childrens
-
చిన్నారుల రక్షణ బాధ్యత అందరిదీ!
నేను ఇటీవల ప్రచార మాధ్యమాలలో, సోషల్ మీడియాలో పోక్సో చట్టం అనే పదాన్ని తరచు వింటున్నాను. దీని గురించి వివరించగలరా?– సంకా పవన్ కుమార్, తెనాలిచిన్నారులపై లైంగిక దాడులు జరగడం ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా వినపడుతోంది. అంతకుముందు చిన్నారులపై లైంగిక దాడులు లేవని కాదు. ఈ మధ్యకాలంలోనే ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. చిన్నారులపై లైంగిక దాడులను అరికట్టడానికి ఉన్న కఠినమైన పోక్సో చట్టం (లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం) కూడా ఈ మధ్యకాలంలో చాలా కేసులను బయటకు తీసుకు వచ్చింది. 2024 ఎన్.సి.ఆర్.బి లెక్కల ప్రకారం 2019 నుంచి 31–మే 2024 వరకు దేశవ్యాప్తంగా 2,99,759 పోక్సో కేసులు నమోదు కాగా తెలంగాణలో 2,731 – ఆంధ్రప్రదేశ్‌లో 11,774 కేసులు నమోదయ్యాయి. గత ఐదు సంవత్సరాలలో దాదాపుగా 20 శాతం చిన్నారులపై లైంగిక దాడుల కేసులు పెరిగినట్లుగా చెబుతున్న అంకెలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒక అంచనా ప్రకారం వెలుగులోకి వస్తున్న కేసుల కన్నా నమోదు కాని కేసుల సంఖ్య రెండింతల పైమాటే!చట్ట ప్రకారం మైనర్ బాలిక/బాలుర పై ఏ విధమైన లైంగిక హింస లేదా దాడి జరుగుతున్న విషయం తెలిసినవారు కచ్చితంగా ఫిర్యాదు చేయాలి. లైంగిక దాడి జరిగిందన్న ఖచ్చితమైన సమాచారం మాత్రమే కాదు. లైంగిక దాడి జరిగి ఉండవచ్చు లేదా దాడి జరిగి ఉండే ఆస్కారం ఉంది అన్న సందేహం ఉన్న వారు కూడా ఫిర్యాదు చేయాలి. అలా తెలిసినప్పటికీ ఫిర్యాదు చేయకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే 18 సంవత్సరాలు దాటిన వారెవరైనా సరే సెక్షన్ 19 పోక్సో చట్టం కింద ఆరు నెలల నుండి ఏడాది వరకు జైలు శిక్ష పడుతుంది. ఈ అంశంపై ప్రభుత్వాలు, అలాగే మీడియా కూడా తగిన ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉంది. పేరెంటింగ్ అంటే కేవలం తల్లిదండ్రులకు సంబంధించినది మాత్రమే కాదు. సమాజానిది కూడా!లైంగిక హింస, లైంగిక దాడి, మైనర్ల ఫోటోలు – వీడియోలు అశ్లీల చిత్రాలకి వాడడం, చిన్నపిల్లల అశ్లీల చిత్రాలు/వీడియోలు కలిగి ఉండడం వంటివి కూడా పోక్సో చట్టం కింద నేరాలే. ఆటిజం వంటి మానసిక ఎదుగుదల లేమి, మతిస్థిమితం లేని పిల్లలపై, అలాగే చిన్నపిల్లలపై అధికారం కలిగిన వ్యక్తులు (తల్లిదండ్రులు, టీచర్లు, కొన్ని ప్రత్యేక వృత్తులలో ఉండే అధికారులు మొదలైన వారు) లైంగిక దాడులకు పాల్పడినట్లయితే అవి ‘అతి తీవ్రమైన’ నేరాలుగా పరిగణించబడతాయి. అందుకుగాను యావజ్జీవ కారాగార శిక్ష, ఉరిశిక్ష అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి మన చుట్టూ జరుగుతున్న పరిణామాలను గమనిస్తూ, బాలలకు ఎటువంటి లైంగిక ఇబ్బంది కలుగుతుందేమోనన్న సందేహం ఉన్నా తక్షణం పోలీసులకి తెలియజేయడం అందరి బాధ్యత. – శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది(న్యాయపరమైన సమస్యలు, సందేహాలకోసం sakshifamily3@gmail.comMýకు మెయిల్ చేయవచ్చు)(చదవండి: ఫస్ట్ విమెన్ స్కూబా టీమ్) -
ఆ జంటకి వివాహమై 84 ఏళ్లు..!
వివాహమై 40 ఏళ్లు లేదా 60 ఏళ్లు అవ్వొచ్చు. మరీ ఎక్కువ కాలం ఇరువురు బతికుంటే దగ్గర దగ్గర 66 ఏళ్లు కూడా అవ్వొచ్చు. అంతేగానీ అన్నేళ్లు ఇరువురి జీవనయానం సాగించడం అంత ఈజీ కాదు. మధ్యలో ఎవరో ఒకరు కాలం చెందడం సర్వసాధారణం. అందులోనూ నేటి యువత పెళ్లై పట్టుమని రెండేళ్లు కూడా కలిసి ఉండటం లేదు. అలాంటి జంటల సంఖ్య వేళ్లతో లెక్కించలేనంత మంది ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో..దగ్గర దగ్గర సెంచరీకి సమీపం వరకు అన్నేళ్లు కలిసి సహచర్యం చేసిన జంటగా రికార్డు దక్కించుకుంది ఈ వృద్ధ జంట. వారిక ఏకంగా వందమంది పైగా మనవరాళ్లు, మనవళ్లు ఉన్నారు. ఇక ఆ వృద్ధ దంపతుల వయసు ఎంత ఉండొచ్చు, పెళ్లి ఎప్పుడైంది వంటి విశేషాల గురించి తెలుసుకుందామా..!.పెళ్లై 84 ఏళ్లు గడిచిన వృద్ధులుగా ఈ బ్రెజిలియన్ జంట నిలిచింది. సుదీర్ఘ కాలం అన్యోన్య దాంపత్య జీవితం గడిపిన జంటగా రికార్డు సృష్టించింది. ఆ దంపతుల పేర్లు మనోయల్ ఏంజెలిమ్ డినో, మరియా డి సౌసౌ డినో. వారి ప్రేమ కథ అత్యంత విచిత్రంగా జరిగింది. ఇద్దరు తమ కుటుంబాల పోషణ కోసం వ్యవసాయం చేస్తుండేవారు. ఇరువురు ఆ వ్యవసాయ వృత్తి ద్వారానే ఇరువురికి పరిచయం ఏర్పడింది. అయితే మళ్లీ విధి అనుకోకుండా మరోసారి ఎదురపడేలా చేసింది. ఇక అప్పుడే ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడింది. ఇక మనోయల్ కూడా తన మనసులోని మాటను మరియాకి చెప్పేశాడు. అందుకు సుమఖత వ్యక్తం చేసింది. అలా ఇద్దరు 1940లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఇద్దరూ పోగాకు చుట్టడాన్ని జీవనోపాధిగా చేసుకుని బతుకు సాగించేవారు. ఇప్పుడు మనోయల్ వయసు 105 ఏళ్ల, మరియాకి 101 ఏళ్లు. ప్రస్తుతం ఇరువురు విశ్రాంతి జీవితం గడుపుతున్నారు. ఇన్నాళ్లు తమ వైవాహిక జీవితంలో ఇంతలా కలిసి ఉండటానికి కారణం ఒక్కటే ప్రేమ. అది తమ ఇద్దరి మధ్య మరొకరు వచ్చి అగాథం సృష్టించ లేనంత నమ్మకం, ప్రేమ వంటివి స్ట్రాంగ్ ఉన్నాయని చెబుతోంది ఈ జంట. "ఇరువురం అనుకోకుండా భార్యభర్తలమయ్యాం. మంచో చెడో వివాహ బంధంతో ఒక్కటయ్యాం. కడదాక నిలుపుకోవాలనుకున్నాం. మా ఇరువరి మధ్య ఉన్న విడదీయరాని ప్రేమ కారణంగా సుదీర్ఘకాలం అన్యోన్యంగా ఉండగలగాం." అని అంటున్నారు ఈ దంపతులు. అంతేగాదు ఎలాంటి పొరపాటు, తప్పు జరిగినా దాన్ని లేవనెత్తడం, ఆరోపణలు చేసుకోవడం వంటి వాటికి తావివ్వకోపోడం వల్లే తమ బంధం దృఢంగా ఉందని అన్నారు. అదే తమ సుదీర్ఘకాల ఆరోగ్య రహస్యానికి కారణం కూడా అని చెబుతోంది ఈ వృద్ధ జంట. నిజమే కాదు వ్యక్తిగత జీవితం ఆహ్లాదంగా ఏంటేనే కదా..మానసిక, శారీరక ఆరోగ్యం బాగుండేది. -
చిన్నారుల బర్డ్ వాక్: పక్షులతో గడిపే ఛాన్స్..!
పక్షులను చూడటం అంటే ప్రకృతితో మమేకమై గొప్ప ఆనందాన్ని పొందే అరుదైన క్షణం. ముఖ్యంగా చిన్నారులకు ఇది తెలియజేయడం అత్యంత ముఖ్యం. ఎందుకంటే వారిలా నిశితంగా గమనించడం పెద్దలకు కూడా సాధ్యం కాదు. ఎందుకంటే వారికి ప్రతీది అద్భుతంలా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే బర్డ్ ఫౌండేషన్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి గ్రేట్ బ్యాక్‌యార్డ్ బర్డ్ కౌంట్ ఈవెంట్ పేరుతో బర్డ్ వాక్‌లు ఏర్పాటు చేసి చిన్నారులు వాటితో నేరుగా గడిపే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఏటా గ్రేట్ బ్యాక్‌యార్డ్ బర్డ్ కౌంట్ ఈవెంట్ ఫిబ్రవరిలో నాలుగు రోజులు నిర్వహిస్తారు. ఈ ఏడాది అలానే ఫిబ్రవరి 15, 16 తేదీల్లో భారతదేశంలోని మొత్తం ఎనిమిది నగరాల్లో ఎనిమిది బర్డ్ వాక్‌లు నిర్వహించనుంది. ఇది ఉదయం 7.30 గంటలకు ప్రారంభమవుతుంది. భారత్లోఇన ప్రధాన నగరాలైన బెంగళూరు (కర్ణాటక), దిమాపూర్ (నాగాలాండ్), హలోల్ (గుజరాత్), జైపూర్ (రాజస్థాన్), మంగళూరు (కర్ణాటక), రాంచీ (జార్ఖండ్), త్రివేండ్రం (కేరళ), ఉజ్జయిని (మధ్యప్రదేశ్) నగరాల్లో జరగనుంది. వీటిని ఎర్లీ బర్డ్ అండ్ అటవీ బర్డ్ ఫౌండేషన్ నిర్వహిస్తాయి. ఇది అనుభవజ్ఞులైన పర్యావరణవేత్తల నేతృత్వంలో ఈ బర్డ్ వాక్ జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా చిన్నారులకు పక్షులను నేరుగా వీక్షించి, గడిపే అరుదైన అవకాశం లభిస్తుంది. గ్రేట్ బ్యాక్‌యార్డ్ బర్డ్ కౌంట్ అనేది ఒక గ్లోబల్ సిటిజన్ సైన్స్ ప్రాజెక్ట్. ఈ పేరుతో ప్రతి ఏడాది ఫిబ్రవరిలో నాలుగు రోజులు ప్రజలు పక్షులను గమనిస్తారు. అలాగే శాస్త్రవేత్తలు ప్రపంచ పక్షుల జనాభా గురించి, వాటి విశేషాల గురించి పంచుకుంటారు. ఈ ఏడాది భారత్ అనేక నగరాల్లో దీన్ని నిర్వహించనుంది. ప్రస్తుతం నిర్వహించనున్న '8 సిటీస్ 8 బర్డ్ వాక్‌లు' మాత్రం చిన్న పిల్లల కోసం ఒక ప్రత్యేక ఎడిషన్. గతేడాది వైల్డ్‌లైఫ్ వీక్ సందర్భంగా, ఆరుగురు ప్రకృతి విద్యావేత్తల ఆధ్వర్యంలో అక్టోబర్ 6, 8, 2024 తేదీలలో మొత్తం ఆరు వేర్వేరు నగరాల్లో బర్డ్ వాక్‌లను నిర్వహించారు. (చదవండి: ప్రపంచంలో అత్యంత అవినీతి దేశాలివే..భారత్ ఎన్నో స్థానంలో ఉందంటే..) -
ఏఐ... పిల్లలూ... తల్లిదండ్రులూ!
ఏఐ ప్రాధాన్యం రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో పిల్లల ప్రపంచం తీవ్ర ప్రభావానికి లోనవుతున్నది. దీన్ని దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులు బిడ్డల పెంపకంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది అత్యంత ముఖ్యమైన అంశం అయ్యింది. 2025 నుంచి 2039 మధ్య జన్మించే పిల్లలు బీటా తరం కిందకు వస్తారు. మొన్న జనవరి 1వ తేదీ అర్ధరాత్రి 12.03 నిమిషాలకు మిజోరంలోని ఐజ్వాల్ ఆసుపత్రిలో జన్మించిన అబ్బాయిని భారతదేశంలో మొదటి తరానికి చెందే తొలి ‘బీటా చిన్నారి’గా గుర్తించారు. అసలు ఆల్ఫా, బీటా... అంటూ ఈ వర్గీకరణ అంతా ఏమిటి అనుకుంటున్నారా? పిల్లలు ఏ తరంలో జన్మించారు అన్న అంశం వాళ్ల సామాజిక వ్యవహార శైలిని నిర్దేశిస్తుంది. అప్పుడు ఉండే సాంకేతికత, సామాజిక మాధ్య మాల ప్రభావం వంటి అంశాలు వాళ్ల వ్యక్తిత్వాన్ని, అనుభవాలను ప్రభావితం చేస్తాయి. అంతేకాదు. రాజకీయంగా వాళ్ల ఐడియాలజీని, వినియోగ దారునిగా వాళ్ల మనస్తత్వాన్ని నిర్దేశిస్తాయి. ఇప్పుడు పుట్టుకొస్తున్న బీటా బేబీలు ఆర్టిఫి షియల్ ఇంటెలిజెన్స్‌తో నిండిపోయిన సాంకేతిక ప్రపంచంలో జీవిస్తారు. అంటే వాళ్ల రోజువారీ జీవితం చిన్న రోబోల మధ్య సాగుతుంది. అవి చెప్పినట్టే వాళ్లు నడుచుకుంటారు. ఒక రకంగా చెప్పాలంటే అవి వీళ్లకు ట్యూటర్లు అన్న మాట. దాంతో పాటు వాటికవే నడిచే డ్రైవర్ లేని కార్లను చూస్తారు. 2035 నాటికి మొత్తం జనాభాలో 16 శాతం మంది బీటా తరానికి చెందిన వాళ్లే ఉంటా రని అంచనా.బీటా తరంలో పుట్టిన పిల్లలు ఆల్ఫా తరం కంటే చురుగ్గా, తెలివిగా, టెక్ సావీగా ఉంటారు. ఉదాహరణకి ‘వీల్స్ ఆన్ ద బస్’ ఆట ఆడాలంటే ‘అలెక్సా’ను పిలుస్తారు. లెక్కల్లో హెచ్చివేతలు అంటే మల్టిప్లికేషన్ వంటివి తెలియకపోతే ‘బ్లాక్ బాక్సు’ను ఆశ్రయిస్తారు. ఈ పరిస్థితుల్లో పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసు కోవాలని నిపుణులు సూచిస్తున్నారు.ముందుగా మార్కెట్లోకి కొత్తగా వస్తున్న యాప్స్, ప్లాట్ ఫారమ్స్ గురించి తెలుసుకోవాలి. ట్రెండ్స్‌ను అనుసరించాలి. అప్పుడు పిల్లలకు ఏవి ఉపయోగపడతాయి? ఏవి ఉపయోగపడవు అనేది తెలుసుకోగలుగుతారు. పిల్లలు ఎక్కువ టెక్నాలజీ మధ్య ఉంటారు గనుక సైబర్ మోసాల బారిన పడే ప్రమాదం ఉంది. తల్లిదండ్రులు ఈ విషయంలో పిల్లలకు తగినంత అవగాహన పెంచాలి. ఎక్కువ డివైజ్‌లపై ఆధారపడకుండా బాహ్య ప్రపంచంలో వాళ్లకు మంచి అనుభవాలను అందించాలి. కొత్త ప్రదేశాలకు తీసికెళ్లటం, బంధువులు, స్నేహితుల మధ్య గడపటం నేర్పాలి. ఇంట్లో కొంత ప్రదేశాన్ని ‘టెక్ ఫ్రీ జోన్’గా మలచాలి. ప్రధానంగా కుటుంబ సభ్యులు అందరూ కలిసి భోజనం చేసే డైనింగ్ టేబుల్ మీద ఎలాంటి డివైజ్‌లూ లేకుండా చూసుకోవాలి. పుస్తకాలు చదవటం, ఇంట్లో అమ్మానాన్నలతో మాట్లాడటం వంటివి అలవాటు చేయాలి. ఏది ఏమైనా బీటా తరం కొత్త ప్రపంచాన్ని చూస్తుంది. చుట్టూ ఉన్న వాళ్లకు కొత్త అనుభవాలను అంది స్తుంది. అవి ఎలా ఉంటాయో రానున్న రోజుల్లో మనకు అర్థం అవుతుంది.– డా‘‘ పార్థసారథి చిరువోలుసీనియర్ జర్నలిస్ట్ ‘ 99088 92065 -
ఎన్పీఎస్ వాత్సల్యకూ పన్ను ఊరట
న్యూఢిల్లీ: చిన్నారుల రిటైర్మెంట్కు గణనీయమైన నిధిని సమకూర్చుకునే ఉద్దేశ్యంతో తీసుకొచ్చిన పీఎం వాత్సల్య ఎన్పీఎస్ పథకానికి తాజా బడ్జెట్లో రూ.50,000 పెట్టుబడులపై పన్ను ఆదా ప్రయోజనం కల్పించారు. తొలిసారిగా 2024–25 బడ్జెట్లో ఈ పథకాన్ని ప్రకటించడం గుర్తుండే ఉంటుంది. మైనర్ల పేరిట తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఎన్పీఎస్ వాత్సల్య ఖాతా ప్రారంభించి ఇన్వెస్ట్ చేయవచ్చు. చిన్నారులు 18 ఏళ్లు నిండిన తర్వాత రెగ్యులర్ ఖాతా కింద మార్చుకుని, అప్పుడు వారు స్వయంగా ఇన్వెస్ట్ చేసుకోవడానికి వెసులుబాటు ఉంది. దీని కింద ఇప్పటికే 89,475 ఖాతాలు ప్రారంభమయ్యాయి. వీటి పరిధిలో రూ.62 కోట్ల పెట్టుబడులు సైతం సమకూరాయి. ఈ పథకానికి మరింత ఆదరణ కల్పించే ఉద్దేశ్యంతో తాజాగా పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని ఆర్థిక మంత్రి కల్పించారు. సాధారణ ఎన్పీఎస్ ఖాతాకు ఉన్నట్టుగానే ఎన్పీఎస్ వాత్సల్యకు ఒకే విధమైన పన్ను విధానాన్ని ప్రతిపాదిస్తున్నట్టు చెప్పారు. కాకపోతే చట్టం పరిధిలో ప్రస్తుతమున్న గరిష్ట ప్రయోజనాల పరిధిలోనే ఇది ఉంటుందన్నారు. సెక్షన్ 80 సీసీడీ(1బి) కింద సాధారణ ఎన్పీఎస్కు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50 వేల జమలపై పన్ను మినహాయింపు ప్రయోజనం ప్రస్తుతం పాత పన్ను విధానం కింద అమల్లో ఉంది. -
పిల్లలకు పాన్ కార్డ్: సింపుల్‌గా అప్లై చేయండిలా..
ప్రస్తుతం అందరికీ పాన్ కార్డు తప్పనిసరి అయిపోయింది. కేవలం ఉద్యోగం చేసేవారికి మాత్రమే కాకుండా, మైనర్స్ లేదా ఐదేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలకు కూడా పాన్ కార్డు తీసుకోవచ్చు. ఆదాయపన్ను శాఖలోని సెక్షన్ 160 ప్రకారం, పాన్ కార్డు జారీ చేయడానికి కనీస వయసు అవసరం లేదు. కాబట్టి ఎవ్వరైనా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే పిల్లలు స్వయంగా పాన్ కార్డు కోసం అప్లై చేసుకోలేరు. కాబట్టి వారి తరపున తల్లిదండ్రులే పాన్ కార్డు కోసం అప్లై చేయాల్సి ఉంటుంది.పిల్లలకు పాన్ కార్డు ఎందుకంటే?తల్లిదండ్రులు పిల్లల పేరుమీద ఏదైనా పెట్టుబడి పెట్టాలన్నప్పుడు, లేదా వారి ఆస్తులకు నామినీలుగా చేర్చినప్పుడు పాన్ కార్డు అవసరం. అంతే కాకుండా పిల్లల పేరుమీద బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి, మైనర్ కుమార్తె కోసం సుకన్య సమృద్ధి యోజన (SSY) పథకాల కోసం ఖాతాలను ఓపెన్ చేయడానికి కూడా పాన్ కార్డు అవసరం.పిల్లల కోసం పాన్ కార్డుకు అప్లై చేయాలనుకునేవారు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లలో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అప్లై చేయడానికి తల్లిదండ్రుల చిరునామా, గుర్తింపు కోసం ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు, ఓటరు ఐడీ వంటివి అవసరమవుతాయి.ఆన్లైన్లో అప్లై చేయడం.. ➤ముందుగా అధికారిక 'నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీస్ లిమిటెడ్' (NSDL) వెబ్సైట్ ఓపెన్ చేయాలి.➤అప్లికేషన్ ఫారమ్‌లో 'న్యూ పాన్ - ఇండియన్ సిటిజన్ (ఫారం 49ఏ)', 'వ్యక్తిగతం' అనే వర్గాన్ని ఎంచుకోవాలి.➤అప్లికేషన్ వివరాల విభాగంలో అవసరమైన వివరాలను ఫిల్ చేయాలి.➤మైనర్ ఫోటో & అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాలి.➤డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తరువాత డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, డిమాండ్ డ్రాఫ్ట్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజు చెల్లింపు కొనసాగించాలి. తరువాత 'సమర్పించు' బటన్‌ను క్లిక్ చేయాలి.➤పైవన్నీ పూర్తయిన తరువాత మీకు ఒక అక్నాలెజ్మెంట్ నెంబర్ వస్తుంది. దీని ద్వారా మీ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు. ధ్రువీకరణ పూర్తయిన తరువాత 15 నుంచి 20 రోజులలోపు మీ చిరునామాకు పాన్ కార్డు డెలివరీ అవుతుంది.ఇదీ చదవండి: కోట్లు సంపాదించే అవకాశం: నిఖిల్ కామత్ ట్వీట్ఆఫ్లైన్ విధానంలో అప్లై చేసుకోవడం..➤అధికారిక NSDL వెబ్సైట్ నుంచి ఫారమ్ 49ఏను డౌన్లోడ్ చేసుకోవాలి.➤సూచనల ప్రకారం అన్ని వివరాలను పూరించండి. ➤సంబంధిత డాక్యుమెంట్స్ కాపీలను, పిల్లల ఫోటోలు రెండు జత చేసి, సమీపంలోని పాన్ సెంటర్లో ఫీజు చెల్లించి సమర్పించండి.➤మీ అప్లికేషన్ సమర్పించిన తరువాత మీకు అక్నాలెజ్మెంట్ నెంబర్ ఇస్తారు. దీని ద్వారా అప్లికేషన్ స్థితిని ట్రాక్ చేయవచ్చు. ➤తరువాత మీ చిరునామాలకు 15 నుంచి 20 రోజులలోపు పాన్ కార్డు డెలివరీ అవుతుంది. -
న్యాయమూర్తుల సంతానానికి హైకోర్టు జడ్జిలుగా నో చాన్స్!
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రస్తుత, మాజీ న్యాయమూర్తుల సంతానం, అతి సమీప బంధువులను హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించరాదన్న ప్రతిపాదనను సుప్రీంకోర్టు కొలీజియం చురుగ్గా పరిశీలిస్తున్నట్టు తెలిసింది. అలాంటి వారి పేర్లను సిఫార్సు చేయరాదంటూ హైకోర్టు కొలీజియాలకు సూచిస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. తద్వారా అర్హులైన కొందరికి అన్యాయం జరిగినా బంధుప్రీతి వంటి ఆరోపణలకు తావుండదని, ఎంపిక ప్రక్రియ మరింత పారదర్శకంగా మారుతుందని కొలీజియం సభ్యుడైన సీనియర్ న్యాయమూర్తి అభిప్రాయపడ్డట్టు సదరు వర్గాలు వెల్లడించాయి. తొలి తరం న్యాయవాదులతో పాటు విభిన్న సామాజికవర్గాల వారికి హైకోర్టు న్యాయమూర్తులుగా అవకాశం లభిస్తుందన్నది దీని ఉద్దేశమని వివరించాయి. మళ్లీ తెరపైకి ‘సంప్రదింపులు’ హైకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి మరో ఇటీవల కీలక పరిణామం కూడా చోటుచేసుకుంది. హైకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన అభ్యర్థులతో సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా సారథ్యంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు కొలీజియం డిసెంబర్ 22న వ్యక్తిగతంగా భేటీ అయింది. తద్వారా గత సంప్రదాయాన్ని పునరుద్ధరించింది. అనంతరం రాజస్తాన్, ఉత్తరాఖండ్, బాంబే, అలహాబాద్ హైకోర్టులకు న్యాయ మూర్తులుగా ఆరుగురు పేర్లను కేంద్రానికి సిఫార్సు చేసింది. దేశంలో మెజారిటీ ప్రజల అభిప్రాయమే సాగాలంటూ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఈ ‘సంప్రదింపు’ల నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటిదాకా హైకోర్టు న్యాయమూర్తుల నియామకానికి అభ్యర్థుల బయోడేటా, వారి అర్హత, సామర్థ్యాలపై కొలీజియం అంచనా, నిఘా సమాచారం తదితరాలను ప్రాతిపదికగా తీసుకుంటూ వస్తుండటం తెలిసిందే. -
పిల్లలకు సోహెల్ మీడియా
సోషల్ మీడియా.. ప్రపంచాన్ని శాశిస్తున్న ప్రచారమాధ్యమం. ఫేస్బుక్, ఎక్స్ (గతంలో ట్విట్టర్), స్నాప్‌చాట్, టిక్‌టాక్.. వంటి ఫ్లాట్‌ఫామ్‌లు కొంతకాలం కిందట అనుసంధాన వేదికలుగా మాత్రమే పనిచేశాయి. ప్రశంసలందుకున్నాయి. కానీ రానురాను పరిస్థితి మారింది. అశ్లీల కంటెంట్, నకిలీ వార్తల వ్యాప్తి, సైబర్ బుల్లీయింగ్ మాధ్యమాలను ముంచెత్తాయి. ఇవి ఎన్నికలనూ శాసిస్తున్నాయి. పెద్దలమాట సరేసరి.. పిల్లలపై ఇవి చూపుతున్న ప్రభావాన్ని నియంత్రించేందుకు చాలా దేశాలు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇటీవలే ఆ్రస్టేలియా 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం విధించింది. దేశంలో పెద్ద దుమారమే రేపింది. అయినా ఆ్రస్టేలియా తరహాలోనే పలు దేశాలు కఠినమైన ప్రైవసీ చట్టాలు, మైనర్లపై నిషేధం వంటి విధానాల ద్వారా సోషల్ మీడియాను ప్రక్షాళన చేసేందుకు ప్రయత్నించాయి. ఆయ దేశాల వివరాలు, అవి చేస్తున్న ప్రయత్నాలు ఓసారి చూద్దాం. ఆ్రస్టేలియాసోషల్ మీడియా మినిమమ్ ఏజ్ బిల్లు ప్రకారం ఇన్‌స్ట్రాగామ్, ఫేస్బుక్ యజమాని మెటా నుంచి టిక్‌టాక్ వరకు మైనర్లు లాగిన్ కాకుండా నిరోధించాలని బిల్లు తీసుకొచ్చింది. వీటి అమలును ఉల్లంఘిస్తే 32 మిలియన్ డాలర్ల వరకు జరిమానాలు విధించనుంది. ఏడాదిలో ఈ నిషేధం అమల్లోకి రానుంది. జనవరి నుంచి అమలు చేసే పద్ధతులపై ట్రయల్ ప్రారంభమవుతుంది. స్పెయిన్16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను ఉపయోగించడాన్ని నిషేధించే బిల్లును స్పెయిన్ జూన్‌లో ప్రవేశపెట్టింది. దీని అమలు, వయస్సు ధ్రువీకరణ వంటివాటిపై చర్చ జరుగుతోంది. ప్రభుత్వం విధానాలను రూపొందించాల్సింది ఉంది.దక్షిణ కొరియా ఈ దేశం 2011లోనే సిడ్రెల్లా చట్టం రూపొందించింది. దీని ప్రకారం 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న వారు అర్ధరాత్రి నుంచి ఉదయం ఆరు గంటల వరకు ఆన్‌లైన్‌గేమ్స్ ఆడకూడదు. ఒక దశాబ్దం తరువాత ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ‘చాయిస్ పర్మిట్’వ్యవస్థను ఏర్పాటు చేసింది. వారి పిల్లలు ఎప్పుడు ఆడుకోవాలో నిర్ణయించే అధికారాన్ని తల్లిదండ్రులకు ఇచ్చింది. అతికొద్ది మంది మాత్రమే ఈ వ్యవస్థను ఉపయోగించారు. 16 ఏళ్లలోపు వారు సోషల్ మీడియా వాడకాన్ని నియంత్రించేందుకు ఉద్దేశించిన బిల్లును ఈ ఏడాది ఆగస్టులో ప్రతిపాదించారు. దీనిని యువజన సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ బిల్లును ‘సిండ్రెల్లా’చట్టం మాదిరిగా యువతను నియంత్రించే వివక్షాపూరిత ప్రయత్నమని విమర్శిస్తున్నాయి. ఫ్రాన్స్ గత ఏడాదే ఓ చట్టాన్ని తీసుకొచ్చింది. సోషల్ మీడియా వినియోగదారుల వయస్సును ధ్రువీకరించాలని, 15 ఏళ్ల కంటే తక్కువ వయసున్నవారికి తల్లిదండ్రుల అనుమతిని పొందాలని ఫ్రాన్స్ 2023 జూన్‌లో చట్టం చేసింది. నిబంధనలను ఉల్లంఘించే సోషల్ నెట్‌వర్క్‌కు ప్రపంచ ఆదాయంలో ఒక శాతం వరకు జరిమానా విధిస్తారు. ఈ చట్టం ఈయూ చట్టానికి అనుగుణంగా ఉందని యూరోపియన్ కమిషన్ ఇంకా ధ్రువీకరించలేదు. దీంతో అమలులోకి రాలేదు. ఇటలీఇక్కడ 14 ఏళ్లలోపు వారు సోషల్ మీడియా ఖాతా తెరవాలంటే తల్లిదండ్రుల సమ్మతి అవసరం. ఆపై వయసున్న వారిపై ఎలాంటి నిషేధాలు లేవు. ఎవరి సమ్మతీ అవసరం లేదు. జర్మనీఈ దేశ నిబంధనల ప్రకారం 13 నుంచి 16 ఏళ్ల లోపు పిల్లలు తల్లిదండ్రుల అనుమతితో మాత్రమే సోషల్ మీడియాను ఉపయోగించాలి. ఈ నియంత్రణలు సరిపోవని, ప్రస్తుత చట్టాలను సక్రమంగా అమలు చేయాలని బాలల రక్షణ న్యాయవాదులు వాదిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి దీనికంటే ముందుకెళ్లే ఉద్దేశంలో ఆ దేశం లేదు. బెల్జియం 13 ఏళ్లు నిండిన పిల్లలకు మాత్రమే సోషల్ మీడియాలో అకౌంట్ ఉండాలని, అది తల్లిదండ్రుల అనుమతితోనే చేయాలని 2018లో బెల్జియం చట్టం చేసింది.నార్వేఇక నార్వేలో సోషల్ నెట్‌వర్క్‌లకు ఉపయోగించడానికి కనీస వయస్సు 13 సంవత్సరాలు. అయినా 12 ఏళ్ల పిల్లల్లో ఎక్కువ మంది, తొమ్మిదేళ్ల పిల్లల్లో సగానికిపైగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. దీంతో కనీస వయోపరిమితిని 15 సంవత్సరాలుగా నిర్ణయించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల అమలులో విఫలమైన నేపథ్యంలో సమర్థవంతమైన మార్గాలను అన్వేíÙస్తోంది. నెదర్లాండ్స్ ఇక్కడ సోషల్ మీడియాను ఉపయోగించడానికి వయో పరిమితి లేదు. పిల్లల్లో ఏకాగ్రతను పెంచడానికి అక్కడి ప్రభుత్వం తరగతి గదుల్లో మొబైల్ పరికరాలను నిషేధించింది. ఇది 2024 జనవరి నుంచి అమల్లో ఉంది. అయితే డిజిటల్ పాఠాలకు, వైద్య అవసరాలు, వైకల్యాలు ఉన్నవారికి మినహాయింపులు వర్తిస్తాయి.చైనా2021 నుంచి మైనర్లకు యాక్సెస్ ఆంక్షలు అమలు చేస్తున్న చైనా ఇందుకు మంచి ఉదాహరణ. ఇక్కడ ఇంటర్నెట్ వినియోగం ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటుంది. దీంతో సోషల్ మీడియాను ఉపయోగించకుండా నిరోధించడం ఇక్కడ సులభం. టిక్‌టాక్ వంటి చైనీస్ డౌయిన్‌లో 14 ఏళ్లలోపు వినియోగదారులకు పరిమితి ఉంది. రోజుకు 40 నిమిషాలు మాత్రమే వినియోగించాలనే నిబంధన ఉంది. పిల్లలు అంతకంటే ఎక్కువసేపు ఆన్లైన్లో గేమ్స్ ఆడటానికి కూడా అనుమతి లేదు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
16 ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియా నిషేధం బిల్లుకు ఆస్ట్రేలియా ఆమోదం
మెల్బోర్న్: 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధించే బిల్లును ఆస్ట్రేలియా ప్రతినిధుల సభ బుధవారం ఆమోదించింది. దీనికి ప్రకారం టిక్‌టాక్, ఫేస్బుక్, స్నాప్‌చాట్, రెడిట్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక వేదికల్లో వారికి ఖాతాలు ఉండకూడదు. దీన్ని అతిక్రమిస్తే ఏకంగా 3.3 కోట్ల డాలర్ల దాకా జరిమానా విధిస్తారు! ప్రధాన పార్టీలన్నీ బిల్లుకు మద్దతిచ్చాయి. దానికి అనుకూలంగా 102, వ్యతిరేకంగా 13 ఓట్లొచ్చాయి. బిల్లు ఈ వారంలో చట్టంగా మార నుంది. వయోపరిమితుల అమలుకు సామాజిక మాధ్యమాలకు ప్రభుత్వం ఏడాది గడువిచ్చింది. ఆ తర్వాత నుంచి జరిమానాలు విధిస్తారు.అమలు ఎలా?ఈ చట్టాన్ని ఎలా అమలు చేస్తారన్నది పెద్ద ప్రశ్నగా ఉంది. ఎందుకంటే వయో నిర్ధారణ కోసం సామాజిక మాధ్యమాలు వినియోగదారుల నుంచి ప్రభుత్వ గుర్తింపు పత్రాలను డిమాండ్ చేయలేవు. డిజిటల్ ఐడెంటిఫికేషన్ యాక్సెస్ ఇచ్చే అవకాశం లేదు. కనుక చట్టం అమలు అనుమానమేనని విపక్ష సభ్యుడు డాన్ తెహాన్ అభిప్రాయపడ్డారు. అమలు చేయగలిగితే మాత్రం ప్రజల జీవితాల్లో మార్పు ఖాయమన్నారు. ఈ బిల్లుపై స్వతంత్ర సభ్యులు తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వం ఏదో చేస్తున్నట్లు ప్రజలకు అనిపించేలా చేయడమే దీని లక్ష్యం తప్ప సోషల్ మీడియాను సురక్షితంగా మార్చేందుకు ఇది దోహదపడబోదని కొన్ని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ‘‘లోతైన పరిశీలన లేకుండా పార్లమెంటు ఆమోదం పొందిన ఈ బిల్లు పెద్దగా పనికొచ్చేది కాదు. పిల్లలకు ఏది మంచిదో నిర్ణయించే తల్లిదండ్రుల అధికారాన్ని హరించేలా ఉంది’’ అని కూడా విమర్శలున్నాయి. ఈ నిషేధం పిల్లలను ఏకాకులను చేస్తుందని, సోషల్ మీడియా తాలూకు సానుకూల అంశాలను వారికి దూరం చేస్తుందని పరిశీలకు లు అంటున్నారు. వారిని డార్క్‌వెబ్ వైపు నడిపినా ఆశ్చర్యం లేదని హెచ్చరిస్తున్నారు. -
మాతృత్వం.. ఓ మధురానుభూతి!
సాక్షి, హైదరాబాద్: మాతృత్వం.. ఓ మధురానుభూతి అని ప్రముఖ నటి రమ్యకృష్ణ పేర్కొన్నారు. పిల్లలు వద్దనుకుంటున్న వారి సంఖ్య పెరిగిపోతోందని, పిల్లల్ని కనడం, పెంచడం భారంగా భావిస్తున్నారని చెప్పారు. అలా అనుకోవద్దని తాము కూడా వృత్తితో పాటు కుటుంబాన్ని బ్యాలెన్స్ చేసుకున్నామని తెలిపారు. నగరంలోని ఓ హోటల్లో ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ 15వ వార్షికోత్సవం బుధవారం జరిగింది. ముఖ్య అతిథిగా ప్రముఖ నటి రమ్యకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ వ్యవస్థాపకురాలు డాక్టర్ దుర్గారావును ఫరి్టలిటీ, ఐవీఎఫ్‌కు సంబంధించి ఆమె పలు ప్రశ్నలను అడిగి నివృత్తి చేసుకున్నారు. జపాన్‌లో కొన్నేళ్లుగా యువ జనాభా విపరీతంగా తగ్గిపోతోందని, పూర్తిగా వృద్ధుల జనాభా పెరుగుతోందని, ఈ నేపథ్యంలో అక్కడి ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతింటోందని డాక్టర్ దుర్గారావు పేర్కొన్నారు. మన దేశంలో కూడా సంతానోత్పత్తి రేటు 1.8 ఉందని, అది 2కు పైగా ఉండాల్సిన అవసరం ఉందని వివరించారు. ఈ సందర్భంగా ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా జని్మంచిన పలువురు పిల్లలకు స్కాలర్షిప్లు అందజేశారు. వీరంతా రేపటి చాలెంజర్లని, రేపటి రోజును తీర్చిదిద్దే వారిని సమాజానికి అందించినందుకు గర్వంగా ఉందని వివరించారు. -
యంగ్ టాలెంట్: బహుముఖ ప్రజ్ఞతో సత్తా చాటుతున్న చిచ్చర పిడుగులు
అవధాన సుధ పద్యాలు చదివే పిల్లలు ఈరోజుల్లో అరుదైపోయారు. అయితే హైదరాబాద్‌కు చెందిన సంకీర్త్ అలా కాదు. పద్యాలు చదవడమే కాదు అలవోకగా పద్యాలు అల్లుతూ ‘బాలావధాని’ అనిపించుకుంటున్నాడు...పదమూడు సంవత్సరాల వింజమూరి సంకీర్త్ తటవర్తి గురుకులంలో పద్యరచనలో శిక్షణ ΄÷ందుతూ ఎన్నో పద్యాలు రాశాడు. ‘క్షాత్రసరణి’ అనే శతక కార్యక్రమంలో మొదటిసారిగా తన పద్యాలు చదివి ‘భేష్’ అనిపించుకున్నాడు. ‘భీముడు జంపె రావణుని భీకర లీల మహోగ్ర తేజుడై’ అని ఇచ్చిన సమస్యకు బాలావధాని ‘క్షేమము గూర్చగా ధరకి శ్రీయుత రూపము నెత్తె భూతలిన్ / ధామముగాను వెల్గు వరదాయకుడై రణధీరయోగియై/ స్వామిగ లోక రక్షణకు సంతసమొంద రణాన రాముడే / భీముడు జంపె రావణుని భీకర లీల మహోగ్ర తేజుడై’ అని చక్కగా పూరించాడు. దత్తపది అంశంలో ‘కరి వరి మరి తరి‘ పదాలు ఇచ్చి అమ్మవారిని వర్ణించమని అడగగా...‘దేవి శ్రీకరి శాంకరి దివ్యవాణినీదు సేవను తరియించి విత్యముగను లోకమును గావ రిపులను రూపుమాపికావుమమ్మ ధరన్ మరి కరుణ జూపి’ అంటూ పూరించాడు. వర్ణన అంశంలో ఉయ్యాల సేవ వర్ణన అడుగగా ‘వెంకటాచలమని వేంకటేశుని గొల్చి, ఊయలూపుచుండ హాయిగాను, భక్తులకు వరముగ భవ్య స్వరూవమై, వెలసినట్టి దేవ వినయ నుతులు‘ అంటూ చక్కగా వర్ణించాడు. ఒకటవ పాదంలో మొదటి అక్షరం శ, 2వ పాదంలో 2వ అక్షరం మ, 3వ పాదంలో 11వ అక్షరం సా, 4వ పాదంలో 19వ అక్షరం వచ్చే విధంగా దుర్గాపూజను వర్ణించమని అడిగితే...‘శమియగు నీ స్వరూపము సుశక్తినొసంగగ దివ్య మాతవై / గమనము దెల్పుచున్ సుమతి కామితదాయిని సింహవాహిని/ సమత వహించుదేవతగ సారమునిచ్చుచు మమ్ముగావవే / మమతయె పొంగగా ధరణు మానితమూర్తి ముదంబు పాడెనే’ అంటూ పూరించి ధారతో కూడిన ధారణ చేసి అందరి మనసులను ఆకట్టుకున్నాడు.తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్కూచిపూడి నృత్య సంప్రదాయంలో తలపై మూడు కుండలు, హిప్ హోల రింగ్ వేసుకుని, కుండపై నిలబడి నృత్యం చేయడం ద్వారా ఉత్తమ ప్రతిభను ప్రదర్శించి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది నిడదవోలుకు చెందిన ఆరు సంవత్సరాల చిన్నారి మద్దిరాల కేతనరెడ్డి.వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్పదిహేను సంవత్సరాల వయసులోనే బహుముఖ ప్రజ్ఞతో వివిధ రంగాలలో ఎన్నో విజయాలను సాధిస్తోంది అన్నమయ్య జిల్లా దేవరవాండ్లపల్లికి చెందిన కైవల్య రెడ్డి ‘వివిధ రంగాలలో బహుముఖప్రజ్ఞ చూపిన విద్యార్ధిని’గా వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుంది. కూచిపూడి నుంచి కరాటే వరకు ఎన్నో విద్యల్లో ప్రతిభ చాటుతోంది. (చదవండి: మోడలింగ్ ఎక్స్‌పీరియన్స్‌తో..ఏకంగా డిజిటల్ స్టార్..) -
బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన YSRCP అధినేత YS జగన్
-
నలుపు తగ్గేదెలా..?
చిన్నారుల ఒంటిమీద, ముఖం మీద పుట్టుమచ్చల్లాంటి నల్లమచ్చలు కనిపిస్తుండటం మామూలే. అయితే కొందరు చిన్నారుల్లో ఇవి చాలా ఎక్కువ సంఖ్యలో వస్తుంటాయి. ఈ కండిషన్‌ను ‘నీవస్’ అంటారు. ఇలా నల్లమచ్చలు ఎక్కువగా వచ్చే ఈ కండిషన్‌ను వైద్యపరిభాషలో ‘మల్టిపుల్ నీవస్’ అని పేర్కొంటారు. చర్మంలోని రంగునిచ్చే మెలనోసైట్స్ అనే కణాలే పుట్టుమచ్చలకూ, ఇలా ఎక్కువ సంఖ్యలో వచ్చే ‘నీవస్’ అని పిలిచే మచ్చలకు కారణం. ఈ మచ్చలు శరీరంలో ఎక్కడైనా రావచ్చు. ఈ లక్షణమున్న కొందరిలో ఇవి అరచేతుల్లో, అరికాళ్లలో, ఆఖరుకు గోళ్లమీద కూడా కూడా కనిపిస్తుంటాయి. కుటుంబ చరిత్రలో ఇలాంటి మచ్చలు రావడంతోపాటు సూర్యకాంతికి చాలా ఎక్కువగా ఎక్స్పోజ్ కావడం వంటి అంశాలు ఇవి వచ్చేందుకు కారణమవుతాయి.రకాలు ...ఈ మచ్చలను ప్రధానంగా రెండు రకాలుగా చెప్పవచ్చు. మొదటిది హానికరం కాని సాధారణ ‘బినైన్’ మచ్చలు. రెండోది హానికరంగా మారే ‘మెలిగ్నెంట్’ మచ్చ. అయితే ఈ మెలిగ్నెంట్ అన్నది చాలా చాలా అరుదు. బినైన్ నీవస్ పెరుగుతున్నప్పుడు ఒకసారి పరీక్షించి, ఆ తర్వాత అది మెలిగ్నెంట్ కాదని నిర్ధారణ చేసుకుని ఆ తర్వాత నిశ్చింతగా ఉండాలి. ఈ మచ్చల్లో కొన్ని పుట్టుకతోనే రావచ్చు. మధ్యలో వచ్చే మచ్చలు 10 నుంచి 30 ఏళ్ల మధ్య కాలంలో రావచ్చు. బినైన్ మచ్చల విషయానికి వస్తే... చాలామంది పిల్లల్లో కనిపించే పుట్టుమచ్చల్లో... హానికరం కాని నీవస్ వాటివల్ల ఎలాంటి ప్రమాదమూ లేదని తెలిశాక నిశ్చింతగా ఉండవచ్చు. క్యాన్సర్‌గా మారే అవకాశం కూడా చాలా తక్కువ. అయితే... కొన్ని నీవస్‌లు క్యాన్సర్ లక్షణాలను సంతరించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటివి ఉన్నవారు క్రమం తప్పకుండా డర్మటాలజిస్ట్లతో ఫాలో అప్‌లో ఉండటం మంచిది. కొన్ని సందర్భాల్లో నీవాయిడ్ బేసల్ సెల్ కార్సినోమా అనే కండిషన్ కూడా రావచ్చు. ఇది పుట్టుకనుంచి ఉండటంతోపాటు, యుక్తవయస్సు వారిలోనూ కనిపిస్తుంది. వారికి మచ్చలతోపాటు జన్యుపరమైన అబ్నార్మాలిటీస్నూ డాక్టర్లు చూస్తుంటారు. ఇలాంటి పిల్లల్లో ముఖ ఆకృతి, పళ్లు, చేతులు, మెదడుకు సంబంధించిన లో΄ాలు కూడా కనిపించేందుకు ఆస్కారం ఉంది. ఇవన్నీ చాలా అరుదైన కండిషన్స్.మచ్చలు ఉన్నప్పుడు గమనించాల్సిన ఏ, బీ, సీ, డీలు...అది ఎలాంటి నల్లమచ్చ లేదా నీవస్ అయినా... ఏ, బీ, సీ, డీ అన్న నాలుగు అంశాల్ని పిల్లల తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి. ఇక్కడ ఏ– అంటే ఎసిమెట్రీ... అంటే పుట్టుమచ్చ సౌష్టవం లో ఏదైనా మార్పు కనిపిస్తుంటుందేమో అని గమనించడం, బీ– అంటే బార్డర్... అంటే పుట్టుమచ్చ అంచుల్లో ఏదైనా మార్పు ఉందా లేక అది ఉబ్బెత్తుగా మారుతోందా అని చూడటం, సీ– అంటే కలర్... అంటే పుట్టుమచ్చ రంగులో ఏదైనా మార్పు కనిపిస్తోందేమో గమనిస్తుండటం, చివరగా... డీ– అంటే డయామీటర్... అంటే మచ్చ తాలూకు వ్యాసం పెరుగుతోందా అని పరిశీలిస్తూ ఉండటం... ఈ నాలుగు మార్పుల్లో ఏది కనిపించినా తక్షణం డర్మటాలజిస్ట్‌ను సంప్రదించాలి.నివారణ ఇలా... పిల్లల్లో నల్లమచ్చల నివారణకు... చిన్నారులను మరీ ఎర్రటి ఎండకు ఎక్కువగా ఎక్స్పోజ్ కాకుండా జాగ్రత్త తీసుకోవాలి. చిన్నారుల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి వీలైనంతవరకు అది హానికారక అల్ట్రావయొలెట్ కిరణాలకు ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాలి. చిన్నపిల్లల్ని బయటకు తీసుకెళ్లేప్పుడు, వారికి కూడా 30 ఎస్పీఎఫ్ ఉన్న సన్ స్క్రీన్ లోషన్స్ రాయాలి.చికిత్స...ఇక కొన్ని నల్లమచ్చలు హానికరం కాని నీవస్ మచ్చలే అయినప్పటికీ కొన్ని అవి చిన్నారుల లుక్స్‌కు కాస్మటిక్‌గా ఇబ్బంది కలిగిస్తుంటే... నిపుణులు వాటిని షేవ్ ఎక్సెషన్ థెరపీ వంటి ప్రక్రియల ద్వారా తొలగించడానికి ప్రయత్నిస్తారు. ఒకవేళ అవి ప్రమాదకరమైన మచ్చలైతే... సంబంధిత నిపుణుల చేత వాటికి అవసరమైన చికిత్సలు అందించాలి. డా. స్వప్నప్రియ, సీనియర్ డర్మటాలజిస్ (చదవండి: ఎక్కువసేపు నిద్రా? ఆందోళన వద్దు...) -
పోరాడే చిరునవ్వులు
యోధులు సైన్యంలో ఉండొచ్చు. కుస్తీగోదాలలో ఉండొచ్చు. మార్షల్ ఆర్ట్స్ బరిలో ఉండొచ్చు. కండలు పెంచే జిమ్‌లలో ఉండొచ్చు. కాని వీరి కంటే గొప్ప యోధులు, చిన్నారి యోధులు హాస్పిటల్ బెడ్ మీద ఉంటారు. వీరు నయం కాని వ్యాధులతో అలుపెరగక పోరాడుతుంటారు. సిరంజీలు, సెలైన్ బాటిల్స్ చుట్టుముట్టినాఒక్క చిరునవ్వుతో వాటిని ఓడించాలని చూస్తారు. వీరిని పలకరించడం, ఉత్సాహ పరచడం సాయ పడటం ఏ మనిషికైనా పరమ కర్తవ్యం. హైదరాబాద్‌లో ఇలాంటి పిల్లలు ‘స్పర్శ్ హాస్పీస్ అండ్ పాలియేటి కేర్ సెంటర్’లో ఉన్నారు. వారిని ‘సాక్షి’ కలిసింది. చైల్డ్ సెలబ్రిటీలను కలిపింది. పోరాడే నవ్వులను పకపకలాడించింది.ప్రపంచంలోని ఏ చిన్నపిల్లలకు కూడా ‘స్పర్శ్’ వంటి సెంటర్ల చిరునామా ఎప్పటికీ తెలియకూడదు. అక్కడకు రావాల్సిన అవసరం ఎప్పటికీ రాకూడదు. కాని దురదృష్టవశాత్తు కొందరు అక్కడికి వస్తారు. నయం కాని వ్యాధులతో పోరాడుతూ అక్కడ సాంత్వన పొందుతారు. సహాయం పొందుతారు. జీవించి ఉండే కాంక్ష చల్లారిపోనీకుండా చూసుకుంటారు. అలాంటి పిల్లలకు ‘స్పర్శ్ హాస్పీస్ అండ్ పాలియేటివ్ కేర్ సెంటర్’లో ఉచితంగా ఉపశమన సేవలను అందిస్తుంది. జబ్బు నయం కానప్పటికీ వారు కాసింత సాంత్వన పొందడానికి పాలియేటివ్ కేర్ అందిస్తుంది. రానున్న నవంబర్ 14 ‘బాలల దినోత్సవం’ సందర్భంగా ఇక్కడ సేవలు పొందుతున్న పసి హృదయాలలో మరింత ఆత్మస్థైర్యాన్ని నింపే ప్రయత్నం చేసింది సాక్షి మీడియా. వెండి తెరపై చైల్డ్ ఆర్టిస్టులగా రాణిస్తున్న కార్తికేయ దేవ్, ఫర్జానాలను ఈ చిన్నారులతో కలిసి ముచ్చటించేలా చూసింది. చైల్డ్ సెలబ్రిటీలతో ఆ పిల్లలు తమ ఇబ్బందులు, ఇష్టాలు, కష్టాలను మనసారా పంచుకున్నారు. ఆ పిల్లల ఆత్మీయత పంచుకున్న చైల్డ్ సెలబ్రిటీలు స్పర్శ్ సేవల్లో తామూ భాగమవుతామని మాటిచ్చారు. ‘సలార్’, ‘గుడ్ బ్యాడ్ అగీ’్ల వంటి సినిమాల్లో గుర్తింపు పొంది త్వరలో రాబోతున్న వరుణ్‌తేజ్ ‘మట్కా’లో మెరవనున్న కార్తికేయదేవ్, ‘ఓరి దేవుడా’లో నటించిన ఫర్జానా ఈ పిల్లల కోసం సరదా సరదా డాన్సులు చేశారు. అల్లరి ఆటలు ఆడారు. ఆ పిల్లలు కూడా వారి అవస్థలు కొద్దిసేపు మర్చిపోయి అడిగి మరీ డైలాగ్స్ చెప్పించుకున్నారు. షూటింగ్ ఎలా ఉంటుంది అని అడిగి తెలుసుకున్నారు. నేనూ పాడతాను., వింటావా అంటూ ఆ ఆర్టిస్టుల ముందు ఆనందంగా పాటలు పాడారు. ‘స్పర్శ్’లో ఊరట పొందుతున్న పిల్లలు సెలబ్రిటీలతో తమ ఆరోగ్య సమస్య ఏమిటో పంచుకున్నారు.చిన్నారులకు ఆత్మీయ సాంత్వనదీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ, చికిత్స అందించినా నయం కాని జబ్బులతో అవస్థలు పడుతున్న వారికి ఉచితంగా పాలియేటివ్ కేర్ సేవలు అందించాలనే లక్ష్యంతో 2011లో ‘స్పర్శ్ హాస్పీస్ అండ్ పాలియాటీవ్ కేర్ సెంటర్’ను ప్రారంభించాం. దీనిని రోటరీ క్లబ్ ఆఫ్ బంజారాహిల్స్ ఆధ్వర్యంలో ప్రారంభించి, నిరంతరం విరాళాలు సేకరిస్తూ ఈ సేవలు కొనసాగిస్తున్నాం. 82 బెడ్ల సామర్థ్యంతో అన్ని వయసుల వారికీ ఇక్కడ ఉచితంగా సేవలు అందిస్తున్నాం. చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా వార్డ్ ఏర్పాటు చేశాం. ఈ పీడియాట్రిక్ వార్డ్‌లో చిన్నారుల కోసం ప్రత్యేకమైన బెడ్లు, ఆహారం, న్యూట్రిషన్, ప్లేస్టేషన్ వంటి సదుపాయాలను ఏర్పాటు చేశాం. ఇక్కడ వైద్యపరమైన ఉపశమన సేవలతో పాటు మానసికంగా, శారీరకంగా, సామాజికంగా సాంత్వన చేకూర్చుతాం. దీని కోసం ప్రత్యేకంగా పాలియాటివ్ కేర్ ఫిజీషియన్లు, నర్సులు, సైకాలజిస్టులు, కౌన్సిలర్లు, సోషల్ వర్కర్లు, వాలంటీర్లు, వార్డ్ బాయ్స్, ఆయాలు...ఇలా 130 మందికి పైగా ఉన్నారు. విభిన్న కారణాలతో ఈ సెంటర్‌కు రాలేని వారికి ఈ సేవలు అందేలా.. స్పర్శ్ టీమ్ పేషెంట్ల ఇంటికే వెళతారు. స్పర్శ్ నుంచి 60 కిలోమీటర్ల లోపు అందించే ఈ హోం కేర్ సేవల కోసం ప్రత్యేకంగా 6 వ్యాన్లను సైతం ఏర్పాటు చేశాం. తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి, మారుమూల గ్రామీణ ప్రాంతాల నుంచి పేషెంట్లు మా వద్దకు వస్తుంటారు. – శారద, కౌన్సెలింగ్ ఇన్ఛార్జ్, సైకాలజిస్ట్చాలా హ్యాపీగా ఉందిఇంట్లో చాలా నొప్పులతో ఏడ్చేవాడిని. ఇక్కడ మాత్రం ఏ ఇబ్బంది వచ్చినా డాక్టర్లు మందులు ఇస్తారు, మంచిగా మాట్లాడతారు, ఆటలు ఆడతారు. కార్తికేయ అన్న నా కోసం ‘నీకెప్పుడు అవసరమున్నా నేనొస్తాననే’ డైలాగ్ చెప్పాడు. నేను తన కోసం పాట పాడాను. సెల్ఫీలు దిగాం ఇద్దరం. కార్తికేయ అన్న ప్రభాస్ సినిమాలో చేశాడంటా. నా కోసం రావడం హ్యపీగా ఉంది.– అబ్దుల్ అర్ఫత్, పదేళ్ల వయసు, కేన్సర్ బాధితుడుఇలాంటి పిల్లలకు సాయం అందాలిసాక్షి మీడియా ద్వారా స్పర్శ్ సెంటర్లో ఉన్న పిల్లలను కలిసిన చైల్డ్ సెలబ్రిటీలు కారికేయ, ఫర్జానా ఎంతో కదిలిపోయారు. ‘మాకు, ఇక్కడి చిన్నారులకు వయసులో పెద్దగా వ్యత్యాసం లేదు కానీ జీవితాల్లో చాలా తేడా ఉంది. దేశవ్యాప్తంగా ఇలాంటి చిన్నారులు ఎందరో ఉన్నారని ఇక్కడికి వచ్చాకే తెలిసింది. మేమెంత మంచి జీవితాన్ని అనుభవిస్తున్నామో తెలిసింది. వారికి ఆనందాలు పంచుదామని వచ్చి ఆరోగ్యం ఎంత విలువైనదో తెలుసుకుని వెళుతున్నాను’ అని కార్తికేయ దేవ్ అంటే ‘రోజూ అమ్మతో హాయిగా ఆడుకునే నాకు ఈ చిన్నారులను చూస్తుంటే చాలా బాధేసింది. వారికి సంతోషాలు పంచాలని పాటలు పాడాను. వారితో ఆడుకున్నాను. తదుపరి నా షూటింగ్‌కు కూడా తీసుకెళతానని చెప్పాను. భవిష్యత్‌లో స్పర్శ్ సేవల్లో భాగం పంచుకోవాలని ఉంది’ అని ఫర్జానా అంది.ఈ పిల్లలు చిరంజీవులు కావాలి‘స్పర్శ్’లో ఉన్న పిల్లల తల్లిదండ్రులు తీవ్రమైన అనారోగ్యాలతో బాధపడుతున్న తమ పిల్లలు చిర ఆయువును పొందాలని కన్నీటి ప్రార్థనలు చేస్తారు. తమ పిల్లలు చిన్న చిరునవ్వు నవ్వితే, సరిగ్గా ఏదైనా తింటే అదే పది వేలుగా మురిసిపోతారు. కాని వారి గుండెల్లో బడబాలనం ఉంది. వారిని అడిగితే – ‘మా బాబుకు ఆ మాయదారి రోగం ఎందుకొచ్చిందో తెలియదు. కేన్సర్ అంట. నాలుగో స్టేజ్‌లో ఉంది. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి చికిత్స అందించాం. జ్యూస్ సెంటర్లో దినసరి కూలీగా పనిచేస్తున్నాను. ఈ స్పర్శ్ హాస్పిటల్ గురించి తెలిసాక ఇక్కడి సేవలు పొందుతున్నాం. పూర్తిగా నయం చేయలేం కానీ., మీ బాబుకు ఎలాంటి అవస్థలు లేకుండా చూసుకుంటాం అని భరోసా ఇచ్చారు.. ఎంతో ఊరటగా ఉంది’ అని చార్మినార్‌కు చెందిన షేక్ ఇర్ఫాన్ అంటే ‘నాకిద్దరు కొడుకులు., అందులో ఒక అబ్బాయి టకాయసు ఆర్టిటైటిస్ అనే వ్యాధితో ఇబ్బంది పడుతున్నాడు. ఈ వ్యాధి నయమయ్యే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. కానీ అంత ఖరీదైన చికిత్స అందించే స్థోమత మాకు లేదు. కనీసం తన నొప్పులు, అవస్థలైనా తగ్గించాలని స్పర్శ్‌లో చేర్చాం. ఇక్కడ ఒక కుటుంబ సభ్యుడిలా చూసుకుంటున్నారు. తనను చూసుకోవడం కోసం నా మరో అబ్బాయి కూడా చదువులకు దూరమయ్యాడు. మా ఆయన ఒక్కడు పని చేస్తే మా అందరికీ రోజు గడుస్తుంది’ అని మౌలాలికి చెందిన శైలజ అన్నారు. ‘పుట్టుకతోనే వచ్చే కంజెనిటల్ హార్ట్ డిసీజ్‌తో మా పాప బాధపడుతోంది. ఎన్నో హాస్పిటల్స్ తిరిగాం... కానీ లాభం లేకుండాపోయింది. ఈ సమయంలో స్పర్శ్ సైకాలజిస్టులు అందించిన మానసిక సాంత్వన కొంత కుదుట పడేలా చేసింది. ఏ పిల్లలకూ ఇలాంటి పరిస్థితులు రావొద్దని ఆశిస్తున్నాను. అందరు పిల్లలు చిరంజీవులుగా నూరేళ్లు బతకాలని కోరుకుంటున్నాను. అని సఫిల్‌గూడకు చెందిన శారద అన్నారు. వన్స్‌మోర్ కొట్టానుఅప్పుడప్పుడు నాకేం అవుతుందో నాకే అర్థం కాదు. ఇబ్బందిగా ఉంటుంది, బాధ అనిపిస్తుంది. కానీ అమ్మ ఏడుస్తుందని బయటకు చూపించను. నా కోసం అమ్మా నాన్న అన్నీ కోల్పోయారు. అన్న చదువులు మానేసి నన్నే చూసుకుంటున్నాడు. తన చదువులకు ఫీజులు కూడా కట్టలేని పరిస్థితికి చేరుకున్నాం. ఇలాంటి సమయంలో మా కష్టాలను మర్చిపోయేలా ఈ స్పర్శ్ చూసుకుంటోంది. ఇక్కడ ఉన్నంత సేపు ఏ బాధలు గుర్తు రావు. ఫర్జానా నా కోసం పాట పాడటం, కార్తికేయ కల్కి సినిమా పాటకు డ్యాన్స్ వేయడం ఎప్పటికీ మర్చిపోను. వన్స్‌మోర్ అంటూ మళ్లీ డ్యాన్స్ చేయించుకున్నాను. – మానిక్‌రాజ్ – డి.జి. భవాని– హనుమాద్రి శ్రీకాంత్ఫొటోలు: నోముల రాజేష్ రెడ్డి -
ప్లీజ్... ఇంకో బిడ్డను కనవచ్చు కదా!
‘మీరు ఇప్పుడు ప్రెగ్నెంటా?’ అని ప్రభుత్వ అధికారులు చైనాలోని మహిళలకు ఫోన్ చేసి అడుగుతున్నారు. అడిగితే అడిగారు అని సర్దుకున్నా ‘ఇంకో బిడ్డను కనవచ్చు కదా’ అని సలహా కూడా ఇస్తున్నారు. ఒకప్పుడు కఠినమైన జనన నియంత్రణ చర్యలు చేపట్టిన చైనా ఇప్పుడు అదనపు జనాభా కోసం ఎందుకు ఆరాటపడుతుంది?ప్రధాన కారణాలలో ఒకటి చైనాలో సంతానోత్పత్తి రేటు తగ్గడం. 2035 నాటికి చైనా జనాభాలో మూడింట ఒక వంతు 60 ఏళ్ల పైబడిన వారు ఉంటారని ‘వ్యూ’ రీసెర్చి నివేదిక చెప్పింది. ‘ప్రపంచ కర్మాగారం’గా తనకు తాను గర్వించుకునే చైనాకు యువ జనాభా అవసరం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని జనాభా పెంచడానికి కృషి చేస్తోంది. జనాభా నియంత్రణ కోసం ‘వన్–చైల్డ్ పాలసీ’ని కఠినంగా అమలుచేసిన దేశంలో ఈ సరికొత్త మార్పు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. (చదవండి: వారి పిల్లలు చెట్లు దైవం, కృష్ణజింక) -
పేరెంట్స్ కన్నా, ఫ్రెండ్స్ మాటలే ముఖ్యం
‘మావాడు మేం చెప్పేది అస్సలు వినడండీ. ఎప్పుడూ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ అంటుంటాడు. వాళ్లందరూ ఒక గ్యాంగయ్యారు. బైక్‌తో రిస్కీ ఫీట్స్ చేస్తుంటారు. ఎప్పుడేం తెచ్చుకుంటారోనని గుండె అదురుతుంటుంది..’‘మా పాప మేమేం చెప్పినా పట్టించుకోదండీ. ఫ్రెండ్స్ చెప్తే మాత్రం వెంటనే చేసేస్తుంది. తనకు నచ్చేలా ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు.’‘మా అబ్బాయి ఒకరోజు చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తాడు, మరుసటి రోజే డల్‌గా కనిపిస్తాడు. ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటాడు.’కౌన్సెలింగ్‌కు వచ్చే చాలామంది పేరెంట్స్ తమ టీనేజ్ పిల్లల గురించి చెప్పే మాటలవి. చిన్నప్పటి నుంచీ అమ్మ కూచిలా లేదా నాన్న బిడ్డలా ఉన్న పిల్లలు, అప్పటివరకు తమ అభిప్రాయలను గౌరవించి, తాము చెప్పే సూచనలు పాటించే పిల్లలు ఒక్కసారిగా మారేసరికి పేరెంట్స్ తట్టుకోలేరు. వారెక్కడ చేజారిపోతారోనని బాధపడుతుంటారు, ఆందోళన చెందుతుంటారు. కానీ, ఆ వయసుకు అది సహజం. టీనేజ్‌కు వచ్చేసరికి వారి ప్రపంచం కుటుంబాన్ని దాటి విస్తృతమవుతుంది. ఈ దశలో స్నేహితులు, ఆన్లైన్ కమ్యూనిటీల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పేరెంట్స్ కంటే ఫ్రెండ్స్ మాటలకే ఎక్కువ విలువిస్తారు. స్నేహితుల ఆమోదం, గుర్తింపు పొందడానికి ప్రయత్నిస్తారు. ఈ మార్పును అర్థం చేసుకోవడం ద్వారా తల్లిదండ్రులు.. సున్నితమైన ఈ దశలో పిల్లలకు సరైన మద్దతు అందించగలుగుతారు. పీర్ ప్రెజర్.. స్నేహితుల ఆమోదం పొందాలనే ఒత్తిడి అందరిపైనా ఉంటుంది. కానీ టీనేజ్‌లో ఎక్కువగా ఉంటుంది. టీనేజర్లు ఒక గ్యాంగ్‌లో చేరేందుకు ప్రయత్నిస్తారు. ఆ వయసులో అది అత్యవసరమనిపిస్తుంది. ఆ స్నేహితుల ఒత్తిడికి లోనైనప్పుడు తప్పులు చేసే అవకాశాలు పెరుగుతాయి. కొందరు టీనేజర్లు మితిమీరి ప్రవర్తించవచ్చు. మద్యం సేవించడం, ప్రమాదకరమైన ఫీట్స్ చేయడం, విచిత్రమైన వేషధారణలోనూ కనిపించవచ్చు. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి, తల్లిదండ్రులు సంయమనంతో ఉండటం ముఖ్యం. పీర్ ప్రెజర్ గురించి పెద్దలతో స్వేచ్ఛగా మాట్లాడగలిగే వాతావరణాన్ని కల్పించాలి. పిల్లలతో చర్చించి, వారి నిర్ణయాలపై గల ప్రభావాన్ని అర్థంచేయించేందుకు ప్రయత్నించాలి. స్నేహితులకు ‘నో’ చెప్పగలిగే ధైర్యాన్ని నేర్పాలి. సోషల్ మీడియా ప్రభావం.. స్నేహితుల ఒత్తిడి కేవలం పాఠశాల సమయంతో ఆగిపోదు. ఇన్స్టాగ్రామ్, స్నాప్‌చాట్ వంటి సోషల్ మీడియా ద్వారా 24/7 కొనసాగుతుంది. ఇవి తమ వ్యక్తీకరణకు ఎంత ఉపయోగపడతాయో, అంతే నెగటివ్ ప్రభావాన్నీ చూపించే సామర్థ్యం గలవి. సోషల్ మీడియాలో ఇతరులను చూస్తూ, పోల్చుకోవడం వల్ల కొందరు టీనేజర్లు ఆత్మన్యూనతకు లోనవుతుంటారు. పోస్టులకు లైకులు, కామెంట్ల ద్వారా వెంటనే గౌరవాన్ని పొందాలనుకునే తీరు కూడా వారిని కుంగిపోయేలా చేయవచ్చు. సోషల్ మీడియా ద్వారా వచ్చే ఈ ఒత్తిడిని తల్లిదండ్రులు గ్రహించి, వారితో మాట్లాడాలి. వారు చూస్తున్న కంటెంట్ గురించి చర్చించాలి. అది నిజ జీవితాన్ని ప్రతిబింబించదని వారికి అర్థమయ్యేలా వివరించాలి. నిర్ణయాలు, ఆత్మగౌరవంస్నేహితులు, సోషల్ మీడియా ఒత్తిడికి లోనైనప్పుడు టీనేజర్లు ఏ మాత్రం ఆలోచించకుండా ఎమోషన్‌తో నిర్ణయాలు తీసుకుంటారు. లో సెల్ఫ్ ఎస్టీమ్‌తో ఉంటే వారు మరింతగా స్నేహితుల ఒత్తిడికి లోనవుతారు. పిల్లల్లో ఆత్మగౌరవాన్ని పెంపొందించడం అత్యంత కీలకం. తల్లిదండ్రులు ఆ బాధ్యతను తీసుకోవాలి. పిల్లలు తమ ప్రతిభను గుర్తించేలా చేయాలి, వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచాలి. ప్రతిరోజూ వారి అభిరుచులు, కష్టాలను గుర్తిస్తూ విజయం దిశగా వారిని ప్రోత్సహించాలి. తల్లిదండ్రులు చేయాల్సింది..యవ్వనంలో, స్నేహితుల ఒత్తిడి సహజమే. కానీ, మీరు సున్నితంగా, ప్రేమతో పిల్లలకు మార్గనిర్దేశం చేస్తే, వారు సంయమనం, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. అందుకు మీరు చేయాల్సింది.. పిల్లలకు మీరెప్పుడూ అందుబాటులో ఉంటారని చెప్పాలి. వారు తమ సమస్యలు మీతో పంచుకునేలా నమ్మకాన్ని కలిగించాలి.ఆత్మవిశ్వాసంతో ప్రవర్తించడం, స్నేహితుల ఒత్తిడిని ఎదుర్కొనే నైపుణ్యాలను నేర్పాలి.సోషల్ మీడియా కంటెంట్ గురించి ఓపికగా చర్చించాలి.వారి కృషి, కష్టాలు, ప్రత్యేకతలను గుర్తించి ప్రశంసించాలి.వారు తీసుకునే నిర్ణయాల ఫలితాలను అర్థంచేసుకోవడంలో వారికి సహాయం చేయాలి. -
అగ్ని ప్రమాదం.. ముగ్గురు చిన్నారులు సజీవ దహనం
హౌరా: పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో దీపావళి వేళ పెను ప్రమాదం చోటుచేసుకుంది. బాణసంచా కాలుస్తున్న సమయంలో ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు ఇంటినంతా చుట్టుముట్టాయి. ఈ సమయంలో ఇంట్లో ఉన్న ముగ్గురు చిన్నారులు మంటల్లో చిక్కుకుని సజీవదహనమయ్యారు. ఈ ఘటనలో ఓ మహిళ, చిన్నారి కూడా గాయపడ్డారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హౌరాలోని ఉల్బీరియా ప్రాంతంలో శుక్రవారం బాణాసంచా కాలుస్తున్న సమయంలో ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. ఈ మంటలు పక్కనే ఉన్న దుకాణానికి కూడా అంటుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునే సరికే ముగ్గురు చిన్నారులు తీవ్రంగా కాలిపోయి మృతి చెందారు. ఉలుబేరియా మున్సిపాలిటీలోని వార్డు నంబర్ 27లో ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.ఈ ప్రాంతానికి చెందిన చిన్నారులు బాణసంచా కాలుస్తుండగా నిప్పురవ్వలు పక్కనే ఉన్న బాణసంచా సామగ్రిపై పడటంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన ఇద్దరు బాధితుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మృతులను తానియా మిస్త్రీ, ఇషాన్ ధార, ముంతాజ్ ఖాతూన్లుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఇది కూడా చదవండి: సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు -
పిల్లల చేత దివిటీలు ఎందుకు కొట్టిస్తారంటే..
దీపావళి పండుగ అంటే పిల్లలకు ఎంతో ఇష్టం. ఇల్లంతా దీపాలతో అలంకరిస్తూ పిల్లలు ఎంతో హడావుడి చేస్తుంటారు. దీపావళి వేళ ఎటుచూసినా దీపాల వెలుగులు కనిపిస్తాయి. దీపావళి నాడు చిన్న పిల్లల చేత పెద్దలు దివిటీలు కొట్టిస్తారు. దీనివెనుక ఒక పరమార్థం ఉంది.దీపావళి రోజున పిల్లల చేత దివిటీలు కొట్టించడం ఒక సంప్రదాయంగా వస్తోంది. ఈ దివిటీలను ప్రత్యేకంగా తయారు చేస్తారు. గోగు కర్రలకు నూనెలో నానబెట్టిన ఒత్తిని కట్టి, దానిని దీపంతో వెలిగిస్తారు. పిల్లలకు ఆ కర్రలను ఇచ్చి, పెద్దలు తమ సమక్షంలో ఆ దివిటీలను కొట్టిస్తారు. ఈ సమయంలో వాటిని గాలిలో గుండ్రంగా మూడుసార్లు తిప్పుతారు. ‘దిబ్బు దిబ్బు దీపావళి మళ్లీ వచ్చే నాగుల చవితి’ అని పిల్లల చేత పాలు పాడిస్తూ ఈ వేడుక చేస్తారు.ఈ దివిటీలు కొట్టించే కార్యక్రమం ముగిశాక పిల్లల కాళ్లు చేతులు కడిగి స్వీట్స్ తినిపిస్తారు. అనంతరం పిల్లల చేత టపాసులు కాల్పిస్తారు. ఈ దివిటీలు కొట్టించడం వెనుకనున్న అంతరార్థం విషయానికొస్తే.. దీపావళి రోజున పితృదేవతలు సంధ్యా సమయంలో ఆకాశంలో దక్షిణ దిక్కుగా వచ్చి తమ గృహాలను చూస్తారట. వారికి ఆహ్వనం పలుకుతున్న రీతిలో దివిటీలను కాలుస్తారని పండితులు చెబుతారు. ఇది పూర్వకాలం నుంచి ఏర్పడిన సంప్రదాయం అని పెద్దలు చెబుతుంటారు.ఇది కూడా చదవండి: సువాసనలు వెదజల్లే దీపాలను వెలిగిద్దాం ఇలా..! -
నూతన దంపతులు 16 మందిని కనాలి
చెన్నై: నూతన దంప తులు ఎక్కువ మంది పిల్లల్నికనే విష యం ఆలోచించాల ని తమిళనాడు ము ఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పేర్కొ న్నారు. ‘తమిళ సంప్రదాయంలో పెద్దలు నూతన దంపతులను 16 సంపదలతో వర్ధిల్లాలని ఆశీర్వదిస్తుంటారు. కానీ, నేడు పరిస్థితి మారిపోయింది. 2026 నుంచి చేపట్టనున్న జన గణన, లోక్‌సభ నియోజ కవర్గాల పునర్విభజనతో పుణ్యమాని చిన్న కుటుంబానికి బదులు, 16 మంది సంతానంతో కళకళలాడాలని ఆశీర్వదించాల్సిన రోజులొచ్చాయి’అని ఆయన వ్యాఖ్యానించారు. సోమవారం చెన్నైలో జరిగిన సామూహిక వివాహ వేదిక కార్యక్రమంలో సీఎం స్టాలిన్ మాట్లాడారు. నియోజకవర్గాల పునర్విభజన కారణంగా దేశంలో ఎన్నికల ముఖ చిత్రమే పూర్తిగా మారిపోనుందని అన్నారు. ‘లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్య తగ్గే అవకాశం ఉన్నందున, మాకు 16 మంది పిల్లలుండాలా అని ఆశ్చర్యపోయే పరిస్థితి ఏర్పడొచ్చు. అయితే, ఈ విషయం మనం మర్చిపోకూడదు’ అని ఆయన అన్నారు. -
'లైట్‌హౌస్ పేరెంటింగ్': పిల్లలు ప్రయోజకులయ్యేందుకు ది బెస్ట్!
'లైట్‌హౌస్ పేరెంటింగ్'..పదంలోనే ఉంది మార్గదర్శకం అని. అంటే..లైట్‌హౌస్ అనేది సముద్రంలో ఉంటుంది. ఇది పెద్ద పెద్ద ఓడలకు, పడవలకు ఓ దిక్సూచిలా ఉంటుంది. అలానే ఈ పేరెంటింగ్ విధానంతో పిల్లలు ప్రయోజకులుగా మారతారాని చెబుతున్నారు నిపుణులు.. అయితే ఈ విధానంలో పిల్లలు చాలా స్వతంత్రంగా ఉంటారు. మరీ ఇంత స్వతత్రంగా ఉంటే చేజారిపోయే అవకాశం ఉంటుదనే సందేహానికి తావివ్వకండి. ఎందుకంటే ఈ పేరెంటింగ్ విధానం వల్ల బాధ్యతయుతమైన పిల్లలుగా ఎదుగుతారని దీమాగా చెబుతున్నారు నిపుణులు. ఇంతకీ ఏంటి లైట్‌హౌస్ పేరెంటింగ్? బాధ్యతయుతంగా పెరిగేందుకు ఎలా ఉపయోగపడుతుంది..?అంటే..ఈ విధానంలో తల్లిదండ్రులు తమ పిల్లలను స్వతంత్రంగా ఎదిగేలా చేస్తారు. ఎక్కడ వారిని నియంత్రించారు. స్నేహంగా మెలుగుతారు. ఇక్కడ తల్లిదండ్రులు పిల్లలకు వచ్చిన ప్రతి సమస్యను తమకు తామే పరిష్కరించుకునేలా దిశా నిర్దేశాం చేస్తారేగానీ జోక్యం చేసుకోరు. సవాళ్లను అధిగమించడం ఎలా అనేది అనుభవపూర్వకంగా తెలుసుకునేలా చేస్తారు. ఈ టైపు తల్లిదండ్రులు తమ పిల్లలకు స్పష్టమైన పరిమితులు, సరిహద్దులను ఏర్పాటు చేస్తారు. ప్రపంచం నుంచి తనంతట తానుగా ఎలా అభివృద్ధి చెందాలో గైడెన్స్ ఇస్తారు.అంతేగాదు ఈ విధానంలో పిల్లలు తమ ఆత్మగౌరవానికి ప్రాముఖ్యత ఇవ్వడం తెలుసుకుంటారు. అలాగే తల్లిదండ్రులతో ఓపెన్ కమ్యునికేషన్ చేయగలరు. ప్రతి విషయం తమ తల్లిదండ్రులకు తెలియజేయడం మంచిదనే ఆటిట్యూడ్ వస్తుంది పిల్లలకి. తాము పరిష్కరించలేని సమస్యను తల్లిదండ్రుల వద్ద చర్చించి సరిచేసుకుంటారు. వాళ్లకంటూ ఓ అభిప్రాయలు, ఉన్నతభావాలతో ఉంటారు. ఆత్మవిశ్వాసంతో ముందకు సాగుతారు. అలాగే అనుకున్న వెంటనే కొన్ని పనులు అవ్వవనే విషయం అనుభవ పూర్వకంగా తెలుసుకుంటారు. ఓపిక, సహనంతో వ్యవహరించడం అలవాటవ్వుతుంది. ఈ పేరెంటింగ్ విధానం వల్ల పిల్లలు ప్రమాదాల బారినపడటం అనేది అరుదని కూడా చెప్పొచ్చు. అయితే ఈ పేరెంటింగ్ విధానంలో పిల్లలతో తల్లిదండ్రులు ఎలా వ్యవహరించాలి అంటే..తల్లిదండ్రులు ఎలా నడుచుకోవాలంటే..పిల్లలతో స్నేహభావంతో మాట్లాడటం వంటివి చేయాలి. విసిగిస్తున్నా ఓ చిరునవ్వుతో మందలిస్తన్నట్లుగా చెప్పాలి. ఇలా చేస్తే తన అమ్మకి తనంటే ఇష్టం అనే బలమైన నమ్మకం ఉంటుంది. ఇలా ఉంటే ఏ విషయమైన మీతో ధైర్యగా చెబుతారు. భయం అనే పదం దూరం అవుతుంది. తల్లిదండ్రులంటే నా శ్రేయోభిలాషులనే గట్టి ఫీలింగ్, మంచి బాండ్ ఉంటుంది. సమస్యలను, సవాళ్లను ఎలా హ్యాండిల్ చేయాలో సూచించాలే తప్ప తల్లిందడ్రులే తలకెత్తుకునే పని చేయకూడదు. అలాగే వాళ్లు సాధించిన ప్రతి విజయాన్ని సెలబ్రేట్ చేయడం, అభినందించడం వంటివి చేయాలి. అలాగే ఓడిపోయినా, వెనుకబడినా..భుజం తట్టి భరోశా ఇస్తూ ముందడుగు వేసేలా చేయాలి. ముఖ్యంగా నలుగురితో కలిసి ఉండటం ఏంటనేది తెలియజేయాలి. తమ నిర్ణయాలను తాము తీసుకునేలా స్వేచ్ఛగా బతకడం నేర్పిస్తే..ప్రతి అంశాన్ని సమాజం నుంచే సహజంగా నేర్చకుంటారు, వంటబట్టించుకుంటారు. ఇలా వ్యవహరిస్తే తల్లిందడ్రులు పిల్లల మధ్య మంచి బలమైన బాండింగ్ ఏర్పడుతుంది. అలాగే బాధ్యతయుతమైన పిల్లలుగా పెరగడమే కాకుండా గొప్ప ప్రయోజకులవుతారని చెబుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం తల్లిదండ్రులు మీ పిల్లలతో ఇలానే ప్రవర్తిస్తున్నారో లేదో చెక్ చేసుకోండి.(చదవండి: పారిస్ ఫ్యాషన్ వీక్‌లో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హ్యాండ్ బ్యాగ్! అన్ని కోట్లా..!) -
పాపం కంటిపాపలు
తల్లిదండ్రులకు కంటిపాపలైన చిన్నారుల్లో కంటిచూపు క్రమంగా క్షీణిస్తోంది. సగటున ప్రతి ముగ్గురు బాలల్లో ఒకరు హ్రస్వదృష్టి (దూరంలోని వస్తువులు సరిగా కని్పంచని) సమస్యతో బాధపడుతున్నట్టు అంతర్జాతీయ విశ్లేషణ ఒకటి హెచ్చరించింది. ఆసియాలోనైతే సమస్య మరీ దారుణంగా ఉంది. జపాన్‌లో ఏకంగా 85 శాతం, కొరియాలో 73 శాతం మంది బాలలు ఈ సమస్యతో బాధపడుతున్నారు. బ్రిటిష్ జర్నల్ ఆఫ్ ఆఫ్తల్మాలజీలో తాజాగా ప్రచురితమైన అధ్యయనం ఈ మేరకు వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఆరు ఖండాల పరిధిలోని 50కి పైగా దేశాల్లో విస్తృతంగా అధ్యయనం చేసిన మీదట ఈ ఆందోళనకర గణాంకాలు వెలుగులోకి వచి్చనట్టు పేర్కొంది. అధ్యయనంలో భాగంగా 50 లక్షలమందికి పైగా బాలలు, టీనేజర్లను పరీక్షించారు. స్కూలు పుస్తకాలతో కుస్తీకి తోడు స్క్రీన్ సమయం విపరీతంగా పెరగడం, ఆరుబయట గడిపే సమయం తగ్గడం పిల్లలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నట్టు పరిశోధకులు తేల్చారు. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే 2050 నాటికి కోట్లాది మంది పిల్లల కంటిచూపు బాగా ప్రభావితం అవుతుందని హెచ్చరించారు. హ్రస్వదృష్టి సాధారణంగా స్కూలుకు వెళ్లడం మొదలు పెట్టే దశలోనే మొదలవుతుంది. కళ్ల ఎదుగుదల ఆగిపోయేదాకా, అంటే 20 ఏళ్లొచ్చేదాకా సమస్య తీవ్రత పెరుగుతూనే ఉంటుంది. సగం యువతకు సమస్యే → ప్రపంచవ్యాప్తంగా 36 శాతం మంది బాలలు హ్రస్వదృష్టితో బాధపడుతున్నారు. → 1990 నుంచి 2023 మధ్యకాలంలోనే సమస్య ఏకంగా మూడు రెట్లు పెరిగింది. → పిల్లల్లో హ్రస్వదృష్టి ఆసియా దేశాలతో పోలిస్తే ఆఫ్రికా దేశాల్లో ఏకంగా ఏడు రెట్లు తక్కువగా ఉండటం విశేషం. → ఉగాండాలో అతి తక్కువగా కేవలం ఒక్క శాతం మంది పిల్లల్లో మాత్రమే హ్రస్వదృష్టి నమోదైంది. → ఆఫ్రికా దేశాల్లో పాఠశాల విద్య ఆరు నుంచి ఎనిమిదేళ్ల వయస్సులో ప్రారంభమ తుంది. పైగా పిల్లలు ఆరుబయట ఎక్కువగా గడుపుతున్నారు. దాంతో అక్క డ బాలలు, యువకుల్లో సమస్య తక్కువగా ఉంది. → జపాన్‌లో ఏకంగా 85%, దక్షిణ కొరియాలో 73% పిల్లలకు హ్రస్వదృష్టి ఉంది. → చైనా, రష్యాల్లో 40 % కంటే ఎక్కువగా, యూకే, ఐర్లాండ్, అమెరికాల్లో 15 శాతానికి పైగా పిల్లల్లో సమస్య ఉంది. → మిగతా ఖండాలతో పోలిస్తే ఆసియాలో 2050 నాటికి ఏకంగా 69 శాతం మంది హ్రస్వదృష్టి బారిన పడతారు. → అప్పటికి ప్రపంచ యువతలో కనీసం సగానికి సగం ఈ సమస్యను ఎదుర్కొంటారు. → వర్ధమాన దేశాల్లో 2050 నాటికి 40% మంది దీని బారిన పడే అవకాశముంది. → పిల్లలను రెండేళ్ల వయసులోనే బడిబాట పట్టించే సింగపూర్, హాంకాంగ్ వంటిచోట్ల సమస్య విస్తరిస్తోంది. → కోవిడ్ లాక్డౌన్ సమయంలో బాలల్లో హ్రస్వదృష్టి సమస్య బాగా పెరిగింది. → కోట్లాది మంది ఇళ్లకే పరిమితమై స్మార్ట్ ఫోన్లు, టీవీలు విపరీతంగా చూడటం దీనికి ప్రధాన కారణం. అమ్మాయిల్లోనే ఎక్కువ అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల్లోనే హ్రస్వదృష్టి ఎక్కువగా కని్పస్తున్నట్టు అధ్యయనం తేలి్చంది. ‘‘అబ్బాయిలతో పోలిస్తే ఎదిగేక్రమంలో వాళ్లు ఇంట్లో గానీ, స్కూల్లో గానీ ఆటలపై, ఆరుబయట, గడిపే సమయం తక్కువ. వీటికితోడు ఆహారపు అలవాట్లు తదితరాల వల్ల చాలా చిన్నవయసులోనే రజస్వల అవుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. వారిలో చాలావరకు టీనేజ్లోనే హ్రస్వదృష్టి బారిన పడుతున్నారు’’ అని పరిశోధకులు పేర్కొన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
International Daughters Day 2024: మన కంటిపాపకు కలలే కాదు... రెక్కలిద్దాం
మన దేశంలో కొత్తగా పెళ్లయిన దంపతులను ‘సుపుత్ర ప్రాప్తిరస్తు’ అని ఆశీర్వదించడం ఆనవాయితీ. అయితే ఇప్పుడు ‘సుపుత్రికా ప్రాప్తిరస్తు’ అంటున్నారు. ఎందుకంటే ఇప్పటి కాలంలో కూతురు పుట్టడమే పెద్ద అదృష్టం అనే విధంగా ఆలోచనలు మారుతున్నాయి. అన్ని రంగాల్లో ఆడపిల్లలు సాధిస్తున్న విజయాలు అందుకు సహకరిస్తున్న తల్లిదండ్రులను చూస్తూనే ఉన్నాం. ఇంట కూతురు ఉంటే ఆ ఇంటికి వచ్చే కళ వేరు. కూతురి సామర్థ్యాలు ఇంటికి వెలుగు. భ్రూణ హత్యల వల్ల స్త్రీల జనాభా కురచగా ఉన్న రోజులు ఇకపై చెల్లిపోవాలి. ప్రతి కూతురూ ఒక వరంలా వర్థిల్లాలి. అంతర్జాతీయ కుమార్తెల దినోత్సవం సందర్భంగా కూతురుగా, కూతురికి తల్లిగా ఉన్న కొంతమంది రచయిత్రుల అభి్రపాయాలు.మీ కూతుళ్లకేం ఇస్తున్నారు?‘మీకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉండి, ఒకరిని మాత్రమే చదివించే స్థోమత ఉన్నట్లయితే అమ్మాయినే చదివించండి‘ అంటారు పెరియార్. ఆడపిల్లల చదువుప్రాధాన్యతను గుర్తించడం వల్లే కావచ్చు నన్ను, మా చెల్లిని బాగా చదివించారు మా తల్లిదండ్రులు. ఆడపిల్లలకేం కావాలి అంటే మంచి బట్టలు, నగలు అని కాకుండా ఆర్థికంగా స్వావలంబన కలిగివుండాలనే వారి ఆలోచన కారణంగానే మా జీవితాల్లో మేము నిలదొక్కుకున్నాం. ఈ కారణం చేతనే కొడుకులకు మాత్రమే తల్లిదండ్రుల బాధ్యత అనుకోకుండా వాళ్ల చివరి రోజుల్లో వారి ఆలనా పాలనా నేను చూసుకోగలిగాను. ఇప్పుడు అమ్మాయిలకి కేవలం ఆర్థిక స్వావలంబన మాత్రమే సరిపోదు. సమాజంలో భద్రత, ఆత్మరక్షణ విద్యలు కూడా అవసరం. ఇంట్లో నేను ఇద్దరు ఆడపిల్లలకు తల్లిని. కాలేజీలో నాకు ఎనిమిది వందల మంది కూతుళ్లు. వారంతా రెక్కలు తొడిగిన ఉత్సాహంతో స్వేచ్ఛగా ఎగరగలిగే వాతావరణం ఉండాలని నా ఆకాంక్ష. అమ్మాయిలు ఆర్థిక స్వావలంబనతో పాటు, ఆత్మవిశ్వాసంతో ఎదగటానికి తల్లిదండ్రులు సమాజం చేయగలిగినదంతా చేయాలి. నేటితరం కూతుళ్లందరికీ నా శుభాకాంక్షలు. – ఎం. ప్రగతి, రచయిత్రి, అనంతపురంకూతురి ప్రపంచంలోకి వెళతానుఏలూరు దగ్గర, కొక్కిరపాడు అనే పల్లెటూరులో ఆర్థికంగా చితికిపోతూ ఉన్న పెద్దరైతు కుటుంబంలో పుట్టాను. నలుగురాడపిల్లల్లో కడసారిదాన్ని. కూతురుగా ఎట్లా ఉన్నానో, ఉంటున్నానో తరచి చూసుకుంటుంటే కొత్తగా ఉంది. చిన్నప్పుడు మా అవసరాలకి డబ్బులు సరిగ్గా ఇవ్వనందుకు అమ్మానాన్నల మీద అరిచేదాన్నని అమ్మ చెపుతూ ఉంటుంది. కాని బుద్ధి పెరిగాక ఎపుడూ విసిగించింది లేదు. ‘మగపిల్లలు లేరు, అంతా ఆడమంద’ అని లోకం వెక్కిరించే రోజుల నుంచి ‘మా బిడ్డలు రత్నాలు’ అని అమ్మానాన్నలు గర్వంగా చెప్పుకునే రోజు వరకూ కూతురుగా నా ప్రయాణంలో అనేక ఎగుడు దిగుళ్లు. కులాన్ని వదిలి నా పెళ్లి నేనే చేసుకున్నందుకు, డబ్బు సంపాదన వదిలి నచ్చిన మార్గంలో వెళ్ళినపుడూ వారు రక్షకులై వెన్ను తట్టారు. చుట్టూ ప్రకృతిని, ప్రేమని ఆస్తులుగా పంచారు. ఇవ్వడం తప్ప తిరిగి అడగడం తెలీని ప్రేమమూర్తుల కూతురిని. స్త్రీలకి అన్నిరంగాలలో స్వేచ్చ ఉండాలని నమ్మే నాకు స్నిగ్ధ ఒక్కతే కూతురు. నేను నమ్మే వాటికి, పెంపకానికి మధ్య కొన్ని విషయాలలో పేచీలు వచ్చేవి, దుస్తులు, షికార్లు, ప్రేమలు వంటివి. ‘స్వేచ్ఛ అంటే నీ నిద్ర నువ్వే లేవడం కూడా’ అంటూ కొటేషన్లు చెప్పిన నాకు ఏ మాత్రం లొంగకుండా తన వ్యక్తిత్వాన్ని చక్కగా కాపాడుకున్న స్నిగ్ధని కొన్ని విషయాల్లో గురువుగా భావించే అమ్మనిపుడు. తనతో గడపడం కోసం నేను ఎదురు చూడడం కాదు, ‘అమ్మా... ముచ్చట్లు చెప్పుకుందామా?’ అని తను తరచూ అడిగే ఆకర్షణ నాలో ఉండడం కోసం ఆ వయసు వారి ప్రపంచంలోకి చొచ్చుకుపోతాను, నేర్చుకుంటాను. ‘నా విలువలకి అనుగుణంగా పెళ్లి చేసుకోకపోతే నేను రాను’ అని బెదిరించబోయానా! ‘నేను నీ ద్వారా వచ్చాను తప్ప నీ కోసం రాలేదు’ అని గట్టిగానే చెప్పింది. కూతురుగా, కూతురి తల్లిగా నా బొమ్మ వారికి సూపర్ హిట్.– కె.ఎన్. మల్లీశ్వరి, రచయిత్రి, విశాఖపట్నంఏ దేశ కరెన్సీ సరిపోదుఫలానా అమ్మాయికి మేము తల్లితండ్రులం అనే స్థాయికి ఎదిగిన ఆడపిల్లలు ఎందరో. అటువంటి అమ్మాయిలను ఆదర్శంగా తీసుకొని గొప్పగా ఎదగాలని ఇండియన్ ఆర్మీకి, సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సన్నద్ధం అయ్యాను. అనేక కారణాల చేత గమ్యం చేరుకోలేక నిస్సహాయతతో నలిగిపోయాను. ఇంట్లో పెళ్లి చేస్తాను అన్న ప్రతిసారి ‘అమ్మా! నీలాగా నా జీవితం ఇంటికి, పెళ్లి, పిల్లలకు అంకితం అవ్వకూడదు’ అని మా అమ్మను నిందించేదాన్ని. అమ్మ మౌనంగా బాధపడేది. వంటింట్లో ఉల్లిపాయలు తరుగుతూ కన్నీటిని దాచిపెట్టేది. అపుడు అర్థం అయ్యేది కాదు... నాకు పెళ్ళి అయ్యి ఒక కూతురు పుట్టే వరకు ఆమె మౌనానికి అర్థం నిస్సహాయత కాదు అది అంతర్మథనం అని నాకు తెలియలేదు. మా అమ్మ ఇద్దరు చెల్లెళ్లకు అక్కగా పుట్టింది. కొడుకులు లేని కుటుంబం. ఇద్దరూ పిన్నులు చిన్న ఉద్యోగాలు చేయడం మొదలుపెట్టారు. కానీ మా అమ్మ పరిస్థితుల రీత్యా టాలెంట్ ఉన్నా ఇంటికే పరిమితం ఐపోయింది. కానీ ఇంట్లో, ఇంటి చుట్టుపక్కల ఎవరికి ఆపరేషన్ ఐనా, ఒంట్లో బాగోలేకపోయినా, ఊరెళ్తున్నా ఇలా కారణం ఏదైనా ఆ కుటుంబానికి వండి పెట్టే బాధ్యత కూడా మా అమ్మ నిస్వార్థంగా తీసుకునేది. మా పిన్నులు జీతం సంపాదించే వారు కానీ ఇతరుల కోసం ఖర్చు చేసే సమయం సంపాదించలేక పోయారు. మా అమ్మను చూస్తూ మా తాత అనుకునేవారు..‘ ఇది నాకు కూతురు కాదు... మా అమ్మ అక్కలను కలిపి మళ్లీ పుట్టించాడు దేవుడు’ అని.. మా అమ్మ కథ విన్నాక నాకు అర్థమైంది ఏమిటంటే ఆడపిల్లగా కుటుంబానికి సహాయం చేయాలి అనుకుంటే ఉద్యోగాలే చెయ్యక్కర్లేదు.. అందరినీ నా వారు అనుకుంటూ కలుపుకుని పోతే డబ్బు సంపాదించే ఉద్యోగం చేయకపోయినా మనసులను సంపాదించొచ్చు. ఇది అర్థమయ్యాక మా అమ్మ జీవితాన్ని గమనించి ఆమె చెప్పినవి, చెప్పనివి అక్షరాలుగా రాయడం మొదలుపెట్టాను. రాయడం మొదలు పెట్టిన తరువాత తెలిసింది ఇది మా అమ్మ కథ కాదు. కొన్ని వందల వేల అమ్మల కథ. ఇంటిపట్టున మిగిలిపోయాము అని బాధపడే ఆడపిల్లల, ఆడతల్లుల మనోవ్యధ. మన దేశంలో ఆడపిల్లలు కొన్ని కోట్ల మంది ఇంటి పట్టున ఉండిపోయాము అని బాధ పడుతూ వుంటారు. మీరు ఓడిపోలేదు. మీరు కూతుర్లుగా మీ అమ్మ నాన్నల ప్రేమను, పేరును, పెంపకాన్ని నిస్వార్థంగా ప్రపంచానికి పంచుతున్నారు, కుటుంబాలను, కలలను పెంచుతున్నారు. మీరు చేస్తున్న సేవకు వెల కట్టి డబ్బు ఇవ్వాలని ఆలోచన వచ్చినా అది ఏ దేశ కరెన్సీలో ఇచ్చినా మీకు సరిపోదు. మీకు కుమార్తెల దినోత్సవ శుభాకాంక్షలు. ఇదంతా రాస్తుంటే నా 17 నెలల కూతురు ‘అమ్మ జూచు జూచు’ అనుకుంటూ ఒక గ్లాస్ ను వంకర టింకరగా పట్టుకుని నా టేబుల్ దగ్గరకు వచ్చింది. నాలో ఉన్న ఆడపిల్ల నాకు పుట్టిన ఆడపిల్లను చూసి మురిసిపోయింది. – ప్రవల్లిక, రచయిత్రి, సికింద్రాబాద్కూతుళ్లు మేజిక్ చేస్తారుఇంటికి ఆడపిల్ల వుండటం గొప్ప వైభవం. నేను ఒక కూతుర్ని, ఒక కూతురికి తల్లిని. అయితే నేను మరీ అంత గొప్ప లేదా మంచి కూతుర్ని కాదు. బహుశా ఇంకొంచం బాగా వుండాల్సింది. జీవితపు ప్రతి దశలో మా అమ్మతో/కుటుంబంతో అనేక విషయాల్లో విభేదిస్తూ, గొడవ పడుతూ, అప్పుడప్పుడూ సర్దుకుపోతూ, నా స్వాతంత్ర కాంక్షను, అభి్రపాయాలను కాపాడుకుంటూ నడిపాను. మా అమ్మ కాస్త మొండిమనిషి కాబట్టి చిన్నతనంలో అలవికాని నా అల్లరిని, ఇప్పటికీ నా స్వభావంలో వుండే లోపాల్ని భరిస్తోంది. సున్నితమైన అమ్మైతే చాలా కష్టం అయేది. కూతురిగా నాకై నేనైతే జస్ట్ పాస్ మార్క్ వేసుకుంటాను. నా కూతురి దగ్గరకొస్తే తన వల్ల నేను టెన్షన్ పడిన సందర్భాలకన్నా గర్వపడిన సందర్భాలే ఎక్కువ. కూతుళ్లు, తల్లులకన్నా, తండ్రులకు సన్నిహితంగా వుంటారు అనే లోకోక్తి నేను నమ్మను. నా కూతురు నాకు దగ్గరగా వుంటుంది. నాకు కొత్త కొత్త విషయాలు నేర్పిస్తుంది. నాతో వాదిస్తుంది. నాది తప్పైతే మన్నిస్తుంది. మంచి కూతురిగా, మా అమ్మాయికి డిస్టింక్షన్ శాంక్షన్ చేస్తాను. ఇవాళ మా అమ్మ దగ్గరకువెళ్ళి అడిగితే కూడా తనకు తక్కువ మార్కులు వేసుకొని, తన కూతురికి ఎక్కువ మార్కులు ఇస్తుంది. కూతుర్లు అంతే. మురిపిస్తారు. మాజిక్ చేస్తారు. – ఎం.ఎస్.కె. కృష్ణజ్యోతి, రచయిత్రి, విజయవాడ -
స్ట్రిక్ట్ మామ్ కాజోల్: సరిగా చేస్తే హెలికాప్టర్ పేరెంటింగ్ విధానం బెస్ట్!
పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల వైఖరే వారి ఎదుగదలకు కీలకం. అందుకనే ఈ విషయంలో చాలామంది తల్లిదండ్రులు చాలా కేర్ తీసుకుంటారు. పిల్లలను మరీ గారాభం చేస్తున్నామా, మరీ కఠినంగా వ్యవహరిస్తున్నామా అని సందేహిస్తుంటారు. ఒక్కోసారి మనం వారి సంరక్షణార్థం స్ట్రిక్ట్‌గా ఉన్నా అపార్థం చేసుకునే పిల్లలు కూడా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న తల్లిదండ్రులకు సెలబ్రిటీలు, ప్రముఖుల పేరెంటింగ్ విధానం కాస్త హెల్ప్ అవుతోంది. ఈ నేపథ్యంలో 90ల నాటి కుర్రాళ్ల క్రష్, బాలీవుడ్ దిగ్గజ నటి కాజోల్ విశ్వసించే పేరెంటింగ్ విధానం గురించి తెలుసుకుందామా..!బాలీవుడ్ నటి కాజోల్ అంటో ఇష్టపడని వారుండరు. తన అందమైన కళ్లతో కుర్రకారుని కట్టిపడేసింది. ఐదుపదుల వయసు దాటినా ఇప్పటికీ ఆమె క్రేజ్ తగ్గలేదనే చెప్పొచ్చు. ఇక నటుడు అజయ దేవగన్‌ని పెళ్లి చేసుకున్న తర్వాత అడపదడపా సినిమాలు చేస్తు తల్లిగా ఇంటి బాధ్యతలను నిర్వర్తిస్తోంది. ఇక పలు ఇంటర్వ్యూల్లో కాజోల్ స్ట్రిక్ట్ మామ్ అని ఆమె పిల్లలు నైసా, దేవగన్‌లు చెప్పడం చూశాం కూడా. అలాగే కాజోల్ కూడా పిల్లల పెంపకంలో తాను చాలా కఠినంగా వ్యవహరిస్తానని ఒప్పుకుంది కూడా. అంతేగాదు తాను పిల్లల పెంపకంలో 'హెలికాప్టర్ పేరెంటింగ్ విధానమే' సరైనది విశ్వసిస్తానని చెబుతోంది. నిజానికి కాజోల్ 'హెలికాప్టర్ ఈలా' అనే బాలీవుడ్ మూవీలో తల్లిపాత్రను పోషించింది కూడా. అయితే అందులో ఉన్నట్లు పిల్లల జీవితంలో అతి ప్రమేయం ఉన్న తల్లిగా మాత్రం వ్యవహరించకున్నా.. కొన్ని విషయాల్లో మాత్రం స్ట్రిక్ట్‌గా పట్టించుకుంటానంటోంది కాజోల్. నిజానికి ఈ పేరెంటింగ్ విధానాన్ని నెగిటివ సెన్స్‌లో వాడతారు. ఎందుకంటే ఈ హెలికాప్టర్ పేరెంటింగ్ విధానంలో పిల్లల ప్రతి కదలికను వారి నియంత్రణలోకి ఉంచుకునే తల్లిదండ్రులకు నిపుణలు ఈ పేరుపెట్టడం జరిగింది. ఇక్కడ పిల్లలను మరీ అంతలా కట్టడి చేయకపోయినా, ఇప్పుడున్న ఆధునిక సంస్కృతిలో కాస్త నియంత్రణ అవసరమే అంటోంది కాజోల్. ప్రస్తుత ఇంటర్నెట్ యుగంలో పిల్లలు ఈజీగా దేన్నైనా నేర్చుకోగలరు, పాడైపోగలరు కాబట్టి ఆ పేరెంటింగ్ స్టైలే మంచిదని చెబుతోంది కాజోల్. ప్రతిదాంట్లో జోక్యం తగదు..వాళ్ల సొంత గుర్తింపు కోసం పాటుపడేలే మనం కాస్త కఠినంగా వ్యవహరించాలి. అలాగే కొన్ని విషయాల్లో ఓ కంట కనిపెడుతూ..ప్రశ్నించాల్సిందే. ఏమరపాటున ఉంటే దారితప్పే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తోంది. ఇక్కడ హెలికాప్టర్ విధానం మాదిరిగా వాళ్లకంటూ స్పేస్ లేకుండా పిల్లలకు సంబంధించిన ప్రతిదాంట్లో వేలు పెట్టకూడదు తల్లిదండ్రులు. వారితో టచ్‌లో ఉంటూ వాళ్ల ప్రతి విషయం తాము కనిపెడుతున్నామనే భయం వారిలో కలిగించాలని చెబుతోంది కాజోల్.భయంతో కూడిన గౌరవం..అంతేగాదు తప్పు చేయాలనే ఆలోచన, లేదా తప్పు చేసినా.. తల్లిదండ్రులకు చెప్పేయడమే మంచిది లేదంటే అమ్మ మాట్లాడదు అనే భయంతో కూడిన గౌరవం కలగచేసేలా పెంచాలని చెబుతోంది. ఈ హెలికాప్టర్ పేరెంటింగ్ విధానం సరిగా ఉపయోగిస్తే పిల్లల పెంపకంలో మంచి హెల్ప్ అవుతుందని నమ్మకంగా చెబుతోంది. ఈ విధానం వల్ల చెడు అలవాట్లు, ఆర్థిక పరిస్థితి పట్ల కరెక్ట్‌గా వ్యవహరించడం వంటివి చేయగలుగుతారు." తాను ఇలా ఉండటం వల్లే తన కూతరు పబ్లిక్ ప్రదేశాల్లో ఎలా వ్యవహరించాలో నేర్చుకుంది. పాప్ సంస్కృతిని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకుంది. మీ తల్లిదండ్రుల వల్లే ఇలా లగ్జరియస్‌గా బతుకుతున్నారనే విషయం పదే పదే చెబుతాను. డబ్బు విలువ తెలిపేందుకు ఎంత చిరాకు తెచ్చుకున్నా సరే.. వాళ్ల పాకెట్ మనీలో కొంత భాగం అడుగుతుంటానని చెబుతోంది." కాజోల్. ప్రతి తల్లిదండ్రలు ఇలా వ్యవహరిస్తే.. పిల్లల బంగారు భవిష్యత్తును ఎలాంటి మచ్చ లేకుండా శోభాయమానంగా ఉంటుందని నమ్మకంగా చెబుతోంది. (చదవండి: ఒకప్పుడు ట్రాన్స్ జెండర్‌గా బిక్షాటన ..నేడు ఒక అమ్మాయిని దత్తత తీసుకుని..!) -
పీఎం కేర్.. చిల్డ్రన్ వెల్ఫేర్
కలెక్టర్ల నుంచి సేకరించి.. తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన పిల్లల వివరాలను రాష్ట్రాల వారీగా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో పీఎం కేర్ ఆన్లైన్ పోర్టల్‌లో నమోదు చేసినట్టు కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి లోక్‌సభలో వెల్లడించారు. ఇప్పటివరకు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పీఎం కేర్ పోర్టల్‌లో కోవిడ్–19 కారణంగా తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన పిల్లలు 4,532 మంది నమోదైనట్టు కేంద్ర మంత్రి తెలిపారు. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 855 మంది పిల్లలు తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయారు. పీఎం కేర్ పోర్టల్‌లో నమోదైన 4,532 మంది పిల్లలకు 18 సంవత్సరాలు నిండాక ప్రతి బిడ్డకు రూ.10 లక్షల చొప్పున పోస్టాఫీస్‌లో కార్పస్ ఫండ్ కింద జమ చేస్తున్నట్టు కేంద్ర మంత్రి వివరించారు.పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకంలో 10 లక్షల కార్పస్‌ను పెట్టుబడి పెట్టడం ద్వారా 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల మధ్య పిల్లలలకు నెలవారీ స్టైఫండ్‌ను ఇస్తారని, 23 సంవత్సరాల నిండిన తరువాత రూ.10 లక్షలు మంజూరు చేస్తారని వెల్లడించారు. బందువుల దగ్గర ఉంటున్న 18 ఏళ్లలోపు పిల్లలకు మిషన్ వాత్సల్య పథకం కింద నెలకు రూ.4,000 చొప్పున మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇస్తుందని మంత్రి పేర్కొన్నారు. పిల్లల సంరక్షణ, ఇన్స్టిట్యూట్లో ఉండే పిల్లలకు బోర్డింగ్, లాడ్జింగ్ సౌకర్యాలను ప్రభుత్వమే కలి్పస్తుందని మంత్రి తెలిపారు. ఈ పిల్లలు 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకునేందుకు వీలుగా కేంద్రీయ విద్యాలయాల్లో ప్రత్యేకంగా అడ్మిషన్లు ఇచి్చనట్టు పేర్కొన్నారు. పూర్తి ఫీజు మినహాయింపుతో.. కోవిడ్ కారణంగా తల్లిదండ్రుల్ని కోల్పోయిన పిల్లలను ఒక్కో కేంద్రీయ విద్యాలయంలో ప్రత్యేకంగా 10 మంది చొప్పున చేర్చు కుంటున్నారు. ఆ పిల్లలకు పూర్తిగా ఫీజు మినహాయింపు ఉంది. స్కూల్‌కు వెళ్లే పిల్లలందరికీ స్కాలర్íÙప్ కింద రూ.20 వేల చొప్పున ఇస్తారు. వీరంతా ఆయుష్మాన్ భారత్–ప్ర«దానమంత్రి జన ఆరోగ్య యోజన కింద రూ.5 లక్షల ఆరోగ్య బీమా కవరేజీతో నమోదయ్యారు. వారికి 23 సంవత్సరాలు వచ్చే వరకు ఆరోగ్య బీమా కవరేజి వర్తిస్తుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు.. కోవిడ్ కారణంగా తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోయిన పిల్లల వివరాలను బాలస్వరాజ్ పోర్టల్‌లో నమోదు చేశారు. ఈ కేటగిరీలో అన్ని రాష్ట్రాల్లో కలిపి 1,82,2671 మంది పిల్లలు నమోదయ్యారు. వీరి సంరక్షణ, విద్య, ఆరోగ్య బాధ్యతలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. మిషన్ వాత్సల్య పథకం కింద, పిల్లల సంరక్షణ సంస్థల ద్వారా వారి సంరక్షణ చర్యలను చేపడుతున్నారు. తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోయిన పిల్లలు అత్యధికంగా ఒడిశాలో 34,160 మంది, మహారాష్ట్రలో 27,302 మంది, ఉత్తర ప్రదేశ్‌లో 19,437 మంది, తమిళనాడులో 15,395 మంది, గుజరాత్లో 13,802 మంది, మధ్యప్రదేశ్‌లో 11,413 మంది ఉన్నారు. -
మా బాబు.. ఒకచోట కుదురుగా ఉండటం లేదు..!?
మా బాబు వసు 5 సంవత్సరాలు. ఒకచోట నిలకడగా ఉండMýంండా, ఎప్పుడూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. ఇంట్లో, స్కూల్లో బయటా కూడా ఇలాగే చస్తుంటాడు. బయట ఫంక్షన్లకు తీసుకెళితే తనను పట్టుకోవడం, తన చుట్టూ తిరగడంతోటే సరిపోతుంది. అందువల్ల ఈ మధ్య బయటకు వెళ్లడం కూడా తగ్గించేశాం. వాళ్ల నానమ్మేమో, ఇది పిల్లల్లో మామూలే అంటుంది. ఈ మధ్య వాళ్ల స్కూల్ టీచర్ మమ్మల్ని పిలిచి, మా బాబు మీద అనేక కంప్లయింట్లు చెప్పింది. మాకు చాలా ఆందోళనగా ఉంది. – కె. మాధవి, సికింద్రాబాద్పిల్లల మెదడులో ఉండే సెల్ఫ్ కంట్రోల్ విభాగం లోని లోపాల వల్ల, వారసత్వ లక్షణాల రీత్యా, కొందరు పిల్లలకు మీరు చెప్పిన లక్షణాలు రావచ్చు. దీనిని హైపర్ యాక్టివిటీ లేదా ఏడీహెచ్‌డీ అంటారు. నిలకడ లేకపోవడం, చదువు మీద ఏకాగ్రత లేకపోవడం, వస్తువులు విసిరేయడం, సహనం లేకపోవడం, ఎప్పుడూ అటూ ఇటూ తిరుగుతూ ఉండటం, స్కూల్లో వస్తువులు మరచిపోవడం, ఈ సమస్య ముఖ్య లక్షణాలు. వీరికి తెలివితేటలు బాగానే ఉన్నప్పటికీ, ఏకాగ్రత లోపించడం వల్ల చదువులో వెనకబడతారు.ఇలాంటి వారిని ఎంత చిన్నవయసులో గుర్తించి, సరిౖయెన చికిత్స చేయిస్తే అంత తొందరగా దీంట్లోంచి బయట పడతారు. ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియర్ థెరపీ, అవసరమైతే కొద్ది మోతాదులో కొన్ని మందులు వాడటం ద్వారా వీరిని పూర్తిగా బాగు చెయ్యచ్చు. పేరెంట్స్, టీచర్లు ఇలాంటి వారిని త్వరగా గుర్తించగలిగితే తొందరగా బాగుపడతారు. మైకేల్ ఫిలిప్స్ అనే స్విమ్మర్ ఈ సమస్యతో బాధపడుతూ చికిత్స తీసుకుని బాగుపడి, ఒలింపిక్స్‌లో 20కి పైగా స్వర్ణ పతకాలు సాధించాడు. చైల్డ్ సైకియాట్రిస్ట్‌ల సూచనలు తీసుకోవడం, పాటించడం మేలు చేస్తుంది.– డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్, సైకియాట్రిస్ట్, విజయవాడ -
వీధికుక్కల బారి నుంచి కాపాడాలంటూ చిన్నారుల ఆందోళన
-
ముగ్గురు పిల్లలతో తండ్రి ఆత్మహత్యాయత్నం
-
పిల్లలకు బ్రషింగ్ నేర్పడం ఇలా..
పెరిగే పిల్లల పళ్లు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే, వాళ్లకు పళ్లు రంధ్రాలు పడటం, పుచ్చుపళ్లు రావడం వంటివి నివారించాలంటే ఈ కింది జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు బ్రషింగ్ ప్రక్రియనూ నేర్పాలి..పళ్లపై ఏర్పడే గార తొలగిపోడానికి, అది ఏర్పడకుండా ఉండటానికి పేస్ట్‌తో రోజూ రెండుసార్లు బ్రష్ చేయడం నేర్పాలి.పళ్ల మీద గుండ్రంగా తిప్పుతున్నట్లుగా బ్రష్‌ను ఉపయోగించేలా చిన్నప్పటినుంచి అలవాటు చేయాలి.దానికి వాళ్లు అలా అలవడిపోయి, జీవితాంతం కరెక్ట్‌గా బ్రషింగ్ చేస్తారు.బ్రష్ మీద బఠాణీ గింజ అంత పేస్ట్ వేస్తే.. దానిని వారు మింగకుండా ఉంటారు.నాలుగేళ్లు దాటాక కూడా వేలు చప్పరించే పిల్లల పళ్లు వంకర టింకరగా రావడం లేదా ఒకేచోట గుంపుగా రావడం జరగవచ్చు. అందుకే ఈ అలవాటు త్వరగా మానేలా జాగ్రత్త తీసుకోవాలి.ఇవి చదవండి: Fashion: స్కర్టే.. సూపర్ స్టయిల్! -
పిడుగు ముద్దాడ బోయింది
వానలో తడవాలని పిల్లలకు ఉంటుంది. జల్లుల్లో వాళ్లు కేరింతలు కొడితే ముద్దొస్తారు. మరి పిడుగుకు ముద్దొస్తే? తృటిలో ప్రాణాలు తప్పిపోయాయి. వానలో పిల్లలు జాగ్రత్త.బిహార్‌లోని సీతామర్హిలో ఒకమ్మాయి వానలో టెర్రస్ మీద సరదాగా కేరింతలు కొడుకుతుంటే తల్లి అది ఫోన్లో వీడియో తీయసాగింది. మనం అనుకుంటాం వాతావరణం ఆహ్లాదంగా ఉందని. కాని మెరుపులు, పిడుగులు ఎలా మెరిసి ఉరుముతాయో తెలియదు కదా. ఇక్కడ ఆ అమ్మాయికి కొద్ది దూరంలోనే పిడుగు పడింది. క్షణాల్లో ఆ అమ్మాయి లోపలికి పరిగెత్తింది. అమ్మాయి, తల్లి క్షేమమేగాని గురి సూటిగా ఉండి ఉంటే? అందుకే జాగ్రత్త. ఇకపై వానలు... ఉరుములు... పిడుగులు.. -
పిల్లలూ గుర్తుందా!? వేసవి సెలవులు అయిపోవచ్చాయి..!
వేసవి సెలవులు అయిపోవచ్చాయి. స్కూళ్లు ప్రారంభమవుతున్నాయి. మళ్లీ తరగతి గదులు, ట్యూషన్లు, హోమ్ వర్కులు ఇలా పిల్లల్లో హంగామా మొదలైపోయింది. యూనిఫామ్, టెక్స్›్టబుక్స్ ఇలా అన్నీ మారుతుంటాయి. ఇదంతా పిల్లల తల్లిదండ్రులకు కూడా పరీక్షే! కొత్త స్కూల్ బ్యాగ్ కొనడం దగ్గర నుంచి కొత్త పుస్తకాలకు అట్టలు వేయడం వరకూ ప్రతి పనీ పేరెంట్స్‌కి హైరానా కలిగిస్తుంది. అయితే పిల్లల్లో పాత ఫ్రెండ్స్‌ని కలుసుకుంటున్నామని, కొత్త ఉపాధ్యాయులు రాబోతున్నారని, క్లాస్ రూమ్ మారబోతుందని, కొత్త పాఠాలు నేర్చుకోబోతున్నామని ఇలా మిశ్రమ భావోద్వేగాలు తొంగి చూస్తుంటాయి.అయితే పిల్లలు తిరిగి స్కూల్ వాతావరణానికి అలవాటు పడాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పవు. పిల్లలు స్కూల్లో ఏది బాగా తింటారు? బాక్సుల్లో ఏం పెట్టాలి? వీటి గురించి కూడా దృష్టి పెట్టాలి. మొదటిసారి స్కూల్‌కి వెళ్తున్న పిల్లల విషయంలో ఎలాంటి చిట్కాలు పాటించాలి? ఆల్రెడీ స్కూల్ అలవాటున్న పిల్లలను హాలిడేస్ మూడ్ నుంచి ఎలా బయటికి తీసుకురావాలి? అవన్నీ ఇప్పుడు చూద్దాం.మొదటిసారి స్కూల్‌కి పంపుతున్నారా..?ప్రీస్కూల్, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీల్లో పిల్లల్ని జాయిన్ చేసేటప్పుడు వారిని పేరెంట్స్ చాలా ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. కొంతమంది పిల్లలు ఈ మార్పును ఆనందంగా అంగీకరిస్తారు. కానీ మరికొందరికి అలవాటు పడటానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది. పిల్లల ఎడ్యుకేషన్ స్టార్ట్ అయ్యిందంటే తల్లిదండ్రులకు టెన్షన్ ్స మొదలైపోయినట్లే! మరి దానిని సులభం చేయడానికి ఈ చిట్కాలను పాటిస్తే మంచిది.చిన్నచిన్న పిల్లలకు స్కూల్ ఎలా ఉంటుందో చూపించడానికి ’టాయ్ స్కూల్’ని తయారు చెయ్యాలి. బొమ్మలతో చిన్న నమూనా పాఠశాలను ఏర్పాటు చెయ్యాలి. మామూలుగా పాఠశాల రోజున ఏమి జరుగుతుందనే దాని గురించి చిన్నగా మాట్లాడుతూనే వారితో కలిసి ఆడుకోవాలి.పాఠశాల ప్రారంభానికి ముందు పిల్లలకు వీలయినన్ని ఎక్కువ పుస్తకాలను చదివి వినిపించాలి. లేదా వారితో చదివించాలి. పిల్లలు వారి కొత్త పాఠశాలలో చేయగలిగే సంగతులు గురించి చర్చించాలి. వారు కలుసుకోబోయే స్నేహితులు, అక్కడుండే వినోదం గురించి మాట్లాడుతూ ఉండాలి.క్లాస్ రూముల్లో పిల్లలు స్వయంగా చెయ్యగలిగే పనులను ఇంట్లో ఉన్నప్పటి నుంచే చక్కగా ప్రాక్టీస్ చేయించాలి. లంచ్ బాక్స్, జ్యూస్ లేదా వాటర్ బాటిల్ మూతలు తెరవడం, తిరిగి మూతలు పెట్టడం.. తమంతట తామే షూస్ తియ్యడం, తిరిగి తొడుక్కోవడం, స్పూన్‌తో అన్నం తినడం ఇలాంటి సాధారణ పనులను నేర్పించాలి.స్కూల్లో ఏదైనా విషయం గురించి పిల్లలు ఇబ్బంది పడితే ఆ విషయం గురించి టీచర్‌కి ఎలా చెప్పాలి? ఎలా పర్మిషన్ అడగాలి? వంటివి కూడా అలవాటు చెయ్యాలి.స్కూల్ ప్రారంభమయ్యే ముందురోజుల్లో పిల్లలను తీసుకుని షాపింగ్ వెళ్తే మంచిది. ఆ షాపింగ్‌లో వాళ్లకు నచ్చిన స్కూల్ బ్యాగ్, పెన్సిల్ కేస్, యూనిఫాం, లంచ్ బాక్స్, వాటర్ బాటిల్ ఇలా అన్నీ కొనిస్తే వారిలో ఉత్సాహం పెరుగుతుంది.ఇక చిన్నారులను స్కూల్‌కి పంపించే నాటికి స్వయంగా టాయిలెట్‌కి వెళ్లగలరా లేదా నిర్ధారించుకోవాలి. లేదంటే కనీసం టాయిలెట్ వస్తుందని టీచర్‌కి చెప్పడం అయినా నేర్పించాలి.చిన్న పిల్లలకు షేరింగ్ కూడా అలవాటు చెయ్యాలి. స్కూల్లో ఇతర పిల్లల దగ్గర లాక్కోకుండా ఉండటంతో పాటు పక్కపిల్లలకు తమ దగ్గరున్నది షేర్ చేసే విధానం నేర్పాలి. స్కూల్లో ఏదైనా పంచిపెడుతున్నప్పుడు తమ వంతు వచ్చే వరకూ వేచి చూడటం గురించి వివరించాలి. దాని వల్ల పిల్లలకు స్నేహితులు పెరుగుతారు.ఇక స్కూల్లో జాయిన్ అయిన తర్వాత కూడా పిల్లలతో కలిసి పేరెంట్స్ పాఠశాలకు వెళ్లడం, స్కూల్ దగ్గర ఆగి ప్లే గ్రౌండ్‌ని పరిశీలించడం, వారి క్లాస్ టీచర్‌తో, ఇతర విద్యార్థులతో మాట్లాడటం మంచిది. ఆ సమయంలోనే పిల్లలకు వారి తరగతి గదిలో ఏది బాగా నచ్చుతుందో తెలుసుకోవచ్చు.పాఠశాలలో మొదటి రోజు ఒత్తిడి లేకుండా పిల్లలను సిద్ధం చేయడానికి స్కూల్ తెరిచే ముందే మీ పిల్లల తరగతిలో జాయిన్ కాబోతున్న ఇతర పిల్లలకు మీ పిల్లలను పరిచయం చెయ్యాలి. అవసరం అయితే ఆ విద్యార్థి కుటుంబాన్ని కలుసుకోవాలి. దాని వల్ల స్కూల్లో జాయిన్ అయిన రోజు క్లాసులో మీ పిల్లలకు తెలిసి వ్యక్తి ఒకరైనా ఉంటారు. దాంతో ఆ స్కూల్ తమకు తెలియని చోటు అనే బెరుకు తగ్గుతుంది.కొద్ది సమయం పాటు మీ నుంచి దూరంగా ఉండేలా వారికి ముందే అలవాటు చెయ్యాలి. కుటుంబ సభ్యులు, సన్నిహిత మిత్రులు లేదా మీరు విశ్వసించే పెద్దవారితో మీరు లేకపోయినా మీ పిల్లలు కలిసి ఉండేలా చూసుకోవాలి.పై తరగతులకు వెళ్లే పిల్లల కోసం..చదువులో కాస్త డల్‌గా ఉండి టీచర్స్‌కి భయపడే పిల్లలకు స్కూల్స్ ప్రారంభం అంటే కాస్త బెరుకు ఉంటుంది. అలాంటి పిల్లలతో పేరెంట్స్ మనసు విప్పి మాట్లాడాలి. వారిలో మానసిక ధైర్యాన్ని కలిగించాలి.పిల్లలు మొదటిరోజు కోసం ఎదురుచూడటంలో సానుకూల అంశాల గురించి పేరెంట్స్ చర్చించాలి. వారి పాత ఫ్రెండ్స్‌ని గుర్తు చేస్తూ, కొత్త ఫ్రెండ్స్ వస్తే ఎలా కలుస్తారో తెలుసుకుంటూ స్నేహపూర్వకంగా మాట్లాడాలి.పిల్లలు స్కూల్‌కి నడిచి వెళ్తున్నా, బస్సు లేదా ఆటోలో ప్రయాణిస్తున్నా వారితో పాటు ఉండే వారి స్నేహితుల్ని పరిచయం చేసుకోవడం మంచిది. మొదటిరోజు మాత్రం వీలైతే స్వయంగా స్కూల్లో డ్రాప్ చేసి పికప్ చేసుకోవడం మంచిది. వారిలోని ఒత్తిడికి దూరం చేసినట్లు అవుతుంది.కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కావడానికి రెండు రోజుల ముందు నుంచే స్కూల్ షెడ్యూల్‌ని బట్టి వారి నిద్ర వేళలను నిర్ణయించి, అలానే నిద్రపోయేలా చెయ్యాలి. సరైన నిద్ర అందకపోతే స్కూల్లో వారు యాక్టివ్‌గా ఉండలేరు. అలాగే వారికి స్నానం చేయించడం, స్కూల్‌కి రెడీ చేయించడం, స్కూల్ నుంచి రాగానే స్కూల్లో సంగతులు అడిగి తెలుసుకోవడం, అవసరం అయితే వారి ఆలోచనలను సరిచేయడం, హోమ్ వర్క్ చేయించడం వంటి పనుల్లో వారి కోసం సమయాన్ని కేటాయించాలి. అలాగే పిల్లలు నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఇంటిని వీలైనంత నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నించాలి.పిల్లలు స్కూల్‌కి వెళ్లే దారిల్లో ఏ షాపులు ఎక్కడ ఉన్నాయి? ఎటు వెళ్తే స్కూల్ వస్తుంది? అలాగే స్కూల్ నుంచి ఇంటికి ఏయే దారుల్లో రావచ్చు.. అవన్నీ ప్రాక్టీస్ చేయించాలి. వారితో కూడా వెళ్తున్నప్పుడు వారినే దారి చెప్పమని అడగటం, లేదంటే ఇంట్లో కూర్చోబెట్టి ఆ దారి గురించి చర్చించడం లాంటివి చెయ్యాలి. అలా చేయడం వల్ల వారు ప్రమాదంలో పడినప్పుడు, ఏదైనా సమస్య వచ్చినా క్షేమంగా ఇంటికి చేరుకోగలరు.బస్సులు లేదా ఆటోలు ఎక్కుతున్నప్పుడు ఆగి దిగాలని, నిదానంగా ఎక్కాలని పిల్లలకు సూచించాలి. అలాగే పిల్లల్ని తీసుకెళ్లే డ్రైవర్‌తో కూడా పిల్లలను ఓ కంట కనిపెట్టమని చెబుతుండాలి. మీ పిల్లలు ఎక్కడ కూర్చుంటారు? ఎలా కూర్చుంటారు? అన్నీ డ్రైవర్ని ఆరా తియ్యాలి.అలాగే స్కూల్‌కి వెళ్తున్న పిల్లలకు రోడ్డు దాటే సమయాల్లో ఇరువైపులా చూసుకోవడం నేర్పించాలి. ఏవైనా వాహనాలు వస్తుంటే పక్కకు ఆగి, అవి వెళ్లిన తర్వాతే నడవడం గురించి చెప్పాలి. ఇవన్నీ దగ్గరుండి ప్రాక్టీస్ చెయ్యించాలి.ఏది తిన్నా రోడ్డు మీద ఆరుబయట తినొద్దని, ఇంటికి తెచ్చుకునైనా, లేదా స్కూల్లోనైనా తినాలని చెప్పాలి. అలాగే చేతులు కడుక్కున్న తర్వాతే తినడం అలవాటు చెయ్యాలి. లేదంటే అలర్జీలు, జలుబులు వస్తుంటాయని వారికి అర్థమయ్యేలా చెప్పాలి.పిల్లల్లో ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే దాని గురించి ముందుగానే ఆ స్కూల్ టీచర్స్‌తో, ఆయాలతో వివరంగా చెప్పి అత్యవసర పరిస్థితిల్లో సమాచారం ఇవ్వమనాలి.ఇక స్కూల్‌కి సైకిల్ మీద వెళ్లే పిల్లల(టీనేజ్ వారు) విషయంలో మరింత జాగ్రత్తలు అవసరం. రద్దీప్రదేశాల్లో వెళ్తుంటే హెల్మెట్ తప్పసరి ధరించేలా చూడాలి.అపరిచితులు ఇచ్చిన ఆహారం తినొద్దని పిల్లలకు చెప్పడంతో పాటు తింటే దాని వల్ల కలిగే ప్రమాదాల గురించి చెప్పాలి. అవసరమైతే కొన్ని ఉదాహరణలను వివరించాలి. అపరిచితులు పిల్లలను కిడ్నాప్ చేస్తారని.. తిరిగి ఇంటికి రాకుండా తీసుకునిపోతారని డైరెక్ట్‌గా చెప్పకుండా.. కొన్ని పేర్లు ఊహించి చెబుతూ.. ఓ కథ రూపంలో వారికి చెబుతుండాలి. అలా చేస్తే వారి మనసుల్లో నాటుకునిపోతుంది.పిల్లలు స్కూల్లో లేదా బయట లేదా బస్సుల్లో ఏవైనా బెదిరింపులకు లోనవుతున్నా, ఏదైనా సమస్యల్లో ఇరుక్కున్నా, అలాంటి విషయాలను ఎప్పటికప్పుడు గమనించు కుంటూ ఉండాలి. మరీ ముఖ్యంగా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి ఆడపిల్లలతో పాటు మగ పిల్లలకు కూడా చెప్పాల్సిందే. సమస్యను మీదకు తెచ్చుకోకుండా ఎలా ఉండాలో చెప్పడంతో పాటు సమస్య వస్తే దాని నుంచి ఎలా బయటపడాలో కూడా నేర్పించాలి. ఒకవేళ ఇతర పిల్లలకు మీ పిల్లల వల్లే సమస్య ఏర్పడుతుంటే దాన్ని కూడా సున్నితంగానే తీసుకోవాలి. పిల్లల దూకుడు ప్రవర్తనకు కొన్ని పరిమితులు విధించి వారిని నెమ్మదిగా మార్చాలి.హోమ్‌వర్క్ సమయంలో టీవీ లేదా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులన్నింటినీ ఆపెయ్యాలి. పెద్దవారు అవుతున్న పిల్లల విషయంలో ఇంటర్నెట్ వినియోగాన్ని గమనిస్తూ ఉండాలి.పిల్లల్లో కళ్లు, మెడ, తల అలసటకు గురవుతుంటే దాన్ని గుర్తించి, చదువుతున్నప్పుడు వారికి కాసేపు విరామం ఇస్తుండాలి. కనీసం ఒక పది నిమిషాలు వారికి నచ్చినట్లుగా ఉండనివ్వాలి.పిల్లలు ఇష్టంగా తినే ఈజీ రెసిపీలు..పిల్లలు ఆకలికి ఎక్కువగా ఆగలేరు. పైగా బయట చూసిన తినుబండారాలను చూస్తే అసలు ఆగరు. అందుకే వారికి కావాల్సిన భోజనంతో పాటు స్నాక్స్ కూడా సిద్ధం చేసి బాక్సుల్లో పెట్టడం మంచిది. ఒకవేళ మధ్యాహ్నం భోజనాన్ని స్కూల్లో ఉచితంగా అందిస్తున్నా, ఇలాంటి స్నాక్స్ బాక్స్‌ల్లో పెడితే పిల్లలు దృఢంగా పెరుగుతారు. ఈజీగా సిద్ధమయ్యే కొన్ని రెసిపీస్ ఇప్పుడు చూద్దాం.రాగి కుకీలు..కావాల్సినవి..రాగి పిండి– ఒకటిన్నర కప్పులుఏలకుల పొడి– అర టేబుల్ స్పూన్గుడ్డు– 1ఉప్పు– తగినంతఅల్లం పొడి– కొద్దిగాకొబ్బరి పాలు, రైస్ బ్రాన్ ఆయిల్ – పావు కప్పు చొప్పునతయారీ..ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని.. ఒక పాన్ లో రాగి పిండి, ఏలకుల పొడి వేసుకుని దోరగా వేయించాలి. ఆ మిశ్రమాన్ని మిక్సీలో వేసి.. దానిలో గుడ్డు, అల్లం పొడి, రైస్ బ్రాన్ ఆయిల్, కొబ్బరి పాలు వేసుకుని మిక్సీ పట్టాలి. దాని వల్ల ఆ మిశ్రమం మొత్తం ముద్దలా మారిపోతుంది. అనంతరం కుకీస్‌లా చేసుకుని.. ఓవెన్ లో 180 డిగ్రీలసెల్సియస్‌లో.. 8 నిమిషాల పాటు బేక్ చేస్తే సరిపోతుంది.ఓట్స్ ఇడ్లీ..కావాల్సినవి..ఓట్స్– 2 కప్పులు (దోరగా వేయించి, మిక్సీ పట్టుకోవాలి)నూనె– అర టేబుల్ స్పూన్మినప పొడి– 1 టేబుల్ స్పూన్శనగపిండి– అర టేబుల్ స్పూన్పెరుగు– 2 కప్పులుపసుపు, కారం– కొద్దికొద్దిగాతయారీ..ముందుగా ఒక బౌల్లో ఓట్స్ పౌడర్, నూనె, మినప పొడి, శనగపిండి, పెరుగు వేసుకుని బాగా కలిపి.. అవసరం అయితే కొద్దిగా నీళ్లు పోసుకుని, ఇడ్లీ రేకుల్లో కొద్దికొద్దిగా వేసుకుని ఆవిరిపై ఉడికించుకోవాలి. అభిరుచిని బట్టి ఇడ్లీ పిండిలో క్యారెట్ తురుము, కొత్తిమీర తురుము కూడా కలుపుకోవచ్చు.ఖర్జూరం– జీడిపప్పు లడ్డూ..కావాల్సినవి..ఖర్జూరాలు, జీడిపప్పు– 1 కప్పు,కొబ్బరి తురుము– అర కప్పు,ఉప్పు– తగినంత,నూనె– 1 టేబుల్ స్పూన్‌తయారీ..ముందు ఖర్జూరాలను ఒక గంట నీటిలో నానబెట్టి, గింజ తీసి.. ఆరబెట్టాలి. అనంతరం ఒక మిక్సీ బౌల్లో ఖర్జూరాలు, జీడిపప్పు, కొబ్బరి కోరు, తగినంత ఉప్పు, నూనె వేసుకుని బాగా మిక్సీ పట్టుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని, నేయి రాసుకున్న చేతులతో చిన్న చిన్న ఉండల్లా చేసుకోవచ్చు.హెర్బ్డ్ పొటాటోస్..కావాల్సినవి..బంగాళదుంపలు– 2 పెద్దవి(తొక్క తీసి.. కడగాలి, వాటిని సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి),ఆలివ్ నూనె– 1 టేబుల్ స్పూన్,వెల్లుల్లి తురుము– కొద్దిగాతులసి ఆకుల తురుము – కొద్దిగా(అభిరుచిని బట్టి),చిల్లీ ఫ్లేక్స్– అర టేబుల్ స్పూన్ఒరేగానో తురుము– 1 టేబుల్ స్పూన్ (మార్కెట్లో దొరుకుతుంది)తేనె– 2 టేబుల్ స్పూన్లుఉప్పు– తగినంతతయారీ..ఒక బౌల్లో బంగాళాదుంప ముక్కలు వేసుకుని చిల్లీ ఫ్లేక్, ఆలివ్ నూనె, వెల్లుల్లి తురుము, తులసి ఆకుల తురుము, తేనె, ఒరేగానో తురుము ఇలా అన్నీ కలిపి గిన్నెను బాగా కుదపాలి. అనంతర వాటిని బేకింగ్ ట్రేలో పెట్టి.. 200 డిగ్రీల సెల్సియస్‌లో 10–15 నిమిషాలు బేక్ చేస్తే సరిపోతుంది.స్టీమ్డ్ ధోక్లా..కావాల్సినవి..శనగపిండి – 1 కప్పు,ఓట్స్, జొన్నపిండి – పావు కప్పు చొప్పున,పంచదార – 1 టేబుల్ స్పూన్,పసుపు– 1 టీస్పూన్,నిమ్మరసం– 1 టేబుల్ స్పూన్,ఉప్పు– తగినంత,బేకింగ్ పౌడర్– 1 టేబుల్ స్పూన్నీళ్లు– సరిపడా,నూనె– 1 టీ స్పూన్‌తయారీ..శనగపిండి, ఓట్స్, జొన్నపిండి, పంచదార, పసుపు, నిమ్మరసం, బేకింగ్ పౌడర్, నూనె వేసుకుని బాగా కలిపి.. కొద్దిగా ఉప్పు తగినంత నీళ్లు పోసుకుని బాగా మిక్స్ చెయ్యాలి. అనంతరం ఒక బౌల్ తీసుకుని దానిలో ఈ మిశ్రమాన్ని వేసుకుని ఆవిరిపై ఉడికించాలి. ఆవాలు, కొత్తిమీర తాళింపు వేసుకుని.. కొత్తి మీర చట్నీతో కలిపి బాక్స్‌లో పెడితే సరిపోతుంది.మొత్తానికి పిల్లలకు నచ్చేవిధంగా, వారు మెచ్చే విధంగా స్కూల్‌కి పంపించగలిగితే వారి వ్యక్తిత్వ వికాసం బాగుంటుంది. వారిలో కొత్త ఉత్సాహం పొంగుకొస్తుంది. దాంతో వారు పెద్దల మాటను వినడంలో, శ్రద్ధగా చదవడంలో, వినయ విధేయలతో పెరగడంలో నంబర్ వన్ అవుతారు. -
కోటి థెరపీల ఉత్సవం! ఏఎస్డీ..?
కోటి దీపోత్సవంలో దీపాల శిఖలు మిలమిలలాడుతుంటే చూడ్డానికి ఎంత ముచ్చటగా ఉంటుంది! అలాగే చిదిమి దీపం పెట్టుకోవాల్సిన చిన్నారులు ఆటిజమ్‌తో చిన్నబోకుండా ఆ అమాయకపు ముఖాలపై చిరునవ్వుల మిలమిలలను అలాగే ఉంచడానికి పూనుకుంది ‘పినాకిల్’ సంస్థ. లక్షణాల్ని బట్టి ఒక్కో ఆటిజమ్ చిన్నారికి ఒక్కో థెరపీ అవసరమవుతుంది. అలాంటి ‘కోటి థెరపీ’లను పూర్తి చేసింది ఈ సంస్థ,‘ఆటిజమ్ స్పెక్ట్రమ్ డిజార్డర్’ (ఏఎస్డీ) అని పిలిచే ఈ రుగ్మత ఉన్న పిల్లలకు జ్ఞానేంద్రియాల నుంచి మెదడుకు సమాచారం చేరడమూ... అక్కణ్ణుంచి తాము స్పందించాల్సిన రీతిలో స్పందించక΄ోవడమనే సమస్య ఉంటుంది. సెన్సెస్(జ్ఞానేంద్రియాల)కు సంబంధించిన సమస్య కాబట్టి దీన్ని ‘సెన్సోరియల్ సమస్య’గా చెబుతారు. ఆ పిల్లలు తమదైన ఏదో లోకంలో ఉన్నట్లుగా ఉంటారు. కళ్లలో కళ్లు కలిపి చూడలేరు. స్పీచ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఉదాహరణకు నేర్చుకున్న ఒకే పదాన్ని పదే పదే అదే ఉచ్చరిస్తూ ఉంటారు. తోటి పిల్లలతో కలవడానికీ, ఆడుకోడానికి పెద్దగా ఆసక్తి చూపరు.అలాంటి పిల్లలకు అవసరమైన చికిత్స (థెరపీలు) అందిస్తోంది పినాకిల్ సంస్థ. లోపాల్ని చక్కదిద్దడానికి అవసరాన్ని బట్టి స్పీచ్ థెరపీ, బిహేవియర్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, డాన్స్ థెరపీ... ఇలాంటి అనేక థెరపీలు అందిస్తోంది. లక్షణాలూ, తీవ్రతలను బట్టి ఒక్కో చిన్నారికి నాలుగైదేసి థెరపీలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి కోటి థెరపీలను ఇటీవలే పూర్తి చేసిందీ సంస్థ. తాము ఈ అసిధారా క్రతువు చేపట్టడం వెనక ఓ నేపథ్యముందంటున్నారు ‘పినాకిల్’ వ్యవస్థాపకురాలు శ్రీజారెడ్డి సరిపల్లి.తొలిచూలు పంటగా పుట్టిన పిల్లాడు మొదట్లో అంతా బాగున్నట్టే కనిపించినా... ఏడాదిన్నర గడిచాక కూడా మాటలు రాక΄ోవడం చూసి ఆందోళన పడ్డారు కోటిరెడ్డి, శ్రీజారెడ్డి దంపతులు. డాక్టర్‌కు చూపిస్తే వినలేక΄ోతున్నాడనీ, బహుశా ఆటిజమ్ కావచ్చని చెప్పారు. చికిత్స కోసం అనేకచోట్ల తిరిగారు. పరిష్కారం దొరకలేదు. వ్యాధి నిర్థారణ సరిగ్గా జరగలేదు.- శ్రీజా రెడ్డి సరిపల్లిపదిహేను రోజులకు అసలు విషయం తెలిసింది. ఆటిజమ్ కాదు, చెవి సమస్య అని తేలింది. అందుకు అవసరమైన శస్త్రచికిత్సలను రెండు చెవులకూ ఒకేసారి చేయించారు. పరిస్థితి పరిష్కారమైందనుకున్నారు. కానీ కేవలం శస్త్రచికిత్స సరి΄ోదు, స్పీచ్ థెరపీ కూడా అవసరమని వైద్యులు చెప్పారు.అన్నీ ఉండి కూడా తమలాంటివారికే ఇంత కష్టంగా ఉంటే, ఏమీ తెలియని వారికి ఇంకెంత కష్టం ఉంటుందన్న ఆలోచన వారిలో రేకెత్తింది. ఆ ఆలోచనల నుంచి రూపుదిద్దుకున్న సంస్థే ‘పినాకిల్’. ఆ ఆటిజమ్ సమస్యను ఎదుర్కొనే పిల్లల తల్లిదండ్రుల దుఃఖం తీర్చడానికీ, ఆ పిల్లలు తమ పనులు తామే చేసుకునేలా, దాదాపుగా మిగతా పిల్లల్లాగే ఆడుకునేలా, నడచుకునేలా చేసేందుకు ఏర్పాటు చేసిన సంస్థ అది!‘‘పినాకిల్ సంస్థకు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో పాటు దేశవ్యాప్తంగా దాదాపు 70కి పైగా సేవాకేంద్రాలున్నాయి. ఆటిజమ్ పిల్లలకు అవసరమైన రకరకాల థెరపీలను అక్కడ అందిస్తుంటారు. లోపల జరుగుతున్న చికిత్సను తల్లిదండ్రులు బయట ఉండి స్క్రీన్ మీద చూడవచ్చు. కేవలం భారత్‌లోనే కాదు... యూఎస్ఏ, సింగపూర్, దుబాయ్‌లలోనూ ఈ సేవలున్నాయి. త్వరలో యునైటెడ్ అరబ్ ఎమిటేర్స్లోనూ పినాకిల్ సేవలు అందనున్నాయి. ఖర్చు భరించలేనివారికి ‘సేవా’ విభాగం కింద వారు తాము చెల్లించగలిగేంత లేదా కేవలం ఒక్క రూపాయి చెల్లించి సేవలు ΄÷ందవచ్చు. పద్ధెనిమిది భాషల్లో మా హెల్ప్‌లైన్ పనిచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 130కి పైగా భాషల్లో సమాచారం తెలుసుకునేలా మా ‘థెరపాటిక్ ఏఐ’ రూ΄÷ందుతోంది. మా హెల్ప్‌లైన్ 9100 181 181 కు ఏ టైమ్‌లో ఫోన్ చేసినా ఆటిజమ్ పిల్లల తల్లిదండ్రులకుప్రాథమిక సమాచారం ఎల్లవేళలా అందుతుంది.ఏఐ ఎందుకంటే..?ఇలాంటి ఓ రుగ్మత ఉందని కనుగొన్న నాటినుంచి నేటికి దాదాపు 133 ఏళ్లు. ఇంతటి చరిత్రా, వేర్వేరు థెరపీల నేర్పూ, నైపుణ్యాలు ఒక్కోచోట ఒక్కొక్కరిలో ఇలా పరిమితంగానే దొరుకుతుండవచ్చు. ఆ అంతటినీ సమగ్రంగా సమీకరించడం, ఒక్కచోటే అందేలా క్రోడీకరించడం అవసరం. అది ‘ఏఐ’తోనే సాధ్యం. అందుకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయం తీసుకుంటున్నాం.’’ అంటూ తమ సేవల గురించి వివరించారు పినాకిల్ సంస్థ ఫౌండర్, చీఫ్ స్ట్రాటజిస్ట్ శ్రీజా సరిపల్లి. – సాక్షి ఫీచర్స్ ప్రతినిధిఇవి చదవండి: చక్కని ‘ఫాంగ్’కు చాంగు భళా.. ఇదే! -
బ్రక్సిజమ్ అంటే...? పిల్లల పళ్లుకి ప్రమాదమా..?
కొందరు పిల్లలు... ఆ మాటకొస్తే కొందరు పెద్దలు కూడా నిద్రలో పళ్లు కొరుక్కోవడంతోపాటు దవడలు బిగబట్టి పళ్లు నూరుతుంటారు. దీనిని వైద్యపరిభాషలో ‘బ్రక్సిజమ్’ అంటారు. దీనివల్ల పళ్లు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ సమస్యపై అవగాహన కోసం ఈ కథనం.తీవ్రమైన మానసిక ఒత్తిడి, యాంగై్జటీ వంటి పరిస్థితులే బ్రక్సిజానికి కారణం. ఎప్పుడో ఒకసారి పళ్లు బిగబట్టడం, కోపం వచ్చినప్పుడు పళ్లు కొరకడం సహజం. కానీ నిత్యం నిద్రలో ఇది జరుగుతుంటే మాత్రం దీన్ని రుగ్మతగా పరిగణించి చికిత్స తీసుకోవాలి. లక్షణాలు: ΄పొద్దున లేవగానే తలనొప్పి. ఒక్కోసారి ముఖం నొప్పి కూడా. చెవి పోటు దవడ కండరాల నొప్పులు కొందరిలో చెవిలో హోరు (టినైటిస్) నోరు నొప్పి కారణంగా ఆహారం తీసుకోలేకపోవడం నోరు తెరవడానికి, మూయడానికి ఇబ్బంది. రకాలు: అవేక్ బ్రక్సిజమ్ : కొందరు మెలకువగా ఉన్నప్పుడు పగటివేళ పళ్లు కొరుక్కుంటూ ఉంటారు. ఇలాంటి కేసుల్లో ఒత్తిడికి కారణం గుర్తించి కౌన్సెలింగ్ ఇస్తే సరిపోతుంది. అంతకుమించి చికిత్స అవసరం ఉండకపోవచ్చు. కొందరిలో ఏదైనా విషయంపై తదేకంగా దృష్టి కేంద్రీకరించినప్పుడు అసంకల్పితంగా దవడ బిగిస్తుంటారు. దీనికీ చికిత్స అవసరం ఉండదు స్లీప్ బ్రక్సిజమ్: నిద్రలో ఉన్నప్పుడు అదేపనిగా పళ్లు కొరకడంతో ΄ాటు తాము అలా చేస్తున్నామన్న విషయమే పిల్లలకు తెలియదు. పగటివేళల్లో మామూలుగానే ఉంటారు. వీళ్లకు చికిత్స అవసరం. రిస్క్ ఫ్యాక్టర్స్: పిల్లల్లో తీవ్రమైన ఒత్తిడి, యాంగై్జటీ వంటి పరిస్థితుల తోపాటు మేజర్ డిప్రెసివ్ డిజార్డర్స్ లేదా జనరలైజ్డ్ యాంగై్జటీ డిజార్డర్స్ వంటి మానసిక పరిస్థితులు పెద్దవారిలో ఆల్కహాల్‌తో పాటు కెఫిన్ ఎక్కువగా ఉండే కాఫీ వంటివి ఎక్కువగా తాగడం పెద్దల్లో యాంగై్జటీని తగ్గించడం కోసం వాడే కొన్ని రకాల ఔషధాలు. ఉదాహరణకు ‘సెలక్టివ్ సెరిటోనిన్ రీ–అప్ టేక్ ఇన్హిబిటార్స్ –ఎస్ఎస్ఆర్ఐస్ అనే మందులు పెద్దవారిలో గురక రావడం. చికిత్స: పిల్లలు నిద్రలో ఎప్పుడైనా పళ్లు కొరుకుతుంటే దానికి పెద్దగా చికిత్స అవసరం లేదు. కానీ అది పళ్లకు హాని కలిగించే ంత తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రం సీరియస్‌గా తీసుకోవాల్సిందే. ముందుగా వారి పళ్లు దెబ్బతినకుండా పంటి డాక్టర్ ఆధ్వర్యంలో మౌత్ గార్డ్స్ అమర్చడం అవసరంస్ట్రెస్ తగ్గించడానికి తొలుత కౌన్సెలింగ్, తర్వాత ధ్యానం వంటి పద్ధతులతో తేలిక పాటి వ్యాయామాలు ‘కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ’తో చాలావరకు ఉపయోగం ఉంటుంది కొన్ని పరీక్షల తర్వాత యాంగై్జటీ, డిప్రెషన్ వంటివి ఉన్నాయని తేలితే... యాంగ్జియోలైటిక్స్ అనే యాంటీ యాంగై్జటీ మందులతో పాటు మజిల్ రిలాక్సెంట్ ఔషధాలు. జీవనశైలి అంటే లైఫ్స్టైల్లో మార్పులు (మద్యం అలవాటు వదిలేయడం, పరిమితికి మించి కాఫీలు, పొగ తాగడాన్ని మానేయడం) డాక్టర్డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డి సీనియర్ డెంటల్ సర్జన్(చదవండి: కిచెన్‌ని క్లీన్‌గా ఉంచడంలో టూత్‌పేస్ట్ ఎలా పనిచేస్తందో తెలుసా..!) -
నయనతార 'చిన్నారి కవల'లను చూశారా!
పిల్లలు నవ్వినా అందమే, ఏడ్చినా అందమే. ఏ కోణంలో చూసినా అందమే అందం! వారి అల్లరి ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. ఇలా ఇద్దరు పిల్లల అల్లరి... అందులో కవల పిల్లల అల్లరి... ఎంతో గమ్మత్తుగా వామ్మో అనాల్సిందే!నయనతార తన కవల పిల్లల ఫొటోలను సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేస్తూ మురిసిపోతుంటుంది. తాజా విషయానికి వస్తే... తన కవల పిల్లలతో నయన ఆనంద క్షణాలను పట్టించే వీడియో నెటిజనులను ఆకట్టుకుంటోంది. పిల్లలతో సింపుల్‌గా ఆటో ప్రయాణం చేసిన నయనతార ఈ ఆటో రైడ్ విజువల్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లోపోస్ట్ చేసింది.‘సూపర్ స్టార్’గా పేరు తెచ్చుకున్న నయనతార సింపుల్‌గా ఆటోలో ప్రయాణించడం నెటిజనులను బాగా ఆకట్టుకుంది. పలువురు నెటిజనులు ఈ వీడియోను తమ సోషల్ పేజీలో షేర్ చేస్తున్నారు. మాతృత్వంలోని మధురిమ గురించి తీయటి కామెంట్లు పెడుతున్నారు.ఇవి చదవండి: తాను.. బాలీవుడ్ 'ఆస్థా'న ఫేవరెట్! -
పిల్లల ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. ఆరుగురి శిశువుల మృతి
ఢిల్లీ: ఢిల్లీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తర ఢిల్లీలోని వివేక్ విహార్ పిల్లల ఆస్పత్రిలో శనివారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసింది. బేబీ కేర్ ఆస్పత్రిలో ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు శిశువులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మరో ఆరుగురు శిశువులను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నామని చెప్పారు.six babies killed and several others injured after a massive fire broke out at a children's hospital in Delhi Vivek Vihar area#delhi #BreakingNews #fire #vivekvihar pic.twitter.com/isMZ3AvQJa— Monu Lodhi 🇮🇳 (@monu_lodh) May 26, 2024 ఈ ప్రమాదంలో మంటలు చెలరేగిన భవనం నుంచి 12 మంది పిల్లలను రెస్య్కూ చేసి బయలకు తీసుకురాగా.. అందులో ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక శకటాలతో ఫైర్ సిబ్బంది మంటలార్పారు. రెస్య్కూలో ఆపరేషన్ చేపట్టి ప్రమాదంలో చిక్కుకున్న పిల్లలను కాపాడారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.BREAKING 🚨 7 newborns killed in massive fire at Delhi children's hospital• Six newborns rescued, one in ventilator• Cause of the fire yet to be ascertained• Rescue operations currently underway pic.twitter.com/aHKv5tMPy0— Gitanjali (@GitanjaliWrites) May 26, 2024 -
సెల్ఫోన్ల నుంచి.. పిల్లల్ని కాపాడుకోవడం ఎలా?
‘మా బాబు ఉదయం లేచిన దగ్గర్నుంచీ మొబైల్ ఫోన్లోనే ఉంటాడండీ, ఏం చేయాలో అర్థం కావట్లేదు’ ఒక తండ్రి ఆవేదన.‘మా పాపకు ఇన్‌స్టా రీల్స్ పిచ్చి పట్టుకుంది. చదువు పక్కనపెట్టి మరీ రీల్స్ చేస్తోంది. ఎంత చెప్పినా వినడం లేదు’ ఒక తల్లి ఆక్రోశం.‘స్కూల్‌కు మొబైల్ ఫోన్ తీసుకురాకూడదని రూల్ ఉన్నా స్టూడెంట్స్ పట్టించుకోవడం లేదు. మేం పాఠం చెప్తుంటే వాళ్లు మొబైల్లో గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు’ ఒక టీచర్ ఫిర్యాదు.‘వాళ్లు లైబ్రరీలకు వెళ్లారు, పుస్తకాలు చదివారు. థియేటర్లకు వెళ్లారు, సినిమాలు చూశారు. మేం స్మార్ట్‌ఫోన్‌లో చూసి నేర్చుకుంటున్నాం, ప్రాజెక్టులు చేస్తున్నాం. రీల్స్ చేస్తున్నాం, చూస్తున్నాం. తప్పేంటీ?’ ఈ తరం విద్యార్థి ప్రశ్న.సోషల్ మీడియాతోనే చిక్కు..పిల్లల మీద స్మార్ట్‌ఫోన్ ప్రభావంపై ప్రపంచవ్యాప్తంగా సైకాలజిస్టులు అధ్యయనాలు జరుపుతున్నారు. న్యూయార్క్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ జోనాథన్ హైద్ కూడా అందులో ఒకరు. 16 ఏళ్లు వచ్చేవరకు పిల్లలకు స్మార్ట్‌ఫోన్ ఇవ్వకూడదని సోషల్ సైకాలజిస్ట్ అయిన హైద్ బలంగా వాదిస్తున్నారు. పిల్లలకు సురక్షితం కాని విధంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయని, వాటి నుంచి కంట్రోల్ చేసుకునే శక్తి, అనుభవం పిల్లలకు ఉండదని అమెరికన్ సైకాలజికల్ అసోసియేషన్ ఒక నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. వాటి నుంచి పిల్లలను కాపాడుకోలేకపోతే యువకుల మానసిక ఆరోగ్యానికి హాని కలగవచ్చని హెచ్చరించింది.సమస్య ఎక్కడ మొదలైంది?ఒకటి రెండు తరాలకు ముందు.. పాఠశాలంటే తప్పకుండా ఆటస్థలం ఉండేది. ప్రతిరోజూ తప్పకుండా వ్యాయామ తరగతి ఉండేది. కాలక్రమేణా పాఠశాలలు ఇరుకిరుకు భవనాలకు మారాయి. ఆటస్థలాలు దూరమయ్యాయి. ఆ సమయంలోనే స్మార్ట్ఫోన్లు వచ్చాయి, ఆటల స్థానాన్ని ఆక్రమించాయి. పిల్లలు ఆటల్లో కొట్టుకోవడం లేదని, దెబ్బలు తగలడం లేదని, చేతులు విరగడం లేదని, ఇంట్లోనే సురక్షితంగా ఉంటున్నారని తల్లిదండ్రులు సంతోషించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాలెడ్జ్‌ను ఇంటర్నెట్ అందుబాటులోకి తెస్తుందనీ, పిల్లలు తెలివైన వారుగా తయారవుతారనీ ఆశపడ్డారు. పిల్లలను వాస్తవ ప్రపంచంలోని ప్రమాదాల నుంచి రక్షించుకున్నామే తప్ప ఆన్లైన్ ప్రపంచంలోని ప్రమాదాలను పసిగట్టలేకపోయాం. ఫలితంగా పిల్లలు స్మార్ట్‌ఫోన్ వలలో చిక్కుకుపోయారు.మారకపోతే ప్రమాదమే..ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌లో అబ్బాయిలు వీడియో గేమ్స్, యూట్యూబ్ కోసం ఎక్కువగా వాడుతుంటే, అమ్మాయిలు ఐnట్ట్చజట్చఝ, టn్చpఛిజ్చ్టి లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌కి ఎక్కువగా వాడుతున్నారని ఒక అధ్యయనంలో తేలింది. అలాగే అబ్బాయిల కంటే అమ్మాయిలు తమ ఎమోష¯Œ ్స గురించి ఎక్కువగా మాట్లాడతారని, పంచుకుంటారని వెల్లడైంది. ఈ పరిస్థితి మారకపోతే యువతలో నిరుత్సాహం, ఆందోళన స్థాయి పెరుగుతుందని సైకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే 30 నుంచి 40 శాతం మంది డిప్రెషన్ లేదా యాంగ్జయిటీతో బాధపడుతున్నారని, 30శాతం మంది ఆత్మహత్మ గురించి ఆలోచిస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏఏటికి ఆ ఏడు ఇది పెరుగుతోందని హెచ్చరిస్తున్నారు.ఐదు అంచెల్లో పరిష్కారం..1. ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ స్మార్ట్‌ఫోన్ ఇవ్వకూడదు. అది వారి మెదడు ఎదుగుదలపై దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. పిల్లల కదలికలు తెలుసుకోవాలనుకుంటే బేసిక్ మొబైల్ ఫోన్ ఇస్తే సరిపోతుంది.2. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ పిల్లల కోసం రూపొందించలేదు. అవి పిల్లలకు హానికరం. బాల్యంలోనే వాటికి పరిచయం అయితే తీరని నష్టం జరుగుతుంది. కాబట్టి పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే.3. పిల్లల ధ్యాసను పక్కదారి పట్టించడంలో స్మార్ట్‌ఫోన్‌దే ప్రధాన పాత్ర. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పాఠశాలల్లోకి స్మార్ట్‌ఫోన్‌ను అనుమతించకూడదు. ఫోన్ లేకపోతే పాఠాలపై శ్రద్ధ పెడతారు, స్నేహితులతో సమయం గడుపుతారు.4. స్మార్ట్ఫోన్లకు దూరం చేస్తే పిల్లలకు పేరెంట్స్‌పై కోపం పెరుగుతుంది. ప్రాజెక్ట్ వర్క్‌ల కోసం విద్యార్థులందరూ డెస్క్ టాప్ లేదా లాప్ టాప్లే వాడాలని పాఠశాలలు ఆదేశాలివ్వాలి.5. పిల్లలను ఫోన్ ఆధారిత బాల్యం నుంచి వెనక్కు తీసుకురావాలి. ఆటలు ఆడుకునే బాల్యాన్ని అందించాలి.– సైకాలజిస్ట్ విశేష్ -
పిల్లల్లో కోపం హద్దులు దాటితే.. ఇలాగే జరుగుతుంది..!
అరుణ్ నాలుగో తరగతి చదువుతున్నాడు. కానీ వాడిని చూస్తే క్లాస్ మొత్తానికీ హడల్. ఓసారి ఏదో అన్నాడని క్లాస్మేట్ గొంతు పిసికాడు. మరోసారి క్లాస్ టీచర్‌పైనే పుస్తకం విసిరేశాడు. ఇంకోసారి ఏకంగా ప్రిన్సిపాల్ పైనే అరిచేశాడు. దాంతో పలుమార్లు స్కూల్లో కౌన్సెలింగ్ చేయించారు. పేరెంట్స్‌ను స్కూల్‌కి పిలిపించి హెచ్చరించారు. కానీ అరుణ్ ప్రవర్తనలో ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో క్లాస్ టీచర్ సలహా మేరకు కౌన్సెలింగ్ సెంటర్‌కు వెళ్ళారు. పేరెంట్స్‌తో మాట్లాడాక అరుణ్ ప్రవర్తనకు మూలం ఇంటి వాతావరణంలోనూ, చూస్తున్న సీరియల్స్‌లోనూ ఉందని తేలింది.హింసాత్మక ప్రవర్తన..పిల్లల చుట్టూ ఉండే విభిన్న అంశాలు హింసాత్మక ప్రవర్తన, ధోరణిని పెంచుతాయి. అది వయసును బట్టి కొట్టడం, తన్నడం, కొరకడం, జంతువులను బాధించడం నుంచి ఇతరులపై దాడిచేయడం, కాల్పులు వంటి నేరపూరిత చర్యల వరకు ఉంటుంది. ఇలాంటి హింసాత్మక, విధ్వంసక ప్రవర్తనను సకాలంలో నియంత్రించకపోతే తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. పిల్లల్లో హింసాత్మక ప్రవర్తనకు సంబంధించిన హెచ్చరిక సంకేతాలు చిన్నప్పటి నుంచే కనిపిస్తాయి. తల్లిదండ్రులు వాటిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.పిల్లల్లో హింసకు కారణాలు..పిల్లల్లో హింసాత్మక ప్రవర్తన పెరగడానికి కారకాలేంటో తెలుసుకోవడానికి హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఏడు సంవత్సరాల పాటు అధ్యయనం జరిపారు. శారీరక శిక్ష, దూకుడు ఆలోచనలు, దూకుడు ప్రవర్తన, ఆత్మగౌరవ లేమి లాంటివి హింసాత్మక ప్రవర్తనకు కారకాలని తేలింది. మరికొన్ని కారణాలు.. 1. శారీరక, మానసిక, శాబ్దిక, లైంగిక దోపిడీకి గురికావడం.2. తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం, మంచి ఇంటి వాతావరణాన్ని అందించకపోవడం..3. బాధాకరమైన సంఘటనలకు గురికావడం లేదా నిరంతర ఒత్తిడిని అనుభవించడం..4. బెదిరింపుల బాధితుడుగా ఉండటం లేదా తానే బెదిరించడం..5. మద్యం, గంజాయి, డ్రగ్స్ లాంటి మాదకద్రవ్యాల వాడకం..6. టెలివిజన్‌లో హింసాత్మక ప్రోగ్రామ్‌లు చూడటం..7. కత్తులు, తుపాకులు లాంటివి ఇంట్లో కంటికెదురుగా ఉండటం..8. చాలా వాస్తవికమైన ఫస్ట్–పర్సన్ షూటర్ గేమ్స్ లాంటివి ఆడటం ఉదా.. పబ్జీ గేమ్.. 9. అఈఈ, అఈఏఈ, బైపోలార్ డిజార్డర్, యాంగ్జయిటీ లాంటి మానసిక రుగ్మతలు..నిరోధించడమిలా..హింసాత్మక ప్రవర్తనను ప్రేరేపించే కారకాలకు దూరం చేస్తే హింసాత్మక ప్రవర్తన తగ్గుతుందని లేదా నిరోధించవచ్చని అధ్యయనాలు చూపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా బాల్య, కౌమారదశల్లో ఇల్లు, సమాజం, మీడియా ద్వారా హింసకు గురికావడాన్ని తగ్గించే ప్రయత్నాలు చేయాలి. ఇంకా..1. కోపం, చిరాకులను సరైన రీతిలో ఎలా వ్యక్తం చేయాలో నేర్పించాలి.2. తన చర్యలకు, పరిణామాలకు తనదే బాధ్యతని గుర్తించేలా తయారుచేయాలి. 3. ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లు, టీవీ, వీడియోలు, చలనచిత్రాలతో సహా పిల్లల స్క్రీన్ విషయంలోనూ హింస లేకుండా పర్యవేక్షించాలి. 4. అన్నిటికీ మించి మంచి కుటుంబ వాతావరణాన్ని అందించాలి. 5. బడిలో, పరిసరాల్లోని సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకునేలా ప్రోత్సహించాలి. 6. ఎన్ని ప్రయత్నాలు చేసినా కోపం తగ్గకపోతే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్‌ను సంప్రదించాలి. 7. సైకాలజిస్ట్‌లు పిల్లల కోపానికి కారణాలు లేదా మానసిక సమస్యలను వీలైనంత త్వరగా గుర్తించి సైకోథెరపీ ద్వారా సహాయపడతారు.కోపం సాధారణ భావోద్వేగం..కోపం మనందరిలో ఉండే ఒక సాధారణ భావోద్వేగం. అయితే చిన్న పిల్లలకు తమ కోపాన్ని ఎలా వ్యక్తం చేయాలో, లేదా ఎలా నియంత్రించుకోవాలో తెలియదు. బొమ్మలు పగలగొట్టవచ్చు, స్నేహితులను నెట్టివేయవచ్చు, కొట్టవచ్చు. వయసు పెరిగేకొద్దీ కోపం నియంత్రించుకోవడం తెలుస్తుంది. కానీ అరుణ్‌లా కొందరిలో ఆ నియంత్రణ శక్తి ఉండదు. హెచ్చరిక సంకేతాలు.. 1. తరచుగా అదుపులేని కోపం2. సులువుగా నిరాశ చెందడం 3. చాలా సున్నితంగా ఉండటం 4. తరచు చిరాకు పడటం 5. ఇంపల్సివ్గా వ్యవహరించడం 6. తరచుగా బెడ్‌ను పాడుచేయడంసైకాలజిస్ట్ విశేష్(psy.vishesh@gmail.com)ఇవి చదవండి: Mother's Day-2024: తల్లీ.. నిన్ను దలంచి! దేశదేశాన మాతృవందనం! -
'పిల్లలను కనాలని లేదు.. ఎందుకంటే?'.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!
ప్రముఖ కన్నడ నటి, హీరోయిన్ హితా చంద్రశేఖర్ సంచలన కామెంట్స్ చేశారు. పిల్లల్ని కనడంపై ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం శాండల్‌వుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. కన్నడ నటుడు సిహి కహీ చంద్రు కుమార్తె అయిన ముద్దుగుమ్మ 2019లో బాల నటుడిగా పేరు తెచ్చుకున్న కిరణ్ శ్రీనివాస్‌ను పెళ్లాడింది. పెళ్లయి ఇప్పటికీ నాలుగున్నరేళ్లు కావొస్తున్నప్పటికీ పిల్లలు లేరు. అయితే బంధుమిత్రుల నుంచి మనవడిని ఎప్పుడు ఇస్తావ్? అనే ప్రశ్నలు మాత్రం తలెత్తున్నాయనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ షోలో పాల్గొన్న హిత చంద్రశేఖర్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. హితా మాట్లాడుతూ.. "ఫస్ట్ నాకు పిల్లలను కనాలని లేదు. కిరణ్, నేను స్నేహితులుగా ఉన్నప్పుడే ఈ విషయం గురించి మాట్లాడుకున్నాం. అతను కూడా సానుకూలంగా స్పందించారు. మాకు పిల్లలు ఎందుకు కావాలి? నాకు అందరిలా పిల్లలు కనాలని ఏం అనిపించడం లేదు. ప్రస్తుతం ఈ లోకంలో ఎలాంటి పరిస్థితులను చూస్తున్నాయో నాకు తెలుసు. అలాంటి పరిస్థితిలో ఇంకో బిడ్డను ఈ లోకంలోకి తీసుకురావాలా? అన్నది నా ఆలోచన. కిరణ్‌కి కూడా అలాగే అనిపించింది" అని చెప్పుకొచ్చింది. అనంతరం మాట్లాడుతూ..'మాతృత్వాన్ని ఆస్వాదించాలంచే మనమే పిల్లలను కనాల్సిన అవసరం లేదు. ఓ కుక్కపిల్లని కూడా మన సొంత బిడ్డలాగా పెంచుకోవచ్చు. మనకు వృద్ధాపం వచ్చినప్పుడు మనల్ని ఎవరు చూసుకుంటారు. మన చివరి రోజుల్లో ఎవరు చూసుకుంటారని చాలా మంది అంటుంటారు. నాకు దాని గురించి ఏ మాత్రం బాధ లేదు" అని తెలిపింది. అంతే కాకుండా ఈరోజు ఎంత మంది తమ తల్లిదండ్రులను బాగా చూసుకుంటున్నారు? అని హితా ప్రశ్నించింది. ప్రస్తుత సమాజంలో కొడుకు, కూతుళ్లు అమెరికాలో ఉంచే వారి తల్లితండ్రులు ఎక్కడో ఒకచోట ఉంటున్నారు. కేవలం ఆ ఇద్దరు దంపతులు మాత్రమే కలిసి ఉంటున్నారు.. అలాంటప్పుడు పిల్లలు ఉన్నా ఏం లాభం అనే ప్రశ్న తలెత్తుతుందని హిత అన్నారు. ఇక్కడ పిల్లలను కనొద్దని నేను చెప్పట్లేదు.. కానీ ఇది నా నిర్ణయం అని మాత్రమే చెబుతున్నానని తెలిపారు. ఈ విషయంలో మా తల్లిదండ్రులు నాకు సపోర్ట్‌గా ఉన్నారని పేర్కొన్నారు. కాగా.. హితా చంద్రశేఖర్ శాండల్‌వుడ్‌లో పలు సినిమాల్లో హీరోయిన్గా నటించింది. View this post on Instagram A post shared by Hitha Chandrashekar K (@thehithaceee) -
నా స్టూడెంట్ టీచర్ అయింది!
‘ఎక్స్’లో రేవ్ అనే టీచర్ తన స్టూడెంట్ ఆలిషా గురించి చేసిన పోస్ట్ వైరల్ అయింది. స్కూల్ రోజుల్లో ఆలీషా అల్లరిపిల్ల. రేవ్ మాటల్లోనే చెప్పాలంటే రెబెల్. ‘ఈ అమ్మాయి భవిష్యత్ ఎలా ఉండబోతుందో’ అంటూ అలీషా గురించి బెంగపడేది రేవ్. కట్ చేస్తే... ఆలిషా ఇప్పుడు ముంబైలోని ఒక స్కూల్లో స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్స్‌కు టీచర్. ‘మొండిఘటం. ఏ పనీ చేయలేదు... అని నా గురించి రేవ్ టీచర్‌కు చెప్పేవారు. అయితే టీచర్ మాత్రం నన్ను ఎప్పుడూ ప్రేమగా చూసుకునేది. అలాంటి ప్రేమను స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్స్‌కు పంచాలనుకుంటున్నాను’ అంటుంది అలీషా. -
Nayi Disha Seema Seth: కార్పొరేట్ రంగం నుంచి కార్మిక లోకానికి...
కార్పొరేట్ ప్రపంచంలో మూడు దశాబ్దాల పాటు పనిచేసిన హరియాణాలోని గురుగ్రామ్‌కు చెందిన సీమా సేథ్ ఇక ఆ రంగంలో మరింత ముందుకు వెళ్లాలనుకోలేదు. ఒకసారి వెనక్కి తిరిగి చూసింది. ఒకరోజు ఒక ఆటోడ్రైవర్‌తో మాట్లాడుతున్నప్పుడు చదువుకు దూరమైన నిరుపేద పిల్లల గురించి తెలుసుకుంది. ఈ క్రమంలో కార్పొరేట్ ప్రపంచాన్ని వదిలి ‘నయీ దిశ’ పేరుతో స్వచ్ఛంద సంస్థను ప్రారంభించి కొత్తదారిలో ప్రయాణిస్తోంది. అట్టడుగు వర్గాలకు చెందిన పిల్లలను విద్యావంతులను చేస్తోంది. తాను కూడా టీచర్‌గా మారి పిల్లలకు పాఠాలు చెబుతోంది.... ‘ఇంజినీర్ కావాలనేది నా లక్ష్యం’ అంటున్న బప్పన్ దాస్ ‘నయీ దిశ’ గురించి ఎంతో గొప్పగా మాట్లాడుతాడు. బప్పన్ తొమ్మిది నెలల వయసు ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఉపాధి వెదుక్కుంటూ పశ్చిమ బెంగాల్ నుంచి గురుగ్రామ్‌కు వచ్చారు. ‘ఈరోజు తిండి దొరికేతే చాలు’ అన్నట్లుగా ఉండేది వారి ఆర్థిక పరిస్థితి. దీంతో చదువు మాట అటుంచి బప్పన్ కనీసం బడిముఖం కూడా చూడలేకపోయాడు. ‘నయీ దిశ’ పుణ్యమా అని బప్పన్ ఎనిమిది సంవత్సరాల వయసులో బడిలోకి అడుగు పెట్టాడు. ‘సీమా మేడమ్ నుంచి పాఠాలు వినడమే కాదు ఆమెతో కలిసి ఆడుకున్నాం. సరదాగా ఎన్నో ప్రాంతాలు తిరిగాం’ అంటాడు బప్పన్. బడి అంటే భయపడే స్థితి నుంచి బడికి ఇష్టంగా వెళ్లడం వరకు బప్పన్‌ను మార్చివేసింది సీమ. ‘నిరుపేద పిల్లల జీవితాల్లో మార్పు తెచ్చే ప్రయత్నం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక మార్గం మరో మార్గంలోకి తీసుకువెళ్లి మరిన్ని మంచిపనులు చేయిస్తుంది’ అంటుంది సీమ. ఉద్యోగం చేస్తున్న రోజుల్లో ప్రతి రోజూ సాయంత్రం సికిందర్‌పూర్‌లోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి పిల్లలకు ఇంగ్లీష్ పాఠాలు బోధించేది. ఈ పని తనకు ఎంతో ఉత్సాహాన్ని, బలాన్ని ఇచ్చేది. తనను రోజూ స్కూల్‌కు తీసుకెళ్లే ఆటోడ్రైవర్ ‘పిల్లలకు పాఠాలు చెప్పడానికి డబ్బులు తీసుకుంటారా?’ అని అడిగాడు. ‘లేదు’ అని చెప్పింది సీమ. తాను ఉండే కాలనీ పేరు చెప్పి ‘అక్కడ చాలామంది పిల్లలు బడికి వెళ్లడం లేదు’ అని చెప్పాడు. ‘ఎందుకు?’ అని అడిగింది సీమ. ‘పిల్లలను బడికి పంపించే స్తోమత తల్లిదండ్రులకు లేదు’ అని చెప్పాడు ఆటోడ్రైవర్. ఆ తరువాత... ‘మేడమ్... మీరు అక్కడ స్కూల్ పెట్టండి. ఎంతోమంది పిల్లలు చదువుకొని బాగుపడతారు’ అన్నాడు ఆటోడ్రైవర్. సీమ ఆలోచనలో పడింది. ఆ తరువాత ఆసక్తి పెరిగింది. ‘మీ కాలనీలో స్కూల్ ఎక్కడ స్టార్ట్ చేయాలో చెబితే అక్కడే చేస్తాను’ అన్నది సీమ. ఆటోడ్రైవర్ నివసించే పేద ప్రజల కాలనీలో ఒక గోదాములో సీమ స్కూల్ స్టార్ట్ చేసింది. 35మంది పిల్లలతో ‘నయీ దిశ’ ప్రస్థానం మొదలైంది. కొద్దిమంది పిల్లలతో ఒక గదిలో మొదలైన స్కూల్ ఆ తరువాత వందమంది పిల్లలతో ఎనిమిది గదుల్లోకి విస్తరించింది. గురుగ్రామ్‌లోని వివిధ కళాశాలలలో చదివే విద్యార్థులు ఈ స్కూల్‌కు వచ్చి కంప్యూటర్ నుంచి థియేటర్ వరకు ఎన్నో విషయాలు బోధిస్తున్నారు. విద్యాసంబంధమైన కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా ‘నయీ దిశ’ కేంద్రంగా మారింది. ‘నయీ దిశ’ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎంతోమంది నిరుపేద పిల్లలకు అకాడమిక్ పునాదిని ఏర్పాటు చేసింది సీమ. ఇప్పుడు ఆ పునాది మీదే పిల్లలు ఎన్నో కలలు కంటున్నారు. ‘తమ పిల్లల్లో వచ్చిన మార్పును చూసి తల్లిదండ్రులు సంతోషించారు. నయీ దిశ పిల్లలకు ఎంత విలువ ఇస్తుందో దగ్గరనుంచి చూశారు. పిల్లలకు బడి అంటే స్వేచ్ఛ అనుకునేలా చేశాం. పిల్లలు తమ మనసులోని భావాలను అందంగా వ్యక్తీకరించడం నుంచి ఇంగ్లీష్‌లో మాట్లాడడం వరకు ప్రతిక్షణం అభ్యాస వేడుకే’ అంటుంది సీమ. ‘మొదటి నుంచీ పిల్లలకు ఎన్నో సబ్జెక్ట్‌లు బోధిస్తూ వారి ఎదుగుదలను చూశాను. మొదట్లో క్రమశిక్షణా రాహిత్యంతో ఉండే పిల్లలు... కాలక్రమేణా మాట, మర్యాద నేర్చుకున్నారు’ అంటుంది ‘నయి దిశ’ స్కూల్లో పని చేస్తున్న నిషా అనే టీచర్. ‘నయీ దిశ’ విజయంతో ఇందిరా కాలనీలో మరో స్కూల్‌ను ప్రారంభించించి సీమ. ఈ స్కూల్లో 65 మంది నిరుపేద పిల్లలు చదువుకుంటున్నారు. సిలబస్‌ను సరిగ్గా అనుసరిస్తున్నారో లేదో తెలుసుకోవడానికి, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సవాళ్లను అర్థం చేసుకోవడానికి నెలకొకసారి టీచర్ ట్రైనింగ్ క్లాసులు నిర్వహిస్తున్నారు. ప్రతి నెల పేరెంట్స్–టీచర్ మీటింగ్ కూడా ఉంటుంది. ‘మా అబ్బాయికి చదువు పట్ల ఉండే శ్రద్ధ చూస్తుంటే ముచ్చట వేస్తోంది. ఇదంతా నయీ దిశ పుణ్యమే. డాక్టర్ కావాలనేది మా అబ్బాయి కల. పదిమందికి ఉపయోగపడే కల కంటే అది తప్పక నెరవేరుతుంది అని సీమ మేడమ్ ఒక మీటింగ్‌లో చెప్పారు’ అంటున్నాడు అశోక్‌రావు అనే పేరెంట్. వినే వారు తప్పకుండా ఉంటారు మన మనసులో మంచి ఆలోచన ఉన్నప్పుడు, అది వినడానికి ఈ విశ్వంలో ఎవరో ఒకరు తప్పనిసరిగా ఉంటారు. ‘ఆలోచన బాగానే ఉంది గానీ.. అసలు ఇది నెరవేరుతుందా...’ అనుకున్న ఎన్నో ఆలోచనలు నెరవేరాయి. మంచి పని కోసం ప్రయాణం ప్రారంభించినప్పుడు దారే తన వెంట తీసుకువెళుతుంది. ఎన్ని అవరోధాలు ఉన్నా వాటంతట అవే తొలగిపోతాయి. – సీమ, నయీ దిశ– వ్యవస్థాపకురాలు -
విషాదం.. కరెంట్ షాక్‌తో 14 మంది చిన్నారులకు గాయాలు
జైపూర్: మహాశివరాత్రి రోజు విషాదం చోటుచేసుకుంది. రాజస్థాన్‌లోని కోటాలో శివరాత్రి పర్వదినాన ఏర్పాటు చేసిన వేడుకల్లో కరెంట్ షాక్ తగిలి 14 మంది చిన్నారులు గాయపడ్డారు. బాధితులను సమీపంలోని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హీరాలాల్ నగర్ తెలిపారు. విద్యుదాఘాతానికి గురైన చిన్నారులు వాళ్ల కుటుంబీకులు ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డుకు తరలిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై మంత్రి మాట్లాడుతూ.. చాలా బాధాకరమైన సంఘటనగా పేర్కొన్నారు. చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారని, వారిలో ఒకరికి 100శాతం శరీరంపై కాలిన గాయాలు ఉన్నట్లు తెలిపారు. ప్రత్యేక వైద్యుల బృందంతో చిన్నారులకు చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. కరెంట్ షాక్‌కు గల కారణాలపై దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అయితే విద్యుత్ షాక్‌కు హైటెన్షన్ ఓవర్ హెడ్ విద్యుత్ లైన్ కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితుల్లో ఇద్దరు పిల్లలకు 50 నుంచి 100 శాతం కాలిన గాయాలు, మిగిలిన వారు 50 శాతం కంటే తక్కువ కాలిన గాయాలు తగిలినట్లు పేర్కొన్నారు. -
లావొక్కింత మితిమీరె!
ప్రపంచం లావెక్కిపోతోంది. అన్ని దేశాల్లోనూ కలిపి స్థూలకాయుల సంఖ్య ఇప్పటికే అక్షరాలా 100 కోట్లు దాటేసింది! 1990 నుంచే వీరి సంఖ్యలో ఏకంగా నాలుగు రెట్ల పెరుగుదల నమోదైంది. మూడు దశాబ్దాల క్రితం దాకా పెద్దల్లోనే ఎక్కువగా కని్పంచిన ఊబకాయ సమస్య ఇప్పుడు చిన్నారుల్లో కూడా పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు, ఆధునిక జీవితపు ఒత్తిళ్లతో పాటు పౌష్టికాహార లోపం కూడా దీనికి ప్రధాన కారణమేనని తాజా అధ్యయనంలో తేలింది. మొత్తమ్మీద ప్రపంచవ్యాప్తంగా 2022 నాటికే వయోజనుల్లో ఊబకాయుల సంఖ్య 88 కోట్లు దాటింది. అలాగే టీనేజీ లోపు వయసు వారిలోనూ 16 కోట్ల పై చిలుకు ఊబకాయంతో బాధపడుతున్నారు. టోంగా, నౌరు, సమోవా తదితర దేశాల్లో మూడొంతులకు పైగా జనం ఊబకాయులేనట! 1990 నుంచి 2022 మధ్య పలు గణాంకాలు తదితరాల ఆధారంగా అధ్యయనం సాగింది. ఈ జాబితాలో అమెరికా కూడా పురుషుల్లో పదో స్థానంలో, మహిళల్లో 36వ స్థానంలో నిలిచింది. ఈ దేశాల్లో అనారోగ్యకరమైన ఆహారపుటలవాట్లే సమస్యకు ప్రధాన కారణమని తేలినట్టు అధ్యయన బృంద సభ్యుడు ప్రొఫెసర్ మజీద్ ఎజాటి వెల్లడించారు. మరోవైపు తక్కువ బరువుతో బాధపడుతున్న వారి సంఖ్యలో 50 శాతం తగ్గదల నమోదైంది. కాకపోతే నిరుపేద దేశాలు, సమాజాల్లో ఇది ఇంకా ప్రబల సమస్యగానే ఉందని అధ్యయనం పేర్కొంది. భారత్‌లోనూ ఊబకాయుల సంఖ్య 8 కోట్లు దాటినట్టు వెల్లడించింది. తక్షణం మేల్కొనాలి... ఒకప్పుడు ప్రధానంగా పెద్దవాళ్లలోనే కన్పించిన స్థూలకాయ సమస్య ఇప్పుడు స్కూలు వయసు చిన్నారుల్లోనూ ప్రబలమవుతుండటం చాలా ఆందోళనకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ గేబ్రయేసస్ అన్నారు. చిన్న వయసులోనే గుర్తించి అరికట్టాల్సిన అవసరాన్ని తాజా సర్వే మరోసారి నొక్కిచెప్పిందని చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు కూడా పెద్ద ఎత్తున ముందుకు రావాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆరోగ్యకరమైన ఆహారం, నియమిత వ్యాయామాలు తదితరాలను జీవన శైలిలో భాగంగా మార్చుకోవడం తప్పనిసరన్నారు. పలు దేశాల్లో ప్రధానంగా పౌష్టికాహార లోపమే స్థూలకాయానికి దారి తీస్తోందని అధ్యయనంలో పాలుపంచుకున్న మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్‌కు చెందిన డాక్టర్ గుహా ప్రదీప అభిప్రాయపడ్డారు. వాతావరణ మార్పులు, కొవిడ్ కల్లోలం, ఉక్రెయిన్ యుద్ధం వంటివన్నీ సమస్యను మరింత జటిలం చేస్తున్నాయని వివరించారు. ‘‘ఇవి ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఖరీదైన వ్యవహారంగా మార్చేస్తున్నాయి. ఫలితంగా చాలా దేశాల్లో ప్రజలకు చాలీచాలని, నాసిరకం ఆహారం అందుతోంది’’ అని ఆవేదన వెలిబుచ్చారు. ఇలా చేశారు... ► అధ్యయనంలో 1,500 మందికి పైగా రీసెర్చర్లు పాలుపంచుకున్నారు. ► ఎన్సీడీ రిస్క్ ఫ్యాక్టర్ కొలాబరేషన్ పేరిట వీరంతా ప్రపంచ ఆరోగ్య సంస్థతో పని చేశారు. ► ప్రపంచవ్యాప్తంగా 190కి పైగా దేశాల నుంచి ఐదేళ్ల పైబడ్డ 22 కోట్ల మందికి పైగా ప్రజల ఎత్తు, బరువు తదితర శారీరక కొలతలను సేకరించారు. ► ఊబకాయాన్ని నిర్ధారించేందుకు బాడీ మాస్ ఇండెక్స్‌ను ఆధారంగా తీసుకున్నారు. గణాంకాలివీ... ► ప్రపంచవ్యాప్తంగా వయోజనుల్లో 88 కోట్లు, టీనేజీ, ఆ లోపు వారిలో దాదాపు 16 కోట్ల మంది ఊబకాయులున్నారు. ► వయోజన ఊబకాయుల్లో 50 కోట్లకు పైగా పురుషులు కాగా 38 కోట్ల మంది స్త్రీలు. ► 1990లో వయోజనుల్లో ఊబకాయుల సంఖ్య 20 కోట్ల లోపే ఉండేది. ► వారిలో స్త్రీలు 13 కోట్లు కాగా 7 కోట్ల మందికి పైగా పురుషులుండేవారు. భారత్‌లోనూ... భారత్ కూడా ఊబకాయ సమస్యతో బాధపడుతోంది. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య బాగా పెరుగుతుందటం ఆందోళన కలిగిస్తోంది. వయోజన మహిళల్లో ఊబకాయులు 1990లో కేవలం 1.2 శాతముండగా 2022 నాటికి ఏకంగా 9.8 శాతానికి పెరిగారు. పురుష జనాభాలో ఊబకాయుల సంఖ్య 0.5 శాతం నుంచి 5.4 శాతానికి పెరిగింది. మొత్తమ్మీద 2022 నాటికి దేశవ్యాప్తంగా 4.4 కోట్ల మహిళలు, 2.6 కోట్ల మంది పురుషులు ఊబకాయంతో బాధపడుతున్నారు. ఇక దేశవ్యాప్తంగా 5–19 ఏళ్ల మధ్య వయసు్కన్న పిల్లల్లో దాదాపు 1.25 కోట్ల మంది ఊబకాయులేనని అధ్యయనంలో తేలింది. 75 లక్షలతో వీరిలో అబ్బాయిల సంఖ్యే ఎక్కువ. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పిల్లల ప్రపంచం తగ్గిపోతోంది!
దాదాపు వందేళ్లుగా భూమ్మీద జనాభా విపరీతంగా పెరిగిపోతూ వచ్చింది. ఇదిలాగే పెరిగితే ఏమవుతుందోనన్న ఆందోళనా పెరుగుతూ వ చ్చింది. కానీ ఆ టెన్షన్‌ను తగ్గిస్తూ.. కొన్నేళ్లుగా జననాల రేటు తగ్గుతూ పోతోంది. దీనివల్ల జనాభాలో వృద్ధుల శాతం పెరుగుతూ.. పిల్లల శాతం తరుగుతూ వస్తోంది. భూమ్మీద ఒకే సమయంలో అత్యంత ఎక్కువ మంది చిన్న పిల్లలు (ఐదేళ్ల వయసు లోపు) ఉన్న సమయాన్ని కూడా దాటేశామని నిపుణులు తాజాగా తేల్చారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. 2017వ సంవత్సరమే అత్యంత ఎక్కువ సంఖ్యలో పిల్లలు ఉన్న ఏడాది (పీక్ చైల్డ్ ఇయర్) అని.. తర్వాతి నుంచి పిల్లల సంఖ్య తగ్గుతూ వస్తోందని గుర్తించారు. ‘ఐక్యరాజ్యసమితి (యూఎన్) జనాభా అంచనాలు–2022 నివేదిక’ ఆధారంగా ఈ గణాంకాలను రూపొందించారు. ► ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో వేర్వేరు సమయాల్లో చేపట్టిన జనాభా నియంత్రణ చర్యలు, ఆ దేశాల్లో పిల్లలను కనగలిగే వయసులో ఉన్నవారి శాతంలో తేడాల కారణంగా.. ప్రపంచవ్యాప్తంగా పిల్లల సంఖ్య హెచ్చుతగ్గులకు లోనవుతూ వస్తోందని యూఎన్ నివేదిక వెల్లడించింది. ► మన దేశానికి వస్తే.. జనాభా నియంత్రణ, ప్రజల్లో అవగాహన క ల్పించే చర్యలతో 2004వ సంవత్సరం నుంచే చిన్న పిల్లల సంఖ్య తగ్గుతూ వస్తోందని పేర్కొంది. 2021 నాటికి దేశంలో 11.53 కోట్ల మంది చిన్నారులు ఉన్నారని.. 2100 నాటికి ఇది 6.86 కోట్లకు తగ్గుతుందని అంచనా వేసింది. ► ఇటీవలిదాకా ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా కొనసాగిన చైనాలో అత్యధికంగా 13.82 కోట్ల మంది పిల్లలు ఉన్నది 1972లోనే. నాటి నుంచి పిల్లల సంఖ్య తగ్గుతూనే ఉంది. ఈ సంఖ్య 2000వ సంవత్సరం నాటికి 8.41 కోట్లకు, 2021 నాటికి 7.47 కోట్లకు తగ్గింది. 2100 ఏడాది నాటికి అక్కడ ఐదేళ్లలోపు పిల్లల సంఖ్య 2.38 కోట్లలోపే ఉంటుందని యూఎన్ అంచనా వేసింది. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
నాకు ఓటేయకుంటే తిండి మానండి
ముంబై: తల్లిదండ్రులు తనకు ఓటేయకుంటే రెండు రోజులపాటు అన్నం మానేయాలంటూ మహారాష్ట్రలో అధికార శివసేన ఎమ్మెల్యే ఎమ్మెల్యే సంతోష్ బంగార్ చిన్నారులకు చెప్పడం వివాదాస్పదంగా మారింది. ఎన్నికల సంబంధ కార్యక్రమాల్లో చిన్నారులను ఉపయోగించుకోరాదంటూ ఎన్నికల కమిషన్ ఇటీవలే మార్గదర్శకాలు జారీ చేయడం తెలిసిందే. బంగార్ ఇటీవల ఓ జిల్లా పరిషత్ పాఠశాలలో పదేళ్లలోపు చిన్నారులతో ముచ్చటిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘మీరేమీ తినకుండా ఉంటే ఏమైందని అమ్మానాన్న అడుగుతారు. బంగార్కే ఓటేయండి. అప్పుడే తింటాం అని చెప్పండి’’ అన్నారు. వచ్చే ఎన్నికల్లో తనకే ఓటేయాలని తల్లిదండ్రులకు చెబుతామంటూ పిల్లలతో వల్లె వేయించారాయన. దీనిపై విపక్షాలన్నీ మండిపడ్డాయి. -
Jaipur Literature Festival 2024: చిల్డ్రన్ ఫస్ట్
‘మన దేశంలో అన్నింటికీ కోర్సులు ఉన్నాయి... పేరెంటింగ్‌కి తప్ప. పిల్లల మానసిక సమస్యల గురించి చాలా తక్కువ పట్టింపు ఉన్న దేశం. పిల్లల్లో మానసిక సమస్యలు అధికంగా ఉన్న దేశం మనదే. పిల్లల గురించిన ఆలోచనే అందరికీ ప్రధానం కావాలి’ అన్నారు జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్లో పాల్గొన్న చైల్డ్ సైకియాట్రిస్ట్‌లు డాక్టర్ శేఖర్ శేషాద్రి, డాక్టర్ అమిత్ సేన్, పిల్లల మానసిక చికిత్సా కేంద్రం నిర్వాహకురాలు నేహా కిర్పాల్. ఇంకా వారేమన్నారు? ‘మన దేశంలో పదికోట్ల మంది బాల బాలికలు మానసిక సమస్యలతో బాధ పడుతున్నారు. వారిలో కేవలం ఒక్కశాతం మందికి మాత్రమే నాణ్యమైన మానసిక చికిత్స, థెరపీ అందుతున్నాయి. తల్లిదండ్రుల ప్రపంచం, పిల్లల ప్రపంచం వేరు వేరుగా ఉంది. చాలా కుటుంబాలలో సభ్యుల మధ్య కనెక్టివిటీ లేదు. దానివల్ల అనేక సమస్యలు వస్తున్నాయి’ అని తెలిపారు పిల్లల మానసిక ఆరోగ్యరంగంలో పని చేస్తున్న నేహా కిర్పాల్, శేఖర్ శేషాద్రి, అమిత్ సేన్.జైపూర్‌లో జరుగుతున్న జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్లో ‘రీక్లయిమింగ్ హోప్’ అనే సెషన్లో వీరు పాల్గొన్నారు. చదువుల ఒత్తిడి – ఆత్మహత్యలు పోటీ పరీక్షల ఒత్తిడి పిల్లలను ఆత్మహత్య లకు ఉసిగొల్పుతోంది. రాజస్థాన్‌లోని ‘కోటా’లో కోచింగ్ సంస్థల వ్యాపారం 12 వేల కోట్లకు చేరుకుంది. ఏటా లక్షమంది విద్యార్థులు అక్కడ జెఇఇ, నీట్ ర్యాంకుల కోసం చేరుతున్నారు. తీసుకున్న ఫీజు కోసం నిర్వాహకులు తల్లిదండ్రులను సంతృప్తిపరచడానికి పిల్లలపై ఒత్తిడి పెంచుతున్నారు. రోజుకు 12గంటల రొటీన్ వల్ల పిల్లలకు కొద్దిగా కూడా రిలీఫ్ లేదు. రోజువారీ పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకున్నవారికి ఒకరకమైన ట్రీట్మెంట్, మార్కులు రాక స్ట్రగుల్ చేస్తున్నవారికి ఒక ట్రీట్మెంట్ ఉంటోంది. పిల్లలు తమ మీద తాము విశ్వాసం కోల్పోతున్నారు. చెప్పుకుందామంటే తల్లిదండ్రుల నుంచి కనీస సానుభూతి దొరకడం లేదు. దాంతో ఆత్మహత్యల ఆలోచనలు, చర్యలు పెరుగుతున్నాయి. పిల్లలకు ఏం కావాలో తెలుసుకోకుండా వారు చదువుకునే గదుల్లో ఫ్యాన్లు తీసేసినంత మాత్రాన ఆత్మహత్యలు ఆగవు. పిల్లలే మనకు ప్రధానం అనుకోక΄ోవడం వల్ల ఈ దారుణ స్థితి ఉంది’ డాక్టర్ అమిత్ సేన్ అన్నారు. ఢిల్లీకి చెందిన ఈ చైల్డ్ సైకియాట్రిస్ట్ పిల్లలకు ఎలాగైనా మానసిక చికిత్స అందించాలని ‘చిల్డ్రన్ ఫస్ట్’ అనే ఆన్లైన్ క్లినిక్‌ని నడుపుతున్నారు. కాని పల్లెటూరి పిల్లలకు ఇలాంటి సాయం ఉంటుందని కూడా తెలియడం లేదు అని వా΄ోయారాయన. వందమంది పిల్లల్లో ఒక్కరే ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు అని తెలిపారు. పరీక్షల మేళాలు జరగాలి ‘పరీక్షలంటే మార్కులు అని పిల్లల బుర్రల్లో ఎక్కించాం. కాని పరీక్ష రాస్తున్నాం అంటే ఏదో ఒకటి నేర్చుకునే అవకాశం వచ్చింది అనే భావన పిల్లల్లో ఎక్కించాలి. నేర్చుకుని, ఆ నేర్చుకున్నది చూపుదాం అని పిల్లలు అనుకోవాలి తప్ప మార్కులు చూపిద్దాం అనుకోకూడదు. నా దృష్టిలో పిల్లలు పరీక్షలు ఎంజాయ్ చేయాలంటే పరీక్షల మేళాలు జరగాలి. మైదానాల్లో రకరకాల పరీక్షలు రాసేందుకు పిల్లలను ఆహ్వానించాలి. అక్కడే ఆ పరీక్షలకు సంబంధించిన మెటీరియల్ ఉంచాలి. పురాణాలు, క్రీడలు, భౌగోళిక ్రపాంతాలు, ఆరోగ్యం... ఇలా అనేక అంశాల మీద పరీక్షలు అక్కడికక్కడ రాయించాలి. దాంతో పరీక్షల భయంపోతుంది’ అన్నారు నిమ్హాన్స్ (బెంగళూరు) సీనియర్ చైల్డ్ సైకియాట్రిస్ట్ శేఖర్ శేషాద్రి. ‘పిల్లలు ఏదైనా సమస్య చెప్పుకోవాలనుకున్నప్పుడు ముగ్గురు వారితో సున్నితంగా వ్యవహరించాలి. ఒకరు కుటుంబ సభ్యులు... రెండు స్కూల్ టీచర్లు... మూడు సమాజం అనే చుట్టుపక్కలవారు, బంధువులు. పిల్లలకు గౌరవం ఇవ్వాలి అని కూడా చాలామంది అనుకోరు’ అన్నారాయన. ‘చైల్డ్ అబ్యూజ్ జరిగినప్పుడు పిల్లలు వచ్చి చెప్పుకుంటే వారిని దగ్గరకు తీసుకోవాల్సిందిపోయి... నువ్వే దీనికి కారణం అని నిందించే స్థితి ఉంది’ అన్నారాయన. కోవిడ్ చేసిన మేలు ‘కోవిడ్ వల్ల తల్లిదండ్రులు, పిల్లలు ఇంట్లో ఎక్కువ రోజులు కలిసి ఎక్కువసేపు గడిపే వీలు వచ్చింది. అప్పటికి గాని మన దేశంలో పిల్లలు, తల్లిదండ్రులు ఒకరికి ఒకరు సంబంధం లేకుండా ఎలా జీవిస్తున్నారో పరస్పరం అర్థం కాలేదు. కోవిడ్ వల్ల బంధాలు బలపడ్డాయి. అది జరిగిన మేలు. అదే సమయంలో పిల్లల మానసిక సమస్యలు, ప్రవర్తనలు తల్లిదండ్రులకు తెలిసి వచ్చాయి. కాని వాటికి సరైన చికిత్స చేయించాలని మాత్రం అనుకోవడం లేదు’ అన్నారు నేహా కిర్పాల్. ఈమె పిల్లల మానసిక చికిత్స కోసం ‘అమాహహెల్త్’ అనే క్లినిక్‌ల వరుసను నడుపుతున్నారు. ‘పిల్లల మానసిక ఆహ్లాదానికి కళలు చాలా ముఖ్యమని తెలుసుకోవాలి. ఇటీవల పిల్లల మానసిక సమస్యలకు ఆర్ట్స్ బేస్డ్ థెరపీలు బాగా ఉనికిలోకి వచ్చాయి’ అని తెలిపారు వారు. – జైపూర్ నుంచి సాక్షి ప్రతినిధి -
పాఠశాల విద్యార్ధుల్లో శారీరక ధృఢత్వ లేమి: సర్వే
నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. అలాంటి పిల్లలు ఆరోగ్యంగా ఉండటం ఎంతో అవసరం.. చిన్న వయసు నుంచే పిల్లలకు పోషక విలువలు కలిగిన ఆహారం అందించడం తప్పనిసరి. అలాగే పిల్లలకు మానసిక ఉల్లాసంతోపాటు శారీరక ఉల్లాసం కూడా ముఖ్యమే. వారికి ఆటలు అలవాటు చేయడం, నేర్పించడం ద్వారా మెదడు చురుకుగా పనిచేయడమే కాకుండా ఇటు ఆరోగ్యంగానూ ఉండగలరు. తాజాగా భారత్‌లోని చాలా వరకు పాఠశాల విద్యార్థుల్లో ఫిట్నెస్ స్థాయిలు(శారీరక ధృఢత్వం) తక్కువగా ఉన్నట్లు పోర్ట్జ్ విలేజ్ ఫౌండేషన్ 12వ వార్షిక ఆరోగ్య సర్వేలో వెల్లడైంది. ఆరోగ్యంపరంగా చాలా వెనకబడి ఉన్నట్లు తేలింది. దేశవ్యాప్యంగా 250 నగరాల్లో ఏడు నుంచి 17 సంవత్సరాల వయసున్న పిల్లలను సర్వే చేసి ఈ విషయాలు వెల్లడయ్యాయి. బాడీ మాస్ ఇండెక్స్ (BMI), ఏరోబిక్ కెపాసిటీ, వాయురహిత కెపాసిటీ, కోర్ స్ట్రెంత్, ఫ్లెక్సిబిలిటీ, అప్పర్ బాడీ స్ట్రెంత్, లోయర్ బాడీ స్ట్రెంత్ వంటి అంశాలను ప్రామాణికంగా తీసుకొని ఈ సర్వే చేపట్టారు. పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో ఫిజికల్ ఎడ్యుకేషన్ కీలక పాత్ర పోషిస్తుందని సర్వే ద్వారా వెల్లడైంది. స్కూళ్లో వారంలో రెండు కంటే ఎక్కువ సార్లు ఆటల్లో చురుగ్గా పాల్గొనే పిల్లల్లో శారీరక దృఢత్వం ఎక్కువగా ఉన్నట్లు తేలింది. శరీరం కింద భాగం, పొట్ట భాగం, ఫ్లెక్సిబిలిటీ, ఏరోబిక్ కెపాసిటీ వంటి కీలకమైన అంశాలలో మెరుగుదల కనిపిస్తోంది. ఇవన్నీ క్రీడల ప్రాముఖ్యత, సానుకూల ప్రభావాన్ని నొక్కి చెబుతున్నాయి. ఈ పరిశోధనలన్నీ పిల్లల రోజువారీ దినచర్యలో శారీరక శ్రమను పెంచడం ద్వారా వారి సంపూర్ణ శ్రేయస్సుకు దోహదపడుతుందనే విషయాన్ని తెలియజేస్తుది. వార్షిక ఆరోగ్య సర్వేలో కనుగొన్న విషయాలపై స్పోర్ట్జ్ విలేజ్ సీఈఓ సౌమిల్ మజ్ముదర్ మాట్లాడుతూ.. స్పోర్ట్జ్ విలేజ్ ద్వారా, క్రీడలతో పిల్లల జీవితాలను మార్యాలనే తమ లక్ష్యానికి కట్టుబడి పనిచేస్తున్నట్లు తెలిపారు. పాఠశాలలు క్రీడలను విద్యలో అంతర్భాగంగా చూడాలని కోరారు. పిల్లలు శారీరక శ్రమలలో పాల్గొనడానికి అవకాశాలను అందించాలని తెలిపారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని అన్నారు. పిల్లలకు క్రీడలు అవసరం లేదనే ఉద్ధేశ్యంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఉన్నారని చెప్పారు. దీంతో శారీరక శ్రమకు ఎక్కువ సమయం కేటాయించకపోవడం వల్ల పిల్లల ఆరోగ్యం క్షీణించే ప్రమాదం ఉందన్నారు. శారీరక శ్రమ శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా మానసిక ఆరోగ్యం, విద్యా పనితీరుపై ప్రభావం చూపుతుందని వివిధ అధ్యయనాలు చూపిస్తున్నాయని తెలిపారు. వెల్లడైన కీలక విషయాలు, ►భారతదేశంలో మొత్తం 73,000 మంది పిల్లలను సర్వే చేశారు ►అయిదుగురిలో ఇద్దరు పిల్లలకు ఆరోగ్యకరమైన BMI లేదు ►అయిదుగురిలో ఇద్దరు పిల్లలు మంది పిల్లలు కోరుకున్న వాయురహిత సామర్థ్యాన్ని(Anaerobic Capacity) కలిగి లేరు ►నలుగురు పిల్లల్లో ముగ్గురికి కావలసిన ఏరోబిక్ కెపాసిటీ లేదు. ►ముగ్గురు పిల్లల్లో ఒకరికి కావలసిన ఉదర లేదా కోర్ బలం లేదు ►అయిదురు చిన్నారుల్లో ముగ్గురికి తగినంత ఎగువ శరీరం, దిగువ శరీర బలం లేదు సర్వే ప్రకారం అబ్బాయిలతో పోల్చినప్పుడు ఆరోగ్యకరమైన BMI స్థాయిలు (62%) బాలికల్లో ఎక్కువశాతం ఉన్నట్లు తేలింది. అమ్మాయిలు ఫ్లెక్సిబిలిటీ, అప్పర్ బాడీ స్ట్రెంత్‌లో కూడా మెరుగ్గా ఉన్నారు. అయితే వారు ఏరోబిక్ కెపాసిటీ, లోయర్ బాడీ స్ట్రెంత్‌లో బలహీనంగా ఉన్నారు. అదే విధంగా ప్రభుత్వ పాఠశాలల (31%) పిల్లలతో పోల్చితే, ప్రైవేట్ పాఠశాలల్లో ఎక్కువ మంది పిల్లలు మెరుగైన శరీర బలాన్ని (43%) కలిగి ఉన్నారని సర్వే వెల్లడించింది. ప్రభుత్వ పాఠశాలల పిల్లలు BMI, ఏరోబిక్ కెపాసిటీ, ఫ్లెక్సిబిలిటీలో మెరుగ్గా ఉన్నారు. -
జడ్చర్లలో అమానుషం.. కన్న బిడ్డలను అమ్మకానికి పెట్టిన కసాయి తండ్రి
సాక్షి, మహబూబ్‌నగర్: మానవ సంబంధాలు రోజురోజుకీ దిగజారిపోతున్నాయి. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలతో ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. ఆస్తుల కోసం తోడబుట్టిన వారిపైనే దాడులు చేసుకుంటూ హతమార్చుకుంటున్నారు. డబ్బు మోజులో పడి పేగు బంధాలను తెంచేసుకుంటున్నారు. తాజాగా కాసుల కోసం కక్కుర్తిపడి కన్నబిడ్డలను కిడ్నాప్ చేసి బేరానికి పెట్టాడో తండ్రి. భార్య ఫిర్యాదు, పోలీసుల అప్రమత్తతో అడ్డంగా బుక్కయ్యాడు. ఆ అమానుష ఘటన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో వెలుగుచూసింది. పట్టణంలోని గౌరీ శంకర్ కాలనీలో నివాసం ఉండే రఫీ తన ముగ్గురు కూతుళ్లను మాయ మాటలు చెప్పి కారులో హైదరాబాద్ తీసుకెళ్లాడు. ఆ తర్వాత భార్యకు ఫోన్ చేసి పిల్లలను కిడ్నాప్ చేశానని తనకు డబ్బు కావాలంటూ డిమాండ్ చేశారు. దీంతో ఆమె వెంటనే జడ్చర్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో పోలీసులు వెంటనే స్పందించి రఫీ ఫోన్‌ను ట్రాక్ చేశారు. హైదరాబాదులోని యాకత్‌పురాలో అతని లోకేషన్ కనిపించగా.. వెంటనే పోలీసుల బృందం అక్కడికి చేరుకుంది. ఓ కారులో నిర్బంధించి ఉన్న పిల్లలను.. పోలీసులు రక్షించారు. అయితే రూ. 9 లక్షలకు పిల్లల్ని బేరం కుదుర్చుకున్నాడని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా పోలీసుల అప్రమత్తతో కథ సుఖాంతం అయ్యింది. పిల్లలను విక్రయించాలనుకున్న తండ్రికి బంధువులు కాలనీవాసులు దేహ శుద్ధి చేశారు. -
Kathleen Folbigg: కన్నబిడ్డల మృతి కేసులో ఆస్ట్రేలియా మహిళ.. 20 ఏళ్లకు విముక్తి
సిడ్నీ: కన్నబిడ్డల మృతి కేసులో 20 ఏళ్లపాటు కారాగారంలో మగ్గిన ఆf స్ట్రేలి యా మహిళకు ఎట్టకేలకు విముక్తి లభించింది.న్యూ సౌత్ వేల్స్ లోని క్రిమినల్ కోర్టు ఆదేశాలతో గురువారం ఆమె విడుదలయ్యారు. కాథ్లీన్ ఫాల్బిగ్కు జన్మించిన నలుగురు సంతానం 1989–1999 సంవత్సరాల మధ్య వివిధ కారణాలతో చనిపో యారు. అయితే, వారి మరణాలకు తల్లి కాథ్లీనే కారణమంటూ పోలీసులు 2003లో హత్య కేసు నమోదు చేసి, జైలు శిక్ష విధించారు. తాను అమాయకురాలినని, తన బిడ్డల మరణాలు సహజంగానే జరిగినవని ఆమె ఎంతగా చెప్పినా ఎవరూ వినలేదు. మీడియా ఆమెను వరస్ట్ ఫిమేల్ సీరియల్ కిల్లర్‌గా అభివర్ణించింది. 2019లో మరోసారి జరిగిన దర్యాప్తులోనూ ఆమెనే దోషిగా తేలింది. 2022లో మాజీ న్యాయాధికారి జరిపిన విచారణలో మాత్రం..చనిపోయిన నలుగురు బిడ్డల్లో ఇద్దరు జన్యు సంబంధ వ్యాధులతోనే చనిపోయి ఉండొచ్చంటూ తెలిపింది. దీంతో, ఈ ఏడాది జూన్‌లో ఆమెకు కోర్టు క్షమాభిక్ష ప్రకటించింది. ఆమెపై వచ్చిన ఆరోపణలను న్యూ సౌత్ వేల్స్ కోర్టు కొట్టివేస్తూ జైలు నుంచి విడుదల చేసింది. జైలు నుంచి విడుదలైన కాథ్లీన్ ఫాల్బిగ్ హర్షం వ్యక్తం చేశారు. 1999లోనే తనపై మోపిన ఆరోపణలకు జవాబులు దొరికినా, నిరపరాధినని నిరూపించుకోలేకపోయాను. పిల్లలు ఆకస్మికంగా, గుర్తు తెలియని కారణాలతో చనిపోయే అవకాశం ఉందని భావించని యంత్రాంగం నన్ను దోషిగా చూసింది’అని పేర్కొన్నారు. రెండు దశాబ్దాలపాటు తనను నిర్బంధించిన యంత్రాంగం నుంచి భారీగా పరిహారం కోరుతూ దావా వేస్తానన్నారు. ఫాల్బిగ్ను విడుదల చేయాలంటూ పలువురు వైద్య నిపుణులు, వైద్యులు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను సైతం చేపట్టారు. -
పిల్లలు ఆడుతూ పాడుతూ ఇంటి పనులు చేసేలా నేర్పించండిలా!
‘కోటి విద్యలు కూటి కోసమే’ అని లోకోక్తి. కానీ, ‘కూటి విద్యను నేర్చుకున్నాకే కోటి విద్యలూ’ అనేది ఈతరం సూక్తి. ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు. అందుకు స్వయంపాకమైతే దీ బెస్ట్ అనే సలహా ఇస్తారు ఆరోగ్య స్పృహ కలిగినవాళ్లెవరైనా! చదువు, కొలువుల కోసం ఉన్న ఊరును వదిలి.. పరాయి చోటుకు పయనమయిన.. అవుతున్న వారంతా ఆ సలహాకే పోపేస్తున్నారు. ఎసట్లో నాలుగు గింజలు ఉడికించుకుంటున్నారు. వర్కింగ్ పేరెంట్స్ ఉన్న పిల్లలకూ ఇది అవసరంగా మారుతోంది. పిల్లల చేతికి గరిటెనందిస్తోంది. రకరకాల వంటకాలను నేర్చుకునేందుకు ప్రేరేపిస్తోంది. అలా పిల్లలు ఆడుతూ పాడుతూ వండుకునే మెనూస్నీ.. వంటింటి చిట్కాలనూ తెలుసుకుందాం! వంట చేయడం ఓ కళైతే.. దాన్ని వారసత్వంగా పిల్లలకు అందించడం అంతకు మించిన కళ. చాలామంది తల్లిదండ్రులు పిల్లలను యుక్తవయస్సు దాటేవరకు వంట గదివైపే రానివ్వరు. కానీ.. ఏ విద్యలోనైనా అనుభవజ్ఞులు నేర్పించే పాఠం కంటే అనుభవం నేర్పించే పాఠం ప్రభావవంతంగా ఉంటుంది. అందుకే చిన్న వయసు నుంచి పిల్లల్ని వంట పనుల్లో, ఇంటిపనుల్లో భాగం చేయడం అవసరం. సలాడ్స్ చేయడం.. రెసిపీలు కలపడం వంటి చిన్న చిన్న పనులతో పాటు.. ఏ కూరగాయ ఎలా ఉడుకుతుంది? ఏ బియ్యాన్ని ఎంతసేపు నానబెట్టాలి? ఏ వంటకానికి ఎలా పోపు పెట్టాలి? వంటి వాటిపై అవగాహన కల్పించాలి. సాధారణంగా వంటింట.. పదునైన కత్తులు, బ్లేడ్లు, ఫ్లేమ్స్.. వేడి నూనెలు, నెయ్యి ఇలా చాలానే ఉంటాయి. అందుకే పిల్లల్ని ఆ దరిదాపుల్లోకి రాకుండా చూసుకుంటారు పేరెంట్స్. నిజానికి వంటగదిలోకి రానివ్వకుండా ఆపడం కంటే.. పర్యవేక్షణలో అన్నీ నేర్పించడమే మేలు అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ప్రతివాళ్లకూ ఏదో ఒకరోజు తమ వంట తామే చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కత్తి తెగుతుందని, నిప్పు కాలుతుందనే విషయం తెలిసే వయసులోనే పిల్లలు ఉప్పుకారాల మోతాదులు అర్థంచేసుకుంటే మంచిది అంటున్నారు కొందరు పెద్దలు. దీనివల్ల సెల్ఫ్డింపెడెన్సే కాదు.. జెండర్ స్పృహా కలుగుతుందని అది అత్యంత అవసరమనీ పెద్దల అభిప్రాయం. అందుకే పాఠ్యాంశాలతోపాటు పాకశాస్త్రాన్నీ సిలబస్‌లో చేర్చాలని.. ఒకవేళ సిలబస్‌లో చేర్చలేకపోయినా హోమ్‌వర్క్‌లో మస్ట్‌గా భాగం చెయ్యాలని అనుభవజ్ఞుల సూచన. ఎందుకంటే..? ► వంట పనుల్లో భాగం అయినప్పుడు పిల్లలకు అది ఒక ప్రాక్టికల్ శిక్షణలా ఉపయోగపడుతుంది. గణితం, సైన్స్ నేర్చుకోవడానికి.. ఒక మార్గం అవుతుంది. ఎలా అంటే.. కొలతలు, వినియోగం వంటి విషయాల్లో ఓ లెక్క తెలుస్తుంది. అలాగే నూనె, నీళ్లు ఇలా ఏ రెండు పదార్థాలను కలపకూడదు? ఏ రెండు పదార్థాలు కలపాలి? అనే విషయం వారికి అర్థమవుతూంటుంది. ► చిన్న వయసులోనే వంట నేర్చుకోవడంతో.. ఓర్పు నేర్పు అలవడుతాయి. శుచీశుభ్రత తెలిసొస్తుంది. అలాగే ప్రిపరేషన్, ప్రికాషన్స్ వంటివాటిపై క్లారిటీ వస్తుంది ► బాల్యంలోనే రెసిపీల మీద ఓ ఐడియా ఉండటంతో.. ఒక వయసు వచ్చేసరికి వంట మీద పూర్తి నైపుణ్యాన్ని సంపాదిస్తారు. ► తక్కువ సమయంలో ఏ వంట చేసుకోవచ్చు.. ఎక్కువ సమయంలో ఏ కూర వండుకోవచ్చు వంటివే కాదు.. కడుపు నొప్పి, పంటినొప్పి వంటి చిన్న చిన్న సమస్యలకు చిట్కాలూ తెలుస్తాయి. ► రెసిపీలు విఫలమైతే పిల్లలు.. విమర్శలను సైతం ఎదుర్కోవడం నేర్చుకుంటారు. వైఫల్యం జీవితంలో సర్వసాధారణమని బోధపడుతుంది. గెలుపోటములను సమంగా తీసుకునే మనోనిబ్బరాన్ని అలవరుస్తుంది. ► స్కూల్లో, బంధువుల ఇళ్లల్లో.. ఇతరులతో కలిసేందుకు ఈ ప్రయోగాలన్నీ పిల్లలకు ప్రోత్సాహకాలవుతాయి. అలాగే వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. వంట నేర్చుకోబోయే పిల్లల్ని.. వయసు ఆధారంగా చేసుకుని.. నాలుగు రకాలుగా విభజించుకుంటే.. వంట నేర్పించడం చాలా తేలిక అంటున్నారు నిపుణులు. 3 – 5 ఏళ్ల లోపున్న పిల్లలు మొదటి కేటగిరీకి చెందితే.. 5 – 7 ఏళ్లలోపు పిల్లలు రెండో కేటగిరీలోకి వస్తారు. ఇక 8 నుంచి 12 ఏళ్లలోపు పిల్లలు మూడో కేటగిరీలోకి, 13 ఏళ్ల తర్వాత పిల్లలంతా నాలుగో కేటగిరీలోకి వస్తారు. మొదటి రెండు కేటగిరీల్లో పిల్లలకు చిన్న చిన్న పనులు అలవాటు చేస్తే.. ఎదిగే కొద్దీ వాళ్లలో నైపుణ్యం పెరుగుతుంది. సాధారణంగా మూడు నుంచి ఐదు ఏళ్లలోపు పిల్లల్లో.. పెద్దలు చేసే ప్రతి పనినీ తామూ చేయాలని.. పెద్దల మెప్పు పొందాలనే కుతూహలం కనిపిస్తూంటుంది. వంటగదిలో కొత్త పనిని ప్రయత్నించడానికి ఉత్సాహంగా ఉంటారు. అయితే వారికి చేతుల్లో ఇంకా పట్టు.. పూర్తి అవగాహన ఉండవు కాబట్టి.. అలాంటి పిల్లలకు చిన్నచిన్న పనులను మాత్రమే చెప్పాలి. వారికి నెమ్మదిగా అలవాటు చేయడానికి వీలుండే పనులను, పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేని వాటిని వారి చేతుల్లో పెట్టొచ్చు. ఎక్కువగా కూర్చుని చేసే పనులను వారికి అప్పగించాలి. చేయించదగిన పనులు.. - పండ్లు, కూరగాయలు కడిగించడం, చపాతీ పిండి కలపడంలో సాయం తీసుకోవడం. - పాలకూర వంటివి కడిగి.. తురుములా తెంపించడం. - బనానా వంటివి గుజ్జులా చేయించడం.(ఆ గుజ్జు బ్రెడ్, ఐస్‌క్రీమ్ వంటివి తయారుచేసుకోవడానికి యూజ్ అవుతుంది) ఐదేళ్లు దాటేసరికి.. పిల్లల్లో మోటార్ స్కిల్స్ బాగా పెరుగుతాయి. అంటే నాడీ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. ఏ పనిలోనైనా ఫర్ఫెక్ట్‌నెస్ పెరుగుతూంటుంది. అలాంటివారికి ఆహారాన్ని సిద్ధం చేయడంలో మెలకువలు నేర్పించొచ్చు. అప్పుడప్పుడే చదవడం, రాయడం ప్రారంభిస్తుంటారు కాబట్టి.. వారికి వంటకాలను పరిచయం చేయడానికి ఈ వయసే మంచి సమయం. వంటలో వాళ్లు మనకు సహాయపడగలిగే సులభమైన రెసిపీలను చెబుతుండాలి. వారు ఉపయోగించగలిగే చాప్ బోర్డ్స్, ఇతరత్రా చిన్నచిన్న కిచెన్ గాడ్జెట్స్ ఆన్లైన్లో దొరుకుతాయి. చేయించదగిన పనులు.. - పొడి పదార్థాలను నీళ్లు పోసి కలపడం - ఇన్‌గ్రీడియెంట్స్‌ని కొలవడం, లేదా లెక్కించడం ∙డైనింగ్ టేబుల్ని సర్దించడం - గుడ్లు పగలగొట్టించడం (పెంకుల విషయంలో కాస్త దగ్గరుండాలి) - పిండి వంటల్లో కానీ.. స్నాక్స్‌లో కానీ ఉండలు చేసే పనిని వారికి అప్పగించడం - మృదువైన పండ్లు, కూరగాయలను కట్ చేయించడం - రెసిపీని పెద్దగా రెండు మూడు సార్లు చెప్పించడం.. ఖాళీ సమయాల్లో ఒకటికి రెండు సార్లు ఆ వివరాలను గుర్తుచేయడం - చిన్న చిన్న చపాతీలు చేయించడం ఎనిమిదేళ్ల నుంచి పన్నెండేళ్ల లోపు పిల్లల్లో స్వతంత్ర ఆలోచనలు పెరుగుతుంటాయి. తమ పనులను తాము చేసుకుంటూంటారు. ఈ వయసు వచ్చేసరికి వంట గదిలో వారికి ఎక్కువ పర్యవేక్షణ అవసరం ఉండదు. సొంతంగా ఎవరి సాయం లేకుండానే వీరు చిన్నచిన్న ఫుడ్ ఐటమ్స్ సిద్ధం చేయగలరు. తిన్న ప్లేట్ లేదా బౌల్ కడిగిపెట్టడం, లంచ్ బాక్స్ సర్దుకోవడం, కిరాణా సామాన్లు జాగ్రత్త చేయడం వంటివన్నీ వాళ్లకు అలవాటు చేస్తూండాలి. చేయదగిన పనులు.. - కూరగాయలు లేదా పండ్ల తొక్క తీసుకుని, కట్ చేసుకుని సలాడ్స్ చేసుకోవడం - శాండ్విచెస్, బ్రెడ్ టోస్ట్‌లు చేసుకోవడం, ఆమ్లెట్స్ వేసుకోవడం - జ్యూసులు తీసుకోవడం ∙మరమరాలు, అటుకులతో పిడత కింద పప్పు, పోహా వంటివి చేసుకోవడం, ఇన్‌స్టంట్‌గా తీపి లేదా కారం రెసిపీలు చేసుకోవడం చిన్నప్పటి నుంచి కుకింగ్ మీద అవగాహన ఉన్నవారికి.. సుమారు 13 ఏళ్లు వచ్చేసరికి కిచెన్‌లోని ప్రతి వస్తువును ఎలా వాడాలి? ఏది ఎప్పుడు వాడాలి? అనేది తెలుస్తూంటుంది. వీరిలో తగు జాగ్రత్తే కాదు చక్కటి నైపుణ్యమూ ఉంటుంది. ఇప్పటి తరానికి స్మార్ట్ గాడ్జెట్స్ పైన బీభత్సమైన కమాండ్ ఉంది. కాబట్టి ఓవెన్‌ని ఉపయోగించడం, ఇండక్షన్ స్టవ్ వాడటం వంటివి వీరికి ఈజీ అవుతాయి. చేయదగిన పనులు.. - గ్యాస్ స్టవ్‌పై ఆమ్లెట్స్ వేసుకోవడం - ఎలక్ట్రిక్ కుకర్‌లో జొన్నకండెలు, చిలగడ దుంపలు, గుడ్లు వంటివి ఉడికించుకోవడం - పదునైన కత్తులు జాగ్రత్తగా వాడటం - పెద్దల సమక్షంలో బ్లెండర్, ఫుడ్ ప్రాసెసర్, గార్లిక్ ప్రెస్, కాఫీ మేకర్, వాఫిల్ మేకర్ వంటి వివిధ కిచెన్ గాడ్జెట్ల వాడకాన్ని నేర్చుకోవడం, మైక్రోవేవ్‌పై పూర్తి అవగాహన తెచ్చుకోవడం, ఐస్‌క్రీమ్ వంటివి సిద్ధం చేసుకోవడం - కిచెన్ క్లీనింగ్ నేర్చుకోవడం వంటి విషయాలపై శ్రద్ధ కల్పించాలి. (చదవండి: పప్పులు తినడం మంచిదేనా? పరిశోధనలో షాకింగ్ విషయాలు) -
ఎక్కువ మందిని కనండి: కిమ్
సియోల్: దేశాన్ని బలోపేతం చేయాలంటే జననాలను పెంచటం మహిళల విధి అని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్ చెప్పారు. ఆదివారం జరిగిన నేషనల్ మదర్స్ సమావేశంలో కిమ్ ప్రసంగిస్తూ ఎక్కువ మంది పిల్లలను కనాలని మహిళలకు పిలుపునిచ్చారు. జననాల రేటు క్షీణతను అడ్డుకోవడం, చిన్నారుల సంరక్షణ, విద్య అనేవి తల్లుల వల్లే సాధ్యమవుతాయని చెప్పారు. దేశ జనాభా గణాంకాలను ఉత్తరకొరియా ప్రభుత్వం బహిర్గతం చేయడం లేదు. అయితే, అక్కడ గత పదేళ్లుగా జననాల రేటు తగ్గుతూ వస్తోందని పొరుగు దేశం దక్షిణ కొరియా అంటోంది. పిల్లల పెంపకం, చదువు చెప్పించడం వంటివి చాలా ఖరీదైన వ్యవహారంగా మారడంతో ఉత్తర కొరియాలోని చాలా కుటుంబాలు ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లలను కనేందుకు సిద్ధంగా లేరని పరిశీలకులు అంటున్నారు. దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు కార్మికుల సమీకరణపై ఆధారపడే ఆ దేశానికి ఈ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. -
పిల్లల వ్యక్తిగత డేటాను తస్కరించిన ‘మెటా’
శాన్ఫ్రాన్సిస్కో: సోషల్ మీడియా వేదికలైన ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల మాతృసంస్థ ‘మెటా’పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 13 ఏళ్లలోపు పిల్లల వ్యక్తిగత సమాచారాన్ని మెటా సేకరించిందని, ఎక్కువ సమయం తమ సామాజిక మాధ్యమాల వేదికల్లోనే వారు గడిపేలా ఒక బిజినెస్ మోడల్‌ను రూపొందించిందని అమెరికాలోని పలు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. పిల్లల డేటాను తస్కరించేలా ఉద్దేశపూర్వకంగానే తమ సోషల్ మీడియా వేదికల్లో మెటా మార్పులు చేసిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మెటా సంస్థ నిర్వాకంపై గత నెలలో 33 రాష్ట్రాల అటార్నీ జనరల్స్ కోర్టులో దావా వేశారు. ఈ సంగతి తాజాగా బయటకు వచి్చంది. యుక్త వయసులో ఉన్నవారిని సోషల్ మీడియా సైట్లవైపు ఆకర్శించడానికి, ప్రలోభాలకు గురిచేయడానికి మెటా ప్రయతి్నస్తోందని వారు ఆరోపించారు. 13 ఏళ్ల కంటే తక్కువ వయసున్న లక్షల మంది యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని వారి తల్లిదండ్రుల అనుమతి లేకుండానే ఇన్స్టాగ్రామ్ సేకరించిందని, ఇలా చేయడం చట్టవిరుద్ధమేనని తమ దావాలో పేర్కొన్నారు. చిన్నారుల గోప్యతను కాపాడడానికి ఉద్దేశించిన చట్టాలను మెటా పాటించలేదని ఆరోపించాయి. తమపై వచి్చన ఆరోపణలపై మెటా యాజమాన్యం స్పందించింది. 13 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలు సోషల్ మీడియా వేదికల్లో ఖాతాలు తెరవడానికి అనుమతి లేదని వెల్లడించింది. ఒకవేళ అలాంటి ఖాతాలు ఉంటే తొలగిస్తామని ప్రకటించింది. సోషల్ మీడియా వేదికలు యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని తస్కరిస్తున్నాయని ఏళ్లుగా ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజా వార్తలతో వాటికి మరింత బలం సమకూరిందని అభిప్రాయపడుతున్నారు. -
పిల్లలతో కలిసి ప్రధాని మోదీ అల్లరి
-
ప్రధాని మోదీ మ్యాజిక్ ట్రిక్.. ఫిదా అయిన చిన్నారులు
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ తనను కలవడానికి వచ్చిన కొందరు చిన్నారులను కాయిన్ ట్రిక్ తో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా మోదీ "మ్యాజిక్ ట్రిక్" చేశారు. ప్రధాని మోదీ నుదిటికి నాణెం పెట్టుకుంటారు. తల వెనుక భాగంలో తట్టగానే ఆ నాణెం ముందుకు పడిపోతుంది. ఈ దృగ్విశయాన్ని పిల్లలు విస్మయంతో చూశారు. #Watch | PM Modi's "Memorable Moments" With Children pic.twitter.com/4r2AysENHu — NDTV (@ndtv) November 16, 2023 పిల్లల నుదిటిపై నాణెం అంటించి వారి తల భాగంలో నొక్కినప్పుడు మాత్రం నాణెం పడిపోదు. ఇదిలాగో తెలియక పిల్లలు విచిత్రంగా చూస్తారు. అయితే.. ఈ క్రమంలో పిల్లల నుదిటిన అంటించిన నాణాన్ని మోదీ మరో చేతితో లాక్కుంటారు. సరదాగా పిల్లలతో ప్రధాని మోదీ పిల్లలతో ఈ మ్యాజిక్ చేశారు. ఈ విషయాన్ని మరిచిపోలేని జ్ఞాపకాలుగా పేర్కొంటూ ప్రధాని మోదీ ట్విట్టర్(ఎక్స్)లో షేర్ చేశారు. ఈ ఏడాది రక్షా బంధన్ వేడుకల్లోనూ ప్రధాని మోదీ పాఠశాల విద్యార్థులతో సరదాగా గడిపారు. పిల్లలు ప్రధానికి ఘనస్వాగతం పలికి రాఖీ కట్టారు. అఖిల భారతీయ శిక్షా సమాగమ్ వేడుకలో భాగంగా కూడా ప్రధాని మోదీ పిల్లలతో ముచ్చటించారు. పిల్లల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఇదీ చదవండి: జిన్‌పింగ్ ఓ నియంత.. బైడెన్ నోట మళ్లీ అదే మాట! -
అప్పట్లో బాలల దినోత్సవం అంటే అలా ఉండేది..ఆరోజులే వేరు
అప్పట్లో పండగలంటే పంద్రా ఆగస్ట్, అక్టోబర్ రెండు, జనవరి ఇరవయ్యారు ఇదిగో నవంబర్ పద్నాలుగు అనే బాలల దినోత్వవమేగా ! అదిగదిగో, తెల్లవారుఝాము నుంచే మొదలయ్యేది హాడావిడి. ఇంట్లో వాళ్ళు పొయ్యి మీద డేగిశా నీళ్ళు అలా పెట్టి ఇలా తరిమేవారు చాకలాయన దగ్గరికి. అప్పటికీ అక్కడికీ చేరిన ఇరుగూ పొరుగూ అని అన్ని రకాల బడి పిల్లలు ఒకరికొకరు బద్ద శత్రువుల్లా కనపడేవారు ఆ కాసింత కాలం. ఎవరికి వారు ముందుగా తమ తమ యూనిఫాంలు ఇస్త్రీ రుద్దించుకోవాలి మరి. "కొండలా కూచుంది ఎంతకీ తరగనంది ఏందిరో వింత గొడవా అనే పాట అప్పుడు తెలీకపోయినా పాడుకునే ఉంటాము ఇస్త్రీ చెయ్యవలసిన ఆ బట్టల కొండనీ చూసి ఆ జాతీయ పండగలకు దగ్గర్లో ఏ శుభకార్యం వచ్చినా, పిల్లల పుట్టిన రోజు వచ్చినా పనిలో పని అని , కలిసి వస్తాయి స్కూల్ డ్రెస్సు లే కుట్టించేవారు ఇంట్లో పెద్దలు. స్కూల్ డ్రస్సే కదాని చిన్న చూపేమీ లేదు మాకు, కొత్త తెల్ల అంగి, బ్లూ నిక్కర్ డ్రస్ వేసుకుని బడికి వెల్లడం ఎంత దర్జా ఒలకబోసే పని.చాచా నెహ్రూ పుట్టిన రోజు ఎప్పుడో తెలీదు, బాలల దినోత్సవం అంటే మాత్రం ప్రతి బాలబాలికల యొక్క రెండో పుట్టిన రోజని మాత్రం ఖచ్చితంగా తెలుసు. బిలబిల్లాడుతూ దారివెంట గలగలల కబుర్లు నడిచేవి. పుయ్యిమని మా PET సుందరం సార్ విజిల్ మోతతో కబుర్లన్నీ అఠెన్షన్ మూసి పెట్టి కాలికి కాలు, చేతుకి చేతులు దగ్గరగా చేర్చి విధ్యార్థులు వరుసలు కట్టిన మా బాలల జాతికి మా హెడ్మాస్టర్ హనీఫ్ గారు ఒక సందేశాన్ని ఇచ్చేవారు, విద్యార్థి వరుసల మధ్యలో క్లాస్ లీడర్లు, కండపుష్టి, దబాయింపు తెలిసిన కుర్రాళ్ళు వచ్చి మా అరచేతుల్లో పంచి పెట్టే నెయ్యి చాక్లెట్ తిని మళ్ళీ హానీఫ్ గారి ప్రసంగానికి అంకితం అయ్యేవాళ్ళం. బాగా చదివే పిల్లలకు, బాగా పరిగెత్తే పిల్లలకు, ఖోఖో,కబాడి ఇత్యాది మల్లయుద్దాలు ఆడే పిల్లలకు, క్రమం తప్పకుండా బడికి హజరయ్యే వాళ్ళకు బహుమతులు ఇచ్చేవారు. స్టేజీ మీద పాటలు పాడి కొంతమంది రంజింపజేసేవారు, ఇంకొంతమంది అయ్యామే డిస్కో డాన్సర్ ’ అనీనూ, ’ఒలమ్మీ తిక్క రేగిందా ’ అని కూడాను స్టెప్పులు వేసేవారు. వారికి బహుమతులతో పాటు చొక్కాలకు రూపాయి నోట్లు పిన్నీసు పెట్టి తగిలించేవారు. విజిళ్ళు వేసీ , చప్పట్లు చరిచి ఎంకరేజింగ్ కూడానూ. పదేళ్ల పాటు సాగిన నా బడి బ్రతుకులో నాకు కాసింత అబ్బిన చిత్రకళకు చోటు ఎప్పుడూ దొరకలేదు,ఏనాడు స్టేజి ఎక్కి ఇదిగో బొమ్మకు ఈ బహుమతి అని అందుకున్నది లేదు. అది ఈ రోజుకూ లేదనుకో. అయినా బొమ్మలు వేసినందుకు బడిలో తన్నకపోవడమే మహద్భాగ్యం. ఇంకా పురస్కారాలు కూడానా? ఆశకు అంతుందా ఎక్కడయినా ? పిల్లల పండగ వస్తుందనగానే పిల్లలందరం కలిసి తలా ఇంతా ఇంతా చిల్లర డబ్బులు వేసుకుని క్లాసు రూములకు సున్నాలు కొట్టి, ఝండాలు కట్టి, నల్ల బల్లలకు బుడమాకు-బొగ్గు కలిపిన సింగారం చేసి, తరగతి గది ముందు కళ్ళాపి చల్లి, రంగురంగుల ముగ్గులు చిత్రించి అవి చూసుకోవడానికి ఇంతింత కళ్ళయ్యేవాళ్లం. బడి లోపలి గోడల మీద నేను వేసిన చాచా నెహ్రూ కోటు మీది గులాబి పువ్వుని అందుకుని అమ్మాయిలు జడల్లొ తురుముకునేవారు. అదీ ఒక పురస్కారం వలెనే అని అప్పుడు తెలీదు. ఇప్పుడు తెలిసినా లాభం లేదు. అప్పుడు మా నూనెపల్లేలో ఉన్నట్లు ఇప్పుడు ఏ పల్లె పాఠశాలల్లో కూడా బడి పాకలు ఉన్నట్టు లేవు, చెట్టు కింద తరగతులు నడుస్తున్నట్టు కానరావు, క్లాస్ ముగియగానే నిక్కర్ల వెనుక దుమ్ము దులుపుకుంటు మగపిల్లలు పైకి లేస్తే , లంగాలు విదిలించుకుంటూ ఆడపిల్లలు నిలబడేవారు, వారి వడి నిండా క్లాసుల తరబడి గంటలుగా వింటూ వింటూ తిన్న పొద్దుతిరుగుడు, కర్బూజా విత్తనాల పొట్టు తెల్లగా రాలేది క్లాసుల నిండా. ఆ రాలినదల్లా విత్తనాల పొట్టు మాత్రమే కాదని అవి నా భవిష్యత్తు లో తలుచుకోబోయే జ్నాపకాల పూల చినుకులని ఇప్పడు తెలుస్తుంది. బాల్యం చెదిరి, వయసు ముదిరి ఇప్పుడు ఆ రాశిని రెండు చేతులా ఎత్తి పట్టుకుని "ఏవి తల్లి! నిరుడు కురిసిన ఆ హిమసమూహములు?" అంటున్నారు సాహిత్య వాళ్ళు.నూనెపల్లె వాళ్ళకు హిమము ఎక్కడిదిరా? అవి కర్బూజా గింజెల పొట్టురా నాయనా. ఒక్కసారి కళ్ళు మూసుకుని వెనక్కి వెళితే అవన్నీ అక్కడే ఉన్నాయిరా, ఇంకా ఈత గింజలూ, రేగు గింజలు, సీతా ఫలం గింజలు, ఉసిరికాయ గింజలూ, రంగు జండాలు, బాలలదినోత్సవమునూ, చాచా నెహ్రూ నూ. -అన్వర్, ఆర్టిస్ట్, సాక్షి -
పిల్లలు బాణాసంచా కాల్చేటప్పడూ జరభద్రం..ఈ జాగ్రత్తలు తప్పనసరి..
మనకు ఎన్నో పండుగలు ఉన్నాయి. ఎన్ని పండుగలు ఉన్నా, పిల్లలకు అమితానందం కలిగించేది దీపావళి పండుగే! మిగిలిన పండుగల్లో పిల్లలకు మిఠాయిలు, పిండివంటలు మాత్రమే ఉంటాయి. దీపావళి నాడైతే మిఠాయిలు, పిండివంటలకు అదనంగా టపాకాయలు కూడా ఉంటాయి. సరదాగా టపాకాయలు కాల్చడానికే పిల్లలు దీపావళి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. టపాకాయలు కాల్చుకోవడం సరదానే అయినా, వాటితో ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అందువల్ల జాగ్రత్తలు తీసుకుని మరీ వాటిని కాల్చాలి. ఏమాత్రం అజాగ్రత్తపడినా ఇళ్లూ ఒళ్లూ కాలే ప్రమాదాలు ఉంటాయి. ఈసారి బాలల దినోత్సవానికి రెండురోజుల ముందు దీపావళి పండుగ వస్తోంది. పిల్లలకు ఈసారి రెట్టింపు ఉత్సాహం ఉంటుంది. పిల్లల్లారా! దీపావళి గురించి కొన్ని ముచ్చట్లు చెప్పుకుందాం. హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు ఒకసారి భూమండలాన్ని తీసుకుపోయి సముద్రంలో దాచేశాడు. దేవతలందరూ మొరపెట్టుకోవడంతో మహావిష్ణువు వరాహావతారం దాల్చాడు. హిరణ్యాక్షుడితో యుద్ధంచేశాడు. వాణ్ణి తన పదునైన కోరలతో పొడిచి చంపేశాడు. సముద్రంలో మునిగిన భూమిని తన కోరలతో పైకెత్తి బయటకు తీసుకువచ్చాడు. ఆ సమయంలో వారికి నరకాసురుడు పుట్టాడు. వాడికి అసురలక్షణాలు ఉన్నాయని, ఎప్పటికైనా తల్లి చేతుల్లోనే మరణిస్తాడని మహావిష్ణువు భూదేవికి చెప్పాడు. ఆ తర్వాత వైకుంఠానికి వెళ్లిపోయాడు. పెరిగి పెద్దవాడైన తర్వాత నరకాసురుడు కామరూప దేశానికి రాజయ్యాడు. ప్రాగ్జ్యోతిషపురాన్ని రాజధానిగా చేసుకుని పాలించసాగాడు. ద్వాపరయుగంలో నరకాసురుడికి శోణితపురం రాజైన బాణాసురుడితో స్నేహం ఏర్పడింది. దుర్మార్గుడైన బాణాసురుడి సావాసంలో నరకాసురుడికి అన్ని చెడ్డ గుణాలూ అలవాటయ్యాయి. బాణుడు రెచ్చగొట్టడంతో ఇతర రాజ్యాల మీద దండయాత్రలు చేసేవాడు. దొరికిన స్త్రీలనందరినీ తీసుకొచ్చి, బంధించేవాడు. ఇలా పదహారువేల మంది స్త్రీలను చెరపట్టాడు. స్వర్గం మీద దండెత్తి, దేవేంద్రుడిని తరిమికొట్టి స్వర్గాన్ని ఆక్రమించుకున్నాడు. ఆ కాలంలోనే శ్రీకృష్ణుడు నరకాసురుడి మిత్రుడైన మురాసరుడిని, అతడి కొడుకులను యుద్ధంలో హతమార్చాడు. తన మిత్రుడైన మురాసురుడిని చంపడంతో నరకాసురుడికి శ్రీకృష్ణుడి మీద కోపం వచ్చింది. వెంటనే శ్రీకృష్ణుడి మీద యుద్ధానికి బయలుదేరాడు. శ్రీకృష్ణుడు యుద్ధానికి బయలుదేరుతుంటే, తాను కూడా వస్తానని పట్టుబట్టింది సత్యభామ. సరేనంటూ, ఆమెను తనతో పాటే గరుడ వాహనం మీద యుద్ధరంగానికి తీసుకుపోయాడు శ్రీకృష్ణుడు. నరకాసురుడికి, శ్రీకృష్ణుడికి హోరాహోరీ యుద్ధం జరిగింది. యుద్ధంలో నరకాసురుడు విడిచిన బాణం తాకడంతో శ్రీకృష్ణుడు మూర్ఛపోయాడు. ఇది చూసి సత్యభామకు పట్టరాని కోపం వచ్చింది. వెంటనే విల్లూ బాణాలూ అందుకుంది. నరకాసురుడి మీద, అతడి సైనికుల మీద వరుసగా బాణాలు కురిపించింది. కాసేపటికి శ్రీకృష్ణుడు మూర్ఛ నుంచి తేరుకున్నాడు. యుద్ధంలో సత్యభామ అలసిపోతుండటం చూశాడు. తాను కూడా యుద్ధంలో విజృంభించాడు. అదను చూసి, చక్రాయుధం విసిరి నరకాసురుడి తల తెగనరికాడు. ఆ రోజు ఆశ్వయుజ బహుళ చతుర్దశి. అందుకే ఆ రోజును మనం నరక చతుర్దశి అంటున్నాం. మర్నాడు అమావాస్య రోజున జనాలందరూ నరకాసురుడి పీడ విరగడైనందుకు సంతోషంగా ఇళ్ల ముందు దీపాలు వెలిగించి, పండుగ చేసుకున్నారు. ఇప్పుడు మనం జరుపుకుంటున్న దీపావళి పండుగ అలా పుట్టిందన్నమాట. బాణసంచా చరిత్ర చాలాకాలం పాటు జనాలు దీపావళి రోజున సాయంత్రం ఇళ్ల ముందు దీపాలు వెలిగించుకోవడం, లక్ష్మీపూజలు జరుపుకోవడం మాత్రమే చేసేవారు. అప్పట్లో టపాకాయలు కాల్చేవారు కాదు. తర్వాతి కాలంలో సురేకారంగా పిలుచుకునే పొటాషియం నైట్రేట్ కనుగొన్న తర్వాత దానికి గంధకం, బొగ్గుపొడి కలిపి పేలుడు పదార్థాలను, ఆ తర్వాత రకరకాల రంగు రంగుల కాంతులు వెదజల్లే బాణసంచా సామగ్రి తయారు చేయడం మొదలైంది. బాణసంచాను మొదటగా తయారు చేసినది చైనావాళ్లు. వాళ్ల నుంచి ఇది దేశ దేశాలకు పాకింది. అలాగే క్రీస్తుశకం పద్నాలుగో శతాబ్దం నాటికి మన దేశానికి కూడా చేరుకుంది. అప్పటి నుంచి దీపావళి పండుగ రోజు టపాకాయలు కాల్చడం అలవాటుగా మారింది. కాకరపూవొత్తులు, మతాబులు, చిచ్చుబుడ్లు, విష్ణుచక్రాలు, భూచక్రాలు, తాటాకు టపాకాయలు, తారాజువ్వలు వంటి బాణసంచా కాల్చడం, వాటి నుంచి వచ్చే రంగురంగుల వెలుగులను చూడటం ఎంతో సరదాగా ఉంటుంది కదూ! అయితే బాణసంచా కాల్చేటప్పుడు జాగ్రత్తగా ఉండటం అవసరం. జాగ్రత్తగా టపాకాయలు కాల్చండి టపాకాయలు కాల్చడం ఎంత సరదా అయినా, టపాకాయలు కాల్చడమంటే ఒకరకంగా నిప్పుతో చెలగాటమే! అందువల్ల టపాకాయలు కాల్చేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించాలి: టపాకాయలు కాల్చేటప్పుడు వదులుగా ఉండే కాటన్ దుస్తులను ధరించండి. టపాకాయలను చేత్తో పట్టుకుని నేరుగా కాల్చవద్దు. రేకు డబ్బాలు, సీసాలు, కుండలు బోర్లించి, వాటిలో టపాకాయలు అసలే కాల్చవద్దు. ఇలా చేయడం వల్ల భారీ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. బాణసంచా కాల్చేటప్పుడు చిన్నారులను ఒంటరిగా వదిలేయవద్దు. తల్లిదండ్రులు దగ్గరుండి, జాగ్రత్తగా కాల్పించండి. టపాకాయలు కాల్చేచోట బాగా నీరు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. అనుకోకుండా కాలిన గాయాలైతే, గాయమైన చోట బాగా నీరుపోసి, గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లాలి. ఈ కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే దీపావళి పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవచ్చు. (చదవండి: అతిపెద్ద బాలల మ్యూజియం!) -
అతిపెద్ద బాలల మ్యూజియం!
ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బాలల మ్యూజియం. అమెరికాలోని ఇండియానాపోలిస్‌లో ఉంది. మేరీ స్టూవర్ట్ కారే అనే సంపన్న వ్యాపారవేత్త 1924లో బ్రూక్లిన్ బాలల మ్యూజియం చూశారు. దాని ప్రేరణతోనే ఆమె ఇండియానాపోలిస్‌లో స్థానిక దాతల సహకారంతో 1925లో ఈ మ్యూజియంను నెలకొల్పారు. దీనిని మరింత విస్తరించాలనే ఉద్దేశంతో 1946లో కొత్త నిర్మాణం చేపట్టి ప్రస్తుతం ఉన్న చోటికి తరలించారు. దాదాపు 4.73 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ మ్యూజియంలో పిల్లల వినోద విజ్ఞానాలకు పనికొచ్చే బోలెడన్ని వస్తువులు ఉన్నాయి. వివిధ దేశాలకు చెందిన పురాతనమైన ఆటవస్తువులు ఉన్నాయి. ఈ మ్యూజియంకు ఏటా దాదాపు పదిలక్షల మందికి పైగానే సందర్శకులు వస్తుంటారు. (చదవండి: వలలో అరుదైన చేపలు..దెబ్బతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మత్స్యకారుడు!) -
పిల్లల కథ! వ్యాపారానికి కావాల్సిన స్ట్రాటజీ!
అంజి అనే కోతి కొత్తగా మూలికలతో ఔషధాలు తయారుచేసి అడవిలో అమ్మటం మొదలుపెట్టింది. అది కొంతకాలం పక్క అడవిలో ఉండే తన మిత్రుడు మారుతి అనే కోతి దగ్గర మూలికలతో ఔషధాలు తయారుచేయడం నేర్చుకుంది. తిరిగి తన అడవికి వచ్చి మొక్కల వేర్లు, కాండం, బెరడు, ఆకులు, మొగ్గలు, పూలు, కాయలు, పండ్లు, గింజలు, చిగుళ్లను.. ఉపయోగించి ఎత్తుపెరగటానికి, బరువు తగ్గడానికి, జుట్టు పెరగటానికి, అందంగా అవడానికి.. ఇలా చాలావాటికి మందులు తయారు చేసేది. ఏ మొక్క దేనికి ఉపయోగపడుతుంది.. ఏ ఆకును ఏ రకంగా వాడాలో అంజికి పూర్తిగా తెలుసు. తన మూలికల ఔషధాలను అడవంతా విస్తరింపచేయాలనే ఆలోచనతో నలుగురు అమ్మకందారులనూ నియమించాలనుకుంది. వెంటనే అడవి అంతా చాటింపు వేయించింది. అంజి తయారుచేసే మందులను అమ్మి పెట్టేందుకు ఏనుగు, ఎలుగుబంటి, నక్క, పంది ముందుకు వచ్చాయి. ఔషధాలను తీసుకుని నాలుగూ నాలుగు దిక్కులకు వెళ్ళాయి. పదిరోజులైనా ఒక్క మందూ అమ్ముడుపోలేదు. అంజి తయారుచేసిన మందుల అడవిలోని జంతువులకు గురి కలగలేదు. దాంతో అంజి ఔషధాల తయారీని నిలిపివేయాలనుకుంది. విషయం తెలుసుకున్న మారుతి.. అంజిని కలసి ‘మిత్రమా! నీకు ఔషధాల తయారీలో మంచి నైపుణ్యం ఉంది. లోపం ఎక్కడుందో రేపు కనిపెడతాను’ అంటూ ధైర్యం చెప్పింది. మరునాడు అంజి వెంట మారుతి వెళ్ళి ఏనుగు, ఎలుగుబంటి, నక్క, పంది మందులను ఎలా విక్రయిస్తున్నాయో గమనించింది. అవి ఎండలో పెద్దగా అరుస్తూ ఔషధాలు కొనమని వాటి గుణాలను వివరిస్తున్నాయి. ఆ అరుపు విని జంతువులు, పక్షులు వస్తున్నాయి. ఏనుగు, ఎలుగుబంటి, నక్క, పందిని.. వాటి చేతుల్లో ఉన్న మందులను చూసి వెళ్ళిపోతున్నాయి. కానీ కొనటంలేదు. లోపం ఎక్కడుందో మారుతికి తెలిసిపోయింది. కాసేపు అలాగే పరిశీలించి.. అంజి, మారుతి రెండూ తిరిగి ఇంటికి బయలుదేరాయి. దారిలో ‘మిత్రమా! నువ్వు చేసిన మందులు సరైనవే’ అంది మారుతి. ‘మరి అమ్మకందారుల్లో లోపమా?’ అడిగింది అంజి. ‘పాపం నిజానికి అవి ఎండలో పెద్దగా అరుస్తూ, కష్టపడుతున్నాయి. వాటి శ్రమలోనూ ఎలాంటి లోపం లేదు’ అంది మారుతి. ‘మరి కారణం ఏంటీ?’ అడిగింది అంజి. ‘సరైన ఔషధాన్ని సరైన అమ్మకందారు అమ్మటం లేదు’ అంది మారుతి. అర్థంకాలేదు అంజికి. గ్రహించిన మారుతి ‘మిత్రమా! మొదట మన మీద నమ్మకం కుదిరితేనే మనం ఎదుటివారికి అమ్మగలం. ఒంటినిండా జుట్టుండే ఎలుగుబంటి జుట్టు పెరగటానికి ఔషధం అమ్మితే ఎలా ఆకర్షితులౌతారో.. సన్నబడడం గురించి ఏనుగు మాట్లాడితే అలాగే పారిపోతారు’ అంది మారుతి. ‘ఔషధం ఎంత గొప్పదైనా నమ్మకం లేకపోతే పనిచేయనట్లు.. తను ఔషధాన్ని ఎంత చక్కగా తయారుచేసినా సరైన వారు విక్రయించకపోతే అది వినియోగదారుడిని ఆకర్షించదని అర్థమైంది అంజికి. ‘మిత్రమా! ప్రతిజీవిలో ఏదో ఒక ప్రతిభ ఉంటుంది. దాన్ని సరైన సమయంలో, సరైన పనికి, సరిగ్గా వినియోగించుకోవాలి’ అని చెప్పింది మారుతి. ఆ సూచన పాటించి చిన్న చిన్న మార్పులతో పెద్ద వ్యాపారవేత్తగా ఎదిగింది అంజి. పైడి మర్రి రామకృష్ణ (చదవండి: పుట్టుకతో ఎవరూ మోసగాళ్లు కాదు! కానీ ఆ మోసం విలువ..!) -
'నేను బందీగా ఉంటా.. నా భార్యాబిడ్డలను వదలండి' ఓ తండ్రి ఆవేదన
జెరూసలేం: ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదుల దాడిలో ఎన్నో కన్నీటిగాథలు వెలుగులోకి వస్తున్నాయి. హమాస్ దళాల అదుపులో వందలాది మహిళలు, పిల్లలు బందీలుగా ఉన్నారు. ఇందులో ఇజ్రాయెల్‌కు చెందిన ఇద్దరు పిల్లలతో ఓ తల్లి కూడా బందీగా చిక్కింది. వారి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్న ఆ పిల్లల తండ్రి ఆవేదన కంటతడి పెట్టిస్తోంది. డోరోన్ అషెర్ తన ఇద్దరు పిల్లలతో గాజా సరిహద్దులో ఉన్న అత్తగారి ఇంటికి వెళ్లింది. ఆమె భర్త యూనీ అషెర్ సెంట్రల్ ఇజ్రాయెల్‌లో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో హమాస్ ఉగ్రవాదులు ఇంట్లోకి చొరబడ్డారనే విషయాన్ని డోరోనే తన భర్తకు ఫోన్లో తెలుపుతుండగానే కాల్ కట్ అయిపోయింది. గూగుల్ అకౌంట్ ద్వారా వారి ఆచూకీని గమనించిన యూనీ అషెర్.. తనవారు గాజాలో ఉన్నట్లు గమనించాడు. తన భార్యా పిల్లలను హమాస్ ఉగ్రవాదులు ఎత్తుకుపోయిన తర్వాత సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చిన ఓ వీడియోలో వారిని యూనీ అషెర్ గుర్తించారు. ఆ వీడియోలో కనిపిస్తున్నది తన భార్యా బిడ్డలేనని అధికారులకు తెలిపారు. వ్యాన్‌లో హమాస్ ఉగ్రవాదులు బందించి తీసుకువెళ్తున్నట్లు కనిపించిన ఆ వీడియోను చూసి యూనీ అషెర్ ఆవేదన వ్యక్తం చేశారు. తన పిల్లలు ఏం తిన్నారో..? ఎలా ఉన్నారో..? అంటూ బోరున విలపిస్తున్నాడు. మహిళలను, పిల్లలను కొట్టకండంటూ హమాస్ ఉగ్రవాదులను కోరుకుంటున్నాడు. 'కావాలంటే నేను వస్తా.. కానీ నా భార్యా బిడ్డలను వదిలేయండి' అని వేడుకుంటున్నాడు. ఇజ్రాయెల్-హమాస్ దళాల మధ్య భీకర పోరు నడుస్తోంది. మూడు రోజులుగా నడుస్తున్న యుద్ధంలో మృతుల సంఖ్య 1,200 దాటింది. హమాస్ మిలిటెంట్ల దాడిలో ఇజ్రాయెల్‌లో 700 మందికిపైగా బలయ్యారు. ఇజ్రాయెల్ సైన్యం ఎదురుదాడిలో గాజాలో 500 మందికిపైగా మరణించారు. ఇరువైపులా వేలాది మంది క్షతగాత్రులుగా మారారు. 130 మందికిపైగా పౌరులను బందీలుగా పట్టుకున్నామని, వారంతా తమ ఆదీనంలో ఉన్నారని హమాస్ ప్రకటించింది. ఇదీ చదవండి Israel–Palestinian conflict: గాజాపై నిప్పుల వర్షం -
చిన్నారుల్లో బ్రాంకియోలైటిస్ వస్తే...? ముఖ్యంగా అలాంటి పిల్లలు..
చిన్నారుల ఊపిరితిత్తులకు గాలిని తీసుకెళ్లే చిన్న గాలిగొట్టాల్ని బ్రాంకియోల్స్ అంటారు. ఇన్ఫెక్షన్లు లేదా ఇతర కారణాలతో వీటిల్లో వాపు వస్తే దాన్నిబ్రాంకియోలైటిస్గా చెప్పవచ్చు. సాధారణంగా ఇది నెలల వయసుగల పిల్లలు మొదలుకొని రెండేళ్ల వరకు చాలా తరచుగా కనిపిస్తుంది. పిల్లల్లో బ్రాంకియోలైటిస్కు చాలా కారణాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ప్రధాన గాలిగొట్టం (ట్రాకియా) లేదా నోరు, ముక్కు, గొంతుల్లో వచ్చే ఇన్ఫెక్షన్లు కిందికి వ్యాపించడం వల్ల ఈ సమస్య రావచ్చు. వైరస్లలో రెస్పిరేటరీ సిన్సీషియల్ వైరస్, రైనో వైరస్, ఎడినో వైరస్, ఇన్ఫ్లుయెంజా, కరోనా లాంటి వైరస్లు, కొన్నిసార్లు కొన్ని రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు కూడా బ్రాంకియోలైటిస్కు కారణం కావచ్చు. ముప్పు ఎవరిలో ఎక్కువ? నెలలు నిండకముందే పుట్టిన చిన్నారులు తల్లిపాలపై పెరగని పిల్లల్లో ఇంతకుమునుపే ఇతరత్రా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పిల్లలు డే కేర్ సెంటర్లోని పిల్లలు... మొదలైనవారిలో. లక్షణాలు... బ్రాంకియోలైటిస్ లక్షణాలు దాదాపు ఓ వారం పాటు పిల్లలను బాధిస్తాయి. ఇవి ఫ్లూ లక్షణాలను పోలి ఉంటాయి. కొన్నిసార్లు తీవ్రమైన దగ్గుతో శ్వాస సరిగా అందక పిల్లలు బాధపడుతుంటారు. సాధారణంగా కనిపించే లక్షణాలివి... దగ్గు, పిల్లికూతలు ముక్కు కారడం ఊపిరి సాఫీగా అందకపోవడం పిల్లలు ఛాతీ పట్టేసినట్లుగా బాధపడటం జ్వరం, ఆకలి తగ్గడం చిరాకు / చికాకు కొన్నిసార్లు వాంతులు కావడం ∙ఆరు నెలల కంటే తక్కువ వయసున్న పిల్లలు పాలు సరిగా తాగలేకపోవడం, ఎక్కువగా ఏడవటం లాంటివి. నిర్ధారణ... ∙ ఛాతీ ఎక్స్–రే కొన్ని రకాల రక్తపరీక్షలు ముక్కు, గొంతు నుంచి సేకరించిన స్వాబ్‌ను పరీక్షించడం ద్వారా వైరలా లేక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా అన్నది చాలావరకు నిర్ధారణ చేయవచ్చు. నివారణ: ∙పిల్లలు తమ చేతుల్ని తరచూ శుభ్రంగా కడుక్కునేలా చూడటం పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోవడం అవసరాన్ని బట్టి కొందరికి ఫ్లూ టీకాలు ఇప్పించడం చల్లగాలికి ఎక్స్పోజ్ కాకుండా చూడటం ∙చల్లటి పదార్థాలు, కూల్‌డ్రింక్స్ తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చికిత్స: చాలావరకు వైరల్ ఇన్ఫెక్షన్లే బ్రాంకియోలైటిస్కి కారణం కాబట్టి లక్షణాల ఆధారంగా సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇస్తారు. అంటే... తగినన్ని నీళ్లు తాగించడం, కాస్త పెద్ద పిల్లలైతే ద్రవాహారాలు ఇవ్వడం, పాలు పట్టేముందర వారి నోరు, ముక్కుల్లో ఉండే చిక్కటి స్రావాలను ‘బల్బ్ సిరంజీ’తో బయటకు తొలగించడం, నిద్రపోతున్నప్పుడు బాగా శ్వాస అందేలా తలను కాస్త ఎత్తుగా ఉంచడం, జ్వరం ఉంటే టెంపరేచర్ తగ్గించే మందులు, యాంటిహిస్టమైన్స్, కాఫ్ సిరప్, నెబ్యులైజేషన్ వంటివి కొంతవరకు ఉపయోగపడతాయి. బ్లడ్ రిపోర్టులు, ఎక్స్–రే బట్టి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మాత్రమే యాంటీబయాటిక్స్ ఇస్తారు. పిల్లలు బాగా డల్‌గా ఉండటం, పాలు, ఆహారం తీసుకోవడం బాగా తగ్గడం, పిల్లలకు ఊపిరి అందనప్పుడు / తమంతట తామే శ్వాస తీసుకోలేనప్పుడు ఇది కాస్త ప్రమాదకరమైన పరిస్థితి అని గ్రహించి, వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి. అక్కడ డాక్టర్లు వారికి... ∙రక్తనాళం ద్వారా ఫ్లూయిడ్స్ ఎక్కించడం ఆక్సిజన్ అందకపోతే ఆక్సిజన్ పైప్‌తో ఆక్సిజన్ అందించడం ∙పిల్లల ఊపిరితిత్తుల్లో, ముక్కులోని చిక్కటి స్రావాలను (సక్షన్ ద్వారా) బయటకు పంపడం వంటి ప్రక్రియలతో చికిత్స అందిస్తారు.ఆక్సిజన్ అందకపోతే వెంటిలేటర్ మీద ఉంచాల్సి వస్తుంది. డాక్టర్ సత్యనారాయణ కావలి, కన్సల్టెంట్ పీడియాట్రీషియన్. (చదవండి: చీలమండ నొప్పి తగ్గాలంటే...) -
పిల్లలకి పోన్లు ఇచ్చి మీ పనుల్లో బిజీగా ఉంటున్నారా?
‘స్విగ్గి, జొమాటోల ఫుడ్డు తెప్పించి చేతులు దులుపుకోవద్దు. పిల్లల్ని అమ్మ చేతి రుచికరమైన వంట తిననివ్వండి’ అని కేరళ హైకోర్టు హితవు పలికింది. ఒక మొబైల్ ఫోన్ కేసులో బుధవారం తీర్పు వెలువరిస్తూ ‘సాయంత్రం ఆడుకుని వచ్చిన పిల్లలు ఇంట్లో వంట ఘుమఘులకు ఉత్సాహపడాలి. అన్నం అడగాలి. అలాంటి స్థితి నేడు ఉన్నదా?’ అని ప్రశ్నించింది. పిల్లల పెంపకంలో ఎన్నెన్నో మార్పులు వచ్చాయి.కాని, పిల్లల ఆటలు, ఆహారం విషయంలో కేరళ హైకోర్టు హెచ్చరికలు చాలా ముఖ్యమైనవి. ‘మైనర్ పిల్లల చేతికి తల్లిదండ్రులు సెల్ఫోన్లు ఇచ్చి వారిని సంతోషపెట్టవద్దు. పిల్లల చేతికి ఫోన్లు ఇచ్చి వారు ఏం చూస్తున్నారో పట్టించుకోకుండా తల్లిదండ్రులు ఇంటి పనులో సొంత పనులో చేసుకోవద్దు. పిల్లలు సెల్ఫోన్లలో చూడకూడనివి చూస్తే వాటి దుష్ఫలితాలు సుదీర్ఘకాలం ఉంటాయి’ అని కేరళ హైకోర్టు బుధవారం తల్లిదండ్రులకు హితవు చెప్పింది. కేరళలోని అలవు ప్రాంతంలో ఒక వ్యక్తి బహిరంగ ప్రదేశంలో ఫోన్లో పోర్న్ వీడియోలు చూస్తున్నాడని పోలీసులు పెట్టిన కేసును కొట్టి వేస్తూ (ఐపిసి సెక్షన్ 292 చెల్లదని) జస్టిస్ కున్హి కృష్ణన్ తల్లిదండ్రులకు సెల్ఫోన్ల గురించి హెచ్చరించారు. ‘పిల్లలు సెల్ఫోన్లలో విజ్ఞాన, వినోదానికి సంబంధించి వీడియోలు చూడాలి... అదీ తల్లిదండ్రుల సమక్షంలో. తల్లిదండ్రుల అజమాయిషీ లేకుండా వారు మొబైల్ చూడకూడదు. పిల్లలు ఆడుకునే సమయాల్లో ఆడుకోవాలి. వారిని ఫుట్బాలో, క్రికెట్టో ఆడేలా చేయండి. శారీరకంగా దృఢంగా ఎదిగేలా చేసి దేశ భవిష్యత్తు కోసం ఆశ పెట్టుకునేలా తీర్చిదిద్దండి’ అని కున్హి కృష్ణన్ అన్నారు. తల్లి చేసేదే రుచికరం అదే సమయంలో పిల్లల ఆహారం గురించి ఇటీవల వచ్చిన మార్పును కూడా జస్టిస్ వ్యాఖ్యానించారు. ‘పిల్లలకు స్విగ్గి, జొమాటోల నుంచి ఆహారం తెప్పించి ఇస్తున్నారు. కాని పిల్లలు తల్లి చేసిన రుచికరమైన తిండినే తినాలి. పిల్లలు సాయంత్రం ఆడుకోవడానికి వెళ్లి ఇంట్లో వంట ఘుమఘుమలు మొదలయ్యే సమయానికి చేరుకుని అన్నం కోసం ఎదురు చూడాలి. అలా జరిగితే ఎంత బాగుంటుంది? మేం చెప్పాల్సింది చెప్పాం. ఇక తల్లిదండ్రుల విచక్షణ’ అని కున్హి కృష్ణన్ అన్నారు. మేధో ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం కేరళ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు స్థూలంగా నేటి పిల్లల పెంపకాన్ని వ్యాఖ్యానిస్తున్నాయి. పరిశీలించి చూస్తే అవి పిల్లల మేధో, భౌతిక ఆరోగ్యం గురించి హెచ్చరిక చేస్తున్నాయి. ఇవాళ రేపు స్కూళ్లు, తల్లిదండ్రులు పిల్లల శారీరక వ్యాయామానికి వీలు ఇవ్వడం లేదు. ఆటలాడమని ప్రోత్సహించడం లేదు. ఆడుకునే వీలు కూడా కల్పించడం లేదు. దాంతో పిల్లలు కదలికలు మందగించి బద్దకం, స్థూలకాయం వంటి సమస్యలతో బాధ పడుతున్నారు. మరోవైపు ఆ సమయాన్ని సెల్ఫోన్లలో అనవసరమైన విషయాలు చూస్తూ బుర్ర పాడుచేసుకుంటున్నారు. ఫిల్టర్లు పెడితే తప్ప సెల్ఫోన్లలో పోర్నోగ్రఫీ, వయొలెంట్ వీడియోలు మీట దూరంలో ఉంటాయి. తెలిసీ తెలియని వయసులో వాటిని గంటల కొద్ది చూస్తే తీవ్ర మానసిక ప్రభావాలకు లోనవుతారు. జరగవలసిన నష్టం జరిగే వరకు తల్లిదండ్రులకు విషయం తెలియడం లేదు. ఇంకోవైపు వంటకు సమయం లేకనో లేదా పిల్లలు అడుగుతున్నారనో చీటికి మాటికి స్విగ్గీలో టిఫిన్లు, భోజనాలు తెప్పించే తల్లిదండ్రులు పెరిగారు. హోటల్ తిండి పిల్లలకు ఏ మాత్రం మంచిది కాదు. ఒకప్పుడు ఎప్పుడో తప్ప బయటి తిండి తిననివారు ఇవాళ ప్రతి రెండో రోజు ఏదో ఒకటి తెప్పిస్తున్నారు. తల్లి చేసే ఒకటి రెండు కూరలైనా ఎంతో శుచిగా, రుచిగా ఉంటాయి. వంట పని భారం కాకుండా భర్త, పిల్లలు సాయం చేస్తే శుభ్రమైన ఇంటి భోజనం చేయవచ్చు. కలిసి కూచుని భోంచేయడం ద్వారా కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం పెరుగుతుంది కూడా. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. (చదవండి: కుక్కలా మారిన వ్యక్తి..ఆడ కుక్కతో ప్రేమలో..) -
థ్యాంక్యూ టీచర్
‘మా టీచర్ ఇలా చెప్పలేదు’ ‘మా టీచర్ ఇలాగే చెప్పింది’ ‘మా టీచర్ కోప్పడుతుంది’ ‘మా టీచర్ మెచ్చుకుంటుంది’ పిల్లలకు ప్రతి సంవత్సరం ఒక ఫేవరెట్ టీచర్ దొరకాలి. ఇంట్లో తల్లి తర్వాత పిల్లలు తమ ఫేవరెట్ టీచర్ మీదే ఆధారపడతారు. వారి సాయంతో చదువు బరువును సులువుగా మోసేస్తారు. వారు ట్రాన్స్ఫర్ అయి వెళితే వెక్కివెక్కి ఏడుస్తారు. ‘టీచర్స్ డే’ సందర్భంగా పిల్లలు అభిమానించే టీచర్ల స్వభావాలూ... లక్షణాలు... అవి కలిగి ఉన్నందుకు వారికి ప్రకటించాల్సిన కృతజ్ఞతలు. పిల్లలు స్కూల్‌కు రాగానే తమ ఫేవరెట్ టీచర్ వచ్చిందా రాలేదా చూసుకుంటారు. ఒకవైపు ప్రేయర్ జరుగుతుంటే మరోవైపు ఒక కంటితో ఫేవరెట్ టీచర్‌ను వెతుక్కుంటారు. క్లాసులు జరుగుతుంటాయి. వింటుంటారు. కాని ఆ రోజు టైమ్‌టేబుల్‌లో ఫేవరెట్ టీచర్ క్లాస్ కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తారు. స్కూల్లో ఎందరో టీచర్లు. కాని ఒక్కో స్టూడెంట్‌కు ఒక్కో ఫేవరెట్ టీచర్. ఆ టీచర్ మాటను వేదవాక్కుగా భావించేవారు గతంలో ఉన్నారు.. రేపూ ఉంటారు. ‘పాప... నువ్వు డాక్టర్ కావాలి’ అనంటే డాక్టరైన వారున్నారు. ‘బాబూ.. నీకు సైన్స్ బాగా వస్తోంది సైంటిస్ట్ కావాలి’ అనంటే ఆ మాటలు మరువక సైంటిస్ట్ అయినవారున్నారు. ఫేవరెట్ టీచర్లు పిల్లలను గొప్పగా ఇన్‌స్పయిర్ చేస్తారు. బలం ఇస్తారు. ప్రేమను పంచుతారు. వారే లేకపోతే చదువులు భారంగా మారి ఎందరో విద్యార్థులు కుదేలయి ఉండేవారు. ► సబ్జెక్ట్ బాగా వచ్చినవారు ఫేవరెట్ టీచర్లు ఎవరు అవుతారు? సబ్జెక్ట్ ఎవరికి బాగా వస్తుందో వారు చాలామందికి ఫేవరెట్ టీచర్ అవుతారు. సబ్జెక్ట్ బాగా వచ్చినవారు అది ఎలా చెప్తే పిల్లలకు బాగా అర్థమవుతుందో తెలుసుకుని చెప్తారు. పిల్లలకు అర్థం కావాల్సింది పాఠం సులభంగా అర్థం కావడం. అర్థమైతే పాఠం పట్ల భయం పోతుంది. భయం పోతే ఆ సబ్జెక్ట్ మరింతగా చదవాలనిపిస్తుంది. అందుకు కారణమైన టీచర్‌ను అభిమానించబుద్ధవుతుంది. సబ్జెక్ట్‌ను అందరికీ అర్థమయ్యేలా చెప్తూ, క్లాసయ్యాక కూడా వచ్చి అడిగితే విసుక్కోకుండా సమాధానం చెప్తారనే నమ్మకం కలిగిస్తూ, చెప్తూ, పాఠం అర్థం కాని స్టూడెంట్ను చిన్నబుచ్చకుండా గట్టున ఎలా పడేయాలో ఆలోచించే టీచర్ ఎవరికైనా సరే ఫేవరెట్ టీచర్. ► మనలాంటి వారు పిల్లలు తమలాంటి టీచర్లను, తమను తెలుసుకున్న టీచర్లను ఇష్టపడతారు. క్లాస్‌లో రకరకాల పిల్లలు ఉంటారు. రకరకాల నేపథ్యాల పిల్లలు ఉంటారు. వారి మాతృభాషను, ప్రాంతాన్ని, నేపథ్యాన్ని గుర్తెరిగి వారితో ప్రోత్సాహకరంగా మాట్లాడే టీచర్లను పిల్లలు ఇష్టపడతారు. ‘మీది గుంటూరా? ఓ అక్కడ భలే ఎండలు. భలే కారం మిరపకాయలు దొరుకుతాయిరోయ్’ అని ఒక స్టూడెంట్‌తో ఒక టీచర్ అంటే ఆ స్టూడెంట్ కనెక్ట్ కాకుండా ఎలా ఉంటాడు. ‘రేపు మీరు ఫలానా పండగ జరుపుకుంటున్నారా? వెరీగుడ్. ఆ పండగ గురించి నాకు తెలిసింది చెప్తానుండు’ అని ఏ టీచరైనా అంటే పిల్లలు వారిని తమవారనుకుంటారు. భాషాపరంగా, సంస్కృతి పరంగా పిల్లలు కలిగి ఉన్నదంతా తమది కూడా అని భావించిన ప్రతి టీచర్ ప్రతి విద్యార్థికీ ఫేవరెట్ టీచరే. ► అందరూ సమానమే ఒక టీచర్‌ను పిల్లలు ఎప్పుడు అభిమానిస్తారంటే వారు అందరినీ సమానంగా చూస్తారనే భావన కలిగినప్పుడు. టీచర్లు ఫేవరిటిజమ్ చూపిస్తే ఆ పిల్లల్ని మాత్రమే వారు ఇష్టపడతారని, తమను ఇష్టపడరని మిగతా పిల్లలు అనుకుంటారు. మంచి టీచర్లు అందరు పిల్లల్నీ ఇష్టపడతారు. ‘టీచర్ నిన్నే కాదు నన్ను కూడా మెచ్చుకుంటుంది’ అని పిల్లలు అనుకునేలా టీచర్ ఉండాలి. కొంతమంది స్టూడెంట్లు మంచి మార్కులు తెచ్చుకుంటే వారిని ఎక్కువ పొగిడి కొంతమంది స్టూడెంట్లు ఎంత బాగా చదువుతున్నా మెచ్చుకోకుండా ఉండే టీచర్లు పిల్లలను భావోద్వేగాలకు గురిచేస్తారు. టీచర్ మెచ్చుకోలు, టీచర్‌తో సంభాషణ పిల్లల హక్కు. అది పిల్లలకు ఇవ్వగలిగిన టీచర్ ఫేవరెట్ టీచర్. ► క్రమశిక్షణ పిల్లలు తమ ఫేవరెట్ టీచర్లో క్రమశిక్షణ ఆశిస్తారు. టైమ్‌కు సిలబస్ పూర్తి చేయడం, టైమ్‌కి స్కూల్‌కు రావడం, క్లాసులు ఎగ్గొట్టకపోవడం, సరిగ్గా నోట్స్ చెప్పడం, సరిగ్గా పరీక్షలకు ప్రోత్సహించడం, ఎంత సరదాగా ఉన్నా క్లాస్ జరుగుతున్నప్పుడు సీరియస్‌గా ఉండటం... ఇవీ పిల్లలు ఆశిస్తారు. తాము గౌరవించదగ్గ లక్షణాలు లేని టీచర్లను పిల్లలు ఫేవరెట్ టీచర్లు అనుకోరు. టీచర్ వృత్తి ఎంతో గొప్ప వృత్తి. టీచర్లు కూడా మనుషులే. వారిలోనూ కోపతాపాలు ఉంటాయి. కాని ఎంతోమంది టీచర్లు పిల్లల కోసం తమ జీవితాలను అంకితం చేసి వారి జీవితాలను తీర్చిదిద్దుతారు. ‘మీరు పెద్దవాళ్లయి పెద్ద పొజిషన్‌కు వెళితే అంతే చాలు’ అంటూ ఉంటారు. మంచి టీచర్లు, గొప్ప టీచర్లు పిల్లల శ్రేయస్సును ఆకాంక్షించి తద్వారా వారి గుండెల్లో మిగిలిపోతారు. పిల్లల హృదయాల్లో ప్రేమ, గౌరవం పొందిన టీచర్లందరికీ ‘టీచర్స్ డే’ శుభాకాంక్షలు. ► మంచి ఫ్రెండ్ కొందరు టీచర్లు క్లాస్‌లో ఫ్రెండ్‌లా ఉంటారు. 45 నిమిషాల క్లాస్‌లో 40 నిమిషాలు పాఠం చెప్పి ఒక ఐదు నిమిషాలు వేరే కబుర్లు, విశేషాలు మాట్లాడతారు. పిల్లల కష్టసుఖాలు వింటారు. వారి తగాదాలు తీరుస్తారు. ఎవరైనా చిన్నబుచ్చుకుని ఉంటే కారణం తెలుసుకుంటారు. ముఖ్యంగా దిగువ ఆర్థిక పరిస్థితి ఉన్న పిల్లలు ఇలాంటి టీచర్లను చాలా తీవ్రంగా అభిమానిస్తారు. తమ కష్టాలు చెప్పుకోవడానికి ఒక మనిషి ఉన్నట్టుగా భావిస్తారు. అదే మంచి ఆర్థికస్థితి ఉన్న పిల్లలైతే తమకు ఎమోషనల్ సపోర్ట్ కోసం చూస్తారు. పాఠాల అలజడుల నుంచి ధైర్యం చెప్పే టీచర్‌ను అభిమానిస్తారు. -
చిన్నారులకు ఆత్మీయ నేస్తం
పిల్లల కోసం పర్యావరణ అనుకూలమైన ఉత్పత్తుల తయారీలోగ్రామీణ మహిళలకు అవగాహన కల్పిస్తున్నారు. న్యూ ఏజ్ పేరెంట్స్‌ను ఆకట్టుకునేలా చేస్తున్న ఈ ప్రయత్నానికి మంచి స్పందన వస్తోందని, పిల్లలకు ఈ బొమ్మలు ఆత్మీయ నేస్తాలు అవుతున్నాయని ఆనందంగా వివరిస్తోంది స్వాతి. ‘‘పిల్లల మనసులు తెల్లని కాగితాల్లాంటివి. వాటిపై మనం ఏది రాస్తే అదే వారి భవిష్యత్తు. పదేళ్లుగా వందలాది మంది చంటి పిల్లలతో ఆడిపాడి, వారికి నచ్చినట్టు చెప్పే పద్ధతులను నేనూ నేర్చుకుంటూ వచ్చాను. డిగ్రీ చేసిన నాకు స్వతహాగా పిల్లలతో గడపడంలో ఉండే ఇష్టం నన్ను టీచింగ్ వైపు ప్రయాణించేలా చేస్తోంది. ప్లే స్కూల్ పిల్లలతో ఆడుకోవడం, వారితో రకరకాల యాక్టివిటీస్ చేయించడం ఎప్పుడూ సరదాయే నాకు. నాకు ఒక బాబు. వాడి వల్లనే ఈ ఇష్టం మరింత ఎక్కువైందనుకుంటాను. బాబుతోపాటు నేనూ ఓ స్కూల్లో జాయిన్ అయి, నా ఆసక్తులను పెంచుకున్నాను. ఆలోచనకు మార్గం పదేళ్లుగా చంటి పిల్లల నుంచి పదేళ్ల వయసు చిన్నారుల వరకు వారి ఆటపాటల్లో నేనూ నిమగ్నమై ఉన్నాను కనుక వారి ముందుకు ఎలాంటి వస్తువులు వచ్చి చేరుతున్నాయనే విషయాన్ని గమనిస్తూ వచ్చాను. కానీ, నేను అనుకున్న విధంగా అన్నింటినీ ఒక దగ్గరకు చేర్చడం ఎలాగో తెలియలేదు. కరోనా సమయంలో వచ్చిన ఆలోచన నాకు నేనుగా నిలబడేలా చేసింది. ఒకప్రా జెక్ట్ వర్క్‌లాగా పిల్లల మానసిక వికాసానికి ఏమేం వస్తువులు అవసరం అవుతాయో అన్నీ రాసుకున్నాను. నేను ఏయే పద్ధతుల్లో పిల్లలకు నేర్పిస్తున్నానో, దాన్నే నాకు నేనేప్రా జెక్ట్ వర్క్‌గా చేసుకున్నాను. ఏ వస్తువులు ఏ ప్రాంతానికి ప్రత్యేకమైనవి, నాకు నచ్చినట్టుగా ఏయే వస్తువులను తయారు చేయించాలి అనేది డిజైన్ చేసుకున్నాను కాబట్టి అనుకున్న విధంగా పనులు మొదలుపెట్టాను. కిండోరా టాయ్స్ పేరుతో రెండేళ్ల క్రితం ఈప్రా జెక్ట్నుప్రా రంభించాను. అన్నింటా ఎకో స్టైల్ పిల్లలకు దంతాలు వచ్చే దశలో గట్టి వస్తువులను నోటిలో పెట్టేసుకుంటారు. వాటిలోప్లాస్టిక్వీ వచ్చి చేరుతుంటాయి. అందుకని సాఫ్ట్ ఉడ్‌తో బొమ్మలను తయారు చేయించాను. వీటికోసం మన తెలుగు రాష్ట్రాల్లోని కొండపల్లి, నిర్మల్ నుంచే కాకుండా, ఇతర రాష్ట్రాల్లోని టాయ్ మేకింగ్ వారిని కలిసి నాకు కావల్సిన విధంగా తయారు చేయించాను. ఇంద్రధనుస్సు రంగులను పరిచయం చేయడానికి సాఫ్ట్ ఉడ్ మెటీరియల్, కలర్, బిల్డింగ్ బాక్స్‌లే కాదు... ఐదేళ్ల నుంచి చిన్న చిన్న అల్లికలు, కుట్టు పని నేర్చుకోవడానికి కావల్సిన మెటీరియల్, క్రోచెట్ అల్లికలు వంటివి కూడా ఉండేలా శ్రద్ధ తీసుకున్నాను. సాఫ్ట్ టాయ్స్తోపాఠం మన దేశ సంస్కృతిని పిల్లలకు తెలియజేయాలంటే మన కట్టూ బొట్టునూ పరిచయం చేయాలి. అందుకు ప్రతి రాష్ట్రం ప్రత్యకత ఏమిటో డెకొరేటివ్ బొమ్మల ద్వారా చూపవచ్చు. ఇవి కూడా ఆర్గానిక్ మెటీరియల్స్ తో తయారు చేసినవే. డెకరేటివ్ సాఫ్ట్ టాయ్స్ స్వయంగా నేను చేసినవే. ఆర్గానిక్ కాటన్ మెటీరియల్‌తో చేయించిన సాఫ్ట్ టాయ్స్‌లో జంతువులు, పండ్లు, పువ్వుల బొమ్మలు కూడా ఉంటాయి. వీటివల్ల చిన్న పిల్లలకు ఎలాంటి హానీ కలగదు. రంగురంగులుగా కనిపించే ఈ బొమ్మల ద్వారా చెప్పేపాఠాలను పిల్లలు ఆసక్తిగా వింటారు. వీటితోపాటు పిల్లలను అలరించే పుస్తకాలు కూడా అందుబాటులో ఉండేలా చూసుకున్నాను. ఒక విధంగా చె΄్పాలంటే ఈ కాలపు తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎలాంటి మానసిక వికాసపు బొమ్మలు కావాలనుకుంటారో అవన్నీ నా దగ్గర ఉండేలాప్లాన్ చేసుకున్నాను. నా ఆసక్తే పెట్టుబడి.. ఉద్యోగం చేయగా వచ్చిన డబ్బుల నుంచి చేసుకున్న పొదుపు మొత్తాలను ఇందుకోసం ఉపయోగించాను. ముందు చిన్నగా స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఆన్లైన్ వేదికగా మంచి ఆర్డర్స్ వస్తున్నాయి. నాతోపాటు ఈ పనిలో గ్రామీణ మహిళలు భాగస్వామ్యం కావడం మరింత ఆనందాన్ని ఇస్తోంది. ప్లే స్కూళ్లు, ఆన్లైన్, ఆఫ్ లైన్ ద్వారా వచ్చే ఆర్డర్లను బట్టి సాఫ్ట్ టాయ్స్ తయారీలో కనీసంపాతికమంది మహిళలుపాల్గొంటున్నారు. ముందుగా వర్క్‌షాప్ నిర్వహించి, టాయ్స్ మేకింగ్ నేర్పించి వర్క్ చేయిస్తుంటాను. పూర్తి ఎకో థీమ్ బేస్డ్ కావడంతో ఈ కాలం అమ్మలు ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారు. నేననుకున్న థీమ్ ఎంతో కొంతమందికి రీచ్ అవడం నాకు చాలా ఆనందంగా ఉంది’’ అని వివరించింది స్వాతి.– నిర్మలారెడ్డి ఫొటోలు: మోహనాచారి -
తల్లిదండ్రులుగా..అదే పిల్లలకు ఇవ్వగల అత్యంత విలువైన కానుక!
పిల్లలకు మీ సమయాన్ని ఇస్తున్నారా? పిల్లలకు తల్లిదండ్రులు ఇవ్వగల అత్యంత విలువైన కానుక ఏదైనా ఉందంటే అది కేవలం సమయం మాత్రమే. సమయం ఎందుకు విలువైనది అని అంటే, గడిచిన క్షణం అయినా తిరిగి రాదు. అందువల్ల వారితో విలువైన, నాణ్యమైన సమయాన్ని గడిపి, వారికి మంచి జ్ఞాపకాలను మిగల్చండి. వారితో గడిపేందుకు ఏమేం చేయవచ్చో చూద్దాం... మనం పిల్లలతో కలిసి చదవడం, పనిపాటలు చేయడం నుంచి ఆటలు ఆడటం వరకు..వారితో మీ బంధం బలపడడానికి, అనుబంధాలు అల్లుకోవడానికి తోడ్పడతాయి. పుస్తక పఠనం పిల్లలతో బంధాన్ని పెంచుకోవడానికి, వారి భాషానైపుణ్యాలను పెంపొందించడానికి పుస్తకపఠనం గొప్ప మార్గం. వయస్సుకి తగినవి, మీ పిల్లలు ఆనందిస్తారని మీరు భావించే పుస్తకాలను ఎంచుకుని వాటిని పిల్లలతో కలిసి బిగ్గరగా చదవవచ్చు లేదా వాళ్లే చదివి మీకు వినిపించేలా చేయవచ్చు. ఒకవేళ పుస్తకాలు లేకపోతే తెలుగు లేదా ఇంగ్లిష్ వార్తాపత్రికలు చదవడంతో దినచర్య ప్రారంభించడం మంచిది. కలిసి ఆటలు ఆడటం మీ పిల్లల సామాజిక నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి ఆటలు ఆడటం ఒక ఆహ్లాదకరమైన మార్గం. బోర్డ్ గేమ్‌లు, కార్డ్గేమ్లు, అవుట్డోర్ గేమ్‌లు వంటి అనేకరకాల ఇండోర్ లేదా ఓట్‌డోర్ గేమ్స్ పిల్లలతో ఆడచ్చు. చెస్, స్నేక్స్ అండ్ లేడర్స్ (పాముపటం), అష్టాచెమ్మా, పచ్చీస్ వంటివి పిల్లలతో కలిసి ఆడటం వల్ల వారిలో క్రీడానైపుణ్యాలు పెంపొందుతాయి. విహారయాత్రలకు వెళ్లడం పిల్లలు కొత్త విషయాలను అనుభూతించడానికి, వారి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తెలుసుకోవడానికి ఔటింగ్‌లకు వెళ్లడం గొప్పమార్గం. పార్క్, జూపార్క్, మ్యూజియం లేదా ఇంకేదైనా చూపించడానికి వారిని అప్పుడప్పుడు బయటకు తీసుకెళ్లడం ద్వారా వారితో ఎక్కువ సమయం గడపవచ్చు. కళానైపుణ్యాన్ని పెంపొందించడం కళలు పిల్లలు తమను తాము నిరూపించుకోవడానికి, తమ నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవడానికి కళలు ఒక ఆహ్లాదకరమైన చక్కటి మార్గం. మీరు మీ పిల్లలకు క్రేయాన్లు, మార్కర్లు, పెయింట్, క్లే వంటి ఆర్ట్ సామాగ్రిని సమకూర్చి, వాటితో వారు ఏమేం చేయాలనుకుంటున్నారో చెప్పించి, వాటిని తయారు చేసేందుకు వారితో కలిసి పనిచేయండి. వారికి కావలసిన వాటిని వారే తయారు చేసుకునేలా వారిని ప్రోత్సహించండి. గార్డెనింగ్ పిల్లలు ప్రకృతి, బాధ్యత గురించి తెలుసుకోవడానికి గార్డెనింగ్‌ని మించిన మంచి మార్గం మరోటి లేదని చెప్పొచ్చు. పిల్లలతో కలిసి మీ పెరట్లో కొన్నిమొక్కలు నాటవచ్చు. లేదా మీ డాబాపై కొన్ని కుండీలు ఏర్పాటు చేసి వాటిలో కూడా నాటవచ్చు. వాటికి రోజూ నీళ్లు పోయడం, అవి ఎలా పెరుగుతున్నాయో వారితో కలిసి చూడడం గొప్ప అనుభూతినిస్తుంది. మాట్లాడటం... మాట్లాడనివ్వటం పిల్లలతో నాణ్యమైన సమయాన్ని గడపడానికి ఉత్తమమైన మార్గాలలో ఒకటి వారితో మాట్లాడటం, వారు చెప్పే కబుర్లు ఆసక్తిగా వినడం. వారి రోజువారి స్నేహితులు, వారి ఆసక్తులు, వారి కలల గురించి వారిని అడగండి. వారు చెప్పేది వినండి. అవసరం అయితే వారికి మీ మద్దతును, సహకారాన్ని అందించడం. కలిసి వంట చేయడం ఉదయం పూట చేసే బ్రేక్‌ఫాస్ట్ నుంచి, మధ్యాన్నం వారు తినే లంచ్ వరకు వారికి ఇష్టమైన వాటిని లేదా మీ ఇంట్లో ఉన్న వాటితో టిఫిన్లు, స్నాక్స్, లంచ్ ప్రిపేర్ చేయడంలో వారి సాయం తీసుకోవడం మంచి పద్ధతి. అంటే తప్పనిసరిగా వారు మీకు హెల్ప్ చేయాలని కాదు... ఆసక్తి ఉంటే వారే సాయం చేయడానికి వచ్చేలా చేసుకోగలిగితే చాలు. ఇది రోజూ కుదరకపోవచ్చు కానీ కనీసం వారికి సెలవురోజుల్లో అయినా సరే, కలిసి వంట చేసుకునే అలవాటు చేయడం మంచిది. వాకింగ్ లేదా సైక్లింగ్‌కు తీసుకెళ్లడం పిల్లలు పది పన్నెండేళ్లలోపు వారైతే వారిని మీతో కలిసి రోజూ వాకింగ్‌కు లేదా సైక్లింగ్‌కు తీసుకెళ్లండి. వారు శారీరకంగా చురుగ్గా ఉండేందుకు, మానసికంగా మీకు దగ్గరయ్యేందుకు మార్నింగ్ వాక్ మంచి మార్గం. అలా చేయడం ద్వారా వారు రోజంతా ఉత్సాహంగా ఉంటారు. స్వచ్ఛంద సేవలో... పిల్లలు ఇతరులకు సహాయం చేయడం, ప్రపంచంలో మార్పు తీసుకురావడం గురించి తెలుసుకోవడానికి వాలంటీరింగ్ ఒక గొప్ప మార్గం. మీరు స్థానికంగా ఉండే ఆశ్రమాల్లో లేదా ఇతర సంస్థలో స్వచ్ఛందంగా సేవ చేయవచ్చు. (చదవండి: ఎలక్ట్రానిక్ వ్యర్థం ఏదైనా..అతడి చేతిలో శిల్పంగా మారాల్సిందే!) -
ఎలుగెత్తి చెబుదాం గొంతెత్తి పాడుదాం
పిల్లలు నోరు తెరిచి దేశం గురించి మాట్లాడే రోజు ఆగస్టు 15. గొంతెత్తి దేశభక్తిని గానం చేసేరోజు మన స్వాతంత్య్ర దినోత్సవం. సంవత్సరంలో 364 రోజులు వారు ఫోనులోనో గేమ్స్లోనో మునిగి ఉన్నా ఈ ఒక్కరోజైనా వారి చేత దేశం గురించి మాట్లాడించాలి. దేశ ఘనతను పాడించాలి. తల్లిదండ్రులు తమ పిల్లల చేత కనీసం ఒక పాట పాడించాలి. ఐదు నిమిషాలు మాట్లాడించాలి. ఏ పాటలు? ఏ మాటలు? ఇవిగోండి సలహాలు... ‘దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా వొట్టి మాటలు కట్టిపెట్టొయ్ గట్టిమేల్ తలపెట్టవోయ్’... అన్నారు గురజాడ. ‘దేశమును ప్రేమించాలి’ అని పిల్లలకు తెలుసు. కాని దేశంలో మంచి పెరిగితేనే అది ప్రేమించ దగ్గ దేశమవుతుందని, దేశంలోని ప్రతి ఒక్కరికీ మేలు జరిగినప్పుడే అది గొప్ప దేశమవుతుందని గురజాడ చెప్పారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఇలాంటి ఒక పాటైనా పిల్లల చేత పాడించకపోతే తల్లిదండ్రుల పెంపకంలో నిర్లక్ష్యం ఉన్నట్టే అర్థం. ‘చెట్టపట్టాల్ పట్టుకొని దేశస్తులంతా నడవ వలెనోయ్... అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ మెలగవలెనోయ్’ అని కూడా గురజాడ అన్నారు. ఇవాళ్టి సందర్భంలో పిల్లలకు ఈ పాట నేర్పి, దాని అర్థం మనసుకు ఎక్కించకపోతే భవిష్యత్తులో వారు ‘దేశమంటే మట్టే’ అనుకుంటారు. ‘మనుషులు’ అనుకోరు. త్యాగఫలం తెలియచేయాలి ఇవాళ మనం పీలుస్తున్న ప్రతి శ్వాస మన పూర్వికుల రక్తం, చెమట, త్యాగం ఫలితం. మహానుభావులు వారి జీవితాలను త్యాగం చేసి భావితరాల చేతుల్లో పెట్టారు దేశాన్ని. ఎంతో విలువైన ఈ దేశ సంపద, దేశ సంస్కృతి పట్ల పిల్లలకు గౌరవం, బాధ్యత తెలియాలంటే వారిలో జాతీయ భావాలు, సుహృద్భావం కలగాలంటే ఆగస్టు 15ను ఒక సందర్భంగా చేసుకుని తెలియచేయాలి. ఇవాళ దురదృష్టవశాత్తు కొన్ని ఇళ్లల్లో పిల్లలకు తెలుగు నేర్పించడం లేదు. కొన్ని స్కూళ్లలో పిల్లలు జెండా వందనం రోజు జైహింద్ చెప్తే సరిపోతుందనుకుంటున్నారు. కనీసం ఒక బృందగానంలో కూడా పాల్గొనడం లేదు... వక్తృత్వంలో నాలుగు ముక్కలు దేశం గురించి మాట్లాడటం లేదు. అందుకే తల్లిదండ్రులు పూనుకుని తమ ప్రతి పిల్లల చేత అయితే తమ అపార్ట్మెంట్లో, లేదా తమ వీధిలో, ఇంట్లో ఏదో విధాన ఒక పాట పాడించడం, దేశం గురించి తప్పకుండా నాలుగు ముక్కలు మాట్లాడించడం అవసరం. పిల్లలు సరిగ్గా చెప్తే వింటారు. నేర్చుకుంటారు. వారికి ఆ వేళ విశేషమైన దుస్తులు, దేశభక్తులు వేషాలు వేస్తే ఎంతో సంబరపడతారు. ఆ స్ఫూర్తిని నింపుకుంటారు. ఆగస్టు 15 అంటే సెలవు దినం, ఆ రోజు ఎటైనా వెళ్లొద్దాం అని ప్లాన్ చేసుకునే తల్లిదండ్రులు పిల్లలను దేశం వైపు నడిపించడంలో నిర్బాధ్యతగా ఉన్నట్టే లెక్క. ఎన్నో పాటలు పిల్లలు నేర్చుకుని పాడటానికి తెలుగు, హిందీ భాషల్లో ఎన్నో పాటలు ఉన్నాయి. ప్రయివేటు గీతాలతో పాటు సినీ గీతాలు కూడా ఉన్నాయి. వీటిలో ఏదో ఒకటి నేర్పించవచ్చు. ‘దేశమును ప్రేమించుమన్నా’ (గురజాడ), ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ (శంకరంబాడి), ‘జయజయ ప్రియభారత జనయిత్రి’ (దేవులపల్లి), ‘తేనెల తేటల మాటలతో’ (ఇంద్రగంటి శ్రీకాంత శర్మ), ‘మాకొద్దీ తెల్లదొరతనము’ (గరిమెళ్ల), ‘చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడ’ (వేములపల్లి శ్రీకృష్ణ)... ఇవన్నీ ఉన్నాయి. ఇక సినిమా పాటల్లో ‘పాడవోయి భారతీయుడా’ (శ్రీశ్రీ) పిల్లలు పాడటానికి సులువుగా ఉంటుంది. మన పిల్లలకు ‘వందేమాతరం’, ‘జనగణమన’, ‘సారే జహాసే అచ్ఛా’ కనీసం వచ్చునా రావా అన్నది కూడా గమనించుకుంటే మంచిది. దేశం గురించి మాట్లాడాలి పిల్లలు దేశం గురించి, దేశ ఔన్నత్యం గురించి మాట్లాడాలి. మాట్లాడటంలో వారికి తర్ఫీదు ఇవ్వాలి. ఏం మాట్లాడాలన్న విషయంలో కొంచెం సాయం చేసినా పర్వాలేదు. ‘భిన్నత్వంలో ఏకత్వం’, ‘మన జాతిపిత’, ‘దేశాభ్యున్నతికై పర్యావరణ పరిరక్షణ’, ‘డిజిటల్ ఇండియా’, ‘స్త్రీ శక్తి’, ‘సామాజిక బాధ్యత’... ఇలా ఏదో ఒక అంశం ఇచ్చి ఐదు నిమిషాలు మాట్లాడేలా చేయాలి. ఇది ఒక సంప్రదాయం. ఒక తరం నుంచి మరో తరానికి అందాలి. అమృతోత్సవం సందర్భంగా ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపై జెండా ఎగరేయడంలో పిల్లలను భాగస్వాములను చేయాలి. దేశ పతాకం పిల్లల చేతుల్లో రెపరెపలాడాలి. దేశభవిష్యత్తుకు వారే విధాతలు కావాలి. -
వారి కోసం ఉపాసన కీలక నిర్ణయం.. !
ఉపాసన కొణిదెల తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. మెగా కోడలిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే మెగా ఇంట్లో వారసురాలు అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్, ఉపాసన బిడ్డకు క్లీంకారగా నామకరణం చేశారు. అయితే మెగాకోడలు ఉపాసన ప్రస్తుతం తల్లిగా చాలా బిజీగా ఉంది. ఎందుకంటే ఈ జూన్‌లో కూతురు పుట్టిన తర్వాత ఈమె జీవితంలో చాలా మార్పులు వచ్చాయని తెలిపింది. తన బిడ్డ వల్ల మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నట్లు వెల్లడించింది. (ఇది చదవండి: మొన్న సెలవులు.. ఇప్పుడేమో ఏకంగా జైలర్ స్పెషల్ షోలు..!) అయితే సామాజిక ఉపాసన సేవలోనూ ఎప్పుడు ముందుంటుంది. తన సేవలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటోంది. అలానే ఒంటరి తల్లుల కోసం ఓ మంచి నిర్ణయం తీసుకుంది. వారి కోసం ప్రత్యేకంగా ప్రతి ఆదివారం ఉచిత ఓపీడీ సేవలు అందించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అపోలో చిల్డ్రన్స్ పేరిట జూబ్లీహిల్స్‌లోని ఆస్పత్రిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఓ వీడియోను కూడా షేర్ చేసింది. దీంతో ఉపాసన చేస్తున్న సేవలను నెటిజన్స్ అభినందిస్తున్నారు. ఈ సందర్భంగా ఉపాసన మాట్లాడుతూ.. 'హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో అపోలో చిల్డ్రన్స్ ప్రారంభోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా.. ఒంటరి తల్లుల కోసం ప్రత్యేకంగా ప్రతి ఆదివారం ఉచిత ఔట్ పేషెంట్ డిపార్ట్మెంట్ (OPD) సేవలను పరిచయం చేయడం గర్వకారణం. ప్రతి ఒక్కరూ 040 -23607777 నంబర్‌కు కాల్ చేసి మీ స్లాట్‌ను బుక్ చేసుకోండి. ఈ సేవలు ప్రతి ఆదివారం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటలవరకు అందుబాటులో ఉంటాయి. సంతాన సాఫల్యతతో ఎదురయ్యే సవాళ్లను, ఒంటరి తల్లులను చూసి నేను తీవ్రంగా చలించిపోయా. ప్రత్యేక శిశువైద్యుల బృందం, అత్యాధునిక సాంకేతికతతో, అపోలో హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం వారి ఆరోగ్య సంరక్షణ ప్రయాణంలో మీ కుటుంబాలను ఆదుకోవడానికి సిద్ధంగా ఉంది. ప్రతి బిడ్డకు సమగ్ర సంరక్షణ అందే విధంగా పెంపొందించే వాతావరణాన్ని సృష్టించడం మా లక్ష్యం.' అంటూ పోస్ట్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉపాసన నిర్ణయాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. (ఇది చదవండి: తన ప్రెగ్నెన్సీ గురించి ఉపాసన ఇంట్రెస్టింగ్ కామెంట్స్!) View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
Sridevi Ashala: స్వానుభవమే పెట్టుబడి
అమ్మ చేతి గోరుముద్దకు ఉన్న రుచి చిన్నారులకే తెలుసు. రుచితో పాటు పోషకాలు నిండుగా ఉంటేనే పిల్లలు బలంగా ఎదుగుతారని స్వయంగా వారికి ఇష్టమైన ఆహారాన్ని తయారుచేస్తూ అందిస్తున్నారు తెలంగాణలోని భువనగిరి వాసి శ్రీదేవి ఆశల. హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో చంటిపిల్లల కోసం టమ్మీ ఫ్రెండ్లీ ఫుడ్ తయారుచేస్తూ బిజినెస్ ఉమన్‌గా రాణిస్తున్నారు. సాప్ట్వేర్ ఉద్యోగినిగా ఉన్న శ్రీదేవి పిల్లల ఆహారం వైపుగా చేసిన ఆలోచనను ఇలా పంచుకున్నారు. ‘‘ఇంజినీరింగ్ పూర్తయ్యాక పెళ్లవడంతోనే ఉద్యోగరీత్యా బెంగళూరుకు వెళ్లిపోయాను. అక్కడి పనివేళలతో పాటు ఉరుకుల పరుగుల మీద ఉండేది జీవితం. వండుకొని తినడానికి టైమ్ ఉండేది కాదు. కెరియర్ను దృష్టిలో పెట్టుకొని ఇన్స్టంట్, ఫాస్ట్ఫుడ్స్ మీద బాగా ఆధారపడేవాళ్లం. కొన్నాళ్లకు నేను ప్రెగ్నెంట్ అని తెలిసి చాలా సంతోషించాం. మాకు పుట్టబోయే బిడ్డ కోసం చాలా కలలు కన్నాం. కానీ, అబార్షన్ కావడంతో చాలా బాధ అనిపించింది. మా జీవనశైలి సరిగా లేదని డాక్టర్ చెప్పడంతో ఆలోచనల్లో పడ్డాం. పరిశోధన అంతా ఇంట్లోనే.. అప్పటి నుంచి సమతుల ఆహారం గురించి తెలుసుకోవడం, పుస్తకాలు చదవడం, ఇంట్లో ప్లాన్ చేసుకోవడం .. ఇది కూడా ఒక ప్రాజెక్ట్ వర్క్‌లా చేశాం. సేంద్రీయ ఉత్పత్తులకు పూర్తిగా మారిపోయాం. దీంతో పాటు గర్భవతులకు, చంటిపిల్లలకు కావాల్సిన పోషకాహారం ఇంట్లోనే తయారు చేయడం మొదలుపెట్టాం. బయట కొన్నవాటిలో కూడా ఏయే పదార్థాలలో ఎంత పోషకాహార సమాచారం ఉంటుందో చెక్ చేయడం అలవాటుగా చేసుకున్నాను. అడిగినవారికి తయారీ.. మా పెద్దమ్మాయి పుట్టిన తర్వాత పాపకు ఇవ్వాల్సిన బేబీ ఫుడ్‌లో ఉండే రసాయనాల పరిమాణం చెక్ చేసినప్పుడు, చూసి ఆశ్చర్యమనిపించింది. నా పాపకు కెమికల్ ఫుడ్ ఎలా తినిపించాలా అని అనుకున్నాను. అందుకే, పాపకు అవసరమైనవన్నీ ఇంట్లోనే తయారుచేసుకునేదాన్ని. మెటర్నిటీ లీవ్ పూర్తయ్యాక ఆఫీసుకు వెళితే నేను ఫిట్‌గా ఉండటం చూసి, మా ఫ్రెండ్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నావు అని అడిగేవారు. నేను చెప్పే జాగ్రత్తలు విని, మాకూ అలాంటి ఫుడ్ తయారు చేసిమ్మని అడిగేవారు. చుట్టుపక్కల వాళ్లు అడిగినా చేసిచ్చేదాన్ని చిన్నపాప పుట్టిన తర్వాత పిల్లల పోషకాహారంపై దృష్టి పెట్టడం కొంత కష్టంగానే అనిపించింది. ఓ వైపు ఉద్యోగంలో ప్రయాణాలు కూడా ఉండేవి. పిల్లల పోషకాహారంపై ఆసక్తితో పాటు అనుభవం, న్యూట్రిషనిస్టులు, మెంటార్స్ అందరూ నా జాబితాలో ఉన్నారు. దీనినే బిజినెస్‌గా మార్చుకుంటే ఎలా వుంటుంది... అనే ఆలోచన వచ్చింది. వేరే రాష్ట్రం కావడంతో.. సాప్ట్వేర్ ఉద్యోగానికి రిజైన్ చేశాను. నేనూ, మా వారు చిదానందం ఇద్దరం చేసిన పొదుపు మొత్తాలను మేం అనుకున్న యూనిట్‌కు తీసుకున్నాం. అయితే, బెంగళూరులో ఉండేవాళ్లం కాబట్టి, అక్కడే అనుకున్న యూనిట్‌ను ఏర్పాటు చేయాలనుకుంటే లైసెన్స్ దగ్గర నుంచి ప్రతిదీ కష్టమయ్యేది. ఒక మహిళ బిజినెస్ పెట్టాలంటే ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయో స్వయంగా ఎదుర్కొన్నాను. షాప్స్‌లో ప్రొడక్ట్స్ ఇవ్వాలనుకుంటే ‘రెండు– మూడు నెలలు చేసి మానేస్తారా.. ఆ తర్వాత పరిస్థితి ఏంటి’ అనేవారు. ప్రొడక్ట్స్ అమ్మడం ఇంత కష్టమా అనిపించింది. కానీ, ఏడాదిన్నరపాటు అక్కడే బిజినెస్ కొనసాగించాను. నెలకు 20 లక్షల టర్నోవర్ బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు యూనిట్ షిప్ట్ చేసి ఏడాది అవుతోంది. మొదట మేం అనుకున్న పెట్టుబడి కన్నా ఎక్కువే అయ్యింది. అయినా వదలకుండా నమ్మకంతో వ్యాపారాన్ని ముందంజలోకి తీసుకువచ్చాను. ‘కచ్చితంగా చేసి చూపిస్తాను అనే ఆత్మవిశ్వాసమే’ నా బిజినెస్‌కు పెట్టుబడి అని చెప్పగలను. నేను చూపాలనుకున్నది, చెప్పాలనుకున్నది కరెక్ట్ అయినప్పుడు ఎక్కడా ఆపకూడదు అనే పట్టుదలతో ఉన్నాను. అందుకే రెండున్నరేళ్లుగా ఈ బిజినెస్‌ను రన్ చేస్తున్నాను. ఇందులో మొత్తం 20 మందికి పైగా వర్క్ చేస్తుంటే, ప్రొడక్షన్ యూనిట్లో అంతా తల్లులు ఉండేలా నిర్ణయం తీసుకున్నాను. అమ్మలకు మాత్రమే బాగా తెలుసు పిల్లలకు ఎంత జాగ్రత్తగా, ఎలాంటి ఆహారం, ఎంత ప్రేమగా ఇవ్వాలనేది. ఆ ఆలోచనతోనే యూనిట్లో అమ్మలు ఉండేలా జాగ్రత్త తీసుకున్నాను. పిల్లల వయసును బట్టి రాగి జావ, మొలకెత్తిన గింజలు, మల్టీగ్రెయిన్స్, వెజిటబుల్స్‌తో తయారైన ఆర్గానిక్ ప్రొడక్ట్స్ తయారుచేస్తాం. నెలకు 20 లక్షలకు పైగా టర్నోవర్ చేస్తున్నాం. ఆన్లైన్ ఆర్డర్స్ ద్వారా విదేశాలకు కూడా మా ప్రొడక్ట్స్ వెళుతుంటాయి. ఒక మహిళ జాబ్ చేయడానికే ధైర్యం కావాలి. ఇక బిజినెస్ అయితే మరింత ధైర్యంతో పాటు ఇంటి నుంచి సహకారం కూడా ఉండాలి. అప్పుడే అనుకున్న వర్క్‌లో బాగా రాణిస్తాం’’ అని వివరించింది శ్రీదేవి. – నిర్మలారెడ్డి -
బుడ్డోడు చెప్పిన సమాధానం విని తలపై కొట్టిన మోదీ
-
వెన్నెల మెరుపుకి మించినది ..అంతకుమించి మరోకటి ఏముందంటే..
కార్తీక మాస సాయంత్రం. రాగి రంగులో శేషాచలం కొండ మెరుస్తూఉంది. కొందరు భక్తులు కపిల తీర్థం జలధార కింద స్నానం చేస్తున్నారు. మరికొందరు కోనేరు దగ్గర మట్టి ప్రమిదలలో నేతిదీపాలు వెలిగిస్తున్నారు. అక్కడే మెట్ల మీద కూర్చున్న ఓ పండితుడు తన శిష్యుడితో కార్తీకమాసం విశిష్టత గురించి వివరిస్తున్నాడు. ఇంతలో ఆకాశంలోకి చందమామ తొంగి చూడటం ప్రారంభించాడు. వెండి వెలుగులో ఉన్న అక్కడి వారంతా వెన్నెల స్నానం చేస్తున్నట్లుగా ఉంది. ఆ చల్లటి వెన్నెలకు పరవశించిన పండితుడు, తన శిష్యుడితో ‘‘చంద్రుడి వెలుగుకు మించి ఈ ప్రపంచంలో ఏదీ లేదు’’ అన్నాడు. అక్కడే దీపం వెలిగిస్తున్న ఓ మహిళ, పండితుడి మాటలు విని సరుక్కున తల తిప్పి చూసింది. ‘‘అదేం మాట?’’ అని చెప్పి తన పని తాను చేసుకుంటూ ఉంది. పండితుడు లేచి ఆమె దగ్గరికి వెళ్ళి ‘‘వెన్నెల మెరుపును మించింది ఏమైనా ఉంటే చెప్పమ్మా?’’ అని ప్రశ్నించాడు. ఇంట్లో చాలా పనులున్నాయని ఆ మహిళ కుటుంబ సభ్యులు ఆమెను అక్కడినుంచి ఇంటికి తీసుకెళ్ళిపోయారు. మరుసటిరోజు కూడా ఆ పండితుడు తన శిష్యుడితోటి కపిలతీర్థం జలధార చూడటానికి వచ్చి అక్కడే కూర్చున్నాడు. పాలమీగడ పాయలుపాయలుగా వర్షిస్తున్నట్లుగా ఉంది జలధార. ఆరోజు కూడా ఆ మహిళ అక్కడికి వచ్చింది. ఆమె చంకలో నెలల బిడ్డ ఉన్నాడు. భక్తిగా దేవుడికి మొక్కి దీపారాధన చేస్తోంది. ఆమె పూజ అయ్యేంతవరకు ఆగిన పండితుడు ‘‘ఏవమ్మా, నిన్న నేను చంద్రుడి వెలుగుకు మింంచి లేదని చెబితే నువ్వు ఒప్పుకోలేదు. కారణం తెలియలేదు. నేను ఎన్నో గ్రంథాలు చదివాను. పెద్దల ఆధ్యాత్మిక ఉపన్యాసాలు చాలా విన్నాను. నేనెక్కడా చంద్రుడికి మించిన వెలుగు, అంతటి మెరుపు ఉంటాయని చదువలేదు, వినలేదు. నువ్వు చెబితే తెలుసుకుందామని ఉంది’’ అని అడిగాడు. ఆ మహిళ చిరునవ్వు నవ్వుతూ తన చేతిలోని బిడ్డకు కోనేరులోని చందమామను చూపింది. ఆ పిల్లవాడు ముసిముసినవ్వులు నవ్వినాడు. ఆ పిల్లవాడి చేతితో, నీటిలో కనిపించే చందమామను తాకించింది. అలలు అలలుగా చందమామ పక్కకి వెళ్ళిపోయాడు. చందమామను పట్టుకోవాలని ఆ పిల్లవాడు నీళ్ళమీద ధబీధబీమని కొట్టినాడు. చందమామ దొరకలేదు. ‘‘అదుగో... పైకి పాయె చందమామ’’ అంటూ ఆకాశంలోని చందమామను చూపింది. ఆ బిడ్డ బోసినవ్వుతో కేరింతలు కొట్టినాడు. బిడ్డ కాలి వెండి గొలుసులు చిన్నగా మోగాయి. అప్పుడు ఆ మహిళ తన బిడ్డ నవ్వును పండితుడికి చూపిస్తూ ‘‘ఈ ప్రపంచంలో నా బిడ్డ మెరుపు ఎవరికైనా వస్తుందా?’’ అని అడిగింది. ఆమె మాటలకు ఆశ్చర్య పోయాడు ఆ పండితుడు. ‘‘నిజమే... తల్లి ప్రేమ అలాంటిది. ఏ తల్లికైనా తన బిడ్డ ముఖంలోని మెరుపు, వెలుగుతో సమానమైనవి ఏవీ ఉండవు కదా...’ అనుకుని చిన్నగా అక్కడి నుం తన శిష్యుడిని వెంటబెట్టుకుని కదిలాడు. వెనుకనే ఆ మహిళ బిడ్డనెత్తుకుని ఆకాశం వైపు చూపిస్త ‘‘చందవమ రావే... జాబిల్లి రావే...’’ అని పాడే పాట తెరలు తెరలుగా వినిపిస్తోంది. – ఆర్.సి.కృష్ణ స్వామి రాజు (చదవండి: గెలుపు.. గమనం.. మలుపు) -
షిజెల్లోసిస్..! పిల్లల్ని బంకలా పట్టేస్తాయి!
వర్షాలు కొన్ని ఆరోగ్య సమస్యల్ని వెంటబెట్టుకొస్తాయి. మరికొన్ని వ్యాధుల్ని మరింతగా పెచ్చరిల్లేలా చేస్తాయి. మరీ ముఖ్యంగా పిల్లల్లో! వాళ్లతో పాటు పెద్దల్లో కూడా. ఇది చిన్నదిగా కనిపించే పెద్ద సమస్యే. సామాన్యజనం పరిభాషలో ‘నెత్తుటిబంక విరేచనాలు’ అంటారు. విరేచనాలవుతూ ఉండగా అందులో కొద్దిగా రక్తం, మరికొద్దిగా చీములా పడుతుండటంతో ఈ పేరు. షిజెల్లా అనే ప్రజాతికి చెందిన ఓ బ్యాక్టీరియాతో వచ్చే సమస్య ఇది. కలుషితమైన నీటి వల్ల ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే వ్యాధి. నీరు కలుషితం అవ్వడానికి అనువుగా ఉండే ఈ సీజన్లో మరింత ఎక్కువగా కనిపిస్తుంది. షిజెల్లోసిస్ వ్యాధిపై అవగాహన కోసం ఈ కథనం. మానవ విసర్జకాలతో కలుషితమైన నీరు తాగడం వల్ల, ఆ నీటితో చేసిన వంటల వల్ల షిజెల్లా బ్యాక్టీరియా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిం, మానవ జీర్ణవ్యవస్థలోకి చేరి, విరేచనాలు మొదలవుతాయి. ఈ విరేచనాలు కాస్త జిగటగా, నెత్తురుతో ఉండటంతో మామూలు వాటికంటే ఎక్కువగా ఆందోళన కలిగిస్తాయి. పిల్లల్లో అందునా ఐదేళ్లలోపు వారిలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. కాబట్టి వారి విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూస్తుంటారు. లక్షణాలు: విరేచనాల్లో బంక (మ్యూకస్), నెత్తురు కనిపించడం. కడుపు పట్టేసినట్లుగా అనిపించడం (స్టమక్ క్రాంప్స్), కడుపు నొప్పి జ్వరం (జ్వరతీవ్రత 101 ఫారెన్‌హీట్ వరకు ఉండవచ్చు) వికారం, కొన్నిసార్లు వాంతులు. వ్యాప్తి ఇలా... ∙కలుషితాహారంతో : షిజెల్లా బ్యాక్టీరియాతో కలుషితమైన నీటితో తయారు చేసిన ఆహారంతో లేదా ఆ నీళ్లు తాగడం వల్ల; లేదా ఆ నీటిలో ఈదినప్పుడు నోట్లోకి వెళ్లినప్పుడు మింగడం వల్ల. వ్యక్తి నుంచి వ్యక్తికి: ఈ బ్యాక్టీరియా కలిగి ఉన్న వ్యక్తి తన పెదవుల్ని చేతులతో తాకాక అవే చేతుల్ని ఇతరులు ముట్టుకున్నప్పుడు. ఇది పిల్లల డే కేర్ సెంటర్లలో, పిల్లలను ఆడిపించే క్రష్‌లు, స్విమ్మింగ్‌పూల్స్ ద్వారా... అలాగే హైజీన్ తక్కువగా ఉండే విద్యార్థుల హాస్టల్స్, మెస్‌లు, క్యాంపస్‌లలో వ్యాపించే అవకావం ఎక్కువ. ఇక ప్రయాణాల్లో అంతగా పరిశుభ్రత పాటించని హోటళ్ల వల్ల కూడా ఒకరినుంచి మరొకరికి పాకవచ్చు. కొన్నిసార్లు కాంప్లికేషన్లు... డీ–హైడ్రేషన్‌తో : విరేచనాల కారణంగా దేహంలోని ద్రవాలను కోల్పోవడంతో డీ–హైడ్రేషన్‌కు గురికావచ్చు. ఫలితంగా తల తిరగడం (డిజ్జీనెస్); తేలిగ్గా అనిపించడం (లైట్ హెడెడ్నెస్); పిల్లల్లో కన్నీళ్లు కూడా కనిపించకపోవడం, కళ్లు లోతుకుపోయినట్లుగా కనిపించడం... మరీ చిన్నపిల్లల్లో ఈ పరిస్థితులు తీవ్రమైతే ఒక్కోసారి షాక్కూ... అటు తర్వాత ప్రాణాపాయానికి కూడా దారితీయవచ్చు. మూర్ఛ (సీజర్స్) : కొంతమంది పిల్లల్లో మూర్ఛ (సీజర్స్) కనిపించవచ్చు. జ్వర తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా జరిగే అవకావాలు ఎక్కువ. ∙మలద్వారం చివరి భాగం బయటికి జారడం (రెక్టల్ ప్రొలాప్స్) : జిగురుతో కూడిన మ్యూకస్ బంకలా పడటం వల్ల మలద్వారం చివరి భాగం బయటకు జారే అవకాశం ఉంటుంది. దీన్నే రెక్టల్ ప్రొలాప్స్ అంటారు. హీమోలైటిక్ అనీమియా : ఇది చాలా అరుదుగా మాత్రమే కనిపించే ముప్పు అయినప్పటికీ కొట్టి పారేయలేని సమస్య. నెత్తుటి విరేచనాలు అవుతుండటంవల్ల ఎర్రరక్తకణాల సంఖ్య తగ్గడం (హీమోలైటిక్ అనీమియా), ప్లేట్లెట్స్ తగ్గడం (థ్రాంబోసైటోపీనియా)... చాలా అరుదుగా ఒక్కోసారి మూత్రపిండాల వైఫల్యం కనిపించవచ్చు. టాక్సిక్ మెగాకోలన్: ఇది కూడా చాలా అరుదుగా మాత్రమే కనిపించే ముప్పు. ఇందులో పేగుల కదలిక (బవెల్ మూవ్మెంట్) మందగించి మలం ముందుకు కదలడం ఆగిపోవచ్చు. దాంతో గ్యాస్‌గానీ, మలవిసర్జన గానీ జరగకపోవచ్చు. ఇలాంటి వైఫల్యం కనిపింనప్పుడు దీన్ని మెడికల్ ఎమర్జెన్సీగా పరిగణిం వెంటనే చికిత్స తీసుకోకపోతే పెద్దపేగు గాయపడటంతో పాటు ఒక్కోసారి ప్రాణాపాయానికీ దారితీసే ప్రవదం ఉంటుంది. బ్యాక్టీరిమియా : షిజెల్లా ఇన్ఫెక్షన్తో పేగుల లోపలి లైనింగ్ దెబ్బతినవచ్చు. దాంతో ఇలా దెబ్బతిన్న ప్రాంతం నుంచి ఇన్ఫెక్షన్ రక్తంలోకి వ్యాపిస్తుంది. ఇది కాస్త అరుదు. నివారణ కేర్‌ఫుల్ డిస్పోజల్ ఆఫ్ డయపర్స్ : చిన్న పిల్లల డయపర్స్ను జాగ్రత్తగా పారేయాలి. వీటిని నీటివనరు (వాటర్ సోర్స్)తో కలవనివ్వకుండా జాగ్రత్తపడాలి. అప్పటికే విరేచనాల, నీళ్ల విరేచనాల, నెత్తుటిబంక విరేచనాలతో బాధపడుతున్నవారు... వంట చేయడం సరికాదు. వాళ్లు కిచెన్ నుంచి దూరంగా ఉండాలి. భోజనానికి ముందు, మల విసర్జన తర్వాత తప్పనిసరిగా కనీసం 20 సెకండ్ల పాటు సబ్బుతో రుద్దుతూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. గుడ్ టాయెలెట్ హ్యాబిట్స్: పిల్లలకూ చేతులు కడుక్కునే అలవాటు నేర్పాలి. స్ల్స్కూ, పిల్లల కేర్ సెంటర్స్, ఆటస్థలాలు, పిల్లలు ఆడుకునే ప్రదేశాలు, వాళ్ల టాయిలెట్స్ పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలు స్విమ్మింగ్ పూల్స్‌లో లేదా పల్లెల్లో చెరువులు, బావుల్లో ఈదుతున్నప్పుడు ఆ నీటిని మింగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చెరువులు, వాగుల వంటి నీటి వనరు నుంచి తెచ్చిన నీటిని కాచి వడబోయకుండా తాగవద్దు. అలాగే పట్టణాల్లోన కొళాయి/నల్లా నీటిని శుభ్రం చేయడం, వడబోయడం వంటివి చేయకుండా వాడకూడదు. --డాక్టర్ శివనారాయణ రెడ్డి, సీనియర్ పీడియాట్రీషియన్ (చదవండి: కీళ్లనొప్పులా?.. ఈ ఆహారం తీసుకోండి!) -
వానాకాలం..వ్యాధులు ప్రబలే కాలం..మీ పిల్లలు జరభద్రం!
వానల్లో... మొన్నటిదాకా మండించిన ఎండలు ఇప్పుడు చల్లటి వర్షాలను తీసుకువచ్చాయి. వర్షాకాలం అంటే ఇష్టం లేనిదెవరికి? ముఖ్యంగా పిల్లలకు మరీ ఇష్టం. ఎందుకంటే కాస్త గట్టి వానలు పడితే సెలవలు వస్తాయి. ప్రస్తుతం తెలంగాణ అంతా భారీ వర్షాల కారణంగా అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. ఆంధ్రాలో కూడా కొన్ని ప్రాంతాలలో వానాకాలం సెలవలే. సెలవల వరకు బాగానే ఉంది కానీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవలసిన పెద్దలకు మాత్రం కాస్త కష్టమే. ఆ మాటకొస్తే అంటువ్యాధులు ప్రబలే ఈ కాలంలో పెద్దవాళ్లు కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఆ జాగ్రత్తలేమిటో చూద్దాం... వానరాకడా... మరొకటీ తెలియదని సామెత. ఒక్కోసారి మబ్బులు పట్టిన ఆకాశం ఉరుముతూ వర్షాలకు సిద్ధంగా ఉండమని హెచ్చరిస్తుంది. ఒకోసారి ఏవిధమైన హెచ్చరికలూ చేయకుండానే వర్షం వచ్చి మీదపడుతుంది. అందువల్ల వాతావరణ హెచ్చరికల గురించి తెలుసుకోవడం మంచిది. తగిన దుస్తులు: వర్షాకాలంలో పిల్లలే కాదు, ఎవరైనా సరే, తేలికగా ఆరిపోయే దుస్తులు ధరించడం మంది. తేలికపాటి దుస్తులను పిల్లలకు ధరింపజేయాలి. అసౌకర్యం, చికాకు కలిగించే దుస్తులను ఈ కాలంలో వారికి తొడగకపోవడం చాలా మంది. పాదరక్షల ఎంపిక: వర్షాకాలంలో మీ పిల్లలకు తగిన పాదరక్షలను ఎంచుకోండి. తడి ఉపరితలాలపై జారకుండా నిరోధించడానికి మంచి ట్రాక్షన్‌తో ఉండే వాటర్‌ప్రూఫ్ బూట్లు లేదా చెప్పులను ఎంచుకోండి. దోమల నుంచి రక్షణ: వర్షాకాలంలో దోమల వల్ల వచ్చే వ్యాధులు ఎక్కువగా ఉంటాయి. దోమల నిరోధకాలను లేదా దోమతెరలను ఉపయోగించడంతోపాటు ఇంటి చుట్టూ దోమలకు సంతానోత్పత్తి కేంద్రాలుగా వరే నీటి వనరులు ఉండకుండా చూసుకోవడం మంచిది. పరిశుభ్రత పద్ధతులు: పిల్లలకు మంచి పరిశుభ్రత అలవాట్లను నేర్పాలి. క్రమం తప్పకుండా చేతులు శుభ్రంగా కడుక్కోవడాన్ని నొక్కి చెప్పండి, భోజనానికి ముందు, టాయిలెట్ తర్వాత చేతులు శుభ్రం చేసుకోవడం అంటువ్యాధుల వ్యాప్తిని నిరోధించడంలో సహాయపడుతుంది. నీళ్లు నిలవకుండా చూసుకోవాలి ఇంటి ఆవరణలో నిలిన నీరు, నీటి కుంటలు లేదా మురికి గుంటలు ఉన్న ప్రదేశాలలో ఆడుకోవడం వల్ల కలిగే ప్రమాదాల గురిం పిల్లలకు అవగాహన కల్పించండి. అటువంటి నీటిలో వ్యాధులకు కారణమయ్యే హానికరమైన బ్యాక్టీరియా, వైరస్లు ఉంటాయి కాబట్టి నిల్వ ఉన్న నీటి లో ఆడకుండా చూడండి. ఆహార భద్రత: వర్షాకాలంలో ఆహార పరిశుభ్రతపై అదనపు శ్రద్ధ అవసరం. స్ట్రీట్ ఫుడ్ లేదా అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశాలలో నిల్వ ఉండే ఆహారం తీసుకోకుండా చూడాలి. పండ్లు, క్యారట్, బీట్రట్ వంటి పచ్చి కరగాయలను తినేముందు శుభ్రంగా కడుక్కోవడం తప్పనిసరి చేయడం అవసరం. తగినంత వెంటిలేషన్: భారీ వర్షాల సమయంలో కిటికీలు మూసి ఉంచడం చాలా కీలకమైనప్పటికీ, మీ ఇంటిలో సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవడం తేమ పెరగకుండా నిరోధించడానికి, ఆరోగ్యకరమైన ఇండోర్ వాతావరణాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది. అలర్జీలు, ఆస్తమా నిర్వహణ: మీ పిల్లలకు అలర్జీలు లేదా ఆస్తమా ఉన్నట్లయితే, వర్షాకాలం వారి ఇబ్బందులను మరింత తీవ్రతరం చేస్తుంది. ఇలాంటప్పుడు ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో ముందుగానే మీ ఫ్యామిలీ డాక్టర్‌ను అడిగి తెలుసుకోవడం, అవసరమైతే తగిన మందులను సిద్ధం చేసుకోవడం మంచిది. పరిశుభ్రమైన నీరు: కాచి చల్లార్చిన నీటిని తాగడం పిల్లలకే కాదు, పెద్దలకూ మంచిదే. రింగ్వార్మ్: ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎరుపు, రింగ్–ఆకారపు దద్దురును కలిగిస్తుంది. దురద లేదా పొలుసులుగా ఉంటుంది. ఇది శరీరంలోని ఏ భాగానికైనా రావచ్చు, తలమీద, గజ్జల్లో , పాదాలపై సర్వసాధారణంగా ఉంటుంది. దీని బారినుంచి పిల్లలను రక్షించుకోవాలి. ఈ కాలంలో రోజువారీ తీసుకోవాల్సిన సూపర్‌ఫుడ్ మారుతున్న సీజన్‌తో, ఆహార శైలులను కూడా మార్చడం అత్యవసరం. వ్యాధులు పెరుగుతున్న సమయంలో కొన్ని ఆహారాలు, సుగంధ ద్రవ్యాలను తీసుకోవాలి. పసుపు కలిపిన పాలు, శొంటి కషాయం, విటమిన్ సి అధికంగా ఉండే ఆహారం, మొలకలు వంటి ఆరోగ్యకరమైన రుతిండి ఇవ్వాలి. పెరుగు వంటి ప్రోబయోటిక్స్ పిల్లల్లో మం బ్యాక్టీరియాను పెంచటానికి సహాయపడుతుంది. ఇది చెడు బ్యాక్టీరియా లేదా వ్యాధిని కలిగించే బ్యాక్టీరియాలతో పోరాడటానికి సహాయపడుతుంది. ఆకుపచ్చ కరగాయలు పోషకాలతో నిండి ఉంటాయి. వెల్లుల్లి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అల్లంలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి కాబట్టి ఏదోరకంగా పిల్లలకు ఇవ్వాలి. తప్పనిసరిగా తీసుకోవలసిన జాగ్రత్తలు చర్మాన్ని శుభ్రంగా, పొడిగా ఉంచండి: ఈత లేదా స్నానం చేసిన తర్వాత పూర్తిగా శరీరాన్ని ఆరనివ్వటం మంచిది. (చదవండి: దెబ్బ తగిలిన ప్రతీసారీ టీటీ ఇంజెక్షన్ తీసుకోవాల్సిందేనా? ఎలాంటప్పుడూ అవసరం?..) -
చిన్నపిల్లలే!.. వారికేం తెలియదు అనుకుంటే..పప్పులో కాలేసినట్లే..
మా అమ్మాయి పసికూన" .. "అబ్బాయి బుడ్డోడు" .. "ఇంకా ఏమీ తెలియదు" . ఇదే తల్లితండ్రుల ఆలోచనలు . మీ ప్రేమ చల్లగుండా. పిల్లలు దేవుడు చల్లని వారే .. కల్లాకపటం ఎరుగని కరుణామయులే. కానీ ..మధ్యలో స్మార్ట్ ఫోన్ .. స్మార్ట్ టీవీలు దురాయి స్వామి. అమాయకత్వం అర్హత కాదు. గురువు / తల్లితండ్రి సరైన రీతిలో ఎడ్యుకేట్ చెయ్యకపోతే పిల్లలు బయటి సమాజం నుంచి నేర్చుకొంటారు . చెడుదారిలో వెళ్లి పోతారు ." అయ్యో .. అప్పుడే ఇంత చిన్న వయసులో ఇలా చేస్తుందని అనుకోలేదు" అని అప్పుడు ఏడిస్తే లాభం ఏంటి ? దీని గురించి మానసిక శాస్త్ర పరిశోధకులు వాసిరెడ్డి అమర్నాథ్ గారు ఏం చెప్పారో ఆయన మాటల్లోనే చూద్ధాం. ఒకసారి నేను హైస్కూల్ పిల్లలకు ఇచ్చిన హోం టాస్క్‌లో..ఐఐటీ విద్యార్థులు కూడా, ఆత్మ హత్యలు చేసుకొంటున్న ఘటనలు జరుగుతున్నాయి . దీనికి గల కారణాలను చర్చించి, పరిష్కార మార్గాలను సూచించండి. ఇటీవలి కాలంలో ఉన్నత విద్య చదివిన కొంతమంది అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తున్నారు. కారణాలను, పరిష్కార మార్గాలను చర్చించండి, తదితరాల గురించి ఇచ్చాం. వారు ఇంట్లో తల్లిదండ్రులతో అవసరమయితే బంధువులతో చర్చించి సమాచారం సేకరించి చర్చకు సిద్ధం కావాలి. అటుపై క్లాస్ రూమ్ లో మెంటార్ పర్యవేక్షణలో డిబేట్ జరుగుతుంది. కొంతమంది తల్లితండ్రులు ఈ ప్రశ్నల పట్ల అభ్యంతరం వ్యక్తం చేసారు. "మా పిల్లలు ఇంకా పసివారు. వారికి ఆత్మ హత్యలు, ప్రేమలు- పెళ్లిళ్లు వీటి గురించి తెలుసుకోవలసిన అవసరం, వయసు రాలేదు. అనవసరంగా పసి మనుసుల్లో నెగటివ్ విషయాలు చొప్పించకండి. వీటిని మేము పిల్లలతో చరించడానికి రెడీగా లేము ", "తలితండ్రులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఆ ప్రశ్నల్ని మార్చండి ."-- నేను మా ఎగ్జిక్యూటివ్స్‌కి ఇచ్చిన ఆదేశం. నిన్న నా క్లాస్. క్లాస్ తరువాత క్వశ్చన్- ఆన్సర్ సెషన్. ఆ సెషన్లో ఏడవ తరగతి అమ్మాయిలు అడిగిన ప్రశ్నలు కొన్ని . 1 . మా అపార్ట్మెంట్లో మా ఫ్రెండ్ ఒక అమ్మాయి స్నాప్ చాట్‌లో ఇంకో అమ్మాయితో చాట్ చేస్తోంది. నేను చూసి అది అమ్మాయి కాదు అని చెప్పాను. ముందుగా నా మాట నమ్మలేదు . తరువాత అది నిజమని తేలింది. ఇప్పుడు వాడు, మా ఫ్రెండ్‌ని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు . తాను డిప్రెషన్ లో ఉంది. సూసైడ్ చేసుకుంటానంటోంది. ఇప్పుడు నేనేమి చెయ్యాలి ? 2 . మేము మా అపార్ట్మెంట్ బయట ఆడుకొంటాము. ఆ టైంలో ఎక్కడినుంచో ఒక గ్యాంగ్ అబ్బాయిలు వస్తారు. మమ్మల్ని టీజ్ చేస్తారు. వల్గర్ మాటలు మాట్లాడతారు . ఒక అంకుల్‌కి చెప్పాము . అయన అక్కడ ఉన్నప్పుడు వారు రారు. అయన వెళ్ళిపోగానే మళ్ళీ వస్తారు . ఏమి చెయ్యాలి ? ౩. మా క్లాసులో కొంతమంది అబ్బాయిలు మాకు నిక్ నేమ్ పెడుతున్నారు. మమల్ని వేరే అబ్బాయిలతో లింక్ చేసి మాట్లాడుతున్నారు. మన స్కూల్ ఇది తక్కువ. మా అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ అయితే, వారి స్కూల్లోఇది ఇంకా ఎక్కువ తట్టుకోలేక పోతున్నామని చెబుతున్నారు. ఏమి చెయ్యాలి. 4 . అబ్బాయి తప్పు చేసినా, పెద్దలు అమ్మాయినే నిందిస్తారు . ఎందుకు ? 5 . పొట్టి బట్టలు వేసుకొంటే పెద్దలు అమ్మాయిని తప్పుపడుతారు . అబ్బాయికి సంస్కారం చెప్పారా ?. 6 . తన బెస్ట్ ఫ్రెండ్ కావాలని ఒక అబ్బాయి నన్ను ఒత్తిడి చేస్తున్నాడు . నేనేమి చెయ్యాలి ? 7 . ఏదో తరగతిలో ప్రేమ లో పడడం తప్పు . కానీ అబ్బాయిలను బెస్ట్ ఫ్రెండ్ చేసుకొంటే తప్పు అవుతుందా ? 8 . మా బంధువుల అమ్మాయి ... 25 ఏళ్ళు వుండొచ్చు. తన ఫ్రెండ్స్ పెళ్లి చేసుకొని హుస్బేండ్స్ చేతిలో నరకాన్ని అనుభవిస్తున్నారు. లేదా బ్రేక్ అప్ అయిపొయింది. కాబట్టి పెళ్లి చేసుకోనటోంది. ఏమి చెయ్యాలి ? సునామిలా ఇలా ప్రశ్నలు వరుసగా దూసుకొస్తూనే వున్నాయి. వారికి అర్థం అయ్యే రీతిలో అన్నింటికీ సమాధానాలు చెప్పాను. ఉదాహరణకు ఎనిమిదో ప్రశ్న కు .. ఔటర్ రింగ్ రోడ్డు పై... హైదరాబాద్ - విజయవాడ హై వే ప్రతి రోజు కొన్ని ప్రమాదాలు - మరణాలు జరుగుతున్నాయి . కాబట్టి నేను రోడ్డుపై ట్రావెల్ చెయ్యను . మలేసియా విమానం, నేపాల్ విమానం కూలిపోయాయి . కాబట్టి నేను విమానం ఎక్కను - హాల్లో నవ్వులు . గుండెపోట్లు ఎక్కువగా వ్యక్తి నిద్రపోతున్న సమయంలో జరుగుతున్నాయి. కాబట్టి నేను ఇక నిద్రే పోను ... ఇంకా పెద్ద పెట్టున నవ్వులు. అసలు గుండె ఉంటేనే గుండెపోటు. కాబట్టి నేను గుండెను తీసేస్తాను .. పగల బడి నవ్వులు. ప్రతి సంవత్సరం టీచర్లను ఇంకా ఎగ్జిక్యూటివ్స్‌ను ఎంపిక చేస్తుంటాను. నిజానికి ఒక తప్పు చేస్తే .. పిల్లల్ని చెరపట్టే ఫెడోఫిలిస్ట్ని ఎంపిక చేస్తే ? రిస్క్ ఉంది కదా ? అవతలివారి సైకాలజీని అర్థం చేసుకొనే సామర్థ్యము అంటే సామజిక తెలివి తేటలు పెంచుకొని ముందుకు సాగుతున్నాను . జీవితంలో తన పెర్సనాలిటీ ఏంటో తెలుసుకొని తనకు కావలసిన వ్యక్తి ఎలా ఉండాలో నిర్ణయించాలంటే మానసిక పరిణతి కావాలి . ఏదో ఎర్రగా బుర్రగా వున్నాడు. స్వీట్ మాటలు చెబుతున్నాడు. మహేష్ బాబులా వున్నాడు అని ట్రాప్ లో పడితే లైఫ్ నాశనం. పెద్ద చదువులు చదివినా.. మంచికి చెడుకి తేడా తెలియని బేలతనంతో ఈజీగా మోసపోతున్నారు. కాబట్టి మంచిగా చదువుపై దృష్టి పెట్టి .. మీరు స్లెటర్స్, కాబోయే లీడర్స్‌గా, అలాగే క్రిటికల్ థింకింగ్ , లాటరల్ థింకింగ్ , కాంప్లెక్స్ ప్రాబ్లెమ్ సొల్వింగ్ స్కిల్స్ ఎంపతీ, సోషల్ అండ్ ఎమోషనల్ ఇంటలిజెన్స్-- మీలో పెంపొందాలే చూసుకోండి. ఈ క్లాస్ అందుకే . దయచేసి తల్లిదండ్రుల్లారా ముందుగానే మేల్కోండి వారికి పెద్దయ్యాక మంచి చెడు చెబుదామని వెయిట్ చేయకండి. ఎందుకంటే ఇప్పుడున్న ఫాస్ట్ టెక్నాలజీకి వారికి అన్ని తొందరగానే అర్థమైపోతున్నాయన్న విషయం ఈ సెషన్లో వారడగిన్న ప్రశ్నల తీరే నిదర్శనం. సో ముందుగానే పిల్లలని గమనించి మంచి చెడు చెప్పి పక్కదోవ పట్టకుండా కాపాడుకోండి. వాసిరెడ్డి అమర్ నాథ్ మానసిక శాస్త్ర పరిశోధకులు, ప్రముఖ విద్యావేత్త -
విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి మిడ్‌మానేర్‌లో దూకిన తల్లి
సాక్షి, రాజన్న సిరిసిల్ల: జిల్లాలో విషాదం చోటుచేసకుంది. బోయినపల్లి మండలం శభాష్‌పల్లి వంతెన వద్ద పిల్లలతో సహా ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. కడుపున పుట్టిన ముగ్గురు బిడ్డలతో కలిసి బుధవారం మిడ్ మానేరు రిజర్వాయర్‌లోకి దూకి ప్రాణాలు విడిచింది. మృతుల్లో పద్నాలుగు నెలల పసికందు కూడా ఉండటం మనసుని కలిచివేస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను నీటిలోంచి వెలికితీశారు. చనిపోయిన వారిని తల్లి రజిత, అయాన్(7), అశ్రజాబిన్(5), ఉస్మాన్ అహ్మద్(14నెలలు)గా గుర్తించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా వేములవాడ అర్భన్ మండలానికి చెందిన రజిత, కరీంనగర్‌లోని సుభాష్ నగర్‌కు చెందిన మహ్మద్ అలీది ప్రేమ వివాహం. ఈ క్రమంలో పుట్టింటికి వెళ్లి వస్తానని చెప్పి పిల్లలు కలిసి బయల్దేరింది. అప్పటి నుంచి కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో నేడు మిడ్ మానేరులో నాలుగురిని విగత జీవులుగా గుర్తించారు. కుటుంబ కలహాల వల్లే మహిళ ఇంతటి దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: సారీ కవిత నా వల్ల మాటలు పడ్డావ్.. తల్లీకొడుకు ఆత్మహత్యాయత్నం -
చిన్నారులూ... కిడ్నీలో రాళ్లు...!
పెద్దవాళ్లతో పోలిస్తే చిన్నపిల్లల మూత్రపిండాల్లో రాళ్లు రావడం అంతే సాధారణం కాదుగానీ... అరుదు మాత్రం కాదు. గణాంకాల ప్రకారం పదహారేళ్లలోపు వారిలో 5 నుంచి 6 శాతం మంది పిల్లల్లో కిడ్నీలో రాళ్లు వస్తుంటాయి. కిడ్నీల్లో రాళ్లు వచ్చే కండిషన్‌ను ‘నెఫ్రోలిథియాసిస్’ అంటారు. కారణాలు: పిల్లల కిడ్నీల్లో రాళ్లు తయారు కావడానికి అనేక కారణాలున్నాయి. వాటిల్లో ముఖ్యమైనవి... ► ఆహారంలో రాళ్లను కల్పించే రసాయన గుణాలు ఉండటంతో పాటు కొంతవరకు వాతావరణం, ఆర్థిక–సామాజిక పరిస్థితులు. (పేదవర్గాల్లో కలుషితాహారం తీసుకునే ఆర్థిక సామాజిక పరిస్థితులు మూత్రపిండాల్లో రాళ్లకు దారితీసే అవకాశాలు ఎక్కువ. వారు తీసుకునే ఆహారాలను బట్టి అవి క్యాల్షియం కార్బొనేట్, ఆక్సలేట్స్, ఫాస్ఫరస్, యూరిక్ యాసిడ్, స్ట్రువైట్ స్టోన్, సిస్టీన్ వంటి రాళ్లను ఏర్పరవచ్చు. వాటిని బట్టి ఫలానా ఆహారనియంత్రణ పాటించాలంటూ డాక్టర్లు సూచిస్తుంటారు). ► పిల్లల్లో తరచూ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తున్న సందర్భాల్లో మూత్రపిండాల్లో రాళ్లకు దారితీయవచ్చు. ► కొందరిలో ఎండోక్రైనల్ సమస్యలు ► కొన్ని జన్యుపరమైన అంశాలు ► కిడ్నీలో రాళ్లు కనిపించిన పిల్లల్లో మెటబాలిక్ డిజార్డర్స్ ఏవైనా ఉన్నాయా అని కూడా డాక్టర్లు అన్వేషిస్తారు. లక్షణాలు: ► జ్వరం ► తీవ్రమైన కడుపు నొప్పి, తీవ్రమైన నడుము నొప్పి ► మూత్రంలో రక్తం కనిపించడం ► వాంతులు ► కొన్ని సందర్భాల్లో ఎలాంటి లక్షణాలూ కనిపించకపోవచ్చు కూడా. నిర్ధారణ : ► కొన్ని రొటీన్ మూత్రపరీక్షలు, ► రీనల్ ఫంక్షన్ టెస్ట్, ► రీనల్ స్కాన్ ► కొన్ని మెటబాలిక్ పరీక్షలు చేయించడం అవసరం. (రీనల్ స్కాన్స్, మెటబాలిక్ పరీక్షల సహాయంతో రాయి తాలూకు రసాయన స్వభావం తెలుసుకుంటారు. దానిపైనే చికిత్స ఆధారపడి ఉంటుంది. జాగ్రత్తలు / చికిత్స: కిడ్నీల్లో స్టోన్స్ వచ్చేందుకు అవకాశం ఉన్న పిల్లలు నీళ్లు ఎక్కువగా తాగడం; పొటాషియమ్ ఎక్కువగా ఉండే ద్రవాహారాల్ని తీసుకోవడం; కొవ్వులు ఎక్కువగానూ, పిండిపదార్థాలు తక్కువగా ఉంటే ఆహారాలకు దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తక్కువగా తీసుకోవాలి. పిల్లల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉంటే వెంటనే చికిత్స చేయించాలి. చాక్లెట్ల వంటి వాటిని తగ్గించాలి. ఉప్పు తక్కువగా తీసుకోవాలి. అలాగే ఉప్పు మోతాదు ఎక్కువగా ఉండే చిప్స్, పచ్చళ్లు వంటి ఆహారాలకు దూరంగా ఉండాలి. పాల ఉత్పాదనలు, మాంసాహారం, చీజ్ వంటి ఆహారాలను తగ్గించాలి. చికిత్స : ఈ రాయి పరిమాణం చాలా చిన్నదిగా ఉంటే దానంతట అదే మూత్రంతో పాటు పడిపోతుంది. ఒకవేళ రాయి పరిమాణం పెద్దదిగా ఉండి, దేనికైనా అడ్డుపడుతుంటే షార్ట్వేవ్ లిథోట్రిప్సీ వంటి అధునిక పద్ధతులతో రాయిని పొడిపొడి అయ్యేలా బ్లాస్ట్ చేయడం, అదీ కుదరనప్పుడు చివరగా యూరాలజిస్ట్ ఆధ్వర్యంలో శస్త్రచికిత్స అవసరమవుతుంది. -
హైదరాబాద్‌లో విషాదం: ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ బన్సీలాల్ పేట్ డివిజన్ జివై రెడ్డి బస్తీలో దారుణం చోటు చేసుకుంది. ఓ తల్లి తన పిల్లలిద్దరినీ భవనంపై నుంచి పడేసి అనంతరం తాను దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. గత కొన్ని రోజులుగా మహిళ భర్త అదనపు కట్నం కోసం వేధింపులు మొదలుపెట్టాడు. దీంతో తట్టుకోలేక ఆమె ఎనిమిదో అంతస్తు నుంచి తన ఇద్దరు పిల్లలను కిందికి పడవేసి అనంతరం తానూ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మునీరు అవుతున్నారు. పోలీసులు మృతదేహాలను గాంధీ ఆస్పత్రి తరలించారు. చదవండి: కూల్చాల్సిన భవనాలెన్ని..కొట్టేయాల్సిన చెట్లెన్ని..? -
అమెజాన్ అడవుల్లో గ్రేట్ ఎస్కేప్
-
చిన్న పిల్లలను ఇలా ఎత్తుకుపోతున్నారు
-
దయనీయ స్థితిలో ముగ్గురు అమ్మాయిల కథ
అమ్మ దూరమైంది.. నాన్న జైలు పాలయ్యాడు.. అలాన లేదు.. పాలనలేదు.. ఆకలికి అన్నం లేదు.. పస్తులు ఉంటున్నారు.. కాలే కడుపుతో తల్లడిల్లుతున్నారు.. ఆకలి తీర్చుకోవడానికి బిక్షాటన చేస్తున్నారు. నాన్న చేసిన తప్పుకు పిల్లలేందుకు శిక్ష అనుభవిస్తున్నారు.. అకలితో అలమటిస్తున్నా ముగ్గురు పిల్లలపై స్పెషల్ రిపోర్టు.. సాక్షి, ఆదిలాబాద్: కన్నకూతుళ్లను అమ్మిన కేసులో ఆదిలాబాద్ జిల్లా బంగారి గూడలో నివసించే గంగాధర్ అరెస్టై జైలుపాలయ్యారు.. గంగాధర్, ఆయన భార్య రాధ బంగారి గూడలో కూలీ పనులు చేసుకోని జీవనం సాగించేవారు. వీరికి ఆడపిల్లలు ఉన్నారు. మగబాబు కావాలని భావించారు. ఈ క్రమంలో గతేడాది రాధ మరోసారి గర్భం దాల్చింది. కానీ ఈసారి కూడా ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. ఆ తర్వాత అనారోగ్య కారణాలతో ఆమె మరణించింది. అయితే అప్పటికే గంగాధర్ ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు. మళ్లీ ఇద్దరు కవలలు జన్మించడంతో అయిదుగురి పిల్లల పెంపకం భారమైంది. కుటుంబాన్ని పోషించే స్థోమత లేక భార్య చనిపోయిన తర్వాత ఎనిమిది నెలల క్రితం ఇద్దరు ఆడ పిల్లలను అమ్మేశాడు తండ్రి గంగాధర్. కర్ణాటకకు చెందివారికి మూడు లక్షలకు కూతుర్లను అప్పగించాడు. అయితే అమ్మకం దందా బయట పడటంతో పోలీసులు గంగాధర్‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. గంగాధర్ జైలు పాలుకావడంతో ముగ్గురు అడ పిల్లలు దిక్కులేని పక్షులయ్యారు. ఇంటి వద్ద అమ్మ లేదు. నాన్న లేడు. తల్లిని కోల్పోయిన పిల్లలను గంగాధర్ ఇన్ని రోజులు కూలీ పనులు చేసి పోషించేవాడు. కానీ ఇప్పుడు అతడు కూడా జైలుగోడల మధ్య మగ్గుతున్నాడు. దీంతో పిల్లలు అనాథలయ్యారు. కనీసం తినడానికి తిండలేక. ఇబ్బందులు పడుతున్నారు. ఆకలికి అన్నం దొరక్క పస్తులు ఉంటున్నారు. కడుపు నిండా తిండిలేక.. కంటి నిండా నిద్రలేక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు.. ఆకలికి తీర్చుకోవడానికి వాళ్ల తాతతో కలిసి బిక్షాటన చేస్తున్నారు. బిక్షాటనలో అన్నం దొరికితే తింటున్నారు. లేదంటే పస్తులు ఉంటున్నారని పిల్లల తాత అవేదన వ్యక్తం చేశారు. పిల్లలను, తమను చూసే వాళ్లు ఎవరు లేరని వాపోయారు. కనీసం పిల్లల ఆకలిని తీర్చడానికి దాతలు, ప్రభుత్వం ముందుకొచ్చి ఆదుకోవాలని వేడుకున్నారు. -
రోజుకు 3 గంటలు చూసేస్తున్నారు.. అమేజాన్ సర్వేలో షాకింగ్ విషయాలు
వేసవి సెలవుల్లో పిల్లలు కనీసం 3 గంటలు ఫోన్ లేదా కంప్యూటర్ స్క్రీన్‌తో గడుపుతున్నారని దేశంలో 85 శాతం మంది తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నట్టు ‘అమేజాన్’ నిర్వహించిన తాజా సర్వే వెల్లడించింది. దీనివల్ల పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యం దెబ్బ తింటుందని వారు భయపడుతున్నారు. పిల్లల్ని ఆరోగ్యకరమైన వ్యాపకాల్లో పెట్టాలని వారంతా కోరుకుంటున్నారు. కాకుంటే పిల్లల్ని స్క్రీన్ మీద నుంచి దృష్టి మళ్లించేలా చేయడమే అసలు సమస్య. మన దగ్గర సమయం లేక పిల్లల్ని ఎలా ఎంగేజ్ చేయాలో తెలియక వారి చేతుల్లో పెడుతున్న ఫోన్ ఇవాళ విశ్వరూపం చూపిస్తున్నదని అమేజాన్ సంస్థ తాజాగా కాంటార్ అనే ఏజెన్సీ ద్వారా నిర్వహించిన సర్వే చెబుతోంది. 10 మెట్రో, నాన్ మెట్రో నగరాల్లో 750 మంది తల్లిదండ్రులను సర్వే చేయగా 69 శాతం మంది ఇప్పుడు మొదలైన వేసవి సెలవుల్లో పిల్లలు మూడు గంటలకు మించి ఫోన్‌గాని కంప్యూటర్ స్క్రీన్గాని చూస్తున్నారని అంగీకరించారు. మొత్తం 85 శాతం మంది తమ పిల్లలు అవసరానికి మించి ఫోన్లు చూస్తున్నారని ఇందుకు తాము చాలా ఆందోళన చెందుతున్నామని తెలియచేశారు. అంతంత సేపు వాళ్లు ఫోన్ చూడటం వల్ల మజ్జుగా ఉండటమే కాదు సోమరులుగా తయారవుతున్నారు. నిద్ర లేమితో బాధపడుతున్నారు అని తెలియచేశారు. ► రెక్కలు కత్తిరించి అయితే ఈ తప్పు పిల్లలదా? వారు నిజంగా ఆడుకోరా? గెంతరా? అల్లరి చేయరా? అంటే చేస్తారు. కాని ఆటస్థలాలు లేకపోవడం, వీధుల్లో ఆడలేకపోవడం, అపార్ట్మెంట్లలో సెల్లార్లు ఉన్నా ఆడటానికి కమిటీలు అంగీకరించకపోవడం, పార్క్‌లు నామమాత్రంగా ఉండటం... వీటన్నింటి వల్ల రోజువారి జీవితంలో బడి నుంచి వచ్చాక మాత్రమే వారు ఫోన్ చేతిలోకి తీసుకునేవారు. తల్లిదండ్రుల ఉద్యోగాల వల్లో, పని వొత్తిడి వల్లో, పిల్లలతో గడిపే సమయం వారు తమ ఫోన్‌కు ఇస్తున్నందు వల్లో పిల్లలు ఫోన్ చూస్తున్నా చూసి చూడనట్టు ఊరుకుంటున్నారు. ఇప్పుడు వేసవి సెలవుల్లో వారికి ఆ అలవాటు వ్యసనం స్థాయికి వెళ్లడం, నివారిస్తే అలగడం మనస్తాపం చేస్తుండటంతో తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో పడుతున్నారు. ► ఇలా చేయాలని ఉంది సర్వేలో ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులను ‘మీ పిల్లలు ఈ సెలవుల్లో ఏం చేస్తే బాగుంటుందని ఆశిస్తున్నారు’ అనే ప్రశ్నకు ఇంగ్లిష్ నేర్చుకోవడం (50 శాతం), నైతిక విషయాలు సంఘ మర్యాదలు తెలుసుకోవాలి (45 శాతం), కళలు నేర్చుకోవాలి (36 శాతం), ఆడుకోవడం విహారాలు చేయడం (32 శాతం) సమాధానం చెప్పాలి. అందరూ ఆశిస్తున్నది విజ్ఞానం వినోదం కలగలిసి ఉంటే బాగుంటుందని. ‘పిల్లలు కొత్త విషయాలు నేర్చుకోవాలని కోరుకుంటారు. ఫోన్ చూసే సమయాన్ని తగ్గించి కొత్త విషయాలు నేర్పించడంలో వారిని ఉత్సాహపరచాలని ఉంది అని చాలామంది తల్లిదండ్రులు మాతో అన్నారు’ అని సర్వే చేసిన కాంటార్ ఏజెన్సీ ప్రతినిధి తెలియచేశారు. ► మెల్లగా మళ్లించాలి స్క్రీన్ టైమ్‌ను తగ్గించాలంటే అది ఒక్కసారిగా బంద్ చేయకుండా మెల్లగా తగ్గించాలని నిపుణులు పేర్కొంటున్నారు. ఫోన్లు రీచార్జ్ చేయకుండా నిరుత్సాహ పరచడం, ఇంట్లో రౌటర్ ఉంటే దానిని తరచూ ఆఫ్ చేస్తూ ఉండటం, ఈ పుస్తకం చదివితే ఫోన్ ఇస్తాను, కాసేపు ఆడుకుంటే ఇస్తాను, ఫ్రెండ్స్‌ను కలిసి వచ్చాక ఇస్తాను అని వారిని దారి మళ్లించడం, విహారాలకు తీసుకెళ్లడం, ఆడుకునే సమయం– కథలు చదివే సమయం– ఫోన్ సమయం అని టైమ్ విభజించి ఆ టైమ్ పాటించడం... అలా మెల్లగా ఫోన్ టైమ్‌ను తగ్గించాలి. పిల్లలు ఫోన్ చూడటం వల్ల వారి మానసిక, బౌతిక స్థితుల కంటే వారు చూస్తున్నది ఆరోగ్యకరమైనదో కాదో పరిశీలించే తీరికలో కూడా తల్లిదండ్రులు లేకపోతే అట్టి సర్వేలకు అందనంత తీవ్ర ఆందోళన చెందాల్సిందే. -
మాటిచ్చారు..నిలబెట్టుకున్నారు
‘మీ బిడ్డలకు నేను ఉన్నాను అక్కా..’ ఓ సామాన్య పేదరాలితో రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న మాట ఇది. ఆ ఒక్క మాట ఇద్దరు బిడ్డల ప్రాణాలకు సంజీవనిగా మారింది. ఏళ్లకు ఏళ్లు ఏడుస్తూ బతుకుతున్న ఆ కుటుంబంలో ఆశల దీపాన్ని వెలిగించింది. చిన్నారుల చికిత్స కోసం ఆస్తులు అమ్ముకుని, అప్పులు చేస్తూ అవస్థలు పడుతున్న వారికి ఓ దారిని చూపించింది. ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ మందులతో ఆకలి తీర్చుకుంటున్న పసివాళ్లకు శాశ్వత పరిష్కారాన్ని ఇచ్చింది. సికిల్ సెల్ ఎనీమియా అనే ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న జి.సిగడాంకు చెందిన ఇద్దరు చిన్నారుల ఆపరేషన్ కోసం వైఎస్ జగన్ సర్కారు రూ.32 లక్షల నగదు విడుదల చేసింది. శ్రీకాకుళం: మండల పరిధిలోని డీఆర్ వలస గ్రామానికి చెందిన పాండ్రంగి సుబ్బలక్ష్మి, రామారావు దంపతుల కుమారులు తిరుపతిరావు(12), యశ్వంత్ (10)లు సికిల్ సెల్ ఎనీమియా అనే ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్నారు. ఈ బిడ్డల దీనస్థితిపై ‘సాక్షి’లో గత ఏడాది జూన్ 29 కథనం కూడా ప్రచురితమైంది. ఇన్నాళ్లకు ఆ ఇద్దరు చిన్నారుల జబ్బు శాశ్వతంగా నయమయ్యే మార్గం కనిపించింది. గత ఏడాది ఆగస్టు 26న విశాఖకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాగా.. ఆయన వద్దకు వెళ్లిన సుబ్బలక్ష్మి, రామారావు దంపతులు బిడ్డల పరిస్థితిని ముఖ్యమంత్రికి వివరించారు. చిన్నారులకు సాయం చేస్తానని ఆనాడే సీఎం మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఆస్పత్రిలో శస్త్ర చికిత్సకు అయ్యే ఖర్చును మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రక్తహీనతతో ఇబ్బంది.. తిరుపతిరావు, యశ్వంత్‌లు ఐదేళ్లుగా ఈ రక్తహీనత వ్యాధితో బాధ పడుతున్నారు. బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్‌తో ఈ వ్యాధి నయమయ్యే అవకాశం ఉందని తెలియడంతో.. బోన్‌మ్యారో ఇవ్వడానికి కూడా తల్లిదండ్రులు ముందుకువచ్చారు. కానీ ఆ ఆపరేషన్‌కు చాలా డబ్బు ఖర్చు పెట్టాల్సి ఉండడంతో ముందుకు వెళ్లలేకపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో విశా ఖ వెళ్లి సీఎం జగన్‌కు తమ పరిస్థితి చెప్పారు. ‘మీ బిడ్డలకు నేను ఉన్నాను అక్కా..’ అంటూ ఆప్యాయంగా మాట్లాడిన సీఎం.. ఒక్కో చిన్నారికి చికిత్సకు రూ.16 లక్షల చొప్పున రూ.32 లక్షలు మంజూరు చేశారు. హైదరాబాద్‌లోని అమెరికన్ అంకాలజీ ఇన్స్టిట్యూట్లో ముందుగా పెద్ద కుమారుడికి ఆపరేషన్ చేసి ఆ తర్వాత చిన్నోడికి కూడా శస్త్ర చికిత్స చేస్తారు. -
రాఘవ లారెన్స్ గొప్ప మనసు.. 150 మంది చిన్నారుల దత్తత
తమిళ స్టార్ హీరో, దర్శకుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ మరోసారి తన గొప్పమనసును చాటుకున్నారు. లారెన్స్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇప్పటికే ఎంతోమంది చిన్నారులకు సాయం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో 150 మంది చిన్నారులను ఆయన దత్తత తీసుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. పిల్లలతో దిగిన ఫొటోను షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. వారికి నాణ్యమైన విద్య అందించేలా కృషి చేస్తానన్నారు. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్ లారెన్స్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న 'రుద్రన్' (తెలుగులో 'రుద్రుడు') మూవీ ఆడియా లాంఛ్ కార్యక్రమంలో ఈ విషయాన్ని ప్రకటించారు. పిల్లలకు అభిమానుల ఆశీస్సులు కావాలని కోరారు. కాగా.. గతంలో గుండె సమస్యలతో బాధపడుతున్న 141 మంది చిన్నారులకు సర్జరీ చేయించిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో చిన్నారులెవరైనా.. ఆర్థిక సమస్య కారణంగా చదువుకు దూరమవుతున్నా, హార్ట్ సర్జరీ చేయాల్సిన అవసరం ఉన్నా.. వెంటనే లారెన్స్ ఛారిటబుల్ ట్రస్ట్‌ను సంప్రదించాలని లారెన్స్ విజ్ఞప్తి చేశారు. లారెన్స్ నటించిన 'రుద్రన్' తెలుగులో రుద్రుడు పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సోమవారం నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో లారెన్స్ మాట్లాడారు. సేవ చేసే విషయంలో రాఘవేంద్ర స్వామి తనను ముందుకు నడిపిస్తున్నాడని తెలిపారు. తెరపైనే కాదు.. నిజ జీవితంలో హీరోగా ఉండాలన్న తన మాతృమూర్తి చెప్పిన మాటను ఆయన గుర్తుచేసుకున్నారు. కతిరేశన్ దర్శకత్వంలో తెరకెక్కిన‘రుద్రన్’ ఈ నెల 14న విడుదలకానుంది. ఇప్పటికే ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేశారు. మరోవైపు లారెన్స్ ‘చంద్రముఖి 2’లో నటిస్తున్నారు. వాసు దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కీలక పాత్ర పోషించారు. త్వరలోనే ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. I’m extremely happy to share the news of adopting 150 children and provide them with education as a new venture from rudhran audio launch. I need all your blessings #Serviceisgod 🙏🏼 pic.twitter.com/lSwns10Grs — Raghava Lawrence (@offl_Lawrence) April 11, 2023 -
27 అంతస్థుల భవనంపై దూకుతూ పిల్లల డేంజరస్ స్టంట్లు