆ 150 ఎకరాలను విక్రయించగా రూ.120 కోట్లు వచ్చిందని ట్రస్టు లెక్క చూపించింది. సింహచలం శ్రీలక్ష్మీనరసింహాస్వామి ఆలయం, మాన్సాస్ ట్రస్టు భూములకు సంబంధించి టీడీపీ హయాంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు నేపథ్యంలో దేవదాయ శాఖ అధికారులు పాత రికార్డులు పరిశీలన చేయగా ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. చట్టాలను, కోర్టు ఉత్తర్వులను, దేవదాయ శాఖ నిబంధనలను తోసిరాజని అధికారం దన్నుతో ఈ కుంభకోణానికి తెరలేపినట్టు రికార్డుల పరిశీలనలో తేలింది. ఆ కమిటీ తీర్మానం ప్రకారమే.. అశోక్‌గజపతిరాజు చైర్మన్‌గా, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన కుటుంబరావు సభ్యుడిగా ఉన్న ముగ్గురు సభ్యులతో కూడిన ట్రస్టు బోర్డు 2017 ఫిబ్రవరిలో ధర్మపురి రెవెన్యూ పరిధిలో ట్రస్టు పేరిట ఉండే 145.78 ఎకరాలు ట్రస్టువి కావంటూ ట్రస్టు ఈవో అప్పటి దేవదాయశాఖ కమిషనర్‌కు లేఖ రాయడం, ఆ వెనువెంటనే ఆ భూములకు రిజిస్ట్రేషన్లకు వీలు కల్పిస్తూ అప్పటి దేవదాయ శాఖ కమిషనర్ నిరభ్యంతర సర్టిఫికెట్ జారీ చేయడం చకచకా జరిగిపోయాయి. ట్రస్టు చైర్మన్‌గా ఆయన బాధ్యతలు చేపట్టాకే.. 2014 జూన్–2019 మే మధ్య రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఆ సమయంలోనే మాన్సాస్ ట్రస్టు చైర్మన్‌గా అశోక్‌గజపతిరాజు బాధ్యతలు చేపట్టిన ఏడాదికే ఈ భూ మాయ చోటుచేసుకోవడం విశేషం. అంతకుముందు మాన్సాస్ ట్రస్టు చైర్మనుగా ఉన్న ఆనంద గజపతిరాజు 2016 మార్చిలో మరణించారు. దీంతో టీడీపీ తరఫున ఎంపీగా కొనసాగుతున్న అశోక్‌గజపతిరాజును ట్రస్టు చైర్మనుగా నియమిస్తూ 2016 ఏప్రిల్ 7న అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. అప్పటి సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడుగా మెలిగిన కుటుంబరావును ట్రస్టు నిర్వహణ కమిటీలో సభ్యుడిగా నియమిస్తూ అదే 2016 ఏప్రిల్ 7వ తేదీన ప్రభుత్వం మరో ఉత్తర్వు ఇచ్చింది. అప్పట్లో ట్రస్టు నిర్వహణకు ప్రభుత్వం నియమించిన ముగ్గురు సభ్యుల కమిటీలో ఇద్దరు ప్రముఖ టీడీపీ నేతలే ఉన్నారు. వీరి నియామకం జరిగిన రోజుల్లోనే దేవదాయ శాఖ అధికారులు విజయనగరం కార్పొరేషన్ పరిధిలో ట్రస్టు పేరిట 474.44 ఎకరాలుందని నిర్ధారించారు. ఏడాదికల్లా అందులో 145.78 ఎకరాలు ట్రస్టువి కాదని తేల్చడం గమనార్హం. -
రిజిస్ట్రేషన్లకు లైన్‌క్లియర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు సోమవారం నుంచి యథాతథంగా జరగనున్నాయి. హైదరాబాద్ గచ్చిబౌలిలోని స్టేట్ డాటా సెంటర్ (ఎస్డీసీ)లో ఉన్న ప్రధాన సర్వర్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్యను గుర్తించి పరిష్కరించడంతో రిజిస్ట్రేషన్ లావాదేవీలకు ఇబ్బంది తొలగిపోయింది. రెండు రోజులుగా ఈ సమస్య పరిష్కారానికి స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ ఉన్నతాధికారులతోపాటు ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థల బృందం చేసిన ప్రయత్నాలు ఆదివారం మధ్యాహ్నానికిగానీ ఫలించలేదు. దీంతో ఐదు రోజులుగా నెమ్మదించిన రిజిస్ట్రేషన్ల కార్యకలాపాలు మళ్లీ సోమ వా రం నుంచి ఊపందుకోనున్నాయి. ఆదివారం మధ్యాహ్నమే సమస్యను పరిష్కరించి రాష్ట్రం లోని అన్ని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల నెట్‌వర్క్‌ను పరిశీలించారు. అంతా సజావుగా పనిచేస్తుండడంతో సోమవారం నుంచి రాష్ట్రంలోని 141 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో లావాదేవీలు మునుపటిలాగానే కొనసాగుతాయని ఉన్నతాధికారులు వెల్లడించారు. సర్వర్ మొరాయించడంతో ఐదు రోజులుగా పెండింగ్‌లో పడిన లావాదేవీలతోపాటు సోమవారం బుక్ చేసుకునే స్లాట్లకు సంబంధించిన లావాదేవీలను కూడా చేపడతామని వెల్లడించారు. వామ్మో.. సాఫ్ట్వేర్ రాష్ట్రంలోని 141 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలను ఐదు రోజులపాటు ఇబ్బంది పెట్టిన సమస్య చాలా చిన్నదని, అయితే దాన్ని గుర్తించడానికే సమయం పట్టిందని తెలుస్తోంది. ఎస్‌డీసీలో ఉన్న ప్రధాన సర్వర్ రాష్ట్రంలోని అన్ని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలను సమన్వయం చేస్తుంది. ఈ సర్వర్ ద్వారానే డాటా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ డాటా ట్రాన్స్ఫర్ చేసేందుకు రూపొందించిన సాఫ్ట్‌వేర్‌లోని ఒక ఫైలు కరప్ట్ అయిందని సమాచారం. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కార్డ్ అప్లికేషన్ ఓపెన్ కాలేదు. రెండు రోజులుగా ఎంత కుస్తీ పడుతున్నా ఈ ఫైల్‌ను గుర్తించలేకపోయారు. ఐటీ శాఖ ఆధ్వర్యంలో సాఫ్ట్వేర్ నిపుణుల టీం ప్రతి ఫైలును చెక్ చేయడంతో ఈ కరప్ట్ ఫైల్ దొరికింది. దీన్ని సరిచేయడంతో సమస్య పరిష్కారమైంది. -
ధరణి పోర్టల్‌లో కొత్త తిప్పలు..‘మార్ట్గేజ్’.. మారట్లే!
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ భూముల మార్ట్గేజ్ వ్యవహారం ధరణి పోర్టల్‌లో క్లిష్టతరమైంది. తనఖా పెట్టిన భూములను ఆ తనఖా విడిపించిన తర్వాత కూడా క్రయ, విక్రయ లావాదేవీలు జరుపుకునేందుకు ధరణి పోర్టల్ అనుమతించడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రుణాన్ని తిరిగి చెల్లించిన తర్వాత కూడా తమను డిఫాల్టర్లుగా చూపిస్తున్నారని వాపోతున్నారు. ఒక రైతు తన భూమిని బ్యాంకులు లేదా ఇతర సంస్థల వద్ద తనఖా పెట్టి తన అవసరాల కోసం రుణం తీసుకోవచ్చు. ఈ క్రమంలో సదరు భూమిని తమ వద్ద తనఖా పెట్టినట్టు ఆ భూమిని బ్యాంకులు మార్ట్గేజ్ చేసుకుంటాయి. ఈ మార్ట్గేజ్ డీడ్‌ను రెవెన్యూ వర్గాలు రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా ఆ తనఖాకు చట్టబద్ధత లభిస్తుంది. అలాంటి భూమిని ఇతరులకు అమ్ముకునే అవకాశం, లేదా మరోచోట తనఖా పెట్టే అవకాశం ఉండదు. అయితే, తీసుకున్న రుణాన్ని తిరిగి బ్యాంకులు లేదా ఇతర సంస్థలకు చెల్లించినప్పుడు రైతు ఆ మార్టిగేజ్ డీడ్‌ను రిలీజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా విడుదల చేసేందుకు రీకన్వేయన్స్ డీడ్ పేరుతో మరో రిజిస్ట్రేషన్ లావాదేవీ చేయాల్సి వస్తుంది. ఇలా రీకన్వేయన్స్ డీడ్ చేసుకునేంతవరకు ధరణి పోర్టల్ సహకరిస్తోందని, ఆ తర్వాతే తంటాలు వస్తున్నాయని రైతులు అంటున్నారు. ఒకసారి తనఖా పెట్టి విడిపించుకున్న భూమిని అమ్ముకునేందుకు వెళితే ఆ భూమి ఇంకా తనఖాలోనే ఉందని ధరణి పోర్టల్ చూపుతోందని వాపోతున్నారు. సాంకేతిక సమస్య వల్లనే... ఈ విషయమై రెవెన్యూ వర్గాలు స్పందిస్తూ రీకన్వేయన్స్ డీడ్ ఆప్షన్‌ను ప్రభుత్వం ధరణి పోర్టల్‌లో ఇచ్చిందని, అయితే డీడ్ వచ్చినా ఆ భూమి తనఖాలోనే ఉన్నట్టు చూపిస్తుండటం కేవలం సాంకేతిక సమస్య మాత్రమేనని అంటున్నాయి. దీన్ని భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) కార్యాలయ స్థాయిలోనే పరిష్కరించి తమకు ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుందని క్షేత్రస్థాయి రెవెన్యూ అధికారులు చెపుతున్నారు. అయితే, రాష్ట్రంలోని మొత్తం వ్యవసాయ భూముల్లో 10 శాతం వరకు భూములు పలు సందర్భాల్లో తనఖాకు వెళతాయని అంచనా. ముఖ్యంగా తోటల పెంపకందారులకు ఎక్కువ మొత్తంలో డబ్బులు అవసరం కనుక అదే భూమిని తనఖా పెట్టి డబ్బులు తెచ్చుకుని తర్వాత ఆ రుణం తీర్చేస్తారు. కానీ, రుణం తీర్చిన తర్వాత కూడా సాగు భూముల అమ్మకాలు, కొనుగోళ్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
కరోనా వేళా ఆగని రిజిస్ట్రేషన్లు
సాక్షి, అమరావతి: కరోనా ఉధృతి వేళ రాష్ట్రంలో ఆస్తుల క్రయ, విక్రయ రిజిస్ట్రేషన్లు సాధారణ రోజులతో పోలిస్తే కొంతమేర తగ్గినా.. ఇబ్బందులను అధిగమించి ఇబ్బడిముబ్బడిగానే జరిగాయి. ఆస్తుల క్రయ, విక్రయ లావాదేవీల ద్వారా రిజిస్ట్రేషన్ల శాఖ ఏప్రిల్, మే నెలల్లో రూ.650.37 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. నిర్దేశిత లక్ష్యం మేరకు ఆ రెండు నెలల్లో రూ.1,125.12 కోట్లు ఆదాయం ఆర్జించాల్సి ఉంది. కరోనా కల్లోలం సృష్టించడంతో రిజిస్ట్రార్ కార్యాలయాలు పూర్తిస్థాయిలో పనిచేయక లక్ష్యం మేరకు ఆదాయం రాలేదు. అయినా.. లక్ష్యంలో 57.80 శాతం రెవెన్యూ సాధించింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ఆదాయం గణనీయంగా పెరిగింది. గతేడాది ఈ రెండు నెలల్లో కేవలం రూ.186.46 కోట్లు మాత్రమే ఆదాయం లభించింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో రూ.463.91 కోట్ల అధిక ఆదాయం వచ్చింది. గతేడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకుని.. కోవిడ్ వ్యాప్తి తీవ్రంగా ఉన్నప్పటికీ ప్రణాళిక ప్రకారం జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్లడం ద్వారా ఆదాయాన్ని పెంచగలిగారు. 1,91,696 రిజిస్ట్రేషన్లు ఈ రెండు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,91,696 ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరిగాయి. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 23,674 రిజిస్ట్రేషన్లు జరగ్గా.. తూర్పు గోదావరి జిల్లాలో 21,197, పశ్చిమగోదావరి జిల్లాలో 16,756 రిజిస్ట్రేషన్లు జరిగాయి. శ్రీకాకుళం జిల్లాలో అతి తక్కువగా 6,950 రిజిస్ట్రేషన్లు అయ్యాయి. రెవెన్యూ పరంగా చూస్తే (నిర్దేశిత లక్ష్యం మేరకు).. ప్రకాశం జిల్లాలో అత్యధికంగా రూ.39.98 కోట్లు (లక్ష్యంలో 73.94%), ఆ తర్వాత నెల్లూరులో రూ.40.29 కోట్లు (లక్ష్యంలో 70.49 శాతం), కర్నూలులో రూ.51.63 కోట్లు (లక్ష్యంలో 70.05 శాతం) ఆదాయం లభించింది. శ్రీకాకుళంలో అతి తక్కువగా రూ.14.10 కోట్లు (లక్ష్యంలో 42.43 శాతం) ఆదాయం వచ్చింది. అనంతపురం జిల్లాలోనూ తక్కువగా రూ.35.02 కోట్లు (లక్ష్యంలో 46.83 శాతం) రెవెన్యూ వసూళ్లు జరిగాయి. ఉద్యోగులు కష్టపడ్డారు కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న కాలంలో రిజిస్ట్రేషన్ల శాఖ ఉద్యోగులు కష్టపడి పనిచేశారు. రాష్ట్రంలో ఆరుగురు ఉద్యోగులు కరోనా బారినపడి మృతి చెందారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లోనూ ధైర్యంగా పనిచేసిన ఉద్యోగులకు అభినందనలు. – ఎంవీ శేషగిరిబాబు, కమిషనర్ అండ్ ఐజీ, రిజిస్ట్రేషన్ల శాఖ -
తారాజువ్వలా ఎగిరిన రియల్ ఎస్టేట్
సాక్షి, హైదరాబాద్: కరోనా లాక్డౌన్, రిజిస్ట్రేషన్లకు సెలవులతో నేలచూపులు చూసి కుదేలైన స్థిరాస్తి రంగం మూడు నెలల్లోనే తిరిగి తారాజువ్వలా పైకిలేచింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర శివార్లలో పెద్ద ఎత్తున పుంజుకున్న రియల్ వ్యాపారాల కారణంగా గత ఆర్థిక సంవత్సరం చివరి 3 నెలల్లో భారీ సంఖ్యలో రిజిస్ట్రేషన్ లావాదేవీలు నమోదయ్యాయి. రంగారెడ్డి, మేడ్చల్ రిజిస్ట్రేషన్ జిల్లాల పరిధిలో ఏడాది కాలంలో జరిగిన కార్యకలాపాల్లో సగం మేరకు జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లోనే జరగడం విశేషం. ముఖ్యంగా శివార్లలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు రిజిస్ట్రేషన్ల కోసం వచ్చేవారితో పోటెత్తాయి. భూమిపై పెట్టుబడిని ఆదాయ వనరుగా మధ్యతరగతి వర్గాలు భావిస్తుండడంతో పాటు రీజనల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) లాంటి ప్రతిపాదనలు, కరోనా వైరస్ నేర్పిన పాఠంతో కాంక్రీట్ జంగిల్‌ను వదిలి ప్రశాంతత కోసం శివార్లలోని విల్లాలు, ఫామ్ హౌస్‌ల వైపు సంపన్నులు మొగ్గు చూపుతుండడం ఇందుకు కారణాలని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు చెబుతున్నాయి. రంగారెడ్డిలో అత్యధిక లావాదేవీలు రిజిస్ట్రేషన్ల గణాంకాలను పరిశీలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా రూ.4 వేల కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. ఇందులో సగం కంటే ఎక్కువగా రూ.2,503 కోట్ల వరకు రంగారెడ్డి, మేడ్చల్ రిజిస్ట్రేషన్ జిల్లాల నుంచే రావడం గమనార్హం. ఇక, ఈ రెండు జిల్లాల పరిధిలో జరిగిన లావాదేవీలను విశ్లేషిస్తే రంగారెడ్డిæ జిల్లా పరిధిలో ఏడాది కాలంలో 1.7లక్షల లావాదేవీలు జరిగితే చివరి మూడు నెలల్లో 88 వేలకు పైగా లావాదేవీలు జరిగాయి. మేడ్చల్ జిల్లా పరిధిలో ఏడాది కాలంలో లక్షకు పైగా డాక్యుమెంట్లు నమోదు కాగా, మూడు నెలల్లో 58 వేలకు పైగా రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు జరగడం విశేషం. ట్రిపుల్ ఆర్ ‘భూమ్’ నగరాన్ని చుట్టుముట్టి 340 కిలోమీటర్లకు పైగా ఏర్పాటు కానున్న ఆర్ఆర్ఆర్ ప్రతిపాదనలు ఒక్క సారిగా స్థిరాస్తి రంగ స్వరూపాన్ని మార్చివేశాయి. హెచ్ఎండీఏ పరిధిలోకి వచ్చే ఏడు జిల్లాల్లో ఈ రహదారి ఏర్పాటవుతుందన్న అంచనాతో శివార్లలో రియల్ కార్యకలాపాలు గత రెండు నెలలుగా జోరందుకున్నాయి. భూముల ధరలు అమాంతం పెంచేసినా, భవిష్యత్తులో మరింత పెరుగుతాయనే ఆశతో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వర్గాలు ఆర్ఆర్ఆర్ చుట్టూ ఉన్న భూముల కొనుగోళ్లపై దృష్టి పెట్టాయి. ఈ ట్రిపుల్ ఆర్ ఏర్పాటు పూర్తయితే దీని చుట్టూ పారిశ్రామికాభివద్ధి జరుగుతుందని, రానున్న ఐదారేళ్లలో భూములకు మరింత డిమాండ్ వస్తుందనే ఆలోచనతో ఎక్కువ మంది ఈ ప్రాంతంపై ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు నగర శివార్లలో లగ్జరీ విల్లాలపై కూడా సంపన్న వర్గాల్లో ఆసక్తి పెరిగింది. కనీసం రూ.3 కోట్ల నుంచి రూ.10 కోట్ల విలువ గల విల్లాల కొనుగోలుపై వ్యాపారవేత్తలు, ఎన్నారైలు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా గండిపేట, గోపన్‌పల్లి, నార్సింగి, తుక్కుగూడ, మహేశ్వరం తదితర ప్రాంతాల్లో విల్లాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయని రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరిగిన తీరు వెల్లడిస్తోంది. ఊతమిస్తున్న అభివృద్ధి ఐటీ రంగం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ చుట్టూ జరుగుతున్న అభివృద్ధి కూడా రియల్ రంగానికి కొత్త ఊపు తెస్తోంది. ముఖ్యంగా ఐటీ అభివృద్ధితో పాటు పరిశ్రమల విస్తరణ, నగరానికి దగ్గర్లోనే యాదాద్రి పుణ్యక్షేత్రం అభివృద్ధి, వరంగల్–హైదరాబాద్ పారిశ్రామిక కారిడార్, బెంగళూరు జాతీయ రహదారిపై ఎలక్ట్రానిక్ గూడ్స్ క్లస్టర్, లాజిస్టిక్ హబ్‌లు లాంటివి ఏర్పాటవుతుండడంతో ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతులు సమకూరుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో విరివిగా వెంచర్లు, టౌ¯న్షిప్లు ఏర్పాటు చేస్తున్నారు రియల్ వ్యాపారులు. భారీ బహుళ జాతి సంస్థలు కూడా తమ కార్యాలయాలను గ్రేటర్లో ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తుండడంతో నివాస ప్రాంతాల కోసం నగర శివార్లలో పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడింది. దీంతో భూములు, విల్లాలు, అపార్ట్మెంట్లు, రిసార్టుల క్రయ విక్రయ లావాదేవీలు భారీ ఎత్తున పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలోనే రిజిస్ట్రేషన్ లావాదేవీలు నగర శివార్లలోనే ఎక్కువ జరుగుతున్నాయి. దీనికి తోడు కోవిడ్ మొదటి దశ తర్వాత మధ్యతరగతి వర్గాలు సొంత ఇళ్లను సమకూర్చుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టాయని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు.శివార్లలోని ఉప్పల్, మేడ్చల్, ఘట్కేసర్, పోచారం, గుండ్ల పోచంపల్లి, తూంకుంట, కొంపల్లి, కుత్బుల్లాపూర్, దుండిగల్, మహేశ్వరం, ఆదిభట్ల, బడంగ్పేట్, మణికొండ, శంకరపల్లి, శంషాబాద్ తదితర ప్రాంతాల్లో నిర్మాణాలు ఊపందుకున్నాయని క్షేత్రస్థాయి పరిస్థితులు చెబుతున్నాయి. -
భూమి పాస్‌బుక్‌లో తప్పులా? ఇలా సవరించుకోండి
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో 9 రకాల సవరణలకు ప్రభుత్వం అవకాశమిచ్చింది. పాస్ పుస్తకాల్లో తప్పులు నమోదైన తర్వాత వాటిని సరి చేసుకునేందుకు ఇప్పటివరకు అవకాశం లేకపోగా, అందులో కొన్నింటి పరిష్కారానికి ఆప్షన్లిచ్చింది. ఆధార్ నమోదులో తప్పులు, ఆధార్ వివరాలు సమర్పించకపోవడం, తండ్రి లేదా భర్త పేరులో తప్పులు, కులం మార్పు, సర్వే నంబర్ మిస్సింగ్, పాస్ పుస్తకాల్లో భూమి రకం మార్పు లాంటి అంశాలకు ఆప్షన్లు ఇచ్చింది. కొత్త పాస్ పుస్తకాల మంజూరుకు బయోమెట్రిక్ తప్పనిసరి కావడంతో రాష్ట్రంలోని మీ–సేవ కేంద్రాలకు వెళ్లి సవరణల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సీసీఎల్ఏ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. కలెక్టర్ల పరిశీలన అనంతరం.. మీ-సేవ కేంద్రాల్లో ఈ మార్పుల కోసం చేసుకున్న దరఖాస్తులు నేరుగా కలెక్టర్లకు వెళ్తాయని, వారు పరిశీలించిన అనంతరం దరఖాస్తును ఆమోదిం చడం లేదా తిరస్కరించడం జరుగుతుందని సీసీఎల్ఏ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆమోదం పొందిన దరఖాస్తుల విషయాన్ని దరఖాస్తుదారుడికి తెలియ జేసి తదుపరి చర్యలు వివరిస్తారని తెలిపారు. కాగా, వీటితో పాటు ధరణిలో రిజిస్ట్రేషన్ల కోసం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరలోనే కొలిక్కి తేవాలని రెవెన్యూ వర్గాలు భావిస్తున్నాయి. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (జీపీఏ) అమల్లో ఉన్న సాంకేతిక ఇబ్బందులు, కంపెనీలకు పాసుపుస్తకాల జారీ ప్రక్రియ, లీజు బదిలీ, రద్దు, సరెండర్, అమ్మకపు సర్టిఫికెట్లు, కన్వేయన్స్ డీడ్ విస్తీర్ణంలో తేడాలు, మార్కెట్ వాల్యూ సర్టిఫికెట్లకు, మైనర్లకు పాసు పుస్తకాల్లాంటివి ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. వీటన్నింటినీ త్వరలోనే పరిష్కరిస్తామని, 10 రోజుల్లో ధరణి పోర్టల్ పూర్తి స్థాయిలో గాడిలో పడుతుందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి.