gang war
-
కృష్ణా జిల్లా యనమలకుదురులో గ్యాంగ్ వార్
-
Viral Video: నడిరోడ్డుపై గ్యాంగ్ వార్.. కార్లు, కత్తులతో ఫైటింగ్
యశవంతపుర: యువకునిపై కారు ఎక్కించి, తల్వార్లతో దాడి చేసిన ఘటన ఉడుపిలో జరిగింది. శుక్రవారం రాత్రి ఉడుపి శారద మండపం జంక్షన్లో రెండు గుంపుల మధ్య తీవ్రమైన ఘర్షణ చోటు చేసుకొంది. హైవే – 169లో ప్రజలు తిరుగుతున్న సమయంలో దుండగులు పెద్ద పెద్ద కత్తులతో వీరవిహారం చేశారు. సినిమాలో మాదిరిగా కార్లలో ఒకరినొకరు గుద్దుకుంటూ గొడవలు పడడం చూసి జనం భయాందోళనకు గురయ్యారు. దగ్గర్లో అపార్ట్మెంట్లోని ఒక వ్యక్తి ఈ దృశ్యాలను వీడియో తీశారు. ఈ వీడియో చూసి ఇది ఉడుపియేనా, లేక ఇతర దేశమా? అని స్థానిక ప్రజలే నోటిమీద వేలు వేసుకొంటున్నారు. కాపు తాలూకాకు చెందిన గరుడ గ్యాంగ్ యువకులు ఒక కారు అమ్మకంపై మరో గుంపుతో గొడవ పడినట్లు తెలిసింది. ఈ దాడుల్లో పలువురికి గాయాలైనట్లు సమాచారం. ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. దుండగుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. Very bad state of affairs Gang War at Udupi Incident happened recently late night, 2 groups fought on Udupi Manipal Highway near KunjibettuWhere is the younger generation heading ???Stringent action should be taken against all these culprits pic.twitter.com/EVAstmKumR— Dr Durgaprasad Hegde (@DpHegde) May 25, 2024 -
గ్యాంగ్‌స్టర్, లేడీ డాన్ల పెళ్లికి గ్యాంగ్‌వార్ ముప్పు? భారీ పోలీసు బందోబస్తు!
దేశరాజధాని ఢిల్లీలోని ద్వారకలోగల సంతోష్ మ్యారేజ్ గార్డెన్లో గ్యాంగ్‌స్టర్ కాలా జఠేడి, లేడీ డాన్ అనురాధల వివాహం నేడు (మార్పి 12) జరగనుంది. ఇందుకు సంబంధించిన సన్నాహాలన్నీ పూర్తయ్యాయి. కొద్దిమంది అతిథులను మాత్రమే ఆహ్వానించారు. అయితే గ్యాంగ్‌వార్ ముప్పును దృష్టిలో పెట్టుకుని మ్యారేజ్ గార్డెన్లో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. అతిథులను బార్ కోడ్ ద్వారా గుర్తించి, ప్రవేశం కల్పించనున్నారు. మ్యారేజ్ గార్డెన్లో పలు సీసీటీవీలను ఏర్పాటు చేశారు. వీటి పర్యవేక్షణకు కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. మ్యారేజ్ హాల్ చుట్టూ ఉన్న రోడ్లను కూడా ఎప్పటికప్పుడు సీసీటీవీలతో పర్యవేక్షిస్తున్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం నాలుగు రాష్ట్రాల పోలీసులు, కేంద్ర ఏజెన్సీలు ఈ వివాహంపై దృష్టి పెట్టాయి. గ్యాంగ్ వార్ ముప్పు దృష్ట్యా సంతోష్ గార్డెన్ చుట్టుపక్కల ఉన్న ఫ్యాక్టరీలు, దుకాణాలను పోలీసులు మూసివేయించారు. రెండు రోజుల క్రితం ఐదుగురు షూటర్లను పోలీసులు మ్యారేజ్ గార్డెన్ సమీపంలో అరెస్ట్ చేశారు. కాలా జఠేడికి పలు ముఠాల నుండి ముప్పు ఉంది. వాటిలో బంబిహా గ్యాంగ్ పేరు మొదట వినిపిస్తుంది. బంబిహా గ్యాంగ్‌కి చెందిన షూటర్లు కాలా జఠేడితో పాటు అతని గ్యాంగ్‌పై దాడి చేయడానికి నిత్యం వెదుకుతుంటారని పోలీసులు దగ్గర సమాచారం ఉంది. గ్యాంగ్‌స్టర్, లేడీ డాన్ల వివాహ వేదికను పూలతో అందంగా అలంకరించారు. అతిథులు కూర్చునేందుకు అద్భుతమైన సోఫాలను ఏర్పాటు చేశారు. అతిథుల విందు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. VIDEO | Tight security for gangster Sandeep alias Kala Jathedi's marriage with "history-sheeter" Anuradha Choudhary alias 'Madam Minz' in #Delhi. The Delhi Police has made a strategic plan to avert any incident of gang-wars or possibility of Sandeep's escape from custody,… pic.twitter.com/9YQPB9950U — Press Trust of India (@PTI_News) March 12, 2024 -
తీహార్ జైల్లో ఘర్షణ.. గ్యాంగ్‌స్టర్ టిల్లు మృతి
ఢిల్లీ: రోహిణి కోర్టు కాల్పుల ఘటన ప్రధాన సూత్రధారి, గ్యాంగ్‌స్టర్ టిల్లు తజ్‌పూరియా Tillu Tajpuriya మృతి చెందాడు. తీహార్ జైల్లో జరిగిన గ్యాంగ్ వార్‌లో అతను చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన అతన్ని ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణం పోయిందని వెల్లడించారు. తీహార్ జైలులో గత రాత్రి రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ప్రత్యర్థి గ్యాంగ్ చేతిలో తజ్‌పూరియా తీవ్రంగా గాయపడ్డాడు. యోగేష్ తుండా, అతని అనుచరులు ఇనుప రాడ్లతో ఈ దాడికి తెగబడినట్లు తెలుస్తోంది. పోలీసులు అన్ని ఢిల్లీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరగాల్సి ఉంది. Delhi's Rohini court shootout accused jailed gangster Tillu Tajpuriya killed after he was attacked by rival gang members Yogesh Tunda and others in Tihar jail. He was taken to Delhi's Deen Dayal Upadhyay Hospital, where he was declared dead. Further investigation underway by… pic.twitter.com/70cVYUD0rk — ANI (@ANI) May 2, 2023 ఢిల్లీలో మోస్ట్ వాండెటెడ్ అయిన గ్యాంగ్‌స్టర్ జితేందర్ గోగిని కిందటి ఏడాది సెప్టెంబర్‌లో రోహిణి కోర్టు ప్రాంగణంలోనే కాల్చి చంపారు ఇద్దరు దుండగులు. ఈ హత్య కేసులో ప్రధాన సూత్రధారి గ్యాంగ్‌స్టర్ టిల్లు తజ్పూరియానే. అప్పుడు మండోలా జైలు నుంచే అతను జితేందర్ హత్యకు ప్రణాళిక వేయడం గమనార్హం. అయితే.. జితేందర్‌ను కాల్చిచంపిన ఇద్దరు దుండగులు అప్పుడే పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో హతమయ్యారు. వీరిని ఉమాంగ్ యాదవ్, వినయ్‌గా పోలీసులు గుర్తించారు. దీనికి ముందు ఇంటర్నెట్ కాలింగ్ ద్వారా టిల్లుకు వీరిద్దరూ సమాచారం ఇచ్చినట్టు వెల్లడైంది. ఇదీ చదవండి: సంచలనంగా చనిపోయిన వ్యక్తి లేఖ! -
ఖైదీల ఘర్షణ.. సిద్దు హత్య కేసు నిందితుల హతం
ఛండీగఢ్: సింగర్ సిద్దూ మూసేవాలా హత్య కేసు నిందితుల్లో ఇద్దరు.. జైలు ఘర్షణలో హతమయ్యారు. పంజాబ్ టార్న్ తరణ్ జిల్లా గోయింద్వాల్ సాహిబ్ సెంట్రల్ జైలు ఆదివారం ఐదుగురు ఖైదీల మధ్య జరిగింది. ఈ ఘర్షణలో మన్దీప్ సింగ్ అలియాస్ తుపాన్ ఆఫ్ బటాలా, మన్మోహన్సింగ్ అలియాస్ మోహ్న ఆఫ్ బుద్లానాలు హతమైనట్లు అధికారులు వెల్లడించారు. మరో ఖైదీ కేశవ్ ఆఫ్ బతిండాకు గాయాలు కావడంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ముగ్గురు ఒకే గ్యాంగ్‌కు చెందిన వాళ్లని, సిద్దు హత్యకేసులో నిందితులుగా ఉన్నారని ఎస్ఎస్పీ గుర్మిత్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. తుపాన్ మూసేవాలా హత్య కేసులో షూటర్లకు వాహనాలు సరఫరా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక పంజాబీ యువగాయకుడు సిద్దూ మూసేవాలా.. 2022, మే 29న కాల్పుల్లో హత్యకు గురయ్యాడు. అంతకు ముందురోజే ఆయనకున్న సెక్యూరిటీని పంజాబ్‌లో కొలువు దీరిన మాన్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. సుమారు 30 రౌండ్ల కాల్పులు జరిపారు ఆయనపై దుండగులు. -
Rajasthan: పట్టపగలే గ్యాంగ్‌స్టర్ దారుణ హత్య
జైపూర్: రాజస్థాన్‌లో గ్యాంగ్ వార్.. ఒక్కసారిగా రాష్ట్రాన్ని ఉలిక్కి పడేలా చేసింది. పట్టపగలే హైప్రొఫైల్ గ్యాంగ్‌స్టర్ రాజు థెట్ హత్యకు గురయ్యాడు. ఇంటి ముందే నలుగురు దుండగులు అతనిపై బుల్లెట్ల వర్షం కురిపించారు. శనివారం ఉదయం 9.30గం. ప్రాంతంలో సికార్ నగరం పిప్రాలి రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. దుండగులు కురిపించిన బుల్లెట్ల వర్షానికి.. రాజు అక్కడికక్కడే కుప్పకూలాడు. ఈ కాల్పుల్లో మరో వ్యక్తి కూడా మృతి చెందినట్లు సమాచారం. షెకావతి ప్రాంతానికి చెందిన మరో గ్యాంగ్‌తో రాజుకి వైరం ఉందని, బహుశా ఆ ముఠానే ఈ హత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. హత్య తర్వాత గాల్లోకి కాల్పులు జరుపుతూ జనాలను భయపెట్టుకుంటూ ముందుకు వెళ్లింది ఆ ముఠా. అయితే.. Gang war in Sikar, Rajasthan. Gangster Raju Theth shot dead. Earlier Raju Theth had enmity with the Anandpal gang, according to sources currently Anandpal gang and Bishnoi gang were together. Sikar police is investigating the matter. pic.twitter.com/ZLkkcNshRH — Ravi Chaturvedi (@Ravi4Bharat) December 3, 2022 ఇక ఈ ఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత.. రోహిత్ గొదార అనే వ్యక్తి కాల్పులకు తానే బాధ్యుడినంటూ ఫేస్బుక్ ద్వారా ప్రకటించుకోవడం గమనార్హం. మరో విశేషం ఏంటంటే.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడినే అంటూ అతను పరిచయం చేసుకున్నాడు. ఆనంద్ పాల్ సింగ్, బల్బిర్ బనుదా హత్యలకు ప్రతీకారంగానే రాజును హతమార్చినట్లు ప్రకటించుకున్నాడు రోహిత్. గ్యాంగ్‌స్టర్ రాజు(పాత చిత్రం) ఆనంద్‌పాల్ గ్యాంగ్‌కు చెందిన బనుదా.. జులై 2014లో బికనీర్ జైలులో జరిగిన గొడవల్లో ఓ గ్యాంగ్ చేతిలో హత్యకు గురయ్యాడు. ఇదిలా ఉంటే.. థెట్ వర్గీయులు అతని మరణానికి సంఘీభావంగా స్థానికంగా దుకాణాలు మూయించేశారు. నిందితులను అరెస్ట్ చేయకపోతే ఆందోళన చేపడతామని పోలీసులను హెచ్చరిస్తున్నారు. ఇదీ చదవండి: గుండెపోటుతో డ్రైవర్ మృతి.. బస్సు బీభత్సం -
సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులో గ్యాంగ్ వార్
-
సింగర్ సిద్ధూ హత్య కేసు: కీలకంగా మారునున్న సెల్ఫీ!
చండీగఢ్: పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇది ముమ్మాటికి పక్కా ప్లాన్ ప్రకారం చేసిన ప్రతికార హత్య అని దర్యాప్తులో తేలింది. అదీగాక అనుమానితుడు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కూడా తన అన్నని మట్టుపెట్టినందుకు ప్రతీకారంగానే సిద్ధూని తన ముఠా సభ్యులు చంపినట్టు ఒప్పుకున్నాడు. ఈ తరుణంలో సిద్ధు హత్య జరిగిన రోజుకు సంబంధించిన సీసీఫుటేజ్ వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ ఫుటేజ్‌లో సిద్ధూ ఎస్యూవీ కారుకి సమీపంలో ఇద్దరూ వ్యక్తులు నిలుచుని ఉన్నారు. ఇద్దరిలో ఒక వ్యక్తి సెల్ఫీ కోసం సిద్ధూ వద్దకు వస్తున్నట్లు ఆ వీడియోలో కనిపించింది. ఆ వ్యక్తి డ్రైవర్ వైపుగా వచ్చి సిద్ధూతో సెల్ఫీ తీసుకున్నాడు. ఐతే ఆ వ్యక్తి సెల్ఫీ తీసుకున్న తర్వాతే.. సిద్ధూ పై జరిగింది. ఆ సమయంలోనే ‘దాడి చేయడానికి సిద్ధంకండి’ అంటూ షూటర్లకు ఒక ఫోన్ కాల్ వచ్చిందని పోలీసులు భావిస్తున్నారు. కానీ ఆ సీసీ ఫుటేజ్‌లో ఆ వ్యక్తుల ముఖాలు అస్పష్టంగా కనిపిస్తున్నాయి. పోలీసులు ఆ వీడియోలో కనిపించిన ఇద్దరు వ్యక్తులను అనుమానితులుగా పరిగణిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి.. ఈ సెల్ఫీనే కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే.. సిద్ధూని హతమార్చిన ఎనిమిది మంది షూటర్లను పంజాబ్ పోలీసులు గుర్తించారు. ఆ షూటర్లంతా పంజాబ్, హర్యానా, రాజస్థాన్, మహారాష్ట్రాలకు చెందినవారు. నిందితుల ఆచూకి కోసం ఈ మూడు రాష్ట్రాల్లోనూ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. (చదవండి: యస్.. ఇది ప్రతీకార హత్యే!: సింగర్ సిద్ధూ హత్య కేసులో కీలక మలుపు) -
సింగర్ సిద్ధూ హత్య కేసులో కీలక మలుపు
ఛండీగఢ్: పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అనుమానితుడిగా భావిస్తున్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్.. ఇదొక ప్రతీకార హత్యే అని వెల్లడించినట్లు తెలుస్తోంది. పంజాబీ సింగర్‌సిద్ధూ మూసే వాలా హత్యను తన ముఠా సభ్యులే చేశారని విచారణలో బిష్ణోయ్, పోలీసుల వద్ద చెప్పినట్లు సమాచారం. నిన్నటిదాకా(గురువారం) అసలు తనకు హత్యతో సంబంధం లేదని వాదిస్తూ వచ్చాడు బిష్ణోయ్. ఈ క్రమంలో తాజాగా.. విక్కీ మిద్దుఖేరా తన అన్న అని, అతని హత్యకు ప్రతీకారంగానే ఇప్పుడు సిద్ధూని తన ముఠా మట్టుబెట్టి ఉంటుందని బిష్ణోయ్ పోలీసులతో వెల్లడించినట్లు సమాచారం. అయితే ఈ హత్యలో తన ప్రమేయం లేదని, తీహార్ జైల్లో ఉన్న తాను కనీసం తన ఫోన్‌ను కూడా ఉపయోగించడం లేదని బిష్ణోయ్ వెల్లడించాడు. అంతేకాదు సిద్ధూ హత్యను జైలులోని టీవీ ద్వారానే తెలుసుకున్నా అని బిష్ణోయ్ తెలిపాడు. ఇదిలా ఉంటే పంజాబీ పాపులర్ సింగర్ సిద్ధూ.. మే 29న మాన్సా జిల్లాలో ఘోరంగా హత్యకు గురయ్యాడు. ఆ వెంటనే పోలీసుల అనుమానం లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ మీదకు మళ్లింది. ఆ మరుసటి రోజే.. జైల్లో తనకు భద్రత కల్పించాలంటూ పటియాలా న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు లారెన్స్ బిష్ణోయ్. సింగర్ సిద్దూ హత్యలో కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ ప్రమేయం ఉందని తేలింది. బ్రార్.. బిష్ణోయ్ గ్యాంగ్‌లో కీలక సభ్యుడు కూడా. బిష్ణోయ్ సోదరుడు విక్కీ మిద్దుఖేరా హత్య కేసులో సిద్దూ మేనేజర్ షగన్‌ప్రీత్ పేరు ప్రముఖంగా వినిపించింది. ఆ ఘటన తర్వాత షగన్‌ప్రీత్.. విదేశాలకు పారిపోయాడు. అయితే ఈ వ్యవహారంలో సిద్ధూనే షగన్‌ప్రీత్‌కు సహకరించి ఉంటాడని బిష్ణోయ్ అనుచరులు నమ్మారు. అందుకే నాలుగు రోజులు రెక్కీ వేసి మరీ సింగర్ సిద్ధూని కిరాతకంగా కాల్చి చంపారు. సిద్ధూ కుటుంబానికి సీఎం పరామర్శ సింగర్ సిద్ధూ మూసే వాలా కుటుంబాన్ని పంజాబ్ సీఎం భగవంత్‌మాన్ పరామర్శించారు. శుక్రవారం మన్సా జిల్లా మూసే గ్రామానికి వెళ్లి.. సిద్ధూ కుటుంబాన్ని ఓదర్చారు. దారిపోడవునా.. నిరసనకారులు సీఎం కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. చివరికి ఎలాగోలా సిద్ధూ ఇంటికి చేరారు సీఎం భగవంత్. ఈ సందర్భంగా.. తమకు న్యాయం చేయాలని సిద్ధూ కుటుంబం సీఎంని కోరింది. చదవండి: నిర్లక్ష్యమే సిద్దూ ప్రాణం తీసిందా? -
Sidhu Moose Wala: నిర్లక్ష్యమే సిద్దూ ప్రాణం తీసిందా?
పంజాబ్ ర్యాప్ సింగర్, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసే వాలా ఆదివారం ఉదయం ఘోర హత్యకు గురయ్యాడు. వీఐపీ కల్చర్‌కు ముగింపే పలికే క్రమంలో భాగంగా.. భద్రతను ఉపసంహరించుకున్న మరుసటి రోజే ఈ దారుణం జరగడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ తరుణంలో.. సిద్ధూ మూసే వాలా నిర్లక్ష్యమే అతని ప్రాణం తీసినట్లు తేలింది. పంజాబ్ మనసా జిల్లా మూసేవాలాకు చెందిన సిద్ధూ.. ఆదివారం గ్యాంగ్ వార్కి బలయ్యాడు. 29 ఏళ్ల ఈ యువ ర్యాపర్ గ్యాంగ్స్టర్లను ప్రొత్సహించేలా ర్యాప్‌లకు కడుతుంటాడు. అంతేకాదు మరణించే వరకు పలు వివాదాలు, కేసులతోనూ వార్తల్లో నిలిచాడు అతను. సిద్ధూ మూసే వాలాతో పాటు 424 మందికి పంజాబ్ ప్రభుత్వం శనివారం వీఐపీ భద్రతను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది. అయితే.. కొందరికి మాత్రం పూర్తిస్థాయిలో వెనక్కి తీసుకోలేదు. సిద్ధూకి నలుగురు భద్రతా సిబ్బంది ఉండగా.. ఇద్దరిని మాత్రమే వెనక్కి తీసుకుంది పంజాబ్ పోలీస్ శాఖ. అంతేకాదు అతనికి బుల్లెట్ వెహికిల్ కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. కానీ, సిద్ధూ సిబ్బందిని, బుల్లెట్‌ఫ్రూఫ్ బండిని ఉపయోగించుకుండా.. తన ఇద్దరు స్నేహితులతో సాధారణ వాహనంలో బయటకు వెళ్లాడు. అదే అతని ప్రాణం తీసింది. జహవర్కే గ్రామం వద్ద వాహనంపై పలు రౌండ్లు కాల్పులు జరిపారు దుండగలు. దీంతో సిద్ధూ అక్కడికక్కడే మృతి చెందగా.. మిగతా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్.. ఈ దాడికి కారణమని పోలీసులు నిర్ధారించారు. లారెన్స్ బిష్ణోయ్ ఈ హత్య కుట్రలో భాగం అయ్యాడు అని పంజాబ్ డీజీపీ వీకే భర్వా మీడియాకు వెల్లడించాడు. బిష్ణోయ్ అనుచరుడు గ్యాంగ్‌స్టర్ గోల్డీ బార్ ఈ హత్యకు కారకుడయ్యి ఉంటాడని చెప్తున్నారు. కిందటి ఏడాది జరిగిన విక్కీ మిద్ధుఖేరా హత్యకు ప్రతీకారంగానే సిద్ధూ హత్య జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. విక్కీ హత్య కేసులో మూసే వాలా మేనేజర్ షగన్‌ప్రీత్ పేరు ప్రముఖంగా వినిపించింది. #WATCH | Punjab: A CCTV video shows two cars trailing Sidhu Moose Wala's vehicle moments before he was shot dead in Mansa district. pic.twitter.com/SsJag33XHb — ANI (@ANI) May 30, 2022 ఇక సిద్ధూ మూసే వాలా హత్య కేసు దర్యాప్తునకు ఒక సిట్ బృందం ఏర్పాటు చేసినట్లు పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. సిద్ధూ మూసే వాలా అసలు పేరు సుభ్‌దీప్ సింగ్ సిద్ధూ. చిన్నవయసులోనే స్టార్ డమ్ దక్కింది అతనికి. అదే సమయంలో వివాదాలు, విమర్శలు సైతం ఎదుర్కొన్నాడు. గన్ కల్చర్‌తో పాటు గ్యాంగ్స్టర్లను హీరోలుగా అభివర్ణిస్తూ ర్యాప్ సాంగ్స్ కట్టాడు అతను. అంతేకాదు నాలుగు పంజాబీ సినిమాల్లోనూ నటించాడు. అతని ఆల్బమ్స్ మొత్తం హింసను ప్రేరేపించేవిగా ఉండేవి. అభ్యంతరకర కంటెంట్‌తోనూ విమర్శలు ఎదుర్కొన్నాడు అతను. సిక్కు తెగ వీరుల్ని అవమానించేలా ఉండడంతో క్షమాపణలు చెప్పాడు కూడా. ఇక లాక్డౌన్ టైంలో తన సెక్యూరిటీ సిబ్బంది దగ్గరి తుపాకులు తీసుకుని ఫొటోలకు ఫోజులు ఇచ్చినందుకు ఆర్మ్స్ యాక్ట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం.. కేసులు నమోదు అయ్యాయి. ఆ టైంలో అరెస్ట్‌కు బయపడి కొన్నాళ్లపాటు పరారీలో ఉన్నాడు అతను. ఆపై బెయిల్ దొరికాక బయటకు రాగా.. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులోనే ఉంది ఇంకా. సిద్ధూపై ఇంకా నాలుగు క్రిమినల్ కేసులు ఉన్నాయి. పంజాబ్ ఎన్నికల ముందు 2021లో కాంగ్రెస్‌లో చేరిన సిద్ధూ మూసే వాలా.. ఎన్నికల్లో సైతం పోటీ చేసి ఆప్ అభ్యర్థి డాక్టర్ విజయ్ సింగ్లా చేతిలో ఓడిపోయాడు. సిద్ధూ మృతి కాంగ్రెస్ కీలక నేతలతో పాటు అతని అభిమానులను దిగ్ర్భాంతికి గురి చేసింది. ఇదిలా ఉంటే.. సెక్యూరిటీ ఉపసంహరణే ఒక ప్రాణం బలి తీసుకుందంటూ ప్రత్యర్థులు ఆరోపిస్తుండగా.. దయచేసి సంయమనం పాటించాలని, దోషులు ఎంతటి వాళ్లైనా వదిలే ప్రసక్తే లేదని పిలుపు ఇచ్చాడు పంజాబ్ సీఎం భగవంత్ మాన్. I am Shocked and Deeply saddened by the gruesome murder of Siddhu Moosewala. Nobody involved will be spared. My thoughts and prayers are with his family and his fans across the world. I appeal everyone to stay calm. — Bhagwant Mann (@BhagwantMann) May 29, 2022 -
Hyderabad: మద్యం మత్తులో గ్యాంగ్‌వార్
సాక్షి, చిలకలగూడ (హైదరాబాద్): వారాసిగూడ చౌరస్తాలో ఆదివారం రాత్రి మద్యం మత్తులో రెండు గ్రూపుల మధ్య గ్యాంగ్‌వార్ జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు లాఠీచార్జ్ చేసి పరిస్థితిని అదుపు చేశారు. వివరాల ప్రకారం.. వారాసిగూడ చౌరస్తాలోని ఓ మద్యం షాపులో నిబంధనలకు వ్యతిరేకంగా విశాలమైన సిట్టింగ్రూంను ఏర్పాటు చేసి మినీబార్ను నిర్వహిస్తున్నారు. ఆదివారం సాయంత్రం రెండు గ్రూపులు తమ స్నేహితులతో కలిసి మినీబార్లో మద్యం సేవిస్తున్నారు. రాత్రి 7 గంటలకు మద్యం మత్తులో రెండు గ్రూపుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని గ్యాంగ్‌వార్‌కు దారితీసింది. చౌరస్తా నుంచి నాలుగు వైపుల ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని రెండు గ్రూపులను చెదరగొట్టారు. ఫజల్, శివకుమార్‌లతోపాటు మరికొంత మందిని అదుపులోకి తీసుకున్నారు. సీసీ కెమెరాల ఫూటేజీలను పరిశీలిస్తున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా మినీబార్లు ఏర్పాటు చేయడంతో తరచూ కొట్లాటలు జరుగుతున్నాయని, వారాసిగూడ చౌరస్తాలో మద్యం షాపులను అనుమతి ఇవ్వొద్దని ఆందోళనలు చేసిన సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
హైదరాబాద్‌లో అర్ధరాత్రి గ్యాంగ్ వార్
-
హైదరాబాద్‌లో అర్ధరాత్రి గ్యాంగ్ వార్.. ఒకరు మృతి
సాక్షి, హైదరాబాద్: ఎల్బీనగర్లో శనివారం అర్థరాత్రి గ్యాంగ్ వార్ కలకలం సృష్టించింది. గంజాయి, మద్యం మత్తులో ఇరువర్గాలవారు పరస్పరం దాడులు చేసుకున్నారు. హాకీస్టిక్, రాడ్లు కత్తులతో ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడటంతో నరసింహారెడ్డి అనే వ్యక్తి మృతి చెందాడు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. నరసింహారెడ్డి మృతికి కారణమైన యువకుల నివాసంపై అతని బంధువులు దాడికి దిగారు. ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఛీ ఛీ పార్టీ ఆఫీస్‌లో ఇదేం పని.. బీజేపీ నేతల వీడియో వైరల్ -
కోతి వర్సెస్ కుక్క! సోషల్ మీడియాలో రచ్చ రచ్చ!
#MonkeyVsDoge: సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ విషయం వైరల్ అవుతుందో.. నెటిజన్లు ఎలా స్పందిస్తారో తెలియదు! ఎక్కడ ఏ ఘటన చోటుచేసుకున్నా తమదైనశైలిలో కామెంట్లు, మీమ్స్ తయారు చేసి సంఘటనలను ట్రెండింగ్‌లోకి తీసుకువస్తారు. విషాద ఘటనలైనా సరే గ్రూప్‌లుగా మరీ కామెంట్లు చేస్తూ ఆ విషయాన్ని నెట్టింట వైరల్ చేస్తారు. ప్రాణమున్న ప్రతిజీవికి కోపం రావడం, దానికి కారకులపై పగ కలగడం సహజం! కోతులే కదా అని తీసిపారేస్తే ఏం చేస్తాయో చూపిస్తున్నాయి వానరాలు. కానీ అన్ని జీవులకు పగాప్రతీకారాలు ఒకేలా ఉండవు. సదరు జీవి శక్తిని బట్టి, అవకాశాన్ని బట్టి, కలిగిన బాధ తీవ్రతను బట్టి ప్రతీకార విస్తృతి మారుతుంది. శనివారంమహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో వానరాలు బీభత్సం సృష్టిస్తున్న వార్తలు వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వార్త ట్విటర్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది. #MonkeyVsDoge అనే హ్యాష్ ట్యాగ్‌తో గ్రూప్‌లుగా మారీ నెటిజన్లు కామెంట్లు, మీమ్స్ తయరు చేసి పోస్ట్ చేస్తున్నారు. అయితే ఈ ఘటన చాలా విషాదకరమైనప్పటికీ దేశవ్యాప్తంగా నెటిజన్లు ‘మంకీ గ్రూప్ వర్సెస్ డాగ్ గ్రూప్’ గా మారీ కామెంట్లు చేయడంతో ట్విటర్ ట్రెండింగ్‌లో ఉంది. గతంలో కుక్కలు కోతులను వెంటపడిమరీ చంపాయని.. దీంతో పగపట్టిన కోతులు ఫ్యాక్షన్ సినిమా తరహాలో గుంపులుగా చేరి కుక్కలను చంపడం ప్రారంభించాయని స్థానికులు తెలిపారు. Monkeys when they are going to Dog areas #MonkeyVsDoge pic.twitter.com/oIFIkZhuuc — Mr X (@tweets_of_X) December 18, 2021 The Biggest reason behind #MonkeyVsDoge gangwar 😂😂😂😂😂😂😂 pic.twitter.com/98NnuPlftc — 𝗔ɴᴋɪᴛ ❁ (@FanOfMySellf) December 18, 2021 Bhai! Ye Billiyon ki Saajish hai bata raha hoon.#MonkeyVsDoge pic.twitter.com/aYtoVu1caP — Ankush (@_James_Bong) December 18, 2021 #MonkeyVsDoge https://t.co/QduTYnHIzq pic.twitter.com/c78WHkSVEx — सिया 🥀 || (@HayeSiyapa) December 18, 2021 Dogs vs Monkeys #MonkeyVsDoge I support both of them check the next vid in the thread 🙏❤️ pic.twitter.com/vTl2sxKSES — Vishupedia (@vishupedia) December 18, 2021 Joe biden has decided to make a peace agreement between monke and doge Thanq biden 👏 #MonkeyVsDoge pic.twitter.com/oTGzAPnY3c — SM (@lolsaalam) December 18, 2021 -
కోర్టులో షూటౌట్; వెలుగులోకి సంచలన విషయాలు
ఢిల్లీలో మోస్ట్ వాండెటెడ్ గ్యాంగ్‌స్టర్ జితేందర్ గోగి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జితేందర్‌ను శుక్రవారం రోహిణి కోర్టు ఆవరణలో అందరూ చూస్తుండగా కాల్చి చంపిన సంగతి విదితమే. అతడి హత్యకు ప్రధాన సూత్రధారుడిగా మరో గ్యాంగ్‌స్టర్ టిల్లు తాజ్‌పూరియాను పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి బలం చేకూర్చే ఆధారాలు పోలీసులకు లభ్యమయినట్టు సమాచారం. రోహిణి కోర్టు షూటౌట్‌కు సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు ఇంటర్నెట్ ద్వారా టిల్లు తెలుసుకున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. టిల్లు తాజ్పూరియా ప్రస్తుతం తీహార్‌లోని మండోలా జైలులో ఉన్నాడు. కారాగారం నుంచే జితేందర్ హత్యకు సంబంధించిన విషయాలను తన ఇద్దరు అనుచరుల ద్వారా ఎప్పటికప్పుడు అతడు తెలుసుకున్నట్టు సమాచారం. జితేందర్‌ను కాల్చిచంపిన ఇద్దరు దుండగులు పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో హతమయ్యారు. వీరిని ఉమాంగ్ యాదవ్, వినయ్‌గా పోలీసులు గుర్తించారు. దీనికి ముందు ఇంటర్నెట్ కాలింగ్ ద్వారా టిల్లుకు వీరిద్దరూ సమాచారం ఇచ్చినట్టు వెల్లడైంది. రోహిణి కోర్టుకు చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది, ఇప్పుడు ఎక్కడికి చేరుకున్నారు వంటి ప్రశ్నలు.. తన ఇద్దరు అనుచరులను ఫోన్లో టిల్లు అడిగినట్టు తెలుస్తోంది. రోహిణి కోర్టుకు చేరుకున్న తర్వాత ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వాలని ఉమాంగ్, వినయ్‌లను ఆదేశించాడట. రోహిణి కోర్టులో షూటౌట్‌కు కొద్ది నిమిషాల ముందు కూడా వారికి కాల్ చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ‘దాడి చేసిన ఇద్దరూ కోర్టు గది లోపల కూర్చున్నారని.. కోర్టు లోపల, బయటా పోలీసు భద్రత కట్టుదిట్టంగా ఉందని తెలుసుకుని.. తన అనుచరులు తప్పించుకోవడం కష్టమని టిల్లు భావించాడు. దీంతో మరోసారి ఫోన్ చేసి వారి ఆచూకీ గురించి అడిగాడు. వారు పార్కింగ్ స్థలంలో ఉన్నారని చెప్పినప్పుడు అక్కడి నుంచి వెంటనే పారిపోవాలని టిల్లు సూచించాడ’ని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ గ్యాంగ్‌వార్: ఒకప్పటి ఫ్రెండ్స్.. శత్రువులుగా ఎందుకు మారారు? -
ఢిల్లీ గ్యాంగ్‌వార్: ఒకప్పటి ఫ్రెండ్స్.. శత్రువులుగా ఎందుకు మారారు?
దేశ రాజధాని ఢిల్లీలో రెండు హంతక ముఠాల గ్యాంగ్‌వార్ పెను సంచలనం రేపింది. ఏకంగా న్యాయస్థానం ఆవరణలోనే మారణహోమం సృష్టించింది. మోస్ట్ వాండెటెడ్ గ్యాంగ్‌స్టర్ జితేందర్ గోగిని కోర్టు ప్రాంగణంలోనే పట్టపగలు ప్రత్యర్థులు కాల్చి చంపారు. పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు దుండగులు మృతి చెందారు. దుండగులు టిల్లు తాజ్పూరియా గ్యాంగ్‌కు చెందిన వారని అనుమానిస్తున్నారు. కాలేజీ రోజుల నుంచే వైరం జితేందర్ గోగి, టిల్లు తాజ్పూరియా ఒకప్పుడు స్నేహితులుగా ఉండేవారు. కాలేజీ స్టూడెంట్ యూనియన్ ఎన్నికలు వీరిద్దరి మధ్య వైరానికి దారితీశాయి. 2010లో ఔటర్ ఢిల్లీలో జరిగిన కాలేజీ విద్యార్థి యూనియన్ ఎన్నికల్లో వీరిద్దరి మధ్య మొదలైన గొడవలు గ్యాంగ్‌వార్‌గా మారాయి. 2018లో బూరారీ ప్రాంతంలో ఈ రెండు గ్రూపుల మధ్య జరిగిన గొడవల్లో ముగ్గురు చనిపోగా, ఐదుగురు గాయపడ్డారు. రెండు ముఠాల మధ్య జరిగిన ఆధిపత్య పోరులో ఇప్పటివరకు 100 మందికి పైగా మరణించారని సమాచారం. ఎవరీ జితేంద్ర? గ్యాంగ్‌స్టర్ జితేంద్ర మన్ అలియాన్ గోగి.. ఢిల్లీ-హరియాణా సరిహద్దులోని అలీపూర్ ప్రాంతానికి చెందినవాడు. పోలీసులు టాప్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో అతడి పేరే ముందుంది. 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్తను తీహార్ జైలు నుంచి బెదిరించడంతో మీడియాలో పతాక శీర్షికలకు ఎక్కాడు. కారాగారం లోపల నుంచే హంతక దందా నడిపించినట్టు ఆరోపణలు ఉన్నాయి. మూడుసార్లు జైలు నుంచి పారిపోయాడు. 2016, జూలై 30న బహదూర్‌గఢ్‌లో పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. గతేడాది మార్చి 3న గురుగ్రామ్‌లోని సెక్టార్ 82లో జితేంద్రను పోలీసులు పట్టుకున్నారు. ఈ రోజు రోహిణి కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరయ్యేందుకు వెళుతుండగా ప్రత్యర్థుల దాడిలో హతమయ్యాడు. దశాబ్ద కాలంగా గ్యాంగ్‌వార్ టిల్లు తాజ్‌పురియా కూడా తీహార్ జైలులో ఉన్నాడు. కారాగారం నుంచే ముఠా కార్యాలపాలు సాగించినట్టు ఇతడిపైనా ఆరోపణలు ఉన్నాయి. 2010 నుంచి గోగి, టిల్లు ముఠాల మధ్య ఆధిపత్య పోరు సాగుతున్నా 2013లో జరిగిన ఘటనతో గ్యాంగ్‌వార్ మరింత తీవ్రమైంది. ఢిల్లీకి డాన్‌గా చెప్పుకునే మరో గ్యాంగ్‌స్టర్ నీతూ దబోడియా అప్పట్లో పోలీసుల ఎన్కౌంటర్లో హతమయ్యాడు. దీంతో జితేంద్ర గోగి, టిల్లు తాజ్‌పురియా మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. దశాబ్ద కాలంగా రెండు గ్రూపుల మధ్య గ్యాంగ్‌వార్ కొనసాగుతోంది. తాజాగా ఢిల్లీలోని రోహిణి కోర్టు రూమ్ 206లో ప్రత్యర్థులు జరిపిన కాల్పుల్లో జితేంద్ర హతమయ్యాడు. లాయర్ డ్రెస్‌లో వచ్చిన దుండగులు అతడిని తుపాకులతో కాల్చి చంపారు. -
ఢిల్లీలో కాల్పుల కలకలం
-
కోర్టులోనే రెండు గ్రూపుల కాల్పులు
-
లాయర్ దుస్తుల్లో వచ్చి కోర్టు ఆవరణలో కాల్పులు.. నలుగురు మృతి
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. న్యాయస్థానం ఆవరణలో ఓ గ్యాంగ్ లాయర్ దుస్తుల్లో వచ్చి కాల్పులకు పాల్పడటంతో నలుగురు మృతి చెందారు. ఢిల్లీలోని రోహిణి కోర్టు రూమ్ 207లో ఈ ఘటన జరిగింది. రెండు గ్యాంగుల మధ్య వాగ్వాదం ఏర్పడి కాల్పులకు దారి తీసింది. లాయర్ దుస్తుల్లో వచ్చిన సునీల్ గ్యాంగ్ కాల్పులకు పాల్పడింది. ఈ ఘటనలో గ్యాంగ్ స్టర్ జితేంద్ర మృతి చెందాడు. ఓ కేసు విషయంలో గ్యాంగ్ స్టర్ జితేంద్ర కోర్టు రాగా లాయర్ దుస్తులు వచ్చిన కొంతమంది కాల్పులకు తెగబడ్డారు. ప్రత్యర్థి ముఠా కాల్పులకు దిగగానే షూటర్లను కాల్చి చంపిన గోగి గ్యాంగ్. కాగా, ఈ ఘటనలో గ్యాంగ్‌స్టర్ జితేంద్రతోపాటు మరో ముగ్గురు మృతి చెందారు. అందరూ చూస్తుండగానే ఇరు గ్యాంగ్‌లు విచ్చల విడిగా కాల్పులు జరుపుకున్నాయి. కొంతకాలంగా సునీల్ గ్యాంగ్-జితేంద్ర గ్యాంగ్‌ల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ క్రమంలోనే జితేంద్ర టార్గెట్ చేసుకున్న సునీల్ గ్యాంగ్.. కోర్టు ఆవరణలోనే కాల్పులకు దిగింది. జితేంద్ర గోగి అలియాస్ దాదా మోస్గ్ వాంటెడ్ క్రిమినల్. 2016లో పోలీస్ కస్టడీ నుంచి జితేంద్ర గోగి పరారీ కాగా, ఆ గ్యాంగ్ స్టర్‌పై రూ. 4 లక్షల రివార్డు ఉంది. కాగా, గోగిపై ఇప్పటికే 12 దోపిడీ, హత్య కేసులున్నాయి. కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ కింద కూడా గోగిపై కేసు నమోదైంది. చదవండి: ఫారెన్ వెళ్లలేకపోతున్నా.. మనస్తాపంతో యువతి #WATCH | Visuals of the shootout at Delhi's Rohini court today As per Delhi Police, assailants opened fire at gangster Jitender Mann 'Gogi', who has died. Three attackers have also been shot dead by police. pic.twitter.com/dYgRjQGW7J — ANI (@ANI) September 24, 2021 -
సినిమాను తలపించే రీతిలో.. హిజ్రాల గ్యాంగ్‌వార్
అనంతపురం క్రైం: హిజ్రాలు రెడ్డెక్కారు. ఆధిపత్య పోరులో ప్రాంతాల వారీగా విడిపోయి దాడులకు తెగబడ్డారు. ఇందులో అనంతపురానికి చెందిన ఒకరు తీవ్రంగా గాయపడగా... దాడి చేసిన వారిని అరెస్టు చేయాలంటూ గురువారం కలెక్టరేట్ వద్ద హిజ్రాలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. టూటౌన్ సీఐ జాకీర్ హుస్సేన్ తెలిపిన వివరాల మేరకు.. అనంతపురంలోని జయమణెమ్మ కళ్యాణమంటపంలో మన విజయం ట్రాన్స్‌జెండర్ అసోసియేషన్ మయూరి ఆధ్వర్యంలో ఈ నెల 28న హిజ్రాలు ఉలిగమ్మ ఉత్సవం నిర్వహించారు. వైఎస్సార్ కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, బళ్లారి ప్రాంతాల నుంచి దాదాపు 500 మంది హిజ్రా లతో పాటు హైదరాబాద్, కర్ణాటక నుంచి 120 మంది హాజరయ్యారు. హైదరాబాద్‌కు చెందిన సునితా నాయక్ అలియాస్ అక్తార్‌భాను ఆధ్వర్యంలో నడిచే సంఘానికి ఇకపై డబ్బులు చెల్లించకూడదని కర్ణాటక, ఏపీకి చెందిన హిజ్రాలు నిర్ణయించగా, హైదరాబాద్ హిజ్రాలు అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలోనే మాటామాట పెరగడంతో వాదన చేసుకున్నారు. ఉత్సవం అనంతరం తమ స్వస్థలాలకు వెళ్లేందుకు హైదరాబాద్, కర్ణాటకకు చెందిన ఆశా, వీనా, ఆర్థన, గీతమ్మ తదితరులు అర్ధరాత్రి వేళ అనంతపురం శివారులోని తపోవనం వద్దకు చేరుకున్నారు. అక్కడ కొద్దిసేపు వాదులాట జరగ్గా... అనంతపురం హిజ్రా రుక్సానా అలియాస్ శర్మాస్‌పై వారంతా దాడి చేశారు. దీనికి నిరసనగా గురువారం కలెక్టరేట్ ముందు పలువురు హిజ్రాలు ఆందోళన చేపట్టారు. బంగారం, డబ్బులు లాక్కున్నారని, దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వన్‌టౌన్ సీఐ ప్రతాప్ రెడ్డి, టూటౌన్ సీఐ జాకీర్ హుస్సేన్ హిజ్రాలతో మాట్లాడి ఆందోళనను విరమింపజేశారు. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఆధిపత్య పోరుతోనే సమస్య తలెత్తిందని, విచారణ చేసి నిందితులపై చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు. -
వనస్థలిపురంలో గ్యాంగ్ వార్ కలకలం
-
బెజవాడలో మరో గ్యాంగ్‌వార్!
సాక్షి, విజయవాడ: నగరంలోని పటమటలో జరిగిన గ్యాంగ్‌వార్ తరహా ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కేదారేశ్వరపేట ఖుద్దూస్‌నగర్‌కు చెందిన షేక్ నాగుల్‌మీరా(మున్నా), రాహుల్ అనే యువకుల వర్గాల మధ్య పాత గొడవలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గత నెల 31వ తేదీన రాహుల్‌తో పాటు అయోధ్యనగర్‌కు చెందిన వినయ్ తదితరులు కేదారేశ్వరపేటలో కత్తులు, కర్రలతో నాగుల్‌మీరా వర్గంపై దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత అదే రోజు రాత్రి 7.30 గంటల సమయంలో నాగుల్‌మీరా వర్గానికి చెందిన ఈసబ్, సాయికుమార్ తదితరులు అయోధ్యనగర్ బసవతారకనగర్ రైల్వే క్యాబిన్ సమీపంలో వినయ్, రాహుల్ తదితరులపై కత్తులు, ఇతర మారణాయుధాలతో దాడి చేశారు. పరస్పర దాడులు తర్వాత ఇరువర్గాలు బయటకు రాలేదు. (గ్యాంగ్‌వార్.. రౌడీషీటర్‌పై హత్యాయత్నం) ఇదిలా ఉండగా అయోధ్యనగర్‌కు చెందిన పుట్టా వినయ్ (18) ఈ నెల 9వ తేదీన తనపై ఖుద్దూస్‌నగర్‌కు చెందిన షేక్ నాగుల్‌మీరా(25), న్యూరాజరాజేశ్వరీపేటకు చెందిన షేక్ ఈసబ్ (26), బుడమేరు మధ్యకట్ట ప్రాంతానికి చెందిన లావేటి సాయికుమార్(24), సీతన్నపేటకు చెందిన నాగులాపల్లి సాయి పవన్(20), కృష్ణలంకకు చెందిన కంది సాయికుమార్ (20)లతో పాటు మరికొందరు దాడి చేసినట్లు అజిత్‌సింగ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పుట్టా వినయ్ ఫిర్యాదు చేసిన వారిలో నాగుల్‌మీరా, ఈసబ్, సాయికుమార్, సాయిపవన్, కంది సాయికుమార్‌లతో పాటు మరో ఇద్దరు బాలలను సోమవారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు సీఐ లక్ష్మీనారాయణ తెలిపారు. అరెస్టు చేసిన వారి నుంచి ఓ ద్విచక్రవాహనం, కత్తులు స్వాధీనం చేసుకున్నామని, దాడి పూర్వాపరాలను పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్లు వివరించారు. తనపై 9 మంది వ్యక్తులు కత్తులు, ఇతర మారణాయుధాలతో కేదారేశ్వరపేట ప్రాంతంలో దాడి చేశారంటూ షేక్ నాగుల్‌మీరా (మున్నా) ఆదివారం సత్యనారాయణపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సోమవారం ఖుద్దూస్‌నగర్‌కు చెందిన రాహుల్, పటమటకు చెందిన సాయికిరణ్, అయోధ్యనగర్‌కు చెందిన పుట్టా వినయ్, వికాస్ అనే యువకులను అరెస్టు చేసినట్లు సీఐ బాలమురళీకృష్ణ తెలిపారు. వీరి నుంచి సైతం కత్తులు స్వాధీనం చేసుకున్నామని, మరో అయిదుగురు కోసం గాలిస్తున్నట్లు వివరించారు. -
హైదరాబాద్: పాతబస్తీలో గ్యాంగ్ వార్
-
గ్యాంగ్‌వార్.. రౌడీషీటర్‌పై హత్యాయత్నం
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలో దారుణం చోటు చేసుకుంది. కాలాపత్తర్ లో పాత కక్షల నేపథ్యంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. రెండు వర్గాలు కత్తులతో దాడులు చేసుకున్నారు. రౌడీషీటర్ షానుర్పై ప్రత్యర్థి వర్గం మరణాయుధాలతో విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో షానూర్కు తీవ్రగాయాలు కాగా, ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. షానూర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. వర్గ ఆధిపత్యం, పాత తగాదాలే దాడులకు కారణమని పోలీసులు భాస్తున్నారు ఘటన జరిగిన ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. షానూర్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
పడమట గ్యాంగ్ వార్ కేసులో మరో నలుగురి అరెస్టు
సాక్షి, విజయవాడ: బెజవాడ పడమట గ్యాంగ్ వార్ కేసులో పోలీసులు మరో నలుగురిని మంగళవారం అరెస్టు చేశారు. వారిలో పండు గ్రూప్‌కు చెందిన రౌడీ షీటర్ అనంత్ కుమార్, అజయ్, శంకర్, మస్తాన్లను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసుల వెల్లడించారు. అయితే ఇప్పటికే పండు గ్యాంగ్‌లోని 26 మందిని, సందీప్ గ్రూప్‌లోని 24 మందిని అరెస్టు చేసి జైలుకు తరలించిన విషయం తెలిసిందే. అయితే పండు గ్రూప్‌కు చెందిన రౌడీ షీటర్ అనంత్ కుమార్‌పై సీపీ బత్తిన శ్రీనివాసులు నగర బహిష్కరణ వేటు వేశారు. అదే గ్యాంగ్‌లోని మరో 18 మందిని సస్పెక్ట్ చేస్తూ.. మరో 8 మందిపై పడమటి పోలీసులు రౌడీ షీట్ కేసులు తెలిచారు. మరోసారి స్ట్రీట్ ఫైట్లకు దిగి బెజవాడ ప్రశాంతతకు భంగం కలిగిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. చదవండి: విశాఖలో మరో గ్యాంగ్‌వార్ కలకలం