committed suicide
-
చిన్నారులను బావిలోకి తోసి తండ్రి ఆత్మహత్య
తాడ్వాయి: ‘డబ్బులు ఇవ్వకపోతే ఇద్దరు పిల్లలను లేకుండా చేసి నీకు మనశ్శాంతి లేకుండా చేస్తా.. ’ అని బెదిరించిన ఆ కసాయి అన్నంత పని చేశాడు. భార్య, అత్తింటి వారిపై కోపం పెంచుకుని కన్న బిడ్డలను బావిలో తోసేసి తనూ ఆత్మహత్య చేసుకున్నా డు. ఈ ఘటనతో మండలంలోని నందివాడలో వి షాదఛాయలు అలుముకున్నాయి. శనివారం దస రా సందర్భంగా గ్రామానికి చెందిన శ్రీనివాస్‌రెడ్డి(30) తన ఇద్దరు కొడుకులు వి ఘ్నేశ్(6), అనిరుధ్‌రెడ్డి(4)కి కొత్త డ్రెస్‌లు వేయించి తన బైక్‌పై శమీ పూజకు తీసుకెళ్లాడు. అతడి భార్య అపర్ణ ఇంటి వద్దే ఉన్నది. రాత్రయినా వారు తిరిగిరాకపోయేసరికి కుటుంబ సభ్యులు, గ్రా మస్తులు చుట్టుపక్కల వెతికారు. ఆదివారం ఉదయం గ్రామ శివారులోని ఓ వ్యవసాయ బావి వద్ద శ్రీనివాస్‌రెడ్డి ఫోన్, చెప్పులు కనిపించడంతో గ్రామస్తులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. బావిలో నుంచి ఇద్దరు చిన్నారుల మృతదేహాలను బయటికి తీయించారు. మోటార్లు వేసి నీటిని ఖాళీ చేయడంతో బావిలో శ్రీనివాస్ రెడ్డి మృతదేహం లభించింది. తండ్రీకొడుకుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తన కొడుకులు, భర్త మృతదేహాన్ని చూసి అపర్ణ రోదన మిన్నంటింది. తన బిడ్డల మృతదేహాలను గుండెలకు హత్తుకుని ఆమె రోదించడం అక్కడి వారిని కంటతడిపెట్టించింది. శరన్నవరాత్రుల సందర్భంగా చిన్నారులు విఘ్నేశ్, అనిరుధ్‌రెడ్డి ప్రతి రోజూ అమ్మవా రి మండపానికి వచ్చి పూజల్లో పాల్గొన్నారని గ్రామస్తులు రోది స్తూ తెలిపారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా నాయ్‌గావ్‌కు చెందిన శ్రీనివాస్‌రెడ్డి పదేళ్ల క్రితం ఇల్ల రికం వచ్చాడు. మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ గ్రామానికి చేరుకొని బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. -
పండగపూట విషాదం.. ఇద్దరు పిల్లలను బావిలోకి నెట్టి..
సాక్షి, కామారెడ్డి జిల్లా: తాడ్వాయి మండలం నందివాడలో పండగ పూట విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలను బావిలో పడేసి తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇద్దరు పిల్లలు, తండ్రి మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. కుటుంబ కలహాలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. పోలీసులు, స్థానికులు వివరాలు ప్రకారం శనివారం రాత్రి దుర్గమ్మ నిమజ్జనానికి పిల్లలను తండ్రి శ్రీనివాస్‌రెడ్డి తీసుకెళ్లగా, రాత్రి 10 గంటలు దాటినా ఇంటికి తిరిగి రాకపోవడంతో భార్య ఆయనకు ఫోన్ చేసింది. ఎన్నిసార్లు చేసినా కాల్ లిప్ట్ చేయలేదు. మళ్లీ అర్ధరాత్రి సమయంలో ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు, స్థానికులు గాలింపు చర్యలు చేపట్టగా, ఆదివారం ఉదయం గ్రామశివారులోని ఓ వ్యవసాయ బావిలో పిల్లలు, తండ్రి మృతదేహాలు కనిపించాయి. తండ్రీకొడుకులు మృతిచెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.ఇదీ చదవండి: వారే లేని.. నేనెందుకని.. -
నా మొహం ఎలా చూపించను
శ్రీరాంపూర్: జీవితంలో సక్సెస్ కావాలి..డబ్బు సంపాదించాలి.. కుటుంబ సభ్యులను ఉన్నత స్థితిలో ఉంచాలంటూ ఆ యువకుడు ఎన్నో కలలు క న్నాడు. మొదట్లో స్టాక్ మార్కెట్లో పెట్టుబడికి లా భాలు బాగానే వచ్చాయి. ఆ తర్వాత తెలిసిన వారి వద్ద, లోన్‌యాప్‌లలో అప్పు చేసి పెట్టిన పెట్టుబడు లు ఆవిరయ్యాయి. మూడేళ్లుగా ట్రేడింగ్ చేస్తున్నా కలిసి రావడం లేదని.. లోన్‌యాప్‌ల వేధింపులు తాళలేక.. ఉరేసుకొని ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లో శనివారం వెలుగులోకి వచి్చంది. ఎస్సై సంతోష్ కథనం ప్రకారం.. శ్రీరాంపూర్‌లోని అరుణక్కనగర్‌కు చెందిన నమ్తబాజీ శ్రీకాంత్(29) ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. భార్య శ్రుతి, 9 నెల ల కుమారుడు ఉన్నారు. భార్య కొడుకుతో కలిసి రాఖీ పండుగకు ఊరెళ్లింది. దీంతో ఇంట్లో ఒక్కడే ఉన్న సమయంలో శుక్రవారం రాత్రి ఫ్యాన్‌కు వైరు తో ఉరేసుకున్నాడు. ఇంటి సమీపంలోనే తల్లిదండ్రులు ఉంటారు. శనివారం ఉదయం శ్రీకాంత్ తమ్ముడు సాయికుమార్ ఇంటికొచ్చి తలుపులు కొట్టినా తీయలేదు. దీంతో బలవంతంగా త లుపులు తెరిచి చూడగా, ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. పోలీసులు శ్రీకాంత్ సెల్‌ఫోన్‌ను పరిశీలించగా, ఆత్మహత్యకు గల కారణాలు వెల్లడయ్యాయి.సెల్ఫీ వీడియో తీసుకొని.. శ్రీకాంత్ ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ‘నేను ఒక కొడుకుగా, అన్నగా, భర్త గా, తండ్రిగా ఫెయిల్ అయ్యాను. లైఫ్‌లో సక్సెస్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాను. సక్సెస్ కాకపోగా, లోన్‌యాప్స్‌లో లోన్ తీశాను. బయట కూడా అప్పు తీసుకొచ్చాను. ఇంట్లో వారిని గొప్ప గా ఉంచాలి. మంచిగా చూసుకోవాలనే ఉద్దేశంతో ఎలాగైనా డబ్బు సంపాదించాలని స్టాక్ మార్కెట్లో డబ్బులన్నీ పెట్టా. ట్రేడింగ్ చేసి డబ్బులన్నీ పోగొట్టుకున్నాను. మాఫ్రెండ్ వాళ్ల అన్న దగ్గరి నుంచి రూ.3 లక్షలు తీసుకున్నా. మా డాడీ దగ్గర రూ.2 లక్షలు అట్లనే వేర్వేరు దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నా. అన్నీ పోగొట్టుకున్నా. నాకు చాలా అప్పులున్నాయ్. దానికి తోడు ఈ లోన్‌యాప్స్. ప్రతి నెలా ఈఎంఐలు కచి్చతంగా కట్టేసిన. ఈ నెలొక్కటే కట్టలేదు. ఏడెనిమిది యాప్‌ల దాకా కట్ట లేదు. ఫోన్లలో టార్చర్ తట్టుకోలేకపోతున్నాను. ఇంటికి వస్తామని వేధించారు. కుటుంబ సభ్యుల వద్ద మొహం చూపెట్టలేక ఆత్మహత్య చేసుకుంటున్నా ను’ అని ఆ వీడియోలో శ్రీకాంత్ పేర్కొన్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వివరించారు. -
సినీ దర్శకుడు ఆత్మహత్య
సినీ దర్శకుడు రవిశంకర్ (63) చెన్నైలో ఆత్మహత్య చేసుకున్నారు. భాగ్య పత్రికలో కథారచయితగా జీవితాన్ని ప్రారంభించిన రవిశంకర్ ఆ తరువాత దర్శకుడు కె.భాగ్యరాజ్, దర్శకుడు విక్రమన్‌ల వద్ద సహాయదర్శకుడిగా పనిచేశారు. కాగా శరత్‌కుమార్, దేవయాని జంటగా విక్రమన్ దర్శకత్వంలో రూపొందిన సూర్యవంశం చిత్రానికి రవిశంకర్ సహాయ దర్శకుడిగా పనిచేయడంతోపాటు, అందులోని రోసాపూ అనే సూపర్‌హిట్ పాటను రాశారు. కాగా నటుడు మనోజ్ భారతీరాజా హీరోగా నటించిన వర్షమెల్లామ్ వసంతం చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ చిత్రంలోని అన్ని పాటలను రవిశంకరే రాశారు. అయితే ఆ తరువాత ఈయనకు మరో అవకాశం రాలేదు. కాగా అవివాహితుడైన రవిశంకర్ స్థానిక కేకే.నగర్‌లోని ఒక చిన్న గదిలో అద్దెకు ఉంటున్నారు. అయితే సినిమా అవకాశాలు లేక, పేదరికంలో జీవిస్తున్న ఈయన మానసిక వేదనతో ఉరి వేసుకుని బలవర్మణానికి పాల్పడినట్లు తెలిసింది. సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి వెళ్లి రవిశంకర్ భౌతికకాయాన్ని పోస్ట్‌మార్టానికి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈయన ఆత్మహత్యకు కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. రవిశంకర్ మర ణం కోలీవుడ్‌ను దిగ్భ్రాంతికి గురిచేసింది. -
వైఎస్సార్ జిల్లా: రైలు కిందపడి ఏఎస్సై ఆత్మహత్య
వైఎస్సార్ జిల్లా: వల్లూరు మండలం తప్పెట్ల బ్రిడ్జి వద్ద రైలు పట్టాలపై పడి ఏఎస్సై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు కమలాపురం పోలీస్ స్టేషన్ లో ఏఎస్సైగా పని చేస్తున్న నాగార్జునరెడ్డిగా గుర్తించారు. నైట్ డ్యూటీ ముగించుకొని తెల్లవారుజామున వెళ్లి రైలు పట్టాలపై పడి ఆత్మహత్య చేసుకున్నట్లుగా సమాచారం. కుటుంబకలహాలతో ఏఎస్సై నాగార్జున రెడ్డి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఇద్దరు అన్నదాతల ఆత్మహత్య
మిరుదొడ్డి (దుబ్బాక)/ రామగిరి (మంథని): ఏడు బోర్లు వేసినా నీరందక పంట ఎండిపోవడంతో మనోవేదనతో ఓ రైతు, ఆరుగాలం కష్టపడ్డా నీటి కొరతతో పత్తి పంటకు దిగుబడి రాలేదన్న బాధతో మరో రైతు పురుగుల మందు తాగి తనువు చాలించారు. సిద్దిపేట, పెద్దపల్లి జిల్లాల్లో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. వివరాలు.. తొగుట మండల కేంద్రానికి చెందిన చిక్కుడు శ్రీనివాస్‌కు (48) వ్యవసాయమే జీవనాధారం. భార్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడిని పోషించుకుంటూ బతుకు వెళ్లదీస్తున్నాడు. మిరుదొడ్డి మండల పరిధిలోని కాసులా బాద్ శివారులో నాలుగు ఎకరాల భూమిని కొనుగో లు చేసి వరి పంట వేశారు. భూగర్భ జలాలు వట్టిపోవడం.. మండుతున్న ఎండలతో రెండు ఎకరాలు పంట పూర్తిగా ఎండిపోయింది. దీంతో సుమారు రూ.6 లక్షల వరకు అప్పు చేసి 7 బోరు బావులు తవ్వంచాడు. అందులో ఒకటి రెండు బోరు బావుల నుంచి సన్నటి నీటి ధార మాత్రం వస్తోంది. పొట్ట దశకు వచ్చిన రెండు ఎకరాలకు సాగు నీరు అందక ఎండు ముఖం పట్టింది. దీంతో మనోవేదనకు గురైన శ్రీనివాస్ శనివారం సాయంత్రం పొలం వద్దే పురుగు మందు తాగాడు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మరోఘటనలో పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం లద్నాపూర్ గ్రామానికి చెందిన ఉడుత సంతోష్ యాదవ్ (34) రెండేళ్లక్రితం ఇల్లు నిర్మించుకున్నాడు. ఇందుకోసం కొంత అప్పు తీసుకొచ్చాడు. తనకున్న 8 ఎకరాల్లో పత్తి వేశాడు. ఇందుకోసం బ్యాంకులో మరికొంత లోన్ తీసుకున్నాడు. అప్పు రూ.35 లక్షల వరకు చేరింది. పత్తి పంట అధిక దిగుబడి వస్తే మొత్తం అప్పు తీర్చవచ్చని భావించాడు. కానీ, తెగుళ్లు, నీటి కొరతతో ఆశించిన దిగుబడి రాలేదు. దీంతో మనస్తాపం చెందిన సంతోష్ ఈనెల 3న గడ్డి మందు తాగాడు. చికిత్స పొందుతూ శనివారం రాత్రి మరణించాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
వెంగళరావునగర్‌లో విషాదం.. అక్కా తమ్ముడు ఆత్మహత్య
వెంగళరావునగర్: అనుమానాస్పద స్థితిలో అక్కా తమ్ముడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రహమత్‌నగర్ డివిజన్ సంతోషగిరి బస్తీలో బి.సాయి(28) నివాసం ఉంటున్నాడు. గత పదేళ్లుగా అతడి సోదరి రాజశ్రీ (30) తమ్ముడి వద్దే ఉంటోంది. నెలలో ఒకటి రెండు రోజులు మాత్రం తన ఇంటికి వెళ్లి వచ్చేది. తరచూ భర్త నర్సింగరావు వేధిస్తున్నాడని తమ్ముడితో చెప్పేది. ఇద్దరూ కలిసి కల్లు సేవించేవారు. సోమవారం సాయి నివాసం ఉంటున్న ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు తెరిచి చూడగా సాయి, రాజశ్రీ మృతిచెంది ఉన్నారు. ఇద్దరి మృతదేహాలు పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్నాయి. దాదాపు వారం రోజుల క్రితం వారు ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. సంఘటనా స్థలంలో సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. భర్త, తమ్ముడు, పెద్దమ్మ, పెదనాన్న ఎవరూ తనను సరిగ్గా చూసుకోవడంలేదని, తనకు బతకాలని లేదని రాజశ్రీ అందులో పేర్కొంది. వారి మృతికి గల కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కొడుకు కళ్లెదుటే తండ్రి ఉరేసుకుని
కౌడిపల్లి (నర్సాపూర్): ఆర్థిక ఇబ్బందులు భరించలేక నాలుగేళ్ల కన్నకొడుకు కళ్ల ముందే తండ్రి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన మెదక్ జిల్లా కౌడిపల్లిలో గురువారం చోటుచేసుకుంది. ఎస్ఐ రంజిత్‌కుమార్‌రెడ్డి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నవీన్(34), అతని తల్లి లలిత వ్యవసాయం, కూలీ పనులు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. నవీన్ భార్య.. కుమారుడు లోకేష్ పుట్టిన తర్వాత వీరికి దూరంగా వెళ్లిపోయింది. కాగా, ఇటీవల లలిత కాలుకు గాయమై తీవ్ర అస్వస్థతకు గురికావడంతో తొలుత మెదక్‌లో వైద్యం చేయించారు. అక్కడ తగ్గకపోవడంతో వైద్యులు.. గాంధీ ఆసుపత్రికి రెఫర్ చేశారు. కొన్ని రోజులుగా చికిత్స పొందుతోంది. కాలుకు ఇన్ఫెక్షన్ అయిందని, తొలగించాల్సి వస్తుందని వైద్యులు చెప్పారు. ఆసుపత్రి ఖర్చులు, కుటుంబ అవసరాలకు డబ్బులు లేకపోవడంతో నవీన్ అప్పులు చేశాడు. దీంతో రోజురోజుకూ ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. ఈ క్రమంలో ఉదయం నవీన్ తన కొడుకు లోకేష్‌తో కలిసి చింతకాయలు తెంపుకొద్దామని తీసుకెళ్లాడు. గ్రామ సమీపంలో కొడుకు చూస్తుండగానే.. చింతచెట్టు ఎక్కి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాలుడు ఏడుస్తుండటంతో అటుగా వెళుతున్న గ్రామస్తులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు దర్యాప్తులో ఉంది. -
హైదరాబాద్: శ్రీచైతన్య కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పీర్జాదిగూడలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం బైపీసీ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. బాత్ రూమ్‌లో చున్నితో ఉరి వేసుకున్న విద్యార్థినిని కళాశాల సిబ్బంది స్థానిక ఆసుపత్రికి తరలించారు. అప్పటికే విద్యార్థిని మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సంఘటన స్థలానికి చేరుకున్న మేడిపల్లి పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. ఆత్మహత్య చేసుకుందా? మరేదైనా కారణమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. వనపర్తి పట్టణానికి చెందిన విద్యార్థిని హాస్టల్లో ఉంటూ చదువుకుంటోంది. తల్లిదండ్రులకు దూరంగా ఉండి చదువుకోవడం ఇష్టం లేక విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. ఇదీ చదవండి: కీచక టీచర్.. విశాఖ స్పెషల్ పోక్సో కోర్టు సంచలన తీర్పు -
బుక్కపట్నం సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్ నాయక్ ఆత్మహత్య
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన శ్రీసత్యసాయి జిల్లా బుక్కపట్నం సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్ నాయక్ (42).. ఏసీబీ అధికారుల నుంచి తప్పించుకుని పారిపోయి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఏసీబీ వలలో చిక్కినందుకు అవమాన భారంతో కుంగిపోయిన నాయక్ చెన్నై చేరుకుని.. అక్కడి లాడ్జిలో ఉరి వేసుకుని మృతి చెందారు. శ్రీసత్యసాయి జిల్లా గోనిపెంట తండాకు చెందిన శ్రీనివాస్ నాయక్ ఈ నెల 22న సురేందర్‌రెడ్డి అనే రైతు నుంచి రూ.10 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు మిగిలిన తతంగం పూర్తి చేస్తుండగా.. అదే రోజు రాత్రి గోడ చాటుకు వెళ్లిన శ్రీనివాస్ నాయక్ పారిపోయి చెన్నైలోని మాధవాపురంలో ఓ లాడ్జిలో దిగారు. అదే గదిలో ఉరి వేసుకోగా.. శనివారం లాడ్జి నిర్వాహకులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు సమాచారం. చదవండి: బర్త్‌డేకు దుబాయ్ తీసుకెళ్లలేదని భర్తను గుద్ది చంపేసింది -
సెల్‌ఫోన్ వాడొద్దన్నందుకు బాలిక ఆత్మహత్య
హైదరాబాద్: సెల్‌ఫోన్ ఎక్కువగా వాడుతున్నావని, ఇది మంచిది కాదని తల్లిదండ్రులు మందలించగా మనస్థాపానికి గురై కూతురు ఆత్మహత్య చేసుకున్న ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలివీ... వెస్ట్‌బెంగాల్‌కు చెందిన సంజీబ్ మండల్ ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తూ బంజారాహిల్స్ రోడ్ నెం. 10లోని నూర్‌నగర్‌లో కుటుంబంతో కలిసి అద్దెకుంటున్నాడు. ఆయన కూతురు ఇషికా మండల్(13) స్థానిక ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నది. ఎప్పటిలాగే శుక్రవారం సాయంత్రం స్కూల్ నుంచి వచి్చన ఆమె బెడ్రూమ్లోకి వెళ్లి సెల్‌ఫోన్‌ను అదే పనిగా చూస్తున్నది. పలుమార్లు మందలించినా ఇషికా ఫోన్చూడటం మాత్రం మానడం లేదు. తల్లిదండ్రులు ఈ విషయంలో కూతురిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పది నిమిషాల తర్వాత తన గదిలోకి వెళ్లిన ఇషికా ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తండ్రి ఇచి్చన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
హైదరాబాద్‌లో విషాదం.. ఫైనాన్షియర్స్ వేధింపులు తాళలేక..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: అత్తాపూర్ సులేమాన్ నగర్లో విషాదం చోటుచేసుకుంది. ఫైనాన్షియర్ వేధింపులు తాళలేక యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తౌఫిక్‌ను రౌడీ షీటర్లతో ఫైనాన్షియర్స్ వహీద్, షకీల్ బెదిరింపులకు గురిచేశారు. డబ్బులు ఇవ్వకపోవడంతో తౌఫిక్‌ను ఇంట్లో నుంచి తీసుకెళ్లిన రౌడీషీటర్స్ కొట్టడంతో భయంతో ఇంటికి వచ్చి ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. బాధితుడి కుటుంబసభ్యులు అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చదవండి: పెళ్లి రోజే వరుడి మృతదేహం.. అసలేం జరిగింది? -
విశాఖ: చైనా వెళ్తున్నానని చెప్పి లాడ్జిలో..
సాక్షి, విశాఖపట్నం: నగరంలో మెడికో రమేష్ కృష్ణ ఆత్మహత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. వాట్సాప్ చాటింగ్, ఫోన్ కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రియుడితో ఏర్పడిన మనస్పర్ధలే ఆత్మహత్యకు కారణమని పోలీసులు తేల్చారు. ఈ నెల 23వ తేదీన విశాఖకు వచ్చిన యువతి రమేష్ కృష్ణ.. అంతకు ముందే ఇండోర్‌లో ఉన్న ప్రియుడిని కలిసింది. చైనాలో ఎంబీబీఎస్ ఫోర్త్ ఇయర్ చదువుతున్న మెడికో.. స్వస్థలం కేరళ, త్రిశూర్ జిల్లా, వందనపల్లి మండలం. చైనా వెళ్తున్నానని చెప్పి ఇంటి నుండి బయలుదేరిన రమేష్ కృష్ణ... విశాఖ నుంచి సింగపూర్‌కు కనెక్టింగ్ ఫ్లైట్‌కి వెళ్లడానికి దాబా గార్డెన్‌లోని ఓ లాడ్జిలో దిగింది. ఈ నెల 24న చెక్ అవుట్ చేయాల్సి ఉండగా, ఆమె గది నుంచి బయటకు రాలేదు.. లోపల నుంచి గడియాపెట్టి ఉండటంతో లాడ్జి నిర్వహకులకు అనుమానం వచ్చి.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తలుపును బద్దలుగొట్టి లోపలికి ప్రవేశించగా, ఆ యువతి గదిలో ఫ్యానుకు ఉరి వేసుకుని వేలాడుతున్నట్టు కనిపించింది. ‘‘తన చావుకు ఎవరూ కారణం కాదనీ.. సారీ అమ్మ’’ అంటూ ఆ సూసైడ్ నోట్లో పేర్కొంది. చదవండి: భర్త వేధింపులపై ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్! -
ఇంటర్ విద్యార్థి విషాదాంతం.. చదవడం ఇష్టం లేక గోదావరిలో దూకాడు
దండేపల్లి: కాలేజీలో దింపేందుకు తీసుకెళ్లిన తండ్రి వద్దనుంచి కరీంనగర్ బస్టాండ్‌లో తప్పించుకున్న ఓ ఇంటర్ విద్యారి్థ...మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం వద్ద గోదావరినదిలో శవమై తేలాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. దండేపల్లికి చెందిన నానవేని మల్లేశ్ కుమారుడు నానవేని ప్రశాంత్, అలియాస్ గట్టు(19) కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల కాలేజీ నుంచి ఇంటికి వచ్చాడు. మంగళవారం అతన్ని కాలేజీలో దింపేందుకు తండ్రి మల్లేశ్ కరీంనగర్ బయల్దేరాడు. కరీంనగర్ బస్టాండులో దిగగానే ప్రశాంత్ తప్పించుకున్నాడు. కొద్దిసేపు బస్టాండులో అతనికోసం వెతికినా ఆచూకీ దొరకలేదు. కాలేజీకి వెళ్లి ఆరా తీయగా, కాలేజీకి రాలేదని చెప్పారు. దీంతో ఇంటికే వచ్చాడేమో అని తండ్రి దండేపల్లికి రాగా..ఇంటికి కూడా రాలేదని కుటుంబసభ్యులు చెప్పడంతో ప్రశాంత్‌ను వెదికేందుకు బయటికి వెళ్లాడు. ఇంతలో సాయంత్రం గూడెం గోదావరినదిలో శవం ఉందని తెలియడంతో అక్కడికి వెళ్లి చూడగా, అది ప్రశాంత్‌ది కావడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. ప్రశాంత్‌ను గతేడాది దండేపల్లి జూనియర్ కాలేజీలో చేరి్పంచగా ఫెయిల్ అయ్యాడు. అతన్ని ఆ కాలేజీ నుంచి తీసి, ఈయేడాది కరీంగర్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో చేరి్పంచారు. చదవడం ఇష్టం లేకనే గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని కుటుంబీకులు, బంధువులు భావిస్తున్నారు. -
ఐఏఎస్ కల నెరవేరక బ్యాంకు మేనేజర్ ఆత్మహత్య
కర్ణాటక: సివిల్స్ పరీక్షల్లో విజేతగా నిలిచి ఐఏఎస్ కావాలి, సమాజంలో ఉన్నత స్థానంలో నిలవాలి అనుకున్న ఒక యువతి కల ఫలించలేదు. బ్యాంకు ఉద్యోగంతో తృప్తి పడలేక, ఐఏఎస్ కాలేక మనోవ్యథతో ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మండ్య నగరంలో చోటు చేసుకుంది. కావేరి గ్రామీణ బ్యాంక్ ప్రాదేశిక కార్యాలయంలో మేనేజర్‌గా పనిచేస్తున్న శృతి (30) స్వస్థలం చామరాజనగర జిల్లా కొళ్లేగాల. తండ్రి మల్లప్ప వ్యవసాయం చేసేవాడు. ముందు నుంచి ఆమె చదువులో చురుగ్గా ఉండేది. ఎలాగైనా ఐఏఎస్‌కు ఎంపిక కావాలని అనుకుంది. కానీ జీవితంలో ఉన్న ఇబ్బందుల వల్ల సాధ్యం కాలేదు. తరువాత ఉద్యోగ నియామకాల్లో ప్రతిభ చూపి ప్రస్తుత ఉద్యోగం సంపాదించింది. మండ్య నగరంలోని వినాయక లేఔట్‌లోని అద్దె ఇంటిలో ఆదివారం రాత్రి డెత్‌నోట్ రాసి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు ఇంకా పెళ్లి కాలేదని సమాచారం. మండ్య గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
నూతన దంపతులు సహా అయిదుగురిని చంపి..
మెయిన్‌పురి: ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నూతన దంపతులతోపాటు మరో ఇద్దరు కుటుంబసభ్యులను, ఓ స్నేహితుడిని ఓ వ్యక్తి గొడ్డలితో నరికి చంపాడు. అనంతరం తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సోను యాదవ్(22), సోని(20)లకు శుక్రవారమే వివాహమైంది. రాత్రి బారాత్ వేడుక జరిగింది. అనంతరం అందరూ నిద్రిస్తుండగా సోను సోదరుడు శివ్ వీర్ యాదవ్(28) గొడ్డలితో నూతన దంపతులతోపాటు మరో సోదరుడు, బావ మరిది సౌరభ్, స్నేహితుడిని చంపేశాడు. తన భార్య, అత్తపైకి తుపాకీతో కాల్పులు జరపగా వారు గాయపడ్డారు. అనంతరం నిందితుడు శివ్ వీర్యాదవ్ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘాతుకానికి కారణాలపై దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్పీ వెల్లడించారు. -
భార్యావియోగాన్ని తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్య
హైదరాబాద్: భార్య పుట్టింటికి వెళ్లడమే కాకుండా తనతో సరిగా మాట్లాడడం లేదని మనస్తాపం చెందిన ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలివీ... ఫిలింనగర్‌లోని దుర్గాభవనీనగర్ బస్తీకి చెందిన పెద్ద నర్సింహా(29) వివాహం రెండేళ్ల క్రితం శివానీతో జరిగింది. నాలుగు రోజుల క్రితం శివాని పుట్టింటికి వెళ్లింది. అత్త మాట్లాడినా సరిగా స్పందించలేదు. భర్తతో సైతం సరిగా మాట్లాడకపోవడంతో విరక్తి చెందిన నర్సింహా ఆదివారం తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఫిలింనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బాసర ట్రిపుల్ ఐటీలో మరో విషాదం
-
బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి, ఆదిలాబాద్: బాసర ట్రిపుల్ ఐటీలో మృత్యు ఘోష ఆగడం లేదు. మరో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న లిఖిత.. హాస్టల్ బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థిని మృతదేహాన్ని నిర్మల్ ఆసుప్రతికి తరలించారు. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో బాలికల వసతి గృహం నాలుగో అంతస్తు నుండి దూకడంతో భద్రతా సిబ్బంది గమనించి, అపస్మారక స్థితిలో ఉన్న విద్యార్థినిని క్యాంపస్ హెల్త్ సెంటర్లో ప్రథమ చికిత్స అనంతరం భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు ధృవీకరించారు. లిఖితది ఆత్మహత్య కాదు.. ప్రమాదం: వీసీ లిఖితది ఆత్మహత్య కాదని.. ప్రమాదం అని వీసీ వెంకటరమణ అంటున్నారు.. యూట్యూబ్ చూస్తూ లిఖిత కింద పడిపోయిందన్నారు. ఆత్మహత్యను ఖండిస్తున్నానని, అబద్ధపు ప్రచారాన్ని నమ్మద్దని కోరుతున్నానని వీసీ అన్నారు. ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
వివాహం జరిగిన నెల రోజులకే ఓ నవ వధువు ఆత్మహత్య
హైదరాబాద్: వివాహం జరిగిన నెల రోజులకే ఓ నవ వధువు సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వసంత్‌నగర్‌లో నివసించే నరేష్ గౌడ్‌కు గాజుల రామారంలో నివాసం ఉండే నందిని (23)కి నెల రోజుల క్రితం వివాహమైంది. భర్త ఇంటి వద్దనే ఉన్న నందిని శనివారం రాత్రి 7 గంటల సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వా«దీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. వధువు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని వ్యక్తిగత కారణాల వల్ల ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దర్యాప్తులో పూర్తి వివరాలు తెలుస్తాయని ఎస్సై రామ్మోహన్ రెడ్డి వివరించారు. -
నాలుగేళ్ల క్రితం వివాహం.. సంతానం కలగడం లేదని...
ఏటూరునాగారం : సంతానం కలగడం లేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని ఎలిశెట్టిపల్లిలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై శ్రావణ్‌కుమార్ కథనం ప్రకారం. ఎలిశెట్టిపల్లి గ్రామానికి చెందిన హన్మంతరావు–నర్సక్క కుమారుడు పులిశె చంద్రశేఖర్(28) పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. చంద్రశేఖర్‌కు నాలుగేళ్ల క్రితం మౌనికతో వివాహం జరిగింది. అతనికి సంతానం కలగడం లేదని గత కొంత కాలంగా మద్యానికి బానిసై ఈనెల 28న ఆదివారం భార్యతో గొడవపడగా అతని భార్య పుట్టింటికి వెళ్లిందన్నారు. సంతానం కలగడం లేదని జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఉన్న పురుగుల మందుతాగడంతో కుటుంబ సభ్యులు, చుట్టుపక్క వారు చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిర్వహించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
రంగారెడ్డి: ప్రాణం తీసిన ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్
సాక్షి, రంగారెడ్డి: జిల్లా వ్యాప్తంగా బెట్టింగ్ జోరుగా సాగుతున్నాయి. ఇందులో డబ్బులు పందాలు కాచి పలువురు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలంలోని గిరాయి గుట్ట తండా పరిధిలోని నార్లగూడ తండాలో అంగోతు ప్రకాష్ (19) అనే యువకుడు బెట్టింగ్‌లో డబ్బులు కోల్పోయి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాత్రి జరిగిన ఢిల్లీ వర్సెస్ పంజాబ్ క్రికెట్ మ్యాచ్‌లో పంజాబ్ గెలుస్తుందని ప్రకాష్ కొంతమంది మిత్రులతో బెట్టింగ్ వేశాడు. ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఓడిపోయింది. దీంతో బెట్టింగ్ మాఫియా డబ్బులు ఇవ్వాలని బలవంతం చేశారు. బెట్టింగ్ డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఉన్న ప్రకాష్ ఏం చేయాలో తెలియక మానసిక ఒత్తిడికి గురై ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని గ్రామస్థులు తెలిపారు. చదవండి: ఆ పేద బతుకులపై విధి కన్నెర్రచేసిందో ఏమో.. -
8న ఎంగేజ్మెంట్.. అంతలోనే ...
హైదరాబాద్: ఈనెల 8న అతడికి ఎంగేజ్మెంట్. అంతలోనే ఆయువకుడు జీవితంపై విరక్తి పుడుతోందని ఉరేసుకున్నాడు. మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన గోనె లెనిన్‌రెడ్డి(30) బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. లెనిన్ డిగ్రీ చదివి కరీంనగర్లో ల్యాబ్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈనెల 8న అతడికి ఎంగేజ్మెంట్ ఉంది. దీంతో లెనిన్ మంగళవారమే ఇంటికి వచ్చాడు. బుధవారం మధ్యాహ్నం తన తల్లి పద్మను ఫంక్షన్ కోసం గిర్నిబావికి తీసుకెళ్లాడు. అనంతరం రాత్రి ఇంట్లో ఉరేసుకున్నాడు. స్థానికులు తలుపులు బలవంతంగా తొలగించి చూడగా.. అప్పటికే లెనిన్ మృతి చెందాడు. మృతుడి తండ్రి 8 ఏళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. సోదరుడు మల్లారెడ్డి హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ‘జీవితంపై విరక్తి కలుగుతోంది. చావాలని అనిపిస్తోంది. అమ్మను బాగా చూసుకో అన్నయ్య’ అని రాసి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. ఘటనాస్థలికి చేరుకున్న ఎస్సై నవీన్‌కుమార్ మృతదేహాన్ని నర్సంపేట మార్చురీకి తరలించారు. -
హైదరాబాద్‌లో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీ ఛత్రినాక పీఎస్‌లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడింది. రెండు రోజుల క్రితమే కానిస్టేబుల్ సురేఖకు నిశ్చితార్థం జరిగింది. ఇష్టంలేని పెళ్లి కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానం వ్యక్తమవుతోంది. రంగారెడ్డి జిల్లా కందుకూరుకు చెందిన సురేఖ.. తన సోదరితో కలిసి అలియబాద్ ప్రాంతంలో నివాసం ఉంటుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సంఘటన స్థలానికి చేరుకున్న శాలిబండ పోలీసులు.. క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. చదవండి: నీలి చిత్రాల సీడీల నుంచి కిడ్నీ రాకెట్ వరకూ.. -
హైదరాబాద్ వెళ్తున్నానని చెప్పి అల్లుడితో లాడ్జికి వెళ్లిన అత్త.. షాకింగ్ ట్విస్ట్!
భద్రాచలంఅర్బన్: పట్టణంలో ఆదివారం ఓ లాడ్జిలో అనుమానాస్పదంగా మృతి చెందిన రావూరి అరుణ (35)ను ఆమెకు అల్లుడు వరసయ్యే ఆంజనేయులు హత్య చేసినట్లు సోమవారం అరుణ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. అరుణ హైదరబాద్‌లో ఆమె భర్త కృష్ణారావుతో కలిసి కోళ్ల ఫారంలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈనెల 14వ తేదీన అరుణ.. తనకు కడుపులో నొప్పి వస్తోందని, ఆమె సొంత గ్రామం అయిన తిరువూరులో వైద్యులకు చూపించుకుని వస్తానని చెప్పి హైదరాబాద్ నుంచి బయలుదేరింది. ఖమ్మం జిల్లాలోని కప్పలబంధం గ్రామానికి చెందిన ఆంజనేయులు (అరుణ భర్త కృష్ణార్జున్‌రావు మేనల్లుడు)తో కలిసి భద్రాచలం పట్టణానికి చేరుకొని లాడ్జిలో గదిని అద్దెకు తీసుకున్నారు. ఒక రోజు అదే గదిలో ఇద్దరూ కలిసి ఉన్నారని, ఇది తెలిస్తే పరువుపోతుందని గ్రహించిన అరుణ గదిలో ఫ్యాన్‌కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు లాడ్జి నిర్వాహకులు ఆదివారం సాయంత్రం పోలీసులకు సమాచారం అందించారు. ఇదే విషయాన్ని అరుణ కుటుంబ సభ్యులకు తెలిపామని పోలీసులు చెప్పారు. సోమవారం అరుణ మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులు పరిశీలించి ఆమె మెడ చుట్టూ కమి లి ఉన్న గాయాన్ని బట్టి ఆంజనేయులే చీర ను అరుణ గొంతుకు చుట్టి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసి ఉంటాడని ఫిర్యాదు చేసి నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని కఠి నంగా శిక్షించాలని వారు కన్నీటిపర్యంతమ య్యారు. ఇందుకు సంబంధించి పోలీసులు సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు సీఐ నాగరాజురెడ్డి తెలిపారు. -
Hyderabad: ఓయో రూమ్స్ మేనేజర్ ఆత్మహత్య
హైదరాబాద్: ఓయో హోటల్లో మేనేజర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ శ్రీనివాస్ వివరాల ప్రకారం.. ఉత్తర్‌ప్రదేశ్ కుషమ్‌కాష్ గ్రామానికి చెందిన అనుర«ద్‌సింగ్, సచిన్‌సింగ్(30) ఇద్దరూ నాచారం మల్లాపూర్‌లో ఉంటూ ఓయో హోటల్లో పనిచేస్తున్నారు. మూడు నెలలుగా మల్కాజిగిరి మారుతీనగర్‌లోని సాయి మాన్సన్ ఓయో హోటల్ నిర్వహిస్తున్నాడు. 16వ తేదీ రాత్రి తన రూమ్‌లోకి వెళ్లిన సచిన్‌సింగ్ తలుపు తీయలేదు. తలుపు పగులగొట్టి చూడగా ఫ్యాన్‌కు ఉరివేసుకొని కనిపించాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొనని దర్యాప్తు చేస్తున్నారు. -
అయ్యో.. నాగలక్ష్మి.. ఇలా చేశావేంటి?
కరీంనగర్: ఇంటర్మీడియెట్ పరీక్షలు బాగా రాయలేకపోయాననే మనస్తాపంతో కాల్ల నాగలక్ష్మి(16) బుధవారం గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తిమ్మాపూర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కాల్ల రామయ్య – నర్సవ్వ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. చిన్నకూతురు నాగలక్ష్మి. మల్యాల మండలం నూకపెల్లి మోడల్ స్కూల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరం బైపీసీ చదువుతోంది. సోమవారం మల్యాలలో బోటనీ పరీక్ష రాసింది. అయితే, పరీక్ష బాగా రాయలేదని మనస్తాపానికి గురైంది. ఇదే విషయాన్ని తన స్నేహితులతో చెప్పింది. పరీక్ష మంచిగారాసి ఉగాది పండుగకు ఇంటికి రావాలని తల్లిదండ్రులు కోరారు. ఈ క్రమంలో మంగళవారం బాలిక ఇంటికి చేరుకుంది. వచ్చినప్పటి నుంచి నాగలక్ష్మి ముదావహంగా ఉంటోంది. భోజనం కూడా సరిగా చేయడంలేదు. తల్లిదండ్రులు ఆరా తీయగా, తాను పరీక్ష బాగా రాయలేకపోయానని రోదిస్తూ తెలిపింది. ఏం ఫర్వాలేదని, ధైర్యంగా ఉండాలని తల్లిదండ్రులు బాలికకు సూచించారు. ఈక్రమంలో బుధవారం ఉగాది పర్వదినం సందర్భంగా ఇంటి ఎదుట వాకిట్లో ముగ్గులు వేసిన నాగలక్ష్మి.. ఉదయం 11 గంటల సమయంలో బయటకు వెళ్లింది. మధ్యాహ్నం వరకూ ఆమె కనిపించలేదు. దీంతో తల్లిదండ్రులు పరిసరాల్లో గాలించారు. బంధువులకు సమాచారం అందించారు. ఎక్కడా ఆచూకీ లభించలేదు. గోదావరినది వైపు నాగలక్ష్మి వెళ్లిందని స్థానికులు వారికి చెప్పారు. దీంతో తల్లిదండ్రులు అటువైపు వెళ్లి చూడగా, గోదావరి ఒడ్డున నాగలక్ష్మి చెప్పులు కనిపించాయి. నదిలో దూకి ఉంటుందనే అనుమానంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు జాలర్లసాయంతో నీటిలో గాలించగా నాగలక్ష్మి మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు బోరున విలపించారు. మృతిరాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై రాజు తెలిపారు. కొడుకులు లేకున్నా.. ఇద్దరు కూతుళ్లే సర్వస్వం అనుకున్న ఆ తల్లిదండ్రులు.. చిన్నకూతురు మృతితో విషాదంలో మునిగారు. -
బస్సులో ఆర్టీసీ కండక్టర్ ఆత్మహత్య
తొర్రూరు: ఆర్టీసీ కండక్టర్ బస్సులో ఆత్మహత్యకు పా ల్పడ్డాడు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా తొర్రూ రు మండల కేంద్రంలో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. ఆర్టీసీ కండక్టర్‌గా పనిచేస్తోన్న మండల పరిధి కంటాయపాలెం గ్రామానికి చెందిన గార్లపాటి మహేందర్‌రెడ్డి(54) తొర్రూరు టీచర్స్‌కాలనీలో స్థిరపడ్డాడు. వ్యక్తిగత పనుల నిమిత్తం ఇటీవల మూడు రోజులు సెలవు పెట్టాడు. వాటిని రద్దు చేసుకుని ఆదివారం ఉదయం 10 గంటలకు విధుల్లో చేరేందుకు డిపోకు వచ్చాడు. సెక్యూరిటీ కార్యాలయం రిజిస్టర్లో సంతకం పెట్టి బస్సులోకి వెళ్లిన మహేందర్‌రెడ్డి ఎంత సేపటికీ బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది వెళ్లి చూడగా బస్సులోని కడ్డీకి ఉరి వేసుకుని కనిపించాడు. వెంటనే డిపో సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. మృతునికి భార్య అరుణ, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. కాగా, ఆర్థిక ఇబ్బందులతోనే కండక్టర్ ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు చెబుతున్నారు. -
రెండేళ్ల క్రితం పెళ్లి.. భర్తతో ఇష్టం లేక.. ప్రియుడిని మర్చిపోలేక..
యశవంతపుర(కర్ణాటక): యాదగిరి జిల్లా శహపుర తాలూకాలో ఘోరం జరిగింది. శివరాత్రి పండుగ రోజున ప్రేమజంట పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. శహపుర తాలూకా హురసగుండగి గ్రామానికి చెందిన సువర్ణ (20), ఈశప్ప (22)లు ఐదేళ్ల నుంచి ప్రేమించుకొంటున్నారు. తల్లిదండ్రులు సువర్ణకు రెండేళ్ల క్రితం మరో యువకునికిచ్చి పెళ్లి చేశారు. భర్తతో కలిసి బెంగళూరులో ఉన్న సువర్ణ.. ప్రియున్ని మరువలేకపోయింది. ఇద్దరూ టచ్‌లోనే ఉండేవారు. శివరాత్రి పండుగకు శుక్రవారం హురసగుండిగి వెళ్లింది. శనివారం ఉదయం సువర్ణ, ఈశప్పలు కలిసి జీవితంలో కలిసి జీవించడం సాధ్యం కాదని, కలిసి చనిపోవడమే శరణ్యమని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. చదవండి: బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. అద్దంకి ఎస్ఐ భార్య, కూతురు మృతి -
మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ భార్య ఆత్మహత్య
ఆదిలాబాద్: మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ నల్లమల్ల బాలకృష్ణ భార్య జ్యోతి(32) మంగళవారం ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన పట్టణంలో సంచలనం సృష్టించింది. బాలకృష్ణ స్థానిక ఆదిత్య ఎన్‌క్లేవ్‌లో భార్య, కుమారుడు రిత్విక్, కూతురు భవిష్యలతో నివాసం ఉంటున్నాడు. మంగళవారం ఉదయం విధుల్లోకి వెళ్లిన కమిషనర్ మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చే సరికి ఇంటి తలుపు లోపల గడియ పెట్టి ఉంది. అనుమానంతో తలుపు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా బెడ్రూమ్లో జ్యోతి ఫ్యానుకు చున్నితో ఉరివేసుకొని వేలాడుతూ కనిపించింది. జ్యోతి మృతదేహాన్ని కిందకు దింపి పోలీసులకు సమాచారం అందించాడు. మంచిర్యాల డీసీపీ సుధీర్ రాంనాథ్ కేకన్, ఏసీపీ తిరుపతిరెడ్డి, ఎస్సైలు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ భార్య కావడంతో చైర్మన్ పెంట రాజయ్య, కౌన్సిలర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కాగా ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఆత్మహత్య కాదు.. హత్యే..! జ్యోతి తల్లిదండ్రులు గంగవరపు రవీంద్రకుమారి, రాంబాబు సంఘటన స్థలానికి చేరుకుని ఆమెది ఆత్మహత్య కాదని, హత్యేనని ఆందోళనకు దిగారు. ఉదయం తమ కూతురు వీడియో కాల్ చేసి మాట్లాడిందని, చంపేసేలా ఉన్నాడని రోదించిందని ఆరోపించారు. ఖమ్మం జిల్లా కేశవపురానికి చెందిన బాలకృష్ణ కానిస్టేబుల్ ఉద్యోగం చేసేవాడని, 2014, ఆగస్టు 15న పెద్దల సమక్షంలో వివాహం జరిగిందని, మూడెకరాల పొలం, రూ.2 లక్షల విలువైన బంగారం అందజేసినట్లు తెలిపారు. కమిషనర్‌గా ఎంపికైన తర్వాత నుంచి గొడవలు మొదలయ్యాయని, తాను కమిషనర్‌నని, ఎక్కువ కట్నం వచ్చేదంటూ వేధించేవాడని ఆరోపించారు. పలుమార్లు కుటుంబ పెద్దల సమక్షంలో మందలించినట్లు తెలిపారు. జ్యోతి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించి న్యాయం చేయాలని వేడుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ నారాయణ్‌నాయక్ తెలిపారు. అమ్మా.. ఏమైంది..! మంచిర్యాలటౌన్: ఉన్నత ఉద్యోగి భార్య.. కుమారుడు, కూతురుతో హాయిగా జీవితం సాగిపోతోంది. ఉదయాన్నే ఇద్దరు పిల్లలను రోజూ మాదిరిగా సిద్ధం చేసి, టిఫిన్ బాక్సు పెట్టి నవ్వుతూ టాటా చెప్పి బడికి పంపించింది. ఏం జరిగిందో గానీ మధ్యాహ్నం వరకు ఆ తల్లి విగతజీవిగా మారింది. ఈ దృశ్యాన్ని చూసిన చిన్నారులు రిత్విక్, భవిష్య ‘‘అమ్మా.. ఏమైంది..’’ అంటూ విలపించిన తీరు అక్కడున్న వారిని కదిలించింది. ‘‘అమ్మా లే అమ్మా... ఏమైంది అమ్మా.. ఎందుకు లేస్తలేవు..’’ అంటూ తల్లి మృతదేహం వద్ద విలపించారు. -
రెండురోజుల్లో పెళ్లి.. అంతలోనే యువకుడి షాకింగ్ నిర్ణయం.. ఏం జరిగింది?
రాజమహేంద్రవరం రూరల్(తూర్పుగోదావరి): రెండురోజుల్లో పెళ్లి... మూడుముళ్ల బంధంతో ఒక్కటై.. సంతోషంగా గడపాల్సిన సమయం..ఇంతలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బొమ్మూరులోని బాలాజీపేట రోడ్లో శ్రీ అపార్టుమెంటులో గురువారం ఈ సంఘటన జరిగింది. పోలీసుల కథ«నం ప్రకారం శ్రీ అపార్ట్మెంటులో ఉంటున్న బొరుసు మంగాదేవికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. కుమార్తెలకు వివాహాలయ్యాయి. నాలుగో సంతానం రాజీవ్‌బాబు(32).దానవాయిపేట యాక్సెస్ బ్యాంక్‌లో ఐటి విభాగం మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన యువతితో ఈనెల 4వ తేదీన వివాహం జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం 10గంటలకు మంగాదేవి, కుమార్తెలు కలసి షాపింగుకు వెళ్లారు. రాజీవ్‌ను రమ్మని కోరారు. ఇంటిలో టీవీ రిపేరు చేయించి వస్తానని అతడు సమాధానం ఇవ్వడంతో కుటుంబ సభ్యులు వెళ్లారు. మధ్యాహ్నం ఒంటి గంటన్నర సమయంలో వారు తిరిగి ఇంటికి చేరుకున్నారు. మెయిన్ డోర్ తెరిచి ఉంది. బెడ్రూమ్ డోర్ వేసి ఉంది. రాజీవ్ పడుకుని ఉన్నాడని భావించారు. తమ పనిలో పడిపోయారు. కాస్సేపటి తర్వాత రాజీవ్‌ను నిద్రలేపుదామని కిటికీలో నుంచి చూశారు. ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడి కనిపించాడు. దీంతో కుటుంబ సభ్యులంతా షాక్ అయ్యారు. శోకసముద్రంలో మునిగిపోయారు. మృతుని తల్లి ఫిర్యాదు మేరకు బొమ్మూరు ఎస్సై శివాజీ కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రాజీవ్ నిశ్చితార్ధమైనప్పటి నుంచి కాబోయే భార్యతో సరదాగా మాట్లాడేవాడు. పరస్పరం గిఫ్ట్‌లు ఇచ్చుకునేవారిని కుటుంబ సభ్యులు తెలిపారు. చదవండి: ఇన్స్టాగ్రామ్ లైవ్‌లో ఆత్మహత్యాయత్నం.. 15 నిమిషాల్లోనే -
వరంగల్ : ఆన్ లైన్ గేమ్స్ కు యువకుడు బలి
-
రైల్వే ట్రాక్‌పై ఇంజినీరింగ్ విద్యార్థి.. కాలేజీకి వెళ్తున్నానని చెప్పి..
శిరివెళ్ల(నంద్యాల జిల్లా): మండల పరిధిలోని గోవిందపల్లె గ్రామానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి ఎం.ఫణేశ్వరరెడ్డి(23) రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. నంద్యాల రైల్వే ఎస్ఐ జలీల్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన వెంకటేశ్వరరెడ్డి కుమారుడు ఫణేశ్వరరెడ్డి నంద్యాల ఆర్జీఎం కాలేజీలో తృతీయ సంవత్సరం ఇంజినీరింగ్ చదువుతున్నాడు. రెండు ఏడాదిలో కొన్ని సబెక్టులు ఫెయిల్ అయ్యాడు. చదవండి: కొడుకును చూసి షాక్ తిన్న తండ్రి.. సినిమా స్టోరీని తలపించింది.. కొంతకాలంగా మానసిక వ్యాధితో బాధ పడుతున్నాడు. ఈక్రమంలో సోమవారం కాలేజీకి వెళ్తున్నానని చెప్పి బైక్‌పై నంద్యాలకు బయల్దేరాడు. సాయంత్రం ప్రకాశం జిల్లా రాచర్ల మండలం రైల్వే ట్రాక్‌పై శవమై కనిపించాడు. బైక్ నంబర్ ఆధారంగా అక్కడి రైల్వే పోలీసులు తల్లిదండ్రులకు సమాచారం అందించి మృతదేహాన్ని నంద్యాలకు తరలించారు. మంగళవారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
పెళ్లయి రెండేళ్లు.. వివాహిత షాకింగ్ నిర్ణయం..
కొత్తపల్లి (తూర్పుగోదావరి): ఒక వివాహిత మృతికి కారణమైన ఐదుగురిపై వరకట్న వేధింపుల కేసు నమోదు చేసినట్టు ఆదివారం పోలీసులు తెలిపారు. కొండెవరం గ్రామానికి చెందిన మేడిశెట్టి రాంబాబుకు జగ్గంపేట మండలం నరేంద్రపట్నం గ్రామానికి చెందిన శిరీష(29)కు రెండేళ్ల క్రితం వివాహం అయింది. కొంతకాలంగా కుటుంబ సభ్యులు ఆమెను అదనపు కట్నం కోసం వేధించడమే కాకుండా చిత్రహింసలకు గురి చేస్తున్నారు. చదవండి: ఎవరు? ఎందుకు? మనస్థాపానికి గురైన శిరీష శనివారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె సోదరుడు బుర్రే క్రాంతి కిరణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త మేడిశెట్టి రాంబాబు, అత్తమామలు నాగమణి, నారయ్య, ఆడపడుచు భవాని, ఆమె భర్త సత్యానందంపై వరకట్నం వేధింపుల కేసును నమోదు చేశారు. పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో తహసీల్దారు ప్రసాద్ పర్యవేక్షణలో పోస్టుమార్టం నిర్వహించారు. కొండెవరంలో రాంబాబు ఇంటిని డీఎస్పీ భీమారావు పరిశీలించారు. ఆయన వెంట సీఐ వైఆర్కే శ్రీనివాస్, ఎస్సై అబ్దుల్ నబీ ఉన్నారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
డిచ్ పల్లి చేరుకున్న విద్యార్థి సురేశ్ మృతదేహం
-
బాసర ట్రిపుల్ ఐటీలో సురేశ్ అనే విద్యార్థి ఆత్మహత్య
-
ఇద్దరి పిల్లల తల్లి.. ఆటో డ్రైవర్‌తో వివాహేతర సంబంధం.. చివరకు..
పెందుర్తి(విశాఖపట్నం): రైలు కింద పడి ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఇష్టపడిన యువకుడితో కలిసి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నం చేయగా సదరు యువకుడు గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. జీఆర్పీ పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గోపాలపట్నం సమీపంలోని కొత్తపాలేనికి చెందిన కొణతాల హేమలత(25) భర్తతో విభేదాల కారణంగా రెండేళ్ల క్రితం విడిపోయింది. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం మంగళపాలెంలోని పుట్టింటిలో ఉంటుంది. ఆమె బ్యూటీషియన్ కోర్సు చేసింది. శుభకార్యాలకు, ఇతరత్రా కార్యక్రమాలకు మేకప్‌లు వేసేందుకు బయటకు వెళ్తుంది. చదవండి: హనీ ట్రాప్.. యువకులకు యువతి వల.. వీడియో కాల్స్ రికార్డ్ చేసి.. ఈ నేపథ్యంలో కోటనరవకు చెందిన ఆటో డ్రైవర్ కె.కుమార్‌తో పరిచయం ఏర్పడి వివాహేతర బంధానికి దారితీసింది. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం అమ్మగారి ఇంటి నుంచి హేమలత బయటకు వెళ్లి కుమార్‌ను కలిసింది. ఇద్దరూ కలిసి సతివానిపాలెం రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లి రాత్రి అంతా గడిపారు. ఈ క్రమంలో శనివారం వేకువజామున ఇద్దరూ ఆత్మహత్య చేసుకునేందుకు నిర్ణయం (ఇద్దరూ మద్యం మత్తులో ఉన్నట్లు జీఆర్పీ పోలీసులు భావిస్తున్నారు) తీసుకున్నారు. ఇద్దరూ కలిసి ట్రాక్‌పై పడుకున్నారు. అయితే రైలు రావడం ఆలస్యం కావడంతో ఇద్దరూ సమీపంలోని బడ్డీ వద్దకు వచ్చి కాసేపు గడిపారు. మళ్లీ కాసేపటి తర్వాత ఆత్మహత్యాయత్నానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆఖరి క్షణంలో మనసు మార్చుకున్న కుమార్ ఆ ప్రయత్నం విరమించుకుందామని హేమలతను వెనక్కి లాగే ప్రయత్నం చేశాడు. కానీ హేమలత ససేమిరా అని రైలుకు ఎదురుగా వెళ్లింది. ఈ క్రమంలో ఇద్దరికీ పెనుగులాట జరిగింది. రైలు వేగంగా రావడంతో ట్రాక్ మీద ఉన్న హేమలతను బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. అదే సమయంలో కుమార్ పక్కకి ఉండడంతో రైలు వేగానికి తుళ్లి రాళ్లపై పడిపోయాడని జీఆర్పీ పోలీసులు భావిస్తున్నారు. గార్డు చూడడంతో వెలుగులోకి.. ఘటన జరిగిన ప్రాంతం పూర్తిగా నిర్మానుష్యంగా ఉండడంతో ఈ ఘటన శనివారం ఉదయం వరకు ఎవరికీ తెలియలేదు. అయితే బహిర్భూమికి అటుగా వెళ్లిన అక్కడి ప్రైవేటు కంపెనీ గార్డు అప్పలరాజు గాయాలతో మూలుగుతున్న కుమార్‌ను చూశాడు. వెంటనే సమీపంలోని రోడ్డు వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి బైకిస్ట్ జగదీష్‌ను ఆపి ఘటనాస్థలికి తీసుకెళ్లాడు. వెంటనే 108కు సమాచారం అందించి చికిత్స నిమిత్తం కుమార్‌ను కేజీహెచ్‌కు తరలించారు. సమాచారం అందుకున్న జీఆర్పీ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని హేమలత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ఆత్మహత్యకు పాల్పడాల్సిన కారణం ఏంటన్నది కుమార్ కోలుకున్నాకే తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు. ఆ దిశగా జీఆర్పీ సీఐ కె.కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్ఐ బాలాజీ కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు హేమలతకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
గంటా సన్నిహితుడి మిత్రుడు అదృశ్యం
దొండపర్తి (విశాఖ దక్షిణ), కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు లేఖ రాసి రాజమహేంద్రవరంలోని రోడ్డు కమ్ రైలు బ్రిడ్జి వద్ద శుక్రవారం ఓ వ్యక్తి అదృశ్యం కావడం కలకలం రేపింది. విశాఖ కిర్లంపూడి లేఅవుట్ ప్రాంతానికి చెందిన కాట్రగడ్డ చంద్రశేఖర్ (60) గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అక్కడున్న క్రేటా కారు (ఏపీ 39 ఈక్యూ 9999) వద్ద ఓ లేఖ లభ్యమైంది. చదవండి: అత్తపై కోడలు భారీ స్కెచ్.. విస్తుపోయే షాకింగ్ నిజాలు బట్టబయలు ఆయన గోదావరిలో దూకి చనిపోయాడా? లేక ఎక్కడికైనా వెళ్లిపోయాడా? అనే విషయంపై స్పష్టత రాలేదు. ఉదయం అటుగా వెళ్తున్న కానిస్టేబుల్ కారు ఆగి ఉండటాన్ని గుర్తించి స్టేషన్‌కు సమాచారం ఇచ్చాడు. పోలీసులు అక్కడకు చేరుకుని పరిసర ప్రాంతాలు, గోదావరిలో గాలింపు చేపట్టినా ఆచూకీ దొరకలేదు. రూ.12 కోట్లకుపైగా అప్పుల్లో కూరుకుపోయి.. విశాఖ మూడో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కిర్లంపూడి లేఅవుట్ ‘ది పామ్స్’ అపార్ట్మెంట్లో చంద్రశేఖర్ కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సన్నిహితుడు, ఇటీవల చనిపోయిన నలంద కిషోర్‌కు ఆయన స్నేహితుడని తెలుస్తోంది. చంద్రశేఖర్ సుమారు రూ.12 కోట్ల అప్పుల్లో కూరుకుపోయినట్లు సమాచారం. ఇందులో రూ.6 కోట్లు మధ్యవర్తిగా ఇతరులకు ఇప్పించి ఇరుక్కుపోయినట్లు చెబుతున్నారు. బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నట్లు ఆయనపై ఆరోపణలున్నాయి. చంద్రశేఖర్ అదృశ్యంపై ఇప్పటివరకు పోలీసులకు ఫిర్యాదు అందలేదు. ఆయన నివాసంలో ప్రస్తుతం ఎవరూ లేరని తెలుస్తోంది. -
విషాదం: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య
సంగారెడ్డి జిల్లా: పటాన్చెరు మండలం భానుర్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు మధ్యప్రదేశ్‌కు చెందిన వలస కూలీలుగా పోలీసులు గుర్తించారు. వివాహిత తన చిన్నారితో పాటు వరసకు మరిది అయిన వ్యక్తితో కలిసి ముగ్గురు అనుమానాస్పదంగా ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటనపై హత్యా? ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: వీడిన మిస్టరీ.. బావే హంతకుడు.. అత్త ఆస్తి కోసం.. -
ఊర్లో ఆడవాళ్లు, మగవాళ్లు నామీద ఇంత పగతో ఉన్నారా?
విజయనగరం క్రైమ్: ఊర్లో ఆడవాళ్లు, మగవాళ్లు నామీద ఇంత పగతో ఉన్నారా? నాకు ఇప్పటివర కూ తెలియదు. ఈ జనాల మధ్యలో బతకలేను మరి. బై ఫ్రెండ్స్’ అంటూ వాట్సాప్‌లో స్టేటస్ పెట్టి, రైలు కింద పడి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన అందించిన వివరాలిలా ఉన్నాయి. దుప్పాడ గ్రామానికి చెందిన తాళ్లపూడి త్రినాథ్ (24) వీటీ అగ్రహారంలో ప్రియా సిమెంట్స్‌లో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా ఊర్లో యువకులంతా కలిసి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. అందులో కొన్ని మెసెజ్‌ల విషయంలో వచ్చిన మనస్పర్థల వల్ల త్రినాథ్ తీవ్ర మానసికక్షోభకు గురయ్యాడు. కొంతమందితో వచ్చిన తగాదాల కారణంగా వన్‌టౌన్‌లో కేసు కూడా నమోదైంది. దీంతో మరింత మనస్తాపం చెందిన త్రినాథ్.. ఆదివారం ఉదయం 8.50 గంటలకు వాట్సాప్‌లో స్టేటస్ పెట్టి బై ఫ్రెండ్స్ అంటూ మెసెజ్ చేసి, 9 గంటలకు అలకానంద కాలనీకి చేరుకుని, రైల్వేట్రాక్ పక్కన బైక్ పార్క్‌చేశాడు. అదే సమయంలో వస్తున్న సికింద్రాబాద్–భువనేశ్వర్ విశాఖ ఎక్స్‌ప్రెస్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి తల్లి గౌరమ్మ, తండ్రి అప్పారావు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జీఆర్పీ ఎస్సై రవివర్మ తెలిపారు. -
క్షమించండి నాన్నా...
కర్నూలు : ‘‘నాన్నా.. నాకు బతకాలని లేదు. మీకు తెలుసు నేను ఓ యువతిని ప్రేమించిన విషయం. ఆమె ఎక్కడ ఉన్నా బాగుండాలని కోరుకున్నాను. కానీ ఆమె ఇప్పుడు లేదు. ఎందుకు ఆత్మహత్య చేసుకుందో నాకు తెలియదు. నా ప్రేయసి ఎక్కడ ఉన్నా బాగుంటుందని ఇన్నాళ్లూ బతికాను. ఆమె బలవన్మరణం చెందిన విషయం తెలిసింది. ఇక నేను బతకను. సారీ నాన్నా’’ అంటూ సూసైడ్ నోట్ రాసి మంగలి శివప్రసాద్ (22) అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బి.అగ్రహారం గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. బి.అగ్రహారం గ్రామానికి చెందిన మంగలి రామచంద్ర, వసుంధర దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు శివప్రసాద్ కోడుమూరు పట్టణంలో డిగ్రీ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. కోడుమూరు మండలం రామాపురం గ్రామానికి చెందిన ఓ యువతి అదే కళాశాలలో డిగ్రీ చదువుతోంది. వారిద్దరూ ప్రేమించుకున్నారు. అయితే వీరి కులాలు వేరు కావడంతో పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని, వేరే చోటుకు వెళ్లి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. గత ఏడాది కొంతకాలం వేరే చోటుకు వెళ్లిపోయారు. ఈ విషయం రెండు కుటుంబాల వారికీ తెలియడంతో వారిని వెతికి పట్టుకుని తీసుకువచ్చారు. ఇరు కుటుంబాల పెద్దలు పంచాయితీ చేశారు. వీరికి మైనార్టీ తీరలేదు కాబట్టి కొంతకాలం దూరం పెట్టి మైనార్టీ తీరిన తరువాత వివాహం చేద్దామని పెద్దలు మాట్లాడుకొని, ప్రేమికులను ఎవరి ఇంటికి వారిని పంపించారు. అయితే వీరిద్దరూ దూరంగా ఉన్నా వారి మధ్య ప్రేమ మరింత బలపడింది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయారు. ఈ క్రమంలోనే ఆ యువతి సోమవారం పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం ఉదయం శివప్రసాద్‌కు ఆ విషయం తెలిసింది. తను ప్రేమించిన అమ్మాయి లేనప్పుడు తను ఎందుకు బతకాలి? ఎవరి కోసం బతకాలి? అంటూ సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కూలి పనులకు వెళ్లిన అమ్మ తిరిగి ఇంటికి వచ్చి ఫ్యాన్‌కు వేలాడుతున్న కుమారుడిని చూసి గుండెలు బాదుకుంది. చుట్టు పక్కల వారు వచ్చి మృతదేహాన్ని కిందకు దించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాపు చేస్తున్నట్లు ఎస్ఐ మోహన్‌కిషోర్ రెడ్డి తెలిపారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
తెల్లవారితే ఉద్యోగంలో చేరాల్సి ఉండగా.. అంతలోనే ఉన్నట్టుండి..
చిల్లకల్లు(జగ్గయ్య పేట):ఎన్టీఆర్ జిల్లా: ఒక్క రోజు ఆగితే.. తాను కోరుకున్న ఉద్యోగంలో చేరిపోయేది. ఏమయ్యిందో ఏమో.. ఈలోపే ఆత్మహత్య చేసుకుంది. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరు గ్రామానికి చెందిన ఐటీ యువతి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. నవులూరు గ్రామానికి చెందిన జాస్తి శ్వేతా చౌదరి (22) బీటెక్ పూర్తి చేసి, కొన్ని నెలలుగా ఐటీ ఉద్యోగం కోసం ఎదురుచూస్తోంది. పలు కంపెనీలకు ఉద్యోగం కోసం ఆన్లైన్లో దరఖాస్తు కూడా చేసుకుంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగానికి ఎంపికయ్యింది. తెల్లవారితే వెళ్లి ఉద్యోగంలో చేరాల్సి ఉండగా.. ఉన్నట్టుండి శనివారం రాత్రి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. చదవండి: ప్రాణం తీసిన ప్రేమ పెళ్లి! శనివారం సాయంత్రం ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై వెళ్లిన శ్వేతా చౌదరి దాదాపు 100 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామంలో చెరువు వద్ద ఆగింది. ‘నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను.. మమ్మీ, డాడీ ఐ లవ్ యూ..’ అంటూ తన ఫోన్ ద్వారా వాయిస్ మెసేజ్ పెట్టింది. అనంతరం రాత్రి 9.00 గంటల సమయంలో చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. శ్వేతా వాయిస్ మెసేజ్ చూసిన వెంటనే తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆ వాయిస్ మెసేజ్ ఆధారంగా జగ్గయ్యపేట రూరల్ పరిధిలోని చిల్లకల్లు చెరువు వద్దకు వెళ్లారు. అక్కడ యువతి వాహనాన్ని గుర్తించి, చెరువులో గాలింపు చేపట్టారు. రాత్రి 12.00 గంటల సమయంలో యువతి మృతదేహం చెరువులో లభ్యమైంది. ఆన్లైన్ వేధింపులే కారణమా? శ్వేతా చౌదరికి ఇటీవల ఆన్లైన్లో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. ఆ వ్యక్తి ఆమె ఖాతాకు రూ.90 వేలు పంపి, ఆ మొత్తాన్ని మరో వ్యక్తికి పంపాలని విజ్ఞప్తి చేయటంతో శ్వేతా అతను చెప్పినట్లుగానే ఆ డబ్బును మరో వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేసింది. అయితే, ఇదే అదునుగా ఆ వ్యక్తి శ్వేతాను పలు విధాలుగా వేధింపులకు గురి చేశాడు. తన ఖాతాకు రూ.5 లక్షలు పంపాలని బెదిరిస్తూ మానసికంగా వేధించాడు. అతని వేధింపులు భరించలేకే శ్వేతా ఆత్మహత్య చేసుకుని ఉంటుందని మృతురాలి తండ్రి సోమశేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తెల్లవారితే ఉద్యోగంలో చేరాల్సిన తమ కుమార్తె ఇంతలోనే ఆత్మహత్యకు పాల్పడటంతో తల్లిదండ్రులు నిశ్చేష్టులై విలపిస్తున్నారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
భర్తతో విడాకులు.. మరో వ్యక్తితో రెండో పెళ్లి.. చివరికి ఏం జరిగిందంటే?
నందిగామ(ఎన్టీఆర్ జిల్లా): వివాహిత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన నందిగామ పట్టణ శివారులో బుధవారం జరిగింది. ఎస్ఐ పండు దొర కథనమ మేరకు.. విశాఖపట్నానికి చెందిన తనూజకు గతంలో చందర్లపాడు మండలం మునగాల పల్లి గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహమైంది. అయితే అతనితో విడాకులు తీసుకుంది. 2015లో నందిగామ పట్టణానికి చెందిన షేక్ ఖాదర్‌వలి బాషాను తనుజ వివాహం చేసుకుంది. చదవండి: ఉద్యోగంలో చేరిన పది రోజులకే యువతి మృతి.. ఏం జరిగిందంటే? అప్పటి నుంచి తన పేరుకు ఫరహాన ఫాతిమాగా మార్చుకుంది. పట్టణ శివారు డీవీఆర్ కాలనీలో భర్తతో కలిసి నివసిస్తోంది. ఖాదర్‌వలి బాషా ఓ ప్రైవేట్ డ్రైవింగ్ స్కూల్లో డ్రైవర్‌గా పని చేస్తాడు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. తాను రెండో పెళ్లి చేసుకున్నప్పటి నుంచి తల్లిదండ్రులు తనతో మాట్లాడటం లేదన్న మనస్తాపంతో ఫాతిమా (తనూజ) (35) బుధవారం ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుని మృతి చెందింది. ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
‘ఈ లోకంలో బతకాలని లేదు.. అమ్మా జాగ్రత్త’
గోదావరిఖని: ‘ఈ లోకంలో బతకాలని లేదు.. అమ్మా జాగ్రత్త’ అని సూసైడ్ నోట్ రాసి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉరేసుకుని ఆత్మహత్య చేసు కున్నాడు. గోదావరిఖనిలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకా రం.. స్థానిక ఎల్బీ నగర్‌కు చెందిన శ్రీరాముల అరవింద్(27) సాఫ్ట్వేర్ ఇంజనీర్. కొద్ది కాలం కిందటే అతని తండ్రి చనిపోయారు. అర వింద్ ఇంట్లో తల్లితోనే ఉంటూ.. వర్క్ ఫ్రం హోంచేస్తున్నాడు. సోమ వారం ఉరేసుకుని మృతి చెందాడు. ఇటీవల మరో కంపెనీలో ఉద్యోగం లో చేరిన అతడు, పని ఒత్తిడి తట్టు కోలేకే ఆత్మహత్యకు పాల్పడ్డాడని, ‘ఈ లోకంలో బత కడం ఇష్టం లేకనే చనిపోతున్నా.. అమ్మా జాగ్రత్త’ అని సూసైడ్ నోట్లో పేర్కొన్నాడని పోలీసులు వెల్లడించారు. చదవండి: పెళ్లయిన మూడో రోజే గొంతు కోసుకొని నవ వరుడి ఆత్మహత్య -
భర్త చనిపోవడంతో మరో వ్యక్తితో సహజీవనం.. రాత్రి ఇంటికి వచ్చి..
తడ(చిత్తూరు జిల్లా): మండలంలోని పూడి గ్రామంలో శనివారం రాత్రి ఓ మహిళ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్ఐ జేపీ శ్రీనివాసరెడ్డి కథనం మేరకు.. కోట మండలం చిట్టేడుకు చెందిన గెడి నిరూప(28) 2016లో అదే గ్రామానికి చెందిన కొమ్మ రాజశేఖర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. నాయుడుపేటలో కాపురముంటుండగా 2018లో ఆమె తండ్రి రామయ్య తన అల్లుడు రాజశేఖర్‌ను హత్య చేశాడు. అప్పటి నుంచి తన బిడ్డ ప్రీతితో కలిసి నిరూప తన అత్తమామల దగ్గరకు వచ్చేసింది. ఇటీవల శ్రీసిటీలో ఆమెకు ఉద్యోగం వచ్చింది. ఈ క్రమంలో డక్కిలి మండలానికి చెందిన పరశురామ్‌తో పరిచయం ఏర్పడింది. చదవండి: మచిలీపట్నంలో రెచ్చిపోయిన టీడీపీ నేతలు తర్వాత అతనితో కలిసి పూడి గ్రామంలో సహజీవనం చేస్తోంది. శనివారం రాత్రి ఇంటికి వచ్చిన నిరూప తన నాలుగేళ్ల కుమార్తెకు బిస్కెట్లు పెట్టి అనంతరం చీరతో ఉరేసుకుంది. ఈ విషయం గమనించిన చిన్నారి ఏడుస్తూ ఉండడంతో స్థానికులు అక్కడకు చేరుకున్నారు. అప్పటికే నిరూప మృతి చెందింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూళ్లూరుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిరూప మృతదేహం తీసుకువెళ్లేందుకు ఆమె తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో పోలీసులే అంత్యక్రియలు పూర్తి చేశారు. చిన్నారి ప్రీతిని తాత ఆదినారాయణకు అప్పగించారు. -
కాకినాడ: సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్య
-
కాకినాడ: సర్పవరం ఎస్ఐ గోపాలకృష్ణ ఆత్మహత్య
సాక్షి, కాకినాడ జిల్లా: సర్పవరం ఎస్ఐ గోపాలకృష్ణ ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన ఇంట్లో సర్వీస్ రివ్వాలర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఘటనకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. కాకినాడ జీజీహెచ్ మార్చురీలో ఎస్ఐ గోపాలకృష్ణ మృతదేహన్ని ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు, ఎస్పీ రవీంద్రనాథ్ బాబు పరిశీలించారు. చదవండి: పెళ్లి పీటలపైనే నవ వధువు మృతి.. ఎన్నో అనుమానాలు.. -
విషాదం: మరణంలో కూడా బెస్ట్ ఫ్రెండ్స్‌గానే మిగిలారు..
పెదనందిపాడు(గుంటూరు జిల్లా): వారి తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. పిల్లలను బాగా చదివించాలని తాము పడిన కష్టం పిల్లలు పడకూడదని చదివిస్తున్నారు. స్నేహితులిద్దరు చిన్నప్పటి నుంచి ఒకే గ్రామం, ఒకే పాఠశాల కాకపోయినప్పటికీ ఇంటర్మీడియట్ నుంచి ఒకే కళాశాలలో కలిసి చదువుకుంటున్నారు, ఖాళీ సమయాల్లో తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటూ తమ చదువులు కొనసాగిస్తున్నారు. వారి స్నేహాన్ని చూసి విధికి కన్నుకుట్టిందో ఏమో కాని ఒకరి తర్వాత మరొకరు ఈ లోకాలను, తల్లిదండ్రులను విడిచివెళ్లారు, వారి కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చారు వారే పెదనందిపాడు మండల అబ్బినేనిగుంటపాలెం గ్రామానికి చెందిన కోండే పాటి విజయ్, కాకుమాను మండలం గార్లపాడు గ్రామానికి చెందిన బాలరాజులు. చదవండి: హోటల్ నిర్వాకం.. గుంత పొంగనాల్లో తాగిపడేసిన సిగరెట్ పీకలు వీరివురు పెదనందిపాడులోని పెదనందిపాడు అర్ట్స్ అండ్ సైన్సెస్ కళాశాలలో బీఎస్సీ (కంప్యూటర్స్) మూడవ సంవత్సరం చదువుతున్నారు. ఇంటర్మీడియట్ మొదటి పంవత్సరంలో ఏర్పడిన వీరి స్నేహం కడవరకు నిలిచింది. అందరి దృష్టిలో బెస్ట్ ప్రెండ్స్‌లా ఉన్నారు. మరణంలో కూడా బెస్ట్ ప్రెండ్స్‌గానే మిగిలారు. గార్లపాడు గ్రామానికి చెందిన బాలరాజు ఆదివారం ఇంట్లో ఫ్యాన్‌కు ఊరివేసుకుని చనిపోయాడు, ఈ విషయం తెలిసిన స్నేహితుడు విజయ్ అక్కడకు వెళ్లి బాలరాజు అంత్యక్రియలు అయిపోయేంత వర కు అక్కడే ఉన్నాడు. ఇంటికి వచ్చిన నాటి నుంచి స్నేహితుడితో ఉన్న అనుబంధాలను గుర్తుచేసుకుంటూ కుమిలిపోయాడు. తన స్నేహితుడు లేని లోకంలో తాను ఉండలేనని, తానూ స్నేహితుడు వద్దకు వెళతానని తల్లిదండ్రులతో చెబుతూ బాధపడేవాడు. దీనిపై తల్లిదండ్రులు సర్ది చెబుతూ ధైర్యం చెప్పే వారు. అయితే మంగళవారం మధ్యాహ్నం తల్లిదండ్రులు లేని సమయం చూసి గ్రామంలో వెలుపల ఉన్న చెరువు వద్దకు వెళ్లి చీరతో ఊరివేసుకుని తన స్నేహితుడు వద్దకు వెళ్లిపోయాడు. రెండు రోజుల వ్యవధిలో తమ తరగతి చెందిన ఇద్దరు విద్యార్థులు చనిపోవడంతో కళాశాల సిబ్బంది, విద్యార్థులు దుఃఖసాగరంలో మునిగారు. ఇన్నాళ్లు తమతో స్నేహంగా మెలిగిన ఇద్దరు మరణించడంతో కళాశాల చిన్నబోయింది. బుధవారం సాయంత్రం అబ్బినేనిగుంటపాలెం గ్రామంలో విజయ్ను కడసారి చూడటానికి వచ్చిన స్నేహితులు, బంధువులు, కళాశాల సిబ్బంది శోకసంద్రంలో మునిగారు. తల్లిదండ్రులు, తోబుట్టువులు వేదన వర్ణనాతీతంగా మారింది. స్నేహితులు, బంధువులు, గ్రామస్తుల అశ్రునయనాల మధ్య కడసారి వీడ్కోలు పలికారు. -
మా అమ్మాయిని సూటిపోటి మాటలతో చంపేశారు!
సాక్షి, పలమనేరు: పట్టణంలోని ఓ ప్రయివేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బాలిక ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం ఉద్రిక్తతకు దారితీసింది. సూటిపోటి మాటలు, వేరే పాఠశాలకు మార్చడాన్ని అవమానంగా భావించి తమ కుమార్తె ఉరేసుకుని తనువు చాలించిందని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. వారి కథనం మేరకు.. పట్టణంలోని రాధాబంగ్లా ప్రాంతానికి చెందిన వజీర్ కూతురు నిజ్బా స్థానిక బ్రహ్మర్షి పాఠశాలలో పదోతరగతి చదువుతోంది. టెన్త్ క్లాస్‌లో నిజ్బా, మరో బాలిక టాపర్లుగా పోటీపడి చదువుతున్నారు. పిల్లల మధ్య జరిగే చిన్నపాటి విషయాల కారణంగా తరచూ పాఠశాల బినామీ కరస్పాండెంట్ రమేష్ నిజ్బా తల్లిదండ్రులను చులకనగా మాట్లాడేవాడు. ఈ నేపథ్యంలో నిజ్బా అనారోగ్యం కారణంగా కొన్ని రోజులు బడికి వెళ్లలేదు. తిరిగి స్కూల్‌కు వెళ్లగా ఒకేక్లాస్‌లో ఇద్దరు విద్యార్థినుల మధ్య చదువులో పోటీ కారణంగా ఇబ్బందిగా ఉందని, పరీక్షలు ఇక్కడే రాసినా కొన్నాళ్లు వేరే స్కూల్‌కు పంపుదామని కరస్పాండెంట్ చెప్పినట్లు బాలిక తండ్రి వజీర్ తెలిపాడు. దీంతో రెండ్రోజుల నుంచి రంగబాబు సర్కిల్లోని ఆదర్శ స్కూల్‌కు నిజ్బా వెళ్తోంది. ఇలా ఉండగా మంగళవారం ముభావంగా ఉండడంతో పాఠశాల హెచ్ఎం తండ్రిని పిలిచి బాలికను ఇంటికి పంపించారు. ఇంటికొచ్చిన బాలిక తాను స్కూల్ యూనిఫామ్ మార్చుకుంటానని గదిలోకి వెళ్లి ఎంతసేపటికీ రాకపోవడంతో తండ్రికి అనుమానం వచ్చింది. కిటికీలో నుంచి చూడగా మెడకు చున్నీ చుట్టుకుని వేలాడుతోంది. స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. బాలిక తల్లి నసీమా తన బిడ్డను సూటిపోటి మాటలతో చంపేశారయ్యా అంటూ కన్నీటి పర్యంతమైంది. పలమనేరులో ఉద్రిక్తత తమ కుమారై ఆత్మహత్యకు కారణమైన బ్రహ్మర్షి పాఠశాల కరస్పాండెంట్, టీచర్లను అరెస్టు చేసే దాకా బిడ్డకు అంత్యక్రియలను నిర్వహించమని మృతురాలి కుటుంబీకులు, బంధువులు ఆందోళన చేయడంతో పట్టణంలో ఉద్రిక్తతకు దారితీసింది. మంగళవారం రాత్రి 9 గంటల వరకు స్థానిక రంగబాబు సర్కిల్లో ఆందోళనలకు దిగారు. వీరికి బంధువులు, స్నేహితులు మద్దతు తెలిపారు. బిడ్డ మృతికి కారణమైన కరస్పాండెంట్‌ను, వేరే స్కూల్ విద్యార్థినిని తమ పాఠశాలలో మూడు రోజులు పెట్టుకున్న ఆదర్శ పాఠశాల హెచ్ఎంను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తతలకు దారితీయడంతో పలమనేరు ఇన్చార్జ్ డీఎస్పీ సుధాకర్‌రెడ్డి బాధితులతో మాట్లాడి పరారీలో ఉన్న నిందితులను 24 గంటల్లో అరెస్టు చేస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. ఈ వ్యవహారాన్ని రాజకీయం చేసేందుకు ప్రయత్నించిన స్థానిక టీడీపీ నాయకులను ఆందోళనకారులు అడ్డగించడం గమనార్హం. -
చెయ్యి విరిగి ఇంటి వద్ద ఉంటున్నాడు.. కోడి గుడ్డు కూర వండలేదని..
మెదక్, మనోహరాబాద్(తూప్రాన్): కోడి గుడ్డు కూర వండలేదని యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మనోహరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ రాజుగౌడ్ వివరాల మేరకు.. మండలంలోని రంగాయపల్లి గ్రామానికి చెందిన మస్కూరి నర్సింలు, సుశీల దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు మాములేశ్ (19) ఎనిమిది నెలల క్రితం బైక్ ప్రమాదంలో చెయ్యి విరిగి ఇంటి వద్ద ఉంటున్నాడు. ఎలాంటి పని చేయడం లేదు. మంగళవారం రాత్రి ఇంట్లో కోడి గుడ్డు కూర వండమని తల్లిని అడిగితే ఇంత రాత్రి ఎలా వండాలని అని మందలించింది. దీంతో ఇంట్లో గొడవపడి మాములేష్ బయటకు వెళ్లిపోయాడు. తల్లి సుశీల చుట్టుపక్కల వెతికినా కనిపించలేదు. బుధవారం ఉదయం గ్రామ శివారులో చెట్టుకు ఉరేసుకొని కనిపించాడు. తండ్రి నర్సింలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
'ఒక్క రూపాయి తీయలేదు.. మెంటల్ టెన్షన్ తట్టుకోలేకపోతున్నా'
బంజారాహిల్స్ (హైదరాబాద్): తనపై మోపిన దొంగ అనే ముద్రను భరించలేక ఓ యువకుడు మనస్తాపానికి గురై ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. ఫిలింనగర్‌లోని దీన్‌దయాళ్ నగర్ బస్తీలో నివసించే బొల్లం శివరాం(30) మణికొండలోని రిలయన్స్ జియో మార్ట్ హబ్‌లో పని చేస్తున్నాడు. ఇటీవల ఈ హబ్‌లో రూ. 2 లక్షల నగదు కనిపించలేదు. దీంతో ఇక్కడ పని చేస్తున్న సంతోష్ అనే ఉద్యోగి ఈ నెపాన్ని శివరాంపై మోపాడు. తాను అలాంటి పని చేయలేదని మనస్తాపానికి గురైన శివరాం సూసైడ్ నోట్ రాసి గురువారం సాయంత్రం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రూ.2 లక్షలు కట్టాలంటూ ఒత్తిడి తీసుకురావడమే కాకుండా తనను దొంగ అనడాన్ని భరించలేకపోతున్నానని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ సూసైడ్ నోట్ రాశాడు. తాను ఒక్క రూపాయి కూడా తీయలేదని ఈ మెంటల్ టెన్షన్ తట్టుకోలేకపోతున్నానని పేర్కొన్నాడు. దీంతో మృతుడి భార్య మీనాక్షి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు హబ్ నిర్వాహకుడు సంతోష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (పబ్జీ ఆడొద్దన్నందుకు కుటుంబాన్నే కాల్చేశాడు..!) -
విషాదం: సరిగ్గా చదవడం లేదని మందలిస్తే..
వంగర (శ్రీకాకుళం): మండల పరిధి కొప్పర పంచాయతీ కె.కొత్తవలస గ్రా మానికి చెందిన విద్యార్థిని గొట్టిపల్లి శ్రావణి (17) మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టు సమీపంలో వంగర –రాజాం రోడ్డులో ఉన్న వంతెన పైనుంచి దూకి ఆత్మహత్యకు శుక్రవారం పాల్పడింది. ఎస్ఐ రొంగలి దేవానంద్ వెల్లడించిన వివరాల ప్రకారం.. కొత్తవలస గ్రామానికి చెందిన శ్రావణి విజయవాడ పడమటి రోడ్డులో ఉన్న శ్రీనివాస హైస్కూల్ లో పదో తరగతి చదువుతోంది. ఆమె తల్లిదండ్రులు ఉపాధి కోసం వలస వెళ్లిపోవడంతో అక్కడే చదువుతోంది. ఇటీవలే సంక్రాంతికి సొంతూరు వచ్చారు. చదవండి: (పుట్టిన రోజే ప్రాణాలు పోయాయి) శ్రావణి సరిగ్గా చదవడం లేదని ఇటీవల తల్లిదండ్రులు ఆమెను మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన శ్రావణి శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంట ల సమయంలో ఇంటి నుంచి బయల్దేరి వెళ్లి వంతెన నుంచి నీటిలో దూకేసింది. దీనిపై స్థానిక మత్స్యకారులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. రాజాం అగ్నిమాపక శకటం సిబ్బందికి సమాచారం అందించి మృతదేహాన్ని వెలికి తీశారు. సంఘటనా స్థలాన్ని సీఐ డి.నవీన్‌కుమార్ పరిశీలించారు. మృతదేహాన్ని రాజాం సీహెచ్‌సీకి తరలించారు. తండ్రి గొట్టిపల్లి అప్పలరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. పేదింట విషాదం.. విద్యార్థిని ఆత్మహత్యతో కె.కొత్తవలస గ్రామంలో వి షాద ఛాయలు అలముకున్నాయి. నిరుపేద కుటుంబానికి చెందిన శ్రావణి తల్లిదండ్రులు గొట్టిపల్లి అప్పలరాజు, చిట్టెమ్మలు కొన్నేళ్ల కిందట విజయవాడకు వలస వెళ్లారు. సంక్రాంతికి సొంతూరు వచ్చారు. ఈ లోగా ఈ విషాదం సంభవించడంతో కుటుంబ సభ్యులంతా కన్నీరుమున్నీరయ్యారు. -
బస్సులో పరిచయమైన అమ్మాయితో ప్రేమ.. ఆమె నిరాకరించడంతో..
సాక్షి, అనంతపురం: ప్రేమ విఫలం కావడంతో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. రొళ్ల మండలం జీజీ హట్టి గ్రామానికి చెందిన వరుణ్‌యాదవ్ (17).. మడకశిరలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. కూలి పనులతో కుటుంబాన్ని పోషించుకుంటున్న తల్లి అమ్మజక్క అతి కష్టంపై కుమారుడిని చదివించుకుంటోంది. రోజూ బస్సులో కళాశాలకు వెళ్లి వచ్చే క్రమంలో పరిచయమైన విద్యార్థిని పట్ల ప్రేమ పెంచుకున్న అతను.. ఆమె నిరాకరించడంతో మనస్తాపానికి గురయ్యాడు. చదవండి: (పెళ్లయి ఇద్దరు పిల్లలున్నా ప్రియున్ని మరిచిపోలేదు.. భర్తకు తెలిసి..) గురువారం ఉదయం కళాశాలకు వెళ్లి వస్తానని తల్లితో చెప్పి బయలుదేరిన వరుణ్ యాదవ్.. రొళ్ల సమీపంలోని జాతీయ రహదారి పక్కనే ఉన్న గోవిందప్ప బావి వద్ద చింత చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న మడకశిర సీఐ శ్రీరామ్, గుడిబండ ఎస్ఐ సురేష్ అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, భర్త నిరాదరణకు గురై ఉన్న ఒక్కగానొక్క కుమారుడి ఉజ్వల భవిష్యత్తు కోసం పరితపించిన తల్లి విలపించిన తీరు అందరి చేత కన్నీరు పెట్టించింది. చదవండి: (డ్యూటీకని వెళ్లి.. జీతం తీసుకొని వెళ్లిపోయి.. ఫోన్ చేస్తే..) -
Hyderabad: బ్లాక్ ఫంగస్‌తో కంటి చూపుకోల్పోయిన వ్యక్తి ఆత్మహత్య
రాజేంద్రనగర్ (హైదరాబాద్): కరోనా, బ్లాక్ ఫంగస్‌తో మంచానికే పరిమితమై మనోవేదనకు గురైన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రాజేంద్రనగర్‌పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ కనకయ్య తెలిపిన వివరాల ప్రకారం రాజేంద్రనగర్ ప్రేమావతిపేట ప్రాంతానికి చెందిన నవీన్‌కుమార్(35) యూనివర్సిటీలో కాంట్రాక్టు ఉద్యోగి. ఆయనకు 2017లో వివాహమైంది. ప్రస్తుతం వీరికి రెండు సంవత్సరాల కుమారె సంతానం. 2020 సంవత్సరం మే నెలలో ఆయన కోవిడ్ బారినపడ్డాడు. జూన్ నెలలో బ్లాక్ ఫంగస్ గురయ్యాడు. దీంతో చికిత్స పొందుతూ కంటి చూపు కొల్పొయాడు. కోలుకున్న అనంతరం ఇంటి వద్దే ఉంటున్నాడు. మంచానికే పరిమితమైన నవీన్‌కుమార్ తరచుగా మనోవేదనకు గురయ్యేవాడు. ఈ నెల 13వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. నోట్లో నుంచి నురుగులు వస్తుండడంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఉస్మానియాకు, అక్కడి నుంచి ఈఎస్ఐ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన శనివారం మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (Hyderabad: నగరంలో ఇద్దరు మహిళల అదృశ్యం.. ఫోన్స్ స్విచ్ఛాఫ్) -
వైద్యవిద్యార్థిని ఆత్మహత్య
రాజేంద్రనగర్: ఓ వైద్య విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ కనకయ్య తెలిపిన వివరాల ప్రకారం... తమిళనాడు రాష్ట్రానికి చెందిన సెల్వన్ కుటుంబం వ్యాపార నిమిత్తం 2005వ సంవత్సరంలో నగరానికి వలస వచ్చారు. హైదర్‌గూడ న్యూఫ్రెండ్స్ కాలనీలో ఇల్లు నిర్మించుకుని నివసిస్తున్నారు. సెల్వన్ దంపతులకు వినీషా(21) ఒక్కతే కూతురు. ఆమె మొయినాబాద్‌లోని భాస్కర కళాశాలలో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతోంది. కాగా ఆదివారం మధ్యాహ్నం తన రూమ్‌లోకి వెళ్లిన వినీషా సాయంత్రం 5 గంటల వరకు బయటకు రాలేదు. దీంతో తల్లిదండ్రులు వెళ్లి చూడగా ఉరి వేసుకొని కనిపించింది. స్థానికులు అందించిన సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. నెలరోజులుగా డిప్రెషన్లో ఉంది: తండ్రి తండ్రి సెల్వన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నెల రోజులుగా తమ కుమార్తె డిప్రెషన్లో ఉందని, కాలేజీలోని స్నేహితులతో తరచు మాట్లాడుతూ ఏదో విషయమై బాధపడుతోందని సెల్వన్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతానికి పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వినీషా సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే దానికి లాక్ ఉండడంతో తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. -
అబ్బాయి కన్నా అమ్మాయి పెద్ద.. చివరికి ఏమైందంటే?
సాక్షి, మెదక్: కలిసి జీవించాలని భావించిన వారికి సామాజిక వర్గాలు, వయసులో ఉన్న వ్యత్యాసం అడ్డుపడ్డాయి. దీంతో కలిసి జీవించలేని జీవితంపై విరక్తి పుట్టి బలన్మరణానికి పాల్పడ్డారు. ఈ నెల 5వ తేదీన కనిపించకుండా పోయిన ప్రేమజంట మంజీర నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఇరు కుటుంబాలు శోకసంద్రలో మునిగిపోయాయి. పోలీసుల కథనం మేరకు.. నాగిలిగిద్ద మండలం మాయినెళ్లి గ్రామానికి చెందిన అనిల్ (25)సంగారెడ్డిలోని భగత్‌సింగ్ కాలనీకి చెందిన కష్ణవేణి (28)లు గత ఏడాదిన్నర నుంచి ప్రేమించుకుంటున్నారు. వివాహం చేసుకుందామని ప్రేమ విషయం ఇంట్లో చెప్పారు. అయితే వీరి సామాజిక వర్గాలు, వయసులో వ్యత్యాసం ఉండడంతో ఇరు కటుంబాల పెద్దలు వివాహానికి నిరాకరించారు. ఈ క్రమంలో జనవరి 5న కష్ణవేణి, అనిల్ ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయారు. దీంతో వారి ఆచూకీ కోసం తల్లిదండ్రులు సంగారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదవండి: (నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.. తల్లికి వీడియో కాల్ చేసి..) ఈ నేపథ్యంలో రాయికోడ్ మండలంలోని సిరూర్ గ్రామ సమీపంలో మంజీర నదిపై వంతెన వద్ద ఓ బైక్ అనుమానాస్పదంగా నిలిచి ఉండటాన్ని పలువురు గుర్తించి రాయికోడ్ పోలీసులకు సమాచారం అందించారు. బైక్ నెంబర్ ఆధారంగా సంగారెడ్డిలో తప్పిపోయిన వారు వినియోగించిన బైక్‌గా గుర్తించి నీటిలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం ఓ మృతదేహం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. ఆ మృతదేహాన్ని కుటుంబీకుల సాయంతో కృష్ణవేణిదిగా గుర్తించారు. శనివారం ఉదయం మరో మృతదేహం కొట్టుకురాగా అనిల్‌గా గుర్తించారు. మృతదేహాలను సంగారెడ్డి పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఘటనపైకేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. -
ఏం జరిగిందో.. ఏ కష్టం వచ్చిందో..?
సాక్షి, ఇచ్ఛాపురం (శ్రీకాకుళం): ఏం కష్టం వచ్చిందోగాని వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన మున్సిపాలిటీ పరిధి రత్తకన్న గ్రామం సంతోషం వీధిలో సోమవారం సాయంత్రం చోటుచేసుకోగా.. ఈది జయలక్ష్మి (21) ప్రాణాలు తీసుకుంది. వివరాల్లోకి వెళితే.. జయలక్ష్మికి గత ఏడాది మే నెలలో ఒడిశా రాష్ట్రంలోని కోటిలింగి గ్రామానికి చెందిన మంచాల పితాంబర్‌తో వివాహమైంది. ఈమె తల్లిదండ్రులు చంద్రమ్మ, మోహనరావులు కొన్నేళ్ల క్రితం వివిధ ప్రమాదాల్లో మృతి చెందడంతో సోదరి, సోదరులు ఈది నాగమ్మ, రామయ్యలవద్ద పెరిగింది. ఈమె ఆదివారం సాయంత్రం అత్తవారింటి నుంచి కన్నవారిల్లైన సోదరింటికి వచ్చింది. అయితే ఏం జరిగిందోగాని.. సోమవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో వంటగదిలో సీలింగ్ హుక్‌కి ఉరివేసుకొని మృతి చెందింది. చదవండి: (యువతిపై అత్యాచారం, హత్య.. కట్టెల కోసమని అడవిలోకి వెళ్లగా..) ఇంటికి వచ్చిన సోదరి హుక్‌కి వేలాడుతున్న జయలక్ష్మిని చూసి కేకలు వేయడంతో సమీపంలో ఉన్నవారు అక్కడకు చేరుకొని పోలీసులకు సమాచారమిచ్చారు. కుటుంబ కలహాల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని సోదరి నాగమ్మ ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్ఐ వి.సత్యనారాయణ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
చచ్చిపోతానని చెప్పి..ప్రాణం తీసుకున్నాడు..
శ్రీకాకుళం(హిరమండలం): చచ్చిపోతానని బంధువులకు ఫోన్లో చెప్పిన కొద్దిసేపటికే ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జలుమూరు మండలం పర్లాం మాకివలస గ్రామానికి చెందిన అల్లు చిట్టిబాబు(35) మూడు నెలలుగా హిరమండలం మేజర్ పంచాయితీలోని పాతహిరమండలంలో గృహాన్ని అద్దెకు తీసుకొని ఉంటూ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వీరి దంపతుల మధ్య కొద్ది నెలలుగా వివాదం ఉంది. ఈ క్రమంలోనే రెండు రోజుల కిందట భార్య, పిల్లను కన్నవారి ఇంటికి పంపించేశాడు. ఆత్మహత్య చేసుకుంటున్నానని శుక్రవారం రాత్రి బంధువులకు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో ఆందోళన చెందిన వారు.. విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. వారు శనివారం ఉదయం వెళ్లి చూడగా.. గదిలో ఉన్న ఫ్యాన్‌కు ఉరివేసుకొని చనిపోయి ఉన్నాడు. స్థానిక ఎస్సై ఎం.మధుసూదనరావు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుని భార్య భారతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై చెప్పారు. చదవండి: (బెదిరించి లొంగదీసుకుని.. గిరిజన బాలికలపై లైంగిక దాడి..) -
పెళ్లయ్యాక స్వాతితో పీకల్లోతు ప్రేమ.. ట్యూషన్‌కి వెళ్లి..
సాక్షి, రాయగడ: తమ ప్రేమను పెద్దలు అంగీకరించరన్న మనస్తాపంతో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లా కేంద్రంలోని సొండి వీధిలో మంగళవారం కలకలం రేపింది. ఈ విషయం తెలుసుకున్న అదనపు ఎస్పీ అనంత నారాయణ మహంతి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని, పరిశీలించారు. అనంతరం యువతీ, యువకుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వివరాలిలా ఉన్నాయి.. సొండి వీధికి చెందిన స్వాతి పాత్రో(15), అదే వీధికి చెందిన రాహుల్ కౌసల్య(26) గత కొద్దికాలంగా ప్రేమించుకుంటున్నారు. రాహుల్‌కు ఇదివరకే పెళ్లయి, ఓ కొడుకు ఉండగా, 5 నెలల క్రితం నుంచి అతడి భార్య, కొడుకు గుణుపూర్‌లోని తన అత్తవారింట్లోనే ఉంటున్నారు. ఇంట్లో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న రాహుల్ స్వాతితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడు. ఒకరిపై మరొకరు మరింత ఇష్టం పెంచుకుని పెళ్లి చేసుకోవాలని భావించారు. అయినా పెళ్లయిన వ్యక్తికి మళ్లీ అమ్మాయిని ఎలా ఇచ్చి, పెళ్లి చేస్తారని అనుకున్న వారు చనిపోయేందుకు సిద్ధమయ్యారు. రాహుల్ ఇంట్లోనే ఓ గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని, ఆత్మహత్య చేసుకున్నారు. చదవండి: (భర్త, కుమార్తెను వదిలి ప్రియుడితో వెళ్లిపోయి.. ఆది పరాశక్తి అవతారంలో..) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి.. ఎప్పటిలాగే ఉదయం ట్యూషన్‌కి వెళ్లిన కూతురు ఇంటికి తిరిగి రాకపోవడంతో కంగారుపడిన యువతి తల్లిదండ్రులు ట్యూషన్ మాస్టారు ఇంటికి వెళ్లి, తమ కూతురు ఆచూకీ కోసం అడిగారు. ఈరోజు తను ట్యూషన్‌కు రాలేదని మాస్టారు చెప్పడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు గ్రామస్తుల సమాచారం మేరకు అదే వీధిలోని రాహుల్ ఇంటికి వెళ్లారు. ఇంటి తలుపులు మూసి ఉండడంతో అనుమానంతో తలుపులు పగలగొట్టి చూశారు. ఈ క్రమంలో ఫ్యాన్‌కు వేలాడుతున్న స్వాతి, రాహుల్ కనిపించారు. అప్పటికే చనిపోయిన స్వాతిని చూసి ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. కొనఊపిరితో ఉన్న రాహుల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రేమజంట ఆత్మహత్యపై దర్యాప్తు చేపడుతున్నారు. చదవండి: (పెళ్లి బాజా మోగాల్సిన ఇంట విషాదం.. ఓ ప్రబుద్ధుడు పెళ్లి చెడగొట్టడంతో) -
పుట్టింటికి వెళ్లిన భార్య.. బాధతో భర్త.. చివరికి విషాదం..
పెనమలూరు(కృష్ణా జిల్లా): భార్య పుట్టింటికి వెళ్లిందని మనస్తాపంతో భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెనమలూరుకు చెందిన పోలగాని నాగరాజు(25)కు అదే గ్రామానికి చెందిన బంకా కృపతో వివాహమైంది. శుక్రవారం వడ్లు కాటా వేసే పనికి వెళ్లిన నాగరాజు రాత్రి ఇంటికి చేరాక భార్యతో గొడవ పడ్డాడు. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లింది. విషయం తెలిసిన నాగరాజు తండ్రి రాంబాబు కొడుకు ఇంటికి వచ్చి చూడగా నాగరాజు ఉరేసుకుని మృతి చెంది ఉన్నాడు. ఈ ఘటనపై అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు సీఐ ఎం.సత్యనారాయణ తెలిపారు. చదవండి: సోడా తాగి వస్తా.. ఇంట్లో నుంచి వెళ్లిన వివాహిత అదృశ్యం -
Lovers Commit Suicide: ప్రేమ జంట ఆత్మహత్య
సాక్షి, చెన్నై: అంబత్తూరు రైల్వే స్టేషన్ మూడో ప్లాట్ ఫాంలో సోమవారం ఉదయం ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడి ఓ జంట ఆత్మహత్యచేసుకోవడం ప్రయాణికుల్ని ఆందోళనకు గురి చేసింది. ఆవడిమ రైల్వే ఎస్ఐ కమల కన్నన్, సిబ్బంది అక్కడికి చేరుకుని మృత దేహాల్ని పోస్టుమార్టంకు తరలించారు. విచారణలో ఆ యువకుడు తిరువణ్ణామలైకు చెందిన జయకుమార్(25)గా తేలింది. ఆ యువతి వేలూరు శివారులోని ఆంధ్రా సరిహద్దు ప్రాంతానికి చెందిన శరణ్యగా గుర్తించారు. ఈ ఇద్దరు చెన్నైలో పనిచేస్తున్నట్టు, ప్రేమలో పడ్డ ఈ జంటను విడదీయడానికి కుటుంబీకులు ప్రయత్నించినట్టు విచారణలో వెలుగు చూసింది. తమ ప్రేమను పెద్దలు అంగీకరించక పోవడంతో బలవన్మరణానికి పాల్పడి ఉండొవచ్చు అని పోలీసులు నిర్ధారించారు. ప్రియుడి మృతితో.. తనువు చాలించింది తిరుపత్తూరు జిల్లా ఆంబూరుకు చెందిన పుదుపేటకు చెందిన రమణన్(21), అదే ప్రాంతానికి చెందిన ఓ బాలిక కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఆదివారం ప్రియుడితో ప్రియురాలు గొడవ పడింది. మనస్తాపం చెందిన రమణన్ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సమాచారం అందుకున్న ఈ ప్రియురాలు ఇంటి నుంచి బయటకు వెళ్లి పోయింది. ఆమె కోసం రాత్రంతా కుటుంబీకులు గాలించారు. అయితే ఉదయాన్నే మృతదేహం సమీపంలోని రైలు పట్టాల మీద గుర్తించారు. రైలు ఢీకొనడంతో ఆ బాలిక శరీరం చిద్రమైంది. తండ్రి మందలించాడని.. న్యూ వాషర్ మెన్ పేటకు చెందిన కందన్ కుమార్తె మేనక (19) అత్యధిక సమయం సెల్ ఫోన్‌తోనే గడిపేది. దీంతో ఆమెను సోమవారం తండ్రి మందలించాడు. తీవ్ర మనస్తాపానికి గురైన మేనక ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. -
ఊరి చివర పాడుబడిన బావిలో పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య
సాక్షి, తిరువొత్తియూరు (చెన్నై): కుటుంబ కలహాలతో ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన విరుదునగర్‌లో చోటుచేసుకుంది. తమ్మనాయకన్ పట్టి రోడ్డుకు చెందిన రైతు శివకుమార్, లక్ష్మీ ప్రియ దంపతులకు కుమార్తె దర్శని ప్రియా (9), కుమారుడు శివ షణ్ముగ వేల్ (5) ఉన్నారు. లక్ష్మీ ప్రియాను శివకుమార్ అనుమానించడంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఆదివారం మరోసారి గొడవ పడ్డారు. మనస్తాపం చెందిన లక్ష్మీ పిల్లలను తీసుకుని బయటకు వెళ్లింది. బంధువులు, గ్రామస్తులు గాలింపు చర్యలు చేపట్టారు. ఊరి చివరనున్న పాడుబడిన వ్యవసాయ బావిలో లక్ష్మీప్రియ, ఇద్దరు పిల్లల మృతదేహాలను గుర్తించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మృతదేహాలను బయటకు తీశారు. వత్సకారపట్టి పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. చదవండి: (కరోనా కాటుకు బలి.. తీరిగ్గా 15 నెలల తర్వాత సమాచారం.. తీరని క్షోభ) -
ఆర్టీసీ బస్సులో ప్రేమజంట ఆత్మహత్య
-
తెలంగాణ ఆర్టీసీ బస్సులో ప్రేమజంట ఆత్మహత్య
అశ్వారావుపేట రూరల్/చండ్రుగొండ: పాఠశాలకని వెళ్లిన బాలిక అదృశ్యమై రెండురోజుల తర్వాత విగతజీవిగా కనిపించింది. ఆమెతోపాటు ఆటోడ్రైవర్ కూడా బలవన్మరణానికి పాల్పడటం పలు అనుమానాలకు తావిస్తోంది. అప్పటికే పెళ్లి అయి ఇద్దరు పిల్లలున్న ఆటోడ్రైవర్, ఆ బాలికను ప్రేమపేరిట మభ్యపెట్టినట్లు తెలుస్తోంది. భద్రాద్రికొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం సీతాయిగూడెంకి చెందిన మాయర సర్వేష్ – కృష్ణవేణి దంపతుల పెద్ద కుమార్తె అనూష(14) స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. అదే గ్రామానికి చెందిన పోరల్ల జగ్గారావు(28) ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. గ్రామానికి చెందిన పలువురితో కలసి అనూష కూడా జగ్గారావు ఆటోలో పాఠశాలకు వెళ్లివచ్చేది. ఈ క్రమంలోనే అతడు ప్రేమపేరిట మాయమాటలు చెప్పి ఆమెను వశపర్చుకున్నట్లు సమాచారం. సోమవారం రోజులాగే పాఠశాలకు వచ్చిన ఆమె మధ్యాహ్న భోజన సమయంలో బయటకు వెళ్లి తిరిగిరాలేదు. అయితే, అప్పటికే పాఠశాల బయట వేచి ఉన్న జగ్గారావు ఆమెను తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో వారు అశ్వారావుపేట ఆర్టీసీ బస్టాండ్‌కు వచ్చి కొత్తగూడెం డిపో బస్సు ఎక్కి కూర్చున్నారు. కొద్దిసేపటి తర్వాత వారిద్దరూ పురుగుల మందు తాగి వాంతులు చేసుకుంటూ కనిపించడంతో బస్సు డ్రైవర్, కండక్టర్ వెంటనే పోలీసులు, అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్ రాక ఆలస్యం కావడంతో బస్సులోనే వారిద్దరిని అశ్వారావుపేట ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్న క్రమంలోనే పరిస్థితి విషమించి ఇద్దరూ మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
విషాదం: భర్తతో గొడవ.. పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య
తిరువొత్తియూరు(తమిళనాడు): కుటుంబ కలహాలతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈరోడ్ జిల్లా కొడుముడి, కోనావల్లి సమీపంలోని వీరవన్నై కాటూరుకు చెందిన ప్రభుశంకర్ (36). రైతు. భార్య శశికళ (33). వీరికి కుమారుడు నిఖిన్‌శంకర్ (12), కుమార్తె సుదర్శన (10) ఉన్నారు. సోమవారం రాత్రి భార్య, భర్త మధ్య గొడవ జరిగింది. మంగళవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో శశికళ, కుమారుడు, కుమార్తె విష మాత్రలు తిని స్పృహతప్పి పడిపోయారు. వారిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ముగ్గురూ అదే రోజు మృతి చెందారు. దీనిపై మలయం పాళయం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
బయటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి.. భర్త ఒక్కసారిగా షాక్
కర్నూలు: మండలంలోని సూదిరెడ్డిపల్లె సమీపంలోని స్కంద వెంచర్లో నివాసం ఉంటున్న ఓ వివాహిత కుటుంబ కలహాల కారణంగా ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బనగానపల్లెకు చెందిన మధుమోహన్‌కు కర్నూలుకు చెందిన జోత్స్న (28)తో పదేళ్ల క్రితం వివాహమైంది. మధుమోహన్ హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఇంజినీరుగా ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవలే స్కంద వెంచర్లో నూతన గృహం కొనుగోలు చేసి భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. కుటుంబ కలహాల కారణంగా భార్యాభర్తలు గొడవపడ్డారు. ఆదివారం ఉదయం భర్త బయటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంట్లో ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించింది. కిందికి దించేసరికి ఆమె అప్పటికే మరణించింది. కర్నూలు అర్బన్ తాలుకా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: వ్యభిచారం చేయకపోతే చంపేస్తామంటూ... వ్యభిచార గృహంపై పోలీసుల దాడి -
బ్లాక్ ఫంగస్ భయం: మగ్గానికి ఉరేసుకున్న బాధితుడు
దొడ్డబళ్లాపురం: బ్లాక్ ఫంగస్ ఉన్నట్లు బయట పడటంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. దొడ్డబళ్లాపురంలోని విద్యానగర్‌లో నివసిస్తున్న రవీంద్ర (58) మరమగ్గం కార్మికుడు. ఈయన కరోనాకు గురై బాగేపల్లిలోని కోవిడ్ కేర్ సెంటర్లో చికిత్స తీసుకున్నాడు. రోగ లక్షణాలు ఎక్కువ కనిపించడంతో వైద్య పరీక్షలు చేయించగా బ్లాక్‌ఫంగస్ ఉన్నట్లు తేలింది. దీంతో అతన్ని బెంగళూరు విక్టోరియాకు తరలించారు. అక్కడ వైద్య సిబ్బందితో గొడవపడి తిరిగివచ్చిన రవీంద్ర గురువారం రాత్రి మగ్గం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అధికారులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి దహనం చేయడానికి నగరసభ అధికారులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది. మగ్గానికి వేలాడుతున్న రవీంద్ర -
అనంతపురం: పెనుకొండలో అన్నాచెల్లెళ్లు ఆత్మహత్య
-
విషాదం: అన్న, ఇద్దరు చెల్లెళ్లు ఆత్మహత్య
అనంతపురం: అన్నాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకోవడం పెనుకొండలో విషాదం నింపింది. ఒకేరోజు ముగ్గురు విష పదార్థం సేవించి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెనుకొండలోని పదవీ విరమణ పొందిన బ్యాంక్ ఉద్యోగి అశ్వర్థప్ప (65) నివాసంలో దుర్వాసన వస్తోంది. దీంతో స్థానికులు స్పందించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి పరిశీలించగ అశ్వర్థప్ప, అతడి ఇద్దరు సోదరిలు విగతజీవులుగా పడ్డారు. అయితే వారు కొన్నిరోజుల కిందట విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఘటనపై పెనుకొండ పోలీసులు సమగ్ర విచారణ చేపట్టారు. అయితే వారు ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డారో అనే విషయం ఇంకా తెలియరాలేదు. -
అక్క ఆత్మహత్య.. తట్టుకోలేక హార్పిక్ తాగిన చెల్లెలు
సాక్షి, ఆదిలాబాద్: ఆవేశంలో అక్క ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోగా.. చెల్లెలు అక్క మృతిని తట్టుకోలేక టాయిలెట్ క్లీనర్ ద్రావణం తాగేసి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. అక్క మృతి చెందగా చెల్లెలు కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతోంది. ఈ విషాద సంఘటన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సంజయ్ నగర్లో చోటుచేసుకుంది. అయితే వారు ఆత్మహత్యకు పాల్పడడానికి కారణం కుటుంబ కలహాలేనని తెలుస్తోంది. . ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. సంజయ్‌నగర్‌లో ఉంటున్న అక్క రేఖశ్రీ మంగళవారం ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆత్మహత్యతో అక్క మృతి చెందడంతో ఆమె చెల్లెలు దీపశ్రీ తట్టుకోలేకపోయింది. అక్క మృతిని కళ్లారా చూసినా దీప తాను కూడా చచ్చిపోతానని బాత్రూమ్లో ఉండే టాయిలెట్ క్లీనర్ తాగేసింది. ఇది గమనించిన కుటుంబసభ్యులు వెంటనే దీపశ్రీని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం దీప పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. అయితే ఈ విషాదానికి కారణం కుటుంబ కలహాలేనని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. చదవండి: నా భార్యకు భర్తగా కొడుకు పేరా? -
ఆడపడుచుతో గొడవ: పిల్లలతో బావిలో దూకిన తల్లి
పెద్దపల్లి రూరల్: కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం మూడు నిండుప్రాణాలను బలిగొంది. పెద్దపల్లి జిల్లా నిమ్మనపల్లి గ్రామంలో బుధవారం ఈ సంఘటన వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని దేవగూడకు చెందిన ఎతిరాజు స్వామి కుటుంబం పెద్దపల్లి మండలం నిమ్మనపల్లి గ్రామానికి వచ్చి స్థిరపడింది. స్వామికి «జూలపల్లి మండలం అబ్బాపూర్ గ్రామానికి చెందిన మమత (27) తో వివాహం జరిగింది. వీరికి శివకృష్ణ (3), శ్రీకృతి (14 నెలలు) సంతానం. స్వామి తోబుట్టువు పద్మ భర్త చనిపోవడంతో ఆమె వీరి వద్దే ఉంటోంది. ఆడపడుచు పద్మతో స్వామి భార్య మమతకు తరచూ గొడవలు జరిగేవి. మంగళవారం స్వామి కూలిపనికి వెళ్లిన తర్వాత ఏదో విషయమై ఆడపడుచుతో గొడవపడ్డ మమత తన ఇద్దరు పిల్లలతో బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. స్వామి ఇంటికి వచ్చిన తర్వాత భార్యాపిల్లలు కనపడక పోవడంతో పద్మను అడగ్గా తనకు తెలియదని చెప్పింది. తర్వాత అత్తింటివారిని, బంధువులను ఫోన్ ద్వారా అడిగి తెలుసుకోగా, తమ వద్దకు రాలేదని చెప్పారు. బుధవారం ఉదయం వారిని వెతికేందుకు బయల్దేరేలోగా మృతదేహాలు సమీపంలోని బావిలో తేలాయని తెలియడంతో హతాశులయ్యారు. ఈ సమాచారం అందడంతో డీసీపీ రవీందర్, ఏసీపీ నితికపంత్, సీఐ ప్రదీప్.. సిబ్బందితో వెళ్లి మృతదేహాలను వెలికి తీయించారు. కాగా, తమ కూతురు అత్తింటివారి వేధింపులతోనే ఆత్మహత్య చేసుకుందని మమత కుటుంబ సభ్యులు ఆరోపించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నామని డీసీపీ తెలిపారు. -
షాకింగ్: కరోనా సోకిందని సూటిపోటి మాటలు.. ఆత్మహత్య
తాండూరు: కరోనా వైరస్ సోకిందని స్థానికులు సూటిపోటి మాటలతో వేధించడంతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి రైలు కింద పడి ప్రాణం తీసుకున్నాడు. అంత్యక్రియలు చేసేందుకు కుటుంబీకులు, బంధువులు ముందుకు రాకపోవడంతో తాండూరు యూత్ అసోసియేషన్ సభ్యులు మానవత్వం చాటుకున్నారు. అందరి హృదయాలను కలచివేసే ఈ సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరులో జరిగింది. వివరాలు.. తాండూరులోని సీతారాంపేట్‌కు చెందిన హన్మంత్ (31)కు ఈశ్వరితో పదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. చెరుకు బండి నడిపిస్తూ హన్మంత్ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడిన ఆయన ఈనెల 11వ తేదీన కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. దీంతో హన్మంత్ హోం క్వారంటైన్లోకి వెళ్లాడు. స్థానికుల సూటిపోటి మాటలతో హన్మంత్‌ను వేధించసాగారు. తన నుంచి కరోనా కుటుంబానికి కూడా సోకుతుందేమో అనే భయంతో శుక్రవారం అర్ధరాత్రి హన్మంత్ ఇంట్లోంచి బయటకు వెళ్లాడు. అనంతరం తాండూరు- కొడంగల్ రోడ్డు మార్గంలోని రైల్వే బ్రిడ్జి వద్దకు వెళ్లి రైలు వస్తోండగా ఎదురుగా వెళ్లాడు. దీంతో రైలు ఢీకొని మృతదేహాన్ని 200 మీటర్ల వరకు లాకెళ్లడంతో పూర్తిగా ఛిద్రమైంది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ కృష్ణయ్య హన్మంత్ మృతదేహాన్ని తాండూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ముందుకు రాకపోవడంతో కరోనా వైరస్ సోకి ఆత్మహత్య చేసుకున్న హన్మంత్ మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు కుటుంబీకులు, బంధువులు ముందుకురాలేదు. కుటుంబీకుల సమాచారంతో తాండూరు యువజన సంఘం సభ్యులు మానవత్వంతో ముందుకు వచ్చారు. అంబులెన్స్‌లో మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. చదవండి: ఘోరం నలుగురు కరోనా రోగులు సజీవ దహనం -
డబ్బుల్లేక భార్యతో గొడవ.. కూతుళ్లతో విషం తాగి
సదాశివపేట రూరల్ (సంగారెడ్డి): తీవ్ర ఆర్థిక కష్టాలు ఎదురవడంతో పిల్లలను పోషించలేక వారికి కూల్‌డ్రింక్‌లో విషం కలిపి నవ్వుతూ తాగండర్రా అంటూ చెప్పి ఆపై ఆయన కూడా తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. అయితే తాగిన వెంటనే తప్పు చేశామని భావించి వెంటనే ఈ విషయాన్ని తన కుటుంబసభ్యులకు చెప్పాడు. వాళ్లు వెంటనే ఆస్పతత్రికి తరలించడంతో ఇద్దరు ప్రాణాలు దక్కగా ఒకరి ప్రాణం పోయింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలో చోటుచేసుకుంది. ఆత్మకూర్ గ్రామానికి చెందిన శివకుమార్, లలిత భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమార్తెలు నవ్యశ్రీ (4), సిరి (5) ఉన్నారు. వీరు హైదరాబాద్‌లో నివసిస్తుండేవారు. అయితే ఇటీవల ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. గురువారం మళ్లీ గొడవ జరగడంతో భర్త శివకుమార్ పిల్లలను తీసుకుని హైదరాబాద్ నుంచి స్వగగ్రామం ఆత్మకూర్‌కు వచ్చాడు. రాత్రి కూల్‌డ్రింక్స్‌లో విష గుళికలు కలిపేశాడు. పిల్లలకు తాగించిన అనంతరం ఆయన కూడా తాగాడు. అనంతరం బయటకు వెళ్లి శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు ఇంటికి వచ్చి చూడగా పిల్లలు అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. దీంతో ఆందోళన చెందిన శివకుమార్ వెంటనే తాను చేసిన పనిని కుటుంబసభ్యులకు చెప్పాడు. వెంటనే కుటుంబసభ్యులు పిల్లలను, అతడిని ఆస్పతత్రిలో చేర్పించారు. అయితే అప్పటికే నవ్యశ్రీ మృతి చెందింది. సిరి, శివకుమార్ ప్రాణాపాయంతో ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్నారు. తండ్రి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సంతోశ్‌కుమార్ తెలిపారు. చదవండి: సెల్ఫీ తీసుకుంటూ ఫోన్‌తో నీటిలోకి కొట్టుకుపోయిన బాలుడు -
ప్రాణం తీసిన పబ్జీ..
సాక్షి, కుల్కచర్ల: పబ్జీ గేమ్ కారణంగా ఓ బాలుడు ప్రాణాలు తీసుకున్నాడు. ఫోన్ ఎక్కువగా వాడొద్దని తండ్రి మందలించడంతో మనస్తాపం చెందిన అతడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలోని బండవెలికచర్లలో గురువారం చోటుచేసుకుంది. ఉప్పరి అనంతయ్య దంపతులు కుల్కచర్లలో పండ్లు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వీరి చిన్న కుమారుడు ఓంకార్ (15) స్థానిక ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. కరోనా నేపథ్యంలో ఆన్లైన్ తరగతులు కొనసాగుతున్నాయి. దీంతో అనంతయ్య అప్పు చేసి మరీ మూడు నెలల క్రితం కొడుకు కోసం సెల్‌ఫోన్ కొన్నాడు. బాలుడు నిత్యం ఆన్లైన్ తరగతుల పేరుతో పబ్జీ గేమ్ ఆడుతూ దానికి బానిసయ్యాడు. ఈ విషయం గమనించిన అనంతయ్య గురువారం కుమారుడిని మందలించాడు. ఎప్పుడూ ఫోన్‌తోనే ఉంటున్నావని.. కేవలం ఆన్లైన్ క్లాసులున్నప్పుడే వినాలని చెప్పాడు. ఫోన్ ఎక్కువగా వాడితే ఆరోగ్యం పాడవుతుందన్నాడు. దీంతో మనస్తాపం చెందిన ఓంకార్ ఇంట్లో చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విఠల్‌రెడ్డి తెలిపారు. -
విషాదం: నీ వెంటే మేమూ!
సాక్షి, చెన్నై: భర్త మరణించి ఏడాది అవుతున్నా ఆయన జ్ఞాపకాలు వెంటాడటంతో బతుకు భారమై ఓ భార్య ఆత్మాహుతి చేసుకుంది. వెళ్తూ..వెళ్తూ ఇద్దరు ఆడ బిడ్డలను హతమార్చింది. కన్యాకుమారి జిల్లా నాగర్ కోయిల్‌కు చెందిన రంజిత్‌కుమార్ (32), రాశి(30) దంపతులకు అక్షయ(5), అనుçసయ(3) ఉన్నారు. మెడికల్ ఏజెన్సీ నడుపుతూ వచ్చిన రంజిత్ కుమార్ గత ఏడాది అనారోగ్యంతో మరణించాడు. దీంతో తన ఇద్దరు పిల్లలతో కలిసి అత్త చంద్ర, మామ రామదాసు ఇంట్లో రాశి ఉంటున్నారు. రెండు రోజుల క్రితం రంజిత్‌కుమార్ సంవత్సరికం జరిగింది. ఆ రోజు నుంచి తీవ్ర మనోవేదనతో ఉంది. (చదవండి: భార్యను చంపి శవంతో స్కూటీపై 10 కి.మీ) ఈ క్రమంలో సోమవారం స్నానపు గది నుంచి వాసన రావడంతో అత్త చంద్ర వెళ్లి పరిశీలించింది. రాశి సజీవ దహనమై కనిపించింది. అనంతరం గదిలోకి వెళ్లి పిల్లలను చూడగా విగత జీవులుగా పడివున్నారు. నాగర్ కోయిల్ డీఎస్పీ వేణుగోపాల్, ఇన్స్పెక్టర్ సాయిలక్ష్మి సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఇంట్లో రాశి రాసిపెట్టిన లేఖ బయట పడింది. తన అన్నలు, వదినమ్మలకు ఆ లేఖ రాస్తూ, తనను క్షమించాలని.. సంవత్సరికం కోసం ఎదురు చూశానని, ఆ తంతంగం ముగిసిందని, అందుకే తన పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నట్టు పేర్కొనడం ఆ కుటుంబాన్ని తీవ్ర శోకసంద్రంలో ముంచింది. (చదవండి: బట్టతల దాచి పెళ్లి చేసుకున్నాడని..) -
లావణ్య కథ..!
-
ఇక భరించలేను.. ఉండలేను!
శంషాబాద్: రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (ఆర్జీఐఏ) పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ పైలట్ భార్య ఆత్మహత్య చేసుకుంది. భర్త ప్రవర్తనతో విసిగి.. ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వీడియో తీసి ఫేస్బుక్లో పోస్టు చేసింది. సీఐ విజయ్‌కుమార్ తెలిపిన ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా దర్శికి చెందిన వెంకటేశ్వర్రావు, అదే జిల్లా అద్దంకికి చెందిన లావణ్య లహరి ప్రేమించుకుని, పెద్దల అంగీకారంతో 2012లో పెళ్లి చేసుకున్నారు. వెంకటేశ్వర్రావు ఓ ప్రైవేటు ఎయిర్‌లైన్స్‌లో పైలట్. లావణ్య సాఫ్ట్వేర్ ఇంజనీర్. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని సీఎస్కే విల్లాలో ఉంటున్నారు. వీరికి సంతానం కలగలేదు. వెంకటేశ్వర్రావు కొంతకాలంగా మరో మహిళతో చనువుగా ఉండటంతో పాటు సంతానం కలగలేదనే వేధింపులు పెరగడంతో లహరి మనస్తాపం చెందింది. గురువారం రాత్రి కూడా ఇదే విషయమై దంపతులు గొడవపడ్డారు. చచ్చే వరకు ప్రేమించాలనుకున్నా.. భర్త ప్రవర్తన మారడం లేదని, వేరే మహిళతో కలిసి తిరుగుతున్నాడనే ఆవేదనతో లావణ్య సూసైడ్ నోట్ రాసింది. ఓ సెల్ఫీ వీడియోలోనూ తన ఆవేదనను వ్యక్తం చేసింది. ‘ప్రేమించడమంటే చచ్చేవరకు ప్రేమించాలన్న నమ్మకంతో ఇంతకాలం గడిపాను. గృహహింస కేసు పెట్టమన్నారు. కానీ, వాడిని ఇప్పటికీ ప్రేమిస్తున్నాను.. వాడి పాపాలతో వాడే పోతాడు.. కానీ అతని ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రావట్లేదు.. వేరే మహిళతో తిరిగి వస్తున్న వ్యక్తికి సేవలు చేసే దౌర్భాగ్యమేంటి. నా లోపాలను సరిదిద్దుకున్నాను. వాడు మాత్రం తను చేసింది తప్పుగానే గుర్తించట్లేదు. ఇలాంటి వాడికి సేవలు చేసే కర్మేంటి నాకు.. ఇక భరించలేను. ఉండలేననే నిర్ణయం ఈ రోజు తీసుకుంటున్నాను’ అని సెల్ఫ్ వీడియో తీసి ఫేస్బుక్లో పెట్టింది. అర్ధరాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. భర్త వెంకటేశ్వర్రావును అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. తమ కూతురిని వెంకటేశ్వర్రావు హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని లావణ్య తండ్రి ఈశ్వరయ్య ఆరోపించారు. పెళ్లి జరిగిన నాటి నుంచి అనేక రకాలుగా వేధించాడని, తమ నుంచి లక్షల రూపాయలు దండుకున్నాడన్నారు. అతడి పైలట్ లైసెన్స్‌ను రద్దు చేసి, కఠినంగా శిక్షించాలని కోరారు. -
టిక్‌టాక్‌లు చూడొద్దన్నందుకు యువతి ఆత్మహత్య
ఉప్పల్(హైదరాబాద్): టిక్‌టాక్‌తోపాటు వీడియో గేమ్‌లు ఆడవద్దన్నందుకు మనస్తాపం చెందిన యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గురువారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. రా మంతాపూర్ అరవింద్ కాలనీ వీధి–2లో ఉండే కనుపూర్తి రాజ లింగం ఫుట్‌వేర్ వర్క్‌షాపు నిర్వాహకు డు. ఇతనికి ముగ్గురు కూతుళ్లు. రెండో కూతురు దీపిక (17) పాలిటెక్నిక్ మొదటి ఏడాది చదువుతోంది. తరచూ ఫోన్లో టిక్‌టాక్‌లు చూస్తూ, వీడి యోగేమ్‌లు ఆడుతూ సమయం వృథా చేస్తుండటం తో తల్లి మందలించింది. దీంతో మనస్తాపం చెందిన దీపిక గదిలోకి వెళ్లి తలుపులేసుకుంది. ఎంతకూ బయటకు రాకపోవడంతో అనుమానంతో కుటుంబ సభ్యులు తలుపులు విరగ్గొట్టి చూడగా గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఉంది. వెంటనే దించి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీ సులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వైఎస్సార్ జిల్లాలో విషాదం..
సాక్షి, కడప: వైఎస్సార్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు కుమార్తెలతో కలిసి తండ్రి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గోపవరం మండలం శ్రీనివాసపురంలో జరిగింది. గ్రామానికి చెందిన బాలకొండయ్య, కుమార్తెలు భావన, శోభనలు బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు వెల్లడించిన వివరాలు ప్రకారం.. చిన్న కొండయ్య భార్య గతంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో.. ఇద్దరు కుమార్తెలతో కలిసి బాలకొండయ్య ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడటంతో గ్రామంలో విషాదం నెలకొంది. బావి నుంచి మృతదేహాలను వెలికితీయడానికి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. -
పది రోజుల్లో పెళ్లి.. యువకుడి ఆత్మహత్య
పలమనేరు: మరో పదిరోజుల్లో పెళ్లి చేసుకోవాల్సిన ఆ యువకుడు విషపు గుళికలు తిని ఆత్మహత్య చేసుకున్నాడు. పెళ్లి సరుకులు తీసుకొస్తానని బుధవారం వెళ్లిన ఆ యువకుడు యోగేశ్ ఆదివారం అటవీ ప్రాంతంలో శవమై కనిపించడం చిత్తూరు జిల్లా పలమనేరు మండలం టి.వడ్డూరులో విషాదం నింపింది. గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ వేమన్నకు అశోక్, యోగేశ్ కుమారులు. పదేళ్ల కిందట అశోక్ పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీన్ని తట్టుకోలేని అతడి తల్లి రాజమ్మ కూడా అదేరోజు పురుగుమందు తాగి ప్రాణాలు తీసుకుంది. తరువాత వేమన్న రెండో వివాహం చేసుకున్నారు. అన్న, తల్లి మృతితో మానసికంగా ఇబ్బందిపడిన యోగేశ్.. తరువాత బెంగుళూరు వెళ్లి ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఇటీవల అతడికి వి.కోట మండలం తోటకనుమ గ్రామానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. ఇంటికి వచ్చి పెళ్లిపనుల్లో నిమగ్నమైన యోగేశ్‌కు, అతడి సవతితల్లికి ఇంటి పెయింటింగ్ విషయమై గత బుధవారం వివాదం జరిగింది. దీంతో తీవ్రంగా కలత చెందిన అతడు అదేరోజు తన తండ్రితో బెంగళూరులో పని ఉందని చెప్పి కొత్తగా కొన్న బుల్లెట్ మీద వెళ్లాడు. గ్రామానికి సమీపంలోని కొత్త చెరువు వద్ద నల్లక్కబాయి అటవీ ప్రాంతంలో బుల్లెట్‌ను, విషపుగుళికలను ఆదివారం గుర్తించిన పెంగరగుంట వాసులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి వచ్చిన పోలీసులు పరిశీలించి సమీపంలో యోగేశ్ మృతదేహాన్ని గుర్తించారు. అతడు నాలుగు రోజుల కిందటే ప్రాణాలు తీసుకున్నట్లు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.