వెర్‌స్టాపెన్‌కు ‘పోల్‌’ | Verstappen stuns Mercedes by taking first pole of the season in Abu Dhabi | Sakshi
Sakshi News home page

వెర్‌స్టాపెన్‌కు ‘పోల్‌’

Dec 13 2020 3:20 AM | Updated on Dec 13 2020 3:56 AM

Verstappen stuns Mercedes by taking first pole of the season in Abu Dhabi - Sakshi

రెడ్‌బుల్‌ జట్టు డ్రైవర్‌ మాక్స్‌ వెర్‌స్టాపెన్‌

అబుదాబి: ఫార్ములావన్‌ (ఎఫ్‌1) 2020 సీజన్‌లోని చివరి రేసు అబుదాబి గ్రాండ్‌ప్రిను రెడ్‌బుల్‌ జట్టు డ్రైవర్‌ మాక్స్‌ వెర్‌స్టాపెన్‌ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్‌ సెషన్‌లో 23 ఏళ్ల వెర్‌స్టాపెన్‌ అందరికంటే వేగంగా ఒక నిమిషం 35.246 సెకన్లలో ల్యాప్‌ను ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ సీజన్‌లో రెడ్‌బుల్‌ జట్టు డ్రైవర్‌కు పోల్‌ పొజిషన్‌ దక్కడం ఇదే తొలిసారి. మెర్సిడెస్‌ డ్రైవర్లు బొటాస్, హామిల్టన్‌ వరుసగా రెండు, మూడు స్థానాల నుంచి రేసును ఆరంభిస్తారు. 17 రేసుల ఈ సీజన్‌లో 16 రేసులు ముగిశాయి. 11 రేసుల్లో హామిల్టన్‌  నెగ్గగా... బొటాస్‌ రెండు రేసుల్లో.. మిగతా మూడు రేసుల్లో వెర్‌స్టాపెన్, గ్యాస్లీ, పెరెజ్‌ టైటిల్స్‌ గెలిచారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement