
సాక్షి, అమీర్‌పేట: ఓ వ్యక్తి ప్రేమ పేరుతో యువతిని నమ్మించి డబ్బులు ఖాజేసిన ఘటన ఎస్‌ఆర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. బోరబండ సైట్–2లో ఉండే 25 ఏళ్ల జెరీనా బేగం వృత్తి రీత్యా బ్యూటీషియన్. 2019లో కరీంనగర్‌లోని ఖార్కానాగడ్డకు చెందిన మొహ్మద్ అబ్దుల్లా ఫైజల్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. అప్పటి నుంచి తరచూ నగరానికి వచ్చి జరీనాను కలిసేవాడు. వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది.
పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఇంట్లో వారికి కూడా పరిచయం చేసింది. ఈ క్రమంలో తనకు అత్యవసరంగా డబ్బుల అవసరం వచ్చిందని చెప్పి రూ.2.50 లక్షలు తీసుకున్నాడు. డబ్బులు తిరిగి ఇవ్వకపోగా యువతి పెళ్లి విషయం ప్రస్తావనకు తేవడంతో తప్పించుకుని తిరుగుతూ వస్తున్నాడు. ఇటీవల ఆమెతో మాట్లాడటం మానివేయడం, ఫోన్ చేసినా తీయకపోవడంతో యువతి పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: హైదరాబాద్: ఆరేళ్లలో కొట్టేసిన మొత్తం అక్షరాలా రూ.4,611 కోట్లు
Comments
Please login to add a commentAdd a comment