సాక్షి, హైదరాబాద్: బోరబండలోని వీకర్స్ కాలనీ సైట్ 3 నుంచి శుక్రవారం రాత్రి భారీ శబ్ధాలు వినిపించాయి. దాదాపు 15 సెకన్ల పాటు భారీ శబ్దాలు రావడంతో స్థానికులు భయకంపితులయ్యారు. భూకంపం వచ్చిందేమోనని భయపడి స్థానికులు ఇళ్ల నుంచి పెద్ద ఎత్తున బయటికి వచ్చారు. శనివారం ఉదయం ఐదు గంటలకు మరో సారి శబ్ధాలు వచ్చాయి. దాంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. శబ్ధాలకు భయపడి.. రాత్రి రోడ్డు మీదే నిద్రించారు. కొంతమంది అయితే రాత్రంతా మేలుకునే ఉన్నారు. అయితే ఎటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం సంభవించ లేదు. భూమిలో నీరు పారుతుంటే కూడా శబ్ధాలు వస్తాయంటున్నారు నిపుణులు. ఈ శబ్ధాలు వచ్చి రాత్రి కార్తిక దీపం సీరియల్ కూడా చూడలేదని బస్తీ మహిళ ఒకరు చెప్పడం విశేషం. ఎప్పుడు ఏం జరుగుతుందోనని బోరబండ వాసులు భయపడుతున్నారు. (చదవండి: బోరబండలో స్వల్ప భూకంపం)
బోరబండ వాసులను భయబ్రాంతులకు గురి చేసిన శబ్ధాలు
Published Sat, Oct 3 2020 9:01 AM | Last Updated on Sat, Oct 3 2020 10:55 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment