హోసూరు(బెంగళూరు): అడిగిన వెంటనే సిగరెట్ కొనివ్వలేదని ఓ వ్యక్తి బాలుడి ప్రాణం తీసిన ఘటన క్రిష్ణగిరి తాలూకా పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకొంది. వివరాలు.. క్రిష్ణగిరి సమీపంలోని పాంచాలియూరు గ్రామానికి చెందిన ఇర్ఫాన్ (14) అదే ప్రాంతంలోని మద్యంషాపు వద్ద బుధవారం రాత్రి నడుచుకుంటూ వెళ్తుండగా అక్కడున్న ఓ మందుబాబు బాలున్ని పిలిచి దుకాణంలో సిగరెట్ కొనిపెట్టాలన్నాడు.
అందుకు బాలుడు నిరాకరించాడు. ఆగ్రహంతో బాలుడిపై మందుబాబు తన ద్విచక్ర వాహనంతో ఢీకొట్టి హత్య చేశాడు. విషయం తెలుసుకొన్న బాలుడి బంధువులు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళన చేపట్టారు. క్రిష్ణగిరి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులతో శాంతి చర్చలు జరిపారు. ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది.
చదవండి కానిస్టేబుల్ భార్య పైశాచికం.. ప్రియుడి మోజులో పడి, ఇంటికి పిలిచి..
Comments
Please login to add a commentAdd a comment