విదేశాల్లో పెంపుడు జంతువుల పేర్ల మీద కోట్ల ఆస్తులు వీలునామా రాసిన ఘటనలు విన్నాం. కానీ మనదేశంలో కోతుల పేరు మీద భూమి ఉండటం అరుదే. మహారాష్ట్ర ఉస్మానాబాద్ జిల్లాలోని ఉప్లా గ్రామంలో కోతుల పేరు మీద 32 ఎకరాల భూమి ఉంది. ఈ విషయం గ్రామ పంచాయతీ రికార్డుల్లో స్పష్టంగా రాసి ఉంది. అటవీ శాఖ మొక్కలు నాటిన ఆ భూమిలో శిథిలావస్థలో ఉన్న ఓ ఇల్లు కూడా ఉంది. ఈ భూమి కోసం గొడవలవుతున్నాయి. నగరాల్లో గజం జాగ కొనాలంటే గగనమవుతోంది.
అలాంటిది కోతులకు 32 ఎకరాల భూమి ఎలా వచ్చింది? అసలు జంతువుల పేరు మీద రిజిస్టర్ ఎలా చేశారు? ఎవరు రిజిస్టర్ చేశారు? అనేక సందేహాలు వస్తున్నాయి కదా! ‘కానీ.. ఎవరు రిజిస్టర్ చేశారు? ఎలా చేశారు?’అనే విషయం మాత్రం ఎవ్వరికీ తెలియదని చెబుతున్నాడు ఆ గ్రామ సర్పంచ్ బప్పా పడ్వాల్. అక్కడ కోతుల పేరుమీద భూమి ఉండటమే కాదు, వాటికి ఎనలేని గౌరవం కూడా ఉంది.
ఉప్లా గ్రామవాసులు కోతులకు ఒకప్పుడు ఇంకా ఎక్కువ మర్యాద ఇచ్చేవారు. వేడుక ఏదైనా కోతులకు ప్రత్యేక స్థానం ఉండేది. పెళ్లిళ్లు అయితే.. ముందు వాటికి కానుకలు ఇచ్చిన తరువాతే వేడుక మొదలయ్యేది. ఇప్పుడు ఆ ఆచారాన్ని తక్కువ మంది పాటిస్తున్నారు. అయినా ఇప్పటికీ... కోతులు ఇంటిముందుకొస్తే ఆహారం మాత్రం కచ్చితంగా పెడతారు.
Comments
Please login to add a commentAdd a comment