Karnataka: Married Woman Kills Lover Over Extra Marital Affair - Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధం.. ముందే వార్నింగ్‌.. ప్రియుడు ఇంట్లోకి రాగానే..

Aug 17 2023 11:59 AM | Updated on Aug 17 2023 2:47 PM

Karnataka: Married Woman Kills Lover Over Extra Marital Affair - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

హోసూరు: మహిళ ఇంట్లో ప్రియుడు హత్యకు గురైన సంఘటన బేరికె పోలీస్‌స్టేన్‌ పరిధిలో చోటు చేసుకొంది. వివరాలు.. బేరికె సమీపంలోని కొళదాసపురం గ్రామానికి చెందిన జ్యోతి (39), ఈమె భర్త కేశవమూర్తి పదేళ్ల క్రితం మృతి చెందాడు. జ్యోతి అంగన్‌వాడీ ఉద్యోగిగా పనిచేస్తూ వచ్చింది. బేరికె సమీపంలోని మహాదేవపురం గ్రామానికి చెందిన వెంకటేష్‌ (40)తో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధం ఏర్పడింది.

వెంకటేష్‌ తరచూ జ్యోతి ఇంటికి వెళ్లి వస్తుండేవాడు. ఇది తెలిసి జ్యోతి సోదరి కొడుకు హరీష్‌ (23) మీ వల్ల పరువు పోతోందని వారిద్దరినీ మందలించాడు. దీంతో ఆమె ప్రియున్ని ఇంటికి రావద్దని చెప్పింది. అయినప్పటికీ మంగళవారం వెంకటేష్‌ జ్యోతి ఇంటికి రాగా తలుపు వేసి జ్యోతి, హరీష్‌ కలిసి కట్టెలతో అతనిపై దాడి చేశారు. తీవ్ర గాయాలేర్పడిన ఇతన్ని స్థానికులు చికిత్స కోసం హోసూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ చనిపోయాడు. బేరికె పోలీసులు కేసు నమోదు చేసుకొని జ్యోతి, హరీష్‌ను అరెస్ట్‌ చేశారు.

చదవండి: 15 రోజులకు ఒకసారి ఇంటికి.. భార్య ప్రవర్తనపై అనుమానం.. ఓ రోజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement