స్పా–ఫ్రాంకోర్‌చాంప్స్ (బెల్జియం): ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్‌లో రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్‌స్టాపెన్ తనకు ఎదురేలేదన్నట్లు దూసుకుపోతున్నాడు. ఆదివారం జరిగిన బెల్జియం గ్రాండ్‌ప్రిలో వెర్‌స్టాపెన్ చాంపియన్‌గా నిలిచాడు. 44 ల్యాప్‌ల రేసును ఆరో స్థానం నుంచి ప్రారంభించిన వెర్‌స్టాపెన్ అందరికంటే వేగంగా ఒక గంటా 22 నిమిషాల 30.450 సెకన్లలో ముగించి వరుసగా ఎనిమిదో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.
ఈ సీజన్‌లో 12 రేసులు జరగ్గా వెర్‌స్టాపెన్ పది రేసుల్లో నెగ్గాడు. మరో రెండు రేసుల్లో రెడ్‌బుల్ జట్టుకే చెందిన సెర్జియో పెరెజ్ విజేతగా నిలిచాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్‌లో వెర్‌స్టాపెన్ పోల్ పొజిషన్ సాధించినా... నిబంధనలకు విరుద్ధంగా కొత్త గేర్‌బాక్స్ మార్చినందుకు అతనిపై ఐదు గ్రిడ్‌ల పెనాల్టీని విధించారు. దాంతో ఆదివారం జరిగిన ప్రధాన రేసును వెర్‌స్టాపెన్ ఆరో స్థానం నుంచి మొదలుపెట్టాడు. పెరెజ్ రెండో స్థానంలో, చార్లెస్ లెక్‌లెర్క్ (ఫెరారీ) మూడో స్థానంలో నిలిచారు. సీజన్‌లోని తదుపరి రేసు డచ్ గ్రాండ్‌ప్రి ఆగస్టు 27న జరుగుతుంది.
ఆసియా యూత్, జూనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో పురుషుల 61 కేజీల విభాగంలో భారత లిఫ్టర్ సిద్ధాంత గొగోయ్ పసిడి పతకం సాధించాడు. గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న ఈ పోటీల్లో ఆదివారం సిద్ధాంత మొత్తం 265 కేజీలు (స్నాచ్‌లో 116+క్లీన్ అండ్ జెర్క్‌లో 149) బరువెత్తి విజేతగా నిలిచాడు.
ఈ విభాగంలో భారత్‌కే చెందిన శంకర్ లాపుంగ్ (256 కేజీలు) కాంస్య పతకం గెల్చుకున్నాడు. మహిళల జూనియర్ 49 కేజీల విభాగంలో జ్ఞానేశ్వరి యాదవ్, మహిళల యూత్ 49 కేజీల విభాగంలో కోయల్ రజత పతకాలు సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment