
సాక్షి, తిరువొత్తియూరు (చెన్నై): కుటుంబ కలహాలతో ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన విరుదునగర్లో చోటుచేసుకుంది. తమ్మనాయకన్ పట్టి రోడ్డుకు చెందిన రైతు శివకుమార్, లక్ష్మీ ప్రియ దంపతులకు కుమార్తె దర్శని ప్రియా (9), కుమారుడు శివ షణ్ముగ వేల్ (5) ఉన్నారు. లక్ష్మీ ప్రియాను శివకుమార్ అనుమానించడంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి.
ఆదివారం మరోసారి గొడవ పడ్డారు. మనస్తాపం చెందిన లక్ష్మీ పిల్లలను తీసుకుని బయటకు వెళ్లింది. బంధువులు, గ్రామస్తులు గాలింపు చర్యలు చేపట్టారు. ఊరి చివరనున్న పాడుబడిన వ్యవసాయ బావిలో లక్ష్మీప్రియ, ఇద్దరు పిల్లల మృతదేహాలను గుర్తించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మృతదేహాలను బయటకు తీశారు. వత్సకారపట్టి పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
చదవండి: (కరోనా కాటుకు బలి.. తీరిగ్గా 15 నెలల తర్వాత సమాచారం.. తీరని క్షోభ)
Comments
Please login to add a commentAdd a comment