abudabi
-
వావ్.. పదహారేళ్ల పడతిలా అబుదాబీ బీచ్‌లో స్టార్ సింగర్
-
అబుదాబిలో బతుకమ్మ సంబరాలు
అబుదాబి, సాక్షి : తెలంగాణ సంప్రదాయానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఉంటున్న తెలంగాణీయులందరు దేశ రాజధాని అయిన అబుదాబి లో జత చేరి అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. అబుదాబి లోని తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యం లో గత నెల రోజులు గా ఈ ఉత్సవాల కు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ అద్భుత కార్యక్రమానికి అబుదాబిలోని ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ వేదిక అయ్యిందియుఏఈ లో ఉన్న వందలాది తెలంగాణ మహిళలు మరియు చిన్నారులు గత నెల రోజులు గా అవిశ్రాంతంగా వివిధ తెలంగాణ నృత్యాల ప్రదర్శనల తయారీ చేశారు. ఎడారి ప్రాంతం కావడం కారణంగా పూలు దొరకడం చాలా కష్టం తోను మరియు చాలా ఖర్చు తో కూడుకున్న వ్యవహారం కావడం తో సంఘ నాయకత్వం ఎక్కువ మోతాదు లో తెలంగాణ నుండి వందలాది కిలోల వివిధ పూలను తెప్పించి అబూ దాబి ని పూల వనంగా మార్చారు. ఇండియా నుండి తెచ్చిన తీరొక్క పూలతో ఘనంగా సామూహిక బతుకమ్మ తయారీ కార్యక్రమాన్ని నిర్వాహకులు పల్లె వాతావరణాన్ని పరిమళించే లా చేశారు. ఈ కార్యక్రమానికి వందలాది తెలంగాణ మహిళలు విచ్చేసి బతుకమ్మ తయారీ ప్రాంగణాన్ని బతుకమ్మ పాట ల తో మార్మోగించారు. శుక్రవారం సాయంత్రం కార్యక్రమ వేదిక అయిన ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ కి రెండు వేల మంది మహిళలు కార్యక్రమ ఆరంభ సమయానికి ముందే చేరుకొని సందడి చేశారు. ఈ తెలంగాణ సంబరాలకు వన్నె తెచ్చేందుకు అందరిని అలరించడానికి మరియు తెలంగాణ వాతావరణానికి మరింత కల తెచ్చేందుకు ప్రముఖ కవి గాయకుడు శ్రీ అష్ట గంగాధర్ మరియు తెలంగాణ వర్ధమాన గాయని శ్రీమతి తేజు ప్రియ ప్రత్యేకంగా ఇండియా నుండి విచ్చేసారు. కార్యక్రమాన్ని తెలంగాణ సంప్రదాయానికి ప్రతిభింబించే లా డప్పు వాయిద్యం మరియు కోలాటాల సందడి మధ్యలో అన్ని బతుకమ్మలను బతుకమ్మ ప్రాంగణానికి తోడ్కొని వెళ్లారుఆ తరువాత తెలంగాణ మహిళలు మరియు చిన్నారులు తెలంగాణ సాంప్రదాయo ఉట్టి పడుతూ చేసిన నృత్య ప్రదర్శనలు సందర్శకులకు కనువిందు చేశాయి. తెలంగాణ నుండి వచ్చిన ఇద్దరు కళాకారులు వివిధ రకాల తెలంగాణ ఆట పాటలతో ప్రేక్షకులను అలరించారు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణ గా జంటల (Couples) నృత్య ప్రదర్శన నిలిచింది. ప్రత్యేకంగా ఇండియా నుండి తెప్పించి అందరికి పంచిన తెలంగాణ పిండి వంటలు కార్యక్రమానికి వచ్చిన తెలంగాణ వారినందరిని విశేషంగా ఆకర్షించాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యుఏఈ భారత రాయబార కార్యాలయ డిప్యూటీ చీఫ్ అఫ్ మిషన్ శ్రీ అమర్నాథ్ అశోకన్ ముఖ్య అతిధి గా మరియు కాన్సులర్ డా: ఆర్. బాలాజీ మరియు కుటుంబ సభ్యులు గౌరవ అతిధులు గా హాజరు అయ్యారు. వారు కూడా తెలంగాణ మహిళ ల తో బతుకమ్మ ఆడి పాడారు. తదనంతరం కార్య నిర్వాహకులు 10 అందమైన బతుకమ్మలకు, ప్రాంగణానికి మొదటగా వచ్చిన 3 బతుకమ్మలకు, అందంగా ముస్తాబైన చిన్నారులకు, చక్కగా బతుకమ్మ నాట్యం చేసిన మహిళలకు మరియు జంటలకు బహుమతి ప్రధానం చేశారు. ఈ కార్యక్రమ ముఖ్య దాతలు టైటిల్ స్పాన్సర్ గా సంపంగి గ్రూప్ మరియు కో స్పాన్సర్ గా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఏ ఎక్స్ ప్రాపర్టీస్, బ్యూటీ డెంటా కేర్ వారిని నిర్వాహుకులు ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమానికి విశేష అతిథులుగా అబుదాబి బాప్స్ హిందూ మందిర్ డైరెక్టర్ శ్రీ ప్రణవ్ దేశాయ్ మరియు వారి కుటుంబ సభ్యులు హాజరు అయి తెలంగాణ మహిళలందరితో బతుకమ్మ ఆడారు. చివరగా గౌరీ పూజ చేసి బతుకమ్మ నిమజ్జనం కృతిమ కొలను లో చేసి ప్రసాదాలు పంచి, విందు భోజనం ఆరగించారు ఈ కార్యక్రమాన్ని రాజశ్రీనివాస రావు, గోపాల్, వంశీ, శ్రీనివాస్, సాగర్, గంగన్న, సంతోష్, జగదీష్, అశోక్ , శ్రీనివాస్ రెడ్డి, పావని, అర్చన, పద్మజ, లక్ష్మి, నిధి తదితరులు దగ్గర ఉండి నడిపించారు. బతుకమ్మ ఉత్సవాలు విదేశాలలో కూడా ఇంత ఘనంగా జరుపుకోవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని కార్య నిర్వాహకులు రాజశ్రీనివాస రావు తెలియజేశారు. -
ఇండిగో కీలక ప్రకటన.. బెంగళూరు నుంచి అబుదాబి డైరెక్ట్ ఫ్లైట్
ప్రముఖ ఎయిర్‌లైన్ సంస్థ ఇండిగో.. అబుదాబీకి పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఆగష్టు 1నుంచి బెంగళూరు - అబుదాబి మధ్య డైరెక్ట్ ఫ్లైట్ ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.భారతీయ ప్రయాణికులకు సేవలందించడం మాత్రమే కాదు, అంతర్జాతీయ పర్యటనను కూడా సులభతరం చేయడానికి ఇండిగో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇండిగో వారానికి ఆరు సార్లు బెంగళూరు నుంచి అబుదాబికి, అబుదాబి నుంచి బెంగళూరుకు ఫ్లైట్స్ నడపడానికి సిద్ధమైంది.బెంగళూరు నుంచి 6E 1438 విమానం మంగళవారం మినహా ప్రతి రోజూ రాత్రి 9:25 గంటలకు బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయం నుంచి బయలుదేరి రాత్రి 11:30 గంటలకు అబుదాబి చేరుకుంటుంది. అదే విధంగా బుధవారం మినహా అబుదాబి నుంచి అర్ధరాత్రి 12:30 గంటలకు బయలుదేరి 6E 1439 విమానం మరుసటి రోజు ఉదయం 5:45 గంటలకు కెంపెగౌడ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుంది.బెంగళూరు నుంచి అబుదాబి వెళ్లాలనుకునే వారికి ఇండిగో చేసిన ప్రకటన ఓ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. సంస్థ తన పరిధిని ఎప్పటికప్పుడు విస్తరిస్తూ.. ప్రజలకు తమదైన రీతిలో సేవలందిస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ప్రయాణికుల అవసరాలను బట్టి తన సర్వీసును మరింత పెంచనున్నట్లు సమాచారం. -
అబుదాబిలో తొలి హిందూ ఆలయాన్ని ప్రారంభించిన మోదీ
అబుధాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) రాజధాని అబుదాబిలో ఏకంగా 27 ఎకరాల్లో సువిశాలమైన బోచసన్వాసి శ్రీ అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ (బీఏపీఎస్) మందిరాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. యూఏఈలోనే గాక మొత్తం మధ్యప్రాచ్యంలోనే పూర్తి హిందూ సంప్రదాయ రీతుల్లో నిర్మితమైన తొలి రాతి ఆలయమిది. భారత్‌తో యూఏఈ పటిష్ట బంధానికే గాక ఆ దేశ మత సామరస్యానికి కూడా ప్రతీకగా ఈ మందిరం అలరారనుంది. ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అక్షయ్ కుమార్, వివేక్ ఒబెరాయ్, మ్యూజిక్ కంపోజర్ శంకర్ మహదేవన్ హాజరయ్యారు. #WATCH | Prime Minister Narendra Modi at the Bochasanwasi Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS) Mandir in Abu Dhabi. pic.twitter.com/mUW34PpJfL — ANI (@ANI) February 14, 2024 ఆలయ విశేషాలెన్నో... బాప్స్ ఆలయం ప్రత్యేకతలు అన్నీ ఇన్నీ కావు. దాదాపు 30 లక్షల దాకా భారతీయులున్న యూఏఈలో ఆలయాలు లేకపోలేదు. దుబాయ్‌లో ఇప్పటికే రెండు హిందూ దేవాలయాలు, ఒక సిక్కు గురుద్వారా ఉన్నాయి. అయితే అవి చూసేందుకు విల్లాల మాదిరిగా ఉంటాయి. యూఏఈ మొత్తంలో పూర్తి హిందూ శైలిలో రూపొందిన తొలి ఆలయం బాప్స్ మందిరమే... ► ఇది దుబాయ్–అబుదాబి హైవే సమీపంలో వద్ద 27 ఎకరాల్లో నిర్మితమైంది. ► దీని నిర్మాణానికి రూ.700 కోట్లు ఖర్చయింది. మొత్తం నిర్మాణం బాప్స్ సంస్థ కనుసన్నల్లో జరిగింది. ► 108 అడుగల ఎత్తు, 262 అడుగుల పొడవు, 180 అడుగుల వెడల్పుతో మొత్తం 55 వేల చదరపు మీటర్ల వైశాల్యంలో ఆలయం రూపుదిద్దుకుంది. ► దీని నిర్మాణానికి దాదాపు మూడున్నరేళ్లు పట్టింది. రాజస్తాన్, గుజరాత్‌కు చెందిన 2 వేల మందికి పైగా కార్మికులు, నిపుణులు మూడేళ్ల పాటు శ్రమించి 402 తెల్లని పాలరాతి స్తంభాలను చెక్కారు. ► ఆలయ నిర్మాణంలో స్టీల్, కాంక్రీట్, సిమెంట్ ఏ మాత్రమూ వాడలేదు. అయోధ్య రామాలయం మాదిరిగానే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో రాళ్ల వరుసలను నేర్పుగా పరస్పరం కలుపుతూ పోయారు. ► ఆలయం నిర్మాణంలో ఉపయోగించిన పాలరాతి తదితరాలను పూర్తిగా రాజస్తాన్‌లోని భరత్పూర్ నుంచి, శిల్పాలను భిల్వారా నుంచి తెప్పించారు. లోపలి నిర్మాణాల్లో ఇటాలియన్ మార్బుల్ వాడారు. ► మందిర పునాదుల్లో 100కు పైగా సెన్సర్లను కూడా ఏర్పాటు చేయడం విశేషం. భూకంపాలతో పాటు ఉష్ణోగ్రత, ఒత్తిళ్లు తదితరాల్లో మార్పులను ఇవి ఎప్పటికప్పుడు పట్టిస్తాయి. ► వీటిని మొత్తం 25 వేల పై చిలుకు విడి భాగాలుగా భారత్‌లో నిపుణులైన పనివాళ్లతో తయారు చేయించి యూఈఏలో జోడించడం విశేషం! ► ఆలయ కాంప్లెక్సులో ప్రార్థన మందిరం, సందర్శకుల కేంద్రం, థీమాటిక్ గార్డెన్లు, గ్రంథాలయం, గ్యాలరీ, ఎగ్జిబిషన్ సెంటర్లు, ఏకంగా 5,000 మంది పట్టే రెండు కమ్యూనిటీ హాళ్లతో పాటు ప్రత్యేకించి పిల్లల కోసం ఆటస్థలం కూడా ఉన్నాయి. ► మందిర ప్రారంభోత్సవంలో పాల్గొనాలనుకునే వారికోసం ఆన్లైన్ రిజి్రస్టేషన్ పోర్టల్ ప్రారంభించారు. సోమవారం ఆలయంలో యజ్ఞం నిర్వహించారు. #WATCH | Prime Minister Narendra Modi performs Aarti at the Bochasanwasi Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS) Mandir, the first Hindu temple in Abu Dhabi. pic.twitter.com/PP5OwWFRxH — ANI (@ANI) February 14, 2024 ఏడు ఎమిరేట్లకు ప్రతీకగా... ► ఆలయంలోని ఏడు గోపురాలను యూఏఈలోని ఏడు ఎమిరేట్లకు ప్రతీకగా తీర్చిదిద్దడం మరో విశేషం. ► రామాయణ ఇతివృత్తాలను ఆలయ గోడలపై అందంగా చెక్కారు. ► ఆలయం బయటి గోడలపై ప్రపంచ ప్రసిద్ధ నాగరికతలన్నింటినీ చక్కగా చెక్కారు. తద్వారా ఈ ఆలయాన్ని మత సామరస్యానికి ప్రతీకగా తీర్చిదిద్దారు. ► భక్తుల బస తదితరాలకు ఆలయ సమీపంలో భవనం కూడా ఏర్పాటైంది. దీన్ని అరేబియన్, ఇస్లామిక్ వాస్తు రీతుల్లో నిర్మించడం విశేషం. ఇలా పురుడు పోసుకుంది... ► 2014లో మోదీ తొలిసారి ప్రధాని పదవి చేపట్టిన కొద్దికాలానికే ఈ హిందూ ఆలయ నిర్మాణానికి బీజం పడింది. 2015లో మోదీ యూఏఈ పర్యటన అనంతరం వేగం పుంజుకుంది. 1981 తర్వాత అక్కడ పర్యటించిన తొలి భారత ప్రధాని మోదీయే. ఇప్పటిదాకా యూఏఈలో ఆరుసార్లు పర్యటించారాయన. తాజాగా ఏడో పర్యటనలో ఉన్నారు. ► 2015 పర్యటన సందర్భంగా యూఏఈ యువరాజుగా ఉన్న షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో పలు అంశాలపై మోదీ లోతుగా చర్చలు జరిపారు. ► ఆ వెంటనే ఆలయ నిర్మాణానికి యూఈఏ సర్కారు నిర్ణయం తీసుకోవడమే గాక 13.5 ఎకరాల భూమి కూడా కేటాయించింది. అనంతరం 2019లో మత సహన ఏడాది ఉత్సవాల సందర్భంగా ఈ ఆలయానికి మరో 13.5 ఎకరాలు ప్రకటించింది. అలా ఆలయానికి 27 ఎకరాల భూమి సమకూరింది. ► 2018లో మోదీ తన రెండో యూఏఈ పర్యటన సందర్భంగా బాప్స్ హిందూ ఆలయ నిర్మాణానికి దుబాయ్ ఒపెరా హౌజ్ నుంచి వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపన చేశారు. -
ICC: బంగ్లాదేశ్ క్రికెటర్‌పై రెండేళ్ల నిషేధం.. ఐసీసీ ప్రకటన
Bangladesh all-rounder banned from all cricket: బంగ్లాదేశ్ క్రికెటర్ నాసిర్ హొసేన్‌కు అంతర్జాతీయ క్రికెట్ మండలి భారీ షాకిచ్చింది. రెండేళ్ల పాటు క్రికెట్ ఆడకుండా అతడిపై నిషేధం విధించింది. ఐసీసీ అవినీతి నిరోధక నియమావళిని ఉల్లంఘించినందుకుగానూ ఈ నిర్ణయం తీసుకుంది. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి మంగళవారం ప్రకటన విడుదల చేసింది. అబుదాబి టీ10 లీగ్‌లో 2020-21 సీజన్‌కు గానూ పుణె డెవిల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన నాసిర్ హుసేన్.. మరో ఏడుగురితో కలిసి మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఐసీసీ అవినీతి నిరోధక విభాగం సెప్టెంబరు, 2023లో అభియోగాలు నమోదు చేసింది. తప్పు చేశాడని తేలింది ఈ అంశంపై దృష్టి సారించిన ఐసీసీ అవినీతి నిరోధక విభాగం విచారణ చేపట్టగా నాసిర్ హుసేన్ తప్పు చేసినట్లు తేలింది. ఖరీదైన ఐఫోన్ 12ను బహుమతిగా పొందడం సహా ఫిక్సింగ్‌కు సంబంధించి ఆ ఫోన్లో బుకీలతో మాట్లాడటం.. ఈ విషయాల గురించి ఏ దశలోనూ అవినీతి నిరోధక విభాగంతో సంప్రదించకపోవడం, విచారణలో సహకరించకపోవడం అతడిపై వేటుకు కారణమైంది. మళ్లీ అపుడే రీఎంట్రీ సాధ్యం కాగా తాజా నిషేధం నేపథ్యంలో.. మళ్లీ 2025 ఏప్రిల్ 7 తర్వాతనే నాసిర్ హుసేన్ అంతర్జాతీయ క్రికెట్ ఆడే అవకాశం ఉంటుంది. ఇక స్పిన్ ఆల్‌రౌండర్ అయిన నాసిర్ హుసేన్ బంగ్లాదేశ్ తరఫున 19 టెస్టులు, 65 వన్డేలు, 31 టీ20లు ఆడాడు. ఆఖరిసారిగా 2018లో బంగ్లా జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు ఈ 32 ఏళ్ల ఆల్‌రౌండర్. చదవండి: అతడు ఎవరినీ కాపీ కొట్టడం లేదు.. హార్దిక్ తిరిగొస్తే తలనొప్పి: టీమిండియా దిగ్గజం -
అబుదాబిలో బతుకమ్మ సంబరాలు!
అబుదాబిలోని తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్లో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. యూఏఈలోని వందలాది మంది తెలంగాణ మహిళలు చిన్నారులు తెలంగాణ నుంచి తీసుకువచ్చిన పువ్వులతో బతుకమ్మను తయారుచేసి అందులో గౌరీదేవిని ప్రతిష్టించి పూజలు చేశారు. బతుకమ్మను కోలాటాల మధ్య ఆడిటోరియం కు తీసుకువచ్చి బతుకమ్మ ఆటలాడారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూఏఈ భారత రాయబార కార్యాలయ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ అమర్నాథ్ అశోక ను. కౌన్సిలర్ ఆర్ బాలాజీ కుటుంబ సభ్యులతో కలిసి హాజరై బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. అనంతరం ఉత్తమ బతుకమ్మలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు రాజా శ్రీనివాస్ గోపాల్ వంశీ కమలాకర్ శ్రీనివాస్ సాగర్ గంగన్న సంతోష్ జగదీష్ శ్రీనివాస్ రెడ్డి పావని అర్చన పద్మజ లక్ష్మీ సుధా పాల్గొన్నారు. (చదవండి: జర్మనీలో అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకలు) -
అంబానీ కంపెనీతో ఏడీఏఐ డీల్.. వేలకోట్లు పెట్టుబడికి సిద్ధం!
అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (ADIA).. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్‌లో 0.59 శాతం వాటా కోసం రూ. 4,966.80 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపింది. ఇది దేశంలోని ఈక్విటీ విలువ ప్రకారం మొదటి నాలుగు కంపెనీలలో ఒకటిగా ఉందని రిలయన్స్ ఇండస్ట్రీస్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ కింద ఉన్న 'రిలయన్స్ రిటైల్' సంస్థ ఇషా అంబానీ ఆధ్వర్యంలో ముందుకు సాగుతోంది. ఈమె గత కొన్ని సంవత్సరాలుగా తన వ్యాపారాన్ని జోరుగా ముందుకు తీసుకెళ్లడం మీద దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగానే రిలయన్స్ రిటైల్ దాని అనుబంధ సంస్థలు, అసోసియేట్స్ ద్వారా వేగంగా డెవలప్ అవుతోంది. కొన్ని నివేదికల ప్రకారం.. రిలయన్స్ రిటైల్ కంపెనీ కింద ఏకంగా 18,500 కంటే ఎక్కువ స్టోర్స్ ఉన్నట్లు.. దీని ద్వారా సుమారు 26.7 కోట్ల మంది వినియోగదారులకు సేవలు అందిస్తున్నట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్‌లో భాగస్వామి అయిన అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (ADIA)కి ఎల్లప్పుడూ మా మద్దతు ఉంటుందని, ఈ పెట్టుబడి భారత ఆర్థిక వ్యవస్థ, మా వ్యాపార ప్రాథమిక అంశాలు, వ్యూహం, అమలు సామర్థ్యాలపై మీద ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తుందని ఇషా అంబానీ అన్నారు. రానున్న రోజుల్లో రిటైల్ రంగంలో మార్పులు వేగవంతంగా పెరిగే అవకాశం ఉంది. ఇదీ చదవండి: ఉద్యోగం పోయి చాలా రోజులైంది.. అప్పటి నుంచి.. మెటా మాజీ ఉద్యోగి పోస్ట్ వైరల్! ఇక ఏడీఐఏ ప్రైవేట్ ఈక్విటీ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హమద్ షాహ్వాన్ అల్ధహేరి మాట్లాడుతూ.. రోజు రోజుకి వేగంగా అభివృద్ధి చెందుతున్న రిలయన్స్ రిటైల్స్‌లో పెట్టుబడి పెట్టడం ఆనందంగా ఉందని, ఈ పెట్టుబడి సంస్థలో ప్రత్యేక మార్పును తీసుకువస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ డీల్ కోసం మోర్గాన్ స్టాన్లీ ఆర్థిక సలహాదారుగా వ్యవహరించనున్నట్లు సమాచారం. -
అదానీలో పెట్టుబడుల జోష్: అబుదాబి ఆయిల్ మేజర్ వేల కోట్ల ప్లాన్!
UAE TAQA seeks to investment: షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ నివేదికతో ఇబ్బందుల్లోపడిన అదానీ గ్రూపు ప్రస్తుతం పెట్టుబడుల విషయంలో దూసుకుపోతోంది. వేల కోట్ల రూపాయలు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు అందుకోనుంది. అదానీకి చెందిన పవర్ కంపెనీ GQG, గోల్డ్‌మాన్ సాచ్స్ పెట్టుబడుల తర్వాత మరో డీల్ సాధించ నుంది. అబుదాబికి చెందిన TAQA అదానీ సంస్థల్లో 2.5 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడి పెట్టాలని యోచిస్తోందని మీడియా నివేదికల ద్వారా తెలుస్తోంది. (అదిరిపోయే లుక్‌లో మహీంద్ర థార్ ఎలక్ట్రిక్ వెర్షన్) తాజాగా అబుదాబి నేషనల్ ఎనర్జీ కంపెనీ PJSC(TAQA) తన వ్యాపారాన్ని విస్తరించేందుకు గౌతమ్ అదానీకి చెందిన పవర్ బిజినెస్‌లలో పెట్టుబడి పెట్టాలని చూస్తోంది. అదానీ గ్రూప్ సంస్థలలో లేదా ఏదైనా ఒక సంస్థలో 1.5-2.5 బిలియన్ల డాలర్ల పెట్టుబడుల నిమిత్తంTAQA చూస్తోందిన ఎకనామిక్ టైమ్స్‌లోని ఒక నివేదిక తెలిపింది. ఉత్తర ఆఫ్రికా, పశ్చిమాసియాలోని ప్రాజెక్టులపై సంయుక్తంగా పనిచేయాలని చూస్తున్నాయని తెలిపింది. ఇవి థర్మల్ ఉత్పత్తి నుండి క్లీన్ ఎనర్జీ అండ్ గ్రీన్ హైడ్రోజన్ వరకు వివిధ నిలువు వరుసలలో విస్తరించి ఉన్నాయని పేర్కొంది. ప్రాథమిక ఇన్ఫ్యూషన్ , ప్రమోటర్ ఫ్యామిలీ ఎంటిటీల నుండి షేర్లను సెకండరీ కొనుగోలు చేయడం ద్వారా అదానీ గ్రూప్ సంస్థలలో 19.9 శాతం వరకు వాటాను కొనుగోలు చేయనుంది. (సంక్షోభం: చైనా రియల్ ఎస్టేట్ దిగ్గజం ఎవర్‌గ్రాండే సంచలనం) అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రస్తుత విలువ రూ. 91,660 కోట్లు, ప్రమోటర్లు 68.28 శాతం వాటాను కలిగి ఉన్నారు. ప్రస్తుత ధరల ప్రకారం, దాదాపు 20 శాతం వాటా అంటే రూ. 18,240 కోట్ల పెట్టుబడి (2.19 బిలియన్లడాలర్లు) TAQA పెట్టనుంది. అబుదాబి సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ (ADX)లో లిస్టెడ్ కంపెనీ TAQA నాలుగు ఖండాల్లోని 11 దేశాలలో పనిచేస్తున్న అంతర్జాతీయ ఇంధన మరియు నీటి సంస్థ. కాగా గత వారం, ఖతార్ వెల్త్ ఫండ్ ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ అనుబంధ సంస్థ 500 మిలియన్ డాలర్ల బ్లాక్ డీల్ ద్వారా అదానీ గ్రీన్ ఎనర్జీలో వాటాను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. -
దుబాయ్‌లో భారతీయుడి జాక్‌పాట్.. నెలకు రూ.5.59 లక్షలు..
అబుదాబి: యూపీకి చెందిన ఖాన్ దుబాయ్‌లో మెగా ప్రైజ్ గెలుచుకున్నాడు. బహుమతిగా అతను మరో 25 ఏళ్లపాటు నెలకు 25 వేలు దేనారాలు (రూ.5.59 లక్షలు) సొంతం చేసుకోనున్నాడు. దుబాయ్‌లోని ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో ఆర్కిటెక్టుగా పనిచేసున్న మహమ్మద్ అడిల్ ఖాన్ టైఖేరోస్ సంస్థ నిర్వహించిన ఫాస్ట్ 5 ఎమిరేట్స్ డ్రాలో మొట్టమొదటి విజేతగా నిలిచాడు. ఈ మేరకు కంపెనీ మార్కెటింగ్ హెడ్ పాల్ చాడర్ మాట్లాడుతూ ఈ డ్రా మొదలుపెట్టిన ఎనిమిది వారాల్లోపే మొట్టమొదటి విజేతను ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. ఈ మెగా ఎమిరేట్స్ డ్రాలో విజేతగా ఖాన్ పేరును ప్రకటిస్తూ బహుమతిగా ఆయనకు 25 సంవత్సరాల పాటు నెలకు 25 వేలు దేనారాలు (రూ.5.59 లక్షలు) చొప్పున ఇవ్వనున్నట్లు తెలిపారు. యూపీకి చెందిన ఖాన్ మాట్లాడుతూ.. ఈ నిజాన్ని నేను నమ్మలేకపోతున్నాను. మా ఇంట్లో వాళ్లకి ఈ విషయాన్ని చెబితే వారు కూడా నమ్మలేదు. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోమన్నారు. మా కుటుంబంలో నేనొక్కడినే పనిచేస్తుంటాను. మా అన్నయ్య కరోనా సమయంలో చనిపోయారు. అన్నయ్య కుటుంబాన్ని కూడా నేనే చూసుకోవాలి. వయసు మీదపడిన తల్లిదండ్రుల తోపాటు నాకొక ఐదేళ్ల పాప కూడా ఉందని, ఈ బహుమతి నాకు సరైన సమయంలోనే అందిందనుకుంటున్నానని అన్నాడు. ఇది కూడా చదవండి: 11 మంది కలిసి రూ.10 కోట్లు గెలుచుకున్నారు.. -
సొంత కరెన్సీలోనే చెల్లింపులు
అబుధాబి: భారత్–యూఏఈ సంబంధాలు మరో కీలక మైలురాయికి చేరుకున్నాయి. వాణిజ్య చెల్లింపులను ఇకపై సొంత కరెన్సీలోనే చేపట్టాలని రెండు దేశాలు నిర్ణయించుకున్నాయి. ఫ్రాన్సులో పర్యటన ముగించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ తిరుగు ప్రయాణంలో శనివారం యూఏఈ రాజధాని అబుదాబిలో ఆగారు. అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో సమావేశమయ్యారు. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సెపా) కుదిరిన ఏడాదిలోనే రెండు దేశాల మధ్య వాణిజ్యం 20 శాతం మేరకు పెరగడంపై నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం 85 బిలియన్ డాలర్లుగా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యం ఈ ఏడాది సెపె్టంబర్లో ఢిల్లీలో జరిగే జీ20 భేటీ సమయానికి 100 బిలియన్ డాలర్లకు చేరుకోవాలని ఆకాక్షించారు. వాణిజ్య చెల్లింపులను సొంత కరెన్సీలోనే చేపట్టాలని, ఇండియన్ యూనిఫైడ్ పేమెంట్స్ వ్యవస్థ(యూపీఐ)ను యూఏఈకి చెందిన ఇన్స్టంట్ పేమెంట్ ప్లాట్‌ఫాం(ఐపీపీ)తో అనుసంధానం చేయాలని అంగీకారానికి వచ్చారు. రెండు దేశాల పేమెంట్స్ మెసేజింగ్ సిస్టమ్స్‌ను లింక్ చేసే విషయం పరిశీలించాలని కూడా నిర్ణయించారు. ఢిల్లీ ఐఐటీ క్యాంపస్‌ను యూఏఈలో ఏర్పాటు చేసే విషయమై రెండు దేశాల విద్యాశాఖాధికారులు ఎంవోయూపై సంతకాలు చేశారు. పరస్పర వాణిజ్య చెల్లింపులను భారత్ కరెన్సీ రూపాయి, యూఏఈ కరెన్సీ దిర్హంలో చేసేందుకు ఉద్దేశించిన ఎంవోయూపై రెండు దేశాల సెంట్రల్ బ్యాంకుల ప్రతినిధులు సంతకాలు చేశారని మోదీ తెలిపారు. ఇరు దేశాల మధ్య బలపడుతున్న ఆర్థిక సహకారం, పరస్పర విశ్వాసానికి ఇది నిదర్శనమన్నారు. ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సు కాప్28 అధ్యక్ష బాధ్యతల్లో ఉన్న యూఏఈకి భారత్ మద్దతుగా నిలుస్తుందని ప్రధాని తెలిపారు. మరింత సుస్థిర అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై కాప్28 అధ్యక్షుడిగా నియమితులైన సుల్తాన్ అల్ సబేర్తో చర్చించానన్నారు. కాప్28 వార్షిక సమావేశాలు దుబాయ్‌లో నవంబర్ 30 నుంచి డిసెంబర్ 12వరకు జరగనున్నాయి. ఈ సమావేశాలకు మోదీని సబేర్ ఆహా్వనించారు. పర్యావరణ మార్పులకు గురైన దేశాలకు వాగ్దానం ప్రకారం 100 బిలియన్ డాలర్ల సాయం అందించాలని సంపన్న మోదీ, అల్ నహ్యాన్ సంయుక్త ప్రకటనలో కోరారు. ‘‘యూఏఈ అధ్యక్షునితో భేటీ సంతోషం కలిగించింది. అభివృద్ధిపై ఆయన దార్శనికత ప్రశంసనీయం. భారత్–యూఏఈ సంబంధాలపై సమగ్రంగా చర్చించాం’’ అని మోదీ ట్వీట్ చేశారు. అంతకుముందు అబుధాబి అధ్యక్ష భవనం వద్ద నహ్యాన్ మోదీకి ఎదురేగి ఆత్మీయ ఆలింగనంతో స్వాగతం పలికారు. మోదీ సైనిక వందనం స్వీకరించారు. అనంతరం మోదీకి నహ్యాన్ విందు ఇచ్చారు. రాత్రికి ప్రధాని భారత్ చేరుకున్నారు. యూఏఈ సెంట్రల్ బ్యాంకుతో ఒప్పందం అన్ని లావాదేవీలకూ వర్తిస్తుందని ఆర్బీఐ తెలిపింది. ‘‘పెట్టుబడులు, రెమిటెన్స్‌లకు దీనితో ఊతం లభిస్తుంది. యూఏఈలోని భారతీయులకు లావాదేవీల చార్జీలు తగ్గడమే గాక సమయం కూడా కలిసొస్తుంది’’ అని తెలిపింది. -
కత్రినా కైఫ్ భర్త విక్కీ కౌశల్‌ను నెట్టేసిన సల్మాన్ బాడీగార్డ్స్.. వీడియో వైరల్
బాలీవుడ్ హీరో, కత్రినా కైఫ్ భర్త విక్కీ కౌశల్‌కు చేదు అనుభవం ఎదురైంది. అబుదాబీ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఐఎఫ్ఏ) అవార్డుల కార్యక్రమంలో విక్కీ కౌశల్‌పై బాడీగార్డ్స్‌తో పాటు సల్మాన్ కూడా దురుసుగా ప్రవర్తించారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. IIFA 2023 అవార్డు వేడుకకి పలువురు బాడీవుడ్ స్టార్స్ సందడి చేశారు. ఈ క్రమంలో ఓ అభిమానితో విక్కీ సెల్ఫీ దిగుతుండగా సల్మాన్ ఖాన్ ఎంట్రీ ఇచ్చాడు. ఆయన అక్కడికి రావడంతో సల్మాన్ బాడీగార్డ్స్ అత్యుత్సాహంతో విక్కీ కౌశల్‌ను పక్కకు నెట్టివేశారు. అయినా సరే పెద్దగా పట్టించుకోని విక్కీ సల్మాన్‌ను పలకరించేందుకు ముందుకు వెళ్లగా సల్మాన్ మాత్రం ఏమీ పట్టనట్లుగా, సరిగా మాట్లాడకుండానే వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు.. సల్మాన్‌ఖాన్ బాడీగార్డ్స్ ప్రవర్తించిన తీరుపై మండిపడుతున్నారు. అంతేకాకుండా తోటి నటుడితో ఎలా ప్రవర్తించాలో కూడా సల్మాన్‌కు తెలియదా? అంత మర్యాద లేదా అంటూ అతడి తీరుపై కూడా ఫైర్ అవుతున్నారు. -
IWF: అబుదాబిలో వైభవంగా జరిగిన గ్రాండ్ ఫినాలే - ఫోటోలు
ఇండియా సోషల్ సెంటర్ (ISC ) అబుదాబిలో ప్రవాసీ భారతీయుల ప్రముఖ సాంఘిక సంక్షేమ కేంద్రంగా గత 56 సంవత్సరాలుగా సేవలు అందిస్తుంది. ఆ సంఘం మహిళా విభాగం 'ఇండియన్ ఉమెన్ ఫోరమ్' (IWF) మహిళా సాధికారత సధించే విషయంలో ముందంజలో ఉంది. సంవత్సరాంతం IWF సంస్థ మహిళలే ప్రాధాన్యతగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తారు. IWF వారు 2022 - 2023 సంవత్సరం గ్రాండ్ ఫినాలే కార్యక్రమాన్ని ఎంతో అంగరంగ వైభవంగా ISC ముఖ్య ప్రాంగణంలో గత శుక్రవారం రాత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారత రాయబార కార్యాలయానికి చెందిన డీసీఎం భార్య జాహ్నవి అమర్నాథ్ ముఖ్య అథితిగా పాల్గొన్నారు. ఇండియా సోషల్ సంటర్ యాజమాన్యం కూడా ఇతర అతిథిలుగా రావడం విశేషం. ఈ కార్యక్రమంలో ప్రవాసీ భారతీయులు ఎంతో ఉత్సాహంతో భారతీయత ఉట్టిపడేలా కథక్, భరత నాట్యం , కూచిపూడి ప్రదర్శించారు. అంతే కాకుండా మొత్తం కార్యక్రమానికి తలమానికంగా నిలిచిన 'యూనిటీ ఇన్ డైవర్సిటీ కాన్సెప్ట్'తో చేసిన 29 రాష్ట్రాల వేషధారణ అందరిని ఎంతగానో ఆకట్టుకుందని కార్య నిర్వాహకులు షీలా మీనన్, పావని ఐత, ఐనీష్, అనూజ, శిల్ప, దీప తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రాన్ని రెప్రెజెంట్ చేస్తూ వచ్చిన ఇద్దరు మహిళలు తెచ్చిన బోనం, బ్రతుకమ్మ విశేష ఆకర్షణగా నిలిచాయి. 2022-23 సంవత్సరం IWF కార్యక్రమాలను విజయవంతంగా కొనసాగించినందుకు ముఖ్య కార్యకర్తలకు ముఖ్య అతిధి జాహ్నవి జ్ఞాపికలను అందించారు. అంతే కాకుండా కార్యక్రమంలో పాల్గొన్న ఒక్కరికి యాజమాన్యం బహుమతులు అందించింది. -
వివాదాల నడుమ అదానీకి భారీ ఊరట: వేల కోట్ల లైఫ్‌లైన్
సాక్షి,ముంబై: అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలతో అతలాకుతలమవుతున్న వేళ అదానీకి భారీ ఊరట లభించింది. ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్‌పీవో)కి వచ్చిన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో అబుదాబి కంపెనీ భారీ పెట్టుబడులను ప్రకటించింది. రూ. 20వేల కోట్ల ఎఫ్‌పీవోలో 16 శాతం సబ్‌స్క్రిప్షన్‌ను ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ (ఐహెచ్సీ) ఇక్కిందిచుకుంది 2023లో ఐరోపా, ఆఫ్రికా, ఆసియా, దక్షిణ అమెరికాలో దృష్టితోపాటు, స్థానిక, అంతర్జాతీయ పెట్టుబడుల్లో ఈ ఏడాది ఇదే తమ తొలి పెట్టుబడి అని కంపెనీ పేర్కొంది. (అదానీ గ్రూప్ దేశ భవిష్యత్తును వెనక్కి లాగుతోంది:అదానీకి హిండెన్‌బర్గ్ కౌంటర్) అబుదాబి కంపెనీ ఐహెచ్‌సీకి చెందిన అనుబంధ సంస్థ గ్రీన్ ట్రాన్స్మిషన్ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్ ద్వారా అదానీ ఎంటర్ప్రైజెస్ ఎఫ్‌పీవోలో 400 మిలియన్ డాలర్లు (రూ. 3,200 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు సోమవారం తెలిపింది. అదానీ గ్రూప్‌పై తమ ఆసక్తి, అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ఫండమెంటల్స్‌పై నమ్మకంతో, బలమైన వృద్ధిని తన వాటాదారులను అదనపు విలువును ఆశిస్తున్నామని ఐహెచ్సీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సయ్యద్ బాసర్ షుబ్ అన్నారు. క్లీన్ ఎనర్జీ , ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో 2023లో గ్లోబల్ అక్విజిషన్ను 70శాతం వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు అదానీ ఎంటర్ప్రైజెస్ ఎఫ్‌పీవో రెండో రోజు కేవలం 3 శాతం సబ్‌స్క్రైబ్ అయింది. ఈక్విటీ షేర్‌కు రూ. 3,112 ,రూ. 3,276 ప్రీమియం ప్రైస్ బ్యాండ్ వద్ద ఇష్యూ మంగళవారం ముగియనుంది. (రానున్న బడ్జెట్ సెషన్లో అదానీ గ్రూప్ vs హిండెన్‌బర్గ్ సునామీ?) కాగా అదానీ గ్రూప్‌లో ఐహెచ్‌సీకి రెండో పెట్టుబడి ఒప్పందం. గత సంవత్సరం అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్మిషన్ , అదానీ ఎంటర్‌ప్రైజెస్‌తో సహా అదానీ గ్రూప్‌లోని మూడు గ్రీన్ ఫోకస్డ్ కంపెనీలలో 2 బిలియన్ల డాలర్లను ఇన్వెస్ట్ చేసింది. పెట్టుబడి పెట్టింది. ఈ మూడు సంస్థలు బీఎస్సీ,ఎన్ఎస్సీలలో లిస్ట్ అయిన సంగతి తెలిసిందే. (చైనా సరిహద్దు ఉద్రిక్తత: ఈ సారి కూడా రక్షణ రంగానికి ప్రాధాన్యత?) -
ఎలిమినేటర్ మ్యాచ్.. గల్లీ క్రికెట్‌లా ఈ ఆటలేంటి!
మనం చిన్నప్పుడు క్రికెట్ ఆడేటప్పుడు ముందు బ్యాటింగ్ ఎవరు రావాలనే దానిపై వివిధ పద్దతులు ఆచరించేవాళ్లం. ఒక పిల్లాడు వంగితే.. వాడి వీపుపై చేతులతో సంఖ్యలను చెబుతూ ఏ స్థానంలో ఎవరు ఆడాలనేది నిర్ణయించేవారు. మరికొంతమంది పచ్చాలు వేసేవారు. ఇదంతా గల్లీ క్రికెట్ కాబట్టి మస్తు ఎంజాయ్‌గా అనిపించేది. కానీ ఇదే తీరు ఒక అంతర్జాతీయ మ్యాచ్‌లో జరిగితే ఆసక్తికరంగా ఉంటుంది. తాజాగా అబుదాబి టి10 లీగ్‌లో భాగంగా టీమ్ అబుదాబి జట్టు ఓపెనర్లు అలెక్స్ హేల్స్, క్రిస్ లిన్ చర్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఇద్దరిలో ఎవరు స్ట్రైక్ తీసుకోవాలనిదానిపై చిన్న గేమ్ ఆడారు. ఆ గేమ్ పేరు రాక్-పేపర్-సిసర్స్. ఈ గేమ్‌లో గెలిచిన హేల్స్ స్ట్రైక్ తీసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన కొందరు అభిమానులు.. కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లో గల్లీ క్రికెట్‌లా ఆటలేంటి అంటూ ఫన్నీ కామెంట్స్ చేవారు. ఆ తర్వాత ఒక్క పరుగు మాత్రమే చేసిన హేల్స్ సుల్తాన్ అహ్మద్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. డెక్కన్ గ్లాడియేటర్స్ టీమ్ అబుదాబిని 5 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన డెక్కన్ గ్లాడియేటర్స్ 10 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది. ఓడియన్ స్మిత్ 32 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన టీమ్ అబుదాబి 10 ఓవర్లలో వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. జేమ్స్ విన్స్ 21 పరుగులు చేశాడు. క్వాలిఫయర్-2లో మోరిస్విల్లే సాంప్ ఆర్మీతో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గెలిచిన డెక్కన్ గ్లాడియేటర్స్ ఫైనల్‌కు చేరుకుంది. ఇక డిసెంబర్ 4న(ఆదివారం) న్యూయార్క్ స్ట్రైకర్స్‌తో ఫైనల్లో అమితుమీ తేల్చుకోనుంది. pic.twitter.com/HC34HqTkbQ — Hassam (@Nasha_e_cricket) December 3, 2022 చదవండి: దిగ్గజం పీలే పరిస్థితి అత్యంత విషమం.. -
అబుదాబిలో తెలంగాణ దినోత్సవ వేడుకలు
సాక్షి, రాయికల్: అబుదాబిలోని తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాలను ఎగురవేశారు. తెలంగాణ విమోచన ప్రాముఖ్యత గురించి పలువురు వక్తలు వివరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు రాజ శ్రీనివాస్‌రావు, వంశీక్రిష్ణ, గంగారెడ్డి, గోపాల్, సన్ని, సంతోష్, బాబు, జగదీశ్, నారాయణరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్, రంజిత్, చరణ్ పాల్గొన్నారు. -
అది మహా పాపం.. శిక్ష నుంచి తప్పించుకోలేరు!
అబుదాబి ఎయిర్‌పోర్టు దాడి ఘటనపై యూఏఈ ప్రభుత్వం స్పందించింది. ‘సాటి మనుషుల ప్రాణాలు తీయడం పాపం. ఇలాంటి పాపపు పని చేసిన వారు శిక్ష తప్పించుకోలేరు’ అంటూ యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జయేద్ ఆల్ నహ్యాన్ అన్నారు. తీవ్రవాదులు తమ లక్ష్యం చేరుకునే క్రమంలో అక్రమంగా ఆయుధాలు వాడుతూ సౌదీ గడ్డపై రక్తం చిందిస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. జనావాసాలు, ప్రజా సౌకర్యాలపై దాడులు చేస్తున్నారంటూ టెర్రిస్టుల చర్యను ఖండించారు. యెమెన్ హౌతీ రెబల్ టెర్రరిస్టులు చేసిన డ్రోన్ దాడిలో చనిపోయిన ఇద్దరు భారతీయుల మృతదేహాలను స్వదేశానికి తరలించేందుకు పూర్తి సహకారం అందిస్తామని యూఏఈ తెలిపింది. ఈ మేరకు భారత రాయబార కార్యాలయం తగు ఏర్పాట్లు చేస్తోంది. وزير خارجية دولة الإمارات: ندين استهداف ميليشيا الحوثي الإرهابية لمناطق ومنشآت مدنية في الدولة اليوم.https://t.co/XLhlzxXARh — وزارة الخارجية والتعاون الدولي (@MoFAICUAE) January 17, 2022 చదవండి: అబుదాబి ఎయిర్‌పోర్టుపై డ్రోన్ దాడి ఇద్దరు భారతీయుల దుర్మరణం -
ఎయిర్ అంబులెన్స్ కూలి నలుగురు మృతి
అబూదాబి: అబుదాబి పోలీసుల ఎయిర్ అంబులెన్స్ యూనైటెడ్ అరబ్ ఎమరైట్స్ రాజధాని అబుదాబిలో కూలిపోయిందని పోలీసులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు, ఇద్దరు వైద్య సిబ్బంది మృతి చెందినట్లు వెల్లడించారు. (చదవండి: రెండో పెళ్లి కోసం తొమ్మిది నెలల పసికందుని 'అమ్మే'సింది) మృతి చెందిన వారిలో పైలట్ ట్రైనర్ ఖమీస్ సయీద్ అల్ హోలీ, లెఫ్టినెంట్ పైలట్ నాసర్ ముహమ్మద్ అల్ రషీది, డాక్టర్ షాహిద్ ఫరూక్ ఘోలం, నర్స్ జోయెల్ క్వియ్ సకార మింటో ఉన్నట్లు అబుదాబి పోలీసులు ధృవీకరించారు. ఈ మేరకు అబుదాబి జనరల్ హెడ్‌క్వార్టర్స్ పోలీసులు విధుల్లో ఉన్నప్పుడు ఎయిర్ అంబులెన్స్ కూలి మృతి చెందిన వైద్యా బృందానికి, వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాపం తెలిపారు. (చదవండి: తక్షణమే చర్యలు తీసుకుంటాం!) -
పరుగులు సమానం.. వికెట్లు మాత్రం తేడా; మళ్లీ రాజస్తాన్‌పైనే
అబుదాబి: ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్‌లో భాగంగా రాజస్తాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్‌లో పవర్ ప్లే(తొలి 6 ఓవర్లు) ముగిసే సమయానికి ఢిల్లీ క్యాపిటల్స్ 2 వికెట్లు కోల్పోయి 36 పరుగులు మాత్రమే చేసింది. ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ పవర్ ప్లేలో అతి తక్కువ స్కోరు నమోదు చేయడం ఇది రెండోసారి. ఇంతకముందు తొలి అంచె పోటీల్లోనూ తొలి ఆరు ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 36 పరుగులు చేసింది. కాగా ఈ పరుగులు నమోదు చేసింది కూడా రాజస్తాన్ రాయల్స్‌పైనే కావడం విశేషం. ఇక్కడ పరుగులు(36) సమానంగా ఉన్నాయి.. వికెట్లు మాత్రమే(3) ఉన్నాయి. ముంబై వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ గెలుపొందింది. చదవండి: టి20 క్రికెట్లో కోహ్లి అరుదైన ఘనత ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ 16 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. హెట్‌మైర్ 28(5 ఫోర్లు) ధాటిగా ఆడుతుండగా.. లలిత్ యాదవ్(3) అతనికి సహకరిస్తున్నాడు. అంతకముందు ఓపెనర్లు పృథ్వీ షా(10), ధావన్(8) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. ఆ తర్వాత వచ్చిన శ్రేయాస్ అయ్యర్(43), రిషబ్ పంత్(24)లు కీలక భాగస్వామ్యంతో ఇన్నింగ్స్ నడిపించారు. చదవండి: RCB New Captain: డివిలియర్స్ కెప్టెన్ కాలేడు.. ఆ ముగ్గురికే చాన్స్ -
IPL 2021: ముంబై ఇండియన్స్ ఆటగాళ్లకు జీపీఎస్ వాచ్‌లు
దుబాయ్: కరోనా నేపథ్యంలో వాయిదా పడిన ఐపీఎల్ 14వ సీజన్ రెండో అంచె పోటీలు యూఏఈలో జరగనున్న విషయం తెలిసిందే. సీఎస్కే, ముంబై ఇండియన్స్‌లో పలువురు ఆటగాళ్లు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. అబుదాబి చేరుకున్న ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు ఆరు రోజుల పాటు క్వారంటైన్లో ఉండనున్నారు. అయితే ఆటగాళ్ల కదలికలపై నిఘా వేసేందుకు అబుదాబి ప్రభుత్వం జీపీఎస్ వాచీలను అందించింది. జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా క్వారంటైన్ సమయంలో ఎవరైనా ఉల్లంఘనలకు పాల్పడ్డారో లేదో తెలుస్తుంది. అబుదాబిలో క్వారెంటైన్ రూల్స్ కఠినంగా ఉన్నాయి.ఒకవేళ దుబాయ్ నుంచి అబుదాబిలో ఎంటర్ కావాలన్న.. వాళ్లు కోవిడ్ నెగటివ్ రిపోర్ట్ చూపించాల్సిందే. మరోవైపు దుబాయ్ హోటల్లో బస చేస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మాత్రం జీపీఎస్ వాచ్‌లను ఇవ్వలేదు. క్వారంటైన్ సమయంలో ప్రతి రోజు ఆటగాళ్లకు కోవిడ్ పరీక్షలు చేస్తున్నారు. ఇక సెప్టెంబర్ 19న దుబాయ్‌లో చెన్నై, ముంబై మ్యాచ్‌తో ఐపీఎల్ 2021 రెండో అంచె పోటీలు మొదలుకానున్నాయి. -
కారు డ్రైవర్‌కు రూ.40 కోట్ల జాక్‌పాట్; కానీ ట్విస్ట్ ఏంటంటే
అబుదాబి: 37 ఏళ్ల రెంజిత్ సోమరాజన్ 2008లో కేరళ నుంచి అబుదాబికి వెళ్లి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. 12 ఏళ్లలో ఎప్పుడు కలిసిరాని అదృష్టం ఒక్కరాత్రిలోనే వరించింది. లక్కీడ్రాలో ఏకంగా 20 మిలియన్ దిర్హామ్( భారత కరెన్సీలో దాదాపు రూ. 40 కోట్లు) దక్కించుకున్నాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ 40 కోట్ల రూపాయలను రెంజిత్‌తో పాటు మరో తొమ్మిదిమంది పంచుకోవాల్సి ఉంది. ఎందుకంటే రెంజిత్‌తో పాటు వివిధ దేశాలకు చెందిన మరో తొమ్మిది మంది కూడా లక్కీడ్రాలో డబ్బును గెలుచుకున్నారు. ఈ విషయాన్ని ఖలీజ్‌టైమ్స్ పత్రిక శనివారం వెల్లడించింది.ఇక తన వాటా కింద సోమరాజన్‌కు ఎంతలేదన్న దాదాపు 4 కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉంది. ఈ లెక్కన చూసుకుంటే మూడేళ్లుగా లాటరీ టికెట్లు కొంటున్న సోమరాజన్‌కు పంట పండినట్లే. ఇదే విషయమై రెంజిత్ సోమరాజన్ స్పందిస్తూ.. '' నాకు ఇంత జాక్‌పాట్ తగులుతుందని ఊహించలేదు. 2008లో ఇండియా నుంచి దుబాయ్‌కు వచ్చాను. అప్పటినుంచి బతుకుదెరువు కోసం డ్రైవర్‌గా మారాను. గతేడాది ఒక కంపెనీ డ్రైవర్ కమ్ సేల్స్‌మన్‌గా పనిచేశాను. ఆ సమయంలో నేను సరైన సేల్స్ చేయని కారణంగా నా జీతంలో కోత విధించేవారు. అది నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. అప్పటినుంచి లాటరీ టికెట్లు కొనుగోలు చేయడం ప్రారంభించాను. అలా పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్‌కు చెందని మిగతా వ్యక్తులతో కలిసి ''రెండు కొంటే ఒక లాటరీ టికెట్ ఉచితం'' ఆఫర్‌ను కనుక్కున్నా. ఆ తొమ్మిది మంది నుంచి 100 దిర్హామ్‌లు వసూలు చేసి జూన్ 29న టికెట్‌ను కొనుగోలు చేశాను. నా ఒక్కడి పేరుతో తీస్తే అదృష్టం లేదని.. అందుకే మరో తొమ్మిది మందిని జత చేశాను. ఇవాళ నా పంట పండింది. నా వాటా తీసుకొని మిగతాది మావాళ్లకు ఇచ్చేస్తాను. ఎందుకంటే వారు నాపై నమ్మకం ఉంచి లాటరీ టికెట్‌కు డబ్బులు అందించారు''. అని చెప్పుకొచ్చాడు. -
Reliance: అబుదాబి కంపెనీతో భారీ డీల్
సాక్షి,ముంబై: దేశీయ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) మరో కీలక ఒప్పందాన్ని చేసుకుంది. ఇటీవల రిలయన్స్ 44 వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆర్ఐఎల్ అధినేత ముఖేశ్ అంబానీ ప్రకటించిన అంతర్జాతీయీకరణ వ్యూహంలో తొలి అడుగు వేసింది. ఇందులో భాగంగా అబుదాబి ప్రభుత్వానికి చెందిన కంపెనీతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. అబుదాబిలోని రువాయిస్‌లో కొత్త పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ (ఏడీఎన్ఓసీ)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ ప్రకారం ఏడ్‌నాక్, రిలయన్స్ సంయుక్తంగా క్లోర్-ఆల్కలీ, ఇథిలీన్ డైక్లోరైడ్, పాలీ వినైల్ క్లోరైడ్ (పీవీసీ) ని ఉత్పత్తి చేయనున్నాయి. దీనికి సంబంధించి అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ (ఎడిఎన్ఓసి) అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఒప్పందం నిబంధనల ప్రకారం, ఈ ఇంటిగ్రేటెడ్ ప్లాంట్‌లో ఏడాదికి 9.40లక్షల టన్నుల క్లోర్-ఆల్కలీ, 1.1 మిలియన్ టన్నుల ఇథిలీన్ డైక్లోరైడ్, 3.60లక్షల టన్నుల పీవీసీ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంటుందని ఆర్ఐఎల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రాజెక్ట్ భారతదేశంలో పీవీసీ ఉత్పత్తికి కీలకమైన బిల్డింగ్ బ్లాక్ అయిన ఇథిలీన్ డైక్లోరైడ్‌ను తయారు చేస్తుందనీ, తమ కార్యకలాపాలను ప్రపంచీకరించడంలో ఇదొక ముఖ్యమైన దశ అని రిలయన్స్ ఛైర్మన్ అండ్ ఎండీ, ముఖేశ్ అంబానీ అన్నారు. ఈ రసాయనాల మార్కెట్ డిమాండ్ అవసరాలకు, ముఖ్యంగా ఆసియా, ఆఫ్రికాలో స్థిరమైన వృద్ధిని సాధిస్తుందన్నారు. ప్రతిపాదిత జాయింట్ వెంచర్ టాజిజ్ (TA’ZIZ)ఇండస్ట్రియల్ కెమికల్స్ జోన్లో నిర్మించబడుతుంది. వాటర్ ట్రీట్మెంట్, వస్త్రాలు , లోహాల తయారీలో క్లోర్-ఆల్కాలిని ఉపయోగిస్తారు. అల్యూమినియం ఉత్పత్తికి అవసరమైన కాస్టిక్ సోను ఉత్పత్తి చేయనుంది. గృహనిర్మాణం, ఇతర వినియోగ వస్తువుల్లో విరివిగా వినియోగిస్తున్నపీవీసీని ఉత్పత్తి చేయడానికి ఇథిలీన్ డైక్లోరైడ్ వినియోగిస్తారు. అయితే పెట్టుబడి వివరాలు వెల్లడికానప్పటికీ పెట్రో కెమికల్ సదుపాయాన్ని ఏర్పాటు చేయడానికి 30వేల కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుందని చమురు రంగ నిపుణులు భావిస్తున్నారు. చదవండి : రిలయన్స్‌కు... కొత్త ‘ఇంధనం’ -
రెండుసార్లు ఆటగాడికి లైఫ్.. తొలిసారి టైటిల్ అందించాడు
అబుదాబి: అబుదాబి వేదికగా జరిగిన పాకిస్తాన్ సూపర్‌లీగ్(పీఎస్ఎల్-6) టైటిల్‌ను ముల్తాన్ సుల్తాన్స్ చేజెక్కించుకుంది. పెషావర్ జాల్మితో జరిగిన ఫైనల్లో ముల్తాన్ సుల్తాన్స్ 47 పరుగులతో విజయం సాధించి తొలిసారి పీఎస్ఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ముల్తాన్ సుల్తాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోరు చేసింది. కాగా మ్యాచ్‌లో రెండుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న మక్సూద్ 35 బంతుల్లో 65 పరుగులు నాటౌట్‌గా నిలిచి విజయంలో కీలకపాత్ర పోషించాడు. అతనికి రోసౌ 50 పరుగులతో ఆకట్టుకోగా.. మసూద్ 37, రిజ్వాన్ 30 పరుగులతో సహకరించారు. అనంతరం భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పెషావర్ జాల్మి ఏదశలోనూ ఆకట్టుకోలేకపోయింది. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులకు ఆలౌట్ అయింది. ఇమ్రాన్ తాహిర్ 3 వికెట్లతో ఆకట్టుకున్నాడు. పెషావర్ బ్యాటింగ్‌లో షోయబ్ మాలిక్ 48 పరుగలతో రాణించగా.. మిగతావారు పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక మక్సూద్.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌ను ఎగురేసుకుపోవడం విశేషం. గత నవంబర్‌లో కరోనా కారణంగా అర్థంతరంగా రద్దు చేసిన పీఎస్ఎల్-6ను అబుదాబి వేదికగా రీషెడ్యూల్ చేసి మ్యాచ్‌లను నిర్వహించిన సంగతి తెలిసిందే. చదవండి: PSL: ఒక్క ఓవర్లో 33 పరుగులు.. దెబ్బకు ప్లేఆఫ్ బెర్త్ -
భర్త ఫోన్‌పై భార్య నిఘా.. నష్టపరిహారం చెల్లించమన్న కోర్టు
దుబాయ్: ''నా అనుమతి లేకుండా భార్య తన ఫోన్లోని ఫోటోలను వేరేవాళ్లకు పంపించి ప్రైవసీకి భంగం కలిగించింది. నాపై నిఘా పెట్టిందని.. అది నాకు ఇష్టం లేదని.. నష్ట పరిహారం ఇప్పించాలంటూ'' కోర్టుకెక్కాడు. అతని వాదనలు విన్న కోర్టు వ్యక్తి భార్యకు 5,400 దిర్హమ్లను నష్టపరిహారంగా చెల్లించాలంటూ తీర్పునిచ్చింది. ఈ వింత ఘటన అబుదాబిలో చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. అబుదాబికి చెందిన దంపతులు పెళ్లైన కొన్నాళ్ల పాటు బాగానే ఉన్నారు. కాలం గడిచు కొద్ది భర్త ప్రవర్తనపై భార్యకు అనుమానం వచ్చింది. తన భర్త ఆమెకు తెలియకుండా ఫోన్లో ఏవో సీక్రెట్స్ దాస్తున్నాడని తనలో తాను భావించింది. ఈ క్రమంలో ఆమె తన భర్త ఫోన్‌పై నిఘా పెట్టింది. అంతటితో ఊరుకోకుండా తన భర్త ఫోన్లో ఉన్న ఫోటోలను అతనికి తెలియకుండా తన వాళ్లకే పంపించింది. విషయం తెలుసుకున్న భర్త భార్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించాడు. భర్త తరపు లాయర్ మాట్లాడుతూ... '' తన క్లయింట్ వ్యక్తిగత గోప్యతను అతని భార్య హరించింది. అతని అనుమతి లేకుండా ఫోటోలను కుటుంబసభ్యులకు పంపించి అతన్ని మానసిక ఒత్తిడికి గురయ్యేలా చేసింది. ఈ కేసు కారణంగా అతను ఉద్యోగానికి కూడా వెళ్లలేకపోయాడని.. దీంతో అతను ఆర్థికంగా నష్టపోయాడు'' అని తన వాదన వినిపించాడు. ఇంతలో భార్య తరపు లాయర్ మాట్లాడుతూ.. తన క్లయింట్ ఎటువంటి తప్పు చేయలేదని.. భర్త చేతిలో తాను మానసిక క్షోభను అనుభవించిందని తెలిపాడు. ఇరువరి వాదనలు విన్న కోర్టు భర్త ప్రైవసీకి భంగం కలిగించి అతని గోప్యతను దెబ్బతీసిన అతని భార్యకు 5,400 దిర్హమ్లు( రూ. లక్ష) నష్టపరిహారంగా చెల్లించాలంటూ వినూత్న తీర్పు ఇచ్చింది. చదవండి: ఫ్లైట్‌లో దంపతుల ముద్దులు.. బ్లాంకెట్ ఇచ్చిన ఎయిర్ హోస్టస్ ‘క్యూబూల్ హై’ అనగానే ముద్దుపెట్టేసిన వధువు -
వైఎస్సార్ సీపీ భారత్‌ను ఏపీ వైపు చూసేలా చేసింది
కువైట్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్బావ దినోత్సవం కువైట్‌లో పండుగలా జరిగింది. ఈ సందర్భంగా సాల్మియా ప్రాంతంతో కువైట్ వైఎస్సార్ సీపీ భారీ కేక్‌ను కట్ చేసింది. కువైట్ కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ( ఇండియా సమయం రాత్రి 10.30 గంటలకు ) నిర్వహించారు. ఈ సందర్భముగా కువైట్ వైఎస్సార్ సీపీ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి మాట్లాడుతూ భారత దేశంలో ఉన్న 29 రాష్ట్రాలలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తున్నారని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధన కోసం నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. సీఎం జగన్ తండ్రికన్నా రెండడుగులు ముందుకేసి అన్ని వర్గాల ప్రజలకు కుల, మత, రాజకీయాలకు అతీతంగా ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అందేలా చూస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కువైట్ కో కన్వీనర్ గోవిందు నాగరాజు, వర్కింగ్ కౌన్సిల్ సభ్యులు మన్నూర్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయములో ఇచ్చిన వాగ్దానాలలో అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోపే 90 శాతం అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎన్ఆర్టీసీ రీజనల్ కో ఆర్డినేటర్ నాయిని మహేశ్వర రెడ్డి , వైఎస్సార్ సీపీ కువైట్ సలహాదారుడు నాగిరెడ్డి చంద్ర శేఖర్ రెడ్డి, యువజన విభాగం ఇంచార్జి మర్రి కళ్యాణ్, బి.సీ.ఇంచార్జి రమణ యాదవ్. మీడియా ఇంచార్జి పుల్లపూత్తురు సురేష్ రెడ్డి, కమిటీ సభ్యులు రహమతుల్లా,హనుమంత్ రెడ్డి, పోలూరు ప్రభాకర్, లక్ష్మి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
దేవుడా.. పెద్ద గండం తప్పింది
దుబాయ్: షాహిద్ అఫ్రిది.. బంతిని ఎంత బలంగా బాదుతాడో .. కోపాన్ని కూడా అంతే వేగంగా చూపిస్తాడు. ఎదుటివారు తప్పు చేసినా.. తాను తప్పు చేసినా అసహనం వ్యక్తం చేయడం అఫ్రిదికి ఉన్న అలవాటు. ఆ అలవాటే అతన్ని చాలాసార్లు ఇబ్బందులు పెట్టింది.. ఒక్కోసారి నవ్వులు కూడా పూయించింది. రెండేళ్ల క్రితం ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన అఫ్రిది ప్రస్తుతం అబుదాబి టీ10 లీగ్‌లో క్యులాండర్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. శుక్రవారం టీమ్ అబుదాబితో ఎలిమినేటర్ మ్యాచ్ జరిగింది.ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌కు మరింత దగ్గరవుతుంది. దీంతో సిరీయస్‌గా తీసుకున్న ఇరుజట్లు మ్యాచ్‌ను గెలవడానికి ప్రయత్నించాయి. మ్యాచ్ ఫలితం పక్కనపెడితే.. క్యులాండర్ బ్యాటింగ్ సమయంలో అఫ్రిది చర్య సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆఫ్‌స్టంప్ మీదుగా వెళుతున్న బంతిని అఫ్రిది పుష్ చేయాలని చూశాడు. కానీ బంతి బ్యాట్ పైనుంచి వెళ్లి కీపర్ చేతుల్లో పడింది. దీంతో అతను వింతైన ఎక్స్ప్రెషన్ పెట్టి పంజాబీ భాషలో 'ఓ తెరీ కైయిర్' అనే పదం ఉపయోగించాడు. ఓ తెరీ కైయిర్ అంటే ఓ మై గాడ్ అని అర్థం. అఫ్రిది పలికిన వ్యాఖ్యలు స్టంప్ మైక్‌లో రికార్డు కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాకిస్తాన్‌కు 22ఏళ్ల పాటు ప్రాతినిధ్యం వహించిన షాహిద్ అఫ్రిది అనతికాలంలోనే మంచి ఆల్‌రౌండర్‌గా పేరు పొందాడు. వన్డేల్లో అత్యంత వేగంగా సెంచరీ(37 బంతుల్లో 100 పరుగులు) చేసిన తొలి ఆటగాడిగా అఫ్రిది రికార్డులకెక్కాడు. పాక్ తరపున 27 టెస్టుల్లో 1716 పరుగులు, 398 వన్డేల్లో 8064 పరుగులు, 99 టీ20ల్లో 1416 పరుగులు చేశాడు. ఇక బౌలింగ్‌లో వన్డేల్లో 395 వికెట్లు, టెస్టుల్లో 48 వికెట్లు, టీ20ల్లో 98 వికెట్లు తీశాడు.ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన క్యులాండర్స్ 10 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది. ఆఫ్రిది 24 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమ్ అబుదాబి 8.4 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. బెన్ డక్కెట్ 27, జో క్లార్క్ 22 పరుగులు చేశారు. చదవండి: సిరాజ్, కుల్దీప్ల గొడవ.. నిజమెంత! కోహ్లి ఫిజియో అవతారం.. చూసి తీరాల్సిందే Shahid Afridi "oh teri khair" #T10League #Cricket pic.twitter.com/zXL3E5DkoT — Saj Sadiq (@Saj_PakPassion) February 5, 2021 -
సిక్సర్ల హోరు.. యునివర్సల్ బాస్ విధ్వంసం
దుబాయ్: యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ మరోసారి విధ్వంసం సృష్టించాడు.40 ఏళ్ల వయసులోనూ మంచినీళ్ల ప్రాయంగా సిక్సర్లు బాదుతూ ప్రత్యర్థి బౌలర్ల గుండెల్లో దడ పుట్టిస్తున్నాడు. తాజాగా అబుదాబి టీ10 లీగ్‌లో గేల్ మరోసారి రెచ్చిపోయాడు. కొడితే ఫోర్.. లేదంటే సిక్స్ అన్నట్లుగా సునామీ ఇన్నింగ్స్‌తో విజృంభించాడు. బుధవారం మరాఠా అరేబియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ అబుదాబికి ప్రాతినిధ్యం వహిస్తున్న గేల్ 22 బంతుల్లోనే 9 సిక్స్‌లు, ఆరు ఫోర్లతో 84 పరుగులతో అజేయంగా నిలిచి ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించాడు. చదవండి: బుమ్రాకు 'తొలి' టెస్టు.. ఐసీసీ ఆల్ ది బెస్ట్ కేవలం 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న గేల్.. టీ10 చరిత్రలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన మహమ్మద్ షహజాద్ రికార్డును సమం చేశాడు. 2018 సీజన్లో షెహజాద్ రాజ్‌పుత్స్ తరఫున 12 బంతుల్లోనే అర్ధ శతకం చేశాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన మరాఠా అరేబియన్స్ నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన టీమ్ అబుదాబి జట్టులో ఓపెనర్ గేల్ విధ్వంసంతో 5.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. గేల్ చేసిన 84 పరుగుల్లో 78 రన్స్ బౌండరీల రూపంలోనే రావడం విశేషం. చదవండి: టీమిండియాకు జో రూట్ వార్నింగ్ -
'నేను కావాలని చేయలేదు.. క్షమించండి'
దుబాయ్: అబుదాబి టీ10 లీగ్‌లో భాగంగా టీమ్ అబుదాబి ఆటగాడు రోహన్ ముస్తఫా ఫీల్డింగ్ సమయంలో షర్ట్ లేకుండా బౌండరీవైపు పరిగెత్తడం తెలిసిందే. సోమవారం రాత్రి నార్తన్ వారియర్స్, టీమ్ అబుదాబి మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ముస్తఫా చర్యపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. తాజాగా రోహన్ ముస్తఫా ఘటనపై స్పందిస్తూ.. అది కావాలని చేయలేదంటూ క్లారిటీ ఇచ్చాడు. 'ముందుగా నేను చేసిన తప్పుకు జట్టు సహచరులతో పాటు అబుదాబి టీ10 లీగ్ చూసినవాళ్లందరికి క్షమాపణలు కోరుకుంటున్నా. అయితే ఆ పని కావాలని చేసింది మాత్రం కాదు.. ఆ తర్వాతి ఓవర్ నేను వేయాల్సి ఉండడంతో జెర్సీని మాత్రమే తీయాలనుకున్నా. కానీ పొరపాటుగా జెర్సీతో పాటు నా షర్ట్ కూడా బయటికి వచ్చేసింది. ఇదంతా గమనించని మా బౌలర్ అప్పటికే బంతి వేయడం.. నావైపు దూసుకురావడం జరిగిపోయింది. బంతి వేగంగా రావడంతో జెర్సీ వేసుకునే సమయం లేకపోవడంతో అలాగే పరిగెత్తాల్సి వచ్చింది. మ్యాచ్ ముగిసిన తర్వాత నేను చేసిన పనికి జట్టుతో పాటు మేనేజ్మెంట్కు కూడా క్షమాపణ చెప్పానంటూ' తెలిపాడు. చదవండి: ధోని గుర్తుగా కోహ్లి హెలికాప్టర్ షాట్ ఈ మ్యాచ్‌లో డెక్కన్ గ్లాడియేటర్స్ 6 వికెట్ల తేడాతో టీమ్ అబుదాబిపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ అబుదాబి 10 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది.లూక్ రైట్ 25 పరుగులు, జో క్లార్క్ 21 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నార్తన్ వారియర్స్ 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. కామెరాన్ డెల్పోర్ట్ 40 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కీరన్ పొలార్డ్ 24 పరుగులతో జట్టును విజయతీరాలకు చేర్చాడు.చదవండి: షర్ట్ లేకుండా పరిగెత్తాడు.. చివరికి Team Abu Dhabi versus Northern Warriors earlier today in the T10 League - the ball goes for 4 as the fielder Rohan Mustafa was too busy changing his jersey #T10League #Cricket pic.twitter.com/GvHZMhl2eq — Saj Sadiq (@Saj_PakPassion) February 1, 2021 -
షర్ట్ లేకుండా పరిగెత్తాడు.. చివరికి
దుబాయ్: అబుదాబి టీ10 లీగ్‌లో సోమవారం రాత్రి నార్తన్ వారియర్స్, టీమ్ అబుదాబి మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. టీమ్ అబుదాబి ఆటగాడు రోహన్ ముస్తఫా చేసిన ఒక పని సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తుంది. అసలు విషయంలోకి వెళితే.. నార్తన్ వారియర్స్ బ్యాటింగ్ సమయంలో ఒక ఓవర్లో రోహన్ తన జెర్సీని సరిచేసుకునే పనిలో పడ్డాడు. అయితే ఇది గమనించని బౌలర్ బంతి వేయగా నార్తన్ వారియర్స్ బ్యాట్స్‌మన్.. రోహన్ దిశగా షాట్ ఆడాడు. అప్పటికీ జెర్సీని వేసుకునే పనిలో ఉన్న రోహన్.. బంతి తన దగ్గరికి రావడంతో జెర్సీ చేతిలో పట్టుకుని పరిగెత్తాడు. అయితే బంతి అప్పటికే బౌండరీ దాటేసింది. రోహన్ ముస్తఫా తన జెర్సీని వేసుకుంటున్న దృశ్యం కెమెరాకు చిక్కింది. దీంతో వారియర్స్ కెప్టెన్ నికోలస్ పూరన్ ముస్తఫా వీడియోనూ చూసి నవ్వాపుకోలేకపోయాడు. దీనిని ఒక వ్యక్తి ట్విటర్లో షేర్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. చదవండి: ఒక్క టెస్ట్.. 3 రికార్డులు.. కోహ్లికి మాత్రమే ఇక మ్యాచ్ విషయానికి వస్తే డెక్కన్ గ్లాడియేటర్స్ 6 వికెట్ల తేడాతో టీమ్ అబుదాబిపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ అబుదాబి 10 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది.లూక్ రైట్ 25 పరుగులు, జో క్లార్క్ 21 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నార్తన్ వారియర్స్ 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. కామెరాన్ డెల్పోర్ట్ 40 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కీరన్ పొలార్డ్ 24 పరుగులతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. చదవండి: క్రికెట్ ఆస్ట్రేలియా కీలక నిర్ణయం.. లాభపడిన కివీస్ Team Abu Dhabi versus Northern Warriors earlier today in the T10 League - the ball goes for 4 as the fielder Rohan Mustafa was too busy changing his jersey #T10League #Cricket pic.twitter.com/GvHZMhl2eq — Saj Sadiq (@Saj_PakPassion) February 1, 2021 -
నాగిన్ డ్యాన్స్‌తో అదరగొట్టిన క్రికెటర్
అబుదాబి: షేక్ జాయేద్ స్టేడియం వేదికగా శుక్రవారం ఐర్లాండ్, యూఏఈ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. వికెట్ తీసిన ఆనందంలో యూఏఈ క్రికెటర్ రోహన్ ముస్తఫా నాగిన్ డ్యాన్స్‌తో అలరించాడు. అసలు విషయంలోకి వెళితే.. ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో 33వ ఓవర్ ముస్తఫా వేశాడు. క్రీజులో ఉన్న ఐర్లాండ్ బ్యాట్స్‌మన్ లోక్రాన్ టక్కర్ బంతి అంచనా వేయడంలో విఫలమై క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. దీంతో ఆనందంతో ముస్తఫా కొన్ని సెకన్ల పాటు నాగిన్ స్టెప్స్ వేసి అలరించాడు. అతని చర్యకు ఆశ్చర్యపోయిన తోటి క్రికెటర్లు.. 'నీలో ఈ కళ కూడా ఉందా' అంటూ ముస్తఫాను అభినందించారు.(చదవండి: జడ్డూ లేట్ చేసి ఉంటే కథ వేరే ఉండేది) ఈ వీడియోనూ అబుదాబి క్రికెట్ తన ట్విటర్లో షేర్ చేసింది. ముస్తఫా స్టెప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా 50 ఓవర్లు ఫార్మాట్లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఐర్లాండ్ మొదట బ్యాటింగ్ చేసింది. 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ స్టిర్లింగ్ సెంచరీతో(131*)ఆకట్టుకోగా.. కెప్టెన్ ఆండ్రూ బాల్బిర్నీ 53 పరుగులతో రాణించాడు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన యూఏఈ 18 ఓవర్లో 3 వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది. (చదవండి: స్లెడ్జింగ్; గిల్ కౌంటర్ అదిరింది..) 🕺 @rohanmustafa88 is loving life! @EmiratesCricket | #AbuDhabiCricket | #UAEvIRE pic.twitter.com/w5r9J7zJJ5 — Abu Dhabi Cricket (@AbuDhabiCricket) January 8, 2021 -
వెర్‌స్టాపెన్‌కు ‘పోల్’
అబుదాబి: ఫార్ములావన్ (ఎఫ్1) 2020 సీజన్‌లోని చివరి రేసు అబుదాబి గ్రాండ్ప్రిను రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్లో 23 ఏళ్ల వెర్స్టాపెన్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 35.246 సెకన్లలో ల్యాప్‌ను ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ సీజన్లో రెడ్‌బుల్ జట్టు డ్రైవర్‌కు పోల్ పొజిషన్ దక్కడం ఇదే తొలిసారి. మెర్సిడెస్ డ్రైవర్లు బొటాస్, హామిల్టన్ వరుసగా రెండు, మూడు స్థానాల నుంచి రేసును ఆరంభిస్తారు. 17 రేసుల ఈ సీజన్లో 16 రేసులు ముగిశాయి. 11 రేసుల్లో హామిల్టన్ నెగ్గగా... బొటాస్ రెండు రేసుల్లో.. మిగతా మూడు రేసుల్లో వెర్స్టాపెన్, గ్యాస్లీ, పెరెజ్ టైటిల్స్ గెలిచారు. -
స్టోక్స్ సూపర్‌మేన్.. మరి ఆర్చర్
అబుదాబి : ఐపీఎల్ 13వ సీజన్లో శుక్రవారం కింగ్స్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ విజయం సాధించడంతో ప్లేఆఫ్ బెర్త్ పోటీ రసవత్తరంగా మారిపోయింది. కేవలం నాలుగో స్థానం కోసం పంజాబ్, రాజస్తాన్, కేకేఆర్, ఎస్ఆర్హెచ్లు పోటీ పడుతున్నాయి. ఈ నాలుగు జట్లలో ఏం జట్టు ప్లేఆఫ్ చేరుతుందనేది సోమవారంతో తేలనుంది. ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడితే పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టోక్స్, శామ్సన్‌లు బ్యాటింగ్‌లో ఇరగదీసి విజయం అందించడంతో హీరోలుగా మారిపోయారు. సెంచరీకి ఒక్క పరుగు దూరంలో గేల్‌ను ఆర్చర్ ఔట్ చేయడంతో అతను హీరోగా మారిపోయాడు. (చదవండి : శామ్యూల్స్‌కు మతి చెడింది : వార్న్) దీనికి రాజస్తాన్ యాజమాన్యం తమ ట్విటర్లో వినూత్నమైన పోస్ట్‌తో ముందుకొచ్చింది. రాజస్తాన్ విజయానికి గట్టి పునాది వేసిన బెన్ స్టోక్స్‌ను సూపర్‌మేన్‌గా, శామ్సన్ను మార్వెల్ సిరీస్‌లోని డాక్టర్ స్ట్రేంజ్‌గా, ఇక ఆర్చర్‌ను గేమ్ ఆఫ్ థ్రోన్ సిరీస్ హీరోగా అభివర్ణిస్తూ ట్వీట్ చేసింది. పంజాబ్‌తో కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో స్టోక్స్, శామ్సన్‌లు బ్యాటింగ్‌లో మెరిస్తే.. ఆర్చర్ స్వింగ్‌లో ఉన్న గేల్ వికెట్‌ను తీసుకున్నాడు. అంతేకాదు ఈ సీజన్లో 19 వికెట్లతో రబడ తర్వాత లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Tricks & Treats! 🙌#Halloween with the Royals. 🎃#HallaBol | #RoyalsFamily | #HappyHalloween pic.twitter.com/Nwju9AaJAv — Rajasthan Royals (@rajasthanroyals) October 31, 2020 -
సూర్య ప్రతాపం.. ప్లేఆఫ్స్‌కు ముంబై
అబుదాబి : ఐపీఎల్ 13వ సీజన్లో ఆర్సీబీపై విజయం సాధించిన ముంబై ఈ సీజన్లో ప్లేఆఫ్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. ముంబై తాను ఆడిన 12 మ్యాచ్‌ల్లో 8 విజయాలు, నాలుగు ఓటములతో 16 పాయింట్లు సాధించి దర్జాగా ప్లేఆఫ్ చేరింది. ఐపీఎల్ చరిత్రలో చెన్నై(10 సార్లు) తర్వాత కనీసం 9సార్లు ప్లే ఆఫ్ చేరిన జట్టుగా ముంబై రెండో స్థానంలో నిలిచింది. ఇక ఆర్సీబీ విధించిన 165 పరుగుల లక్ష్యాన్ని ముంబై 19 ఓవర్లలో చేధించింది. ముంబై బ్యాట్స్మన్లలో సూర్యకుమార్ యాదవ్ 79 పరుగులు(10 ఫోర్లు, 3 సిక్సర్లు)తో టాప్ స్కోరర్‌గా నిలచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించగా, ఓపెనర్లు డికాక్ 18, ఇషాన్ కిషన్ 25 పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్, చాహల్ చెరో రెండు వికెట్లు తీశారు. అంతకముందు టాస్ గెలిచిన ముంబై ఆర్సీబీని బ్యాటింగ్‌కు ఆహ్వానించగా.. ఆర్సీబీఓపెనర్లు దేవదూత్ పడిక్కల్, జోష్ పిలిప్‌లు ఆ జట్టుకు శుభారంభాన్ని అందించారు. ముంబై బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ఇద్దరు బ్యాట్ ఝులిపించడంతో పవర్‌ప్లే ముగిసేసరికి ఆర్సీబీ స్కోరు 6ఓవర్లో 54 పరుగులు చేసింది. అయితే జట్టు స్కోరు 71 పరుగులకు చేరగానే జోష్ పిలిప్ రాహుల్ చాహర్ బౌలింగ్‌లో స్టంప్ అవుట్‌గా వెనుదిరిగాడు. మరోవైపు వేగంగా ఇన్నింగ్స్ ఆడిన దేవదూత్ పడిక్కల్ కొన్ని చక్కని షాట్లు ఆడి 30 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేయగా కెప్టెన్ కోహ్లి అలా వచ్చి ఇలా వెళ్లిపోయాడు. ఏబీ డివిలియర్స్ వచ్చీ రాగానే ఫోర్, సిక్సర్‌తో మంచి టచ్‌లో కనిపించినా జట్టు స్కోరు పొలార్డ్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అయితే ఒకపక్క వికెట్లు పడుతున్నా దేవదూత్ వేగంగా ఆడడంతో ఏ దశలోనూ రన్‌రేట్ 8కి తక్కువగా నమోదు కాలేదు. దీంతో ఆర్సీబీ 15 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 130 పరుగులు చేసింది. అయితే ఆ తర్వాత నుంచి ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆర్సీబీకి పరుగులు రావడం కష్టమైంది. ఈ నేపథ్యంలోనే ఆర్సీబీ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. శివమ్ మావితో పాటు 45 బంతుల్లో 74 పరుగులు చేసిన పడిక్కల్ ఒకే ఓవర్లో వెనుదిరిగారు. తర్వాత వచ్చిన క్రిస్ మోరిస్ విఫలం కావడం.. ఆఖర్లో వాషింగ్టన్ సుందర్ 10 పరుగులు, గురుకీరత్ 14 పరుగుల చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో బుమ్రా 3 వికెట్లతో ఆకట్టుకోగా, బౌల్ట్ , పొలార్డ్, రాహుల్ చాహర్ తలా ఒక వికెట్ తీశారు. -
ఆకట్టుకున్న పడిక్కల్..ముంబై టార్గెట్ 165
అబుదాబి : ఐపీఎల్ 13వ సీజన్లో భాగంగా ఆర్సీబీ ముంబై ఇండియన్స్‌కు 165 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. టాస్ గెలిచిన ముంబై ఆర్సీబీని బ్యాటింగ్‌కు ఆహ్వానించగా.. ఆర్సీబీ ఓపెనర్లు దేవదూత్ పడిక్కల్, జోష్ పిలిప్‌లు ఆ జట్టుకు శుభారంభాన్ని అందించారు. ముంబై బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ఇద్దరు బ్యాట్ ఝులిపించడంతో పవర్‌ప్లే ముగిసేసరికి ఆర్సీబీ స్కోరు 6ఓవర్లో 54 పరుగులు చేసింది. అయితే జట్టు స్కోరు 71 పరుగులకు చేరగానే జోష్ పిలిప్ రాహుల్ చాహర్ బౌలింగ్‌లో స్టంప్ అవుట్‌గా వెనుదిరిగాడు. మరోవైపు వేగంగా ఇన్నింగ్స్ ఆడిన దేవదూత్ పడిక్కల్ కొన్ని చక్కని షాట్లు ఆడి 30 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేయగా, కెప్టెన్ కోహ్లి అలా వచ్చి ఇలా వెళ్లిపోయాడు. ఏబీ డివిలియర్స్ వచ్చీ రాగానే ఫోర్, సిక్సర్‌తో మంచి టచ్‌లో కనిపించినా జట్టు స్కోరు పొలార్డ్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అయితే ఒకపక్క వికెట్లు పడుతున్నా దేవదూత్ వేగంగా ఆడడంతో ఏ దశలోనూ రన్‌రేట్ 8కి తక్కువగా నమోదు కాలేదు. దీంతో ఆర్సీబీ 15 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 130 పరుగులు చేసింది. అయితే ఆ తర్వాత నుంచి ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆర్సీబీకి పరుగులు రావడం కష్టమైంది. ఈ నేపథ్యంలోనే ఆర్సీబీ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. శివమ్ మావితో పాటు 45 బంతుల్లో 74 పరుగులు చేసిన పడిక్కల్ ఒకే ఓవర్లో వెనుదిరిగారు. తర్వాత వచ్చిన క్రిస్ మోరిస్ విఫలం కావడం.. ఆఖర్లో వాషింగ్టన్ సుందర్ 10 పరుగులు, గురుకీరత్ 14 పరుగుల చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో బుమ్రా 3 వికెట్లతో ఆకట్టుకోగా, బౌల్ట్ , పొలార్డ్, రాహుల్ చాహర్ తలా ఒక వికెట్ తీశారు. -
ప్లేఆఫ్ బెర్త్ ఎవరు ఖరారు చేసుకుంటారో..
అబుదాబి : ఐపీఎల్ 13వ సీజన్ ముగింపు దశకు వస్తుండడంతో ప్లేఆఫ్స్‌కు ముందుగా ఏ జట్టు చేరుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇందులో భాగంగా పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్న ముంబై ఇండియన్స్, ఆర్సీబీ మధ్య అబుదాబి వేదికగా ఆసక్తికర పోరు జరగనుంది. కాగా టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ ఎంచుకుంది.కాగా ఈ మ్యాచ్‌లోనూ రోహిత్ శర్మ బరిలోకి దిగకపోవడంతో పొలార్డ్ తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.(చదవండి : శామ్యూల్స్‌కు మతి చెడింది : వార్న్) ఈ మ్యాచ్ లో ఏ జట్టు విజయం సాధిస్తే వారు పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలోకి వెళ్లడం మాత్రమే కాకుండా ప్లే ఆఫ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి జట్టుగా నిలుస్తుంది.ముంబై జట్టులో ఎలాంటి మార్పులు లేకపోగా.. ఆర్సీబీ మాత్రం మూడు మార్పులు చేసింది. నవదీప్ సైనీ స్థానంలో శివమ్ దూబే, అరోన్ ఫించ్ స్థానంలో జోష్ ఫిలిఫ్, మొయిన్ అలీ స్థానంలో డేల్ స్టెయిన్‌లను జట్టులోకి తీసుకున్నట్లు కెప్టెన్ కోహ్లీ వివరించాడు. కాగా ఇరు జట్ల మధ్య జరిగిన తొలి అంచె పోటీలో ఆర్సీబీ సూపర్ ఓవర్ ద్వారా ముంబైపై విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య ఐపీఎల్లో ఇప్పటివరకు 28 మ్యాచ్‌లు జరగ్గా.. ముంబై 18, ఆర్సీబీ 10 విజయాలు నమోదు చేశాయి. బెంగళూరు : విరాట్ కోహ్లీ(కెప్టెన్),దేవదత్ పడిక్కల్, జోష్ ఫిలిప్, ఎబి డివిలియర్స్, గుర్కీరత్ సింగ్ మన్, శివం దుబే, క్రిస్ మోరిస్, వాషింగ్టన్ సుందర్, డేల్ స్టెయిన్, మహ్మద్ సిరాజ్, యుజువేంద్ర చాహల్ ముంబై : ఇషాన్ కిషన్, క్వింటన్ డి కాక్, సూర్యకుమార్ యాదవ్, సౌరభ్ తివారీ, హార్దిక్ పాండ్యా, కీరోన్ పొలార్డ్ (కెప్టెన్), కృనాల్ పాండ్యా, జేమ్స్ ప్యాటిన్సన్, రాహుల్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా -
కేకేఆర్‌పై ఆర్సీబీ ఘన విజయం
అబుదాబి : ఐపీఎల్ 13వ సీజన్లో ఆర్సీబీ మరో ఘన విజయాన్ని నమోదు చేసింది. కేకేఆర్ విధించిన 85 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆర్సీబీ రెండు వికెట్లు కోల్పోయి చేధించింది. ఆర్సీబీ బ్యాటింగ్‌లో దేవదూత్ పడిక్కల్, ఫించ్‌లు కలిసి మొదటి వికెట్‌కు 46 పరుగులు జోడించారు. 6వ ఓవర్ బౌలింగ్ వచ్చిన పెర్గూసన్ బౌలింగ్‌లో రెండో బంతికి ఫించ్ 16 పరుగుల వద్ద ఔటవ్వగా.. అదే ఓవర్లో నాలుగో బంతికి దేవదూత్ కూడా రనౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లి.. గురుకీరత్‌తో కలిసి మరో వికెట్ పడకుండా 13.3 ఓవర్లో జట్టును విజయతీరాలకు చేర్చాడు. కేకేఆర్ బౌలర్లలో పెర్గూసన్ ఒక వికెట్ తీశాడు. కాగా ఈ విజయంతో ఆర్సీబీ రన్‌రేట్‌ను మరింత మెరుగుపరుచుకొని మొత్తం 10 మ్యాచ్‌ల్లో 7 విజయాలు, 3 ఓటములతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. కేకేఆర్ ఈ మ్యాచ్‌లో ఓటమి పాలయినా పది మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు, 5 ఓటమిలతో నాలుగో స్థానంలోనే కొనసాగుతుంది.కాగా అద్భుత బౌలింగ్ ప్రదర్శన కనబరిచిన మహ్మద్ సిరాజ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. (చదవండి : 84 పరుగులకే చాప చుట్టేసిన కేకేఆర్) అంతకముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఏంచుకున్న కేకేఆర్.. ఆర్సీబీ బౌలర్ల దాటికి ఏ దశలోనూ పోరాటపటిమ కనబర్చలేదు. కాగా కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. కేకేఆర్ బ్యాట్స్మెన్లలో కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 30 పరుగులతో టాప్‌స్కోరర్‌గా నిలవగా.. మిగతావారు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఒక దశలో జట్టు స్కోరు 60 పరుగులు దాటుటుందా అన్న దశలో చివర్లో లోకీ పెర్గ్యూసన్ 19 పరుగులు, కుల్దీప్ యాదవ్ 12 పరుగులు చేయడంతో 84 పరుగులు చేయగలిగింది. ఆర్సీబీ బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 3వికెట్లు, చహల్ 2, వాషింగ్టన్ సుందర్, నవదీప్ సైనీ తలా ఒక వికెట్ తీశారు. (చదవండి : ఎందుకన్నయ్య మీరు ఇలా చేశారు..) -
కేకేఆర్ ఘోర వైఫల్యం.. ఆర్సీబీ టార్గెట్ 85
అబుదాబి : ఐపీఎల్ 13వ సీజన్లో ఆర్సీబీతో జరగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ పూర్తిగా తేలిపోయింది. 1,1, 0, 10, 4 ఇవి కేకేఆర్ టాప్ 5 బ్యాట్స్‌మెన్ చేసిన పరుగులు. అసలు ఆడుతుంది టీ20నా లేక గల్లీ క్రికెట్ అనేంతలా సాగింది కేకేఆర్ బ్యాటింగ్ తీరు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఏంచకున్న కేకేఆర్.. ఆర్సీబీ బౌలర్ల దాటికి నిర్ణీత 20 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. కేకేఆర్ బ్యాట్స్మెన్లలో కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 30 పరుగులతో టాప్‌స్కోరర్‌గా నిలవగా.. మిగతావారు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఒక దశలో జట్టు స్కోరు 60 పరుగులు దాటుటుందా అన్న దశలో చివర్లో లోకీ పెర్గ్యూసన్ 19 పరుగులు, కుల్దీప్ యాదవ్ 12 పరుగులు చేయడంతో 84 పరుగులు చేయగలిగింది. ఆర్సీబీ బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 3వికెట్లు, చహల్ 2, వాషింగ్టన్ సుందర్, నవదీప్ సైనీ తలా ఒక వికెట్ తీశారు. సిరాజ్ అద్భుత స్పెల్ : 4-2-8-3.. ఇవి ఆర్సీబీ బౌలర్ మహ్మద్ సిరాజ్ గణాంకాలు. సాధారణంగా టీ20 మ్యాచ్‌లో ఇలాంటి గణాంకాలు అరుదుగా చూస్తుంటాం. మొదటిస్పెల్లో సిరాజ్ వేసిన మూడు ఓవర్లలో తొలి రెండు ఓవర్లు మెయిడెన్ వేయడం విశేషం. ఐపీఎల్ చరిత్రలో ఒక బౌలర్ ఇలా వరుస రెండు ఓవర్లను మెయిడెన్‌గా వేయడం ఇదే తొలిసారి. సిరాజ్ ఐపీఎల్ కెరీర్లోనే అత్యుత్తమ గణాంకాలు నమోదు చేయడం మరో విశేషంగా చెప్పుకోవచ్చు. కేకేఆర్ రెండో అత్యల్ప స్కోరు : ఐపీఎల్ చరిత్రలో కేకేఆర్ రెండో అత్యల్ప స్కోరు నమోదు చేసింది.ఇంతకముందు 2008 ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 15.2 ఓవర్లలో 67 పరుగులకే ఆలౌట్ అయింది. మళ్లీ 12 సంవత్సరాల తర్వాత తాజాగా ఆర్సీబీపై రెండో అత్యల్ప స్కోరు నమోదు చేసింది. కాగా ఐపీఎల్లో అత్యల్ప స్కోరు ఆర్సీబీ పేరిట ఉంది. 2017 ఐపీఎల్ సీజన్లో ఇదే కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 49 పరుగులకే చాప చుట్టేసింది. ఓవరాల్‌గా ఐపీఎల్ చరిత్రలో ఎక్కువసార్లు అత్యల్ప స్కోర్లు నమోదు చేసిన జట్లుగా ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సీబీ ఉన్నాయి. ఇరు జట్లు ఐదేసి సార్లు ఐపీఎల్లో అత్యల్ప స్కోర్లు నమోదు చేయడం విశేషం. -
'మాకోసం ఆ మైదానాలు చిన్నగా మార్చండి'
దుబాయ్ : ఐపీఎల్ 13వ సీజన్లో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిరాశజనకమైన ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో కేవలం రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. కేకేఆర్‌తో జరిగిన గత మ్యాచ్‌లో విజయం దిశగా సాగిన చెన్నై ఒక్కసారిగా తడబడి అనూహ్యంగా ఓటమిపాలైంది. ధోని, కేదార్ జాదవ్ ఆటతీరును చాలా మంది విమర్శించారు. అయితే చెన్నై తాను ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఆరు సార్లు చేజింగ్‌కే పరిమితమైంది. కాగా ఐపీఎల్ మ్యాచ్‌లు యూఏఈ వేదికగా షార్జా, దుబాయ్, అబుదాబి వేదికగా జరుగుతున్న సంగతి తెలిసిందే. (చదవండి : పంజాబ్ బ్యాటింగ్ వర్సెస్ వరుణ్) ఈ నేపథ్యంలో సీఎస్కే మేనేజ్మెంట్ శుక్రవారం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌ను కలిసినట్లు వార్తలు వచ్చాయి. దుబాయ్, అబుదాబి స్టేడియాల్లో ఉన్న బౌండరీలైన్‌ను తగ్గించాలంటూ కౌన్సిల్‌ను కోరినట్లు తెలిసింది. మా జట్టులో సీనియర్ ఆటగాళ్లు ఎక్కువగా ఉండడం.. పైగా దుబాయ్‌లో వేడి ఎక్కువగా ఉండడం వల్ల సీనియర్ ఆటగాళ్లు ఒత్తిడికి తట్టుకోలేకపోతున్నారని సీఎస్కే తెలిపింది. అంతేగాక మా జట్టు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో చేజింగ్ చేయాల్సి రావడం.. మొదట ఫీల్డింగ్‌లో అలిసిపోవడంతో మా ఆటగాళ్లు చేదనలో ఎనర్జీతో కనిపించడం లేదన్నారు. అందుకే తాము ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌ను కలిసి దుబాయ్, అబుదాబి మైదానాల్లోని బౌండరీ లైన్‌ను తగ్గించాలని కోరినట్లు తెలిపారు. చెన్నై జట్టు చేసిన ప్రతిపాదనను రాజస్తాన్ జట్టు కూడా స్పందిస్తూ ఈ విషయంలో తమ మద్దతు కూడా ఉంటుందని ఒక ప్రకటనలో తెలిపినట్లు సమాచారం.(చదవండి : ఇంత పొడవైన క్రికెటర్‌ను ఎప్పుడైనా చూశారా) వాస్తవం : చెన్నై యాజమాన్యం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌ను కలిసినట్లుగా వచ్చిన వార్తలో నిజం లేదు. ఇది కేవలం ఉహాగానాలు మాత్రమే. -
'మా జట్టు ప్రదర్శన నన్ను నిరాశపరిచింది'
అబుదాబి : ఐపీఎల్ 13వ సీజన్లో బుధవారం కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే ప్రదర్శన తనను చాలా నిరాశపరిచిందని ఆ జట్టు ప్రధాన కోచ్ స్టీఫెన్ ప్లెమింగ్ పేర్కొన్నాడు. మ్యాచ్ అనంతరం ప్లెమింగ్ సీఎస్కే బ్యాటింగ్ తీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. (చదవండి : శాంసన్ రాత మారేనా? మళ్లీ అదే డ్రామానా?) 'కేకేఆర్‌తో మ్యాచ్‌లో కేవలం 10 పరుగుల తేడాతో ఓడిపోవడం బాధగా అనిపించింది. వాట్సన్ మంచి ఆరంభాన్ని ఇచ్చినా దాన్ని నిలబెట్టుకోలేకపోయాం. మ్యాచ్‌లో మా ఇన్నింగ్ మొదలైన తర్వాత వాట్సన్, డుప్లెసిస్ ఇచ్చిన ఆరంభానికి తోడు.. రాయుడు మంచి టచ్‌లో కనిపించడంతో లక్ష్యాన్ని సులభంగా చేదిస్తుందనే అనుకున్నా. కానీ ఒక ఐదారు ఓవర్లు పాటు నిలకడగా ఆడి ఉంటే కచ్చితంగా గెలిచేవాళ్లం. ధోని నాలుగో స్థానంలో రావడంపై తప్పుబట్టలేం. ఎందుకంటే వాట్సన్ క్రీజులో ఉండడంతో ధోని అతనికి సహకారమందించాలని ప్రయత్నించాడు. కానీ దురదృష్టం మమ్మల్ని వెంటాడింది. వాట్సన్ అవుటైన తర్వాత వచ్చిన మిగతా బ్యాట్స్మెన్లు షాట్ల ఎంపిక పొరపాటుతో పాటు కేకేఆర్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. మా జట్టులో బ్యాట్స్మెన్లకు కొదువ లేదు.అందరు విమర్శించినట్టు మాకు అదనపు బ్యాట్స్‌మన్ అవసరం లేదు. 8 వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే బ్రావో వరకు పటిష్టంగానే ఉంది. కాకపోతే వచ్చే మ్యాచ్‌లో బ్యాటింగ్ ఆర్డర్ మార్చాల్సిన అవసరం ఉంది. సామ్ కరన్, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో లాంటి ఆల్రౌంర్లు ఉండి కూడా కీలక దశలో చేతులెత్తేసాం.'అంటూ చెప్పుకొచ్చాడు. (చదవండి : చేదనలో తడబడ్డ చెన్నై; కేకేఆర్ విజయం) కేకేఆర్‌తో మ్యాచ్‌లో 13వ ఓవర్ వరకు కేవలం రెండు వికెట్లు కోల్పోయి పటిష్టంగా కనిపించిన చెన్నై .. వాట్సన్ 50 పరుగులు పూర్తి చేసిన వెంటనే అవుటవ్వడంతో మ్యాచ్ పూర్తిగా మారిపోయింది. 10వ ఓవర్ నుంచి 15వ ఓవర్ వరకు సీఎస్కే జట్టు కేవలం 20 పరుగులు మాత్రమే చేయడం ఆ జట్టు ఓటమికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. కాగా చెన్నె సూపర్ కింగ్స్ తన తర్వాతి మ్యాచ్ శనివారం(అక్టోబర్ 10న) ఆర్సీబీతో తలపడనుంది. -
చేదనలో తడబడ్డ చెన్నై; కేకేఆర్ విజయం
అబుదాబి : ఐపీఎల్ 13వ సీజన్లో భాగంగా చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 10 పరుగుల తేడాతో విక్టరీ నమోదు చేసింది. చెన్నై ఓపెనర్ షేన్ వాట్సన్ (40 బంతుల్లో 51; 6 ఫోర్లు, 1 సిక్స్) మినహా మిగతావారు విఫలం కావడంతో సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకి ఓపెనర్లు వాట్సన్, డుప్లెసిస్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఈ దశలో జట్టు స్కోరు 30 పరుగుల వద్దకు చేరుకోగానే డుప్లెసిస్ శివమ్ మావి బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చని అంబటి రాయుడు మంచి టచ్‌లో కనిపించాడు. 27 బంతుల్లో 30 పరుగులు చేసిన రాయుడు నాగర్కోటి బౌలింగ్‌లో వెనుదిరగడంతో 99 పరుగుల వద్ద చెన్నై రెండో వికెట్ కోల్పోయింది. కాగా ఈ మ్యాచ్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధోని ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. (చదవండి : కేకేఆర్ ఆలౌట్.. సీఎస్కే టార్గెట్ ఎంతంటే) అయితే వాట్సన్ 40 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే నరైన్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో 101 పరగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో సామ్ కరాన్‌తో కలిసి ధోని ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నంలో 16వ ఓవర్లో వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో ధోని క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాతి ఓవర్లోనే కరాన్ కూడా వెనుదిరగడంతో సీఎస్కే ఒత్తిడికి లోనైంది. ఇదే సమయంలో కేకేఆర్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో క్రీజులో ఉన్న కేదార్ జాదవ్, రవీంద్ర జడేజాలు చెన్నైను గెలిపించలేకపోయారు. దీంతో చెన్నై విజయానికి 10 పరుగుల దూరంలో నిలిచిపోయింది. కేకేఆర్ బౌలర్లలో శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, ఆండ్రీ రసెల్ తలా ఒక వికెట్ తీశారు. అంతకముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఏంచుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్ సునీల్ నరైన్ స్థానంలో రాహుల్ త్రిపాఠిని ఓపెనర్‌గా పంపించింది. ఈ సందర్భంగా త్రిపాఠి ఓపెనర్‌గా మంచి షాట్స్ ఆడుతూ తన విలువేంటో చూపించాడు. సహచరులంతా తక్కువ స్కోరుకే వెనుదిరిగినా తాను మాత్రం ఇన్నింగ్స్ ఆసాంతం మెరుపులు మెరిపించాడు. త్రిపాఠి 51 బంతుల్లో 81 పరుగులు సాధించగా.. ఇందులో 8ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. మిగిలిన వారిలో ఎవరు చెప్పుకోదగ్గ ప్రదర్శన నమోదు చేయలేదు. కాగా స్కోరు 37 పరుగులకు చేరగానే కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. శార్దూల్ ఠాకూర్ వేసిన నాలుగో ఓవర్ రెండో బంతికి శుబ్‌మన్ గిల్ క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన నితీష్ రాణా సహకారంతో త్రిపాఠి మాత్రం బౌండరీలతో విరుచుకుపడ్డాడు. దీంతో కేకేఆర్ స్కోరుబోర్డు ఉరకలెత్తింది. ఈ దశలో 8వ ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన కరణ్ శర్మ తను వేసిన మొదటిబంతికే వికెట్ తీసుకున్నాడు. భారీ షాట్‌కు యత్నించిన నితీష్ రాణా రవీంద్ర జడేజాకు క్యాచ్ ఇచ్చి అవుట్‌గా వెనుదిరిగాడు. కాగా కేకేఆర్ తొలి 10 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. నాలుగో స్థానంలో వచ్చిన సునీల్ నరైన్ 17 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. కాగా నరైన్ అవుటైన తర్వాత బ్యాటింగ్ ఆర్డర్లో ముందుగా వచ్చిన ఇయాన్ మోర్గాన్ పూర్తిగా నిరాశపరిచాడు. కాగా రాహుల్ త్రిపాఠి 81 పరుగుల వద్ద బ్రేవో బౌలింగ్‌లో వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన రసెల్, కమిన్స్, కార్తీక్ ఏ దశలోనూ ఆకట్టుకోలేకపోయారు. దీంతో నిర్ణీత ఓవర్లలో 20 ఓవర్లలో కేకేఆర్ 167 పరుగులకు ఆలౌట్ అయింది. కాగా చెన్నై బౌలర్లలో బ్రేవో 3, శార్దూల్ ఠాకూర్, కరణ్ శర్మ,శామ్ కర్జన్ తలా రెండు వికెట్లు తీశారు. ఈ విజయంతో కేకేఆర్ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకగా.. చెన్నై ఐదో స్థానానికి పడిపోయింది. -
త్రిపాఠి జోరు.. కేకేఆర్ స్కోరెంతంటే
అబుదాబి : సీఎస్కేతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఏంచుకున్న కోల్‌కత ఇన్నింగ్స్‌ను నిలకడగా ఆడుతోంది. కాగా అందరూ ఊహించినట్టుగానే ఈ మ్యాచ్‌లో సునీల్ నరైన్ స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన రాహుల్ త్రిపాఠి.. శుబ్‌మన్ గిల్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించాడు. కాగా స్కోరు 37 పరుగులకు చేరగానే కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. శార్దూల్ ఠాకూర్ వేసిన నాలుగో ఓవర్ రెండో బంతికి శుబ్‌మన్ గిల్ క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన నితీష్ రాణా సహకారంతో త్రిపాఠి మాత్రం బౌండరీలతో విరుచుకుపడ్డాడు. దీంతో కేకేఆర్ స్కోరుబోర్డు ఉరకలెత్తింది. (చదవండి : పొలార్డ్‌ను అనుసరించిన దినేష్ కార్తీక్) ఈ దశలో 8వ ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన కరణ్ శర్మ తను వేసిన మొదటిబంతికే వికెట్ తీసుకున్నాడు. భారీ షాట్‌కు యత్నించిన నితీష్ రాణా రవీంద్ర జడేజాకు క్యాచ్ ఇచ్చి అవుట్‌గా వెనుదిరిగాడు. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన సునీల్ నరైన్‌తో కలిసి ఇన్నింగ్స్ కొనసాగించిన త్రిపాఠి 31 బంతుల్లో 50 రన్స్ సాధించాడు. ఇందులో 6 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. కాగా కేకేఆర్ తొలి 10 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. క్రీజులో త్రిపాఠి 52 పరుగులు, నరైన్ 13 పరుగులతో ఉన్నారు. -
రసెల్ ఈసారైనా మెరిసేనా?
అబుదాబి : ఐపీఎల్ 13వ సీజన్లో ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య అబుదాబి వేదికగా ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. కాగా సీఎస్కేతో మ్యాచ్‌లో కేకేఆర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఏంచుకుంది. ఇప్పటివరకు 5 మ్యాచ్‌లాడిన సీఎస్కే రెండు విజయాలు, మూడు ఓటములతో పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉంది. ఇక కేకేఆర్ నాలుగు మ్యాచ్‌లాడి రెండు విజయాలు, రెండు ఓటములతో 4వ స్థానంలో ఉంది. కాగా సీఎస్కే కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్ల విధ్వంసంతో ఏకంగా 10వికెట్ల తేడాతో గెలిచి హ్యాట్రిక్ ఓటములకు స్వస్తి పలికింది. అటు కేకేఆర్ మాత్రం ఒక మ్యాచ్‌లో గెలుస్తూ.. మరొక మ్యాచ్‌లో ఓడుతూ వస్తుంది. కాగా ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 22 మ్యాచ్‌లు జరగ్గా సీఎస్కే 14 గెలుపొందగా.. కేకేఆర్ 8 గెలిచింది. ఇరు జట్ల బలబలాలు సీఎస్కే విషయానికి వస్తే.. షేన్ వాట్సన్, డు ప్లెసిస్, రాయుడు, కేదార్ జాదవ్, ఎంఎస్ ధోని, జడేజా, బ్రేవో, సామ్ కర్జన్లతో బ్యాటింగ్ విభాగం పటిష్టంగానే ఉంది. ఇక ఆరంభంలోనే వాట్సన్, డు ప్లెసిస్ మరోసారి రాణిస్తే మాత్రం కేకేఆర్‌కు కష్టాలు తప్పకపోవచ్చు. ఇక బౌలింగ్‌లో దీపక్ చాహర్, కరణ్ శర్మ, శార్థూల్ ఠాకూర్లతో సమతుల్యంగా కనిపిస్తుంది. కేకేఆర్ విషయానికి వస్తే.. సునీల్ నరైన్ ఓపెనర్‌గా విఫలమవుతూ వస్తున్న అతన్నే కొనసాగించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో నరైన్ సీఎస్కేతో జరిగే మ్యాచ్‌లో నరైన్ స్థానంలో రాహుల్ త్రిపాఠిని ఓపెనింగ్ పంపే అంశంపై కేకేఆర్ పరిశీలిస్తుంది. ఇక బ్యాటింగ్‌లో శుబ్‌మన్ గిల్, నితీష్ రాణా, ఇయాన్ మోర్గాన్‌లు రాణిస్తుండగా.. దినేష్ కార్తిక్, ఆండ్రీ రసెల్ పూర్తిగా విఫలమవుతూ వస్తున్నారు. మరి ఈసారైనా రసెల్ మెరుపులు మెరిపిస్తాడా లేదా అనేది చూడాలి. గత మ్యాచ్‌లో కేవలం బ్యాటింగ్ ఆర్డర్ సరిగా లేకపోవడం వల్లే కేకేఆర్ ఓటమికి ఒక కారణంగా చెప్పవచ్చు. మంచి ఫామ్‌లో ఉన్న మోర్గాన్‌ను బ్యాటింగ్ ఆర్డర్లో ముందు పంపిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా బౌలింగ్‌లో పాట్ కమిన్స్, కమలేష్ నాగర్ కోటి, శివమ్ మావిలతో పటిష్టంగానే కనిపిస్తుంది. ఈ మ్యాచ్‌లో సీఎస్కే పియూష్ చావ్లా స్థానంలో కరణ్ శర్మను తుది జట్టులోకి తీసుకుంది. కాగా కేకేఆర్లోమాత్రం తుది జట్టులో ఎలాంటి మార్పు చేయలేదు. సీఎస్కే జట్టు : ఎంఎస్ ధోని(కెప్టెన్), షేన్ వాట్సన్, అంబటి రాయుడు, డుప్లెసిస్, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రేవో, సామ్ కరాన్,కరణ్ శర్మ, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్ కేకేఆర్ జట్టు : దినేశ్ కార్తీక్(కెప్టెన్), సునీల్ నరైన్, శుబ్‌మన్ గిల్, నితీష్ రాణా, ఇయాన్ మోర్గాన్, ఆండ్రీ రసెల్, ప్యాట్ కమిన్స్, నాగర్కోటి, వరుణ్ చక్రవర్తి, రాహుల్ త్రిపాఠి, శివం మావి -
'ఎవరిని నిందించొద్దు.. తప్పంతా నాదే'
అబుదాబి : ఐపీఎల్ 13వ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా రెండో ఓటమి నమోదు చేసింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. కేన్ విలియమ్సన్ ఈ మ్యాచ్‌లోనూ ఆడకపోవడం.. మనీష్ పాండే మినహా మిగతావారు విఫలమవడంతో సన్‌రైజర్స్ బ్యాటింగ్‌లో పూర్తిగా ఫెయిలయ్యింది. ఇదే విషయమై మ్యాచ్ అనంతరం సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ స్పందించాడు. 'ఈరోజు జరిగిన మ్యాచ్‌లో మా ప్రదర్శన అస్సలు బాగోలేదు. ఇన్నింగ్స్ ఆరంభంలో మంచి రన్‌రేట్ లభించినా దానిని చివరి వరకు కొనసాగించలేకపోయాం.అయితే ఈ మ్యాచ్‌లో నేను ఎవరిని నిందించదలచుకోలేను.. తప్పంతా నాదే కాబట్టి.. ఓటమి బాధ్యత కూడా నేనే తీసుకుంటా. ఆరంభం నుంచి దూకుడు ప్రదర్శించాలన్న ధోరణితో ఇన్నింగ్స్ ప్రారంభించిన నేను దానిని కాపాడుకోలేకపోయా.. వరుణ్ చక్రవర్తి వేసిన బంతిని అంచనా వేయలేక అనవసరంగా వికెట్‌ను ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇన్నింగ్స్‌లో పూర్తి ఓవర్లు ఆడి కేవలం నాలుగు వికెట్లే కోల్పోయినా.. జట్టు స్కోరు చూస్తే నామమాత్రంగానే ఉంది. 20 ఓవర్లు పూర్తయ్యేసరికి ఇంకా ఇద్దరు బ్యాట్స్మెన్లు బెంచ్ మీదే ఉన్నారు. (చదవండి : కేన్ విలియమ్సన్ అందుకే ఆడలేదా..) 16వ ఓవర్ తర్వాత బ్యాటింగ్‌లో వేగం పెంచి బౌలర్లపై ఒత్తిడి తెచ్చి ఉంటే మంచి స్కోరు సాధించేవాళ్లం. కానీ జట్టులో సరైన హిట్టర్లు లేకపోవడం దురదృష్టం. అంతేగాక కోల్‌కతాతో మ్యాచ్‌లో డాట్‌బాల్స్ ఎక్కువగా ఉన్నాయి. దాదాపు 35- 36 బంతులు డాట్‌బాల్స్ ఉన్నాయి. టీ20 క్రికెట్లో ఇన్ని డాట్‌బాల్స్ ఉండడం ఎవరు ఒప్పుకోరు. ఈ విషయం నన్ను చాలా బాధించింది. తర్వాత ఆడబోయే మ్యాచ్‌ల్లో మా మైండ్‌సెట్ మార్చుకొని బరిలోకి దిగుతాం. దుబాయ్‌లో బౌండరీలు కొట్టడం చాలా కష్టంగా ఉంది. ఇండియాతో పోలిస్తే ఇక్కడి మైదానాల్లో బౌండరీలు చాలా దూరంలో ఉన్నాయి. దీంతో బౌండరీలు బాదే విషయంలో మాకు మరింత ప్రాక్టీస్ కావాల్సి ఉంది.'అని తెలిపాడు. (చదవండి : 'ఆర్చర్ రెడీగా ఉండు .. తేల్చుకుందాం') కేకేఆర్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ మొత్తం సాదాసీదాగా సాగింది జానీ బెయిర్ స్టోతో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన వార్నర్‌తో పాటు ఒక్క బ్యాట్స్‌మన్ కూడా కావాల్సినంత దూకుడును ప్రదర్శించలేకపోయాడు. కోల్‌కతా పదునైన బౌలింగ్ కూడా అందుకు కారణంగా చెప్పవచ్చు. నరైన్ ఓవర్లో వార్నర్ ఒక సిక్స్, ఫోర్ కొట్టినా... తర్వాతి ఓవర్లోనే కమిన్స్ చక్కటి బంతితో బెయిర్‌స్టో (5)ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. పుట్టినరోజునాడు బెయిర్‌స్టోకు మైదానంలో కలిసి రాలేదు. ఆ తర్వాత కూడా కేకేఆర్ బౌలర్లు ప్రత్యర్థిపై బ్యాట్స్‌మన్‌పై ఒత్తిడిని కొనసాగించారు. వరుణ్ చక్రవర్తి వేసిన తొలి బంతినే అర్థం చేసుకోవడంలో తడబడి వార్నర్ రిటర్న్ క్యాచ్ ఇవ్వడంతో రైజర్స్ కీలక వికెట్ కోల్పోయింది. మనీష్ పాండే అర్థసెంచరీతో మెరిసినా... సరైన హిట్టింగ్ చేసేవారే కరువయ్యారు. దీంతో సన్‌రైజర్స్ నామమాత్రపు స్కోరుకే పరిమితమయింది. అయితే గతంలో తక్కువ స్కోర్లు నమోదు చేసినా బౌలర్ల బలంతో గెలిచే ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్‌లో మాత్రం ఏం చేయలేకపోయింది. శుభమన్ గిల్ అద్భుత బ్యాటింగ్.. మోర్గాన్ దూకుడు ఇన్నింగ్స్ ముందు సన్‌రైజర్స్ బౌలర్లంతా తేలిపోయారు. కాగా సన్‌రైజర్స్ తన తర్వాతి మ్యాచ్ సెప్టెంబర్ 29న ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఎదుర్కోనుంది. -
'సెంచరీగా మలిచి ఉంటే బాగుండేది'
అబుదాబి : ఐపీఎల్ 13వ సీజన్లో కోల్‌కతాపై విజయం తమ జట్టులో జోష్ నింపిందని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. మ్యాచ్ అనంతరం జట్టు సమిష్టి ప్రదర్శనపై రోహిత్ స్పందించాడు.' చెన్నైతో జరిగిన మొదటి మ్యాచ్‌లో ఓటమి తర్వాత మా గేమ్‌ప్లాన్‌ను మార్చాలనుకున్నాం. అందుకు తగ్గట్టే కోల్‌కతాతో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసే అవకాశం రావడంతో దూకుడుగా ఆడాలనే నిశ్చయించుకున్నాం. దానికి తగ్గట్టే మా ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాం. గేమ్‌ప్లాన్ సరిగ్గా రావడంతో మ్యాచ్ గెలిచాం. దీనికి తోడు జట్టు సమిష్టి ప్రదర్శన కలిసొచ్చింది. ఇక నా ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నా. 54 బంతులెదుర్కొని 80 పరుగులు చేయడం సంతోషమే.. దానిని సెంచరీగా మలిస్తే బాగుండేది. సీఎస్కేతో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో జరిగిన పొరపాటును రిపీట్ కాకుండా చూసుకోవాలనుకున్నా. అందుకు తగ్గట్టే ఆడుతూ.. పిచ్ నా కంట్రోల్లోకి వచ్చిన తర్వాత బ్యాట్ ఝుళిపించా. (చదవండి : కమిన్స్ విఫలం వెనుక కారణం ఇదే) అంతేగాక మధ్య ఓవర్లలో ఎంతసేపు నిలబడితే చివర్లో అంత వేగంగా పరుగులు సాధిస్తామనే 50 పరుగులు తర్వాత కాస్త నెమ్మదించాను. కానీ అనూహ్యంగా 80 పరుగుల వద్ద ఔట్ కావాల్సి వచ్చింది. అప్పటికే అలసిపోయాను అనే ఫీలింగ్ కలిగింది.. దాంతో సెంచరీ చేస్తే బాగుండు అనే ఫీలింగ్ కలగలేదు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే మా జట్టు ముందు మ్యాచ్‌తో పోలిస్తే చాలా మెరుగుపడింది. జట్టుతో ఆలస్యంగా కలిసినా బౌల్ట్, జేమ్స్ పాటిన్సన్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. అయితే యూఏఈలో ఐపీఎల్ జరుగుతుందని ముందు మేం ఊహించలేదు. కానీ మా పేస్ పవర్ ముంబై వాంఖడేలో సరిగ్గా సరిపోయేది. కానీ ఇక్కడ స్పిన్ బౌలింగ్‌కు ఎక్కువగా అనుకూలిస్తున్నా.. మా బౌలర్లు మంచి ప్రదర్శనే కనబరిచారు. రానున్న రోజుల్లో దీనిని ఇలాగే కొనసాగిస్తామ’ని చెప్పకొచ్చాడు. కాగా రోహిత్ శర్మ ఐపీఎల్లో మరో 10 పరుగులు చేస్తే 5 వేల పరుగులు సాధించిన మూడో ఆటగాడిగా రికార్డులెక్కనున్నాడు. ఇప్పటివరకు రోహిత్ ఐపీఎల్లో 190 మ్యాచ్‌ల్లో 4990 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 37 అర్థ సెంచరీలు ఉన్నాయి. రోహిత్ కంటే ముందు కోహ్లి, రైనాలు ఐపీఎల్లో 5 వేల పరుగులు సాధించారు. రోహిత్ శర్మ మరో అరుదైన ఘనత కూడా సాధించాడు. కేకేఆర్‌తో మ్యాచ్‌లో భాగంగా ఐపీఎల్లో 200 సిక్సర్లు బాదిన క్రికెటర్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. ఐపీఎల్లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు విండీస్ స్టార్ క్రిస్ గేల్ (కింగ్స్ ఎలెవన్ పంజాబ్) పేరిట ఉంది. గేల్ 326 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉండగా, ఏబీ డివిలియర్స్ 214, ఎంఎస్ ధోనీ 212 సిక్సర్లతో తరువాతి స్థానాల్లో ఉన్నారు. సురేష్ రైనా 194 సిక్సర్లతో టాప్ 5లో ఉన్నాడు. కాగా ముంబై ఇండియన్స్ తన తర్వాతి మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో సెప్టెంబర్ 28న తలపడనుంది. (చదవండి : కోట్లు పెట్టి కొన్నాం.. ఇలా అయితే ఎలా!) -
జియో.. సిక్సర్!
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్)లో భాగమైన జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. తాజాగా అబుధాబికి చెందిన సార్వభౌమ సంస్థ ముబాదలా ఇన్వెస్ట్మెంట్ కంపెనీ (ముబాదలా) జియోలో 1.85 శాతం వాటాలు కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ దాదాపు రూ. 9,094 కోట్లు. గడిచిన సుమారు నెలన్నర వ్యవధిలో జియోకి ఇది ఆరో డీల్. ఇప్పటిదాకా కంపెనీలోకి దాదాపు రూ. 92,202 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ‘జియో ప్లాట్‌ఫామ్స్‌లో ముబాదలా రూ. 9,093.60 కోట్లు ఇన్వెస్ట్ చేస్తోంది. దీని ప్రకారం కంపెనీ విలువ రూ. 5.16 లక్షల కోట్లుగా ఉంటుంది‘ అని సంస్థ వెల్లడించింది. అంతర్జాతీయ టెక్ దిగ్గజాలు ఫేస్బుక్, సిల్వర్ లేక్, విస్టా ఈక్విటీ పార్ట్నర్స్, జనరల్ అట్లాంటిక్, కేకేఆర్, ముబాదలా ఇప్పటిదాకా ఇన్వెస్ట్ చేశాయి. టెలికం సేవలు అందించే జియో ఇన్ఫోకామ్ సహా డిజిటల్ వ్యాపార విభాగాలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తెస్తూ రిలయన్స్ ఇండస్ట్రీస్.. జియో ప్లాట్‌ఫామ్స్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జియోకు 38.8 కోట్ల పైగా యూజర్లు ఉన్నారు. వాటాలు ఇలా.. ఈ ఏడాది ఏప్రిల్ 22న జియోలో అమెరికాకు చెందిన సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ 9.99% వాటా కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ రూ. 43,574 కోట్లు. ఆ తర్వాత కొద్ది రోజులకే సిల్వర్ లేక్ రూ. 5,666 కోట్లతో 1.15% వాటాలు దక్కించుకుంది. మే 8న అమెరికాకు చెందిన విస్టా ఈక్విటీ పార్ట్నర్స్ రూ. 11,367 కోట్లు వెచ్చించి 2.32 శాతం వాటాలు కొనుగోలు చేసింది. ఇక, మే 17న అంతర్జాతీయ ఈక్విటీ సంస్థ జనరల్ అట్లాంటిక్ 1.34 శాతం వాటాలను రూ. 6,598 కోట్లకు దక్కించుకుంది. అటుపైన మరో ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం కేకేఆర్ కూడా రూ. 11,367 కోట్లతో 2.32 శాతం వాటాలు కొనుగోలు చేసింది. వచ్చే ఏడాది మార్చి ఆఖరు నాటికి రుణ రహిత కంపెనీగా ఆవిర్భవించాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ నిర్దేశించుకుంది. ఇందులో భాగంగానే వివిధ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా నిధుల సమీకరణ జరుపుతోంది. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే నిర్దేశించుకున్న గడువులోగానే లక్ష్యాన్ని సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయని పరిశ్రమవర్గాలు అంటున్నాయి. చేతిలో ఉన్న నగదు నిల్వలను సర్దుబాటు చేసిన తర్వాత ఈ ఏడాది మార్చి ఆఖరు నాటికి రిలయన్స్ నికర రుణభారం రూ. 1,61,035 కోట్లుగా ఉంది. పటిష్టమైన ముబాదలా పోర్ట్‌ఫోలియో.. . వినూత్న వ్యాపారాలకు తోడ్పాటు అందించేందుకు ముబాదలా 2017లో కొత్తగా వెంచర్స్ విభాగం ప్రారంభించింది. ఇది ప్రస్తుతం అమెరికా, యూరప్, మధ్య ప్రాచ్య దేశాల్లో పలు వెంచర్ ఫండ్స్‌ను నిర్వహిస్తోంది. ముబాదలా పోర్ట్‌ఫోలియో లో అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, సెమీకండక్టర్స్, మెటల్స్, మైనింగ్, ఫార్మా, మెడికల్ టెక్, పునరుత్పాదక విద్యుత్ తదితర సంస్థల్లో పెట్టుబడులు ఉన్నాయి. సిల్వర్ లేక్ మరో రూ.4,546 కోట్లు జియో ప్లాట్‌ఫామ్స్‌లో సిల్వర్ లేక్ కొత్తగా రూ. 4,547 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. ఈ సంస్థ జియోలో ఇప్పటికే రూ. 5,656 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. అంతా కలిపి 2.08% వాటా కోసం సిల్వర్ లేక్ సుమారు రూ. 10,203 కోట్లు వెచ్చించినట్లవుతుంది. తాజా పెట్టుబడులతో జియో ప్లాట్‌ఫామ్స్ సుమారు 19.90% వాటాలు విక్రయించి రూ. 92,202.15 కోట్లు సమీకరించినట్లవుతుంది. టెక్నాలజీ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసేందుకు 1999లో ఏర్పాటైన సిల్వర్ లేక్ ఇప్పటిదాకా ట్విటర్, ఎయిర్‌బీఎన్‌బీ, ఆలీబాబా వంటి దిగ్గజ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టింది. అబుధాబితో నాకు దీర్ఘకాలంగా సంబంధాలు ఉన్నాయి. ప్రపంచ దేశాలకు యూఏఈని మరింతగా అనుసంధానించడంలో ముబాదలా ప్రభావవంతంగా పనిచేయడం నాకు తెలుసు. ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థల వృద్ధిలో కీలకపాత్ర పోషించిన ముబాదలా అనుభవం మాకు ఉపయోగపడుతుంది. – ముకేశ్ అంబానీ కీలక సవాళ్లను అధిగమించే దిశగా కొంగొత్త టెక్నాలజీలను తయారు చేస్తున్న అధిక వృద్ధి స్థాయి కంపెనీలలో పెట్టుబడులు పెట్టేందుకు మేము కట్టుబడి ఉన్నాం. క్రియాశీలకంగా కలిసి పనిచేస్తాం. – ముబాదలా గ్రూప్ సీఈవో ఖల్దూన్ అల్ ముబారక్ -
ఆ డ్రైవర్‌కు రూ 2.6 కోట్ల జాక్‌పాట్..
షార్జా : కేరళకు చెందిన 43 ఏళ్ల డ్రైవర్‌కు అబుదాబిలో అదృష్టం వరించింది. ఓ మాల్లో నిర్వహించిన రాఫెల్ డ్రాలో కేరళ వాసి అబ్దుల్ సలాం షనవాస్కు ఏకంగా 2,72,260 డాలర్లు అంటే దాదాపు రూ 2.6 కోట్ల జాక్‌పాట్ తగిలింది. 1997లో తిరువనంతపురం నుంచి ఖాళీ చేతులతో కేరళ వచ్చానని, మరో 50 ఏళ్లు కష్టపడినా ఇంత సొమ్ము తనకు లభించదని షనవాస్ చెప్పుకొచ్చారు. డ్రైవర్‌గా పాతికేళ్ల నుంచి పనిచేస్తున్నా ఎక్కువ డబ్బు దాచలేకపోయానని, అబుదాబికి వచ్చిన తర్వాత నెలకు రూ 49,200 ఆర్జిస్తున్నానని అన్నారు. ఈ డ్రాలో ఎంట్రీ ఇచ్చేందుకు తాను 54 డాలర్లు వెచ్చించానని, తనను లాటరీ వరించిన విషయం ఎవరికీ చెప్పలేదని, తన భార్యకు మాత్రం భారీ సర్ప్రైజ్ ఎదురుచూస్తోందని చెప్పానని ఖలీజ్ టైమ్స్‌తో వెల్లడించారు. ఇక లాటరీ విజేతగా ఉద్విగ్న క్షణాలను ఎదుర్కొన్నానని..డ్రాలో నమోదైన తర్వాత తనకు వచ్చిన మొబైల్ మెసేజ్‌ను తాను డిలీట్ చేశానని, ఎస్ఎంఎస్ కనిపించకపోవడంతో గుండె ఆగినంత పనైందని, ఫోన్ నెంబర్ ఇతర వివరాలను సరిపోల్చుకున్న తర్వాత లాటరీ విజేతగా నిర్వాహకులు నిర్ధారించారని చెప్పారు. లాటరీ ద్వారా వచ్చే డబ్బుతో ఇటీవల తాను కొనుగోలు చేసిన స్ధలంలో మంచి ఇల్లు కట్టుకుంటామని షనవాస్ తన ప్రణాళికలు వెల్లడించారు. చదవండి : ఒక్క పోస్ట్... వంద రూపాలు -
భారత కార్మికులకు సాయంగా ఐఎస్సీ సంఘం
అబుదాబి: కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు పలు దేశాలు లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. యూఏఈలో కూడా లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో జీవనోపాధి కోసం వెళ్లిన భారతీయుల ఆర్థిక పరిస్థితి అస్థవ్యస్థమంగా మారింది. వారు పని చేసే చోట యాజమాన్యం వేతనాలు చెల్లించకపోవడంతో వారి బతుకుతెరువు ప్రశ్నార్థకంగా మారింది. ఇక అక్కడి మన భారత వలస కూలీలను ఆదుకునేందుకు తాము ఉన్నామంటూ అబుదాబిలోని ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ (ఐఎస్సీ) వారు ముందుకు వచ్చారు. (నిరుపేదలకు చేయూతగా నిలిచిన జీవీఎంసీ) ఈ సంస్థ గత 52 సంవత్సరాలుగా యూఏఈలోని మన తెలుగువారికి ఎన్నో విధాలుగా సేవలందిస్తోంది. ఇక కోవిడ్-19 నేపథ్యంలో అక్కడి తెలుగు వారిని ఆదుకునేందుకు ప్రతి ఒక్కొక్కరికి 3 వారాలకు సరిపడే విధంగా వంట సామగ్రిని అందించింది. పరిస్థితులు మెరుగయ్యే వరకు కార్మికులను ఆదుకుంటామని ఈ కార్యక్రమానికి ముఖ్యదాతగా వ్యవహరిస్తున్న లూలూ గ్రూప్ అధినేత అజిత్ జాన్సన్ తెలియజేశారు. ఈ విపత్కర పరిస్థితుల నుండి బయటపడే వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని ఐఎస్సీ సంస్థ అధ్యక్షుడు యోగేష్ చెప్పారు. ఇవే కాకుండా అన్ని కార్మిక గృహాలలో ఫేస్ మాస్క్‌లు, శానిటైజర్లు, హ్యాండ్‌వాష్‌లతో పాటు చేతి గ్లౌజులను కూడా అందజేస్తున్నామని సంఘం సంక్షేమ కార్యదర్శి రాజా శ్రీనివాస రావు పేర్కొన్నారు. యూఏఈలో కరోనా పాజిటివ్ కేసుల తీవ్రత అధికంగా ఉండటంతో ఇక్కడి ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా తమ సంఘం తరపున ఐసోలేషన్ సెంటర్ల ఏర్పాటుకు సన్నాహాలు చేశామని సంఘ కోశాధికారి షజీల్, కార్యదర్శి జయప్రదీప్ చెప్పారు. -
భార్యను కాపాడుతూ.. భర్త మృతి
దుబాయ్ : అగ్ని ప్రమాదం నుంచి భార్యను కాపాడే క్రమంలో తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భారత్‌కు చెందిన వ్యక్తి సోమవారం మృతి చెందారు. కేరళకు చెందిన అనిల్(32) మంటల్లో చిక్కుకున్న తన భార్య నీనును రక్షించే క్రమంలో వీరిద్దరూ గత సోమవారం అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో స్థానికులు ఈ దంపతులను దుబాయ్‌లోని స్థానిక ఆసుపత్రికి తరలించగా 90 శాతం కాలిన గాయలతో చికిత్స పొందుతున్న అనిల్ నేడు మరణించడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. 10 శాతం గాయాలైన ఆయన భార్య నీను ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. కాగా ఈ దంపతులకు నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడని.. ఈ ఘటనలో బాలుడు కూడా గాయపడినట్లు అధికారులు తెలిపారు. దుబాయ్‌లోని ఉమ్ అల్ క్విన్‌లో అనిల్ తన భార్య, కుమారుడితో కలిసి నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో గత సోమవారం వారి అపార్టుమెంటులోని కారిడార్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీంతో మంటల్లో చిక్కుకున్న నీనును కాపాడేందుకు వెళ్లిన అనిల్ భార్యను రక్షించేందుకు వెళ్లి తాను మంటల్లో చిక్కుకున్నాడు. దీంతో నీను అరుపులు విన్న పక్క అపార్టుమెంటు వాసులు అక్కడి వచ్చి చూసేసరికి అనిల్ మంటల్లో చిక్కుకుని కనిపించారు. మంటలను ఆర్పి దంపతులిద్దరినీ అబుదాబిలోని మఫ్రాక్ ఆస్పత్రికి తరలించారు. కాగా వైద్యులు చికిత్స అందిస్తున్న తరుణంలో నీను పరిస్థితి నిలకడ ఉండగా. బాలుడి మెరుగైన వైద్యం కోసం అబుదాబిలోని మరో ఆసుపత్రికి గత మంగళవారం తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. భార్యను కాపాడుతూ మంటల్లో చిక్కుకున్న భర్త.. -
టీ10 లీగ్‌లో యువరాజ్
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ త్వరలో అబుదాబిలో జరగనున్న టి10 లీగ్‌లో ఆడబోతున్నాడు. ఈ మేరకు మరఠా అరేబియన్స్‌కు యువీ ప్రాతినిథ్యం వహించనున్నాడు. కొంతకాలం క్రితం భారత క్రికెట్ జట్టుకు యువీ రిటైర్మెంట్ ప్రకటించడంతో అబుదాబి లీగ్‌లో ఆడటానికి మార్గం సుగమం అయ్యింది. యువీ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత గ్లోబల్ టీ20 కెనడా లీగ్‌లో ఆడగా, ఇప్పుడు అబుదాబి టీ20 లీగ్‌లో ఆడనున్నాడు. మరాఠా తరఫున శ్రీలంక ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగా, వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రేవోలతో కలిసి యువీ ఆడనున్నాడు. గత ఐపీఎల్ సీజన్ యువరాజ్ విఫలమయ్యాడు. ముంబైకు ప్రాతినిథ్యం వహించిన యువరాజ్ నాలుగు మ్యాచ్‌లు ఆడి 98 పరుగులు మాత్రమే చేశాడు. అబుదాబి టీ10 లీగ్‌లో యువీ ఆడటానికి లైన్‌క్లియర్ అయిన తర్వాత మాట్లాడుతూ.. ‘ ఈ కొత్త ఫార్మాట్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా. ప్రపంచ దిగ్గజ క్రికెటర్లు ఇందులో ఆడుతున్నారు. వారితో కలిసి ఆడటాన్ని ఆస్వాదిస్తా. టీ10 లీగ్‌ల్లో ఆడాలంటే ఎక్కువ హార్డ్ చేయాలి. ఇదొక క్రికెట్లో సరికొత్త జోష్‌ను తీసుకొచ్చే ఫార్మాట్’ అని పేర్కొన్నాడు. అబుదాబి వేదికగా నవంబర్ 15 నుంచి 24 వరకు జరగనున్న మూడో సీజన్ టీ10టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొననున్నాయి. -
అబుదాబి టీ10 లీగ్‌లో యూవీ ?
ఢిల్లీ : టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ త్వరలోనే అబుదాబిలో జరగనున్న టి10 లీగ్‌లో పాల్గొనే అవకాశం ఉన్నట్లు టోర్నమెంట్ చైర్మన్ షాజీ ఉల్ ముల్క్ తెలిపాడు. అబుదాబి వేదికగా నవంబర్ 15 నుంచి 24 వరకు జరగనున్న మూడో సీజన్ టీ10టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొననున్నాయి. దీనికి సంబంధించి బుధవారం నిర్వహించిన ఆటగాళ్ల డ్రాఫ్టింగ్‌లో భారత్ నుంచి ఒక్కర్ని కూడా ఎంపిక చేయలేదు. ఇదే విషయమై షాజీ ఉల్ ముల్క్ స్పందిస్తూ.. బీసీసీఐ నిమామాలను అనుసరిస్తూ భారత్ నుంచి రిటైర్ అయిన ఆటగాళ్లను మాత్రమే తీసుకుంటున్నట్లు స్పష్టం చేశాడు. ' ఇప్పటికే ఈ విషయమై యూవీతో చర్చలు జరిపామని, టోర్నిలో అతడ్ని ఆడించేందుకు ప్రయత్నిస్తాం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తాం' అని పేర్కొన్నాడు. డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్‌సింగ్ ఈ ఏడాది జూన్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పటికే యూవీ కెనడాలో జరిగిన గ్లోబల్ టీ20 లీగ్‌లో పాల్గొని మంచి ప్రదర్శననే నమోదు చేశాడు. తాజాగా అబుదాబి టీ10 లీగ్‌లో ఆడేందుకు యూవీ అంగీకరిస్తే అతని అభిమానులకు ఇది శుభవార్తే అవుతుంది. కాగా, ఈ లీగ్‌లో శ్రీలంక స్టార్ ఆటగాళ్లు లసిత్ మలింగ, తిసార పెరీర, నిరోషన్ డిక్వెల్లా, ఇంగ్లడ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ, పాక్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రిది ఆడనున్నట్లు తెలిసింది. -
అబుదాబిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
అబుదాబి : తెలంగాణ సాంప్రదాయానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని తెలంగాణవాసులు ఆదేశ రాజధాని అబుదాబిలో శనివారం ఘనంగా జరుపుకున్నారు. అక్కడి తెలంగాణ సంఘం గత నెలరోజులుగా ఇందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసింది. ఈ అద్భుత కార్యక్రమానికి స్థానిక ఇండియన్ సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ వేదికైంది. అయితే ఎడారి ప్రాంతం కావడం వల్ల పూలు దొరకడం చాలా కష్టం. కొనుగోలు చేయాలంటే చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం కావడంతో నిర్వాహకులు ఇండియా నుంచి రకరకాల పూలను, వందల కిలోల్లో తెప్పించి అబుదాబిని పూలవనంగా మార్చారు. శనివారం ఉదయం ఇండియా నుంచి తెచ్చిన తీరొక్క పూలతో, పల్లె వాతావరణాన్ని తలపించేలా ముస్తాబు చేశారు. ఈ వేడుక కోసం వందలాది మహిళలు, చిన్నారులు నెల రోజులు కష్టపడి రూపొందించిన నృత్య ప్రదర్శనలతో, బతుకమ్మ పాటలతో ప్రాంగణాన్ని మార్మోగించారు. ఇండియా నుంచి వచ్చిన ప్రమఖ కవి గాయకులు కోకిల నాగరాజు, సాయిచంద్‌లతో పాటు టీన్యూస్లోని ధూమ్‌ధామ్ ముచ్చట్లు యాంకర్ కుమారి ఉదయ శ్రీలు వివిధ రకాల ఆటపాటలతో ప్రేక్షకులను అలరించారు. అనంతరం తెలంగాణ సాంప్రదాయం ప్రతిబింబించేలా డప్పు వాయిద్యం, కోలాటాల సందడి మధ్యలో అన్ని బతుకమ్మలను ప్రాంగణానికి తోడ్కొని వెళ్లారు. ఈ కార్యక్రమంలో జంటల నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలంగాణ నుంచి తెప్పించిన పిండి వంటలు అందరినీ విశేషంగా ఆకర్షించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా యుఏఈలోని భారత రాయబార కార్యాలయంలో ఫస్ట్ సెక్రటరీ శ్రీమతి పూజ వెర్నెకర్, ఐఎఫ్ఎస్ అధికారిణి హాజరయ్యారు. వారుకూడా తెలంగాణ మహిళలతో బతుకమ్మ ఆడిపాడారు. తదనంతరం కార్యక్రమ నిర్వాహకులు 10 అందమైన బతుకమ్మలకు, ప్రాంగణానికి మొదటగా వచ్చిన 5 బతుకమ్మలకు, అందంగా ముస్తాబైన చిన్నారులకు, చక్కగా బతుకమ్మ నాట్యం చేసిన మహిళలకు, జంటలకు బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యదాతలైన బూర్జిల్ హాస్పిటల్, పే ఇట్, రాయల్ రెజిస్, ఎస్పాకో, ఎన్ఎంసి, యుఏఈ ఎక్సేంజ్, ఆసమ్ సలోన్, రోచన గ్రూప్ వారిని నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. చివరగా గౌరీపూజ చేసి బతుకమ్మను కృతిమ కొలనులో నిమజ్జనం చేశారు. అనంతరం ప్రసాదాలు తీసుకుని, విందు భోజనం చేశారు. ఈ కార్యక్రమాన్నిగోపాల్, వంశీ, కమలాకర్, శ్రీనివాస్, సాగర్, గంగన్న, సంతోష్, జగదీష్, రాజశ్రీనివాస రావు, అశోక్ , శ్రీనివాస్ రెడ్డి, పావని, అర్చన, వనిత, మంజు, సౌజన్య , లక్ష్మి, సుధ తదితరులు దగ్గరుండి నడిపించారు. ఈ సందర్భంగా బతుకమ్మ ఉత్సవాలను విదేశాలలో ఇంత ఘనంగా జరుపుకోవడం ఎంతో సంతోషాన్నిచ్చిందని నిర్వాహకులు తెలియజేశారు. -
కూలీ నుంచి మేనేజర్‌గా..
ఒకప్పుడు మారుమూల పల్లెలో కూరగాయలమ్మిన ఆ యువకుడు.. ఇప్పుడు అబుదాబీ మాల్స్‌లో రెస్టారెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. గల్ఫ్‌లో భవన నిర్మాణ కూలీగా జీవితం మొదలుపెట్టి పట్టుదలతో మెరుగైన జీవనానికి బాటలు వేసుకున్నాడు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వీవీరావుపేటకు చెందిన హబీబ్‌కు చిన్నప్పుడే కుటుంబ బాధ్యతలు మీదపడ్డాయి. అతని తండ్రి దుబాయిలో అనారోగ్యంతో మృతిచెందడంతో కుటుంబ పోషణ హబీబ్ చూసుకోవాల్సి వచ్చింది. స్కూల్‌కు వెళ్తూనే.. గ్రామంలో కూరగాయలు అమ్మాడు. ఇలా ఆరేళ్లు గడిచిన తర్వాత హబీబ్ గల్ఫ్‌కు వెళ్లాడు. 1998లో భవన నిర్మాణ కూలీగా అబుదాబీలో అడుగుపెట్టాడు. పదకొండు నెలల తరువాత యజమాని పనిలేదని చెప్పి పంపించాడు. ఆ తర్వాత హబీబ్ అక్కడే ఓ రెస్టారెంట్లో డిష్ వాషర్గా పనిలో కుదిరాడు. ఇంగ్లిష్ నేర్చుకుంటే జీతం ఎక్కువ వస్తుందని తెలుసుకుని ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం సంపాదించాడు. వెయిటర్‌గా.. తరువాత క్యాషియర్‌గా పనిచేశాడు. చైనీస్ డిషెస్ నేర్చుకుని కుక్‌గా ఎదిగాడు. తన చొచ్చుకుపోయే స్వభావం వల్ల మార్కెటింగ్ స్థాయికి ఎదిగాడు. తరువాత పీఆర్వోగా సైతం పనిచేశాడు. తాను పనిచేసే రెస్టారెంట్ కొత్త బ్రాంచ్‌లకు ఉద్యోగులు అవసరం ఉంటుండడంతో తన గ్రామం వారిని, స్నేహితులకు ఉపాధి చూపించాడు. 40 మందికి ఉచితంగా వీసాలిప్పించాడు. కొంత కాలం తర్వాత స్వస్థలానికి వచ్చిన ఆయన.. వివిధ వ్యాపారాలు నిర్వహించాడు. అవి కలిసిరాకపోవడంతో ఆర్థికంగా కొంత నష్టపోయాడు. దీంతో మళ్లీ గల్ఫ్ బాట పట్టాడు. అబుదాబీలో మూడు సంవత్సరాలుగా కౌలూన్ చైనీస్ రెస్టారెంట్ బ్రాంచ్‌కు మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. పడి లేచిన కెరటంలా హబీబ్ జీవన ప్రస్తానం కొనసాగింది. ఉర్దూ, హిందీ, ఇంగ్లిష్, మలయాళం, నేపాలీ, అరబ్బీ భాషలపై ఆయనకు పట్టుంది. కాగా, హబీబ్ ప్రస్తుతం స్వగ్రామానికి కోఆప్షన్ సభ్యుడిగా ఎంపికయ్యాడు.-తోకల ప్రవీణ్, మల్లాపూర్ -
ప్రధాని మోదీకి ‘జాయెద్ మెడల్’
దుబాయ్: ప్రధాని మోదీకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) ప్రభుత్వం అత్యున్నత జాయెద్ పురస్కారాన్ని ప్రకటించింది. ద్వైపాక్షిక వ్యూహాత్మక సంబంధాల బలోపేతానికి విశేషంగా కృషి చేసినందుకు గుర్తింపుగా మోదీని ఈ పురస్కారంతో గౌరవిస్తున్నట్లు యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా జాయెద్ అల్ నహ్యాన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘భారత్‌తో మాకున్న చారిత్రక, సమగ్ర వ్యూహాత్మక సంబంధాలను మా ప్రియ స్నేహితుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యున్నత స్థాయికి చేర్చారు. ఆయన కృషికి గుర్తింపుగా యూఏఈ అధ్యక్షుడు జాయెద్ పురస్కారాన్ని ప్రకటించారు’ అని అబూధాబీ యువరాజు, యూఏఈ సైనిక దళాల డిప్యూటీ కమాండర్ మొహమ్మద్ బిన్ జాయెద్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘రెండు దేశాల మధ్య ఎంతోకాలంగా ఉన్న మైత్రిని, ఉమ్మడి వ్యూహాత్మక సహకారాన్ని ఉన్నతస్థాయికి చేర్చడంలో ప్రధాని మోదీ పాత్రకు ఈ పురస్కారమే గుర్తింపు’ అని ఖలీజ్ టైమ్స్ పత్రిక పేర్కొంది. -
మోదీకి మరో అంతర్జాతీయ అవార్డు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం దక్కింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం అందించే ఆ దేశ అత్యున్నత పౌరపురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ జాయెద్’ను మోదీకి ప్రకటించింది. భారత్- యూఏఈ దేశాల మధ్య సంబంధాల్ని మెరుగుపరచినందుకు ఈ పురస్కారాన్ని మోదీకి ప్రదానం చేయనున్నట్టు తెలిపింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ గతంలో ఈ పురస్కారం అందుకున్నారు. అబుదాబీ యువరాజు, యూఏఈ ఆర్మీ డిప్యూటీ సుప్రీం కమాండర్ షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ ఈ అవార్డును నరేంద్ర మోదీకి బహూకరించనున్నారు. ‘‘భారత్‌తో చరిత్రాత్మక, సమగ్ర, వ్యూహాత్మక సంబంధాలు మెరుగుపడటంలో నా ప్రియ మిత్రుడు నరేంద్ర మోదీ కీలక పాత్ర పోషించారు. మోదీ కృషి ఫలితంగానే ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతమయ్యాయి. రెండు దేశాల మధ్య సత్సంబంధాల కోసం పాటుపడిన మోదీకి జాయేద్ అవార్డు ఇవ్వడం గౌరవంగా భావిస్తున్నామ’’ని యువరాజు షేక్ మహమ్మద్ ట్వీట్ చేశారు. -
యూఏఈలో తెలంగాణా అవతరణ దినోత్సవ వేడుకలు
అబూదాబీ : తెలంగాణ రాష్ట్రం అవతరించి నాలుగు సంవత్సరాలు పూర్తైన సందర్బంగా తెలంగాణా సంఘం ఆధ్వర్యంలో యూఏఈలోని అబూదాబీలో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకున్నారు. పవిత్ర రంజాన్ మాసం కావడంతో యుఏఈ ప్రభుత్వం ఎటువంటి వినోద కార్యక్రమాలు జరుపరాదని నిర్ణయించడంతో తెలంగాణా నుండి కళాకారులను పిలవకుండానే ఈ కార్యక్రమం జరిపామని నిర్వాహకులు తెలిపారు. అక్కడే నివసిస్తున్న తెలంగాణకు సంబంధినవారి సమక్షంలో సంఘ సభ్యుడికి చెందిన అతిథి గృహంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణా తల్లికి దీప ప్రజ్వలన చేసి తదనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. చిన్నారి సంజన పాడిన ముప్పై ఒక్క జిల్లాల ప్రాశస్త్యం తెలియ జేసే పాటతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. మాస్టర్ కవీష్ పాడిన జయహే తెలంగాణా పాట ఒక్క సారిగా అక్కడి వాతావరణాన్ని వేడెక్కించింది. సంకల్ప్, సంస్కృతిలు హైదరాబాద్ చారిత్రక ప్రాశస్త్యం పై పాడిన పాట అందరినీ అలరించింది. తదనంతరం మరెన్నో తెలంగాణా భావ జాలం ఉన్నగీతాలను చిన్నారులు పాడి కార్యక్రమానికి వచ్చిన వారిని అలరింపజేశారు. సంఘ సభ్యులందరూ కలిసి జై తెలంగాణా అని రాసి ఉన్న కేక్ కట్ చేసి జయహే జయహే తెలంగాణా గీతం పాడి కార్యక్రమానికి ముగింపు పలికారు. చివరగా సంఘ ప్రతినిధులు వంశీ, కమలాకర్, రాజా శ్రీనివాస్, సదానంద్, గంగా రెడ్డి, గోపి, పల్లవి, పావని, అర్చన, రోజా, భాస్కర్ తదితరులుమాట్లాడుతూ బంగారు తెలంగాణా నిర్మాణం లో గల్ఫ్ లో ఉంటున్న తెలంగాణీయుల పాత్ర ఎంత గానో ఉందన్నారు. తెలంగాణా జాతి పిత సిద్దాంత కర్త అయిన ఆచార్య జయశంకర్ పాత్ర తెలంగాణా రాష్ట్ర అవతరణలో ఎంతో ఉందని సభికులు అభిప్రాయ పడ్డారు. జయశంకర్ ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు . తమ ఆట పాటలతో ప్రేక్షకులందరిని అలరించిన చిన్నారులకు బహుమతి ప్రదానం చేశారు. -
ఉపాధి కోసం వెళ్లి...
పేదరికంలో మగ్గిపోతున్న కుటుంబాలకు ఆశాదీపాలుగా ఉన్న ఇద్దరు యువకుల ఆయువు అంతలోనే తీరిపోయింది. ఉన్న ఊరును, కన్నవారిని వదిలి వేరే ప్రాంతాలకు వెళ్లిన వారిని మృత్యువు కాటేసింది.దీంతో ఆ కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. ఉపాధి కోసం అబుదాబీకి వెళ్లిన మునగపాక మండలం మడకపాలెం యువకుడు అక్కడ గుండెపోటుతో మృతి చెందగా, మాడుగుల మండలం వీరనారాయణంకు చెందిన మరో యువకుడిని రైలు రూపంలో మృత్యువు కబళించింది. మునగపాక(యలమంచిలి): ఆర్థిక ఇబ్బందుల నుంచి కుటుంబాన్ని గట్టెక్కించాలని భావించాడు. ఇక్కడే ఉంటే ఆ స్థాయిలో సంపాదించలేనని అనుకున్నాడు. సంసాదన కోసం దేశం కాని దేశం వెళ్లాడు. కష్టాలు తీరుతాయని ఆశిస్తున్న సమయంలో గుండెపోటుకు గురై ఓ యువకుడు మృతి చెందడంతో కుటుంబం వీధినపడాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని మడకపాలెం గ్రామానికి చెందిన కొత్తపల్లి నూకరాజు,నరసమ్మ దంపతులకు ఇద్దరు సంతానం, కూలీపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కుమార్తెకు వివాహం జరిగింది. పేదరికంలో ఉన్న కుటుంబానికి చేయూత ఇచ్చేందుకు కుమారుడు మహేష్(25) గాజువాక ఏజెంట్ ద్వారా ఐదేళ్ల క్రితం అబుదాబీ వెళ్లాడు. అక్కడ రెండేళ్లపాటు వెల్డర్‌గా పనిచేసి, ఇంటికి వచ్చేశాడు. ఏడాదిపాటు గ్రామంలో ఉంటూ తల్లిదండ్రులకు చేయూతగా ఉండేవాడు. 22 నెలల క్రితం మళ్లీ అబుదాబీ వెళ్లాడు. కుటుంబమంతా సంతోషంగా ఉన్న తరుణంలో వారికి పిడుగులాంటి వార్త అందింది. మహేష్ గురువారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్లి, నిద్రించే క్రమంలో 11 గంటల సమయంలో గుండెపోటుకు గురై మృతిచెందాడు. స్నేహితులు మహేష్ తల్లితండ్రులకు శుక్రవారం తెల్లవారు 2 గంటలకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న మహేష్ కుటుంబ సభ్యులు భోరున విలపించారు. కుటుంబానికి అండగా నిలిచిన మహేష్ మృతిచెందడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. రైలు ఢీకొని .. మాడుగులరూరల్: కుటుంబానికి అండగా ఉండేందుకు పనికోసం వేరే రాష్ట్రానికి వెళ్లిన ఓ యువకుడు రైలు ఢీకొని దుర్మరణం చెందాడు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలో వీరనారాయణం గ్రామానికి చెందిన అయితంశెట్టి పరమేశ్(20) ఐటీఐ పూర్తిచేసి, ఉపాధి కోసం గత నెల 28న బెంగళూరు వెళ్లాడు. అక్కడ ప్రైవేటుగా రాడ్ బెండింగ్ పనులు చేస్తున్నాడు. పరమేశ్‌తో పాటు మరో పది మంది యువకులు ఈ పని చేయడానికి వెళ్లారు. పరమేశ్ పనిచేసే స్థలానికి సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్ మీదకు గురువారం ఉదయం బహిర్భూమికి వెళ్లాడు. అకస్మాత్తుగా రైలు వచ్చి పరమేశ్‌ను ఢీకొనడంతో దుర్మరణం చెందాడు. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ట్రాక్‌పైకి వెళ్లడంతో రైలు వచ్చిన శబ్దం వినిపించలేదు. తోటి యువకులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పరమేశ్ మృతదేహానికి బెంగళూరులో పోస్టుమార్టం నిర్వహించి, అంబులెన్స్ లో శుక్రవారం స్వగ్రామానికి తీసుకొచ్చారు. వీరనారాయణంలో అంత్యక్రియలు నిర్వహించారు. పరమేశ్ తండ్రి భీమునాయుడు గతంలో హత్యకు గురయ్యాడు. పరమేశ్ మృతి చెందడంతో తల్లీసోదరుడు భోరున విలపించారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
అబూదబీలో వచ్చే ఏడాదే హైపర్‌లూప్!
విమానం కంటే వేగంగా నేల పైనే ప్రయాణించేందుకు వీలు కల్పించే హైపర్‌లూప్ టెక్నాలజీ ప్రాచుర్యం ఏటికేడాదీ పెరిగిపోతోంది. టెస్లా వ్యవస్థాపకుడు ఈలాన్ మస్క్ ఒకవైపు హైపర్‌లూప్ ట్రాన్స్పోర్ట్ టెక్నాలజీస్, ఇంకోవైపు ఈ రవాణా వ్యవస్థను ప్రపంచవ్యాప్తం చేసేందుకు పోటీ పడుతున్నారు. ఫ్రాన్స్‌లో ఇటీవలే ఓ టెస్ట్ ట్రాక్ నిర్మాణాన్ని ప్రారంభించిన హైపర్‌లూప్ ట్రాన్స్పోర్ట్ టెక్నాలజీస్.. వచ్చే ఏడాదే గల్ఫ్‌లోని అబుదబిలోనూ దీన్ని అందుబాటులోకి తెచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు అబుదబిలోని రియల్ ఎస్టేట్ కంపెనీ అల్డార్ ప్రాపర్టీస్‌తో ఒప్పందం కూడా కుదిరింది. అన్నీ సవ్యంగా సాగితే 2019లో నిర్మాణం మొదలుపెట్టడమే కాకుండా 2020 కల్లా ఒక దశ హైపర్‌లూప్‌ను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని కంపెనీ అంటోంది. అబుదబి సరిహద్దుల నుంచి దుబాయి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కలుపుతూ దాదాపు ఆరు మైళ్ల పొడవైన మార్గాన్ని నిర్మించాలన్నది కంపెనీ ప్లాన్. అలాగే 2020లో దుబాయిలో జరిగే ఎక్స్పో 2020కి హైపర్‌లూప్ నిర్మాణం పూర్తి అవుతుందని కంపెనీ అంచనా వేస్తోంది. దీర్ఘకాలంలో యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్‌లోని దేశాలన్నింటినీ కలుపుతూ హైపర్‌లూప్‌ను నిర్మించేందుకు తాము ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని హైపర్‌లూప్ ట్రాన్స్పోర్ట్ టెక్నాలజీస్ సీఈఓ బిబాప్ గ్రెస్తా అంటున్నారు. -
అబుదాబి ఆయిల్‌ఫీల్డ్‌లో ఓఎన్జీసీ విదేశ్‌కి వాటా
న్యూఢిల్లీ: ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్, దాని భాగస్వామ్య కంపెనీలు కలసి అబుదాబిలోని అతిపెద్ద ఆఫ్‌షోర్ చమురు క్షేత్రం(లోయర్ జుకమ్)లో 10% వాటాను చేజిక్కించుకున్నాయి. ఈ కొనుగోలు విలువ 600 మిలియన్ డాలర్లు (రూ.3,840 కోట్లు). చమురు నిల్వలు సమృద్ధిగా ఉన్న యూఏఈలోకి ఓ భారత కంపెనీ అడుగుపెట్టడం ఇదే ప్రథమం. ప్రధాని మోదీ, అబుదాబి రాజు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ ఆల్ నహ్యాన్ సమక్షంలో ఈ శనివారం ఈ ఒప్పందం కుదిరింది. ఓఎన్జీసీ విదేశ్‌తోపాటు ఐవోసీ, బీపీసీఎల్ ఈ ఒప్పందంలో భాగస్వాములుగా ఉన్నాయి. రాయితీలతో కూడిన ఈ ఒప్పందం 40 ఏళ్లు అమల్లో ఉంటుంది. ప్రస్తుతం లోయర్‌జుకమ్ ఆయిల్ ఫీల్డ్‌లో నిత్యం 4 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి జరుగుతోంది. 2025 నాటికి రోజుకు ఉత్పత్తిని 4.5 లక్షల బ్యారెళ్లకు తీసుకెళ్లాలన్నది లక్ష్యం. ఓఎన్జీసీ గ్రూపు చైర్మన్ శశి శంకర్, అడ్నాక్ గ్రూప్ చీఫ్ సుల్తాన్ అహ్మద్ ఆల్ జబీర్ ఒప్పందంపై సంతకాలు చేశారు. మరో 30% వాటా కొనుగోలుకు సామర్థ్యం కలిగిన భాగస్వాముల ఎంపిక జరుగుతోందని ఆల్ జబీర్ పేర్కొన్నారు. -
ప్రవాస భారతీయుడికి రూ.17.5 కోట్ల లాటరీ
దుబాయ్: అబుదాబిలో నివసిస్తున్న ప్రవాస భారతీయుడికి జాక్‌పాట్ తగిలింది. అతని లాటరీ టికెట్‌కు సుమారు రూ.17.5 కోట్లు వచ్చాయి. కేరళకు చెందిన సునీల్ మప్పట్టా కృష్ణన్ కుట్టి నాయర్ లాటరీలో 10 మిలియన్ల దిర్హామ్‌లు గెలుచుకున్నాడని స్థానిక మీడియా వెల్లడించింది. ఈ నగదు మొత్తాన్ని నాయర్ తన ముగ్గురు స్నేహితులతో పంచుకోను న్నారని టికెట్ ధరలో కొంత మొత్తం ఇచ్చిన అతని కొలీగ్ తెలిపాడు. -
అబుదాబిలో బతుకమ్మ సంబరాలు
రాయికల్ : అబుదాబిలోని ఇండియన్ సోషల్ సెంటర్లో శనివారం బతుకమ్మసంబరాలు అంబరాన్నంటాయి. అబుదాబీ, షార్జా, దుబాయ్, తదితర ప్రాంతాలకు చెందిన సుమారు వెయ్యి మంది మహిళలు బతుకమ్మలను తీసుకువచ్చి గౌరీపూజ నిర్వహించారు. అనంతరం బతుకమ్మ పాటలు, కోలాటాలు ఆడుతూ ఉత్సాహంగా గడిపారు. నిర్వాహకులు ఉత్తమ బతుకమ్మలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు పావని, అర్చన, రోజా, పద్మజ, లక్ష్మీ, లత, నాయకులు రాజ శ్రీనివాస్, పృథ్వీ, వంశీ, గంగారెడ్డి, గోపాల్ పాల్గొన్నారు. -
అబుదాబి ఎయిర్ పోర్టులో నటుడి అరెస్ట్
మళయాళ నటుడు జినూ జోసెఫ్ శుక్రవారం అబుదాబి ఎయిర్ పోర్టులో అరెస్టయ్యారు. ఈ విషయాన్ని ఆయనే తన ఫేస్ బుక్ అకౌంట్లో శుక్రవారం మధ్యహ్నం పోస్ట్ చేశారు. న్యూయార్క్ నుంచి అబుదాబికి ఎతిహాద్ విమానంలో బయల్దేరిన జినూ నిద్రపట్టడంలేదని టీవీ ఆఫ్ చేయాలని కోరగా అందుకు క్రూ సిబ్బందిలో ఒకరు నిరాకరించారు. ఈ సందర్భంగా జినూ, సిబ్బంది మధ్య కొద్దిపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. సిబ్బందితో జరిగిన సంభాషణను జినూ తన మొబైల్ లో వీడియో రికార్డ్ చేయడానికి ప్రయత్నించారు. దానిని సిబ్బంది అడ్డకోవడంతో వారి మధ్య చిన్నపాటి ఘర్షణ చోటు చేసుకుంది. జరిగిన సంఘటనపై సిబ్బంది ఫిర్యాదు చేయడంతో జినూను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అబుదాబి ఎయిర్ పోర్టు పోలీసులు తనను అరెస్టు చేసినట్లు జోసెఫ్ ఆ తర్వాత ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. ఎతిహాద్ ఎయిర్ సర్వీస్ సరిగా లేవని, ప్రయాణ సమయంలో సిబ్బంది తనపై వివిక్ష చూపారని , ఈ విషయాన్ని మిగతా అందరికీ షేర్ చేయాలని అందులో పేర్కొన్నారు. -
అబుదాబి విజేత రోస్ బర్గ్
అబుదాబి: ఫార్ములావన్ సీజన్ లో చివరి రేసు అబుదాబి గ్రాండ్‌ప్రిలో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్ రేసును పోల్ పొజిషన్ నుంచి ప్రారంభించిన రోస్ బర్గ్ విజేతగా నిలిచాడు. 55 ల్యాప్ ల రేసును రోస్ బర్గ్ ఒక గంటా 38 నిమిషాల 30. 175 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. రోస్ బర్గ్ కంటే ఎనిమిది నిమిషాల 217 సెకన్లు వెనుకబడ్డ అతని సహచర రేసర్ హమిల్టన్ రెండో స్థానం దక్కించుకున్నాడు. ఫెరారీ జట్టు డ్రైవర్ రైకోనెన్ మూడో స్థానాన్ని సాధించాడు. కాగా, ఫోర్స్ ఇండియాకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు సెర్గియో పెరెజ్, నికో హుల్కెన్‌బర్గ్ వరుసగా ఐదు, ఏడు స్థానాలతో సంతృప్తి పడ్డారు. అంతకుముందు మెక్సికన్ గ్రాండ్ ప్రి , బ్రెజిల్ గ్రాండ్ ప్రిలో విజేతగా నిలిచిన రోస్ బర్గ్ అదే ఊపును అబుదాబి గ్రాండ్ ప్రిలో కూడా కొనసాగించాడు. దీంతో ఈ సీజన్ లో ఆరో టైటిల్ ను తన ఖాతాలో వేసుకున్న రోస్ బర్గ్... ఓవరాల్ గా 14వ టైటిల్ ను సాధించాడు.