
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ త్వరలో అబుదాబిలో జరగనున్న టి10 లీగ్‌లో ఆడబోతున్నాడు. ఈ మేరకు మరఠా అరేబియన్స్‌కు యువీ ప్రాతినిథ్యం వహించనున్నాడు. కొంతకాలం క్రితం భారత క్రికెట్ జట్టుకు యువీ రిటైర్మెంట్ ప్రకటించడంతో అబుదాబి లీగ్‌లో ఆడటానికి మార్గం సుగమం అయ్యింది. యువీ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత గ్లోబల్ టీ20 కెనడా లీగ్‌లో ఆడగా, ఇప్పుడు అబుదాబి టీ20 లీగ్‌లో ఆడనున్నాడు. మరాఠా తరఫున శ్రీలంక ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగా, వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రేవోలతో కలిసి యువీ ఆడనున్నాడు. గత ఐపీఎల్ సీజన్ యువరాజ్ విఫలమయ్యాడు. ముంబైకు ప్రాతినిథ్యం వహించిన యువరాజ్ నాలుగు మ్యాచ్‌లు ఆడి 98 పరుగులు మాత్రమే చేశాడు.
అబుదాబి టీ10 లీగ్‌లో యువీ ఆడటానికి లైన్‌క్లియర్ అయిన తర్వాత మాట్లాడుతూ.. ‘ ఈ కొత్త ఫార్మాట్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా. ప్రపంచ దిగ్గజ క్రికెటర్లు ఇందులో ఆడుతున్నారు. వారితో కలిసి ఆడటాన్ని ఆస్వాదిస్తా. టీ10 లీగ్‌ల్లో ఆడాలంటే ఎక్కువ హార్డ్ చేయాలి. ఇదొక క్రికెట్‌లో సరికొత్త జోష్‌ను తీసుకొచ్చే ఫార్మాట్’ అని పేర్కొన్నాడు. అబుదాబి వేదికగా నవంబర్ 15 నుంచి 24 వరకు జరగనున్న మూడో సీజన్ టీ10టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొననున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment