HCUలో భూ రగడ.. ఓయూలో ఉద్రిక్తత | HCU Land Row: BJP Visit Protests Continue At University April 1st Updates, Check Out More Details In News Video | Sakshi
Sakshi News home page

HCUలో భూ రగడ.. ఓయూలో ఉద్రిక్తత

Published Tue, Apr 1 2025 8:57 AM | Last Updated on Tue, Apr 1 2025 12:34 PM

HCU Land Row: BJP Visit Protests Continue At University April 1st Updates

హైదరాబాద్‌, సాక్షి: హెచ్‌సీయూలో ఉద్రికత్త నెలకొంది. యూనివర్సిటీ ముట్టడికి  సీపీఎం, బీజేవైఎం నేతలు ముట్టడికి ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ తరుణంలో హెచ్‌సీయూ భూములపై బీజేఎల్పీ నేత  మహేశ్వర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క ఇద్దరూ హెచ్‌సీయూ పూర్వ విద్యార్థులే. HCU వెళ్తే ఆ ఇద్దరు మంత్రులు ఏ ముఖం పెట్టుకొని వెళ్తారు? క్యాబినెన్‌లో మంత్రుల మధ్య ఏకాభిప్రాయం లేదని స్పష్టంగా తెలుస్తుంది. రాబర్ట్ వాద్రా కోసమే భూములు అమ్మకానికి పెడుతున్నట్లు చెప్పుకుంటున్నారు. ఏ ముఖం పెట్టుకొని కేటీఆర్.. హెచ్‌సీయూ గురించి మాట్లాడుతున్నారు. BRS, కాంగ్రెస్ కలిసి ఆడుతున్న నాటకం. BRS చేసిన మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోంది. భూముల వేలం ఆపడానికి ఉద్యమిస్తాం.అభివృద్ధి అంటే భూముల అమ్మకమా?’ అని ప్రశ్నించారు.

పార్లమెంట్‌కు చేరిన హెచ్‌సీయూ భూముల రగడ :

  • రాజ్యసభ జీరో అవర్‌లో బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్
  • హెచ్‌సీయూ భూముల వేలాన్ని వెంటనే ఆపివేయాలి
  • పర్యావరణాన్ని కాపాడాలి
  • అరుదైన పక్షులు, వృక్షజాతులు అక్కడ ఉన్నాయి
  • ఉగాది పండుగ రోజున అర్ధరాత్రి హెచ్సీయూ భూముల్లో బుల్డోజర్లు నడిపించారు
  • హెచ్సీయూ భూముల అమ్మకంపై పోరాడుతున్న బీజేపీ ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేశారు
  • భూముల అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ  హెచ్‌సీయూ విద్యార్థులు ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు
  • ఉచిత హామీల పథకం కోసం భూములను అమ్మవద్దు  
  • తెలంగాణలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదు
  • రాహుల్, రేవంత్ రాజ్యాంగం నడుస్తుంది

మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం:

  • కమాండ్ కంట్రోల్ సెంటర్ కు చేరుకున్న 11మంది మంత్రులు
  • సీఎం ఎందుకు మీటింగ్ పెట్టారనే దానిపై కొనసాగుతున్న సస్పెన్స్

అధికారులపై విద్యార్థుల దాడి : డీసీపీ వినీత్‌

  • హెచ్‌సీయూలో కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళనలు

  • ఇటు ఉస్మానియాలో ఆందోళన బాట పట్టిన విద్యార్థులు  

  • హెచ్‌సీయూ భూములపై సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని మాదాపూర్‌ డీసీపీ వినీత్‌ విజ్ఞప్తి

  • ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారం టీజీఐఐసీ ఆధ్వర్యంలో కంచ గచ్చిబౌలి సర్వే నెంబర్ 25లో అభివృద్ధి పనులు 

  • అభివృద్ధి పనులు అడ్డుకున్న విద్యార్థులు 

  • అధికారులు, కార్మికులపై కర్రలు, రాళ్లతో దాడి చేశారని డీసీపీ వినీత్‌ వెల్లడి

హెచ్‌సీయూ భూముల వివాదంపై హైకోర్టులో పిటిషన్‌ :

  • కంచ గచ్చిబౌలి భూములపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. 
  • ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన వట ఫౌండేషన్‌
  • కంచ గచ్చిబౌలి భూములను జాతీయ ఉద్యానవంగా ప్రకటించాలని పిటిషన్‌
  • అత్యవసర పిటిషన్‌గా విచారణకు స్వీకరించాలని కోరిన వట ఫౌండేషన్‌ లాయర్‌
  • రేపు విచారణకు స్వీకరిస్తామని తెలిపిన హైకోర్టు                                                                                                                                                              
  • యూనివర్సిటీ భూముల్ని పరిశీలించేందుకు బయల్దేరిన బీజేపీ ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌, ధన్‌పాల్‌  సూర్యనారయణతోపాటు ఇతర బీజేపీ నేతలు యూనివర్సిటీకి వెళ్లకుండా అడ్డుకున్నారు.  
  • హెచ్‌సీయూ భూమల వేలం వ్యవహారంపై ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. దీంతో నిరసనల్ని ఉద్ధృతం చేయాలని విద్యార్థులు నిర్ణయించారు. బీజేపీ విద్యార్థి యువజన విభాగం హెచ్‌సీయూని ముట్టడిస్తారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. హెచ్‌సీయూ పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు.  

  • హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ వద్ద  ఉద్రికత నెలకొంది. హెచ్‌సీయూ భూముల్ని పరిశీలించేందుకు వెళ్తున్న బీజేపీ శ్రేణుల్ని పోలీసులు అరెస్ట్‌ చేస్తున్నారు. 

  • హెచ్‌సీయూ భూముల్ని పరిశీలించేందుకు బీజేపీ ఎమ్మెల్యేలు బయల్దేరారు. భూముల వద్ద వాస్తవ పరిస్థితుల్ని తెలుసుకోనున్నారు. ఈ తరుణంలో హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ వద్ద బీజేపీ నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అటు బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డిని హౌస్‌ అరెస్ట్‌ చేశారు.  

కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిపై నెలకొన్న వివాదంతో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (HCU) క్యాంపస్‌ అట్టుడికిపోతోంది. ఇవాళ్టి నుంచి పోరాటం ఉధృతం చేయాలని విద్యార్థి సంఘాలు నిర్ణయించాయి. ఈ క్రమంలో తరగతుల్ని బహిష్కరించి ఆందోళనకు సిద్ధమయ్యాయి. ఒకవైపు.. 

బీజేపీ ఎమ్మెల్యేలు HCU సందర్శన వేళ.. హైదరగూడ MLA క్వార్టర్స్ వద్ద భారీగా పోలీసులు మోహరించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో యూనివర్సిటీ వద్దకు వెళ్లాలని బీజేపీ నిర్ణయించింది. ఎట్టి పరిస్థితుల్లో యూనివర్సిటీని సందర్శిస్తామని అంటోంది. 

ఇప్పటికే భూముల వేలం పై నిజ నిర్ధారణ కమిటీ వేయాలని బీజేపీ నిర్ణయించింది. తద్వారా వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని భావిస్తోంది. ఇప్పటికే యువ మోర్చా ఆధ్వర్యంలో HCU భూముల వేలానికి వ్యతిరేకంగా పోరాటం నడుస్తోంది.

మరోవైపు.. వామపక్ష పార్టీలు సైతం సెంట్రల్ యూనివర్సిటీ వద్ద ఆందోళనకు సిద్ధమైంది. సెంట్రల్ యూనివర్సిటీ భూమి అమ్మకాన్ని ప్రభుత్వ వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌తో సీపీఐ, సీపీఎంలు నిరసన చేపట్టబోతున్నారు. 

గవర్నర్ స్పందించాలి HCU భూములు కాపాడాలి!

హెచ్‌సీయూ భూముల పరిరక్షణ కోసం పాటుపడుతున్న విద్యార్థులపై రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గమైన అణచివేతకు పాల్పడుతోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపిస్తున్నారు. విద్యార్థుల పోరాటానికి బీఆర్‌ఎస్‌ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో.. ఈ ఉదయం కేబీఆర్‌ పార్కు వద్ద బీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. హెచ్‌సీయూ భూముల విషయంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ..  ‘ప్రకృతిని కాపాడండి.. అది మనల్ని కాపాడుతుంది’.. ‘హెచ్‌సీయూ అడవి నరికితే.. హైదరాబాద్‌ ఊపిరి ఆగుతుంది‘ అంటూ ప్లకార్డుల ప్రదర్శనతో బీఆర్‌ఎస్‌వీ నిరసన చేపట్టింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి, పలువురు ప్రకృతి ప్రేమికులు మద్దతు తెలిపారు.

కంచె గచ్చిబౌలి భూములపై ఇప్పటికే టీజీఐఐసీ (TGIIC) కీలక ప్రకటన చేసింది. ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. ప్రాజెక్టులో సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)భూమి లేదని తెలిపింది. ఈ మేరకు టీజీఐఐసీ వెల్లడించింది.

 

 

వేడెక్కిన క్యాంపస్‌ 
హెచ్‌సీయూలో 400 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం టీజీఐఐసీకి కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ కొద్ది రోజులుగా క్యాంపస్‌లో విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. సదరు స్థలాన్ని పొక్లెయిన్‌లతో చదును చేస్తున్న విషయం తెలుసుకున్న విద్యార్థులు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తు‍న్నారు. గత రెండురోజులుగా నెలకొన్న ఉద్రిక్తతలతో HCU మొత్తం ఇప్పుడు  పోలీసు పహారాలో ఉంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement