Boy
-
తిరుమలలో విషాదం.. భవనంపై నుంచి పడి బాలుడు మృతి
సాక్షి, తిరుమల: తిరుమలలో విషాదం చోటుచేసుకుంది. ఆర్టీసి బస్ స్టేషన్ వద్ద పద్మనాభ యాత్రిక సదన్ భవనం నుంచి పడి రెండేళ్ల బాలుడు మృతి చెందాడు. వసతి సముదాయం (రెండో అంతస్తు) నుంచి బాలుడు కిందకి పడిపోయాడు. వైఎస్సార్ కడప జిల్లా చినచౌక్కు చెందిన శ్రీనివాసులు, కృష్ణవేణి దంపతుల కుమారుడు సాత్విక్(3)గా గుర్తించారు.తిరుమలలో ఇంటి దొంగలు చేతివాటంతిరుమలలో ఇంటి దొంగలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన నకిలీ టికెట్లతో దళారీలు.. భక్తులకు స్వామివారి దర్శనం చేయిస్తున్నారు. విజిలెన్స్ వింగ్ అధికారులకు అనుమానం రావడంతో వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్ద నిలిపివేశారు. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన కౌంటర్ సిబ్బంది లక్ష్మీపతితో అగ్నిమాపక పీఎస్జీ మణికంఠ, భానుప్రకాష్ భక్తులను మోసగిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది మణికంఠ సహాయంతో నకిలీ టికెట్లను తయారు చేస్తున్నారు. హైదరాబాద్, ప్రొద్దుటూరు, బెంగుళూరు భక్తులు సుమారు 11 మంది నుంచి రూ.19 వేలు వసూలు చేసినట్లు సమాచారం. -
పెళ్లయినా పిల్లలు పుట్టరని..
మహబూబ్‌నగర్ క్రైం: పెళ్లయినా పిల్లలు పుట్టరని తెలుసుకొని.. ఎలాగైనా తనకంటూ ఒక కుటుంబం ఉండాలని భావించిన ఓ వ్యక్తి.. సమీప బంధువు కుమారుడిని కిడ్నాప్ చేశా డు. రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలను మహబూబ్‌నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు శనివారం వెల్లడించారు. జడ్చర్ల మండల పరిధిలోని కొత్తతండాకు చెందిన పాత్లవత్ లాలు కొన్ని రోజులుగా జిల్లాకేంద్రంలోని పద్మా వతి కాలనీలో ఉంటూ మేస్త్రీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే లాలు వద్ద సమీప బంధువు ఖిల్లాఘనపురం మండలం తిర్మాలయి పల్లికి చెందిన సభావత్ రాజు రెండు నెలలగా మేస్త్రీ పని చేస్తున్నాడు. అయితే సభావత్ రాజుకు లైంగిక సమస్యలు ఉండటంవల్ల పెళ్లి కాదని, ఒకవేళ పెళ్లి అయినా పిల్లలు పుట్టరని తెలుసుకున్నాడు. దీంతో ఎలాగైనా తనకంటూ ఒక కుటుంబం ఏర్పాటు చేసుకోవాలని భావించి పథకం ప్రకారం.. లాలు కొడుకు మూడేళ్ల విక్కీని చాక్లెట్లు, ఇతర తినుబండారాలు ఇప్పిస్తూ దగ్గర చేసుకున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 8వ తేదీన సాయంత్రం 4 గంటల ప్రాంతంలో పద్మావతి కాలనీ అంగన్వాడీ సెంటర్ దగ్గరకు వెళ్లి అక్కడే ఉన్న విక్కీని స్కూటీపై ఎక్కించుకుని జడ్చర్లకు తీసుకువెళ్లాడు. ఆ తర్వాత రాజుకు పరిచయం ఉన్న సావిత్రిని కలిసి, జరిగిన విషయం చెప్పకుండా ఆమెను కూడా తీసుకుని విజయవాడ వెళ్లాడు. రాజు వాడుతున్న మొబైల్ ఫోన్ ఆధారంగా పోలీసులు నిందితుడు విజయ వాడలో ఉన్నట్లు గుర్తించారు. శుక్రవారం రాత్రి ప్రత్యేక టీం రాజును అరెస్టు చేసి బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. -
Mahakumbh 2025: తొమ్మిదేళ్లకే నాగ సన్యాసి.. గడ్డకట్టే చలిలో కఠోర తపస్సు
మహాకుంభమేళా ఈ నెల(జనవరి) 13 నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో అత్యంత వైభవంగా ప్రారంభంకానుంది. ఇందుకోసం ప్రభుత్వం ఘనమైన ఏర్పాట్లు చేస్తోంది. కుంభమేళాలో పుణ్యస్నానాలు చేసేందుకు ఇప్పటికే పలువురు సాధువులు ప్రయాగ్‌రాజ్ చేరుకున్నారు. వారిలో ఒకరే తొమ్మిదేళ్ల నాగసన్యాసి గోపాల్ గిరి మహారాజ్.ఈయన హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh)లోని చంపా నుండి వచ్చారు. మహాకుంభ్‌లో అతి పిన్న వయస్కుడైన నాగ సన్యాసిగా గోపాల్ గిరి నిలిచారు. ప్రస్తుత శీతాకాలంలో గడ్డకట్టే చలి మధ్య గోపాల్ గిరి మహారాజ్ శరీరంపై ఎటువంటి దుస్తులు లేకుండా, కవలం బూడిద పూసుకుని తపస్సు కొనసాగిస్తుంటారు. గోపాల్ గిరికి మూడేళ్ల వయసు ఉన్నప్పుడే అతని తల్లిదండ్రులు బాలుడిని ఒక గురుపుకు అప్పగించారు. నాటి నుంచి గోపాల్ గిరి సాధన ప్రారంభించారు.గోపాల్ గిరి మహారాజ్ మీడియాతో మాట్లాడుతూ మహా కుంభమేళా(Kumbh Mela) తర్వాత తన చదువును తిరిగి కొనసాగిస్తానని అన్నారు. తనకు మొదట్లో తనకు ఇంటికి దూరమయ్యాననే బాధ ఉండేదని, అయితే తన గురువు అందించిన జ్ఞానం, మార్గదర్శకత్వం తనను ప్రాపంచిక అనుబంధాల నుండి దూరంగా ఉంచాయని అన్నారు. కాగా గోపాల్ గిరి మహారాజ్ దినచర్య చాలా క్రమశిక్షణతో కూడి ఉంటుంది. బ్రహ్మ ముహూర్తంలోనే మేల్కొని, తన దైనందిన కార్యకలాపాలు నిర్వహిస్తారు. తరువాత గురువు సమక్షంలో వేదాలను నేర్చుకుంటారు. మహా కుంభమేళాలో గోపాల్ గిరి మహారాజ్ కత్తి కళను ప్రదర్శిస్తున్నారు. ఈ కళతో పాటు గోపాల్ గిరి చేసే అతీంద్రియ తపస్సు అతనికి ప్రత్యేక గుర్తింపునిచ్చింది.ఇది కూడా చదవండి: గుంపులో చిక్కుకుపోయారా? మిమ్మల్ని మీరు ఇలా కాపాడుకోండి -
కుర్రాడిగా అదృశ్యమై.. 23 ఏళ్ల తర్వాత ఫ్యామిలీతో ప్రత్యక్షమై.. వింత ఘటన
సరిగ్గా 23 ఏళ్ల క్రితం మాయమైన కుర్రాడు ఇప్పుడు వివాహితునిగా భార్య, ఇద్దరు పిల్లలతో పాటు ఇంటికి తిరిగివస్తే, ఆ కుటుంబ సభ్యుల స్పందన ఎలా ఉంటుంది? అది ఊహకు అందదు. ఇటువంటి ఘటన గురించి విన్నవారు తెగ ఆశ్చర్యపోతారు. సరిగ్గా ఇటువంటి ఉదంతం ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.యూపీలోని సీతాపూర్(Sitapur)లో 23 ఏళ్ల క్రితం అదృశ్యమైన ఒక కుర్రాడిని అతని జ్ఞాపకాలు ఇంటికి తిరిగివచ్చేలా చేశాయి. ఆ కుర్రాడు వివాహితునిగా మారి భార్య, ఇద్దరు పిల్లలలో పాటు గ్రామానికి తిరిగిరావడంతో అందరూ ఆశ్యర్యపోయారు. అతనిని చూసిన తల్లి షాక్‌నకు గురయ్యింది. అతనిని చూసేందుకు గ్రామస్తులు క్యూ కడుతున్నారు. బాల్యంలో అతని తలకు తగిలిన గాయం ఆధారంగా ఆ తల్లి అతను తన కుమారుడేనని గుర్తించింది.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ యువకుడిని గుర్తించారు. 23 ఏళ్ల క్రితం ఆ బాలుని తల్లి తన కుమారుడు కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇన్నాళ్లకు కుమారుడిని కలుసుకున్న ఆ తల్లి భావోద్వేగానికి గురయ్యింది. ఈ ఉదంతం రెయుసా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.మీడియాకు అందిన వివరాల ప్రకారం రేవాన్ గ్రామానికి చెందిన అరవింద్ మౌర్య(Arvind Maurya) 2002లో అనుమానాస్పద స్థితిలో అదృశ్యమయ్యాడు. అప్పుడు అరవింద్ వయసు దాదాపు 18 ఏళ్లు. ఆ సమయంలో అరవింద్.. సోంపు విక్రయించేవాడు. కొడుకు అదృశ్యం కావడంతో తల్లి చంపకళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనకు తెలిసిన అన్నిచోట్లా వెదికింది. పలుదేవాలయాల చుట్టూ తిరుగుతూ, తన కుమారుడు క్షేమంగా తిరిగిరావాలని కోరుతూ పూజలు చేసింది.ఇప్పుడు ఇంటికి తిరిగివచ్చిన అరవింద్.. పోలీసులకు తాను ఇన్నాళ్లూ ఎక్కడున్నదీ, ఏం చేసినదీ తెలిపాడు. తాను ఇంటి నుంచి వెళ్లిపోయిన తరువాత పంజాబ్, హర్యానా తదితర ప్రాంతాలలో ఉంటూ, ఏవో పనులు చేసుకుంటూ కాలం గడిపానని తెలిపాడు. అదేసమయంలో తనకు వివాహం జరిగిందని, ఇద్దరు పిల్లలు కూడా పుట్టారని తెలిపాడు. ఇప్పుడు తన భార్య, పిల్లల కోరిక మేరకు పంజాబ్ నుంచి తన ఇంటికి తిరిగివచ్చానని తెలిపాడు. అరవింద్‌ను, అతని కుటుంబ సభ్యులను విచారించిన తర్వాత పోలీసులు ఈ మిస్సింగ్ కేసు(Missing case)ను ముగించారు. అరవింద్ భార్య పూనమ్ మాట్లాడుతూ తన అత్తమామలను కలుసుకున్నానని, ఇప్పుడు చాలా ఆనందంగా ఉందని అన్నారు. తనకంటూ ఒక ఉమ్మడి కుటుంబం ఉన్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. కాగా అరవింద్, పూనమ్‌లు 2014లో పంజాబ్‌లో వివాహం చేసుకున్నారు. ఇది కూడా చదవండి: ఆరేళ్ల బుడతడు.. వెయ్యి కిలోమీటర్లు పరిగెడుతూ అయోధ్యకు.. -
16 గంటలు శ్రమించినా దక్కని ప్రాణం.. బోరుబావిలో పడిన సుమిత్ మృతి
భోపాల్ : మధ్యప్రదేశ్ రాష్ట్రం గుణ జిల్లాలో బోరు బావి ఘటనలో బాలుడు సుమిత్ మీనా (Sumit Meena) విషాదాంతమైంది. శనివారం సాయంత్రం బోరు బావిలో పడిన 10ఏళ్ల బాలుడు సుమిత్ మీనాను రెస్యూ సిబ్బంది రక్షించారు. అయితే, చికిత్స పొందుతూ మరణించడంతో బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.గుణ జిల్లా (Guna District) రఘోఘర్ అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలోని పిప్లియా అనే గ్రామంలో శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో సుమిత్ మీనా అనే బాలుడు ఆటలాడుకుంటూ 140 అడుగుల బోరుబావిలో పడ్డాడు. 39 అడుగుల లోతులోకి కూరుకుపోయాడు. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న పోలీసులు,రెస్క్యూ సిబ్బంది బాలుడిని కాపాడేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. 16 గంటల పాటు శ్రమించి సుమిత్ మీనాను బోరుబావి (borewell) నుంచి సురక్షితంగా బయటకు తీశాయి. ఆదివారం ఉదయం 9.30గంటల సమయంలో అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించాయి. అయినప్పటికీ చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందినట్లు గుణ జిల్లా వైద్యాదికారి డాక్టర్ రాజ్‌కుమార్ రిషేశ్వర్ తెలిపారు.#WATCH | Guna, Madhya Pradesh: The 10-year-old boy, Sumit who fell into a borewell in the Janjali area of Raghogarh yesterday has been taken out and sent to a hospital. Details awaited. pic.twitter.com/5rSjIsv48j— ANI (@ANI) December 29, 2024 ‘బాలుడు రాత్రంతా చలి వాతావరణంలో బోర్‌వెల్‌లోనే ఉన్నాడు. అతని చేతులు, కాళ్ళు తడిసి వాచిపోయాయి.నోట్లోకి బురద చేరింది.మోతాదుకు మించి (అల్పోష్ణస్థితి) నీరు చేరడం వల్ల బాలుడి అంతర్గత భాగాల పనితీరు స్తంభించి పోయింది. సకాలంలో మెరుగైన వైద్యం అందించినా సమయం మించిపోయినందున బాలుడిని కాపాడుకోలేకపోయాం’అని విచారం వ్యక్తం చేశారు. -
పుట్టిన రోజు వేడుకలకని పిలిచి... అవమానించడంతో బాలుడి ఆత్మహత్య
బస్తీ (యూపీ): పుట్టిన రోజు వేడుకలకు ఆహ్వానించారు. వచ్చిన బాలుడి బట్టలిప్పించారు. మీద మూత్ర విసర్జన చేశారు. ఆ ఘటనను వీడియోలో చిత్రీకరించారు. వీడియోను ఫోన్ నుంచి తీసేయాలని కుటుంబ సభ్యులు వేడుకున్నా వినిపించుకోలేదు. ఫిర్యాదు చేస్తే పోలీసులూ పట్టించుకోలేదు. అవమానం భరించలేక 17ఏళ్ల దళిత బాలుడు చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ అమానవీయ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో జరిగింది. సంత్ కబీర్‌నగర్ జిల్లాకు చెందిన బాలుడు బస్తీ జిల్లాలోని తన మేనమామ ఇంట్లో ఉంటున్నాడు. డిసెంబర్ 20వ తేదీ రాత్రి గ్రామస్తులు కొందరు బర్త్ డే పారీ్టకి బాలుడిని ఆహా్వనించారు. అక్కడికి చేరుకోగానే నలుగురు వ్యక్తులు అతడిని బట్టలు విప్పి, చితకబాదారు. మూత్ర విసర్జన చేసి అవమానించారు. అంతేకాదు ఉమ్మివేసి నాకాలని బలవంతం చేశారు. ఈ తతంగం మొత్తాన్ని వీడియోలో బంధించారు. జరిగిన అవమానాన్ని బాలుడు ఇంట్లో చెప్పాడు. వీడియోను డిలీట్ చేయాలని కుటుంబ సభ్యులు వారిని కోరినా వినలేదు. దీంతో వారిపై కెపె్టన్గంజ్ పోలీస్‌స్టేషన్ ఫిర్యాదు చేశారు. కానీ ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ఎస్హెచ్ఓ నిరాకరించారు. నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ అవమానాన్ని భరించలేక సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో బాధితుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తమకు న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులు మృతదేహాన్ని పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. అయినా పోలీసులు పట్టించుకోలేదు. చివరకు ఎస్పీ కార్యాలయం ఎదుట నిరసన తెలపడంతో ఎస్పీ స్పందించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కెపె్టన్గంజ్ ఎస్హెచ్ఓ దీపక్‌కుమార్ దూబేను సస్పెండ్ చేశారు. బాలుడి మేనమామ ఫిర్యాదు మేరకు సోమవారం ఎఫ్ఐఆర్ నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపారు. నలుగురు నిందితుల్లో ఇద్దరిని అరెస్టు చేశారు. -
బోరు బావిలో పడ్డ బాలుడు
-
చదరంగంలో చిచ్చర పిడుగు
మాటలు రాకముందే ఆటల వైపు ఆకర్షితుడైన ఆ చిన్నారి ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు... మెదడుకు పదును పెంచేందుకు పజిల్స్‌ను పరిచయం చేశారు. సులభమైన పజిల్స్‌ను పక్కన పెట్టిన ఆ బుడ్డోడు... సంక్లిష్టత పెరుగుతున్నకొద్దీ వాటిని ఆస్వాదించడం ప్రారంభించాడు. కుమారుడి ఉత్సాహాన్ని గుర్తించిన తల్లిదండ్రులు అతడికి చదరంగాన్ని పరిచయం చేయగా... అందులో అంచెలంచెలుగా ఎదుగుతూ ముందుకు సాగాడు. ఆరేళ్ల వయసులోనే భారత గ్రాండ్‌మాస్టర్లు దొమ్మరాజు గుకేశ్, ఇరిగేశి అర్జున్‌లాంటి మేటి స్టార్స్‌ను తన ప్రతిభతో కట్టిపడేసిన ఆ బుడతడు... ఎనిమిదేళ్ల వయసులోనే క్యాడెట్ విభాగంలో అండర్–8 ప్రపంచ ర్యాపిడ్, క్లాసికల్ ఫార్మాట్ చెస్ చాంపియన్‌షిప్‌లలో విజేతగా నిలిచి అబ్బురపరిచాడు. చదరంగంలో సంచలనాలు సృష్టిస్తున్న తెలంగాణ కుర్రాడు ఆదుళ్ల దివిత్ రెడ్డి ప్రస్థానంపై ప్రత్యేక కథనం. సాక్షి క్రీడావిభాగం ‘పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది’ అన్నట్లు హైదరాబాద్‌కు చెందిన ఆదుళ్ల దివిత్ రెడ్డి... చిన్నప్పటి నుంచే చదరంగంలో చిచ్చర పిడుగులా చెలరేగుతున్నాడు. ఎనిమిదేళ్ల వయసులోనే ప్రపంచ క్యాడెట్స్ చెస్ చాంపియన్‌షిప్ అండర్–8 ఓపెన్ కేటగిరీలో విజేగా నిలిచిన దివిత్ రెడ్డి.. అంతకుముందు వరల్డ్ క్యాడెట్ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకంతో సత్తా చాటాడు. ఇప్పటికే 1784 ఎలో రేటింగ్ పాయింట్లు ఖాతాలో వేసుకున్న దివిత్ రెడ్డి... భవిష్యత్తుపై భరోసా కల్పిస్తున్నాడు. రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లో జరిగిన ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో గ్రాండ్‌మాస్టర్లు దొమ్మరాజు గుకేశ్, అర్జున్ ఇరిగేశితో తలపడి తన ఎత్తులతో ఆకట్టుకున్న దివిత్ వారి నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ కోసం డింగ్ లిరెన్ (చైనా)తో పోటీ పడుతున్న గుకేశ్... ‘ఈ అబ్బాయి చాలా బాగా ఆడుతున్నాడు. ఇతడి ఎత్తులకు ఆశ్చర్యం కలుగుతోంది’ అని కితాబు ఇచ్చాడంటే దివిత్ ప్రతిభ ఎలాంటిదో ఊహించుకోవచ్చు. తనకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న ప్రత్యర్థులను కూడా అలవోకగా ఓడిస్తున్న దివిత్... భవిష్యత్తులో మరిన్ని సంచలనాలు నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లైన తల్లిదండ్రులు పసిప్రాయం నుంచి దివిత్‌ను ప్రోత్సహించగా... వారి కృషికి తగ్గ ఫలితం దక్కినటైంది. ‘చిన్నప్పుడు దివిత్ పజిల్స్ నింపడాన్ని ఇష్టపడేవాడు. ఎంతో క్లిష్టమైన పజిల్స్ ఇచ్చినా సునాయాసంగా పూర్తి చేసేవాడు. దీంతో అతడిని స్థానికంగా ఒక పజిల్ ఇన్స్టిట్యూట్లో చేర్పించాం. అక్కడ కూడా ప్రతిభ చాటుకున్నాడు. దీంతో ఆన్లైన్ చెస్ కోచింగ్ ప్రారంభించాం’ అని దివిత్ తండ్రి మహేశ్ రెడ్డి వెల్లడించారు. విశాఖపట్నంకు చెందిన చెస్ కోచ్ పోలవరపు రామకృష్ణ శిక్షణలో మరింత రాటుదేలిన దివిత్... జాతీయ అంతర్జాతీయ పోటీల్లో సత్తా చాటాడు. ఆరేళ్ల ప్రాయంలోనే దివిత్ అండర్–8 జాతీయ చెస్ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్నాడు. ‘నేను అతడిలో ప్రపంచ చాంపియన్‌ను చూశాను. ప్రోత్సహిస్తే ఫలితం ఉంటుందని ఆలోచించి... చదువుతో పాటు శిక్షణకు తగిన సమయం కేటాయించేలా చేశా. దీని కోసం నా భార్య ఉద్యోగాన్ని పక్కన పెట్టి పూర్తి స్థాయిలో దివిత్‌కు చేదోడుగా నిలిచింది. కోవిడ్–19 కారణంగా వచ్చిన లాక్డౌన్ ఒక విధంగా మాకు మేలు చేసింది. చిన్న వయసులోనే అతడి ఎత్తులు చాలా వ్యూహాత్మకంగా ఉండటం చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయే వాళ్లు. దాన్నే కొనసాగిస్తూ విజయాలు సాధిస్తున్నాడు. గ్యారీ కాస్పరోవ్ అంటే దివిత్‌కు చాలా ఇష్టం. కాస్పరోవ్ తరహాలోనే అటాకింగ్ ఆటను ఇష్టపడతాడు. దాదాపు ఓడిపోయే స్థితి నుంచి కూడా తిరిగి పుంజుకోవడం దివిత్‌కు బాగా అలవాటు’ అని మహేశ్ రెడ్డి వివరించారు. ఈ ఏడాది 10 అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొన్న దివిత్ రెడ్డి సమీప భవిష్యత్తులో గ్రాండ్‌మాస్టర్ (జీఎం) హోదా దక్కించుకోవడం ఖాయమే అని మహేశ్ అన్నారు. అమెరికాకు చెందిన భారత సంతతి కుర్రాడు అభిమన్యు మిశ్రా 12 సంవత్సరాల 4 నెలల 25 రోజుల వయసులో గ్రాండ్‌మాస్టర్‌గా అవతరించి ఈ ఘనత సాధించిన పిన్న వయస్కుడిగా నిలవగా... ఇప్పుడు ఆ రికార్డును దివిత్ బద్దలు కొడతాడని మహేశ్ విశ్వాసం వ్యక్తం చేశారు. -
AP: దారుణం.. కుక్కల దాడిలో రెండేళ్ల బాలుడి మృతి
సాక్షి,ఎన్టీఆర్జిల్లా: ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మోడల్ కాలనీలో సోమవారం(నవంబర్ 11) దారుణం జరిగింది. రెండేళ్ల బాలుడు బాలతోటి ప్రేమ్ కుమార్ తన ఇంటి ముందు ఆడుకుంటుండగా వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి.దాడి చేసిన తర్వాత కుక్కలు బాలుడిని పొలాల్లోకి లాక్కెళ్లాయి. కుక్కల దాడిలో తీవ్ర గాయాలు కావడంతో బాలుడిని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. బాలుడి మృతితో పెనుగంచిప్రోలు గ్రామంలో విషాదం నెలకొంది.ఇదీ చదవండి: రంగరాయలో ర్యాగింగ్ కలకలం -
మూడేళ్ళ పాపను ఎత్తుకెళ్లిన యువకుడు
-
ఆరు నెలల బాలుడికి కిడ్నీలో రాళ్లు
కర్నూలు(హాస్పిటల్): సాధారణంగా చిన్నపిల్లలకు అవయవాలు చాలా చిన్నగా ఉంటాయి. అందులోనూ ఆరు నెలల పిల్లలంటే అత్యంత సున్నితంగా ఉంటాయి. ఆ వయసులో కిడ్నీలో రాళ్లు ఏర్పడటం అంటే చాలా ఇబ్బందికర పరిస్థితి. అలాంటిది రెండు కిడ్నీల్లోనూ రెండేసి రాళ్లు, అవీ పెద్ద పరిమాణంలో ఏర్పడటంతో ఓ బాబుకు మూత్రవిసర్జన ఆగిపోయి, పొట్ట ఉబ్బిపోయింది. ఆ బాబుకు ఎండోస్కోపిక్ విధానంలో మొత్తం నాలుగు రాళ్లను తొలగించి కర్నూలు కిమ్స్ ఆస్పత్రి వైద్యులు ఊరట కలిగించారు. ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం ఆస్పత్రి యూరాలజిస్టు డాక్టర్ వై.మనోజ్‌కుమార్ తెలిపారు. ‘నంద్యాల జిల్లా పాణ్యంకు చెందిన ఆరు నెలల బాబు దక్షిత్‌కు మూత్ర విసర్జన కాకపోవడం, పొట్ట ఉబ్బిపోవడంతో ఈ నెల 5వ తేదీన కర్నూలులోని కిమ్స్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అతనికి అన్ని పరీక్షలు నిర్వహించగా, రెండు కిడ్నీల్లో 11 మి.మీ, 9 మి.మీ, 9 మి.మీ, 7 మి.మీ. పరిమాణంలో నాలుగు రాళ్లు ఉన్నట్లు తేలింది. ముందుగా స్టెంట్లు అమర్చి కిడ్నీలను సాధారణ స్థితికి తెచ్చిన తర్వాత ఈ నెల 5వ తేదీన ఎండోస్కోపిక్ విధానంలో కుట్లు లేకుండా లేజర్ ద్వారా ఇతర అవయవాలకు ఎలాంటి హాని జరగకుండా కిడ్నీలో రాళ్లను తొలగించాం. అతను కోలుకోవడంతో 10వ తేదీన డిశ్చార్జ్ చేశాం. ఇంత చిన్న వయసులో రెండు కిడ్నీల్లో రెండేసి రాళ్లు ఏర్పడటం ఏపీలో ఇదే తొలిసారి. లక్ష మందిలో కేవలం పది మందికే ఇలాంటి సమస్య తలెత్తుతుంది.’ అని డాక్టర్ వివరించారు. -
కిడ్నాపైన బాలుడు శవమై తేలాడు
చిల్లకూరు: తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం వరగలిలో సోమవారం కిడ్నాపైన బాలుడు లాసిక్ (12)... మంగళవారం సాయంత్రం గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలోని ఉప్పుటేరులో శవమై కనిపించడం కలకలం రేపింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. వరగలిలోని కాతారి రమేష్, సంధ్య దంపతుల కుమారుడు లాసిక్ వాకాడులోని గురుకుల పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్నాడు. దసరా సెలవులు ఇవ్వడంతో ఇంటికి వచ్చాడు. సోమవారం తల్లిదండ్రులు నిర్వహించే దుకాణంలో ఉండగా, అక్కడకు వచ్చిన చిత్తు కాగితాలు ఏరుకునే ముగ్గురు గిరిజన వ్యక్తులు బాలుడికి మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేశారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు తల్లిదండ్రులు, బంధువులు బాలుడి కోసం వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో గ్రామానికి సమీపంలోని ఉప్పుటేరు (కండలేరు క్రీక్)కు ఆవలి వైపున ఉన్న సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచల మండలం తిరుమలమ్మ పాళెం సమీపంలో బాలుడి మృతదేహం ఉన్నట్లు మంగళవారం సాయంత్రం అక్కడి వారు సమాచారం ఇచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు బోట్లపై అక్కడికి వెళ్లి మృతదేహాన్ని గుర్తించి తీసుకుని వచ్చారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేశామని, ఘటనకు గల కారణాలు ఇంకా తెలియలేదని, అదుపులో ఉన్న గిరిజనుడిని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. బాలుడి మృతితో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాగా, మత్తు మందు ఇచ్చి బాలుడిని కిడ్నాప్ చేసి ఉంటారని.. బాలుడు స్పృహలోకి వచ్చి గొడవ చేయడంతో ఉప్పు నీటిలో పడేసి ఉంటారని తెలుస్తోంది. -
13 ఏళ్ల బాలునిపై తోడేలు దాడి
బహ్రాయిచ్: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రాయిచ్‌లో నరమాంస భక్షక తోడేళ్ల భీభత్సం ఆగడం లేదు. అటవీశాఖ అధికారులు ఐదవ తోడేలును పట్టుకున్న తర్వాత ఒంటరిగా మిగిలిపోయిన ఆరవ తోడేలు ఆహారం కోసం నిరంతరం దాడులు చేస్తోంది. తాజాగా ఇంటి టెర్రస్‌పై నిద్రిస్తున్న 13 ఏళ్ల అర్మాన్ అలీపై తోడేలు దాడి చేసింది. ఈ దాడిలో బాలుడు గాయపడ్డాడు. బాధిత బాలునికి బహ్రాయిచ్‌లోని మెడికల్ కాలేజీలో చికిత్స అందిస్తున్నారు.అటవీ శాఖ అన్ని రకాలుగా తోడేళ్లను పట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది. మహసీ ప్రాంతంలో తోడేళ్ల దాడుల కారణంగా సుమారు 110 గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. మహసీ, శివపూర్‌లోని 110 గ్రామాల్లో అటవీశాఖ, పోలీసులు, పీఎస్సీ సిబ్బంది, జిల్లా ఉద్యోగులు వంతుల వారీగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నప్పటికీ తోడేళ్ల దాడులు ఆగడం లేదు.బహ్రాయిచ్‌లోని మహసీ తహసీల్‌లో గత 200 రోజులుగా నరమాంస భక్షక తోడేళ్ల భీభత్సం కొనసాగుతోంది. తోడేళ్లు ఇప్పటివరకు 60 మందిని గాయపరిచాయి. ఆరు తోడేళ్లు దాడులకు దిగుతున్నాయని గుర్తించామని, వాటిలో ఐదు తోడేళ్లను పట్టుకున్నామని అటవీ శాఖ పేర్కొంది. ఇక ఒక తోడేలు మాత్రమే మిగిలి ఉందని, దానిని పట్టుకోవడానికి అన్నిరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపింది. అయితే అటవీ శాఖ సమాధానానికి గ్రామస్తులు సంతృప్తి చెందడం లేదు.ఇది కూడా చదవండి: ట్రంప్‌పై కాల్పులు జరిపిన ర్యాన్ వెస్లీ రౌత్ ఎవరు? -
బాలుడి దారుణ హత్య
బాల్కొండ: నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో పన్నెండేళ్ల బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. బాలుడిని గుప్త నిధుల కోసం చంపారా? లేదా డబ్బుల కోసమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాలివి. బాల్కొండకు చెందిన బండి నరేందర్.. నచ్చు రాకేశ్ మేనమామ అయిన నాగాపూర్‌కు చెందిన దశరథ్ మేకలను మేతకు తీసుకుని వెళ్తాడు. దీంతో రాకేశ్ కుటుంబ సభ్యులకు పరిచయమయ్యాడు. గణపతులను చూసి వద్దామని చెప్పి ఈ నెల 11న బండి నరేందర్ చిట్టాపూర్ గ్రామానికి చెందిన బాలుడు నచ్చు రాకేశ్‌ను.. బాల్కొండకు తీసుకొచ్చాడు. ఆ రోజు రాత్రి 11 గంటల వరకు కూడా రాకేశ్ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు నరేందర్‌ను ప్రశ్నించారు. అతని నుంచి సరైన సమాధానం రాక పోవడంతో బాల్కొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా శనివారం ఉదయం బాల్కొండలోని ఖిల్లా ప్రాంతంలో బాలుడి మృతదేహం ఉందని చిట్టాపూర్ గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో ఈ ఘోరం వెలుగుచూసింది. బాలుడి మృతదేహంపై దుస్తులు లేకపోగా.. ఎడమ కంటి భాగంపై బండరాయితో మోది హత్య చేసినట్లు ఆనవాళ్లు కనిపించాయి. ఖిల్లాలోని ఓ గుహ ముందు హత్య చేసి మృతదేహాన్ని కొద్దిదూరంలో పారేశారు. ఘటన స్థలాన్ని సీఐ శ్రీధర్‌రెడ్డి పరిశీలించారు. బాలుడిని నరేందర్ హత్య చేసి ఉంటాడని బాధిత కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. నరేందర్‌తో వెళ్లేముందు బాలుడు తన అన్న మణికంఠకు ఫోను చేసి చెప్పాడని తెలిపారు. పోలీసులు నరేందర్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. అయితే అనుమానితుడు నేరాన్ని అంగీకరించలేదని పోలీసులు పేర్కొన్నారు. త్వరలోనే పూర్తిస్థాయి దర్యాçప్తు చేపట్టి నిందితులను పట్టుకుంటామన్నారు. కాగా బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పోలీసు స్టేషన్‌కు చేరుకుని నరేందర్‌ను తమకు అప్పగించాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. హత్య జరిగిన మర్నాడు కూడా నరేందర్ తన భార్య మొబైల్‌తో ఫోన్ చేసి.. రాకేశ్ ఖానాపూర్ వద్ద ఉన్నాడని అబద్ధం చెప్పాడని వివరించారు. హత్య జరిగిన రోజు ఉదయం నరేందర్.. మొదట బాలుడి అన్న మణికంఠకు ఫోన్‌చేసి ఖిల్లా వద్దకు రమ్మన్నాడని, మణికంఠ వెళ్లకపోవడంతో రాకేశ్‌ను తీసుకెళ్లినట్లు వివరించారు. న్యాయం చేస్తామని ఆర్మూర్ ఏసీపీ బస్వారెడ్డి హామీ ఇవ్వడంతో మృతుని కుటుంబ సభ్యులు ఆందోళనను విరమించారు. హతుని తండ్రి రెండేళ్ల క్రితమే రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. -
శభాష్ హృతిక్
సాక్షి, హైదరాబాద్: అంచనాలకు మించి రాణించి... తనకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న ఆటగాళ్లను ఓడించి... హైదరాబాద్ కుర్రాడు హృతిక్ కటకం ఆసియా అండర్–14 టెన్నిస్ చాంపియన్íÙప్ బాలుర సింగిల్స్ విభాగంలో చాంపియన్‌గా అవతరించాడు. కంబోడియాలో జరిగిన ఈ టోర్నీలో హృతిక్ టైటిల్ గెలిచే క్రమంలో టాప్ సీడ్, రెండో సీడ్, మూడో సీడ్ క్రీడాకారులను ఓడించడమే కాకుండా... తన ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోకపోవడం విశేషం. ఫైనల్లో హృతిక్ 6–3, 7–5తో రెండో సీడ్ డాంగ్జే కిమ్ (దక్షిణ కొరియా)ను ఓడించి టైటిల్ దక్కించుకున్నాడు. తొలి రౌండ్లో హృతిక్ 6–0, 6–0తో యితియన్ లూ (చైనా)పై, క్వార్టర్ ఫైనల్లో 6–1, 6–1తో మూడో సీడ్ రమ్తిన్ రఫీ»ొరుజెని (ఇరాన్)పై, సెమీఫైనల్లో 6–3, 6–4తో టాప్ సీడ్ ధర్మ పాంతారాటోర్న్ (థాయ్‌లాండ్)పై గెలుపొందాడు. హైదరాబాద్‌కే చెందిన డేవిస్‌కప్ ప్లేయర్, లండన్ ఒలింపిక్స్‌లో పోటీపడ్డ విష్ణువర్ధన్ దిశానిర్దేశనంలో హృతిక్ ముందుకు సాగుతున్నాడు. హైదరాబాద్ హబ్సిగూడలోని ట్రినిటీ చాలెంజర్స్ టెన్నిస్ అకాడమీలో కోచ్‌లు హెన్రీ ప్రవీణ్, రామకృష్ణ వద్ద హృతిక్ శిక్షణ తీసుకుంటున్నాడు. పుణేలోని ఆర్యన్ పంప్స్‌కు చెందిన ప్రశాంత్ సుతార్ హృతిక్‌కు స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్నారు. తాజా ఆసియా టైటిల్‌తో హృతిక్ ఈ ఏడాది డిసెంబర్లో అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగే ప్రతిష్టాత్మక ఎడ్డీ హెర్, ఆరెంజ్ బౌల్ చాంపియన్íÙప్ పోటీలకు కూడా అర్హత సాధించాడు. -
కుక్కలు చుట్టుముట్టాయ్..ఈ బుడ్డోడి ధైర్యం చూడండి!
చిన్నారులపై కుక్కలు పాశవివంగా దాడిచేసి, ప్రాణాల్ని తీసేసిన ఘటనలు మనందరి హృదయాల్ని పిండేసాయి. కారణాలేమైనప్పటికీ పిల్లలు,పెద్దలపై కుక్కల స్వైర విహారం ఉదంతాలు ఈ మధ్య కాలంలో కనిపించాయి. అలాగే రోడ్డుపై వెళుతున్నపుడు కూడా ఒక్కసారిగా మీదకు ఉరుకుతాయి. భయంకరంగా మొరుగుతూ కొద్ది దూరం వెంబడిస్తాయి కూడా. ద్విచక్రవాహనదారులకు ఇలాంటి అనుభవాలు కోకొల్లలు. అయితే కుక్క మనపై దాడికి ప్రయత్నించినా, గట్టిగా మొరిగినా పరిగెత్తకుండా, నిలబడి గట్టిగా అదిలిస్తే చాలా వరకు వెనక్కి తగ్గుతాయి. దాదాపు అలాంటి వీడియో ఒకటి ఎక్స్‌లో ఆకట్టుకుంటోంది.ప్రమాదం మన ముందుకొచ్చినపుడు ధైర్యంగా ఉండటమే ఏకైక మార్గం అంటూ ఒక వీడియోను ది ఫిగెన్ అనే ఎక్స్ యూజర్ దీన్ని షేర్ చేశారు. ఇది ఎక్కడ జరిగింది అనేది వివరాలు అందుబాటులో లేన్నప్పటకీ, ఈ ఫుటేజ్ ప్రకారం ఇద్దరు చిన్నారులు (పాప,బాబు) వీధిలో నడుస్తుండగా కుక్కలు ఎదురపడ్డాయి. దీంతో పక్కనున్న పాప భయంతో పారిపోయింది. తరువాత ఒంటరిగా మిగిలిన చిన్నారి మీదికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగైదు కుక్కలు ఎగబడ్డాయి. అప్పుడా బాలుడు ధైర్యంగా నిలబడిన తీరు విశేషంగా నిలిచింది.When you're cornered, your only option is to be brave ... pic.twitter.com/uLDXhtNvcw— Figen (@TheFigen_) September 11, 2024ఆ బాలుడి గుండె ధైర్యానికి సమయస్ఫూర్తికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. నువ్వెంత బలవంతుడివో నీకు తెలియదు.. ధైర్యంగా ఉండటమే నీకున్న ఏకైక మార్గం అంటూ ఒక యూజర్ వ్యాఖ్యానించారు. -
యూట్యూబ్‌లో చూస్తూ సర్జరీ.. అంతా బాగుంది అని అనుకునే లోపే
దేశంలో నకిలీ డాక్టర్ల రోజురోజుకి పెరిగిపోతున్నారు. వీరి కారణంగా అమాయకులు ప్రాణాల్ని పోగొట్టుకుంటున్నారు. తాజాగా వాంతులు అవుతున్నాయని 15ఏళ్ల బాలుడిని ఓ ఆస్పత్రికి తరలించారు అతని తల్లిదండ్రులు. ఫేక్ డాక్టర్ చికిత్స చేయడంతో వాంతులు తగ్గాయి. కానీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా బాలుడికి యూట్యూబ్ చూస్తూ గాల్ బ్లాడర్ ఆపరేషన్ చేశాడు. పరిస్థితి విషమించడంతో అత్యసర చికిత్స కోసం సదరు డాక్టర్.. మరో ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశాడు. అయితే మార్గం మధ్యలో బాలుడు చనిపోవడంతో డెడ్ బాడీని ఆస్పత్రి ఆవరణలో వదిలేసి పారిపోయాడు నకిలీ డాక్టర్. పోలీసుల తెలిపిన వివరాల మేరకు.. బీహార్ రాష్ట్రం సరణ్ ప్రాంతానికి చెందిన 15ఏళ్ల బాలుడు అనారోగ్యానికి గురయ్యాడు. వాంతులు చేసుకున్నాడు. మా అబ్బాయికి పలు మార్లు వాంతులయ్యాయి. చికిత్స కోసం గణపతి ఆస్పత్రికి తీసుకొచ్చాం.ఆస్పత్రిలో జాయిన్ చేయించిన కొద్ది సేపటికి వాంతులు తగ్గిపోయాయి. కానీ డాక్టర్ అజిత్ కుమార్ పూరి మాత్రం బాలుడికి ఆపరేషన్ చేశారు. యూట్యూబ్ వీడియోస్ చూసి ఆ ఆపరేషన్ చేయడంతో నా కుమారుడు మరణించాడు అని బాలుడి తండ్రి చందన్ షా గుండెలవిసేలా రోదిస్తున్నారు.మేం డాక్టర్లమా.. లేదంటే మీరు డాక్టర్లా.. గణపతి ఆస్పత్రికి తీసుకెళ్లిన తర్వాత వాంతులు తగ్గిపోయాయి. కానీ డాక్టర్ ఓ పని మీద తండ్రిని పంపించి, కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా నా మనువడికి ఆపరేషన్ చేయడం ప్రారంభించారు. అనుమతి లేకుండా ఆపరేషన్ ఎందుకు చేస్తున్నారు? అని అడిగితే. పేషెంట్ నొప్పితో బాధపడుతున్నాడు. మేం డాక్టర్లమా? మీరు డాక్టర్లా? అంటూ మండిపడ్డారు. నా మనవడి జీవితం ఇలా ముగుస్తుందనుకోలేదు అయినా, ఆపరేషన్ చేశారు. అంతా బాగానే ఉందని అనుకున్నాం. కానీ ఆపరేషన్ జరిగిన సాయంత్రం నా మనవడి శ్వాస ఆగింది. సీపీఆర్ చేసిన నకిలీ డాక్టర్ అత్యవసర చికిత్స కోసం పాట్నాకు తరలించారు. మార్గ మధ్యలోనే మృతి చెందడంతో నా మనవడి మృతదేహాన్ని ఆస్పత్రి మెట్లపై వదిలి పారిపోయారు. వాడి జీవితం ఇలా అర్ధాంతరంగా ముగుస్తుందని’ నేను అనుకోలేదని బాలుడి తాత ప్రహ్లాద్ ప్రసాద్ షా విచారం వ్యక్తం చేశాడు.విషాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో నకిలీ డాక్టర్ అజిత్ కుమార్ పూరీపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. -
విమానంలో తీసుకొచ్చి... ఛత్తీస్‌గఢ్ బాలుడి ప్రాణాలు కాపాడి..
సాక్షి, హైదరాబాద్: అరుదైన ఇన్ఫెక్షన్ కారణంగా తీవ్రంగా జ్వరం, ఫిట్స్, మెదడులో ప్రెషర్ తగ్గిపోవడం లాంటి సమస్యలు తలెత్తి, చివరకు తన సొంత తల్లిదండ్రులను కూడా గుర్తుపట్టలేని పరిస్థితికి ఓ బాలుడు చేరాడు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ ప్రాంతానికి చెందిన ఈ 12 ఏళ్ల బాలుడిని తొలుత స్థానికంగానే ఒక ఆస్పత్రిలో చేర్చి, పరిస్థితి విషమించడంతో సికింద్రాబాద్‌లోని కిమ్స్ కడల్స్ ఆస్పత్రికి సమాచారం ఇచ్చారు. ఇక్కడినుంచి కిమ్స్ కడల్స్ కొండాపూర్ ఆస్పత్రికి చెందిన వైద్యులు చార్టర్డ్ విమానంలో రాయ్‌పూర్ వెళ్లి, అక్కడినుంచి బాబును ఇక్కడకు తీసుకొచ్చి చికిత్స అందించారు. ఇందుకు సంబంధించిన వివరాలను కిమ్స్ కడల్స్ ఆస్పత్రి కొండాపూర్‌కి చెందిన పీడియాట్రిక్స్ విభాగం క్లినికల్ డైరెక్టర్, పీడియాట్రిక్ ఐసీయూ విభాగాధిపతి డాక్టర్ పరాగ్ శంకర్రావు డెకాటే తెలిపారు. “ఆ బాబుకు తీవ్రమైన జ్వరం, ఫిట్స్, మెదడులో ప్రెషర్ తగ్గిపోవడం లాంటి సమస్యలు వచ్చాయి. దాంతో అక్కడి వైద్యులు మెరుగైన చికిత్స కోసం మమ్మల్ని సంప్రదించారు. మేం రాయ్‌పూర్ వెళ్లేలోపు అతడికి ఫిట్స్ పెరగడం, బీపీ తగ్గిపోవడం, బాగా మత్తుగా ఉండిపోయి, ఊపిరి కూడా అందని పరిస్థితి వచ్చింది.ఇక్కడినుంచి వెళ్లగానే ముందుగా ఆ బాబుకు వెంటిలేటర్ పెట్టి, పరిస్థితిని కొంత మెరుగుపరిచాం. మెదడులో ప్రెషర్, ఫిట్స్ సమస్యలు తగ్గించేందుకు మందులు వాడాం. తర్వాత అక్కడినుంచి విమానంలో హైదరాబాద్‌కు తీసుకొచ్చాం. ఇలా విమానంలో తీసుకురావడానికి మా పీడియాట్రిక్ ఐసీయూ కన్సల్టెంట్ డాక్టర్ తరుణ్ సాయపడ్డారు. ఆ బాలుడు ఇక్కడ 9 రోజులు ఆస్పత్రిలో ఉన్నాడు. మధ్యలో బ్రెయిన్ ప్రెషర్ పెరిగింది, ఫిట్స్ వచ్చాయి, అన్నింటినీ తగిన మందులతో నయం చేశాం. అతడికి వచ్చిన రికెట్షియల్ ఇన్ఫెక్షన్ అనేది రాయ్‌పూర్ ప్రాంతంలో చాలా అరుదు. దీనివల్ల అతడికి మెదడులో మెర్స్ అనే సమస్య వచ్చింది. అతడికి తర్వాత కాలేయం, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు కూడా వచ్చినా వాటినీ మందులతో నయం చేశాం. ఇక్కడ చేరిన నాలుగోరోజే వెంటిలేటర్ తీసేశాం. తొమ్మిదో రోజుకు పూర్తిగా నయం కావడంతో డిశ్చార్జి చేశాం” అని డాక్టర్ పరాగ్ డెకాటే చెప్పారు. దేశంలోని ఏ ప్రాంతంలో ఎంత సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న పేషెంట్లయినా ఉండవచ్చని, వారికి చికిత్స చేయగల సామర్థ్యం కిమ్స్ కడల్స్ ఆస్పత్రికి ఉందని డాక్టర్ అవినాష్, డాక్టర్ కళ్యాణ్ (పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్) తెలిపారు. ఇక్కడ ఉన్న అత్యాధునిక వైద్య సదుపాయాలు అక్కడ ఉండకపోవచ్చని చెప్పారు. డాక్టర్ ప్రభ్‌జోత్, డాక్టర్ జయంత్ కృష్ణ (పీడియాట్రిక్ న్యూరాలజిస్టులు), డాక్టర్ పాండు (పీడియాట్రిక్ గ్యాస్ట్రోఎంటరాలజిస్టు), డాక్టర్ మౌనిక (పీడియాట్రిక్ నెఫ్రాలజిస్టు), డాక్టర్ ప్రతీక్ వై పాటిల్ (ఇన్ఫెక్షియస్ డిసీజెస్)లతో కూడిన బృందం ఆ బాలుడికి పూర్తి చికిత్స చేసింది. “ఎయిర్ అంబులెన్స్ అనేది కొంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే గానీ, ప్రాణాలకంటే ఏదీ ఎక్కువ కాదు. అత్యాధునిక సదుపాయాలు లేని నగరాల నుంచి అవి ఉన్నచోటుకు సరైన సమయానికి సమర్థమైన చికిత్స కోసం తీసుకురావడం కీలకం. తొలిసారి ఎక్మో పెట్టి ఒక పాపను విమానంలో ఇక్కడకు తీసుకొచ్చి నయం చేశాం. ఇలా విమానంలో తీసుకొచ్చినవాటిలో ఇది రెండో కేసు. ఇటీవలే మేము నాగ్‌పూర్ నుంచి ఎక్మో పెట్టి, 9 గంటల రోడ్డు ప్రయాణంలో హైదరాబాద్ తీసుకొచ్చాము. ఇది ఎక్మో పెట్టి తీసుకొచ్చినవాటిలో ప్రపంచంలోనే అత్యంత సుదూర ప్రయాణం. ఒక రకంగా అత్యాధునిక వైద్య సదుపాయాలతో కూడిన యూనిట్‌ను రోడ్డుమీదే సృష్టించడం అవుతుంది. ఇలాంటి అత్యంత సంక్టిష్టమైన కేసులకు కూడా సమర్థవంతంగా చికిత్స చేసిన చరిత్ర కిమ్స్ కడల్స్ ఆస్పత్రికి ఉంది” అని డాక్టర్ పరాగ్ డెకాటే వివరించారు. -
అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకు తప్పొప్పులు నేర్పించాలి: బాంబే హైకోర్టు
ముంబై: బద్లాపూర్‌లోని ఓ పాఠశాలలో ఇద్దరు చిన్నారులపై లైంగిక వేధంపుల కేసులో బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అబ్బాయిలకు చిన్నతనం నుంచే వారి ఆలోచన ధోరణిలో మార్పులు తీసుకురావాలని తెలిపింది. అమ్మాయిలను, మహిళలను గౌరవించడం నేర్పంచాలని సూచించింది. సమాజంలో పురుషాధిక్యత కొనసాగుతోందని.. అందుకే మగపిల్లలకు చిన్నప్పటి నుంచే చెడు ప్రవర్తనపై అవగాహన కల్పించాలని జస్టిస్ రేవతి మోహితే దేరే, జస్టిస్ పృథివీరాజ్ చవాన్లతో కూడిన డివిజన్ బెంచ్ సూచించింది.ద్లాపూర్లోని తమ పాఠశాలలో ఇద్దరు నాలుగేళ్ల చిన్నారులపై లైంగిక వేధింపుల కేసుపై సుమోటోగా స్వీకరించిన బాంబే హైకోర్టు..తాజాగా విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం మాట్లాడుతూ.. బాలురకు లింగ సమానత్వం, సున్నితత్వం గురించి అవగాహన కల్పించాలని తెలిపింది. సమాజంలో పురుషాధిక్యత కొనసాగుతోందని, పిల్లలకు సమానత్వం గురించి బోధించే వరకు ఏదీ మారదని పేర్కొంది.‘సమాజంలో పురుషాధిక్యత ఇప్పటికీ ఉన్నాయి. మన ఇంట్లో పిల్లలకు సమానత్వం గురించి చెప్పేంత వరకు ఏమీ జరగదు. అప్పటి వరకు నిర్భయ వంటి చట్టాలన్నీ పని చేయవు. మనంం ఎప్పుడూ అమ్మాయిల గురించే మాట్లాడుతుంటాం. అబ్బాయిలకు ఏది ఒప్పు, తప్పు అని ఎందుకు చెప్పకూడదు? అబ్బాయిల ఆలోచనా ధోరణిని చిన్నతనంలోనే మార్చాలి. మహిళలను గౌరవించడం నేర్పించాలి’ అని పేర్కొంది.కాగా గత వారం బద్లాపూర్‌లో కిండర్ గార్టెన్ విద్యార్థినులపై పాఠశాల అటెండర్ లైంగిక వేధింపులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తడంతో రాష్ట్ర ప్రభుత్వం నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. రిటైర్డ్ పోలీసు, రిటైర్డ్ జడ్జి, రిటైర్డ్ అధ్యాపకుడు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యుడితో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది. పాఠశాలల్లో ఈ ఘటనలను ఎలా అరికట్టాలనే దానిపై కమిటీ సిఫారసులతో ముందుకు రావలని తెలిపింది. -
ఖమ్మంలో సంచలనం రేకెత్తించిన బాలుడి దత్తత ఘటన సుఖాంతం
-
హైదరాబాద్: కుక్కల దాడిలో మరో బాలుడి మృతి
సాక్షి, హైదరాబాద్: వీధి కుక్కల దాడులకు పసివాళ్లు బలవుతున్నారు. నగరంలో శునకాల దాడిలో మరో బాలుడు మృతి చెందాడు. 20 రోజుల క్రితం ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్‌లో కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.. కుక్కలు పిల్లలపై దాడులు చేస్తున్నాయని గ్రామస్తులు ఆందోళనకు దిగారు.మరో ఘటనలో రంగారెడ్డి జిల్లా కోకాపేట్ కుక్కలు స్వైర విహారం చేశాయి. కుక్కల దాడిలో చిన్నారి తీవ్ర గాయలయ్యాయి. వెంటనే ఆ చిన్నారిని ఆసుప్రతికి తరలించారు.కాగా, ఇటీవల రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బట్టోనితాళ్లలో అచేతన స్థితిలో అనారోగ్యంతో మంచానికే పరిమితమైన వృద్ధురాలిపై కుక్కలగుంపు దాడి చేసి ప్రాణాలు తీసిన సంగతి తెలిసిందే. తలను పీకి.. పొట్టను చీల్చి పేగులు, కాలే యాన్ని తినేశాయి.బట్టోనితాళ్లకు చెందిన పిట్ల రామలక్ష్మి(85) ఇంట్లో నిద్రిస్తుండగా బుధవారం అర్ధరాత్రి వీధికుక్కల గుంపు విచక్షణారహితంగా దాడిచేసి ముఖాన్ని కొరుక్కుతిని, పొట్టను చీల్చాయి. వృద్ధాప్యం, అనారోగ్యంతో కదలలేని స్థితిలో ఉన్న రామలక్ష్మి ఎదురుతిరగలేని పరిస్థితిలో ప్రాణాలు విడిచింది. రామలక్ష్మి ము ఖం పూర్తిగా ఛిద్రమై ఎముకలు తేలాయి. ఆమె పడుకున్న మంచంలోనే ప్రాణాలు వదలగా, రక్తం ధారలు కట్టింది. -
స్కూటీ లిఫ్ట్ అడిగి.. బస్సు, రైలెక్కి
మీర్‌పేట: ట్యూషన్‌కు వెళ్తున్నాని ఇంట్లో నుంచి వెళ్లిన బాలుడు కనిపించకుండా పోయాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. జిల్లెలగూడ దాసరి నారాయణరావు కాలనీకి చెందిన మధుసూదన్‌రెడ్డి, కవిత దంపంతుల కుమారుడు మహిధర్‌రెడ్డి(13) స్థానికంగా ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుతన్నారు. రోజుమాదిరిగానే ఆదివారం మధ్యాహ్నం 3.30గంటలకు తన అన్నతో కలిసి సర్వోదయనగర్‌లో ట్యూషన్‌కు బయలుదేరాడు. వీరు నిత్యం లిఫ్ట్ అడిగి వెళ్తుంటారు. ఓ బైక్ ఆపగా.. అన్నను వెళ్లమని చెప్పిన మహిధర్ తాను తర్వాత వస్తానన్నాడు. అనతరం మరో స్కూటీని లిఫ్ట్ అడిగి మీర్పేట్ బస్టాండ్ వద్ద దిగి అక్కడ నుంచి మిథాని డిపోకు చెందిన ఉమెన్స్ కాలేజీ బస్‌లో మలక్‌పేట్ రైల్వే స్టేషన్ బస్టాప్‌లో దిగాడు. రైల్వే స్టేషన్‌కు వెళ్లి టికెట్ తీసుకుని రైలు ఎక్కాడు. ముందుగా కిడ్నాప్ అనుకుని.. ట్యూషన్‌కు వెళ్లిన కొడుకు తిరిగి రాకపోవంతో కంగారుపడిన తల్లిదండ్రులు కిడ్నాప్ అనుకుని మీర్‌పేట ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఇంట్లో నుంచి వెళ్లేప్పుడు రూ.2 వేలు తీసుకెళ్లిన్నట్లు గుర్తించారు. పోలీసులు సీసీ పుటేజీలు పరిశీలించగా బాలుడు తనంతట తానే లిఫ్ట్ అడిగి.. బస్ ఎక్కి, అనంతరం రైలులో వెళ్లిన్నట్లు గుర్తించారు. సొంతూరు కర్నూల్ వెళ్లి ఉంటాడని భావించి అక్కడి పోలీసులు, బంధువులను అప్రమత్తం చేశామని ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపారు. ఏసీపీ కాశిరెడ్డి మీర్‌పేటకు వచ్చి సీసీ పుటేజీ పరిశీలించారని.. నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి వెతుకుతున్నామని చెప్పారు. ఇదిలా ఉండగా గోవా టికెట్ తీసుకున్న బాలుడు రైలెక్కి అక్కడకు వెళ్లినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. -
బాలుడు కిడ్నాప్.. ఆందోళనలో తల్లిదండ్రులు
-
అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిల్లోనే టైప్-1 డయాబెటిస్ ముప్పు ఎక్కువ
ఆధునికకాలంలో చాలామందిని వేధిస్తున్న సమస్య డయాబెటిస్. అయితే తాజా అధ్యయనంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమ్మాయిల కంటే అబ్బాయిల్లోనే టైప్ 1 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని యూకే లోని యూనివర్శిటీ ఆఫ్ ఎక్సెటర్‌కి చెందిన పరిశోధనా బృందం వెల్లడించింది. చిన్నపిల్లలకు టైప్-1 డయాబెటిస్ (T1D) వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని ఈ అధ్యయనం కనుగొంది. తాజా అధ్యయనం ప్రకారం అమ్మాయిల్లో 10 ఏళ్ల తర్వాత టైప్ 1 మధుమేహం రిస్క్ గణనీయంగా తగ్గుతుంది. కానీ అబ్బాయిల్లో మాత్రం ఈ ముప్పు స్థిరంగా ఉంటుందని పరిశోధన వెల్లడించింది. సెక్స్ హార్మోన్లు పాత్ర పోషిస్తాయని పరిశోధన తెలిపింది. పురుషుల్లోని ఆటోఆంటిబాడీల అభివృద్ధితో దీనికి సంబంధం ఉండవచ్చని సూచించింది. రోగనిరోధక వ్యవస్థ, దీనికి సంబంధించిన ప్రోటీన్లైన్ ఆటోఆంటిబాడీ ఎక్కువున్న అబ్బాయిల్లో ప్రమాదం ఉందని అధ్యయనం చూపించింది. వీరు మెజారిటీ ఆటో ఇమ్యూన్ వ్యాధుల మాదిరిగా కాకుండా ఈ తరహా మధుమేహానికి ప్రభావితమవుతారని వెల్లడించింది.ఈ అధ్యయనంలో కంప్యూటర్, స్టాటిస్టికల్ మోడలింగ్ డేటా సాయంతో పరిశోధకులు టీఐడీ ఉన్న వ్యక్తుల 235,765 మంది బంధువులను పరిశీలించారు. ఇందులో మగవారిలో అధిక ఆటోయాంటిబాడీ స్థాయిలు ఉన్నట్లు కనుగొన్నారు (అమ్మాయిల్లో: 5.0శాతం, పురుషుల్లో: 5.4శాతం). అలాగే మగవారు మల్టిపుల్ యాంటిబాడీ ప్రతిరోధకాలకు పాజిటివ్ వచ్చే అవకాశం ఉన్నందున వీరిలో ఐదేళ్ల ముందే ఈ టీఐడీ వచ్చే అవకాశం ఉంది. పదేళ్ల వయస్సులో వచ్చే ప్రమాదంలో మార్పు టీనేజ్-సంబంధిత హార్మోన్లు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నఅధ్యయన బృందం మరింత పరిశోధన కోసం పిలుపునిచ్చింది. ఈ సంవత్సరం సెప్టెంబర్ 9-13 వరకు జరిగే స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో యూరోపియన్ అసోసియేషన్ వార్షిక సమావేశంలో ఈ ఫలితాలను ప్రెజెంట్ చేయనున్నారు. -
ప్లాన్ ప్రకారమే ఎత్తుకెళ్లాడు.. తండ్రి రోదన..