mother and children
-
కడపలో తల్లీతనయుల అదృశ్యం!
కడప అర్బన్ : కడప నగరం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో తల్లీ, ఇద్దరు కుమారులు అదృశ్యమయ్యారు. వివరాలు ఇలా.. సాధుచెంగన్న వీధికి చెందిన షేక్ ఫర్హత్ అంజుమ్‌కు(35), బెల్లంమండివీధిలో నివాసం ఉంటున్న షేక్ అల్తాఫ్తో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు షేక్ అబ్దుల్లా(13), షేక్ ఇబ్రహీం(11)లు ఉన్నారు. ఆ తర్వాత భార్యాభర్తలు మనస్పర్థలతో విడిపోయారు. ఈ క్రమంలో ఆమె తన ఇద్దరు కుమారులతో కలిసి తల్లి షేక్ ముంతాజ్ బేగం వద్ద ఉంటోంది. ఈ నేపథ్యంలో ఈనెల 8వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మాసాపేటలోని ఓ స్కూల్లో చదువుతున్న తన ఇద్దరు కుమారులను తీసుకుని వస్తానని తల్లికి చెప్పి ఫర్హత్ వెళ్లింది. తరువాత తన కుమార్తె, ఇద్దరు మనుమల ఆచూకీ తెలియరాలేదని ముంతాజ్ బేగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారి ఆచూకీ తెలిసిన వారు 9121100513, 9121100517, 9121100518 ఫోన్ నంబర్లలో లేదా పోలీస్ స్టేషన్‌లోగానీ, డయల్ 100కు గానీ సమాచారం ఇవ్వాలని కడప టు టౌన్ పోలీసు స్టేషన్ ఎస్ఐ సంజీవరాయుడు కోరారు. ఇవి చదవండి: అనుమానాస్పద స్థితిలో భార్య మృతి! భర్తే ఇలా చేశాడని.. -
ఇద్దరు కొడుకులతో కలసి బావిలోకి దూకిన తల్లి
నడికూడ: ఇద్దరు కొడుకులతో కలసి తల్లి బావిలో దూకగా.. ఒక కొడుకు, తల్లి మృతిచెందిన ఘటన హనుమకొండ జిల్లా నడికూడ మండలం కంఠాత్మకూర్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మామిడి కుమారస్వామితో దేశాయిపేటకు చెందిన కావ్య అలియాస్ లావణ్య (30)కు 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కొడుకు విద్యాధర్ 3వ తరగతి చదువుతుండగా.. చిన్న కొడుకు శశిధర్ (7) ఒకటో తరగతి చదువుతున్నాడు. కాగా, కావ్య ఆదివారం మధ్యాహ్నం తన ఇద్దరు కుమారులతో కలసి గ్రామంలోని ఓ వ్యవసాయ బావి వద్దకు వెళ్లింది. ముందుగా ఇద్దరు కుమారులను బావిలోకి తోసి.. ఆ తర్వాత తానూ బావిలోకి దూకింది. వీరిలో పెద్ద కుమారుడు బావిలోని విద్యుత్ మోటార్ పైపును పట్టుకొని గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు, వ్యవసాయ కూలీలు వచ్చి విద్యాధర్‌ను పైకి తీశారు. అప్పటికే తల్లి, చిన్న కుమారుడు శశిధర్ మృతిచెందారు. కావ్య ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. కొడుకు విద్యాధర్‌ను ప్రశ్నించగా నానమ్మతో తల్లికి గొడవ జరిగిందని తెలిపాడు. మృతురాలు కావ్యకు మతిస్థిమితం సరిగా లేదని తెలిసింది. -
భర్తతో గొడవ.. పిల్లలతో కాలువలో దూకిన తల్లి
నందిపేట్ (ఆర్మూర్): భర్తతో చిన్నపాటి గొడవ జరగడంతో క్షణికావేశంలో పిల్లలతో కలిసి కాలువలో దూకింది ఓ తల్లి. కొట్టుకుపోతున్న తల్లిని స్థానికులు కాపాడగా చిన్నారులు నీట మునిగి చనిపోయారు. నిజామాబాద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పోలియో చుక్కలు వేయిస్తానని.. నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల మండలం దొంచంద గ్రామానికి చెందిన పల్లపు శ్రీనివాస్‌తో నందిపేటకు చెందిన అమృత అలియాస్ సోనికి నాలుగున్నర సంవత్సరాల కిందట వివాహం జరిగింది. శ్రీనివాస్ నందిపేటకు వచ్చి ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు మనుశ్రీ (3), మనుతేజ (6 నెలలు) ఉన్నారు. శ్రీనివాస్ ఇటీవల ట్రాక్టర్ కొన్నాడు. దీంతో అప్పులయ్యాయని ఇంట్లో తరచూ భార్యతో గొడవ జరుగుతోంది. ఈ క్రమంలో శ్రీనివాస్ ట్రాక్టర్‌కు ట్రాలీ కొని రిజిస్ట్రేషన్ చేయించేందుకు సోమవారం ఆర్మూర్‌కు వెళ్లాడు. భర్త తన మాట వినట్లేదని కోపంతో అమృత.. పిల్లలకు పోలియో చుక్కలు వేయిస్తానని మధ్యాహ్నం ఇంటి నుంచి బయలుదేరింది. నందిపేట శివారులో నిండుగా పారుతున్న గుత్ప ఎత్తిపోతల పథకం కాలువ వద్దకు వెళ్లి బ్రిడ్జిపై నుంచి పిల్లలతో సహా దూకింది. ప్రమాదవశాత్తు పడిపోయా: తల్లి కొడుకులతో కలిసి తల్లి దూకడాన్ని స్థానికులు చూసి కేకలు వేశారు. కాలువలో కొద్ది దూరం కొట్టుకు పోయిన అమృత ఓ పైపును పట్టుకుని ఆగింది. అటుగా వెళ్తున్న డిచ్పల్లి క్యాంపు స్పెషల్ పోలీసు బెటాలియన్ కానిస్టేబుల్ రాకేశ్ కాలువలోకి దిగి అమృతను ఒడ్డుకు చేర్చాడు. పోలీసులు గుత్ప ఎత్తిపోతల పథకం మోటార్లను నిలిపి వేయించారు. నీటి ఉధృతి తగ్గాక జాలర్లు ఇద్దరు పిల్లల మృతదేహాలను వెలికి తీశారు. కాలువలో దూకడంపై అమృతను స్థానికులు ప్రశ్నించగా.. కూతురు నీరు తాగడానికి కాలువలోకి దిగి పడిపోయిందని, తన బిడ్డను కాపాడే ప్రయత్నంలో చంకలో ఎత్తుకున్న కొడుకుతో సహా తాను ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయానని పొంతన లేని సమాధానం చెప్పింది. -
ఫంక్షన్‌హాల్ నుంచి వచ్చి.. బ్యాగ్ సర్దుకుని ఇద్దరు పిల్లలతో..
చాంద్రాయణగుట్ట (హైదరాబాద్): ఇద్దరు పిల్లలతో కలిసి ఓ గృహిణి అదృశ్యమైన సంఘటన ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...మదన్‌ఖాన్ కాలనీకి చెందిన మక్సూద్ మహ్మద్ ఖాన్ భార్య అస్మాబేగం (23), కుమార్తె జహెరా ఖాతూన్(3), కుమారుడు యాసిన్ మహ్మద్ ఖాన్(2), తల్లి సలీం ఉన్నీసాతో కలిసి నివాసముంటున్నాడు. కాగా ఈ నెల 19వ తేదీన అతని తల్లి, భార్యాపిల్లలు సమీప బంధువుల ఇంట్లో ఫంక్షన్‌కు వెళ్లారు. ఫంక్షన్‌హాల్ నుంచి ఇంటి వచ్చిన ఆస్మాబేగం బ్యాగ్ సర్దుకొని ఇంట్లో ఎవరికి చెప్పకుండా రాత్రి ఎనిమిది గంటల సమయంలో పిల్లలతో కలిసి వెళ్లిపోయింది. రాత్రి ఇంటికి వచ్చిన మక్సూద్ విషయం తెలుసుకొని ఆమె ఆచూకీ కోసం గాలించి, ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. చదవండి: ('ఒక్క రూపాయి తీయలేదు.. మెంటల్ టెన్షన్ తట్టుకోలేకపోతున్నా') -
ఊరి చివర పాడుబడిన బావిలో పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య
సాక్షి, తిరువొత్తియూరు (చెన్నై): కుటుంబ కలహాలతో ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన విరుదునగర్‌లో చోటుచేసుకుంది. తమ్మనాయకన్ పట్టి రోడ్డుకు చెందిన రైతు శివకుమార్, లక్ష్మీ ప్రియ దంపతులకు కుమార్తె దర్శని ప్రియా (9), కుమారుడు శివ షణ్ముగ వేల్ (5) ఉన్నారు. లక్ష్మీ ప్రియాను శివకుమార్ అనుమానించడంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఆదివారం మరోసారి గొడవ పడ్డారు. మనస్తాపం చెందిన లక్ష్మీ పిల్లలను తీసుకుని బయటకు వెళ్లింది. బంధువులు, గ్రామస్తులు గాలింపు చర్యలు చేపట్టారు. ఊరి చివరనున్న పాడుబడిన వ్యవసాయ బావిలో లక్ష్మీప్రియ, ఇద్దరు పిల్లల మృతదేహాలను గుర్తించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మృతదేహాలను బయటకు తీశారు. వత్సకారపట్టి పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. చదవండి: (కరోనా కాటుకు బలి.. తీరిగ్గా 15 నెలల తర్వాత సమాచారం.. తీరని క్షోభ) -
అమ్మా..! నాకూ, తమ్ముడికి ఈత రాదు
సాక్షి,తాడేపల్లిరూరల్: అమ్మా! నాకూ తమ్ముడికి, నీకు ఈతరాదు.. అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళ్లిపోదాం పద.. నాన్న, తాతయ్య దగ్గర మనం ఉండవద్దు అంటూ కన్న కూతురు వేడుకున్నా.. ఆ తల్లి హృదయం కరగలేదు. మామ పెట్టిన బాధలు గుర్తుకు వచ్చి గుండెను దిటవు చేసుకున్న ఆ అమ్మ బకింగ్‌హామ్ కెనాల్ లాకుల వద్ద కృష్ణానదికి పడవలు వెళ్లే దారిలో కూతురు, కొడుకుతో కలిసి కాలువలోకి దూకి శుక్రవారం ఆత్మహత్యకు యత్నించింది. అసలేం జరిగిందంటే.. విజయవాడకు వన్‌టౌన్‌కు చెందిన పవన్ కుమార్‌కు ఖమ్మం జిల్లా రాంపురానికి చెందిన శాంతిప్రియకు తొమ్మిదేళ్లక్రితం పెళ్లయింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక బాబు. భర్తకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో కుటుంబ బాధ్యతలు ఆమె చూసుకుంటోంది. మామ రామకృష్ణ వేధిస్తుండడంతో శాంతిప్రియ భర్తకు చెప్పింది. అయినా ప్రయోజనం లేకపోవడంతో చేసేది లేక తన పెద్దకుమార్తె స్పందన, కొడుకు తలామ్ రాజును తీసుకుని బకింగ్‌హామ్ కెనాల్ లాకుల వద్దకు వచ్చి ఆత్మహత్యకు యత్నిస్తుండగా అక్కడే విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ నాగేశ్వరరావు గమనించాడు. అడ్డు కునే లోపలే ఆమె తన ఇద్దరు పిల్లలను కాలువలోకి తోసి తనూ దూకింది. అక్కడే చేపలు పడుతున్న నాగరాజు, యేసు, యాకోబు, క్రిస్టియన్ బాబు కాలువలోకి దూకి ముగ్గురినీ కాపాడి బయటకు తీసుకు వచ్చారు. శాంతి ప్రియ తనను ఎందుకు బతికించారు అంటూ భోరున విలపించింది. ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చేందుకు తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌కు తీసుకు వెళ్లారు. ఆ సమయంలో పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన రామకృష్ణ ‘నీ మొగుడ్ని, రెండో కూతురిని కూడా తీసుకువెళ్లి ఆత్మహత్య చేసుకుని ఉంటే మాకు పట్టిన పీడ వదిలేదని’ అనడంతో పోలీసులు తమదైన శైలిలో అతనికి కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం శాంతిప్రియ తల్లిదండ్రులను పిలిపించి, పిల్లల్ని, ఆమెను ఇంటికి పంపారు. భర్తకు కిడ్నీ దానం చేసిన శాంతిప్రియ భర్తకు మూడేళ్ల క్రితం రెండు కిడ్నీలూ చెడిపోవడంతో భర్త తండ్రిగానీ, తమ్ముడు కానీ కిడ్నీ ఇచ్చేందుకు ముందుకు రాలేదు. శాంతిప్రియ తన కిడ్నీని దానం చేసింది. అప్పటి నుంచి ఆమె ఆరోగ్య పరిస్థితి కూడా సరిగా లేదు. అయినా ఇంట్లో పనిమొత్తం ఆమె చూసుకుంటోంది. మామ వేధిస్తుండడంతో మనస్తాపం చెందిన ఆమె ఎన్నిసార్లు భర్తకు చెప్పినా ఫలితం లేకపోయింది. భర్త కూడా తననే మందలించడంతో తన అమ్మానాన్నలకు చెప్పింది. వారూ సర్దుకుపోవాలని చెప్పడంతో ఏం చేయాలో పాలుపోక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. రెండో కుమార్తెను భర్త బయటకు తీసుకెళ్లడంతో ఆ సమయంలో మిగిలిన ఇద్దరు పిల్లలతో ఆత్మహత్యకు యత్నించింది. -
కుమారుడితో సహా మహిళ అదృశ్యం
సాక్షి, ఆరిలోవ (విశాఖపట్టణం) : తల్లీ కుమారుడు అదృశ్యమైన కేసు ఆరిలోవ పోలీస్ స్టేషన్లో బుధవారం నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మూడో వార్డు పరిధి రవీంద్రనగర్‌లో గాలి రామకృష్ణ భార్య నీరజ, ఆరేళ్ల కుమారుడు శైలేంద్ర ఓ అద్దింట్లో నివాసముంటున్నారు. రామకృష్ణ ఐబీఎం కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన నెలలో ఒక వారం కంపెనీ వ్యవహారాల కోసం హైదరాబాద్ వెళ్తుంటారు. ఇందులో భాగంగా మంగళవారం సాయంత్రం ఆయన హైదరాబాద్ బయలుదేరారు. రాజమండ్రి వెళ్లిన అనంతరం తన బార్య నీరజకు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ చేసి ఉంది. దీంతో తన మామకు ఫోన్‌చేసి విషయం చెప్పారు. ఆయన కూడా ఆమె ఫోన్‌కు ప్రయత్నించినా అదే పరిస్థితి. దీంతో రవీంద్రనగర్‌లోని బంధువులకు తెలియజేశారు. బంధువులు ఆమె ఇంటికి వెళ్లి చూడగా తాళం వేసి ఉంది. ఆమె తన కుమారుడితో పుస్తకాలు బ్యాగు పట్టుకొని సాయంత్రం బయటకు వెళ్లిందని ఇంటి యజమాని ద్వారా తెలుసుకొన్నారు. ఎంతకీ ఆమె ఇంటికి తిరిగి రాకపోవడంతో మార్గమధ్యలో రామకృష్ణ ట్రైన్ దిగిపోయి తిరిగి అదే రాత్రి 3 గంటలకు విశాఖ చేరుకొన్నారు. నీరజ నెల రోజులుగా ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు నేర్చుకొంటుంది. అప్పటి నుంచి ఆ ఇన్స్టిట్యూట్ నిర్వాహకురాలు కల్పనతో తరుచూ ఫోన్లో చాటింగ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆ ఇన్స్టిట్యూట్కు వెళ్లి ఆరా తీయగా అక్కడ కల్పన కూడా లేదు. దీంతో రామకృష్ణ తన భార్య, కుమారుడు కనిపించలేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కల్పన గురించి కూడా ఆరా తీయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బస్సులో నుంచి పడిపోయిన తల్లి, ఇద్దరు చిన్నారులు
ఖమ్మంరూరల్ : ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్లే లగ్జరీ బస్సు నుంచి ఓ మహిళా ప్రయాణికురా లు, అయిదేళ్ల లోపు ఇద్దరు చిన్నారులు రోడ్డుపై పడి గాయపడిన సంఘటన సోమవారం తల్లంపాడు వద్ద జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు బస్సు బయలుదేరిన పది నిమిషాల్లోపే తల్లంపాడు ఉన్నత పాఠశాల వద్ద ఈ సంఘటన జరిగింది. బస్సు డ్రైవర్ ముందు వెళ్లే వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో ఎదురుగా వచ్చిన లారీని తప్పించేందుకు ఒక్కసారిగి పక్కకు తీసుకొని సడెన్‌బ్రేక్ వేశాడు. దీంతో కుడివైపు ముందు వరుస సీట్లో కూర్చున్న ఖమ్మం నగరంలోని ముస్తఫానగర్‌కు చెందిన ఎస్కే నస్రీన్, ఐదేళ్ల లోపు ఆమె ఇద్దరు కుమారులు కుదుపునకు లోనయ్యారు. వారు సీటులో నుంచి ఫుట్ బోర్డుపై పడి ఒక్కసారిగా నడి రోడ్డుపై జారి పడ్డారు. దీంతో నస్రీన్ తలకు, చేతికి గాయాలయ్యాయి. పిల్లలు ఇద్దరు ఒడిలో నిద్రిస్తుండగా ఆమె పిల్లలను రెండు చేతులతో గట్టిగా పట్టుకోవడంతో పిల్లలకు స్వల్ప గాయాలతో సురక్షితంగా ప్రమాదం నుంచి బయట పడ్డారు. ఆ సమయంలో వెనుక వస్తున్న లారీ డ్రైవర్ అప్రమత్తం కావడంతో వీరికి పెనుప్రమాదం తప్పింది. బస్సును డ్రైవర్ రోడ్డు పక్కకు ఆపగా, వెంటనే తోటి ప్రయాణికులు రోడ్డుపై పడ్డ తల్లి, పిల్లలను పైకి లేపారు. గాయాలతో రక్తమోడుతున్న తల్లికి ఏం జరిగిందో తెలియని పరిస్థితిలో ఏడుస్తున్న చిన్నారులను రోడ్డుపై ఆగిన ఓ వాహనదారుడు తన కారులో ఎక్కించుకుని స్థానికంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స చేయించారు. అప్పటికే ప్రయాణికులు సమాచారం ఇవ్వడంతో 108 వాహనంలో ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇదే బస్సులో వెనుక కూర్చున్న నస్రీన్ అత్త సురక్షితంగా బయటపడింది. మిగతా ప్రయాణికులు బస్సు కుదుపునకు గురయినప్పటికీ ఎవరికి ఏమీ కాలేదు. బస్సు వేగంగా వెళుతున్నప్పుడు సడెన్ బ్రేక్ వేయడం, బస్సు డోర్ వేసి లేకపోవడంతోనే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. వాస్తవంగా ఖమ్మం నుంచి బయలుదేరాక ఈ బస్సు సూర్యాపేటలోనే ఆగుతుంది. మధ్యలో ఎక్కడా స్టాఫ్ లేదు. అయినా డ్రైవర్ డోర్ వేసుకోకపోవడం గమనార్హం. రోడ్డుమీద పడిన తల్లి, ఇద్దరు పిల్లలు ప్రాణాలతో బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
కష్టమే వచ్చిందో.. కర్కశత్వమో!
-
కష్టమే వచ్చిందో.. కర్కశత్వమో!
ఏం జరిగిందో తెలియదు. ఆ కుటుంబానికి కష్టమే వచ్చిందో.. లేదా ఎవరైనా కర్కశత్వం చూపారో గానీ, ఒక తల్లి, ఇద్దరు అభం శుభం ఎరుగని చిన్నారులు రైలు పట్టాల పక్కన మరణించి పడి ఉన్నారు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ నగరంలోని మల్కాజిగిరి రైల్వేస్టేషన్ సమీపంలో శనివారం ఉదయం వెలుగుచూసింది. స్టేషన్ సమీపంలోని పట్టాలపై గుర్తుతెలియని మహిళతో పాటు ఇద్దరు చిన్నారుల మృతదేహాలు అనుమానాస్పద స్థితిలో పడి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. పిల్లలిద్దరూ విశ్వభారతి నర్సింగ్ స్కూల్లో చదువుతున్నారు. పెద్ద అబ్బాయి నాగరాజు ఒకటో తరగతి చదువుతుండగా, చిన్నబ్బాయి సాయితేజ యూకేజీ చదువుతున్నాడు. వాళ్ల తల్లి గౌరమ్మ పుప్పాలగూడ లోని గ్రీన్ స్పేస్ సిగ్మా అపార్టుమెంట్లలో పనిచేస్తున్నట్లు తెలిసింది. ఈ ముగ్గురూ ఎలా, ఎందుకు మరణించారన్న విషయం మాత్రం ఇంకా తెలియలేదు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.