Married woman
-
వివాహం జరగాల్సిన ఇంట్లో విషాదం..
మహబూబాబాద్: వివాహం జరగాల్సిన ఇంట్లో విషాదం నెలకొంది. ఓ యువతి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం చిట్యాలలో జరిగింది. స్థానికులు, కుటుంబ సభ్యుల ప్రకారం.. గ్రామానికి చెందిన ఈదురు యాకయ్య, సోమలక్ష్మి దంపతుల మొదటి కూతురు లావణ్య(25) డిగ్రీ పూర్తి చేసింది.ఇటీవల నిశ్చితార్థం జరిగింది. ఇంతలో ఏమైందో తెలియదుగాని శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య పాల్పడింది. తల్లిదండ్రులు వచ్చి చూడగా అప్పటికే మృతి చెంది విగతజీవిగా కనిపించింది. దీంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
దారుణ హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం
శ్రీనివాసపురం: వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైన ఘటన సోమవారం రాత్రి తాలూకాలోని పాళ్య గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శ్రీరామరెడ్డి భార్య రూప (38) హత్యకు గురైంది. పాళ్య గ్రామానికి చెందిన శ్రీరామరెడ్డి భార్య రూప సోమవారం మధ్యాహ్నం పశువులు మేపడానికి ఇంటి నుంటి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఈ సమయంలో సంబందీకులకు గ్రామ సమీపంలోని చురువునహళ్లి గ్రామానికి వెళ్లే మార్గంలో ఉన్న కాలువ వద్ద రూప రక్తపు మడుగులో కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. శ్రీనివాసపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలన జరిపారు. హత్య జరిగిన రోజునే నిందితుడిని అరెస్టు చేశారు. ఇదే గ్రామానికి చెందిన ఆనందప్ప నాయక్‌ను హంతకుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో ఆనందప్ప నాయక్‌కు హతురాలు రూపతో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలిసింది. హతురాలు రూప, ఆనందప్ప నాయక్‌ల మధ్య ఈ మధ్య వైషమ్యాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆనందప్ప నాయక్ రూపను గొంతుకోసి హత్య చేసినట్టు తెలిసింది. హత్యపై స్పందించిన భర్త శ్రీరామరెడ్డి తాను సాయంత్రం భార్య రూపకు ఫోన్ చేసిన సమయంలో మొబైల్ స్విఛాఫ్ వచ్చింది. తన భార్య రూప ఆనందప్ప నాయక్‌ల మధ్య డబ్బు లావాదేవీలు ఉండేవని హత్య ఎందుకు జరిగిందనేది పోలీసుల విచారణలో తెలియాల్సి ఉందన్నారు. కోలారు ఎస్పీ బి నిఖిల్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. డీఎస్పీ నందకుమార్ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని రచించి విచారణ చేస్తున్నారు. శ్రీనివాసపురం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
వివాహిత అనుమానాస్పద మృతి
కెలమంగలం: డెంకణీకోట సమీపంలో మహిళ అనుమానాస్పద మృతిపై హోసూరు సబ్ కలెక్టర్ ప్రియాంక విచారణ చేపట్టారు. డెంకణీకోట తాలూకా బేవనత్తం గ్రామానికి చెందిన మురుగేషన్ భార్య సోనియా (23), వీరికి గత ఏడేళ్ల క్రితం పెళ్లి జరిగి కొడుకు పుట్టాడు. ఈ నేపథ్యంలో సోనియా ఆదివారం అనుమానాస్పద స్థితిలో మరణించింది. విషయం తెలుసుకొన్న డెంకణీకోట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మహిళ శవాన్ని ఆస్పత్రికి తరలించారు. కూతురి మృతి గురించి అనుమానం ఉందని ఆమె తల్లి సుశీల పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి జరిగి ఏడేళ్లు మాత్రమే కావడంతో హోసూరు సబ్ కలెక్టర్ విచారణ జరిపారు. -
Hyderabad: మియాపూర్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగి దారుణ హత్య
మియాపూర్: ఓ మహిళను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్యచేసిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ వెంకటేశ్వర్లు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.వైజాగ్‌కు చెందిన బండి స్పందన(29)దీప్తీ శ్రీనగర్ కాలనీలోని సీబీఆర్ ఎస్టేట్‌లో అపార్ట్మెంట్లో తల్లి నమ్రత, సోదరుడితో కలిసి నివాసముంటోంది. ఆమెకు 2022లో వారణాసి వినయ్ కుమార్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో వారు వేర్వేరుగా ఉంటున్నారు. ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న స్పందన తల్లి నమ్రత సోమవారం ఉదయం స్కూల్‌కు వెళ్లింది. సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా బయటి నుంచి తాళం వేసి ఉంది. దీంతో ఆమె కుమార్తెకు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో స్థానికుల సహాయంతో తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లిచూడగా బెడ్రూమ్లో స్పందన రక్తపు మడుగులో కనిపించింది. ఆమె తలకు, ముఖానికి తీవ్ర గాయాలు ఉన్నాయి. దీంతో ఆమె మియాపూర్ పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. -
‘ఓలా అలా కాదు’.. మహిళా నియామకాలపై భవిష్ అగర్వాల్
ఫాక్స్‌కాన్ నియామక పద్ధతులపై వచ్చిన వార్తలపై ఓలా వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ భవీష్ అగర్వాల్ స్పందించారు. తమ కొత్త కర్మాగారాల్లో వివాహితలతో సహా మహిళల నియామకం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. వివాహితలను నియమించుకోవడంపై ఓలాకు ఎటువంటి వ్యతిరేక విధానం లేదని అగర్వాల్ పేర్కొన్నారు.ఇటీవల ఓ మీడియా సమావేశంలో భవిష్ అగర్వాల్ మాట్లాడుతూ.. 'మహిళలు ఎక్కువ క్రమశిక్షణ, నైపుణ్యంతో ఉంటారు. మేము మా కర్మాగారాలలో మహిళా శ్రామిక శక్తిని నియమించడం కొనసాగిస్తాం. పెళ్లైన మహిళలను నియమించుకోకూడదనే ఫాక్స్‌కాన్ లాంటి విధానాలు మా దగ్గర లేవు’ అన్నారు.భారత్‌లో మహిళా శ్రామిక శక్తి తక్కువగా ఉందని, దీనిని పరిష్కరించడానికి తమ వంతు కృషి చేస్తున్నామని భవిష్ అగర్వాల్ పేర్కొన్నారు. ప్రస్తుతం జూనియర్ స్థాయి ఉద్యోగాల్లో మహిళలను ఎక్కువగా నియమించుకుంటున్నామని, సీనియర్ మేనేజ్మెంట్ స్థాయిలో కూడా మరింత మంది మహిళలను నియమించేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు.కాగా మహిళా శ్రామిక శక్తిని పెంపొందించడంపై ఓలా ఎలక్ట్రిక్ గతంలోనే తమ వైఖరిని ప్రకటించింది. "ఈ రోజు, ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీని పూర్తిగా మహిళలే నడుపుతారని ప్రకటించడానికి నేను గర్విస్తున్నాను. ఈ వారం మేము మొదటి బ్యాచ్ ను స్వాగతించాం. పూర్తి సామర్థ్యంతో, ఫ్యూచర్ ఫ్యాక్టరీ 10,000 మందికి పైగా మహిళలకు ఉపాధి కల్పిస్తుంది, ఇది మహిళలకు మాత్రమే పనిచేసే ప్రపంచంలోనే అతిపెద్ద కర్మాగారం, ఏకైక మహిళా ఆటోమోటివ్ తయారీ కేంద్రంగా మారుతుంది'' అని బ్లాగ్ పోస్ట్‌లో భవిష్ అగర్వాల్ పేర్కొన్నారు.యాపిల్ ఉత్పత్తుల అతిపెద్ద సరఫరాదారు అయిన ఫాక్స్‌కాన్ భారత్‌లోని తన ఐఫోన్ కర్మాగారంలో వివాహిత మహిళలను ఉద్యోగాలకు తిరస్కరిస్తున్నట్లు ఇటీవలి పరిశోధనాత్మక నివేదిక బహిర్గతం చేసింది. తమిళనాడులోని శ్రీపెరంబుదూరులో ఉన్న ప్రధాన ఐఫోన్ అసెంబ్లింగ్ ఫ్యాక్టరీలో వివాహిత మహిళలను ఉద్యోగావకాశాల నుంచి తప్పించారని నివేదిక ఆరోపించింది. -
మహిళ దారుణ హత్య
నేలకొండపల్లి: నేలకొండపల్లి మండలంలోని బైరవునిపల్లిలో శుక్రవారం ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. తనతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని కొన్నాళ్లుగా వేధిస్తున్న ఓ వ్యక్తి ఈ ఘటనకు పాల్పడగా ఆయన కూడా కత్తితో పొడుచుకుని ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికుల కథనం ప్రకారం ఘటనకు సంబంధించి వివరాలు... బైరవునిపల్లి గ్రామానికి చెందిన కోళ్ల సైదమ్మ(47)తో ఆమె భర్త దూరంగా ఉంటుండగా, సూర్యాపేట జిల్లా కోదాడలోని ఓప్రైవేట్ పాఠశాల హాస్టల్లో వార్డెన్‌గా పనిచేస్తోంది. ప్రస్తుతం సెలవులు కావడంతో స్వగ్రామమైన బైరవునిపల్లి వచ్చింది. అదే గ్రామానికి చెందిన సొంటి శ్రీను తనతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని ఆమెను కొన్నాళ్లుగా వేధిస్తున్నాడు. రెండు రోజుల క్రితం ఇంటికి వెళ్లి కొట్టినట్లు తెలిసింది. ఈనేపథ్యాన శుక్రవారం కూడా సైదమ్మ ఒంటరిగా ఉన్నట్లు తెలుసుకున్న శ్రీను వెళ్లి గొడవకు దిగాడు. ఆమె తనను నిరాకరించిందన్న కోపంతో ముందుగానే సిద్ధం చేసుకున్న కత్తితో మూడు చోట్ల బలంగా పొడిచాడు. ఆపై చేతులను కత్తితో ఇష్టానుసారంగా కోశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సైదమ్మ రక్తపు మడుగులో పడి పోయింది. దీంతో స్థానికులు ఆమెను నేలకొండపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లేలోగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇదిలా ఉండగా శ్రీను సైతం అదే కత్తితో పొడుచుకోగా పేగులు బయటకు రావడంతో అపస్మారక స్థితిలో పడిపోయాడు. ఆయనను ఖమ్మం తరలించగా పరిస్థితి విషమంగానే ఉన్నట్లు సమాచారం. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉండగా, సెలవుల్లో ఇంటికి రాకుండా కోదాడలో ఉన్నా బతికేదని వారు రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది.భారీ బందోబస్తుహత్య జరగడంతో బైరవునిపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. సైదమ్మ కుటుంబ సభ్యులు, బంధువులు హత్య చేసిన శ్రీను కోసం గ్రామంలో గాలించారు. కానీ ఆయన సైతం ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుసుకున్న వారు ఆగ్రహంతో ఉండగా.. ఎలాంటి ఘటనలు జరగకుండా ఖమ్మం రూరల్ సీఐ రాజిరెడ్డి ఆధ్వర్యాన నేలకొండపల్లి, ముదిగొండ ఎస్సైలు తోట నాగరాజు, నరేష్, సిబ్బందితో పహారా ఏర్పాటు చేశారు. ఘటనపై మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. -
వివాహిత ఆత్మహత్య
కొత్తూరు: మండలంలోని కర్లెమ్మ పంచాయతీ ఎన్ఎన్ కాలనీలో నివాసం ఉంటున్న వన్నాల రేవతి(27) బుధవారం ఇంటిలో ఉన్న ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రేవతి భర్త కృష్ణారావు స్థానిక ఫైర్ స్టేషన్లో ఫైర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. సారవకోట మండలం కుమ్మరిగుంటకు చెందిన కృష్ణారావుకు పాతపట్నం మండలం పాచిగంగుపేటకు చెందిన రేవతితో తొమ్మిదేళ్ల కిందట వివాహం జరిగింది. అయితే ఎప్పటి మాదిరిగానే కృష్ణారావు విధుల నుంచి మధ్యాహ్నం భోజనం కోసం ఇంటికి వచ్చాడు. ఇంటిలోకి వెళ్లే సరికి రేవతి ఫ్యాన్‌కు ఉరి వేసుకొని కనిపించింది. దీంతో వెంటనే ఆమెకు కిందకు దించి స్థానికుల సహకారంతో స్థానిక సీహెచ్‌సీకి తీసుకెళ్లాడు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పాతపట్నం ఏరియా ఆస్పత్రికి పోలీసులు తరలించారు. వీరికి ఆరేళ్ల వయసు గల కుమార్తె ఉంది. అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఏంఏ ఆహ్మద్ తెలిపారు. -
‘నాన్నా.. వేధింపులు భరించలేకపోతున్నా.. చావుతోనే నాకు విముక్తి’
సాక్షి, రామగుండం(పెద్దపల్లి): ‘నాన్నా.. కట్నం వేధింపులు భరించలేకపోతున్నా.. చావుతోనే నాకు విముక్తి.. అందుకే నా బాబుతో కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నా.. (రియల్లీ ఐ వాంట్ టూ డై విత్ మై బేబీ) నన్ను క్షమించండి’అంటూ ఓ వివాహిత తండ్రికి మెసేజ్ పంపి ఆత్మ హత్య చేసుకుంది. పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై వెంకట్ కథనం ప్రకారం.. రామగుండం రైల్వేస్టేషన్ ఏరియా భరత్‌నగర్‌కు చెందిన మాణిక్యాల సదానందరెడ్డి కూతురు ధనశ్రీ.. అదే కాలనీకి చెందిన దండుగుల రాకేశ్ ప్రేమించుకున్నారు. కుటుంబ సభ్యులు కాదనడంతో వారిని ఎదిరించిన ధనశ్రీ గతేడాది మేలో రాకేశ్‌ను ఆదర్శ వివాహం చేసుకుంది. అయితే, కొంతకాలం తర్వాత ధనశ్రీకి పుట్టింటితో సఖ్యత కుదిరింది. రెండు కుటుంబాలు కలిసి పోయాయి. అయితే పెళ్లి తర్వాత రాకేశ్ ఏ నిచేయకుండా నిత్యం మద్యం తాగడం, కట్నం తేవాలని భార్యను వేధించడం ప్రారంభించాడు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు బాధితురాలు మొరపెట్టుకోగా పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టించి రూ.50 వేలను ధనశ్రీ అత్తింటి వారికి అప్పగించారు. ధనశ్రీ కూడా ఇంటివద్ద ట్యూషన్లు చెబుతూ కొంత ఆదాయం సంపాదిస్తోంది. ఇలా సాఫీగానే సాగిన క్రమంలో వారికి కుమారుడు (4 నెలలు) పుట్టాడు. అయినప్పటికీ రాకేశ్ ప్రవర్తనలో మార్పురాలేదు. భర్త మద్యం తాగి కట్నం కోసం వేధించడం, అత్తామామల సూటిపోటి మాటలతో ధనశ్రీ విసిగిపోయింది. ఆదివారం తన తల్లిగారింటికి వెళ్లి అత్తింటి వేధింపులపై వారితో మొరపెట్టుకుంది. వారు సర్దిచెప్పగా సాయంత్రానికి తిరిగి అత్తగారింటికి వచి్చన ధనశ్రీ.. గదిలో ఎవరూ లేని సమయంలో తాను బిడ్డతో కలిసి చనిపోతున్నానంటూ తండ్రికి ఫోన్లో మెసేజ్ పెట్టింది. తొలుత బాబుతో కలిసి ఉరివేసుకోవాలని అనుకున్నా.. బిడ్డపై మమకారంతో బాబును వదిలేసి తానే దూలానికి చీరతో ఉరి వేసుకుంది. చప్పుడు కావడంతో గదిలోకి వచ్చిన కు టుంబ సభ్యులు.. కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ధనశ్రీని గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతిచెందినట్లు డాక్టర్లు ధ్రవీకరించారు. తన కూతురు మృతికి ఆమె అత్తింటివారే కారణమని సదా నందరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
బలవంతంగా ఆటోలో ఎక్కించి.. వివాహితపై కిరాతకంగా..
సాక్షి, ఆదిలాబాద్: వివాహితను వేధించిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై దుబ్బక సునీల్ తెలిపారు. ఎస్సై వివరాల ప్రకారం... మహారాష్ట్రకు చెందిన ఓ వివాహిత (30) తమ బంధువులుంటున్న అందర్‌బంద్ గ్రామానికి వెళ్లడానికి ఆదిలాబాద్ బస్టాండ్‌కు వచ్చింది. అక్కడి నుంచి ఇంద్రవెల్లి మండలంలోని దుర్వగూడ గ్రామానికి చెందిన పుసం హరిక్రిష్ణ, దుర్వ కాంతులతో పాటు మల్లాపూర్ గ్రామానికి చెందిన పుసం సుభాష్‌లు వివాహితను బలవంతంగా ఆటోలో ఎక్కించి ఇంద్రవెల్లి మండలానికి తీసుకొస్తూ అసభ్యకరంగా ప్రవర్తించి లొంగదీసుకునేందుకు యత్నించాడు. ప్రతిఘటించడంతో ఆటో నుంచి తోసేశారు. దీంతో వివాహిత కుడికాలుకు గాయమైంది. బుధవారం బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
పిండం ఎదుగుదల ఎలా ఉంది?
న్యూఢిల్లీ: వివాహిత 26 వారాల గర్భవిచ్చిత్తి కేసులో ఆమె గర్భంలో ఉన్న పిండం ఎదుగుదల ఎలా ఉందో నివేదిక ఇవ్వాలని సుప్రీం కోర్టు ఎయిమ్స్ వైద్యులను ఆదేశించింది. గత ఏడాది అక్టోబర్ నుంచి ఆ మహిళ ప్రసవానంతర మానసిక సమస్యలకు చికిత్స తీసుకుంటోందని గర్భాన్ని మోయడానికి ఆమె సిద్ధంగా లేదంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనల్ని çపరిగణనలోకి తీసుకుంది. మానసిక సమస్యలకు ఆ మహిళ తీసుకుంటున్న మందులు ఆమె గర్భంలో పెరుగుతున్న శిశువు ఆరోగ్యానికి ఏమైనా హాని చేస్తాయో పూర్తిగా పరీక్షలు చేసి వివరంగా కోర్టుకు నివేదించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్, జస్టిస్ జె.బి. పర్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఆ మహిళ శారీరక, మానసిక స్థితి ఎలా ఉందో పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది. ‘‘ఇప్పటికే ఇద్దరు పిల్లల తల్లయిన ఆ మహిళ ప్రసవానంతరం వచ్చే మానసిక సమస్యలతో బాధపడుతోందని పరీక్షల్లో తేలితే ప్రత్యామ్నాయంగా మరేౖవైనా మందులు ఇవ్వొచ్చా పరిశీలించాలి’’ అని సుప్రీం బెంచ్ స్పష్టం చేసింది. ఎయిమ్స్ వైద్యులకి పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది. -
‘దాడి చేసి వేధిస్తున్నారు’
ఆత్మకూరు : తనపై భర్త తరపు బంధువులు దాడులకు పాల్పడుతున్నారని, తనకు న్యాయం చేయాలని ఓ వివాహిత ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రిలో షేక్ నస్రీన్ సోమవారం విలేకరులతో మాట్లాడారు. వింజమూరుకు చెందిన షేక్ నస్రీన్ భర్త ముజీబ్‌తో గొడవలు రావడంతో మూడేళ్ల క్రితం విడిపోయింది. వారికి ఐదేళ్ల కుమార్తె ఉంది. ఆమె బతుకుదెరువు కోసం కలిగిరిలోని ఓ దుకాణంలో చిరుద్యోగం చేస్తోంది. రోజూ వింజమూరు నుంచి కలిగిరికి వెళ్లి వస్తుంటుంది. ఈ క్రమంలో ఆమె భర్త తరపు బంధువులు నలుగురు తమ మాట వింటే భర్తతో కాపురం నిలబెడతామని చెప్పుకొచ్చారు. అదే క్రమంలో ఆమెను తరచూ వేధిస్తుండేవారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం కలిగిరిలో విధులు పూర్తి చేసుకుని వింజమూరుకు వస్తున్న ఆమెను ఆ నలుగురూ అటకాయించి ఇబ్బందులకు గురిచేశారు. ఆమె ఉంటున్న ఇల్లు (భర్త బంధువుది) వెంటనే ఖాళీ చేయాలని దౌర్జన్యానికి పాల్పడ్డారు. అంతేకాకుండా ఆమె ఉంటున్న ఇంటిని సైతం కొంత భాగం కూలదోశారు. దీంతో అదేరోజు రాత్రి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సమయంలో రాలేమని, మరుసటి రోజు రావాలని పోలీసులు చెప్పడంతో స్టేషన్ ఎదుటే ఈ ఆదివారం తనకు న్యాయం చేయాలని ధర్నాకు దిగింది. పోలీసులు ఆమెను ధర్నాను విరమింపజేసేందుకు ప్రయత్నించే క్రమంలో చేతిలోని బ్లేడు తెగి గాయాలయ్యాయి. అస్వస్థతకు గురైన ఆమె ఆత్మకూరులోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరింది. తనను వేధిస్తున్న వారిపై ఫిర్యాదు చేసేందుకు దిశ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లనున్నట్లు ఆమె తెలిపింది. దీనిపై పోలీసులను వివరణ కోరగా పలువురిపై కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు. -
ఆరేళ్ల ప్రేమ, ఐదేళ్ల కిందట వేరొకరితో పెళ్లి.. కొడుకు పుట్టాక ప్రియుడు కావాలని..
నల్గొండ : తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి తన ప్రియుడు మోసం చేశాడంటూ వివాహిత రోడ్డుపై ధర్నా చేపట్టింది. ఈ ఘటన వేములపల్లి మండలంలోని ఆమనగల్లు గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. వేములపల్లి మండలంలోని రావులపెంట గ్రామానికి చెందిన తరికొప్పుల శిరీష, ఆమనగల్లుకు చెందిన మహేష్ గత ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ విషయం శిరీష ఇంట్లో తెలియడంతో ఐదేళ్ల క్రితం ఆమెకు కుటుంబ సభ్యులు వేరే వ్యక్తితో వివాహం చేశారు. అయినప్పటికీ శిరీష, మహేష్ మధ్య ప్రేమ కొనసాగుతూనే వచ్చింది. శిరీష విడాకులు తీసుకుంటే తాను వివాహం చేసుకుంటానని చెప్పడంతో ఆమె తన భర్త నుంచి విడిపోయి దూరంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఆమెతో పెళ్లికి మహేష్ నిరాకరిస్తున్నాడు. ఈ విషయమై పెద్ద మనుషులను ఆశ్రయించినప్పటికీ పట్టించుకోకపోవడంతో శనివారం మహేష్ స్వగ్రామమైన ఆమనగల్లుకు శిరీష చేరుకొని తనను పెళ్లి చేసుకోవాలని భీమారం–సూర్యాపేట రహదారిపై ధర్నా చేపట్టింది. అయితే శిరీష తన భర్తతో లీగల్‌గా విడాకులు తీసుకోలేదని, ఆమెకు మూడేళ్ల వయస్సు గల కుమారుడు ఉన్నట్లు తెలిసింది. -
ఢిల్లీ: ఆ మృగోన్మాదులకు మరణశిక్ష ఖరారు
ఆమె అతన్ని నమ్మింది. అన్నా అని ఆప్యాయంగా పిలిచి.. ఇంటికి పిలిచి మరీ భోజనం పెట్టేది. కానీ, అతడిలోని ఉన్మాదం బయటపడింది. మరో ఇద్దరితో కలిసి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అక్కడితో ఆగలేదు. ఆమెను అత్యంత కిరాతకంగా హతమార్చాడు. ఆపై ఆమె ఇద్దరు బిడ్డలను(7, 6 ఏళ్ల వయసు) వదల్లేదు. ఘోరమైన ఈ కేసులో చివరకు ఆ మానవ మృగాలకు న్యాయస్థానం మరణశిక్ష ఖరారు చేసింది. దేశ రాజధానిలో సంచలనం సృష్టించిన ఖ్యాలా ట్రిపుల్ మర్డర్(వివాహిత హత్యాచారం) కేసులో ముగురు నిందితులకు మరణశిక్ష పడింది. మంగళవారం తీస్ హజారీ కోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది. 2015లో మొహమ్మద్ అక్రమ్, షాహిద్, రఫత్ అలీ అనే ముగ్గురు.. తమకు పరిచయం ఉన్న వివాహితపై హత్యాచారానికి(గ్యాంగ్ రేప్, మర్డర్) పాల్పడడంతో పాటు ఆమె పిల్లలిద్దరిని అత్యంత దారుణంగా హతమార్చారు. ఆపై ఇంట్లోని డబ్బు, నగదుతో పరారయ్యారు. అదే ఏడాదిలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినప్పటికీ.. కోర్టు విచారణ మాత్రం ఎనిమిదేళ్లపాటు సాగింది. సుదీర్ఘ దర్యాప్తు కొనసాగిన అనంతరం ఈ కేసులో పక్కా ఆధారాల్ని పోలీసులు కోర్టులో సమర్పించడంతో స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ న్యాయమూర్తి అంచల్ మంగళవారం శిక్ష ఖరారు చేశారు. జడ్జి వ్యాఖ్యలు.. తీర్పు చదివే సమయంలో జడ్జి.. ‘‘ఆమె భర్త పని మీద ఊరు వెళ్తున్నాడని నిందితులకు తెలుసు. ఉద్దేశపూర్వకంగానే ఆమె ఇంట్లోకి చొరబడ్డారు. నిందితుల కుట్ర ఈ కేసులో స్పష్టంగా తెలుస్తోంది. ఆమె బిడ్డలను కూడా చంపి.. అత్యంత పైశాచికంగా ప్రవర్తించారు ఈ ముగ్గురు. అన్నింటికి మంచి ప్రధాన నిందితుడు అక్రమ్‌పై ఆమె పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశాడు. అన్నా అనే పిలుపునకు కళంకం తెచ్చాడు అంటూ మరణశిక్ష విధిస్తున్నట్లు తీర్పు ఇచ్చారు. పక్కా స్కెచ్ వేసి.. 2015లో ఢిల్లీ రఘువీర్ నగర్‌లోని బాధిత కుటుంబం ఉంటోంది. అదే కాలనీలో ఉండే మొహమ్మద్ అక్రమ్ ఆ కుటుంబంతో చనువుగా ఉంటూ వచ్చేవాడు. సదరు వివాహిత అతన్ని అన్నగా పిలుస్తూ.. ఇంటికి పిలిచి భోజనం పెట్టేది. ఈ క్రమంలో పని మీద జైపూర్ వెళ్లి తిరిగొచ్చిన భర్తకు.. ఇంట్లో భార్య, ఇద్దరు పిల్లలు అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండడం కనిపించింది. భార్య మెడకు దుపట్టా, కూతురి మెడకు కర్చీఫ్‌తో ఉరేసి ఉంది. ఇంట్లో దోపిడీ జరిగినట్లు స్పష్టంగా ఆనవాళ్లు కనిపించాయి. దీంతో ఆయన పోలీసులను ఆశ్రయించాడు. 2015, సెప్టెంబర్ 21వ తేదీన ఈ ఘటన జరిగింది. పోస్ట్‌మార్టం నివేదికలో ఆమె అత్యాచారానికి గురైనట్లు తేలడంతో పాటు పదునైన ఆయుధంతో ఆమెను హతమార్చినట్లు తేలింది. ఈ కేసులో దర్యాప్తులోతుకి వెళ్లిన పోలీసులకు అక్రమ్‌పైనే అనుమానాలు మళ్లాయి. అదే ఏడాది అక్టోబర్‌లో షాహిద్, అక్రమ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్లిచ్చిన సమాచారంతో.. రఫత్(అప్పుడు మైనర్‌గా ఉన్నాడు)అనే మరో నిందితుడ్ని అరెస్ట్ చేసి జువైనల్ హోంకు తరలించారు. ప్రత్యక్ష సాక్షుల కథనం, నిందితుల ఫోన్‌కాల్స్ రికార్డయిన సమయం.. ప్రాంతం.. ఇలా అన్నింటిని పోలీసులు పరిశీలించారు. సుదీర్ఘ దర్యాప్తు తర్వాత.. 2023, ఆగష్టు 22న ఈ ముగ్గురిని దోషులుగా నిర్ధారించింది న్యాయస్థానం. -
మూడు నెలల క్రితం పెళ్లి.. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి
తిరువొత్తియూరు(చెన్నై): కళ్లకురుచి జిల్లా ఉలుందూర్ పేట సమీపంలో నవవధువు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు.. చిరుపాక్కం గ్రామానికి చెందిన కలయమూర్తి కుమార్తె కనకవల్లి (20). ఈమెకు పచ్చముత్తూ కుమారుడు సుగుణేష్(22)తో మూడు నెలల క్రితం వివాహమైంది. ఈక్రమంలో గత 3 రోజుల క్రితం చిరుపాక్కంలో ఉన్న తన ఇంటికి తీసుకువెళ్లారు. ఈ క్రమంలో పని విషయంగా కనకవల్లి తల్లిదండ్రులు బయటకు వెళ్లారు. ఈ క్రమంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న కనకవల్లి ఫ్యానుకు ఉరేసుకున్న ఆత్మహత్య చేసుకుంది. ఇది చూసిన తల్లిదండ్రులు, బంధువులు విలపించారు. స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కనకవల్లి మృతదేహాన్ని కళ్లకురిచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి వరకట్నం వేధింపుల కారణంగా ఆత్మ చేరుకున్నారా..? లేదా..? మరేదైనా కారణం ఉందా..? అనే కోణంతో విచారణ చేస్తూ ఉన్నారు. తిరుకోవిలూరు ఆర్డీఓ విచారణను పర్యవేక్షిస్తున్నారు. చదవండి హైదరాబాద్‌లో అమానుషం.. యువతి బట్టలిప్పి వివస్త్రను చేసిన కీచకుడు -
క్యాబ్‌లో ఏం మాట్లాడుతున్నారు? డ్రైవర్‌కు దుర్భుద్ధి పుడితే ఎలా?
క్యాబ్‌లో ఎక్కాక చేతులు ఊరికే ఉండవు. ఫోన్ తీసి కబుర్లు చెప్పమంటాయి. కాని కబుర్లు మరీ పర్సనల్ అయినప్పుడు, అవి విన్న డ్రైవర్‌కు దుర్బుద్ధి పుడితే నరకం అనుభవించాల్సి ఉంటుంది. బెంగళూరులో క్యాబ్ ఎక్కిన మహిళ ఫోన్లో చేసిన పర్సనల్ టాక్‌ను విన్న డ్రైవర్ ఆమెను ఏడు నెలలుగా బ్లాక్మెయిల్ చేసి 40 లక్షలు గుంజాడు. అనుకోకుండా దొరికాడు. ఇలాంటి ఘటనలు ఎన్ని జరుగుతున్నాయో! ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? స్త్రీలు విధులు, ఉపాధికి బయటకు వెళ్లక తప్పదు. ఇప్పుడున్న ప్రయివేటు రవాణా యాప్‌లను నమ్ముకోకా తప్పదు. ఇలాంటి యాప్‌లలో పని చేసే డ్రయివర్లు నూటికి తొంభై తొమ్మిది మంది తమ బతుకు తెరువు కోసం పని చేస్తున్నా ఒకరిద్దరు ప్రమాదకరంగా మారుతున్నారు. ఇటీవల బెంగళూరులో ఒక మహిళ టూ వీలర్ బుక్ చేసుకుంటే ఆమెను వెనుక కూచోబెట్టుకున్న డ్రైవర్ ఆమె చూసేలా తన శరీరాన్ని తాను తాకుతూ అసభ్యంగా ప్రవర్తిస్తుంటే ఆమె మధ్యలో బైక్ మీద నుంచి దూకేయాల్సి వచ్చింది. ఇప్పుడు వెలికి వచ్చిన మరో ఘటన ఒంటరి స్త్రీలు ఎంత జాగ్రత్తగా క్యాబ్ లేదా టూ వీలర్ వ్యవస్థను ఉపయోగించుకోవాలో తెలుపుతోంది. అసలేం జరిగింది? ఇది నవంబర్ 2022లో జరిగింది. బెంగుళూరులో ఒక వివాహిత క్యాబ్ మాట్లాడుకుని ఇంటినుంచి బయలుదేరింది. క్యాబ్‌లో వెనుక సీట్లో కూచుని ఫోన్ తీసి మిత్రుడితో మాట్లాడసాగింది. అప్పటికే డిప్రెషన్లో ఉన్న ఆమె తన మిత్రుడితో ఇంటి సమస్యలు చెప్పుకుని, త్వరలో విడాకులు తీసుకుందామనుకుంటున్న ఆలోచన చెప్పి, మిత్రునితో సాన్నిహిత్యపు మాటలు మాట్లాడింది. తను క్యాబ్‌లో ఉన్నానని ఇంకో వ్యక్తి ఆ మాటలు వింటున్నాడని మర్చిపోవడం ఆమె తప్పు. ఈ మాటలన్నీ విన్న క్యాబ్ డ్రైవర్ ఆమెను గమ్యంలో దింపి సోషల్ మీడియా ద్వారా ఆమెనూ ఆమె భర్తనూ గుర్తించాడు. తర్వాత ఆమెకు కాల్ చేసి ఆ రోజు తాను విన్న సంగతంతా భర్తకు చెప్పేస్తానని, మరో పురుషుడితో సన్నిహితంగా వ్యవహరిస్తున్నావని చెప్పేస్తానని బెదిరించాడు. ఆ వివాహిత హడలిపోయింది. దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో తెలియక భయపడిపోయింది. దాంతో క్యాబ్ డ్రైవర్ ఆమె నుంచి గత ఏడు నెలలుగా డబ్బు గుంజడం మొదలెట్టాడు. ఆమె తన దగ్గరున్న 20 లక్షల రూపాయలు అతనికి సమర్పించింది. అయినప్పటికీ ఆశ చావక వేధిస్తుండటంతో తల్లిగారి ఇంటికి వెళ్లి తల్లికి చెందిన 20 లక్షల విలువైన నగలు తెచ్చి ఇచ్చింది. పరువు మర్యాదలు ఎలా కాపాడుకోవాలో తెలియక, మరోవైపు ఈ క్యాబ్ డ్రైవర్ పెడుతున్న నరకం నుంచి ఎలా బయటకు రావాలో అర్థం కాక సతమతమైంది. ఇంత జరుగుతున్నా ఆమె ఈ విషయాన్ని భర్తకు కాని, పోలీసులకు కాని తెలిపే ధైర్యం చేయలేదు. అయినప్పటికీ దుర్మార్గుడు దొరికాడు. జాగ్రత్త... మాటలు వింటారు మీ మాటలు, చాటింగ్ ప్రతిదీ అపరిచితుల కంట పడకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం స్త్రీలకు ఉంది. అపరిచితుల ఎదుట ఫోన్లలో పర్సనల్ విషయాలు మాట్లాడకపోవడం, ఇంట్లో ఒంటరిగా ఉంటుంటే గనక అలాంటి వివరాలు చెప్పకపోవడం, ఏ సమయంలో ఎక్కడ ఉండేది చెప్పకపోవడం చాలా ముఖ్యం. అలాగే ఫోన్ క్యాబ్‌లో వదిలి ఏదైనా కొనడానికి కిందకు దిగకూడదు. పిల్లల స్కూల్ టైమింగ్స్, డ్రాపింగ్ పికప్ వంటి విషయాలు ఫోన్లో డ్రైవర్ వినేలా చెప్పకూడదు. డబ్బు విషయాలు కూడా. అలాగే డ్రైవర్‌తో కాలక్షేపం కబుర్లు కూడా మంచివి కావు. ఏ క్యాబ్ డ్రైవర్ అయినా ఏ కొంచెం ఇబ్బంది పెట్టినా వెంటనే పోలీసులకు ఫోన్ చేయాలి. ఎందుకంటే మన వ్యక్తిగత సమస్యలను కుటుంబం అర్థం చేసుకుంటుంది. వాటిని అడ్డు పెట్టి ఎవరూ బ్లాక్మెయిల్ చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిదీ... ముఖ్యంగా స్త్రీలది. తస్మాత్ జాగ్రత్త! ఎలా దొరికాడు? జూలై 24న బెంగళూరులోని రామ్మూర్తి నగర్లో ఒక క్యాబ్ ఆగి అందులో కొందరు పార్టీ చేసుకుంటున్నారని పోలీసులు గమనించారు. రాత్రిపూట అలా క్యాబ్‌లో పార్టీ చేసుకోవడం సరికాదని హెచ్చరించి వెళ్లిపోయారు. అయితే వెళుతూ ఉండగా ఎస్.ఐకి అనుమానం వచ్చింది. క్యాబ్‌లో ఉన్నది డ్రైవర్ స్థాయి మనుషులు. వారు తాగుతున్నది గ్లెన్లివట్ విస్కీ. ఆ బాటిల్ ధర బెంగళూరులో 9,900. అంత ఖరీదైన బాటిల్ ఎక్కడిదని డ్రైవర్ని పేరడిగితే ‘ప్రవీణ్’ అని చెప్పాడు. ఐడి కార్డులో కిరణ్ అని ఉంది. దాంతో పోలీసులకు పూర్తిగా అనుమానం వచ్చింది. ఆ క్యాబ్‌కు డ్రైవర్ అతడే. మిగిలినవారు స్నేహితులు. కిరణ్‌ను పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లి తగు మర్యాదలు చేశాక మొత్తం కక్కాడు. పోలీసులు అవాక్కయ్యి ఆ వివాహితను, ఆమె భర్తను కలిసి విషయం చెప్పారు. అయినప్పటికీ వారు కేసు పెట్టడానికి సంశయిస్తే బాధితుల పేర్లు బయటకు రాకుండా చూస్తామని హామీ ఇచ్చి కేసు పెట్టించారు. వెంటనే కిరణ్‌ని అరెస్ట్ చేశారు. కుదువ పెట్టిన నగలన్నీ బయటకు తెచ్చారు. డబ్బు మాత్రం అతడు బెట్టింగ్‌లో ఖర్చు పెట్టేశాడు. -
తాడిపత్రిలో వివాహిత దారుణ హత్య.. వారిపైనే అనుమానం?
తాడిపత్రి అర్బన్(అనంతపురం జిల్లా): మంచంపై నిద్రిస్తున్న వివాహితను తలపై కత్తితో నరికి చంపి.. పెట్రోల్ పోసి నిప్పంటించి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించిన ఘటన అనంతపురం జిల్లా తాడిపత్రిలోని నందలపాడులో చోటుచేసుకుంది. ఆ మహిళను భర్త లేదా కుమారుడు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు తెలిపిన ప్రాథమిక సమాచారం మేరకు.. నందలపాడుకు చెందిన రంగనాథ్‌రెడ్డి, శివమ్మ (48) దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు సంతానం. కుమార్తెలందరికీ వివాహమైంది. కుమారుడు రవీంద్రనాథ్‌రెడ్డి ఇటీవల ఓ యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. మతాంతర వివాహం కావడంతో కొడుకును ఇంటికి రావొద్దని తల్లి శివమ్మ వ్యతిరేకించింది. దీంతో రవీంద్రనాథ్‌రెడ్డి తాడిపత్రిలోనే వేరు కాపురం పెట్టాడు. చదవండి: అప్పు తీరుస్తామని పిలిపించి.. రాధను చంపేశారు కాగా.. భర్త రంగనాథ్‌రెడ్డి, భార్య శివమ్మ ఇద్దరే నందలపాడులో నివాసం ఉంటున్నారు. బుధవారం రాత్రి శివమ్మ తన ఇంటి వసారాలో మంచంపై నిద్రపోగా.. భర్త రంగనాథ్‌రెడ్డి ఇంటి మిద్దెపైకి ఎక్కి పడుకున్నాడు. గురువారం ఉదయం కిందకు దిగొచ్చిన రంగనాథ్‌రెడ్డి తన భార్య పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని మృతి చెందిందని చుట్టుపక్కల వారికి చెప్పాడు. ముమ్మాటికీ హత్యే కానీ.. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని 70 శాతానికి పైగా కాలిపోయిన శివమ్మ మృతదేహాన్ని పరిశీలించారు. ఆమె పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంటే.. కాలిపోతున్నప్పుడు కేకలు వేసేదని పోలీసులు చెబుతున్నారు. మంటల్లో కాలిపోతున్న సమయంలో ఆ ప్రాంతంలో అటూఇటూ తిరిగిన ఆనవాళ్లు ఏమీ లేవని గుర్తించిన పోలీసులు ఘటన స్థలంలో లభించిన ఆధారాలను బట్టి శివమ్మ హత్యకు గురైందనే ప్రాథమిక నిర్ధారణకు వచ్చి క్లూస్ టీమ్‌ను రప్పించారు. శివమ్మ తలపై కత్తిలాంటి పదునైన ఆయుధంతో నరికిన ఆనవాళ్లను క్లూస్ టీమ్ కనుగొంది. శివమ్మ తలపై రెండుచోట్ల బలమైన లోతు గాయాలు ఉన్నట్టు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ముందుగా శివమ్మను తలపైకొట్టి హత్య చేసి.. ఆ తర్వాత పెట్రోల్ పోసి దహనం చేసినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. దీంతో పోలీసులు హత్య కేసుగా నమోదు చేశారు. చంపిందెవరో! కాగా, శివమ్మను చంపింది ఎవరనే విషయం ఇంకా స్పష్టం కాలేదు. తన భార్య హత్యకు గురైనా.. ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె భర్త రంగనాథరెడ్డి ఫిర్యాదు చేయడం వెనుక ఆంతర్యం ఏమిటనేది ఇంకా వెల్లడి కాలేదు. మరోవైపు ఇటీవలే మతాంతర వివాహం చేసుకున్న కుమారుడు రవీంద్రనాథ్‌రెడ్డిని శివమ్మ ఇంట్లోకి రానివ్వకపోవడంతో అతడేమైనా ఈ ఘాతుకానికి పాల్పడ్డాడా అనే అనుమానం కూడా ఉంది. కుమారుడు రవీంద్రనాథ్‌రెడ్డిపై పట్టణ పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ ఉంది. శివమ్మ అంత్యక్రియలు ముగిసిన అనంతరం తండ్రీ కొడుకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విచారణ పూర్తయిన అనంతరం గానీ.. వారిద్దరిలో ఎవరు హంతకులో చెప్పలేమని పోలీసులు పేర్కొంటున్నారు. -
జపాన్ నుంచి వచ్చిన వారం రోజులకే..
నెల్లికుదురు: జపాన్ నుంచి వచ్చిన వారం రోజులకే గుండెపోటుకు గురై ఓ వివాహిత మృతి చెందిన సంఘటన మండలంలోని చిన్నముప్పారంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన కదిర రాకేష్–సృజన (32) దంపతులు గత కొన్నేళ్లుగా జపాన్‌లో ఉద్యోగం చేసుకుంటూ స్థిరపడ్డారు. ఈ క్రమంలో సృజనకు కొన్ని నెలలుగా ఆరోగ్యం సహకరించడం లేదన్నారు. ఆరోగ్యం కుదుట పడకపోవడంతో వారం రోజుల క్రితం జపాన్ నుంచి వచ్చి వరంగల్‌లో తన బంధువుల ద్వారా రోహిణి ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటున్నట్లు తెలిపారు. మంగళవారం గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలికి 5 ఏళ్ల కూతురు ఉంది. -
వివాహిత అదృశ్యం.. ఏం జరిగిందో?
పరవాడ(విశాఖపట్నం): పెదముషిడివాడ శివారు గండివానిపాలెం గ్రామానికి చెందిన మడక దేవి (30) ఈ నెల 7 నుంచి కనిపించడం లేదని ఆమె భర్త రాము పరవాడ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. దేవి తల్లిదండ్రులు గండివానిపాలెంలో నివసిస్తున్నారు. వారి ఇంటి నుంచి ఆమె ఈ నెల 7న సాయంత్రం 5 గంటలకు బయటకు వెళ్లిందని, అప్పటి నుంచి సమాచారం లేదని తెలిపారు. వారికి ఇద్దరు పిల్లలు. ఆమె ఆచూకీ తెలిసిన వారు పరవాడ సీఐ పి.ఈశ్వరరావుకు 9440796038 నంబర్లో సమాచారం అందజేయాలని స్టేషన్ హెచ్‌సీ శ్రీనివాసరావు కోరారు. చదవండి: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి.. -
ప్రేమ వివాహం.. మరొకరితో వివాహేతర సంబంధం..
సాక్షి, జంగారెడ్డిగూడెం: భార్యాభర్తల మధ్య తగాదాల నేపథ్యంలో మనస్తాపంతో భార్య ఈగలమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై ఎం.సాగర్‌బాబు తెలిపిన వివరాలు ప్రకారం ఎ.పోలవరం గ్రామానికి చెందిన వనపర్తి సతీష్‌తో అదే గ్రామానికి చెందిన దేవి (20)కి రెండేళ్ల క్రితం వివాహమైంది. వీరికి మూడు నెలల పాప ఉంది. బుధవారం ఉదయం సతీష్ కూలిపనికి వెళ్లి మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో వారిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. అనంతరం సతీష్ పనికి వెళ్లిపోయాడు. గొడవ నేపథ్యంలో మనస్తాపం చెందిన దేవి ఈగలమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దేవి అత్త నిర్మల గమనించి, కుటుంబ సభ్యులతో కలిసి వెంటనే జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తీసుకువెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే ఈ ఘటనపై దేవి సోదరి ఎ.పోలవరానికి చెందిన తమ్మిశెట్టి నాగమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన చెల్లెలు దేవి, బావమరిది సతీష్‌ది ప్రేమ వివాహమని, అయితే సతీష్‌కు వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉంటంతో వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని, ఇటీవల ఫోన్ విషయమై గొడవ జరిగి తన చెల్లెలిని కొట్టాడని, దీంతో మనస్తాపం చెంది ఈగల మందు తాగిందని ఫిర్యాదులో పేర్కొంది. సతీష్ బలవంతంగా తన చెల్లితో మందు తాగించాడనే అనుమానం ఉందని, న్యాయం చేయాలని ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. చదవండి: (నారాయణ సంస్థలపై సీఐడీ దాడులు.. సంచలన విషయాలు వెలుగులోకి!) -
చదువంటే ప్రాణం.. కన్న కలలు తీరకుండా.. కన్న పేగును చూసుకోకుండానే..
సాక్షి, మంత్రాలయం: ఆ తల్లి కన్న కలలు తీరకుండా తీరని లోకాలకు వెళ్లింది. కనులారా కన్న పేగును చూసుకోకుండానే కన్నుమూసింది. పేగు తెంచుకుని పుట్టిన నవజాత శిశువు (బాబు) సైతం క్షణాల్లోనే ఊపిరి వదిలాడు. ఈ విషాద ఘటన గ్రామస్తులను కలచివేసింది. మంత్రాలయం మండలం రచ్చమర్రి గ్రామానికి చెందిన పెద్ద దస్తగిరి, భీయమ్మ కూతురు చాంద్‌బీని పత్తికొండ మండలం హోసూరు గ్రామానికి చెందిన దస్తగిరికి ఇచ్చి మూడేళ్ల క్రితం వివాహం చేశారు. చదువుపై మక్కువ ఉండటంతో చాంద్‌బీ పత్తికొండ డిగ్రీ కళాశాలలో బీకాం కంప్యూటర్స్ కోర్సు రెండో సంవత్సరం చదువుతోంది. తొలి కాన్పు కోసం పుట్టిల్లు రచ్చమర్రికి వచ్చింది. గురువారం చాంద్‌బీకి నొప్పులు మొదలు కావడంతో ఆదోనికి తీసుకెళ్లారు. అక్కడ సాధారణ కాన్పు జరిగింది. అయితే కాన్పు సమయంలో బ్లడ్ ప్రెజర్ (బీపీ) పెరిగి శిశువుకు పురుడు పోయగానే భయంతో ప్రాణాలు కోల్పోయింది. శిశువు సైతం మూడు నిమిషాల వ్యవధిలోనే ఊపిరి వదిలాడు. మొదటి కాన్పులోనే ఇద్దరు మృత్యువాత పడటంతో ఇంటిల్లిపాది శోక సంద్రంలో మునిగారు. చదవండి: (20 కోట్ల ఆఫర్‌ని కాదన్నాడు.. రూ.100కోట్లు ఇచ్చినా కూడా..) -
మేనమామతో పెళ్లి.. భర్త తీరు బాగోలేదంటూ వివాహిత షాకింగ్ ట్విస్ట్
అనంతపురం శ్రీకంఠంసర్కిల్: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... అనంతపురంలోని ఐదో రోడ్డులో నివాసముంటున్న శ్రావణి (26)ని అదే రోడ్డులో ఉంటున్న మేనమామ దుర్గాప్రసాద్‌తో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి మూడేళ్ల వయసున్న కుమార్తె ఉంది. దంపతులిద్దరి మధ్య అప్పుడప్పుడు మనస్పర్థలు తలెత్తి గొడవపడేవారు. ఇద్దరికీ కుటుంబ పెద్దలు సర్దిచెప్పేవారు. అయితే దుర్గాప్రసాద్ తీరు సరిగా లేదంటూ పలుమార్లు తన తల్లిదండ్రులకు శ్రావణి చెబుతూ వచ్చింది. ఈ క్రమంలోనే గురువారం మధ్యాహ్నం ఇద్దరూ గొడవపడ్డారు. అనంతరం శ్రావణి గదిలోకి వెళ్లి ఎంతసేపటికీ బయటకు రాలేదు. దీంతో అనుమానం వచ్చి గది తలుపు తీసి చూస్తే ఫ్యాన్‌కు వేసుకున్న ఉరికి వేలాడుతున్న శ్రావణి మృతదేహం కనిపించింది. విషయం తెలుసుకున్న మృతురాలి తల్లి అక్కమ్మ, సోదరుడు రాధాకృష్ణ అక్కడకు చేరుకుని శ్రావణి మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. సమాచారం అందుకున్న అనంతపురం మూడో పట్టణ పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. అక్కమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. చదవండి: స్వప్పతో పరిచయం.. భార్యను పట్టించుకోకుండా.. -
Hyderabad: స్వప్నతో పరిచయం.. భార్యను పట్టించుకోకుండా..
సాక్షి, హైదరాబాద్: భర్త వేధింపులు తాళలేక మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గురువారం చోటు చేసుకుంది. సీఐ చంద్రశేఖర్ వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా దర్పనపల్లి మండలం దమ్మన్నపేట్ తండాకు చెందిన మాలోత్ మంజుల(24)ను సిరిసిల్లా జిల్లాకు చెందిన మాలోత్ ప్రసాద్‌తో 2021 జనవరి 8న వివాహం జరిగింది. పెళ్లిలో రూ.10లక్షల నగదు, ప్లాట్, 8 తులాల బంగారాన్ని కట్నంగా అందజేశారు. ఉపాధి కోసం హకీంపేట్‌కు వలస వచ్చిన ప్రసాద్, అతడి భార్య, 15 నెలల కుమారుడితో కలిసి జీవిస్తున్నారు. గత కొంత కాలంగా ప్రసాద్‌కు స్వప్ప అనే మహిళతో పరిచయం ఏర్పడింది. భార్య, కుమారున్ని పట్టించుకోకుండా ప్రసాద్ తిరుగుతున్నాడు. కుల పెద్దలకు ఫిర్యాదు చేసినా ప్రసాద్ ప్రవర్తనలో మార్పు రాలేదు. అంతేకాకుండా మంజులను మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన మంజుల ఇంట్లో ఫ్యాన్ రాడ్డుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీకి తరలించి మంజుల తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. చదవండి: (పవన్ కల్యాణ్ ఇంటి ఎదుట మహిళ హంగామా) -
గుణదల మహిళది హత్యే?.. వివాహేతర సంబంధంతో.. పదేపదే..
సాక్షి, పెనమలూరు: కానూరులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన మహిళది హత్యేనని తేలింది.ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని చెబుతున్నారు. కానూరులో గురువారం రాత్రి గుణదలకు చెందిన ముమ్మిడివరపు గౌరమ్మ (50) కానూరు శివారు పంచాయతీరాజ్ ఎంప్లాయిస్ కాలనీలో నిర్మానుష్య ప్రాంతంలో అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. ఆమె గుణదల నుంచి వచ్చి ఇక్కడ ఎలా చనిపోయిందనేది పెద్ద మిస్టరీగా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. మృతురాలి ఫోన్‌కాల్ డేటాను పరిశీలించగా ఆమె యనమలకుదురుకు చెందిన జయరావు అనే వ్యక్తితో ఎక్కువగా మాట్లాడినట్లు గుర్తించారు. ఫోన్ సిగ్నల్ ఆధారంగా జయరావు ఆచూకీని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారని తెలిసింది. గుణదలకు చెందిన మృతురాలు గౌరమ్మ, ప్రసాదంపాడు బ్యాంకు వద్ద సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న యనమలకుదురు నివాసి జయరావుకు గత కొద్ది కాలంగా పరిచయం ఉంది. జయరావుకు వివాహం అయింది. అతనికి భార్య, పిల్లలు ఉన్నారు. అయితే గౌరమ్మ తరచుగా జయరావుకు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టసాగింది. దీంతో గురువారం మద్యం తాగిన జయరావు బైక్‌పై గౌరమ్మను కానూరు శివారుకు తీసుకు వచ్చాడు. అక్కడ వీరి మధ్య వివాదం ఏర్పడటంతో ఆమెను ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. ఆ తరువాత అతను అక్కడి నుంచి పారిపోయాడు. పోస్టుమార్టంలో ఊపిరాడక పోవటంతోనే గౌరమ్మ చనిపోయిందని తేలడంతో కేసు విచారణ వేగవంతం చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో పై విషయాలు నిందితుడు వెల్లడించాడని సమాచారం. ఈ ఘటనకు సంబంధించి అన్ని కోణాల నుంచి పోలీసులు విచారణ చేస్తున్నారు. -
సహజీవనం చేస్తున్న ప్రియుడు మోసం.. వివాహిత..
సాక్షి, అన్నమయ్య(మదనపల్లె): సహజీవనం చేస్తున్న ప్రియుడు మోసం చేశాడని మనస్తాపంతో ఓ వివాహిత ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన గురువారం పట్టణంలో జరిగింది. స్థానిక తొట్లివీధిలో ఉంటున్న మహబూబ్‌బాషా కుమార్తె షాహీనా(30)కు కొంతకాలం క్రితం భర్త చనిపోవడంతో ఒంటరిగా జీవిస్తోంది. ఏడాదిక్రితం కదిరికి చెందిన అమీన్ ఆమెకు పరిచయమయ్యాడు. పరిచయం కాస్తా ప్రేమగా మారి కదిరిలో ఇద్దరూ కలిసి సహజీవనం చేశారు. ఈక్రమంలో అమీన్ తల్లిదండ్రులకు విషయం తెలియడం, షాహీనాను పెళ్లిచేసుకునేందుకు నిరాకరించడంతో ఆమె అక్కడి నుంచి మదనపల్లెలోని తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. గురువారం ఉదయం ఫినాయిల్ తాగింది. గమనించిన కుటుంబసభ్యులు జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చదవండి: (బద్వేలులో దారుణం.. ప్రియుడితో కలిసి సహజీవనం చేస్తూ..) -
యువకుడితో వివాహేతర సంబంధం.. వదిలేయాలని వేడుకున్నా..
సాక్షి, బెంగళూరు: ఫేస్బుక్ ద్వారా పరిచయమైన వివాహిత– యువకుని ఉదంతంలో ఆమె హత్యకు గురైంది. ఈ సంఘటన కనకపుర పట్టణ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు... పట్టణ పరిధిలోని కురుపేట వీధి రోడ్డు నివాసి శ్రుతి (28) హతురాలు. శ్రుతి భర్త గార పని చేస్తుండగా, ఆమె ఇళ్లలో పనికి వెళ్లేది. ఆమెకు మొబైల్లో ఫేస్బుక్ ద్వారా హనుమంతు అనే అవివాహిత యువకుడు పరిచయమయ్యాడు. ఇద్దరి పరిచయం అక్రమ సంబంధానికి దారితీసింది. కొన్ని రోజులుగా అతడు ఆమె నుంచి దూరంగా ఉంటున్నాడు. అయినా శ్రుతి పదేపదే ఫోన్ చేసి హనుమంతును కలవాలని ఒత్తిడి చేసేది. దీంతో విసిగిపోయిన హనుమంతు శ్రుతి ని వదిలించుకోవాలని, బైక్‌పై మారణ్ణదొడ్డి రోడ్డుకు తీసికెళ్లి బెల్ట్‌తో గొంతు బిగించి హత్య చేశాడు. బెదిరించడం వల్లనే.. ఈ నేపథ్యంలో పోలీసులు హనుమంతును అరెస్టు చేశారు. తనకు వేరే అమ్మాయితో వివాహం నిశ్చయమయిందని, వదిలేయాలని ఎంత వేడుకున్నా శ్రుతి వినిపించుకోలేదన్నాడు. ఎవరినీ పెళ్లి చేసుకోవద్దు, తనతోనే ఉండాలని బెదిరించేదని చెప్పాడు. అందుకే ఆమెను బైక్‌పై తీసికెళ్లి హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. కనకపుర పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. చదవండి: (చేదు మిగిల్చిన షుగర్ వ్యాధి.. వేదన చూడలేక కుటుంబమంతా..)