వెర్‌స్టాపెన్‌కు 17వ విజయం | Verstappen wins Brazilian GP | Sakshi

వెర్‌స్టాపెన్‌కు 17వ విజయం

Nov 7 2023 3:53 AM | Updated on Nov 7 2023 3:53 AM

Verstappen wins Brazilian GP - Sakshi

సావ్‌పాలో (బ్రెజిల్‌): మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకున్న రెడ్‌బుల్‌ జట్టు డ్రైవర్‌ మాక్స్‌ వెర్‌స్టాపెన్‌ ఈ ఏడాది ఫార్ములావన్‌ సీజన్‌లో 17వ విజయాన్ని నమోదు చేశాడు. సీజన్‌లోని 20వ రేసు బ్రెజిల్‌ గ్రాండ్‌ప్రిలో వెర్‌స్టాపెన్‌ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. 71 ల్యాప్‌ల ప్రధాన రేసును ‘పోల్‌ పొజిషన్‌’తో ప్రారంభించిన అతను చివరిదాకా తన ఆధిక్యాన్ని కాపాడుకొని విజేతగా నిలిచాడు.

వెర్‌స్టాపెన్‌ అందరికంటే వేగంగా ఒక గంట 56 నిమిషాల 48.894 సెకన్లలో రేసును ముగించి టైటిల్‌ దక్కించుకున్నాడు. మొత్తం 20 మంది డ్రైవర్లలో 14 మంది మాత్రమే రేసును పూర్తి చేశారు. ఈ ఏడాది మొత్తం 22 రేసులు ఉండగా.. ఇప్పటికి 20 రేసులు ముగిశాయి. 17 రేసుల్లో వెర్‌స్టాపెన్‌ నెగ్గగా... రెండు రేసుల్లో సెర్జియో పెరెజ్‌ (రెడ్‌బుల్‌), ఒక రేసులో కార్లోస్‌ సెయింజ్‌ (ఫెరారీ) గెలిచారు. ఈ సీజన్‌లోని తదుపరి రేసు లాస్‌వేగస్‌ గ్రాండ్‌ప్రి ఈనెల 19న జరుగుతుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement