Monkey Vs Dog: Twitter Trending Over 250 Dogs Deceased By Attack Monkeys - Sakshi
Sakshi News home page

కోతి వర్సెస్‌​ కుక్క! సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ!

Published Sun, Dec 19 2021 7:57 AM | Last Updated on Sun, Dec 19 2021 10:38 AM

Monkey Vs Dog Twitter Trending Over 250 Dogs Deceased By Attack Monkeys - Sakshi

#MonkeyVsDoge: సోషల్‌ మీడియాలో ఎప్పుడు ఏ విషయం వైరల్‌ అవుతుందో.. నెటిజన్లు ఎలా స్పందిస్తారో తెలియదు! ఎక్కడ ఏ ఘటన చోటుచేసుకున్నా తమదైనశైలిలో కామెంట్లు, మీమ్స్‌ తయారు చేసి సంఘటనలను ట్రెండింగ్‌లోకి తీసుకువస్తారు. విషాద ఘటనలైనా సరే గ్రూప్‌లుగా మరీ కామెంట్లు చేస్తూ ఆ విషయాన్ని నెట్టింట వైరల్‌ చేస్తారు. ప్రాణమున్న ప్రతిజీవికి కోపం రావడం, దానికి కారకులపై పగ కలగడం సహజం! కోతులే కదా అని తీసిపారేస్తే ఏం చేస్తాయో చూపిస్తున్నాయి వానరాలు. కానీ అన్ని జీవులకు పగాప్రతీకారాలు ఒకేలా ఉండవు. సదరు జీవి శక్తిని బట్టి, అవకాశాన్ని బట్టి, కలిగిన బాధ తీవ్రతను బట్టి ప్రతీకార విస్తృతి మారుతుంది. శనివారంమహారాష్ట్రలోని బీడ్‌ జిల్లాలో వానరాలు బీభత్సం సృష్టిస్తున్న వార్తలు వెలుగులోకి వచ్చింది. 

ప్రస్తుతం ఈ వార్త ట్విటర్‌లో తీవ్రమైన చర్చ జరుగుతోంది. #MonkeyVsDoge అనే హ్యాష్‌ ట్యాగ్‌తో గ్రూప్‌లుగా మారీ నెటిజన్లు కామెంట్లు, మీమ్స్‌ తయరు చేసి పోస్ట్‌ చేస్తున్నారు. అయితే ఈ ఘటన చాలా విషాదకరమైనప్పటికీ దేశవ్యాప్తంగా నెటిజన్లు ‘మంకీ గ్రూప్‌ వర్సెస్‌ డాగ్‌ గ్రూప్‌’ గా మారీ కామెంట్లు చేయడంతో ట్విటర్‌ ట్రెండింగ్‌లో ఉంది. గతంలో కుక్కలు కోతులను వెంటపడిమరీ చంపాయని.. దీంతో పగపట్టిన కోతులు ఫ్యాక్షన్‌ సినిమా తరహాలో గుంపులుగా చేరి కుక్కలను చంపడం ప్రారంభించాయని స్థానికులు తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement