
చాంద్రాయణగుట్ట (హైదరాబాద్): ఇద్దరు పిల్లలతో కలిసి ఓ గృహిణి అదృశ్యమైన సంఘటన ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...మదన్‌ఖాన్ కాలనీకి చెందిన మక్సూద్ మహ్మద్ ఖాన్ భార్య అస్మాబేగం (23), కుమార్తె జహెరా ఖాతూన్(3), కుమారుడు యాసిన్ మహ్మద్ ఖాన్(2), తల్లి సలీం ఉన్నీసాతో కలిసి నివాసముంటున్నాడు. కాగా ఈ నెల 19వ తేదీన అతని తల్లి, భార్యాపిల్లలు సమీప బంధువుల ఇంట్లో ఫంక్షన్‌కు వెళ్లారు.
ఫంక్షన్‌హాల్ నుంచి ఇంటి వచ్చిన ఆస్మాబేగం బ్యాగ్ సర్దుకొని ఇంట్లో ఎవరికి చెప్పకుండా రాత్రి ఎనిమిది గంటల సమయంలో పిల్లలతో కలిసి వెళ్లిపోయింది. రాత్రి ఇంటికి వచ్చిన మక్సూద్ విషయం తెలుసుకొని ఆమె ఆచూకీ కోసం గాలించి, ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
చదవండి: ('ఒక్క రూపాయి తీయలేదు.. మెంటల్ టెన్షన్ తట్టుకోలేకపోతున్నా')
Comments
Please login to add a commentAdd a comment