Belgium
-
నఫీసాటు సంచలనం
పారిస్: ఒక్క క్రీడాంశంలో పోటీపడి ఒలింపిక్ పతకం గెలవాలంటేనే ఎన్నో ఏళ్లు శ్రమించాల్సి ఉంటుంది. అలాంటిది ఒకే ఈవెంట్లో ఏడు క్రీడాంశాలు ఉంటే ఎంత కష్టపడాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో బెల్జియం క్రీడాకారిణి నఫీసాటు థియామ్‌ను ఎంత ప్రశంసించినా తక్కువే. ఏడు క్రీడాంశాల సమాహారమైన ‘హెప్టాథ్లాన్’లో ఆమె వరుసగా మూడో ఒలింపిక్స్‌లోనూ తమ ఆధిపత్యాన్ని చాటుకొని స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. తద్వారా ఒలింపిక్స్ చరిత్రలో హెప్టాథ్లాన్‌లో మూడు స్వర్ణాలు గెలిచిన ఏకైక క్రీడాకారిణిగా నఫీసాటు థియామ్ కొత్త చరిత్ర లిఖించింది. హెప్టాథ్లాన్‌లో 100 మీటర్ల హర్డిల్స్ రేసు, హైజంప్, షాట్‌పుట్, 200 మీటర్ల రేసు, లాంగ్‌జంప్, జావెలిన్ త్రో, 800 మీటర్ల రేసు ఉంటాయి. ఈ ఏడింటిలో ఆయా అథ్లెట్స్ సాధించిన పాయింట్ల ఆధారంగా టాప్–3లో నిలిచిన వారికి స్వర్ణ, రజత, కాంస్య పతకాలు అందజేస్తారు. పారిస్ ఒలింపిక్స్‌లో 29 ఏళ్ల నఫీసాటు 6880 పాయింట్లు స్కోరు చేసి టాప్ ర్యాంక్‌లో నిలిచింది. 2016 రియో ఒలింపిక్స్, 2020 టోక్యో ఒలింపిక్స్‌లోనూ నఫీసాటు పసిడి పతకాలు సాధించింది. ప్రస్తుత వరల్డ్ చాంపియన్ కాటరీనా జాన్సన్ థాంప్సన్ (బ్రిటన్; 6844 పాయింట్లు) రజతం, నూర్ విడిట్స్ (బెల్జియం; 6707 పాయింట్లు) కాంస్యం గెల్చుకున్నారు. -
Microsoft outage: బగ్‌తో పరిహాసమా?!
బ్రస్సెల్స్: మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో బగ్ వల్ల బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ సమస్య తలెత్తడంతో శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్ ఆధారిత సేవలు నిలిచిపోయాయి. కోట్ల డాలర్ల నష్టం వాటిల్లిందని చెబుతున్నారు. సైబర్‌సెక్యూరిటీ సంస్థ క్రౌడ్స్రై్టక్ అందించిన అప్డేట్లో బగ్ వల్లే ఈ సంక్షోభం ఏర్పడింది. ఇది చాలా తీవ్రమైన విషయం కాగా, బెల్జియం వ్యంగ్య రచయిత విన్సెంట్ ఫ్లిబస్టీర్ పరిహాసానికి దిగాడు. నెటిజన్లతో చీవాట్లు తింటున్నాడు. తాను క్రౌడ్స్రై్టక్ సంస్థలో కొత్తగా ఉద్యోగంలో చేరానని, మొదటి రోజు సాఫ్ట్‌వేర్‌లో చిన్న ఆప్డేట్ చేశానని చెప్పుకొచ్చాడు. ఈ మేరకు ‘ఎక్స్’లో పలు పోస్టులు పెట్టాడు. కోడ్‌లో కేవలం ఒక లైన్ మార్చడం వల్ల బగ్ ఏర్పడిందని తెలిపాడు. క్రౌడ్‌స్ట్రైక్ ఆఫీసులో దిగిన ఫొటోను కూడా షేర్ చేశాడు. నిజానికి అతడు ఈ సంస్థలో ఉద్యోగి కాదు. కృత్రిమ మేధ(ఏఐ) సాయంతో ఈ ఫొటో సృష్టించాడు. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ మారింది. 3.8 లక్షల లైక్‌లు వచ్చాయి. 37,000 మంది షేర్ చేశారు. కొన్ని గంటల తర్వాత విన్సెంట్ మరో పోస్టు చేశాడు. సాఫ్ట్వేర్ అప్డేట్లో బగ్ కారణంగా తనను ఉద్యోగం నుంచి తొలగించారని బాధపడ్డాడు. ఇది చాలా అన్యాయం అంటూ ఆక్రోశించాడు. తనకు ఎవరైనా ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని దీనంగా వేడుకున్నాడు. ‘ఎక్స్’ అధినేత ఎలాన్ మస్‌్కను సైతం కోరాడు. తాను బాధపడుతున్న వీడియోను పంచుకున్నాడు. నెటిజన్లు చాలామంది ఇదంతా నిజమేనని నమ్మేశారు. కానీ, నిజం దాగదు కదా! వాస్తవం ఏమిటో తెలిసిపోయింది. పిచి్చవేషాలు మానుకోవాలంటూ విన్సెంట్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. విన్సెంట్ నార్డ్ప్రెస్ అనే బెల్జియన్ పేరడీ న్యూస్ సైట్‌కు వార్తలు రాస్తుంటాడు. -
మళ్లీ ఓడిన భారత మహిళలు
మహిళల జూనియర్ హాకీ వరల్డ్ కప్‌లో భారత జట్టుకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. శనివారం జరిగిన పూల్ ‘సి’ మ్యాచ్‌లో బెల్జియం 3–2 గోల్స్ తేడాతో భారత్‌ను ఓడించింది. భారత్ తరఫున అన్ను 47వ, 51వ నిమిషాల్లో గోల్స్ సాధించింది. బెల్జియం తరఫున నోవా ష్రూయెర్స్ (5వ నిమిషం), ఫ్రాన్స్ డి మాట్ (42వ ని.), అస్ట్రిడ్ బొనామి (52వ ని.) గోల్స్ నమోదు చేశారు. తొలి, మూడో క్వార్టర్లో ఒక్కో గోల్ సాధించి ముందుగా బెల్జియం 2–0తో ఆధిక్యంలో నిలిచింది. అయితే నాలుగు నిమిషాల వ్యవధిలో అన్ను రెండు గోల్స్ సాధించి స్కోరును సమం చేసింది. అయితే చివర్లో లభించిన పెనాల్టీ స్ట్రోక్‌ను సమర్థంగా ఉపయోగించుకున్న బెల్జియం మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మరో వైపు మంగళవారం మలేసియాలోని కౌలాలంపూర్‌లో జూనియర్ పురుషుల హాకీ ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. అదే రోజు జరిగే తొలి మ్యాచ్‌లో కొరియాతో భారత్ తలపడుతుంది. -
కథక్ నుంచి తీన్మార్ వరకు ఏదైనా..వారెవా! అనేలా ఇరగదీస్తాడు!
బెల్జియన్ కంటెంట్ క్రియేటర్ ఈడీ పీపుల్ వివిధ ప్రాంతాలలో లోకల్స్‌తో కలిసి చేసే డ్యాన్స్ వీడియోలు ప్రపంచ వ్యాప్తంగా ఫేమ్ అయ్యాయి. ఏదైనా ప్రాంతానికి వెళ్లిన పీపుల్ స్థానికులను ‘మీకు ఇష్టమైన డ్యాన్స్ ఏమిటి?’ అని అడగడమే కాదు ‘నాకు నేర్పించగలరా?’ అని రిక్వెస్ట్ చేసి ఓపిగ్గా నేర్చుకుంటాడు. అలా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాలకు చెందిన డ్యాన్స్‌లను నేర్చుకుంటూ, స్థానికులతో పోటీ పడి డ్యాన్స్ చేస్తుంటాడు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా మన దేశానికి సంబంధించి వివిధ ప్రాంతాలకు చెందిన డ్యాన్స్‌లు చేసి ‘వారేవా’ అనిపించుకున్నాడు. ‘మీ డ్యాన్స్ చూస్తుంటే భారతీయ పౌరసత్వం ఇవ్వాలనిపిస్తుంది’. ‘మా దేశంలోని కొన్ని అద్భుతమై డ్యాన్స్‌లను మిస్ అయ్యారు. వాటిని కూడా చేస్తే బాగుంటుంది’ అంటూ వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఈడీ పీపుల్ షేర్ చేసిన డ్యాన్స్ వీడియోలపై నెటిజనులు స్పందించారు. View this post on Instagram A post shared by Ed People (@ed.people) (చదవండి: ఏం చిక్కొచ్చి పడింది! అటు చూస్తే.. జవాన్!.. ఇటు చూస్తే.. ఆఫీస్..!) -
ఎదురులేని వెర్స్టాపెన్.. సీజన్లో వరుసగా ఎనిమిదో విజయం
స్పా–ఫ్రాంకోర్చాంప్స్ (బెల్జియం): ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్లో రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ తనకు ఎదురేలేదన్నట్లు దూసుకుపోతున్నాడు. ఆదివారం జరిగిన బెల్జియం గ్రాండ్‌ప్రిలో వెర్స్టాపెన్ చాంపియన్‌గా నిలిచాడు. 44 ల్యాప్‌ల రేసును ఆరో స్థానం నుంచి ప్రారంభించిన వెర్స్టాపెన్ అందరికంటే వేగంగా ఒక గంటా 22 నిమిషాల 30.450 సెకన్లలో ముగించి వరుసగా ఎనిమిదో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సీజన్లో 12 రేసులు జరగ్గా వెర్స్టాపెన్ పది రేసుల్లో నెగ్గాడు. మరో రెండు రేసుల్లో రెడ్‌బుల్ జట్టుకే చెందిన సెర్జియో పెరెజ్ విజేతగా నిలిచాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్‌లో వెర్స్టాపెన్ పోల్ పొజిషన్ సాధించినా... నిబంధనలకు విరుద్ధంగా కొత్త గేర్‌బాక్స్ మార్చినందుకు అతనిపై ఐదు గ్రిడ్ల పెనాల్టీని విధించారు. దాంతో ఆదివారం జరిగిన ప్రధాన రేసును వెర్స్టాపెన్ ఆరో స్థానం నుంచి మొదలుపెట్టాడు. పెరెజ్ రెండో స్థానంలో, చార్లెస్ లెక్లెర్క్ (ఫెరారీ) మూడో స్థానంలో నిలిచారు. సీజన్‌లోని తదుపరి రేసు డచ్ గ్రాండ్‌ప్రి ఆగస్టు 27న జరుగుతుంది. ఆసియా యూత్, జూనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో పురుషుల 61 కేజీల విభాగంలో భారత లిఫ్టర్ సిద్ధాంత గొగోయ్ పసిడి పతకం సాధించాడు. గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న ఈ పోటీల్లో ఆదివారం సిద్ధాంత మొత్తం 265 కేజీలు (స్నాచ్‌లో 116+క్లీన్ అండ్ జెర్క్‌లో 149) బరువెత్తి విజేతగా నిలిచాడు. ఈ విభాగంలో భారత్‌కే చెందిన శంకర్ లాపుంగ్ (256 కేజీలు) కాంస్య పతకం గెల్చుకున్నాడు. మహిళల జూనియర్ 49 కేజీల విభాగంలో జ్ఞానేశ్వరి యాదవ్, మహిళల యూత్ 49 కేజీల విభాగంలో కోయల్ రజత పతకాలు సాధించారు. -
ప్రాక్సిమస్ గ్రూప్ గూటికి రూట్ మొబైల్
న్యూఢిల్లీ: ఎంటర్ప్రైజ్ మెసేజింగ్ సేవల సంస్థ రూట్ మొబైల్లో బెల్జియంకు చెందిన ప్రాక్సిమస్ గ్రూప్ 84 శాతం వరకు వాటాలను దక్కించుకోనుంది. ఇందులో భాగంగా ముందు దాదాపు 58 శాతం వాటాలను రూ. 5,922 కోట్లకు కొనుగోలు చేయనుంది. ఈ డీల్‌తో నిబంధనల ప్రకారం.. 26 శాతం ఓపెన్ ఆఫర్ ప్రకటించాల్సి రానుండటంతో, ఆ మేరకు షేర్లన్నింటినీ కొనుగోలు చేస్తే మొత్తం 84 శాతం వరకూ వాటాలను పెంచుకునే అవకాశం ఉంది. అయితే, లిస్టెడ్ కంపెనీల్లో పబ్లిక్ వాటా కనీసం 25 శాతం ఉండాలనే నిబంధన మేరకు 12 నెలల్లోగా కొన్ని షేర్లను విక్రయించి తన వాటాను 75%కి తగ్గించుకోవాల్సి రానుంది. షేరు ఒక్కింటికి రూ. 1,626.40 చొప్పున అనుబంధ సంస్థ ప్రాక్సిమస్ ఓపల్ ద్వారా ప్రాక్సిమస్ గ్రూప్ తమ సంస్థలో 57.56% వాటాలను కొనుగోలు చేయనున్నట్లు రూట్ మొబైల్ తెలిపింది. లావాదేవీ పూర్తయ్యాక రూట్ మొబైల్ సీఈవో రాజ్‌దీప్ గుప్తా తన ప్రస్తుత బాధ్యతల్లో కొనసాగుతూనే.. గ్రూప్ సీపాస్ (కమ్యూనికేషన్స్ ప్లాట్‌ఫాం యాజ్ ఎ సర్వీస్) కార్యకలాపాలకు సారథ్యం వహిస్తారు. రూట్ మొబైల్లో వాటాల కొనుగోలుతో అంతర్జాతీయంగా సీపాస్ విభాగంలో తమ స్థానం మరింత పటిష్టం కాగలదని ప్రాక్సిమస్ గ్రూప్ సీఈవో గిలామ్ బూటిన్ తెలిపారు. ప్రాక్సిమస్ సంస్థలో పెట్టుబడి.. ఒప్పందం ప్రకారం రూట్ మొబైల్ వ్యవస్థాపక వాటాదారుల్లో కొందరు ప్రాక్సిమస్ ఓపల్లో అలాగే ప్రాక్సిమస్కు చెందిన మరో అనుబంధ సంస్థ టెలీసైన్లో మైనారిటీ వాటాలు తీసుకోనున్నారు. ఇందుకోసం 299.6 మిలియన్ యూరోలను వెచి్చంచనున్నారు. రూట్ మొబైల్ మరింత ముందుగానే బిలియన్ డాలర్ల ఆదాయ లక్ష్యాన్ని సాధించేందుకు టెలీసైన్తో భాగస్వామ్యం ఉపయోగపడగలదని గుప్తా ధీమా వ్యక్తం చేశారు. సోమవారం బీఎస్ఈలో రూట్ మొబైల్ షేరు సుమారు 9% క్షీణించి రూ. 1,486 వద్ద క్లోజైంది. -
చివరి నిమిషంలో భారత్ ఓటమి
అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్‌లో భాగంగా ఒలింపిక్ చాంపియన్ బెల్జియంతో లండన్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్ 1–2 గోల్స్ తేడాతో ఓడిపోయింది. చివరి నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను నెల్సన్ ఒనానా గోల్‌గా మలిచి బెల్జియం జట్టును గెలిపించాడు. అంతకుముందు థిబె స్టాక్‌బ్రోక్స్ (18వ ని.లో) గోల్‌తో బెల్జియం 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే 25వ నిమిషంలో మన్దీప్ సింగ్ గోల్‌తో భారత్ 1–1తో స్కోరును సమం చేసింది. ఇక మ్యాచ్ ‘డ్రా’గా ముగియడం ఖాయమనుకున్న దశలో భారత జట్టు గోల్ సమరి్పంచుకొని మూల్యం చెల్లించుకుంది. నేడు జరిగే రెండో మ్యాచ్‌లో బ్రిటన్‌తో భారత్ తలపడుతుంది. -
పిల్లలను చంపేసి చనిపోవాలనుకుంది ఓ తల్లి..కానీ 16 ఏళ్ల తర్వాత..
ఓ తల్లి తన ఐదుగురు పిల్లలను చంపేసి తాను చనిపోవాలనుకుంది. కానీ అనుకోకుండా ఆమె ప్రాణాలతో బయటపడింది. ఆ తర్వాత ఆమె స్వంత అభ్యర్థన మేరకు 16 ఏళ్ల తర్వాత అనాయాస మరణం పొందింది. ఈ విషాద ఘటన బెల్జియంలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..బెల్జియంలో 2007లో దేశాన్ని కుదిపేసిన దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ఫిబ్రవరి 27, 2007న నివెల్లెస్ పట్టణంలోని జెనీవ్‌వ్ లెర్మిట్టే అనే మహిళ 14 సంవత్సరాల కుమారుడు, నలుగురు కూతుళ్లను గొంతుకోసి చంపేసింది. ఆ చిన్నారుల తండ్రి తన తల్లిదండ్రులను చూసేందుకు మొరాకోకి వెళ్లినప్పుడూ ఆ తల్లి ఈ ఘాతుకానికి పాల్పడింది. ఆ తర్వాత ఆమె కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోవాలనుకుంది. అనుహ్యంగా ఆమె ప్రయత్నం విఫలమై ప్రాణాలతో బయటపడింది. ఐతే కోర్టు ఈ దారుణానికి ఒడిగట్టినందుకు 2008లో ఆమెకు జీవిత ఖైదు విధించింది. ఐతే ఆమె విచారణలో చెప్పిన విషయాలు అధికారులనే కంటతడి పెట్టించాయి. "తాను ఈ దారుణానికి ఒడిగట్టినరోజు ఓ సూపర్ మార్కెట్ నుంచి రెండు కత్తులను దొంగలించినట్లు తెలిపింది. ఆ రోజు తన పిల్లలు భోజనం చేశాక తలుపులు లాక్ చేసి మరీ చంపేశానని చెప్పుకుచ్చింది. క్షణికమైన నిర్ణయం వల్లే నా పిల్లలందర్నీ పొగొట్టుకున్నాను. ఇది నాకు భరించలేని ఆవేదన. నా చివరి రోజుల వరకు దీన్ని అనుభవిస్తాను, ఇదే నాకు సరైన శిక్ష అని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత ఆమె తన భర్తకు విడాకులు సైతం ఇచ్చింది. ఈ విషాద ఘటన జరిగి నేటికి సుమారు 16 ఏళ్లు. అదీగాక బెల్జియం చట్టాల ప్రకారం భరించలేని నయం చేయలేని మానసిక బాధతో భాదపడుతున్నట్లు భావించినట్లయితే అనాయాస మరణానికి అనుమతిస్తుంది. ఆ తల్లి లెర్మిట్టే ఈ విషయాన్నే కోర్టుకి నివేదించింది. వాస్తవానికి 2019లో ఆమెను మానసిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు కూడా. అయినా ఆమె ఆ తీవ్ర మనోవేదనను మర్చిపోలేకపోతుందని, అది నయం కానిదని వైద్యులు సైతం ధృవీకరించడంతో కోర్టు ఆమెకు అనాయాస మరణానికి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు మానసిక వైద్యుల మాట్లాడుతూ..ఆమె పిల్లను చంపేసి చనిపోవాలనుకుంది, అలా జరగకుండా ఆమె బతికి బయటపడటం ఆమెను తీవ్రంగా కుంగదీసింది. ఆ క్షణికమైన నిర్ణయం కారణంగానే పిల్లలను పోగొట్టుకున్నాని అంటూ కుంగిపోయింది. ఆమె చనిపోవాలనే బలంగా అనుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆమె అనాయాస మరణం పోందినట్లు బెల్జియం స్థానిక మీడియా పేర్కొంది. బుధవారమే ఆమె అంత్యక్రియలు కూడా జరిగినట్లు పేర్కొన్నారు. (చదవండి: దారుణ అకృత్యానికి రెడీ అవుతున్న పుతిన్! ఏకంగా ఆత్మాహుతి దాడుల కోసం ప్లాన్) -
విషాదం.. లైవ్ మ్యాచ్‌లో ప్రాణాలొదిలిన గోల్ కీపర్
ఫుట్‌బాల్‌లో విషాదం నెలకొంది. లైవ్ మ్యాచ్‌లోనే గోల్ కీపర్ ప్రాణాలొదిలాడు. పెనాల్టీ కిక్‌ను సేవ్ చేసిన గోల్‌కీపర్ ఆ మరుక్షణమే ప్రాణం వదలడం అభిమానులను కలచివేసింది. ఈ ఘటన బెల్జియంలో చోటు చేసుకుంది. విషయంలోకి వెళితే..బ్రెజిల్‌కు చెందిన సెకండ్ ప్రొవిజనల్ డివిజన్ వెస్ట్ బ్రాబంట్లో వింకిల్ స్పోర్ట్ బి జట్టుకు ఆర్నే ఎస్పీల్ గోల్ కీపర్‌గా సేవలందిస్తున్నాడు. వెస్ట్రోజెబ్కేతో మ్యాచ్‌లో వింకిల్ స్పోర్ట్ జట్టు 2-1తో ఆధిక్యంలో ఉంది. రెండో సగం మరికాసేపట్లో ముగుస్తుందనగా వెస్ట్రోజెబ్కేకు పెనాల్టీ కిక్ లభించింది. అయితే గోల్‌కీపర్‌గా తన బాధ్యతను సమర్థంగా నిర్వహించిన ఆర్నే స్పిల్ పెనాల్టీ కిక్‌ను అడ్డుకున్నాడు. అయితే పెనాల్టీ కిక్‌ను అడ్డుకున్న మరుక్షణమే గ్రౌండ్‌పై కుప్పకూలాడు. ఎమర్జెన్సీ సర్వీస్ సిబ్బంది అతన్ని ఆసుపత్రికి తరలించినప్పటికి హార్ట్ ఫెయిల్యూర్‌తో అప్పటికే మరణించినట్లు వైద్యులు పేర్నొన్నారు. ఈ వార్త వింకిల్ స్పోర్ట్స్ క్లబ్లో విషాదం నింపింది. చదవండి: మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కోచ్ కన్నుమూత -
టికెట్ అడిగేసరికి బిడ్డనే వదిలేశారు!
టెల్అవీవ్: బెల్జియం పాస్‌పోర్టులున్న ఆ దంపతులిద్దరూ ఏడాది వయస్సున్న బిడ్డను తీసుకుని ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. మరికాసేపట్లో బయలుదేరే బ్రస్సెల్స్ విమానంలో వారు ఎక్కాల్సి ఉంది. ఆలస్యంగా వచ్చిన వారిని ఒకటో నంబర్ టెర్మినల్ వద్ద సిబ్బంది ఆపి టికెట్లడిగారు. రెండు టికెట్లే చూపారు. చిన్నారికి కూడా టికెట్ కావాలనే సరికి ఇదేమిటంటూ ప్రశ్నించారు. సిబ్బందితో వాదనకు దిగారు. మరో టికెట్ కొనడానికి నిరాకరించారు. పైపెచ్చు, ష్ట్రోలర్పైన చిన్నారిని అక్కడే సెక్యూరిటీ విభాగం వద్ద వదిలేసి హడావుడిగా విమానం వైపు వెళ్లిపోబోయారు. ఇది చూసి సిబ్బంది అప్రమత్తమయ్యారు. సిబ్బంది అలెర్ట్ చేయడంతో సెక్యూరిటీ అధికారులు వారిని అడ్డుకుని, పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన జనవరి 31వ తేదీన ఇజ్రాయెల్‌లోని టెల్అవీవ్లో ఉన్న బెన్ గురియన్ ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది. టికెట్ అడిగారనే కారణంతో ఏకంగా బిడ్డనే వదిలేసిన తల్లిదండ్రులను ఇప్పుడే చూస్తున్నామని అక్కడి సిబ్బంది వ్యాఖ్యానించారు. ఇలాంటి తల్లిదండ్రులు కూడా ఉంటారా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ ఘటన తమకు షాక్ కలిగించిందని సిబ్బంది తెలిపారని రియాన్ఎయిర్ విమానయాన సంస్థ అధికారి ఒకరు అన్నారు. -
Hockey World Cup 2023: హాకీ జగజ్జేత జర్మనీ
భువనేశ్వర్: 13 ఏళ్ల విరామం తర్వాత జర్మనీ జట్టు పురుషుల హాకీలో జగజ్జేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ప్రపంచకప్ హాకీ టోర్నీ ఫైనల్లో జర్మనీ ‘షూటౌట్’లో 5–4తో డిఫెండింగ్ చాంపియన్ బెల్జియం జట్టును ఓడించింది. నిర్ణీత సమయం ముగిసే సరికి రెండు జట్లు 3–3తో సమంగా నిలిచాయి. దాంతో విజేతను నిర్ణయించడానికి ‘షూటౌట్’ నిర్వహించారు. ‘షూటౌట్’లో నిర్ణీత ఐదు షాట్ల తర్వాత రెండు జట్లు 3–3తో సమంగా నిలిచాయి. ‘సడెన్ డెత్’లో తొలి షాట్లో రెండు జట్ల ఆటగాళ్లు సఫలమయ్యాయి. రెండో షాట్లో జర్మనీ సఫలంకాగా... బెల్జియం ఆటగాడు విఫలంకావడంతో జర్మనీ విజయం ఖరారైంది. ఈ గెలుపుతో ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ జట్ల తర్వాత మూడుసార్లు ప్రపంచకప్ నెగ్గిన మూడో జట్టుగా జర్మనీ గుర్తింపు పొందింది. జర్మనీ 2002, 2006ల లో టైటిల్ నెగ్గింది. కాంస్య పతకం మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 3–1తో ఆస్ట్రేలియాను ఓడించింది. -
బెల్జియం, జర్మనీ మ్యాచ్ డ్రా
భువనేశ్వర్: డిఫెండింగ్ చాంపియన్ బెల్జియం,మాజీ విజేత జర్మనీ జట్ల మధ్య మంగళవారం జరిగిన ప్రపంచకప్ హాకీ టోర్నీ లీగ్ మ్యాచ్ 2–2తో ‘డ్రా’గా ముగిసింది. పూల్ ‘బి’లో మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో బెల్జియం ఓటమి అంచున నిలిచింది. అయితే ఆఖరి క్వార్టర్లో వెగ్నేజ్ (54వ ని.లో) చేసిన గోల్‌తో ‘డ్రా’తో బయటపడింది. అంతకుముందు జర్మనీ జట్టులో వెలెన్ నిక్లస్ (22వ ని.లో), టామ్ గ్రామ్‌బుష్ (52వ ని.లో) చెరో గోల్ చేయగా, సెడ్రిక్ చార్లియర్ 9వ నిమిషంలోనే బెల్జియంకు తొలి గోల్ అందించాడు. ఈ నెల 20న జరిగే ఆఖరి లీగ్‌తో క్వార్టర్స్ బెర్త్‌లు ఖరారవుతాయి. చివరి లీగ్ మ్యాచ్‌ల్లో జపాన్‌తో బెల్జియం, దక్షిణ కొరియాతో జర్మనీ తలపడతాయి. ఈ పూల్ లో జరిగిన మొదటి మ్యాచ్‌లో దక్షిణ కొరియా 2–1తో జపాన్‌పై గెలిచింది. కొరియా తరఫున లీ జంగ్ జన్ (8వ, 23వ ని.లో) రెండు గోల్స్ చేశాడు. జపాన్ జట్టులో నగయొషి (1వ ని.లో) గోల్ సాధించాడు. అయితే జపాన్ 11 మందితో కాకుండా 12 మందితో ఆడటం వివాదం రేపింది. -
సముద్రంలో వెయ్యి మీటర్ల లోతు.. ఆహా అనిపించేలా నగరం!
ఇప్పటి వరకు మనకు జలాంతర్గాముల గురించి తెలుసు. ఇకపై జలాంతర నగరాలు కూడా సముద్ర గర్భంలో వెలిసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బ్రెజిల్‌లోని రియో డి జనీరో తీరానికి ఆవల సముద్ర గర్భంలో తొలి జలాంతర నగరం నిర్మాణానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ ఖ్యాతి పొందిన బెల్జియన్ డిజైనర్, ఆర్కిటెక్ట్ విన్సెంట్ కాలెబాట్ ఈ జలాంతర నగరానికి రూపకల్పన చేశారు. ఇరవైవేల మందికి నివాసం కల్పించేలా వెయ్యి టవర్లతో ‘ఆక్వారియా’ పేరిట ఈ జలాంతర నగరాన్ని నిర్మించనున్నారు. సముద్రంలో వెయ్యి మీటర్ల లోతు వరకు విస్తరించేలా ఈ జలాంతర నగర నిర్మాణాన్ని తలపెట్టారు. సముద్ర జలాల్లో కలిసిపోయి, కాలుష్యానికి కారణమవుతున్న పెట్రోలియం వ్యర్థాలను నిర్మూలించే లక్ష్యంతో ఈ నిర్మాణాన్ని తలపెట్టారు. త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించి, అంటార్కిటికా వద్ద పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, సముద్రపు నాచు వంటి పదార్థాలతో ఈ నగరాన్ని నిర్మించనున్నట్లు చెబుతున్నారు. -
ఓటమికి నైతిక బాధ్యత.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ఫుట్‌బాలర్
బెల్జియం జట్టు కెప్టెన్ ఈడెన్ హజార్డ్ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలికాడు. ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో బెల్జియం లీగ్ దశలోనే వెనుదిరిగిన సంగతి తెలిసిందే. బెల్జియం ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కెప్టెన్సీ పదవితో పాటు ఆటకు గుడ్‌బై చెప్పినట్లు హజార్డ్ ఇన్స్టాగ్రామ్ వేదికగా తెలిపాడు. 2008లో 17 ఏళ్ల వయసులో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అరంగేట్రం చేసిన ఈడెన్ హజార్డ్ బెల్జియం తరపున 126 మ్యాచ్‌లు ఆడాడు. అతని 14 ఏళ్ల కెరీర్లో 33 గోల్స్ నమోదు చేశాడు. లక్సమ్బర్గ్తో మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేసిన హజార్డ్ మూడు ఫిఫా వరల్డ్‌కప్స్‌తో పాటు రెండు యూరోపియన్ ఛాంపియన్షిప్స్ ఆడాడు. హజార్డ్ 56 మ్యాచ్‌ల్లో బెల్జియం జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇక ఈడెన్ హజార్డ్ తన రిటైర్మెంట్పై స్పందించాడు. ''ఈరోజు నా పేజీ ముగిసింది. 2008 నుంచి ఇప్పటివరకు నాకు అండగా నిలబడిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. థాంక్యూ ఫర్ యువర్ సపోర్ట్'' అంటూ ఎమెషనల్‌గా పేర్కొన్నాడు. రెడ్ డెవిల్స్‌గా పేరు పొందిన బ్రెజిల్ ఈసారి ఫిఫా వరల్డ్‌కప్‌లో గ్రూప్ దశకే పరిమితమైంది. క్రొయేషియా, మొరాకో, కెనడాలతో కలిసి ఒకే గ్రూప్‌లో ఉన్న బెల్జియం.. ఒకే ఒక విజయాన్ని నమోదు చేసింది. కెనడాపై విజయం అందుకున్న బెల్జియం.. మొరాకోతో మ్యాచ్‌లో 2-0తో పరాజయం పాలైంది. ఆ తర్వాత క్రొయేషియాతో మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన స్థితిలో డ్రా చేసుకోవడం బెల్జియం కొంపముంచింది. మ్యాచ్ డ్రాతో క్రొయేషియా, మొరాకోలు నాకౌట్ దశకు చేరగా.. కెనడాతో పాటు బెల్జియం ఇంటిదారి పట్టింది. View this post on Instagram A post shared by Eden Hazard (@hazardeden_10) చదవండి: మూతిపళ్లు రాలినా క్యాచ్ మాత్రం విడువలేదు FIFA WC 2022: రొనాల్డో కోసం ఏదైనా.. టాప్‌లెస్‌గా దర్శనం -
FIFA World Cup Qatar 2022: బెల్జియం అవుట్
దోహా: స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయిన ప్రపంచ రెండో ర్యాంకర్, గత ప్రపంచకప్‌లో మూడో స్థానం పొందిన బెల్జియం జట్టు తాజా మెగా ఈవెంట్లో గ్రూప్ దశలోనే ఇంటిముఖం పట్టింది. నాకౌట్ దశ బెర్త్ దక్కాలంటే గత వరల్డ్‌కప్ రన్నరప్ క్రొయేషియా జట్టుపై తప్పక గెలవాల్సిన మ్యాచ్‌ను బెల్జియం 0–0తో ‘డ్రా’ చేసుకుంది. బెల్జియంను నిలువరించిన క్రొయేషియా ఐదు పాయింట్లతో గ్రూప్ ‘ఎఫ్’లో రెండో స్థానంలో నిలిచి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. క్రొయేషియాతో మ్యాచ్‌లో బెల్జియం జట్టు ఓటమి స్వయంకృతమే అని చెప్పాలి. స్టార్ ఫార్వర్డ్ రొమెలు లుకాకుకు ఏకంగా ఐదుసార్లు గోల్ చేసే సువర్ణావకాశాలు వచ్చినా అతను వృథా చేశాడు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5101504615.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
FIFA WC 2022: మొరాకో చేతిలో పరాభవం.. బెల్జియంలో చెలరేగిన అల్లర్లు
ఫిఫా ప్రపంచకప్‌లో మొరాకో జట్టు బెల్జియంపై సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఖతర్‌లో అల్ థుమమ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో 2-0 తేడాతో ప్రపంచ రెండో ర్యాంకర్ అయిన బెల్జియంను మొరాకో మట్టికరిపించింది. ఈ విజయంతో మొరాకో గ్రూప్-ఎఫ్‌లో అగ్రస్థానానికి దూసుకెళ్లగా.. బెల్జియం రెండో స్థానానికి పడిపోయింది. అయితే ఈ మ్యాచ్ బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో ఉద్రిక్తతలకు దారితీసింది. బ్రెజిల్ పరాజయాన్ని జీర్జించుకోలేని పలువురు ఫుట్‌బాల్ అభిమానులు మొరాకో జెండాలు పట్టుకొని రోడ్లపైకి వచ్చి అల్లర్లు సృష్టించారు. కొందరు కర్రలతో దాడి చేస్తూ వాహనాలపై రాళ్లు రువ్వారు. కారుతో సహా పలు ఎలక్ట్రిక్ స్కూటర్లకు నిప్పంటించారు. పరిస్థితి చేయి దాటిపోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. నిరసనకారులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దాదాపు 12 మందిని అదుపులోకి తీసుకోగా ఒకరిని అరెస్ట్ చేశారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. బెల్జియం రాజధాని అంతటా అనేక చోట్ల ఈ ఘర్షణలు చోటుచేసుకున్నాయని, సాయంత్రం 7 గంటల వరకు పరిస్థితి అదుపులోకి వచ్చిందని బెల్జియం పోలీసులు తెలిపారు. అయితే ఇప్పటికీ పలు ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పబ్లిక్ హైవేపై అల్లరి మూకలు పైరోటెక్నిక్ మెటీరియల్, కర్రలతో దాడి చేశారని, వాహనాలకు నిప్పంటించారని పోలీసులు తెలిపారు. బాణా సంచా పేల్చడంతో ఓ జర్నలిస్టు ముఖానికి గాయమైనట్లు పేర్కొన్నారు. ఈ కారణాల వల్ల తాము జోక్యం చేసుకొని జల ఫిరంగులను, టియర్ గ్యాస్ ఉపయోగించినట్లు తెలిపారు. చదవండి: Ju Ae: కిమ్ వారసురాలు ఆమే? వయసు కేవలం పదేళ్లు మాత్రమే! 🚨BREAKING NEWS🚨 Brussels, home of the EU parliament, ERUPTS in street riots as Moroccans 'celebrate' their victory over their now home country. Are we feeling enriched? pic.twitter.com/YI0h6nXSxt — UNN (@UnityNewsNet) November 27, 2022 Meanwhile, in Brussels, Moroccans celebrate their win over Belgium. The cultural enrichment is paying dividends, right? pic.twitter.com/yakNCjTSSN — David Vance (@DVATW) November 27, 2022 -
ఫిఫా వరల్డ్‌కప్-2022లో మరో సంచలనం.. బెల్జియంను ఖంగుతినిపించిన మొరాకో
ఫిఫా వరల్డ్‌కప్-2022లో భాగంగా భారతకాలమానం ప్రకారం ఇవాళ (నవంబర్ 27) సాయంత్రం 6:30 గంటలకు అల్ తుమామ స్టేడియం వేదికగా జరిగిన గ్రూప్-ఎఫ్ మ్యాచ్‌లో ప్రపంచ 2వ ర్యాంకర్ బెల్జియం, 22వ ర్యాంకర్ మొరాకో జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన మొరాకో.. తమ కంటే మెరుగైన బెల్జియంను 2-0 తేడాతో ఓడించి సంచలనం సృష్టించింది. రెండో అర్ధభాగం 75వ నిమిషంలో లభించిన ఫ్రీ కిక్‌ను అబ్దెల్ హమీద్ సాబిరి అద్భుతమైన గోల్‌గా మలిచి మొరాకోను ఆధిక్యంలో తీసుకెళ్లాడు. అనంతరం 90వ నిమిషంలో జకారియా అబౌక్లాల్ రెండో గోల్ చేసి మొరాకోకు చారిత్రక విజయాన్ని అందించాడు. 1998 తర్వాత ఫిఫా వరల్డ్‌కప్‌లో మొరాకో మ్యాచ్ గెలవడం ఇదే తొలిసారి. ఈ గెలుపుతో గ్రూప్-ఎఫ్‌లో మొరాకో.. బెల్జియంను వెనక్కునెట్టి అగ్రస్థానానికి చేరుకుంది. కాగా, నవంబర్ 23న క్రొయేషియాతో జరిగినను మ్యాచ్‌ను మొరాకో 0-0తో డ్రా చేసుకోగా.. 24న కెనడాపై బెల్జియం 1-0 గోల్స్ తేడాతో గెలుపొందింది. ఇదిలా ఉంటే, ఇవాళ మధ్యాహ్నం 3:30 గంటలకు అహ్మద్ అలీ బిన్ స్టేడియం వేదికగా జరిగిన గ్రూప్-ఈ మ్యాచ్‌లో ప్రపంచ 31 ర్యాంకర్ కోస్టారికా.. తమ కంటే పటిష్టమైన 24వ ర్యాంకర్ జపాన్‌కు షాకిచ్చింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో కోస్టారికా.. జపాన్ను 1-0 గోల్స్ తేడాతో ఓడించింది. రెండో అర్ధభాగం 81వ నిమిషంలో కీషర్ ఫుల్లర్ గోల్ కొట్టి కోస్టారికాను గెలిపించాడు. -
ఆ ఆటోడ్రైవర్ నిజాయితీకి ఫిదా.. ఏకంగా మనువాడింది
అతనొక ఆటోడ్రైవర్. అయినా ఆమె అతన్ని అర్థం చేసుకుని ఇష్టపడింది. అతని నిజాయితీ ఆమెను బాగా ఆకర్షించింది. స్వదేశీ-విదేశీ అభ్యంతరాలు, ఆస్తిపాస్తుల అంతరాల్ని పక్కన పెట్టింది. మనసులో మాట బయటపెట్టి.. అతన్ని ఒప్పించింది. ఐదేళ్లుగా వాళ్ల ప్రేమ ప్రయాణం సాగింది. డేటింగ్ పేరుతో ఎక్కడ మోసం చేస్తుందేమోనని ఆ కుర్రాడి కుటుంబం కంగారు పడింది. దేశం కానీ దేశం నుంచి అల్లుడు అనేసరికి ఆమె తల్లిదండ్రులు ఆలోచనలో పడ్డారు. కానీ, వాళ్ల ప్రేమ కొనసాగింది. చివరికి.. మనసైన వాడిని అతని సంప్రదాయ పద్ధతుల్లోనే వివాహం ఆడింది. బెల్జియంకు చెందిన కెమిల్ తన కుటుంబం పాటు ఐదేళ్ల కిందట కర్ణాటక విజయనగర జిల్లా హంపికి టూర్ మీద వచ్చింది. ఆ సమయంలో హంపి జనతా ప్లాట్‌కు చెందిన ఆటోడ్రైవర్ అయిన అనంతరాజుతో పరిచయం ఏర్పడింది. ఇక్కడ ఉన్నన్నిరోజులు వాళ్ల గైడ్‌గా ఉన్నాడు రాజు. ఎక్కడా మోసం చేయకుండా ప్రయాణికులతో, విదేశీయులతో అతను వ్యవహరించిన తీరు, నిజాయితీ ఆమెను విపరీతంగా ఆకర్షించాయి. పైగా తనకు వచ్చే సంపాదనలో అతను కొంత దానం చేస్తున్నాడని తెలిసి.. ఆ మంచి మనసును ఇష్టపడిందామె. ఈ క్రమంలో అతన్ని ప్రేమిస్తున్నట్లు తన ఇంట్లో వాళ్లకు చెప్పింది. మొదట ఆలోచనలో పడ్డా.. కూతురి సంతోషం కోసం వాళ్లు అంగీకరించారు. పెద్దల సమక్షంలోనే ఆమె అతనికి ప్రపోజ్ చేసింది. తన ఇంట్లో వాళ్లను అడిగి.. ఆమె ప్రేమకు అంగీకారం తెలిపాడతను. అలా.. వాళ్ల ప్రేమ.. పెద్లల సమక్షంలోనే పెరిగి పెద్దైంది. అయితే.. కరోనా సమయంలో వాళ్ల వివాహం జరగాల్సి ఉంది. బెల్జియంలో గ్రాండ్‌గా పెళ్లి ప్లాన్ చేశారు ఆమె తల్లిదండ్రులు. ఈలోపు.. కరోనా పరిణామాలతో ఆ పెళ్లి వాయిదా పడింది. దీంతో ఇరు కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. కెమిల్ బెల్జియంలో సామాజిక వేత్త. ఈ గ్యాప్‌లో వాళ్ల బంధం మరింత బలపడింది. ఆమెకు మరో వ్యక్తితో వివాహం చేయాలని ప్రయత్నాలు మొదలయ్యాయి. ఎలాగైనా రాజునే పెళ్లి చేసుకుంటానని భీష్మించుకుని కూర్చుంది. చివరికి వాళ్ల ఇంట్లో వాళ్లు.. రాజు తల్లిదండ్రులతో మరోసారి పెళ్లి సంప్రదింపులు మొదలుపెట్టారు. చివరికి.. భారత్‌లోనే పెళ్లి బాజాలు మొగాయి. ఇవాళ(శుక్రవారం 25-11-2022) హంపీ విరూపాక్షేశ్వర ఆలయంలో పెద్దలు, బంధు మిత్రుల నడుమ ఘనంగా వివాహం జరిగింది. హంపీకి చెందిన అంజీనప్ప కుమారుడు అనంతరాజుకి, బెల్జియంకు చెందిన జీప్ పిలిఫ్ మూడవ కుమార్తె కెమిల్ ఏడగుడులతో ఒక్కటవ్వడం స్థానికంగా ఆకట్టుకుంది. -
బోణీ కొట్టిన బెల్జియం.. కెనడాకు పరాభవం
దోహా: గ్రూప్ ‘ఎఫ్’లో బుధవారం అర్ధరాత్రి జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ బెల్జియం 1–0తో కెనడాను ఓడించింది. తొలి అర్ధ భాగం ముగిసే దశలో స్ట్రయికర్ మిచి బాట్షుయ్ (44వ ని.) గోల్ చేయడంతో బెల్జియం ఖాతా తెరిచింది. అనంతరం ఈ ఆధిక్యాన్ని కాపాడుకుని టోర్నీలో శుభారంభం చేసింది. ప్రపంచకప్‌లో గెలుపు రుచి చవిచూడాలనుకున్న కెనడా ఆశల్ని గత మెగా ఈవెంట్ కాంస్య పతక విజేత బెల్జియం తుంచేసింది. వరల్డ్‌కప్ చరిత్రలో ఒక్కసారి 1986లో మాత్రమే ఆడిన కెనడా అప్పుడు ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఓడింది. మళ్లీ 36 ఏళ్ల తర్వాత గల్ఫ్ గడ్డపై జరిగే మెగా ఈవెంట్‌కు అర్హత సాధించింది కానీ... ఓటమితోనే ప్రపంచకప్‌కు శ్రీకారం చుట్టింది. నిజం చెప్పాలంటే ఈ మ్యాచ్‌లో కెనడా... బెల్జియంకు దీటుగా రాణించింది. ప్రపంచ రెండో ర్యాంకర్ 46 శాతం బంతిని ఆ«దీనంలో ఉంచుకుంటే... కెనడా కూడా 43% తమ ఆ«దీనంలో పెట్టుకొని గోల్స్ కోసం మేటి ప్రత్యర్థి కంటే ఎక్కువసార్లే ప్రయతి్నంచింది. ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై 21 సార్లు దాడులు చేసింది. కానీ ప్రతీసారి నిరాశ తప్పలేదు. మరో వైపు మెరుగైన బెల్జియం 9 సార్లు ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌వైపు దూసుకొచ్చి ఒకసారి సఫలమైంది. -
FIFA World Cup 2022: లుకాకు లేకుండానే తొలి మ్యాచ్ బరిలో బెల్జియం
FIFA World Cup 2022: గత ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో మూడో స్థానంలో నిలిచిన బెల్జియం జట్టు ఈసారి టైటిల్ వేటను నేడు కెనడాతో జరిగే మ్యాచ్‌తో ప్రారంభించనుంది. అయితే ఈ మ్యాచ్‌లో బెల్జియం స్టార్ ప్లేయర్ రొమెలు లుకాకు గాయం కారణంగా బరిలోకి దిగడం లేదు. ఎడమ తొడ కండరాల గాయంతో బాధపడుతున్న లుకాకు మొరాకోతో జరిగే రెండో మ్యాచ్‌లోనూ ఆడేది సందేహమేనని బెల్జియం కోచ్ రొబెర్టో మార్టినెజ్ తెలిపారు. 31 ఏళ్ల లుకాకు బెల్జియం తరఫున ఇప్పటి వరకు 102 మ్యాచ్‌లు ఆడి 68 గోల్స్ సాధించాడు. చదవండి: ICC T20 Rankings: దిగజారిన కోహ్లి ర్యాంక్.. 4 హాఫ్ సెంచరీలు చేసినా కూడా..! -
FIFA Football WC 2022: బెల్జియంపై భారీ అంచనాలు.. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి..!
గత నాలుగు ప్రపంచకప్‌లలో యూరోప్ జట్లే విశ్వవిజేతగా నిలిచాయి. ఈసారీ యూరోప్ నుంచే మళ్లీ ప్రపంచ చాంపియన్ వచ్చే అవకాశాలున్నాయి. గత వరల్డ్‌కప్‌లో విశేషంగా రాణించి కీలకమైన సెమీఫైనల్లో ఓటమి చవిచూసిన బెల్జియం మరోసారి టైటిల్ ఫేవరెట్‌గా ఖతర్‌లో అడుగు పెట్టింది. కీలక మ్యాచ్‌ల్లో ఒత్తిడికి తడబడకుండా ఆడితే ఈసారి ఆ జట్టుకు గొప్ప ఫలితం లభిస్తుంది. –సాక్షి క్రీడా విభాగం బెల్జియం ప్రపంచకప్‌లో ఉత్తమ ప్రదర్శన: మూడో స్థానం (2018). ‘ఫిఫా’ ర్యాంక్: 2. అర్హత ఎలా: యూరోపియన్ క్వాలిఫయింగ్ గ్రూప్ ‘ఇ’ విన్నర్. ఎంతో మంది స్టార్ ఆటగాళ్లతో నిండిన బెల్జియం జట్టును కచ్చితంగా టైటిల్ ఫేవరెట్స్‌లో ఒక జట్టుగా పరిగణించాలి. 14వ సారి ప్రపంచకప్‌లో ఆడుతున్న బెల్జియం క్వాలిఫయింగ్ టోర్నీలో అజేయంగా నిలిచింది. ఆరు విజయాలు సాధించి, రెండు మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకుంది. సమకాలీన ఫుట్‌బాల్‌లో మేటి గోల్‌కీపర్‌గా పేరొందిన థిబాట్ కుర్టియస్, ఉత్తమ మిడ్‌ఫీల్డర్ కెవిన్ డి బ్రున్, స్టార్ ఫార్వర్డ్స్ లుకాకు, హెజార్డ్లతో బెల్జియం పటిష్టంగా కనిపిస్తోంది. తమ గ్రూప్‌లో క్రొయేషియాతో మ్యాచ్ మినహా మొరాకో, కెనడా జట్ల నుంచి బెల్జియంకు పెద్దగా ప్రతిఘటన ఉండకపోవచ్చు. మొరాకో ప్రపంచకప్‌లో ఉత్తమ ప్రదర్శన: ప్రిక్వార్టర్ ఫైనల్ (1986). ‘ఫిఫా’ ర్యాంక్: 22. అర్హత ఎలా: ఆఫ్రికా క్వాలిఫయింగ్ మూడో రౌండ్ విన్నర్. ఆఫ్రికా క్వాలిఫయింగ్ టోర్నీలో అజేయంగా నిలిచిన మొరాకో ప్రపంచకప్ ప్రధాన టోర్నీలోనూ అదే జోరు కొనసాగించాలని పట్టుదలతో ఉంది. అయితే బెల్జియం, క్రొయేషియాలాంటి రెండు పటిష్ట జట్లను నిలువరించాలంటే మొరాకో అద్భుతంగా ఆడాల్సి ఉంటుంది. హకీమ్ జియచ్, హకీమీ కీలక ఆటగాళ్లు. కెనడా ప్రపంచకప్‌లో ఉత్తమ ప్రదర్శన: గ్రూప్ దశ (1986). ‘ఫిఫా’ ర్యాంక్: 41. అర్హత ఎలా: ఉత్తర, మధ్య అమెరికా కరీబియన్ క్వాలిఫయింగ్ మూడో రౌండ్ విన్నర్. మూడున్నర దశాబ్దాల తర్వాత మళ్లీ ప్రపంచకప్‌కు అర్హత పొందిన కెనడా జట్టులో అల్ఫోన్సో డేవిస్, డేవిడ్ల రూపంలో ఇద్దరు స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. రెండోసారి ప్రపంచకప్‌లో ఆడుతున్న కెనడా 1986లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. గ్రూప్‌లో బెల్జియం, క్రొయేషియా లాంటి పటిష్ట జట్లు ఉండటంతో కెనడా ఈసారైనా పాయింట్ల ఖాతా తెరుస్తుందో లేదో వేచి చూడాలి. క్రొయేషియా ప్రపంచకప్‌లో ఉత్తమ ప్రదర్శన: రన్నరప్ (2018). ‘ఫిఫా’ ర్యాంక్: 12. అర్హత ఎలా: యూరోపియన్ క్వాలిఫయింగ్ గ్రూప్ ‘హెచ్’ విన్నర్. నాలుగేళ్ల క్రితం సంచలన ప్రదర్శనతో క్రొయేషియా తొలిసారి ఫైనల్‌కు చేరింది. ఆ తర్వాత పలువురు సీనియర్ ఆటగాళ్లు రిటైర్ కావడంతో కొంత బలహీన పడ్డా యూరోపియన్ క్వాలిఫయింగ్‌లో పూర్తి ఆధిపత్యం చలాయించి తొలి అవకాశంలోనే ప్రపంచకప్ బెర్త్ సాధించింది. తాజా జట్టులో అనుభవంలేని యువ ఆటగాళ్లు ఎక్కువగా ఉండటంతో స్టార్ మిడ్ ఫీల్డర్లు లుకా మోడ్రిచ్, బ్రొజోవిచ్, కొవాచిచ్ల ఆటతీరుపైనే క్రొయేషియా విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. గత ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన జట్టు తదుపరి వరల్డ్‌కప్‌లోనూ ఫైనల్‌కు చేరడం చివరిసారి 2002లో జరిగింది. 1998 ప్రపంచకప్ రన్నరప్ బ్రెజిల్ 2002లో ఫైనల్ చేరడంతోపాటు విజేతగా నిలిచింది. -
చాంప్ వెర్స్టాపెన్
ఆస్టిన్: ఫార్ములావన్ సీజన్లో ఇదివరకే చాంపియన్‌షిప్ ఖాయం చేసుకున్న రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ ఖాతాలో మరో విజయం చేరింది. యూఎస్ గ్రాండ్‌ప్రిలోనూ ఈ బెల్జియం రేసర్ విజయం సాధించాడు. సర్క్యూట్ ఆఫ్ అమెరికాస్‌లో సోమవారం రాత్రి ముగిసిన 56 ల్యాపుల రేసును వెర్స్టాపెన్ అందరికంటే ముందుగా ముగించాడు. గంటా 42 నిమిషాల 11.687 సెకన్లలో ముగించి 2022 సీజన్లో 13వ టైటిల్ సాధించాడు. మాజీ చాంపియన్, మెర్సిడెజ్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ 5.023 సెకన్ల తేడాతో రెండో స్థానంలో నిలువగా, ఫెరారి డ్రైవర్ లెక్లెర్క్ 7.501 సెకన్ల తేడాతో మూడో స్థానంలో నిలిచాడు. ఈ సీజన్లో ప్రస్తుతం 13 విజయాలతో 391 పాయింట్లతో వరల్డ్ చాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకోగా... చార్లెస్ లెక్లెర్క్ (267), సెర్గెయ్ పెరెజ్ (రెడ్‌బుల్; 265) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఈ సీజన్లో తదుపరి రేసు మెక్సికన్ గ్రాండ్ ప్రి 29, 30 తేదీల్లో జరుగుతుంది. సీజన్లో తర్వాతి రేసు మెక్సికన్ గ్రాండ్ప్రిగా ఉంటుంది. ఆస్టిన్: ఫార్ములావన్ సీజన్లో ఇదివరకే చాంపియన్‌షిప్ ఖాయం చేసుకున్న రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ ఖాతాలో మరో విజయం చేరింది. యూఎస్ గ్రాండ్‌ప్రిలోనూ ఈ బెల్జియం రేసర్ విజయం సాధించాడు. సర్క్యూట్ ఆఫ్ అమెరికాస్‌లో సోమవారం రాత్రి ముగిసిన 56 ల్యాపుల రేసును వెర్స్టాపెన్ అందరికంటే ముందుగా ముగించాడు. గంటా 42 నిమిషాల 11.687 సెకన్లలో ముగించి 2022 సీజన్లో 13వ టైటిల్ సాధించాడు. మాజీ చాంపియన్, మెర్సిడెజ్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ 5.023 సెకన్ల తేడాతో రెండో స్థానంలో నిలువగా, ఫెరారి డ్రైవర్ లెక్లెర్క్ 7.501 సెకన్ల తేడాతో మూడో స్థానంలో నిలిచాడు. ఈ సీజన్లో ప్రస్తుతం 13 విజయాలతో 391 పాయింట్లతో వరల్డ్ చాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకోగా... చార్లెస్ లెక్లెర్క్ (267), సెర్గెయ్ పెరెజ్ (రెడ్‌బుల్; 265) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఈ సీజన్లో తదుపరి రేసు మెక్సికన్ గ్రాండ్ ప్రి 29, 30 తేదీల్లో జరుగుతుంది. సీజన్లో తర్వాతి రేసు మెక్సికన్ గ్రాండ్ప్రిగా ఉంటుంది. -
FIH Pro League: ‘షూటౌట్’లో బెల్జియంపై భారత్ విజయం
ఆంట్వర్ప్: ప్రొ హాకీ లీగ్‌లో భాగంగా టోక్యో ఒలింపిక్స్ చాంపియన్ బెల్జియం జట్టుతో శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత పురుషుల జట్టు ‘షూటౌట్’లో 5–4తో గెలిచింది. ‘షూటౌట్’లో భారత్ తరఫున హర్మన్‌ప్రీత్, అభిషేక్, లలిత్, షంషేర్ సింగ్, ఆకాశ్‌దీప్ సింగ్... బెల్జియం తరఫున బొకార్డ్, టాన్‌గయ్, సిమోన్, ఆర్థర్ సఫలమయ్యారు. బెల్జియం ప్లేయర్ నికోలస్ కొట్టిన ఐదో షాట్‌ను భారత గోల్‌కీపర్ శ్రీజేష్ అడ్డుకు న్నాడు. అంతకుముందు నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లు 3–3తో సమంగా నిలిచాయి. ప్రస్తుతం భారత్ 29 పాయింట్లతో రెండో ర్యాంక్‌లో ఉంది. బెల్జియం మహిళల జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 1–2తో ఓడిపోయింది. -
రజతం నెగ్గిన జ్యోతి యర్రాజీ
ఆంధ్రప్రదేశ్ మహిళా అథ్లెట్ జ్యోతి యర్రాజీ బెల్జియంలో జరిగిన ఐఫామ్ ఈఏ పర్మిట్ అంతర్జాతీయ అథ్లెటిక్స్ మీట్లో రజత పతకం సాధించింది. వైజాగ్‌కు చెందిన జ్యోతి 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ రేసును 13.19 సెకన్లలో ముగించి రెండో స్థానంలో నిలిచింది. జో సెడ్నీ (నెదర్లాండ్స్; 13.18 సెకన్లు) స్వర్ణం, జెన్నా బ్లన్‌డెల్ (బ్రిటన్; 13.30 సెకన్లు) కాంస్యం సాధించారు. హీట్స్‌లో జ్యోతి 13.26 సెకన్లతో రెండో స్థానంలో నిలిచింది. -
ముచ్చటగా మూడోసారి.. ఈసారి శాశ్వత వీడ్కోలు
Kim Clijsters- న్యూజెర్సీ: గతంలో రెండుసార్లు రిటైర్మెంట్ (2007, 2012) ప్రకటించి.. ఆ తర్వాత మళ్లీ రాకెట్ పట్టిన బెల్జియం మహిళా టెన్నిస్ స్టార్ కిమ్ క్లియ్‌స్టర్స్ ఈసారి మాత్రం శాశ్వతంగా ఆటకు వీడ్కోలు పలికింది. ఇందుకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా ఆమె ప్రకటన విడుదల చేసింది. కాగా గత ఏడాది ఇండియన్ వెల్స్ ఓపెన్‌లో చివరిసారి బరిలోకి దిగిన 38 ఏళ్ల క్లియ్‌స్టర్స్ తన కెరీర్లో నాలుగు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్‌ను (2005, 2009, 2010–యూఎస్ ఓపెన్; 2011–ఆస్ట్రేలియన్ ఓపెన్) నెగ్గింది. ఇక తన కుటుంబంతో అమెరికాలో స్థిరపడిన క్లియ్‌స్టర్స్ 2003లో తొలిసారి ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకుంది. కెరీర్ మొత్తంలో 41 టైటిల్స్ నెగ్గిన క్లియ్‌స్టర్స్ 523 మ్యాచ్‌ల్లో గెలిచి, 131 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. మొత్తం 2 కోట్ల 45 లక్షల 45 వేల 194 డాలర్ల (రూ. 186 కోట్లు) ప్రైజ్‌మనీని సంపాదించింది. చదవండి: IPL 2022: మొదట్లో కష్టాలు... తర్వాత చుక్కలు... సిక్సర్ల సునామీతో చెన్నై బోణీ -
రష్యా దౌత్యవేత్తల బహిష్కరణ
బ్రసెల్స్: గూఢచర్యం ఆరోపణలపై రష్యా దౌత్యవేత్తలను బహిష్కరిస్తున్నట్టు బెల్జియం, నెదర్లాండ్స్ మంగళవారం ప్రకటించాయి. 21 మంది రష్యా దౌత్యవేత్తలను రెండు వారాల్లోగా దేశం వీడాలని బెల్జియం ఆదేశించింది. నెదర్లాండ్స్ కూడా 17 మంది రష్యా దౌత్యాధికారులను బహిష్కరిస్తున్నట్టు పేర్కొంది. వీరంతా నిజానికి నిఘా అధికారులని ఆరోపించింది. (చదవండి: ఇమ్రాన్ ఖాన్ కౌంట్ డౌన్ స్టార్ట్! ఓటింగ్‌కు దూరంగా ఉండాలని పిలుపు, రద్దు తప్పదా?) -
స్కూల్లో టీచర్ అవమానించిందని.. 30 ఏళ్ల తర్వాత.. 101 సార్లు పొడిచి..
బ్రస్సెల్స్: చిన్నప్పుడు స్కూల్లో అవమానించిందని ఓ వ్యక్తి టీచర్‌పై కక్ష్య పెంచుకున్నాడు. ఏడేళ్ల వయసులో జరిగిన అవమానానికి దాదాపు 30 ఏళ్ల తర్వాత ప్రతీకారం తీర్చుకున్నాడు. గుంటెర్ ఉవెంట్స్ అనే 37 ఏళ్ల వ్యక్తి 2020లో టీచర్‌ను హత్య చేశాడు. ఏకంగా 101 సార్లు కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘోర ఘటన బెల్జియంలో చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను బెల్జియం పోలీసులు గురువారం మీడియాకు వెల్లడించారు. కాగా 2020లో ఆంట్వెర్ప్ సమీపంలో మారియా వెర్లిండెన్ అనే 59 ఏళ్ల టీచర్‌ను హత్య చేశారు. 101 సార్లు పొడిచి చంపారు. ఈ కేసులో నిందితులను పట్టుకునేందుకు బెల్జియం పోలీసులు దాదాపు 100 మంది అనుమానితుల డీఎన్ఏలను పరీక్షించారు. అయినా కేసును చేధించలేకపోయారు. అయితే మహిళ మృతదేహం పక్కనే ఉన్న డైనింగ్ టేబుల్‌పై ఉన్న నగదు అలాగే ఉండటంతో ఆమెను డబ్బుల కోసం హత్య చేయలేదనే నిర్ధారణకు వచ్చారు. చదవండి: భార్యను వదిలేసి స్వాతి టీచర్‌తో నాయ్యవాది.. చిత్ర హింసలు.. కాదు కిడ్నాప్! అయితే హత్య జరిగిన 16 నెలల తర్వాత, ఉవెంట్స్ టీచర్‌ను హత్య చేసిన విషయం తన స్నేహితుడి దగ్గర చర్చించాడు. దీంతో అతను పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం ఉవెంట్స్‌ను ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్య జరిగిన ప్రదేశంలో లభించిన క్లూతో నిందితుడి డీఎన్ఏను పరీక్షించగా అతనే నేరం చేసినట్లు తేలింది. అంతేగాక నిందితుడు హతురాలి పూర్వ విద్యార్ధి అని తేలింది. తనను అవమానించినందుకే టీచర్‌ను హత్య చేసినట్లు పోలీసుల ఎదుట అంగీకరించాడు. 1990లో తన ఏడేళ్ల వయస్సులో పాఠశాల విద్యార్థిగా ఉన్న సమయంలో టీచర్ మారియా వెర్లిండెన్ తన గురించి చేసిన వ్యాఖ్యలను ఇప్పటి వరకు మరిచిపోలేదని చెప్పాడు. చదవండి: ఎవరినీ లెక్కచేయని పుతిన్.. బైడెన్ తీవ్ర వ్యాఖ్యలు.. రష్యా అభ్యంతరం -
తొమ్మిదోసారి వ్యాక్సిన్.. అసలు విషయం తెలిస్తే షాక్!
కరోనా వైరస్ తరిమికొట్టేందుకు వ్యాక్సిన్ మాత్రమే రక్ష అని తెలిసినప్పటికీ.. కొంతమంది మాత్రం ఇప్పటికీ వ్యాక్సిన్ తీసుకునేందుకు వెనకాడుతున్నారు. చాలా మంది అయితే ఇప్పటకీ మొదటి డోస్ వ్యాక్సిన్ కూడా వేయించుకోకపోవడం గమనార్హం. అయితే ఇటీవల ఓ వ్యక్తి మాత్రం తొమ్మిదో సారి వ్యాక్సిన్ తీసుకునేందుకు వచ్చి.. అక్కడ ఉన్నవారందరినీ షాక్‌కు గురిచేశాడు. ఈ ఘటన బెల్జియంలో చోటుచేసుకుంది. బెల్జియంలోని వాలూన్ ప్రావిన్స్ చార్లెరోయ్ నగరంలో ఓ యువకుడు వ్యాక్సిన్ తీసుకోకుండా సర్టిఫికెట్ పొందాలనుకునే వారిని సంప్రదించి, వారి నుంచి డబ్బులు వసూలు చేసి వారి స్థానంలో అతను వ్యాక్సిన్ వేయించుకోవటం మొదలు పెట్టాడు. టీకా తీసుకున్న తరువాత టీకా ధృవీకరణ పత్రాన్ని సదరు వ్యక్తులకు ఇచ్చేవాడు. ఇలా ఆ వ్యక్తి తొమ్మిదోసారి వ్యాక్సిన్ కోసం స్థానిక వ్యాక్సిన్ కేంద్రానికి వచ్చి సిబ్బందికి పట్టుబడ్డాడు. సిబ్బంది పోలీసులకు సమాచారం అందించగా.. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి ఇప్పటకీ ఎనిమిది డోసుల వ్యాక్సిన్ తీసుకున్నట్లు పోలీసులకు తెలిపాడు. ఇప్పటికీ 8 డోసుల కరోనా వ్యాక్సిన్ తీసుకుంటున్నప్పటికీ అతను పూర్తిగా సాధారణ స్థితిలోనే ఉన్నాడు. ఎనిమిది డోసుల వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ అతని శరీరంలో ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించడంలేదని సమాచారం. ప్రస్తుతం అతన్ని అబ్జర్వేషన్లో ఉంచామని పోలీసులు తెలిపారు. -
Hockey Men Junior World Cup: యువ భారత్ జోరు...
భువనేశ్వర్: డిఫెండింగ్ చాంపియన్ భారత్ జూనియర్ హాకీ ప్రపంచకప్‌లో టైటిల్ నిలబెట్టుకునేందుకు మరో అడుగు ముందుకు వేసింది. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత జూనియర్ జట్టు 1–0తో బెల్జియంపై గెలుపొంది సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఈ మ్యాచ్‌లో నమోదైన ఏకైక గోల్‌ను శారదానంద్ తివారి సాధించాడు. ఆట 21వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను శారదానంద్ ఎలాంటి పొరపాటు చేయకుండా నేర్పుగా గోల్‌పోస్ట్‌లోకి పంపాడు. దీంతో భారత్ 1–0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. దీన్ని తుదిదాకా కాపాడుకొని విజయం సాధించింది. మ్యాచ్ మొదలవగానే బెల్జియం దూకుడు పెంచింది. పదేపదే భారత రక్షణపంక్తిని ఛేదించుకుంటూ దాడులకు పదునుపెట్టింది. అయితే గోల్‌కీపర్ పవన్ చక్కని సమయస్ఫూర్తితో వారి ప్రయత్నాల్ని నీరుగార్చాడు. ఇతర క్వార్టర్ ఫైనల్స్‌లో జర్మనీ పెనాల్టీ షూటౌట్లో 3–1తో స్పెయిన్‌పై, అర్జెంటీనా 2–1 తో నెదర్లాండ్స్‌పై, ఫ్రాన్స్ 4–0తో మలేసియాపై గెలిచాయి. రేపు జరిగే సెమీఫైనల్స్‌లో అర్జెంటీనా తో ఫ్రాన్స్; జర్మనీతో భారత్ తలపడతాయి. -
కొబ్బరి చెట్లకు క్లోనింగ్
తిరువనంతపురం: చాలా నెమ్మదిగా పెరిగే కొబ్బరి చెట్లను కూడా తాము క్లోనింగ్ చేయగలిగినట్లు బెల్జియం యూనివర్సిటీ పరిశోధకులు ప్రకటించారు. బెల్జియంలోని కె.యు.ల్యువెన్ అండ్ అలయెన్స్ ఆఫ్ బయో డైవర్సిటీ ఇంటర్నేషనల్‌కు చెందిన పరిశోధకులు వేగంగా కొబ్బరి మొక్కలను ఎక్కువ సంఖ్యలో పెంచడంతోపాటు, కొబ్బరి జన్యు మూలాలను దీర్ఘకాలం పరిరక్షించే వీలుంది. వీరు సాధించిన విజయం భారత్ వంటి దేశాల్లోని కొబ్బరి రైతులు ఎదుర్కొనే వ్యాధులు, వాతావరణ మార్పులు, సముద్ర మట్టాల్లో పెరుగుదల వంటి సమస్యల నుంచి విముక్తి కలగనుంది. ‘అసాధ్యమని భావిస్తున్న కొబ్బరి క్లోనింగ్‌ను మేం సాధించాం. మా పరిశోధన కొబ్బరి జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు, కొబ్బరికి పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చేందుకు సాయపడుతుంది’ ఈ పరిశోధకులు ఒక ప్రకటనలో తెలిపారు. అరటి పండుపై సాగించిన పరిశోధనల ఫలితాల స్ఫూర్తితోనే ఈ విజయం సాధించినట్లు చెప్పారు. తమ విధానంపై పేటెంట్ కోసం త్వరలో దరఖాస్తు చేసుకోనున్నట్లు చెప్పారు. ఈ ఫలితాలు సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్ సెప్టెంబర్ ఎడిషన్‌లో ప్రచురితమయ్యాయి. -
‘ఈ బంధాన్ని ఇక్కడితోనే ఆపేయండి’
జూలో జంతువులను చూసి భలే ఉన్నాయంటూ మురిసిపోతాం. కోతులు, చింపాజీల వంటి జంతువులైతే అచ్చం మనిషిలాగే ఉంటాయని ఆనందపడతాము. ఖాళీ దొరికితే చాలు జంతుప్రేమికులు.. జూలను సందర్శిస్తుంటారు. అయితే తాజాగా బెల్జియంలోని ఆంట్వెర్ప్ జంతు ప్రదర్శనశాల ఓ సందర్శకురాలిపై నిషేధం విధించింది. దీంతో సదరు సందర్శకురాలు కన్నీటి పర్యంతం అయ్యిది. వివరాల్లో వెళ్తే.. బెల్జియంలోని ఆంట్వెర్ప్ జంతు ప్రదర్శనశాలను గత నాలుగేళ్లుగా ఏడీ టిమ్మర్‌మన్స్ అనే ఓ మహిళా సందర్శిస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఆమె జూకి వచ్చిన ప్రతిసారి ఆమె 38 ఏళ్ల ఓ మగ చింపాంజీని చూస్తూ కాలక్షేపం చేసేది. తరచుగా రావటంతో ఆ చింపాంజీ సదరు మహిళను గుర్తించడం మొదలుపెట్టింది. దీంతో వారిద్దరి మధ్య స్నేహం పెరిగింది. ఈ క్రమంలో చింపాంజీ దాని సహచర చింపాంజీలో కలివిడిగా ఉండటంతో తగ్గించింది. ఒంటరిగా కూర్చోటంతో మిగతా చింపాంజీలు కూడా దాన్ని పట్టించుకోవటం మానేశాయి. దీంతో ఆ చింపాంజీలో వచ్చిన మార్పును జూ సిబ్బంది గమనించి.. దాని ప్రవర్తనకు గల కారణం ఆరా తీశారు. అయితే ఏడీ టిమ్మర్‌మన్స్ అనే మహిళ దాని వద్ద ఎక్కువ సమయం ఉండటం వారి దృష్టికి వచ్చింది. అయితే దాని ప్రవర్తనలోని మార్పుకు తీసుకురావడానికి సిబ్బంది.. ఆమెను జూకు రావొద్దని నిషేధం విధించారు. దీంతో ఆమె ఒక్కసారిగా కన్నీటి పర్యంతం అవుతూ.. చింపాజీతో తనకు బంధం ఉందని తెలిపింది. మిగతా సందర్శకులను అనుమతించినప్పుడు తనను ఎందుకు రానివ్వడం లేదని జూ సిబ్బందిని ప్రశ్నించింది. ఆమెకు మద్దతుగా సోషల్ మీడియాలో ఉద్యమం నడుస్తోంది. -
వెల్డన్ బాయ్స్.. ఫోటో హైలెట్స్
టోక్యో: గత కొంతకాలంగా హాకీలో మెరుగైన ప్రదర్శన కనబరస్తున్న భారత పురుషుల హాకీ జట్టు.. టోక్యో ఒలిపింక్స్‌లో సెమీస్ దాకా వెళ్లి ఒక్కసారిగా అంచనాలు పెంచింది. అయితే బెల్జియం చేతిలో ఓటమితో ఫైనల్ చేరనప్పటికీ.. కాంస్యం ఆశలు మాత్రం సజీవంగా ఉంచుకోగలిగింది. ►టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా మంగళవారం ఉదయం జరిగిన హాకీ మొదటి సెమీఫైనల్లో బెల్జియం చేతిలో 5-2 తేడాతో ఓడింది భారత్. ►మొదట్లో ప్రపంచ ఛాంపియన్‌కు గట్టి పోటీ ఇచ్చిన భారత్.. ఆ తర్వాత ప్రత్యర్థి డిఫెండింగ్ ముందు తడబడింది. ►ఏ దశలోనూ భారత్ మరో గోల్ చేయకుండా అడ్డుకుంది బెల్జియం. ►చివర్లో రెండు గోల్స్‌తో పట్టుసాధించిన బెల్జియం.. ఆఖర్లో మరో గోల్‌తో 5-2 తేడాతో భారత్‌ను చిత్తుగా ఓడించింది. ►ఇక రెండో సెమీఫైనల్లో ఓడిన జట్టుతో భారత్ కాంస్యం కోసం పోరాడనుంది. ►సెమీస్ దాకా చేరుకున్న భారత హాకీ జట్టు ప్రయత్నాన్ని యావత్ దేశం ‘వెల్డన్ బాయ్స్’ అంటూ అభినందిస్తోంది. -
టోక్యో ఒలింపిక్స్ అప్డేట్స్: షాట్‌పుట్‌లో నిరాశపరిచిన తేజిందర్‌పాల్
షార్ట్పుట్లో తేజిందర్‌పాల్ నిరాశ ► టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా షాట్‌పుట్ విభాగంలో భారత అథ్లెట్ తేజిందర్‌పాల్ సింగ్ నిరాశపరిచాడు. మొత్తం మూడు ప్రయత్నాల్లో ఒకసారి మాత్రమే సఫలమైన తేజిందర్ 19.99 మీ దూరం విసిరాడు. మిగతా రెండుసార్లు ఫౌల్ చేసి ఫెయిల్యూర్ అయ్యాడు. Tokyo Olympics Day 12 Live Updates: ఒలింపిక్స్‌లో భారత్ వరుస ఓటములు చవిచూస్తోంది. మంగళవారం జరిగిన ఈవెంట్స్‌లో ప్రతికూల ఫలితం వచ్చింది. ఓవైపు హాకీ, మరోవైపు జావెలిన్ థ్రో, ఇంకోవైపు రెజ్లింగ్‌లో ఓటములే ఎదురయ్యాయి. మహిళల రెజ్లింగ్ 62 కేజీల విభాగంలో భారత రెజ్లర్ సోనమ్ మాలిక్, మంగోలియాకు చెందిన బోలోర్టుయా ఖురెల్ఖూతో తలపడి ఓడింది. Tokyo Olympics Wrestling: ► 2-2తో స్కోర్ సమమైనప్పటికీ.. ఖురెల్ఖూ పాయింట్ మూవ్ ఆధారంగా ఆమెను విజేతగా ప్రకటించారు. దీంతో సోనమ్ మాలిక్ ఓటమి పాలైంది. ► ఆరంభంలో దూకుడు చూపించినప్పటికీ.. ఫస్ట్ రౌండ్ బౌట్‌ను ఓడింది సోనమ్. ► తొలి పాయింట్ సాధించిన సోనమ్ ►మహిళల రెజ్లింగ్ 62 కిలోల విభాగంలో భారత రెజ్లర్ సోనమ్ మాలిక్ బరిలోకి దిగింది. ఆసియన్ సిల్వర్ మెడలిస్ట్, మంగోలియాకు చెందిన బోలోర్టుయా ఖురెల్ఖూతో పోరాడుతోంది. India-Belgium Men's Hockey Semi-Final Live Updates: ►చివర్లో మరో పాయింట్‌తో 5-2 తేడాతో బెల్జియం భారత్‌పై ఘన విజయం సాధించింది. ►మొదలైన నాలుగో క్వార్టర్. 2-2తో కొనసాగింది మ్యాచ్. ఈ తరుణంలో బెల్జియం మరో గోల్‌తో 3-2 ఆధిక్యంలోకి వచ్చింది. దీంతో భారత్‌పై ఒత్తిడి మరింత పెరిగింది. ఈ తరుణంలో మరో పెనాల్టీ కార్నర్ దక్కింది బెల్జియంకు. ఆ వెంటనే మరో గోల్‌తో బెల్జియం 4-2తో మ్యాచ్‌పై పూర్తి పట్టు సాధించింది. ►మూడో క్వార్టర్ ముగిసేందుకు ఏడు నిమిషాలుండగా.. భారత్‌కు పెనాల్టీ కార్నర్ దక్కింది. కానీ, ఎటాకింగ్ గేమ్‌తో బెల్జియం భారత్‌ను ఇరకాటంలో పెడుతోంది. మూడో క్వార్టర్ ముగిసేసరికి.. స్కోర్ 2-2తో సమంగానే కొనసాగుతోంది. ►సెకండ్ క్వార్టర్ ముగిసేసరికి 2-2 తేడాతో స్కోర్ సమం అయ్యింది. బెల్జియం తరపున లూయిపరట్, అలెగ్జాండర్ హెన్డ్రిక్స్ చెరో గోల్ కొట్టారు. బెల్జియం డిఫెండింగ్ గేమ్ ఆడుతుండడంతో టీమిండియాపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ క్రమంలో మూడో క్వార్టర్లో మ్యాచ్ ఉత్కంఠ భరితంగా కొనసాగుతోంది. ► భారత పురుషుల హాకీ సెమీస్‌లో బెల్జియంతో తలపడుతోంది భారత పురుషుల హాకీ జట్టు. తొలి క్వార్టర్‌లోనే బెల్జియంపై గోల్ చేసిన భారత్.. ఆపై బెల్జియంకు ఓ గోల్ అప్పజెప్పింది. ఆపై మరో గోల్‌తో 2-1తో నిలిచింది. మన్దీప్, హర్మన్‌ప్రీత్ చెరో గోల్ కొట్టారు. తొలి క్వార్టర్ ముగిసేసరికి.. భారత్ అత్యద్భుత ప్రదర్శన కనబరిచింది. ఇక రెండో క్వార్టర్ మొదలైన కాసేపటికే.. బెల్జియం ఆటగాడు అలెగ్జాండర్ హెన్డ్రిక్స్ గోల్ కొట్టడంతో స్కోర్ 2-2 అయ్యింది. క్లిక్ చేయండి: పతకాలు గెస్ చేయండి.. క్యాష్ ప్రైజ్ గెల్వండి టోక్యో వేదికగా ఒలింపిక్స్ 2020లో పురుషుల హాకీ సెమీస్‌లో బెల్జియంతో భారత హాకీ జట్టు తలపడిన విషయం తెలిసిందే. భారత కాలమానం ప్రకారం.. ఈ ఉదయం ఓయి హాకీ స్టేడియం నార్త్ పిచ్‌లో మ్యాచ్ ప్రారంభం కాగా.. మ్యాచ్ మూడో క్వార్టర్ దాకా హోరాహోరీగా నడిచింది. అయితే నాలుగో క్వార్టర్ నుంచి బెల్జియం డామినేషన్ కొనసాగింది. చివర్లో బెల్జియం మూడు గోల్స్ సాధించడంతో 5-2 తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది బెల్జియం. I’m watching the India vs Belgium Hockey Men’s Semi Final at #Tokyo2020. Proud of our team and their skills. Wishing them the very best! — Narendra Modi (@narendramodi) August 3, 2021 #WATCH | CRPF jawans cheer for Indian men's hockey team in Jammu, chant 'Jeetega bhai jeetega, India jeetega' & 'Bharat Mata ki Jai'. India is playing against Belgium in the semi-final at #TokyoOlympics. pic.twitter.com/ohEneoSOtx — ANI (@ANI) August 3, 2021 Tokyo Olympics Women's Javelin Throw: భారత స్టార్ జావెలిన్ థ్రోయర్ అన్ను రాణి తీవ్రంగా నిరాశ పరిచింది. మహిళల జావెలిన్ థ్రో విభాగంలో Annu Rani సత్తా చాటలేకపోయింది. మహిళల జావెలిన్ థ్రో విభాగంలో 54.4 మీటర్ల దూరం విసిరి 14వ పొజిషన్‌తో సరిపెట్టుకుని.. ఫైనల్ ఈవెంట్‌కు క్వాలిఫై కాలేకపోయింది. టోక్యో ఒలింపిక్స్‌లో నేటి(ఆగష్టు 3) భారత్ షెడ్యూల్ ఉ.7గం.లకు బెల్జియంతో తలపడనున్న భారత్ పురుషుల హాకీ జట్టు (సెమీస్) ఉదయం 7:20 నుంచి అథ్లెటిక్స్ మహిళల లాంగ్‌జంప్ ఫైనల్ ఉదయం 8:30కు మహిళల రెజ్లింగ్ 62 కిలోల విభాగం ( సోనమ్ మాలిక్) ఉదయం 8:50 నుంచి అథ్లెటిక్స్ పురుషుల 400 మీ. హార్డిల్స్ ఫైనల్ మధ్యాహ్నం 2:20 నుంచి జిమ్నాస్టిక్స్ మహిళల బ్యాలెన్స్ బీమ్ ఫైనల్ మధ్యాహ్నం 2:45కు మహిళల రెజ్లింగ్ 62 కిలోల విభాగం సెమీస్ మధ్యాహ్నం 3:45కు పురుషుల షాట్‌బాల్ (తజిందర్ పాల్) క్వాలిఫికేషన్ మధ్యాహ్నం 3:50కి అథ్లెటిక్స్ పురుషుల పోల్‌వాల్ట్ ఫైనల్ సాయంత్రం 5:05 నుంచి అథ్లెటిక్స్ మహిళల హ్యామర్ త్రో ఫైనల్ సాయంత్రం 5:55 నుంచి అథ్లెటిక్స్ మహిళల 800 మీ. పరుగు ఫైనల్ సాయంత్రం 6:20 నుంచి అథ్లెటిక్స్ మహిళల 200 మీ. పరుగు ఫైనల్ -
Tokyo Olympics: 41 ఏళ్ల నిరీక్షణకు అడుగు దూరంలో..
టోక్యో: 41 ఏళ్లుగా ఊరిస్తున్న ఒలింపిక్ పతకాన్ని ఖాయం చేసుకునేందుకు భారత పురుషుల హాకీ జట్టు విజయం దూరంలో నిలిచింది. 1972 తర్వాత ఒలింపిక్స్‌లో తొలిసారి సెమీఫైనల్ దశకు అర్హత సాధించిన భారత్... నేడు జరిగే తొలి సెమీఫైనల్లో ప్రపంచ చాంపియన్ బెల్జియం జట్టుతో తలపడనుంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ స్థానంలో ఉన్న బెల్జియం ప్రస్తుత యూరోపియన్ చాంపియన్ కూడా కావడం విశేషం. గత కొన్నేళ్లలో ఎంతో మెరుగుపడిన బెల్జియం జట్టును ఓడించాలంటే మన్‌ప్రీత్ సింగ్ నాయకత్వంలోని టీమిండియా ఆద్యంతం జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది. ఏ క్షణంలోనూ నిర్లక్ష్యాన్ని దరిచేరనీయకుండా అప్రమత్తంగా ఆడితే భారత్‌కు విజయం దక్కడం ఖాయం. 2019లో యూరోప్ పర్యటనలో బెల్జియం జట్టుతో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో భారత్‌నే విజయం వరించింది. బెల్జియంపై నెగ్గి ఫైనల్ చేరుకుంటే భారత్‌కు స్వర్ణం లేదా రజతం ఖరారవుతుంది. ఒకవేళ ఓడితే మాత్రం కాంస్య పతకం కోసం మరో మ్యాచ్ ఆడి అందులో గెలవాల్సి ఉంటుంది. రెండో సెమీఫైనల్లో జర్మనీతో ఆస్ట్రేలియా తలపడుతుంది. -
Tokyo Olympics: 49 ఏళ్ల తర్వాత సెమీస్‌లో
జాతీయ క్రీడకు కొత్త ఊపిరి వచ్చింది. విశ్వ క్రీడల్లో భారత పురుషుల హాకీ జట్టు మెరిసింది. ఏకంగా 49 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఒలింపిక్స్‌లో మళ్లీ టీమిండియా సెమీఫైనల్ దశకు అర్హత సాధించింది. 1980 మాస్కో ఒలింపిక్స్‌లో భారత్ ఫైనల్ చేరి స్వర్ణ పతకం సాధించినా... ఆ క్రీడల్లో నాకౌట్ ఫార్మాట్‌ను నిర్వహించలేదు. ఆరు జట్లు మాత్రమే పాల్గొనడంతో లీగ్ ఫార్మాట్ ద్వారా ఫైనలిస్ట్‌లను ఖరారు చేశారు. చివరిసారి భారత్ 1972 మ్యూనిక్ ఒలింపిక్స్‌లో సెమీఫైనల్ చేరింది. సెమీఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో 0–2తో ఓడిపోయింది. మూడో స్థానం పోరులో టీమిండియా 2–1తో నెదర్లాండ్స్‌ను ఓడించి కాంస్యం గెల్చుకుంది. టోక్యో: ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు 41 ఏళ్ల తర్వాత అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. 1980 మాస్కో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన తర్వాత భారత జట్టు... అనంతరం జరిగిన తొమ్మిది ఒలింపిక్స్‌లలో క్వార్టర్ ఫైనల్ దశను దాటలేకపోయింది. ఈసారి మాత్రం పక్కా ప్రణాళికతో, పట్టుదలతో ఆడి సెమీఫైనల్లోకి దూసుకెళ్లి పతకం రేసులో నిలిచింది. ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో మన్‌ప్రీత్ సింగ్ నాయకత్వంలోని భారత జట్టు 3–1తో గ్రేట్ బ్రిటన్ జట్టును ఓడించింది. భారత్ తరఫున దిల్‌ప్రీత్ సింగ్ (7వ ని.లో), గుర్జంత్ సింగ్ (16వ ని.లో), హార్దిక్ సింగ్ (57వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. గ్రేట్ బ్రిటన్ తరఫున ఏకైక గోల్‌ను సామ్ వార్డ్ (45వ ని.లో) సాధించాడు. మంగళవారం జరిగే సెమీఫైనల్లో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ బెల్జియం జట్టుతో భారత్ తలపడుతుంది. మరో సెమీఫైనల్లో జర్మనీతో ఆస్ట్రేలియా ఆడుతుంది. ఇతర క్వార్టర్ ఫైనల్స్‌లో బెల్జియం 3–1తో స్పెయిన్‌పై; జర్మనీ 3–1తో అర్జెంటీనాపై గెలుపొందగా... ఆస్ట్రేలియా ‘పెనాల్టీ షూటౌట్’లో 3–0 తో నెదర్లాండ్స్‌ను ఓడించింది. బ్రిటన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ఈ క్రమంలో కొన్నిసార్లు డిఫెన్స్‌లో తడబడింది. బ్రిటన్ ఏకంగా ఎనిమిది పెనాల్టీ కార్నర్లు సంపాదించినా ఒక్కసారి మాత్రమే సఫలమైంది. మ్యాచ్ ముగియడానికి మరో మూడు నిమిషాలు ఉందనగా భారత్ 2–1తో ఒక గోల్ ఆధిక్యంలో మాత్రమే ఉంది. అయితే హార్దిక్ సింగ్ గోల్ చేయడంతో భారత ఆధిక్యం 3–1కి పెరిగింది. చివరి మూడు నిమిషాల్లో బ్రిటన్ గోల్ చేయడానికి తీవ్రంగా యత్నించినా భారత జట్టు వారి దాడులను వమ్ము చేసింది. -
యూరప్‌ను ముంచెత్తిన వరదలు.. 40 మంది మృతి
బెర్లిన్: జర్మనీ, బెల్జియంలలో భారీ వర్షాలు, వరదలతో 40 మంది చనిపోగా పదుల సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు. జర్మనీలోని యూస్కిర్చెన్, అహ్రెవీలర్, కొలోన్ తదితర ప్రాంతాల్లో సంభవించిన వరదల్లో సుమారు 35 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. చాలా నివాస ప్రాంతాలు దెబ్బతినడంతో 70 మంది వరకు గల్లంతయ్యారు. అదేవిధంగా, జర్మనీ సరిహద్దులకు సమీపంలోని బెల్జియంలో సంభవించిన వరదల్లో ఐదుగురు చనిపోయినట్లు సమాచారం. ఇంకా, నెదర్లాండ్స్, లక్జెంబర్గ్‌ల్లోనూ వరద తీవ్రతకు సమాచార, రవాణా వ్యవస్థ స్తంభించిందని అధికారులు చెప్పారు. చాలా నివాస ప్రాంతాలు నీట మునిగాయి. కార్లు వరదల్లో కొట్టుకుపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో యూరప్‌వాసులకు నెటిజన్లు సంఘీభావం ప్రకటిస్తూ త్వరగా ఈ కష్టం నుంచి గట్టెక్కాలని ప్రార్థిస్తున్నారు. Germany floods. Cars being washed down the street in western German state of North Rhine-Westphalia. #Hochwasser video @rq_sh4 pic.twitter.com/stfGpIGuA1 — Ian Fraser (@Ian_Fraser) July 15, 2021 Apocalyptic scenes in the Walloon city of Verviers, 32 km east of Liège, Belgium. video: Themida Xostelidou via @Meteovilles pic.twitter.com/ktRse1MuSW — Ian Fraser (@Ian_Fraser) July 15, 2021 -
ఒకే సారి రెండు కరోనా వేరియంట్లు.. వృద్ధురాలు బలి!
బ్రుసెల్స్ : ఒకేసారి రెండు కరోనా వైరస్ వేరియంట్ల బారిన పడిన ఓ వృద్దురాలు ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన బెల్జియంలో వెలుగుచూసింది. సదరు వృద్దురాలి శరీరంలో యూకే, సౌత్ ఆఫ్రికన్ వేరియంట్లను గుర్తించినట్లు బెల్జియం సైంటిస్టులు ప్రకటించారు. బ్రుసెల్స్కు చెందిన 90 ఏళ్ల వృద్దురాలు గత మార్చినెలలో కరోనా వైరస్ బారినపడింది. దీంతో ఆమెను అలాస్ట్లోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. ఆమె శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ సరిగానే ఉన్నా.. ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. ఐదు రోజుల తర్వాత మృత్యువాత పడింది. ఈ నేపథ్యంలో పరీక్షలు నిర్వహించగా.. ఆమె శరీరంలో బ్రిటన్ ఆల్ఫా వేరియంట్, సౌత్ ఆఫ్రికా బెటా వేరియంట్లు రెండూ ఉన్నట్లు గుర్తించారు. కరోనా రోగి శరీరంలో రెండు వేరియంట్లను గుర్తించటం ఇదే మొదటిసారని పరిశోధకులు చెబుతున్నారు. ఇలాంటి కేసులు చాలా అరుదుగా వస్తుంటాయని తెలిపారు. దీనిపై మాలుక్యులర్ బయాలజిస్ట్ ఆనీ వాన్కీన్బెర్హన్ మాట్లాడుతూ.. ‘‘ మార్చి నెలలో ఈ రెండు వేరియంట్లకు సంబంధించిన కేసులు బెల్జియంలో బాగా నమోదయ్యాయి. ఆమె ఇద్దరు వేరు వేరు వ్యక్తుల నుంచి ఈ రెండు వేరియంట్లను అంటించుకుని ఉంటుంది. అయితే, ఆమెకు ఎలా ఈ వైరస్లు సోకాయన్న సంగతి తెలియలేదు. ఆమె ఆరోగ్యం త్వరగా క్షీణించటానికి ఈ రెండు వేరియంట్లే కారణమని చెప్పటం చాలా కష్టం’’ అని తెలిపింది. కాగా, బెల్జియంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కొత్తగా 1,027 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం 1,093,700 కేసులు రికార్డయ్యాయి.. 25,198మంది మరణించారు. -
ఏం యాక్టింగ్‌రా బాబు; నువ్వు ఇక్కడ ఉండాల్సింది కాదు
యూరోకప్ 2020 చివరి అంకానికి చేరుకుంటున్న తరుణంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. శుక్రవారం ఇటలీ, బెల్జియం మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఇటలీ జట్టు స్ట్రైకర్ సిరో ఇమ్మొబైల్ చేసిన పని అభిమానులను ఆశ్చర్యం కలిగించింది. ఆట 31వ నిమిషంలో ఇమ్మొబైల్ తనకు బంతిని పాస్ చేయాలని మిడ్ ఫీల్డర్‌కు సైన్ ఇచ్చాడు. బంతి తన వద్దకు చేరడంతో ఇమ్మొబైల్ గోల్ కొట్టేందుకు యత్నించాడు. ఈ నేపథ్యంలో బెల్జియం డిఫెండర్ బంతిని తన్నే ప్రయత్నంలో ఇమ్మొబైల్ కాలికి తగిలింది. దాంతో అతను కింద పడిపోయి నొప్పితో విలవిలలాడాడు. అయితే ఉద్దేశపూర్వకంగా ఇది జరగకపోవడంతో మ్యాచ్ రిఫరీ దీన్ని పట్టించుకోలేదు. అయితే ఆ వెంటనే ఇటలీ మిడ్‌ఫీల్డర్ నికోలో బారెల్లా గోల్‌తో మెరిశాడు. దీంతో హాఫ్‌టైమ్ ముగిసేలోపే ఇటలీ భోణీ కొట్టడంతో ఆటగాళ్లంతా సంబరాల్లో మునిగిపోయారు. అప్పటివరకు నొప్పితో విలవిలలాడుతున్నట్లు కనిపించిన ఇమ్మొబైల్ పైకిలేచి చిరునవ్వుతో జట్టు దగ్గరికి చేరుకొని చీర్ చెప్పాడు. ఇదంతా చూసిన అభిమానులు ఇమ్మొబైల్ చేసిన పనికి నోరెళ్లబెట్టారు. ' ఏం యాక్టింగ్‌రా బాబు.. నువ్వు ఇక్కడ ఉండాల్సింది కాదు' అని కామెంట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఇమ్మొబైల్ చర్యపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ స్పందించాడు. '' రగ్బీ గేమ్ ఆటగాళ్లు ఫుట్‌బాల్ ఆటగాళ్లకు ఇలాంటి ట్రిక్స్ నేర్పించి ఉంటారు. ఈ పనికి రగ్బీ వారికి ఎక్కువ మొత్తం చెల్లించాలి'' అంటూ కామెంట్ చేశాడు. ఇక మ్యాచ్‌లో బెల్జియంను 2-1 తేడాతో ఓడించిన ఇటలీ సెమీస్‌లోకి అడుగుపెట్టింది. బారెల్లా, ఇన్‌సిగ్నేలు చెరో గోల్ సాధించారు. కాగా సెమీస్ పోరులో ఇటలీ స్పెయిన్లు వెంబ్లే స్టేడియం(లండన్)లో తలపడనున్నాయి. 🚨⚽️ | NEW: Injured Italian player suddenly recovers when Italy scores #Euro2021 pic.twitter.com/bdEWYMCFAw — News For All (@NewsForAllUK) July 2, 2021 -
UEFA EURO 2020: పోర్చు‘గల్లంతు’
సెవిల్లె (స్పెయిన్): యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ పోర్చుగల్ జట్టు కథ ముగిసింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో బెల్జియం 1–0 గోల్ తేడాతో క్రిస్టి యానో రొనాల్డో సారథ్యంలోని పోర్చుగల్ జట్టును ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి చేరింది. ఆట 42వ నిమిషంలో ఎడెన్ హజార్డ్ గోల్‌తో బెల్జియం ఆధిక్యంలోకి వెళ్లి చివరిదాకా ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంది. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో ఇటలీతో బెల్జియం ఆడుతుంది. సోమవారం జరిగిన మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో స్పెయిన్ 5–3తో క్రొయేషియాను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. -
Euro Cup: పోర్చుగల్ ఔట్.. రొనాల్డో భావోద్వేగం
సెవిలా: యూరో కప్ 2020 నుంచి డిఫెండింగ్ ఛాంపియన్ పోర్చుగల్ అనూహ్యంగా వైదొలిగింది. ఆదివారం రాత్రి జరిగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో బెల్జియం చేతిలో 0-1 తేడాతో ఓటమిపాలై తమ అభిమానులను షాక్‌కు గురి చేసింది. 42వ నిమిషంలో థోర్గాన్ హజార్డ్ చేసిన గోల్‌తో ఆధిక్యంలోకి దూసుకెళ్లిన బెల్జియం.. తర్వాత ప్రత్యర్థికి సమం చేసే అవకాశం ఇవ్వకుండా ఆటను ముగించింది. తమ జట్టు అనూహ్య రీతిలో టోర్నీ నుంచి వైదొలగడంతో స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో భావోద్వేగానికి లోనయ్యాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం అసహనంతో తన ఆర్మ్ బ్యాండ్‌ను నేలకేసి కొట్టాడు. కెరీర్లో తన చివరి యూరో కప్‌లో ఆడిన రొనాల్డోకు ప్రిక్వార్టర్స్‌లోనే తన జట్టు ఇంటి దారి పట్టడం అస్సలు మింగుడు పడలేదు. Nahhh mannn, Possibly the last every time we see Ronaldo at the EUROS😢😢😢 pic.twitter.com/1aPQVOLr0F — Dhruvzzz (@dhruvzz8) June 27, 2021 కాగా, ఈ టోర్నీలో సూపర్ ఫామ్‌లో ఉన్న రొనాల్డో.. నాలుగు మ్యాచ్‌ల్లో ఐదు గోల్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అంతే కాదు, టోర్నీ చరిత్రలో అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా కూడా రికార్డు నెలకొల్పాడు. యూరో కప్‌లో అతను మొత్తం 14 గోల్స్ చేసి ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. ఇదే టోర్నీలో ఫ్రాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు గోల్స్ సాధించడం ద్వారా అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్(109 గోల్స్) సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఇరాన్‌కు చెందిన అలీ డేయీ(109 గోల్స్)తో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. అయితే ప్రిక్వార్టర్స్‌లో అతను ఒక్క గోల్ చేసుంటే తన జట్టును గట్టెక్కించడంతో పాటు అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించేవాడు. చదవండి: టీ20 ప్రపంచకప్ వేదిక మార్పు.. -
ఆ రాయిని కదిపి ఎంత పెద్ద పొరపాటు చేశాడంటే...
బ్రుసెల్స్ : ట్రాక్టర్‌తో పొలం పనులు చేసుకోవటానికి అడ్డుగా ఉందని ఏకంగా రెండు దేశాల మధ్య సరిహద్దు రాయిని జరిపాడో రైతు. తనకు తెలియకుండా చేసినా పెద్ద పొరపాటే చేశాడు. వివరాలు. బ్రెజిల్‌కు చెందిన ఓ రైతు కొద్ది రోజుల క్రితం తన పొలంలో పని చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో పొలం పనులు చేసుకోవటానికి తరచుగా ట్రాక్టర్‌కు అడ్డు వస్తున్న రాయిపై అతడి కోపం వచ్చింది. ఆ రాయి ఏంటి? అదెందుకు అక్కడ ఉంది? అన్నదేమీ ఆలోచించకుండా 2.25 మీటర్లు వెనక్కు జరిపి, తన పని చేసుకుని వెళ్లిపోయాడు. రెండు రోజుల తర్వాత కొందరు చరిత్రకారులు అటు వైపు వచ్చారు. 1819లో పాతిన ఫ్రాన్స్-బెల్జియం దేశాలకు సంబంధించిన ఆ సరిహద్దు రాయి ఉండాల్సిన ప్రదేశంలో కాకుండా వెనక్కు ఫ్రాన్స్ భూభాగంలోకి జరిగి ఉండటాన్ని గుర్తించారు. దీనిపై చరిత్రకారుడు డేవిడ్ లావాక్స్ మాట్లాడుతూ.. ‘‘ ఆ రైతు రాయిని జరపటం ద్వారా బెల్జియం పెద్దదైంది.. ఫ్రాన్స్ చిన్నదైంది. నాకు సంతోషం వేసింది. ఎందుకంటే మా టౌన్ పెద్దదైంది కాబట్టి. అయినప్పటికి అది మంచి ఐడియా కాదు. ఫ్రాన్స్‌లోని భౌసిగ్నీస్ మేయర్ సర్ రాక్ దీనికి ఒప్పుకోలేదు. అందుకే దాన్ని యధా స్థానంలో పెట్టడానికి నిర్ణయించాము’’ అని చెప్పాడు. మామూలుగా అయితే ఈ సంఘటన రెండు దేశాల మధ్య గొడవకు దారి తీసేదే. కానీ, ఇరు దేశాల మధ్య మంచి సంబంధాలు ఉండటంతో.. స్థానిక అధికారులు దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. చిరు నవ్వులతో ఏం చేయాలో నిర్ణయం తీసుకున్నారు. -
ఆరు రెట్లు అధికంగా కరోనా వైరస్ వ్యాప్తి
సాక్షి, హైదరాబాద్: కరోనావైరస్ ప్రపంచాన్ని ఇంకా అతలకుతలం చేస్తూనే ఉంది. ఈ సమయంలో కరోనా వైరస్ వ్యాప్తి నివేదించిన వాస్తవ సంఖ్య కంటే ఆరు రెట్లు అధికంగా సంక్రమిస్తుందని ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్శిటీ (ఏఎన్‌యూ), మెల్బోర్న్ విశ్వవిద్యాలయ అధ్యయనంలో వెల్లడైంది. పరిశోధకుల అధ్యయనం ప్రకారం, 15 దేశాలలో మార్చి 2020 నుంచి ఆగస్టు 2020 మధ్య కరోనా వైరస్ వ్యాప్తి నివేదించిన కేసుల కంటే సగటున 6.2 రెట్లు ఎక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ అధ్యయనాన్ని ‘రాయల్ సొసైటీ ఓపెన్ సైన్స్’లో ప్రచురించారు. ఇది యూకే, ఫ్రాన్స్, బెల్జియం, ఇటలీ దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి రేటు నివేదించిన దానికంటే చాలా ఎక్కువ. ఇటలీ విషయంలో 17 రెట్లు ఎక్కువని తెలిసింది. డేటా ప్రకారం, 15 దేశాలలో ఏప్రిల్ చివరి నాటికి చూస్తే ఆస్ట్రేలియాల్లో వ్యాధి వ్యాప్తి అధికంగా ఉంది. అయితే వ్యాధి వ్యాప్తి రేటు ఆగస్టు చివరిలో అధికారికంగా నివేదించిన దానికంటే ఐదు రెట్లు అధికంగా ఉండొచ్చని పీటీఐ తెలిపింది. 800 మిలియన్లకు పైగా జనాభా ఉన్న 11 యూరోపియన్ దేశాలు, ఆస్ట్రేలియా, కెనడా, దక్షిణ కొరియా, అమెరికాలో వాస్తవ సంఖ్య కంటే వ్యాప్తి అధికంగా ఉందని అధ్యయనంలో పరిశోధకులు అంచనా వేశారు. (చదవండి: కోవిషీల్డ్‌తో మెరుగైన ఫలితాలు) ధ్రువీకరించబడిన కేసుల కంటే అధికం... ‘అనేక దేశాలలో ధ్రువీకరించబడిన కేసుల కంటే కోవిడ్-19 వ్యాప్తి చాలా ఎక్కువగా ఉంది. ఇది వ్యాధిని నియంత్రించడంలో, వ్యాప్తి సంభావ్యత రెండింటికీ అడ్డుగా మారింది. ఉదాహరణకు, ఒక విశ్లేషణలో 5.4 మిలియన్లకు పైగా జనాభా ఉన్నా యూకేలో సుమారు 8 శాతం జనాభాకు కరోనావైరస్ సంక్రమించింద’ని అధ్యయన సహ రచయిత ప్రొఫెసర్ క్వెంటిన్ గ్రాఫ్టన్ తెలిపిన విషయాన్ని పిటిఐ వెల్లడించింది. ‘ఈ పరిశోధనలు కరోనావైరస్ మహమ్మారిపై మనం ఎలా వ్యవహరించాం, ప్రస్తుతం కరోనా బారినపడే వ్యక్తుల అనారోగ్యం, జీవితకాలంలో వారి ఆరోగ్యంపై ఏర్పడే ప్రభావాలతో పాటు, లాక్డౌన్లను ఎలా అమలు చేశాం, ఉపయోగించుకున్నాం. ఈ మహమ్మారిని నియంత్రించడంలో ఎంతవరకు ముందున్నామ’నే విషయాలను తెలుపుతుందని గ్రాఫ్టన్ చెప్పారు. కరోనావైరస్ మరణాలను పరిశీలించేందుకు "బ్యాక్కాస్టింగ్" అనే ప్రక్రియను పరిశోధకులు ఉపయోగించారు. దీనిని వ్యాధి వ్యాప్తి నుంచి లక్షణాల వరకు, వ్యాధి లక్షణాల నుంచి మరణం వరకు ఉన్న సమయంతో పోల్చారు. ఈ ప్రక్రియతో వ్యాధి వ్యాప్తి రేటును సుమారు 95 శాతం వరకు కచ్చితంగా నిర్థారించినట్టు గ్రాఫ్టన్ తెలిపారు. "సరళంగా చెప్పాలంటే, ఒక దేశంలో కోవిడ్-19తో ఎంత మంది మరణించారనే దానిపై మేము గణాంకాలను విశ్లేషించాం. ఎంత మందికి వ్యాధి సోకి చనిపోయారో అనే విషయాన్ని గత వివరాలు ఆధారంగా కనుగొన్నాం. కరోనా మరణాల సంఖ్యపై, వాస్తవ వ్యాప్తి రేటును అంచనా వేయడానికి సులభమైన పద్ధతి ఇద"ని ఇకిగై రీసెర్చ్ స్టీవెన్ ఫిప్స్ ను పీటీఐ ఉటంకించింది. -
క్లాస్ రూంలో ఉపాధ్యాయుడి వికృత చేష్టలు
బ్రసెల్స్: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు వికృత చేష్టలకు పాల్పడ్డాడు. చిన్నారులకు మహమ్మద్ ప్రవక్త నగ్న కార్టూన్ని చూపించడంతో సస్పెండ్ అయ్యాడు. వివరాలు.. బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లోని మోలెన్బీక్లోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు ఒకరు పదేళ్లలోపు చిన్నారులకు మహ్మద్ ప్రవక్త నగ్న కార్టూన్ని చూపించాడని తెలిసింది. సివిక్ స్పిరిట్ క్లాస్‌లో భాగంగా ఉపాధ్యాయుడు ఐదవ తరగతి విద్యార్థులకు కార్టూనిస్ట్ కోకో గీసిన మోకాళ్లపై నగ్నంగా ఉన్న మహమ్మద్ ప్రవక్త కార్టూన్ని చూపించాడు. ఇంటికి వచ్చిన పిల్లలు తరగతి గదిలో జరిగిన సంఘటన గురించి తల్లిదండ్రులకు చెప్పడంతో ఇది వెలుగులోకి వచ్చింది. వారి ఫిర్యాదు మేరకు సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు మోలెన్‌బీక్ మేయర్ కేథరీన్ మౌరెక్స్ తెలిపారు. ‘చిన్నారులకు అశ్లీల ఫోటోలను చూపిండం నేరం. పైగా సదరు ఉపాధ్యాయుడి మహమ్మద్ ప్రవక్త వ్యంగ్య చిత్రాలను చూపించాడు. ఇది తీవ్రంగా పరిగణించాల్సిన అంశం. అందుకే అతడి మీద చర్యలు తీసుకున్నాం’ అని కేథరీన్ తెలిపారు. (చదవండి: ప్రధానికి వీపు చూపిస్తూ వైద్యుల నిరసన) ఉపాధ్యాయుని సస్పెన్షన్‌పై ఫ్రాంకోఫోన్ లిబరల్ పార్టీ ఎంఆర్ అధ్యక్షుడు జార్జెస్-లూయిస్ బౌచెజ్ స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్లో "ఈ సమాచారం ఖచ్చితమైనది కాదని నేను నమ్ముతున్నాను, అది నిజమైతే, అది ఆమోదయోగ్యం కాదు, అసహనంగా ఉంటుంది. భావ ప్రకటనా స్వేచ్ఛ చర్చించలేనిది" అంటూ ట్వీట్ చేశారు. మౌరిక్స్ ఈ ట్వీట్‌కు సమాధానమిస్తూ..‘ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్నారులకు అశ్లీల చిత్రాలు చూపించరాదని, ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవడానికి ఇదే కారణమని’ హామీ ఇచ్చారు. -
యూరప్, అమెరికాకు కోవిడ్ దడ
వాషింగ్టన్/లండన్: కరోనా మహమ్మారి యూరప్, అమెరికా దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. మొదటి సారి కంటే సెకండ్ వేవ్‌లో అత్యంత భయంకరంగా వైరస్ విజృంభిస్తోంది. అమెరికాలో రికార్డు స్థాయిలో గురువారం ఒకే రోజు 90 వేల కేసులు నమోదు కాగా యూరప్ దేశాలైన ఫ్రాన్స్, బెల్జియం, ఇటలీలలో కరోనా రోగులతో ఆస్పత్రులన్నీ కిటకిటలాడిపోతున్నాయి. ఫ్రాన్స్‌లో నెలరోజుల పాటు దేశవ్యాప్త లాక్డౌన్ అమలు చేస్తే, జర్మనీలో పాక్షికంగా లాక్డౌన్ ప్రకటించారు. పోర్చుగల్, చెక్ రిపబ్లిక్ వంటి దేశాల్లో కర్ఫ్యూని అమలు చేశారు. ఐర్లాండ్ వారం రోజుల క్రితమే అత్యవసరాలు మినహా మార్కెట్లని మూసేసింది. దీంతో బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌పై కూడా దేశంలో లాక్డౌన్ విధించాలంటూ ఒత్తిడి పెరిగిపోతోంది. మరోవైపు వివిధ దేశాల్లో లాక్డౌన్ పట్ల వ్యాపారస్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఇలా మార్కెట్లను మూసేస్తుంటే తాము ఎలా జీవించాలంటూ స్పెయిన్ నుంచి ఇటలీ వరకు ప్రజలు రోడ్లెక్కి లాక్‌డౌన్‌కి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. మరో 5 నెలలు ఇంతే..! యూరప్ దేశాల్లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ వరకు కొనసాగే అవకాశాలున్నాయని యూకే సైంటిఫిక్ అడ్వైజరీ గ్రూప్ ఆఫ్ ఎమర్జెన్సీస్ (ఎస్‌ఏజీఈ) అంచనా వేసింది. అత్యంత కఠినంగా లాక్‌డౌన్‌ని అమలు పరచకపోతే పరిస్థితి మరింత దిగజారుతుందని బ్రిటన్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. కరోనా అంశంలో ఎస్‌ఏజీఈ వేసిన అంచనాలకు సంబంధించిన ఒక పత్రం లీకైంది. దాని ప్రకారం యూకేలోనే 85 వేల మంది వరకు మరణించే అవకాశాలున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో కరోనా మరింత ఉధృత స్థాయికి చేరుకొని రోజుకి 800 మంది వరకు మరణిస్తారు. 25 వేల మంది వరకు ఆస్పత్రి పాలవుతారని ఆ సంస్థ పేర్కొంది. వారిలో 5 వేల మంది వరకు ఐసీయూలో ఉంటారు. ఇక బ్రిటన్‌లో ప్రతి రోజూ లక్ష మంది కరోనా బారిన పడతారని న్యూ ఇంపీరియల్ కాలేజీ స్టడీ వెల్లడించింది. ఒకే ఒక్క రోజు పది లక్షల మందికి కరోనా సోకిందన్న వార్త వినడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. ► ప్రతిరోజూ సగటున యూరప్ దేశాల్లో 1,370 మంది చనిపోతుండగా, అమెరికాలో 808 మంది చొప్పున మరణిస్తున్నారు. ► గత వారంలో యూరోపియన్ యూనియన్, యూకేలో సగటున రోజుకి లక్షా 76 వేల మంది కరోనా బారిన పడగా, అమెరికాలో రోజుకి సగటున 72 వేల కేసులు నమోదవుతున్నాయి. ► ఫ్రాన్స్‌లో సగానికి పైగా ఐసీయూ బెడ్స్ కరోనా రోగులతో నిండిపోయాయి. ► ఇటలీలోని మిలాన్ నగరంలో వాణిజ్య ప్రదర్శనకు వినియోగించే కేంద్రాలను తాత్కాలిక కోవిడ్ ఆస్పత్రులుగా మార్చారు. ► బెల్జియంలోని 10% ఆస్పత్రుల్లో నర్సులకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో లక్షణాలు లేకుండా కరోనా ఉన్నవారందరూ విధులకు హాజరు కావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ► యూరోపియన్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ సిఫారసుల ప్రకారం కరోనా చేసిన పరీక్షల్లో 3శాతం కంటే తక్కువ మందికే పాజిటివ్ రావాలి. కానీ స్పెయిన్‌లో 11%, ఫ్రాన్స్‌లో 18%, నెదర్లాండ్స్, చెక్ రిపబ్లిక్లలో 26% వరకు పాజిటివిటీ రేటు ఉంది. ► కోవిడ్ అమెరికా, యూరప్లపై తీవ్ర ఆర్థిక ప్రభావాన్ని చూపించింది. యూరోజోన్ ఎకానమీ 2020లో 8.3% తగ్గిపోతే, అమెరికా ఎకానమీలో 4.3% తగ్గుదల కనిపించింది. ఎందుకీ విజృంభణ? యూరప్ దేశాల్లో కోవిడ్–19 తొలి దశ విజృంభణ ముగిసిపోయాక ఆ దేశాలన్నీ బాగా రిలాక్స్ అయిపోయాయి. మొదటి సారి లాక్డౌన్ సమయంలో మళ్లీ మహమ్మారి విజృంభిస్తే ఎదుర్కోవడానికి అవసరమైన ప్రణాళికలను ప్రభుత్వాలు పక్కాగా రచించలేదు. కరోనా రోగుల ట్రాకింగ్, ట్రేసింగ్, టెస్టింగ్ కార్యక్రమం మిగిలిన దేశాలతో పోల్చి చూస్తే యూరప్‌లో పకడ్బందీగా అమలు కాలేదు. అంతేకాదు గత వేసవిలో ప్రజలు కూడా యథేచ్ఛగా తిరిగారు. విపరీతంగా ప్రయాణాలు చేయడం, నైట్ లైఫ్ ఎంజాయ్ చేయడం, క్లబ్బులు పబ్బులు, బీచ్‌ల వెంట తిరగడం చేశారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి చర్యలన్నీ గాలికి వదిలేశారు. దీంతో అక్టోబర్‌లో మళ్లీ కరోనా బాంబు పేలింది. -
బెల్జియం రాకుమారి సైనిక శిక్షణ
కొత్త స్టూడెంట్ వస్తే క్లాస్ రూమ్‌కి కళ వస్తుంది. ఇక్కడ కొత్తగా వచ్చింది రాకుమారి ఎలిజబెత్! ఆమె అడుగు పెట్టగానే రాయల్ మిలటరీ అకాడెమీ మొత్తానికే కళాకాంతులు వచ్చాయి. కాంతి ఎక్స్ట్రా. ఆరేళ్లు రాగానే పిల్లల్ని మన భాషలో స్కూల్లో పడేసినట్లు.. పద్దెనిమిదేళ్లు రాగానే రాజవంశాల్లో మిలటరీ అకాడెమీకి పంపించేస్తారు. రెండుమూడేళ్ల వరకు ఇంటి మీద బెంగ పడేందుకు లేదు. ఎలిజబెత్ బెల్జియం రాకుమారి. క్రౌన్ ప్రిన్సెస్. అంటే సింహాసనాన్ని అధిష్టించడానికి నెక్స్ట్ లైన్లో ఉన్న వారసురాలు. తండ్రి కింగ్ ఫిలిప్. బెల్జియం రాజు. ఆయన కూడా ఈ అకాడెమీలోనే 1978–81 మధ్య సైనిక శిక్షణ తీసుకున్నారు. రథ గజ తురగ పదాతి సైన్యాలు ఎన్ని ఉన్నా రైతు బిడ్డ వ్యవసాయం చేసినట్లు రాజు బిడ్డ కత్తి తిప్పాల్సిందే. ఇప్పుడు కత్తుల్లేవు కనుక ఆడపిల్లయినా కసరత్తులు చేసి రాటు తేలాలి. డిఫెన్స్ వాల్యూస్ నేర్చుకోవాలి. డిసిప్లెయిన్, రెస్పెక్ట్, కమిట్మెంట్.. ఇవీ ఆ వాల్యూస్. ధైర్యం ఒకరు నేర్పేది కాకపోయినా ధైర్యంగా ఉండటం కూడా ఒక సబ్జెక్టుగా నేర్పిస్తారు. షూటింగ్, మార్చింగ్, మారువేషంలో తప్పించుకునే మెళకువలు చెప్తారు. ఇప్పుడైతే రాకుమారి ఎలిజబెత్ కు నాలుగు వారాల శిక్షణే. అయితే చేరి నెల కావస్తున్నా.. ఈ వాట్సాప్ యుగంలోనూ.. మిలటరీ డ్రెస్ వేసుకుని యుద్ధ విద్యలు అభ్యసిస్తున్న ఆమె ఫొటోలు ఇన్నాళ్లకు గానీ బయటికి రిలీజ్ కాలేదు. ఇక రాజుగారు, రాణిగారు కూతుర్ని కళ్లారా సోల్జర్ గా చూసుకుని మురిసిపోయే వేడుక కోసం సెప్టెంబర్ 25 వరకు ఆగక తప్పదు. ఆరోజు అందరు జననీజనకులను రప్పించి, వారి పుత్రుడికో, పుత్రికకో వారి ఎదురుగా ‘బ్లూ బెరెట్’ (క్యాప్) తొడగబోతున్నారు. రత్నాల కిరీటాలు ఎన్ని ఉన్నా, రాజపుత్రికకు బ్లూ బెరెట్ తెచ్చే ఠీవే వేరు. అదొక స్టెయిల్లో ఉంటుంది.. కాన్ఫిడెన్సు, కదనోత్సాహమూ మిక్స్ అయి! బెల్జియం రాచకుటుంబంలో రాకుమారి ఎలిజబెత్ పెద్దమ్మాయి. తర్వాత ఇద్దరు తమ్ముళ్లు, ఒక చెల్లెలు. వాళ్లతో ఈ పెద్దమ్మాయికి సమీప భవిష్యత్తులో ఆటలు లేనట్లే. బ్లూ బెరెట్ సెరమనీ తర్వాత రెండో దశ శిక్షణ ప్రారంభం అవుతుంది పాపం. -
ప్రధానికి వీపు చూపిస్తూ వైద్యుల నిరసన
బ్రసెల్స్: కరోనా కాలంలోనూ నిర్విరామంగా విధులు నిర్వర్తిస్తున్న వైద్యులకు ఏమిచ్చినా తక్కువే. అలాంటిది ఓ దేశంలో మాత్రం వైద్యులకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదు. దీంతో ప్రభుత్వ విధానాలతో విసిగి వేసారిన వైద్యులు ప్రధానికి వినూత్న నిరసన తెలిపి షాక్ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే బెల్జియం ప్రధాని సోఫీ విల్మ్స్ బ్రస్సెల్స్‌లోని సెయింట్ పీటర్ ఆసుపత్రిని సందర్శించేందుకు వెళ్లారు. దీంతో అక్కడి వైద్యులు సహా సిబ్బంది రోడ్డుకిరువైపులా నిల్చుని ఉన్నారు. ఘన స్వాగతం కోసం అనుకుంటే తప్పులో కాలేసినట్లే.. ప్రధాని విల్మ్స్ విధానాలను వ్యతిరేకిస్తూ ప్రధానికి వీపు చూపిస్తూ నిలబడ్డారు. బడ్జెట్లో వీరికి తగినంతగా నిధులు కేటాయించకపోవడం, వేతనాల్లో కోత విధించడంతో ఇప్పటికే అసహనంతో ఊగిపోతున్నారు. (కరోనా విలయం : ఈమె త్యాగం మహోన్నతం) మరోవైపు ఎలాంటి అర్హతలు లేనివారిని కూడా ప్రభుత్వం నర్సులుగా నియమించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఈ క్రమంలో తమ వ్యతిరేకతను దేశాధ్యక్షురాలికి తెలియజెప్పేందుకు ఇలా వినూత్నంగా నిరసన తెలిపారు. కొన్నిసార్లు నిశ్శబ్ధ నిరసనే అన్నింటికన్నా ఉత్తమం అని సదరు ఆసుపత్రి వైద్యులు పేర్కొంటున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఓ జర్నలిస్టు సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్ అవుతోంది. "వారి నిరసనలో ఆవేదన కనిపిస్తోంద"ని, "ప్రాణాలకు తెగించి కరోనాతో యుద్ధం చేస్తున్న వైద్యులకు ప్రభుత్వాలు అండగా ఉండాల"ని పలువురు నెటిజన్లు వైద్య సిబ్బందికి మద్దతు తెలుపుతున్నారు. (కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిలో ముందడుగు) -
కరోనా విలయం : ఈమె త్యాగం మహోన్నతం
కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో ప్రపంచమంతా వణికిపోతోంది. ఈ మహమ్మారి కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ లేకపోవడంతో వేలమంది ప్రాణాలు కోల్పోగా, లక్షలమంది ఈ వైరస్ బారిన పడ్డాయి. అయితే ఇంతటి మహా విలయంలో ఒక పెద్దావిడ అపూర్వమైన త్యాగం చేశారు. వైరసె సోకి ఆరోగ్యం విషమించిన పరిస్థితుల్లో కూడా తనకు వెంటిలేటర్ వద్దని నిరాకరించారు. తనకు బదులుగా తనకంటే వయసులో చిన్న వారికి దాన్ని ఉపయోగించమని చెప్పారు. చివరకు కరోనా కాటుకు బలైపోయారు. బెల్జియంకు చెందిన సుజాన్ హోయలార్ట్స్(90) ఈ మహమ్మారి బారిన పడ్డారు. వ్యాధి ముదరడంతో ఆకలి మందగించడంతోపాటు, శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారింది. దీంతో ఆమెకు వెంటిలేటర్ అమర్చేందుకు వైద్యులు సిద్ధపడ్డారు. ఇక్కడే ఆమె పెద్దమనసును చాటుకున్నారు. ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న ఆమె తనకు కృత్రిమ శ్వాసక్రియను ఉపయోగించడం ఇష్టం లేదనీ, ఇప్పటికే చాలా మంచి జీవితాన్ని గడిపాను కనుక తనకు ఉపయోగించే ఆ పరికరాన్ని వేరే ఎవరైనా చిన్న వయసున్న రోగులకు ఉపయోగించండి అని వైద్యులతో చెప్పారు. దురదృష్టవశాత్తు ఆ తరువాత కొన్ని రోజులకే ఆమె కన్నుమూశారు. దీంతో ఆమె త్యాగం మరువలేనిదంటూ ఆమెకు చికిత్స అందించిన వైద్యులు సహా పలువురు కన్నీటి పర్యంతమయ్యారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. కాగా కరోనా వైరస్ కారణంగా పంచవ్యాప్తంగా ప్రస్తుతం 8,56,579పాజిటివ్ కేసులు నమోదు కాగా, 42,089 మంది మృతి చెందారు. ఈ మహమ్మారికి కచ్చితమైన మందు, వ్యాక్సిన్ ఏదీ అందుబాటులో రాకపోవడం మరింత ఆందోళన పుట్టిస్తోది. దీనికితోడు వేగంగా పెరుగుతున్న రోగుల సంఖ్య కారణంగా చాలా ప్రాంతాల్లో వెంటిలేటర్ల కొరత వేధిస్తోంది. చదవండి : అమెరికాను వణికించిన భూకంపం -
భారత్‌లో 30 కోవిడ్ కేసులు
న్యూఢిల్లీ: ప్రపంచం నలుమూలలకీ అత్యంత వేగంగా విస్తరిస్తోన్న కోవిడ్ ప్రజలను బెంబేలెత్తిస్తోంది. వైరస్ విజృంభణతో ప్రపంచ ప్రజల దైనందిన జీవితంలోనూ పెనుమార్పులు సంభవిస్తున్నాయి. విదేశీయుల రాకపోకలపై ఆంక్షలు పెరిగాయి. పాఠశాలలు, ప్రార్థనాలయాలు మూతపడ్డాయి. చైనాలో వైరస్ ప్రభావం తగ్గుముఖం పడుతోంటే, ఇటలీ, ఇరాన్ లాంటి ఇతర దేశాల్లో తీవ్రతరమౌతోంది. కరోనా కలకలం అంతర్జాతీయంగా దాదాపు 30 కోట్ల మంది విద్యార్థులను వారంపాటు విద్యాలయాలకు దూరం చేసింది. భారత్‌లో కరోనా బాధితుల సంఖ్య 30కి చేరడంతో ఢిల్లీలో ప్రాథమిక పాఠశాలలను ప్రభుత్వం మూసివేసింది. ఇటలీ, దక్షిణ కొరియాల నుంచి వచ్చే వారిపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. విదేశీయులను కోవిడ్ సోకలేదని వైద్యుల ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలని భారత్ కోరుతోంది. భారత్‌లో 30 కోవిడ్ కేసులు ఇటలీకి చెందిన పర్యాటకులతో సహా మార్చి 4వ నాటికి భారత్‌లో 29 కరోనా వైరస్ కేసులు నమోదైనట్టు ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ పార్లమెంట్లో ప్రకటించారు. 28,529 మందిని వైద్యపరిశీలనలో ఉంచినట్టు వెల్లడించారు. ఇటీవలే ఇరాన్లో పర్యటించి వచ్చిన ఘజియాబాద్‌కు చెందిన వ్యక్తికి ఈ వైరస్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 30కి చేరింది. వైరస్‌ను గుర్తించేందుకు జిల్లా, గ్రామస్థాయిల్లో బృందాలను ఏర్పాటు చేయాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది. (చదవండి: కోవిడ్‌ను జయించిన కేరళ విద్యార్థిని) మొత్తం 95 వేల మంది.. ప్రపంచవ్యాప్తంగా 95,000 మంది ప్రజలకు వైరస్ సోకగా, 3,200 మంది మరణించారు. ఇప్పటి వరకు 80 దేశాలకు కోవిడ్–19 వ్యాపించింది. చైనాలో తగ్గుముఖం పట్టిన వైరస్ వ్యాప్తి, చైనాలో కన్నా ఇతర ప్రాంతాల్లో ఎక్కువగా విస్తరిస్తోంది. గురువారం 31 మంది మృతిచెందగా ఇప్పటి వరకు మరణాల సంఖ్య 3,012కి చేరింది. 80,400 మందికి వైరస్ సోకినట్టు తేలింది. అమెరికాలో కోవిడ్ మృతుల సంఖ్య 11కు చేరడంతో కరోనాపై పోరాడేందుకు 8 బిలియన్ డాలర్లను వెచ్చించాలని అమెరికన్ కాంగ్రెస్ తీర్మానించింది. ఇరాన్లో మృతుల సంఖ్య 107కి చేరింది. 3,515 మందికి వైరస్ సోకినట్టు చేరింది. ఇటలీలోనూ కరోనా మృతుల సంఖ్య 107, బాధితులు 3000 మంది. దక్షిణ కొరియాలో బాధితుల సంఖ్య 6,000కు చేరింది. జీసస్ జన్మస్థలమైన పాలస్తీనాలోని బెత్లెహాం చర్చ్‌ని తాత్కాలికంగా మూసివేశారు. జపాన్, ఫ్రాన్స్‌లలో పాఠశాలలు మూసివేశారు. ఢిల్లీలోని మొగల్ గార్డెన్‌లోకి ప్రజల సందర్శనలను నిలిపి వేస్తున్నట్టు రాష్ట్రపతి భవన్ వెల్లడించింది. ఫ్లూతో బాధపడే ఉద్యోగులకు ఇంటినుంచి పనిచేసే అవకాశం ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వం యోచిస్తోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో 16 ఏళ్ల భారతీయ బాలికకు కోవిడ్ సోకినట్టు తేలింది. చాలా దేశాలు ఏమీ చేయడం లేదు.. ప్రపంచంలోని చాలా దేశాలు కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు తగు చర్యలు తీసుకోవడం లేదని, ఇది సరైన విధానం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ముప్పునకు తగ్గ చర్యలు తీసుకోవడంలో పట్టుదల చూపడం లేదని తెలిపింది. మోదీ బెల్జియం పర్యటన వాయిదా యూరోపియన్ యూనియన్‌తో వాణిజ్య ఒప్పందాల కోసం ప్రధాని నరేంద్ర మోదీ బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో జరగాల్సిన సదస్సు వాయిదా పడినట్లు భారత్ తెలిపింది. ఈ నెల 13న ఈ సమావేశం కోవిడ్ కారణంగా ఈ పర్యటన వాయిదా పడింది. ఇరు వర్గాలకూ కుదిరే మరో సమయంలో భేటీ జరుగనుంది. ఆక్టెమ్రాతో కోవిడ్‌కు చెక్? ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు విరుగుడు దొరికిందా? అవును అంటోంది స్విట్జర్లాండ్ ఫార్మా కంపెనీ రోష్! ఆర్థరైటిస్ రోగుల్లో మంట/వాపులను తగ్గించేందుకు ఉపయోగించే అక్టెమ్రా అనే మందు కరోనా వైరస్ కట్టడికీ ఉపయోగపడవచ్చునని రోష్ చెబుతోంది. వ్యాధికి కేంద్రబిందువైన చైనాలో అక్టెమ్‌రాను వాడేందుకు ఇప్పటికే చైనా ప్రభుత్వ అనుమతి పొందిన రోష్ సుమారు 20 లక్షల డాలర్ల విలువైన మందులను చైనా ప్రభుత్వానికి ఉచితంగా అందజేసింది. అక్టెమ్‌రాను వైద్య పరిభాషలో టోసిలిజుమాబ్ అని పిలుస్తారు. 2010 నుంచి దీనిని అమెరికాలో ఆర్థరైటిస్ చికిత్సలో వాడుతున్నారు. దీంట్లో అత్యధిక మోతాదులో తెల్ల రక్తకణాలు విడుదల చేసే ప్రొటీన్లు ఉంటాయి. చైనా ప్రచురించిన మార్గదర్శకాల ప్రకారం కరోనా కారణంగా ఊపిరితిత్తులు దెబ్బతిన్న వారికి అక్టెమ్‌రాను వాడవచ్చు. -
పురుగుల లార్వాతో కేకులు, కుకీలు
-
తిన్నాక తెలిస్తే వాంతి చేసుకుంటారు!
బెల్జియం : అవును! బెల్జియంకు చెందిన ఘెంట్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు కేకులు, కుకీలు ఇతర ఆహారపదార్ధాలు దేంతో తయారుచేశారో తెలిస్తే మన కడుపులో తిప్పేయటం ఖాయం. ఒక వేళ అది తిన్న తర్వాత అసలు విషయం తెలిస్తే వాంతి చేసుకుంటారు. ఇంతకీ అవి దేంతో తయారు చేశారని ఆలోచిస్తున్నారా?.. బ్లాక్ సోల్జర్ అనే పురుగుల లార్వాతో. పురుగుల లార్వాతో పదార్ధాలను తయారుచేయటం డైరీ ఉత్పత్తులకంటే మేలని అంటున్నారు ఘెంట్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. డేలాన్ జోంపా సోస అనే శాస్త్రవేత్త మాట్లాడుతూ.. ‘ పురుగుల పెంపకం పాడి పరిశ్రమ లాగా ఎక్కువ ప్లేస్‌ను తీసుకోదు. వాటి తిండికి కూడా ఎక్కువ ఖర్చుకాదు. నీటిని కూడా తక్కువ తీసుకుంటాయి. వీటిలో అధిక ప్రొటీన్, విటమిన్స్, ఫైబర్, మినరల్స్ ఉంటాయి. వీటి పెంపకానికి తక్కువ ఖర్చు, పర్యావరణానికి మంచిద’ని తెలిపింది. పురుగుల ద్వారా తయారైన వాటిని తిన్న వారు పురుగు పదార్ధాలకు, పాల పదార్ధాలకు మధ్య పెద్ద తేడా గుర్తించలేకపోయారు. అయితే సగం తిన్న తర్వాత ఓ రకమైన రుచిని తాము పొందామని చెప్పారు. ఏదేమైనప్పటికి పురుగులతో తయారుచేసిన పదార్ధాలను కొనబోమని తేల్చిచెప్పారు. -
ప్రపంచ చాంపియన్‌కు భారత్ షాక్
భువనేశ్వర్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ హాకీ లీగ్‌లో భారత పురుషుల జట్టు తమ జోరు కొనసాగిస్తోంది. నెదర్లాండ్స్‌తో తొలి రౌండ్ రెండు మ్యాచ్‌ల్లో నెగ్గిన టీమిండియా... ప్రపంచ చాంపియన్ బెల్జియంతో శనివారం రెండో రౌండ్ తొలి మ్యాచ్‌లో 2–1తో సంచలన విజయం సాధించింది. ఆట రెండో నిమిషంలో మన్దీప్ సింగ్ గోల్‌తో భారత్ ఖాతా తెరిచింది. 33వ నిమిషంలో బొకార్డ్ గోల్‌తో బెల్జియం స్కోరును సమం చేసింది. ఆ తర్వాత 47వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను రమణ్‌దీప్ సింగ్ గోల్‌గా మలచడంతో భారత్ 2–1తో ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న భారత్ విజయాన్ని ఖాయం చేసుకుంది. నేడు ఇదే వేదికపై ఈ రెండు జట్లు మళ్లీ తలపడతాయి. -
చైనా చిందేసింది
చాంగ్జౌ: ఓటమి అంచుల నుంచి గట్టెక్కి విజయం రుచి చూస్తూ చైనా మహిళల హాకీ జట్టు వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత పొందింది. బెల్జియంతో శనివారం జరిగిన ఒలింపిక్స్ క్వాలిఫయర్స్‌లో చైనా విజయం సాధించి ఈ ఘనత సాధించింది. తొలి మ్యాచ్‌లో చైనా 0–2తో ఓడిపోయింది. అయితే రెండో మ్యాచ్‌ను ఆ జట్టు 2–2తో ‘డ్రా’ చేసుకుంది. మరో నాలుగు నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా... చైనా అద్భుతం చేసింది. 56వ, 57వ నిమిషాల్లో ఒక్కో గోల్ చేసి స్కోరును సమం చేసింది. మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించింది. దాంతో నిర్ణీత రెండు మ్యాచ్‌ల తర్వాత గోల్స్ సగటులో చైనా, బెల్జియం 2–2తో సమంగా నిలిచాయి. దాంతో విజేతను నిర్ణయించడానికి షూటౌట్‌ను నిర్వహించారు. షూటౌట్లో రెండు జట్లు ఐదేసి షాట్లు తీసుకున్నా... ఇక్కడా స్కోరు 1–1తో సమమైంది. దాంతో సడెన్‌డెత్ నిర్వహించారు. సడెన్‌డెత్‌లో తొలి షాట్‌ను చైనా క్రీడాకారిణి లీ జియాకి బంతిని లక్ష్యానికి చేర్చగా... బెల్జియం క్రీడాకారిణి అలిక్స్ జెనీర్స్ కొట్టిన షాట్ బయటకు వెళ్లిపోవడంతో చైనా 2–1తో విజయాన్ని ఖాయం చేసుకుంది. వరుసగా ఆరోసారి ఒలింపిక్స్‌కు అర్హత సాధించి సంబరాల్లో మునిగి తేలింది. -
భారత్ క్లీన్‌స్వీప్
ఆంట్వర్ప్: బెల్జియం పర్యటనను భారత పురుషుల హాకీ జట్టు క్లీన్ స్వీప్‌తో ముగించింది. గురువారం జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్ 5–1తో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ బెల్జియంపై ఘన విజయం సాధించింది. భారత ఆటగాళ్లు సిమ్రన్ జీత్ సింగ్ (7వ నిమిషంలో), లలిత్ (35వ ని.లో), వివేక్ సాగర్ (36వ ని.లో), హర్మన్‌ప్రీత్ సింగ్ (42వ ని.లో), రమణ్‌దీప్ సింగ్ (43వ ని.లో) తలా ఓ గోల్ సాధించారు. ప్రత్యర్థి తరఫున హెన్రిక్స్ (39వ ని.లో) ఏకైక గోల్ చేశాడు. ఈ పర్యటనలో భారత్ తన తొలి మ్యాచ్‌లో 2–0తో బెల్జియంపై, అనంతరం రెండు, మూడు మ్యాచ్‌ల్లో 6–1తో, 5–1తో స్పెయిన్‌పై, నాలుగో మ్యాచ్‌లో 2–1తో బెల్జియంపై విజయాలను సాధించింది. -
అరుదైన శునకం ..ఖరీదు రెండు లక్షలా?
సాక్షి, అనంతపురం: కుక్క ధర లక్షలు పలుకుతోంది. ఇదెక్కడో అనుకుంటే పప్పులో కాలేసినట్లే.... మన అనంతపురంలోనే. అమెరికాలో కనిపించే మేలుజాతి శునకం ఇప్పుడు అనంతపురంలోనూ కనిపిస్తోంది. ఎంతో ఇష్టంగా తెచ్చుకున్న కుక్క ప్రస్తుతం యజమానికి కాసులను కురిపిస్తోంది. అమెరికాలో సెక్యూరిటీ కోసం బెల్జియం మెల్లాయిస్ జాతికి చెందిన శునకాన్ని అక్కడి పోలీసులు సెక్యూరిటీ కోసం వినియోగిస్తున్నారు. దీంతో ముచ్చటపడ్డ ప్రణీత్ అరుదైన జాతి శునకాన్ని అనంతపురానికి తెచ్చేసుకున్నాడు. అనంతపురంలో రెండో రోడ్డులో నివాసముంటున్న ప్రణీత్‌రెడ్డి బెల్జియం మెల్లాయిస్ జాతి శునకాన్ని పెంచుకుంటున్నారు. ప్రస్తుతం ఈ శునకం తొమ్మిది పిల్లలకు జన్మనిచ్చింది. ఈ జాతి కుక్క ఒక్కొక్కటి రూ.3లక్షలు పలుకుతోందని, పిల్లలైతే రూ.2లక్షల దాకా ఉంటుందని ప్రణీత్‌రెడ్డి చెబుతున్నారు. -
సిగరెట్ లైటర్ వల్లే అతడి ఆచూకీ తెలిసింది..
పారిస్ : గత అక్టోబరులో హత్యకు గురైన భారత పౌరుడి మర్డర్ మిస్టరీలో పురోగతి సాధించామని ఫ్రెంచ్ పోలీసులు తెలిపారు. మృతుడి ప్యాంటు జేబులో లభించిన సిగరెట్ లైటర్ ఆధారంగా అతడి ఆచూకీ కనిపెట్టగలిగామని పేర్కొన్నారు. వివరాలు... గతేడాది ఫ్రాన్స్‌లోని బోర్బర్గ్లోని రోడ్డు పక్కన మిషన్ ఆపరేటర్‌కు మృతదేహం కనిపించింది. దీంతో వెంటనే అతడు పోలీసులకు సమాచారం అందించాడు. అయితే శవం పూర్తిగా విచ్ఛిన్నమైపోవడం, అతడికి సంబంధించిన ఎటువంటి కార్డులు లభించకపోవడంతో మృతుడిని గుర్తించడం పోలీసులకు సవాలుగా మారింది. అతడి వేలి ముద్రలు, డీఎన్ఏ ఆధారంగా విచారణ జరిపినా ప్రయోజనం లేకపోయింది. ఈ క్రమంలో కేసును సవాలుగా తీసుకున్న పోలీసులకు.. అతడి జేబులో సిగరెట్ లైటర్ దొరికింది. దానిపై రాసి ఉన్న పేరు ద్వారా అతడి ఆచూకీ తెలుసుకునేందుకు మార్గం దొరికింది. ఈ నేపథ్యంలో బెల్జియంలో నివసిస్తున్న దర్శన్ సింగ్ అనే వ్యక్తి ఫ్రాన్స్‌లో హత్యకు గురై ఉంటాడని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. వెంటనే బెల్జియం ఫెడరల్ పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో సిగరెట్ లైటర్‌పై ఉన్న క్రెగ్ కేఫ్(పబ్ పేరు) అనే అక్షరాల ఆధారంగా మృతుడి ఇంటికి వెళ్లి అతడి వివరాలు సేకరించారు. వాటి ఆధారంగా హంతకుడి జాడ కనిపెట్టే దిశగా విచారణ జరుపుతున్నామని పోలీసులు పేర్కొన్నారు. -
జోష్నాకు షాక్
న్యూఢిల్లీ:ఎల్ గునా ఓపెన్ అంతర్జాతీయ స్క్వాష్ టోర్నమెంట్లో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు లభించాయి. మహిళల సింగిల్స్‌లో 16వ సీడ్ జోష్నా చినప్ప రెండో రౌండ్లో నిష్క్రమించగా... పురుషుల సింగిల్స్‌లో సౌరవ్ ఘోషాల్ ముందంజ వేశాడు. శుక్రవారం ఈజిప్ట్‌లో జరిగిన మ్యాచ్‌ల్లో జోష్నా 8–11, 5–11, 11–6, 12–10, 4–11తో టినీ గిలిస్ (బెల్జియం) చేతిలో ఓడిపోగా... సౌరవ్ 11–9, 11–1, 3–11, 9–11, 11–6తో ఎడ్మన్ లోపెజ్ (స్పెయిన్)పై విజయం సాధించాడు. -
ఆ సాయంత్రం ఢిల్లీలో జరిగిందేమిటి?
ఆ యువతికి మొదటిసారి అనుమానం వచ్చింది. తనేదైనా ట్రాప్‌లో చిక్కుకుపోతున్నానా అని భయానికి లోనైంది. అప్పటికే ఐదు గంటలుగా ఆమె తన ప్రమేయం లేకుండానే ఢిల్లీ ఆటోల్లో తిరుగుతోంది. బాగా అలసటగా ఉంది. చీకటిపడి చాలా సేపే అయింది. ఇండియాను చూసేందుకు వచ్చిన ఒక విదేశీ యువతి, ఇరవై నాలుగ్గంటల్లోనే ఇండియాను వదిలి వెళ్లిపోయిందంటే కారణం ఏమై ఉంటుంది? ‘స్టార్ట్ ఇమీడియట్లీ’ అనే కాల్ ఆమెకు ఆమె కుటుంబ సభ్యుల నుంచి వచ్చి ఉండాలి. లేదంటే, ‘ఇండియా నుంచి వెంటనే పారిపో’ అనే సంకేతం ఆమె మనసుకు అంది ఉండాలి. గత ఏడాది డిసెంబర్ 6 సాయంత్రం నాలుగు గంటలకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన ఒక బెల్జియం యువతి.. ఇరవై నాలుగ్గంటల్లోపే ఇండియా నుంచి తప్పించుకుని వెళ్లింది. బెల్జియం వెళ్లిన కొన్నాళ్లకు రాయబార కార్యాలయానికి వెళ్లింది. ఇండియాలో ఆ రోజు ఏం జరిగిందీ వెల్లడించింది. ఆ విషయాన్ని బెల్జియం.. భారత విదేశీ వ్యవహారాల శాఖ దృష్టికి తెచ్చింది. వెంటనే భారత ప్రభుత్వం ‘హంట్’ మొదలు పెట్టింది. ఇండియాలో ఆ రోజు ఫ్లయిట్ దిగగానే తనకు తారసపడిన వారు అడుగడుగునా తననెంత అయోమయంలో పడేసిందీ, తననెలా మోసం చేయాలని ప్రయత్నించిందీ, తనెంత మానసిక ఒత్తిడికి లోనైందీ వివరిస్తూ బెల్జియం యువతి చేసిన ఫిర్యాదుపై భారత ప్రభుత్వం ఇప్పుడు ఢిల్లీ పోలీసులను పరుగులు తీయిస్తోంది. ఆమెను ఇరవై నాలుగ్గంటల్లోపు పారిపోయేలా చేసి, దేశ ప్రతిష్టను దెబ్బతీసిన వారందరినీ ఇరవై నాలుగ్గంటల్లో పట్టుకోవాలని ఆదేశాలు వెళ్లాయి మరి. నిందితులను పట్టుకుంటే దేశం పరువు దక్కేదేం ఉండదు. కానీ నిందితులను పట్టుకోలేకపోతే మాత్రం అది ఇంకో పరువుపోయే విషయం అవుతుంది! జరిగిందేమిటి? ఆ సాయంత్రం ఢిల్లీలో దిగిన వెంటనే బెల్జియం యువతి ఒక సిమ్ కార్డు కొనుగోలు చేసింది. అక్కడే ఆటో ఎక్కి, న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌కు పోనివ్వమంది. మింటో రోడ్డుకు వెళ్లాలి తను. అయితే ఆటోవాలా ఆమె మింటో రోడ్డు వైపు కాకుండా ఇంకో రూట్లో తీసుకెళ్లి ఇద్దరు మగ మనుషుల ముందు ఆటో ఆపాడు. వాళ్లు ఆ యువతికి తమ పోలీస్ ఐడెంటిటీ కార్డులు చూపించారు. ‘‘ఇటువైపు నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. అయినప్పటికీ ముందుకు వెళ్లాలంటే, మీరు టూరిస్టు పోలీసుల అనుమతి తీసుకోవాలి’’ అని ఆమెకు ఒక అడ్రెస్ ఇచ్చారు, టూరిస్టు పోలీసులు ఆ అడ్రస్‌లో ఉంటారని! ఆటోవాలా అమెను ఆ అడ్రెస్‌కు తీసుకెళ్లాడు. అక్కడ మళ్లీ ఆరుగురు మగవాళ్లు ఉన్నారు. వాళ్లంతా పోలీస్ యూనిఫామ్‌లో ఉన్నారు. ‘‘మీరు వెళ్లాలని అనుకుంటున్న వైపు వెళ్లడం అసంభవం. వెంటనే మీరు ఈ ప్రాంతాన్ని వదిలివెళితే మంచిది’’ అని చెప్పారు. ఆమెకేవో హింసాత్మక నిరసన ప్రదర్శనల లైవ్ వీడియోలను కూడా చూపించారు. తర్వాత ఆమె మెడలోని ఆభరణాలను చూస్తూ, ‘‘గోల్డేనా?’’ అని అడిగారు. ఆమె బుక్‌చేసిన హోటల్ ఫోన్ నంబర్ అడిగి తీసుకుని, హోటల్‌కి ఫోన్ చేసి,‘‘మీ రూమ్ బుకింగ్ క్యాన్సిల్ అయిందట! చెప్పాం కదా, పరిస్థితి బాగోలేదని’’ అన్నారు. అక్కడే ఉన్న ఒక ఆటోను చూపించి, ‘‘అందులో ఎక్కి సెంట్రల్ ఢిల్లీలోని ఫలానా ట్రావెల్స్‌కు వెళ్లండి’’ అని సలహా ఇచ్చారు. మొదటి ఆటోవాలా పక్కకు తప్పుకున్నాక, రెండో ఆటోవాలా ఆమెను ఎక్కించుకుని ఎన్.డి.ఎం.సి.మార్కెట్ (న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ మార్కెట్) ఏరియాలో ఉన్న ట్రావెల్ ఏజెన్సీ దగ్గర ఆపాడు. అక్కడ ఇద్దరు మనుషులు ఆమెను రిసీవ్ చేసుకున్నారు. ఒక వ్యక్తికి లైన్ కలిపి ఫోన్‌ని ఆమె చేతికి ఇచ్చారు. హోటల్ బుకింగ్ గురించి ఆ వ్యక్తికి తెలుస్తుందని చెప్పారు. యువతికి మొదటిసారి అనుమానం వచ్చింది. తనేదైనా ట్రాప్‌లో చిక్కుకుపోతున్నానా అని భయానికి లోనైంది. అప్పటికే ఐదు గంటలుగా ఆమె తన ప్రమేయం లేకుండానే ఢిల్లీ ఆటోల్లో తిరుగుతోంది. అలసటగా ఉంది. చీకటి కూడా పడింది. ‘‘నిజమే, మీ బుకింగ్ క్యాన్సిల్ అయింది. వీటిల్లో కొన్ని రూములు ఉన్నాయట’’ అని ఆమెకు కొన్ని హోటళ్లు, రెంట్ల వివరాలు ఇచ్చారు. అవన్నీ ఖరీదైనవి. చివరికి విసుగెత్తి, రోజుకు నలభై డాలర్ల రెంట్ (సుమారు మూడు వేల రూపాయలు) ఉన్న హోటల్ గదిని బుక్ చేయమంది. చేశారు. అక్కడి నుంచి ఆటో ఆమెను ఆ హోటల్ ఉన్న ప్రాంతానికి తీసుకెళ్లింది. ఆమె గది థర్డ్ ఫ్లోర్లో ఉంది. కిటికీల్లేవు. ఇంటర్నెట్ లేదు! వెంటనే గది తలుపులు వేసుకుని లోపల లాక్ చేసుకుంది. ఈలోపు కొత్త సిమ్ కార్డ్ యాక్టివేట్ అయింది. రిషికేష్‌లో తెలిసినవాళ్లుంటే వాళ్లకు ఫోన్ చేసి, జరిగిందంతా చెప్పింది. రిషికేష్ నుంచి అక్కడి వాళ్లు, ఈ యువతి మొదట బుక్ చేసిన హోటల్‌కి ఫోన్ చేసి అడిగితే, ‘‘క్యాన్సిల్ ఏమీ కాలేదే. ఆమె పేరు మీదే ఇప్పటికీ రూమ్ ఉంది’’ అని చెప్పారు. అది తెలిసి యువతి నిశ్చేష్టురాలైంది. కొద్ది నిమిషాల్లోనే ఆ హోటల్ సిబ్బంది (మొదట ఆమె బుక్ చేసిన హోటల్) వచ్చి యువతిని సురక్షితంగా తమతో తీసుకెళ్లారు. తెల్లారి లేచీ లేవగానే రూమ్ ఖాళీ చేసి, అప్పటికి అందుబాటులో ఉన్న ఫ్లయిట్ ఎక్కి ఆ యువతి తన స్వదేశానికి వెళ్లిపోయింది. ఈ వివరాలన్నీ బాధితురాలు తమ రాయబార కార్యాలయానికి ఇచ్చిన ఫిర్యాదులో పొందుపరిచింది. మళ్లీ ఇండియా వెళ్లేది లేదని అంటోంది. బెల్జియం ఆ ఫిర్యాదును ఇండియాకు ఫార్వర్డ్ చేసింది. ఆ యువతిని వేధించిన ఆగంతకుల మీద, ఆటో రిక్షాల డ్రైవర్ల మీద, ట్రావెల్ ఏజెన్సీ మీద, హోటల్ మీద, దొంగ పోలీసుల మీద భారత విదేశీ వ్యవహారాల శాఖ.. ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్. మహిళలకు సంబంధించిన ఏ కేసైనా ఆమె దృష్టికి వెళితే త్వరగా పరిష్కారం అవుతుందని పేరు. మీరు ఈ వార్తా కథనాన్ని చదివే సమయానికి దాదాపు నిందితులంతా చట్టం చేతికి చిక్కినా ఆశ్చర్యం లేదు. ఒక్కరే వెళ్తున్నారా? ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు ముఖ్యంగా.. దేశం దాటాల్సి వస్తే తీసుకోవల్సిన కనీస జాగ్రత్తలు.. ►ఒంటరిగా హోటల్లో గది బుక్ చేసుకునే కంటే ట్రావెలర్స్ హాస్టల్స్‌లో బస చేయడం మంచిది. ఇంటర్నెట్లో ఇలాంటి వివరాలు ఉంటాయి. చూసుకొని బుక్ చేసుకోవాలి. ►మీరు వెళ్లే ప్రాంతానికి సంబంధించిన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వివరాలనూ ఇంటర్నెట్ ద్వారా తెలుసుకోవాలి. ఒకవేళ హోటల్లో రూమ్ బుక్ చేసుకునుంటే పికపింగ్, డ్రాపింగ్ సౌకర్యం ఉందేమో తెలుసుకుని మీ ఫ్లయిట్ వివరాలు వాళ్లకు ఇచ్చి.. పికప్ చేసుకోవడానికి వెహికల్ పంపమని కోరాలి. ఆ సౌకర్యం లేకపోతే వెహికల్ అరేంజ్ చేయమని రిక్వెస్ట్ చేయాలి. ట్రావెల్స్ హాస్టల్స్‌లో బస ఏర్పాటు చేసుకున్నట్లయితే హాస్టల్లో ఉన్న వాళ్ల నంబర్ తీసుకొని పికప్ చేసుకోవడానికి వాళ్లను రమ్మని కోరవచ్చు. ►ఏ ప్రాంతానికి వెళ్తున్నారో ఆ ప్రాంతానికి తగ్గట్టే డ్రెస్ వేసుకోవడం మంచిది. ►కాలక్షేపానికి తిరుగుతున్నట్టు కనపడకండి. ►మీరు ఆ ప్రాంతానికి కొత్తవారని పసిగట్టి స్థానికులు మీ గురించి ఆరా తీస్తే ఏమీ చెప్పకూడదు. అంటే మీ ఒంటరి ప్రయాణం, బస చేస్తున్న ప్రదేశాల వివరాలు వగైరా బయటపెట్టవద్దు. ►స్థానిక హెల్ప్‌లైన్స్ నంబర్లను దగ్గర పెట్టుకోవాలి. -
తొలిసారి విశ్వవిజేత బెల్జియం
భువనేశ్వర్: భారత గడ్డ బెల్జియం హాకీ జట్టు తలరాతను మార్చేసింది. ప్రపంచకప్ హాకీలో స్వర్ణ చరిత్రను ‘రెడ్ లయన్స్’ పేరిట రాసింది. ఇన్నేళ్లుగా క్వార్టర్స్ దాటని జట్టును ఈసారి చాంపియన్‌గా చేసింది. కళింగ స్టేడియంలో ఆదివారం నిర్ణీత సమయానికల్లా ఒక్క గోల్ కానీ ఫైనల్ మ్యాచ్ చివరికొచ్చేసరికి నరాలు తెగే ఉత్కంఠను రేపింది. ఇదీ చాలదన్నట్లు సడెన్‌డెత్ దాకా హైడ్రామా కొనసాగింది. ఈ థ్రిల్లర్ మ్యాచ్‌లో... ఆఖరి క్షణం వరకు దోబూచులాడిన విజయం చివరకు బెల్జియంను వరించింది. బెల్జియం ‘సడెన్ డెత్’లో 3–2తో నెదర్లాండ్స్‌పై గెలుపొందింది. దీంతో గత ప్రపంచకప్‌లాగే ఈసారి డచ్ జట్టు రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది. అంతకుముందు కాంస్యం కోసం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు 8–1తో ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించింది. -
మన సత్తాకు పరీక్ష!
భువనేశ్వర్: ప్రపంచకప్‌ను ఘనమైన విజయంతో ఆరంభించిన భారత హాకీ జట్టు పటిష్టమైన బెల్జియంను ఢీకొట్టేందుకు సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య ఆదివారం ఆసక్తికర మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్ బెల్జియంను ఓడిస్తే టీమిండియా నేరుగా క్వార్టర్ ఫైనల్స్‌లో అడుగు పెడుతుంది. బుధవారం తొలి మ్యాచ్‌లో భారత్ 5–0తో దక్షిణాఫ్రికాను కంగుతినిపించింది. ఇకపైనా ఇదే ఉత్సాహాన్ని కొనసాగించాలని గట్టి పట్టుదలతో ఉంది. ఆ మ్యాచ్‌లో భారత్ అటాకింగ్‌లో అదరగొట్టింది. ఫార్వర్డ్‌లో మన్దీప్ సింగ్, సిమ్రన్‌జిత్ సింగ్, ఆకాశ్‌దీప్ సింగ్, లలిత్ ఉపాధ్యాయ్ మ్యాచ్ ఆసాంతం అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. ఈ స్ట్రయికర్లంతా ఫామ్‌లో ఉన్నారు. మన్‌ప్రీత్ సింగ్ మిడ్‌ఫీల్డ్‌లో రాణించాడు. అయితే డిఫెండర్లు హర్మన్‌ప్రీత్ సింగ్, బీరేంద్ర లాక్రా, సురేందర్ కుమార్‌లు మెరుగుపడాల్సిన అవసరం ఉంది. ఈ రక్షణ పంక్తితో పాటు గోల్ కీపర్ పి.ఆర్.శ్రీజేశ్ కూడా పెట్టని గోడలా ఉంటేనే పటిష్టమైన బెల్జియంను భారత్‌ను నిలువరించగలదు. లేదంటే ఘనవిజయం వెంటే పరాజయం వెక్కిరించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే భారత్‌కు నిలకడే అసలు సమస్య! ఒక మ్యాచ్‌లో చెలరేగి... మరుసటి మ్యాచ్‌లో అలసత్వం ప్రదర్శించడం రివాజే. పైగా ప్రపంచ ఐదో ర్యాంకర్ భారత్‌కు బెల్జియంతో పేలవమైన రికార్డుంది. 2013 నుంచి ఇప్పటివరకు ఇరు జట్లు 19 సార్లు తలపడితే భారత్ ఐది మ్యాచ్‌ల్లోనే గెలిచింది. బెల్జియం మాత్రం 13 సార్లు విజయం సాధించింది. ఒక మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. చివరిసారిగా నెదర్లాండ్స్‌లో ఈ ఏడాది జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో తలపడగా... ‘డ్రా’ ఫలితం ఎదురైంది. మరోవైపు రియో ఒలింపిక్స్ రన్నరప్ బెల్జియం తక్కువ ర్యాంకులో ఉన్న కెనడాపై 2–1తో చెమటోడ్చి గెలిచింది. అందివచ్చిన పెనాల్టీ కార్నర్లను బెల్జియం ఆటగాళ్లు గోల్స్‌గా మలచడంలో విఫలమయ్యారు. దీంతో ఓ కూన జట్టుపై పోరాడి గెలవాల్సిన పరిస్థితి ఎదురైంది. అయితే ఒక మ్యాచ్‌తో, ఒక్క ఫలితంతో ప్రపంచ టాప్–3 జట్టును తక్కువ అంచనా వేయలేం. ఆతిథ్య దేశంపై గెలిచే సత్తా బెల్జియంకు ఉంది. ఫార్వర్డ్, డిఫెన్స్ అందరూ ఒక్క సారిగా కదంతొక్కితే భారత్‌కు కష్టాలు తప్పవు. ప్రపంచకప్‌లాంటి మెగా టోర్నీలో ఏ ఒక్క పొరపాటైనా మూల్యం భారీగానే ఉంటుంది. కాబట్టి ఇరుజట్లు కూడా ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఆడాలి. గత మ్యాచ్‌లో పెనాల్టీ కార్నర్లతో అనుభవమైన బెల్జియంకు భారత్‌తో ఎలా ఆడాలో తెలుసు. తప్ప కుండా మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశముంది. పాక్ పరాజయం ప్రపంచకప్‌ను అత్యధికంగా నాలుగుసార్లు గెలిచిన పాకిస్తాన్ జట్టుకు శుభారంభం దక్కలేదు. పూల్ ‘డి’లో భాగంగా జర్మనీతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్ 0–1తో ఓడిపోయింది. జర్మనీ తరఫున నమోదైన ఏకైక గోల్‌ను మార్కో మిల్ట్‌కౌ 36వ నిమిషంలో చేశాడు. ఇదే పూల్‌లోని మరో మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 7–0తో మలేసియాను చిత్తుగా ఓడించింది. నెదర్లాండ్స్ తరఫున జెరోన్ హెర్ట్‌బెర్గర్ ‘హ్యాట్రిక్’ సాధించగా... మిర్కో ప్రుసెర్, మింక్ వాన్ డెర్ వీర్డెన్, రాబర్ట్ కెంపర్‌మన్, బ్రింక్‌మన్ ఒక్కో గోల్ సాధించారు. ►రాత్రి గం. 7 నుంచి స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్–1లో ప్రత్యక్ష ప్రసారం -
ఈ గుర్రమెందుకు‘రొయ్యో’..
చేపలు పట్టాలంటే ఏం కావాలి? ముందుగా ఓ వల.. ఆ తర్వాత పడవ.. కదా.. ఇదే ప్రశ్న.. బెల్జియంలోని ఓస్ట్‌డూన్‌కెర్క్‌కు వెళ్లి అడగండి.. ముందుగా ఓ వల.. ఆ తర్వాత గుర్రం అని సమాధానమిస్తారు.. గుర్రానికి చేపల వేటకు ఏం సంబంధం? ఉంది.. ఎందుకంటే.. ఇక్కడ గుర్రమెక్కే ష్రింప్స్(రొయ్యల్లాంటివి), చేపలను వేటాడతారు. గుర్రాలు దాదాపుగా నడుంలోతు మునిగేస్థాయి వరకూ సముద్రంలోకి వెళ్లి.. తిరిగి తీరం వైపు వస్తారు. వెనుక వైపు వల కట్టి ఉంటుంది. తీరానికి వచ్చాక.. అందులో చిక్కే ష్రింప్స్, ఇతర చేపలను అమ్ముకుంటారు. ష్రింప్స్‌తో చేసిన వంటకాలకు అక్కడ తెగ డిమాండ్ ఉంది.. 500 ఏళ్ల క్రితమైతే బెల్జియంతోపాటు ఫ్రాన్స్, నెదర్లాండ్స్, దక్షిణ ఇంగ్లండులలో ఇలా గుర్రమెక్కే ష్రింప్స్‌ని వేటాడేవారు. అప్పట్లో అది ఎంత ప్రాచుర్యం పొందిందంటే.. గుర్రమెక్కి చేపలు వేటాడుతున్న మత్స్యకారుల విగ్రహాలను కూడా అక్కడ ఏర్పాటు చేశారు. తర్వాత తర్వాత ఆధునిక పద్ధతుల రాకతో ఈ తరహా విధానం కనుమరుగైపోయింది. ప్రస్తుతం ఓస్ట్‌డూన్‌కెర్క్‌లో మాత్రమే గుర్రమెక్కి చేపలను పట్టే మత్స్యకారులు ఉన్నారు. అదీ ఓ డజను కుటుంబాలు మాత్రమే. వారు కూడా పర్యాటకుల కోసం.. తమ సంప్రదాయాన్ని బతికించుకోవడం కోసం దీన్ని కొనసాగిస్తున్నారు. -
ఫిఫా వరల్డ్ కప్: మూడో స్థానంలో నిలిచిన బెల్జియం
-
‘మూడు’తో ముగించిన బెల్జియం
సెయింట్ పీటర్స్బర్గ్: ప్రపంచకప్‌లో బెల్జియంకు ఊరటనిచ్చే విజయం. ఫైనల్ చేరలేదన్న బాధ నుంచి తేరుకున్న రెడ్ డెవిల్స్... కప్‌లో తమ ప్రయాణాన్ని అత్యుత్తమ స్థానంతో ముగించింది. తమ ఫుట్‌బాల్ చరిత్రలోనే ఈ మెగా టోర్నీలో తొలిసారిగా మూడో స్థానంలో నిలిచి కాంస్యాన్ని అందుకుంది. మూడోస్థానం కోసం శనివారం ఇక్కడ జరిగిన పోరులో బెల్జియం 2–0తో ఇంగ్లండ్‌పై గెలుపొంది టోర్నీని చిరస్మరణీయం చేసుకుంది. ఇప్పటివరకు ఈ మహాసమరంలో నాలుగో స్థానం (1986)లో నిలవడమే బెల్జియం ఘనత. థామస్ మ్యూనెర్ (4వ ని.లో), ఎడెన్ హజార్డ్ (82వ ని.లో) ఒక్కో గోల్ చేసి తమ జట్టుకు మరపురాని విజయాన్ని అందించారు. గెలిచి తీరాలన్న కసితో బరిలోకి దిగిన బెల్జియం మ్యాచ్ ప్రారంభంలోనే అదరగొట్టింది. 4వ నిమిషంలో గోల్ చేసి ఇంగ్లండ్‌పై ఒత్తిడి పెంచింది. ‘డి’ ఏరియా నుంచి చాడ్లీ ఇచ్చిన క్రాస్ పాస్‌ను అందుకున్న మ్యూనెర్ అదే ఊపులో బంతిని నెట్లోకి పంపి బెల్జియంను ఆనందంలో ముంచెత్తాడు. తర్వాత తేరుకున్న ఇంగ్లండ్ బంతిని తమ ఆధీనంలోనే ఉంచుకుంటూ తొలి అర్ధభాగం ప్రత్యర్థిని నిలువరించింది. రెండో అర్ధభాగంలో ఇంగ్లండ్ ఆటగాడు ఎరిక్ డెయిర్ (69వ నిమిషం) గోల్ ప్రయత్నాన్ని అల్డెర్విరాల్డ్ అద్భుత రీతిలో అడ్డుకున్నాడు. తర్వాత 82వ నిమిషంలో డి బ్రుయెన్ నుంచి బంతిని అందుకున్న బెల్జియం కెప్టెన్ హజార్డ్ ఇంగ్లండ్ గోల్ కీపర్ పిక్‌ఫోర్డ్‌ను బోల్తా కొట్టిస్తూ మరో గోల్ చేశాడు. దీంతో ఇంగ్లండ్ జట్టు నాలుగో స్థానంతో ముగించింది. -
మూడో స్థానం ఎవరిదో!
సెయింట్ పీటర్స్బర్గ్: ప్రతిష్టాత్మక ప్రపంచ కప్ సెమీఫైనల్లో ఓడిన వేదన నుంచి తేరుకుని, గౌరవప్రద స్థానంతో ప్రయాణం ముగించేందుకు బెల్జియం, ఇంగ్లండ్‌లకు ఓ అవకాశం. మూడో స్థానంలో నిలిచేదెవరో తేలేందుకు శనివారం ఇక్కడి సెయింట్ పీటర్స్బర్గ్ స్టేడియంలో రెండు జట్లు తలపడున్నాయి. టోర్నీలో ఒకే గ్రూప్ ‘జి’లో ఉన్న ఈ జట్లులీగ్ దశలో ఎదురుపడ్డాయి. మొత్తం లీగ్‌కే చివరిదైన ఆ మ్యాచ్‌లో బెల్జియం 1–0తో నెగ్గింది. రెండింటి చివరి ఘనత నాలుగే..! 1966 కప్‌లో విజేతగా నిలిచిన ఇంగ్లండ్... 1990లో సెమీస్ చేరినా నాలుగో స్థానంతోనే సంతృప్తి పడింది. తర్వాత మరెప్పుడూ ఆ స్థాయి అందుకోలేదు. బెల్జియం కూడా 1986లో సెమీస్ చేరి నాలుగో స్థానంతోనే సరిపెట్టుకుంది. కప్‌లో తమ రికార్డు మెరుగు పర్చుకోవడానికి ఓ విధంగా రెండింటికీ ఇదో అవకాశం. మరోవైపు టోర్నీ టాప్ గోల్ స్కోరర్ (6)గా ‘గోల్డెన్ బూట్’ రేసులో ఉన్న ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ కేన్‌కు... ఈ సంఖ్యను మరింత పెంచుకునే వీలు దొరికింది. ఇంకొక్క గోల్ చేసినా 2002 (రొనాల్డొ, బ్రెజిల్–8 గోల్స్) తర్వాత అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడవుతాడు. ఒకవేళ కేన్ స్కోరు చేయలేకపోయి... బెల్జియం స్ట్రయికర్ రొమేలు లుకాకు రెండు గోల్స్ కొడితే ఇద్దరూ చెరో ఆరు గోల్స్‌తో గోల్డెన్ బూట్ అందుకునేందుకు ముందువరుసలో ఉంటారు. బలాబలాల రీత్యా చూస్తే మ్యాచ్‌లో బెల్జియంకే కొంత మొగ్గు కనిపిస్తోంది. అయితే, ఫైనల్ చేరలేదన్న బాధను దిగమింగి, నిర్వేదాన్ని వీడి పునరుత్తేజంతో ఆడిన జట్టే విజేతగా నిలుస్తుంది. -
సహజంగా ఆడితే వినోదం ఖాయం
ప్రపంచ కప్‌లో మూడో స్థానాన్ని నిర్ణయించే మ్యాచ్‌పై ఎవరికీ ఆసక్తి ఉండదు. సహజంగా తర్వాతి రోజు కప్ విజేతను తేల్చే పోటీ గురించే ప్రపంచం ఆలోచిస్తుంటుంది కాబట్టి శనివారం సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో బెల్జియం–ఇంగ్లండ్ మ్యాచ్ కూడా ఇందుకు అతీతం కాదు. ఏదేమైనా ఈ రెండు జట్లు సెమీఫైనల్స్‌లో ఎలా ఆడాయో, ఎందుకు ప్రత్యర్థులను ఓడించలేక పోయాయో అందరికీ తెలుసు. బెల్జియం శక్తివంచన లేకుండా పోరాడినా ఫ్రాన్స్ దాని ఆటలను సాగనివ్వలేదు. క్రొయేషియాపై పరాజయం పాలైనా యువ ఇంగ్లండ్ జట్టు నన్ను ఆకట్టుకుంది. చాలామంది ఆటగాళ్లకు అనుభవం లేకున్నా, 28 ఏళ్ల అనంతరం సెమీస్ చేరడం ఘనతే. వారిని ఇది సానుకూల దృక్పథంలో ఉంచుతుంది. రక్షణాత్మకంగా ఆడినా గారెత్ సౌత్‌గేట్ (ఇంగ్లండ్ కోచ్) కుర్రాళ్లు ప్రత్యర్థి నుంచి మ్యాచ్‌ను లాగేసుకునేలా కనిపించారు. స్కోరింగ్ అవకాశాలు సృష్టించుకుంటూ ఇదే ప్రదర్శన కొనసాగిస్తే వారికి కచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుంది. సెమీస్ ఓటమి భారం నుంచి తేరుకుని పునరుత్తేజం పొంది మరో మ్యాచ్ ఆటడం కష్టమైనదే. అయినా ప్రత్యామ్నాయం లేదు. అప్పటికే నాకౌట్ చేరడంతో లీగ్ దశలో తలపడి నప్పుడు ఈ రెండు జట్లు సురక్షిత స్థితిలో ఉన్నాయి. శనివారం మాత్రం పూర్తి శక్తి సామర్థ్యాలతో ఆడతాయని భావిస్తున్నా. సహజంగా ఆడితే ఈ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతుంది. తమ ప్రతిభను సరైన తీరులో ప్రదర్శిస్తే మనం ఈ మ్యాచ్ నుంచి మంచి వినోదాన్ని ఆశించవచ్చు. -
ఫ్రెంచ్ కిక్...
అసలు సమరంలో అనుభవమే గెలిచింది. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా సెమీస్ చేరిన బెల్జియం జట్టుకు మాజీ చాంపియన్ ఫ్రాన్స్ ఓటమి కిక్ ఇచ్చింది. దర్జాగా మూడోసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో ఫ్రాన్స్ తరఫున శామ్యూల్ ఏకైక గోల్ కొట్టి ఉండవచ్చు. ఈ ఒక్క గోల్‌తో ఫ్రాన్స్ గెలిచి ఉండొచ్చు. కానీ మ్యాచ్‌ను కంటికి రెప్పలా కాపాడింది మాత్రం కచ్చితంగా ఫ్రాన్స్ గోల్ కీపర్ హూగో లోరిసే. సెమీస్ చరిత్రను చెరిపేందుకు బెల్జి యం ముందు నుంచీ కష్టపడింది. ఆ పడిన కష్టం... లోరిస్ ‘గోడ’ను దాటి వెళ్లలేకపోయింది. మ్యాచ్‌లో ఇదొక్కటే తేడా! ఈ తేడానే ఫ్రాన్స్‌ను ‘చాంపియన్’ బరిలో ఉంచితే... బెల్జియంను మూడో స్థానం పోరాటానికి పంపింది. సెయింట్ పీటర్స్బర్గ్: ఫైనల్ దారిలో తొలి అడుగు పడింది. ఫ్రాన్స్ టైటిల్ వేటకు సిద్ధమైంది. ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో మూడోసారి ‘ఫైనల్స్’ అర్హత సంపాదించింది. బెల్జియం కథ మళ్లీ సెమీఫైనల్‌కే పరిమితమైంది. మంగళవారం అర్ధరాత్రి జరిగిన తొలి సెమీఫైనల్లో ఫ్రాన్స్ 1–0 స్కోరుతో బెల్జియంపై విజయం సాధించింది. రెండో అర్ధభాగం మొదలైన కాసేపటికే శామ్యూల్ ఉమ్టిటి (51వ ని.) గోల్‌తో ఫ్రాన్స్ ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకోవడంలో సఫలమైంది. బెల్జియం ఆటగాళ్లు గోల్ ప్రయత్నంలో విఫలమైనా... బరిలో దిగినప్పటి నుంచి చివరిదాకా కష్టపడ్డారు. ఫ్రాన్స్‌కు దీటుగా స్ట్రయికర్లు లక్ష్యంపై గురిపెట్టారు. కానీ ఈ ప్రయత్నంలో గోల్‌పోస్ట్ చేరిన ప్రతీసారి ప్రత్యర్థి గోల్‌కీపర్ లోరిస్ కళ్లు చెదిరే విన్యాసాలతో అడ్డుకున్నాడు. ఆట ఆరంభం నుంచి బెల్జియం బంతిపై పట్టుసాధించే పనిలో పడింది. 15వ నిమిషంలో స్ట్రయికర్ హజర్డ్ చేసిన తొలి ప్రయత్నం విఫలం కాగా... 21వ నిమిషంలో లోరిస్ ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా బెల్జియం బోణీ కొట్టేది. డిఫెండర్ అల్డర్విరెల్డ్ పెనాల్టీ బాక్స్‌లో కుడి వైపు నుంచి గోల్ పోస్ట్ ఎడమవైపు కొట్టిన మెరుపు షాట్‌ను లోరిస్ అంతే వేగంగా అద్భుతంగా డైవ్ చేస్తూ తప్పించాడు. మరోవైపు ఫ్రాన్స్ స్ట్రయికర్ల దాడుల్ని బెల్జియం గోల్‌కీపర్ కుర్టోయిస్ నిలువరించాడు. దీంతో గోల్ లేకుండా తొలి అర్ధభాగం ముగిసింది. ఆ తర్వాత ఆరు నిమిషాలకే ఫ్రాన్స్ విజయబావుటకు బీజం పడింది. 51వ నిమిషంలో ఫార్వర్డ్ గ్రీజ్మన్ కార్నర్ నుంచి కొట్టిన షాట్‌ను డిఫెండర్ ఉమ్టిటి హెడర్‌తో గోల్‌పోస్ట్‌లోకి పంపించాడు. దీంతో ఫ్రెంచ్ శిబిరం సంతోషంలో మునిగింది. 64వ నిమిషంలో బెల్జియం ఆటగాడు మెర్టెన్స్ ఇచ్చిన పాస్‌ను పెనాల్టీ బాక్స్‌లో ఉన్న అల్డర్విరెల్డ్ సూపర్ ఫాస్ట్‌గా తరలించేందుకు కొట్టిన హెడర్ షాట్ గురి తప్పింది. మళ్లీ 81వ నిమిషంలో హజర్డ్ స్టేడి యం సెంటర్ పాయింట్ నుంచి కొట్టిన లాంగ్ షాట్‌ను రెప్పపాటు సమయంలోనే లోరిస్ తప్పించాడు. బెల్జియం స్ట్రయికర్లు గురిపెట్టిన ప్రతీసారి లోరిస్ చాకచక్యంగా ఆపేశాడు. ఆధిక్యంలో ఇంగ్లండ్ క్రొయేషియాతో జరుగుతున్న ఫుట్‌బాల్ ప్రపంచకప్ రెండో సెమీఫైనల్లో తొలి అర్ధభాగం ముగిసే సమయానికి ఇంగ్లండ్ జట్టు 1–0తో ఆధిక్యంలో నిలిచింది. ఆట మొదలైన ఐదో నిమిషంలోనే కీరన్ ట్రిపియర్ కళ్లు చెదిరేరీతిలో డైరెక్ట్ ఫ్రీ కిక్‌తో బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపించడంతో ఇంగ్లండ్ ఖాతా తెరిచింది. -
ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్లో ఫ్రాన్స్
సెయింట్ పీటర్స్బర్గ్ : ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లోకి ఫ్రాన్స్ దూసుకెళ్లింది. మంగళవారం అర్థరాత్రి బెల్జియంతో జరిగిన సెమీ ఫైనల్లో ఫ్రాన్స్ 1-0 తేడాతో విజయం సాధించింది. ప్రిక్వార్టర్స్‌లో అర్జెంటీనా, క్వార్టర్స్‌లో ఉరుగ్వేను మట్టికరిపించిన ఫ్రాన్స్.. సెమీస్‌లో అదే ఉత్సాహంతో బెల్జియంను ఓడించింది. దీంతో టైటిల్‌ను అందుకోవాలన్న బెల్జియం ఆశలు ఆవిరయ్యాయి. ఇరు జట్లు హోరా హోరీగా పోరాడటంతో తొలి అర్ధభాగం వరకు ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. ప్రత్యర్థులిద్దరూ చక్కని డిఫెన్స్‌తో ఆకట్టుకున్నారు. అయితే 51వ నిమిషంలో గ్రీజ్మన్ కొట్టిన కార్నర్ క్రాస్ షాట్‌ను శామ్యూల్ ఉమ్టిటి అద్భుతమైన హెడర్‌తో బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపించాడు. దీంతో ఫ్రాన్స్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. చివర్లో బెల్జియం గోల్ కోసం విపరీతంగా ప్రయత్నించినా ఫ్రాన్స్ గోల్‌కీపర్ లోరిస్ వారికి అడ్డుగోడలా నిలబడ్డాడు. ప్రపంచకప్‌లో ఫ్రాన్స్ ఫైనల్‌కు చేరడం ఇది మూడోసారి. 1998లో విజేతగా నిలిచిన ఆ జట్టు 2006లో రన్నరప్‌గా నిలిచింది. నేడు ఇంగ్లండ్, క్రొయేషియా తలపడే రెండో సెమీస్‌లో గెలిచిన జట్టుతో ఆదివారం మాస్కోలోని లుహినికి స్టేడియంలో ఫ్రాన్స్ ఫైనల్ ఆడనుంది. ఇక మూడో స్థానం కోసం ఓడిన జట్టుతో బెల్జియం తలపడనుంది. -
12 ఏళ్ల తర్వాత ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్స్‌కు ఫ్రాన్స్
-
ఆ జట్టుకు బలమైన పరీక్ష
తీవ్ర మానసిక ఒత్తిడిని భరిస్తూ వరుసగా రెండు పెనాల్టీ షూటౌట్ మ్యాచ్‌ల్లో గెలవడం ఆషామాషీ కాదు. 1990 ప్రపంచ కప్ స్వీయానుభవంతో చెబుతున్నా... నాడు నా సారథ్యంలోని అర్జెంటీనా క్వార్టర్స్‌లో యుగోస్లేవియాను, సెమీస్‌లో ఇటలీని పెనాల్టీలోనే ఓడించింది. ఇప్పుడు క్రొయేషియాదీ ఇదే పరిస్థితి. 240 నిమిషాల పాటు నాకౌట్ మ్యాచ్‌లు ఆడటం, అందులోనూ షూటౌట్ అంటే ఆ ఒత్తిడి చెప్పలేనిది. జర్మనీతో 1990 కప్ ఫైనల్లో మేమిలాంటి ప్రభావానికే గురయ్యాం. నాడు మేం పెనాల్టీ కిక్‌తో కప్‌ను సమర్పించుకున్నాం. మా ఆటగాళ్లు ఇద్దరు రెడ్ కార్డులకు గురయ్యారు. ఓడినా విశ్వ ప్రయత్నం చేశాం. నాతోపాటు అభిమానులూ దీనిని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారు. క్రొయేషియాను సరిగ్గా ఇదే ఇబ్బంది పెడుతుందని ఇదంతా చెబుతున్నా. దీనిని అధిగమించాలంటే సెమీస్‌కు ముందు మూడు రోజుల విరామంలో ఆ జట్టు పునరుత్తేజం కావాలి. ఫైనల్‌కు అతి దగ్గరగా వచ్చిన అవకాశాన్ని ఎవరూ వదులుకోవాలని అనుకోరు. ప్రి క్వార్టర్స్‌లో పెనాల్టీతోనే గట్టెక్కినా 90 నిమిషాల్లో క్వార్టర్ ఫైనల్‌ను ముగించిన ఇంగ్లండ్ కుర్రాళ్లు తాజాగా ఉన్నారు. ఈ రెండు జట్ల మధ్య సామీప్యత కనిపిస్తోంది. ఇంగ్లండ్ గోల్స్‌లో ఎక్కువ శాతం పథకం ప్రకారం బంతిని బాక్స్ ఏరియాలోకి పంపి హెడర్‌తో సాధించినవే. నిబద్ధతతోపాటు సాను కూల దృక్పథంతో భీకరంగా పోరాడే క్రొయేషియా డిఫెండర్లంటే నాకిష్టం. ప్రాథమిక అంశాల్లో బలంగా ఉంటూ, స్థాన బలంతో వారు చాలా మ్యాచ్‌లను గాడినపెట్టారు. కానీ, అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని చూస్తే ఇంగ్లండ్‌పై ఒత్తిడిని ఎదుర్కొని నిలవడం క్రొయేషియాకు బలమైన పరీక్ష. -
బ్రెజిల్ జట్టుకు ఘోర అవమానం
బ్రాసిలియా: ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో క్వార్టర్ ఫైనల్లో పరాజయం పాలై కోట్లాది మంది హృదయాలను గాయపరిచిన బ్రెజిల్ ఫుట్‌బాల్ జట్టుకు స్వదేశంలో ఘోర అవమానం ఎదురైంది. స్వదేశం చేరుకున్న ఆటగాళ్లకు అభిమానులు రాళ్లు, గుడ్లతో స్వాగతం పలికారు. వారు ప్రయాణిస్తున్న బస్సుపై గుడ్లతో దాడి చేశారు. రాళ్లు విసిరి హంగామా చేశారు. గత ప్రపంచకప్‌లో జర్మనీ చేతిలో 7-1తో బ్రెజిల్ ఓటమి పాలు కాగా, ఆ గాయం అభిమాలను వేధిస్తుండగానే ఈసారి బెల్జియం చేతిలో బ్రెజిల్‌కు పరాభవం ఎదురైంది. ఈ పరాజయాన్ని జీర్ణించుకోలేకపోతున్న బ్రెజిల్ అభిమానలు తమ జట్టుకు గుడ్లతో దాడి చేసి స్వాగతం పలికారు. ఆటగాళ్లు ప్రయాణిస్తున్న బస్సుపై కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేసిన అభిమానులు బస్సును ముందుకు కదలకుండా అడ్డుకున్నారు. భద్రతా సిబ్బంది నచ్చజెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ వారు ఆందోళన కొనసాగించారు. దీంతో రాళ్ల దాడి నుంచి ఆటగాళ్లను రక్షించేందుకు కాల్పులు జరపాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. -
బ్రెజిల్ జట్టుకు స్వదేశంలో ఘోర అవమానం
-
సమఉజ్జీల సమరమిది
ప్రపంచ కప్ సెమీఫైనల్లో ఒక్క దక్షిణ అమెరికా జట్టు కూడా లేకపోవడం నిరాశ కలిగిస్తోంది. నిజానికి బ్రెజిల్, ఉరుగ్వే ముందుకు వెళ్లాల్సింది. అయితే బ్రెజిల్ పలు అవకాశాలు చేజార్చుకోగా, మ్యాచ్‌లో కోలుకుంటున్న సమయంలో గోల్‌కీపర్ చేసిన తప్పిదం ఉరుగ్వే ఆట ముగించింది. మాకు పొరుగు దేశాలైన రెండు జట్లను ఓడించిన టీమ్‌లు ఇప్పుడు తొలి సెమీఫైనల్లో తలపడబోతున్నాయి. సొంతగడ్డపై 2016 యూరో ఫైనల్లో ఓడిన చేదు జ్ఞాపకాలను తుడిచేయాలని భావిస్తున్న ఫ్రాన్స్ ఇప్పుడు అన్ని రంగాల్లో సమతూకంగా కనిపిస్తోంది. దృక్పథంలో కొంత తేడా ఉన్నా, బెల్జియం కూడా అంతే బలంగా ఉంది. మా జట్టు చేతిలో1986లో సెమీఫైనల్లో, 2014లో క్వార్టర్ ఫైనల్లో ఓడిన బెల్జియం జట్టులో ఈసారి పట్టుదల ఎక్కువగా కనిపిస్తోంది. తమ గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిస్తే మున్ముందు కఠినమైన ‘డ్రా’ ఎదురయ్యే అవకాశం ఉందని తెలిసినా బెల్జియం జాగ్రత్తగా ఆడి రెండో స్థానానికి పరిమితం కావాలని చూడలేదు. పెద్ద జట్లను ఎదుర్కోగల సత్తా తమలో ఉందని భావిస్తున్న ఆ టీమ్ ఎక్కడా తగ్గలేదు. ఫ్రాన్స్ మొదటి నుంచి కూడా ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించే తరహా ఆటనే చూపిస్తోంది. ముఖ్యంగా కైలియాన్ ఎంబాపె వేగాన్ని, ఆంటోనీ గ్రీజ్మన్ స్ట్రయికింగ్ నైపుణ్యాన్ని ఆ జట్టు నమ్ముకుంది. దీంతో పోలిస్తే బెల్జియం ముందుగా చొరవ చూపించకుండా ఏదైనా జరిగితే అప్పటి పరిస్థితికి అనుగుణంగా ప్రతిస్పందించాలనే తరహా ఆట ఆడుతోంది. జట్టులో రొమెలు లుకాకులాంటి మెరుపు ఆటగాడికి హజార్డ్, డి బ్రూయిన్ తోడుగా ఉన్నారు. అయితే ఫ్రాన్స్ నుంచి ఆ జట్టుకు కొంత భిన్నమైన పరీక్ష ఎదురు కానుంది. కాసిమెరో లేకపోవడంతో మిడ్‌ఫీల్డ్‌లో బ్రెజిల్‌పై బెల్జియంకు మంచి పట్టు చిక్కింది. కానీ పాల్ పోగ్బా, ఎన్గొలో కాంటో వారికి ఆ అవకాశం ఇవ్వరు. కొత్త వ్యూహంతో బ్రెజిల్‌ను బెల్జియం ఓడించడంపై చాలా చర్చ జరుగుతోందని నాకు తెలుసు. టోర్నీ కీలక దశలో ఇలా చేయాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. కానీ నా దృష్టిలో వ్యూహాన్ని ఎంత బాగా అమలు చేశారన్నదే ముఖ్యం. వ్యూహాలు, ఆలోచనలు సరే కానీ ఇలాంటి మ్యాచ్‌లు నెగ్గాలంటే ఎంతో సాహసం, పట్టుదల, పోరాటతత్వం ఉండాలి. అటు వనరులకు కొదవ లేని, స్ఫూర్తివంతమైన జట్టు ఫ్రాన్స్ ఉండటంతో ఈ పోరు ఆసక్తికరంగా సాగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అటాక్, డిఫెన్స్, మిడ్‌ఫీల్డ్ అన్నింటిలో దాదాపు సమంగా కనిపిస్తున్న ఈ రెండు జట్ల గోల్‌కీపర్లు కూడా ఎంతో ప్రతిభావంతులు. కాబట్టి ఒకరిని ఎంచుకోవడం చాలా కష్టం. అయితే ఎలాగైనా గెలవాలనే కసి మాత్రమే ఇద్దరిలో ఒకరిని విజేతగా నిలుపుతుంది. నా దృష్టిలో దీనిని ‘మ్యాచ్ ఆఫ్ ద టోర్నమెంట్’గా చెప్పగలను. -
చిలుక జోస్యం కాదు.. ఎలుగుబంటి జోస్యం!
క్రస్లోయార్స్క్: చిలక జోస్యం సంగతేమో కానీ ఫుట్‌బాల్ ప్రపంచ కప్ రాగానే ప్రతీ జంతువుకు జ్యోతిష్య హోదా కట్టబెట్టేస్తున్నట్లున్నారు! ఆక్టోపస్ నుంచి మొదలు పెడితే పిల్లి, డాల్ఫిన్, పంది వరకు అన్ని జంతువులు వరల్డ్ కప్ విన్నర్ ఎవరో తేల్చేస్తున్నాయి. తాజాగా ఈ కోవలో ఎలుగు బంటి కూడా చేరింది. ‘పామిర్’ పేరు గల 11 ఏళ్ల తెల్ల ఎలుగు బంటి ఇప్పుడు బరిలోకి దిగింది. మంగళవారం జరగబోయే సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఫ్రాన్స్‌ను ఓడించి బెల్జియం విజేతగా నిలుస్తుందని పామిర్ చెబుతోంది. ఈ రెండు దేశాల జాతీయ పతాకాలు ముద్రించిన రెండు క్యాన్లను దీని ముందు ఉంచారు. వీటిలో బెల్జియంను పామిర్ ఎంచుకుంది. వీటిలో ఎన్ని నిజ్జంగా నిజం అయ్యాయనేది పక్కన పెడితే ‘వార్ ఆఫ్ వరల్డ్ కప్ ఎనిమల్స్’గా మారిపోయిందనేది మాత్రం చెప్పవచ్చు. -
బెల్జియం Vs ఫ్రాన్స్: ఫైనల్ చేరేదెవరు?
వేగంలో సమఉజ్జీలు... దాడుల్లో దీటైనవారు... రక్షణ శ్రేణిలో దుర్భేద్యులు... పోరాటంలో పోటాపోటీ! ప్రపంచ కప్ తొలి సెమీఫైనల్లో తలపడనున్న ఫ్రాన్స్– బెల్జియం జట్ల ప్రదర్శనను విశ్లేషిస్తే ఇలానే ఉంటుంది. అన్ని విభాగాల్లో ఢీ అంటే ఢీ అనేలా ఉన్న రెండింటి మధ్య ‘మాజీ చాంపియన్’ హోదా ఒక్కటే తేడా. 1998లో విజేతగా నిలిచిన ఫ్రాన్స్... తర్వాత పడుతూ లేస్తూ ప్రయాణం సాగి స్తోంది. ఈసారి గ్రీజ్మన్ వంటి ఆటగాడికి ఎంబాపెలాంటి మెరిక తోడవడంతో ఆటతీరుతోపాటు జట్టు రాతే మారిపోయింది. లీగ్ దశలో సాధారణంగానే కనిపించినా నాకౌట్లో దుమ్ము దులిపేస్తోంది. ఇక 1986లో సెమీస్ చేరడమే ఈ మెగా టోర్నీలో బెల్జియంకు అత్యుత్తమం. ఇప్పుడు మాత్రం ముందునుంచి ఉన్న అంచనాలు నిలబెట్టుకుంటూ సంచలనా త్మకంగా ఆడుతోంది. రొమేలు లుకాకు, ఈడెన్ హజార్డ్, డి బ్రుయెన్ల త్రయం ముందు ఎంతటి ప్రత్యర్థైనా వణకాల్సిందే. ఈ నేపథ్యంలో సెమీస్ హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. సెయింట్ పీటర్స్బర్గ్: రెండు దశాబ్దాల తర్వాత ప్రపంచ విజేతగా నిలవాలనే పంతంతో ఫ్రాన్స్! ‘గోల్డెన్ జనరేషన్’ ఆటగాళ్లతో ఇప్పుడు కాకుంటే మరెప్పుడూ కప్పు కొట్టలేమన్న పట్టుదలతో బెల్జియం! లీగ్ దశను అజేయంగా ముగించి, నాకౌట్లో ప్రత్యర్థులను పిండి చేసిన ఈ రెండు జట్లు మంగళవారం అర్ధరాత్రి ఇక్కడి సెయింట్ పీటర్స్బర్గ్ స్టేడియంలో తొలి సెమీఫైనల్లో తలపడనున్నాయి. ఏ ఒక్కరి ప్రదర్శన మీదనో ఆధారపడకుండా, దూకుడే మంత్రంగా ఆడుతూ, బలా బలాల్లోనూ సమతూకంతో కనిపిస్తున్నందున ఈ మ్యాచ్‌లో ప్రేక్షకులకు మంచి పోరాటాన్ని వీక్షించే అవకాశం కలగనుంది. వీరి పోరాటం చూడండి... డి బ్రుయెన్ కాంటె బ్రెజిల్‌తో క్వార్టర్స్‌లో 20 గజాల దూరం నుంచి బెల్జియం ఆటగాడు డి బ్రుయెన్ కొట్టిన గోల్ చూస్తే ఔరా అనాల్సిందే. కచ్చితమైన పాస్‌లు ఇతడి ప్రత్యేకత. మరోవైపు కాంటె... ప్రపంచంలో అత్యుత్తమ మిడ్‌ఫీల్డర్. పరిస్థితులకు తగ్గట్లు ఆడటం తన గొప్పతనం. మరి వీరిలో ఎవరు మిడ్ ఫీల్డ్‌లో మెరుస్తారో? లుకాకు (Vs) వరానె, ఉమ్టిటి టోర్నీలో నాలుగు గోల్స్ కొట్టడంతో పాటు సహచరులకు అవకాశాలు సృష్టిస్తున్నాడు బెల్జియం ఫార్వర్డ్ రొమేలు లుకాకు. మరోవైపు ప్రత్యర్థుల గోల్ అవకాశాలను నీరుగార్చడంలో ఫ్రాన్స్ సెంట్రల్ డిఫెన్స్ ఆటగాళ్లు వరానె, ఉమ్టిటి సిద్ధహస్తులు. క్వార్టర్స్‌లో ఉరుగ్వే స్టార్ సురెజ్‌ను వీరు కట్టిపడేశారు. ఈ ద్వయాన్ని దాటడం లుకాకుకు చిక్కుముడే. వెర్టాంగెన్(Vs) ఎంబాపె, గ్రీజ్మన్ బెల్జియం రక్షణ త్రయంలో కీలకం వెర్టాంగెన్. ఎడమ వైపున ఉండే ఇతడు డిపెండబుల్ ఆటగాడు. ఫ్రాన్స్ చిరుతలు గ్రీజ్మన్, ఎంబాపెలను నిలువరించడం తనకు పెద్ద పరీక్ష కానుంది. ఎంబాపె మిడ్ ఫీల్డ్ నుంచి వేగంగా పరిగెడుతూ ప్రిక్వార్టర్స్‌లో అర్జెంటీనాను ఎలా పడగొట్టాడో అందరూ చూశారు. ఇక గ్రీజ్మన్ గోల్ కొట్టాడంటే ఆ మ్యాచ్‌లో ఇప్పటిదాకా ఫ్రాన్స్‌కు పరాజయమన్నది ఎదురుకాలేదు. అనుభవజ్ఞుడైన వెర్టాంగెన్... ఈసారి గ్రీజ్మన్, ఎంబాపెలను ఎలా నిలువరిస్తాడో? హజార్డ్(Vs) పవార్డ్ ఈ టోర్నీలో అత్యుత్తమంగా ఆడుతున్నాడు బెల్జియం కెప్టెన్ ఈడెన్ హజార్డ్. దాడులతో పాటు చురుకైన కదలికలకు పెట్టింది పేరు. క్వార్టర్స్‌లో బ్రెజిల్ ఇతడి ధాటికి వెనుకంజ వేసింది. రైట్ బ్యాక్‌లో తనకు ఫ్రాన్స్ యువ కెరటం పవార్డ్తో పోటీ తప్పదు. 22 ఏళ్ల పవార్డ్... ప్రి క్వార్టర్స్‌లో అర్జెంటీనాపై కీలక సమయంలో గోల్ కొట్టాడు. లోరిస్(Vs) కోర్టొయిస్ ఆస్ట్రేలియాతో లీగ్ మ్యాచ్‌లో గోల్ ఇచ్చి విమర్శల పాలైన ఫ్రాన్స్ గోల్‌కీపర్ హ్యుగో లోరిస్... తర్వాత తేరుకుని అడ్డుగోడలా మారాడు. ఉరుగ్వేపై అతడి ఆటే దీనికి నిదర్శనం. బెల్జియం పొడగరి కోర్టొయిస్... అగ్రశ్రేణి కీపర్. బ్రెజిల్‌తో క్వార్టర్స్‌లో నెమార్ షాట్‌ను కొనవేళ్లతో పైకి పంపి తన స్థాయిని మరింత పెంచుకున్నాడు. సెమీస్ చేరాయిలా... ఫ్రాన్స్ ►ఆస్ట్రేలియాపై 2–1తో గెలుపు ►పెరూపై 1–0తో విజయం ►డెన్మార్క్‌తో 0–0తో డ్రా ►ప్రిక్వార్టర్స్‌లో అర్జెంటీనాపై 4–3తో విజయం ►క్వార్టర్స్‌లో ఉరుగ్వేపై 2–0తో జయభేరి బెల్జియం ►పనామాపై 3–0తో గెలుపు ►ట్యూనీషియాపై 5–2తో విజయం ►ఇంగ్లండ్‌పై 1–0తో గెలుపు ►ప్రి క్వార్టర్స్‌లో 3–2తో జపాన్‌పై విజయం ►క్వార్టర్స్‌లో 2–1తో బ్రెజిల్‌పై జయభేరి హెన్రీ... నువ్వు సరైన పక్షాన లేవు బెల్జియం సహాయ కోచ్ థియరీ హెన్రీ ఫ్రాన్స్ ఒకనాటి మేటి ఫుట్‌బాలర్. కెప్టెన్ డెచాంప్స్, జినెదిన్ జిదాన్తో కలిసి 1998లో దేశానికి కప్ అందించాడు. ప్రస్తుతం బెల్జియం విజయాల్లో అతడి పాత్ర విస్మరించలేనిది. దీంతో హెన్రీని లక్ష్యంగా చేసుకుని ఫ్రాన్స్ వాగ్బాణాలు సంధిస్తోంది. అతడు సరైన పక్షాన నిలవలేదని ఎత్తిపొడుస్తోంది. మరో చిత్రమేమంటే... ప్రపంచ కప్‌లో ఫ్రాన్స్–బెల్జియం చివరిసారిగా తలపడింది 1986లో. మూడో స్థానం కోసం సాగిన ఆ పోరులో ఫ్రాన్స్ 4–2 తేడాతో గెలుపొందింది. బెల్జియం నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. ఆ జట్టుకిదే ప్రపంచకప్ అత్యుత్తమ ప్రదర్శన. తర్వాత 8 అంతర్జాతీయ స్నేహపూర్వక మ్యాచ్‌ల్లో బెల్జియం రెండింటిలో నెగ్గింది. ఓవరాల్‌గా ఇప్పటివరకు ఫ్రాన్స్, బెల్జియం జట్లు 73 మ్యాచ్‌ల్లో ముఖాముఖీ తలపడ్డాయి. ఫ్రాన్స్ 24 మ్యాచ్‌ల్లో... బెల్జియం 30 మ్యాచ్‌ల్లో గెలిచాయి. మరో 19 మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. -
పెను సంచలనం.. బ్రెజిల్ అవుట్
ఫిఫా వరల్డ్‌కప్ 2018లో మరో పెను సంచలనం చోటు చేసుకుంది. హాట్ ఫెవరేట్ బ్రెజిల్ ఘోర ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది. కజస్ ఏరెనా వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌లో బెల్జియం చేతిలో 2-1 తేడాతో సాంబా జట్టు ఘోర పరాభవం చవిచూసింది. దీంతో టోర్నీలో బ్రెజిల్ కథ ముగియగా, బెల్జియం సెమీస్‌కు చేరుకుంది. మంగళవారం సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరిగే సెమీస్‌లో ఫ్రాన్స్‌తో బెల్జియం తలపడనుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సాకర్ వర్ల్డ్ కప్ నేడు క్వార్టర్ ఫైనల్స్
-
అష్ట దిగ్గజాల ఆట...
విశ్వ సమరంలో వీర రస ప్రదర్శనకు మళ్లీ రంగం సిద్ధమైంది. ముప్ఫై రెండు నుంచి మొదలు పెట్టి అత్యుత్తమంగా నిలిచిన ఆఖరి ఎనిమిది జట్లు తమ సత్తా చాటేందుకు సై అంటున్నాయి. తొలి రోజు ఖండాంతర పోరులో శుక్రవారం ఉరుగ్వే–ఫ్రాన్స్, బ్రెజిల్–బెల్జియం క్వార్టర్ ఫైనల్స్‌లో తలపడనున్నాయి. వీటిలో సెమీస్ మెట్టును రెండు దక్షిణ అమెరికా (ఉరుగ్వే, బ్రెజిల్) జట్లే ఎక్కుతాయో... లేదా రెండు యూరప్ దేశాలు (ఫ్రాన్స్, బెల్జియం) ముందంజ వేస్తాయో చూడాలి...! నిజ్ని నవ్‌గొరొడ్: ప్రత్యర్థులకు ఒక్క గోల్ కూడా ఇవ్వకుండా... అయిదు గోల్స్ చేసి లీగ్ దశను అజేయంగా ముగించింది ఉరుగ్వే. ప్రి క్వార్టర్స్‌లో పోర్చుగల్‌కు గోల్ ఇచ్చినా ప్రతిగా రెండు కొట్టి గెలుపొందింది. మరోవైపు ఫ్రాన్స్ ప్రయాణం నిదానంగా మొదలుపెట్టింది. ఆస్ట్రేలియా, పెరూపై గెలిచి, డెన్మార్క్‌తో డ్రా చేసుకుంది. ప్రి క్వార్టర్స్‌లో మాత్రం అర్జెంటీనాపై జూలు విదిల్చింది. మొత్తమ్మీద రెండు జట్లు నాలుగు మ్యాచ్‌ల్లో ఏడు గోల్స్ చేశాయి. ఇక శుక్రవారం క్వార్టర్ ఫైనల్‌ను 350 మ్యాచ్‌ల విశేష అనుభవం ఉన్న డిగో గోడిన్, జిమెనెజ్, క్యాసెరెస్, లక్జాల్ట్ల ఆధ్వర్యంలోని ఉరుగ్వే రక్షణ శ్రేణికి... గ్రీజ్మన్, ఎంబాపెల ఫ్రాన్స్ ఫార్వర్డ్ దళానికి మధ్య పోరాటంగా పేర్కొనవచ్చు. స్టార్ స్ట్రయికర్ సురెజ్ ఫామ్ భరోసానిస్తున్నా, ప్రి క్వార్టర్స్‌లో రెండు గోల్స్‌తో గెలిపించిన మరో స్టార్ ఎడిన్సన్ కవాని గాయం ఉరుగ్వేను కలవరపరుస్తోంది. అతడు బరిలో దిగేది అనుమానంగానే ఉంది. గత మ్యాచ్‌లో అర్జెంటీనాపై విజయం ఫ్రాన్స్‌లో ఆత్మవిశ్వాసం పెంచి ఉంటుందనడంలో సందేహం లేదు. టీనేజ్ సంచలనం ఎంబాపె తన వేగంతో ప్రత్యర్థులకు దడ పుట్టిస్తున్నాడు. అతడికి గ్రీజ్మన్, గిరౌడ్, ఉస్మాన్ డంబెల్ తోడైతే తిరుగుండదు. వీరి ఆధ్వర్యంలోని ఫార్వర్డ్ బృందం ప్రత్యర్థి రక్షణ శ్రేణిని ఛేదించే ప్రయత్నాలు మ్యాచ్‌ను ఆసక్తికరంగా మార్చడం ఖాయం. దీనిని దృష్టిలో పెట్టుకునే ‘ఫ్రాన్స్‌కు ఒక్కసారి అవకాశం ఇచ్చామో వారిని అందుకోవడం చాలా కష్టం’ అని ఇప్పటికే ఉరుగ్వే కోచ్ ఆస్కార్ తబ్రెజ్ వ్యాఖ్యానించాడు. ‘బలమైన ఉరుగ్వే నుంచి భిన్న ఆట ఎదురుకావొచ్చు’ అనేది ఫ్రాన్స్ కోచ్ డెచాంప్స్ అంచనా. ►ఉరుగ్వే (vs) ఫ్రాన్స్ రాత్రి గం. 7.30 నుంచి కజన్: వరల్డ్ కప్‌లో బ్రెజిల్ ప్రయాణం సాఫీగా సాగుతోంది. మాజీ చాంపియన్లు ఒక్కొక్కటే వెనుదిరుగుతున్నా, సాంబా జట్టు మాత్రం ఒక్కో అడుగు వేసుకుంటూ వెళ్తోంది. లీగ్ దశలో డ్రాతో స్విట్జర్లాండ్ విస్మయపర్చినా... కోస్టారికా, సెర్బియాలపై సాధికార విజయాలు సాధించింది. ప్రి క్వార్టర్స్‌లో మెక్సికోకు చిక్కకుండా తప్పించుకుంది. అటువైపు బెల్జియం మాత్రం ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తూ లీగ్‌లో అజేయంగా నిలిచింది. ప్రి క్వార్టర్స్‌లో జపాన్ నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్న తీరు అదెంత ప్రమాదకర జట్టో చాటింది. ప్రపంచ ర్యాంకుల్లో 2, 3 స్థానాల్లో ఉన్న వీటి మధ్య క్వార్టర్స్‌లో భీకర పోరాటం ఖాయం. టోర్నీలో ఇప్పటివరకు ఏడు గోల్స్ చేసిన బ్రెజిల్... ప్రత్యర్థులకు ఒక్కటే ఇచ్చింది. బెల్జియం ఏకంగా 12 గోల్స్ కొట్టి... నాలుగు ఇచ్చింది. కీలక సమయంలో స్టార్ ఆటగాడు నెమార్ ఫామ్‌లోకి రావడంతో పాటు సాంబా జట్టు ఆట క్రమంగా పదునెక్కుతోంది. యువ గాబ్రియెల్ జీసస్ కూడా మెరిస్తే తిరుగుండదు. థియాగో సిల్వా, మిరండా వంటి సీనియర్లతో పటిష్ఠంగా కనిపిస్తున్న వీరి రక్షణ శ్రేణిని బెల్జియం స్టార్లు హజార్డ్, లుకాకు, మెర్టెన్స్‌లు ఏమేరకు ఛేదిస్తారో చూడాలి. గత మ్యాచ్‌లోలా ఆధిక్యం కోల్పోతే కోలుకోవడానికి వీలుండదు. ఆటగాళ్లంతా అద్భుత ఫామ్‌లో ఉండటంతో బెల్జియంను ‘గోల్డెన్ జనరేషన్’ జట్టుగా అభివర్ణిస్తున్నారు. ఇప్పుడు కాకుంటే మరె ప్పుడూ కప్పు గెలిచే అవకాశం రాదంటున్నారు. ఈ మ్యాచ్‌లో మాజీ చాంపియన్‌ను ఓడిస్తే 1986 తర్వాత బెల్జియం సెమీస్‌కు చేరినట్లవుతుంది. ►బ్రెజిల్ (vs) బెల్జియం రాత్రి గం.11.30 నుంచి ►సోనీ ఈఎస్పీఎన్, సోనీ టెన్–2, 3లలో ప్రత్యక్ష ప్రసారం -
ఇదీ క్రీడా స్ఫూర్తి.!
మాస్కో : ఫుట్‌బాల్ మ్యాచ్ అంటేనే యుద్ధం మాదిరిగా రెండు జట్ల మధ్య చావోరేవో అన్నట్టుగా హోరాహోరీ పోరు సాగుతుంది. ఆశించిన మేర ఫలితం రాకపోతే ఇరుజట్ల అభిమానుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు, రక్తపాతాలకు దారి తీసిన ఉదంతాలు కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుత ప్రపంచకప్ సందర్భంగా అందుకు పూర్తి విరుద్ధంగా చోటుచేసుకున్న కొన్ని సంఘటనలు అందరినీ ఔరా అని ఆశ్చర్యచకితులను చేస్తున్నాయి. అటు అభిమానులు, ఇటు ఆటగాళ్ల క్రీడా స్ఫూర్తికి అద్దం పడుతున్నాయి. బెల్జియంతో జరిగిన మ్యాచ్ చివర్లో జపాన్ జట్టు ఆశలు గల్లంతుకావడంతో స్టేడియంలోని అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు. రష్యాలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లు చూసేందుకు జపాన్ నుంచి వెళ్లిన వేలాదిమంది ఈ ఓటమితో ప్రపంచకప్ పోటీల నుంచి తమ జట్టు వైదొలగడాన్ని జీర్ణించుకోలేకపోయారు. అయినా పంటి బిగువున ఆ బాధను భరిస్తూనే తాము వీక్షించిన స్టేడియంలోని చెత్తాచెదారమంతా శుభ్రంచేశారు. ఈ మ్యాచే కాకుండా అంతకుముందు తమ జట్టు పాల్గొన్న నాలుగుమ్యాచ్లలోనూ ఇదే రకమైన నైతికవిలువలు, స్ఫూర్తిని ప్రదర్శించారు. ఈ మ్యాచ్ తర్వాత నీలం రంగు ’సామురాయ్ డ్రెస్’ ధరించిన ఈ అభిమానులు స్టేడియమంతా కలియతిరుగుతూ చెత్త ఎరుతున్న ఫోటోలు, వీడియోలు సామాజికమాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఓటమి చవిచూసిన జపాన్ జట్టు కూడా అత్యున్నత క్రీడా స్ఫూర్తిని, తమ దేశ క్రమశిక్షణను చేతల్లో చూపింది. స్టేడియం లోపల తమ జట్టుకు కేటాయించిన లాకర్ రూమ్ లోని కుర్చీలు, సామాగ్రిని ఆటగాళ్లు మిలమిల మెరిసేలా శుభ్రపరిచారు. ఓటమికి కుంగిపోకుండా రష్యన్ భాషలో ’ధన్యవాదాలు’ అనే నోట్‌ను అక్కడ వదిలి వెళ్లారు. ప్రపంచకప్ పోటీల నుంచి తమ జట్టు నిష్క్రమించినా జపాన్ ఆటగాళ్లు, అభిమానులు అందరి మనసులు గెలుచుకున్నారు. జపాన్ వ్యాప్తంగా ఫుట్‌బాల్ మ్యాచ్‌ల తర్వాత అభిమానులు ఈ విధంగా స్టేడియాలను శుభ్రపరచడం జపనీస్ సంస్కృతిలో అంతర్భాగమని ఆ దేశానికి చెందిన జర్నలిస్ట్ స్కాట్ మ్యాక్ఇన్టైర్ చెబుతున్నారు. జపాన్‌దేశ క్రీడాభిమానుల నుంచి స్ఫూర్తి పొందిన సెనగల్ అభిమానులు కూడా స్టేడియాన్ని శుభ్రపరిచారు. తమ జట్టు పోలాండ్‌పై గెలిచిన ఉత్సాహంతో వారు ఆ పనిచేశారు. -
జపాన్ విలాపం...
90+4 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో 47 నిమిషాలు స్కోరే లేదు! తుది ఫలితం మాత్రం 3–2. అంటే మిగతా 47 నిమిషాల్లో ఐదు గోల్స్! బెల్జియం, జపాన్ మధ్య జరిగిన ఫుట్‌బాల్ ప్రపంచకప్ నాకౌట్ పోరు తీవ్రతకు నిదర్శనమిది! ఓ వైపు రెండు జట్ల దూకుడైన ఆట... మరోవైపు గోల్‌పోస్ట్ వద్ద కీపర్ల అసమాన ప్రతిఘటన...! నిర్ణీత సమయంలో 2–2తో స్కోరు సమం. ఇంజ్యూరీలో పుంజుకున్న బెల్జియం ఔరా అనిపించేలా గెలవగా... ఆఖరి క్షణంలో గోల్ సమర్పించుకున్న జపాన్ కుదేలైంది! ఓ దశలో 2–0తో ఆధిక్యంలో నిలిచి విజయం దిశగా సాగుతున్న ‘బ్లూ సమురాయ్’ బృందం ఆ తర్వాత ఏకంగా మూడు గోల్స్ ఇచ్చుకొని ఓటమిని మూటగట్టుకుంది. రొస్తావ్ ఆన్ డాన్: ఈ ప్రపంచ కప్‌లో అందరూ తమ జట్టును ప్రమాదకరమైనదిగా ఎందుకు పేర్కొంటున్నారో చాటుతూ బెల్జియం అద్భుతం చేసింది. నాలుగు నిమిషాల వ్యవధిలో జపాన్‌కు రెండు గోల్స్ ఇచ్చి చేజారిందనుకున్న మ్యాచ్‌ను... ఐదు నిమిషాల తేడాలో రెండు గోల్స్ చేసి నిలబెట్టుకుంది. స్కోరు సమమైన వేళ, ఇంజ్యూరీ సమయంలో మెరుపు ఆటతో ఫలితాన్ని తమవైపు తిప్పుకొంది. ఓడినా జపాన్ చక్కటి పోరాటంతో ఆకట్టుకుంది. సంచలనం సృష్టించేలా కనిపించిన ఆసియా జట్టు... ఆధిక్యం కోల్పోయి, ఆఖర్లో అనూహ్యంగా పరాజయం పాలైంది. రెండు జట్ల మధ్య సోమవారం అర్ధరాత్రి ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో బెల్జియం 3–2తో గెలుపొందింది. జెన్కి హరగూచి (48వ నిమిషం), తకాషి ఇనుయ్ (52వ ని.)లు జపాన్ తరఫున గోల్స్ చేశారు. జాన్ వెర్టన్గెన్ (69వ ని.), మరౌనె ఫెల్లాయిని (74వ ని.), నేసర్ చాడ్లీ (90+4వ ని.)లు బెల్జియంకు స్కోరు అందించారు. ఆధిపత్యం అటు... ఇటు పోటాపోటీ ఆటతో మ్యాచ్ రసవత్తరంగా ప్రారంభమైంది. బెల్జియం మిడ్ ఫీల్డర్లు ఈడెన్ హజార్డ్, డ్రీస్ మెర్టెన్స్‌లు వీలు చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించినా ప్రత్యర్థి లొంగలేదు. మొదటి నిమి షంలోనే జపాన్ ఆటగాడు కొట్టిన షాట్ గోల్‌పోస్ట్ పక్కనుంచి వెళ్లింది. కొద్దిసేపటికే మెర్టెన్స్ అందించిన క్రాస్‌ను రొమేలు లుకాకు వృథా చేశాడు. హజార్డ్, లుకాకులకు సహచరుల నుంచిఅండ కరవై బెల్జియం ప్రభావవంతంగా కనిపించలేదు. జపాన్ సైతం ఓ గోల్ చాన్స్ చేజార్చుకుంది. మొదటి భాగంలో 55 శాతం బంతి బెల్జియం ఆధీనంలోనే ఉంది. ధనాధన్... రెండోభాగం మొదలవుతూనే జపాన్ దడదడలాడించింది. ఆటగాళ్ల మధ్య నుంచి వచ్చిన బంతిని వెంటాడిన హరగూచి... డి బాక్స్ లోపల ప్రత్యర్థిని ఏమారుస్తూ గోల్‌పోస్ట్‌లోకి పంపాడు. మరుసటి నిమిషంలో బెల్జియం దాడికి దిగినా బంతి గోల్బార్ను తాకి వెనక్కు వచ్చింది. ఇక 52 వ నిమిషంలో ఇనుయ్ డి బాక్స్ ముందు నుంచి కొట్టిన షాట్ నెట్లోకి చేరింది. జపాన్ ఒక్కసారిగా 2–0 ఆధిక్యంలోకి వెళ్లడంతో బెల్జియం దాడులు పెంచింది. ఫెల్లాయిని, చాడ్లీలను సబ్స్టిట్యూట్లుగా దింపింది. దీనికి ప్రతిఫలమే 69వ నిమిషంలో వెర్టన్గెన్ గోల్. కార్నర్లో ఉన్న అతడు హెడర్ ద్వారా కొట్టిన షాట్ ఎత్తులో వెళ్లి గోల్‌పోస్ట్‌లో పండింది. కొద్దిసేపటికే క్రాస్ షాట్‌ను ఫెల్లాయిని... తలతో గోల్‌గా మలిచాడు. సమయం దగ్గరపడటంతో బెల్జియం దూకుడు చూపినా కీపర్ కవాషియా రెండుసార్లు అద్భుతంగా అడ్డుకున్నాడు. స్కోర్లు సమమై... ఇంజ్యూరీ సమయం కూడా ముగుస్తుండటంతో మరో షూటౌట్ తప్పదని అనిపించింది. అయితే... ఆఖరి నిమిషంలో కుడివైపు నుంచి అందిన బంతిని చాడ్లీ నేర్పుగా గోల్ కొట్టి బెల్జియంకు విజయం కట్టబెట్టాడు. ‘థ్యాంక్యూ రష్యా’ మ్యాచ్‌లో ఓడిపోయిన జట్లు అసహనంతో డ్రెస్సింగ్ రూమ్‌లో అద్దాలు పగలగొట్టడం, వస్తువులను చిందరవందర చేయడం ఎన్నో సార్లు చూశాం. కానీ ఈ తరహాలో అతి శుభ్రంగా, అసలు అక్కడ అప్పటి వరకు ఎవరూ లేనట్లుగా ఉంచడం ఎప్పుడైనా చూశామా? కానీ జపాన్ మాత్రం అలాగే చేసింది. బెల్జియం చేతిలో పరాజయం బాధిస్తున్నా...తమ క్రమశిక్షణలో మాత్రం కట్టుతప్పలేదు. అక్కడినుంచి వెళ్లిపోయే ముందు అన్నీ క్రమపద్ధతిలో, కనీసం చిన్న కాగితం ముక్క కూడా కనిపించకుండా సర్దిపెట్టింది. పైగా వెళుతూ వెళుతూ రష్యన్ భాషలో కృతజ్ఞతలు చెబుతూ ఒక కార్డును అక్కడ ఉంచింది. హ్యాట్సాఫ్ టు జపాన్! -
ఫిఫా వరల్డ్ కప్: 48 ఏళ్లలో తొలిజట్టు
రోస్టోవ్: ఫిఫా వరల్డ్ కప్‌లో బెల్జియం సంచలన విజయం సాధించడంతో పాటు కొత్త అధ్యాయాన్ని లిఖించింది. సోమవారం అర్ధరాత్రి జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో జపాన్‌పై విజయం సాధించిన బెల్జియం క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. ఇరు జట్ల మధ్య హోరాహోరాగా సాగిన పోరులో అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగిన బెల్జియం 3-2 తేడాతో జపాన్ను చిత్తుచేసింది. రెండో అర్థ భాగం ఆరంభంలో 2-0తో వెనుకబడిన బెల్జియం.. ఆ తర్వాత అరగంట లోపు మూడు గోల్స్ సాధించి జపాన్‌కు షాకిచ్చింది. బెల్జియం ఆటగాళ్లలో జాన్ వెర్టోన్‌గెన్ గోల్ సాధించగా, ఫెల్లానీ రెండు గోల్స్ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఫుట్‌బాల్ వరల్డ్ కప్ చరిత్రలో బెల్జియం క్వార్టర్స్‌కు చేరడం మూడోసారి కాగా, వరల్డ్ కప్ నాకౌట్ గేమ్‌లో 2-0 వెనుకబడి ఆపై విజయాన్ని అందుకోవడం 48 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం. రెండో అర్థ భాగంలో జపాన్ స్వల్ప వ్యవధిలో రెండు గోల్స్‌తో దూసుకుపోయింది. ఆట 48వ నిమిషంలో హరగుచి గోల్ సాధించగా, 52వ నిమిషంలో టకాషి ఇనుయ్ మరో గోల్ సాధించడంతో జపాన్ 2-0 ఆధిక్యం లభించింది. దాంతో జపాన్‌కు నాలుగు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ దక్కాయి. అయితే ఈ ఆనందం వారికి ఎంతో సేపు నిలవలేదు. ఆ తర్వాత బెల్జియం రెచ్చిపోయింది. 70, 75 నిమిషాల్లో గోల్స్ సాధించి స్కోరును సమం చేసింది. తొలుత వెర్టోన్‌గెన్ గోల్ సాధించగా, ఐదు నిమిషాల వ్యవధిలో ఫెల్లానీ మరో గోల్స్ సాధించాడు. ఆపై నిర్ణీత సమయం వరకూ ఇరు జట్లు గోల్ సాధించడం కోసం తీవ్రంగా శ్రమించాయి. కాగా, అదనపు సమయంలో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన బెల్జియం ఆటగాడు చాడ్లి గోల్ సాధించి జట్టుకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో బ్రెజిల్‌తో బెల్జియం తలపడనుంది. -
అజేయ బెల్జియం
కలినిన్‌గ్రాడ్: ప్రపంచకప్ గెలవగల జట్లలో ఒకటిగా టోర్నీలో అడుగుపెట్టిన బెల్జియం... అదే స్థాయి ఆటతో లీగ్ దశను అజేయంగా ముగించింది. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ గెలిచి 9 పాయింట్లతో గ్రూప్ ‘జి’లో అగ్రస్థానం సాధించింది. గురువారం అర్ధరాత్రి ఇంగ్లండ్‌తో ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 1–0తో నెగ్గింది. జానుజాజ్ (54వ నిమిషం) ఏకైక గోల్ చేశాడు. రెండు జట్లు రెండేసి విజయాలతో ఇప్పటికే నాకౌట్ చేరిన నేపథ్యంలో మ్యాచ్ గణాంకాలు గ్రూప్ టాపర్ ఎవరో తేల్చేందుకే ఉపయోగపడ్డాయి. పనామాపై ట్యూనీషియా విజయం గ్రూప్ ‘జి’లోనే జరిగిన మరో మ్యాచ్‌లో పనామాపై ట్యూనీషియా 2–1తో నెగ్గింది. ట్యూనీషియా ఆటగాడు యాసిన్ మెరాయ్ 33వ నిమిషంలో సెల్ఫ్ గోల్ చేయడంతో పనామాకు ఆధిక్యం దక్కింది. అయితే, బెన్ యూసెఫ్ (51వ నిమిషం), ఖజ్రీ (66వ నిమిషం) గోల్స్ చేసి జట్టును గెలిపించారు. -
ఇంగ్లండ్ ప్లాన్ ప్రకారమే ఓడిందా..?
మాస్కో : ఏ టోర్నీలోనైనా ఆడే ప్రతీ మ్యాచ్ గెలవాలని అన్ని జట్లు కోరుకుంటాయి. అందులోనూ ఫిఫా వంటి మెగా టోర్నీలో ప్రతీ మ్యాచ్ ఫైనల్ పోరును తలపిస్తూ ఉంటుంది. కాగా, లీగ్ దశలో బెల్జియంపై ఇంగ్లండ్ ఆడిన తీరు ఇప్పుడు విమర్శలకు తావిచ్చింది. ఆ జట్టు గెలుపు కంటే కూడా ఓటమి కోసం ఎక్కువ శ్రమించినట్లు కనబడుతోంది. వివరాల్లోకి వెళితే.. ఫిఫా ప్రపంచకప్‌లో చివరి లీగ్ మ్యాచ్ ఆడకమందే ఇంగ్లండ్, బెల్జియం జట్లు నాకౌట్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. గ్రూప్ జీలో టాప్ స్థానం కోసం గురువారం జరిగిన మ్యాచ్‌లో బెల్జియం1-0తో ఇంగ్లండ్‌ను ఓడించింది. దీంతో గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచిన ఇంగ్లండ్ రౌండ్16లోకి అడుగుపెట్టింది. అయితే ఇంగ్లండ్ జట్టు పక్కా గేమ్ ప్లాన్ ప్రకారమే బెల్జియంపై ఓడిందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకు ఇంగ్లండ్‌కు అన్ని అనుకూలిస్తే క్వార్టర్స్‌లో బలమైన బ్రెజిల్ ప్రత్యర్థిగా ఎదురయ్యే పరిస్థితులే ఎక్కువగా కన్పిస్తున్నాయి. దీనిలో భాగంగా సాంబా జట్టు నుంచి ముప్పు తప్పించుకోవడానికే బెల్జియంపై ఇంగ్లండ్ ఓడిపోయిందని అభిప్రాయపడుతున్నారు. ఈ మ్యాచ్‌లో ఓడిపోవడంతో ఇంగ్లండ్ నాకౌట్లో కొలంబియాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలిచినట్లయితే మరో నాకౌట్ మ్యాచ్‌లో స్వీడన్, స్విట్జర్లాండ్ మధ్య జరిగే మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో క్వార్టర్ ఫైనల్లో తలపడే అవకాశం ఉంటుంది. బ్రెజిల్‌తో పోలిస్తే వీటి(స్వీడన్, స్విస్)పై గెలవటం సులభం అనే ఉద్దేశంతో బెల్జియం పై ఓడిపోయిందనేది విశ్లేషకుల వాదన. బెల్జియంతో మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు ఏ కేటగిరి ఆటగాళ్లను రిజర్వ్ బెంచ్‌కే పరిమితం చేయటంతో వారి అనుమానాలకు మరింత బలం చేకూర్చింది. ఏ మాత్రం పోరాట పటిమను ప్రదర్శించని ఇంగ్లండ్ ఆటగాళ్లు సాదాసీదాగా ఆడి మ్యాచ్‌ను ఓటమితో ముగించారు. మ్యాచ్‌లో పలుమార్లు గోల్ చేసే అవకాశాలు వచ్చినా ఇంగ్లండ్ ఆటగాళ్లు పదే పదే మిస్ చేశారు. సాధారణంగా ఫుట్‌బాల్ మ్యాచ్‌ల్లో జట్టు ఓడిపోతే కోచ్ ఆగ్రహాన్ని చవిచూడటం పరిపాటి. అటువంటిది మ్యాచ్ అనంతరం ఇంగ్లండ్ కోచ్ ఆటగాళ్లను అభినందిస్తూ స్వాగతం పలకడం చర్చనీయాంశమైంది. ఇక బెల్జియంకు కూడా ఇంగ్లండ్‌పై గొప్ప రికార్డేమి లేదు. 1936(82 సంవత్సరాల) తర్వాత ఇంగ్లండ్‌పై బెల్జియం గెలవడం ఇదే తొలిసారి. -
ఓడినా.. నాకౌట్‌కు ఇంగ్లండ్
మాస్కో : సాదాసీదాగా సాగిన మ్యాచ్.. ఒక్క మెరుపు గోల్ తప్ప అభిమానులను అలరించిన క్షణాలు లేవు. నాకౌట్‌కు చేరామన్న ధీమాతో ఇరుజట్లు ఏ కేటగిరి ఆటగాళ్లను బెంచ్‌కే పరిమితం చేసి బరిలోకి దిగాయి. ఫిఫా ప్రపంచకప్‌లో భాగంగా గ్రూప్ జీ టాపర్ కోసం జరిగిన పోరులో బెల్జియం 1-0తో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. దీంతో 82 సంవత్సరాల తర్వాత ఇంగ్లండ్‌పై బెల్జియం విజయం సాధించింది. 1936లో ఇంగ్లండ్‌పై గెలిచిన బెల్జియం తాజాగా రెండో సారి విజయానందం పొందింది. ఓవరాల్‌గా ఇరుజట్లు 22సార్లు తలపడగా బెల్జియం కేవలం రెండు సార్లు మాత్రమే గెలిచింది. తొలి అర్థభాగం చప్పగా సాగింది. ఒక్క గోల్ నమోదు కాకుండానే ప్రథమార్థం ముగిసింది. ఇరు జట్లు గోల్ కోసం పోరాడిన రక్షణశ్రేణి సమర్థవంతంగా అడ్డుకుంది. ద్వితీయార్థం మొదలైన ఆరు నిమిషాలకు బెల్జియం ఆటగాడు అద్నాన్ జనుజాజ్.. ఇంగ్లండ్ పెనాల్టీ ఏరియా మీదుగా ఆటగాళ్ల గ్యాప్ నుంచి కళ్లు చెదిరే రీతిలో గోల్ చేశాడు. దీంతో బెల్జియం 1-0తో ఆధిక్యంలోకి వచ్చింది. ఇక మ్యాచ్ ముగిసే సరికి ఇరు జట్లు మరో గోల్ నమోదు చేయకపోవడంతో బెల్జియం విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో బెల్జియం 14 అనవసర తప్పిదాలు చేయగా, ఇంగ్లండ్ 11 అనవసరం తప్పిదాలు చేసింది. రిఫరీలు బెల్జియం ఆటగాళ్లకు ఎల్లో కార్డు చూపించారు. ఈ మ్యాచ్‌లో గెలిచిన బెల్జియం జలై 2న జపాన్‌తో రౌండ్ 16లో తలపడనుంది. ఇక ఓడిపోయిన ఇంగ్లండ్ జులై 3న కొలంబియాతో తలపడనుంది. -
భారత్ 1–1 బెల్జియం
బ్రెడా (నెదర్లాండ్స్): చివరి క్షణాల్లో పట్టు సడలించి ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇచ్చే అలవాటు మరోసారి భారత్ కొంపముంచింది. మ్యాచ్ ఆద్యంతం ఆధిపత్యం చెలాయించిన భారత హాకీ జట్టు చివరి రెండు నిమిషాల్లో ప్రత్యర్థికి గోల్ సమర్పించుకొని గెలవాల్సిన మ్యాచ్‌ను చివరకు ‘డ్రా’గా ముగించింది. చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో గురువారం ఇక్కడ బెల్జియం, భారత్‌ల మధ్య జరిగిన మ్యాచ్ 1–1తో సమమైంది. భారత్ తరఫున హర్మన్‌ప్రీత్ సింగ్ (10వ నిమిషంలో), బెల్జియం తరఫున లొయిక్ ల్యూపార్ట్ (59వ నిమిషంలో) చెరో గోల్ సాధించారు. మ్యాచ్ ప్రారంభం నుంచి దూకుడైన ఆటతో చెలరేగిన భారత్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఒత్తిడిని కొనసాగిస్తూ... మ్యాచ్‌పై పైచేయి కనబర్చింది. దీంతో తొలి అర్ధభాగం ముగిసే సరికి 1–0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో అర్ధ భాగంలో దాడులు తీవ్రతరం చేసిన బెల్జియం ఆటగాళ్లు బంతిని ఎక్కువ శాతం తమ నియంత్రణలో ఉంచుకొని భారత ఆటగాళ్లను విసిగించారు. ఈ క్రమంలో భారత్‌కు గోల్ చేసే అవకాశాలు వచ్చిన వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయింది. మరో రెండు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా... బెల్జియం ఆటగాళ్లకు లభించిన పెనాల్టీ కార్నర్‌ను లొయిక్ లూపార్ట్ గోల్‌గా మలిచి స్కోరు సమం చేశాడు. శనివారం జరిగే మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో భారత్ ఆడుతుంది. -
టునిషియాపై 5-2తో బెల్జియం విజయం
-
బెల్జియం... బెబ్బులిలా
ఫేవరెట్లు జాగ్రత్త పడాల్సిందే! బెంబేలెత్తిస్తున్న బెల్జియంను తట్టుకోవాలంటే తప్పకుండా వ్యూహరచన చేయాల్సిందే. ఈ ఫిఫా ప్రపంచకప్‌లో ‘చాంపియన్ల’కు దీటుగా రాణిస్తున్న జట్టేదైనా ఉందంటే అది బెల్జియమే! మెరికల్లాంటి ఫార్వర్డ్, దుర్భేద్యమైన డిఫెన్స్‌తో రోజు రోజుకూ పటిష్టమైన జట్టుగా ఎదుగుతోంది. గ్రూప్ ‘జి’లో ఇంగ్లండ్ కంటే ముందుగా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి చేరింది. లుకాకు డబుల్ మ్యాజిక్ స్పార్టక్ స్టేడియాన్ని ఊపేసింది. మాస్కో: పనామాపై 3–0తో గెలిచింది బెల్జియం. అయినా కోచ్‌తో మాట పడాల్సి వచ్చింది. కోచ్ రాబెర్టో మార్టినెజ్ ఇదేం ఆట? ఇంత నింపాదిగానా? అని అసంతృప్తి వెలిబుచ్చారు. ఆయన అసంతృప్తికి ఈ మ్యాచ్ సగంలోపే సమాధానమివ్వాలనుకున్నారో ఏమోగానీ బెల్జియం ఆటగాళ్లు బెంబేలెత్తించారు. 3–1తో తొలి భాగాన్ని ముగించిన బెల్జియం... చివరకు 5–2తో ట్యూనిషియాను దడదడలాడించింది. వరుసగా రెండో భారీ విజయంతో ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. గ్రూప్ ‘జి’ నుంచి వరుస విజయాలతో ఈ అర్హత సంపాదించింది. స్పార్టక్ స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో బెల్జియం మ్యాచ్ ఆసాంతం గర్జించింది. స్టార్ స్ట్రయికర్ రొమెలు లుకాకు ఈ మ్యాచ్‌లోనూ రెండు గోల్స్ సాధించాడు. మొత్తం నాలుగు గోల్స్‌తో ఈ టోర్నీలో క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్) సరసన నిలిచాడు. ఆట ఆరంభమే బెల్జియం ఆధిక్యంతో మొదలైంది. 6వ నిమిషంలో లభించిన పెనాల్టీని మిడ్‌ఫీల్డర్ ఎడెన్ హజార్డ్ గోల్‌గా మలిచాడు. మరో పది నిమిషాలకు ఈ ఆధిక్యం రెట్టింపైంది. ఆట 16వ నిమిషంలో మెర్టెన్స్ ఇచ్చిన పాస్‌ను ఎలాంటి పొరపాటు చేయకుండా లుకాకు గోల్‌పోస్ట్‌లోకి తరలించాడు. అయితే రెండు నిమిషాల వ్యవధిలోనే ట్యూనిషియా డిఫెండర్ డిలాన్ బ్రాన్ గోల్ చేయడంతో బెల్జియం ఆధిక్యం 2–1కు తగ్గింది. 18వ నిమిషంలో కెప్టెన్ ఖాజ్రీ ఫ్రికిక్ షాట్‌ను బ్రాన్ గోల్ పోస్ట్‌లోకి తరలించాడు. ప్రథమార్థం ముగిసే దశలో లుకాకు మరో గోల్ సాధించాడు. ఇంజ్యూరీ టైమ్ (45+3వ ని.)లో మెనియెర్తో కుదిరిన సమన్వయంతో లుకాకు గోల్ చేసి తొలి అర్ధభాగాన్ని 3–1తో ముగించాడు. తర్వాత ద్వితీయార్ధం కూడా ప్రథమార్థంలాగే మొదలైంది. ఆరు నిమిషాల్లో బెల్జియం మళ్లీ గోల్‌తో గర్జించింది. 51వ నిమిషంలో అల్డెర్ విరెల్డ్ నుంచి వచ్చిన బంతిని హజార్డ్ ఛాతితో నియంత్రించి మెరుపు వేగంతో గోల్ కొట్టాడు. అప్పుడు... ఇప్పుడు ఆట మొదలైన ఆరు నిమిషాలకే హజార్డ్ గోల్ చేయడం విశేషం. ఎక్స్ట్రా టైమ్ కంటే ముందే సాకర్ ప్రపంచకప్‌లో బెల్జియం ఏకంగా 4 గోల్స్ చేయడం ఇదే తొలిసారి. సరిగ్గా 90వ నిమిషంలో టియెలిమన్స్ కార్నర్ దిశగా ఇచ్చిన పాస్‌ను మైకీ బట్షువయి గోల్ పోస్ట్‌లోకి నెట్టేశాడు. దీంతో 5–1 ఆధిక్యంతో గెలిచేందుకు సిద్ధమైంది బెల్జియం. అయితే ఇంజ్యూరీ టైమ్ (90+3వ ని.)లో ఈ సారి ట్యూనిషియా గోల్ సాధించింది. కెప్టెన్ ఖాజ్రీ కొట్టిన ఈ గోల్‌తో ఆధిక్యం 5–2కు తగ్గింది. ఈ మ్యాచ్‌లో బెల్జియం ఆట అద్భుతంగా సాగింది. 12 సార్లు లక్ష్యంపై గురిపెట్టిన ఆ జట్టు ఐదు సార్లు సఫలమైంది. ప్రత్యర్థి ట్యూని షియా ఐదుసార్లు ప్రయత్నించి 2 గోల్స్‌తో సరిపెట్టుకుంది. బెల్జియం తమ గ్రూప్‌లో చివరి మ్యాచ్‌ను ఈ నెల 28న ఇంగ్లండ్‌తో ఆడనుంది. ► 2 డిగో మారడోనా తర్వాత ప్రపంచకప్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో రెండు అంతకంటే ఎక్కువ గోల్స్ చేసిన రెండో ఆటగాడిగా లుకాకు చరిత్రకెక్కాడు. 1986లో మారడోనా ఇంగ్లండ్, బెల్జియంలపై రెండేసి గోల్స్ సాధించాడు. ► 5 వరల్డ్‌కప్ చరిత్రలో బెల్జియం ఒక మ్యాచ్‌లో 5 గోల్స్ చేయడం ఇదే ప్రథమం. ఓవరాల్‌గా ఒకే మ్యాచ్‌లో ఏడు గోల్స్ నమోదు కావడం తొమ్మిదోసారి. ► 6 ప్రపంచకప్ గ్రూప్ దశలో బెల్జియంకు ఇది వరుసగా ఆరో విజయం. 2002లో ఒకటి, 2014లో మూడు, ఇప్పుడు రెండు మ్యాచ్‌ల్లో గెలిచింది. ► 0 గత 13 ప్రపంచకప్‌ల్లో బరిలోకి దిగిన ట్యూనిషియా ఒక్క మ్యాచ్ గెలవలేకపోయింది. నాలుగు డ్రా చేసుకుంటే తొమ్మిదింట పరాజయమే! (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
భళా... బెల్జియం
సంచలనమేమీ లేదు... అరంగేట్ర జట్టు ప్రత్యర్థిని నిలువరించనూ లేదు... ప్రపంచకప్ తొలి మ్యాచ్‌ను కొంత ఆసక్తికరంగానే ప్రారంభించినా కొత్త జట్టు పనామా తర్వాత తప్పులతో తడబడింది. దాని పోరాటం నామమాత్రమే అయింది. క్రమంగా పుంజుకున్న బెల్జియం అసలైన ఆటను బయటకు తీసింది. వరుస దాడులతో ఊపిరి సలపకుండా చేసింది. స్ట్రయికర్లు లుకాకు, మెర్టెన్స్ కళ్లు చెదిరే రీతిలో చేసిన గోల్స్‌తో విజయదుందుభి మోగించింది. సోచి: ప్రారంభ మ్యాచ్ తర్వాత ప్రపంచ కప్‌లో ఓ ఏకపక్ష మ్యాచ్. అరంగేట్ర పనామాపై బెబ్బులిలా విరుచుకుపడిన బెల్జియం 3–0 తేడాతో సునాయాస విజయం అందుకుంది. సోమవారం ఇక్కడ జరిగిన గ్రూప్ ‘జి’ మ్యాచ్‌లో ప్రత్యర్థి అనుభవ రాహిత్యాన్ని సొమ్ము చేసుకున్న ఆ జట్టు పూర్తి ఆధిపత్యం చాటింది. మెరుపులా మెరిసిన స్ట్రయికర్లు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రొమేలు లుకాకు రెండు, డ్రియెస్ మెర్టెన్స్ ఒక గోల్ చేశారు. పోటీతోనే ప్రారంభమైనా... వాస్తవానికి బంతిపై నియంత్రణ, పాస్‌ల చేరవేతతో ప్రారంభంలో పనామా దీటుగా ఆడింది. మంచి డిఫెన్స్‌తో గోల్‌కు అవకాశం ఇవ్వలేదు. అటు బెల్జియం కూడా దాడులు చేయడంలో ఇబ్బందిపడింది. ఓ దశలో ఇద్దరు మినహా ఆ జట్టు ఆటగాళ్లంతా ప్రత్యర్థి ఏరియాలోకి వెళ్లారు. అయినా స్కోరు చేయలేకపోయారు. దీంతో మొదటి భాగం గోల్ లేకుండానే ముగిసింది. అయితే, రెండో భాగం ప్రారంభంలోనే ఈ నిరీక్షణకు తెరపడింది. బెల్జియం ఒక్కసారిగా దూకుడు పెంచగా, పనామా క్రమంగా లయ తప్పింది. 47వ నిమిషంలో స్ట్రయికర్ డ్రీస్ మెర్టెన్స్... గోల్ పోస్ట్‌కు కొద్ది దూరంలో అందిన బంతిని చూడచక్కని రీతిలో స్కోరు చేసి బెల్జియంకు ఆధిక్యం అందించాడు. ఇక్కడినుంచి గాడి తప్పిన పనామా ఒకటీ, అరా అవకాశాలనూ సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఆ జట్టు ఆటగాళ్లు వరుసగా ఎల్లో కార్డ్‌కు గురయ్యారు. మరోవైపు 69వ నిమిషంలో డిబ్రుయెన్ అందించిన క్రాస్‌ను స్ట్రయికర్ లుకాకు... డైవ్ చేస్తూ అద్భుతం అనేలా తలతో గోల్‌గా మలిచాడు. దీన్నుంచి తేరుకునేలోపే 75వ నిమిషంలో మరో దెబ్బకొట్టాడు. డిబ్రుయెన్, విట్సెల్ నుంచి అందిన పాస్‌లను ఈడెన్ హజార్డ్... లుకాకుకు చేరవేయగా అతడు వేగంగా పరుగెడుతూ కీపర్ పెనెడోను తప్పిస్తూ గోల్‌గా మార్చాడు. ఆరు నిమిషాల్లో రెండు గోల్స్ ఇచ్చుకున్న పనామా తర్వాత చేసేదేమీ లేకపోయింది. ఆ జట్టు ఆటగాళ్లు ఐదుగురు ఎల్లోకార్డ్ను ఎదుర్కోవడం గమనార్హం. -
ఎవరిదో ‘జి’గేల్...!
ఎప్పుడో 52 ఏళ్ల క్రితం వరల్డ్ కప్ నెగ్గిన జట్టు... ఆ తర్వాత అదే గొప్పతో ప్రతీసారి బరిలోకి దిగడం, అంచనాలను అందుకోలేక విఫలం కావడం ఆ జట్టుకు రొటీన్‌గా మారిపోయింది... మరోవైపు ప్రతిభకు కొదవ లేకపోయినా, సంచలన విజయాలకు లోటు లేకపోయినా తుది ఫలితం మాత్రం సానుకూలంగా లేని జట్టు మరొకటి... ఇందులో ఒకటి ఇంగ్లండ్ కాగా, రెండోది బెల్జియం. ఈ రెండు ప్రపంచకప్‌లో ఒకే గ్రూప్ నుంచి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. నాకౌట్ చేరడంలో ఏమాత్రం సందేహం లేకున్నా, ఆ తర్వాత ఎంత ముందుకు వెళతాయనేది ఆసక్తికరం. ఇక పనామా, ట్యునీషియాల సంచలనం గురించి కూడా ఊహించలేం. ఇంగ్లండ్... సత్తా ఉన్నా గత ప్రపంచకప్‌లో గ్రూప్ దశలోనే వెనుదిరగడం, 2016 యూరోలో ప్రిక్వార్టర్స్‌లో ఐస్లాండ్ చేతిలో ఓడటంలాంటి పరిణామాలు ఇంగ్లండ్ జట్టుపై అంచనాలు తగ్గించేశాయి. ప్రపంచంలోనే అత్యంత ధనికమైన, పురాతనమైన లీగ్ (ఈపీఎల్) ఇంగ్లండ్‌లోనే ఉన్నా... అంతర్జాతీయ స్థాయికి వచ్చేసరికి మాత్రం ఆ జట్టు అంతంతమాత్రం ప్రదర్శనే కనబరుస్తోంది. సూపర్ స్టార్లు బెక్‌హామ్, రూనీలు రాజ్యమేలిన సమయంలో కూడా ఇంగ్లండ్ చెప్పుకోదగ్గ విజయాలు సాధించలేకపోయింది. యువ ఆటగాళ్లతో కూడిన జట్టు గ్రూప్ దశ దాటడం ఖాయమే అయినా, ఆపై ఏమాత్రం రాణిస్తుందనేది ఆసక్తికరం. ప్రపంచ ర్యాంక్: 12 కీలక ఆటగాడు: హ్యారీ కేన్. మరో మాటకు తావు లేకుండా కేన్‌పై ఇంగ్లండ్ చాలా ఆధారపడుతోందనేది వాస్తవం. జిదాన్ ద్వారా ‘పరిపూర్ణ ఆటగాడి’గా ప్రశంసలందుకున్న ఇతను ప్రస్తుతం టాప్ స్ట్రయికర్లలో ఒకడు. ప్రీమియర్ లీగ్ పోటీల్లో అద్భుతంగా రాణించిన హ్యారీ క్వాలిఫయింగ్‌లో ఇంగ్లండ్ తరఫున 5 గోల్స్ కొట్టాడు. కోచ్: గారెత్ సౌత్‌గేట్. పెద్ద స్థాయిలో కోచింగ్ అనుభవం లేకపోయినా 2016లో ఇంగ్లండ్ ఏరికోరి గారెత్ను కోచ్‌గా పెట్టుకుంది. అయితే తొందరగానే జట్టుపై పట్టు సాధించిన ఇతను సాహసవంతమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఎక్కడా వెనకడుగు వేయడనే పేరుంది. 1998, 2002 ప్రపంచకప్‌లలో ఇంగ్లండ్ తరఫున బరిలోకి దిగిన సౌత్‌గేట్ ఈసారి కోచ్‌గా తనదైన ముద్ర వేయాలనుకుంటున్నాడు. చరిత్ర: 14 సార్లు వరల్డ్ కప్‌లో పాల్గొంది. 1966లో చాంపియన్‌గా నిలిచింది. బెల్జియం... నిలకడకు మారుపేరైనా! యూరోపియన్ జట్లలో పటిష్టమైన వాటిలో ఒకటిగా బెల్జియంకు గుర్తింపు ఉంది. ఆ జట్టు ప్రదర్శన ఎంత నిలకడగా ఉందో ‘ఫిఫా’ ర్యాంకింగ్ కూడా చూపిస్తుంది. అయితే వరల్డ్ కప్ విషయానికి వచ్చేసరికి మాత్రం చాలా విషయాలు దానికి అచ్చి రాలేదు. ఈసారి కూడా జట్టు ఏ ఒక్కరిపైనో ఆధార పడకుండా సమష్టితత్వాన్నే నమ్ముకుంది. ఫార్వర్డ్‌లలో రొమెలు లుకాకు పాత్ర కీలకం కానుంది. ఆఖరి సారిగా వరల్డ్ కప్ బరిలోకి దిగుతున్న గోల్ కీపర్ తిబాట్ కార్టియోస్ టోర్నీని చిరస్మరణీయం చేసుకోవాలని భావిస్తున్నాడు. డిఫెన్స్ కొంత బలహీనంగా కనిపిస్తున్నా... క్వాలిఫయింగ్‌లో బెల్జియం ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ప్రపంచ ర్యాంక్: 3 కీలక ఆటగాడు: ఎడెన్ హజార్డ్. నైపుణ్యం, చురుకుదనం కలగలిసిన ఎడెన్ ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ ఫార్వర్డ్‌లలో ఒకడు. క్వాలిఫయింగ్ మ్యాచ్‌లలో 6 గోల్స్ చేయడంతో పాటు మరో 5 గోల్స్‌లో ప్రధాన పాత్ర పోషించాడు. కెవిన్ డి బ్రూయిన్పై కూడా జట్టు ఆశలు పెట్టుకుంది. కోచ్: రాబర్టో మార్టినెజ్. 2016 యూరోకప్‌లో జట్టు ఘోర ప్రదర్శన తర్వాత మార్క్ విల్మాట్స్ను తొలగించి ఇతడిని ఎంపిక చేశారు. స్పెయిన్‌కు చెందిన మార్టినెజ్ వచ్చాక జట్టు ఆట గాడిలో పడింది. గతంలో క్లబ్ స్థాయిలో మాత్రమే కోచింగ్ ఇచ్చిన అనుభవం ఉన్న ఇతనికి ఇదే తొలి ‘ఫిఫా’ కప్. చరిత్ర: 12 సార్లు టోర్నీ బరిలోకి దిగింది. 1986లో నాలుగో స్థానం అత్యుత్తమ ప్రదర్శన ట్యునీషియా... గ్రూప్ దశ దాటాలని... క్వాలిఫయింగ్‌లో కాంగో, లిబియా, గినియా జట్లను వెనక్కి తోసి అజేయంగా ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. ఒక్కసారైనా గ్రూప్ దశ దాటని ఈ జట్టు ప్రస్తుత ఏకైక లక్ష్యం ఒక్క మ్యాచ్‌లోనైనా విజయం సాధించడం. జట్టులో దాదాపు అందరూ కొత్త కుర్రాళ్లే. కీలక ఆటగాడు: యూసుఫ్ ఎమ్ సక్ని. 27 ఏళ్ల ఈ ఫార్వర్డ్ తన ఆటతీరుతో ట్యూనీషియా ప్రపంచ కప్ కు అర్హత సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. గినియాతో జరి గిన మ్యాచ్‌లో హ్యాట్రిక్ కొట్టాడు. ప్రపంచ ర్యాంక్: 21 కోచ్: నబీల్ మాలుల్. 1980, 1990లలో ట్యునీషియా అత్యుత్తమ ఆటగాడిగా గుర్తింపు ఉంది. 2002లో ట్యునీషియా ఆఫ్రికా కప్ గెలిచిన సమయంలో జట్టు సహాయక కోచ్‌గా పని చేసిన అనుభవం ఉంది. అదే కారణంతో కోచ్ పదవి లభించింది. అతని నేతృత్వంలో జట్టు 2011 సీఏఎఫ్ చాంపియన్స్ లీగ్ గెలిచింది. చరిత్ర: నాలుగు సార్లు పాల్గొంది. ఎప్పుడూ గ్రూప్ దశ దాటలేదు. గత రెండు వరల్డ్‌కప్‌లకు దూరమై ఈసారి మళ్లీ అర్హత సాధించింది. పనామా... కోచ్ ఎలా నడిపిస్తాడో! 40 లక్షల జనాభా గల ఈ దేశం తొలిసారి ప్రపంచకప్‌కు అర్హత సాధించిన రోజున ప్రభుత్వం జాతీయ సెలవుదినాన్ని ప్రకటించింది. తమ గ్రూప్‌లో ఉన్న అమెరికాను పడగొట్టడంతో పాటు చివరి క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో కోస్టారికాను 2–1తో ఓడించి అర్హత సాధించింది. ప్రపంచ ర్యాంక్: 55 కీలక ఆటగాడు: బ్లాస్ పెరెజ్. జాతీయ జట్టు తరఫున 100కు పైగా మ్యాచ్‌లు ఆడిన సీనియర్. నాలుగు సార్లు ప్రపంచ కప్ క్వాలిఫయింగ్ టోర్నీల్లో పాల్గొన్నాడు. లూయీస్ తేజాడా కూడా మరో ప్రధాన ఆటగాడు. కోచ్: హెర్నన్ డారియో గోమెజ్. దిగువ స్థాయి జట్లను తన శిక్షణలో మేటిగా తీర్చిదిద్దడంలో మంచి గుర్తింపు ఉంది. గోమెజ్ కోచ్‌గా ఉన్న సమయంలో 1998లో కొలంబియా, 2002లో ఈక్వెడార్, ఇప్పుడు పనామా వరల్డ్ కప్‌కు అర్హత సాధించాయి. తన నేతృత్వంలో సంచలనాన్ని ఆశిస్తున్నాడు. -
బీరు గ్లాసు తెచ్చిన తంటా!
బెల్జియంలోని బ్రూగ్స్‌లో ఓ బీర్వాల్ అని చాలా ఫేమస్ బార్ ఉంది. అక్కడ రోజుకు దాదాపు 1600 గ్లాసుల బీరు అమ్ముడు పోతుందట. అంత ఫేమస్ అది. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది బీరు గురించి కాదు. ఆ బీరు పోసిచ్చే గ్లాసుల గురించి..! ఎందుకంటే ఆ షాప్ వాళ్లే ప్రత్యేకంగా తయారు చేయించుకున్న గ్లాసుల్లో వారు బీరు సర్వ్ చేస్తారు. అంతవరకు బాగానే ఉంది. కానీ అక్కడే ఆ షాప్ యాజమాన్యానికి ఓ చిక్కు వచ్చి పడింది. ఆ ప్రత్యేకమైన గ్లాసులే వారికి తల నొప్పిగా మారాయి. ఎందుకంటే అవి చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉన్నాయని అక్కడికొచ్చిన కస్టమర్లు వాటిని ఇంటికి తీసుకెళ్తున్నారట. బార్ గోడలపై గ్లాసులను దయచేసి తీసుకెళ్లకండి అని పెద్ద పెద్ద అక్షరాలతో నాలుగు భాషల్లో చేసిన విజ్ఞప్తులను కూడా పట్టించుకోకుండా వాటిని దొంగిలిస్తున్నారట. ఇక చేసేదేం లేక బారు ఎంట్రన్స్‌లలో గ్లాస్ స్కానర్లను పెట్టి మరీ వారి గ్లాసులను కాపాడుకోవాల్సి వస్తోందట. బార్లోపలికి వచ్చి వెళ్లే వారందరినీ స్కాన్ చేసి గ్లాసులుంటే వారికి సున్నితంగా చెప్పి వారి గ్లాసులు వారు తీసుకుంటున్నారట. -
బెల్జియంపై భారత్ విజయం
హామిల్టన్ (న్యూజిలాండ్): నాలుగు దేశాల తొలి అంచె అంతర్జాతీయ హాకీ టోర్నమెంట్లో లీగ్ మ్యాచ్‌లో, ఫైనల్లో బెల్జియం చేతిలో ఎదురైన ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. రెండో అంచె టోర్నీ లీగ్ మ్యాచ్‌లో భారత్ 5–4తో ప్రపంచ మూడో ర్యాంకర్ బెల్జియంను బోల్తా కొట్టించింది. భారత్ తరఫున రూపిందర్ పాల్ సింగ్ (4వ, 42వ ని.లో) రెండు గోల్స్ చేయగా... హర్మన్‌ప్రీత్ సింగ్ (46వ ని.లో), లలిత్ ఉపాధ్యాయ్ (53వ ని.లో), దిల్‌ప్రీత్ సింగ్ (59వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. బెల్జియం జట్టుకు జాన్ డోమెన్ (17వ ని.లో), ఫెలిక్స్ డెనాయర్ (37వ ని.లో), అలెగ్జాండర్ హెండ్రిక్స్ (45వ ని.లో), టామ్ బూన్ (56వ ని.లో) ఒక్కో గోల్ అందించారు. శనివారం జరిగే మూడో లీగ్ మ్యా చ్లో జపాన్‌తో భారత్ ఆడుతుంది. -
బెల్జియం ఈసారైనా?
పారిస్: 117 ఏళ్ల చరిత్ర కలిగిన డేవిస్ కప్ పురుషుల టీమ్ టెన్నిస్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచేందుకు బెల్జియం జట్టుకు మరో అవకాశం లభించింది. గతంలో రెండుసార్లు (2015లో, 1904లో) ఫైనల్‌కు చేరి రన్నరప్‌తో సరిపెట్టుకున్న బెల్జియం మూడో ప్రయత్నంలోనైనా డేవిస్‌కప్ టైటిల్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో శుక్రవారం మొదలయ్యే డేవిస్ కప్ ఫైనల్లో తొమ్మిదిసార్లు చాంపియన్ ఫ్రాన్స్‌తో బెల్జియం జట్టు తలపడుతుంది. డేవిస్ కప్ ముఖాముఖి పోరులో ఫ్రాన్స్ 4–3తో బెల్జియంపై ఆధిక్యంలో ఉంది. బెల్జియం ఆశలన్నీ ప్రపంచ ఏడో ర్యాంకర్ డేవిడ్ గాఫిన్‌పై ఉండగా... ఫ్రాన్స్ భారమంతా ప్రపంచ 15వ ర్యాంకర్ జో విల్ఫ్రైడ్ సోంగాపై ఉంది. శుక్రవారం జరిగే రెండు సింగిల్స్ మ్యాచ్‌ల్లో లుకాస్ పుయి (ఫ్రాన్స్)తో గాఫిన్... సోంగా (ఫ్రాన్స్)తో స్టీవ్ డార్సిస్ తలపడతారు. -
ప్లాస్టిక్.. టిక్..టిక్...
పర్యావరణానికి చేటు చేస్తుందని.. భూమి లోకి చేరితే వందల ఏళ్ల పాటు నాశనం కాకుండా ఇబ్బంది పెడుతుందని తెలిసినా ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్ వినియోగం తగ్గట్లేదు. బ్రిటన్ దినపత్రిక గార్డియన్ ఈ అంశంపై ఈ మధ్యే ఒక కథనాన్ని ప్రచురించింది. దీని ప్రకారం.. భూమ్మీద ఉన్నది 700 కోట్ల మందైతే.. వీళ్లం దరూ కొంటున్న ప్లాస్టిక్ బాటిళ్ల సంఖ్య ఎంతో తెలుసా? ప్రతి నిమిషానికి కోటి! అంటే గంటకు 60 కోట్లు రోజుకు 1,440 కోట్లు! ఏడాదికి 50,000 కోట్లు! వీటిల్లో దాదాపు సగం చెత్తగా మారిపోతున్నాయి.. చెరువులు, నదులు సము ద్రాల్లో కలిసిపోయి సమస్యలను జటిలం చేస్తున్నాయి. నీటివనరుల్లోకి చేరిన ప్లాస్టిక్‌లో కొంత చేపలకు ఆహారమవుతోంది. ఆ చేపలను తిన్న మనుషులూ అనారోగ్యం పాలవుతు న్నారు. బెల్జియంలోని ఘెంట్ వర్సిటీ అధ్య యనం ప్రకారం.. సముద్ర జలచరాలను తినేవారు ప్రతిసారి కనీసం 11 వేల సూక్ష్మస్థాయి ప్లాస్టిక్‌ను తమ శరీరంలోకి పంపించుకుం టున్నారని స్పష్టం చేస్తోంది. -
ఆర్టీసీలో బెల్జియం దేశస్తుల షూటింగ్
అనంతపురం సెంట్రల్ : రోడ్డు రవాణాశాఖ కార్యాలయంలో సోమవారం సందడి వాతావరణం నెలకొంది. బెల్జియం దేశానికి చెందిన కొంతమంది ఓ రియాల్టీ గేమ్ షోకు సంబంధించి షూటింగ్ నిర్వహించారు. షూటింగ్‌ను వాహనదారులు ఆసక్తిగా తిలకించారు. మూడు రోజుల క్రితం అనుమతి తీసుకుని ఈ వీడియో చిత్రీకరించారు. పనుల నిమిత్తం ఆర్టీఏ కార్యాలయానికి వచ్చే వాహనదారులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అధికారులు మందస్తు, ప్రత్నామయ చర్యలు తీసుకున్నారు. -
ట్రంప్ తొలి విదేశీ పర్యటన ఖరారు. ఎక్కడికంటే
-
ఈ నెల 25న బెల్జియంకు ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలి విదేశీ పర్యటన ఖరారైంది. నాటో దేశాల సదస్సు నిమిత్తం ట్రంప్ వచ్చే నెల 25న బెల్జియం రాజధాని బ్రస్సెల్స్కు వెళ్లనున్నట్లు వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి. నాటోతో బంధాన్ని బలోపేతం చేసుకోవడం, కూటమికి సంబంధించి కీలక అంశాలు, ఉగ్రవాద వ్యతిరేక పోరాటంపై ఈ సందర్భంగా ట్రంప్ చర్చిస్తారు. ఈ కార్యక్రమం తర్వాత ట్రంప్ జీ–20 సదస్సు కోసం జర్మనీకి కూడా వెళ్తారు. జీ–20 సమావేశాలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరుకానున్నారు. ఇప్పటికే మోదీని శ్వేతసౌధానికి ట్రంప్ ఆహ్వానించగా, ట్రంప్‌ను భారత్ పర్యటనకు మోదీ ఆహ్వానించారు. అయితే జీ–20 సదస్సులో ఇరు దేశాధినేతలు సమావేశమయ్యే అవకాశం ఉంది. ట్రంప్ గతంలో ఎన్నికల ప్రచార సమయంలో నాటోపై వ్యతిరేకత వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. ఇది అమెరికాకు అనవసరపు ఖర్చుతో కూడిన ఖర్చంటూ టంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
మాంచెస్టర్‌ను ఓడిస్తాం
సైమన్ మిగ్నోలెట్ ఇంటర్వ్యూ బెల్జియం స్టార్ ఆటగాడు సైమన్ మిగ్నోలెట్. ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్)లో లివర్‌పూల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ గోల్‌కీపర్ తమ జట్టు ఈ సారి టైటిల్ సాధిస్తుందనే ధీమాతో ఉన్నాడు. సహచరుడు లోరిస్ కరియస్ కోసం ఆరంభ మ్యాచ్‌ల్లో బెంచ్‌కే పరిమితమైన ఇతను కొత్త ఏడాదిలో తమ జట్టు విజయాలతో దూసుకెళుతుందనే ఆశాభావంతో ఉన్నాడు. ఇంకా అతను ఏమన్నాడంటే... విజయంతో ఈ ఏడాదికి ముగింపు పలుకుతారా? అవును... జట్టు సభ్యులు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. మాంచెస్టర్ సిటీతో శనివారం జరిగే మ్యాచ్‌లో గెలవాలనే పట్టుదల వారిలో ఉంది. అంతేకాదు ఈ సీజన్లో టైటిల్ గెలిచే అవకాశాలు కూడా మాకే ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందనే విషయం కూడా తెలుసు. మాంచెస్టర్ సిటీతో కీలకమైన మ్యాచ్‌లో మీరు ప్రతీకారం తీర్చుకుంటారా? తీర్చుకోవాలని ఉంది. అయితే ముందుగా గట్టిపోటీపైనే మా దృష్టి ఉంది. తర్వాత ఒక్కో మ్యాచ్ విజయం... అనంతరం టైటిల్ వేటలో సఫలమవడం మా టార్గెట్. ఈపీఎల్ టైటిల్‌తో నా కలను సాకారం చేసుకోవాలనుంది. దీనికోసం చాలా కష్టపడాలి. అభిమానుల అంచనాలను చేరుకోవాలని, వారి నిరీక్షణకు తెరదించాలనే లక్ష్యంతో ఉన్నాం. ఈ ఏడాది వ్యక్తిగతంగా మీకు, అలాగే మీ జట్టుకు ఎలాంటి అనుభూతినిచ్చింది? ఈ ఏడాది నేను ఎన్నో సాధించాలనుకున్నా... అనుకున్నవన్నీ కుదరలేదు. లీగ్ కప్‌లో ఫైనల్‌కైనా చేరాం. అయితే చాంపియన్స్ లీగ్‌లో నిరాశపరిచాం. కానీ జట్టుగా కొన్ని మంచి ఫలితాలు లభించాయనే సంతోషంగా ఉంది. మీ ఫుట్‌బాల్ కెరీర్లో మంచి రోజని చెప్పుకోవాలంటే... ఏదని చెబుతారు? బెల్జియం గోల్ కీపర్‌గా నా కెరీర్లో తీపి గుర్తులెన్నో ఉన్నాయి. కానీ లివర్పూల్లాంటి జట్టుతో ఒప్పంద పత్రాలపై సంతకం చేసిన రోజు ఎంతో ప్రత్యేకమైంది. దాన్నెపుడూ మరచిపోలేను. ఈ సీజన్లో మీ జట్టు తరఫున ఉత్తమ క్రీడాకారుడు ఎవరు? ప్రత్యేకంగా ఒకరు అని చెప్పలేం. జట్టులో అందరూ బాగానే ఆడుతున్నారు. అయితే నా అభిప్రాయం ప్రకారం ఫిలిఫ్ కుటినో అందరిలో ముందుంటాడు. -
ప్రపంచ కప్ వెనుక ఎవరున్నారో తెలుసా?
న్యూఢిల్లీ: హాకీ జూనియర్ ప్రపంచకప్ విజేతగా భారత్ నిలవడం వెనుక ఓ వ్యక్తి అమోఘ కృషి, పట్టుదల ఉన్నాయనే మీకు తెలుసా? గతంలో తాను ఎంచుకున్న క్రీడలో విఫలమైన ఆ క్రీడాకారుడి బోధనలే భారత్‌కు హాకీ జూనియర్ అండర్-21 ప్రపంచ కప్‌ను అందించాయంటే ఎంతమంది నమ్మగలరు? కానీ, ఇది నమ్మి తీరాల్సిందే. భారత్ హాకీ జూనియర్ టీంకు శిక్షకుడిగా పనిచేసిన హరేంద్ర సింగ్ ఒక హాకీ ప్లేయర్. జాతీయ టీంకు ఎంపిక చేయకుండా పక్కకు పడేసిన ఓ క్రీడాకారుడు. ఆ సమయంలో తాను ఎంత కుమిలిపోయి ఉన్నాడనే విషయం తాజాగా అతడి మాటలే చెబుతున్నాయి. సాధారణంగా జట్టు విజయం సాధించిన వెంటనే క్రీడాకారులును ప్రశ్నించిన మీడియా అనంతరం కోచ్ హరేంద్ర సింగ్‌ను ప్రశ్నించింది. ఆ సమయంలో అతడి కళ్లు చెమ్మగిల్లాయి. అంతే కాదు అతడి చెంపల మీదుగా ఆ కన్నీళ్లు దారగా కారాయి. ఈ విజయం వెనుక మీరే ఉండటం ఒక క్రీడాకారుడిగా, కోచ్‌గా ఎలా భావిస్తున్నారని ప్రశ్నించగా. తన గత స్మృతులు చెప్పారు. తాను ఒక క్రీడాకారుడినని, కసిగా ఆడేవాడినని, ఒకప్పుడు జాతీయ టీంకు ఎంపికచేయకుండా పక్కకు పెట్టారని అన్నారు. అప్పుడే తనకు తాను బోధించుకున్నానని, అత్యుత్తమ క్రీడాకారులను తయారు చేయగలనన్న ఆత్మ విశ్వాసంతో 1998లో కోచ్‌గా కెరీర్ ప్రారంభించానని చెప్పాడు. ‘ఆరోజే నేను నా అంతరాత్మకు చెప్పుకున్నాను. నేను ఒలింపియన్‌ను కాకపోవచ్చు.. కానీ నేను ఒలింపియన్లను, ప్రపంచ చాంపియన్లను తయారు చేయగలనని.. దేశాన్ని గర్వంగా తలెత్తుకునేలా చేయగలనని. ఈ రోజు భారత త్రివర్ణ పతాకం ప్రపంచ కప్పు విజయంతో మరింత ఎత్తులో రెపరెపలాడుతోంది. ఈ క్షణం కోసం నేను ఎదురుచూశాను. ప్రపంచ కప్ భారత్ ఎలాగైనా తన శిక్షణతో గెలవాలని 22 ఏళ్ల జీవితాన్ని శిక్షణకే కేటాయించాను. అది నేడు ఆవిష్కృతమైంది’ అని ఆయన చెప్పారు. బెల్జియంపై 2-1తేడాతో భారత్ జూనియర్ హాకీ టీం విజయం సాధించిన విషయం తెలిసిందే. దాదాపు 15 ఏళ్ల నిరీక్షణకు ఈ విజయంతో తెరపడింది. వీరేంద్ర సెహ్వాగ్ అభినందనలు హాకీ జూనియర్ ప్రపంచ కప్ సాధించిన యువ క్రీడాకారులకు ప్రముఖ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అభినందనలు తెలియజేశారు. వారు దేశం గర్వించేలా చేశారని, ఇది నిజంగా చాలా గొప్ప విజయం అని అభివర్ణిస్తూ ఆయన ట్వీట్ చేశారు. ‘ఎంజాయ్ ది బెల్జియం చాకోలెట్ బాయ్స్’ అంటూ ఆయన ట్వీట్లో పేర్కొన్నారు. -
భారత్ మీసం మెలేసింది
హాకీ జూనియర్ ప్రపంచకప్ విజేత టీమిండియా ఫైనల్లో బెల్జియంపై 2–1తో విజయం టోర్నీని అజేయంగా ముగించిన యువ జట్టు టైటిల్‌తో 15 ఏళ్ల నిరీక్షణకు తెర సొంతగడ్డపై భారత యువ ఆటగాళ్లు అద్భుతం చేశారు. ఆద్యంతం దూకుడుగా ఆడిన ఈ రైజింగ్ స్టార్స్ అ‘ద్వితీయం’ నమోదు చేశారు. రెండోసారి జూనియర్ ప్రపంచకప్ టైటిల్‌ను సాధించారు. జాతీయ క్రీడకు మళ్లీ జీవం పోశారు. 15 ఏళ్ల నిరీక్షణకు తెరదించడంతోపాటు భారత హాకీ భవిష్యత్‌కు భరోసా ఇచ్చారు. ఈ టోర్నీలో భారత్ ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలిచి అజేయంగా నిలవడం విశేషం. లక్నో: స్వర్ణం తప్ప మరో పతకం గురించి ఆలోచనే లేదని భారత యువ హాకీ ఆటగాళ్లు నిరూపించారు. స్వదేశంలో జరిగిన హాకీ జూనియర్ అండర్–21 ప్రపంచకప్ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. ఇక్కడి మేజర్ ధ్యాన్‌చంద్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్ 2–1 గోల్స్ తేడాతో బెల్జియం జట్టుపై గెలిచింది. భారత్ తరఫున గుర్జంత్ సింగ్ (8వ ని.లో), సిమ్రన్‌జీత్ సింగ్ (22వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... బెల్జియం జట్టుకు ఫాబ్రిస్ (70వ ని.లో) ఆఖరి సెకన్లలో ఏకైక గోల్‌ను అందించాడు. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో జర్మనీ 3–0తో ఆస్ట్రేలియాపై నెగ్గింది. 37 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ మెగా ఈవెంట్లో భారత జట్టు రెండోసారి టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకుంది. భారత్ చివరిసారి, ఏకైకసారి 2001లో జూనియర్ ప్రపంచకప్‌ను సాధించింది. ఆ తర్వాత ఈ టోర్నీలో ఒక్కసారి కూడా క్వార్టర్ ఫైనల్ దశను దాటలేకపోయింది. అయితే ఈసారి మాత్రం సొంతగడ్డపై యువ ఆటగాళ్లు చెలరేగిపోయారు. తమ ఆటతీరుతో, దూకుడుతత్వంతో ఒక్కో అడ్డంకిని అధిగమించి అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. ఫైనల్ చేరే క్రమంలో రెండు జట్లు అజేయంగా నిలువడంతో అంతిమ సమరం హోరాహోరీగా సాగుతుందని భావించారు. క్వార్టర్ ఫైనల్లో, సెమీఫైనల్లో ‘షూటౌట్’లో నెగ్గిన బెల్జియం జట్టుకు ఈసారి అలాంటి అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో భారత్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. మంచి సమన్వయంతో ముందుకు దూసుకెళుతూ అవకాశం దొరికినప్పుడల్లా బెల్జియం గోల్‌పోస్ట్‌పై దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో వరుసగా రెండు పెనాల్టీ కార్నర్లు సంపాదించారు. అయితే ఒత్తిడిలో వాటిని వృథా చేసుకున్నా... వెంటనే తేరుకొని ఎనిమిదో నిమిషంలో బోణీ చేసింది. ఎడమవైపు నుంచి ‘డి’ సర్కిల్‌లోకి వచ్చిన గుర్జంత్ క్లిష్టమైన కోణం నుంచి రివర్స్ ఫ్లిక్ షాట్‌తో బెల్జియం గోల్కీపర్ను బోల్తా కొట్టించి భారత్‌కు తొలి గోల్‌ను అందించాడు. ఖాతా తెరిచిన ఉత్సాహంలో భారత ఆటగాళ్లు మరింత దూకుడుగా ఆడారు. ఫలితంగా తొలిసారి ఫైనల్‌కు చేరిన బెల్జియం ప్రత్యర్థి దాడులను నిలువరించడానికే ప్రాధాన్యత ఇచ్చింది. 22వ నిమిషంలో సిమ్రన్‌జీత్ సింగ్ గోల్‌తో భారత్ 2–0తో ముందంజ వేసింది. తొలి అర్ధభాగాన్ని భారత్ ఇదే స్కోరుతో ముగించింది. రెండో అర్ధభాగంలో బెల్జియం తమ దాడుల్లో పదును పెంచినా భారత రక్షణపంక్తి అప్రమత్తత కారణంగా వారికి నిరాశే మిగిలింది. 2–0తో ఆధిక్యంలో ఉన్నప్పటికీ... సెమీస్‌లో ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ జర్మనీని ఓడించిన బెల్జియంను చివరి నిమిషం వరకు భారత్ ఏమాత్రం తేలిగ్గా తీసుకోలేదు. చివరి సెకన్లలో పెనాల్టీ కార్నర్ సంపాదించిన బెల్జియం దానిని గోల్‌గా మలిచినా అప్పటికే ఆలస్యమైపోయింది. తాజా విజయంతో జర్మనీ తర్వాత ఈ టైటిల్‌ను రెండుసార్లు గెలిచిన రెండో జట్టుగా భారత్ గుర్తింపు పొందింది. -
హాకీ వరల్డ్ కప్ భారత్ కైవసం
-
జూనియర్ ప్రపంచకప్ హాకీ విజేత భారత్
-
జూనియర్ ప్రపంచకప్ హాకీ విజేత భారత్
లక్నో: జూనియర్ ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్లో భారత ఆటగాళ్లు మరోసారి చరిత్ర సృష్టించారు. 15 ఏళ్ల క్రితం చివరిసారి జూనియర్ వరల్డ్ కప్ హాకీ టైటిల్‌ను సాధించిన భారత్.. నేటితో ఆ కరువును తీర్చుకుంది. ఇక్కడి మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ప్రత్యర్థి బెల్జియంపై 2-1 గోల్స్ తేడాతో భారత్ విజయం సాధించింది. తమపై పెట్టుకున్న నమ్మకాన్ని హర్జిత్ సింగ్ అండ్ గ్యాంగ్ నిలబెట్టుకుంది. ఈ టోర్నీలో ఇరు జట్లు ఓటమి అనేది లేకుండా ఫైనల్ పోరుకు అర్హత సాధించినా.. చివరి మెట్టుపై బెల్జియంను భారత్ బోల్తా కొట్టించింది. ఆది నుంచి భారత కుర్రాళ్లదే హవా! ఆట మొదలైన 8వ నిమిషంలో గుర్జంత్ సింగ్ బెల్జియం గోల్ కీపర్ ను బోల్తా కొట్టిస్తూ భారత్ కు 1-0 ఆధిక్యం అందించాడు. ఆ మరుసటి నిమిషంలో నీలకంఠశర్మ గోల్ పోస్ట్ కు బంతిని కొట్టగా తృటిలో గోల్ చేజారింది. 22వ నిమిషంలో సిమ్రన్ జీత్ సింగ్, నీలకంఠ సమిష్టిగా గోల్ చేసి ఆధిక్యాన్ని రెట్టింపు చేశారు. ఆటముగిసే సరికి బెల్జియం కేవలం ఒక్క గోల్ చేయడంతో 2-1తో భారత్ రెండో పర్యాయం జూనియర్ హాకీ ప్రపంచ కప్ ను ముద్దాడింది. తద్వారా జర్మనీ తర్వాత రెండుసార్లు ఈ ప్రపంచ కప్ నెగ్గిన జట్టుగా భారత్ ఘనత వహించింది. -
భారత్ అదరహో...
►15 ఏళ్ల తర్వాత ఫైనల్‌కు అర్హత ►సెమీస్‌లో షూటౌట్లో ఆస్ట్రేలియాపై గెలుపు ►రేపు బెల్జియంతో టైటిల్ పోరు ►జూనియర్ ప్రపంచకప్ హాకీ సొంతగడ్డపై మూడేళ్ల క్రితం ఎదురైన నిరాశను మరిపించేలా భారత హాకీ యువ ఆటగాళ్లు మెరిశారు. జూనియర్ ప్రపంచకప్‌లో అంతిమ సమరానికి అర్హత సాధించారు. ప్రపంచ మాజీ చాంపియన్ ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో షూటౌట్లో విజయం సాధించి ఈ మెగా ఈవెంట్లో 15 ఏళ్ల తర్వాత టైటిల్ పోరుకు చేరుకున్నారు. బెల్జియంతో ఆదివారం జరిగే ఫైనల్లోనూ గెలిచి 15 ఏళ్ల ప్రపంచకప్ టైటిల్ నిరీక్షణకు తెరదించాలనే పట్టుదలతో ఉన్నారు. లక్నో: జాతీయ క్రీడ మళ్లీ జిగేల్మంది. సొంతగడ్డపై భారత యువ ఆటగాళ్లు సత్తా చాటారు. జూనియర్ ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్లో టైటిల్‌కు మరో విజయం దూరంలో నిలిచారు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో భారత్ ‘షూటౌట్’లో 4–2తో మాజీ చాంపియన్ ఆస్ట్రేలియాను బోల్తా కొట్టించారు. ఆదివారం జరిగే ఫైనల్లో బెల్జియంతో భారత్ తలపడుతుంది. అంతకుముందు తొలి సెమీఫైనల్లో బెల్జియం ‘షూటౌట్’లో 4–3తో డిఫెండింగ్ చాంపియన్ జర్మనీపై సంచలన విజయం సాధించింది. భారత్ చివరిసారి 2001లో టైటిల్‌ను సాధించింది. 2013లో స్వదేశంలోనే జరిగిన ప్రపంచకప్‌లో భారత్ క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగింది. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో నిర్ణీత సమయం వరకు రెండు జట్లు 2–2తో సమంగా నిలిచాయి. దాంతో ఫలితం తేలడానికి షూటౌట్‌ను నిర్వహించారు. షూటౌట్లో గోల్‌కీపర్ వికాస్ దహియా ఆస్ట్రేలియా ఆటగాళ్ల రెండు షాట్స్‌ను నిలువరించి భారత విజయాన్ని ఖాయం చేశాడు. భారత్ తరఫున హర్జీత్ సింగ్, హర్మన్‌ప్రీత్ సింగ్, సుమీత్, మన్‌ప్రీత్ జూనియర్ సఫలమయ్యారు. ఆస్ట్రేలియా తరఫున బ్లేక్ గోవర్స్, జాక్ వెల్చ్ గోల్స్ చేయగా... మాథ్యూ బర్డ్, షార్ప్ లాచ్లన్ కొట్టిన షాట్లను భారత గోల్‌కీపర్ వికాస్ దహియా అడ్డుకున్నాడు. ఫలితం తేలిపోవడంతో భారత్ ఐదో షాట్‌ను తీసుకోలేదు. రెగ్యులర్ సమయంలో ఆట 14వ నిమిషంలో టామ్ క్రెయిగ్ గోల్‌తో ఆసీస్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత 42వ నిమిషంలో గుర్జంత్ సింగ్ గోల్‌తో భారత్ స్కోరును సమం చేసింది. 48వ నిమిషంలో మన్దీప్ సింగ్ గోల్‌తో భారత్ 2–1తో ఆధిక్యాన్ని సంపాదించింది. అయితే 57వ నిమిషంలో షార్ప్ లాచ్లన్ గోల్‌తో ఆసీస్ స్కోరును 2–2తో సమం చేసింది. అనంతరం తర్వాత 13 నిమిషాల్లో రెండు జట్లు మరో గోల్ చేయడానికి తీవ్రంగా కృషి చేసినా ఫలితం లేకపోయింది. -
భారత జూనియర్ జట్టు ఓటమి
వాలన్సియా: నాలుగు దేశాల ఇన్విటేషన్ హాకీ టోర్నమెంట్లో భారత జూనియర్ జట్టు 2-4తో బెల్జియం చేతిలో ఓడిపోరుుంది. బెల్జియం తరఫున వెగ్నెజ్, బోక్రిక్, కినా, స్టోక్బ్రోక్స్ గోల్స్ సాధించగా... భారత్ తరఫున మర్మన్ప్రీత్ సింగ్, అజయ్ యాదవ్ గోల్స్ చేశారు. టోర్నీ తొలి మ్యాచ్‌లో భారత్ 3-1తో జర్మనీపై గెలిచింది. తర్వాతి మ్యాచ్‌లో భారత్ జట్టు స్పెరుున్‌తో ఆడుతుంది. -
శ్రీసిటీలో వెర్మీరియన్ యూనిట్ ప్రారంభం
శ్రీసిటీ(సత్యవేడు): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీసిటీలో శుక్రవారం బెల్జియం దేశానికి చెందిన వెర్మీరియన్ ఇండియా యూనిట్‌ను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రారంభించారు. ఆస్పత్రి పరికరాల తయారీలో పేరుగాంచిన వెర్మీరియన్ గ్రూప్ భారతదేశంలో మొట్టమొదట ఉత్పాదక కేంద్రాన్ని శ్రీసిటీలో ప్రారంభించింది. కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ఈ కంపెనీ ఉత్పత్తుల్లో ప్రధానమైనవి వీల్‌చైర్లని, ఆస్పత్రులు, వికలాంగులు మాత్రమే కాకుండా వయస్సు మీరిన వారికి కూడా ఇవి ఉపయోగపడతాయని చెప్పారు. వెర్మీరియన్ గ్రూప్ సీఈవో పాట్రిక్ వెర్మీరియన్ మాట్లాడుతూ రూ. 40వేల కోట్ల పెట్టుబడితో ఈ యూనిట్ ఏర్పాటు చే శామని, ప్రపంచంలో ఇది నాలుగో ఉత్పత్తి కేంద్రమని తెలిపారు. ఇండియా తమకు చాలా ముఖ్యమైన వ్యాపార కేంద్రమని, ఇక్కడ తక్కువ ధరలకు ఉత్పత్తులు అందిస్తామని చెప్పారు. శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ ఈ కంపెనీ ఏర్పాటుతో తక్కువ ధరతో నాణ్యమైన ఉత్పత్తులు లభిస్తాయని విశ్వసిస్తున్నానని చెప్పారు. -
పాలకూర తింటే క్రీడల్లో రాణించొచ్చు!
లండన్: మీ పిల్లల్ని మంచి క్రీడాకారులుగా తయారు చేయాలనుకుంటున్నారా? బరిలోకి దిగితే దుమ్మురేపాలని కోరుకుంటున్నారా? అయితే ఇప్పటి నుంచే పాలకూరను ఎక్కువగా తినిపించడం అలవాటు చేయండి. ఎందుకంటే ఆటలాడినప్పుడు శరీరంలో ఆక్సిజన్ శాతం తగ్గి.. అలసిపోతారు. అయితే పాలకూర ఎక్కువగా తినేవారు ఆక్సిజన్ తక్కువగా ఉన్న సమయంలో కూడా అద్భుతమైన ప్రదర్శనను కనబరుస్తారట. ఇందుకు కారణం పాలకూరలో అధిక మోతాదులో ఉండే నైట్రేటే కారణమంటున్నారు బెల్జియంలోని లీవెన్ యూనివర్సిటీ పరిశోధకులు. ఇందుకోసం 27 మంది క్రీడాకారులపై వారం రోజులపాటు శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. కూర్చున్నప్పుడు, సైక్లింగ్ వంటి వ్యాయామాలు చేసేటప్పుడు నైట్రేట్ పనితీరును పరిశీలించారు. వారిలో నైట్రేట్ తీసుకున్నవారి కండరాల్లో అద్భుతమైన పటుత్వం వచ్చినట్లు గుర్తించారు. సహజ పద్ధతుల్లో నైట్రేట్ శరీరానికి అందించడానికి అత్యుత్తమ మార్గం పాలకూర తినిపించడమేనని యూనివర్సిటీ ప్రొఫెసర్ పీటర్ హెస్పెల్ తెలిపారు. ముఖ్యంగా క్రీడాకారుల విషయంలో ఈ పద్ధతి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. -
తొలిసారిగా ఓ మైనర్‌కు కారుణ్యమరణం!
బ్రస్సెల్స్: ఎప్పటికీ నయం కాని రోగాల బారిన పడినవారు ప్రభుత్వ అనుమతితో కారుణ్యమరణం(యుథనేషియా) పొందుతారు. చాలా దేశాల్లో అమల్లో ఉన్న ఈ విధానంలో కేవలం పెద్దవారికి మాత్రమే ప్రభుత్వాలు కారుణ్యమరణానికి అనుమతిస్తున్నాయి. అయితే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఓ మైనర్‌కు కారుణ్యమరణానికి అవకాశం కల్పించింది బెల్జియం. మైనర్‌కు సంబంధించిన వివరాలు వెల్లడించనప్పటికీ.. ప్రత్యేకమైన కేసుగా పరిగణించి ఓ మైనర్‌కు కారుణ్య మరణం ప్రసాదించినట్లు ఫెడరల్ యుథనేషియా అధికారి ఒకరు వెల్లడించారు. బెల్జియంలో కారుణ్యమరణానికి సంబంధించిన చట్టాన్ని 2014లో మార్చారు. దీని ప్రకారం వయసుతో సంబంధం లేకుండా ఎవరినైనా కారుణ్యమరణానికి అనుమతించొచ్చు. ఈ చట్టం ప్రకారం మైనర్‌కు కారుణ్యమరణానికి అనుమతి ఇవ్వడం ఇదే తొలిసారి. నెదర్లండ్స్లో సైతం మైనర్లకు కారుణ్యమరణానికి అనుమతి ఉన్నప్పటికీ.. 12 సంవత్సరాలు పైబడినవారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. కాగా.. మొదటిసారిగా బెల్జియం ఓ మైనర్‌కు కారుణ్యమరణానికి అనుమతించిన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా దీనిపై తీవ్ర చర్చ జరుగుతోంది. అసలు ప్రత్యేకమైన కేసుగా భావించడంలో పరిగణలోకి తీసుకునే అంశాలేమిటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. -
ఒలింపిక్స్ హాకీలో కొత్త చరిత్ర!
రియో డీ జనీరో: రియో ఒలింపిక్స్‌లో అర్జెంటీనా పురుషుల హాకీ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్ పురుషుల హాకీలో తొలి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుని కొత్త అధ్యాయాన్ని లిఖించింది. గురువారం జరిగిన తుదిపోరులో అర్జెంటీనా 4-2 తేడాతో బెల్జియంను ఓడించి పసిడిని సొంతం చేసుకుంది. ఇరు జట్ల మధ్య హోరాహోరీగా జరిగిన పోరులో అర్జెంటీనా అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించి జయకేతనం ఎగురవేసింది. ఆట తొలి అర్ధభాగంలో భాగంగా 10వ నిమిషంలో గోల్ సాధించిన అర్జెంటీనా.. ఆ తరువాత మరింత దూకుడగా ఆడి విజయాన్ని సాధించింది. దీంతో ఒలింపిక్స్ పురుషుల హాకీలో తొలి పతకాన్ని సాధించడమే కాకుండా, స్వర్ణాన్ని కూడా చేజిక్కించుకోవడం విశేషం. అయితే రజత పతకానికే పరిమితమైన బెల్జియం కూడా ఒలింపిక్స్ లో కొత్త చరిత్రను సృష్టించింది. ఒలింపిక్స్ హాకీలో బెల్జియంకు ఇదే అత్యుత్తమ పతకం. 1920లో కాంస్యాన్ని సాధించిన బెల్జియం.. ఆపై పతకాల వేటలో మాత్రం విఫలమైంది. తాజా రజతంతో 96 సంవత్సరాల ఒలింపిక్స్ హాకీలో పతకాల నిరీక్షణకు బెల్జియం తెరదించింది. -
భారత హాకీ జట్టు ఆశలు ఆవిరి
క్వార్టర్ ఫైనల్లో బెల్జియం చేతిలో ఓటమి రియో డి జనీరో: రక్షణ శ్రేణిలో లోపాలు... ఫార్వర్డ్ శ్రేణిలో దూకుడు లోపించడంతో... రియో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు పోరాటం ముగిసింది. ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో టీమిండియా 1-3 గోల్స్ తేడాతో బెల్జియం చేతిలో ఓడిపోయింది. బెల్జియం 96 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఒలింపిక్స్ హాకీలో సెమీఫైనల్‌కు చేరుకుంది. ఆట 15వ నిమిషంలో ఆకాశ్‌దీప్ సింగ్ చేసిన గోల్‌తో భారత్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో క్వార్టర్ ముగిసేవరకు భారత్ ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంది. అయితే మూడో క్వార్టర్లో బెల్జియం ఆటగాళ్లు దూకుడు పెంచారు. వరుస దాడులతో భారత్‌పై ఒత్తిడి పెంచారు. 34వ, 45వ నిమిషాల్లో సెబాస్టియన్ డాకీర్ రెండు గోల్స్ చేయడంతో బెల్జియం 2-1తో ఆధిక్యాన్ని సంపాదించింది. 50వ నిమిషంలో టామ్ బూన్ గోల్‌తో బెల్జియం 3-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. -
సిద్ధరామయ్యకు పుత్రశోకం
అనారోగ్యంతో బెల్జియంలో మృతిచెందిన రాకేశ్ సాక్షి, బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పెద్ద కుమారుడు రాకేశ్(39) శనివారం బెల్జియంలో అనారోగ్యంతో కన్నుమూశారు. రాకేశ్‌కు భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొం తకాలంగా క్లోమ సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయన గత వారం యూరప్ పర్యటనకు వెళ్లారు. ఆరోగ్యపరిస్థితి విషమించడంతో స్నేహితులు బ్రస్సెల్స్‌లోని ఆంట్వెర్ప్ వర్సిటీ ఆసుపత్రిలో చేర్పించారు. విషయం తెలిసి వెంటనే సీఎం సిద్ధరామయ్య, ఆయన భార్య, రెండో కొడుకు యతీంద్ర బెల్జియం వెళ్లారు. క్లోమవ్యాధితో అవయవాలు దెబ్బతిని రాకేశ్ మరణించారని వైద్యులు ప్రకటించారు. భౌతికకాయాన్ని ఆదివారం ప్రత్యేక విమానంలో బెంగళూరుకు తీసుకురానున్నారు. అంత్యక్రియలు సోమవారం జరగనున్నాయి. ప్రధాని మోదీ, సోనియా సంతాపం..: రాకేశ్ మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం తెలియజేశారు. సిద్ధరామయ్య కొడుకు మరణించడంతో తీవ్ర మనో వేదనకు గురయ్యానని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పేర్కొన్నారు. రాకేశ్ మృతిపై బీజేపీ కర్ణాటక శాఖ అధ్యక్షుడు యడ్యూరప్పతో పాటు పలువురు నాయకులు సంతాపాన్ని తెలియజేశారు. ఈ నెల 13న రాకేష్ జన్మదినోత్సవాన్ని అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఇంతలోనే ఆయన మృతిచెందడం అభిమానుల్లో విషాదం నింపింది. -
సీఎం కుమారుడికి అస్వస్థత
బెంగళూరు: బెల్జియం పర్యటనలో ఉన్న సీఎం సిద్ధరామయ్య కుమారుడు రాకేష్ సిద్ధరామయ్య తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. రాకేష్ సిద్ధరామయ్య ప్యాంక్రియాసిస్‌కు సంబంధించిన వ్యాధితో ఇబ్బంది పడుతున్నట్లు తెలుసుకున్న సీఎం సిద్ధరామయ్య.. విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌తో మాట్లాడారు. బెల్జియంలో ఉన్న తన కుమారుడికి ఉత్తమవైద్య సేవలు అందించే దిశగా చర్యలు తీసుకోవాలని, ఇందుకు సంబంధించి బెల్జియంలోని భారత రాయబార కార్యాలయ ఉద్యోగులను ఆదేశించాలని కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌ను కోరారు. తక్షణమే స్పందిన సుష్మాస్వరాజ్ బెల్జియంలోని భారత రాయబార కార్యాలయ ఉద్యోగులతో మాట్లాడి రాకేష్ సిద్ధరామయ్య ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసినట్లు సమాచారం. కాగా, రాకేష్ సిద్ధరామయ్య అస్వస్థత విషయం తెలుసుకున్న సీఎం తక్షణం తమ ఫ్యామిలీ డాక్టర్స్ ఇద్దరిని బెల్జియం పంపినట్లు తెలుస్తోంది. సీఎం సిద్దరామయ్య సైతం గురువారం తెల్లవారుజామున 4.30గంటలకు బెల్జియం బయల్దేరి వెళ్లారు. అంతకు ముందు ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం రాకేష్ ఆరోగ్యం బాగుందన్నారు. అతడు కోలుకుంటున్నాడని, చికిత్సకు స్పందిస్తున్నట్లు చెప్పారు. కాగా రాకేష్ తన స్నేహితులతో కలిసి విహారయాత్రకు బెల్జియం వెళ్లారు. -
వేల్స్ కొత్త చరిత్ర
లిల్లీ: యూరో కప్ ఫుట్ బాల్ టోర్నమెంట్ లో సంచలనం నమోదైంది. శుక్రవారం రాత్రి జరిగిన క్వార్టర్ ఫైనల్లో రెండో ర్యాంకర్ బెల్జియం ఇంటిముఖం పట్టింది. అమీతుమీ తేల్చుకోవాల్సిన పోరులో పసికూన వేల్స్ 3-1 తేడాతో బెల్జియంను బోల్తా కొట్టించి సెమీస్ కు చేరింది. తద్వారా ఓ ప్రధాన టోర్నీలో తొలిసారి సెమీస్ కు చేరి కొత్త చరిత్ర సృష్టించింది. ఆట 13వ నిమిషంలో బెల్జియంకు రాద్జా తొలి గోల్ ను అందించి జట్టును ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు.ఈడెన్ హజార్డ్ నుంచి పాస్ ను అందుకున్న రాద్జా గోల్ గా మలచాడు. కాగా, ఆట 30వ నిమిషంలో వేల్స్ ఆటగాడు ఆష్లే విలియమ్స్ హెడర్ ద్వారా గోల్ సాధించి స్కోరును సమం చేశాడు.ఇక ఆ తర్వాత రెచ్చిపోయిన వేల్స్..పటిష్టమైన బెల్జియం ఎటాక్ ను నిలువరించడమే కాకుండా, మరో రెండు గోల్స్ నమోదు చేసి అద్భుతమైన విక్టరీ సాధించింది. ఆట 55వ నిమిషంలో హాల్ రాబ్సన్ కాను, 85వ నిమిషంలో శ్యామ్ వేక్స్ తలో గోల్ చేయడంతో వేల్స్ ఘనమైన విజయం సాధించింది. ఇదిలా ఉండగా, 1958 ప్రపంచకప్ తర్వాత ఓ మేజర్ టోర్నీలో వేల్స్ బరిలోకి దిగడం కూడా ఇదే తొలిసారి. -
కొత్త చరిత్ర దిశగా...
* నేడు బెల్జియంతో వేల్స్ క్వార్టర్స్ పోరు * బేల్పైనే అందరి దృష్టి * యూరో కప్ లిల్లీ: ఒకరిదేమో అరంగేట్రం స్థాయి... మరొకరిదేమో ‘ఫిఫా’ ర్యాంకింగ్‌లో రెండో స్థానం. కొత్త చరిత్ర కోసం ఒకరు... పాత చరిత్రను తిరగరాయడానికి మరొకరు. ఈ నేపథ్యంలో యూరోపియన్ చాంపియన్‌షిప్‌లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. నేడు (శుక్రవారం) జరగనున్న క్వార్టర్స్ పోరులో కొత్త కూన వేల్స్‌తో.... రెండో ర్యాంకర్ బెల్జియం అమీతుమీకి సిద్ధమైంది. అర్హత పోటీల్లో అద్భుతమైన ఆటతీరుతో తొలిసారి యూరోకప్‌కు అర్హత సాధించిన వేల్స్... లీగ్, ప్రిక్వార్టర్స్‌లోనూ అంచనాలకు మించి రాణించింది. నార్తర్న్ ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో ఆఖరి నిమిషాల్లో ఒత్తిడిని జయించి గెలవడం జట్టులో ఆత్మవిశ్వాసాన్ని ఆమాంతం పెంచింది. దీంతో క్వార్టర్స్‌లోనూ అదే స్థాయిలో ఆడాలని పట్టుదలగా ఉంది. అలాగే 1958 ప్రపంచకప్ తర్వాత ఓ మేజర్ టోర్నీలో వేల్స్ బరిలోకి దిగడం ఇదే మొదటిసారి కావడంతో గెలుపుతో కొత్త చరిత్ర సృష్టించాలని భావిస్తోంది. దీనికోసం ఏడాది కిందట క్వాలిఫయింగ్ టోర్నీలో బెల్జియంపైనే ఏకైక గోల్ సాధించిన ఫ్రికిక్ నిపుణుడు గ్యారెత్ బేల్పైనే జట్టు మరోసారి భారీ ఆశలు పెట్టుకుంది. అయితే బెల్జియం దాడులను నిలువరించాలంటే వేల్స్ రక్షణశ్రేణితో పాటు గోల్ కీపర్ హెన్నెసే శక్తికి మించి రాణించాలి. మరోవైపు స్టార్ ఆటగాళ్లతో కూడిన బెల్జియం ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. లీగ్ దశలో రెండు మ్యాచ్‌లే గెలిచినా.. ప్రిక్వార్టర్స్‌లో హంగేరిపై నాలుగు గోల్స్‌తో తమ సత్తా ఏంటో చూపెట్టింది. వ్యూహాలను రచించడం, అమలు చేయడంలో కోచ్ విల్మోట్స్ దిట్ట. యూరోలో 1980లో రన్నరప్‌గా నిలిచిన బెల్జియం ఆ తర్వాత పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ ఈ లీగ్ తొలి మ్యాచ్‌లోనే ఇటలీలాంటి మేటి జట్టుపై గెలవడంతో ఇప్పుడు టైటిల్‌పై ఆశలు పెట్టుకుంది. వేల్స్‌తో పోలిస్తే అన్ని రంగాల్లో మెరుగ్గా ఉన్న బెల్జియంకు స్టార్ స్ట్రయికర్ ఈడెన్ హజార్డ్ కొండంత అండ. చివరి నిమిషాల్లో తన స్ట్రయికింగ్‌తో మ్యాచ్ ఫలితాలను తారుమారు చేయడం ఇతని ప్రత్యేకత. టోబీ, విర్మాలెన్, లుకాక్, మునేర్లూ రాణిస్తే వేల్స్‌కు కష్టాలు తప్పవు. -
ఇటలీకి ఐర్లాండ్ షాక్
► ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశం ► ఇటలీ, బెల్జియం కూడా ముందుకు యూరో కప్ లిల్లీ (ఫ్రాన్స్): వరుస విజయాలతో ఊపుమీదున్న ఇటలీ జట్టుకు.. యూరోపియన్ చాంపియన్‌షిప్‌లో ఐర్లాండ్ షాకిచ్చింది. మ్యాచ్ ఆసాంతం ఇటలీ దాడులను అడ్డుకోవడమే కాకుండా ఆఖరి నిమిషాల్లో సంచలన గోల్‌తో ప్రత్యర్థిని కంగుతినిపించింది. ఫలితంగా బుధవారం అర్ధరాత్రి జరిగిన గ్రూప్-ఇ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఐర్లాండ్ 1-0తో ఇటలీపై గెలిచి ప్రిక్వార్టర్స్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. ఈ గ్రూప్‌లో చెరో ఆరు పాయింట్లతో ఇటలీ, బెల్జియం కూడా నాకౌట్ దశకు చేరుకున్నాయి. ఐర్లాండ్ తరఫున రాబీ బ్రాడీ (85వ ని.) ఏకైక గోల్ సాధించాడు. బెల్జియం గెలుపు: మరో మ్యాచ్‌లో బెల్జియం 1-0తో స్వీడన్‌పై గెలిచింది. నైనంగోలన్ (84వ ని.) బెల్జియం తరఫున ఏకైక గోల్ చేశాడు. స్వీడన్ స్టార్ స్ట్రయికర్ ఇబ్రమోవిచ్ కెరీర్లో తన చివరి మ్యాచ్ ఆడేశాడు. యూరో తర్వాత కెరీర్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు మంగళవారమే ప్రకటించిన అతను ఈసారి గోల్ చేయలేకపోయాడు. -
బెల్జియం బోల్తా...
* ప్రపంచ రెండో ర్యాంకర్‌పై ఇటలీ సంచలన విజయం * యూరో కప్‌లో శుభారంభం లియాన్ (ఫ్రాన్స్): గత రెండు ప్రపంచకప్‌లలో లీగ్ దశలోనే నిష్ర్కమించి... గత ప్రాభవం కోసం పరితపిస్తున్న ఇటలీ జట్టు యూరో కప్‌లో మాత్రం తొలి మ్యాచ్‌లోనే ఆకట్టుకుంది. ప్రపంచ రెండో ర్యాంకర్ బెల్జియంతో సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన గ్రూప్ ‘ఇ’ లీగ్ మ్యాచ్‌లో ఇటలీ 2-0 గోల్స్ తేడాతో సంచలన విజయం సాధించింది. ఇటలీ తరఫున 32వ నిమిషంలో గియాచెరిని తొలి గోల్ చేయగా... ఇంజ్యురీ టైమ్‌లో (90+3వ నిమిషంలో) గ్రాజియానో పెలె రెండో గోల్‌ను అందించాడు. ప్రస్తుత ఇటలీ జట్టు గతంలో ఎన్నడూలేని విధంగా బలహీనంగా ఉందని, ఆ జట్టు నుంచి యూరోలో అద్భుతాలు ఆశించకూడదని పలువురు విశ్లేషకులు వేసిన అంచనా తొలి మ్యాచ్ ప్రదర్శనతో పటాపంచలైంది. గత మూడు యూరో టోర్నీలకు అర్హత పొందడంలో విఫలమైన బెల్జియం ఈసారి మాత్రం క్వాలిఫయింగ్‌లో గ్రూప్ ‘బి’ టాపర్‌గా నిలిచి ఏడాది క్రితమే బెర్త్‌ను ఖాయం చేసుకుంది. దూకుడైన ఆటతీరుకు పెట్టింది పేరైన బెల్జియం తొలి మ్యాచ్‌లో అందివచ్చిన అవకాశాలను వృథా చేసుకొని మూల్యం చెల్లించుకుంది. ఇటలీ గోల్‌పోస్ట్‌పై ఏకంగా 18 సార్లు దాడులు చేసినప్పటికీ ఫినిషింగ్ లోపం ఆ జట్టును వేధించింది. మరోవైపు ఇటలీ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని బోణీ కొట్టింది. తాజా ఫలితంతో గత 34 ఏళ్లలో బెల్జియంపై అధికారిక మ్యాచ్‌లో ఓటమి ఎరుగని రికార్డును ఇటలీ నిలబెట్టుకుంది. మ్యాచ్‌లో పూర్తి సమన్వయంతో ఆడిన ఇటలీ 32వ నిమిషంలో ఖాతా తెరిచింది. బెల్జియం డిఫెన్స్‌ను బోల్తా కొట్టిస్తూ లియోనార్డో బోనూచి అందించిన పాస్‌ను అందుకున్న గియాచెరిని మిగతా పనిని పూర్తి చేశాడు. ఆ తర్వాత స్కోరును సమం చేసేందుకు బెల్జియం ఆటగాళ్లు తీవ్రంగా ప్రయత్నించారు. 53వ నిమిషంలో లుకాకు ఎడమవైపు నుంచి దూసుకెళ్లి కొట్టిన షాట్ గోల్‌పోస్ట్‌పై నుంచి బయటకు వెళ్లింది. ఆ తర్వాత కూడా బెల్జియం ఆటగాళ్లు దాడులు చేసినా పటిష్టమైన డిఫెన్స్‌తో ఇటలీ వారి అవకాశాలను అడ్డుకుంది. హంగేరి అదుర్స్ నాలుగు దశాబ్దాల తర్వాత యూరో చాంపియన్‌షిప్‌కు అర్హత పొందిన హంగేరి జట్టు అద్భుత విజయంతో బోణీ కొట్టింది. ఆస్ట్రియాతో మంగళవారం జరిగిన గ్రూప్ ‘ఎఫ్’ లీగ్ మ్యాచ్‌లో హంగేరి 2-0 గోల్స్ తేడాతో గెలుపొందింది. హంగేరి తరఫున 62వ నిమిషంలో ఆడమ్ సజాలాయ్, 87వ నిమిషంలో జోల్టాన్ స్టీబెర్ ఒక్కో గోల్ చేశారు. 40 ఏళ్ల హంగేరి గోల్‌కీపర్ గాబోర్ కిరాలీ ఈ మ్యాచ్‌లో పాల్గొని యూరో టోర్నీ చరిత్రలో మ్యాచ్ ఆడిన పెద్ద వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. ‘యూరో’లో నేడు రష్యా X స్లొవేకియా సా.గం. 6.30 నుంచి రుమేనియా X స్విట్జర్లాండ్ రా.గం. 9.30 నుంచి ఫ్రాన్స్ X అల్బేనియా రా.గం. 12.30 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
ఇంతకీ ఎవరు ఆ టోపీవాలా.. ?
బ్రస్సెల్స్: బెల్జియం అధికారులు కంటిపై కునుకు లేకుండా పనిచేస్తున్నారు. బ్రస్సెల్స్ విమానాశ్రయంపై ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఆత్మహుతి దాడి చేసి 32మంది పౌరులను బలి తీసుకున్న తర్వాత దాడికి కారణమైన ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే వాయువేగంతో దర్యాప్తు చేస్తున్న అధికారులు తాజాగా ఓ వీడియో ఫుటేజీని విడుదల చేశారు. అందులో ఓ వ్యక్తి లైట్ వైట్ కలర్ జాకెట్ వేసుకొని గుండ్రటి టోపీ పెట్టుకొని కంగారు పడుతూ వేగంగా కదలడం కనిపించింది. బ్రస్సెల్స్‌లో ఎన్ని సీసీటీవీ కెమెరాలు ఉన్నాయో అన్నింటిలో అతడి కదలిక రికార్డయింది. ప్రస్తుతం దాడికి పాల్పడిన ముగ్గురిలో ఇద్దరు ఎయిర్ పోర్ట్ లోనే తమను తాము పేల్చుకోగా మిగిలి ఉన్న ఆ మూడో అనుమానిత ఉగ్రవాది ఇతడే అయ్యుంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మార్చి 22న ఉదయం 7.58గంటలకు ఎయిర్ పోర్ట్‌లో బాంబు పేలుళ్లు సంభవించాయి. ఆ వెంటనే ఈ వ్యక్తి అక్కడి నుంచి పారిపోవడం ప్రారంభించినట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా తెలుస్తోంది. ఎంతో సునాయాసంగా అతడు మొత్తం నగరాన్ని కాలినడకనే దాదాపు రెండు గంటలపాటు నడిచి తప్పించుకున్నాడు. అతడు వెళ్లిన విధానం చూస్తుంటే ముందుగానే ఆ మార్గంపై కసరత్తు చేసుకున్నట్లు కూడా అర్ధమవుతోంది. సరిగ్గా 9.50 గంటల ప్రాంతంలో అతడికి సీసీటీవీ కెమెరాకు సంబంధాలు తెగిపోయాయి. ఒకానొక చోట ఇదే వ్యక్తి తన జాకెట్ విప్పేసి కనిపించాడు. మరో సీసీటీవీలో చేతిలో ఫోన్‌తో ప్రత్యక్షమయ్యాడు. ఈ వీడియో విడుదల సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ తాము విడుదల చేసిన వీడియోలో ఉన్న వ్యక్తిని ఎవరైనా వీడియో తీసినా లేదా ఫొటో తీసిన తమకు ఇచ్చి సహకరించాలని అన్నారు. -
'ఓడిపోలేదు.. గుణపాఠం నేర్చుకుంటాం'
బ్రస్సెల్స్: ఉగ్రవాదుల దాడిని ముందుగానే పసిగట్టి తిప్పిగొట్టడంలో విఫలమయ్యారని వస్తున్న ఆరోపణలను బెల్జియం ప్రధాని చార్లెస్ మైఖెల్ తిప్పికొట్టారు. ఈ దాడి తర్వాత తాము ఏ కోశాన భయపడలేదని, అంతే వేగంగా స్పందించామని అన్నారు. 'ఒక నిజం మాట్లాడే విషయంలో ఎప్పటికీ భయపడవద్దు. మేం ఏది సరిగా చేశాం.. ఏది తప్పుగా చేశాం, ఎక్కడ వైఫల్యం చెందాం అనే అంశాలను తెలుసుకోవాల్సి ఉంది. అవి తెలుసుకుని వాటి ద్వారా భవిష్యత్తు కోసం పాఠాలు నేర్చుకుంటాం. బెల్జియం ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో విఫలమైందని అనే మాటలను అంగీకరించను. ఎందుకంటే వారిపై సమర్థంగా పోరాడిన దేశం మాది. కానీ, ఇప్పుడొక వైఫల్యం కనిపించింది. అది ఎలాంటిదంటే అమెరికా 9/11 దాడుల్లాంటిది, లండన్ గతంలో ఎదుర్కొన్న సమస్య లాంటిది. మేం కూడా ఈ ఘటనతో గుణపాఠం నేర్చుకుంటాం' అని ఆయన చెప్పారు. బ్రస్సెల్స్ ఎయిర్ పోర్ట్ పై ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దాడి చేసి 32మందికి పైగా ప్రాణాలు బలితీసుకున్న విషయం తెలిసిందే. -
బెల్జియం పోలీసుల వేట
బ్రసెల్స్ నిందితుల కోసం విస్తృత గాలింపు ఇద్దరు మంత్రుల రాజీనామా! దాడులపై త్వరలోనే స్పష్టత ఇస్తానన్న ప్రధాని బ్రసెల్స్: బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో వరు స పేలుళ్లకు పాల్పడిన వారి కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఐసిస్ ఉగ్రవాద సంస్థకు చెందిన వారిగా భావిస్తున్న ఇద్దరి కోసం వేటాడుతున్నారు. మెట్రో రైల్వే స్టేషన్లో ఘటనాస్థలంలో ఒకరిని అనుమానాస్పదంగా గుర్తించగా, మరొకరిని అనుమానాస్పద బాంబర్ (నజిమ్ లాచ్రోయి)గా విమానాశ్రయం సీసీటీవీ ఫుటేజ్‌లో గుర్తించారు. తమను పేల్చేసుకున్న బక్రోయి సోదరుల గురించి పోలీసులకు తెలుసని, వారిలో ఒకడైన ఇబ్రహీం బక్రోయి టర్కీ నుంచి వచ్చినట్లు భద్రతా అధికారులు కనుగొన్నారు. అతడి గురించి తాము ముందుగానే హెచ్చరించినప్పటికీ అతడికున్న ఉగ్రవాద సంబంధాలను కనుగొనడంలో బెల్జియం పోలీసులు విఫలమయ్యారని టర్కీ అధ్యక్షుడు రికెప్ టయీప్ ఎర్డోగన్ చెప్పారు. ఇంటెలిజెన్స్ వైఫల్యం వల్లే దాడులు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఇద్దరు బెల్జియం మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. అంతర్గత భద్రత మంత్రి జాన్ జంబోన్, న్యాయ శాఖ మంత్రి కోయెన్ రాజీనామా చేసినట్లు మీడియా తెలిపింది. దాడుల గురించి త్వరలోనే స్పష్టత ఇస్తామని బెల్జియం ప్రధాని చార్లెస్ మిచెల్ చెప్పారు. బ్రసెల్స్ దాడులతో యూరోపియన్ యూనియన్ దేశాలు అప్రమత్తమయ్యాయి. ఆయా దేశాల న్యాయ, హోం శాఖ మంత్రులు త్వరలోనే బ్రసెల్స్‌లో భేటీ అయి ఉగ్రవాద పోరుకు కార్యాచరణ రూపొందించనున్నారు. పెద్ద ఎత్తున నివాళి వరుస పేలుళ్లతో 31 మంది మరణించిన ఘటన షాక్ నుంచి బెల్జియం ఇంకా తేరుకోలేదు. బ్రసెల్స్‌లోని ‘ప్లేస్ డి లా బౌర్స్’ అనే సెంటర్ వద్దకు ప్రజలు పెద్దఎత్తున వచ్చి నివాళులర్పించారు. తామంతా ఒకే కుటుంబానికి చెందిన వారమని, ప్రపంచమంతా తమతో ఉందంటూ సందేశమిస్తున్నారు. ఇస్లామిక్ స్టే ట్ జిహాదీలు యూరప్‌లో మరిన్ని దాడులకు పాల్పడతారేమోనని ఆందోళన చెందుతున్నారు. ఐసిస్‌తో సంబంధాలున్నాయన్న అనుమానంతో 162 మందిని మలేసియాలోని కౌలాలంపూర్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. అబ్దెస్లామ్‌కు తెలియదు పారిస్ దాడుల నిందితుడైన సలాహ్ అబ్దెస్లామ్‌కు బ్రసెల్స్ పేలుళ్ల గురించి తెలియదని అతడి న్యాయవాది స్వెన్ మేరీ చెప్పారు. అబ్దెస్లామ్ను జైల్లో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉంచారన్నారు. బెల్జియంలో దాడులకు ముందు అబ్దెస్లామ్ బ్రసెల్స్‌లో పట్టుబడిన సంగతి తెలిసిందే. అబ్దెస్లామ్పై బెల్జియం పోలీసులు అభియోగాలు నమోదుచేయగా, విచారణ నిమిత్తం అతడిని అప్పగించాలని ఫ్రాన్స్ అధికారులు కోరారు. వెంటనే తనను ఫ్రాన్స్‌కు అప్పగించాలని అబ్దెస్లామ్ చెప్పాడని, దీనిని వ్యతిరేకించవద్దని మేజిస్ట్రేట్‌ను కోరతానని మేరీ పేర్కొన్నారు. భారతీయుడి చివరి ఫోన్ కాల్ గుర్తింపు పేలుళ్ల అనంతరం గల్లంతైన భారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాఘవేంద్రన్ గణేశ్ చివరి ఫోన్‌కాల్‌ను అధికారులు గుర్తించారు. బెంగళూరు ఇన్ఫోసిస్‌కు చెందిన గణేశ్ చివరి కాల్‌ను బ్రసెల్స్‌లో మెట్రో రైల్లో మాట్లాడినట్లు కనుగొన్నారని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ట్విటర్లో తెలిపారు. ఆయన ఆచూకీ కోసం ఎంబసీ అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారని చెప్పారు. -
ఇన్ఫోసిస్ ఉద్యోగి ఎలా గల్లంతయ్యారు?
న్యూఢిల్లీ: బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ పేలుళ్లలో ఇన్ఫోసిస్ ఉద్యోగి రాఘవేంద్రన్ గణేశ్ మెట్రోలో ప్రయాణిస్తూ అదృశ్యమైనట్టు తెలుస్తోంది. ముందు అనుకున్నట్టుగా ఎయిర్ పోర్ట్ లో కాకుండా గణేశ్ మెట్రో ట్రైన్లో ప్రయాణిస్తూ గల్లంతు అయినట్లు తెలుస్తోంది. బెంగళూరుకు చెందిన గణేష్ పేలుళ్ల సమయంలో మెట్రో రైలులో ప్రయాణించారని భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ గురువారం ఉదయం ట్విట్ చేశారు. అటు ముంబైకి చెందిన జెట్ఎయిర్ వేస్ మహిళా ఉద్యోగినులు నిధి, అమిత్, ఇద్దరు ఆసుపత్రిలో కోలుకుంటున్నారని సుష్మ తెలిపారు. ఇద్దరి క్షేమ సమాచారాన్ని మంజీవ్ పూరిని అడిగి తెలుసుకుంటున్నానన్నారు. అలాగే మంజీవ్ పూరి నాయకత్వంలోని భారత ఎంబసీ బృందం చేస్తున్న కృషిని ఆమె అభినందించారు. రాఘవేంద్రన్ గణేశన్ గత నాలుగేళ్లుగా బ్రస్సెల్స్‌లో పనిచేస్తున్నారు. గణేష్ సోదరుడు ఇప్పటికే బ్రస్సెల్స్ చేరుకున్నారు. గణేష్ ఆచూకీని గుర్తించడంలో అక్కడి బెల్జియంలోని భారత దౌత్యకార్యాలయం అతనికి సహకరిస్తోంది. విమానాశ్రయంలో కంటే.. మెట్రో స్టేషన్ లో జరిగిన పేలుళ్ల తీవ్రత అధికంగా ఉండటంతో ప్రాణనష్టం కూడా అక్కడే ఎక్కువ జరిగింది. ఈ నేపథ్యంలో గణేష్ ఆచూకీ గల్లంతు కావడం ఆందోళన కలిగిస్తోంది. కాగా బ్రస్సెల్స్‌లో మంగళవారం ఎయిర్‌పోర్ట్‌లో, మెట్రో స్టేషన్ వద్ద జరిగిన ఆత్మాహుతి దాడుల్లో 31 మంది మృత్యువాత పడగా, మరో 200 మంది గాయపడిన సంగతి తెలిసిందే. Raghavendran Ganesh - We have tracked his last call in Brussels. He was travelling in the metro rail. @SanjeevKandakur @IndEmbassyBru — Sushma Swaraj (@SushmaSwaraj) March 24, 2016 -
మళ్లీ ఉగ్ర మూకల దాడి
బెల్జియం రాజధానిగా మాత్రమే కాదు...యూరప్ యూనియన్ ప్రధాన కార్య క్షేత్రంగా ఉన్న బ్రస్సెల్స్పై ఉగ్రవాదం పంజా విసిరింది. నగరంలోని అంతర్జా తీయ విమానాశ్రయం, సబ్వే మెట్రో స్టేషన్ లక్ష్యంగా ఐఎస్ ఉగ్రవాదులు రెచ్చి పోయి పేలుళ్లకు పాల్పడి 34మందిని పొట్టనబెట్టుకున్నారు. 270మందిని గాయ పరిచారు. నిత్యం రెప్పవాల్చని నిఘా ఉంటుందనుకున్నచోటే ఇంతటి కిరాతకానికి పాల్పడటం ద్వారా ప్రపంచంలో ఎక్కడైనా ఏమైనా చేయగలమని ఉగ్రవాదులు నిరూపించదల్చుకున్నట్టు కనిపిస్తోంది. ఈ ఘటనలకు సంబంధించి 24 గంటలు గడవకుండానే పేలుళ్ల కారకులుగా భావిస్తున్న ఇద్దరు మానవబాంబులను గుర్తించ డంతోపాటు మరొకడి కోసం గాలిస్తున్నారు. మానవబాంబులుగా మారి తమను తాము పేల్చుకున్న ఉగ్రవాదులిద్దరూ సోదరులని, వీరు పారిస్ పేలుళ్ల ఉదంతంలో ప్రధాన అనుమానితులని చెబుతున్నారు. విమానాశ్రయంలో జరిగిన రెండు పేలు ళ్లకూ మానవబాంబులే కారణమని తేల్చగా మెట్రో స్టేషన్లో జరిగిన పేలుడు ఎలాంటిదో ఇంకా నిర్ధారణ కాలేదు. అంతవరకూ నవ్వుతూ, ఆత్మీయులతో సర దాగా గడుపుతూ ఉన్న మనుషులు ఒక్క క్షణంలో మాంస ఖండాలుగా మారి చెల్లా చెదురుగా పడిపోవడమంటే ఊహకందని విషాదం. నాలుగు నెలలక్రితం పారిస్‌లో 130మంది ఉసురుతీసిన ముష్కరులే తప్పించుకుపోయి ఈ ఉన్మాదానికి పాల్ప డ్డారని వస్తున్న వార్తలు దిగ్భ్రాంతికరమైనవి. ఆ పేలుళ్లకు సంబంధించి ఒక ప్రధాన అనుమానితుణ్ణి బ్రస్సెల్స్‌లో అదుపులోకి తీసుకుని నాలుగురోజులు కావస్తుండగా ఈ దాడులు జరిగాయంటే నిఘా విభాగం సరిగా పనిచేయలేక పోయిందని అర్ధం. ఇలాంటి ఉదంతాలు సమాజాన్ని మొద్దుబారుస్తాయి. సాధారణ పౌరులు సైతం విచక్షణాశక్తిని కోల్పోయేలా చేస్తాయి. మానవ సహజాతాలైన ప్రేమ, కరుణవంటి భావనలు కొడిగట్టడం మొదలవుతుంది. భయాందోళనలు ఆవరించి ఉన్నచోట హేతుబద్ధత కరువవుతుంది. ఉన్మాద ఘటన చోటుచేసుకున్న ప్రాంతంలో, దేశంలో ఇవి తప్పనిసరి పరిణామాలు. అపరిచితులను అనుమానిం చడం మాట అటుంచి...నిన్నటివరకూ తెలిసినవారే అయినా ఆ ఉగ్రవాదులు అనుసరిస్తున్నామని చెబుతున్న మతానికే చెందినవారన్న కారణంతో తెలియని శత్రుత్వాన్ని పెంచుకునే ధోరణులు ప్రబలుతాయి. ఇలాంటి దాడులకు పాల్పడే ఉగ్రవాదులు కోరుకునేది కూడా అదే. చీలిన సమాజాలు వారికి ప్రాణధాతువుల వుతాయి. అలాంటిచోట విద్వేషాలు నూరిపోయడం, ఎదుటి వర్గంపై అనుమా నాలు రేకెత్తించడం, పరస్పరం కలహించుకునే వాతావరణాన్ని సృష్టించడం చాలా తేలికవుతుంది. ఈ ప్రమాదాన్ని పసిగట్టడం వల్లనే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హొలాండ్ పారిస్ దాడులు జరిగిన సమయంలో దేశ ప్రజలనుద్దేశించి మాట్లా డారు. ఉగ్రవాదంపై జరిపే ఈ యుద్ధంలో అతిగా స్పందించి అకారణ దాడులకు పాల్పడవద్దని హితవు చెప్పారు. యూదులనో, ముస్లింలనో లక్ష్యంగా చేసుకుని బలప్రయోగానికి దిగితే మనకూ, ఉగ్రవాదులకూ తేడా ఉండదని హెచ్చరించారు. జాతీయవాదం ముసుగులో కొన్ని గ్రూపులు అప్పటికే రెచ్చగొట్టే ప్రకటనలు చేసినా, ఒకటి రెండుచోట్ల అనుచిత ఘటనలు చోటుచేసుకున్నా ఫ్రాన్స్ మొత్తం ప్రశాంతంగానే ఉందని చెప్పాలి. తమ గడ్డపైనే పుట్టి పెరిగి ఉగ్రవాదుల ప్రభావంలోకి వెళ్తున్నవారు ఇప్పుడు పాశ్చాత్య ప్రపంచానికి పెద్ద బెడదగా మారారు. యాంత్రిక జీవనం, కొరవ డుతున్న సామాజిక సంబంధాలు, నిరుద్యోగం, భవిష్యత్తును గురించిన బెంగ వంటివి ఉగ్రవాదంవైపు యువత ఆకర్షితులు కావడానికి తోడ్పడుతున్నాయని మనో విశ్లేషకులు చెబుతున్నారు. ఉగ్రవాదంపై యుద్ధం పేరిట ఇరాక్, సిరియా, లిబియా, సోమాలియా తదితర దేశాల్లో అమెరికా, యూరప్ దేశాలు సాగిస్తున్న నరమేథం అల్‌కాయిదా, ఐఎస్‌లాంటి ఉగ్రవాద మూకలకు పశ్చిమాసియాలో ఊపిరి పోస్తున్నాయి. మరోపక్క ఉన్న వనరులన్నిటినీ ఈ నిరర్ధక యుద్ధానికే ఖర్చుచేసే స్థితి ఉండటంవల్ల అభివృద్ధిపై పూర్తిగా కేంద్రీకరించే అవకాశం యూరప్ దేశాలకు కలగటం లేదు. రెండు ప్రపంచ యుద్ధాలు సృష్టించిన ఉత్పాతాలను చూశాక మానవాళి మరోసారి అలాంటి విషమ పరిస్థితుల్లో చిక్కుకోకూడదన్న మహదాశయంతో ఐక్యరాజ్యసమితి, భద్రతామండలివంటి అంతర్జాతీయ వేదికలు ఏర్పడ్డాయి. దేశాలమధ్య ఏర్పడే ఎంతటి క్లిష్ట సమస్యలైనా ఈ వేదికలపైనే పరి ష్కారం కావాలని భావించారు. కానీ అగ్రరాజ్యాలు తమ వెనకటి గుణాన్ని విడనా డలేదు. ఫలితంగానే ఉగ్రవాదం వేళ్లూనుకుంటోంది. బెల్జియంలో ఉగ్రవాద ఉదంతాలు తక్కువే. 2014లో తొలిసారి బ్రస్సెల్స్‌లో ఒక యూదు మ్యూజియంపై ఉగ్రదాడి జరిగింది. నిరుడు మరొక దాడిని పోలీ సులు ముందుగా పసిగట్టి నివారించగలిగారు. అయితే ఉగ్రవాదులకు చెందిన స్లీపర్ సెల్స్ అక్కడ లెక్కకు మిక్కిలిగా ఉన్నాయని చాన్నాళ్లనుంచి హెచ్చరికలు వస్తూనే ఉన్నాయి. ఈ సెల్స్ ఏ క్షణంలోనైనా దాడులకు తెగబడవచ్చునన్న సూచ నలూ వెలువడ్డాయి. బెల్జియంలో నిఘా వ్యవస్థ పటిష్టంగా లేకపోవడం పాశ్చాత్య దేశాలకు పెద్ద తలనొప్పిగానే మారింది. 2012లో బెల్జియం పౌరుడొకరు తొలిసారి ఉగ్రవాదుల్లో చేరడం కోసం సిరియా వెళ్లాడు. అలాంటివారి సంఖ్య ఇప్పుడు 450కి చేరుకుంది. వారిలో దాదాపు 120మంది స్వస్థలానికి తిరిగొచ్చారు. అందులో ఎందరు నిరాశానిస్పృహలకు లోనైనవారో, ఎందరు తమ గడ్డపైనే ఉగ్రవాద కార్య కలాపాలు సాగించడానికి వచ్చారో తెలుసుకునేందుకు అనువైన వ్యవస్థ బెల్జియం లో సరిగా లేదని నిపుణులు చెబుతున్నారు. బెల్జియంలో భద్రతా విభాగం సిబ్బంది సంఖ్య 600కు మించదని, నిఘా విభాగంలో సైతం వెయ్యిమందికి మించి అధికా రులుండరని గణాంకాలు చెబుతున్నాయి. యూరప్ యూనియన్(ఈయూ) ప్రధాన కార్యాలయం, దానికి సంబంధించిన అనుబంధ కార్యాలయాలు, నాటో ప్రధాన కార్యాలయం ఉన్నచోట భద్రత ఇంత బలహీనంగా ఉండటాన్ని నిపుణులు తప్పుబడతారు. అయితే గట్టి భద్రత దానంతటదే సురక్షితమైన సమాజానికి హామీ ఇవ్వలేదు. పౌరులందరికీ మెరుగైన అవకాశాలు సాధించే ప్రజాస్వామిక వ్యవస్థ మాత్రమే ఉగ్రవాదం బెడదను సమర్ధంగా ఎదుర్కొనగలదు. ఆ దిశగా బెల్జియం మాత్రమే కాదు...పాశ్చాత్య ప్రపంచమంతా ఆలోచించాలి. అప్పుడు ఉగ్రవాదాన్ని ఎదుర్కొనడం తేలికవుతుంది. -
బెల్జియం ఫుట్‌బాల్ మ్యాచ్ రద్దు
బ్రస్సెల్స్: బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో బాంబు పేలుళ్ల ఘటన ప్రభావం ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడింది. వచ్చే మంగళవారం బెల్జియం, పోర్చుగల్ మధ్య ఇక్కడ జరగాల్సిన ఫ్రెండ్లీ ఇంటర్నేషనల్ మ్యాచ్‌ను రద్దు చేశారు. బెల్జియం ఫుట్‌బాల్ సంఘం అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. భద్రత కారణాల రీత్యా ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. మ్యాచ్‌ను రద్దు చేయాల్సిందిగా బ్రస్సెల్స్ సిటీ హాల్ నిర్వాహకులు తమను కోరారని చెప్పారు. బ్రస్సెల్స్‌లో మంగళవారం ఎయిర్‌పోర్ట్‌లో, మెట్రో స్టేషన్ వద్ద జరిగిన ఆత్మాహుతి దాడుల్లో 34 మంది మరణించగా, మరో 200 మంది గాయపడిన సంగతి తెలిసిందే. -
బ్రస్సెల్స్‌లో ఇన్ఫోసిస్ ఉద్యోగి అదృశ్యం
న్యూఢిల్లీ: బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో మంగళవారం బాంబు పేలుళ్లు జరిగిన తర్వాత భారత్‌కు చెందిన రాఘవేంద్ర గణేశన్ ఆచూకీ తెలియడం లేదు. బ్రస్సెల్స్ నగరంలో రాఘవేంద్ర ఇన్ఫోసిస్‌లో పనిచేస్తున్నాడు. రాఘవేంద్ర ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, అయితే అతని జాఢ ఇంకా తెలియరాలేదని బ్రెజిల్లో భారత రాయబారి మంజీవ్ పూరి చెప్పారు. రాఘవేంద్రను సంప్రదించేందుకు అతని స్నేహితులు కూడా ప్రయత్నిస్తున్నారని తెలిపారు. రాఘవేంద్ర ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ట్వీట్ చేశారు. రాఘవేంద్ర అదృశ్యం కావడానికి గంట ముందు తల్లితో ఫోన్లో మాట్లాడినట్టు చెప్పారు. బెల్జియంలోని భారతీయులకు అన్న విధాలా సాయం చేస్తామని హామీ ఇచ్చారు. బాంబు పేలుళ్లలో గాయపడిన జెట్ ఎయిర్ వేస్ సిబ్బంది ఇద్దరు కోలుకుంటున్నారని సుష్మా వెల్లడించారు. బ్రస్సెల్స్‌లో మంగళవారం ఎయిర్‌పోర్ట్‌లో, మెట్రో స్టేషన్ వద్ద జరిగిన ఆత్మాహుతి దాడుల్లో 34 మంది మరణించగా, మరో 200 మంది గాయపడిన సంగతి తెలిసిందే. -
'బాంబులు బ్యాగులో పెట్టుకుని వచ్చారు'
బ్రసెల్స్: బెల్జియం రాజధాని బ్రసెల్స్ ఎయిర్ పోర్టులో జంట పేలుళ్లకు పాల్పడిన ఉగ్రవాదులు లగేజీలో బాంబులు పెట్టుకుని వచ్చారని స్థానిక మేయర్ తెలిపారు. ఉగ్రవాదులు తమ లగేజీతో కారులో విమానాశ్రయానికి వచ్చారని జావెంటమ్ మేయర్ ఫ్రాన్సిస్ వెర్మీరిన్ వెల్లడించారు. సూటుకేసు బ్యాగుల్లో బాంబులు పెట్టుకుని ఎయిర్ పోర్టులోకి వచ్చారని చెప్పారు. వీటిని ట్రాలీల మీద పెట్టుకుని లోపలికి వచ్చారని, మొదటి రెండు బాంబు పేలాయని తెలిపారు. మరో ట్రాలీపై పెట్టిన మూడో బాంబు పేలలేదని, దీన్ని భద్రతాధికారులు స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. బాంబు నిర్వీర్య బృందం తర్వాత దీన్ని పేల్చివేసిందని వెల్లడించారు. బాంబు పేలుళ్లతో ఎయిర్ పోర్టు రణరంగంగా మారిందని వ్యాఖ్యానించారు. ముష్కరుల హింసాకాండను ఆయన తీవ్రంగా ఖండించారు. కాగా, ఎయిర్ పోర్టు సహా మెట్రో స్టేషన్ వద్ద బాంబులు అమర్చినట్లుగా అనుమానిస్తున్న ముగ్గురి ఫొటోలను బెల్జియం పోలీసులు మంగళవారం రాత్రి విడుదల చేశారు. నల్ల చొక్కాలు ధరించిన ఇద్దరు వ్యక్తులు, వారి పక్కనే నడుస్తున్న మరో టోపీవాలా కదిలికలను సీసీటీవీ ఫుటేజీల నుంచి సేకరించిన పోలీసులు.. ఆ ముగ్గురే బాంబులు అమర్చినవారై ఉంటారని అనుమానిస్తున్నారు. నల్లచొక్కాలతో ఉన్న ఇద్దరు వ్యక్తులు తమ ఎడమ చేతులకు నల్లరంగు గ్లౌజులు ధరించారు. టోపీవాలా తెల్లనికోటు ధరించి, తలకు నల్లటి టోపీ పెట్టుకున్నాడు. ముగ్గురు దగ్గర ఒకే రకమైన బ్యాగులు ఉండడంతో అనుమానాలు బలపడుతున్నాయి. విమానాశ్రయంలో జరిగిన జంట పేలుళ్లలో 14 మంది చనిపోగా, 96 మంది గాయాల పాలయ్యారు. మాల్బీక్ సబ్వే మెట్రో స్టేషన్లో ఉదయం రద్దీ సమయంలో చోటు చేసుకున్న భారీ పేలుడులో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. 106 మంది గాయపడ్డారు. -
పన్ను‘పోటు’ దేశాలు
ఒక్కొక్క దేశంలో ఒక్కోపన్ను విధానం... ప్రపంచంలోని ఎక్కువ వసూలు చేస్తున్న మొదటి ఎనిమిది దేశాల జాబితా ఇది.. అరుబా (కరేబియన్ సముద్రంలోని ద్వీప దేశం) పన్ను రేటు: 58.95 శాతం ► ఉద్యోగులకు చెల్లించే జీతాల ఆధారంగా వసూలు ఉండదు. మూలధనం పన్ను కూడా లేదు. 15 శాతం వ్యాట్ కూడా వసూలు చేస్తున్నారు స్వీడన్ పన్ను రేటు: 56.60 శాతం ► {పజలకు ఉచిత విద్య, రాయితీతో వైద్య సేవలు, ప్రజా రవాణా సౌకర్యం కల్పిస్తున్నారు. కంపెనీలు సోషల్ సెక్యూరిటీగా 31.42% పన్ను చెల్లించాలి. మూలధన రాబడులపై 30% చెల్లించాలి. డెన్మార్క్ పన్ను రేటు: 55.56 శాతం ► 2008లో 62.3గా ఉన్న పన్ను రేటును తగ్గించారు. ఈ దేశంలో సోషల్ సెక్యూరిటీ ట్యాక్స్ లేదు. భాగస్వామి నుంచే సంక్రమించే ఆస్తికి పన్ను విధించరు. ఇతరుల నుంచి ఆస్తి సంక్రమిస్తే కట్టాల్సిందే నెదర్లాండ్స్ పన్ను రేటు: 52.00 శాతం ► ఈ దేశంలో ఉద్యోగుల జీతాలపై పన్ను లేదు. అలాగే స్టాంప్ డ్యూటీ వసూలు చేయరు. ఆస్తి మార్పిడిపై మాత్రం 6 శాతం వసూలు చేస్తున్నారు. బెల్జియం పన్ను రేటు: 50.00 శాతం ► అతి ఎక్కువ సంవత్సరాదాయమున్న ఉద్యోగులు మొత్తంలో 40 శాతం మాత్రమే ఇంటికెళ్తారు. 13 శాతం సోషల్ సెక్యూరిటీ పన్ను చెల్లించాల్సి ఉండగా.. అందులో ఉద్యోగి వాటా 35 శాతం.. జపాన్ పన్ను రేటు: 50.00 శాతం ► దాదాపు రూ. 1.55 కోట్ల సంవత్సర ఆదాయముంటే 50 శాతం వసూలు చేస్తారు. ఈ పన్నులు రెండుగా విభజించారు. 40 శాతం మార్జినల్ పన్ను, 10 శాతం ప్రాపర్టీ పన్ను యునెటైడ్ కింగ్డమ్ పన్ను రేటు: 50.00 శాతం ► రూ.1.60 కోట్ల ఆదాయం వస్తే 50 శాతం చెల్లించాల్సిందే.. సోషల్ సెక్యూరిటీ కోసం 14 శాతం వసూలు చేస్తున్నారు. ఫిన్లాండ్ పన్ను రేటు: 49.20 శాతం ► సంవత్సర ఆదాయం రూ. 62 లక్షలుంటే 49.2 శాతం కట్టాల్సిందే. కేపిటల్ గెయిన్స్‌పై 28 శాతం పన్ను ఉండగా, 21 శాతం మున్సిపల్ ట్యాక్స్ చెల్లించాలి. ఇండియా ఇండియాలో గరిష్టంగా 30% వసూలు చేస్తుండగా... కనిష్ట 10 శాతం ఆదాయపు పన్ను చెల్లించాలి. -
పోరాడి ఓడిన భారత్
ఫైనల్లో బెల్జియం 1-0తో టీమిండియాపై గెలుపు రాయ్‌పూర్: ప్రతిష్టాత్మక హాకీ వరల్డ్ లీగ్ (హెచ్‌డబ్ల్యూఎల్) ఫైనల్స్ టోర్నమెంట్లో టైటిల్ పోరుకు అర్హత సాధించాలని భావించిన భారత జట్టుకు నిరాశ ఎదురైంది. శనివారం జరిగిన రెండో సెమీఫైనల్లో భారత్ 0-1 గోల్ తేడాతో బెల్జియం చేతిలో ఓడిపోయింది. ఆట ఐదో నిమిషంలో సెడ్రిక్ చార్లియర్ చేసిన గోల్‌తో బెల్జియం 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత స్కోరును సమం చేసేందుకు భారత ఆటగాళ్లు శతవిధాలా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆదివారం జరిగే ఫైనల్లో ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాతో బెల్జియం; కాంస్య పతక పోరులో నెదర్లాండ్స్‌తో భారత్ తలపడతాయి. బెల్జియంతో జరిగిన మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు తొలి రెండు భాగాల్లో అనుకున్నంత దూకుడుగా ఆడలేకపోయారు. మరోవైపు బెల్జియం అవకాశం వచ్చిన ప్రతీసారి భారత గోల్‌పోస్ట్‌పై దాడులు చేసింది. అయితే మ్యాచ్ మొత్తంలో రెండు జట్లకు ఒక్క పెనాల్టీ కార్నర్ కూడా రాకపోవడం గమనార్హం. సర్దార్ సింగ్ నాయకత్వంలోని భారత జట్టు ఆటగాళ్లు బంతిని తమ ఆధీనంలో 59 శాతం ఉంచుకున్నా... బెల్జియం గోల్‌పోస్ట్ ‘డి’ ఏరియాలోకి 24 సార్లు చొచ్చుకెళ్లినా గోల్‌ను మాత్రం చేయలేకపోయారు. -
మరో సంచలనంపై దృష్టి
* నేడు బెల్జియంతో భారత్ సెమీస్ మ్యాచ్ * హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్స్ టోర్నీ రాయ్‌పూర్: అమోఘమైన ఆటతీరుతో గ్రేట్ బ్రిటన్‌పై సంచలన విజయం సాధించిన భారత హాకీ జట్టు మరో కఠిన పరీక్షకు సిద్ధమైంది. హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్స్ టోర్నీలో శనివారం జరిగే సెమీఫైనల్లో పటిష్టమైన బెల్జియంతో అమీతుమీ తేల్చుకోనుంది. లీగ్ దశలో పూర్తిగా నిరాశపర్చిన సర్దార్‌సేన ప్రస్తుతం నిలకడలేమితో ఇబ్బంది పడుతోంది. ఈ విషయాన్ని కోచ్ ఓల్ట్మన్ కూడా అంగీకరిస్తున్నారు. అయితే బ్రిటన్‌పై భారత డిఫెన్స్ సమర్థంగా పని చేసింది. ఈ మ్యాచ్‌లో కూడా ఇది కొనసాగితే మరో సంచలనాన్ని ఊహించొచ్చు. లీగ్ దశ నుంచి అద్భుతంగా ఆడుతున్న బెల్జియంను ఓడించడం అనుకున్నంత సులువు కాదు. అన్ని రంగాల్లోనూ ఈ జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో హెచ్‌డబ్ల్యూఎల్ సెమీస్‌లో భారత్‌పై గెలవడం వాళ్లకు ఆత్మవిశ్వాసాన్ని పెంచే అంశం. ఊహించని రీతిలో గోల్స్ కొట్టడంలో బెల్జియన్లు సిద్ధహస్తులు. కాబట్టి వాళ్లను నిలువరించాలంటే భారత్ శక్తికి మించి పోరాడాల్సిందే. నెదర్లాండ్స్‌కు షాక్: హాకీ వరల్డ్ లీగ్ (హెచ్‌డబ్ల్యూఎల్) ఫైనల్స్ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ నెదర్లాండ్స్ జట్టుకు ఓటమి ఎదురైంది. శుక్రవారం జరిగిన తొలి సెమీఫైనల్లో ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియా 3-2 గోల్స్ తేడాతో నెదర్లాండ్స్‌ను ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఆస్ట్రేలియా తరఫున వొతెర్స్పూన్ (8వ ని.లో), బీల్ (22వ ని.లో), గోడ్స్ (42వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... నెదర్లాండ్స్‌కు జోంకర్ (29వ ని.లో), ప్రుసెర్ (33వ ని.లో) ఒక్కో గోల్ అందించారు. భారత్, బెల్జియంల మధ్య సెమీఫైనల్ విజేతతో ఆదివారం జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియా తలపడుతుంది. -
ఎన్నాళ్లకెన్నాళ్లకు...
79 ఏళ్ల తర్వాత డేవిస్ కప్ నెగ్గిన బ్రిటన్ ఫైనల్లో బెల్జియంపై 3-1తో గెలుపు ఆండీ ముర్రే అద్భుత ప్రదర్శన గెంట్ (బెల్జియం): దాదాపు ఎనిమిది దశాబ్దాలుగా ఊరిస్తున్న ప్రపంచ టీమ్ టెన్నిస్ చాంపియన్‌షిప్ ఈవెంట్ డేవిస్ కప్‌ను బ్రిటన్ జట్టు ఈసారి చేజిక్కించుకుంది. బెల్జియం జట్టుతో జరిగిన ఫైనల్లో బ్రిటన్ 3-1తో విజయం సాధించింది. ఆదివారం జరిగిన రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌లో బ్రిటన్ స్టార్ ప్లేయర్ ఆండీ ముర్రే 6-3, 7-5, 6-3తో డేవిడ్ గాఫిన్ (బెల్జియం)పై గెలుపొందడంతో బ్రిటన్ విజయం ఖాయమైంది. ఫలితం తేలిపోవడంతో ఐదో మ్యాచ్‌ను నిర్వహించలేదు. 79 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బ్రిటన్‌కు టైటిల్ దక్కడంలో ఆండీ ముర్రే కీలకపాత్ర పోషించాడు. తొలి రోజు సింగిల్స్‌లో నెగ్గడంతోపాటు రెండో రోజు తన సోదరుడు జేమీ ముర్రేతో కలిసి డబుల్స్ మ్యాచ్‌లో విజయాన్ని అందించాడు. చివరిసారి 1936లో డేవిస్ కప్ టైటిల్‌ను సాధించిన బ్రిటన్... 1978లో ఫైనల్‌కు చేరుకున్నప్పటికీ 1-4తో అమెరికా చేతిలో ఓడింది. -
బెల్జియంలో హై అలర్ట్
-
మా దేశంలో పెట్టుబడులు పెట్టండి
బెల్జియం కౌన్సిల్ జనరల్ డాక్టర్ బర్ట్ డీగ్రూఫ్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇతర ప్రపంచ దేశాలతో పోలిస్తే పెట్టుబడులకు సరైన ప్రాంతం బెల్జియం అని, అక్కడ పెట్టుబడులు పెట్టే కంపెనీలకు ప్రత్యేక రాయితీలు ఇస్తున్నామని ఆ దేశ కౌన్సిల్ జనరల్ డాక్టర్ బర్ట్ డీగ్రూఫ్ అభిప్రాయపడ్డారు. బెల్జియం దేశానికి పారిస్, లండర్, ఫ్రాంక్‌ఫర్డ్ వంటి గొప్ప గొప్ప రాజధానులకు 300 కి.మీ.లకు మించి దూరం లేదని పేర్కొన్నారు. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్టీఏపీసీసీఐ) ఆధ్వర్యంలో ‘బెల్జియం- యూరప్‌లో పెట్టుబడులకు సరైన ప్రాంతం’ అనే అంశంపై శుక్రవారమిక్కడ సదస్సు జరిగింది. కార్యక్రమంలో బ్రెజిల్ ఇన్వెస్టిమెంట్ ఎక్స్పర్ట్ క్యాథలిన్ ఫ్రూతాఫ్, ఎస్ఏఎస్ పార్టనర్స్ కార్పొరేట్ అడ్వైజర్స్ ప్రై.లి. డెరైక్టర్ అలెక్స్ టీ కోశీ, ఎఫ్టీఏపీసీసీఐ ప్రెసిడెంట్ అనిల్ రెడ్డి వెన్నం, చైర్మన్ రాజ్‌కుమార్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. -
బెల్జియం చేతిలో భారత్ పరాజయం
యాంట్‌వర్ప్ (బెల్జియం) : వరల్డ్ హాకీ లీగ్ సెమీఫైనల్స్ సన్నాహాల్లో భాగంగా భారత జట్టుకు తమ రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఓటమి ఎదురైంది. బెల్జియంతో జరిగిన ఈ మ్యాచ్‌లో సర్దార్ సింగ్ సేన 1-2 గోల్స్ తేడాతో పరాజయం పాలైంది. భారత్ తరఫున ఆకాశ్‌దీప్ సింగ్ 32వ నిమిషంలో ఏకైక గోల్ చేశాడు. 16న తమ చివరి ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత జట్టు యూఎస్ఏతో తలపడుతుంది. -
బెల్జియమ్‌లో బాహుబలి
అనేక సంచలనాలకు తెర తీస్తున్న భారీ చిత్రం ‘బాహుబలి’ ఇప్పుడు సౌండ్ రికార్డింగ్‌లోనూ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటివరకు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎన్నడూ లేని విధంగా ఈ పని కోసం ఏకంగా బెల్జియమ్కు వెళ్ళింది. అక్కడ ‘ఫోలే’ రికార్డింగ్ చేస్తోంది. ‘ఫోలే’ అంటే... షూటింగ్ అంతా పూర్తయిపోయాక, పోస్ట్ ప్రొడక్షన్లో తెర మీది దృశ్యాలకు అనుగుణంగా రోజువారీగా మనం వినే శబ్దాలను పునఃసృష్టించడం! సామాన్యభాషలో వివరించాలంటే, అద్దం బద్దలైనప్పుడు, ఖణేల్‌మంటూ కత్తులు దూసినప్పుడు, గాలికి దుస్తులు రెపరెపలాడినప్పుడు, తలుపులు తెరిచినప్పుడు.. ఒక్కో సందర్భానికి ఒక్కో రకమైన శబ్దం ఉంటుంది. లైవ్ రికార్డింగ్ లేకుండా లొకేషన్లో సన్నివేశాలను చిత్రీకరించినప్పుడు, ఆయా దృశ్యాల్లోని శబ్దాలను ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్లో ప్రత్యేకంగా సృష్టించి, జత చేస్తారు. వీటినే సౌండ్ ఎఫెక్ట్స్ అంటాం. శబ్ద నాణ్యత కోసం ఇప్పుడు ‘బాహుబలి’ చిత్రానికి రెండు వారాల పాటు బెల్జియమ్‌లోని డేమ్ బ్లాంచే కాంప్లెక్స్‌లో ఈ పని చేస్తున్నారు. సుప్రసిద్ధ ‘ఫోలే ఆర్టిస్ట్’ ఫిలిప్ వాన్ లీర్ ఈ రికార్డింగ్ చేస్తున్నారు. సోమవారం ఆరంభమైన ఈ రికార్డింగ్ ఈ నెల 14 వరకు జరుగుతుంది. ఫిలిప్‌తో కలిసి సౌండ్ డిజైనర్ పీయమ్ సతీశ్ కూడా పని చేస్తున్నారు. అలా ‘బాహుబలి’ ఓ అరుదైన ఘనతను దక్కించుకోనుంది. ప్రభాస్, అనుష్క, తమన్నా, రానా తదితర భారీ తారాగణంతో, అత్యంత భారీ నిర్మాణ వ్యయంతో రాజమౌళి దర్శకత్వంలో రెండు భాగాలుగా ఈ చిత్రం తయారవుతున్న విషయం తెలిసిందే. కె. రాఘవేంద్రరావు సమర్పణలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
అమెరికాపై బెల్జియం విజయం
-
రష్యాపై 1-0తో విజయం
-
నాకౌట్ దశకు చేరిన బెల్జియం
-
వరల్డ్‌కప్‌లో బోణీ కొట్టిన బెల్జియం
-
మళ్లీ... అదే తడబాటు
బెల్జియం చేతిలో ఓడిన భారత్ చివరి నిమిషంలో గోల్ సమర్పణ హాకీ ప్రపంచకప్ ది హేగ్ (నెదర్లాండ్స్): మళ్లీ అదే తడబాటు... ఆధిక్యంలోకి వెళ్లడం... ఆ తర్వాత ఆధిక్యాన్ని కోల్పోవడం... చివరకు మ్యాచ్‌నే చేజార్చుకోవడం... కొన్నేళ్లుగా భారత హాకీ జట్టుకు అలవాటుగా మారింది. శనివారం మొదలైన హాకీ ప్రపంచకప్‌లో బె ల్జియంతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. మ్యాచ్‌లో మరో 15 సెకన్ల సమయం... అప్పటికీ ఇరుజట్ల స్కోరు 2-2... డిఫెండర్ల ఏమరుపాటును పసిగట్టిన జాన్ డొమెన్... వాయువేగంతో భారత్ సర్కిల్‌లోకి దూసుకొచ్చాడు. మెరుపు వేగంతో బంతిని నేర్పుగా గోల్‌పోస్ట్‌లోకి పంపాడు. అంతే అప్పటి వరకు ‘డ్రా’ అనుకున్న మ్యాచ్‌ను బెల్జియం సొంతం చేసుకుంటే... నిమిషంలో ఫలితాన్ని తారుమారు చేసుకొని భారత్ మూల్యం చెల్లించుకుంది. ఫలితంగా ప్రతిష్టాత్మక హాకీ ప్రపంచకప్‌ను టీమిండియా ఓటమితో మొదలుపెట్టింది. కొయెసెరా స్టేడియంలో శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో బెల్జియం 3-2తో భారత్‌పై గెలిచి శుభారంభం చేసింది. మన్దీప్ సింగ్ (45వ ని.), ఆకాశ్‌దీప్ సింగ్ (50వ ని.) భారత్‌కు గోల్స్ అందించగా... ఫ్లోరెంట్ అబెల్ (34వ ని.), సిమోన్ గోంగార్డ్ (56వ ని.), జాన్ డొమెన్ (70వ ని.) బెల్జియం తరఫున గోల్స్ చేశారు. మ్యాచ్ మొత్తం హోరాహోరీగా సాగినా చివరి నిమిషంలో జరిగిన డ్రామాలో భారత్ చేతులెత్తేసింది. మొత్తం ఆరు పెనాల్టీల్లో బెల్జియం ఒక్కదాన్ని వినియోగించుకోగా... భారత్‌కు దక్కిన ఏకైక పెనాల్టీ కార్నర్‌ను రూపిందర్ వృథా చేశాడు. ఆసీస్ దూకుడు: మరో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 4-0తో మలేసియాను ఓడించింది. గ్లెన్ టర్నర్ (25, 54వ ని.) రెండు గోల్స్ చేయగా, ఎడిల్ ఒకెండెన్ (50వ ని.), జెమీ డ్వేయర్ (52వ ని.) చెరో గోల్ సాధించారు. ఆసీస్ ఆరు పెనాల్టీ కార్నర్లను మిస్ చేసుకోగా, మలేసియా రెండింటిని వృథా చేసుకుంది. స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 1-0తో గెలిచింది. అలిస్టర్ బ్రోగ్డన్ (6వ ని.) ఏకైక గోల్ చేశాడు. -
గుర్రంలో గుర్రుపెడదామా..
చూడ్డానికి ఆవు బొమ్మలా కనిపిస్తున్నా.. ఇదో గుర్రం బొమ్మట.. అయితే.. ఇక్కడ ఇది ఆవు బొమ్మా లేదా గుర్రం బొమ్మా అన్నది విషయం కాదు. వినడానికి విచిత్రంగా ఉన్నా.. ఇదో హోటల్. అవును.. ఈ గుర్రం బొమ్మలో పడుకుని.. మనం గుర్రుపెట్టొచ్చు. బెల్జియంలోని డర్బైలో ఉంది ఈ ‘లా బలాడ్ దెస్ గోమ్స్’ హోటల్. ఈ హోటల్లో ఇలాంటివి మొత్తం 20 గుర్రం బొమ్మలున్నాయి. అంటే.. మొత్తం 20 గదులన్నమాట. బయటికిలా కనిపిస్తున్నా.. లోపల మనకు అన్ని సదుపాయాలు ఉంటాయి. చిత్రమైన అనుభూతి పొందాలనుకునేవారు ఈ హోటల్‌కు క్యూ కడుతుంటారు. ఒక రోజుకు రూ.12 వేలు వసూలు చేస్తారు. -
పూసపాటి ‘టైమ్‌లెస్ ఆర్ట్’!
జూన్ 12 వరకు నగరంలో కొనసాగనున్న ప్రదర్శన బెల్జియంలో సానపెట్టిన వజ్రాలకు ఒక రవ్వ ప్రకాశం ఎక్కువ అని సామెత. బెల్జియం రాజధాని బ్రసెల్స్‌కు సమీపంలోని ‘మ్యూజియం ఆఫ్ శాక్రెడ్ ఆర్ట్’ (మోసా)లో ప్రదర్శించే చిత్రాలకూ అటువంటి అదనపు గౌరవం ఉంది. ఇతరుల మతవిశ్వాసాలను గౌరవించే యూరోపియన్ సంస్థ (యు ఆర్ ఐ)లో సభ్యుడైన మార్టిన్ ‘మోసా’ను 2009లో స్థాపించాడు. ‘మోసా’ నూతన భవనాన్ని ఈ నెల 17వ తేదీన హరిప్రసాద్ చౌరాసియా వేణుగానంతో, పూసపాటి పరమేశ్వరరాజు చిత్రించిన ఐకానిక్ కాలిగ్రఫీ చిత్రాల ఎగ్జిబిషన్ (టైమ్‌లెస్ ఆర్ట్)తో ప్రారంభిస్తున్నారు. అంతదూరం వెళ్లి పూసపాటి చిత్రాలను చూడలేం కదా! నథింగ్ టు వర్రీ! ఈ నెల 12 నుంచి సుందరయ్య విజ్ఞానకేంద్రంలోని ఐలమ్మ ఆర్ట్ గ్యాలరీలో పూసపాటి తాజాచిత్రాలు కొలువై ఉన్నాయి. వచ్చే నెల 12 వరకు ఈ ప్రదర్శన ఉంటుంది. ఈ నేపథ్యంలో పూసపాటితో సంభాషణా సారాంశం ఆయన మాటల్లోనే... విజయనగరంలో 1961లో జన్మించాను. తమిళనాడు, పుణే, ఔరంగాబాద్‌లలో చదువుకున్నాను. ‘ముద్ర’లో పనిచేశాను. జగదీష్ అండ్ కమలా మ్యూజియం ట్రస్టీలలో ఒకరిగా సేవలు అందిస్తున్నాను. మా ప్రపితామహులు పూసపాటి అప్పలరాజుగారు ఒరిస్సాలో ‘అస్కా’ అనే గ్రామానికి చెందినవారు. ఆలయ శిల్పాలు, లోహ విగ్రహాలు రూపొందించేవారు. పౌరాణిక గాధల చిత్రకథలను ప్రెస్కోలుగా చిత్రించేవారు. చింతగింజల మేళవింపుతో తయారైన రంగులను వాడి వస్త్రాలపై బొమ్మలు వేసేవారు. పూర్వీకుల కళ బహుశా నాలో అంతర్లీనంగా ఉండి ఉంటుంది. భారతీయ ఇతిహాసాలను ఆధునికంగా చెప్పాలనే ముప్పయ్యేళ్ల ప్రయత్నం ఐకానిక్ క్యాలిగ్రఫీ రూపంలో వ్యక్తమైంది. రామాయణంలో ‘కొత్తదనాలు’! వాల్మీకి రామాయణంలో ఇప్పటికీ మనకు ఉపకరించే కుటుంబ జీవితానికి సంబంధించిన మౌలిక విలువలున్నా యి. రామాయణం భారతీయ సామూహిక, సామాజిక చేతనాత్మ! తరచి చూస్తే.. రాముడు-సీత-లక్ష్మణుడు-భరతుడు-ఆంజనేయుడు-సుగ్రీవుడు-రావణుడు తదితర పాత్రలన్నీ ఏ కొంచెమో మన జీవితంలో ఉంటాయి. ఈ నేపథ్యంలో 37 డ్రాయింగ్ల సంకలనంగా కాలిగ్రఫీలో రామాయణం రూపొందించాను. ఆరు కాండాల ఇతిహాసంలో ఎన్నెన్ని ఘట్టాలు... ఎన్నెన్ని పాత్రలు.... ఎంతటి వైవిధ్యం... వీటన్నిటిని ఎంపిక చేసుకున్న పాళీల ద్వారా లయగతితో వ్యక్తీకరించాను. నా పుస్తకంలో రామాయణ కథానుసారం చిత్రాలుండవు. నా మనో చిత్రంలో మెరిసిన ఘట్టాలను డ్రాయిం గులుగా మలచా. ఉదాహరణకు సరయూ నదిని గిరిజన రాజు గుహుడు తన పడవపై సీతారామలక్ష్మణులను దాటిస్తోన్న దృశ్యం పుస్తకంలో తొలి చిత్రం! ఈ బొమ్మను 2003 లో తొలిసారిగా వేశా. అందులో నావ హంసలా ఉంటుంది. పుస్తకంలోని ఇదే సన్నివేశంలోని పడవ సింపుల్ ! మంథర కైకేయికి దుర్బోధ చేసే చిత్రం (ఒకే గీత) వేసేందుకు చాలా కాలం పట్టింది. ఒక్క గీతలో మంథర పూర్తి శరీరాన్ని చూసినవారు తలపంకించడం గొప్ప కితాబు! రామసేతు చిత్రం లో ఇటుకపై దేవనాగరి లిపిలో ‘రామ’ చిత్రించాను. మొత్తం బొమ్మల్లో ‘అక్షరం’ ఇదొక్కటే! క్షరించని (నాశనం కాని) చిత్రాలు అనే అర్థంలో ఇందులోని చిత్రాలన్నీ అక్షరాలే! ‘గీత’ ప్రత్యేకత! అసంఖ్యాక రామాయణాలను శతాబ్దాలుగా ఎందరో కళాకారులు శిల్పాలుగా-విగ్రహాలుగా-చిత్రాలుగా మలుస్తున్నారు. వారందరి తపస్సునూ కాలిగ్రఫీ చిత్రాలలో స్పర్శామాత్రంగా రాబట్టి సంప్రదాయానికి ఆధునికత తేవాలనుకున్నాను. మనిషికి ఒడ్డూపొడవులున్నట్లే గీత ప్రారంభానికి, ముగింపుకు మధ్య స్థలకాలాదులుంటాయి. సరళంగా, ఒంపుగా, పలుచగా, చిక్కగా, శూన్యంగా గీత ప్రయాణిస్తుంది. చిత్రంలో ఖాళీ శూన్యం కాదు. రేఖలో భాగమూ, రేఖకు కొత్త కోణమూ! ఈ చిత్రాలు సందర్శకులకు సందేశాలు ఇవ్వవు. తమ సంస్కృతిలో తమకు నచ్చిన అన్వయించే ప్రత్యేక సందర్భాలను గుర్తు చేసుకునేందుకు ఆస్కారం ఇస్తాయి. - పున్నా కృష్ణమూర్తి, సాక్షి, కల్చరల్ కరస్పాండెంట్ పూసపాటి గురించి... తెలుగు పద్య మాధుర్యాన్ని ఆస్వాదించి ‘సుందర తెలుగు’ అన్నారు తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి. పూసపాటి పరమేశ్వరరాజు ‘ఐకానిక్ కాలిగ్రఫీ’ని చూస్తే ‘సుందర చిత్రమ్’ అనేవారేమో! క్యాలీగ్రఫీ అంటే అందమైన రాత! ఆ రాతలో తనదైన రీతిలో చిత్రాలను రూపొందించారు పూసపాటి! తెలుగు వారికే సొంతమైన పద్యాల్లా తెలుగువాడైన పూసపాటి ‘ఐకానిక్ కాలిగ్రఫీ’ అనే అపురూప కళాప్రకియకు ఆద్యుడయ్యారు! కాబట్టే ఆయన చిత్రాలు సముద్రాంతర యానాలు చేస్తూ ప్రపంచ కళాప్రేమికులను అలరిస్తున్నాయ్! ఆమ్‌స్టర్‌డామ్‌లో 2013 జూలై నుంచి నవంబర్ 14 వరకూ ‘రామాయణ : లోర్ ఆఫ్ బిలీఫ్’ చిత్రాలను ప్రదర్శించారు. బీజింగ్‌లోని ఐదవ అంతర్జాతీయ బినాలేలో, ఇండియాలోని ఒకేఒక బినాలే అయిన కోచీ ముజిరిస్ బినాలేలో కూడా ఇవి ప్రదర్శితాలు. న్యూఢిల్లీలోని ఐఐసీ గ్యాలరీ నిర్వహించిన అంతర్జాతీయ కాలిగ్రఫీ కళాకారుల ప్రదర్శనకు పూసపాటి ఆహ్వానితులు. పూసపాటి వర్క్స్‌ను (బుద్ధిస్ట్ సింబల్స్, జూయిష్ సింబల్స్, క్రిస్టియన్ సింబల్స్, ఏక ఓంకారం, అల్లా నూరు నామాలు, అహురమజ్దా, న్యూమరికల్ యాత్రలు, ఎపిక్ నెరేటివ్స్, ఆయతనాలు, రామయణ-భాగవతాలు) ‘మోసా’ శాశ్వత ప్రాతిపదిక న ప్రద ర్శిస్తోంది. ‘రామాయణమ్ : లోర్ ఆఫ్ బిలీఫ్, ఐకానిక్ కాలిగ్రఫీ’ (రామాయణమ్ : విశ్వాస గాథ, ఐకానిక్ కాలిగ్రఫీ) అనే ప్రతిష్టాత్మక పుస్తకం ఇటీవల విడుదలైంది. వివిధ మ్యూజియంలు ఈ పుస్తకాన్ని సేకరించాయి. -
బెల్జియం చేతిలో భారత మహిళల ఓటమి
గ్లాస్గో: చాంపియన్స్ చాలెంజ్-1 హాకీ టోర్నీలో భారత మహిళల జట్టుకు మరో పరాజయం ఎదురైంది. పూల్ ‘ఎ’లో భాగంగా గురువారం బెల్జియంతో జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్ 0-5 తేడాతో ఓటమిపాలైంది. ఆరంభంలో హోరాహోరీగా పోరాడి బెల్జియంను అడ్డుకున్న భారత మహిళలు 33వ నిమిషంలో మనన్ సైమన్స్ తొలి గోల్ సాధించినప్పటి నుంచి పట్టు కోల్పోయారు. బెల్జియం క్రీడాకారిణులు జిల్ బూన్ (38వ నిమిషం), లూయిస్ వెర్సవెల్ (41వ), ఎమ్మా పవ్రెజ్ (64వ), లీసెలోట్ వాన్ లింట్ (69వ)లు వరుసగా గోల్స్ నమోదు చేసి భారత్‌పై ఆ జట్టుకు తిరుగులేని ఆధిక్యాన్ని కట్టబెట్టారు. భారత్ తమ తదుపరి మ్యాచ్‌ను శుక్రవారం అమెరికాతో ఆడనుంది. -
రూపు మార్చే మాయా ఫోన్
వాషింగ్టన్: బయటికి వెళుతున్నారు.. జేబులన్నీ ఫుల్.. మీ ఫోన్ బయటే ఉండిపోయింది.. ఎలా? దాన్ని కాస్త అటూ ఇటూ తిప్పగానే బ్రాస్లెట్లా మారిపోయింది. చేతికి పెట్టుకుని బయలుదేరారు.. ఫోన్లో ఓ వీడియో చూడా లి.. మళ్లీ అటూ ఇటూ తిప్పారు.. ఫోన్లా మారిపోయింది.. అవసరమైనప్పుడు ఒక పుస్తకం ఆకారంలోకి వచ్చేసింది ఇలాంటి ఫోన్ ఉంటే భలేగా ఉంటుంది కదూ.. బెల్జియం దేశానికి చెందిన హాస్లెట్ యూనివర్సిటీ ఐమైండ్స్ పరిశోధకులు ‘పాడిల్’ పేరిట ఇలాంటి ఫోన్ ప్రాథమిక నమూనా(ప్రొటోటైప్)ను రూపొందించారు. రూబిక్స్ మ్యాజిక్ పజిల్‌ను స్ఫూర్తిగా తీసుకుని ‘పాడిల్’ను రూపొందించినట్లు దీని తయారీలో పాల్గొన్న శాస్త్రవేత్త రాఫ్ రామేకర్స్ పేర్కొన్నారు. ఈ ఫోన్ ప్రస్తుతం 15 ఆకారాల్లోకి మారగలదని చెప్పా రు. దీని ప్రస్తుత డిజైన్ ప్రకారం.. ఒక ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టమ్, ఒక ప్రొజెక్టర్ అవసరమని తెలిపారు. ఈ రెండు పరికరాల సహాయంతో.. ‘పాడిల్’ను వివిధ ఆకారాల్లోకి మార్చడంతో పాటు, ఆపరేట్ చేయవచ్చని తెలిపారు. ఆ పరికరాల అవసరం లేకుండా.. పూర్తిస్థాయిలో ‘పాడిల్’ను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని.. అది మరో ఏడాదిన్నరలో అందుబాటులోకి రావచ్చని రామేకర్స్ చెప్పారు. -
సంగ్రామం : యుద్ధభూమిలో ఒలికిన సిరా!
కలం... మెదడుకి నాలుక వంటిదంటాడో ప్రాచీన రోమన్ కవి. కానీ తన కంటె తుపాకీ గొప్పదని మెదళ్లు భావిస్తే...? కలం ఆ తుపాకీకే నాలుకగా మారిపోగలదు. మొదటి ప్రపంచ యుద్ధం వేళ జరిగింది ఇదే. ఫలితం- కలం సైనిక భాషను నింపుకుంది. యుద్ధ దేవతను ఆవాహన చేసింది. సామాజిక సంఘర్షణలలో, అంతర్యుద్ధాలలో కవులూ, మేధావులూ బాధితుల వైపు నిలబడడం సహజ పరిణామం. కానీ సామ్రాజ్యాల మధ్య రగడ మీద, పాలక వంశాల నడుమ కక్షల మీద కవులూ రచయితలూ భ్రమలు పెంచుకోవడం ఆ కాలానికి సంక్రమించిన అంధత్వానికి గుర్తు. మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ చేసిన తొలి దాడి బెల్జియం(ఆగస్టు 4,1914) మీదే. యుద్ధ క్రీడ మరింత వికృతం కాబోతోందని ఆ దాడి సంకేతించింది. స్త్రీ, బాల, వృద్ధ గణాలను యుద్ధ బాధకు దూరంగా ఉంచాలని పాత నీతి. కానీ వయో భేదం లేకుండా జాతిలో ప్రతి ఒక్కరినీ యుద్ధంతో మమేకం చేయాలన్న దుగ్ధ మొదటి ప్రపంచ యుద్ధకాలంలో ఐరోపా దేశాలలో కనిపిస్తుంది. యుద్ధం మొదలయ్యే వేళకే జర్మనీలో ఒక యుద్ధ ప్రచార విభాగం చురుకుగా పని చేస్తున్నదన్న సంగతి ఇంగ్లండ్‌కు తెలిసింది. వెంటనే ఆర్థిక కార్యదర్శి డేవిడ్ లాయిడ్ జార్జి... ఇలాంటి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసే పనిని లిబరల్ పార్టీ పార్లమెంటు సభ్యుడు, పెద్ద పత్రికా రచయిత చార్లెస్ మాస్టర్మన్ (1873-1927)కు అప్పగించాడు. లండన్‌లోని వెల్లింగ్డన్ హౌస్ కేంద్రంగా మాస్టర్మన్ సెప్టెంబర్ 2,1914న తన పని ప్రారంభించాడు. ఇంగ్లండ్‌కు గొప్ప సారస్వత వారసత్వం ఉంది. జర్మనీకి విస్తారమైన జానపద, పురాణ సంపద ఉంది. వాటిని ఆ రెండు దేశాలూ ఉపయోగించుకున్నాయి. నిజానికి జర్మనీకి యుద్ధ ప్రచారం అవసరం లేదు. సైన్యంలో పనిచేయడం అక్కడి పౌరులందరి విధి. యాభయ్ సంవత్సరాలు నిండే లోపున ప్రతి పౌరుడు యుద్ధంలో ఏదో ఒక కాలంలో కనీసం మూడేళ్లు పని చేయాలి. యుద్ధం ఆ దేశానికి ఒక కుటీర పరిశ్రమ. అయినా డ్రాగన్, రెక్కల గుర్రం వంటి పురాణ ప్రతీకలను ఉపయోగించుకుని జర్మనీ కూడా పెద్ద ఎత్తున యుద్ధ ప్రచారం చేసింది. దీనికి తోడు సంచార సినిమాలతో విస్త్రతంగా ప్రచారం చేసింది. విదేశాలలో, ముఖ్యంగా అమెరికా, కెనడాలలో ఉన్న జర్మన్లు గూఢచర్యం ద్వారా దేశానికి సాయపడాలని భావించారు. బ్రిటన్‌లో యుద్ధ ప్రచార విభాగం ఏర్పాటు చేశాక మాస్టర్మన్ చేసిన మొదటి పని - ఇరవై అయిదుగురు ఇంగ్లిష్ రచయితలతో ఒక సమావేశం నిర్వహించడం. నాడూ నేడూ కూడా ప్రపంచ సాహిత్యం మహనీయులుగా పరిగణిస్తున్న ఉద్దండులు- రడ్యార్డ్ కిప్లింగ్ (1865-1936), సోమర్సెట్ మామ్ (1874-1965), ఆర్థర్ కానన్ డాయ్ల్ (1859-1930), హెచ్‌జీ వెల్స్ (1866-1946), జీకే చెస్టర్సన్ (1874-1936), జీఎం ట్రెవీలియన్ (1876-1962), విలియం ఆర్చర్ (1856-1924), హెచ్‌జే న్యూబాల్ట్ (1862-1938), జాన్ మేస్‌ఫీల్డ్ (1878-1967), ఫోర్డ్ మ్యాడాక్స్ ఫోర్డ్ (1873-1939), జాన్ గాల్స్వర్థీ (1867-1933), ఆర్నాల్డ్ బెనెట్ (1867-1931), గిల్బెర్ట్ పార్కర్ (1862-1932) వంటివారు మాస్టర్మన్ పిలుపును మన్నించినవారే. వీరిలో కిప్లింగ్ ముంబైలోనే పుట్టాడు. ఆయన ‘జంగిల్‌బుక్’ ఇప్పటికీ హాట్‌కేక్. భారతీయ సమాజం నేపథ్యంగా ఎన్నో రచనలు చేశాడు. 1906లో సాహిత్యంలో నోబెల్ బహుమానం స్వీకరించాడు. తరువాత గాల్స్వర్థీకి (1932) ఆ పురస్కారం వచ్చింది. విలియం ఆర్చర్ గురించి కూడా చెప్పుకోవాలి. నార్వేజియన్ మహా రచయిత హెన్రిక్ ఇబ్సన్ను ఇంగ్లిష్‌వారికి పరిచయం చేసిన ఘనత ఆర్చర్‌దే. ‘ఎడింబరో ఈవెనింగ్ న్యూస్’ పత్రికకు సంపాదకీయాలు రాసిన ఆర్చర్, ఇబ్సన్ ప్రపంచ ప్రఖ్యాత నాటకం ‘ఎ డాల్స్ హౌస్’ను ఇంగ్లిష్‌లోకి అనువదించాడు. ఇబ్సన్ ఇతర రచనలు ‘ద పిల్లర్స్ ఆఫ్ సొసైటీ’, ‘ద మాస్టర్ బిల్డర్’ వంటి రచనలను కూడా ఆంగ్లంలోకి అనువదించాడు. ట్రెవీలియన్ ప్రధానంగా చరిత్రకారుడు. రచయిత కూడా. యుద్ధాన్నీ, యుద్ధంలో ఇంగ్లండ్ పాత్రనీ సమర్థిస్తూ వీరు చేసిన రచనలను హాడర్ అండ్ స్టౌటన్, మెథూయున్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్, జాన్ ముర్రే, మేక్మిలన్, థామస్ నెల్సన్ సంస్థలు అచ్చువేసేవి. అప్పటికే ఐరోపాలో ఎంతో ఖ్యాతి గాంచిన చిత్రకారుడు, డచ్ దేశీయుడు లూయీస్ మేయీకర్ ఈ రచనలకు బొమ్మలు వేసేవాడు. 1918 వరకు వీరు మొత్తం 1160 రచనలు చేశారు. బ్రిటిష్ వార్ ప్రోపగాండా బ్యూరో తన తొలి పత్రాన్ని 1915 ఆరంభంలో వెలువరించింది. ఇది బెల్జియంలో జర్మనీ చేసినట్టు చెబుతున్న అత్యాచారాల గురించి వివరించింది. ‘ఆయుధం ఎత్తు!’ (ఆర్థర్ కానన్ డాయ్ల్), ‘బెర్లిన్‌లో పైశాచకత్వం’ (చెస్టర్సన్), ‘కొత్త సైన్యం’ (కిప్లింగ్), ‘నెత్తురే వాళ్ల వాదన అయినప్పుడు!’(ఫోర్డ్ మాడాక్స్ ఫోర్డ్) వంటి కరపత్రాలు అప్పుడు వచ్చాయి. రచయితలతో పాటు బ్రిటిష్ కళాకారులు కూడా మొదటి ప్రపంచ యుద్ధంలో కీలక పాత్ర పోషించారు. వీరి సేవలు యుద్ధంలో ఉపయోగించుకోవడానికి ఏర్పడినదే ఆర్టిస్ట్స్ రైఫిల్.1859లో ఈ దళం ఏర్పాటు యోచనకు బీజం పడింది. మూడో నెపోలియన్ దండెత్తితే జాతికి చెందిన కళాకారులు సయితం ఎదురొడ్డి నిలవాలన్న నినాదంతో ఆవిర్భవించింది. మొదటి ప్రపంచ యుద్ధకాలానికి బాగా విస్తరించింది. మార్స్ (యుద్ధ దేవత), మినర్వా (జ్ఞానదేవత) తలలతో ఈ దళం ఒక ముద్రికను తయారు చేసుకుంది. 1900 సంవత్సరానికి ఈ దళ ం 12 కంపెనీలుగా విస్తరించింది. తొలి సంవత్సరాలలో ఎక్కువగా చిత్రకారులు, శిల్పులు, ఎన్గ్రేవర్స్, వాస్తు శిల్పులు, నటులు, సంగీత విద్వాంసులు ఉండేవారు. విలియం మోరిస్, ల్యూక్ ఫీల్డెస్, చార్లెస్ కీనే, జాన్ లీచ్, అల్ఫ్రెడ్ లీటే (గ్రాఫిక్స్ డిజైనర్) వంటివారు ఈ దళం తరఫున యుద్ధం చేశారు. పాల్ నాష్, జాన్ నాష్, వింథామ్ రాబిన్సన్, యూజిన్ బెనెట్ కూడా ఈ దళంలోనే పని చేశారు. వీళ్లు ఎక్కువగా శిక్షణ కేంద్రాలలో ఉండేవారు. తేలిక పాటి ఆయుధాలను ఉపయోగించడంలో శిక్షణ పొందేవారు. ‘బ్రిటన్ నిన్ను పిలుస్తోంది!’ అంటూ యుద్ధ కార్యదర్శి కిష్నర్ బొమ్మతో రూపొందించిన ప్రఖ్యాత వాల్‌పోస్టర్‌ను రూపొందించిన వాడే అల్ఫ్రెడ్ ఆంబ్రోస్ షూ లీటే (1882-1933). ఆర్టిస్ట్స్ రైఫిల్స్ దళంలో మొదటి ప్రపంచ యుద్ధం సమయానికి 15,022 మంది అధికారుల స్థాయి వారు ఉండేవారు. వీరిలో 2,003 మంది ఆ యుద్ధంలో చనిపోయారు. అంటే అంతమంది కళాకారులు యుద్ధంలో కన్నుమూశారు. గ్రేట్‌వార్‌లో చెప్పుకోదగిన మరొక విభాగం- సాహిత్యవేత్తలతో ఏర్పడిన అంబులెన్స్ డ్రైవర్ల దళం. అప్పటికీ, అనంతర కాలాలలో ప్రపంచ ప్రఖ్యాతులైన రచయితలంతా పని చేసిన దళమిదే. ఎర్నెస్ట్ హెమింగ్వే, జాన్ దాస్ పాసోస్, ఇఇ కమ్మింగ్స్, వాల్ డిస్నీ వంటివారు ఈ దళంలో చేరారు. వయసు తక్కువ కావడం, లేదా వయసు మీరడం, ఇతర లోపాల వల్ల సైన్యానికి ఎంపిక కాలేకపోయిన వారే ఇందులో ఎక్కువ. ఇలాంటి వారు దాదాపు 23 మంది. జ్టైడ్ స్టీన్, ఈఎం ఫ్రాస్టర్ కూడా ఇందులో ఉన్నారు. విద్యావంతులు, రచయితలు ఇలా డ్రైవర్లుగా పాల్గొనడం రష్యా-జపాన్ యుద్ధం (1905)లో కనిపిస్తుంది.హెమింగ్వే, వాల్ట్ డి స్నీ అమెరికా రెడ్ క్రాస్ తరఫున పాల్గొన్నారు. ప్రచార విభాగంలో ఉన్నప్పటికీ యుద్ధరంగంలో ప్రత్యక్షంగా పాల్గొన దలిచిన వారు కూడా అంబులెన్స్ డ్రైవర్లుగా పని చేశారు. అందుకు ఉదాహరణ- జీఎం ట్రెవీలియన్. ఎన్నో హాస్య రచనలు చేసిన మామ్ సైనికునిగా ఎంపిక కాలేకపోయాడు. కారణం - అప్పటికి ఆయన వయసు నలభయ్ సంవత్సరాలు. దానితో అంబులెన్స్ డ్రైవర్‌గా యుద్ధరంగంలో ప్రత్యక్షమయ్యాడు. చిత్రంగా యుద్ధ ప్రచార విభాగంలో పని చేసిన మహా రచయితల పేర్లు రహస్యంగా ఉంచారు. 1935 తరువాత గానీ ఈ సంగతి వెలుగు చూడలేదు. యుద్ధం ముగిశాక వాళ్లలో వచ్చిన మార్పు, జీవితాల మీద అది వేసిన ముద్ర, వాళ్ల కుటుంబాలకు పంచిన విషాదం మళ్లీ ఓ పెద్ద గ్రంథం. - డా॥నారాయణరావు -
బెల్జియంతో భారత్ తొలి పోరు
న్యూఢిల్లీ: ప్రపంచకప్ హాకీలో భారత జట్టు తమ తొలి మ్యాచ్‌ను బెల్జియంతో ఆడనుంది. ఈమేరకు అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) టోర్నీ షెడ్యూల్‌ను విడుదల చేసింది. నెదర్లాండ్స్ రాజధాని ది హేగ్‌లో మే 31 నుంచి జూన్ 15 వరకు ఈ మెగా టోర్నీ జరుగుతుంది. పటిష్ట జట్లున్న పూల్ ‘ఎ’లో భారత్.. 31న బెల్జియంతో, జూన్ 2న ఇం గ్లండ్‌తో, 5న స్పెయిన్‌తో, 7న మలేసియాతో 9న ప్రపంచ చాంపియన్స్ ఆసీస్‌తో తలపడుతుంది. ఓవరాల్‌గా 76 మ్యాచ్‌లు జరుగనుండగా పూల్ దశలో రోజుకు 6 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. మహిళల ప్రపంచకప్ హాకీ కూడా సమాంతరంగా జరుగనుంది. -
బెల్జీయంలో భారత రాయబారిగా పూరి
బెల్జీయంలో భారత రాయబారిగా మన్జీవ్ సింగ్ పూరి నియమితులయ్యారు. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. అలాగే కౌన్సిల్ ఆఫ్ ద యూరోపియన్ యూనియన్‌లో కూడా పూరి భారత రాయబారిగా విధులు నిర్వహించనున్నారని పేర్కొంది. ప్రస్తుతం పూరి ఐక్యరాజ్యసమితిలో భారత్ తరపున ఉప శాశ్వత ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.1982 బ్యాచ్ ఇండియన్ ఫారన్ సర్వీస్‌కు చెందిన పూరి ఇప్పటి వరకు పలు దేశాల్లో భారత రాయబారిగా పని చేశారు. అలాగే హాంగేరిలోని భారత రాయబారి ఉన్న మలయ్ మిశ్రాను బొస్నియా అండ్ హెర్జిగోవినాలో నూతన రాయబారిగా విదేశాంగ శాఖ నియమించింది. అయితే మారిషస్‌లో భారత రాయబారిగా ఉన్న టీ పీ సీతారాంను యూఏఈలో భారత రాయబారిగా నియమిస్తున్నట్లు విదేశాంగ శాఖ మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే సీతారాం వచ్చే నెలలో ఆ నూతన బాధ్యతులు స్వీకరించనున్నారు.