హైదరాబాద్: బోరబండ(Borabanda)లో అందరూ చూస్తుండగానే దారుణం జరిగింది. పదిహేడేళ్ల ఓ బాలికతో కొందరు దుండగులు అనుచితంగా ప్రవర్తించారు. ఇంట్లోకి వెళ్లి మరీ ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఓ ఆటో డ్రైవర్ వాళ్లను అడ్డుకుని.. ఆమెను రక్షించారు. అయితే..
దుండగుల దాడిలో ఆ డ్రైవర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో స్థానికులు 100కు(Dial 100) ఫోన్ చేసి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు(Police) ఆ కామాంధులను అదుపులోకి తీసుకున్నారు. గాయపడి డ్రైవర్‌ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసుల నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఇదీ చదవండి: కామాంధుడికి 20 ఏళ్ల జైలు శిక్ష
Comments
Please login to add a commentAdd a comment