Red bull driver
-
వెర్స్టాపెన్ షో షురూ
బహ్రెయిన్: వరుసగా గత మూడు సీజన్ల పాటు ఫార్ములా వన్ సర్క్యూట్‌ను శాసించిన రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ కొత్త సీజన్‌ను మళ్లీ అదే జోరుతో మొదలు పెట్టాడు. 2024లో తొలి ఎఫ్1 రేస్ అయిన బహ్రెయిన్ గ్రాండ్‌ప్రిలో వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. సమీప ప్రత్యర్థికంటే ఏకంగా 22.457 సెకన్ల తేడాతో రేస్‌ను ముగించడం అతని ఆధిపత్యాన్ని చూపిస్తోంది. శనివారం జరిగిన రేస్‌ను వెర్స్టాపెన్ 1 గంటా 31 నిమిషాల 44.472 సెకన్లలో పూర్తి చేశాడు. రెడ్‌బుల్‌కే చెందిన సెర్గియో పెరెజ్ రెండో స్థానంలో నిలవగా, ఫెరారీ డ్రైవర్ కార్లోస్ సెయింజ్కి మూడో స్థానం దక్కింది. స్టార్ మెర్సిడెజ్ డ్రైవర్ లూయీస్ హామిల్టన్ ఏడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఫేవరెట్‌గా బరిలోకి దిగిన వెర్స్టాపెన్ అంచనాలను అందుకున్నాడు. 57 ల్యాప్‌లు అన్నింటిలో ముందంజలో నిలిచిన అతను తన కెరీర్లో 55వ విజయాన్ని అందుకున్నాడు. సీజన్లో రెండో రేసు ఈ నెల 9న సౌదీ అరేబియాలో జరుగుతుంది. -
వెర్‌స్టాపెన్‌కు 17వ విజయం
సావ్‌పాలో (బ్రెజిల్): మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకున్న రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్లో 17వ విజయాన్ని నమోదు చేశాడు. సీజన్‌లోని 20వ రేసు బ్రెజిల్ గ్రాండ్‌ప్రిలో వెర్స్టాపెన్ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. 71 ల్యాప్‌ల ప్రధాన రేసును ‘పోల్ పొజిషన్’తో ప్రారంభించిన అతను చివరిదాకా తన ఆధిక్యాన్ని కాపాడుకొని విజేతగా నిలిచాడు. వెర్స్టాపెన్ అందరికంటే వేగంగా ఒక గంట 56 నిమిషాల 48.894 సెకన్లలో రేసును ముగించి టైటిల్ దక్కించుకున్నాడు. మొత్తం 20 మంది డ్రైవర్లలో 14 మంది మాత్రమే రేసును పూర్తి చేశారు. ఈ ఏడాది మొత్తం 22 రేసులు ఉండగా.. ఇప్పటికి 20 రేసులు ముగిశాయి. 17 రేసుల్లో వెర్స్టాపెన్ నెగ్గగా... రెండు రేసుల్లో సెర్జియో పెరెజ్ (రెడ్‌బుల్), ఒక రేసులో కార్లోస్ సెయింజ్ (ఫెరారీ) గెలిచారు. ఈ సీజన్‌లోని తదుపరి రేసు లాస్‌వేగస్ గ్రాండ్‌ప్రి ఈనెల 19న జరుగుతుంది. -
వెర్స్టాపెన్ రికార్డు
మెక్సికో సిటీ: ఇప్పటికే ప్రపంచ డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను సొంతం చేసుకున్నప్పటికీ... రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ మాత్రం ఫార్ములావన్–2023 సీజన్లో ఎదురులేకుండా దూసుకుపోతున్నాడు. మెక్సికో గ్రాండ్‌ప్రి రేసులో వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. 71 ల్యాప్‌ల ప్రధాన రేసును మూడో స్థానం నుంచి ప్రారంభించిన వెర్స్టాపెన్ తొలి మలుపు వద్ద ప్రత్యర్థి డ్రైవర్లను ఓవర్టేక్ చేసి ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత రేసు చివరిదాకా ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. వెర్స్టాపెన్ 71 ల్యాప్‌లను అందరికంటే వేగంగా 2 గంటల 2 నిమిషాల 30.814 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచాడు. ఈ సీజన్లో వెర్‌స్టాపెన్‌కిది 16వ గెలుపు కావడం విశేషం. తద్వారా ఒకే ఏడాది అత్యధిక ఎఫ్1 రేసుల్లో గెలిచిన డ్రైవర్‌గా తన పేరిటే ఉన్న రికార్డును వెర్స్టాపెన్ బద్దలు కొట్టాడు. గత ఏడాది వెర్స్టాపెన్ 15 రేసుల్లో గెలుపొందాడు. ఓవరాల్‌గా వెర్స్టాపెన్ కెరీర్లో ఇది 51వ విజయం. ఈ క్రమంలో కెరీర్లో అత్యధిక ఎఫ్1 విజయాలు సాధించిన డ్రైవర్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్న అలైన్ ప్రాస్ట్ (ఫ్రాన్స్) సరసన నిలిచాడు. -
సెయింజ్‌కు ‘పోల్’
సింగపూర్: ఫార్ములావన్‌లో ఈ సీజన్లో తొలిసారి రెడ్‌బుల్ డ్రైవర్లు వెర్స్టాపెన్, సెర్జియో పెరెజ్ నిరాశపరిచారు. శనివారం జరిగిన సింగపూర్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో వెర్స్టాపెన్ 11వ స్థానంలో, పెరెజ్ 13వ స్థానంలో నిలిచారు. నేడు జరిగే ప్రధాన రేసును వెర్స్టాపెన్ 11వ స్థానం నుంచి, పెరెజ్ 13వ స్థానం నుంచి ప్రారంభిస్తారు. మరోవైపు ఫెరారీ డ్రైవర్ కార్లోస్ సెయింజ్ అందరికంటే వేగంగా ల్యాప్‌ను 1 నిమిషం 30.984 సెకన్లలో ముగించి ‘పోల్ పొజిషన్’ సాధించాడు. నేడు జరిగే ప్రధాన రేసును సెయింజ్ తొలి స్థానం నుంచి మొదలు పెడతాడు. ఈ సీజన్లో 14 రేసులు జరగ్గా... 14 రేసుల్లోనూ రెడ్‌బుల్ డ్రైవర్లు వెర్స్టాపెన్ (12 రేసుల్లో), పెరెజ్ (2 రేసుల్లో) విజేతలుగా నిలిచారు. -
వెర్స్టాపెన్ ‘హ్యాట్రిక్’.. సీజన్లో వరుసగా మూడో విజయం
మోంట్మెలో (స్పెయిన్): ఫార్ములావన్ తాజా సీజన్లో రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ తన జోరు కొనసాగిస్తున్నాడు. ఆదివారం జరిగిన స్పానిష్ గ్రాండ్‌ప్రిలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగి టైటిల్ నిలబెట్టుకున్నాడు. 66 ల్యాప్‌ల రేసును ‘పోల్ పొజిషన్’ తో ప్రారంభించిన వెర్స్టాపెన్ అందరికంటే వేగంగా ఒక గంటా 27 నిమిషాల 57.940 సెకన్లలో ముగించి విజేతగా నిలిచాడు. హామిల్టన్ (మెర్సిడెస్) రెండో స్థానంలో, రసెల్ (మెర్సిడెస్) మూడో స్థానంలో, పెరెజ్ (రెడ్‌బుల్) నాలుగో స్థానంలో నిలిచారు. ఈ సీజన్లో వెర్‌స్టాపెన్‌కిది వరుసగా మూడో విజయంకాగా, ఓవరాల్‌గా ఐదో టైటిల్ కావడం విశేషం. ఈ సీజన్లో మొత్తం ఏడు రేసులు జరగ్గా ... ఏడింటిలోనూ రెడ్‌బుల్ జట్టు డ్రైవర్లే విజేతగా నిలువడం గమనార్హం. వెర్స్టాపెన్ బహ్రెయిన్, ఆ్రస్టేలియా, మయామి, మొనాకో, స్పానిష్ రేసుల్లో నెగ్గగా... పెరెజ్ సౌదీ అరేబియా, అజర్బైజాన్ రేసుల్లో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. సీజన్‌లోని ఎనిమిదో రేసు కెనడియన్ గ్రాండ్‌ప్రి ఈనెల 18న జరుగుతుంది. -
చాంప్ వెర్స్టాపెన్
ఆస్టిన్: ఫార్ములావన్ సీజన్లో ఇదివరకే చాంపియన్‌షిప్ ఖాయం చేసుకున్న రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ ఖాతాలో మరో విజయం చేరింది. యూఎస్ గ్రాండ్‌ప్రిలోనూ ఈ బెల్జియం రేసర్ విజయం సాధించాడు. సర్క్యూట్ ఆఫ్ అమెరికాస్‌లో సోమవారం రాత్రి ముగిసిన 56 ల్యాపుల రేసును వెర్స్టాపెన్ అందరికంటే ముందుగా ముగించాడు. గంటా 42 నిమిషాల 11.687 సెకన్లలో ముగించి 2022 సీజన్లో 13వ టైటిల్ సాధించాడు. మాజీ చాంపియన్, మెర్సిడెజ్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ 5.023 సెకన్ల తేడాతో రెండో స్థానంలో నిలువగా, ఫెరారి డ్రైవర్ లెక్లెర్క్ 7.501 సెకన్ల తేడాతో మూడో స్థానంలో నిలిచాడు. ఈ సీజన్లో ప్రస్తుతం 13 విజయాలతో 391 పాయింట్లతో వరల్డ్ చాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకోగా... చార్లెస్ లెక్లెర్క్ (267), సెర్గెయ్ పెరెజ్ (రెడ్‌బుల్; 265) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఈ సీజన్లో తదుపరి రేసు మెక్సికన్ గ్రాండ్ ప్రి 29, 30 తేదీల్లో జరుగుతుంది. సీజన్లో తర్వాతి రేసు మెక్సికన్ గ్రాండ్ప్రిగా ఉంటుంది. ఆస్టిన్: ఫార్ములావన్ సీజన్లో ఇదివరకే చాంపియన్‌షిప్ ఖాయం చేసుకున్న రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ ఖాతాలో మరో విజయం చేరింది. యూఎస్ గ్రాండ్‌ప్రిలోనూ ఈ బెల్జియం రేసర్ విజయం సాధించాడు. సర్క్యూట్ ఆఫ్ అమెరికాస్‌లో సోమవారం రాత్రి ముగిసిన 56 ల్యాపుల రేసును వెర్స్టాపెన్ అందరికంటే ముందుగా ముగించాడు. గంటా 42 నిమిషాల 11.687 సెకన్లలో ముగించి 2022 సీజన్లో 13వ టైటిల్ సాధించాడు. మాజీ చాంపియన్, మెర్సిడెజ్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ 5.023 సెకన్ల తేడాతో రెండో స్థానంలో నిలువగా, ఫెరారి డ్రైవర్ లెక్లెర్క్ 7.501 సెకన్ల తేడాతో మూడో స్థానంలో నిలిచాడు. ఈ సీజన్లో ప్రస్తుతం 13 విజయాలతో 391 పాయింట్లతో వరల్డ్ చాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకోగా... చార్లెస్ లెక్లెర్క్ (267), సెర్గెయ్ పెరెజ్ (రెడ్‌బుల్; 265) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఈ సీజన్లో తదుపరి రేసు మెక్సికన్ గ్రాండ్ ప్రి 29, 30 తేదీల్లో జరుగుతుంది. సీజన్లో తర్వాతి రేసు మెక్సికన్ గ్రాండ్ప్రిగా ఉంటుంది. -
సింగపూర్ గ్రాండ్‌ప్రి విజేత పెరెజ్
సింగపూర్: రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ సెర్జియో పెరెజ్ ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్లో రెండో విజయం సాధించాడు. ఆదివారం జరిగిన సింగపూర్ గ్రాండ్‌ప్రిలో పెరెజ్ విజేతగా నిలిచాడు. 59 ల్యాప్‌ల ఈ రేసును పెరెజ్ అందరికంటే వేగంగా 2గం:02ని.15.238 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని పొందాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన లెక్లెర్క్ (ఫెరారీ) రెండో స్థానంలో నిలిచాడు. ఈ సీజన్లో 11 విజయాలు సాధించిన వెర్స్టాపెన్ (రెడ్‌బుల్) ఏడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. తదుపరి రేసు జపాన్ గ్రాండ్‌ప్రి ఈనెల 9న జరుగుతుంది. -
Dutch GP 2022: వెల్డన్ వెర్స్టాపెన్
జాండ్‌వూర్ట్ (నెదర్లాండ్స్): ఆద్యంతం ఆధిపత్యం చలాయించిన రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ ఫార్ములావన్ (ఎఫ్1) 2022 సీజన్లో పదో విజయం నమోదు చేశాడు. సొంతగడ్డపై ఆదివారం జరిగిన డచ్ గ్రాండ్‌ప్రి ప్రధాన రేసులో వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. 72 ల్యాప్‌ల ఈ రేసును ‘పోల్ పొజిషన్’తో ప్రారంభించిన వెర్స్టాపెన్ అందరికంటే వేగంగా గంటా 36 నిమిషాల 42.773 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. జార్జి రసెల్ (మెర్సిడెస్) రెండో స్థానంలో, చార్లెస్ లెక్లెర్క్ (ఫెరారీ) మూడో స్థానంలో నిలిచారు. ప్రపంచ మాజీ చాంపియన్ లూయిస్ హామిల్టన్ నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. 22 రేసుల ఈ సీజన్లో ఇప్పటివరకు 15 రేసులు పూర్తయ్యాయి. వెర్స్టాపెన్ 319 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. తాజా గెలుపుతో వెర్స్టాపెన్ వరుసగా రెండో ఏడాదీ 10 విజయాలు సాధించాడు. ఒకే సీజన్లో అత్యధిక విజయాలు సాధించిన రికార్డు మైకేల్ షుమాకర్ (జర్మనీ; 2004లో 13), సెబాస్టియన్ వెటెల్ (జర్మనీ; 2013లో 13) పేరిట సంయుక్తంగా ఉంది. 201 పాయింట్లతో చార్లెస్ లెక్లెర్క్ (ఫెరారీ), సెర్గియో పెరెజ్ సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. సీజన్‌లోని తదుపరి రేసు ఇటలీ గ్రాండ్‌ప్రి ఈనెల 11న జరుగుతుంది. విజేత వెన్నెల–శ్రియాన్షి జోడీ పుణే: ఇండియా జూనియర్ ఇంటర్నేషనల్ గ్రాండ్‌ప్రి బ్యాడ్మింటన్ టోర్నీలో కలగొట్ల వెన్నెల–శ్రియాన్షి వలిశెట్టి (భారత్) జోడీ అండర్–19 మహిళల డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో వెన్నెల–శ్రియాన్షి ద్వయం 21–19, 21–18తో నర్దన–రిధి కౌర్ (భారత్) జోడీపై విజయం సాధించింది. మహిళల సింగిల్స్ ఫైనల్లో ఉన్నతి హుడా (భారత్) 25–23, 17–21, 10–21తో సరున్‌రక్ వితిద్సర్న్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో దివ్యం అరోరా–రిధి కౌర్ (భారత్) జోడీ టైటిల్ దక్కించుకుంది. -
'ఫార్ములావన్‌ను యువతులు ఎగబడి చూస్తున్నారు.. ఆటపై ఇష్టంతో కాదు'
ఫార్ములావన్ ఫాలో అయ్యేవారికి క్రిస్టియన్ హార్నర్.. పరిచయం అక్కర్లేని పేరు. 2005 నుంచి రేసింగ్‌లో ఉన్న క్రిస్టియన్ హార్నర్ ఖాతాలో తొమ్మిది వరల్డ్ టైటిల్స్ ఉన్నాయి. అందులో నాలుగు వరల్డ్ కన్స్ట్రక్టర్స్ చాంపియన్‌షిప్స్.. మిగతా ఐదు వరల్డ్ డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్స్ ఉన్నాయి. ప్రస్తుతం బ్రిటిష్ టీమ్ రెడ్‌బుల్ ఫార్ములావన్ ప్రిన్సిపల్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో క్రిస్టియన్ హార్నర్ ఫార్ములావన్ ఫాలో అవుతున్న యువతులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఫార్ములా వన్ చూసేందుకు అమ్మాయిలు ఎగబడుతున్నారని.. అయితే అది ఆటపై ఇష్టంతో కాదని.. అందమైన ఫార్ములా వన్ డ్రైవర్లను చూసేందుకే వస్తున్నారంటూ పేర్కొన్నాడు. క్రిస్టియన్ వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతున్నాయి. టాక్స్పోర్ట్స్కు చెందిన న్యూజ్ ప్రెజంటేటర్ లారా వుడ్స్‌కు క్రిస్టియన్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. '' ఫార్ములావన్ ఇప్పుడు ఉత్సాహంగా ఉన్న యువకులను ప్రోత్సహిస్తుంది. యంగ్ జనరేషన్‌పై ఫోకస్ పెట్టింది. కానీ ఫార్ములావన్ ఫాలో అవుతున్న యువతులు మాత్రం డ్రైవర్లపై ఫోకస్ పెట్టారు. ఎందుకంటే ఇప్పుడొస్తున్న యంగ్ డ్రైవర్లు మంచి లుక్‌తో కనిపిస్తున్నారు. కేవలం వారిని చూసేందుకు పార్ములా వన్‌కు ఎగబడుతున్నారు.. ఆటపై ఇష్టంతో మాత్రం కాదు'' అంటూ పేర్కొన్నాడు. క్రిస్టియన్ సమాధానం విన్న లారా వుడ్స్ అతనికి ధీటుగా కౌంటర్ ఇచ్చింది. ''ఫార్ములా వన్ను యువతులు ఎక్కువగా చూస్తున్నారని మీరన్న మాట నిజమే.. కానీ డ్రైవర్లపై మోజుతో మాత్రం కాదు.. ఆటను చూసి యువతులు కూడా గొప్ప రేసర్లుగా మారాలని అనుకుంటున్నారు.'' అంటూ పేర్కొంది. కాగా క్రిస్టియన్ వ్యాఖ్యలపై అన్ని వైపలు నుంచి విమర్శలు రావడంతో తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ క్షమాపణ కోరాడు. చదవండి: 423 రోజుల తర్వాత గ్రౌండ్లోకి.. గతం ఒక చీకటి జ్ఞాపకం డబ్బు లేదు.. విరిగిన బ్యాట్‌కు టేప్ వేసి ఆడేవాడిని.. “A lot of young girls watch F1 because all these great-looking young drivers” says Horner. #F1 Listening to the Christian Horner’s opinion : pic.twitter.com/MfpeifwvsV — 𝐑𝐀𝐘 | 𝐒𝐭𝐢𝐥𝐥 𝐈 𝐑𝐢𝐬𝐞 💜 (@RayyLH44) February 22, 2022 Dear Christian Horner, On behalf of the women that watch and love f1 I wanna say something: WE. WATCH. F1. BECAUSE. WE. LIKE. THE. SPORT. WE. DON'T. WATCH. F1. BECAUSE. WE. THINK. THAT. THE. DRIVERS. ARE. HOT. Stop saying such bullshit. Thank you. Yours sincerely Lara — lara || Charles Leclerc wdc year || essereFerrari (@scuderialara) February 22, 2022 christian horner is genuinely a cunt pic.twitter.com/MNAtxeVI3R — cess ⁺✧. 。 (@pogkazuha) February 21, 2022 -
ఎదురులేని వెర్స్టాపెన్
జాండ్వోర్ట్: సొంత ప్రేక్షకుల మధ్య రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్‌స్టాపెన్‌కు తిరుగులేకుండా పోయింది. 36 ఏళ్ల విరామం తర్వాత ఫార్ములావన్ (ఎఫ్1) క్యాలెండర్లో పునరాగమనం చేసిన డచ్ గ్రాండ్‌ప్రిలో ఈ నెదర్లాండ్స్ డ్రైవరే విజేతగా నిలిచాడు. 72 ల్యాప్‌ల పాటు ఆదివారం జరిగిన ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ఆరంభించిన వెర్స్టాపెన్ ఎక్కడా వెనుదిరిగి చూడలేదు. ల్యాప్ ల్యాప్‌కు ఆధిక్యాన్ని పెంచుకుంటూ గమ్యాన్ని అందరికంటే ముందుగా గంటా 30 నిమిషాల 05.395 సెకన్లలో చేరుకుని విన్నర్‌గా నిలిచాడు. సీజన్లో వెర్‌స్టాపెన్‌కిది ఏడో విజయం కాగా... ఓవరాల్‌గా 17వది. 20.932 సెకన్లు వెనుకగా రేసును ముగించిన హామిల్టన్ (మెర్సిడెస్) రెండో స్థానంలో నిలిచాడు. మరో మెర్సిడెస్ డ్రైవర్ బొటాస్ మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. నాలుగు, ఐదు స్థానాల్లో వరుసగా గ్యాస్లీ (ఆల్ఫా టారీ), లెక్లెర్క్ (ఫెరారీ) నిలిచారు. తాజా విజయంతో వెర్స్టాపెన్ డ్రైవర్ చాంపియన్íÙప్లో మళ్లీ అగ్రస్థానాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం అతడు 224.5 పాయింట్లతో తొలి స్థానంలో ఉన్నాడు. మూడు పాయింట్ల తేడాతో హామిల్టన్ (221.5) రెండో స్థానంలో ఉన్నాడు. -
బెల్జియం జీపీ విజేత వెర్స్టాపెన్
స్పా ఫ్రాంకోర్చాంప్స్: వర్షంతో మూడు ల్యాప్లే జరిగిన బెల్జియం గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో రెడ్‌బుల్ డ్రైవర్ వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. భారీ వర్షంతో మూడు గంటలు ఆలస్యంగా... గంట పాటు మాత్రమే సాగేలా సేఫ్టీ కారు నడుమ రేసు ఆరంభమైంది. అయితే మూడు ల్యాప్‌ల అనంతరం ట్రాక్ ప్రతికూలంగా మారడంతో రేసును కొనసాగించడం ప్రమాదమని భావించిన నిర్వాహకులు రేసును నిలిపేశారు. రేసు నిలిచే సమయానికి వెర్స్టాపెన్, రసెల్ (విలియమ్స్), హామిల్టన్ (మెర్సిడెస్) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉండటంతో దానిని తుది ఫలితంగా ప్రకటించారు. తదుపరి డచ్ గ్రాండ్‌ప్రి సెప్టెంబర్ 5న జరగనుంది. -
వెర్స్టాపెన్ ‘పోల్’ సిక్సర్
స్పా ఫ్రాంకోర్ చాంప్స్ (బెల్జియం): ఫార్ములావన్ (ఎఫ్1) తాజా సీజన్లో రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ ఆరోసారి పోల్ పొజిషన్ సాధించాడు. శనివారం జరిగిన బెల్జియం గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ చివరి సెషన్లో ల్యాప్‌ను అందరికంటే ముందుగా ఒక నిమిషం 59.765 సెకన్లలో పూర్తి చేసిన వెర్స్టాపెన్ పోల్ పొజిషన్‌ను దక్కించుకున్నాడు. దాంతో నేడు జరిగే ప్రధాన రేసును అతను తొలి స్థానం నుంచి ఆరంభిస్తాడు. 0.321 సెకన్లు వెనుకగా ల్యాప్‌ను పూర్తి చేసిన విలియమ్స్ డ్రైవర్ జార్జ్ రసెల్ రెండో స్థానంలో నిలవగా... మూడో స్థానంలో మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ నిలిచాడు. నేడు జరిగే ప్రధాన రేసును సాయంత్రం గం. 6:30 నుంచి స్టార్‌స్పోర్ట్స్ సెలెక్ట్–2, హాట్‌స్టార్ ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి -
Lewis Hamilton: వరుసగా ఐదో విజయం!
బార్సిలోనా (స్పెయిన్): ఆరంభంలో ఆధిక్యం కోల్పోయినా... ఎక్కడా తడబడకుండా డ్రైవ్ చేస్తూ... చివరి దశలో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మళ్లీ ఆధిక్యంలోకి వచ్చి... ఆ తర్వాత వెనుదిరిగి చూడకుండా మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ స్పెయిన్ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ (ఎఫ్1) రేసును సొంతం చేసుకున్నాడు. 66 ల్యాప్లపాటు జరిగిన ఈ రేసులో ‘పోల్ పొజిషన్’తో మొదలుపెట్టిన హామిల్టన్‌ను తొలి మలుపు వద్ద రెడ్‌బుల్ డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ ఓవర్టేక్ చేసి ఆధిక్యంలోకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత వెర్స్టాపెన్ దూకుడు కొనసాగించగా... మళ్లీ ఆధిక్యంలోకి వచ్చేందుకు హామిల్టన్ పట్టువదలకుండా ప్రయత్నించాడు. రేసు మరో ఆరు ల్యాప్‌ల్లో తర్వాత ముగుస్తుందనగా హామిల్టన్ వేగాన్ని పెంచి వెర్స్టాపెన్ను ఓవర్టేక్ చేసి ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత మిగతా ఆరు ల్యాప్‌ల్లో వెర్‌స్టాపెన్‌కు ఏమాత్రం అవకాశమివ్వకుండా హామిల్టన్ ట్రాక్‌పై రయ్‌రయ్‌మంటూ దూసుకుపోయి లక్ష్యాన్ని గంటా 33 నిమిషాల 07.680 సెకన్లలో అందుకొని విజేతగా నిలిచాడు. స్పెయిన్ గ్రాండ్‌ప్రిలో హామిల్టన్‌కిది వరుసగా ఐదో విజయంకాగా ఓవరాల్‌గా ఆరోది. హామిల్టన్కంటే ముందు దివంగత దిగ్గజ డ్రైవర్ అయిర్టన్ సెనా (బ్రెజిల్) మాత్రమే ఒకే గ్రాండ్‌ప్రిలో (మొనాకో గ్రాండ్‌ప్రి 1989 నుంచి 1993 వరకు) వరుసగా ఐదేళ్లు విజేతగా నిలిచాడు. ఓవరాల్‌గా హామిల్టన్ కెరీర్లో ఇది 98వ విజయం. తదుపరి రేసు మొనాకో గ్రాండ్‌ప్రి ఈనెల 23న జరుగుతుంది. స్పెయిన్ గ్రాండ్‌ప్రి ఫలితాలు (టాప్–10): 1. హామిల్టన్ (మెర్సిడెస్), 2. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్), 3. బొటాస్ (మెర్సిడెస్), 4. లెక్లెర్క్ (ఫెరారీ), 5. పెరెజ్ (రెడ్‌బుల్), 6. రికియార్డో (మెక్లారెన్), 7. సెయింజ్ (ఫెరారీ), 8. నోరిస్ (మెక్లారెన్), 9. ఒకాన్ (అల్పైన్), 10. గాస్లీ (అల్ఫా టౌరి). -
వెర్‌స్టాపెన్‌కు ‘పోల్’
అబుదాబి: ఫార్ములావన్ (ఎఫ్1) 2020 సీజన్‌లోని చివరి రేసు అబుదాబి గ్రాండ్ప్రిను రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్లో 23 ఏళ్ల వెర్స్టాపెన్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 35.246 సెకన్లలో ల్యాప్‌ను ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ సీజన్లో రెడ్‌బుల్ జట్టు డ్రైవర్‌కు పోల్ పొజిషన్ దక్కడం ఇదే తొలిసారి. మెర్సిడెస్ డ్రైవర్లు బొటాస్, హామిల్టన్ వరుసగా రెండు, మూడు స్థానాల నుంచి రేసును ఆరంభిస్తారు. 17 రేసుల ఈ సీజన్లో 16 రేసులు ముగిశాయి. 11 రేసుల్లో హామిల్టన్ నెగ్గగా... బొటాస్ రెండు రేసుల్లో.. మిగతా మూడు రేసుల్లో వెర్స్టాపెన్, గ్యాస్లీ, పెరెజ్ టైటిల్స్ గెలిచారు. -
మొనాకో చాంప్ రికియార్డో
మొనాకో: రెడ్‌బుల్ డ్రైవర్ డానియెల్ రికియార్డో ఎట్టకేలకు మొనాకో గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచాడు. ఇక్కడ మూడేళ్లుగా టైటిల్ కోసం తన స్పీడుకు పదును పెడుతున్నప్పటికీ... అందని టైటిల్ ఈసారి మాత్రం చేతికందింది. పోల్ పొజిషన్ సాధించిన ఈ రెడ్‌బుల్ డ్రైవర్ టైటిలే లక్ష్యంగా ఆదివారం తన జోరు చూపెట్టాడు. మొదటి స్థానం నుంచి రేసును ఆరంభించిన రికియార్డో 78 ల్యాప్‌ల రేసును గంటా 42 నిమిషాల 54.807 సెకన్లలో పూర్తి చేశాడు. కేవలం 7.7336 సెకన్ల తేడాతో గత విజేత, ఫెరారీ డ్రైవర్ వెటెల్ రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. హామిల్టన్ మూడో స్థానంలో నిలిచాడు. ఫోర్స్ ఇండియా డ్రైవర్లు ఒకాన్ ఆరో స్థానంలో నిలువగా, సెర్గియో పెరెజ్ 12వ స్థానం పొందాడు. సీజన్‌లోని తదుపరి రేసు కెనడా గ్రాండ్‌ప్రి జూన్ 10న జరుగుతుంది. -
రికియార్డో హవా
స్పా (బెల్జియం): క్వాలిఫయింగ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా... ప్రధాన రేసులో మాత్రం రెడ్‌బుల్ డ్రైవర్ డానియెల్ రికియార్డో సత్తా చాటాడు. రోస్‌బర్గ్. బొటాస్, రైకోనెన్ల దూకుడుకు కళ్లెం వేస్తూ ఈ సీజన్లో మూడో విజయాన్ని నమోదు చేశాడు. ఆదివారం జరిగిన బెల్జియన్ గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచాడు. 44 ల్యాప్‌ల రేసును గంటా 24 నిమిషాల 36.556 సెకన్లలో ముగించాడు. ఎఫ్1లో రెడ్‌బుల్ జట్టుకు ఇది 50వ విజయం. పోల్ పొజిషన్‌తో రేసును ప్రారంభించిన రోస్‌బర్గ్ (మెర్సిడెస్) రెండో స్థానంతో సంతృప్తిపడ్డాడు. బొటాస్, రైకోనెన్, వెటెల్ వరుసగా మూడో, నాలుగో, ఐదో స్థానాల్లో నిలిచారు. ఆరంభంలో ఆధిక్యంలో ఉన్న హామిల్టన్.. రెండో ల్యాప్‌లో రోస్‌బర్గ్ కారును ఢీకొట్టాడు. ఫలితంగా టైర్ పంక్చర్ కావడంతో పుంజుకోలేకపోయాడు. 38 ల్యాప్‌ల తర్వాత హామిల్టన్ రేసు నుంచి వైదొలిగాడు. మరో ముగ్గురు కూడా మధ్యలోనే రిటైరయ్యారు. రేసు ఆద్యంతం రోస్‌బర్గ్, రికియార్డోల మధ్య గట్టి పోటీ జరిగింది. కేవలం 3.3 సెకన్ల తేడాతో రోస్‌బర్గ్ వెనుకబడిపోయాడు. పెరెజ్‌కు పాయింట్లు ఈ రేసులో ఫోర్స్ జట్టు డ్రైవర్లు పెరెజ్, హుల్కెన్‌బర్గ్ ఆకట్టుకున్నారు. 13వ గ్రిడ్ నుంచి రేసును ప్రారంభించిన పెరెజ్ 9వ స్థానంలో నిలిచి 4 పాయింట్లు సాధించాడు. మరో డ్రైవర్ హుల్కెన్‌బర్గ్ 18వ గ్రిడ్ నుంచి రేసును ప్రారంభించి 10వ స్థానంతో 1 పాయింట్‌తో సరిపెట్టుకున్నాడు. మొదట మ్యాగ్నుసెన్ ఆరో స్థానంలో నిలిచినా 20 సెకన్ల పెనాల్టీ విధించడంతో అతను 12వ స్థానానికి పడిపోయాడు. దీంతో హుల్కెన్‌బర్గ్ ముందుకొచ్చి 10వ స్థానంలో నిలిచాడు. -
వెటెల్దే ఆధిపత్యం
గ్రేటర్ నోయిడా: వరుసగా మూడో ఏడాది ‘ఇండియన్ గ్రాండ్ ప్రి’ టైటిల్‌పై గురిపెట్టిన రెడ్‌బుల్ డ్రైవర్, డిఫెండింగ్ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ శుక్రవారం జరిగిన రెండు ప్రాక్టీస్ సెషన్లలోనూ దుమ్మురేపాడు. బుద్ధ సర్క్యూట్లో ఉదయం జరిగిన తొలి ప్రాక్టీస్ సెషన్లో ని.1:26.683 సెకన్ల ల్యాప్ టైమింగ్ నమోదు చేశాడు. అయితే మధ్నాహ్నం జరిగిన రెండో ప్రాక్టీస్ సెషన్లో వెటెల్ మరింత మెరుగ్గా డ్రైవ్ చేశాడు. ని. 1:25.722 సెకన్లతో అత్యంత వేగవంతంగా ల్యాప్‌ను పూర్తి చేసి కొత్త రికార్డు సృష్టించాడు. దీంతో రెండు సెషన్లలోనూ టాప్‌లో నిలిచాడు. రెడ్బుల్కు చెందిన మరో డ్రైవర్ మార్క్ వెబెర్ కూడా రెండు సెషన్లలో (1:26.871 సెకన్లు; 1:26.011 సెకన్లు) హవా కొనసాగిస్తూ రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. తొలి ప్రాక్టీస్ (ఎఫ్పీ-1) సెషన్లో నాలుగో స్థానంలో నిలిచిన లోటస్ డ్రైవర్ గ్రోస్జీన్... రెండో ప్రాక్టీస్‌లో 1:26.220 సెకన్ల టైమింగ్‌తో మూడో స్థానంలో నిలవగా... మెర్సిడెస్కు చెందిన లూయిస్ హామిల్టన్ (1:26.399 సెకన్లు) నాలుగో స్థానం దక్కించుకున్నాడు. గేర్‌బాక్స్ సమస్యతో తొలి ప్రాక్టీస్ సెషన్లో 12వ స్థానానికి పరిమితమైన ఫెరారీ డ్రైవర్ ఫెర్నాండో అలోన్సో.... రెండో ప్రాక్టీస్‌లో ఆకట్టుకున్నాడు. 1:26.430 సెకన్ల టైమింగ్‌తో ఐదో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. నికో రోస్బెర్గ్ (మెర్సిడెస్) 1:26.582 సెకన్లతో ఆరోస్థానంలో నిలవగా... ఫెలిప్ మసా (ఫెరారీ) 1:26.601 సెకన్లతో; కిమీ రైకోనెన్ (లోటస్) 1:26.632 సెకన్లతో; మెక్లారెన్ డ్రైవర్లు సెర్గి పెరెజ్ 1:26.857 సెకన్లతో; జెన్సన్ బటన్ 1:26.972 సెకన్లతో వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ‘ఫోర్స్’ విఫలం భారత రేసింగ్ జట్టు ‘ఫోర్స్ ఇండియా’ రెండు ప్రాక్టీస్ సెషన్లలోనూ విఫలమైంది. తొలి ప్రాక్టీస్ సెషన్లో 15వ స్థానంలో నిలిచిన ఆడ్రియన్ సుటిల్... రెండో సెషన్లో 1:27.375 సెకన్ల ల్యాప్ టైమింగ్‌తో 12వ స్థానంలో నిలిచాడు. తొలి ప్రాక్టీస్ సెషన్‌కు దూరంగా ఉన్న పాల్ డి రెస్టా... రెండోసెషన్‌లో 1:27.608 సెకన్లతో 15వ స్థానానికి పరిమితమయ్యాడు. విలియమ్స్ జట్టుకు జరిమానా పిట్ స్టాప్‌లో చేసిన చిన్న తప్పిదానికి విలియమ్స్ జట్టుపై 60వేల యూరోల (రూ. 50 లక్షలు) జరిమానా పడింది. రెండో ప్రాక్టీస్ సెషన్లో విలియమ్స్ డ్రైవర్ పాస్టర్ మల్డొ నాల్డో నడుతుపున్న కారు కుడి టైర్ నట్ ఊడిపోయింది. మరోవైపు తొలి ప్రాక్టీస్ సెషన్లో పిట్‌లైన్ వద్ద కారును వేగంగా నడిపినందుకు లోటస్ డ్రైవర్ కిమీ రైకోనెన్పై 400 యూరోల (రూ.34వేలు) జరిమానా విధించారు.