ట్యూషన్‌కని వెళ్లి అదృశ్యమైన బాలుడు
కిడ్నాప్‌గా భావించి పీఎస్‌లో ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు
బాలుడే స్వయంగా వెళ్లినట్లు సీసీ
పుటేజీల ద్వారా నిర్ధారించిన పోలీసులు
ఆచూకీ కోసం నాలుగు ప్రత్యేక బృందాల ఏర్పాటు
మీర్‌పేట: ట్యూషన్‌కు వెళ్తున్నాని ఇంట్లో నుంచి వెళ్లిన బాలుడు కనిపించకుండా పోయాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. జిల్లెలగూడ దాసరి నారాయణరావు కాలనీకి చెందిన మధుసూదన్‌రెడ్డి, కవిత దంపంతుల కుమారుడు మహిధర్‌రెడ్డి(13) స్థానికంగా ఓ ప్రైవేట్ స్కూల్‌లో చదువుతన్నారు. రోజుమాదిరిగానే ఆదివారం మధ్యాహ్నం 3.30గంటలకు తన అన్నతో కలిసి సర్వోదయనగర్‌లో ట్యూషన్‌కు బయలుదేరాడు.
వీరు నిత్యం లిఫ్ట్ అడిగి వెళ్తుంటారు. ఓ బైక్ ఆపగా.. అన్నను వెళ్లమని చెప్పిన మహిధర్ తాను తర్వాత వస్తానన్నాడు. అనతరం మరో స్కూటీని లిఫ్ట్ అడిగి మీర్‌పేట్ బస్టాండ్ వద్ద దిగి అక్కడ నుంచి మిథాని డిపోకు చెందిన ఉమెన్స్ కాలేజీ బస్‌లో మలక్‌పేట్ రైల్వే స్టేషన్ బస్టాప్‌లో దిగాడు. రైల్వే స్టేషన్‌కు వెళ్లి టికెట్ తీసుకుని రైలు ఎక్కాడు.
ముందుగా కిడ్నాప్ అనుకుని..
ట్యూషన్‌కు వెళ్లిన కొడుకు తిరిగి రాకపోవంతో కంగారుపడిన తల్లిదండ్రులు కిడ్నాప్ అనుకుని మీర్‌పేట ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఇంట్లో నుంచి వెళ్లేప్పుడు రూ.2 వేలు తీసుకెళ్లిన్నట్లు గుర్తించారు. పోలీసులు సీసీ పుటేజీలు పరిశీలించగా బాలుడు తనంతట తానే లిఫ్ట్ అడిగి.. బస్ ఎక్కి, అనంతరం రైలులో వెళ్లిన్నట్లు గుర్తించారు.
సొంతూరు కర్నూల్ వెళ్లి ఉంటాడని భావించి అక్కడి పోలీసులు, బంధువులను అప్రమత్తం చేశామని ఇన్‌స్పెక్టర్ నాగరాజు తెలిపారు. ఏసీపీ కాశిరెడ్డి మీర్‌పేటకు వచ్చి సీసీ పుటేజీ పరిశీలించారని.. నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి వెతుకుతున్నామని చెప్పారు. ఇదిలా ఉండగా గోవా టికెట్ తీసుకున్న బాలుడు రైలెక్కి అక్కడకు వెళ్లినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment