బోరబండలో గ్యాంగ్ వార్
Published Thu, Sep 8 2016 4:18 PM | Last Updated on Mon, Oct 8 2018 3:08 PM
- యువకుడిపై కత్తితో దాడి
హైదరాబాద్: నగరంలోని ఎస్ఆర్ నగర్ పీఎస్ పరిధిలోని బోరబండలో గ్యాంగ్ వార్ జరిగింది. ప్రేమ వ్యవహారం నేపథ్యంలో ఓ యువకుడిపై హత్యాయత్నం జరిగింది. స్థానిక రాజీవ్‌నగర్‌కు చెందిన శ్రవణ్ అనే యువకుడిపై గురువారం సాయంత్రం నలుగురు యువకులు కత్తితో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతడిని చుట్టుపక్కల వారు ఆస్పత్రికి తరలించారు. ప్రేమ వ్యవహారమే ఈ ఘటనకు కారణమని భావిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Advertisement
Advertisement