ఇద్దరి పిల్లల తల్లి.. ఆటో డ్రైవర్‌తో వివాహేతర సంబంధం.. చివరకు.. | Extramarital Affair: Woman Committed Suicide Falling Under Train In Vizag | Sakshi
Sakshi News home page

Extramarital Affair: ఇద్దరి పిల్లల తల్లి.. భర్తతో విడిపోయి ఆటో డ్రైవర్‌తో వివాహేతర సంబంధం.. చివరకు

Published Sun, Aug 21 2022 8:14 PM | Last Updated on Sun, Aug 21 2022 8:26 PM

Extramarital Affair: Woman Committed Suicide Falling Under Train In Vizag - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

పెందుర్తి(విశాఖపట్నం): రైలు కింద పడి ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఇష్టపడిన యువకుడితో కలిసి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నం చేయగా సదరు యువకుడు గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. జీఆర్పీ పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గోపాలపట్నం సమీపంలోని కొత్తపాలేనికి చెందిన కొణతాల హేమలత(25) భర్తతో విభేదాల కారణంగా రెండేళ్ల క్రితం విడిపోయింది. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం మంగళపాలెంలోని పుట్టింటిలో ఉంటుంది. ఆమె బ్యూటీషియన్‌ కోర్సు చేసింది. శుభకార్యాలకు, ఇతరత్రా కార్యక్రమాలకు మేకప్‌లు వేసేందుకు బయటకు వెళ్తుంది.
చదవండి: హనీ ట్రాప్‌.. యువకులకు యువతి వల.. వీడియో కాల్స్‌ రికార్డ్‌ చేసి.. 

ఈ నేపథ్యంలో కోటనరవకు చెందిన ఆటో డ్రైవర్‌ కె.కుమార్‌తో పరిచయం ఏర్పడి వివాహేతర బంధానికి దారితీసింది. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం అమ్మగారి ఇంటి నుంచి హేమలత బయటకు వెళ్లి కుమార్‌ను కలిసింది. ఇద్దరూ కలిసి సతివానిపాలెం రైల్వే ట్రాక్‌ వద్దకు వెళ్లి  రాత్రి అంతా గడిపారు. ఈ క్రమంలో శనివారం వేకువజామున ఇద్దరూ ఆత్మహత్య చేసుకునేందుకు నిర్ణయం (ఇద్దరూ మద్యం మత్తులో ఉన్నట్లు జీఆర్పీ పోలీసులు భావిస్తున్నారు) తీసుకున్నారు.

ఇద్దరూ కలిసి ట్రాక్‌పై పడుకున్నారు. అయితే రైలు రావడం ఆలస్యం కావడంతో ఇద్దరూ సమీపంలోని బడ్డీ వద్దకు వచ్చి కాసేపు గడిపారు. మళ్లీ కాసేపటి తర్వాత ఆత్మహత్యాయత్నానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆఖరి క్షణంలో మనసు మార్చుకున్న కుమార్‌ ఆ ప్రయత్నం విరమించుకుందామని హేమలతను వెనక్కి లాగే ప్రయత్నం చేశాడు. కానీ హేమలత ససేమిరా అని రైలుకు ఎదురుగా వెళ్లింది. ఈ క్రమంలో ఇద్దరికీ పెనుగులాట జరిగింది. రైలు వేగంగా రావడంతో ట్రాక్‌ మీద ఉన్న హేమలతను బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. అదే సమయంలో కుమార్‌ పక్కకి ఉండడంతో రైలు వేగానికి తుళ్లి రాళ్లపై పడిపోయాడని జీఆర్పీ పోలీసులు భావిస్తున్నారు.  

గార్డు చూడడంతో వెలుగులోకి.. 
ఘటన జరిగిన ప్రాంతం పూర్తిగా నిర్మానుష్యంగా ఉండడంతో ఈ ఘటన శనివారం ఉదయం వరకు ఎవరికీ తెలియలేదు. అయితే బహిర్భూమికి అటుగా వెళ్లిన అక్కడి ప్రైవేటు కంపెనీ గార్డు అప్పలరాజు గాయాలతో మూలుగుతున్న కుమార్‌ను చూశాడు. వెంటనే సమీపంలోని రోడ్డు వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి బైకిస్ట్‌ జగదీష్‌ను ఆపి ఘటనాస్థలికి తీసుకెళ్లాడు. వెంటనే 108కు సమాచారం అందించి చికిత్స నిమిత్తం కుమార్‌ను కేజీహెచ్‌కు తరలించారు.

సమాచారం అందుకున్న జీఆర్పీ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని హేమలత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ఆత్మహత్యకు పాల్పడాల్సిన కారణం ఏంటన్నది కుమార్‌ కోలుకున్నాకే తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు. ఆ దిశగా జీఆర్పీ సీఐ కె.కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్‌ఐ బాలాజీ కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు హేమలతకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement