T 10 cricket
-
పొట్టి క్రికెట్లో పెను విధ్వంసం.. 28 బంతుల్లోనే శతకం
యూరోపియన్ క్రికెట్ సిరీస్‌లో ఓ అనామక ఆటగాడు పెను విధ్వంసం సృష్టించాడు. 13 సిక్సర్లు, ఏడు ఫోర్ల సాయంతో 33 బంతుల్లో ఏకంగా 115 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో అతను 28 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి, యూరోపియన్ క్రికెట్ సిరీస్ చరిత్రలో భారత సంతతికి చెందిన గౌహర్ మనన్(29 బంతుల్లో) పేరిటఉన్న ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును బద్దలు కొట్టాడు. కమ్మర్‌ఫెల్డర్ స్పోర్ట్‌వెరిన్ జట్టు తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగిన 32 ఏళ్ల అహ్మద్ ముస్సాదిక్.. టిహెచ్‌సిసి హాంబర్గ్ జట్టుపై వీరవిహారం చేయడంతో ఆ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ముస్సాదిక్ తొలి బంతి నంచే బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. స్పిన్నర్లు, పేసర్లు అన్న తేడా లేకుండా బంతి బాదడమే లక్ష్యంగా పెట్టుకుని, ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ క్రమంలో 13 బంతుల్లో అర్ధ శతకం, 28 బంతుల్లో శతకాన్ని పూర్తి చేసి ఇన్నింగ్స్ ఆఖరి బంతికి వెనుదిరిగాడు. అనంతరం 199 పరుగలు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ప్రత్యర్థి జట్టు.. 10 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి కేవలం 53 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ముస్సాదిక్ ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టు 145 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. చదవండి: టీమిండియా క్రికెటర్లు లేకుండానే ఐసీసీ అవార్డులు -
టీ10 లీగ్‌లో యువరాజ్
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ త్వరలో అబుదాబిలో జరగనున్న టి10 లీగ్‌లో ఆడబోతున్నాడు. ఈ మేరకు మరఠా అరేబియన్స్‌కు యువీ ప్రాతినిథ్యం వహించనున్నాడు. కొంతకాలం క్రితం భారత క్రికెట్ జట్టుకు యువీ రిటైర్మెంట్ ప్రకటించడంతో అబుదాబి లీగ్‌లో ఆడటానికి మార్గం సుగమం అయ్యింది. యువీ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత గ్లోబల్ టీ20 కెనడా లీగ్‌లో ఆడగా, ఇప్పుడు అబుదాబి టీ20 లీగ్‌లో ఆడనున్నాడు. మరాఠా తరఫున శ్రీలంక ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగా, వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రేవోలతో కలిసి యువీ ఆడనున్నాడు. గత ఐపీఎల్ సీజన్ యువరాజ్ విఫలమయ్యాడు. ముంబైకు ప్రాతినిథ్యం వహించిన యువరాజ్ నాలుగు మ్యాచ్‌లు ఆడి 98 పరుగులు మాత్రమే చేశాడు. అబుదాబి టీ10 లీగ్‌లో యువీ ఆడటానికి లైన్‌క్లియర్ అయిన తర్వాత మాట్లాడుతూ.. ‘ ఈ కొత్త ఫార్మాట్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా. ప్రపంచ దిగ్గజ క్రికెటర్లు ఇందులో ఆడుతున్నారు. వారితో కలిసి ఆడటాన్ని ఆస్వాదిస్తా. టీ10 లీగ్‌ల్లో ఆడాలంటే ఎక్కువ హార్డ్ చేయాలి. ఇదొక క్రికెట్లో సరికొత్త జోష్‌ను తీసుకొచ్చే ఫార్మాట్’ అని పేర్కొన్నాడు. అబుదాబి వేదికగా నవంబర్ 15 నుంచి 24 వరకు జరగనున్న మూడో సీజన్ టీ10టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొననున్నాయి. -
అబుదాబి టీ10 లీగ్‌లో యూవీ ?
ఢిల్లీ : టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ త్వరలోనే అబుదాబిలో జరగనున్న టి10 లీగ్‌లో పాల్గొనే అవకాశం ఉన్నట్లు టోర్నమెంట్ చైర్మన్ షాజీ ఉల్ ముల్క్ తెలిపాడు. అబుదాబి వేదికగా నవంబర్ 15 నుంచి 24 వరకు జరగనున్న మూడో సీజన్ టీ10టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొననున్నాయి. దీనికి సంబంధించి బుధవారం నిర్వహించిన ఆటగాళ్ల డ్రాఫ్టింగ్‌లో భారత్ నుంచి ఒక్కర్ని కూడా ఎంపిక చేయలేదు. ఇదే విషయమై షాజీ ఉల్ ముల్క్ స్పందిస్తూ.. బీసీసీఐ నిమామాలను అనుసరిస్తూ భారత్ నుంచి రిటైర్ అయిన ఆటగాళ్లను మాత్రమే తీసుకుంటున్నట్లు స్పష్టం చేశాడు. ' ఇప్పటికే ఈ విషయమై యూవీతో చర్చలు జరిపామని, టోర్నిలో అతడ్ని ఆడించేందుకు ప్రయత్నిస్తాం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తాం' అని పేర్కొన్నాడు. డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్‌సింగ్ ఈ ఏడాది జూన్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పటికే యూవీ కెనడాలో జరిగిన గ్లోబల్ టీ20 లీగ్‌లో పాల్గొని మంచి ప్రదర్శననే నమోదు చేశాడు. తాజాగా అబుదాబి టీ10 లీగ్‌లో ఆడేందుకు యూవీ అంగీకరిస్తే అతని అభిమానులకు ఇది శుభవార్తే అవుతుంది. కాగా, ఈ లీగ్‌లో శ్రీలంక స్టార్ ఆటగాళ్లు లసిత్ మలింగ, తిసార పెరీర, నిరోషన్ డిక్వెల్లా, ఇంగ్లడ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ, పాక్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రిది ఆడనున్నట్లు తెలిసింది. -
టీ10 లీగ్‌లో కోచ్‌గా సెహ్వాగ్
దుబాయ్: టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మరో జట్టుకు కోచ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అనంతరం సెహ్వాగ్ వ్యాఖ్యాతగా విధులు నిర్వర్తించడంతో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు మెంటార్‌గా వ్యవహారిస్తున్నాడు. అయితే, తాజాగా సెహ్వాగ్ మరో జట్టుతో బ్యాటింగ్ కోచ్‌గా ఉండేందుకు ఒప్పందం చేసుకున్నాడు. గతేడాది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా జరిగిన టీ10 క్రికెట్ లీగ్‌లో మరాఠా అరేబియన్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన సెహ్వాగ్.. ఈ ఏడాది అదే జట్టుకు బ్యాటింగ్ కోచ్ బాధ్యతల్ని చేపట్టనున్నాడు. ఈ మేరకు బ్యాటింగ్ కోచ్‌గా ఉండేందుకు సెహ్వాగ్ అంగీకరించిన విషయాన్ని మరాఠ అరేబియన్స్ సహ యజమాని పర్వేజ్ ఖాన్ వెల్లడించారు. ఈ లీగ్ రెండో సీజన్ నవంబర్‌లో జరగనుంది. -
10 ఓవర్ల క్రికెట్ లీగ్ లో సెహ్వాగ్!
షార్జా: ఓవర్ల పరంగా చూస్తే పరిమిత ఓవర్ల క్రికెట్ క్రమేపీ తగ్గుతూ వస్తుంది. తొలుత 50 ఓవర్ల క్రికెట్ ను పూర్తిగా ఆస్వాదించిన సగటు క్రికెట్ అభిమాని.. ఆపై 20 ఓవర్ల ఫార్మాట్ కు బాగా అలవాటు పడ్డాడు. దాంతో 50 ఓవర్ల వన్డే క్రికెట్ కు ఆదరణ బాగా తగ్గిందనే చెప్పాలి. ఇప్పుడు 20 ఓవర్ల క్రికెట్ కంటే మరింత పొట్టి ఫార్మాట్ వీక్షకుల్ని ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. అదే టీ 10 క్రికెట్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) వేదికగా జరిగే ఈ లీగ్ టెన్ క్రికెట్ గా నామకరణం చేశారు. ఇందులో పాల్గొనడానికి వీరేంద్ర సెహ్వాగ్, క్రిస్ గేల్, షాహిద్ ఆఫ్రిది, కుమార సంగక్కరలతో పాటు మరికొంత మంది అంతర్జాతీయ క్రీడాకారులు అంగీకరించారు. ఈ లీగ్ లో పంజాబీస్, పక్తూన్స్, మరాఠా, బంగ్లాస్, లంకన్స్, సింధీస్, కేరళైట్స్ జట్లు పాల్గొనున్నాయి. డిసెంబర్ 21 నుంచి 24 వరకూ షార్జా క్రికెట్ స్టేడియంలో టీ 10 లీగ్ జరుగనుంది. దాదాపు 20 మంది అంతర్జాతీయ క్రికెటర్లు టీ 10 లీగ్ లో పాల్గొనబోతున్నట్లు సమాచారం.