Formula One
-
ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో ఏసీబీ FIR నమోదు
-
వెర్స్టాపెన్ అద్భుతం
సావోపాలో (బ్రెజిల్): వరుసగా నాలుగో ఏడాది ఫార్ములావన్ ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ సొంతం చేసుకునే దిశగా రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ మరో అడుగు వేశాడు. సీజన్‌లోని 21వ రేసు బ్రెజిల్ గ్రాండ్‌ప్రిలో వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ రేసులో 27 ఏళ్ల వెర్స్టాపెన్ ఊహకందని రీతిలో ఫలితాన్ని రాబట్టాడు. ఎక్కడో 17వ స్థానం నుంచి రేసును మొదలుపెట్టిన వెర్స్టాపెన్... అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఒక్కో డ్రైవర్‌ను దాటుకుంటూ చివరకు అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ సీజన్లో ఎనిమిదో విజయాన్ని నమోదు చేశాడు. నిర్ణీత 69 ల్యాప్‌లను వెర్స్టాపెన్ అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా 2 గంటల 6 నిమిషాల 54.430 సెకన్లలో పూర్తి చేసి విజేతగా అవతరించాడు. 10 జట్ల నుంచి మొత్తం 20 మంది డ్రైవర్లు పోటీపడగా... ఐదుగురు డ్రైవర్లు రేసును పూర్తి చేయడంలో విఫలమయ్యారు. అలెగ్జాండర్ అల్బోన్ (విలియమ్స్ రేసింగ్), లాన్స్ స్ట్రోల్ (ఆస్టన్ మార్టిన్ అరామ్కో) తొలి ల్యాప్‌లోనే వెనుదిరగ్గా... 30వ ల్యాప్‌లో ఫ్రాంకో కొలాపింటో (విలియమ్స్ రేసింగ్), 38వ ల్యాప్‌లో కార్లోస్ సెయింజ్ (ఫెరారీ) రేసు నుంచి తప్పుకున్నారు. మనీగ్రామ్ హాస్ జట్టు డ్రైవర్ నికో హుల్కెన్బర్గ్పై రేసు నిర్వాహకులు అనర్హత వేటు వేశారు. 27వ ల్యాప్‌లో హుల్కెన్‌బర్గ్ స్టీరింగ్‌పై నియంత్రణ కోల్పోయి ట్రాక్ బయటికి వచ్చాడు. అనంతరం హుల్కెన్‌బర్గ్ మార్షల్ సహకారంతో మళ్లీ ట్రాక్‌పైకి వచ్చాడు. ఇది నిబంధనలకు వ్యతిరేకం కావడంతో హుల్కెన్బర్గ్ను రేసు నిర్వాహకులు డిస్క్వాలిఫై చేశారు. 21 రేసుల అనంతరం డ్రైవర్స్ పాయింట్ల పట్టికలో వెర్స్టాపెన్ 393 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా... మెక్లారెన్ జట్టు డ్రైవర్ లాండో నోరిస్ 331 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచాడు. ఈ సీజన్లో మరో మూడు రేసులు (లాస్ వేగస్ గ్రాండ్‌ప్రి; నవంబర్ 24న... ఖతర్ గ్రాండ్‌ప్రి; డిసెంబర్ 1న... అబుదాబి గ్రాండ్‌ప్రి; డిసెంబర్ 8న) మిగిలి ఉన్నాయి. ఈ మూడు రేసుల్లో ఒక దాంట్లోనైనా వెర్స్టాపెన్ గెలిస్తే వరుసగా నాలుగో ఏడాది అతనికే ప్రపంచ చాంపియన్íÙప్ టైటిల్ లభిస్తుంది. -
పదకొండేళ్ల తర్వాత ప్రపంచం ముందుకు షూమాకర్!
రేసింగ్ రారాజు మైకేల్ షూమాకర్ పదకొండేళ్ల తర్వాత తొలిసారి బయట కనిపించినట్లు సమాచారం. తన కూతురు గినా పెళ్లి సందర్భంగా ఈ దిగ్గజ డ్రైవర్ ప్రపంచం ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. యూకేకు చెందిన మెట్రో సైట్ ఈ విషయాన్ని వెల్లడించింది. కాగా ఏడుసార్లు ఫార్ములా వన్ చాంపియన్‌గా నిలిచిన షూమాకర్ 2013లో ఘోర ప్రమాదానికి గురయ్యాడు.ఫ్రాన్స్‌లో ఆల్ఫ్ పర్వతాల్లో కుటుంబంతో కలిసి స్కీయింగ్ చేస్తుండగా.. పట్టుతప్పి పడిపోయాడు. ఈ క్రమంలో బండరాయికి తల బలంగా తగలడంతో ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లాడు. పేరుకు బతికి ఉన్నాడే గానీ పూర్తిగా అచేతనంగా మారిపోయాడు. ఆ తర్వాత అతడి మళ్లీ పూర్తిస్థాయిలో కోలుకోనే లేదనే వార్తలు వచ్చాయి.అయితే, తాజాగా తన కుమార్తె గినా వివాహ బంధంలో అడుగుపెడుతున్న వేళ షూమాకర్ బయటకు వచ్చినట్లు కథనాలు రావడం అతడి అభిమానులకు ఊరటనిచ్చాయి. కాగా గినా అథ్లెట్. గుర్రపుస్వారీలో ఆమెకు అనుభవం ఉంది. ఇక గినా పెళ్లి విషయానికొస్తే.. తన చిరకాల స్నేహితుడు ఇయాన్ బెత్కెను ఇటీవలే వివాహమాడింది. మూడు రోజుల క్రితం ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆమె షేర్ చేసింది.అయితే, అందులో షూమాకర్ సహా మిగతా కుటుంబ సభ్యులెవరూ లేకపోవడం గమనార్హం. ఇక స్పెయిన్‌లోని మాలోర్కాలో గల లగ్జరీ విల్లాలో గినా వెడ్డింగ్ జరిగినట్లు తెలుస్తోంది. కాగా జర్మనీకి చెందిన 55 ఏళ్ల షూమాకర్ కుమారుడు మిక్ షూమాకర్ కూడా ఎఫ్1 రేసింగ్‌లో పాల్గొన్నాడు. -
వెర్స్టాపన్కు షాక్.. నోరిస్దే టైటిల్
ఫార్ములావన్ ప్రపంచ చాంపియన్‌లో భాగంగా సింగపూర్ గ్రాండ్‌ప్రిలో మెక్లారెన్ డ్రైవర్ లాండో నోరిస్ (బ్రిటన్) టైటిల్ కైవసం చేసుకున్నాడు. క్వాలిఫయింగ్ ఈవెంట్లో అగ్రస్థానంలో నిలిచి ‘పోల్ పొజిషన్’తో రేసు ప్రారంభించిన నోరిస్ అందరికంటే వేగంగా 1 గంట 40 నిమిషాల 52.571 సెకన్లలో లక్ష్యాన్ని చేరి విజేతగా నిలిచాడు. కాగా డ్రైవర్ చాంపియన్‌షిప్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న రెడ్‌బుల్ రేసర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ (నెదర్లాండ్స్) 1 గంట 41 నిమిషాల 13.516 సెకన్లలో గమ్యాన్ని చేరి రెండో స్థానంతో సరిపెట్టుకోగా... మెక్‌లారెన్‌కే చెందిన ఆస్కార్ పియాస్ట్రి 1 గంటల 41 నిమిషాల 34.394 సెకన్లతో మూడో స్థానంతో ముగించాడు.ఎవరికి ఎన్ని పాయింట్లు?ఆదివారం నాటి ఈ ప్రదర్శన ద్వారా నోరిస్ 25 డ్రైవర్ చాంపియన్‌షిప్ పాయింట్లు ఖాతాలో వేసుకోగా... వెర్‌స్టాపెన్‌కు 18 పాయిట్లు, పియాస్ట్రికి 15 పాయింట్లు దక్కాయి. 62 ల్యాప్‌ల ఈ రేసులో రెండో స్థానంలో నిలిచిన వెర్స్టాపెన్ కంటే నోరిస్ 20.945 సెకన్ల ముందు లక్ష్యాన్ని చేరాడు. జార్జ్ రసెల్ (మెర్సిడెస్; 1 గంట 41 నిమిషాల 53.611 సెకన్లు), చార్లెస్ లెక్లెర్క్ (ఫెరారీ; 1 గంట 41 నిమిషాల 55.001 సెకన్లు) వరుసగా నాలుగో, ఐదో స్థానాల్లో నిలిచారు.టాప్‌లో అతడేఇక బ్రిటన్ స్టార్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ (మెర్సిడెస్; 1 గంట 42 నిమిషాల 17.819 సెకన్లు) ఆరో స్థానంతో సరిపెట్టుకున్నాడు. 24 రేసుల ఫార్ములావన్ సీజన్లో సింగపూర్ గ్రాండ్‌ప్రి 18వ రేసు కాగా... మరో ఆరు రేసులు మిగిలుండగా... ప్రస్తుతం డ్రైవర్స్ చాంపియన్‌షిప్‌లో 331 పాయింట్లతో వెర్స్టాపెన్ ‘టాప్’లో కొనసాగుతున్నాడు.మరోవైపు.. నోరిస్ 279 పాయింట్లతో రెండో ర్యాంక్‌లో, లెక్లెర్క్ 245 పాయింట్లతో మూడో ర్యాంక్‌లో ఉన్నారు. రెండో స్థానంలో ఉన్న నోరిస్ కంటే వెర్స్టాపెన్ 52 పాయింట్లు ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. సీజన్‌లోని తదుపరి రేసు యునైటెడ్ స్టేట్స్ గ్రాండ్‌ప్రి అక్టోబర్ 20న ఆస్టిన్ నగరంలో జరుగుతుంది. A brush with the barriers, not once but twice! 💥💥Lucky Lando 🍀#F1 #SingaporeGP pic.twitter.com/6KlhtzCQ0w— Formula 1 (@F1) September 22, 2024Winning is a habit 🥳#F1 #SingaporeGP @McLarenF1 pic.twitter.com/w78SCNW4pl— Formula 1 (@F1) September 22, 2024 -
నోరిస్‌కు పోల్ పొజిషన్
సింగపూర్: ఫార్ములావన్ సింగపూర్ గ్రాండ్ ప్రిలో మెక్లారెన్ డ్రైవర్ లొండా నోరిస్ పోల్ పొజిషన్ సాధించాడు. శనివారం నిర్వహించిన క్వాలిఫయింగ్ ఈవెంట్లో నోరిస్ అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా గమ్యాన్ని చేరుకున్నాడు. నోరిస్ 1 గంట 29 నిమిషాల 525 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అగ్రస్థానం దక్కించుకోగా... రెడ్ బుల్ రేసర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ (1 గంట 29 నిమిషాల 728 సెకన్లు) రెండో స్థానంలో నిలిచాడు. తొలి రెండు స్థానాల్లో నిలిచిన డ్రైవర్ల మధ్య కేవలం 0.203 సెకన్ల తేడా మాత్రమే ఉంది. బ్రిటన్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ (మెర్సిడెస్; 1 గంట 29 నిమిషాల 841 సెకన్లు) మూడో స్థానంలో నిలిచాడు. జార్జి రసెల్ (మెర్సిడెస్; 1 గంట 29 నిమిషాల 867 సెకన్లు), ఆస్కార్ పీస్ట్రి (మెక్లారెన్; 1 గంట 29 నిమిషాల 953 సెకన్లు) వరుసగా నాలుగో, ఐదో స్థానాలు దక్కించుకున్నారు. ఆదివారం జరగనున్న ప్రధాన రేసును నోరిస్ పోల్ పొజిషన్‌తో ప్రారంభించనున్నాడు. 24 రేసుల సీజన్లో సింగపూర్ గ్రాండ్ ప్రి 18వ రేసు కాగా... డ్రైవర్స్ చాంపియన్‌షిప్‌లో ప్రస్తుతం నెదర్లాండ్స్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ 313 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. గత కొన్ని రేసులుగా నిలకడ కొనసాగిస్తున్న నోరిస్ 254 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. వీరిద్దరి మధ్య 59 పాయింట్ల అంతరం ఉంది. మరో ఏడు రేసులు మిగిలుండగా... ఈ ఏడాది డ్రైవర్స్ చాంపియన్íÙప్ ట్రోఫీ కైవసం చేసుకునే దిశగా ఆదివారం జరగనున్న సింగపూర్ గ్రాండ్ ప్రి కీలకం కానుంది. -
ఫెరారీ సవారీ.. ఇటాలియన్ గ్రాండ్‌ప్రి టైటిల్ నెగ్గిన లెక్లెర్క్
ఫార్ములావన్ ఇటాలియన్ గ్రాండ్‌ప్రిలో ఫెరారీ రేసర్ చార్లెస్ లెక్లెర్క్ టైటిల్ గెలుచుకున్నాడు. నాలుగో స్థానం నుంచి రేసును ప్రారంభించిన ఫెరారీ డ్రైవర్.. వాయువేగంతో ముందుకు సాగి అగ్రస్థానం దక్కించుకున్నాడు. గత వారం డచ్ గ్రాండ్‌ప్రి టైటిల్ దక్కించుకున్న లాండో నోరిస్ మూడో స్థానంతో సరిపెట్టుకోగా... డ్రైవర్స్ చాంపియన్‌షిప్‌లో ‘టాప్’లో ఉన్న వెర్స్టాపెన్ ఆరో స్థానానికే పరిమితమయ్యాడు. మోంజా (ఇటలీ): ఫార్ములావన్ సీజన్ 16వ రేసు ఇటాలియన్ గ్రాండ్‌ప్రిలో ఫెరారీ డ్రైవర్ చార్లెస్ లెక్లెర్క్ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన ప్రధాన రేసులో లెక్లెర్క్ అందరికంటే ముందుగా నిరీ్ణత 53 ల్యాప్‌లను 1 గంటా 14 నిమిషాల 40.727 సెకన్లలో ముగించి విజేతగా నిలిచాడు. ఫెరారీ జట్టు ప్రధాన కేంద్రమైన ఇటలీలో ఆ జట్టుకు టైటిల్ దక్కడం ఐదేళ్ల తర్వాత ఇదే తొలిసారి. చివరిసారి 2019లో లెక్లెర్కే ఫెరారీ జట్టుకు ఇక్కడ టైటిల్ అందించాడు.నాలుగో స్థానం నుంచి రేసును ప్రారంభించిన లెక్లెర్క్ తనకు అచ్చొచ్చిన ట్రాక్‌పై వాయువేగంతో దూసుకెళ్లాడు. గత కొన్ని రేసుల నుంచి టాప్ త్రీలో చోటు దక్కించుకోలేకపోతున్న లెక్లెర్క్ ఈసారి సత్తా చాటగా... గత వారం డచ్ గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచిన మెక్లారెన్ డ్రైవర్ లాండో నోరిస్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. మెక్లారెన్ జట్టుకే చెందిన ఆస్కార్ పియాస్ట్రి 1 గంటా 14 నిమిషాల 43.391 సెకన్లలో లక్ష్యాన్ని చేరి రెండో స్థానంలో నిలిచాడు. అగ్రస్థానం దక్కించుకున్న లెక్లెర్క్తో పోల్చుకుంటే... పియాస్ట్రి 2.664 సెకన్లు ఆలస్యంగా గెలుపు గీత దాటాడు. మొత్తం 53 ల్యాప్‌లు గల 306.720 కిలోమీటర్ల ఈ రేసును పోల్ పొజిషన్‌తో ప్రారంభించిన నోరిస్ 1 గంటా 14 నిమిషాల 46.880 సెకన్లలో గమ్యాన్ని చేరి మూడో స్థానం దక్కించుకున్నాడు. డ్రైవర్స్ చాంపియన్ప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్న రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ 1 గంట 15 నిమిషాల 18.659 సెకన్లలో లక్ష్యాన్ని చేరి ఆరో స్థానంతో సరిపెట్టుకున్నాడు. సీజన్లో మరో ఎనిమిది రేసులు మిగిలుండగా... వెర్స్టాపెన్ 303 పాయింట్లతో టాప్‌లో కొనసాగుతుండగా... 241 పాయింట్లతో నోరిస్ రేండో స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నాడు. తొలి రెండు స్థానాల్లో ఉన్న డ్రైవర్ల మధ్య ప్రస్తుతం 62 పాయింట్ల వ్యత్యాసం ఉంది. రేసు రేసు ఆరంభంలోనే లెక్లెర్క్ ఆధిక్యం దక్కించుకోగా... మెక్లారెన్ డ్రైవర్ లాండో నోరిస్ కూడా వాయువేగంతో దూసుకెళ్లాడు. అయితే రెండో మలుపు వద్ద నోరిస్‌ను మెక్లారెన్ జట్టుకే చెందిన ఆస్కార్ పియాస్ట్రి వెనక్కి నెట్టి రెండో స్థానంలోకి వచ్చాడు.చివరకు వరకు పియాస్ట్రి అదే జోరు కొనసాగించినా.. లెక్లెర్క్ను అందుకోలేకపోయాడు. కార్లోస్ సెయింజ్ జూనియర్ (ఫెరారీ) 1 గంట 14 నిమిషాల 56.348 సెకన్లలో లక్ష్యాన్ని చేరి నాలుగో స్థానంలో నిలవగా... బ్రిటన్ స్టార్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ (మెర్సిడెస్) 1 గంట 15 నిమిషాల 3.547 సెకన్లలో రేసును ముగించి ఐదో స్థానం దక్కించుకున్నాడు. ఈ రేసు ద్వారానే ఫార్ములావన్ అరంగేట్రం చేసిన విలియమ్స్ రేసింగ్ జట్టు డ్రైవర్ ఫ్రాంకో కొలాపింటో 12వ స్థానంలో నిలిచాడు. సీజన్‌లోని తదుపరి రేసు అజర్బైజాన్ గ్రాండ్‌ప్రి ఈనెల 15న బాకు సిటీలో జరుగుతుంది. -
Dutch GP: నోరిస్‌కు ‘పోల్’
జాండ్వర్ట్ (నెదర్లాండ్స్): ఫార్ములావన్ (ఎఫ్1) ప్రపంచ చాంపియన్ మాక్స్ వెర్‌స్టాపెన్‌కు సొంతగడ్డపై ఎదురుదెబ్బ తగిలింది. గత మూడేళ్లుగా డచ్ గ్రాండ్‌ప్రిలో సంపూర్ణ ఆధిపత్యం కనబరిచి విజేతగా నిలిచిన వెర్స్టాపెన్ (రెడ్‌బుల్)కు ఈ ఏడాది క్వాలిఫయింగ్ రౌండ్లో చుక్కెదురైంది. శనివారం నిర్వహించిన అర్హత పోటీలో వెర్స్టాపెన్ను వెనక్కి నెడుతూ.. లాండో నోరిస్ (మెక్లారెన్) ‘పోల్ పొజిషన్’సాధించాడు. 2021 సీజన్‌తో ఫార్ములావన్ క్యాలెండర్లో తిరిగి వచి్చన డచ్ గ్రాండ్‌ప్రిలో గత మూడు పర్యాయాలు వెర్స్టాపెన్ పోల్ పొజిషన్ సాధించి రేసులో విజేతగా నిలిచాడు. కాగా, శనివారం క్వాలిఫయింగ్ రేసులో నోరిస్ దుమ్మురేపాడు. వెర్స్టాపెన్ కంటే రెప్పపాటు ముందు లక్ష్యాన్ని చేరి ‘పోల్ పొజిషన్’కొట్టేశాడు. పియాస్ట్రి (మెక్లారెన్), రస్సెల్ (మెర్సిడెస్), పెరేజ్ (రెడ్‌బుల్) వరుసగా మూడో, నాలుగో, ఐదో స్థానాల్లో నిలిచాడు. బ్రిటన్ స్టార్ డ్రైవర్, ఏడుసార్లు ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ 12వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన 14 రేసుల్లో ఏడింట నెగ్గిన వెర్స్టాపెన్... డ్రైవర్స్ ప్రపంచ చాంపియన్íÙప్లో 277 పాయింట్లతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. ఇటీవలి కాలంలో వెర్‌స్టాపెన్‌కు గట్టి పోటీనిస్తున్న బ్రిటన్ డ్రైవర్ నోరిస్ 199 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. క్వాలిఫయింగ్ ఈవెంట్లో వెర్స్టాపెన్ జోరుకు చెక్ పెట్టిన నోరిస్.. ఆదివారం ప్రధాన రేసులోనూ దీన్ని కొనసాగిస్తాడా చూడాలి. 26 ఏళ్ల వెర్‌స్టాపెన్‌కు ఇది కెరీర్లో 200వ రేసు కావడం విశేషం. ప్రాక్టీస్‌లో కారు బుగ్గిడచ్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ ఈవెంట్‌కు ముందు జరిగిన ప్రాక్టీస్ సెషన్లో అమెరికా రేసర్ లోగాన్ సార్జియాంట్ కారు ప్రమాదానికి గురైంది. సాధన సమయంలో కారు ట్రాక్‌పై నుంచి కాస్త పక్కకు వెళ్లగానే ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో అప్రమత్తమైన సార్జియాంట్ తక్షణమే కారు నుంచి బయటకు దూకేయడంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయతి్నంచే లోపే కారు మొత్తం కాలి బూడిదైంది. దీంతో పాటు క్వాలిఫయింగ్ ఈవెంట్ ఆరంభానికి ముందు మరో డ్రైవర్ కారులో కూడా మంటలు చెలరేగాయి. -
బ్రేక్ ముగిసింది... స్టీరింగ్ పిలుస్తోంది
ఫార్ములావన్ సీజన్లో వరుసగా ఐదు నెలలపాటు ట్రాక్‌పై రయ్..రయ్..రయ్ మంటూ దూసుకెళ్లిన కార్లకు గత 26 రోజులుగా విరామం లభించింది. విరామం ముగియడంతో మళ్లీ ట్రాక్‌పైకి రావడానికి కార్లు, డ్రైవర్లు సిద్ధమయ్యారు. మొత్తం 24 రేసుల ఈ సీజన్లో ఇప్పటివరకు 14 రేసులు ముగిశాయి. 15వ రేసుకు నెదర్లాండ్స్‌లోని జాండ్వర్ట్ సర్క్యూట్ ముస్తాబయింది. శుక్రవారం డ్రైవర్లందరూ ప్రాక్టీస్ చేశారు. శనివారం క్వాలిఫయింగ్ సెషన్‌ను నిర్వహిస్తారు. ఆదివారం ప్రధాన రేసు జరుగుతుంది. సీజన్‌లోని తొలి అర్ధభాగంలో డిఫెండింగ్ వరల్డ్ చాంపియన్ మాక్స్ వెర్స్టాపెన్ ఆధిపత్యం చలాయించి ఏడు రేసుల్లో గెలిచాడు. రెండో భాగంలో మిగిలిన పది రేసుల్లో ఇతర జట్ల డ్రైవర్లు గేర్ మార్చి వెర్స్టాపెన్ దూకుడుకు బ్రేక్‌లు వేస్తారా లేదా వేచి చూడాలి. జాండ్వర్ట్ (నెదర్లాండ్స్): గత మూడేళ్లుగా సొంతగడ్డపై రెడ్‌బుల్ జట్టు డ్రైవర్, నెదర్లాండ్స్ స్టార్ మాక్స్ వెర్‌స్టాపెన్‌కు ఎదురులేదు. స్వదేశంలో ‘హ్యాట్రిక్’ విజయాలతో జోరు మీదున్న వెర్స్టాపెన్ వరుసగా నాలుగోసారి టైటిల్ సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు. 2021 సీజన్‌తో ఫార్ములావన్ క్యాలెండర్లో తిరిగి వచి్చన డచ్ గ్రాండ్‌ప్రిలో ఈసారీ గెలిచి అత్యధికసార్లు ఈ రేసు నెగ్గిన జిమ్ క్లార్క్ సరసన చేరాలని వెర్స్టాపెన్ భావిస్తున్నాడు. జిమ్ క్లార్క్ 1963, 1964, 1965, 1967లో డచ్ గ్రాండ్‌ప్రి చాంపియన్‌గా నిలవగా.. వెర్స్టాపెన్ 2021 నుంచి 2023 వరకు మూడేళ్ల పాటు వరుసగా విజయాలు సాధించాడు. గత మూడు రేసుల్లోనూ ‘పోల్ పొజిషన్’తో ప్రధాన రేసు ప్రారంభించిన 26 ఏళ్ల వెర్‌స్టాపెన్‌కు ఇది కెరీర్లో 200వ రేసు కావడం విశేషం. ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన 14 రేసుల్లో ఏడింటిలో నెగ్గిన వెర్స్టాపెన్... డ్రైవర్స్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 277 పాయింట్లతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. ఇటీవలి కాలంలో నిలకడైన ప్రదర్శన చేస్తున్న బ్రిటన్ డ్రైవర్ లాండో నోరిస్ (మెక్లారెన్) 199 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా... చార్లెస్ లెక్లెర్క్ (ఫెరారీ) 177 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. మెర్సిడెస్ రేసర్ లూయిస్ హామిల్టన్ 150 పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్నాడు. ఈ ఏడాది వెర్స్టాపెన్ అత్యధికంగా తొమ్మిదిసార్లు పోడియంపై (టాప్–3) నిలవగా... నోరిస్ ఎనిమిదిసార్లు ఆ ఘనత సాధించాడు. ట్రాక్ ఎలా ఉందంటే! ఇసుక దిబ్బలకు ప్రసిద్ధి అయిన జాండ్వర్ట్లో ఈ రేసు జరగనుంది. సముద్ర తీరానికి అతి సమీపంలోని రిసార్ట్‌లోని అహ్లాదకర వాతావరణం అటు అభిమానులను, ఇటు రేసర్లను మరింత ఉత్సాహపరచనుంది. అనూహ్య మలుపులు, ఊహించని ఎత్తుపల్లాలతో డ్రైవర్లకు ఈ ట్రాక్ సవాలు విసరనుంది. 72 ల్యాప్‌లు.. డచ్ గ్రాండ్‌ప్రి సర్క్యూట్లో మొత్తం 72 ల్యాప్‌లు ఉన్నాయి. అందులో ఒక్కో ల్యాప్ 4.2 కిలోమీటర్లు కాగా... పూర్తి రేసు దూరం 307 కిలోమీటర్లు.రెడ్‌బుల్ రేసర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ (నెదర్లాండ్స్) కెరీర్లో ఇది 200వ రేసు. ఫార్ములావన్ చరిత్రలో 200 రేసులు పూర్తి చేసుకోనున్న 23వ డ్రైవర్‌గా వెర్స్టాపెన్ గుర్తింపు పొందనున్నాడు. 392 రేసులతో ఫెర్నాండో అలోన్సో అగ్రస్థానంలో ఉన్నాడు. హామిల్టన్‌దే రికార్డు డచ్ గ్రాండ్‌ప్రిలో అత్యంత వేగంగా ల్యాప్ పూర్తి చేసిన రికార్డు బ్రిటన్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ పేరిట ఉంది. 2021 రేసులో భాగంగా హామిల్టన్ 1 నిమిషం 11.097 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు.సొంతగడ్డపై పోటీ పడేటప్పుడు కాస్త ఒత్తిడి ఉండటం సహజమే. గత ఏడాది ఇక్కడ పోటీ పడ్డప్పుడు పూర్తి విశ్వాసంతో బరిలోకి దిగి విజేతగా నిలిచా. ఈ సారి ఇంకా ఎక్కువ పోటీ ఉండనుంది. మరింత మెరుగయ్యేందుకు ప్రయతి్నస్తా. –వెర్స్టాపెన్, రెడ్‌బుల్ డ్రైవర్ నేటి క్వాలిఫయింగ్ సెషన్ సాయంత్రం గం. 6:30 నుంచి ఫ్యాన్ కోడ్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
ఆస్కార్‌కు తొలి ఎఫ్1 విజయం
బుడాపెస్ట్: మెక్లారెన్ జట్టు డ్రైవర్ ఆస్కార్ పియాస్ట్రి తన కెరీర్లో తొలిసారి ఫార్ములావన్ (ఎఫ్1) రేసులో విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన హంగేరి గ్రాండ్‌ప్రిలో 23 ఏళ్ల ఈ ఆ్రస్టేలియన్ డ్రైవర్ అగ్రస్థానాన్ని పొందాడు. కెరీర్లో 35వ రేసులో పోటీపడ్డ ఆస్కార్ నిర్ణీత 70 ల్యాప్‌లను అందరికంటే వేగంగా ఒక గంటా 38 నిమిషాల 01.989 సెకన్లలో పూర్తి చేసి టైటిల్ దక్కించుకున్నాడు. మెక్‌లారెన్‌కే చెందిన లాండో నోరిస్ రెండో స్థానంలో నిలిచాడు.హామిల్టన్ (మెర్సిడెస్), లెక్లెర్క్ (ఫెరారీ), వెర్స్టాపెన్ (రెడ్‌బుల్) వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. సీజన్‌లోని తదుపరి రేసు బెల్జియం గ్రాండ్‌ప్రి ఈనెల 28న జరుగుతుంది. -
2024 Japanese Grand Prix: వెర్‌స్టాపెన్‌కు మూడో విజయం
సుజుకా (జపాన్): జపాన్ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన ఈ రేసును వెర్స్టాపెన్ ‘పోల్ పొజిషన్’తో ప్రారంభించాడు. నిరీ్ణత 53 ల్యాప్‌లను అందరికంటే వేగంగా ఒక గంటా 54 నిమిషాల 23.566 సెకన్లలో పూర్తి చేసి ఈ నెదర్లాండ్స్ డ్రైవర్ అగ్రస్థానాన్ని దక్కించుకొని కెరీర్లో 57వ టైటిల్‌ను సాధించాడు. ఈ సీజన్లో వెర్‌స్టాపెన్‌కిది మూడో విజయంకాగా... జపాన్ గ్రాండ్‌ప్రిలో వరుసగా మూడో గెలుపు కావడం విశేషం. రెడ్‌బుల్ జట్టుకే చెందిన సెర్జియో పెరెజ్ రెండో స్థానంలో నిలిచాడు. ఈ సీజన్లో నాలుగు రేసుల తర్వాత వెర్స్టాపెన్ 77 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతుండగా... 64 పాయింట్లతో పెరెజ్ రెండో స్థానంలో, 59 పాయింట్లతో లెక్లెర్క్(ఫెరారీ) మూడో స్థానంలో ఉన్నారు. సీజన్‌లోని ఐదో రేసు చైనా గ్రాండ్‌ప్రి ఈనెల 21న జరుగుతుంది. -
వెర్‌స్టాపెన్‌కు పోల్
సుజుకా: ఫార్ములా వన్ సీజన్ జపాన్ గ్రాండ్‌ప్రి ప్రధాన రేసును రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ కొత్త ఉత్సాహంతో మొదలు పెట్టనున్నాడు. మెల్బోర్న్లో జరిగిన గత రేసులో కారు బ్రేకులు వైఫల్యంతో రేసు మధ్యనుంచి తప్పుకున్న వెర్స్టాపెన్... శనివారం జరిగిన జపాన్ గ్రాండ్ ప్రి క్వాలిఫయింగ్‌లో మొదటి స్థానంలో నిలిచాడు. క్వాలిఫయింగ్ రేసును వెర్స్టాపెన్ 1 నిమిషం 28.197 సెకన్లలో పూర్తి చేశాడు. రెడ్‌బుల్‌కే చెందిన సెర్గెయో పెరెజ్ (1 నిమిషం 28. 263 సెకన్లు)కు రెండో స్థానం దక్కగా...ల్యాండో నోరిస్ (మెక్లారెన్ – 1 నిమిషం 28.489 సె.) మూడో స్థానంలో నిలిచాడు. -
వెర్‌స్టాపెన్‌కు షాక్.. విజేతగా కార్లోస్ సెయింజ్
మెల్బోర్న్: ఫార్ములావన్ సీజన్లో వరుసగా మూడో విజయం సాధించాలని ఆశించిన వరల్డ్ చాంపియన్ మాక్స్ వెర్స్టాపెన్ (రెడ్‌బుల్)కు నిరాశ ఎదురైంది. ఆదివారం జరిగిన ఆస్ట్రేలియన్ గ్రాండ్‌ప్రి రేసును ‘పోల్ పొజిషన్’తో ఆరంభించిన వెర్స్టాపెన్ కారు ఇంజిన్‌లో సమస్య తలెత్తడంతో నాలుగో ల్యాప్‌లోనే వైదొలిగాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఫెరారీ జట్టు డ్రైవర్ కార్లోస్ సెయింజ్ జూనియర్ విజేతగా అవతరించాడు. నిర్ణీత 58 ల్యాప్‌ల రేసును సెయింజ్ అందరికంటే వేగంగా ఒక గంటా 20 నిమిషాల 26.843 సెకన్లలో ముగించి ఈ సీజన్లో తొలి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఫెరారీకే చెందిన చార్లెస్ లెక్లెర్క్ రెండో స్థానంలో నిలిచాడు. 2022 బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి తర్వాత ఇద్దరు ఫెరారీ డ్రైవర్లు టాప్–2లో నిలిచారు. సీజన్‌లోని నాలుగో రేసు జపాన్ గ్రాండ్‌ప్రి ఏప్రిల్ 7న జరుగుతుంది. -
వెర్‌స్టాపెన్‌కు పోల్
ఫార్ములా వన్ సీజన్లో మూడో రేసు ఆ్రస్టేలియన్ గ్రాండ్‌ప్రిలో మ్యాక్స్ వెర్స్టాపెన్ పోల్ పొజిషన్‌ను సాధించాడు. మెల్బోర్న్లో శనివారం జరిగిన ప్రధాన క్వాలిఫయింగ్ రేస్‌ను రెడ్‌బుల్ డ్రైవర్ వెర్స్టాపెన్ 1 నిమిషం 15.915 సెకన్లలో పూర్తి చేశాడు. ఫెరారీ డ్రైవర్ కార్లోస్ సెయింజ్ రెండో స్థానంలో (1 నిమిషం 16.185 సె.) రెండో స్థానంలో నిలవగా...ల్యాండో నోరిస్ (మెక్లారెన్ – 1 నిమిషం 16.315 సె.)కు మూడో స్థానం దక్కింది. తొలి రెండు క్వాలిఫయింగ్లలో ముందంజలో నిలిచిన సెయింజ్నుంచి గట్టి పోటీ ఎదురైనా ఆ తర్వాత వెర్స్టాపెన్ దూసుకుపోయాడు. వెర్స్టాపెన్ ఎఫ్1 కెరీర్లో ఇది 35వ పోల్ పొజిషన్ కావడం విశేషం. గత సౌదీ అరేబియా రేసుకు ముందు అపెండిసైటిస్ బారిన పడి శస్త్ర చికిత్స చేయించుకున్న సెయింజ్ సత్తా చాటాడు. పేలవ ప్రదర్శన కనబర్చిన లూయీస్ హామిల్టన్ (మెర్సిడెజ్) 11వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. -
Max Verstappen: విజేత వెర్స్టాపెన్
Saudi Arabian Formula One Grand Prix 2024- జెద్దా: ఫార్ములావన్ తాజా సీజన్లో తన జోరు కొనసాగిస్తూ రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ వరుసగా రెండో రేసులోనూ టైటిల్ సాధించాడు. సౌదీ అరేబియా గ్రాండ్‌ప్రిలో నిర్ణీత 50 ల్యాప్‌లను వెర్స్టాపెన్ అందరికంటే వేగంగా 1 గంట 20 నిమిషాల 43.273 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన వెర్స్టాపెన్ చివరిదాకా తన ఆధిక్యాన్ని కాపాడుకొని తన కెరీర్లో 56వ విజయాన్ని నమోదు చేసుకున్నాడు. సీజన్ తొలి రేసు బహ్రెయిన్ గ్రాండ్‌ప్రిలోనూ వెర్స్టాపెన్ నెగ్గాడు. సీజన్‌లోని తదుపరి రేసు ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి ఈనెల 24న జరుగుతుంది. పోరాడి ఓడిన శ్రీజ సింగపూర్ స్మాష్ వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) టోర్నీలో తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. ప్రపంచ మూడో ర్యాంకర్ వాంగ్ మాన్యు (చైనా)తో ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 50వ ర్యాంకర్ శ్రీజ 6–11, 11–9, 5–11, 11–8, 8–11తో పోరాడి ఓడిపోయింది. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో సుతీర్థ ముఖర్జీ 4–11, 11–7, 9–11, 11–9, 10–12తో జియోజిన్ యాంగ్ (చైనా) చేతిలో ఓటమి చవిచూసింది. పురుషుల సింగిల్స్‌లో శరత్ కమల్ క్వాలిఫయింగ్‌లో విజేతగా నిలిచి మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందాడు. -
Formula One: రయ్..రయ్...రయ్...
సాఖిర్: గత ఏడాది పూర్తి ఆధిపత్యం చలాయించిన రెడ్‌బుల్ జట్టు అదే జోరును ఈ ఏడాదీ కొనసాగించాలనే లక్ష్యంతో ఫార్ములావన్ (ఎఫ్1) 2024 సీజన్లో బరిలోకి దిగనుంది. మొత్తం 24 రేసులతో కూడిన ఈ సీజన్‌కు నేడు బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి రేసుతో తెర లేవనుంది. శనివారం క్వాలిఫయింగ్ సెషన్... ఆదివారం ప్రధాన రేసు జరుగుతాయి. భారత కాలమానం ప్రకారం నేటి రాత్రి గం. 9:30 నుంచి క్వాలిఫయింగ్ సెషన్‌ను... ఆదివారం రాత్రి 8:30 నుంచి ప్రధాన రేసును నిర్వహిస్తారు. ఫ్యాన్‌కోడ్ యాప్‌లో ఎఫ్1 రేసుల ప్రత్యక్ష ప్రసారం ఉంది. గత సీజన్లో మొత్తం 22 రేసులు జరగ్గా... రెడ్‌బుల్ జట్టు డ్రైవర్లు వెర్స్టాపెన్ 19 రేసుల్లో, సెర్జియో పెరెజ్ 2 రేసుల్లో గెలిచారు. మరో రేసులో ఫెరారీ జట్టుకు చెందిన కార్లోస్ సెయింజ్ నెగ్గాడు. కొత్త సీజన్లో రెడ్‌బుల్ జట్టుతోపాటు వెర్స్టాపెన్ ప్రదర్శన ఎలా ఉంటుందో వేచి చూడాలి. -
ఫెరారీకి హామిల్టన్!
ఏడుసార్లు ఫార్ములావన్ వరల్డ్ చాంపియన్, బ్రిటన్ దిగ్గజ రేసర్ లూయిస్ హామిల్టన్ మెర్సిడెస్ జట్టును వీడనున్నాడు. 2013 నుంచి మెర్సిడెస్ తరఫున పోటీపడ్డ హామిల్టన్ ఈ ఏడాది తర్వాత ఆ జట్టుతో బంధం తెంచుకోనున్నాడు. 39 ఏళ్ల హామిల్టన్ 2025 సీజన్లో ఫెరారీ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం దాదాపు ఖరారైంది. హామిల్టన్ 2008, 2014, 2015, 2017, 2018, 2019, 2020లలో ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ గెలిచాడు. 2021లో సౌదీ అరేబియా గ్రాండ్‌ప్రి తర్వాత హామిల్టన్ మరో రేసులో విజేతగా నిలువలేకపోయాడు. -
విజయంతో వెర్స్టాపెన్ ముగింపు
అబుదాబి: ఫార్ములావన్–2023 సీజన్‌ను ప్రపంచ చాంపియన్, రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ వెర్స్టాపెన్ విజయంతో ముగించాడు. చివరిదైన 22వ రేసు అబుదాబి గ్రాండ్‌ప్రిలోనూ వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. ఈ సీజన్లో వెర్స్టాపెన్ రికార్డుస్థాయిలో 19 రేసుల్లో నెగ్గాడు. మరో రెండు రేసుల్లో పెరెజ్ (రెడ్‌బుల్), కార్లోస్ సెయింజ్ (ఫెరారీ) ఒక రేసులో నెగ్గారు. అబుదాబి గ్రాండ్‌ప్రిని ‘పోల్ పొజిషన్’తో ఆరంభించిన వెర్స్టాపెన్ నిర్ణీత 58 ల్యాప్‌లను అందరికంటే వేగంగా ఒక గంట 27 నిమిషాల 02.624 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. కెరీర్లో 54వ గెలుపుతో వెర్స్టాపెన్ ఫార్ములావన్ చరిత్రలో అత్యధిక విజయాలు అందుకున్న డ్రైవర్ల జాబితాలో వెటెల్ (53)ను అధిగమించి మూడో స్థానానికి చేరుకున్నాడు. హామిల్టన్ (103), షుమాకర్ (91) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. -
వెర్‌స్టాపెన్‌కు 17వ విజయం
సావ్‌పాలో (బ్రెజిల్): మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకున్న రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్లో 17వ విజయాన్ని నమోదు చేశాడు. సీజన్‌లోని 20వ రేసు బ్రెజిల్ గ్రాండ్‌ప్రిలో వెర్స్టాపెన్ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. 71 ల్యాప్‌ల ప్రధాన రేసును ‘పోల్ పొజిషన్’తో ప్రారంభించిన అతను చివరిదాకా తన ఆధిక్యాన్ని కాపాడుకొని విజేతగా నిలిచాడు. వెర్స్టాపెన్ అందరికంటే వేగంగా ఒక గంట 56 నిమిషాల 48.894 సెకన్లలో రేసును ముగించి టైటిల్ దక్కించుకున్నాడు. మొత్తం 20 మంది డ్రైవర్లలో 14 మంది మాత్రమే రేసును పూర్తి చేశారు. ఈ ఏడాది మొత్తం 22 రేసులు ఉండగా.. ఇప్పటికి 20 రేసులు ముగిశాయి. 17 రేసుల్లో వెర్స్టాపెన్ నెగ్గగా... రెండు రేసుల్లో సెర్జియో పెరెజ్ (రెడ్‌బుల్), ఒక రేసులో కార్లోస్ సెయింజ్ (ఫెరారీ) గెలిచారు. ఈ సీజన్‌లోని తదుపరి రేసు లాస్‌వేగస్ గ్రాండ్‌ప్రి ఈనెల 19న జరుగుతుంది. -
వెర్స్టాపెన్ రికార్డు
మెక్సికో సిటీ: ఇప్పటికే ప్రపంచ డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను సొంతం చేసుకున్నప్పటికీ... రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ మాత్రం ఫార్ములావన్–2023 సీజన్లో ఎదురులేకుండా దూసుకుపోతున్నాడు. మెక్సికో గ్రాండ్‌ప్రి రేసులో వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. 71 ల్యాప్‌ల ప్రధాన రేసును మూడో స్థానం నుంచి ప్రారంభించిన వెర్స్టాపెన్ తొలి మలుపు వద్ద ప్రత్యర్థి డ్రైవర్లను ఓవర్టేక్ చేసి ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత రేసు చివరిదాకా ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. వెర్స్టాపెన్ 71 ల్యాప్‌లను అందరికంటే వేగంగా 2 గంటల 2 నిమిషాల 30.814 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచాడు. ఈ సీజన్లో వెర్‌స్టాపెన్‌కిది 16వ గెలుపు కావడం విశేషం. తద్వారా ఒకే ఏడాది అత్యధిక ఎఫ్1 రేసుల్లో గెలిచిన డ్రైవర్‌గా తన పేరిటే ఉన్న రికార్డును వెర్స్టాపెన్ బద్దలు కొట్టాడు. గత ఏడాది వెర్స్టాపెన్ 15 రేసుల్లో గెలుపొందాడు. ఓవరాల్‌గా వెర్స్టాపెన్ కెరీర్లో ఇది 51వ విజయం. ఈ క్రమంలో కెరీర్లో అత్యధిక ఎఫ్1 విజయాలు సాధించిన డ్రైవర్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్న అలైన్ ప్రాస్ట్ (ఫ్రాన్స్) సరసన నిలిచాడు. -
టైం మెచ్చిన ధృవ్తార!
యూట్యూబ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు... ధృవ్ రాఠీ. ఈ హరియాణా కుర్రాడు యూట్యూబర్‌గా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు. గాలివాటంగా విజయం సాధించలేదు. తనదైన సక్సెస్ ఫార్ములాను రూపొందించుకున్నాడు. ఆడియో స్పేస్‌లోకి అడుగు పెట్టి పాడ్‌కాస్టర్‌గా కూడా సత్తా చాటాడు. ‘డబ్బు కోసం కాదు ప్యాషన్‌తో పనిలోకి దిగండి. సామాజిక బాధ్యతను మరవకండి’ అంటున్న ధృవ్ రాఠీ తాజాగా టైమ్ మ్యాగజైన్ ‘నెక్స్ట్ జెనరేషన్ లీడర్స్ 2023’ జాబితాలో చోటు సంపాదించాడు... ధృవ్ రాఠీ సొంత రాష్ట్రం హరియాణా. జర్మనీలోని కాజ్రువ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మెకానికల్ ఇంజనీరింగ్, అదే ఇన్స్టిట్యూట్లో రెన్యూవబుల్ ఎనర్జీలో మాస్టర్స్ డిగ్రీ చేశాడు. ట్రావెల్ వీడియోలతో ప్రయాణం ప్రారంభించిన ధృవ్ ఆ తరువాత రాజకీయా, సామాజిక అంశాలపై దృష్టి సారించాడు. ‘ఇన్సైడ్ ది వరల్డ్స్ స్మాలెస్ట్ కంట్రీ’ ‘గ్రౌండ్ రియాలిటీ ఆఫ్ దిల్లీ స్కూల్స్’ ‘క్లీనింగ్ నైన్ మిలియన్ కేజీ వర్త్ ఆఫ్ ట్రాష్’.... మొదలైన వీడియోలు బాగా పాపులర్ అయ్యాయి. ఏదో ఒక వీడియో చేయాలి, వదలాలి అని తొందర పడకుండా ఆచితూచి ఆలోచించి వీడియోలు చేసేవాడు ధృవ్. ‘చేయకపోయిన ఫరవాలేదు. చేసింది మాత్రం బాగుండాలి’ అని గట్టిగా నమ్ముతాడు. ఒక అంశంపై వీడియో చేయాలనుకున్నప్పుడు ‘కెమెరా ఉంది కదా. ఇది చాలు’ అనుకోకుండా ఆ అంశంపై లోతుగా రిసెర్చ్ చేస్తాడు. జర్నల్స్, రిపోర్ట్స్ చదవడంతో పాటు ఎంతోమంది నిపుణులతో మాట్లాడతాడు. ఆ తరువాతే పనిలోకి దిగుతాడు. ‘డబ్బులు బాగా గడించాలనే లక్ష్యంతో యూట్యూబర్‌గా మారవద్దు. యూట్యూబ్ అనేది జస్ట్ ఫర్ మనీ అనే భావనను మనసులో నుంచి తీసివేయాలి. ప్యాషన్ ఉన్నప్పుడే క్రియేటర్ కావాలి. ఒక క్రియేటర్ సక్సెస్ కావడానికి ఓపిక అనేది అతి ముఖ్యం. ఇక నేను తెలుసుకునేది ఏమీ లేదు అనుకోకుండా అనుభవాలు, పరిస్థితుల నుంచి ఎప్పటికప్పుడు పాఠాలు నేర్చుకోవాలి. నేను నేర్చుకున్నది ఏమిటో నా గత వీడియోలు, ఇప్పటి వీడియోలకు మధ్య ఉన్న తేడాను గమనిస్తే తెలుస్తుంది. ఖరీదైన టెక్నికల్ టూల్స్ వాడినంత మాత్రాన పేరు రాదు అనేది గ్రహిం చాలి. వృథాగా డబ్బులు ఖర్చు చేయవద్దు. సింపుల్ కెమెరా ఫోన్, ఫ్రీ వీడియో ఎడిటర్‌తో మన ప్రయాణం మొదలు పెట్టవచ్చు. సామాజిక బాధ్యతను ఎప్పుడూ మరవద్దు’ అంటాడు ధృవ్. ‘పాపులర్ యూట్యూబర్’గా పేరు వచ్చినప్పటికీ అక్కడే ఆగిపోకుండా ఆడియో స్పేస్‌లోకి అడుగు పెట్టాడు ధృవ్ రాఠీ. పాలిటిక్స్, ఎంటర్టైన్మెంట్, సోషల్, ఎకనామిక్స్ టాపిక్‌లను కవర్ చేస్తూ పాడ్‌కాస్టర్‌గా కూడా తానేమిటో నిరూపించుకున్నాడు. ‘పాడ్‌కాస్ట్‌లో అనుకూలతలు, ప్రతికూలతలు ఉన్నాయి. విజువల్‌గా ఆట్టుకునే అవకాశం లేదు. యానిమేషన్‌కు వీలులేదు. కేవలం మాట మాత్రమే ముఖ్యం అవుతుంది. శ్రోతలు తమ పనులు చేసుకుంటూ కూడా మన మాటలు ఆసక్తిగా వినేలా చేయాలి. పాడ్‌కాస్టింగ్‌లో నేను వీడియోలో ఎలా కనిపించాలి? అనేదాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆకట్టుకునేలా ఎలా మాట్లాడాలి? అనేదానిపైనే దృష్టి ఉంటుంది. నా ముఖాన్ని మాత్రమే కాదు గొంతు కూడా చాలామంది గుర్తుపట్టడం అనేది పాడ్‌కాస్టింగ్‌లో నాకు ప్లస్‌పాయింట్ అయింది. పాడ్‌కాస్టర్‌గా నాకు మంచి మార్కులు వేస్తూ శ్రోతలు నుంచి మెయిల్స్, మెసేజ్‌లు వస్తుంటాయి’ అంటున్న ధృవ్ అభిరుచుల విషయానికి వస్తే...ప్రయాణాలు, ఫొటోగ్రఫీ, స్కూబా–డైవింగ్, పుస్తక పఠనం అంటే ఇష్టం. ‘తక్కువలో ఎక్కువ’ అనేది నమ్మే సూత్రం. (చదవండి: సాధారణ ఉద్యోగిగా అడుగుపెట్టి..నేడు సంపన్న మహిళగా..!) -
వెర్స్టాపెన్ ‘హ్యాట్రిక్’
దోహా: వేదిక మారినా ఫలితం మారలేదు. ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్లో రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ 14వ విజయం నమోదు చేసుకున్నాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఖతర్ గ్రాండ్‌ప్రిలో వెర్స్టాపెన్ చాంపియన్‌గా నిలిచాడు. నిరీ్ణత 57 ల్యాప్‌లను వెర్స్టాపెన్ అందరికంటే వేగంగా ఒక గంటా 27 నిమిషాల 39.168 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఆస్కార్ పియస్ట్రీ (మెక్లారెన్) రెండో స్థానంలో, లాండో నోరిస్ (మెక్లారెన్) మూడో స్థానంలో నిలిచారు. ప్రపంచ మాజీ చాంపియన్ లూయిస్ హామిల్టన్ (మెర్సిడెస్), కార్లోస్ సెయింజ్ (ఫెరారీ) తొలి ల్యాప్‌లోనే వెనుదిరిగారు. ఈ ఫలితంతో వెర్స్టాపెన్ ఈ సీజన్లో మరో ఐదు రేసులు మిగిలి ఉండగానే 433 పాయింట్లతో ప్రపంచ డ్రైవర్స్ చాంపియన్íÙప్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. 22 రేసుల ఈ సీజన్లో ఇప్పటి వరకు 17 రేసులు ముగిశాయి. ఇందులో 14 రేసుల్లో వెర్స్టాపెన్, రెండు రేసుల్లో పెరెజ్ (రెడ్‌బుల్), మరో రేసులో కార్లోస్ సెయింజ్ (ఫెరారీ) గెలిచారు. 2021, 2022లలో కూడా వెర్స్టాపెన్ ప్రపంచ చాంపియన్íÙప్ టైటిల్‌ను సాధించాడు. ఈ సీజన్‌లోని తదుపరి రేసు యూఎస్ఎ గ్రాండ్‌ప్రి ఈనెల 22న జరుగుతుంది. -
వెర్‌స్టాపెన్‌కు ‘పోల్’
సుజుకా (జపాన్): ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్లో ఎదురులేని రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ తొమ్మిదోసారి పోల్ పొజిషన్ సాధించాడు. శనివారం జరిగిన జపాన్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో వెర్స్టాపెన్ అందరికంటే వేగంగా ల్యాప్‌ను ఒక నిమిషం 28.877 సెకన్లలో ముగించాడు. తద్వారా నేడు జరిగే ప్రధాన రేసును వెర్స్టాపెన్ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు 15 రేసులు జరగ్గా, రెడ్‌బుల్ జట్టు డ్రైవర్లు వరుసగా 14 రేసుల్లో విజేతలుగా నిలిచారు. వెర్స్టాపెన్ 12 రేసుల్లో, పెరెజ్ రెండు రేసుల్లో గెలిచారు. గతవారం జరిగిన సింగపూర్ గ్రాండ్‌ప్రిలో ఫెరారీ డ్రైవర్ కార్లోస్ సెయింజ్ చాంపియన్‌గా నిలిచి రెడ్‌బుల్ జట్టు జైత్రయాత్రకు అడ్డుకట్ట వేశాడు. -
సింగపూర్ గ్రాండ్‌ప్రి విజేత కార్లోస్ సెయింజ్
సింగపూర్: ఫార్ములావన్ 2023 సీజన్లో ఎట్టకేలకు 15వ రేసులో రెడ్‌బుల్ జట్టు డ్రైవర్లు కాకుండా మరో జట్టుకు చెందిన డ్రైవర్ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన సింగపూర్ గ్రాండ్‌ప్రిలో ఫెరారీ జట్టు డ్రైవర్ కార్లోస్ సెయింజ్ చాంపియన్ అయ్యాడు. నిర్ణీత 62 ల్యాప్‌ల ఈ రేసును ‘పోల్ పొజిషన్’తో ప్రారంభించిన సెయింజ్ అందరికంటే వేగంగా గంటా 46 నిమిషాల 37.418 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని సంపాదించాడు. 22 రేసుల ఈ సీజన్లో తొలి 14 రేసుల్లో రెడ్‌బుల్ డ్రైవర్లు వెర్స్టాపెన్ (12), సెర్జియో పెరెజ్ (2) విజేతగా నిలిచారు. అయితే సింగపూర్ గ్రాండ్‌ప్రిలో వీరిద్దరికి నిరాశ ఎదురైంది. వెర్స్టాపెన్ ఐదో స్థానంతో, పెరెజ్ ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకున్నారు. లాండో నోరిస్ (మెక్లారెన్) రెండో స్థానంలో, లూయిస్ హామిల్టన్ (మెర్సిడెస్) మూడో స్థానంలో నిలిచారు. సీజన్‌లోని తదుపరి రేసు జపాన్ గ్రాండ్‌ప్రి ఈనెల 24న జరుగుతుంది. -
సెయింజ్‌కు ‘పోల్’
సింగపూర్: ఫార్ములావన్‌లో ఈ సీజన్లో తొలిసారి రెడ్‌బుల్ డ్రైవర్లు వెర్స్టాపెన్, సెర్జియో పెరెజ్ నిరాశపరిచారు. శనివారం జరిగిన సింగపూర్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో వెర్స్టాపెన్ 11వ స్థానంలో, పెరెజ్ 13వ స్థానంలో నిలిచారు. నేడు జరిగే ప్రధాన రేసును వెర్స్టాపెన్ 11వ స్థానం నుంచి, పెరెజ్ 13వ స్థానం నుంచి ప్రారంభిస్తారు. మరోవైపు ఫెరారీ డ్రైవర్ కార్లోస్ సెయింజ్ అందరికంటే వేగంగా ల్యాప్‌ను 1 నిమిషం 30.984 సెకన్లలో ముగించి ‘పోల్ పొజిషన్’ సాధించాడు. నేడు జరిగే ప్రధాన రేసును సెయింజ్ తొలి స్థానం నుంచి మొదలు పెడతాడు. ఈ సీజన్లో 14 రేసులు జరగ్గా... 14 రేసుల్లోనూ రెడ్‌బుల్ డ్రైవర్లు వెర్స్టాపెన్ (12 రేసుల్లో), పెరెజ్ (2 రేసుల్లో) విజేతలుగా నిలిచారు. -
వారెవ్వా వెర్స్టాపెన్
మోంజా (ఇటలీ): అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. ఫార్ములావన్ (ఎఫ్1) చరిత్రలో ఒకే సీజన్లో అత్యధికంగా 10 వరుస విజయాలు సాధించిన డ్రైవర్‌గా వెర్స్టాపెన్ గుర్తింపు పొందాడు. ఆదివారం జరిగిన ఇటలీ గ్రాండ్‌ప్రిలో రెండో స్థానం నుంచి రేసును ఆరంభించిన వెర్స్టాపెన్ నిర్ణీత 51 ల్యాప్‌లను అందరికంటే వేగంగా ఒక గంట 13 నిమిషాల 41.143 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానం దక్కించుకున్నాడు. పెరెజ్ రెండో స్థానంలో, సెయింజ్ మూడో స్థానంలో నిలిచారు. ఫెరారీ డ్రైవర్ కార్లోస్ సెయింజ్ ‘పోల్ పొజిషన్’తో రేసును మొదలుపెట్టగా... 15వ ల్యాప్‌లో సెయింజ్ను వెర్స్టాపెన్ ఓవర్టేక్ చేసి ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత వెర్స్టాపెన్ను ఎవరూ అందుకోలేకపోయారు. దాంతో వెర్స్టాపెన్ ఖాతాలో ఈ సీజన్లో ఓవరాల్‌గా 12వ విజయం... వరుసగా 10వ విజయంతో కొత్త చరిత్ర నమోదైంది. 2013లో సెబాస్టియన్ వెటెల్ వరుసగా 9 రేసుల్లో గెలిచాడు. వెటెల్ రికార్డును 25 ఏళ్ల వెర్స్టాపెన్ బద్దలు కొట్టాడు. అంతేకాకుండా ఈ సీజన్లో జరిగిన 14 రేసుల్లోనూ రెడ్‌బుల్ జట్టు డ్రైవర్లే గెలుపొందడం విశేషం. వెర్స్టాపెన్ 12 రేసుల్లో నెగ్గగా... రెడ్‌బుల్ జట్టుకే చెందిన మరో డ్రైవర్ సెర్జియో పెరెజ్ రెండు రేసుల్లో గెలిచాడు. 22 రేసుల ఈ సీజన్లో ప్రస్తుతం వెర్స్టాపెన్ 364 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. తదుపరి రేసు సింగపూర్ గ్రాండ్‌ప్రి ఈనెల 17న జరుగుతుంది.