borabanda
-
బోరబండలో డబుల్ బెడ్ రూం ఇళ్ల పేరుతో మోసం
-
బోరబండ ఇన్స్పెక్టర్పై వేటు
హైదరాబాద్: బోరబండ పోలీసుస్టేషన్ ఇన్స్పెక్టర్ కె.రవికుమార్‌పై వేటు పడింది. ఆయన్ను సిటీ కమిషనరేట్‌కే ఎటాచ్ చేస్తూ కొత్వాల్ సందీప్ శాండిల్య మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. విధి నిర్వహణలో అలసత్వం, రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం తదితర కారణాల నేపథ్యంలో సీపీ ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోపక్క ఎస్సార్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో మంగళవారం వెలుగులోకి వచి్చన యువకుడి హత్య కారణంగా మరో ఇన్స్పెక్టర్పై చర్యలకు కమిషనర్ రంగం సిద్ధం చేశారు. దీనికి సంబంధించి బుధవారం ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ఎన్నికల నేపథ్యంలో ప్రతి స్టేషన్ హౌస్ ఆఫీసర్ తమ పరిధిలో ఉన్న రౌడీషీటర్ల వంటి అసాంఘిక శక్తులపై కన్నేసి ఉంచాలని కొత్వాల్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. రౌడీషీటర్లకు సంబంధించిన రికార్డులు కలిగి ఉండాలని, వీటిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడంతో పాటు ఇన్స్పెక్టర్లే స్వయంగా పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. వీరిని బైండోవర్ చేయడంతో పాటు క్రమం తప్పకుండా కౌన్సిలింగ్ ఇవ్వడం, వారి ఇళ్లను సందర్శించి కదలికలపై నిఘా ఉంచడం సైతం ఇన్స్పెక్టర్ల బాధ్యతగా సందీప్ శాండిల్య స్పష్టం చేశారు. దైనందిన విధుల నేపథ్యంలో ఈ వ్యవహారాల్లో ఎస్సై సహాయం తీసుకోవాలే తప్ప పూర్తిగా వారిపై విడిచిపెట్ట కూడదని ఆదేశాలు జారీ చేశారు. వీటి అమలును పర్యవేక్షించడానికి ఆయన మంగళవారం నుంచి ఠాణాల తనిఖీలు ప్రారంభించారు. వెస్ట్‌జోన్ పరిధిలోని పలు పోలీసుస్టేషన్లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. బోరబండ ఠాణాలో సరైన రికార్డులు లేకపోవడం, రౌడీషీటర్ల వ్యవహారం ఎస్సైలే పర్యవేక్షించడం వంటివి సందీప్ శాండిల్య దృష్టికి వచ్చాయి. దీంతో ఇన్స్పెక్టర్ రవికుమార్‌ను నిలదీసిన ఆయన రౌడీషీటర్ల ఇళ్లకు వెళ్లారా? అంటూ ప్రశ్నించారు. తన వెంట వచ్చి కనీసం నలుగురి ఇళ్లైనా చూపాల్సిందిగా ఆదేశించారు. కొత్వాల్ వాహనం వరకు వెళ్ళిన రవికుమార్ ఆ వ్యవహారాలను ఎస్సైలు పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సందీప్ శాండిల్య ఆయన్ను కమిషనరేట్‌కు అటాచ్ చేస్తూ ఉత్తుర్వులు జారీ చేశారు. మరోపక్క రౌడీషీటర్ల కదలికలపై నిఘా ఉంచాలని కొత్వాల్ పదేపదే స్పష్టం చేస్తున్నారు. వాళ్లు ఏం చేస్తున్నారు? ఎవరితో వైరాలు ఉన్నాయి? తదితర అంశాలపై కన్నేయాల్సిందిగా ప్రత్యేక విభాగాలకు ఆదేశించారు. అయితే ఎస్సార్‌నగర్ రౌడీషీటర్ షేక్ షరీఫ్ సోమవారం రాత్రి యువకుడు తరుణ్‌ను హత్య చేశాడు. ఇది మంగళవారం వెలుగులోకి వచ్చింది. గతంలోనూ వీరి మధ్య వైరం ఉన్నా, పలుమార్లు ఘర్షణలు జరిగినా రౌడీషీటర్ పై నిఘా ఉంచడం, చర్యలు తీసుకోవడంలో ప్రత్యేక విభాగాలు నిర్లక్ష్యం వహించాయని కొత్వాల్ భావిస్తున్నారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఆయన మరో ఇన్స్పెక్టర్పై వేటుకు రంగం సిద్ధం చేశారు. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు బుధవారం వెలువడే అవకాశం ఉంది. -
హైదరాబాద్ బోరబండ సీఐ రవికుమార్ పై వేటు
-
ఐదు నెలల క్రితమే పెళ్లి.. అత్తింటి వేధింపులతో గర్భిణి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: అత్తింటి వారి వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం వెలుగులోకి వచ్చింది. ఇన్స్పెక్టర్ రవికుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎస్పీఆర్హిల్స్ అశయ్య నగర్‌కు చెందిన జీహెచ్ఎంసీ స్వచ్ఛ ఆటో డ్రైవర్‌గా పనిచేసే రాజేందర్‌కు బాలానగర్ చింతల్‌కు చెందిన లావణ్యతో ఐదు నెలల క్రితం వివాహం జరిగింది. లావణ్యకు పుట్టుకతోనే వినికిడి లోపం ఉంది. పెళ్లయిన కొద్ది రోజులకే ఆమె భర్త రాజేందర్, అత్తింటి వారు ఆమెను వేధింపులకు గురిచేసేవారు. చెవిటి దానివిగనుక అదనపు కట్నం తీసుకోరావాలని అత్తింటి వారు లావణ్యను వేధించేవారు. ఈ క్రమంలోనే గర్భిణి అయిన లావణ్య(25)తనలో తాను కుమిలిపోయి ఆగస్టు 14న తెల్లవారు జామున తన అత్తగారింట్లో ఫ్యానుకు ఊరేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. అయితే ఈ విషయాన్ని గమనించిన చుట్టుపక్కల వారు ఆమెను కాపాడి ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. మృతిరాలి తండ్రి లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు బోరబండ పోలీసులు భర్త రాజేందర్, అత్త నరసవ్వలపై వరకట్న కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపారు. చదవండి: బ్యాంక్ ఖాతాల్లోంచి డబ్బునలా కాజేస్తున్నారు! -
Hyderabad: శిశువును బండకేసి బాదిన ‘మైనర్’ తండ్రి
రహమత్‌నగర్(బోరబండ): పరిపక్వత లేని వయస్సు, చదువుకునేటప్పుడు ఏర్పడ్డ ఆకర్షణ ఆ మైనర్లను ఒకటి చేసింది. అది కాస్తా పెళ్లికి దారి తీసింది. తెలిసీతెలియని వయస్సులో వారు ఓ బిడ్డకు సైతం జన్మనిచ్చారు. తమ సుఖాలకు అడ్డువస్తున్నదనే అక్కసుతో కన్న తండ్రి తమ పేగుబంధాన్ని తెంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే పలుమార్లు శిశువును చంపాలని యత్నించాడు. జరిగిన ఘోరాన్ని సదరు బాలిక తమ కుటుంబ సభ్యులకు తెలిపింది. వారంతా పోలీసులను ఆశ్రయించడంతో విషయంవెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రాంతానికి చెందిన మైనర్ బాలుడు, మైనర్ బాలిక ఇంటర్ మీడియట్ చదువుతున్నారు. వీరు ఎనిమిదో తరగతి నుండే ఒకనొకరు ఇష్ట పడ్డారు. పదవ తరగతి చివరి పరీక్ష పూర్తి కాగానే యాదగిరిగుట్టలో ఇరువురు వివాహం చేసుకున్నారు. ఆ తరువాత బోరబండ డివిజన్ ఓ ప్రాంతంలో కాపురం పెట్టారు. 2022లో వీరికి ఓ పాప పుట్టింది. తన దాంపత్య జీవితానికి అడ్డంకిగా మారుతున్నదని సదరు తండ్రి పసి గుడ్డుపై పలు మార్లు హత్యయత్నం చేశాడు. ఈ క్రమంలో మే 4న తిరిగి బిడ్డను బండకేసి బాదాడు. ఈ ఘటనలో శిశువుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘోరాన్ని చూసి తట్టుకోలేక బాలిక విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. వారంతా కలిసి శుక్రవారం బోరబండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. -
హైదరాబాద్: గోడ కూలి నెలల పసికందు మృతి
సాక్షి, హైదరాబాద్: నగరంలోని బోరబండ పరిధిలోని రహమత్‌నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి కురిసిన నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్ గోడ కూలి.. పక్కనే ఉన్న రేకుల ఇంటి మీద ఇటుక రాళ్లు పడ్డాయి. దీంతో ఆ ఇంట్లో ఉన్న ఓ నెలల పసికందు మృతి చెందింది. నారాయణఖేడ్ చెందిన శ్రీకాంత్-జగదేవి జంట.. కూలీ పని కోసం నగరానికి వచ్చి రెహమత్నగర్ పరిధిలోని ఓంనగర్‌లో ఉంటున్నారు. మంగళవారం రాత్రి ఈదురు గాలులతో కూడిన వర్షంతో.. వాళ్లుంటున్న పోర్షన్ పక్కన నిర్మాణంలో ఉన్న భవనం నాలుగో అంతస్తులో ఉన్న సైడ్‌వాల్ కూలిపోయింది. దీంతో ఆ ఇటుక రాళ్లు పక్కనే శ్రీకాంత్ ఉంటున్న రేకుల రూమ్‌పై పడ్డాయి. ఆ సమయంలో పెద్ద శబ్ధం రావడంతో.. ఆ భార్యభర్తలిద్దరూ అప్రమత్తం అయ్యి బయటపడ్డారు. అయితే ఊయలలో నిద్రిస్తున్న 8 నెలల జీవనికా ఇటుకలు మీద పడి అక్కడికక్కడే మృతి చెందింది. బాలిక మృతితో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఆ భవన నిర్మాణం అక్రమంగా సాగుతోందని చెబుతూ.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. మరోవైపు చిన్నారి మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్ తరలించి.. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. -
హైదరాబాద్‌లో దారుణం.. యువతి గొంతుకోసిన ప్రేమోన్మాది
సాక్షి, హైదరాబాద్: బోరబండలోని బంజారానగర్‌లో దారుణం చోటుచేసుకుంది. తన ప్రేమను అంగీకరించలేదనే కోపంతో యువతి గొంతు కోశాడు ఓ ప్రేమోన్మాది. సురేష్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో కొన్నాళ్లుగా లక్ష్మీ అనే యువతి వెంటపడుతున్నాడు. అయితే యువకుడి ప్రేమను లక్ష్మీ నిరాకరించింది. ఈ క్రమంలో సోమవారం స్కూటీపై వెళ్తున్న యువతిని అడ్డగించిన సురేష్.. ఒక్కసారిగా కత్తితో గొంతు కోసేందుకు యత్నించాడు. దీంతో లక్ష్మీ గట్టిగా కేకలు వేయడంతో స్థానికంగా ఉన్న కొంతమంది ప్రేమోన్మాదిని అడ్డుకున్నారు. నిందితుడు పారిపోయే ప్రయత్నం చేయగా పట్టుకొని చితకబాదిన స్థానికులు.. ఎస్ఆర్ నగర్ పోలీసులకు అప్పగించారు. ప్రేమోన్మాది దాడిలో యువతికి తీవ్ర గాయాలవ్వగా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. చదవండి: యూపీలో దారుణం.. హోటల్ గదిలో విగతజీవిగా వైద్యాధికారి -
Crime News: భాయ్.. నావల్ల కావట్లేదు చనిపోతున్నా!
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగం కోసం వెళుతున్నట్లు ఇంట్లో చెప్పి బయటికి వెళ్లిన వ్యక్తి అదృశ్యమైన సంఘటన అమీర్‌పేట పరిధిలో సోమవారం వెలుగులోకి వచ్చింది. బోరబండ ఎస్‌ఆర్‌టీకి చెందిన అబ్దుల్ మతీన్ డిగ్రీ పూర్తి చేశాడు. గత నెల(డిసెంబర్) 30న ఉదయం ఉద్యోగం చూసుకునేందుకు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి బయటికి వెళ్లాడు. అదే రోజు మధ్యాహ్నం ఫోన్ చేసి ఇంటికి వస్తున్నట్లు చెప్పాడు. అయితే రాత్రి తన సోదరుడు అబ్దుల్ ముజాయిద్‌కు లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు ఎక్కువయ్యాయని, తాను ఇక ఇంటికి రానని, ఆత్మహత్య చేసుకుంటానని మెసేజ్ పంపాడు. దీంతో కుటుంబసభ్యులు అతడి కోసం వెతికినా ప్రయోజనం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామాంజనేయులు తెలిపారు. -
తల్లీ కూతుళ్ల ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్టు
సాక్షి, హైదరాబాద్: బోరబండ విజేత థియేటర్ ఎదురుగా సాగర్‌సొసైటీ గుడిసెల్లో జరిగిన తులసీబాయి, శిరీష ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్టు చోటు చేసుకుంది. పక్కింట్లో ఉండే వ్యక్తే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని కుటుంబసభ్యులు ఆరోపించారు. బోరబండ హైటెక్ సిటీ హోటల్ సమీపంలోని నివసించే మృతురాలి కూతురు జ్యోతి, కుమారు పరుశరాంలు విలేకర్లతో మాట్లాడుతూ.. 2019 తమ తండ్రిని గోపాల్‌ను కూడా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని అన్నారు. అప్పట్లో పక్కింట్లో ఉండే వ్యక్తిపై ఫిర్యాదు చేయడంతో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారన్నారు. అయితే బయటికి వచ్చాక ఇంటికి వచ్చేవాడని, జైలుకు వెళ్లినందుకు తనకు డబ్బులు ఖర్చు అయ్యాయని, డబ్బుల కోసం తమ తల్లిని వేధిస్తూ వచ్చాడని ఆరోపించారు. అదే కోపంతో తల్లితో పాటు చెల్లి శిరీషను హత్య చేసి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఘటన స్థలానికి వచ్చిన పోలీసులు ఇంటి బయట ఉన్న చెప్పులను కూడా స్వాధీనం చేసుకున్నారని తెలపారు. లోతుగా విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దీనిపై ఇన్స్పెక్టర్ సైదులును వివరణ కోరగా పోస్టుమార్టం రిపోర్టు వస్తే తల్లీ కూతుళ్ల మృతికి గల కారణాలు తెలుస్తాయన్నారు. బయట లభించిన చెప్పులతో సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. చదవండి: Hyderabad: అమ్మాయిలా నటిస్తూ.. రొమాంటిక్‌గా వారితో చాటింగ్ -
హైదరాబాద్: పెళ్లి సందడిలో హిజ్రాల హల్చల్
సాక్షి, బంజారాహిల్స్: పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్న ఓ ఇంటికి వచ్చిన హిజ్రాలతో పాటు వారి వెంట వచ్చిన ఆటో డ్రైవర్ బెదిరింపులకు పాల్పడిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలివీ... ఎస్పీఆర్హిల్స్ సమీపంలోని వినాయకనగర్‌లో నివాసం ఉంటున్న బి.సురేష్‌కుమార్ మేన కోడలు వివాహం ఈ నెల 13న జరగనుంది. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో రాత్రి 8.30 గంటలకు నలుగురు హిజ్రాలు ఓ ఆటోలో ఆ ఇంటికి వచ్చారు. డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో రూ. 4 వేలు ఇచ్చారు. అయినా సంతృప్తి చెందకుండా రూ. 40 వేలు కావాలంటూ నానా హంగామా చేశారు. దీంతో ఇంటి యజమానులు వారిని బయటికి వెళ్లిపోవాలని చెప్పారు. వారితో పాటు వచ్చిన ఆటో డ్రైవర్ షేక్ అజీజ్ ఓ కత్తి తీసుకొచ్చి ఇంటి సభ్యులను బెదిరించాడు. మీ ఇంటిని గుర్తు పెట్టుకుంటామని తర్వాత వచ్చి అంతు చూస్తామంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ మేరకు బాధితుడు సురేష్‌కుమార్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆటో డ్రైవర్ అజీజ్‌తో పాటు నలుగురు హిజ్రాలపై ఐపీసీ సెక్షన్ 386, 506తో పాటు ఆరŠమ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చదవండి: రూ. కోట్లు కొల్లగొట్టిన హ్యాకర్.. ‘వన్ ప్లస్’తో చిక్కాడు! -
రేవ్ పార్టీలో పట్టుబడ్డ సింగర్ రాహుల్ సిప్లిగంజ్
-
ఏం సెప్తిరి... ఏం స్టెప్పేస్తిరి!
సాక్షి, హైదరాబాద్: రేవ్ పార్టీ జరిగిన ఫుడింగ్ అండ్ మింక్ పబ్ అంశంలో బిగ్‌బాస్ సీజన్–3 విజేత రాహుల్ సిప్లిగంజ్, బంజారాహిల్స్ తాజా మాజీ ఇన్స్పెక్టర్ పూసపాటి శివచంద్ర ఇద్దరూ వార్తల్లో నిలిచారు. వీరిలో ఒకరు ఆ పార్టీలో పాల్గొని పట్టుబడగా... మరొకరు విధి నిర్వహణలో నిర్లక్ష్యం ఆరోపణలపై సస్పెండ్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరికీ సంబంధించిన రెండు వేర్వేరు వీడియోలు ఆదివారం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. నషా ముక్త్ హైదరాబాద్ లక్ష్యంతో ముందుకు వెళ్తున్న సిటీ పోలీసులు ‘డ్రగ్ ఫ్రీ హైదరాబాద్’పేరుతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బోరబండ ప్రాంతంలో ఇటీవల జరిగిన కార్యక్రమంలో రాహుల్ సిప్లిగంజ్ అతిథిగా మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం గర్వంగా ఉందని, మంచి కార్యక్రమమని ప్రశంసించారు. ఇదే అంశాన్ని తన అధికారిక సోషల్‌మీడియాలోనూ పొందుపరిచారు. ఇక ఇన్స్పెక్టర్ శివచంద్ర తన ఇంట్లో ‘హాయే మేరా దిల్’అనే హిందీ పాటకు డ్యాన్స్ చేశారు. షార్ట్స్, టీషర్టులో ఉన్న శివచంద్ర డ్యాన్స్ చేసిన వీడియో యూట్యూబ్‌లో ఉంది. అది కూడా ఆదివారం వైరల్‌గా మారింది. (చదవండి: పట్టుబడగానే... మావాడు మంచోడే!) -
మహిళ వివాహేతర సంబంధం.. కోరిక తీర్చకపోతే భర్తకు చెబుతామని బెదిరించి..
సాక్షి, హైదరాబాద్: బోరబండలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధాన్ని బయట పెడతామంటూ వివాహితను బెదిరించిన ఇద్దరు ఆమెపై సామూహిక లైంగిక దాడి చేశారు. ఈ అవమానాన్ని భరించలేకపోయిన బాధితురాలు, ఆమె ప్రియుడు మంగళవారం ఆత్మహత్యకు యత్నించారు. చికిత్స అనంతరం కోలుకున్న బాధితురాలు శుక్రవారం ఎస్సార్‌నగర్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన మేరకు.. వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం పెద్ద పస్లాబాద్కు చెందిన వెంకట్ (22) బోరబండలో నివసిస్తూ హైటెక్ సిటీలోని ఓ భవనంలో నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్నాడు. వనపర్తి జిల్లాకు చెందిన వివాహిత (32) భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి బోరబండ సైట్–3లో ఉంటోంది. భర్తతో కలిసి కూలీపనులు వెళ్లేది. 9 నెలల క్రితం వెంకట్‌తో పరిచయమైంది. వీరి మధ్య ఏర్పడిన స్నేహం వివాహేతర సంబంధానికి దారి తీసింది. సోమవారం రాత్రి వెంకట్ ఆమె ఇంటికి వెళ్లాడు. తిరిగి వెళ్తున్న సమయంలో స్థానికులైన ఇస్మాయిల్, మరో బాలుడు (17) కలిసి వెంకట్‌ను అడ్డగించారు. ఆ తరువాత తమ కోరిక తీర్చకపోతే ఈ విషయం భర్తకు చెబుతామని బెదిరించారు. అనంతరం గదిలోకి తీసుకువెళ్లి లైంగికదాడికి పాల్పడ్డారు. దీంతో బాధితురాలు ఆత్మహత్య చేసుకుంటానని వెంకట్‌కు చెప్పింది. నేను కూడా బతకను అని ఇద్దరూ మంగళవారం ఉదయం ద్విచక్ర వాహనంపై బోరబండ నుంచి బయలుదేరారు. చదవండి: హైదరాబాద్: నవ వధువు ఆత్మహత్య వికారాబాద్ జిల్లా చన్గోముల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మన్నెగూడ సమీపంలో ఉన్న కండ్లపల్లి అటవీ ప్రాంతంలోకి చేరుకు గుర్తుతెలియని ద్రావకాన్ని తాగారు. దానిని మార్గమధ్యలో కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని వెంకట్ తన సోదరుడికి ఫోన్ చేసి చెప్పాడు. అతడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. వెంకట్ చికిత్స పొందుతుండగా... వివాహిత శుక్రవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయింది. నేరుగా ఎస్సార్‌నగర్ ఠాణాకు చేరుకుని ఫిర్యాదు చేసింది. దీని ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడితో పాటు ఇస్మాయిల్ కోసం గాలిస్తున్నారు. చదవండి: పాపం ప్రేమను గెలిపించుకోవాలనుకున్నాడు.. అదే శాపమై.. -
పరిచయం ప్రేమగా మారింది, పెళ్లి చేసుకుంటానన్నాడు.. కానీ
సాక్షి, అమీర్‌పేట: ఓ వ్యక్తి ప్రేమ పేరుతో యువతిని నమ్మించి డబ్బులు ఖాజేసిన ఘటన ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. బోరబండ సైట్–2లో ఉండే 25 ఏళ్ల జెరీనా బేగం వృత్తి రీత్యా బ్యూటీషియన్. 2019లో కరీంనగర్‌లోని ఖార్కానాగడ్డకు చెందిన మొహ్మద్ అబ్దుల్లా ఫైజల్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. అప్పటి నుంచి తరచూ నగరానికి వచ్చి జరీనాను కలిసేవాడు. వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఇంట్లో వారికి కూడా పరిచయం చేసింది. ఈ క్రమంలో తనకు అత్యవసరంగా డబ్బుల అవసరం వచ్చిందని చెప్పి రూ.2.50 లక్షలు తీసుకున్నాడు. డబ్బులు తిరిగి ఇవ్వకపోగా యువతి పెళ్లి విషయం ప్రస్తావనకు తేవడంతో తప్పించుకుని తిరుగుతూ వస్తున్నాడు. ఇటీవల ఆమెతో మాట్లాడటం మానివేయడం, ఫోన్ చేసినా తీయకపోవడంతో యువతి పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: హైదరాబాద్: ఆరేళ్లలో కొట్టేసిన మొత్తం అక్షరాలా రూ.4,611 కోట్లు -
ఉన్నత చదువులకు చేయూత అందించండి
సాక్షి, హైదరాబాద్: నగరంలోని బోరబండలో నివాసం ఉండే నిరుపేద కుటుంబానికి చెందిన చదువుల తల్లి విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు ఆర్థిక కష్టాలు పడుతోంది. కుటుంబ ఆర్థిక స్థితికి మించి కోర్సు ఫీజు ఉండటంతో దాతల సాయం కోసం ఎదురుచూస్తోంది. ప్రైవేటు ఉద్యోగి కురవ పులికొండ రంగస్వామికి ముగ్గురు ఆడపిల్లలు. పెద్ద కుమార్తె వైష్ణవి చిన్నప్పటి నుంచి చదువుల్లో రాణిస్తుండటంతో ఆర్థిక ఇబ్బందులున్నా బీటెక్ వరకు చదివించాడు. లండన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ హెర్ట్పోర్డ్షైర్లో ఎంఎస్(ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ విత్ రోబోటిక్) కోర్సుపై ఆసక్తితో దరఖాస్తు చేసుకోగా అనుమతి లభించింది. అప్పు చేసి ముందస్తుగా సీటు కోసం రూ.5 లక్షలు చెల్లించారు. కోర్సు మొత్తం ఫీజు రూ.16.50 లక్షలు కాగా, అడ్మిషన్ తీసుకున్న ఎనిమిది నెలల్లో పూర్తి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. విద్యా లక్ష్మి పథకం కింద బ్యాంక్‌లో రుణం కోసం ప్రయత్నించగా రూ.7 లక్షల వరకు మంజూరు చేసేందుకు హామీ ఇచ్చారు. ఒక వేళ బ్యాంక్ రుణం మంజూరు చేసినా ఫీజు కోసం రూ.4.50 లక్షలు, కోర్సు పూర్తయ్యే వరకు మరో రూ.12 లక్షల వరకు ఖర్చు అవుతోంది. మొత్తం రూ.16.50 లక్షలు అవసరం. ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఉన్నత చదువుల కోసం మనస్సున్న దాతలు ఆదుకోవాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. అకౌంట్ నంబర్ 0649118000761, కెనరా బ్యాంక్, వెంగళ్రావునగర్ బ్రాంచ్, ఐఎఫ్ఎస్సీ నంబర్ సీఎన్ఆర్బీ.0006108, హైదరాబాద్. ఫోన్: 97051 44495 గూగుల్ పే, ఫోన్ పే చేసి ఆర్థిక సాయం అందించవచ్చు. -
చోరీకోసం వచ్చి ప్రాణాలు కోల్పోయాడు
బంజారాహిల్స్: దొంగతనం చేయడానికి వచ్చి ఇంటి కుటుంబ సభ్యులు కేకలు పెట్టడంతో పారిపోయే క్రమంలో ఓ దొంగ నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకడంతో మృతి చెందాడు. జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపి న మేరకు.. బోరబండ సఫ్దర్‌నగర్‌లో నివాసం ఉండే సయ్యద్ చాంద్‌పాషా అలియాస్ ఇబ్రహీం (22) ఆదివారం రాత్రి జూబ్లీహిల్స్‌రోడ్ నెం 10(బి) లోని వెంకటగిరిలోని ఓ అపార్ట్మెంట్లో చోరీ కోసం వచ్చాడు. భవనంలోని నాలుగో అంతస్తులో ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో అలికిడి రావడంతోఇంటి యజమానులు కేకలు వేశారు. దాంతో కంగారు పడిన ఇబ్రహీం పారిపోయే క్రమంలో నాలుగో అంతస్తునుంచి పక్కనున్న ఖోమాన్ స్కూల్‌భవనం మీదకు దూకేశాడు. అక్కడినుంచి రోడ్డు మీదకు దూకడంతో తలపగలడంతో పాటు కాళ్లు విరిగిపోయాయి. స్థానికులు జూబ్లీహిల్స్‌పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు ఇబ్రహీంను 108లో ఉస్మానియా ఆస్పత్రికి తర లించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు సోమవారం తెల్లవారుజామున మృతి చెందారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడి గురించి పోలీసులు ఆరా తీయగా అతడిపై సనత్‌నగర్ పీఎస్‌లో ఒక రాబరీ కేసు, ఒక చోరీ కేసులో నిందితుడిగా ఉన్నట్లు తేలింది. చదవండి: మరొకరితో చనువుగా ఉంటోందని బీటెక్ విద్యార్థినిపై దారుణం -
కార్పెంటర్ షాప్‌లో అస్థిపంజరం
అమీర్‌పేట(హైదరాబాద్): బోరబండ ఇందిరానగర్ ఫేజ్–2లో బుధవారం దారుణ సంఘటన వెలుగుచూసింది. కార్పెంటర్ షాపులో ఓ వ్యక్తి అస్థి పంజరం బయటపడింది. షాపు యజమానే ఎవరినో హత్య చేసి పెట్టెలో పెట్టి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన పలాష్ పాల్ అనే వ్యక్తి గాయత్రీనగర్‌లో ఉంటూ కార్పెంటర్‌గా పనిచేసేవాడు. ఇందిరానగర్‌లోని కనకదుర్గా భవానీ, షిరిడీ సాయిబాబా ఆలయం కింద ఉన్న సెల్లార్‌ను 2017లో అద్దెకు తీసుకుని కార్పెంటర్ షాపు నిర్వహిస్తున్నాడు. సంవత్సరంపాటు ప్రతినెలా అద్దెను చెల్లిస్తూ వచ్చిన పాల్ ఆ తరువాత వాటిని సకాలంలో ఇవ్వడం లేదు. పాల్ ప్రతినెలా అద్దె ఇవ్వని కారణంగా షాపు ఖాళీ చేయించాలన్న నిర్ణయానికి వచ్చి రెండురోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మంగళవారం వచ్చి ట్రస్టు సభ్యుల సమక్షంలో షాపు తాళాలు తెరిచి అందులోని సామాన్లను ఓ చోట భద్రపరిచాలని సూచించారు. అనంతరం గోవర్ధన్ అనే వ్యక్తికి షాపును అద్దెకు ఇచ్చారు. బుధవారం ఉదయం షాపులో ఓ పక్కకు కనిపించిన పెట్టెను గోవర్ధన్ తెరిచి చూడగా అస్థిపంజరం బటయపడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి వచ్చి పెట్టెలోని అస్థిపంజరాన్ని బయటకుతీశారు. హత్యకు గురైన వ్యక్తి ఎవరన్నది తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. కార్పెంటర్ పలాష్ పాల్‌కు ఓ మహిళతో అక్రమ సంబంధం ఉండేదని తెలుస్తోంది. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. -
బోరబండలో మళ్లీ భూ ప్రకంపనలు
-
బోరబండ: ఇళ్ల నుంచి జనం పరుగులు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని బోరబండలో మళ్లీ భూప్రకంపనలు రావడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి భారీ శబ్ధాలు వస్తుండంతో జనం భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. భారీ శబ్ధాలతో 4 సెకన్ల పాటు భూమి కంపించింది. రెండు రోజుల క్రితం కంటే భారీ శబ్ధాలు వచ్చాయని స్థానికులు చెప్తున్నారు. కాగా, భూప్రకంపనలపై ఎన్జీఆర్ఐ సీనియర్ సైంటిస్ట్ శ్రీనగేష్ స్పందించారు. భూమి పొరల్లో నీరు చేరుతున్న సమయంలో శబ్ధాలు వస్తాయని అంటున్నారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న తప్పుడు వార్తల్ని నమ్మొద్దని అన్నారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం వెల్లటూరులో 1600 సార్లు భూమి కంపించిందని తెలిపారు. ఇవాళ ఒక్కరోజే 12సార్లు భూకంపం వచ్చినట్టు రికార్డ్ నమోదైందని శ్రీనగేష్ వెల్లడించారు. రహమత్‌నగర్, బోరబండ ప్రాంతాల్లో వచ్చిన భూ ప్రకంపనలు సహజమైనవేని ఆయన స్పష్టం చేశారు. ఆస్తి, ప్రాణనష్టాలు జరిగే అవకాశమే లేదని అన్నారు. -
‘శబ్ధాలకు భయపడి కార్తీక దీపం సీరియల్ చూడలేదు’
సాక్షి, హైదరాబాద్: బోరబండలోని వీకర్స్ కాలనీ సైట్ 3 నుంచి శుక్రవారం రాత్రి భారీ శబ్ధాలు వినిపించాయి. దాదాపు 15 సెకన్ల పాటు భారీ శబ్దాలు రావడంతో స్థానికులు భయకంపితులయ్యారు. భూకంపం వచ్చిందేమోనని భయపడి స్థానికులు ఇళ్ల నుంచి పెద్ద ఎత్తున బయటికి వచ్చారు. శనివారం ఉదయం ఐదు గంటలకు మరో సారి శబ్ధాలు వచ్చాయి. దాంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. శబ్ధాలకు భయపడి.. రాత్రి రోడ్డు మీదే నిద్రించారు. కొంతమంది అయితే రాత్రంతా మేలుకునే ఉన్నారు. అయితే ఎటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం సంభవించ లేదు. భూమిలో నీరు పారుతుంటే కూడా శబ్ధాలు వస్తాయంటున్నారు నిపుణులు. ఈ శబ్ధాలు వచ్చి రాత్రి కార్తిక దీపం సీరియల్ కూడా చూడలేదని బస్తీ మహిళ ఒకరు చెప్పడం విశేషం. ఎప్పుడు ఏం జరుగుతుందోనని బోరబండ వాసులు భయపడుతున్నారు. (చదవండి: బోరబండలో స్వల్ప భూకంపం) -
బోరబండలో మళ్లీ స్వల్ప భూకంపం
-
బోరబండలో స్వల్ప భూకంపం
సాక్షి, హైదరాబాద్ : శుక్రవారం.. దాదాపు రాత్రి పది గంటలు దాటింది.. బస్తీల్లోని ప్రజలు అప్పుడప్పుడే భోజనం చేసి నిద్రకు ఉపక్రమిం చారు. ఒక్కసారిగా పెద్ద ఎత్తున శబ్దాలు వినిపించాయి. ఏం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందారు..ఒక్కసారిగా బాంబులు పేలాయా, లేక ఇళ్లు కూలాయో తెలియక అయోమయంలో ఉన్నారు. భూకంపం వచ్చిందని ఎవరో కేకలు వేశారు. ఒక్కసారిగా పిల్లా, పెద్దా, ముసలి, ముతకా అందరూ ఇళ్ళ నుంచి ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. బోరబండ డివిజన్ పరిధి లోని ఎన్‌ఆర్‌ఆర్‌పురం సైట్–3లో శుక్రవారం రాత్రి జరిగిన సంఘటన ఇది. సైట్–3 వీకర్‌సెక్షన్‌లోని సాయిరామ్‌నగర్, ఆదిత్యానగర్‌లలో భూకంపం వచ్చింది. అక్కడి నుంచి పెద్దమ్మనగర్, జయవంత్‌నగర్, భవానీనగర్, అన్నా నగర్, రహమత్‌నగర్‌లోని ఎస్పీఆర్హిల్స్ తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున శబ్దాలు చోటు చేసుకున్నాయి. ప్రజలంతా ప్రాణభయంతో హడలిపోయారు. అయితే క్షణాల్లోనే అంతా సర్దుకోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. మూడేళ్ళ కిందట ఇలాంటి భూకంపం వచ్చిందని, ఇది ప్రమాదకరం కాదని ఎన్జీఆర్ఐ సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ శ్రీనగేశ్ శుక్రవారం ‘సాక్షి’కి తెలియజేశారు. రిక్టర్ స్కేల్‌పై 1.5 గా మాత్రమే నమోదైందని, ఇది ప్రమాదకరం కాదన్నారు. -
బోరబండలో భారీ శబ్దాలు
సాక్షి, హైదరాబాద్ : బోరబండలోని వీకర్స్ కాలనీ సైట్ 3 నుంచి శుక్రవారం రాత్రి భారీ శబ్ధాలు వినిపించాయి. దాదాపు 15 సెకన్ల పాటు భారీ శబ్దాలు రావడంతో స్థానికులు భయకంపితులయ్యారు. అయితే భూకంపం వచ్చిందేమోనని భయపడి స్థానికులు ఇళ్ల నుంచి పెద్ద ఎత్తున బయటికి వచ్చారు. అది భూకంపమా లేక భారీ శబ్దాలా అనేది తెలియాల్సి ఉంది. 2017లోనూ ఇదే తరహాలో భారీ శబ్దాలు వచ్చినట్లు బోరబండ వాసులు పేర్కొన్నారు. కాగా జీహెచ్ఎంసీ కమిషనర్ తన టీంతో కలిసి భారీ శబ్దాలు వినిపించిన సైట్-3 ప్రాంతానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. -
ప్లాస్టిక్ కవర్ చుట్టి.. చెరువులో పడేసి
సాక్షి, సనత్‌నగర్ : గుర్తు తెలియని వ్యక్తులు మహిళను హత్య చేసి ప్లాస్టిక్ కవర్లో చుట్టి చెరువులో పడేశారు. అయితే హత్యకు గురైన మహిళ మృతదేహం గుర్తు పట్టలేని విధంగా ఉండడంతో పోలీసులు ఆమె గురించి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసిన ఈ సంఘటన వివరాలు ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి వివరాల ప్రకారం.. బోరబండ సమీపంలోని సున్నం చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం తేలియాడుతుందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకొని మృతదేహాన్ని వెలికితీశారు. మృతదేహం మహిళదిగా గుర్తించారు. అప్పటికే మృతదేహం ఉబ్బిపోయి ఉండడంతో పాటు ముఖం గుర్తుపట్టలేని విధంగా ఉంది. దీనిని బట్టి చెరువులో పడేసి చాలా రోజులు అయి ఉండవచ్చని భావిస్తున్నారు. కాళ్లు, ముఖం మినహా మిగతా శరీర భాగాలకు ప్లాస్టిక్ కవర్ చుట్టి ఉంది. అలాగే కాళ్లు చేతులు సన్నని వస్త్రంతో కట్టేసి ఉన్నాయి. తలకు బలమైన గాయమైనట్లు గుర్తించారు. దీనిని బట్టి మహిళను హత్య చేసి చెరువులో పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మహిళ వయస్సు 30–40 ఏళ్ల మధ్యలో ఉంటుందని, ఆమె కుడి చేతిపై ‘ఎస్’ అక్షరంతో టాటూ ముద్రించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె వివరాలు తెలిస్తేనే హత్యకు ఒడిగట్టింది ఎవరు? హత్యకు దారి తీసిన కారణాలపై దర్యాప్తు ముమ్మరం చేయనున్నట్లు ఇన్స్పెక్టర్ చెప్పారు. మృతురాలి చేతిపై ఉన్న టాటూ ఆధారంగా ఆమె సంబంధీకులు మృతదేహాన్ని గుర్తించగలరని భావిస్తున్నట్లు తెలిపారు. మహిళ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే సనత్‌నగర్ పోలీసులను ఆశ్రయించాల్సిందిగా కోరారు. ఈ మేరకు హత్య కేసుగా భావించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పాప ఏడుస్తోంది.. పాలు కావాలి
వెంగళరావునగర్: తల్లిలేని 5 నెలల పాపకు పాలులేవంటూ రాష్ట్రమంత్రి కేటీఆర్‌కు ఓ వ్యక్తి ట్వీట్ చేయడంతో మంత్రి స్పందించి డిప్యూటీ మేయర్ ద్వారా సాయం అందించారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డ డివిజన్ ప్రేమ్‌నగర్‌లో లకాన్సింగ్, జ్యోతిలు దినసరి కూలీలు . వారికి 5 నెలల పాప ఉంది. అనారోగ్య కారణాలతో నెలరోజుల కిందట పాప తల్లి జ్యోతి మృతి చెందింది. దాంతో తండ్రి లకాన్సింగ్ పాపకు తానే ప్యాకెట్ పాలు పట్టిస్తూ ఉన్నాడు. లాక్డౌన్ కారణాల వల్ల ఆ పాపకు గురువారం తండ్రి పాల ప్యాకెట్ తీసుకురాలేకపోయాడు. పాలులేక ఆ రాత్రి పాప ఏడుస్తుంటే ఈ విషయాన్ని వారి ఇంటి పక్కనే ఉంటున్న నవీన్ అనే యువకుడు మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశాడు. దానికి మంత్రి కేటీఆర్ అప్పటికప్పుడు స్పందిస్తూ సమీపంలో బోరబండ వద్ద నివసిస్తున్న డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్‌కు తెలియజేసి పాపకు పాలను చేరేలా చూడాలని కోరారు. కేటీఆర్ సూచన మేరకు గురువారం అర్ధరాత్రి ఒంటి గంట సమ యంలో డిప్యూటీ మేయర్ బాబా హుటాహుటిన ఎర్రగడ్డకు పాలు తీసుకుని వెళ్లి పాప తండ్రికి అందించడంతో పాటుగా ఆ కుటుంబానికి నెలకు సరిపడా నిత్యా వసర సరుకులు అందించారు. తమ కుటుంబానికి సాయం అందించడంతో పాటుగా పాపకు పాలు సకాలంలో అందించిన కేటీఆర్‌కు, డిప్యూటీ మేయర్‌కు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం విషయం తెలుసుకుని మంత్రి కేటీఆర్ డిప్యూటీ మేయర్‌ను అభినందించారు.