పిల్లలను చంపేసి చనిపోవాలనుకుంది ఓ తల్లి..కానీ 16 ఏళ్ల తర్వాత.. | Mum Who Killed 5 Children Euthanised After 16 Years At Belgium | Sakshi
Sakshi News home page

పిల్లలను చంపేసి చనిపోవాలనుకుంది ఓ తల్లి..కానీ 16 ఏళ్ల తర్వాత..

Published Fri, Mar 3 2023 1:09 PM | Last Updated on Fri, Mar 3 2023 2:11 PM

Mum Who Killed 5 Children Euthanised After 16 Years At Belgium - Sakshi

ఓ తల్లి తన ఐదుగురు పిల్లలను చంపేసి తాను చనిపోవాలనుకుంది. కానీ అనుకోకుండా ఆమె ప్రాణాలతో బయటపడింది. ఆ తర్వాత ఆమె స్వంత అభ్యర్థన మేరకు 16 ఏళ్ల తర్వాత అనాయాస మరణం పొందింది. ఈ విషాద ఘటన బెల్జియంలో చోటు చేసుకుంది. 

అసలేం జరిగిందంటే..బెల్జియంలో 2007లో దేశాన్ని కుదిపేసిన దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ఫిబ్రవరి 27, 2007న నివెల్లెస్‌ పట్టణంలోని జెనీవ్‌వ్‌ లెర్మిట్టే అనే మహిళ 14 సంవత్సరాల కుమారుడు, నలుగురు కూతుళ్లను గొంతుకోసి చంపేసింది. ఆ చిన్నారుల తండ్రి తన తల్లిదండ్రులను చూసేందుకు మొరాకోకి వెళ్లినప్పుడూ ఆ తల్లి ఈ ఘాతుకానికి పాల్పడింది. ఆ తర్వాత ఆమె కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోవాలనుకుంది. అనుహ్యంగా ఆమె ప్రయత్నం విఫలమై ప్రాణాలతో బయటపడింది. ఐతే కోర్టు ఈ దారుణానికి ఒడిగట్టినందుకు 2008లో ఆమెకు జీవిత ఖైదు విధించింది.

ఐతే ఆమె విచారణలో చెప్పిన విషయాలు అధికారులనే కంటతడి పెట్టించాయి. "తాను ఈ దారుణానికి ఒడిగట్టినరోజు ఓ సూపర్‌ మార్కెట్‌ నుంచి రెండు కత్తులను దొంగలించినట్లు తెలిపింది. ఆ రోజు తన పిల్లలు భోజనం చేశాక తలుపులు లాక్‌ చేసి మరీ చంపేశానని చెప్పుకుచ్చింది. క్షణికమైన నిర్ణయం వల్లే నా పిల్లలందర్నీ పొగొట్టుకున్నాను. ఇది నాకు భరించలేని ఆవేదన. నా చివరి రోజుల వరకు దీన్ని అనుభవిస్తాను, ఇదే నాకు సరైన శిక్ష అని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత ఆమె తన భర్తకు విడాకులు సైతం ఇచ్చింది. ఈ విషాద ఘటన జరిగి నేటికి సుమారు 16 ఏళ్లు.  అదీగాక బెల్జియం చట్టాల ప్రకారం భరించలేని నయం చేయలేని మానసిక బాధతో భాదపడుతున్నట్లు భావించినట్లయితే అనాయాస మరణానికి అనుమతిస్తుంది.

ఆ తల్లి లెర్మిట్టే ఈ విషయాన్నే కోర్టుకి నివేదించింది. వాస్తవానికి 2019లో ఆమెను మానసిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు కూడా. అయినా ఆమె ఆ తీవ్ర మనోవేదనను మర్చిపోలేకపోతుందని, అది నయం కానిదని వైద్యులు సైతం ధృవీకరించడంతో కోర్టు ఆమెకు అనాయాస మరణానికి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు మానసిక వైద్యుల మాట్లాడుతూ..ఆమె పిల్లను చంపేసి చనిపోవాలనుకుంది, అలా జరగకుండా ఆమె బతికి బయటపడటం ఆమెను తీవ్రంగా కుంగదీసింది. ఆ క్షణికమైన నిర్ణయం కారణంగానే పిల్లలను పోగొట్టుకున్నాని అంటూ కుంగిపోయింది. ఆమె చనిపోవాలనే బలంగా అనుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆమె అనాయాస మరణం పోందినట్లు బెల్జియం స్థానిక మీడియా పేర్కొంది. బుధవారమే ఆమె అంత్యక్రియలు కూడా జరిగినట్లు పేర్కొన్నారు. 

(చదవండి: దారుణ అకృత్యానికి రెడీ అవుతున్న పుతిన్‌! ఏకంగా ఆత్మాహుతి దాడుల కోసం ప్లాన్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement