Borabanda: Two youngsters Molested Married Woman - Sakshi
Sakshi News home page

బోరబండలో దారుణం.. మహిళను బెదిరించి.. ఇద్దరు యువకుల అత్యాచారం

Published Fri, Dec 17 2021 6:12 PM | Last Updated on Sat, Dec 18 2021 2:36 PM

Two youngsters Molested Married Woman In Borabanda - Sakshi

ప్రతీకాత్మకచిత్రం

సాక్షి, హైదరాబాద్‌: బోరబండలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధాన్ని బయట పెడతామంటూ వివాహితను బెదిరించిన ఇద్దరు ఆమెపై సామూహిక లైంగిక దాడి చేశారు. ఈ అవమానాన్ని భరించలేకపోయిన బాధితురాలు, ఆమె ప్రియుడు మంగళవారం ఆత్మహత్యకు యత్నించారు.  చికిత్స అనంతరం కోలుకున్న బాధితురాలు శుక్రవారం ఎస్సార్‌నగర్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇన్‌స్పెక్టర్‌ సైదులు తెలిపిన మేరకు.. వికారాబాద్‌ జిల్లా దౌల్తాబాద్‌ మండలం పెద్ద పస్లాబాద్‌కు చెందిన వెంకట్‌ (22) బోరబండలో నివసిస్తూ హైటెక్‌ సిటీలోని ఓ భవనంలో నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్నాడు. వనపర్తి జిల్లాకు చెందిన వివాహిత (32) భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి బోరబండ సైట్‌–3లో ఉంటోంది.

భర్తతో కలిసి కూలీపనులు వెళ్లేది. 9 నెలల క్రితం వెంకట్‌తో పరిచయమైంది. వీరి మధ్య ఏర్పడిన స్నేహం వివాహేతర సంబంధానికి దారి తీసింది. సోమవారం రాత్రి వెంకట్‌ ఆమె ఇంటికి వెళ్లాడు. తిరిగి వెళ్తున్న సమయంలో స్థానికులైన ఇస్మాయిల్, మరో బాలుడు (17) కలిసి వెంకట్‌ను అడ్డగించారు. ఆ తరువాత తమ కోరిక తీర్చకపోతే ఈ విషయం భర్తకు చెబుతామని బెదిరించారు. అనంతరం గదిలోకి తీసుకువెళ్లి లైంగికదాడికి పాల్పడ్డారు. దీంతో బాధితురాలు ఆత్మహత్య చేసుకుంటానని వెంకట్‌కు చెప్పింది. నేను కూడా బతకను అని ఇద్దరూ మంగళవారం ఉదయం ద్విచక్ర వాహనంపై బోరబండ నుంచి బయలుదేరారు.
చదవండి: హైదరాబాద్‌: నవ వధువు ఆత్మహత్య

వికారాబాద్‌ జిల్లా చన్గోముల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మన్నెగూడ సమీపంలో ఉన్న కండ్లపల్లి అటవీ ప్రాంతంలోకి చేరుకు గుర్తుతెలియని ద్రావకాన్ని తాగారు. దానిని మార్గమధ్యలో కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని వెంకట్‌ తన సోదరుడికి  ఫోన్‌ చేసి చెప్పాడు. అతడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. వెంకట్‌ చికిత్స పొందుతుండగా... వివాహిత శుక్రవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయింది. నేరుగా ఎస్సార్‌నగర్‌ ఠాణాకు చేరుకుని  ఫిర్యాదు చేసింది. దీని ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడితో పాటు ఇస్మాయిల్‌ కోసం గాలిస్తున్నారు. 
చదవండి: పాపం ప్రేమను గెలిపించుకోవాలనుకున్నాడు.. అదే శాపమై..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement