
దొడ్డబళ్లాపురం(బెంగళూరు): వివాహితను ఇంట్లో హత్య చేసిన సంఘటన దొడ్డ తాలూకా వడగెరె గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామం నివాసి చన్నబసవయ్య భార్య భాగ్యశ్రీ (35)కి ఇదే గ్రామానికి చెందిన రియాజ్ (27)అనే వ్యక్తితో ఆర్థిక లావాదేవీలతో పాటు వివాహేతర సంబంధం ఉండేది. కొన్నాళ్ల కిందట గొడవలు మొదలై దూరంగా ఉంటున్నారు. ఆదివారం తెల్లవారుజామున భాగ్యశ్రీ ఇంటికి వెళ్లిన ఒక వ్యక్తి తలుపులు తట్టాడు.
తలుపులు తెరవగానే ఆమెను బయటకు లాగి కత్తితో పొడిచి హత్య చేసి పరారయ్యాడు. ఆ సమయంలో భాగ్యశ్రీ పిల్లలు ఇద్దరూ అక్కడే ఉన్నారు. భర్త బంధువుల ఇంట్లో వేడుక ఉందని పొరుగూరికి వెళ్లాడు. భర్త ఫోన్ స్విచాఫ్‌లో ఉంది, మరోవైపు రియాజ్ కూడా పరారీలో ఉన్నాడు. దీంతో పోలీసులు ఇద్దరి మీదా అనుమానం వ్యక్తం చేశారు. దొడ్డ బెళవంగల పోలీసులు కేసు నమోదు చేశారు.
చదవండి: మంత్రి కొడుకు అరాచకం.. మహిళపై అత్యాచారం చేసి ఫొటోలు, వీడియోలు తీసి..
Comments
Please login to add a commentAdd a comment