
స్పా ఫ్రాంకోర్‌చాంప్స్: వర్షంతో మూడు ల్యాప్‌లే జరిగిన బెల్జియం గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో రెడ్‌బుల్ డ్రైవర్ వెర్‌స్టాపెన్ విజేతగా నిలిచాడు. భారీ వర్షంతో మూడు గంటలు ఆలస్యంగా... గంట పాటు మాత్రమే సాగేలా సేఫ్టీ కారు నడుమ రేసు ఆరంభమైంది. అయితే మూడు ల్యాప్‌ల అనంతరం ట్రాక్ ప్రతికూలంగా మారడంతో రేసును కొనసాగించడం ప్రమాదమని భావించిన నిర్వాహకులు రేసును నిలిపేశారు. రేసు నిలిచే సమయానికి వెర్‌స్టాపెన్, రసెల్ (విలియమ్స్), హామిల్టన్ (మెర్సిడెస్) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉండటంతో దానిని తుది ఫలితంగా ప్రకటించారు. తదుపరి డచ్ గ్రాండ్‌ప్రి సెప్టెంబర్ 5న జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment