
‘మీరు ఇప్పుడు ప్రెగ్నెంటా?’ అని ప్రభుత్వ అధికారులు చైనాలోని మహిళలకు ఫోన్ చేసి అడుగుతున్నారు. అడిగితే అడిగారు అని సర్దుకున్నా ‘ఇంకో బిడ్డను కనవచ్చు కదా’ అని సలహా కూడా ఇస్తున్నారు. ఒకప్పుడు కఠినమైన జనన నియంత్రణ చర్యలు చేపట్టిన చైనా ఇప్పుడు అదనపు జనాభా కోసం ఎందుకు ఆరాటపడుతుంది?
ప్రధాన కారణాలలో ఒకటి చైనాలో సంతానోత్పత్తి రేటు తగ్గడం. 2035 నాటికి చైనా జనాభాలో మూడింట ఒక వంతు 60 ఏళ్ల పైబడిన వారు ఉంటారని ‘వ్యూ’ రీసెర్చి నివేదిక చెప్పింది. ‘ప్రపంచ కర్మాగారం’గా తనకు తాను గర్వించుకునే చైనాకు యువ జనాభా అవసరం ఉంది.
దీన్ని దృష్టిలో పెట్టుకొని జనాభా పెంచడానికి కృషి చేస్తోంది. జనాభా నియంత్రణ కోసం ‘వన్–చైల్డ్ పాలసీ’ని కఠినంగా అమలుచేసిన దేశంలో ఈ సరికొత్త మార్పు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
(చదవండి: వారి పిల్లలు చెట్లు దైవం, కృష్ణజింక)