
దుబాయ్: టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మరో జట్టుకు కోచ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అనంతరం సెహ్వాగ్ వ్యాఖ్యాతగా విధులు నిర్వర్తించడంతో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు మెంటార్‌గా వ్యవహారిస్తున్నాడు.
అయితే, తాజాగా సెహ్వాగ్ మరో జట్టుతో బ్యాటింగ్ కోచ్‌గా ఉండేందుకు ఒప్పందం చేసుకున్నాడు. గతేడాది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా జరిగిన టీ10 క్రికెట్ లీగ్‌లో మరాఠా అరేబియన్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన సెహ్వాగ్.. ఈ ఏడాది అదే జట్టుకు బ్యాటింగ్ కోచ్ బాధ్యతల్ని చేపట్టనున్నాడు. ఈ మేరకు బ్యాటింగ్ కోచ్‌గా ఉండేందుకు సెహ్వాగ్ అంగీకరించిన విషయాన్ని మరాఠ అరేబియన్స్ సహ యజమాని పర్వేజ్ ఖాన్ వెల్లడించారు. ఈ లీగ్ రెండో సీజన్ నవంబర్‌లో జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment