Hyderabad Central University
-
అసలు హెచ్‌సీయూ భూములు ఎన్ని.. ప్రస్తుత వివాదం ఏంటి?
ప్రతిష్టాత్మక హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ భూముల వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. వర్సిటీ భూములను ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ఏదో సాకు చూపి వెనక్కు లాక్కుంటున్నాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. వర్సిటీ ఏర్పడిన 50 ఏళ్లలో దాదాపు 500 ఎకరాల భూమిని వెనక్కి తీసుకున్నారని అంటున్నారు. మొదట 2300 ఎకరాల్లో హెచ్‌సీయూను ఏర్పాటు చేయగా.. ఇప్పుడు యూజీసీ లెక్కల ప్రకారం 1800 ఎకరాలు మాత్రమే ఉందని ఆరోపిస్తున్నారు.తాజాగా టీజీఐఐసీ ద్వారా 400 ఎకరాలను వేలం వేసేందుకు నిర్ణయించడంతో విద్యార్థి సంఘాలు, వర్కర్లు, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది పోరాటానికి దిగారు. వీరంతా జేఏసీగా ఏర్పడి ఆందోళనకు శ్రీకారం చుట్టారు. మరోవైపు ఈ స్థలం హెచ్‌సీయూది కాదని, అందుకే కోర్టు తీర్పు మేరకే అభివృద్ధి చేసేందుకు 400 ఎకరాల భూమిని టీజీఐఐసీకి అప్పగించామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదే జరిగితే ఇక మిగిలేది 1400 ఎకరాలు మాత్రమే.హెచ్‌సీయూ పూర్వ విద్యార్థులైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని, హెచ్‌సీయూ భూములు (HCU Lands) వర్సిటీ అవసరాలకే వినియోగించేలా చొరవ చూపాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. చుట్టూ ఐటీ కారిడార్ ఉండడంతో ఈ భూముల విక్రయం ద్వారా భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 400 ఎకరాలను విక్రయిస్తే మార్కెట్ విలువ ప్రకారం రూ.10 వేల కోట్లు వస్తుందని ప్రభుత్వ అంచనా వేసిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మొదటి కేటాయించింది 2,300 ఎకరాలు హెచ్‌సీయూను సిక్స్ పాయింట్ ఫార్ములా ప్రకారం 1974లో ఏర్పాటు చేసి 2,300 ఎకరాలు కేటాయించారు. మొత్తంలో టీఐఎఫ్‌ఆర్‌కు 200 ఎకరాలు, ఐఎస్బీకి 260, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్ల కోసం 200 ఎకరాలు ఎఐఏబీకి 100, నిడ్కు 30, హెచ్‌సీయూ ఆర్టీసీ డిపోకు 9 ఎకరాలు, ట్రిపుల్ ఐటీకి 60 ఎకరాలను కేటాయించారు. అంతేకాక విద్యుత్ సబ్‌స్టేషన్, గచ్చిబౌలి స్టేడియం, ట్రిపుల్ ఐటీ (IIIT) విద్యుత్ కేంద్రం, ఎంఆర్ఓ, ఎంఈఓ కార్యాలయాలకు, జీహెచ్ఎంసీ (GHMC) వెస్ట్‌జోన్, సర్కిల్ కార్యాలయాలకు, టిమ్స్ ఆస్పత్రికి దాదాపు 100 ఎకరాలు కేటాయించారు. ఇటీవలే టీఎన్జీఓ కాలనీకి ఐఎస్బీ ప్రహరీని ఆనుకొని లింకు రోడ్డుకు 20 ఎకరాలు కూడా హెచ్‌సీయూ నుంచి సేకరించి పెద్ద రోడ్డు వేశారు.భూముల విక్రయాలు ఆపాలి ప్రభుత్వం హెచ్‌సీయూ భూముల విక్రయాలను ఆపాలి. ఇది ప్రభుత్వ విద్య, పర్యావరణ పరిరక్షణపై స్పష్టమైన దాడి. ప్రైవేటు లాభాపేక్ష కంటే ప్రభుత్వ విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. – లెనిన్, ఎస్ఎఫ్ఐ హెచ్‌సీయూ క్యాంపస్ అధ్యక్షుడుఏకతాటిపై నిలుస్తాం.. హెచ్‌సీయూ ఉన్నత విద్యకు ఒక బ్రాండ్. ఈ విద్యా సంస్థ భూమిని తీసుకోవడం దారుణం. అందరం ఏకతాటిపై నిలిచి వర్సిటీ భూములను కాపాడుకుంటా. ఇప్పటికే చాలా భూమి తీసుకున్నారు. ఇకనైనా ఆపండి. – జి.కిరణ్‌కుమార్, ఏఐఓబీసీఎస్ఏ జాతీయ అధ్యక్షుడుఎంతవరకైనా పోరాడుతాం.. హెచ్‌సీయూ భూముల పరిరక్షణ కోసం ఎంతవరకైనా పోరాటం చేస్తాం. నాణ్యమైన విద్య అందిస్తూ, పర్యావరణ పరిరక్షణకు మారుపేరైన హెచ్‌సీయూను రక్షించుకుంటాం. ఇప్పటికే ఎంతో స్థలం తీసుకున్నా ప్రత్యామ్నాయంగా స్థలం ఇవ్వలేదు. – అనిల్‌కుమార్, ఏబీవీపీ హెచ్‌సీయూ క్యాంపస్ అధ్యక్షుడుచదవండి: రూ. 100 కోట్లు విలువ చేసే భూమికి ఎసరు జీవ వైవిధ్యాన్ని కోల్పోతాం.. ప్రభుత్వ చర్యతో శివారులో జీవ వైవిధ్యాన్ని కోల్పోయే పరిస్థితి దాపురిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం వేలాన్ని రద్దు చేసి హెచ్‌సీయూ భూములను కాపాడాలని డిమాండ్ చేస్తున్నాం. – నాగరాజు, పీడీఎస్‌యూ హెచ్‌సీయూ అధ్యక్షుడు -
హెచ్‌సీయూ ‘ఐఓఈ’కి ఐదేళ్లు!
సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలోనే అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం 2019లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి (Hyderabad Central University) అత్యుత్తమ హోదాను అందించింది. వర్సిటీకి ‘ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్’ (ఐఓఈ) హోదా లభించి అయిదేళ్లు కావస్తోంది. అప్పటి నుంచి హెచ్‌సీయూ (HCU)లో మౌలిక వసతులు దశల వారీగా మెరుగుపడుతున్నా మరింత ఆధునికీకరించేందుకు మరిన్ని నిధులు మంజూరు చేయాల్సిన ఆవశ్యకతను కేంద్రం గుర్తించాల్సిన అవసరముంది.దేశంలో మూడు వర్సిటీలకే.. ‘ఐఓఈ’ హోదాను దేశంలో మూడు కేంద్రీయ విశ్వవిద్యాలయాలకే కేంద్రం గుర్తింపు ఇచ్చింది. వీటిలో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ ఉంది. మూడోది 2019లో హెచ్‌సీయూకి కల్పించడం విశేషం. దక్షిణ భారతంలో కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకైక యూనివర్సిటీగా హెచ్‌సీయూ గుర్తింపు పొందడం గమనార్హం. టాప్–500లో భాగమే లక్ష్యం.. జాతీయ అవసరాలు, ప్రపంచస్థాయి ప్రమాణాల అధ్యాపకులు, విద్యార్థులు, బోధనేతర సిబ్బందికి, విద్యా, ఆర్థిక, పరిపాలనాపరమైన మద్దతు ఇవ్వడమే ‘ఐఓఈ’ లక్ష్యం. ప్రపంచంలోని అత్యుత్తమ 500 విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా గుర్తింపు పొందడమే ఐఓఈ ధ్యేయంగా సిబ్బంది పని చేస్తున్నారు.ఇప్పటివరకు రూ.500 కోట్లతో.. మానవ వనరుల అభివృద్ది కేంద్రం, 50 గదుల ప్రత్యేక గెస్ట్ హౌస్, 400 మంది విద్యార్థినీ విద్యార్థులకు ఒక్కో వసతి గృహం, కొత్త పరిపాలనా భవనం, నాంపల్లిలోని గోల్డెన్ థ్రెషోల్డ్ భవనాన్ని పునరుద్ధరించారు. రూ.60 కోట్లతో అత్యాధునిక స్థాయి ల్యాబ్‌లలో వినియోగించే పరికరాలు అందుబాటులో తెచ్చారు. 250 మందికిపైగా అధ్యాపకుల పరిశోధనలు, వృత్తిపరమైన అభివృద్దికి నిధులను సమకూర్చారు. 1,50,00 ఎస్ఎఫ్టీతో కూడిన ఇన్నోవేషన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, రీసెర్చ్ క్లస్టర్స్, కంప్యూటర్ ట్రైనింగ్ ల్యాబ్‌లు, ఒకొక్కటి 300 మంది కూర్చొనే సౌకర్యం కలిగిన 8 ఆడిటోరియాలను నిర్మించారు. వీటితో పాటు మరిన్ని మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నారు. చదవండి: జేఈఈ మెయిన్ నిర్వహణలో ఎన్టీఏ తీరుపై విమర్శలుఅంతర్జాతీయ గుర్తింపు తెస్తాం.. హెచ్సీయూకు అంతర్జాతీయంగా గుర్తింపు తేవడమే ఐఓఈ లక్ష్యంగా పని చేస్తున్నాం. గత అయిదేళ్లలో ఎన్నో నిర్మాణాలు, శిక్షణలు, సమావేశాలు, సదస్సులు నిర్వహించాం. ఇప్పటికే కొన్నింటిని అందుబాటులోకి తెచ్చాం. వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ బీజేరావు, రిజిస్ట్రార్ డాక్టర్ దేవేష్ నిగమ్ పర్యవేక్షణలో ఐఓఈ బృందం హెచ్‌సీయూ రూపురేఖలను మార్చనుంది. – ప్రొఫెసర్ ఘనశ్యామ్కృష్ణ, హెచ్‌సీయూ ఐఓఈ డైరెక్టర్ -
జస్ట్ రిలాక్స్.. ఫుట్‌బాల్ ఆడిన సీఎం రేవంత్
సాక్షి, హైదారాబాద్: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిన్నటి(శనివారం)తో ముగిసింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బిజీబీజీగా గడిపిన నేతలు రిలాక్స్ అవుతున్నారు. రేపు పోలింగ్ జరనుండటంతో ప్రచారం మూడ్ నుంచి నేతలు నెమ్మదిగా బయటకు వచ్చి సేదతీరుతున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం ఉదయం సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్లి రిలాక్స్ అయ్యారు. అక్కడి విద్యార్థులుతో కాసేపు.. ఫుట్‌బాల్ ఆడుతూ సరదగా సేదతీరారు. ఇక రేపు (సోమవారం) లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్‌లో తన కుటుంబసభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇక.. ఇటీవల రోహిత్ వేముల కేసును రీఓపెన్ చేయాలని అతని తల్లి సీఎం రేవంత్‌ను కలిసి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో ఆమెకు సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. మరోవైపు.. ఈ రోహిత్ వేముల కేసును మళ్లీ ఓపెన్ చేస్తామని హైదరాబాద్ సీసీ కొత్త శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.#Telangana Chief Minister @revanth_anumula visits @HydUniv on Sunday morning engaging in a game of football with the students.This comes after his government followed recent developments in the 2016 Dalit scholar #RohithVemula's suicide case. The police had filed a Closure… pic.twitter.com/Q48PfDbXE6— South First (@TheSouthfirst) May 12, 2024వీడియో క్రెడిట్స్: South First@TheSouthfirst -
ప్రాణాలతో బయటపడడం అద్భుతమే
నాగపూర్: జైలు నుంచి ప్రాణాలతో బయటపడతానని ఏనాడూ అనుకోలేదని ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబా(54) చెప్పారు. సజీవంగా బయటకు రావడం నిజంగా అద్భుతమేనంటూ భావోద్వేగానికి గురయ్యారు. జైలులో శారీరకంగా, మానసికంగా ఎన్నో బాధలు అనుభవించానని చెప్పారు. అక్కడ జీవితం అత్యంత దుర్భరమని పేర్కొన్నారు. మావోలతో సంబంధాల కేసులో బాంబే హైకోర్టు సాయిబాబాను నిర్దోషిగా గుర్తిస్తూ మంగళవారం తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఆయన గురువారం నాగపూర్ సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి చక్రాల కురీ్చలో బయటకు వచ్చారు. ఈశాన్య భారతదేశంలో గిరిజనుల హక్కుల కోసం పోరాడుతున్నందుకే తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. తప్పుడు కేసులో ఇరికించి అరెస్టు చేశారని సాయిబాబా అన్నారు. జైలులోనే ప్రాణాలు పోతాయనుకున్నా.. ‘‘నా ఆరోగ్యం క్షీణించింది. ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నాను. మొదట చికిత్స తీసుకోవాలి. ఆ తర్వాతే మాట్లాడగలను. త్వరలో డాక్టర్లను కలిసి చికిత్స తీసుకుంటా. విలేకరు లు, లాయర్లు కోరడం వల్లే ఇప్పుడు స్పందిస్తున్నా. జైలులో నాకు ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు. అత్యంత కఠినమైన, దుర్భర జీవితం అనువించా. చక్రాల కుర్చీ నుంచి పైకి లేవలేకపోయా. ఇతరుల సాయం లేకుండా సొంతంగా టాయిలెట్‌కు కూడా వెళ్లలేని పరిస్థితి. ఇతరుల సాయం లేనిదే స్నానం కూడా చేయలేపోయా. జైలులోనే నా ప్రాణాలు పోతాయని అనుకున్నా. ఈరోజు నేను ఇలా ప్రాణాలతో జైలు నుంచి బయటకు రావడం అద్భుతమే చెప్పాలి. నాపై నమోదైన కేసులో సాక్ష్యాధారాలు లేవని ఉన్నత న్యాయస్థానం తేలి్చచెప్పింది. చట్టప్రకారం ఈ కేసు చెల్లదని స్పష్టం చేసింది. నాకు న్యాయం చేకూర్చడానికి ఇంతకాలం ఎందుకు పట్టింది? నాతోపాటు నా సహచర నిందితులు పదేళ్ల విలువైన జీవితాన్ని కోల్పోయారు. ఈ జీవితాన్ని ఎవరు తిరిగి తీసుకొచ్చి ఇస్తారు? జైలుకు వెళ్లినప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాను. అప్పుడు పోలియో మినహా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. కానీ, ఇప్పుడు గుండె, కండరాలు, కాలేయ సంబంధిత వ్యాధుల బారినపడ్డాను. నా గుండె ప్రస్తుతం కేవలం 55 శాతం సామర్థ్యంతో పనిచేస్తోంది. డాక్టర్లే ఈ విషయం చెప్పారు. నాకు పలు ఆపరేషన్లు, సర్జరీలు చేయాలని అన్నారు. కానీ, ఒక్కటి కూడా జరగలేదు. జైలులో సరైన వైద్యం అందించలేదు. పదేళ్లపాటు నాకు అన్యా యం జరిగింది. ఆశ ఒక్కటే నన్ను బతికించింది. ఇకపై బోధనా వృత్తిని కొనసాగిస్తా. బోధించకుండా నేను ఉండలేను’’ అని ప్రొఫెసర్ సాయిబాబా స్పష్టం చేశారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం పోరాటం కొనసాగిస్తారా? అని మీడియా ప్రశ్నించగా, భారత రాజ్యాంగాన్ని 50 శాతం అమలు చేసినా సరే సమాజంలో అనుకున్న మార్పు వస్తుందని బదులిచ్చారు. సాయిబాబా సొంత ఊరు ఆంధ్రప్రదేశ్‌లోని బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురం పట్టణం సమీపంలోని జనుపల్లె. ఆయన పాఠశాల, కళాశాల విద్య ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే కొనసాగింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నత విద్య అభ్యసించిన ఆయన అక్కడే ప్రొఫెసర్ అయ్యారు. -
విద్యాసంస్థల ర్యాంకింగ్స్ విడుదల.. టాప్ 10లో హైదరాబాద్‌కు దక్కని చోటు
సాక్షి, న్యూఢిల్లీ/రాయదుర్గం: దేశంలోని విద్యాసంస్థల్లో అన్ని విభాగాల్లో కలిపి ఐఐటీ–మద్రాస్ అత్యుత్తమ విద్యాసంస్థగా నిలిచింది. మొత్తం విభాగాల్లో ఐఐటీ–మద్రాస్‌కు మొదటిస్థానం దక్కడం ఇది ఐదోసారి కాగా, ఇంజనీరింగ్ విభాగంలోనూ వరుసగా ఎనిమిదోసారి నంబర్‌వన్ స్థానాన్ని నిలుపుకోవడం విశేషం. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్–2023) నివేదికను విద్య, విదేశీ వ్యవహారాల శాఖల సహాయ మంత్రి డాక్టర్ రాజ్‌కుమార్ రంజన్ సింగ్ సోమవారం విడుదల చేశారు. బోధనా అభ్యాసం, మౌలిక వసతులు, పరిశోధన, వృత్తిపరమైన అభ్యాసం, గ్రాడ్యుయేషన్ ఫలితం, విద్యార్థులు పొందే ఉపాధి అవకాశాలు వంటి అంశాల ఆధారంగా విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలు, డిగ్రీ కళాశాలలు, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, ఫార్మసీ, లా, మెడికల్ కాలేజీలకు ర్యాంకులను ప్రకటించారు. వీటిలో అన్ని కేటగిరీల్లో ఐఐటీ–మద్రాస్ తొలిస్థానంలో ఉండగా, ఐఐఎస్సీ–బెంగళూరు రెండో స్థానంలో, ఐఐటీ–ఢిల్లీ మూడో స్థానంలో నిలిచాయి. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఐఐటీ–హైదరాబాద్ 14వ స్థానం, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (హెచ్‌సీయూ) 20వ స్థానం, నిట్–వరంగల్ 53, ఉస్మానియా యూనివర్సిటీ 64, వడ్డేశ్వరంలోని కేఎల్ కాలేజ్ ఎడ్యుకేషనల్ యూనివర్సిటీ 50, వైజాగ్‌లోని ఆంధ్రా యూనివర్సిటీ 76వ స్థానంలో నిలిచాయి. ర్యాంకింగ్స్ కోసం 200కు పైగా యూనివర్సిటీలను సర్వేచేశారు. దరఖాస్తు చేసిన దాదాపు 8వేల సంస్థల నుంచి 2023 ర్యాంకులను ప్రకటించారు. అత్యుత్తమ వర్సిటీల విభాగంలో... ఇక అత్యుత్తమ వర్సిటీల విభాగంలో ఐఐఎస్సీ–బెంగళూరు తొలి స్థానంలో ఉండగా, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 10వ స్థానం, ఉస్మానియా యూనివర్సిటీ 36, హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 84వ స్థానంలో నిలిచింది. ఏపీలోని ఆంధ్రా యూనివర్సిటీ 43, శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ 60వ స్థానం దక్కించుకున్నాయి. ఇంజనీరింగ్ విభాగంలో ఐఐటీ–హైదరాబాద్ 8వ, నిట్–వరంగల్ 21వ స్థానంలో ఉన్నాయి. పరిశోధన విభాగంలో ఐఐటీ–హైదరాబాద్ 14వ స్థానంలో, హెచ్‌సీయూ 25వ స్థానంలో నిలిచాయి. మేనేజ్మెంట్ విభాగంలో ఐఐఎం–వైజాగ్ 29వ, ఐసీఎఫ్ఏఐ–హైదరాబాద్ 40వ స్థానంలో ఉన్నాయి. ఫార్మసీలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్–హైదరాబాద్ తొలి స్థానంలో ఉండగా, న్యాయ విభాగంలో నల్సార్ యూనివర్సిటీ 3వ స్థానంలో ఉంది. ఇన్నోవేషన్ విభాగంలో ఐఐటీ–హైదరాబాద్ 3వ స్థానంలో నిలిచింది. వ్యవసాయ విభాగంలో.. ఇక వ్యవసాయం, దాని అనుబంధ విభాగాల్లో గుంటూరులోని ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీ 20వ, వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ 31వ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్–హైదరాబాద్ 32వ స్థానంలో ఉన్నాయి. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ కోసం https://www.nirfindia.org/ వెబ్సైట్లో చూడొచ్చు. సమష్టి కృషితోనే సాధ్యం జాతీయ, అంతర్జాతీయస్థాయిలో మంచి గుర్తింపే లక్ష్యం. సమష్టి కృషితోనే సాధ్యం. దేశంలో టాప్– 10 విశ్వవిద్యాలయాల్లో హెచ్సీయూకు మళ్లీ ర్యాంక్‌ను పొందడం ఆనందంగా ఉంది. ఉత్తమ పద్ధతులు, నాణ్యతతో కూడిన బోధన, పరిశోధనల కారణంగా ఈ ర్యాంకు సాధ్యమైంది. భవి ష్యత్‌లో మెరుగైన ర్యాంకు సాధించేందుకు కృషి చేస్తాం. -ప్రొ. బీజే రావు, వైస్‌చాన్స్‌లర్ హెచ్‌సీయూ మానవాళి కోసం టెక్నాలజీ ఈ విజయంలో విద్యార్థులు, అధ్యాపకులతోపాటు, పూర్వ విద్యార్థుల కృషి కూడా ఉంది. మానవాళి కోసం సాంకేతిక పరిజ్ఞానం అనే నినాదంతో ఐఐటీహెచ్ ముందుకెళ్తోంది. – ప్రొ. బీఎస్ మూర్తి, ఐఐటీహెచ్ డైరెక్టర్ IIT Madras ranked best institution followed by IISC Bengaluru and IIT Delhi as per the NIRF Ranking released by the Union Ministry of Education pic.twitter.com/yAKN3uVnuU— ANI (@ANI) June 5, 2023 IISC, Bangalore ranked best university followed by JNU and Jamia Millia Islamia as per the NIRF Ranking released by the Union Ministry of Education pic.twitter.com/Jvr1OixSHz— ANI (@ANI) June 5, 2023 ఫార్మసీ విభాగంతో హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ మొదటి స్థానంలో నిలిచింది. జామియా హమ్దర్ద్, బిట్స్ పిలానీ రెండో, మూడో స్థానాలు సాధించాయి.న్యాయ విద్యలో బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ, దిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీ, హైదరాబాద్‌లోని ‘నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా’ తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. దీనికి సంబంధించిన సమగ్ర వార్తకథనం మా ఎడ్యుకేషన్ వెబ్ సైట్లో చదవండి -
హెచ్‌సీయూ ఎన్నికల్లో ఎస్ఎఫ్ఐ కూటమి జయకేతనం
రాయదుర్గం: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) విద్యార్థి సంఘ ఎన్నికల్లో ఎస్ఎఫ్ఐ కూటమి జయకేతనం ఎగురవేసింది. 2022–23 విద్యాసంవత్సరానికి విద్యార్థి సంఘ ఎన్నికల పోలింగ్‌ను శుక్రవారం నిర్వహించారు. శనివారం ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. మొత్తం 5,300 ఓట్లకు గాను 76 శాతం ఓట్లు పోలైన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఏ, డీఎస్‌యూ విద్యార్థి సంఘాల కూటమి ఘన విజయం సాధించింది. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ప్రజ్వల్ 1,838 ఓట్లు సాధించారు. ఉపాధ్యక్షుడు పృథ్వీసాయికి 1,860 ఓట్లు వచ్చాయి. ప్రధాన కార్యదర్శిగా క్రిపామారియాజార్జ్, కల్చరల్ సెక్రెటరీగా లిఖిత్‌కుమార్, జాయింట్ సెక్రెటరీగా కత్తిగణేశ్, స్పోర్ట్స్ సెక్రెటరీగా సీహెచ్ జయరాజ్ ఎన్నికయ్యారు. ఇతర పదవుల్లోనూ ఈ కూటమికి చెందిన వారే ఎన్నిక కావడం విశేషం. -
Hyderabad: హెచ్‌సీయూలో బీబీసీ నిషేధిత డాక్యుమెంటరీ ప్రదర్శన..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వివాదాస్పద డాక్యుమెంటరీ ప్రదర్శన చర్చనీయాంశంగా మారింది. హెచ్‌సీయూలో బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని ఇటీవల రెండు సంఘాలు కలిసి ప్రదర్శించినట్లు తెలిసింది. 2002 గోద్రా అల్లర్లు, రామమందిర నిర్మాణ ఘర్షణపై బీబీసీ డాక్యుమెంటరీ రూపొందించగా దానిపై భారతదేశంలో నిషేధం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. విషయం తెలుసుకున్న ఏబీవీపీ విద్యార్థి సంఘం వివాదాస్పద డాక్యుమెంటరీని ప్రదర్శించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. డాక్యుమెంటరీని ప్రదర్శించిన, తిలకించిన వారిపై చర్యలు తీసుకోవాలని యూనివర్సి'rటీ అధికారులకు వారు ఫిర్యాదు చేశారు. దేశంలో మళ్లి అల్లర్లు సృష్టించడానికి కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారని ఏబీవీపీ నాయకులు ఆరోపించారు. ఈ డాక్యుమెంటరీపై ఎలాంటి నిషేధం లేదని, సెన్సార్ మాత్రమే చేశారని, బీబీసీ నుంచి అనుమతి పొంది ప్రదర్శించుకోవచ్చని కొందరు వాదిస్తున్నట్లు తెలిసింది. అధికారికంగా ఫిర్యాదు రానిదే దీనిపై విచారణ చేయడం, కేసులు నమోదు చేయడం ఉండదని పోలీసులు స్పష్టం చేసినట్లు తెలిసింది. -
రంగస్థలంపై పాకుడు రాళ్ళు
‘పాకుడు రాళ్ల’ మీద స్థిరంగా నిలవడం కష్టం. కుడు రాళ్లు పట్టుకుని పైపైకి ఎగబాకడమూ కష్టమే. సినిమా రంగంలో స్త్రీల కెరీర్ పాకుడు రాళ్లపై నడక వంటిదని రావూరి భరద్వాజ రాసిన నవల ‘పాకుడు రాళ్లు’జ్ఞానపీఠ్ అవార్డు గెలుచుకుంది. తెలుపు నలుపు కాలం నాటి నటీమణి జీవితాన్ని ఆధారం చేసుకుని 1978లో రాసిన ఈ నవల ఇప్పుడు నాటకంగా ప్రదర్శితమవుతోంది. ఒక భారీ నవలను నాటకంగా మలచడం కష్టమైనా దర్శకురాలు నస్రీన్ ఇషాక్ విజయం సాధించింది. ఒక మహిళ ప్రధాన పాత్ర వహించే ఈ నాటకానికి మరో మహిళ దర్శకత్వం వహించడం, వస్తువు ఈ కాలానికి కూడా రిలవెంట్గా ఉండటంతో ఇప్పటికి ఆరు ప్రదర్శనలు పూర్తి చేసుకుంది. నస్రీన్ ఇషాక్ పరిచయం... నవలను నాటకంగా మలచడంలో ఆమె సాధక బాధకాలు... గుంటూరు జిల్లాలోని ఒక ఊరిలో నాటకాలు ఆడే అమ్మాయి మంగమ్మ మొదట చెన్నైకి చేరి, అక్కడ ‘మంజరి’గా మారి, నటిగా టాప్‌స్టార్ అయ్యి, ఆ తర్వాత బొంబాయిలో ఎదిగి, భారతదేశం తరఫున సాంస్కృతిక రాయబారిగా అమెరికా వరకూ వెళ్లగలిగింది. అయితే ఆమె ముగింపు? ఆత్మహత్య. సినిమా రంగపు పాకుడురాళ్లు ఆమెను చివరకు పతనం అంచునే పడేస్తాయి. ఈ మంగమ్మ అను మంజరి కథనే రచయిత రావూరి భరద్వాజ ‘పాకుడురాళ్లు’ నవలగా రాశారు. నవల వచ్చాకగాని ఆ తర్వాతగాని ఈ మంజరి ఎవరి కథ అనేది ఆయన బహిరంగ పరచలేదు. మూకీల నుంచి టాకీలుగా సినిమా మారుతుండగా టాప్‌స్టార్ అయిన ఒక హీరోయిన్ కథ అని కొంతమంది, 1950లలో టాప్‌స్టార్ అయిన మరో హీరోయిన్ కథ అని మరి కొంతమంది అంటూ ఉంటారు. అయితే రచయిత రావూరి భరద్వాజ జర్నలిస్టు కూడా కావడం వల్ల తనకు తెలిసిన సమాచారంతో, ముగ్గురు నలుగురు హీరోయిన్ల జీవితాన్ని ఒక మంజరికి ఆపాదించి రాశారని నవలలోని ఘటనలను బట్టి అర్థమవుతుంది. ఇది ఒక రకంగా కొంతమంది హీరోయిన్ల ఉమ్మడి బయోగ్రఫీ. అందుకే ఆ నవలకు అంత బలం, చారిత్రక విలువ. ఇప్పుడు నాటకంగా ‘పాకుడురాళ్లను నాటకంగా చేయడం చాలా పెద్ద సవాలు. దీనిని గంటన్నర నిడివి గల నాటకంగా చేద్దామనుకున్నాను. కానీ గంటా యాభై నిమిషాల కంటే తగ్గించలేకపోయాను’ అంటారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ థియేటర్ విభాగంలో గెస్ట్ ఫ్యాకల్టీగా పని చేస్తున్న 52 ఏళ్ల నస్రీన్ ఇషాక్. ఈమె దర్శకత్వం వహించిన ‘పాకుడు రాళ్లు’ నాటకం మొన్న జనవరి ఒకటిన విశాఖలో హౌస్‌ఫుల్ గా ప్రదర్శితమైంది. దానికి ముందు హైదరాబాద్, అద్దంకిలలో కూడా ప్రదర్శితమైంది. షోస్ రిపీట్ అవుతున్నాయి కూడా. ‘ఈ నాటకంలో మంజరి ఎదుర్కొన్న ఘటనలు నేటికీ సినిమా రంగంలో అలాగే ఉన్నాయి. ఆ మధ్య వచ్చిన మీటూ ఉద్యమాన్ని కూడా చూశాం. భరద్వాజ గారు ఈ నవలను విస్తృత ఘటనలతో రాశారు. మంజరి తానే బాధితురాలిగా ఉండి ఆ తర్వాత ఎదుటివారిని ఆడించే శక్తిమంతురాలు అవుతుంది. నవలలో ఆమె పాత్ర అంతర్గత పెనుగులాటను, దాని గాఢతను రచయిత రాయ లేదు. మంజరి పాత్రను సహానుభూతితో అర్థం చేసుకునేలా నాటకం ముగింపును మలచడానికి నవలను శోధించాల్సి వచ్చింది’ అంటారు నస్రీన్ ఇషాక్. ‘పైకి చూడటానికి ఈ నవల మంజరి తన శరీరాన్ని చూపిస్తూ ఇతరులతో ఆడిన ఆటగా ఉంటుంది. కాని లోన చూస్తే ఆ ఆట వల్ల ఆమె పడే వేదన తెలుస్తుంది’ అంటారు ఆమె. 18 మంది నటీనటులు వేదిక మీద 18 మంది నటీనటులు ఈ నాటకాన్ని ప్రదర్శిస్తారు. నవలలో ఎదురు పడే ముఖ్యపాత్రలు– కల్యాణి, రాజమణి, చంద్రం, చలపతి, మాధవరావు... ఈ పాత్రలన్నీ మంజరితో తలపడతాయి. నాటకంలో ఐదు పాటలు ఉన్నాయి. మంజరి పాత్రను భావనా వఝపాండల్ పోషించింది. ‘ఒక నటి బయోపిక్‌ను స్టేజ్ మీద ఏ మేరకు నిజాయితీగా చూపించగలమో ఆ మేరకు పాకుడురాళ్లలో చూపించాం’ అంటారు నస్రీన్ ఇషాక్. తెలుగు రాకపోయినా నస్రీన్ ఇషాక్ది ఢిల్లీ. అక్కడే ఢిల్లీ యూనివర్సిటీలో వీధి నాటకాల నుంచి నాటకరంగం మీద ఆసక్తి పెంచుకున్నారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో సీటు సాధించి చదువుకున్నారు. 2009 నుంచి హైదరాబాద్‌లో ఉన్నారు. ‘మొదట నేను ఇంగ్లిష్, హిందీ నాటకాలు వేయించేదాన్ని. కాని ఇక్కడ ఉన్నదంతా తెలుగు నటులు. మాతృభాషలో నాటకం ఆడటం నటులకు చాలా ముఖ్యం. అందుకని తెలుగు సాహిత్యం నుంచి నాటకాలను ఎంచుకోవాలని నిశ్చయించుకున్నాను. మొదట ‘మైదానం’ నవలను నాటకం చేశాను. ఇప్పుడు ‘పాకుడు రాళ్లు’ చేశాను. నాటకం చేయాలని అనుకున్నాక ఒక నెల రోజుల పాటు రీడింగ్ సెషన్స్ ఉంటాయి. మా నటీనటులు ఒక్కో చాప్టర్ చదువుతూ దాని సారాంశం నాకు హిందీలోనో ఇంగ్లిష్‌లోనో చెబుతూ వెళతారు. నవల ఆత్మను పట్టుకుంటే నాటకం వేయడానికి భాష అడ్డంకి కాదు అని నా భావన. సన్నివేశాల వరుస, నటీనటుల ఎక్స్ప్రెషన్స్, ఎనర్జీ, ఇన్వాల్వ్మెంట్, ఫీలింగ్, వేరియేషన్స్... వీటిని నేను చూసుకుంటాను. నాకు తెలిసిపోతాయి’ అంటారు నస్రీన్. ఆమె భర్త నౌషాద్ ముహమ్మద్ది కేరళ. అతను సెంట్రల్ యూనివర్సిటీ థియేటర్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాడు. ‘పాకుడురాళ్లు నాటకాన్ని మరెన్నో ప్రదర్శనలు వేయాలని ఉంది’ అంటున్న నస్రీన్ కోరిక నెరవేరాలని కోరుకుందాం. (క్లిక్ చేయండి: స్త్రీ శక్తి.. సూపర్ ఫైటర్) -
థాయ్ విద్యార్థినిపై అత్యాచార యత్నం.. హిందీ నేర్పిస్తానని ఇంటికి..
గచ్చిబౌలి (హైదరాబాద్): హిందీ భాష నేర్చుకునేందుకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి వచ్చిన థాయ్‌లాండ్ విద్యార్థినిపై ఒక ప్రొఫెసర్ అత్యాచార యత్నం చేశాడు. హిందీపాఠాలు నేర్పి స్తానంటూ తన ఇంటికి తీసుకెళ్లి.. కూల్‌డ్రింక్‌లో మద్యం కలిపి ఇచ్చి లైంగికదాడికి ప్రయత్నించాడు. వర్సిటీలో బాధితురాలితోపాటు చదివే విద్యార్థుల ద్వారా విషయం తెలుసుకున్న ప్రొఫెసర్లు గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో ప్రొఫెసర్ తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తూ విద్యార్థి సంఘాలు ధర్నాకు దిగాయి. వర్సిటీ అధికారులు సదరు ప్రొఫెసర్‌ను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించడంతో ధర్నా విరమించారు. ఈ కేసు వివరాలను మాదాపూర్ ఏసీపీ రఘునందన్‌రావు వెల్లడించారు. హిందీ నేర్పిస్తానంటూ.. థాయ్‌లాండ్‌కు చెందిన విద్యార్థిని (24) హెచ్‌సీయూలో ఎంఏ హిందీ చదువుతోంది. 25రోజులుగా హెచ్‌సీయూలోని ఇంటర్నేషనల్ స్టడీస్ హస్టల్లో ఉంటోంది. వర్సిటీ హిందీ విభాగం ప్రొఫెసర్ రవి రంజన్ ఆమెపై కన్నువేశాడు. హిందీ నేర్పిస్తానని, తన నివాసానికి రావాలని కోరాడు. శుక్రవారం క్లాసులు ముగిశాక సాయంత్రం 4 గంటల సమయంలో తన కారులో ఎక్కించుకుని మసీదుబండ ప్రాంతంలోని తన ఫ్లాట్‌కు తీసుకువెళ్లాడు. పాఠాలు చెప్తూ కూల్‌డ్రింక్‌లో మద్యం కలిపి థాయ్‌లాండ్ విద్యార్థినికి ఇచ్చాడు. తర్వాత ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించాడు. తీవ్రంగా ప్రతిఘటించిన ఆమె.. వెంటనే థాయ్‌లాండ్‌లోని ప్రొఫెసర్‌కు ఫోన్ చేసి రవి రంజన్ అసభ్యంగా ప్రవర్తిస్తున్న విషయం చెప్పింది. థాయ్‌లాండ్ ప్రొఫెసర్ వెంటనే రవి రంజన్‌కు ఫోన్ చేసి విద్యార్థినిని వదిలేయాలని తీవ్రంగా మందలించాడు. దీనితో భయపడిన రవి రంజన్.. రాత్రి 9 గంటల సమయంలో విద్యార్థినిని వర్సిటీ హస్టల్ సమీపంలో వదిలివెళ్లిపోయాడు. బాధిత విద్యార్థిని ఈ విషయాన్ని తోటి విద్యార్థులకు చెప్పడంతో వెంటనే వర్సిటీ క్యాంపస్‌లోని హెల్త్ సెంటర్లో చేర్పించారు. విషయం తెలుసుకున్న అసొసియేట్ ప్రొఫెసర్ అలోక్ మరో ఇద్దరు హెల్త్ సెంటర్ వద్దకు వచ్చారు. అయితే థాయ్ విద్యార్థినికి హిందీ, ఇంగ్లిష్ రాకపోవడంతో ఏం జరిగిందో సరిగా చెప్పలేకపోయింది. దీనితో వారు థాయ్ ప్రొఫెసర్ సాయంతో ఆమెపై అత్యాచార యత్నం జరిగినట్టు తెలుసుకున్నారు. దీనిపై శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఐపీసీ 354, 354ఏ సెక్షన్ల కింద ప్రొఫెసర్ రవి రంజన్‌పై కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు. థాయ్ విద్యార్థిని స్టేట్మెంట్ రికార్డ్ చేశామని, షాక్‌లో ఉన్న ఆమె తేరుకున్నాక మరోసారి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామని.. అవసరమైతే సెక్షన్లు మార్చుతామని మాదాపూర్ ఏసీపీ రఘునందన్‌రావు తెలిపారు. అట్టుడికిన క్యాంపస్ ప్రొఫెసర్ రవిరంజన్ ఘాతుకం తెలిసిన హెచ్‌సీయూ విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. వర్సిటీ ప్రధాన ద్వారం లోపల స్టూడెంట్ యూనియన్, ఏబీవీపీ ధర్నాకు దిగాయి. ప్రొఫెసర్, యూనివర్సిటీ మేనేజ్మెంట్ తీరును నిరసిస్తూ ఆందోళన చేశాయి. హెచ్‌సీయూ రిజిస్ట్రార్ దేవేశ్ నిగమ్, వీసీ సర్రాజు, ఇతర అధికారులు విద్యార్థులతో చర్చలు జరిపారు. ప్రొఫెసర్ రవి రంజన్‌ను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ ఘటనపై వర్సిటీ స్వయంగా ఫిర్యాదు చేస్తుందని హమీ ఇచ్చారు. దీనితో విద్యార్థి సంఘాలు ధర్నా విరమించాయి. మహిళా సాధికారత ఉపన్యాసంతో! థాయ్ విద్యార్థినిపై అత్యాచార యత్నానికి పాల్పడిన ప్రొఫెసర్ రవి రంజన్ ఇటీవల మహిళా సాధికారతపై ఉపన్యాసం ఇచ్చినట్టు విద్యార్థులు చెప్తున్నారు. ఆయన మాట్లాడిన మాటలకు, చేతలకు ఎక్కడా పొంతన లేదంటూ మండిపడ్డారు. పోలాండ్‌లో ప్రొఫెసర్‌గా పనిచేసిన రవి రంజన్.. 2018లో హెచ్‌సీయూలో చేరినట్టు చెప్తున్నారు. బాధితురాలికి న్యాయం జరిగేదాకా పోరాటం హెచ్సీయూకు ఇప్పటివరకు మంచిపేరు ఉంది. కానీ ప్రొఫెసర్ రవి రంజన్ చర్య సమాజాన్ని సిగ్గుపడేలా చేసింది. థాయ్ విద్యార్థినిపై జరిగిన అత్యాచార యత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. బాధిత విద్యార్థినికి న్యాయం చేయాలి. అప్పటిదాకా పోరాడుతాం. – అభిషేక్ నందన్, హెచ్‌సీయూ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడు రవి రంజన్‌పై కఠిన చర్యలు చేపట్టాలి ప్రొఫెసర్లను తండ్రులుగా, అన్నలుగా భావిస్తారు. అలాంటి వారు కంచే చేను మేసినట్టుగా అత్యాచార యత్నం చేయడం సిగ్గుచేటు. ప్రొఫెసర్ రవి రంజన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి. వర్సిటీలోని వేధింపుల సెల్లో మూడు ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. దేశవ్యాప్తంగా యూనివర్సిటీల్లో ఇలాంటి వేధింపుల కేసులెన్నో పెండింగ్‌లో ఉన్నాయి. వాటిపై చర్యలు తీసుకోవాలి. – మహేశ్ నమాని, ఏబీవీపీ నేషనల్ కన్వీనర్ -
థాయిలాండ్ విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారయత్నం
-
థాయిలాండ్ విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారయత్నం.. హెచ్‌సీయూలో ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో దారుణం జరిగింది. థాయిలాండ్ విద్యార్థినిపై ఫ్రొఫెసర్ అత్యాచారయత్నం చేశాడు. హిందీ నేర్పిస్తానని ఇంటికి తీసుకెళ్లి.. బలవంతంగా మద్యం తాగించి లైంగిక దాడికి యత్నించాడు. ప్రతిఘటించిన విద్యార్థిని.. గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇప్పటికే రవిరంజన్‌పై మూడు కేసులు ఉన్నాయి. ప్రొఫెసర్ రవిరంజన్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. కాగా, సెంట్రల్ యూనివర్శిటీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గేట్ ముందు విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఫ్రొఫెసర్ రవిరంజన్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. చదవండి: కటకటాల్లోకి నిత్య పెళ్లికూతురు.. నాలుగు పెళ్లిళ్లు చేసుకొని.. -
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత
-
హెచ్‌సీయూలో 29 వరకు ‘సుకూన్–2022’
గచ్చిబౌలి: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో శుక్రవారం నుంచి సందడి నెలకొననుంది. ప్రతిష్టాత్మకమైన ‘సుకూన్’ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. హెచ్‌సీయూ క్యాంపస్‌లోని సుకూన్ గ్రౌండ్స్, కొమ్రమ్ భీమ్ ఓపెన్ డయాస్‌లో మూడు రోజులపాటు కార్యక్రమం కొనసాగనుంది. కార్యక్రమంలో భాగంగా కొలేజ్ పోటీలు, డ్యాన్స్ పోటీలు, పాటల పోటీలు, ఫేస్ పెయింటింగ్ పోటీలు, బైత్‌బాజీ కార్యక్రమం, వ్యాసరచన, ఉపన్యాస పోటీలు, రంగోలి, ముగ్గుల పోటీలను నిర్వహించనున్నారు. పోస్టర్ మేకింగ్ పోటీలు, మెహిందీ పోటీ, మొబైల్ ఫోటోగ్రఫీ, క్విజ్ పోటీలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. గురువారం హెచ్‌సీయూ విద్యార్థి సంఘం అధ్యక్షులు అభిషేక్‌నందన్ మాట్లాడుతూ ఈనెల 27,28,29 తేదీల్లో ‘సుకూన్–2022’ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. మొదటి రోజు డప్పు చందు కార్యక్రమం, ట్రైబల్ ఫోక్ షో, సూఫీ ఖవ్వాలీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. రెండో రోజు ఆర్కెస్ట్రా, రాక్ షోను నిర్వహించడం జరుగుతుందన్నారు. చివరిరోజైన మూడో రోజు డీజే నైట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. -
అమితా ‘బుద్ధుడి’పై పరిశోధన
సాక్షి, హైదరాబాద్: పులికాట్ సరస్సులోని ఓ దీవిలో ఉన్న అమితాభ బుద్ధుడి రహస్యాన్ని ఛేదించేందుకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆచార్యులు పరిశోధన ప్రారంభిస్తున్నారు. ఏపీలోని నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మండలం కుంతూరు పల్లె శివారులో నాలుగడుగుల బుద్ధుడి విగ్రహం చాలాకాలంగా ప్రశ్నార్థకంగా ఎదురుచూస్తోంది. తధాగతుడి రూపాల్లో అమితాభుడి అవతారం ఒకటి. ఆగ్నేయాసియా దేశాల్లో అమితాభ బుద్ధుడి ఆరాధన ఎక్కువ. పులికాట్ దీవిలో అమితాభ బుద్ధుడి విగ్రహం పరిశోధకులను ఆకట్టుకుంటోంది. మన దేశంలో ఈ తరహా శిల్పాలు అరుదు. ఈ ప్రాంతం ఇసుక దిబ్బలతో ఆర డుగుల ఎత్తుతో ఉంటుంది. దీంతో ఆ ప్రాంతంలో బౌద్ధ స్థూపం ఉండి ఉంటుందని భావిస్తున్నారు. గతంలో ఇక్కడ శాతవాహనుల కాలానికి చెందిన పెద్దపెద్ద ఇటుకలు వెలుగుచూశాయి. ‘1991 ప్రాంతంలో నేను శ్రీవెంకటేశ్వర వర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో పరిశోధించి బుద్ధుడి విగ్రహాన్ని గుర్తించా. ఆ సమయంలో కొన్ని ఇటుకలూ వెలుగుచూశాయి. అవి క్రీ.శ. 1–2 శతాబ్దాల కాలానికి చెందినవిగా అనిపించాయి’అని హెచ్‌సీయూ ప్రొఫెసర్ డాక్టర్ కేపీరావు ‘సాక్షి’తో చెప్పారు. ‘ఏడాది క్రితం మళ్లీ కుంటూరుకు వెళ్లాం. బుద్ధుడి విగ్రహం అలాగే ఉంది. అక్కడి దిబ్బ ప్రాంతంలో ఈనెల 24 నుంచి దాదాపు నెలన్నరపాటు తవ్వకాలు జరపాలని నిర్ణయించాం’అని తెలిపారు. ఇటుక గోడ నిర్మాణ జాడలు ‘బుద్ధుడి విగ్రహమున్న ప్రాంతంలో గతంలో భారీ ఇటుకలతో గోడ ఉండేదని, కొందరు త వ్వి ఇటుకలు తీసుకెళ్లారని స్థానికులు చెప్పా రు. అమితాభ బుద్ధుడి శిల్పం ఇక్కడ ఎందుకుందో తవ్వకాల్లో తెలుస్తుంది. ఆగ్నేయాసియాతో ఈ ప్రాంతానికి సంబంధముందా కూడా తెలుస్తుంది’ అని కేపీరావు చెప్పారు. -
క్యాంపస్ ప్లేస్‌మెంట్స్.. వార్షిక వేతనాల్లో కోత
క్యాంపస్ ప్లేస్మెంట్లకు అడ్డా అయిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీపై కోవిడ్ ఎఫెక్ట్ పడింది. ఒకప్పుడు రికార్డు స్థాయిలో వార్షిక వేతనాలు దక్కించుకున్న విద్యార్థులకు నేడు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ దేశంలో నైపుణ్యం, ప్రతిభ కలిగిన విద్యార్థులందరూ వచ్చి చేరే క్యాంపస్‌లలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఒకటి. ప్రపంచ స్థాయి కంపెనీలు తమ ఉద్యోగుల కోసం ఇక్కడికి వస్తుంటాయి. విద్యార్థులు ఫైనల్ ఇయర్లో ఉండగానే లక్షల జీతాలు చెల్లించి తమ సంస్థలో చేర్చుకుంటామంటూ ఆఫర్ లెటర్లు ఇస్తుంటాయి. కానీ ఇప్పుడు పరిస్థితి తిరగబడింది. ఈ ఏడాది ఇదే అధికం ఈ ఏడాది క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ఎంటెక్ విద్యార్థి సోమ్నాథ్పాల్ అత్యధిక వార్షిక వేతనం దక్కించుకున్న విద్యార్థిగా నిలిచారు, ఒక మల్టీ నేషనల్ కంపెనీ రూ. 17 లక్షల వార్షిక వేతనం చెల్లించే ఒప్పందం మీద సోమ్‌నాథ్‌కి అవకాశం పొందారు. అంతకు ముందు ఏడాది అత్యధిక వార్షిక వేతనం రూ. 43 లక్షలు ఉండగా కోవిడ్‌కి ముందు ఏడాది ఈ మొత్తం రూ. 45 లక్షలుగా నమోదు అయ్యింది. రూ. 20 లక్షల తేడా కోవిడ్ కారణంగా కంపెనీలు ఎక్కువ వేతనం చెల్లించేందుకు సిద్ధంగా లేవు. దీంతో ఏడాది వ్యవధిలోనే ప్రతిష్టాత్మక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వంటి చోట అత్యధిక వార్షిక వేతనాల్లో ఏకంగా 20 లక్షల వరకు తగ్గిపోయింది. ఇక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్ ప్లేస్మెంట్ సగటు వేతనం రూ. 8 నుంచి 10 లక్షల మధ్య ఉంటుండగా ఇప్పుడు అది రూ. 5 లక్షల నుంచి రూ. 6 లక్షలకు పడిపోయిందని వర్సిటీ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ ప్రేరణ తెలిపారు. ఈ కోర్సులకే ప్రాముఖ్యత క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ కోసం వస్తున్న కంపెనీలు ఎక్కువగా డేటా ఎనలటిక్స్, బిజినెస్ ఎనలటిక్స్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ తదితర రంగాల్లో ఎక్కువ ఉద్యోగాలు పొందారు. చదవండి : రైతులకు వరం.. ఐఐటీ హైదరాబాద్ సరికొత్త ఆవిష్కరణ! -
మమ్మల్ని సాదుతానని మధ్యలోనే వెళ్లిపోయింది
గచ్చిబౌలి: ‘నా చిన్న బిడ్డను కొడుకే అనుకున్నం.. కొండంత ధైర్యంగ ఉన్నం.. కానీ.. ఇలా మధ్యలోనే వదిలి వెళ్తదనుకోలే. మూణ్నెళ్లు అయితే నా చదువు పూర్తయితది.. మిమ్ముల్ని సాదేది నేనే అన్నది. మౌనికకు ఎలాంటి ఇబ్బందులు లేవు.. ఆమె చావుకు కారణాలేమిటో పోలీసులే తేల్చాలి’ అని హెచ్‌సీయూ ఎంటెక్ విద్యార్థిని ఆర్.మౌనిక తండ్రి లచ్చయ్య గచ్చిబౌలి పీఎస్‌లో కన్నీరు మున్నీరుగా విలపించారు. రోజంతా గది నుంచి బయటకు రాకున్నా యూనివర్సిటీ యాజమాన్యం ఎందుకు పట్టించుకోలేదని, కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని మంగళవారం గచ్చిబౌలి పీఎస్‌లో ఆయన ఫిర్యాదు చేశారు. శనివారం సాయంత్రం తల్లితో మంచిగానే మాట్లాడిందని, ఆదివారం నుంచి ఫోన్ ఎత్తలేదని లచ్చయ్య తెలిపారు. తన కూతురు చనిపోయేంత పిరికి కాదని, తమకే ధైర్యం చెప్పేదని అన్నారు. యూనివర్సిటీలోనే ఏమో జరిగిందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. పెళ్లి విషయంలో ఎప్పుడూ ఒత్తిడి చేయలేదన్నారు. హెచ్‌సీయూలో నానో సైన్స్‌లో ఎంటెక్ రెండో సంవత్సరం చదువుతున్న మౌనిక (27) హాస్టల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆమె ఆత్మహత్యకు కారణాలేమిటో తెలియడంలేదని పోలీసులు చెబుతున్నారు. షన్నూ.. ఐ మిస్ యూ.. ‘ఐ యామ్ ద రీజన్ ఫర్ ఎవ్రీ థింగ్, ఐయామ్ నాట్ ఎ గుడ్ డాటర్, వెరీ వెరీ సారీ అమ్మ, నాన్న. ఐ లవ్ యూ ఆల్, షన్ను మిస్‌యూ అంటూ బాసర ట్రిపుల్ ఐటీ సెమిస్టరీ మార్కుల మెమోపై మౌనిక సూసైడ్ నోట్ రాసింది. తన అక్క కూతురు షన్నును మిస్ అవుతున్నానని పేర్కొంది. క్యాట్‌కు సెల్‌ఫోన్.. మౌనిక ఆత్మహత్యకు గల కారణాలను గచ్చిబౌలి పోలీసులు అన్వేషిస్తున్నారు. ఆమె సెల్ ఫోన్ ఓపెన్ కాకపోవడంతో క్యాట్‌కు పంపారు. చాటింగ్, మెసేజ్ ద్వారా ఏదైనా క్లూ లభించే అవకాశం ఉండవచ్చని పోలీసులు చెబుతున్నారు. ప్రేమ వ్యవహరం ఏమైనా ఉందనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు. -
దేశీయ వర్సిటీల్లో హెచ్సీయూకు మొదటి స్థానం
రాయదుర్గం (హైదరాబాద్): దేశీయ యూనివర్సిటీల్లో హైదరాబా ద్ సెంట్రల్ యూనివర్సిటీ మరోసారి సత్తా చాటింది. నేచర్ ఇండెక్స్ ర్యాంకింగ్స్–2021లో మొదటి స్థానంలో నిలిచింది. నేచర్ ఇండెక్స్ ఏటా ఉన్నత విద్యాసంస్థలకు ర్యాంకింగ్స్ ప్రకటిస్తోంది. దేశంలోని అన్ని ఉన్నత విద్యా సంస్థల్లో హెచ్సీయూకు 17వ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా హెచ్‌సీయూ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ బీజేరావు మాట్లాడుతూ.. ప్రపంచ స్థాయిలో వర్సిటీకి మెరుగైన ర్యాంకింగ్ సాధించడంపై దృష్టి పెడతామని పేర్కొన్నారు. పరిశోధనలపై ప్రత్యేక దృష్టి పెట్టేందుకు ఈ ర్యాంకింగ్ దోహదం చేస్తుందన్నారు. -
హ్యుమానిటీస్‌లో హెచ్‌సీయూ టాప్
రాయదుర్గం(హైదరాబాద్): రౌండ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్(ఆర్‌యూఆర్)–2020లో గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ సత్తా చాటింది. హ్యుమానిటీస్ విభాగంలో దేశంలో మొదటి స్థానం, ప్రపంచంలో 276వ స్థానాన్ని సాధించింది. ఈ మేరకు హెచ్‌సీ యూ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. క్లారివేట్ అనలైటిక్స్ భాగస్వామ్యంతో ఆర్‌యూఆర్ ర్యాంకింగ్స్ ఏజెన్సీ.. ఆర్‌యూఆర్–2020 హ్యుమానిటీస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్‌ను విడుదల చేసింది. బోధన, పరిశోధన, అంతర్జాతీయ వైవిధ్యం, ఆర్థిక సస్టైనబిలిటీ వంటి అంశాలతోపాటు 20 సూచికలను పరిగణనలోకి తీసుకున్నారు. ప్రపంచంలో 800 పైగా విద్యా సంస్థలు ర్యాంకింగ్‌లో పాల్గొన్నాయి. ప్రపంచంలో హ్యుమానిటీస్ బోధనపరంగా హెచ్‌సీయూ 53వ స్థానం సాధించిందని వర్సిటీ వీసీ ప్రొఫెసర్ అప్పారావు తెలిపారు. -
విషాదం: హెచ్‌సీయూ ప్రొఫెసర్ ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: నగరంలో విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఆత్మహత్య చేసుకున్నారు. మెడికల్ సైన్స్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ రిషీభరద్వాజ్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. హెచ్‌సీయూలో ఆయన ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన స్వస్థలం హిమాచల్‌ప్రదేశ్. కుటుంబ కలహాలే కారణంగా పోలీసులు భావిస్తున్నారు. పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
హెచ్‌సీయూ @2
రాయదుర్గం(హైదరాబాద్): నగరంలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఘనతల్లో మరొకటి చేరింది. ఔట్లుక్–ఐసీఏఆర్ఈ ఇండియా యూని వర్సిటీ ర్యాంకింగ్స్–2020లో రెండో స్థానం పొం దింది. ర్యాంకుల జాబితాను ఆదివారం ప్రకటిం చారు. ప్రథమ స్థానంలో ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ) నిలిచింది. మొత్తం 1,000కి గాను జేఎన్‌యూ 931.67 స్కోర్ పొందింది. 887.78 స్కోర్‌తో హెచ్‌సీయూ ద్వితీయస్థానం సాధించింది. దేశంలోని అత్యుత్తమ టాప్–25 వర్సిటీలతో ఈ జాబితా వెలువడింది. ఇందులో రాష్ట్రం నుంచి హెచ్‌సీయూతోపాటు మరో వర్సిటీ ‘మనూ’చోటు దక్కించుకోవడం విశేషం. ‘మనూ’24వ ర్యాంకులో నిలిచింది. ప్రధానం గా అకడమిక్, రీసెర్చ్ ఎక్స్‌లెన్స్, ఇండస్ట్రీ ఇంటర్ఫే స్, ప్లేస్మెంట్, వసతులు, గవర్నెన్స్, అడ్మిషన్లు, డైవర్సిటీ, ఔట్రీచ్ వంటి పరిమితులలో సాధించిన ప్రగతి ఆధారంగా ర్యాంకులు కేటాయించారు. ‘మనూ’కు 24వ స్థానం ఔట్లుక్–ఐసీఏఆర్ఈ ఇండియా ర్యాంకింగ్స్– 2020లో రాష్ట్రం నుంచి చోటు దక్కించుకున్న మరో వర్సిటీ మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం (మనూ). జాబితాలో ‘మనూ’ 24వ స్థానం పొందింది. మొత్తం 1,000 స్కోరుకు గాను 436.88 సాధించింది. ప్రపంచస్థాయి గుర్తింపే లక్ష్యం.. దేశంలోని 25 ఉత్తమ యూనివర్సిటీల్లో హెచ్‌సీయూ రెండో స్థానం పొందడం గర్వంగా ఉంది. ఇది సమష్టి కృషికి నిదర్శనం. వర్సిటీకి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు సాధించడమే లక్ష్యంగా పనిచేస్తాం. దీనికోసం వ్యవస్థీకృత ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది. ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్‌గా గుర్తింపు పొందడంతోనే మరింత ఉన్నత స్థానానికి ఎదగడానికి దోహదం చేస్తోంది. విద్యార్థులు, అధ్యాపకులు, అధికారులు, సిబ్బంది, పూర్వ విద్యార్థులు కలసి కృషి చేస్తే సాధించలేనిది లేదు. –ప్రొఫెసర్ పొదిలె అప్పారావు, హెచ్‌సీయూ ఉపకులపతి. -
పీవీ నరసింహరావుకు భారతరత్న ఇవ్వాలి: కేసీఆర్
-
పీవీకి భారతరత్న ఇవ్వాలి: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహరావుకు భారతరత్న ఇవ్వాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు అన్నారు. వర్షాకాల శాసనసభ రెండో రోజు సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. పీవీకి భారతరత్న ఇవ్వాలన్న తీర్మానాన్ని ఈ సందర్భంగా సభలో ప్రవేశపెట్టారు. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. నూతన ఆర్థిక సంస్కరణల సృష్టికర్త పీవీ అని కొనియాడారు. తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ మన ఠీవి అని, ఆయనకు లభించాల్సిన గౌరవం దక్కలేదన్నారు. ఏడాది పాటు పీవీ శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. గ్లోబల్ ఇండియా నిర్మాత పీవీ నరసింహారావు అని, దేశం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో పీవీ ప్రధాని అయ్యారని కేసీఆర్ తెలిపారు. పీవీ అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. మన్మోహన్ సింగ్‌ను ఆర్థిక మంత్రి చేసిన ఘనత పీవీది అని పేర్కొన్నారు. పీవీ నాటిన సంస్కరణ ఫలితాలను ఇప్పుడు అనుభవిస్తున్నామని సీఎం తెలిపారు. భూ సంస్కరణలకు పీవీనే నాంది పలికారని గుర్తుచేశారు. తన సొంత భూమి 800 ఎకరాలను ప్రభుత్వానికి స్వాధీనం చేశారని కొనియాడురు. హైదరాబాద్‌లో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీకి పీవీ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. పీవీ బహుముఖ ప్రజ్ఞాశాలి: భట్టి కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. పీవీ బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. పీవీకి భారతరత్న ఇవ్వాలన్న తీర్మానానికి మద్దతిస్తున్నామని తెలిపారు. సంక్షోభాల సమయంలో చాకచాక్యంగా పీవీ పాలన చేశారని గుర్తు చేశారు. అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారని భట్టి పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. యుద్ధంలో గెలిచినవారే చరిత్రను రాస్తారని తెలిపారు. పీవీ స్థాయికి తగ్గ విధంగా భారత ప్రభుత్వం గుర్తించాలని కోరారు. తెలంగాణ ఉద్యమం అస్తిత్వ పోరాటమని పీవీ చెప్పారని గుర్తు చేశారు. కాగా, నేడు అసెంబ్లీలో నాలుగు కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. ప్రైవేట్ యూనివర్శిటీల బిల్లును మంత్రి సబితారెడ్డి సభలో పెట్టనున్నారు. తెలంగాణ డిజాస్టర్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆర్డినెన్స్-2020, తెలంగాణ ఫిస్కల్ రెస్పాన్స్‌బిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ బిల్లు -2020, ఆయుష్ మెడికల్ కాలేజీల్లో అధ్యాపకుల పదవీ విరమణ వయోపరిమితి పెంపు బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. -
హెచ్‌సీయూకి ‘విదేశీ’ వెల్లువ
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు కోవిడ్ పంజా విసురుతున్నప్పటికీ నగరంలోని సెంట్రల్ వర్సిటీకి విదేశీ విద్యార్థులు వెల్లువెత్తుతున్నారు. దేశంలోనే ప్రతిష్టాత్మక వర్సిటీగా వెలుగొందుతున్న ఈ విశ్వవిద్యాలయానికి 2020–21 విద్యాసంవత్సరానికిగాను పలు దేశాలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు వందలాదిగా దరఖాస్తు చేసుకుంటున్నట్లు వర్సిటీ వర్గాలు తెలిపాయి. గతేడాది కేవలం 203 దరఖాస్తులు విదేశాల నుంచి రాగా..ఈ సారి 258 ఇంటర్నేషనల్ విద్యార్థుల దరఖాస్తులందాయని పేర్కొన్నారు. అంటే గతేడాదితో పోలిస్తే విదేశీ విద్యార్థుల రాక 20 శాతం పెరిగిందన్నమాట. ఇక ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్(ఐసీసీఆర్) నుంచి 175 దరఖాస్తులు రాగా..ఈ సారి 200 దరఖాస్తులందినట్లు తెలిపాయి. ఇక ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా కార్డు కలిగి, విదేశీ పాస్‌పోర్టు కలిగిన వారి నుంచి 38 దరఖాస్తులందడం విశేషం. గతేడాది ఓసీఐ కార్డు కలిగిన వారి నుంచి 30 దరఖాస్తులు అందినట్లు పేర్కొన్నాయి. ఇక వర్సిటీలో అత్యధిక డిమాండ్ కలిగిన ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు 18 విదేశీ విద్యార్థుల దరఖాస్తులందడం విశేషం. వర్సిటీకి అందిన విదేశీ విద్యార్థుల దరఖాస్తులు.. 2019–20 విద్యాసంవత్సరం: 30 మంది డైరెక్ట్‌గా,మరో 175 దరఖాస్తులు ఐసీసీఆర్ సంస్థ ద్వారా విదేశీ విద్యార్థుల దరఖాస్తులందాయి. 2020–21 విద్యాసంవత్సరం: 40 మంది డైరెక్ట్‌గా,మరో 200 ఐసీసీఆర్ ద్వారా,మరో 18 మంది ఇంటిగ్రేటెడ్ మాస్టర్‌ప్రోగ్రాంకు విదేశీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడం విశేషం. ఈ దేశాల నుంచే అత్యధికం.. బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్, సూడాన్, గాంబియా, మడగాస్కర్, దక్షిణాఫ్రికా, టాంజానియా, గుయానా తదితర దేశాల విద్యార్థులు సెంట్రల్ వర్సిటీలో చదువుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆయా దేశాలతో మెరుగైన సాంస్కృతిక, ద్వైపాక్షిక సంబంధాలు నెలకొల్పేందుకు ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్(ఐసిసిఆర్)సంస్థ ఆయా దేశాల విద్యార్థులకు ఇక్కడ చదువుకునే అవకాశం కల్పిస్తోంది. ఆర్థికంగా వెనుకబడిన దేశాలకు చెందిన విద్యార్థులే పలు కోర్సులకు దరఖాస్తు చేసుకుంటున్నారు. విదేశీ విద్యార్థుల వెల్లువతో సెంట్రల్ వర్సిటీకి ఇన్సిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్(ఐఓఈ)స్టేటస్‌ను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ గతేడాది కేటాయించిందని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఐసీసీఆర్ సౌజన్యంతో మరింత మంది విదేశీ విద్యార్థులను ఆకర్షించేందుకు వర్సిటీ ప్రయత్నిస్తోందని వర్సిటీ వర్గాలు తెలిపాయి. విదేశీ విద్యార్థులకు 15 శాతం కోటా.. నగరంలోని సెంట్రల్ వర్సిటీలో అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ కలిగిన పలు కోర్సుల్లో సుమారు 15 శాతం సీట్లను విదేశీ విద్యార్థులకు కేటాయిస్తున్నారు. విదేశీ విద్యార్థులను విశేషంగా ఆకర్షిస్తుండడంతో ఈవర్సిటీని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ఇన్సిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్(ఐఓఈ) హోదా కల్పించడం విశేషం. ఈ హోదా దక్కడంతో విదేశాలకు చెందిన పలువురు వృత్తి నిపుణులను వర్సిటీలో బోధన చేసేందుకు వీలుగా వారిని నియామకం చేసుకునే అధికారాన్ని వర్సిటీకి ప్రభుత్వం కేటాయించింది. విదేశాలకు చెందిన పలువురు విద్యావేత్తలతో గెస్ట్‌ఫ్యాకల్టీని ఏర్పాటు చేయడం, పలు స్వల్పకాలిక కోర్సులకు విదేశీ విద్యార్థులను ఆహ్వానించడం వంటి చర్యలకు సెంట్రల్ యూనివర్సిటీ శ్రీకారం చుడుతోందని వర్సిటీ వర్గాలు తెలిపాయి. విద్య,పరిశోధన తదితర అంశాల్లో సెంట్రల్ వర్సిటీతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకునేందుకు అంతర్జాతీయ స్థాయిలో పేరున్న పలు విద్యాసంస్థలు,కంపెనీలు,పరిశోధన సంస్థలు ముందుకొస్తున్నాయని పేర్కొన్నాయి. -
గుర్రాల నుంచే కోవిడ్ వ్యాక్సిన్
సాక్షి, హైదరాబాద్: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయడానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ పరిశోధకులు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. కరోనా నిర్మూలన చికిత్సలో భాగంగా.. వ్యాక్సిన్ కనుగొనేందుకు యాంటీ బాడీ వ్యవస్ధలతో కూడిన ఇమ్యునో థెరపీని అభివృధ్దిచేసే యోచనలో ఉన్నట్లు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వీసీ అప్పారావు 'సాక్షి'తో తెలిపారు. 'వ్యాక్సిన్ సిద్ధం కావడానికి ఆరు నెలలు సమయం పడుతుంది. ప్లాస్మా అనేది కొంతమందికి మాత్రమే అది కూడా ఒకే రక్త గ్రూప్ ఉన్నవారికే పనిచేస్తుంది. గుర్రాల నుంచి సేకరించిన యాంటీ బాడీస్ సమర్ధవంతంగా పని చేయటంతో పాటు రోగులపై దుష్ప్రభావాలు చూపవు. కావున ఎక్కువ మొత్తంలో గుర్రం నుంచి రక్తం తీసుకొని అందులో ఉన్న యాంటీ బాడీస్‌తో వ్యాక్సిన్ తయారీ జరుగుతుందని' వీసీ అప్పారావు పేర్కొన్నారు. చదవండి: 'మాస్క్‌లు ధరించకుంటే టికెట్ ఇవ్వొద్దు' -
హెచ్‌సీయూ అడ్మిషన్ల ప్రక్రియ షురూ
రాయదుర్గం: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ 2020–21 విద్యా సంవత్సరం అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. అడ్మిషన్ కోసం దరఖాస్తులను మే 3వ తేదీలోగా ఆన్లైన్ లోనే దరఖాస్తు చేసుకోవాలి. హెచ్‌సీయూలో 2,400 సీట్లు వివిధ కోర్సులలో ఉన్నాయి. మొత్తం 128 కోర్సులలో 16 ఇంటిగ్రేటెడ్ కోర్సులు, 41 పొస్టు గ్రాడ్యుయేట్ కోర్సులు, 15 ఎంఫిల్,10 ఎంటెక్, 46 పీహెచ్డీ కోర్సులు ఉన్నాయి. గతేడాది మొత్తం 119 కోర్సులలో 2,170 సీట్లు ఉండేవి. ఈ ఏడాది నుంచి కొత్తగా 17 కోర్సులు...182 సీట్లు హెచ్‌సీయూలో 2020–21 విద్యా సంవత్సరం నుంచి కొత్తగా 17 కోర్సులు ప్రారంభిస్తుండగా వాటిలో 182 సీట్లు ఏర్పాటు చేశారు. అందులో ఎంఈడీ ఎడ్యుకేషన్ లో 50 సీట్లు, ఎంఏ జెండర్‌స్టడీస్–20, ఎంఏ కమ్యూనికేషన్ (మీడియాస్టడీస్) 25, ఎంఏ కమ్యూనికేషన్ (మీడియా ప్రాక్టీస్)–25, ఎంటెక్ మైక్రో ఎలక్ట్రానిక్స్ అండ్ వీఎల్ఎస్ఐ డిజైనింగ్–06, ఎంటెక్ మ్యానుఫాక్చరింగ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్–18, పీహెచ్డీ మైక్రోబయాలజీ–04 (పునః ప్రారంభిస్తున్నారు), ఎంఫిల్ కంప్యూటర్ లిటరేచర్–08, ఎంఫిల్ సోషల్ ఎక్స్క్లూషన్ అండ్ ఇన్ క్లూజన్ పాలసీ–04, ఎంఫిల్ రీజనల్ స్టడీస్–04, పీహెచ్డీ థియేటర్ ఆర్ట్స్, కంపారిటివ్ లిటరేచర్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ స్టడీస్‌లో నాలుగేసి సీట్లు, రీజినల్ స్టడీస్, కాంగ్ని టివ్సైన్స్లలో రెండేసి సీట్లు, ఫోక్ కల్చర్ స్టడీస్, సోషల్ ఎక్స్‌క్లూజివ్ అండ్ ఇన్ క్లూజివ్ పాలసీలో ఒక్కో సీటును కొత్తగా ఏర్పాటు చేశారు మరిన్ని కోర్సులలో అడ్మిషన్లు ఇలా.. ఎంసీఏలో అడ్మిషన్‌ను నిట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎన్ఐఎంసెట్ స్కోరు ద్వారా కేటాయిస్తారు. ఎంటెక్ కోర్సులో సీటును గేట్ ద్వారా సీసీఎంటీ లో ప్రతిభ చాటిన వారికి కేటాయిస్తారు. అయిదేళ్ళ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ (కంప్యూటర్ సైన్స్)లో సీటును సెంట్రల్ సీట్ అలోకేషన్ బోర్డు (సీఎస్ఏబి) జేఈఈ ద్వారా కేటాయిస్తారు. ఎంబీఏ సీటును క్యాట్, ఎంఎస్సీ బయోటెక్నాలజీలో సీటును న్యూఢిల్లీ లోని జేఎన్ యూ ద్వారా నిర్వహించే సీఈఈబీలో ప్రతిభ చాటిన వారికి కేటాయిస్తారు. మరిన్ని వివరాలకు వెబ్సైట్ http://acad.uohyd.ac.inను లాగిన్ కావాలి. -
హెచ్‌సీయూ విద్యార్థినికి భారీ ప్యాకేజీ
సాక్షి, రాయదుర్గం: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థినికి క్యాంపస్ ప్లేస్మెంట్లో భారీ ప్యాకేజీతో ఆఫర్ వచ్చింది. స్కూల్ ఆఫ్ కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్‌లోని ఎంసీఏ విద్యార్థిని వి. నందిని సోని క్యాంపస్ ప్లేస్మెంట్లో అడోబ్ సిస్టమ్స్ కంపెనీలో ఉద్యోగానికి ఎంపికయ్యారు. హెచ్‌సీయూలోని ప్లేస్మెంట్ గైడెన్స్ అండ్ అడ్వైజరీ బ్యూరో సమన్వయంతో ఈ ప్లేస్‌మెంట్‌ను నిర్వహించారు. రూ.43 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగానికి నందినిని అడోబ్ సిస్టమ్స్ కంపెనీ ఎంపిక చేసింది. దీంతో హెచ్‌సీయూలో చరిత్రలో ఇప్పటి వరకు అత్యధిక ప్యాకేజీ అందుకున్న విద్యార్థినిగా నందిని సోనీ నిలిచారు. నందిని తన పాఠశాలను విద్యను మహారాష్ట్రలోని బోయిసర్ అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్లో పూర్తి చేశారు. అహ్మదాబాద్‌లోని సెయింట్ జేవీయర్స్ కళాశాలలో బీసీఏ చదివారు. కాగా, ఈ ఏడాది క్యాంపస్ ప్లేస్మెంట్లో 200 మందిపైగా విద్యార్థులు ఉద్యోగాలు సాధించారని హెచ్‌సీయూ ప్లేస్మెంట్ గైడెన్స్ అండ్ అడ్వైజరీ బ్యూరో చైర్మన్ రాజీవ్ వాంకర్ తెలిపారు. ఇంజినీరింగ్ వదిలేశా: నందిని మొదట ఇంజినీరింగ్ కోర్సులు చేయాలనుకున్నా కానీ ఆ తరువాత కంప్యూటర్స్‌లో ఉన్నత విద్యను అభ్యసించాలని.. నైపుణ్యం కలిగిన సాఫ్ట్వేర్ డెవలపర్‌గా ఉండాలన్న లక్ష్యంతో ఎంసీఏలో చేరినట్టు నందిని సోని తెలిపారు. స్మార్ట్ ఇండియా హాకథాన్– 2019లో తన బృందంతో కలిసి విజేతగా నిలిచినట్టు వెల్లడించారు. అత్యధిక ప్యాకేజీతో అడోబ్ సిస్టమ్స్‌లో ఉద్యోగం రావడం సంతోషంగా ఉందన్నారు. (ఐసెట్–2020 నోటిఫికేషన్ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
రోహిత్ వేములపై చిత్రానికి ‘నో ఎంట్రీ’
సాక్షి, న్యూఢిల్లీ : హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్శిటీ దళిత విద్యార్థి నాయకుడు రోహిత్ వేములపై తీసిన చిత్రంతోపాటు ఇప్పటికే విశ్లేషకుల ప్రశంసలు అందుకున్న పలు డాక్యుమెంటరీ చిత్రాలకు ముంబైలో ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి మూడవ తేదీ వరకు ఫిల్మ్ డివిజన్ ఆధ్వర్యంలో కొనసాగనున్న ద్వైవార్షిక అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఎంట్రీ దొరకలేదు. 2016లో రోహిత్ వేముల ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై ‘వియ్ హావ్ నాట్ కమ్ ఇయర్ టు డై’ పేరిట దీపా ధన్‌రాజ్ డాక్యుమెంటరీని నిర్మించారు. 2018లో ఆమ్‌స్టర్‌డామ్‌లో జరిగిన అంతర్జాతీయ డాక్యుమెంటరీ చిత్రోత్సవంలో ‘బెస్ట్ ఫీచర్ లెన్త్ డాక్యుమెంటరీ అవార్డు’ను అందుకున్న ‘రీజన్’ చిత్రానికి కూడా ఎంట్రీ దొరక లేదు. కమ్యూనిస్టు నాయకుడు గోవింద్ పన్సారే, హేతువాది నరేంద్ర దాభోల్కర్ హిందుత్వ వాదులు హత్య చేయడంపై ప్రముఖ దర్శకుడు ఆనంద్ పట్వర్ధన్ ఈ డాక్యుమెంటరీని తీశారు. పట్వర్ధన్కు 2014లో ‘శాంతారామ్– జీవితకాలం పురస్కారం’ అవార్డు లభించిన విషయం తెల్సిందే. విశాఖపట్నంలో జన్మించి ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలిస్తూ ప్రశంసలు అందుకుంటున్న గాయకురాలు, గేయ రచయిత్రి, మ్యూజిక్ కంపోజర్ సోన మొహాపాత్రపై దీప్తి గుప్తా తీసిన ‘షటప్ సోనా’కు, కళాకారుడు కౌషిక్ ముఖోపాధ్యాయ్పై అవిజిత్ ముకుల్ కిషోర్ తీసిన ‘స్క్వీజ్ లైమ్ ఇన్ యువర్ ఐ’ చిత్రానికి ఎంట్రీ లభించలేదు. రోహన్ శివకుమార్ తీసిన ‘లవ్లీ విల్లా’, అర్చనా పాడ్కే తీసిన ‘అబౌట్ లవ్’ చిత్రాలకు కూడా ఎంట్రీ దొరకలేదు. ఎంపిక చేసిన 800 డాక్యుమెంటరీల్లో విశ్లేషకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమాలకు ఎందుకు ఎంపిక చేయలేదని ఫిల్మ్స్ డివిజన్ డైరెక్టర్ జనరల్, ముంబై అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ డైరెక్టర్ స్మితా వాట్స్ శర్మను మీడియా ప్రశ్నించగా, తమ ఎంపిక నిష్మక్షపాతంగా జరిగిందని, అందులో ఎలాంటి రాజకీయం లేదని సమాధానం చెప్పారు. -
హెచ్‌సీయూలో రిక్షాల లొల్లి
గచ్చిబౌలిలోని హెచ్‌సీయూ క్యాంపస్‌లో మొదటిసారిగా ఈ రిక్షాల రవాణా ప్రారంభమైంది. విద్యార్థులు నిర్ణీత చార్జీలు చెల్లించి క్యాంపస్‌లో రాకపోకలు సాగించాలి. ఇప్పటి వరకు క్యాంపస్‌లో ఉచిత బస్సు సౌకర్యం ఉంది. బస్సు సౌకర్యాన్ని కొనసాగిస్తూనే ఈ రిక్షాలను ప్రైవేశపెట్టారు. సాక్షి, రాయదుర్గం: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ క్యాంపస్‌లో ప్రస్తుతం విద్యార్థులు, ఫ్యాకల్టీ, సిబ్బంది కలిపితే 6 వేలకుపైగా ఉంటారు. రవాణా సేవలను మరింత మెరుగ్గా అందించేందుకు ప్రైవేటు సంస్థకు అనుమతించారు. ఈ–రిక్షాలను బెంగుళూరుకు చెందిన మెజర్స్ ట్రాన్స్వాహన్ టెక్నాలజీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ‘ఓన్, ఆపరేట్ అండ్ మెయింటెన్’ పద్ధతిన నిర్వహిస్తారు. అయితే రవాణాను ప్రైవేట్‌పరం చేసి విద్యార్థులపై భారం మోపడంపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. ఏఏ మార్గాల్లో... ఈ రిక్షాలు హెచ్‌సీయూ క్యాంపస్‌లో రెండు ప్రాంతాలలో అందుబాటులో ఉంటాయి. మెయిన్‌గేటు నుంచి సౌత్ గేటు వరకు, సౌత్ క్యాంపస్ గేటు నుంచి మసీదుబండగేటు (స్మాల్ గేట్) వరకు ఉంటాయి. అక్కడి నుంచి తిరిగి అదేమార్గాల్లో అందుబాటులో ఉంటాయి. వేళలు... సోమవారం నుంచి శనివారం వరకు తిరుగుతాయి. ఆయా రోజుల్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకే అందుబాటులో ఉంటాయి. డిజిటల్ మోడ్‌లోనే చెల్లించాలి... ఈ రిక్షాలకు డబ్బుల చెల్లింపులన్నీ డిజిటల్ మోడ్‌లోనే ఉంటాయి. ఒక ట్రిప్పునకు రూ. 10 చెల్లించాల్సి ఉంటుంది. వీటిని విద్యార్థులు, ఫ్యాకల్టీ, స్టాఫ్, సందర్శకులు కూడా వినియోగించుకొనే అవకాశం కల్పించారు. దివ్యాంగులకు ఉచితం ఈ రిక్షాలలో దివ్యాంగ విద్యార్థులు ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని కల్పించారు. వారు యూనివర్శిటీ గుర్తింపు కార్డును చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ రిక్షాలను తిరగనివ్వం క్యాంపస్‌లో విద్యార్థులకు ఈ–రిక్షాలలో ఉచితంగా ప్రయాణం చేసేందుకు అనుమతించాలి. ఇతరులకు చార్జీలు వసూలు చేసినా అభ్యంతరం లేదు. విద్యార్థులపై భారం వేసే ఎలాంటి చర్యలనూ అంగీకరించం. ఇప్పటికే రిజిష్ట్రార్, డిప్యూటీ రిజిస్ట్రార్‌కు వినతిపత్రాలను సమర్పించాం. త్వరలో సానుకూల నిర్ణయం వస్తుందని భావిస్తున్నాం. లేదంటే ఈ–రిక్షాలను వర్సిటీలో తిరగనివ్వం. – ఎం.శ్రీచరణ్, హెచ్‌సీయూ విద్యార్థి సంఘం ఉపాధ్యక్షుడు విద్యార్థులపై భారం తగదు క్యాంపస్‌లో బస్సుల ట్రిప్పుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేస్తుంటే ఆర్థిక భారం మోపేలా ఈ రిక్షాలను ప్రైవేశపెట్టారు. స్కాలర్షిప్ రూ. 750 మాత్రమే ఇస్తూ ఇలాంటి భారం మోపడం తగదు. ఒక్కో విద్యార్థి కనీసం నాలుగు సార్లు హాస్టల్ నుంచి బయట తిరిగితే రోజుకు రూ. 50 మేర రవాణా చార్జీలు చెల్లించాల్సి వస్తుంది. ఇక మెస్, ఇతర ఖర్చులను ఎలా భరిస్తారు? ఈ చర్యను వెంటనే ఉపసంహరించాలి. లేదంటే గత్యంతరం లేక ఉద్యమించాల్సి ఉంటుంది. – పి సందీప్, డీఎస్‌యూ ప్రధాన కార్యదర్శి, హెచ్‌సీయూ -
హెచ్‌సీయూలో.. అందాల లోకం..
అందాలలో అహో మహోదయం.. హెచ్‌సీయూలో నవోదయం.. ఎటు చూసినా పచ్చదనం.. ఆహ్లాదపూరిత వాతావరణం.. ప్రకృతి రమణీయత. చెంగుచెంగుమంటూ గంతులు వేసుకుంటూ వెళ్లే జింకలు.. పక్షుల కిలకిలారావాలు.. జల సవ్వడిని తలపించే తటాకాలు. విభిన్న పుష్ప జాతుల వృక్షాలు.. ఇలా ఎన్నో అపురూప దృశ్య మాలికలకు కేరాఫ్‌గా నిలుస్తోంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. సువిశాలమైన హెచ్‌సీయూ క్యాంపస్‌లో ఒక్కోచోట ఒక్కో అందం, పచ్చదనం,జంతుజాలం.. సొగసు చూడతరమా.. అన్నట్లుగా ఉంటుంది. సెంట్రల్ యూనివర్సిటీ ప్రతి ఏటా రూపొందించే కేలండర్లో ఇక్కడి క్యాంపస్‌లోని అందాలతో కూడిన ఫొటోలను పెట్టడం ఆనవాయితీ. ఈ ఏడాది సైతం క్యాంపస్ అందాలతో కూడిన ఫొటోలతో కేలండర్‌కు రూపకల్పన చేసేందుకు సంకల్పించారు. ఇందుకోసం సెంట్రల్ యూనివర్సిటీ ఫ్యాకల్టీ ప్రతినిధులు, విద్యార్థులు స్వయంగా తీసిన ఫొటోలను పంపాలని ఉన్నతాధికారులు కోరుతారు. ఆ ప్రకారం క్యాంపస్‌లోని వివిధ ప్రాంతాలలో ప్రకృతి అందాలతో కూడిన ఫొటోలను తీయడానికి ఫ్యాకల్టీ, విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ ఏడాది కూడా ఫొటోలు పంపాలని కోరగా 200 ఎంట్రీలను విద్యార్థులు, ఫ్యాకల్టీ ప్రతినిధులు పంపించారు. వీరిలో రఘు గణపురం, డాక్టర్ రవి జిల్లపల్లి, విజయభాస్కర్ మరిశెట్టి, జ్ఞానశేఖర్, కేఎన్ కృష్ణకాంత్, మోనికా, పి.కె.నవనీత్ కృష్ణన్, శశిశేఖర్రెడ్డి, సుష్మ నంద్యాల, అనోజ్, చందాని సింగ్, నిరంజన్ బసు తీసిన చిత్రాలను 2020 కేలండర్ రూపకల్పనలో వినియోగించారు. వీరంతా క్యాంపస్‌లోని అందాలను తమ కెమెరాల్లో బంధించి కేలండర్ అందంగా రూపొందేలా దోహదపడ్డారు. -
మళ్లీ టాప్-10లో హెచ్‌సీయూ
రాయదుర్గం: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మరో ఘనత సాధించింది. క్యూఎస్ ఇండియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్–2020లో హెచ్‌సీయూ వరుసగా రెండోసారి టాప్‌టెన్ జాబితాలో నిలిచింది. మంగళవారం విడుదల చేసిన ఈ ర్యాంకింగ్స్ జాబితాలో మొదటి స్థానంలో ఐఐటీ–బాంబే, ఐఐఎస్సీ–బెంగళూరు రెండోస్థానం, ఐఐటీ–ఢిల్లీ–మూడోస్థానం పొందగా హెచ్‌సీయూ 8వ స్థానం సాధించింది. దేశంలోని వంద విద్యాసంస్థలను పరిశీలించి ర్యాంకింగ్స్ ఇచ్చారు. స్టాఫ్ విత్ పీహెచ్డీ కేటగిరీలో బెస్ట్ స్కోర్ ఇండికేటర్‌ను హెచ్‌సీయూ సాధించడం మరో విశేషం. ఈ ర్యాంకింగ్స్‌లో ముఖ్యంగా ఫ్యాకల్టీ–స్టూడెంట్స్‌లో 26.9 పాయింట్లు, సిటేషన్స్ ఫర్ ఫ్యాకల్టీ 40.5, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ 3.4, ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ 2.5, ఎంప్లాయర్ రెప్యూటేషన్ 5.3, అకాడమిక్ రెప్యూటేషన్లో 10.8 పాయింట్లు సాధించింది. వీటి ఆధారంగానే ర్యాంకింగ్స్‌ను ఖరారు చేశారు. -
హెచ్సీయూకు ఎమినెన్స్ హోదా
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీతోపాటు ఐదు ప్రభుత్వ విద్యా సంస్థలకు ఎమినెన్స్(ఐవోఈ) హోదా కల్పిస్తున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ హోదా దక్కిన మిగతా విద్యా సంస్థల్లో మద్రాస్ ఐఐటీ, ఖరగ్‌పూర్ ఐఐటీ, బనారస్ హిందూ యూనివర్సిటీ, ఢిల్లీ వర్సిటీలున్నాయి. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గత నెలలో చేసిన ప్రతిపాదనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మానవ వనరుల అభివృద్ధి మంత్రి రమేశ్ పొఖ్రియాల్ నిశాంక్ తెలిపారు. దీంతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చే ఐదేళ్లలో కేంద్రం నుంచి రూ.వెయ్యి కోట్లు నిధులు అందనున్నాయి. వీటితోపాటు ప్రైవేట్ రంగంలోని తమిళనాడుకు చెందిన అమృత విద్యాపీఠమ్, వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఒడిశాలోని కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ, ఢిల్లీకి చెందిన జామియా హమ్దర్ద్ యూనివర్సిటీ, మొహాలీలోని సత్య భారతి ఫౌండేషన్ భారతి ఇన్స్టిట్యూట్లకు కూడా ఎమినెన్స్ హోదా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఆయా సంస్థల అంగీకారం కోసం ఎదురుచూస్తున్నామన్నారు. ఇంకా..నోయిడాలోని శివ్‌నాడార్ వర్సిటీ, సోనెపట్‌లోని ఓపీ జిందాల్ యూనివర్సిటీలకు ఎమినెన్స్ హోదా ఇవ్వాలని ఎంపిక కమిటీ సిఫారసు చేసిందన్నారు. జాదవ్‌పూర్ యూనివర్సిటీ, అన్నా వర్సిటీల ఎమినెన్స్ హోదాకు సంబంధించి తమ వంతు నిధులు కేటాయించేందుకు బెంగాల్, తమిళనాడు ప్రభుత్వాలు అంగీకారం తెలపాల్సి ఉందన్నారు. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, అశోకా యూనివర్సిటీ, అజీంప్రేమ్‌జీ యూనివర్సిటీ, తేజ్‌పూర్ యూనివర్సిటీ, పంజాబ్ యూనివర్సిటీ, ఆంధ్రా యూనివర్సిటీ, గాంధీనగర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ప్రమాణాలు అందుకోవడంలో విఫలమైన వాటిలో ఉన్నాయి. ఎమినెన్స్ హోదా ప్రకటించాలంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అంగీకారంతోపాటు తమ వంతుగా కనీసం 50 శాతం నిధులను సమకూర్చాల్సి ఉంటుందని మంత్రి నిశాంక్ తెలిపారు. దేశంలో పలు విద్యా సంస్థలను ప్రపంచ స్థాయి బోధన, పరిశోధన సామర్ధ్యం కలిగినవిగా తీర్చిదిద్దడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు 2016లో కేంద్రం ప్రకటించింది. ఇందులో భాగంగా 10 ప్రభుత్వ, 10 ప్రైవేటు విద్యార్థులను తీర్చిదిద్దుతామని ప్రకటించింది. ‘ఇప్పటివరకు 16 సంస్థలకు ఎమినెన్స్ హోదా ఇచ్చాం. మరో నాలుగు సంస్థలకు సంబంధించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సమ్మతి కోసం ఎదురుచూస్తున్నాం’అని నిశాంక్ తెలిపారు. ఎమినెన్స్ హోదా కల్పించిన ప్రభుత్వ విద్యాసంస్థలైతే ప్రభుత్వం రూ.వెయ్యి కోట్ల వరకు సాయం అందజేస్తుంది. అదే ప్రైవేట్ సంస్థలకైతే ప్రభుత్వ నిధులు అందవు కానీ, మరింత స్వతంత్ర ప్రతిపత్తితోపాటు ప్రత్యేక కేటగిరీ డీమ్డ్ యూనివర్సిటీ హోదా లభిస్తుంది. -
హెచ్‌సీయూ విద్యార్థిని అనుమానాస్పద మృతి
సాక్షి, హైదరాబాద్ : సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. హిందీ సబ్జెక్ట్‌లో పీహెచ్డీ చేస్తున్న దీపికా మహాపాత్రో (29) బాత్రూమ్లో జారిపడి చనిపోయినట్లు తెలుస్తోంది. కాగా గత కొంతకాలంగా ఆమె న్యూరో సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. సోమవారం ఉదయం బాత్రూమ్కు వెళ్లిన దీపికా ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన సహచర విద్యార్థినులు వెళ్లిచూడగా అప్పటికే ఆమె అపస్మారక స్థితిలో పడిఉండటాన్ని గమనించారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే దీపిక మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
హెచ్‌సీయూలో ఏబీవీపీ ఘన విజయం
రాయదుర్గం: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో అఖిల భారత విద్యార్థి పరిషత్ ఘన విజయం సాధించింది. 2018–19 విద్యా సంవత్సరానికి విద్యార్థి సంఘ ఎన్నికల పోలింగ్‌ను శుక్రవారం నిర్వహించగా ఓట్ల లెక్కింపును శనివారం చేపట్టారు. రాత్రి వరకు సాగిన ఓట్ల లెక్కింపులో ఏబీవీపీ, ఓబీసీఎఫ్, సేవాలాల్ విద్యార్థిదళ్ కూటమి అభ్యర్థులంతా ఘన విజయం సాధించాచినట్లు హెచ్‌సీయూ అధికారులు తెలిపారు. ఫలితాలు ప్రకటించగానే ఏబీవీపీ, ఓబీసీఎఫ్, సేవాలాల్ విద్యార్థి దళ్ కూటమి నాయకులు సంబరాలు చేసుకున్నారు. ప్రెసిడెంట్‌గా నాగ్‌పాల్ విజయం హెచ్‌సీయూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్, హెచ్‌సీయూ విభాగం మహిళా కన్వీనర్, సైకాలజీలో పీహెచ్డీ చేస్తున్న ఆర్తి నాగ్‌పాల్ తన సమీప ప్రత్యర్థి ఎర్రం నవీన్‌కుమార్‌పై 334 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆర్తికి 1,663 ఓట్లు రాగా నవీన్‌కు 1,329 ఓట్లు మాత్రమే లభించాయి. ఉపాధ్యక్ష పదవికి పోటీచేసిన అమిత్ కుమార్ çతన సమీప ప్రత్యర్థి పి.పారితోశ్పై 247 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అమిత్‌కు 1,505 ఓట్లు లభించగా పారితోశ్కు 1,258 ఓట్లు పోల్ అయ్యాయి. ప్రధాన కార్యదర్శి పదవికి పోటీచేసిన ధీరజ్ సంగోజి తన సమీపç ప్రత్యర్థి అభిషేక్కుమార్పై 127 ఓట్లతో విజయం సాధించారు. ధీరజ్‌కు 1,573 ఓట్లురాగా అభిషేక్‌కు 1,446 ఓట్లు లభించాయి. సంయుక్త కార్యదర్శి పదవికి పోటీచేసిన ఎస్. ప్రవీణ్‌కుమార్ తన సమీప ప్రత్యర్థి అనుమపెస్ కృష్ణన్‌పై 39 ఓట్ల స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. సాంస్కృతిక కార్యదర్శి పదవికి పోటీచేసిన అరవింద్ ఎస్ కుమార్ తన ప్రక్రితి చక్రవర్తిపై 233 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అరవింద్‌కు 1,475 ఓట్లు రాగా చక్రవర్తికి 1,242 ఓట్లు పోల్ అయ్యాయి. క్రీడా కార్యదర్శి పదవికి పోటీ చేసిన కె. నిఖిల్రాజ్ తన సమీప ప్రత్యర్థి శ్యామ్యూల్ ఈను రాగ్ నాలామ్పై 139 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నిఖిల్‌కు 1,467ఓట్లు రాగా, శ్యామ్యూల్‌కు 1,328 ఓట్లు లభించాయి. నోటాకు 983 ఓట్లు హెచ్‌సీయూ విద్యార్థి సంఘం ఎన్నికల్లో నోటాకు గణనీయంగా ఓట్లు పడ్డాయి. ఆరు పదవులకే 983 ఓట్లు పోల్ కావడం విశేషం. అ«ధ్యక్ష పదవికి 95, ఉపాధ్యక్ష పదవికి 216, ప్రధాన కార్యదర్శికి 144, క్రీడా కార్యదర్శికి 199, సాంస్కృతిక కార్యదర్శికి 133, సంయుక్త కార్యదర్శికి 196 ఓట్లు పోల్ అయ్యాయి. -
యూఎస్ వదిలి... ఐపీఎస్ చేపట్టి...
లక్షల డాలర్ల జీతం వచ్చే ఉద్యోగాన్ని కాదనుకొని సివిల్స్ బాట పట్టారు అజిత వేజెండ్ల. చెన్నై ఐఐటీలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి యూఎస్‌లో ఫైనాన్స్ విభాగంలో ఎంఎస్ పూర్తి చేశారు. అక్కడే కొంతకాలం ఫైనాన్స్ విభాగాల్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి సివిల్స్ సాధించాలనే లక్ష్యంతో ఇండియాకు వచ్చేశారు. తరువాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎకనమిక్స్‌లో పీహెచ్డీ చేస్తూనే సివిల్స్ సాధించారు. జనపక్షపాతి అయిన ఆమె లక్షల డాలర్ల జీతాన్నిచ్చే ఉన్నతోద్యోగాన్ని వదులుకున్నారు. చిన్ననాటి నుంచీ చూసిన ప్రజల ఇబ్బందులను గమనించిన ఆమె హృదయంలో.. వారి కోసమే తన శక్తియుక్తులను వినియోగించాలన్న సంకల్పం బలంగా నాటుకుంది. ఆ సంకల్పాన్ని సాకారం చేసే లక్ష్యంతోనే సివిల్స్ రాశారు. కృషికి కుటుంబ ప్రోత్సాహం తోడు కాగా ఐపీఎస్ సాధించారు. ఆ లక్ష్యసాధకురాలే.. ఇప్పుడు రంపచోడవరం ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టిన అజిత వేజెండ్ల. చెన్నై ఐఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాక అమెరికా వెళ్లి ఫైనాన్స్‌లో ఎంఎస్ పూర్తి చేశారు. అక్కడే కొంత కాలం ఉద్యోగం చేసినా తన జీవితధ్యేయ సాధనకు స్వదేశానికి తిరిగి వచ్చారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎకనమిక్స్‌లో పీహెచ్డీ చేస్తూనే సివిల్స్‌లో విజయం సాధించారు. లక్ష్యసాధకురాలైన అజిత విజయ ప్రస్థానం ఆమె మాటల్లోనే.. తూర్పుగోదావరి, రంపచోడవరం: నా బాల్యం తెనాలిలో గడవగా.. పెరిగింది హైదరాబాద్‌లో. నాన్న, అమ్మ ఉద్యోగస్తులు కావడంతో హైదరాబాద్‌లోనే పెరిగాను. అక్కడే సెయింటాన్స్‌లో ప్రా«థమిక స్థాయి నుంచి పదో తరగతి వరకు చదివాను. నెల్లూరు నారాయణలో ఇంటర్, మద్రాస్ ఐఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను. స్కాలషిప్తోనే యూఎస్‌లో ఎంఎస్ ఫైనాన్స్ కోర్సు పూర్తి చేశాను. కొద్దికాలం క్రితమే వివాహం జరిగింది. భర్త రాహుల్‌దేవ్‌సింగ్ కూడా ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఏఎస్పీగా పనిచేస్తున్నారు. తమ్ముడు అజయ్ కూడా ఐఐటీలో చదివాడు గిరిజన బాలలతో గడుపుతా.. ఖాళీ సమయాల్లో దగ్గరలోని పాఠశాలకు వెళ్లి పిల్లలకు బోధన చేయడం ఎంతో ఇష్టం. రంపచోడవరం ఏజెన్సీలో కూడా వీలైతే గిరిజన బాలలతో సమయం గడపదలచుకున్నాను. పుస్తకాలు చదవడం, మ్యూజిక్ వినడం, కుటుంబ సభ్యులతో గడపడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. ప్రతి వ్యక్తీ జీవితంలో ఒక లక్ష్యాన్ని ఎన్నుకుని, దానిని సాధించడానికి శాయశక్తులా కృషి చేయాలి. ఎన్నుకున్న రంగంలో నైపుణ్యం పొందాలి. లక్ష్యం సాధించే వరకూ కష్టపడాలి. మానవతా దృక్పథంతో ముందుకు సాగాలి. ప్రజల కష్టాలు దగ్గరగా చూశాను.. తాత గారి ఊరు తెనాలి తరచూ వచ్చేవారం. అక్కడ ప్రజల ఇబ్బందులు, బంధువుల పరిస్థితి దగ్గర నుంచి చూశాను. అప్పుడే పబ్లిక్ ఓరియంటెడ్ జాబ్ (ప్రజాజీవితంతో ముడిపడ్డ ఉద్యోగం) చేయాలని ఉండేది. యూఎస్‌లో ఉద్యోగం వచ్చినా సివిల్స్ సాధించాలనే కోరికతో ఇండియాకు వచ్చేశాను. ఎకనామిక్స్‌లో పీహెచ్డీ చేస్తూనే సివిల్స్ సాధించాను. గ్రేహౌండ్స్‌లో శిక్షణ వృత్తి నైపుణ్యం పెంచింది.. గ్రేహౌండ్స్‌లో అసిస్టెంట్ కమాండెంట్‌గా చేయటం వృత్తి నైపుణ్యాన్ని పెంచింది. ప్రాథమికంగా పోలీస్ ఉద్యోగంలో నేర్పుకోవాల్సిన మెళకువలు, వ్యూహరచన, సహనం, సమయస్ఫూర్తి ఆకళింపు చేసుకున్నాను. పోలీసులు చైతన్యవంతులై పనిచేసేలా సహకరిస్తాను. చట్టం అమలు కోసం అన్ని విభాగాలనూ సమన్వయం చేస్తాను. మానవీయంగా వ్యవహరించాలనేది నా లక్ష్యం. -
హెచ్‌సీయూలో విద్యార్థి ఆత్మహత్యాయత్నం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. మిజోరాం రాష్ట్రానికి చెందిన బీర్బల్ లాజిస్టిక్ సైన్స్‌లో రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఎల్ బ్లాక్ హాస్టల్ మూడో అంతస్తు నుండి అర్థరాత్రి కిందకు దూకాడు. తీవ్రంగా గాయపడిన అతనిని హాస్టల్ సిబ్బంది హుటాహుటిన గచ్చిబౌలిలోని కేర్ ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపినట్లు తోటి విద్యార్థులు చెప్రారు. ప్రేమ వ్యవహారం కారణంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
హెచ్‌సీయూలో విషాద చాయలు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని హైదరాబాద్ సెంట్రల్ యూనిర్సిటీలో ఓ విద్యార్థి మృతి చెందాడు. పశ్చిమబెంగాల్‌కు చెందిన ఆకాష్ గుప్తా హెచ్‌సీయూలో ఎంఏ సోషియాలజీ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. స్నేహితులతో కలిసి గురువారం సాయంత్రం చెరువు వద్దకు వెళ్లాడు. అక్కడ స్నేహితులతో కలిసి ఆడుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు జారి నీటి గంటలో పడ్డాడు. ఆకాష్‌కు ఈత రాకపోవడంతో నీట మునిగిపోయాడు. వెంటనే అప్రమత్తమైన స్నేహితులు అతన్ని బయటకు తీసి స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆకాష్ తల్లిదండ్రులు జార్ఖండ్‌లో ఉంటున్నారు. ఆకాష్ గుప్తా మృతితో వర్సిటీలో విషాద ఛాయలు నెలకొన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సెంట్రల్ వర్సిటీ ఎన్నికల్లో ఏఎస్జే ఘన విజయం
సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో అలయెన్స్ ఫర్ సోషల్ జస్టిస్(ఏఎస్జే) కూటమి ఏబీవీపీ, ఎన్ఎస్యూఐ ప్యానెళ్లపై విజయం సాధించింది. ఏఎస్జే కు 1,977 ఓట్లు రాగా.. ఏబీవీపీకి 1,569 ఓట్లు, ఎన్ఎస్యూఐకి 872 ఓట్లు లభించా యి. నోటాకు 249 ఓట్లు నమోదయ్యాయి. ఏఎస్జే కూటమి తరఫున అధ్యక్షుడిగా పి.శ్రీరాగ్, ఉపాధ్యక్షునిగా లునావత్ నరేశ్, ప్రధాన కార్యదర్శిగా ఆరీఫ్ అహ్మాద్, సంయుక్త కార్యదర్శిగా మహ్మద్ ఆసిఫ్, సాంస్కృతిక కార్యదర్శిగా గుండేటి అభిషేక్, క్రీడల కార్యదర్శిగా లోలం శ్రావణ్ ఎన్నికయ్యారు. -
రోహిత్ సూసైడ్ రిపోర్ట్‌ను తగలబెట్టేశారు
సాక్షి, హైదరాబాద్: రీసెర్చి స్కాలర్ రోహిత్ వేముల వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య చేసుకున్నాడంటూ జస్టిస్ రూపన్‌వాల కమిషన్ నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే. ఆ కాపీలను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు దహనం చేశారు. గురువారం సాయంత్రం కాలేజీ ఆవరణలో ఓ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద ఉన్న రోహిత్ వేముల విగ్రహాం వద్ద గుమిగూడిన విద్యార్థులు పత్రులను తగలబెట్టి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. కమిటీ నివేదిక అర్థం పర్థం లేనిదని అంబేద్కర్ స్టూడెంట్స్ అసోషియేషన్ నేత దొంత ప్రశాంత్ విమర్శించారు. కేంద్రం కనుసన్నల్లోనే నివేదికను రూపొందించారని, సాక్ష్యాలు తారుమారు అయ్యాయని ఆయన ఆరోపించారు. హక్కుల కోసం దళితులు పోరాటం చేయాల్సిన పరిస్థితిని ప్రభుత్వాలు కల్పించాయని తెలిపారు. ఇక విద్యార్థులకు సంఘీభావం తెలుపుతూ యూనివర్సిటీ ప్రోఫెసర్ కే లక్ష్మీ నారాయణ నిరసనలో పాల్గొన్నారు. ఓ న్యాయమూర్తి కూడా అబద్ధాల నివేదిక ఇచ్చి ఇస్తాడని తాను ఊహించలేదని ఈసందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. రోహిత్ సూసైడ్‌కు సస్పెన్షన్ తోపాటు మరియు కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయ, యూనివర్సిటీ అధికారులే కారణమంటూ విద్యార్థులు ఆరోపించటంతో అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అశోక్ కుమార్ రూపన్వాల్ నేతృత్వంలో విచారణ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. గత అక్టోబర్ లోనే నివేదికను రూపొందించి కేంద్ర మానవాభివృద్ధి మంత్రిత్వ శాఖకు సమర్పించింది. అయితే ఈ మధ్యే అధికారికంగా దానిని ప్రకటించారు. -
వ్యక్తిగత కారణాలతోనే రోహిత్ వేముల ఆత్మహత్య
హైదరాబాద్ : సంచలనం సృష్టించిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో పీహెచ్డీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్యకు వ్యక్తిగత కారణాలేనని అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఏకే రూపన్ వాల్ కమిషన్ తేల్చి చెప్పింది. రోహిత్ వేముల మరణానికి దారితీసిన కారణాలపై దర్యాప్తు చేపట్టేందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఈ ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. వ్యక్తిగత కారణాలు, అసంతృప్తితోనే రోహిత్ బలవన్మరణానికి పాల్పడ్డాడని... క్యాంపస్‌లో జరిగిన పరిణామాలకు అతని మృతికి ఎలాంటి సంబంధం లేదని రూపన్ వాల్ కమిషన్ స్పష్టం చేసింది. సూసైడ్ నోట్లో ఈ విషయం ఉందని నివేదికలో పేర్కొంది. రోహిత్ సూసైడ్ నోట్ ఆధారంగా నివేదిక రూపొందించింది. యూనివర్శిటీ నుంచి బహిష్కరణకు గురవడంతో రోహిత్ ఒత్తిడికి లోనైన మాట వాస్తవమే కావచ్చు కాని... ఆత్మహత్యకు మాత్రం అదొక్కడే కారణం కాదని తెలిపింది. రోహిత్ ఆత్మహత్య వివాదంలో అప్పటి కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, సెంట్రల్ వర్సిటీ అధికారులకు ఎలాంటి సంబంధంలేదని స్పష్టం చేసింది. ఈమేరకు జస్టిస్ రూపన్ వాల్ కమిషన్ ఆగస్టు తొలివారంలో యూజీసీకి ఈ నివేదిక సమర్పించింది. కాగా 2016, జనవరి 17న హెచ్‌సీయూ క్యాంపస్‌లోని తన హాస్టల్‌గదిలో రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మరోవైపు రూపన్ వాలా కమిటీ నివేదికపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. -
HCU స్కాలర్ విశాల్ తాండన్ ఆత్మహత్య
-
హెచ్‌సీయూ విద్యార్థి ఆత్మహత్య
వ్యక్తిగత సమస్యలే కారణం! సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) పరిశోధక విద్యార్థి విశాల్ టాండన్ (43) శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. జెండర్ స్టడీస్‌లో పీహెచ్డీ చేస్తున్న విశాల్... నల్లగండ్లలో తాను నివశిస్తున్న అపర్ణాసరోవర్ అపార్టుమెంటు 14వ అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. వ్యక్తిగత సమస్యలే అతడి మరణానికి కారణమని తెలుస్తోంది. పంజాబ్‌కి చెందిన విశాల్ క్యాంపస్ దగ్గర్లోని అపర్ణాసరోవర్లో తల్లితో కలసి ఉంటున్నాడు. కాగా, నెల కిందట తల్లి ముంబైలోని కుమార్తె వద్దకు వెళ్లారు. జీవితంలో రాణించలేకపోతున్నానని, ఇంకా అమ్మపైనే ఆధారపడాల్సి వస్తోందని విశాల్ కొంతకాలంగా తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నాడు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో తన సోదరికి మెయిల్ పంపి, అపార్టుమెంటు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ‘నన్ను క్షమించండి. లవ్ యూ వెరీమచ్’అంటూ విశాల్ సోదరికి పంపిన మెయిల్లో పేర్కొన్నట్టు చందానగర్ సీఐ తిరుపతిరావు తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ ఉద్యమంలో విశాల్ కీలకపాత్ర పోషించాడని, అభ్యుదయ వాదని స్నేహితులు చెబుతున్నారు. -
చట్టపరిధిలో పనిచేస్తున్నట్లు లేదు!
ఏపీ పోలీసుల తీరును తప్పుపట్టిన ప్రెస్ కౌన్సిల్ విచారణ కమిటీ - జర్నలిస్ట్ నాగార్జునరెడ్డిపై దాడి కేసులో తదుపరి విచారణకు - ప్రకాశం జిల్లా ఎస్పీ స్వయంగా హాజరుకావాలని చైర్మన్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ వ్యవస్థ చట్టపరిధిలో కాకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తోందని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విచారణ కమిటీ అభిప్రాయపడింది. పత్రికాస్వేచ్ఛ, నైతిక నియమావళి ఉల్లంఘన కేసులపై రెండురోజులుగా ఈ కమిటీ హైదరాబాద్‌లో విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రకాశం జిల్లా చీరాలలో జర్నలిస్ట్ నాగార్జునరెడ్డిపై దాడి కేసుకు సంబంధించి జిల్లా ఎస్పీ హాజరుకావాలని ఆదేశించినా ఎస్పీ త్రివిక్రమవర్మ బుధవారం విచారణకు హాజరుకాక పోవడంతో కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎస్పీ తరఫున హాజరైన చీరాల డీఎస్పీ ప్రేమ్‌కాజల్, వన్‌టౌన్ సీఐ వెంకటేశ్వరరావు.. ఎస్పీ ఇతర పనులపై ఐజీ కార్యాలయానికి వెళ్లారని చెప్పడం కౌన్సిల్ చైర్మన్‌కు మరింత ఆగ్రహం తెప్పిం చింది. తదుపరి న్యూఢిల్లీలో జరగనున్న విచారణకు ఎస్పీ స్వయంగా హాజరుకావాలని, అవసరమైతే అరెస్ట్ వారంట్ జారీచేస్తామని కౌన్సిల్ చైర్మన్ సీకే ప్రసాద్ హెచ్చరించారు. నాగార్జునరెడ్డిపై స్థానిక ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అనుచరులు దాడిచేసిన కేసులో.. కేసు నమోదు, దర్యాప్తునకు సంబంధించిన అంశాలపై కమిటీ సభ్యులు పలు అనుమానాలను వ్యక్తం చేశారు. కేసు నమోదు విషయమై ప్రభుత్వ న్యాయవాది నుంచి కాకుండా పదవీ విరమణ చేసిన ప్రభుత్వ న్యాయవాది సలహా తీసుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక్క చీరాలలోనే ఇలా జరగడం లేదని, ఆంధ్రప్రదేశ్ అంతటా ఇదే విధానం అమలవుతోందని డీఎస్పీ చెప్పిన సమాధానం పట్ల చైర్మన్ విస్మయం వ్యక్తం చేశారు. తదుపరి విచారణ జరిగే వరకు బాధిత జర్నలిస్ట్‌పై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించారు. జర్నలిస్టులను నిషేధిస్తే ప్రజాస్వామ్యం ఉన్నట్లా? హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో జర్నలిస్టుల ప్రవేశాన్ని నిషేధించిన యాజమాన్యం.. తమది ప్రజాస్వామ్య సంస్థగా పేర్కొనడం విడ్డూరంగా ఉందని విచారణ కమిటీ అభిప్రాయ పడింది. రోహిత్ వేముల ఆత్మహత్య నేపథ్యంలో జర్నలిస్టుల ప్రవేశంపై నిషేధం విధించడం, వర్సిటీలోకి వచ్చిన ఫ్రంట్‌లైన్ జర్నలిస్ట్‌పై కేసులు బనాయించడంపై బుధవారం కమిటీ విచారణ చేపట్టింది. కేసుకు సంబంధించిన పూర్తి సమాచారం తో తదుపరి విచారణకు హాజరుకావాలని యూనివర్సిటీ ప్రతినిధి ప్రొఫెసర్ సంజయ్‌కు సూచించింది. దీనిపై సమగ్ర నివేదికను అందించాలని సైబరాబాద్ కమిషనర్‌ను ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ ఆదేశించారు. ఔట్లుక్ మేగజైన్ ఎడిటర్‌కు సంబంధించిన కేసు న్యాయస్థానంలో నడుస్తున్నందున, ఆ కేసుపై విచారణను వాయిదా వేసింది. -
రాష్ట్రపతి పేరును ఎందుకు చేర్చారు?: హైకోర్టు
హైదరాబాద్: పలు గొడవలకు కారణమైనా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వీసీ అప్పారావును తొలగించడం లేదని ఆరోపిస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేరును కూడా చేర్చారు. దీనిపై సోమవారం విచారించిన హైకోర్టు... రాష్ట్రపతి పేరును ఎందుకు చేర్చారని పిటిషనర్ తరఫు లాయర్ ను హైకోర్టు ప్రశ్నించింది. వీసీని నియమించింది రాష్ట్రపతి కాబట్టే ఆయన పేరు కూడా చేర్చామని న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ అభియోగానికి తగ్గట్టుగా వచ్చే సోమవారం లోపు కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్‌ను కోరింది. కేసు తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. -
హెచ్‌సీయూలో ఉద్రిక్తత.
-
రోహిత్ వర్ధంతిని అడ్డుకోవద్దు
వేముల రోహిత్ తల్లి రాధిక విజయవాడ : గతేడాది ఆత్మహత్య చేసుకున్న హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ విద్యార్థి వేముల రోహిత్ వర్ధంతిని అడ్డుకోవద్దని అతని తల్లి రాధిక ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విజయవాడలో మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఆమె ఆదివారం విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో ఈ నెల 17న రోహిత్ వర్థంతి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు విద్యార్థి నేతలకు అధికారులు అనుమతించడం లేదన్నారు. రోహిత్ మృతి చెంది ఏడాది గడిచినా నేటి వరకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం రోహిత్ కులంపై లేనిపోని ప్రచారం చేస్తూ కేసును తప్పుదారి పట్టిస్తోందని ఆరోపించారు. రోహిత్ మృతికి కారకులైన వారిపై నేటికీ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్టుపై కేసు నమోదు చేయకపోవడం శోచనీయమన్నారు. రోహిత్ వర్థంతి కార్యక్రమానికి విద్యార్థులు తరలి రావాలని కోరారు. అంబేడ్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ నాయకుడు ప్రభాకర్ మాట్లాడుతూ.. రోహిత్ కేసులో న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. తిరుపతిలో జరిగిన సైన్స్ ఎగ్జిబిషన్లో సెంట్రల్ వర్సిటీ వీసీ అప్పారావుకు అవార్డు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వీసీకి అవార్డు ఇవ్వటం విద్యావ్యవస్థను అవమానించడమేనని పేర్కొన్నారు. ‘రోహిత్’ ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి దళిత విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్యకు కారణమైన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వామపక్ష పార్టీల నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రోహిత్ వర్థంతిని పురస్కరించుకుని సోమవారం సామాజిక న్యాయ దినాన్ని పాటిం చనున్నట్లు వారు ప్రకటించారు. -
అక్షరాలు దిద్దించేటప్పుడే.. వివక్షలను చెరిపేయించాలి
రేపటికి ఏడాది! హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థి రోహిత్ మరణించి ఏడాది పూర్తయినా ఇంకా న్యాయం కోసం దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు, విద్యార్థిలోకం ఎదురుచూస్తూనే ఉన్నాయి! విశ్వవిద్యాలయాల్లో కొనసాగుతోన్న వివక్షని భరిస్తూ, నిర్లిప్తతను అలవాటుగా మార్చుకున్న సమాజం మేల్కొనకపోతే రోహిత్ లాంటి బలవన్మరణాలు పునరావృతం అవుతూనే ఉంటాయి. అందుకే.. అసమానతలను పెంచి పోషించే ఈ విద్యావిధానంలో మార్పు రాకుండా విశ్వవిద్యాలయాల్లో మరణాలకు చరమగీతం పాడలేము అని అంటున్నారు పౌర హక్కుల ఉద్యమకారిణి, ప్రముఖ పాత్రికేయురాలు, గుజరాత్ అల్లర్లలో బాధితులకోసం ఏర్పాటు చేసిన ‘సిటిజన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్’ కార్యదర్శి తీస్తా సెతల్ వాద్. ఆమెతో సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూ. ► హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ విద్యార్థి రోహిత్ మరణించి ఏడాది అవుతోంది! ఇప్పటికీ కేసు ముందుకు సాగకపోవడానికి కారణమేమనుకుంటున్నారు? రోహిత్ కన్నా ముందూ, రోహిత్ తరువాత కూడా సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్యలు జరిగాయి. మనసుని కుదిపేసే అంశాలెన్నో ఉన్నాయి కనుకనే రోహిత్ కేసు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. జెఎన్‌యులో విద్యార్థి ఉద్యమం కూడా ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వారందరినీ కదిలించింది. విశ్వవిద్యాలయాలను మతోన్మాద రాజకీయాలు శాసిస్తున్నంత కాలం ఉద్యమాలు తప్పవు. రోహిత్ కేసులో న్యాయం జరగకపోవడానికి కారణం స్పష్టం. మంత్రులు, రాజకీయ నాయకులు ఈ కేసులో కీలక నిందితులు. వారిని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తుంది. ► విశ్వవిద్యాలయాల్లో వివక్షని ఎలా అర్థం చేసుకోవాలి? ఉన్నత విశ్వవిద్యాలయాల్లో కనిపిస్తున్న వివక్షపై గతంలో థోరట్ కమిటీ చేసిన సిఫార్సులు విశ్వవిద్యాలయాల్లో కొనసాగుతోన్న అనేక అమానవీయ అంశాలను; దళితులు, ఆదివాసీలు ఎదుర్కొంటున్న వివక్షను వెలుగులోనికి తెచ్చాయి. ఉన్నత విశ్వవిద్యాలయాల్లోకి ప్రవేశిస్తోన్న తొలితరం విద్యార్థులకు కావాల్సిన తోడ్పాటు అందకపోగా, వారిని యూనివర్సిటీల నుంచి వెలివేసే స్థాయికి విశ్వవిద్యాలయాల యాజమాన్యాలు దిగజారాయి. అట్టడుగు వర్గాలనుంచి వచ్చే విద్యార్థులకు రెమెడీ క్లాసులు నిర్వహించాలని థోరట్ కమిటీ సిఫారసు చేసింది. ప్రస్తుతం దేశంలో ఉన్న 40 కేంద్రీయ విశ్వవిద్యాలయాల నుంచి ఏదో రకమైన వివక్షపై ఫిర్యాదులు వస్తున్నాయి. అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. థోరట్ కమిటీ రిపోర్టు ఇదే చెప్పింది. 84 శాతం ఎస్సి, ఎస్టి విద్యార్థులకు రెమెడీ క్లాసుల్లేవు. ఇదే సామాజిక వర్గాల విద్యార్థుల్లో 50 శాతం మందికి ఇంటర్నల్ మార్కుల్లో కోత పెట్టినట్టు తెలింది. అద్భతమైన ప్రతిభ కలిగిన విద్యార్థులు సైతం అన్ని సబ్జెక్టుల్లో అత్యధిక మార్కులు సంపాదించినప్పటికీ కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అవుతున్న పరిస్థితికి వివక్షే కారణం. ఇది అందరికీ తెలుసు. కానీ ఎవరికీ శిక్షలుండవు. దళిత, ఆదివాసీలకు ఉన్నత విద్యావ్యవస్థల్లో అవకాశాల్ని తిరస్కరించడంలో భాగమే ఈ వివక్ష. ►పరిష్కారం ఏమిటి? ఎక్కడా థోరట్ కమిటీ సిఫార్సులను అమలు చేయడంలేదు. విద్యార్థుల్లో స్ట్రెస్‌ని తగ్గించేందుకు, వారిలో మానసిక స్థైర్యాన్ని నింపేందుకు ఎక్కడా కూడా ఇంతవరకు ప్రయత్నం జరిగిన దాఖలాలు లేవు. గ్రామీణ ప్రాతాల నుంచి వచ్చే దళిత ఆదివాసీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ లేదు. వారికి ఇంటర్నల్స్ మార్కుల్లో కోత, తరగతి గదుల్లో అవమానాలు, ల్యాబ్స్‌లో పరికరాలు అందుబాటులో ఉంచకపోవడం, కనీసం గైడ్‌ని కేటాయించకపోవడం ఇలాంటి ఎన్నో రకాల వివక్షను ఈ వర్గాల విద్యార్థులు ఎదుర్కొంటున్నారు. పాఠశాల విద్యాస్థాయి నుంచి స్త్రీపురుష వివక్షని, కుల వివక్షని పెంచి పోషిస్తోంది మన విద్యావ్యవస్థ. అక్కడే మార్పు అవసరం. థోరట్ కమిటీ సిఫార్సులను అమలు చేయడం, దాని ఆధారంగా వివక్షారహిత విశ్వవిద్యాలయాల కోసం ఒక యాక్ట్ ని తీసుకురావడం నేటి ఆవశ్యకత. అయితే అది రోహిత్ యాక్ట్ అయినా, సమానత్వాన్ని కాంక్షించే అంబేడ్కర్ యాక్ట్ అయినా అది సమ సమాజానికి దారి ఏర్పరచాలి. ► ఇప్పటికే ఎన్నో చట్టాలున్నాయి. ఉదాహరణకు ఎస్సి, ఎస్టి అట్రాసిటీ యాక్టు లాంటివి. రోహిత్ యాక్టు మాత్రం అమలు జరుగుతుందని మీరు భావిస్తున్నారా? ఏ చట్టమైనా సక్రమంగా అమలుచేయించే బాధ్యత మళ్లీ పౌరసమాజంపైనే ఉంటుంది. చట్టం అంటూ ఉంటే ప్రశ్నించే అధికారం ఉంటుంది. అందుకే రోహిత్ చట్టాన్ని డిమాండ్ చేస్తున్నాం. అయితే ఈ ఉద్యమం మొత్తం రోహిత్ చట్టాన్ని ఒక్కదాన్నే కోరుకోలేదు. ఉద్యమ డిమాండ్లలో అది కూడా ఒకటి. అయితే ఎస్సి ఎస్టి అట్రాసిటీ కేసుల్లో దోషులను ఎలా తప్పిస్తున్నారో మనం రోహిత్ కేసులో స్పష్టంగా చూశాం. అదే చాలా వాటిల్లో జరుగుతోంది. ► ఎపి ప్రభుత్వం త్వరలోనే రోహిత్ దళితుడు కాదని, బీసీ అని తేల్చబోతోంది. దీనిపై మీ అభిప్రాయం? ఇది చాలా దుర్మార్గమైన విషయం. రోహిత్ తల్లి రాధిక ఒంటరి స్త్రీ. ఆమాటకొస్తే దళిత స్త్రీల పోరాటాలన్నీ ఒంటరి స్త్రీల పోరాటాలే. ఆమె సర్వస్వం త్యాగం చేసి బిడ్డల్ని పెంచి పెద్దచేసి, విద్యాబుద్ధులు నేర్పించినా తల్లి కులం బిడ్డకి రాకపోవడం పురుషాధిపత్య సమాజం నిజస్వరూపం. ఏ సంబంధమూ లేని తండ్రి కులం ఎలా వర్తిస్తుందో ఎపి ప్రభుత్వానికే అర్థం కావాలి. రోహిత్ బీసీ అని తేల్చబోవడం పెద్ద రాజకీయ కుట్ర. – అత్తలూరి అరుణ తీస్తా సెతల్ వాద్ ఉద్యమకారిణి -
‘రోహిత్ మృతికి కారకులను కఠినంగా శిక్షించాలి’
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిశోధక విద్యార్ధి రోహిత్ వేముల మృతికి కారణమైన ఆర్ఎస్ఎస్, బీజేపీ, ఎబీవీపీకి చెందిన కేంద్ర మంత్రులు బండారు దత్తత్రేయ, సృ్మతీఇరానీ, ఎమ్మెల్సీ రాంచంద్రరావు, వీసీ అప్పారావులను అరెస్ట్ చేయాలని, జాతీయ ఎస్సీ కమీషన్ ఆదేశాన్ని అమలు చేయాలని డాక్టర్ ఆనంద్ తెల్ తుంబ్డే, ప్రకాష్ అంబేద్కర్లు డిమాండ్ చేశారు. రోహిత్ వేముల న్యాయపోరాట సంఘీభావ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం హైదర్‌గూడ ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ... రోహిత్ వేముల మృతి కారణమైన దోషులను అరెస్ట్ చేయాలని 29 సోమవారం నాంపల్లిలోని గాంధీభవన్ ప్రకాశం హాల్లో బహిరంగసభను నిర్వహించనున్నట్లు వారు తె లిపారు. వీసీ అప్పారావు దళిత విద్యార్థులను సాంఘీక బహిష్కరణకు గురిచేయడంతో 15 రోజులు ఉద్యమించిన న్యాయం జరగకపోవంతో జనవరి 17న రోహిత్ వేముల ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు. ఈ ఘటన జరిగి 7 నెలలు గడుస్తున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు రోహిత్ ఎస్సీ కాదని, బీసీ అని దుష్ర్పచారం చేస్తూ నిందితులను రక్షించే ప్రయత్నం చేస్తున్నారని వారు మండిపడ్డారు. గుంటూరు జిల్లా కలెక్టర్ ఇచ్చిన నివేదికతో పాటు జాతీయ ఎస్సీ కమిషన్ రోహిత్ ఎస్సీఅని డిక్లేర్ చేస్తూ సైబరాబాద్ పోలీసులకు ఎస్సీ, ఎస్టీ కేసు విచారణ వెంటనే పూర్తి చేసి, రోహిత్ వేముల కుటుంబానికి న్యాయం చేయాలని అదేశించి 15 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించి కూడా 4 నెలల గడుస్తుందని అన్నారు. దళితుల పట్ల తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకంగా, అగ్రకుల పక్షపతిగా చంద్రబాబు, వెంకయ్య నాయుడు, సుజానాచౌదరిల అడుగులకు మడుగులోత్తుతూ తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడుతుందని మండిపడ్డారు. రోహిత్ మృతికి కారణమైన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేసి, వారిని శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. సోమవారం జరిగే సభను దళితులు, మేదావులు, ప్రజా, కుల సంఘాల నాయకులు విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. ఈ సమావేశంలో ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, బంగారి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
హెచ్‌సీయూలో అంబేడ్కర్ విగ్రహం మాయం
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మరోసారి వివాదానికి కేంద్రమైంది. దళిత విద్యార్థి రోహిత్ సహా ఐదుగురు విద్యార్థుల వెలివేత అనంతరం వర్సిటీలో వెలిసిన వెలివాడలోని అంబేడ్కర్ విగ్రహం సోమవారం అర్ధరాత్రి అపహరణకు గురైంది. ఇది వీసీ అప్పారావు పనేనని హెచ్‌సీయూ విద్యార్థి జేఏసీ ఆరోపించింది. ఇది భారత రాజ్యాంగానికి అవమానమని పేర్కొంది. పోలీసులు కూడా వీసీ చెప్పుచేతుల్లో ఉంటూ దళిత విద్యార్థులపై జరుగుతున్న దాడులను పట్టించుకోవడం లేదని జేఏసీ నాయకులు ఆరోపించారు. వెలివాడను పూర్తిగా తొలగించడానికి చేసిన కుట్రలో భాగంగా విగ్రహాన్ని మాయం చేశారన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేంద్ర మంత్రి దత్తాత్రేయ, ఎమ్మెల్సీ రామచందర్‌రావు, వీసీ అప్పారావు తదితరులను అరెస్టు చేయకుండా పోలీసులు పక్షపాతవైఖరి అవలంభిస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. వీసీ తదితరులు తమపైనున్న నేరారోపణలు కప్పిపుచ్చుకునేందుకు వెలివాడను తొలగించేందుకు విఫలయత్నం చేస్తున్నారని సామాజిక న్యాయపోరాట విద్యార్థి జేఏసీ నాయకుడు ప్రశాంత్ అన్నారు. వర్సిటీలో మంగళవారం నిర్వహించిన నిరసనలో విద్యార్థి నాయకులతోపాటు ఎస్సీ, ఎస్టీ అధ్యాపక సంఘం సభ్యులు కేవై రత్నం, శ్రీపతిరాయుడు పాల్గొన్నారు. అంబేడ్కర్ విగ్రహం ఏమైందో చెప్పాలని వీసీని డిమాండ్ చేశారు. అనంతరం వర్సిటీలోని షాప్‌కామ్ వద్ద నుంచి ఊరేగింపుగా వెళ్లిన విద్యార్థులు హెచ్‌సీయూ ప్రధాన గేటు ముందున్న రహదారిపై బైఠాయించారు. రాస్తారోకోతో వాహనాలు స్తంభించిపోయాయి. -
రోహిత్ వేముల దళితుడే
గుంటూరు కలెక్టర్ ధ్రువీకరణ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)లో జనవరి 17న ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేముల దళితుడేనని గుంటూరు కలెక్టర్ కాంతిలాల్ దండే ధ్రువీకరించారు. నేషనల్ కమిషన్‌కు సమర్పించిన నివేదికతో రోహిత్ ఎస్సీ మాల కులస్తుడని పేర్కొన్నారు. దీంతో రోహిత్ బీసీ అనే వాదనకు తెరపడింది. వర్సిటీ యాజమాన్యం కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు రోహిత్ తన సూసైడ్ లేఖలో పేర్కొన్న విషయం తెలిసిందే. రోహిత్‌తో సహా నలుగురు విద్యార్థుల వెలివేత, అనంతరం రోహిత్ ఆత్మహత్య యావత్ దేశాన్నే కుదిపేసింది. వర్సిటీ వైస్ చాన్స్‌లర్ అప్పారావు, కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, మంత్రి స్మృతి ఇరానీల జోక్యం వల్లే తన కుమారుడు రోహిత్ ఆత్మహత్యకు పాల్పడ్డారంటూ అతడి తల్లి రాధిక ఫిర్యాదు చేయడంతో వారిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. అయితే రోహిత్ తండ్రి బీసీ(వడ్డెర) కనుక అతని కులమే రోహిత్ కులమని నమ్మించేందుకు ఏపీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించింది. పిల్లల పెంపకంలో కానీ, వారి విద్యాబుద్ధుల విషయంలోగానీ, చివరకు కుటుంబం గురించి గానీ ఎటువంటి బాధ్యతలు నెరవేర్చని రోహిత్ తండ్రి కులం కాక, రోహిత్ తల్లి రాధిక కులమే రోహిత్‌కి చెందినట్టు ఆధారాలతో సహా నిరూపించడం కేసులో కీలక మలుపుగా భావించొచ్చు. గుంటూరు తహసీల్దారు రిపోర్టు ఆధారంగా రోహిత్ కులాన్ని కలె క్టర్ ధ్రువీకరించారు. ఇది విద్యార్థుల ఐక్యపోరాటాల ఫలితమని, రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వారిని అరెస్టు చేయాలని హెచ్‌సీయూ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు ప్రశాంత్, మున్నా, వెంకటేశ్ చౌహాన్,అర్పిత అన్నారు. -
ఇద్దరు హెచ్‌సీయూ ప్రొఫెసర్లపై సస్పెన్షన్ వేటు
పోలీసు కస్టడీలో ఉన్నందుకే ఈ చర్యలన్న యాజమాన్యం సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ యాజమాన్యం దళిత ప్రొఫెసర్లు కె.వై.రత్నం, తథాగత్‌లను సస్పెండ్ చేసింది. రోహిత్ ఆత్మహత్యానంతరం హెచ్‌సీయూలో విద్యార్థి ఉద్యమానికి అండగా నిలి చిన పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ కె.వై.రత్నం, మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ తథాగత్‌లను సస్పెండ్ చేస్తూ వర్సిటీ యాజమాన్యం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2 రోజులకు పైగా పోలీసు కస్టడీ, జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కారణంగా వారిపై ఈ చర్యలు తీసుకున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. రోహిత్ ఉదం తం నేపథ్యంలో సెలవుపై వెళ్లిన వీసీ అప్పారావు తిరిగి హఠాత్తుగా విధుల్లో చేరడాన్ని కొందరు విద్యార్థులు, ఆచార్యులు వ్యతిరేకించారు. ఈ సందర్భంగా నాడు జరిగిన ఆందోళనలో మొత్తం 27 మంది విద్యార్థులు, ప్రొఫెసర్లను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో 25 మంది విద్యార్థులతో పాటు ప్రొఫెసర్లు రత్నం, తథాగత్‌లు కూడా ఉన్నారు. అన్యాయాన్ని ప్రశ్నించినందుకే... వీసీ అప్పారావు నియంత పాలన సాగిస్తున్నారని, విద్యార్థులకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించినందుకే తమని అరెస్టులు చేయించి, పోలీసులతో కొట్టించి, కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ప్రొఫెసర్లు రత్నం, తథాగత్‌లు ఆరోపించారు. అందులో భాగంగానే తమపై తాజా సస్పెన్షన్ వేటన్నారు. రోహిత్‌తో పాటు అంతకుముందు వర్సిటీలో జరిగిన ఆత్మహత్యలకు ఇక్కడ కొనసాగుతున్న కులవివక్షే కారణమన్నారు. దీనిపై తాము న్యాయ పోరాటం చేస్తామన్నారు. -
అక్షరం.. ప్రజల దిక్కు!
కవులు, రచయితలు జనం పక్షం రాష్ట్ర ఏర్పాటులో ‘అక్షరా’నికీ భాగస్వామ్యం సీరియస్ రచయితలను సర్కారే గుర్తించాలి ‘సాక్షి’తో ఆచార్య జయధీర్ తిరుమలరావు హన్మకొండ కల్చరల్ : వృత్తి కళాకారుల పక్షాన ఆయన ‘జానపద’మై నిలిచారు. కనుమరుగైపోతోన్న అమూల్య గ్రంథాలు, తాళపత్రాలకు పెద్దదిక్కయ్యారు. యాభై ఏళ్లుగా అక్షరాల సేద్యం.. నిరంతరాయంగా సాహిత్యం, సాంస్కృతికోద్యమం.. ఇదే ఆచార్య జయధీర్ తిరుమలరావు జీవనపథం. తెలంగాణకు ప్రత్యేక సాహిత్య, సాంస్కృతిక అస్తిత్వం ఉందని బలంగా చెప్పే ఆచార్య తిరుమలరావు ఓరుగల్లులో జన్మించారు. తెలుగు విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా, ప్రచురణల శా ఖ డెరైక్టర్‌గా పనిచేశారు. హైదరాబాద్‌లోని ప్రాచ్యలిఖిత భాండాగారం డెరైక్టర్‌గా ఉన్న సమయంలో అమూల్య గ్రం థాలు, తాళపత్రాలను సేకరించి భద్రపరిచారు. ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆయన జానపద కళాకారుల, కళల పరిరక్షణ కోసం ‘జానపద’ను స్థాపించారు. తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కూడా అయిన ఆయన.. రాష్ర్ట ఆవిర్భావం తరువాత కవులు, రచయితలపై బాధ్యత పెరి గిందని అంటారు. రాష్ట్రావిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన ‘సాక్షి’తో తన మనోభావాలను పంచుకున్నారు. అవేమిటో ఆయన మాటల్లోనే.. ప్రభుత్వమే గుర్తించాలి.. కళాకారులకు ఉద్యోగాలిచ్చారు. కానీ, రాసే కవికి మాత్రం న్యాయం జరగలేదు. అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలనడం అన్యాయం. సీరియస్, సిన్సియర్ రచయితలను ప్రభుత్వమే గుర్తించాలి. రచయితకు లభించే గుర్తింపు, సహాయం రచయిత వ్యక్తిత్వాన్ని పెంచేదిగా ఉండాలి. అలాగే, రచయితలకు ఇచ్చే ఆర్థిక సహాయాన్ని పెంచాలని చాలా కాలంగా అడుగుతున్నాం. రెండేళ్లు గడిచిన సందర్భంలో మరోసారి గుర్తు చేస్తున్నాం. ప్రజలకు జవాబుదారీ.. ‘తెరవే’ తెలంగాణ రచయితల వేదిక(తెరవే) పదహారేళ్లుగా నిరంతరాయంగా పనిచేస్తూనే ఉంది. ‘ప్రత్యేక రాష్ట్ర సాధన’ లక్ష్యంగానే ఇది ఆవిర్భవించింది. రాష్ట్ర సాధనలో రచయితల పాత్ర అమోఘం. అరసం, విరసంతో పాటు రాజకీయ ఎజెండాతో పనిచేసే సంస్థలు చాలా ఉన్నాయి. కానీ ప్రాంతీయ స్పృహతో రాష్ట్ర సాధన లక్ష్యంతో ఏర్పడిన సంస్థ తెరవే మాత్రమే. ప్రస్తుతం కొన్ని సంస్థలు రాజకీయ ప్రాపకం, ప్రాబల్యం కోసం ‘పాటుపడు’తున్నా.. మేం మాత్రం ప్రజలకు జవాబుదారీగానే ఉంటాం. రచయిత సామూహిక ఆలోచనల ప్రతినిధి.. ప్రతిపక్ష నాయకుడు తన పార్టీ అవసరాల రీత్యా మాట్లాడుతాడు. వాటిలో ఎలిగేషన్స్ ఉంటాయి. కానీ, రచయిత చేసే పనిలో, రాసే రాతల్లో అవేవీ ఉండవు. ప్రజల మనోభావాలను, ఉద్వేగాలను ఒక లాజిక్‌తో వివరించి చెబుతాడు. ఒక నినాదంగా కవి, రచయిత ప్రభుత్వాన్ని నేరగ్రస్తంగా చిత్రించాలని అనుకోరు. అది ఉద్దేశమై కూడా ఉండదు. రచయిత సామూహిక ఆలోచనలకు ప్రతినిధి. దానిని పది మంది తరఫున ప్రతిఫలిస్తాడు. అందులో నిజాయితీ ఉంటుంది. రాజకీయం మాత్రం ఉండదని గుర్తించాలి. ప్రజల మన్ననలే ముఖ్యం.. సాహిత్యం, రచయిత పాత్ర విస్తరించాలి. పాత నమూనాలు పనికిరావు. ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజలతో మమేకమై రాయాలి. ఇవ్వాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కవులు, రచయితలను గుర్తించి అవార్డులివ్వాలి. కానీ, ప్రభుత్వంతో సన్మానాలు, పురస్కారాలు పొందడం మాకంత ముఖ్యం కాదు. రచయితలు ప్రజల అవసరాలు తీర్చేలా అక్షరాలు రాసి ప్రజల మనోభావాలను వ్యక్తీకరించే పాత్ర పోసిస్తూ ప్రజల మన్నన పొందడమే ముఖ్యం. ప్రభుత్వం, ప్రభుత్వ అవార్డులు ఆశించే వారు.. ఇద్దరూ కూడా రచయితల గౌరవాన్ని తగ్గించేలా ప్రవర్తించవద్దు. వారిని కాపాడుకోవడం పౌరధర్మం పేద రచయితలు అనారోగ్యానికి గురైనప్పుడు సమాజమే వారి ని రక్షించుకోవాలి. వారిని కాపాడుకోవడం పౌరధర్మంగా భావిం చాలి. సుద్దాల హనుమంతుకు క్యాన్సర్ వచ్చిందని తెలిసి, దవాఖానాకు తీసుకువెళ్తామని మేం అంటే- ‘ఇప్పటి వరకు మా ఇంట్లో ఉన్నది తిని బతికాం. దవాఖానకు వెళ్తే ఇంట్లో ఉన్న సామాను కూడా అమ్ముకోవాల్సి వస్తుంది. అక్కడకు రాను’ అన్నాడు. తెలంగాణ ఏర్పడి రెండేళ్లయినా నేటికీ పేద రచయితలు, కవుల గురించి ఎలాంటి విధాన నిర్ణయమూ జరగలేదు. సాహిత్యంలోనూ డబ్బున్న వాళ్లే రాణించే పరిస్థితి ఉంది. కొత్త రాష్ట్రంలో సాహిత్యంపై గౌరవం పెంచాలి.. అవార్డుల కోసం పైరవీలు చేసేవారు ఒకవైపు.. అవార్డులు కాదు.. ప్రజల పక్షానే ఉంటామనే వారు మరోవైపు.. ఇందులో ప్రయోజనాలదే పెద్దపీట. కొత్త రాష్ట్రంలో సాహిత్యంపై గౌరవం పోయే పరిస్థితి ఏర్పడకూడదు. రచయితలకు ప్రభుత్వం సహకరించాలి. పుస్తకాలు అచ్చు వేసుకోవడానికి ఆర్థిక సహాయం అందించాలి. పది జిల్లాల్లో గ్రంథాలయాల ద్వారా పుస్తకాలను కొనుగోలు చేయాలి. రచయితల కోసం సహకార సంఘాన్ని ఏర్పాటు చేయాలి. దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో రచయితలకు గౌరవం ఎక్కువ అనే మాట వినపడాలి. స్వేచ్ఛను హరించొద్దు.. సభలు, సమావేశాలకు ఇతర కారణాలను చూసి అనుమతులు ఇవ్వకపోవడం, ఆంక్షలు విధించడం సరి కాదు. వరంగల్ సభ విషయంలో న్యాయస్థానం కూడా సరైన పాత్ర నిర్వహించలేదు. ఎవరు ఏ రూపంలోనైనా సరే.. స్వేచ్ఛను హరించడాన్ని మేం నిరాకరిస్తాం. రచయితలుగా, కవులుగా మేం సంస్కారవంతమైన భాషలోనే మాట్లాడతాం. మా లక్ష్యం.. సామాజిక క్రాంత దర్శనం సీమాంధ్ర పాలనలో పెడ ధోరణులకు వ్యతిరేకంగా ఉద్యమించే వాళ్లం. ప్రస్తుతానికి ప్రభుత్వానికి హితవు చెప్పడం, వాస్తవాలు వివరించడం వంటివి మాత్రమే చేస్తున్నాం. రచయితలు తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకుని నిలబడుతున్నారు. వారు సామాజిక వాస్తవాన్ని తమ ఆత్మవ్యక్తీకరణను అక్షరాలుగా పెట్టి సూచనలుగా అందిస్తున్నారు. సామాజిక క్రాంత దర్శనం చేస్తున్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవడమే అక్షరం కర్తవ్యం. రాష్ట్ర సాధనలో ‘అక్షర’ భాగస్వామ్యం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విజయంలో అక్షరాలకు నిండైన భాగస్వామ్యం ఉంది. ఇప్పుడు రకరకాల పండుగలు చేస్తున్నారు. రచయితలను సమాజానికి దూరం చేయాలని కొందరు చూస్తున్నారు. అక్షర రంగం దానిని ప్రతిఘటిస్తుంది. ఈ ప్రభుత్వం మాది. -
హెచ్‌సీయూలో ఉద్రిక్తత
వెలివాడ ఉద్యమకారుల టెంట్లు తీసేయడంపై ఆందోళన సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మళ్లీ అగ్గి రాజుకుంది. వర్సిటీలో వెలివాడ వద్ద ఏర్పాటు చేసుకున్న ఉద్యమకారుల టెంట్లు రాత్రికి రాత్రి మాయమవడంపై నిరసన పెల్లుబికింది. టెంట్లకున్న అంబేడ్కర్ నినాదాల పోస్టర్లు, రోహిత్ ఫొటోలనూ తొలగించడంపై విద్యార్థులు భగ్గుమన్నారు. శుక్రవారం అర్ధరాత్రి 2 గంటల నుంచి వర్సిటీ గేటు వద్ద బైఠాయించారు. దళిత విద్యార్థులను అణచివేసేందుకు వీసీ అప్పారావు పన్నుతున్న కుయుక్తులే ఇవని ఆరోపించారు. సెక్యూరిటీ సిబ్బంది టెంట్లు తొలగిస్తుండగా కొందరు విద్యార్థులు చూశారని విద్యార్థి జేఏసీ తెలిపింది. సెక్యూరిటీని నిలదీసినప్పటికీ తమకేం తెలియదంటూ తప్పించుకుంటున్నారని ఆరోపించింది. తమకెలాంటి నోటీసూ ఇవ్వకుండానే టెంట్లు, బ్యానర్లు తొలగించిన వీసీపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామంది. ఏదిఏమైనా తమ ఉద్యమం ఆగదని, వీసీపై చర్యలు తీసుకునేవరకూ పోరాడతామని ప్రకటించింది. ఈ మేరకు విద్యార్థులంతా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తమకు న్యాయం చేయాలని కోరారు. కండిషన్ బెయిల్ నుంచి విముక్తి హెచ్‌సీయూ విద్యార్థులు, అధ్యాపకులు సహా మొత్తం 27 మందికి మార్చి 22న నమోదైన కేసులో కండిషన్ బెయిల్ నుంచి విముక్తి లభించింది. మార్చి 22న విద్యార్థులు, అధ్యాపకులు రత్నం, తథాగత్లతో సహా 27 మంది హెచ్‌సీయూ విద్యార్థులకు ఇచ్చిన కండిషన్ బెయిల్ శుక్రవారంతో ముగిసింది. -
హెచ్‌సీయూలో శివలింగం ప్రత్యక్షం
రాజ్యాంగ విరుద్ధం : విద్యార్థి జేఏసీ హైదరాబాద్: ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో హఠాత్తుగా శివలింగం, నంది, నాగ ప్రతిమలు ప్రత్యక్షమయ్యాయి. గతంలో వాటిని అక్కడ చూడలేదని, హఠాత్తుగా ఎక్కడినుంచి వచ్చాయో అర్థం కావడంలేదని విద్యార్థులు పేర్కొంటున్నారు. క్యాంపస్ పరిధిలోని మెయిన్ గేట్ వెలుపల రాత్రికి రాత్రి విగ్రహాలు వెలియడం చర్చనీయాంశంగా మారింది. లౌకికత్వానికి ప్రతీకగా నిలవాల్సిన వర్సిటీల్లో దేవుడి విగ్రహాలను ఏర్పాటు చేయడం సరైంది కాదని జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంబేడ్కర్ విగ్ర హం ఏర్పాటుకు అనుమతించని అధికారులు, ఒక మతానికి సంబంధించిన విగ్రహాలను ఎలా కొనసాగిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. ఓ వైపు అంబేడ్కర్ 125వ జయంతిని ఘనంగా నిర్వహిస్తూనే మరోవైపు అంబేడ్కర్ గుర్తులు లేకుండా చేసేందుకు కుట్రపన్నుతున్నారని వారు పేర్కొన్నారు. క్యాంపస్‌లో నిర్భందాన్ని ప్రయోగిస్తూ ఒక వర్గం అభిప్రాయాలు, భావాలను అందరిపై రుద్దడం సరి కాదన్నారు. -
ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కుట్ర
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల ఘటనపై కొనసాగుతున్న ఉద్యమాన్ని పక్కదోవపట్టించేందుకు వీసీ అప్పారావు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కుట్రలు పన్నుతున్నారని హెచ్‌సీయూ జేఏసీ నాయకులు అన్నారు. శుక్రవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో జేఏసీ నేత వెంకటేష్ చౌహాన్ మాట్లాడుతూ.. ఉద్యమాన్ని నీరుగార్చేందుకు నిన్నటి వరకు ఉద్యమంలో ఉన్న రాజ్‌కుమార్ సాహుని బెదిరించి తమకు అనుకూలంగా మలుచుకున్నారన్నారు. ఈ ఘటనతో వీసీ వెనుక వెంకయ్యనాయుడు ఉన్నాడన్నది స్పష్టమైందన్నారు. ఏప్రిల్ 6న కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించిన సాహు అదేరోజు వీసీకి అమ్ముడుపోయాడని ఆరోపించారు. ఏప్రిల్ 12న నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఒక్కరు మినహా 948 మంది విద్యార్థులు వీసీ అప్పారావుకు వ్యతిరేకంగా ఓటు వేశారని మరో నేత అర్పిత అన్నారు. సంజయ్ మాట్లాడుతూ ఉద్యమ అవసరాలకోసం పూర్వ విద్యార్థులు, అధ్యాపకులు, పౌరసమాజం నుంచి ఆర్థిక సహాయం పొందారని, ప్రతిపైసా ఉద్యమానికే వినియోగించామన్నారు. ఆధారరహిత ఆరోపణలను పట్టుకొని మంత్రి వెంకయ్య నాయుడు హెచ్‌సీయూ విద్యార్థులను క్షమాపణ చెప్పాలని కోరడం విడ్డూరంగా ఉందన్నారు. వీసీ అప్పారావుకు పదవిలో కొనసాగే అర్హత లేదని, ఆయనను కాపడుతున్న వెంకయ్యనాయుడు దళిత జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, వామపక్షపార్టీలు, ఆమ్ఆద్మీ స్పాన్సర్డ్ ఉద్యమంగా ముద్రవేయడం దుర్మార్గమన్నారు. ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులకు ఉద్యోగాలు రావని, పాస్ చేయమని అధ్యాపకులు,వీసీ చేస్తున్న బెదిరింపులకు లొంగవద్దన్నారు. -
స్కాలర్స్ లిస్టు పంపండి: వీసీ అప్పారావు
సాక్షి, హైదరాబాద్: ఐదేళ్ల కాలపరిమితి పూర్తి చేసుకున్న పరిశోధక విద్యార్థుల జాబితా పంపాలంటూ వివిధ విభాగాల డీన్లకు హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ వైస్ చాన్స్‌లర్ అప్పారావు ఆదేశాలు జారీచేశారు. కోర్సు పూర్తి అయినా కాకున్నా ఐదేళ్లు పూర్తయితే విద్యార్థులు హాస్టల్ ఖాళీ చేయాలని డీన్లకు తేల్చి చెప్పారు. ఇదిలా ఉండగా విద్యార్థులపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే డీన్స్కి ఆదేశాలు జారీచేసినట్టు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. గతంలో వర్సిటీలో వివిధ కోర్సులు చేస్తున్న విద్యార్థుల కాలపరిమితి పూర్తయినప్పటికీ గైడ్ అనుమతితో గడువు పెంచుకునే అవకాశం ఉండేది. ఇప్పుడా అవకాశం లేకుండా చేసి విద్యార్థులను క్యాంపస్ నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అంబేడ్కర్ అసోసియేషన్ కన్వీనర్ మున్నా, ఎస్సీ, ఎస్టీ ఫ్యాకల్టీ ఆరోపించారు. -
ఇక అవమానాలుండవు
బౌద్ధంలోకి మారిన రోహిత్ వేముల తల్లి, సోదరుడు ముంబై: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న రీసెర్చ్ విద్యార్థి రోహిత్ వేముల తల్లి, సోదరుడు గురువారం బౌద్ధ మతం స్వీకరించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా ఆయన మనవడు ప్రకాశ్ అంబేడ్కర్ సమక్షంలో ఇక్కడ జరిగిన కార్యక్రమంలో బౌద్ధ బిక్షువులు రోహిత్ తల్లి రాధిక, సోదరుడు నాగ చైతన్య (రాజా వేముల)లకు బౌద్ధ దీక్షను ఇచ్చారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ.. ఒక పక్క గళమెత్తడానికి ప్రయత్నిస్తున్న వారి గొంతుకలు నొక్కడానికి ప్రయత్నిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ.. మరోపక్క అంబేడ్కర్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొంటున్నారని విమర్శించారు. తాము కుల వర్గీకరణతో కూడిన హిందూ మతానికి వ్యతిరేకమని, కుల వ్యవస్థ లేని బౌద్ధంలోకి అందుకే వచ్చామని తెలిపారు. ఈ రోజు నుంచి తమకు అవమానాలు, అగౌరవాలు, దైవపూజా కార్యక్రమాల్లో వివక్ష ఉండదని చెప్పారు. తన సోదరుడు రోహిత్ బతికుంటే, తమ మత మార్పిడి నిర్ణయం పట్ల చాలా సంతోషించేవాడన్నారు. రోహిత్ కూడా బౌద్ధంలోకి మారాలని అనుకున్నాడని, అయితే ఆ పని చేయలేకపోయాడని చెప్పారు. రోహిత్ అక్క మాత్రం మతం మారలేదు. ఈ కార్యక్రమంలో రోహిత్ స్నేహితుడు రియాజ్ షేక్, హెచ్‌సీయూ విద్యార్థి రాజు పాల్గొన్నారు. -
బౌద్ధం స్వీకరించిన రోహిత్ తల్లి, సోదరుడు
ముంబై: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి రోహిత్ తల్లి రాధిక, అతని సోదరుడు రాజా మతం మారారు. ముంబైలో బౌద్ధమత గురువు సమక్షంలో వీరు బౌద్ధమతాన్ని స్వీకరించారు. రోహిత్ దళితుడు కావడం వల్లే వివక్షకు గురై వెలివేయబడ్డాడని.. అటువంటి వెలివేతకు అవకాశంలేని బౌద్ధమతాన్ని స్వీకరించినట్లు రోహిత్ సోదరుడు అన్నారు. అసమానతలకు తావులేనిదిగా భావించి అంబేద్కర్ బౌద్ధం మతం స్వీకరించారని, అటువంటి సమానత్వాన్ని కాంక్షిస్తూ అంబేద్కర్ చూపిన మార్గంలో ఆయన జయంతిని పురస్కరించుకుని తాము బౌద్ధాన్ని స్వీకరించినట్లు ఆయన తెలిపారు. కొంతకాలంగా దేశంలో 'ఘర్ వాపసీ' గో మాంసం వివాదం, విద్యావ్యవస్థ కషాయీకరణ తదితర అంశాలపై దళిత, మైనారిటీ వర్గాలు ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇదే క్రమంలో అంబేద్కర్ విద్యార్థి సంఘం సభ్యుడు, హెచ్ సీయూ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్యకు పాల్పడటంతో నిరసనలు, ఆందోళలు వెల్లువెత్తాయి. -
బౌద్ధం స్వీకరించనున్న రోహిత్ తల్లి, సోదరుడు
హైదరాబాద్: యూనివర్సిటీలు కేంద్రంగా కొద్ది నెలలుగా సాగుతోన్న ఆందోళనల్లో భాగంగా రేపు కీలక పరిణామం చోటుచేసుకోనుంది. హిందూ మంతంలో దళితులపై కొనసాగుతున్న వివక్షను నిరసిస్తూ బౌద్ధాన్ని స్వీకరించిన బాబాసాహెబ్ బీఆర్ అంబేద్కర్ బాటలోనే రోహిత్ వేముల కుటుంబం కూడా పయనించనుంది. దళితుడు కావడం వల్లే తన కుమారుడు వివక్షకు గురయ్యాడని, విద్యాలయం నుంచి వెలివేశారని, తనకు న్యాయం చేయాలంటూ కొద్ది నెలలుగా ఆందోళన కొనసాగిస్తోన్న రోహిత్ వేముల తల్లి రాధిక హిందూ మతాన్ని వీడి బౌద్ధాన్ని స్వీకరించనున్నారు. అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా గురువారం ముంబై మహానంగరంలో జరిగే కార్యక్రమంలో రోహిత్ తల్లి రాధికతోపాటు సోదరుడు రాజాకూడా బౌద్ధం స్వీకరిస్తారు. ఈ మేరకు వారిద్దరూ కొద్దిమంది స్నేహితులతో కలిసి బుధవారం హైదరాబాద్ నుంచి ముంబై పయనమయ్యారు. బౌద్ధ ధర్మం అసమానతలకు తావులేనిదిగా భావించడం వల్లే బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆ మతాన్ని స్వీకరించాడని, అటువంటి సమాన త్వాన్ని కాంక్షించే తాము కూడా అంబేడ్కర్ చూపిన మార్గంలో పయనించేందుకు నిర్ణయించుకున్నట్లు వేముల రాజా మీడియాకు తెలిపారు. రెండేళ్ల కిందట కేంద్రంలో కొత్త ప్రభుత్వం వచ్చిన కొద్ది నెలలకే సంఘ్ పరివార్ 'ఘర్ వాపసీ' కార్యక్రమాన్ని ప్రారంభించడం, పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రులు, ఒక పార్టీకి చెందిన ఎంపీలు అనుచిత వ్యాఖ్యలు చేయడం, వాటిపై దేశవ్యాప్తంగా ఆందోళనలను చెలరేగటం విదితమే. ఆ తర్వాత గో మాంసం వివాదం, విద్యావ్యవస్థ కషాయీకరణ తదితర అంశాలపై దళిత, మైనారిటీ వర్గాలు ఎక్కడికక్కడ ఆందోళనలు చేపట్టడం తెలిసిందే. ఈ క్రమంలోనే అంబేద్కర్ విద్యార్థి సంఘం సభ్యుడు, హెచ్ సీయూ స్కారల్ రోహిత్ వేముల సంఘంసంఘ్ అనుబంధ ఏబీవీపీ విద్యార్థి సంఘంతో గొడవపడి, ఆత్మహత్యకు పాల్పడటం, అనంతరం దళితులపై వివక్షను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమాలు పుట్టుకురావటం చూశాం. రోహిత్ కుటుంబం బౌద్ధమత స్వీకారంతో వర్సిటీల్లోని వేలమంది అణగారిన విద్యార్థులు కూడా అదే బాటపట్టే అవకాశం లేకపోలేదు. -
‘హెచ్‌సీయూ వీసీని తొలగించాలి’
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో అశాంతికి కారణమైన వీసీ పొదిలి అప్పారావును తక్షణమే తొలగించాలని మంగళవారం సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం జనరల్ బాడీ సమావేశంలో డిమాండ్ చేసింది. విశ్వవిద్యాలయాన్ని మిలటరీ క్యాంపుగా మార్చిన అప్పారావును వారంతా తీవ్రంగా వ్యతిరేకించారు. విద్యార్థులపై పెట్టిన కేసులన్నీ ఉపసంహరించుకోవాలని ఈ సమావేశం తీర్మానించింది. యూనివర్సిటీలోకి మీడియా, ఇతర మేధావులు, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రవేశించడం వారి ప్రజాస్వామిక హక్కు అని తెలిపింది. వర్సిటీలో వివక్షకు తావులేకుండా యాజమాన్యం చర్యలు తీసుకోవాలని సమావేశం డిమాండ్ చేసింది. -
హెచ్ సీయూలో ఉద్రిక్తత
విద్యార్థుల చలో హెచ్ సీయూ పిలుపు, వీసీ అప్పారావు ఆధ్వర్యంలో అకడమిక్ కౌన్సిల్ సమావేశం నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రోహిత్ వేముల మృతికి కారణమైన వీసీ అప్పారావును తొలగించాలని, రోహిత్ యాక్ట్ తీసుకురావాలనే డిమాండ్ తో హెచ్ సీయూ జాక్ బుధవారం చలో హెచ్ సీయూకి పిలుపు నిచ్చింది. ఈ నేపథ్యంలో వర్సిటీ వద్ద భద్రత కట్టు దిట్టం చేశారు. మీడియాతో సహా.. బయటి వారిని వర్సిటీలోకి అనుమతించడం లేదు. మరో వైపు యూనివర్సిటీ వీసీ అప్పారావు ఆధ్వర్యంలో అకడమిక్ కౌన్సిల్ సమావేశం జరగ నుంది. కౌన్సిల్ సమావేశాన్ని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటామని విద్యార్థి జేఏసీ స్పష్టం చేసింది. -
ఆ వర్సిటీ విద్యార్థులకు ఉద్యోగాలు ఏవీ!
సెమిస్టర్ ముగిసిపోతున్నా చేతిలో ఉద్యోగాల ఆఫర్లు ఏమీ లేకపోవడంతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రోహిత్ వేముల ఆత్మహత్య తర్వాతి పరిణామాల నేపథ్యంలో క్యాంపస్ నియామకాలు ఒక్కసారిగా ఆగిపోయాయి. ఆందోళనల కారణంగా యూనివర్సిటీ ప్రతిష్ఠ దెబ్బతిందని, అందుకే కంపెనీలు ఏవీ రావట్లేదని అంటున్నారు. గత సంవత్సరం ఇదే సమయానికి కనీసం పది కంపెనీలు కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ శాఖకు వచ్చాయని, కానీ ఈసారి ఒకే ఒక్క కంపెనీ వచ్చిందని, కనీసం 60 శాతం మంది విద్యార్థులకు చేతిలో ఉద్యోగాలు లేవని ఆ శాఖకు చెందిన ఓ విద్యార్థి చెప్పారు. 2015 ఆగస్టు - డిసెంబర్ నెలల మధ్యలో 42 కంపెనీలు క్యాంపస్ నియామకాల కోసం వచ్చాయి. కానీ, 2016లో ఇప్పటివరకు కేవలం 15 కంపెనీలు మాత్రమే వచ్చాయి. జనవరి నెలలోనే నియామకాలు చాలావరకు తగ్గిపోయాయని, యూనివర్సిటీ పేరు ప్రతిష్ఠలు దారుణంగా దెబ్బతినడంతో కంపెనీలు ఇటువైపు చూడటం మానేస్తున్నాయని స్టూడెంట్ ప్లేస్మెంట్ సమన్వయకర్త ఒకరు అన్నారు. ఒకటీ ఆరా కంపెనీలు వచ్చినా, ఇంటర్వ్యూలలో కూడా అసలు ఈ గొడవ ఏంటి, దాని పరిణామాలేంటనే అడుగుతున్నారట. ఈ పరిస్థితిని చక్కదిద్ది, విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఏప్రిల్ 9 నుంచి జాబ్ ఫెయిర్ ఒకటి నిర్వహించనున్నారు. ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనల విషయంలో మంచి గుర్తింపు పొందిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పేరు చెబితే ఇప్పుడు నిరసనలే గుర్తుకొస్తున్నాయి. క్యాంపస్ నియామకాలు తగ్గితే కొత్తగా చేరే విద్యార్థుల సంఖ్య కూడా పడిపోతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితిని వీలైనంత త్వరగా చక్కదిద్దాలని ఇటు ఆందోళనకారులతో పాటు యూనివర్సిటీ వర్గాలను కూడా విద్యార్థులు కోరుతున్నారు. -
అక్రమ కేసులు ఉపసంహరించుకోవాలి
ఢిల్లీలో విద్యార్థి సంఘాల ధర్నా సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అరెస్టు చేసిన 25 మంది విద్యార్థులతో పాటు ఇద్దరు ప్రొఫెసర్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జేఎన్‌యూ విద్యార్థులు శనివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ ఎదుట ధర్నా చేశారు. విద్యార్థులపై బనాయించిన కేసులను ఉపసంహరించుకోవాలని కోరారు. వర్శిటీలోకి పోలీసులు ప్రవేశించడం అమానుషమన్నారు. హెచ్‌సీయూ వ్యవహారంలో సీఎం కేసీఆర్ మౌనం వీడాలన్నారు. ఎస్ఎఫ్ఐ జేఎన్‌యూ విద్యార్థి నేత సృజన మాట్లాడుతూ హెచ్‌సీయూలో విద్యార్థులకు ఆహారం, నీళ్లు, విద్యుత్తు నిలిపివేయడం అమానుషమన్నారు. రోహిత్ మృతికి నైతిక బాధ్యత వహిస్తూ హెచ్‌సీయూ వీసీ రాజీనారామా చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో ఎస్ఎఫ్ఐ, బిర్సా అంబేడ్కర్ పూలే విద్యార్థి సమాఖ్య, జేఎన్‌యూ విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. -
సీఎం మద్ధతుతోనే విద్యార్థులపై దాడులు: యాష్కీ
సీఎం కేసీఆర్ మద్దతుతోనే హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో విద్యార్థులపై దాడులు జరిగాయని నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కీ ఆరోపించారు. దేశంతోపాటు రాష్ట్రంలో ప్రశ్నించే వారిని అణగదొక్కుతున్నారని విమర్శించారు. హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ మరణం వెనుక వీసీ అప్పారావు హస్తంపై విచారణ జరుగుతున్న తరుణంలో వీసీని విధుల్లోకి తీసుకోవడం వెనుకా కేసీఆర్ హస్తం ఉందన్నారు. దళిత విద్యార్థి మరణిస్తే కనీసం సీఎం పరామర్శించలేదని గుర్తు చేశారు. శుక్రవారం ఆయన కరీంనగర్ జిల్లా జగిత్యాలలో ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో గతంలో ఇరిగేషన్ శాఖ అవినీతిలో కూరుకుపోయిందని చెప్పిన కేసీఆర్ ప్రస్తుతం అదే కాంట్రాక్టర్లకు పనులు కట్టబెట్టబెడుతున్నారని ఆరోపించారు. టీజేఏసీని నిర్వీర్యం చేయడం వెనుక కేసీఆర్ హస్తం ఉందన్నారు. కరువు మండలాల ప్రకటనలో ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రతిపక్ష నాయకులు ప్రశ్నిస్తే వారిపై ప్రతిదాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెనుకబడిన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకుండా రైతులకు రుణమాఫీ చేయకుండా ప్రభుత్వం మభ్యపెడుతోందన్నారు. కేసీఆర్ ఒక్కరే సీడీఎఫ్ రూ.5 వేల కోట్లు దగ్గర పెట్టుకుని కొడుకు, అల్లుడికే నిధులిస్తూ బడుగు, బలహీనవర్గాలకు ఇచ్చే రాయితీలను పక్కదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. -
విద్యార్థుల్లో అలజడికి బాధ్యులెవరు?
రోహిత్ వేముల ఆత్మహత్యతో అట్టుడికిపోయిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఇప్పుడిప్పుడే ప్రశాంత పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో వైస్ చాన్సలర్ అప్పారావు రాక ఒక్కసారిగా అలజడి రేపింది. అప్పారావుకు వ్యతిరేకంగా, అనుకూలంగా క్యాంపస్‌లో మళ్లీ ఆందోళనలు ప్రారంభమయ్యాయి. ఇదే పరిస్థితుల్లో జేఎన్‌యూ విద్యార్థి నాయకుడు కన్హయ్య కుమార్ హైదరాబాద్ రాక పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేసింది. రోహిత్ వేముల విద్యార్థిని ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వైస్ ఛాన్సలర్ అప్పారావు, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయలపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కేసు దాఖలైన విషయం తెల్సిందే. ఈ కేసు నుంచి విముక్తం కాకముందే, కేసులో క్లీన్ చిట్ లభించక ముందే అప్పారావు మళ్లీ వీసీ కుర్చీలో కూర్చోవడంతో అలజడి చెలరేగింది. ప్రశాంత పరిస్థితులను నెలకొల్పేందుకు కృషిచేయాల్సిన పోలీసుల ఓవర్‌యాక్షన్ వల్ల ఉద్రిక్తత తీవ్రమవుతోంది. విద్యార్థులను చితక్కొట్టారు, క్యాంపస్‌లో మెస్‌ను మూసేశారు... విద్యుత్ సరఫరా కట్ చేశారు. క్యాంపస్‌లోకి ఎవరినీ అనుమతించడం లేదు. ఆఖరికి మీడియాను కూడా అనుమతించడంలేదు. బుధవారం జేఎన్‌యూ విద్యార్థినేత కన్హయ్య కుమార్‌ను కూడా అనుమతించలేదు. అప్పారావును మళ్లీ బాధ్యతలు నిర్వహించేందుకు అనుమతించడం అంటే మోదీ ప్రభుత్వం ఈ విషయంలో వెనక్కి తగ్గలేదన్న మాట. పార్టీ చేపట్టిన హిందూత్వ ఎజెండాను ముందుకు తీసుకువెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నదన్న విషయం స్పష్టమవుతోంది. విద్యార్థుల్లో మోదీ ప్రభుత్వం రేపిన చిచ్చు ఒక్క హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకో, జేఎన్‌యూకో పరిమితం కాలేదు. పూణెలోని 'ఫిల్మ్స్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా', మద్రాస్ యూనివర్సిటీల్లోనూ చిచ్చు రేపింది. ఈ చిచ్చు ప్రస్తుతానికి స్థానిక పరిణామాలకే పరిమితం కావచ్చు. కానీ ప్రతిపక్షాలు అవకాశంగా తీసుకుంటున్నాయి కనుక జరగబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై తప్పక ప్రభావం చూపనుంది. - ఓ సెక్యులరిస్ట్ కామెంట్ -
దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలపై దాడి: కన్హయ్య
దేశవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల మీద ఒక సీరియస్ దాడి జరుగుతోందని జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ అన్నాడు. సుందరయ్య విజ్ఞానకేంద్రంలో గురువారం ఉదయం కన్హయ్య మీడియాతో మాట్లాడాడు. తొలుత హెచ్‌సీయూలో ఘటన జరిగిందని, తర్వాత జేఎన్‌యూలో విద్యార్థులను తప్పుపట్టారని అన్నాడు. పోనీ ఈ రెండింటినీ పక్కన పెడితే అలీగఢ్ యూనివర్సిటీ మైనారిటీ హోదాను తప్పించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించాడు. మొత్తంగా అసలు విద్యార్థుల ఆందోళనను డీలెజిటమేట్ చేసే ప్రయత్నం ఒకటి జరుగుతోందని ఆరోపించాడు. జస్టిస్ ఫర్ రోహిత్ వేముల ఆందోళనను ఢిల్లీలో కొనసాగించాలని తాము ముందుగానే నిర్ణయించుకున్నామని, ఇక్కడ ఘటన జరిగిన తర్వాత తాను ఇక్కడికొచ్చి విద్యార్థి సంఘాల నేతలతో మాట్లాడానని తెలిపాడు. ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్లిన తర్వాత అక్కడ జేఏసీ ప్రారంభించామని, అంబేద్కర్ భవన్ నుంచి ఆర్ఎస్ఎస్ ఆఫీసు వరకు నిరసన ప్రదర్శన నిర్వహించామని, తర్వాత బహిరంగ సభ కూడా నిర్వహించామని తెలిపాడు. రోహిత్ వేముల ఆందోళనకు జేఎన్‌యూలో జరిగిన ఆందోళన కేవలం ఒక కొనసాగింపు మాత్రమేనని వెల్లడించాడు. అయితే ప్రభుత్వం మాత్రం ఈ రెండింటినీ ఒక దానికి ఒకటి పోటీగా చేయాలనుకుందని అన్నాడు. తాను జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా.. తనకు ఆదర్శప్రాయుడు అఫ్జల్ గురు కాదు, రోహిత్ వేములేనని చెప్పానని గుర్తుచేశాడు. తాను హెచ్సీయూకు రావాలని ముందుగానే నిర్ణయించుకున్నామని, కానీ అనుకోకుండా జరిగిందో.. కావాలనే చేశారో గానీ తాను రావడానికి ఒక్కరోజు ముందే అప్పారావు మళ్లీ వీసీగా బాధ్యతలు స్వీకరించారని కన్హయ్యకుమార్ అన్నాడు. ఆయన మద్దతుదారులు దండలతో ఆయనకు స్వాగతం పలికారని, తర్వాత శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్న విద్యార్థులను రెచ్చగొట్టడంతో హింసాత్మక ఘటనలు జరిగాయని తెలిపాడు. తనకు ప్రజాస్వామ్యంపై నమ్మకముందని, హింసను ఎట్టి పరిస్థితుల్లో సమర్థించబోనని అన్నాడు. కానీ ఇక్కడ మాత్రం అమ్మాయిలను మగ పోలీసులతో కొట్టించారని, విద్యుత్, వై-ఫై కట్ చేశారని, చివరకు అధ్యాపకులను కూడా కొట్టి, అరెస్టుచేసి జైళ్లలో పెట్టారని చెప్పాడు. పోలీసులు తొలుత తనను యూనివర్సిటీలోకి అనుమతించాలనే అనుకున్నారట గానీ.. తర్వాత అంతర్గత భద్రతా సమస్యల వల్ల పంపలేదని చెప్పారని.. ఆ అంతర్గత భద్రతను భంగపరిచింది ఎవరని ప్రశ్నించాడు. జేఎన్‌యూ - హెచ్‌సీయూలలో ఒకేలాంటి పోలికలు కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించాడు. -
నగరం
రోజంతా ఉద్రిక్త వాతావరణం హెచ్‌సీయూ...ఓయూల్లో విద్యార్థుల ఆందోళన ఓయూలో పరస్పర దాడులు...గాయాలు అట్టుడికిన హెచ్‌సీయూ నగరంలో 40 డి గ్రీల గరిష్ట ఉష్ణోగ్రత ఓ వైపు మండుతున్న ఎండలు... మరోవైపు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ.. ఉస్మానియా విశ్వ విద్యాలయాల్లో విద్యార్థుల ఆందోళనలతో నగరం వేడెక్కింది. మంగళవారం నాటి పరిణామాల నేపథ్యం... జేఎన్‌యూ విద్యార్థి కన్హయ్య కుమార్ రాకతో హెచ్‌సీయూ అట్టుడికింది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏ క్షణం ఏం జరుగుతుందోననే ఉత్కంఠ... పరిస్థితి ఎటు దారి తీస్తుందోననే టెన్షన్... కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలతో విద్యార్థులు.. ఎలాగైనా నిలువరించాలనే ఉద్దేశంతో భారీగా మోహరించిన పోలీసులు.. బుధవారం ఉదయం నుంచీ సాయంత్రం వరకూ క్షణ క్షణం భయం భయంగా గడిచింది. ఇంకోవైపు ఉస్మానియా వర్సిటీలోని వాటర్ ట్యాంక్‌లో బయట పడిన మృతదేహం అక్కడ చిచ్చు రేపింది. అది తమ సహచరుని మృతదేహ మేనని... నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని భావించిన విద్యార్థుల్లో ఆగ్రహం పెల్లుబికింది. అక్కడికి చేరుకున్న పోలీసులపై రాళ్ల దాడికి దిగారు. ఫలితంగా పోలీసులు లాఠీలకు పని చెప్పారు. ఇరువర్గాల దాడుల్లో అటు పోలీసు ఉన్నతాధికారులు... సిబ్బంది.. ఇటు విద్యార్థులు గాయపడ్డారు. ఆ మృతదేహం విద్యార్థిది కాదని పోలీసులు ప్రకటించడంతో వివాదం సద్దుమణిగింది. మొత్తమ్మీద తీవ్ర ఎండలకు తోడు.. వర్సిటీలో చోటు చేసుకున్న పరిణామాలతో న‘గరం’..గరంగా మారింది. -
హెచ్సీయూకు 27 వరకు సెలవులు
హైదరాబాద్: వైస్ చాన్స్‌లర్ అప్పారావు రాకతో ఒక్కసారిగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మళ్లీ మొదలైన ఆందోళనల నేపథ్యంలో యూనివర్సిటీ యాజమాన్యం ఆంక్షలను కఠిన తరం చేసింది. యూనివర్సిటీకి ఈనెల 27వ తేదీ వరకు సెలవులు ప్రకటించింది. యూనివర్సిటీలోకి మీడియా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, బయటి విద్యార్థులు, వేరే విద్యార్థి సంఘాల నేతలకు సైతం అనుమతి నిరాకరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అవసరమైన పోలీసు బలగాలను మోహరించాలని యూనివర్సిటీ యాజమాన్యం పోలీస్ కమిషనర్‌కు లేఖ రాసింది. యూనివర్సిటీ మెయిన్ గేట్‌ను మాత్రమే తెరచి కేవలం యూనివర్సిటీకి సంబంధించిన వ్యక్తులకు మాత్రమే ప్రవేశం కల్పించనున్నామని యాజమాన్యం వెల్లడించింది. మరోవైపు హెచ్‌సీయూలో కన్హయ్యకుమార్ సభ నిర్వహించేందుకు కొన్ని విద్యార్థి సంఘాలు ప్రయత్నిస్తుండగా.. అసలు కన్హయ్యకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఉందా లేద అనే విషయం ఇప్పుడు వివాదాస్పదంగా మారేలా కనిపిస్తోంది. ఇప్పటివరకు పోలీసుల నుంచి కన్హయ్యకు ఎలాంటి అనుమతి లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో హెచ్‌సీయూ వరకు రావడం మాట అటుంచి, అసలు హైదరాబాద్‌లోనైనా అతడిని అడుగు పెట్టనిస్తారా లేదా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ అప్పారావు మళ్లీ బాధ్యతలు చేపట్టడంతో విద్యార్థులు ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. మంగళవారం వీసీ నివాసంపై దాడికి పాల్పడిన 36 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కాగా, రోహిత్ తల్లి నేడు హెచ్‌సీయూలో దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో హెచ్‌సీయూలో పరిస్థితి టెన్షన్ టెన్షన్‌గా మారింది. -
వివక్షకు వ్యతిరేకంగా జాతీయ సదస్సు
విశ్వవిద్యాలయాల్లో కుల వివక్షకు వ్యతిరేకంగా ఏప్రిల్ 4, 5, 6 తేదీల్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జాతీయ సదస్సు జరగనుంది. వర్సిటీలోని దళిత్-ఆదివాసీ స్టడీస్, అంబేడ్కర్ స్టడీ సెంటర్, సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహిసున్నట్టు తెలిపారు. ICSSR ఛైర్మన్ సుఖదేవ్ థోరట్, కేంద్రప్రభుత్వ మాజీ కార్యదర్శి పిఎస్.క్రిష్ణన్, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉమాచక్రవర్తి, సీనియర్ జర్నలిస్ట్ సీమా ముస్తఫా లతో కూడిన బృందం ఈ సదస్సుకి ముఖ్య అథిదులుగా హాజరుకానున్నారు. దేశంలోని విశ్వవిద్యాలయాలు, ఐఐఎంలు, ఐఐటిలతో సహా 40 ఉన్నత విద్యాసంస్థల నుంచి విద్యార్థులు, అధ్యాపకులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. దేశంలోని ఉన్నత విద్యాసంస్థల్లో నెలకొన్న కుల వివక్షపై సమగ్రసమాచారాన్ని సేకరించి, నిర్దిష్టమైన నివేదికను తయారుచేయడమే జాతీయ సదస్సు లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. హెచ్‌సియులో వివక్ష కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్, అతనితో పాటు మరో నలుగురు విద్యార్థుల రస్టికేషన్ నేపధ్యంలో వెల్లువెత్తిన విద్యార్థి ఉద్యమం దేశ వ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల్లోని వివక్షను తెరపైకి తెచ్చింది. ఈ నేపధ్యంలోనే దేశంలోని పలు ఉన్నత విద్యాలయాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న వివక్షలు వెలుగులోకి వచ్చాయి. వాటన్నింటిపై ఆయా విద్యాసంస్థల నుంచి వచ్చిన విద్యార్థులు, అధ్యాపకులు స్పష్టమైన రిపోర్టును అందించనున్నారు. ఈ సదస్సులో వచ్చిన అభిప్రాయాలను క్రోడీకరించి దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో నెలకొన్న వివక్షపై ఒక డాక్యుమెంటును రూపొందించే యోచనలో ఉన్నారు. ఈ డాక్యుమెంటరీని ఢిల్లీలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. దీన్ని రాష్ట్ర పతి, ప్రధానులకు, అన్ని రాజకీయ పక్షాలకు అందించనున్నారు. -
రోహిత్ చట్టం రావాలి - తల్లి రాధిక
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య అనంతర పరిణామాలు ఉద్వేగభరితం అవుతున్నాయి. విద్యార్థి నాయకులు రేపటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లోని యూనివర్సిటీలన్నిటికీ బస్సు యాత్రలు చేపడుతున్నారు. 23న ఢిల్లీ వెళుతున్నారు. మరోవైపు ‘నా బిడ్డ చావుకి కారణమైన వారిని కఠినంగా శిక్షించే వరకు విశ్రమించేది లేదు’ అని రోహిత్ తల్లి రాధిక అంటున్నారు. రోహిత్ వేముల. ఇప్పుడతనొక చైతన్య కెరటం. సామాజిక ఉద్యమ కాంతి విస్ఫోటనం. వేనవేల సంవత్సరాల వెలివేతల వెతలకి మరణవాంగ్మూలం. రోహిత్‌కి కోటి ఆశలున్నాయి. ఆ ఆశల నక్షత్ర స్ఫూర్తి ఎవరో తెలుసా? గోరుముద్దలతో కొడుకు గుండెల్లో తెగువ నింపిన అమ్మ.. రాధిక. అమ్మే.. అతనికి రోల్‌మోడల్. అంటరాని దానివని సమాజం వెలివేసేవరకు.. ముగ్గురు బిడ్డల తల్లిని చేసి కట్టుకున్నవాడు కాలదన్ని వెళ్లే వరకు... అడుగడుగునా ఆంక్షల సంకెళ్లతో సమాజం తన మనసును కుళ్ల పొడిచే వరకు.. రెప్పలమాటున కన్నీటిని దిగమింగుకొని నిశ్శబ్దంగా భరించిన రోహిత్ వేముల తల్లి రాధిక ఏనాడూ పన్నెత్తి మాట్లాడలేదు! తనను వెలివేసిన ఈ సమాజాన్ని నిలదీయనూ లేదు. పట్టెడన్నం కోసం పదిమందినీ చేయి చాచకుండా పిల్లలకు నాలుగక్షరాలు నేర్పడమే సరియైన దారనుకుంది. రెక్కలకు మిషన్ కట్టుకొని పాతబట్టలను కుట్టుకుని, పాచిపనితో పాటు వెంటవచ్చే తిట్లను తుడిచేసుకొని బతకడం మొదలు పెట్టింది. తన బిడ్డల కోసమే బతకడం మొదలు పెట్టింది రాధిక. రోహిత్ తల్లి రాధిక ఈ సమాజంపై చేసిన నిశ్శబ్ద యుద్ధమే రోహిత్‌కి తిరుగుబాటు నేర్పింది. ఆ మాతృమూర్తితో సాక్షి సంభాషణ. చుక్కలంటే రోహిత్‌కి చాలా ఇష్టమట కదా! చిన్నప్పుడు రోహిత్ కి చీకటంటే భయం. అమ్మమ్మతో (రాధికను పెంచిన తల్లి) ఆ విషయం చెబితే చీకటంటే భయమెందుకు చీకటి వెనుక నక్షత్రాల వెలుతురుంది చూడమందట. అప్పట్నుంచి చీకట్లోకి వెళ్లాలంటే నక్షత్రాలను తలచుకునేవాడు. నిత్యం నా గాజులతో ఆటాడుకునే రోహిత్.. పగిలిన గాజులతో నక్షత్రాలను చేసి అందులో రంగుల హరివిల్లుని చూపేవాడు. ఇంట్లో బకెట్లను అడ్డం పెట్టి క్రికెట్ ఆడుతుంటే వచ్చే శబ్దానికి రోహిత్ ఇంట్లో ఉన్నట్టు చుట్టుపక్కల వాళ్లు గ్రహించేవాళ్లే తప్ప రోహిత్ అలికిడి ఎవ్వరికీ తెలిసేది కాదు. ఒంటరి జీవితం, పేదరికం, అస్పృశ్యత ఎలా ఉండేది? మీ పిల్లల మనోభావాలు ఏమిటి? నాకు నా కుటుంబ సభ్యుల తోడు ఉన్నా, ఒంటరిగానే జీవితాన్ని ఈదటం నేర్చుకున్నాను. పిల్లలకూ అదే నేర్పాను. అన్నింటికీ పరిష్కారం చదువొక్కటే అనుకున్నా. కానీ చదువును అంటి పెట్టుకొని వివక్ష నా బిడ్డని వెంటాడుతోందని తెలుసుకోలేకపోయాను. అదే వివక్ష నా బిడ్డని నాకు దూరం చేస్తుందని అస్సలూహించలేదు. అలా ఊహించి వుంటే నా బిడ్డని భద్రంగా దాచిపెట్టుకొందును. చిన్నప్పుడు తమ్ముడు ఫిజిక్స్ ట్యూషన్‌కెళితే అగ్రవర్ణాలవాళ్లంతా మాష్టారు గది లోపలుంటే, గడపను ఆనుకొని తమ్ముణ్ణి, తమ్ముడి దళిత మిత్రులను, సాయిబుల పిల్లలను బయటే కూర్చోబెడుతున్నారని తెలిసి రోహిత్ ఊరడించాడు. ఎక్కడకూర్చున్నా మనకు చదువు అబ్బుతుంది. అందరికన్నా మరింత కష్టపడితే అందరికన్నా మనమే ముందుంటాం. మంచి స్థానంలో ఉంటాం. అన్నింటికీ పరిష్కారం అదేనని తమ్ముడికి చెప్పేవాడు. మాది కటిక పేదరికం. నేను రోహిత్ చదువుకి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. అన్ని చోట్ల జనరల్ క్యాటగిరీలోనే సీట్లు సంపాదించాడు. ఎంఎస్సీ ఎంట్రన్స్‌లో ఆలిండియాలో ఆరో స్థానాన్ని సంపాదించి కన్నతల్లిని గర్వపడేలా చేశాడు. అప్పుడే నా కష్టం వృథా పోలేదని అర్థం అయ్యింది. చిన్నప్పట్నుంచి స్కూల్ కి కానీ, కాలేజీకి కానీ బాక్స్ తీసుకెళ్లే వాడు కాదు. నిజానికి ఇంట్లో ఏమీ ఉండేది కాదు. అందుకే మధ్యాహ్నం కూడా ఇంటికే వచ్చేవాడు. ఉంటే తినేవాడు. లేకుంటే పస్తులుండేవాడు. డిగ్రీలో సైతం పస్తులున్న విషయం నాకింకా గుర్తుంది. స్కూల్లో అయితే టీచర్లే వాళ్ల బాక్సుల్లోది పెట్టేవాళ్లు. అంతటి పేదరికం కూడా రోహిత్ ని కుంగదీయలేదు. అంబేడ్కర్ పుస్తకాలెక్కువగా చదివేవాడు. కన్నా మాష్టారి బడిలో చదువుకునేప్పుడు ఉపన్యాస పోటీల్లో కుల వివక్షలేని సమాజం అవసరమని మాట్లాడినట్లు మాష్టారు చెప్పారు. రోహిత్ మిమ్మల్ని ఏదైనా కావాలని అడిగేవాడా? ఇది కావాలని నన్నేనాడూ అడగలేదు. బట్టలు కూడా నేను తెచ్చి కొలతలిచ్చి రమ్మంటే టైలర్ దగ్గరికెళ్లేవాళ్లు రోహిత్, రాజు. చివరకు నేను చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానన్న రోహిత్‌కి హైదరాబాద్‌లోనే ఒకమ్మాయిని తీసుకొచ్చి చూపించాను. దూరంగా చెట్టుకింద కూర్చున్న అమ్మాయి దగ్గరికి తన మిత్రుడితో కలిసి వెళ్లి నాకు వేరే ఆలోచనలున్నాయని, ఇప్పుడు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని సున్నితంగా చెప్పి వచ్చాడు రోహిత్. రోహిత్‌ని టైస్టని, దేశ విద్రోహి అని అంటున్నారు..! అందరూ సమానంగా ఉండాలనడం దేశ ద్రోహమా? అవమానిస్తే సహిస్తూ కూర్చోక పోవడం టైజమా? నేను పెద్దగా చదువుకోలేదు. కానీ నా బిడ్డలను ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చి దిద్దాను. ఎవరికీ ద్రోహం చేసి ఎరుగరు. అన్నింటినీ సహిస్తూ ఉండేవాళ్లు. రోహిత్ ఎప్పుడూ లైబ్రరీల చుట్టూ తిరిగేవాడు. ఏవేవో పుస్తకాలు చదివేవాడు. అతని చదువే అతనికి తెగింపు నేర్పింది. అందుకే అన్యాయాన్ని ప్రశ్నించాడు. బహుశా అదే నా బిడ్డ చేసిన ద్రోహం కాబోలు. అందుకే నా బిడ్డను సాంఘిక బహిష్కరణ చేసి, యూనివర్శిటీ బయటకు, రోడ్డు మీదికి చేర్చారు. మీ భర్త ఎప్పుడైనా బిడ్డల ఆలనా, పాలనా చూశారా? నా భర్త ఏనాడూ నా బిడ్డల గురించి ఆలోచించలేదు. ఆలోచిస్తే నేనొక్కత్తినే ఎందుకు బిడ్డలను పెంచుకుంటాను. అసలు నా బిడ్డల మొహం కూడా అతనికి సరిగ్గా తెలియదు. మేమిద్దరం విడిపోయిన తర్వాత కూడా నా వెంటపడి వీధి రౌడీలా వేధించేవాడు. నా పేరు చెప్పి చుట్టుపక్కల అప్పులు చేసేవాడు. ఆ అప్పులన్నీ తీర్చుకోలేక నేనూ, నా బిడ్డలూ అష్టకష్టాలు పడేవాళ్లం. టెన్త్‌లో ఉండగా పరీక్ష ఫీజుకి డబ్బుల్లేక మట్టిపనికి వెళ్లిన రోహిత్‌ని అతని క్లాస్మేట్ చూడటంతో తట్టుకోలేక మట్టితట్ట అక్కడే పడేసి వచ్చి బోరున ఏడ్చాడు. మీరు దళితులు కాదంటూ మీ గురించి జరుగుతున్న చర్చపై మీరేమనుకుంటున్నారు? నాకూ, నా బిడ్డలకూ కూడు పెట్టని కులం ఇప్పుడు నా గురించి ఆరా తీస్తోంటే బాధగా వుంది. నా భర్త నా బిడ్డల మూతి కూడా తుడిచి ఎరగడు. అతనికి నా కులం గురించి చర్చించే అర్హత లేదు. ఒక దళిత బిడ్డగా అన్ని అవమానాలను భరిస్తూ, అన్ని అణచివేతలను సహిస్తూ నా బిడ్డలు పెరిగారు. అదీ దళిత వాడలోనే. ఆ దళిత వాడే మమ్మల్ని గుండెలకు హత్తుకుంది. అవే ఆచారాలు, అలవాట్లూ నా బిడ్డలకూ ఉన్నాయి. ఏనాడూ మా గురించి ఆలోచించకుండా, మా ఆలనా పాలనా చూడకుండా ఇప్పుడు నా బిడ్డలు తన కులమేనంటూ నా భర్త మాట్లాడటంలో అర్థం లేదు. నన్ను పెంచింది వడ్డెర కులస్థులే అయినా నా పుట్టుక మూలాలు దళితులవే. రోహిత్ మరణం నేటికీ దేశాన్ని కుదిపేస్తోంది. మీరేం కోరుకుంటున్నారు. మొన్ననే నా బిడ్డ అిస్థికలు నదిలో కలిపొచ్చాము. మనసు ముక్కలైంది. చెట్టంత బిడ్డను కోల్పోవడం ఎంత నరకమో అనుభవిస్తున్నాను. కానీ అతను ఊరికినే చనిపోలేదు. ఎందుకు చనిపోయాడో యూనివర్సిటీ వాళ్లు నాకు చెప్పాలి. రోహిత్ ఆత్మహత్యకు కారకులెవ్వరో ముందు తేలాలి. ఆమెవరో (స్మృతీ ఇరానీ, సుష్మాస్వరాజ్ అంటూ చిన్న కొడుకు రాజా అందించాడు) నా బిడ్డ దళితుడు కాదని మాట్లాడ్డం కాదు. నా బిడ్డ ఎందుకు చనిపోయాడో చెప్పాలి. నా బిడ్డనే కాదు ఎంతో మంది దళిత బిడ్డల్ని చంపేసి డబ్బులిచ్చి పంపేద్దామనుకుంటున్నారు. కానీ నాకు ఒక్కనయాపైసా కూడా అక్కర్లేదు. నాలాంటి తిరగబడే తల్లులుంటారని వీసీ అప్పారావుకి అర్థం కావాలి. నా బిడ్డ చావుకి కారణమైన వారిని కఠినంగా శిక్షించే వరకు నా బిడ్డ ఆత్మకు శాంతి లేదు. న్యాయం జరిగే వరకు నేను ఊరుకోను. - అత్తలూరి అరుణ, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సాక్షి రాజకీయ నాయకులు, ఇతర సంఘాలు మీ పక్షాన నిలబడ్డాయి కదా. వారికి మీరేం చెప్పదల్చుకున్నారు? నా దగ్గరికొచ్చిన మొట్టమొదటి నాయకులు వైఎస్ జగన్. నా ఇంటికొచ్చి ధైర్యం చెప్పారు. ఆయనే అధికారంలో ఉంటే నేను దళిత స్త్రీనన్న నిజాన్ని ఒక్కముక్కలో తేల్చిపడేసేవారు. ఒక్కపైసా కూడా ఇవ్వకుండా నాకు 5 లక్షలిచ్చినట్టు తెలుగుదేశం ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. నాకూ, నా చిన్న కొడుకు రాజా కి ఉద్యోగం కూడా ఇచ్చామంటున్నారు. కానీ ఎప్పుడిచ్చారో, ఎక్కడిచ్చారో వాళ్లే చెప్పాలి. వైఎస్ఆర్ మరణం తరువాత నా బిడ్డలకు ఫీజు రీయింబర్స్మెంట్ రాదేమోనని బెంగపడ్డాను. పెద్దాయన చనిపోయినప్పుడు నేను అన్నం కూడా ముట్టలేదు. నాకు మద్దతిచ్చిన వారందరికీ నా ధన్యవాదాలు. నా బిడ్డకు న్యాయం జరిగే వరకు నా వెంట ఉండండి. నా లాంటి దళిత బిడ్డలపై వేధింపులు ఆగాలంటే రోహిత్ చట్టం చేయాలి. అందుకు పార్లమెంటులో నా పక్షాన పోరాడండి. ఇదే నేను చెప్పగలిగింది. -
హెచ్‌సీయూలో సంస్కరణలు అవసరం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో సంస్కరణలు అవసరమని... విద్యార్థుల ప్రవేశాలు మొదలుకొని అధ్యాపకుల నియామకాల వరకు అన్నింటిలో రిజర్వేషన్లను సంపూర్ణంగా అమలు చేయాలని వర్సిటీ ఇన్చార్జి వైస్ చాన్స్‌లర్ మరియప్పన్ పెరియస్వామి చెప్పారు. ప్రతిష్టాత్మకమైన హెచ్‌సీయూ భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతిరూపమని, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి గంపెడాశతో వచ్చిన దళిత, వెనుకబడిన విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడడం విషాదకరమని పేర్కొన్నారు. వర్సిటీలో పరిస్థితులను సాధారణ స్థితికి తెచ్చేందుకు శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. హెచ్‌సీయూలో కెమిస్ట్రీ విభాగం డీన్ అయిన పెరియస్వామి.. ఇన్చార్జి వీసీగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. వేల ఏళ్లుగా అవమానాలకు, వివక్షకు గురవుతున్న దళిత విద్యార్థులకు న్యాయం జరగాలని తాను కోరుకుంటున్నానని పెరియస్వామి చెప్పారు. హెచ్‌సీయూలో పరిస్థితులను సాధారణ స్థితికి తెచ్చేందుకు కృషి చేస్తానన్నారు. వివక్షకు తావులేకుండా చేయడానికి మీ దగ్గరున్న ప్రణాళిక ఏమిటని ప్రశ్నించగా... అంబేడ్కర్ ప్రసాదించిన రిజర్వేషన్లను సక్రమంగా అమలు చేయడమే పరిష్కారమన్నారు. హెచ్‌సీయూలో అన్ని రంగాల్లో సంస్కరణలు అవసరమని అభిప్రాయపడ్డారు. విద్యార్థుల ప్రవేశాలు మొదలుకొని అధ్యాపకుల నియామకాల వరకు అన్నింటిలో రిజర్వేషన్లు సంపూర్ణంగా అమలు చేయాలని చెప్పారు. ఇప్పటికే వర్సిటీ ఆ పనిచేస్తున్నా.. మరింత సమర్థవంతంగా అమలు చేయడం అవసరమన్నారు. రోహిత్ కుటుంబానికి న్యాయం చేస్తాం రోహిత్ బతికుంటే గొప్ప ప్రొఫెసర్ కాగలిగేవాడని పెరియస్వామి చెప్పారు. అంత గొప్పవ్యక్తికి మనమెవరమూ నష్టపరిహారం ఇవ్వలేమని, అతడి కుటుంబానికి న్యాయం చేయగలిగితే చాలని పేర్కొన్నారు. అది కూడా చేయకపోతే సమాజం క్షమించదన్నారు. రోహిత్ తమ్ముడు రాజుకు హెచ్‌సీయూలో ఉద్యోగం కల్పించే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం, రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల దృష్టికి తీసుకెళతానని చెప్పారు. వర్సిటీల్లో అడ్మిషన్లు, పరీక్షల విధానం, ఉద్యోగ నియామకాలకు సంబంధించిన కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పెరియస్వామి అభిప్రాయపడ్డారు. విద్యార్థుల సమస్యలకు సత్వర పరిష్కారం కోసం ప్రత్యేకించి మెంటర్ వ్యవస్థ ఉన్నప్పటికీ అది సక్రమంగా అమలు జరగడం లేదని, దాన్ని పునరుద్ధరిస్తానని చెప్పారు. వర్సిటీకి వచ్చేవారిలో అత్యధికులు అత్యంత వెనుకబడిన, పేద, దళిత, ఆదివాసీ విద్యార్థులేనన్నారు. వారిలో కొందరు పలు కారణాలతో కోర్సు పూర్తి చేసుకోలేక, మధ్యలోనే చదువు మానుకొని వెనుదిరిగి వెళ్లలేక మానసిక వేదనకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తాను కూడా పేద గీత కార్మిక కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తినేనని, తనకూ ఆ బాధ తెలుసని పెరియస్వామి చెప్పారు. వివిధ డిపార్ట్మెంట్లలో మొదట దళిత విద్యార్థులకు గైడ్లను కేటాయించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇంటర్నల్ మార్కులు, ఇంట రాక్షన్ విధానంలో పరీక్షల నిర్వహణను వర్సిటీలో అమలుచేయాలన్నది తన కోరిక అన్నారు. అమెరికాలో అమల్లో ఉన్న ఈ విధానం ద్వారా.. ప్రొఫెసర్లు బోధించే విషయాలు విద్యార్థులకు ఏమేర అర్థం అవుతున్నాయో, ఎక్కడ లోపాలున్నాయో స్పష్టంగా అర్థమవుతుందని చెప్పారు. -
రోహిత్ కుటుంబాన్ని ఆదుకోవడంలో విఫలం
భాగ్యనగర్‌కాలనీ: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్ కుటుంబాన్ని ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి గా విఫలమయ్యాయని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ, సీనియర్ నాయకుడు వి.హనుమంతరావులు ఆరోపించా రు. కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ నుంచి విడుదలైన అనంతరం వారు మీడియా తో మాట్లాడుతూ.. తమ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ విద్యార్థులకు మద్దతుగా దీక్షలో పాల్గొన్నారని, ఆయనకు మద్దతుగా తాము హెచ్‌సీయూ ప్రధాన ద్వారం ముందు శనివారం ధర్నా చేస్తుంటే పోలీసులు అన్యాయంగా అరెస్టు చేసి కూకట్పల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారని అన్నారు. విద్యార్థులకు మద్దతు తెలి పేందుకు తమ నాయకుడు రాహుల్‌గాంధీ వస్తే ఆయనను అడ్డుకునేందుకు ఏబీవీపీ విద్యార్థులు కుట్రపన్నారన్నారు. దళిత విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే అతని కుటుంబానికి అన్ని విధాలా ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమన్నారు. ఇప్పటి వరకు వీసీ అప్పారావును సస్పెండ్ చేయలేదని, ఈ ఘటనకు కారణమైన కేంద్రమంత్రి స్మృతి ఇరానీని పదవి నుంచి తొలగించకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దళితుల పట్ల ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీబీఐతో విచారణ జరిపించాలి: ఎస్ఎఫ్ఐ కేపీహెచ్‌బీకాలనీ: హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ మృతి పై సీబీఐ విచారణ జరిపించి, నిందితులను వెంటనే శిక్షించాలని కోరుతూ జేఎన్టీయూహెచ్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శనివారం ర్యాలీ నిర్వహించారు. రోహిత్ జయంతి సందర్భంగా అతని చిత్రపటానికి ఎస్ఎఫ్ఐ నాయకుడు నరేష్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి, కొవ్వొత్తులతో నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు నరసింహ, నరేష్, సమీర్, రాజు, శశాంక్, వినోద్, గోవర్దన్, శ్రీనునాయక్, రఘు, విజయ్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు అండగా ఉంటాం... హిందూ మతోన్మాద వ్యతిరేక వేదిక దోమలగూడ: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల డిమాండ్లు నేరవేరేవరకు వారికి హిందూ మతోన్మాద వ్యతిరేక వేదిక అండగా ఉంటుందని పలువురు వక్తలు ప్రకటించారు. రోహిత్ వేముల మృతికి కారణమైన వారిని శిక్షించే వరకు పోరాడుదాం అంటూ హిందూ మతోన్మాద వ్యతిరేక వేదిక ఆధ్వర్యంలో ఇం దిరాపార్కు వద్ద వివిధ సంఘాల నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విరసం నాయకులు వరవరరావు మాట్లాడుతూ.. దేశంలో దళి తులు, ఆదివాసీలు, ముస్లింలు, మహిళలపై భౌతిక, సాంస్కృతిక దాడులు తీవ్రమయ్యాయన్నారు. ఉన్నత విద్యను బోధించే విశ్వవిద్యాలయాలు అగ్రహారాలుగా మారాయని ఆరోపించారు. యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ చనిపోయేముందు వీసీకి రాసిన సూసైడ్ నోట్ చాలా విలువైందన్నారు. రోహిత్ పిరికితనంతో ఆత్మహత్య చేసుకోలేదని, ఆయనది త్యాగం అని అన్నారు. కులమతాలు ఏవైనప్పటికీ డబ్బున్న వాళ్లు బ్రహ్మణిజం లోకి మారుతున్నరన్నారు. కేంద్ర మంత్రి దత్తాత్రే య లేఖ ఆధారంగా విద్యార్థులను సస్పెండ్ చేయడం శోచనీయమన్నారు. రోమిత్ మృతికి కారకులైనమంత్రులు స్మృతి ఇరానీ, దత్తాత్రేయ, వీసీ అప్పారావు, ఎమ్మెల్సీ రాంచందర్‌రావులపై ఐపీసీ 302 సెక్షన్ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వేదిక కన్వీనర్ అభినవ్, వహాద్ ఎ ఇస్లామీహిందూ నాయకులు మౌలానా నసీరుద్దీన్,ప్రొఫెసర్ రత్నం, పీడీఎస్‌యూ నాయకులు రాజు, గంగాధర్, పీఓడబ్ల్యూ నాయకురాలు సంధ్య, ఫాతిమా ప్రసంగించారు. -
కొనసాగుతున్న ఆమరణ దీక్ష
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో శుక్రవారం అర్ధరాత్రి ప్రారంభమైన ముగ్గురు విద్యార్థుల ఆమరణ దీక్ష కొనసాగుతోంది. విద్యార్థుల ప్రధానమైన డిమాండ్లలో తొలి డిమాండ్ రోహిత్‌తో సహా మరో నలుగురు విద్యార్థులను రెస్టికేట్ చేసిన అప్పారావును తొలగించడం. అయితే, అప్పారావు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లగా... ఆయన స్థానంలో నియామకమైన విపిన్ శ్రీవాస్తవ్‌ని కూడా విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకించారు. విద్యార్థులతో పాటు ఎస్సీ, ఎస్టీ అధ్యాపకులు శ్రీవాస్తవ్‌కు వ్యతిరేకంగా నిరశన దీక్ష చేపట్టారు. శుక్రవారం అర్ధరాత్రి విపిన్ శ్రీవాస్తవ్ స్థానంలో కెమిస్ట్రీ డీన్ పెరియసామి ఇన్చార్జ్ వీసీగా బాధ్యతలు చేపట్టడంతో విద్యార్థులలో కొంత సానుకూల వాతావరణం ఏర్పడుతుందన్న ఆశాభావాన్ని యూనివర్సిటీ అధ్యాపకులు వ్యక్తం చేశారు. గతంలోనే విద్యార్థులపై రెస్టికేషన్ను తాత్కాలికంగా ఎత్తివేస్తున్నట్టు యూనివర్సిటీ ప్రకటిం చింది. శుక్రవారం బాధ్యతలు చేపట్టిన ఇన్చార్జ్ విసి పెరియసామి శనివారం సాయంత్రం విద్యార్థులు ప్రొఫెసర్లతో మాట్లాడారు. అయితే ఆదివారం డీన్స్‌తో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటుచేసి విద్యార్థుల డిమాం డ్లపై చర్చించాలని ఇన్చార్జ్ వీసీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. అలాగే మిగిలిన డిమాండ్ల పరిష్కారం కోసం ఆమరణ దీక్ష కొనసాగిస్తున్న విద్యార్థులు, విద్యార్థులకు మద్దతుగా రిలే దీక్ష చేస్తున్న ఎస్సీ, ఎస్టీ అధ్యాపకులు వీరికి మద్దతుగా నిలిచిన ఇతర అధ్యాపకులను శని వా రం సాయంత్రం పెరియార్సామి కలిసి మాట్లాడినట్లు తెలిసింది. అధ్యాపకుల దీక్ష సైతం కొనసాగుతుందని ప్రొఫెసర్ కృష్ణ, ప్రొఫసర్ శ్రీపతి రాముడు తెలిపారు. -
విధిలేని పరిస్థితుల్లోనే విద్యార్థుల సస్పెన్షన్
-
విధిలేని పరిస్థితుల్లోనే విద్యార్థుల సస్పెన్షన్
• హైకోర్టులో హెచ్‌సీయూ రిజిస్ట్రార్ కౌంటర్ దాఖలు • భవిష్యత్తులో పునరావృతం కాకూడదనే కఠిన నిర్ణయం • యూనివర్సిటీ నుంచే పంపేయాలని బోర్డు సిఫారసు చేసింది • అయితే మేం వారి పట్ల ఉదారంగా వ్యవహరించాం • వారి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా సస్పెన్షన్ ఎత్తేశాం • హాస్టళ్లలో ప్రవేశం, ఎన్నికల్లో పోటీకి మాత్రమే సస్పెన్షన్‌ను వర్తింపజేశాం సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ)లో ఏబీవీపీ నాయకుడు సుశీల్‌కుమార్‌పై జరిగిన దాడి వ్యవహారంలో ఐదుగురు పరిశోధక (పీహెచ్డీ) విద్యార్థులను యూనివర్సిటీ నుంచే పంపేయాలని ప్రొక్టోరియల్ బోర్డు సిఫారసు చేసిందని వర్సిటీ రిజిస్ట్రార్(ఇన్చార్జ్) ఎం.సుధాకర్ హైకోర్టుకు నివేదించారు. అయితే వారి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఎంతో ఉదారంగా వ్యవహరించామని, అందులో భాగంగానే పూర్తిస్థాయి సస్పెన్షన్‌ను రద్దు చేశామని తెలిపారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండేందుకు, మిగిలిన విద్యార్థులకు గుణపాఠం కావాలన్న ఉద్దేశంతోనే విధిలేని పరిస్థితుల్లోనే ఐదుగురు విద్యార్థులపై సస్పెన్షన్ వేటు వేశామన్నారు. యూనివర్సిటీలో అత్యున్నత నిర్ణాయక వ్యవస్థ అయిన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సిఫారసు మేరకే సస్పెన్షన్‌ను ఎత్తివేశామని కోర్టుకు వివరించారు. ఈ మొత్తం వ్యవహారంలో ప్రతిదీ యూనివర్సిటీ నిబంధనల మేరకే జరిగిందన్నారు. యూనివర్సిటీ తమపై విధించిన సస్పెన్షన్‌ను రద్దు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ పీహెచ్డీ విద్యార్థులు దొంత ప్రశాంత్ తదితరులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఈ మొత్తం వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని హెచ్‌సీయూ రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు ఇన్చార్జ్ రిజిస్ట్రార్ తాజాగా కౌంటర్ దాఖలు చేశారు. అది స్వచ్ఛంద క్షమాపణ కాదు సుశీల్ కుమార్ తమకు స్వచ్ఛందంగా క్షమాపణ చెప్పారని పిటిషనర్లు పేర్కొనడంలో వాస్తవం లేదని రిజిస్ట్రార్ తన కౌంటర్లో పేర్కొన్నారు. ‘‘అంబేద్కర్ విద్యార్థి సంఘానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణలు కోరుతూ ఎన్ఆర్ఎస్ హాస్టల్లో సుశీల్‌కుమార్ ఉన్న గదికి 30 మంది వరకు విద్యార్థులు వెళ్లినట్లు 2015 ఆగస్టు 4 రోజు వేకువజామున మాకు సమాచారం వచ్చింది. సుశీల్‌ను అతని రూం నుంచి సైకిల్ షెడ్ వరకు తీసుకొచ్చి రాతపూర్వక క్షమాపణలు తీసుకున్నారు. గది నుంచి బయటకు తీసుకొచ్చే సమయంలో పిటిషనర్లు అతనిపై భౌతిక దాడికి పాల్పడినట్లు తెలిసింది. ఒత్తిడిలో సుశీల్‌కుమార్ క్షమాపణలు చెప్పారు. యూనివర్సిటీ భద్రతా సిబ్బంది తమ వాహనంలో సుశీల్‌కుమార్‌ను మెయిన్‌గేట్ సమీపంలోని సెక్యూరిటీ పోస్ట్ వద్దకు తీసుకొచ్చారు. పిటిషనర్లు, ఇతరులు అక్కడకు వచ్చి ఫేస్బుక్లో తన క్షమాపణలను సుశీల్కుమార్తోనే అప్లోడ్ చేసేలా చేశారు. సుశీల్‌కుమార్ తన క్షమాపణలను శాంతిపూర్వకంగా, స్వచ్ఛందంగా చెప్పారన్న పిటిషనర్ల వాదనలను ఖండిస్తున్నా. అసలు అంత మంది ఓ విద్యార్థి హాస్టల్ గదికి వెళ్లి, బలవంతంగా బయటకు తీసుకురావడం న్యాయబద్ధం కాదు. అసలు భౌతిక హింసే జరగలేదని అనుకున్నా.. మొత్తం వ్యవహారం ప్రజాస్వామ్యయుతంగా, శాంతిపూర్వకంగా జరిగిందని పిటిషనర్లు చెప్పడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. ఈ ఘోర తప్పిదానికి పిటిషనర్లే కారణం. వారు తమ పాత్రను ఎంత మాత్రం తోసిపుచ్చలేరు’’ అని రిజిస్ట్రార్ వివరించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారు ‘‘సుశీల్‌కుమార్ ఫేస్బుక్లో చేసిన వ్యాఖ్యల వల్ల తమకు ఇబ్బంది ఉందని భావిస్తే పిటిషనర్లు యూనివర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేయాల్సింది. అంతే తప్ప చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడానికి ఎంత మాత్రం వీల్లేదు’’ అని రిజిస్ట్రార్ పేర్కొన్నారు. ‘‘ఆ రోజు సుశీల్‌కుమార్ ఫోన్ చేయడంతో పోలీసులు హాస్టల్‌కు చేరుకున్నారు. తర్వాత పిటిషనర్లపై అదేరోజు కేసు నమోదు చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో అటు యూనివర్సిటీని, ఇటు పోలీసులను ఎవరో తప్పుదోవ పట్టించారంటూ పిటిషనర్లు చేస్తున్న వాదనలో ఎంత మాత్రం వాస్త వం లేదు. ప్రొక్టోరియల్ బోర్డు నిర్వహించిన విచారణలో ఈ మొత్తం ఘటన వెనుక పిటిషనర్ల పాత్ర ఉన్నట్లు తేలింది. బీజేపీకి చెందిన ఎమ్మెల్సీ ఒకరు సుశీల్‌కుమార్ తల్లి, ఇతరుల సమక్షంలో వైస్ ఛాన్స్‌లర్‌ను కలిసిన మాట నిజమే. బాధ్యులైన విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని కోరిన మాట కూడా నిజం. ఏబీవీపీ ప్రధాన కార్యదర్శి చేసిన ఫిర్యాదుకు కౌంట ర్గా అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ నేతలు కూడా ఫిర్యాదు చేసి సుశీల్‌కుమార్‌ను సస్పెండ్ చేయాలన్నారు. ఈ రెండు ఫిర్యాదుల ను యూనివర్సిటీలో విద్యార్థుల క్రమశిక్షణ వ్యవహారాలను పర్యవేక్షించే ప్రొక్టోరియల్ బోర్డుకు నివేదించాం. పిటిషనర్లకు కూడా నోటీసులు జారీ చేసి బోర్డు ముందు హాజరు కావాలన్నాం. వారి వాంగ్మూలాలు నమోదు చేశాం. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో సుశీల్‌కుమార్ విచారణకు హాజరు కాలేదు. అయినా బోర్డు విచారణను కొనసాగించి, ఆగస్టు 12న మధ్యంతర నివేదిక ఇచ్చింది. వర్సిటీ వర్గాలకు ఫిర్యాదు చేయకుండా సుశీల్‌కుమార్ గదికి వెళ్లి గొడవకు దిగిన పిటిషనర్లకు గట్టి హెచ్చరికలు చేయాలని బోర్డు తన నివేదికలో సిఫారసు చేసింది. సుశీల్‌కుమార్, ఇతర సాక్షుల వాంగ్మూలాన్ని నమోదు చేసేం దుకు బోర్డు మరోసారి సమావేశమై ఆగస్టు 31న తుది నివేదిక సమర్పించింది. సుశీల్‌కుమార్‌పై పిటిషనర్లు భౌతికంగా దాడి చేశారని, అందువల్ల వారిని యూనివర్సిటీ నుంచి సస్పెండ్ చేయాలని సిఫారసు చేసింది. అందులో భాగంగానే సెప్టెంబర్ 8న పిటిషనర్లను యూనివర్సిటీ నుంచి సస్పెండ్ చేశాం. ఈ ఘటనలో వారు ఎక్కడా తమ పాత్రను తోసిపుచ్చలేదు. అయితే విద్యార్థుల నుంచి వచ్చిన వినతి మేరకు సెప్టెంబర్ 11న వారి సస్పెన్షన్‌ను ఎత్తివేశాం’’ అని రిజిస్ట్రార్ కోర్టుకు తెలిపారు. ఉదారంగా వ్యవహరించాం ‘‘ప్రొక్టోరియల్ బోర్డు నివేదికను వైస్ ఛాన్సలర్ ఏర్పాటు చేసిన సబ్ కమిటీ పరిశీలించి, అందులో చేసిన సిఫారసులతో ఏకీభవించింది. తన నివేదికను ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ముందు ఉంచింది. ప్రొక్టోరియల్ బోర్డు, సబ్ కమిటీల నివేదికను పరిశీలించిన కౌన్సిల్ విద్యార్థుల విద్యా, ఆర్థిక పరిస్థితులను దృష్టి పెట్టుకుని వారి పట్ల ఉదారంగా వ్యవహరించాలని నిర్ణయించింది. యూనివర్సిటీ నుంచి కాకుండా హాస్టళ్లు, పరిపాలన భవనాల్లో ప్రవేశానికి, ఎన్నికల్లో పోటీ చేయకుండా మాత్రమే పిటిషనర్లను అనర్హులుగా చేస్తూ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది’’ అని రిజిస్ట్రార్ తన కౌంటర్లో వివరించారు. ‘‘పిటిషనర్లలో ఒకరైన వేల్పుల సుంకన్న ఇప్పటికే పీహెచ్డీ థీసిస్ సమర్పించారు. అయితే సస్పెన్షన్ అతని విద్య కొనసాగింపునకు అడ్డంకి కాదు. తరగతులకు, సెమినార్లకు, వర్క్‌షాపులకు, గ్రంథాలయానికి హాజరు కాకుండా అతన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. విషయపరంగా ఓ అంశంపై ఆరోగ్యకరమైన చర్చలు విద్యార్థి జీవితంలో భాగం. అయితే రెచ్చిపోయి ఒకరిపై ఒకరు భౌతిక దాడులకు దిగడాన్ని సహించం. అందుకే ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకూడదన్న ఉద్దేశంతో పిటిషనర్లను హాస్టళ్ల నుంచి సస్పెండ్ చేశాం’’ అని రిజిస్ట్రార్ వివరించారు. -
'వర్సిటీలో సాధారణ పరిస్థితి నెలకొల్పేందుకు ప్రయత్నం'
హైదరాబాద్ : హెచ్‌సీయూలో సాధారణ పరిస్థితి నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నట్లు యూనివర్సిటీ ఇంఛార్జ్ వీసీ శ్రీవాస్తవ్ వెల్లడించారు. మంగళవారం 67వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా యూనివర్సిటీలో జాతీయ జెండాను ఆయన ఎగురవేశారు. విద్యార్థులతో చర్చల ద్వారానే ప్రస్తుతం సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు శ్రీవాస్తవ్ వివరించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
కదం తొక్కిన విద్యార్థులు
చలో హెచ్‌సీయూ విజయవంతం రేపు యూనివర్సిటీల బంద్ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల చలో హెచ్‌సీయూ విజయవంతమైంది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ వేలాది మంది విద్యార్థులు కదం తొక్కారు. విశ్వవిద్యాలయాల్లో వివక్షను సాగనివ్వబోమని నినదించారు. ఈ నెల 27న దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల బంద్‌కు పిలుపునిచ్చారు. రోహిత్ ఆత్మహత్యకు కారణమైన కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, స్మృతి ఇరానీలను, వీసీ అప్పారావును తొలగించాలని డిమాండ్ చేశారు. అఖిల భారత స్థాయిలో విద్యార్థి జేఏసీని ఏర్పాటు చేసి సమైక్యంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళతామని ప్రకటించారు. ఈ నెల 28 లోపు విద్యార్థుల డిమాండ్లను పరిష్కరించకపోతే... నాగ్‌పూర్‌లోని అంబేడ్కర్ దీక్షా స్థలం నుంచి దేశవ్యాప్త ఉద్యమానికి పిలుపునిస్తామని హెచ్చరించారు. రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు చేపట్టాలంటూ విద్యార్థి జేఏసీ ఇచ్చిన చలో హెచ్‌సీయూ పిలుపు విజయవంతమైంది. హెచ్‌సీయూలో ప్రారంభమైన ఉద్యమానికి సంఘీభావం పలికేందుకు సోమవారం తొమ్మిది రాష్ట్రాల నుంచి నాలుగైదు వేల మంది ప్రతినిధులు తరలివచ్చారు. వివిధ ప్రజాసంఘాలు, మహిళా, విద్యార్థి సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. వివక్షకు వ్యతిరేకంగా సాగుతున్న ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళతామని వారంతా ముక్తకంఠంతో నినదించారు. రోహిత్ ఆత్మహత్యకు కారణమైన కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, స్మృతి ఇరానీలను తక్ష ణమే పదవి నుంచి తొలగించాలని, సెలవులో వె ళ్లిన వీసీ అప్పారావును శాశ్వతంగా పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఇన్చార్జి వీసీగా బాధ్యతలు చేపట్టిన విపిన్ శ్రీవాత్సవ తక్షణమే వైదొలగాలన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో హెచ్‌సీయూ జేఏసీ నాయకులు ప్రశాంత్, వెంకటేశ్ చౌహాన్ మాట్లాడారు. దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో కొనసాగుతున్న వివక్షను రోహిత్ ఆత్మహత్య ఉదంతం తెరపైకి తెచ్చిందని, ఈ ఉద్యమం విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులను ఐక్యం చేసిందని వారు పేర్కొన్నారు. అందులో భాగంగానే అఖిల భారత స్థాయిలో విశ్వవిద్యాలయాల ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ)ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రశాంత్, సుంకన్న, విజయ్, శేషన్న తదితరులు ప్రకటించారు. హెచ్‌సీయూ ఉద్యమానికి సంఘీభావంగా వివిధ విద్యాసంస్థల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి తరలి వచ్చిన విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాలు ఐక్య ఉద్యమ నిర్మాణానికి తోడ్పడాలని కోరారు. దేశంలో నెలకొన్న హిందూత్వ, మతోన్మాద చర్యలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని, అందుకు కలసివచ్చే అన్ని వర్గాలను కలుపుకొనిపోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడారు. విద్యా వ్యవస్థలో మార్పులు తేవాలి.. రోహిత్ ఆత్మహత్య విశ్వవిద్యాలయాల్లో అడుగడుగునా నెలకొన్న వివక్షను బహిర్గతం చేసిందని యూజీసీ మాజీ చైర్మన్ సుఖ్‌దేవ్ థోరట్ పేర్కొన్నారు. దేశంలోని వర్సిటీల్లో జరిగిన 25 ఆత్మహత్యల్లో 23 దళితులవే కావడం వివక్ష స్వరూపాన్ని బట్టబయలు చేస్తోందన్నారు. సామాజిక అవగాహనను, పరమత సహనాన్ని పెంచేలా విద్యావ్యవస్థలో మార్పులు తేవాలని చెప్పారు. వర్సిటీల్లో దళిత విద్యార్థులు ఎదుర్కొంటున్న వివక్షపై ఒక కమిటీని నియమించాలన్నారు. వర్సిటీలను బ్రాహ్మణ అగ్రహారాలుగా తయారు చేయొ ద్దని... విద్యాసంస్థల్లో వివక్షను నిరోధించేం దుకు ‘రోహిత్ చట్టం’ చేయాలని విరసం నేత వరవరరావు డిమాండ్ చేశారు. రోహిత్ ఆత్మహత్యకు కారణమైన స్మృతి ఇరానీని, దత్తాత్రేయని మంత్రి పదవుల నుంచి తొలగించాలన్నారు. సమాజంలో లోపించిన మానవీయ సంబంధాలను, సమాజంలో నెలకొన్న అసహనాన్ని రోహిత్ మరణం లేవనెత్తిందని ప్రొఫెసర్ హరగోపాల్ చెప్పారు. వివక్ష మూలాలను వెతకకుండా, సమాజంలో మార్పు రాకుండా వర్సిటీల్లో మార్పుని ఆశించలేమన్నారు. బీజేపీ ప్రభుత్వం విశ్వవిద్యాలయాలను హిందూత్వ భావజాలంతో నింపాలనుకుంటే విద్యార్థులు ఇకపై సహించరని వ్యాఖ్యానించారు. ఉద్యమాన్ని ముందుకు తీసుకెళతామని, సంఘటితంగా వివక్షను ఎదుర్కొంటామని సభకు హాజరైన విద్యార్థులతో ప్రొఫెసర్ కంచ ఐలయ్య ప్రమాణం చేయించారు. మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ... ఇది సమానత్వానికి, కులతత్వానికి మధ్య పోరాటమని వ్యాఖ్యానించారు. వ్యవస్థలో ఉన్న అసమానతలపై రోహిత్ తిరుగుబాటు చేశాడని ప్రముఖ జర్నలిస్టు పాలగుమ్మి సాయినాథ్ అన్నారు. దేశంలోని అన్ని వర్సిటీల్లో వివక్ష జరుగుతోందన్నారు. హెచ్‌సీయూలో ప్రారంభమైంది సైద్ధాంతిక యుద్ధమని అంబేడ్కర్ మనవడు ప్రకాష్ అంబేడ్కర్ అభివర్ణించారు. విద్యార్థులపై హిందూత్వ రాజకీయాలను రుద్దడం ఎంతమాత్రం సరికాదని వ్యాఖ్యానించారు. రోహిత్ మరణానికి కారకులైన వారిపై చర్య తీసుకోకపోతే తన కథల పుస్తకానికి వచ్చిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుని వెనక్కిచ్చేస్తానని పసునూరి రవీందర్ ప్రకటించారు. విద్యార్థులకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ, విరసం నేత కాశీం, ముంబై యూనివర్సిటీ ప్రొఫెసర్ ముంగేకర్, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు వెంకటరెడ్డి, డీఎస్ఎస్ అధ్యక్షురాలు గెడ్డం ఝాన్సీ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వెంకట్, ప్రగతి శీల మహిళా సంఘం నాయకురాలు వి.సంధ్య తదితరులు సంఘీభావం ప్రకటించారు. సస్పెన్షన్ రద్దు ఉత్తర్వులు మా ముందుంచండి హెచ్సీయూకు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: పీహెచ్డీ విద్యార్థులపై విధించిన సస్పెన్షన్‌ను రద్దు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను తమ ముందుంచాలని హైకోర్టు సోమవారం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్‌సీయూ) రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. ఆ ఉత్తర్వుల కాపీని పిటిషనర్లకు కూడా అందచేయాలని స్పష్టం చేసింది. అలాగే ఏబీవీపీ నాయకుడు సుశీల్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసులో పురోగతికి సంబంధించి ఏవైనా వివరాలుంటే వాటిని అఫిడవిట్ రూపంలో తమ ముందుంచాలని తెలంగాణ పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 12వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. తన కుమారుడు సుశీల్‌కుమార్‌పై దాడి జరిగిందని, అందువల్ల అతనికి తగిన భద్రత కల్పించేలా అధికారులను ఆదేశించాలంటూ వినయ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అలాగే తమపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలంటూ పీహెచ్డీ విద్యార్థులు దొంత ప్రశాంత్ తదితరులు కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు వ్యాజ్యలను న్యాయమూర్తి సోమవారం విచారించారు. ఈ సందర్భంగా హెచ్‌సీయూ తరఫు న్యాయవాది ఎన్.వి.సుమంత్ స్పందిస్తూ పీహెచ్డీ విద్యార్థులపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేశామని కోర్టుకు నివేదించారు. విద్యార్థుల తరఫు సీనియర్ న్యాయవాది బొజ్జా తారకం సస్పెన్షన్ కొనసాగుతోందని, సస్పెన్షన్ రద్దు ఉత్తర్వులు తమకు అందలేదన్నారు. దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ ఒకవేళ సస్పెన్షన్ అలాగే ఉందని భావిస్తే, ఈ వ్యాజ్యంలో పిటిషనర్లలో ఒకరిగా ఉన్న రోహిత్ మృతి చెందినందున, ఆ మేర పిటిషన్లో సవరణలు చేయాలని సూచిస్తూ విచారణను ఫిబ్రవరి 12కు వాయిదా వేశారు. -
నిరసనల హోరు
రోహిత్ మృతిపై కొనసాగుతున్న ఆందోళనలు మదనపల్లెలో మానవహారం, రిలేదీక్షలు ఎమ్మెల్యే మద్దతు మహిళా వర్సిటీలో తరగతులు బహిష్కరించిన విద్యార్థులు చిత్తూరులో గాంధీ విగ్రహం వద్ద ధర్నా యూనివర్సిటీ క్యాంపస్(తిరుపతి)/మదనపల్లె/చిత్తూరు: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి రోహిత్ మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం కూడా జిల్లాలో నిరసనలు కొనసాగాయి. శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, శ్రీపద్మావతి మహిళా డిగ్రీ కళాశాలల్లో విద్యార్థులు గురువారం ఆందోళనలు నిర్వహించారు. ఈసందర్భంగా విద్యార్థినులు తరగతులను బహిష్కరించారు. శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఎన్టిఆర్ విగ్రహం వద్ద విద్యార్థినులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రోహిత్ మరణం బాధాకరణమని, కారకులను శిక్షించాలని డిమాండ్ చేశారు. రిజిస్ట్రార్ పి.విజయలక్ష్మి, అధ్యాపక సంఘం అధ్యక్షురాలు కృష్ణకుమారిలు విద్యార్థుల ఆందోళనకు మద్దతు పలికారు. రోహిత్‌కు నివాళులర్పించారు. మహిళా డిగ్రీ కళాశాలలో.. శ్రీపద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో రోహిత్ ఆత్మహత్యపై విద్యార్థినులు నిరసన వ్యక్తం చేశారు. కళాశాల ఆవరణలోని పద్మావతి విగ్రహం వద్ద బైఠాయించి ఆందోళన చేశారు. రోహిత్ విశ్వవిద్యాలయాల్లో ఎదుర్కొన్న దీనపరిస్థితులవల్లే ఆత్మహత్య చేసుకున్నారని విద్యార్థినులు వాపోయారు. ఇలాంటి సంఘటనలు ఏ విద్యాసంస్థల్లో జరగకూడదని నినదించారు. సంఘటనపై బాధ్యులను శిక్షించాలని కోరారు. వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి ఓబుల్‌రెడ్డి, టీఎస్ఎఫ్ నాయకులు అక్కులప్ప, ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘనాయకులు మురళీధర్, ప్రభు, వెంకటస్వామి తదితరులుపాల్గొన్నారు. దళిత సంఘాల నివాళి రోహిత్ మృతికి సంతాపంగా తిరుపతిలో గురువారం రాత్రి దళిత సంఘాల ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తుల ప్రదర్శనతో ఘనంగా నివాళులు అర్పించారు. -
'అతడి ఆత్మహత్య దేశానికే అవమానం'
హైదరాబాద్ : రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో హెచ్‌సీయూలో నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థులను న్యూఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గురువారం పరామర్శించారు. విద్యార్థులు చేపట్టిన దీక్షకు కేజ్రీవాల్ సంఘీభావం ప్రకటించారు. ఆత్మహత్య చేసుకున్న రోహిత్ మెరిట్ ఆధారంగానే యూనివర్శిటీలో సీటు సంపాదించాడని.... అంతేకానీ... రిజర్వేషన్లతో అతడు యూనివర్శిటీలో అడుగు పెట్టలేదని కేజ్రీవాల్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాంటి విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం దేశానికే అవమానం అని అన్నారు. హెచ్‌సీయూలో చోటు చేసుకున్న సంఘటనలపై కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఎలాంటి విచారణ జరపకుండా విద్యార్థులకు వ్యతిరేకంగా కేంద్రానికి లేఖ రాశారని కేజ్రీవాల్ ఆరోపించారు. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతీ ఇరానీ ఈ అంశాన్ని దళితులు... ఇతరులకు మధ్య ఘర్షణగా చిత్రీకరించారని విమర్శించారు. మానవ వనరుల మంత్రిత్వశాఖ ఆదేశాలతోనే హెచ్‌సీయూకి కొత్త వీసీ వచ్చారన్నారు. ఏబీవీపీ వేధింపులతోనే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నారని స్పష్టం చేశారు. యూనివర్శిటీలో ఏబీవీపీ నాయకుడు సునీల్ కుమార్‌పై ఏఎస్ఏ విద్యార్థులు దాడి చేయలేదని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. సునీల్ ఆపరేషన్‌కి...ఏఎస్ఏ దాడికి సంబంధమే లేదని అన్నారు. యూనివర్శిటీలో విద్యార్థుల ఆత్మహత్యలు బాధాకరమని కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. -
కొనసాగుతున్న నిరసనల పర్వం
దేశవ్యాప్తంగా వివిధ పార్టీలు, దళిత సంఘాల ఆందోళనలు స్మృతీ, దత్తాత్రేయలను బర్తరఫ్ చేయాలని డిమాండ్ కోల్‌కతా/హిసర్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)లో పీహెచ్డీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్యపై బుధవారం కూడా దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగాయి. కోల్‌కతాలో తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ యువజన విభాగాలు వేర్వేరుగా ఆందోళనలు చేశాయి. కేంద్రమంత్రులు స్మృతీ ఇరానీ, దత్తాత్రేయలను కేబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ వారి దిష్టిబొమ్మలను దహనం చేశారు. హర్యానాలోని హిసర్‌లో పలు దళిత సంఘాల నాయకులు నిరసన ప్రదర్శనలకు దిగారు. హెచ్‌సీయూలో ఘటనలను ఖండిస్తూ హిసర్‌లోని మినీ సెక్రటేరియట్ ఎదుట నిరసన తెలిపారు. ఆందోళనకారులు కేంద్ర ప్రభుత్వానికి, ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్మృతి, దత్తాత్రేయలను పదవుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఇక కొయంబత్తూర్లోనూ ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ సంఘాలు నిరసన చేపట్టాయి. దీంతో 23 మంది విద్యార్థులను పోలీ సులు అరెస్ట్ చేశారు. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లోని మధురలో కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ కార్యకర్తలు ప్రధాని నరేంద్రమోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎఫ్ఐఆర్లో పేరు నమోదైన కేంద్ర మంత్రి దత్తాత్రేయను కేబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. న్యాయపర చర్యలు తీసుకోవాలి: మాయావతి లక్నో/పట్నా/న్యూఢిల్లీ: హెచ్‌సీయూ పీహెచ్డీ విద్యార్థి రోహిత్ మరణానికి కారణమైన కేంద్రమంత్రులు స్మృతీ ఇరానీ, దత్తాత్రేయలపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు. వర్సిటీ వీసీ అప్పారావుపైనా చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. దళిత విద్యార్థి అయిన రోహిత్‌పై కేంద్ర మంత్రులు వ్యవహరించిన తీరు అప్రజాస్వామికమని, గర్హనీయమని అన్నారు. ఈ మేరకు ఆమె బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఘటనపై వాస్తవాలను వెలికి తీసేందుకు ఒక నిజనిర్థారణ కమిటీని హైదరాబాద్ పంపనున్నట్టు ఆమె వెల్లడించారు. మరోవైపు రోహిత్ మరణానికి సంబంధించి స్మృతీ ఇరానీపై సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ ఘటనపై ప్రధాని మోదీ మౌనం వీడాలని, ఈ కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, దత్తాత్రేయను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయలని, వర్సిటీ వీసీని తొలగించాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి దీపిందర్‌సింగ్ హుడా న్యూఢిల్లీలో డిమాండ్ చేశారు. అటు రోహిత్ మరణంపై బిహార్ సీఎం నితీశ్‌కుమార్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బుధవారం ఆయన పట్నాలో విలేకరులతో మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలో ఉన్న వాతావరణం అసహనం పెరుగుతోందనడానికి సూచనగా ఉందన్నారు. ఒక దళిత విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడంటే దేశంలోని పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా స్మృతీ, దత్తాత్రేయలపై మండిపడ్డారు. రోహిత్ మృతికి వారిద్దరే కారణమని ఆయన బెంగళూరులో ఆరోపించారు. -
మా సస్పెన్షన్‌ను రద్దు చేయండి
* హైకోర్టులో హెచ్‌సీయూ విద్యార్థుల పిటిషన్ * సస్పెన్షన్ రాజ్యాంగ విరుద్ధం సాక్షి, హైదరాబాద్: తమను హాస్టళ్ల నుంచి సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) రిజిస్ట్రార్ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ దొంత ప్రశాంత్‌తోపాటు పలువురు పీహెచ్డీ విద్యార్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సిఫారసుల మేరకు వైస్‌చాన్స్‌లర్ ఆమోదంతో రిజిస్ట్రార్ జారీచేసిన ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమని... ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్ట నిబంధనలకు సైతం విరుద్ధమని పేర్కొన్నారు. హాస్టళ్లలో ఉంటూ తమ చదువును పూర్తిచేసే అవకాశం కల్పించాలని కోరారు. హాస్టళ్లతో పాటు పరిపాలనా భవనం, ఇతర ఉమ్మడి ప్రదేశాల్లో సంచరించేందుకు, విద్యార్థి సం ఘం ఎన్నికల్లో పోటీచేసేందుకు అనుమతివ్వాలని కోరారు. జస్టిస్ సంజయ్‌కుమార్ వద్దకు..: ఈ వ్యాజ్యంపై అత్యవసరంగా విచారణ చేపట్టాలని న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావుకు పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది బొజ్జా తారకం విజ్ఞప్తి చేశారు. అయితే హెచ్‌సీయూ వివాదంలో కేంద్ర బిందువైన విద్యార్థి సుశీల్‌కుమార్‌కు తగిన రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలంటూ అతడి తల్లి వినయ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ సంజయ్‌కుమార్ విచారిస్తున్నారు. దీంతో అదే అంశానికి సంబంధించిన ఈ వ్యాజ్యాన్ని కూడా ఆ పిటిషన్‌తో కలిపి విచారించడం మేలని... అది వేరే న్యాయమూర్తి ముందు ఉన్నందున దీనిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నిర్ణయం తీసుకుంటారని జస్టిస్ రామచంద్రరావు స్పష్టం చేశారు. దీంతో హైకోర్టు రిజిస్ట్రీ వర్గాలు సంబంధిత ఫైల్‌ను తాత్కాలిక సీజే జస్టిస్ దిలీప్ బి.బొసాలే ముందుకు తీసుకెళ్లగా... విద్యార్థుల వ్యాజ్యాన్ని జస్టిస్ సంజయ్‌కుమార్‌కే కేటాయించారు. సుశీల్‌కుమార్ తల్లి వినయ దాఖలు చేసిన పిటిషన్ ఈ నెల 25న విచారణకు రానుంది. ఈ లెక్కన దొంత ప్రశాంత్ తదితరులు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కూడా అదేరోజున విచారించే అవకాశముంది. తమ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని ప్రశాంత్ తదితరుల తరఫు న్యాయవాది బుధవారం న్యాయమూర్తిని కోరితే... ఆయన తీసుకునే నిర్ణయం ఆధారంగా కేసు విచారణ ఉంటుంది. బీజేపీ నేతలు తమను జాతి వ్యతిరేకులుగా అభివర్ణిస్తూ చర్యలు తీసుకోవాల్సిందిగా వీసీపై ఒత్తిడి తెచ్చారని దొంత ప్రశాంత్ తదితరులు తమ పిటిషన్లో పేర్కొన్నారు. హాస్టళ్ల నుంచి మాత్రమే పంపేశాం ముంబై పేలుళ్ల కేసు దోషి యాకుబ్ ఉరితీతను నిరసిస్తూ ఏఎస్ఏ విద్యార్థులు చేపట్టిన కార్యక్రమంపై సుశీల్‌కుమార్ ఫేస్బుక్లో అభ్యంతరకర సందేశం పోస్ట్ చేశారని... అదే వివాదానికి కారణమైందని హెచ్‌సీయూ రిజిస్ట్రార్ హైకోర్టుకు నివేదించారు. ఈవివాదంలో ఏఎస్‌ఏకు చెందిన ఐదు గురిని తొలుత వర్సిటీ నుంచి సస్పెండ్ చేశామ న్నారు. కానీ వారి భవిష్యత్తు, ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సస్పెన్షన్‌ను రద్దు చేశామని, హాస్టల్ నుంచి మాత్రమే పంపేశామని చెప్పారు. సుశీల్‌కు రక్షణ కల్పించాలంటూ అతని తల్లి విన య దాఖలు చేసిన పిటిషన్లో హైకోర్టు ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ కౌంటర్ దాఖలు చేశారు. -
కొత్త రాష్ర్టం ఎలా ఉంది?
కాంగ్రెస్ నేతలను అడిగి తెలుసుకున్న రాహుల్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, అభివృద్ధిపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ టీపీసీసీ నేతలను అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి కారులో వెళ్తున్న సమయంలో పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. తెలంగాణ ఏర్పాటులో ఎదురైన ఇబ్బందులను రాహుల్ గుర్తు చేసినట్లు తెలిసింది. కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డాక పరిస్థితులు ఎలా ఉన్నాయని అడిగినట్లు సమాచారం. కాగా, అవసరమైన వనరులు ఉన్నా అధికారంలో ఉన్న వారు సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని టీపీసీసీ నేతలు వివరించినట్లు తెలిసింది. హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం పరిపాలన, వారి వారసులు ఇప్పుడు ఎక్కడున్నారని రాహుల్ అడిగి తెలుసుకున్నారు. -
ఆత్మహత్యకు ముందు రోహిత్ ఆవేదన..
(సూసైడ్ నోట్లోని ముఖ్యాంశాలు) ♦ నాకు అనేక సమస్యలున్నాయి. అవే ఆత్మహత్యకు ప్రేరేపించాయి. బతికుండటం కంటే మరణంలోనే నాకు ఆనందముంది. నా దేహానికి, ఆత్మకు దూరం పెరుగుతున్నట్లనిపిస్తోంది. ♦ కార్ల్ సాగన్ మాదిరిగా గొప్ప సైన్స్ రచయిత కావాలనుకున్నా. చివరికిలా ఆత్మహత్య లేఖ రాయాల్సి వచ్చింది. ఇలాంటి లేఖ రాయడం నాకిదే తొలిసారి. బహుశా నా చర్య తప్పే కావచ్చు. ♦ ప్రస్తుతం నాలో బాధా లేదు, ప్రేమా లేదు. పూర్తి శూన్యంగా ఉన్నాను. ఇది చాలా దారుణమైన స్థితి. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. ♦ మనిషిని కులంతోనే అంచనా వేస్తున్నారు తప్ప తనకు మనసుంటుందని గుర్తించడంలేదు. మనిషిని ఒక ఓటుగా, అంకెగా, వస్తువుగానే చూస్తున్నారు. ♦ ఆత్మలపై, పునర్జన్మలపై నాకైతే నమ్మకంలేదు. మరణానంతరం చుక్కలదాకా పయనిస్తానని, ఇతర ప్రపంచాల గురించి తెలుసుకుంటానని నా నమ్మకం. ♦ నేను సైన్స్‌ను, ప్రకృతిని, నా చుట్టూ ఉన్న మనుషులను ప్రేమించాను. కానీ ప్రజలు ప్రకృతికి దూరమవుతున్నారు. -
ఎందుకిలా? ప్రాణం విలవిల..
►‘ఈ లేఖ చదివే సమయానికి నేను మీ మధ్య ఉండను. ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాను. మీలో కొందరు నన్ను ప్రేమించారు. కంటికి రెప్పలా చూసుకున్నారు. ఆదరించారు. కానీ నాకు అనేక సమస్యలున్నాయి. అవే నన్ను ఆత్మహత్యకు ప్రేరేపించాయి. బతికుండడం కంటే మరణంలోనే నాకు ఆనందం ఉంది.. నా దేహానికి, ఆత్మకు దూరం పెరుగుతున్నట్టు అనిపిస్తోంది. కార్ల్ సాగన్ మాదిరిగా గొప్ప సైన్స్ రచయిత కావాలనుకున్నా. చివరికిలా ఆత్మహత్య లేఖ రాయాల్సి వచ్చింది.. నా చిన్ననాటి నుంచి ఒంటరితనానికి దూరం కాలేకపోయాను.. మరణించాక నా గురించి ఎవరేమనుకున్నా పట్టించుకోను..’ ఇది ఆత్మహత్యకు పాల్పడ్డ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పీహెచ్డీ స్కాలర్ రోహిత్ సూసైడ్ నోట్ సారాంశం! ►అమ్మకు ఎవరో చేతబడి చేశారని నాన్న నమ్మకం. ఆ అనుమానమే తల్లీ పిల్లలకు కలిగింది. బీటెక్ చదువుకున్న కొడుకు భువనేశ్వర్ టీసీఎస్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి ఇంటికొచ్చేశాడు. అధ్యాపక వృత్తిలో ఉన్న పెద్దకొడుకు అనుమానాన్ని పెనుభూతంగా చేసుకుని ఏడాదిన్నర క్రితం ఇంట్లో ఉరేసుకుని చనిపోయాడు. మూడు రోజుల దాకా ఆ విషయం బయటకు పొక్కకుండా శవాన్ని ఇంట్లోనే ఉంచేశారు. దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగూ ఆరా తీస్తే కొడుకు చనిపోతే వాసన రాదా? అంటూ ఎదురు ప్రశ్న వేశారు. అయిన వారందరికీ దూరమయ్యారు. ఒంటరితనంతో గడుపుతున్నారు. ఆ తర్వాత కూడా ఆ ఇంటిని ‘భూతం’ వదల్లేదు. ఆదాయం వచ్చే పనిని తండ్రి వదిలేసుకున్నాడు. చేతబడిపై నమ్మకం చావని ఆయన మాంత్రికులు, తాయెత్తుల కోసం ఊళ్లు తిరుగుతూనే ఉన్నాడు. ఇంతలో తల్లీకొడుకులిద్దరూ ఉరేసుకుని ఒకేసారి ఆత్మహత్యకు పాల్పడ్డారు.. ఇది విశాఖ నగరం అక్కయ్యపాలెం రామచంద్రనగర్‌లో రెండ్రోజుల క్రితం తనువు చాలించిన కమల, రవికుమార్‌ల విషాదగాధ! - సాక్షి, విశాఖపట్నం ► పై ఘటనల్లో ఆత్మహత్యలకు పాల్పడ్డవారు నిరక్షరాస్యులు కాదు.. మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న వారు అంతకంటే కాదు.. మహానగరాల్లో ఉంటున్నారు. ఉన్నత విద్యను అభ్యసించిన వారూ.. సమాజంపై అవగాహన ఉన్నవారూ. ఇలాంటి వారే అఘాయిత్యాలకు పాల్పడుతుండడం, అందుకు దారితీసే పరిస్థితులను మానసిక వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు ఇలా విశ్లేషిస్తున్నారు. ఆత్మహత్యలకు దారితీసే పరిస్థితులివీ ►తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల్లో డిప్రెషన్. ► తల్లిదండ్రుల నుంచి సరైన ప్రేమాభిమానాలు పొందలేకపోవడం ►విడిగా జీవించడం, సర్దుబాటు చేసుకోలేక పోవడం ►మానసిక, ప్రవర్తనలో అపసవ్యత ►అతి గారాబం, అతి నియంత్రణ ►చదువులో సరైన క్రమశిక్షణ లేకపోవడం ►ఎవరితోనూ కలవలేక ఒంటరిగా ఉండడం. ► ఇతరులకన్నా తక్కువన్న న్యూనత, భవిష్యత్‌పై నిరాశ ►సమాజ ం దూరంగా ఉంచడం.. గత సంఘటనలూ ప్రభావితం.. ఆత్మహత్యలకు గతంలో జరిగిన ఘటనలూ ప్రభావితం చేస్తాయి. అందులో కొన్ని.. ►{పేమ విఫలం, చిన్ననాటి దుర్ఘటనలు, ఆత్మీయులను కోల్పోయిన ఘటనలు మర్చిపోలేకపోవడం. ►మహిళల్లో అబార్షన్లు, పిల్లలు కలగరన్న నిర్థారణకు రావడం. ఆస్తులు కోల్పోయినప్పుడు.. ►అత్తమామల వేధింపులు, పరీక్షల్లో ఫెయిల్ వంటివి తనువు చాలించాలనుకుంటారు. అలాంటి వారిని గుర్తించవచ్చు.. ఆత్మహత్యకు పాల్పడాలనుకునే వారిని గుర్తించవచ్చని మానసిక నిపుణులు చెబుతున్నారు. ►ఎప్పుడు రెస్ట్‌లెస్‌గా, అసహనంగా ఉంటారు. అన్నీ తెలిసినట్టు కనిపిస్తారు. దేనిపైనా ఆసక్తి చూపరు. తిరస్కార భావంతో ఉంటారు. ఎవరి సలహాలు తీసుకోరు. ►ఎక్కువగా భయపడతారు.. నిద్రపోరు. చెప్పిందే చెబుతారు.. చేసిందే చేస్తుంటారు. ఈ లక్షణాలున్న వారిని వారి తల్లిదండ్రులు, స్నేహితులు, టీచర్లు, సైకాలజిస్టులు, సైక్రియాట్రిస్టులు గుర్తించగలుగుతారు. మాకెందుకులే అనుకోరాదు.. మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారి పట్ల వారి కుటుంబ సభ్యులే కాదు.. సాటి మనుషులు మాకెందుకులే అని ఊరుకోవడం సరికాదు. సమాజం కూడా స్పందించాలి. సైన్స్ అభివృద్ధి చెందుతున్నా ఇంకా తెలుగు రాష్ట్రాల్లో చెడుపు, చిల్లంగి వంటి మూఢనమ్మకాలు కొనసాగడం విచారకరం. ఇలాంటి రుగ్మతలతో ఉన్న వారిని సరైన సైకాలజిస్టుకు చూపిస్తే తిరిగి మామూలు మనుషులుగా మారతారు. సెంట్రల్ యూనివర్సిటీ స్కాలర్ రోహిత్, అక్కయ్యపాలెంలోని కమల, రవికుమార్‌ల వంటి ఘటనలు పునరావృతం కాకుండా నివారించవచ్చు. కాలేజీ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడినప్పుడు వేసే కమిటీల్లో మానసిక శాస్త్రవేత్తలు, నిపుణులకు స్థానం కల్పించాలి. -ప్రొఫెసర్ ఎం.వి.ఆర్.రాజు, ఏయూ సైకాలజీ విభాగాధిపతి. స్కిజోఫినియా అయి వుండొచ్చు.. అక్కయ్యపాలెంలో ఆత్మహత్యకు పాల్పడ్డ తల్లీకొడుకుల పరిస్థితి చూస్తే స్కిజోఫినియాగా అనిపిస్తుంది. తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్న వారే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. మూఢనమ్మకాల నుంచి బయటపడలేక మానసిక బలహీనత, అపోహలతో అయిన వారికి, చుట్టుపక్కల వారికీ దూరంగా ఉంటూ ఒంటరి జీవితం గడుపుతున్నట్టు అర్థమవుతోంది. తల్లి అనారోగ్యం వారిపై ప్రభావం చూపి ఉండొచ్చు. ఇలాంటి సమస్య వారి కుటుంబంలో ఎవరో ఒకరికి ఉండొచ్చు. జన్యుపరంగా కూడా ఇలాంటి రుగ్మత వస్తుంది. ఈ సమస్యకు మానసిక వైద్యులు చికిత్స చేసి నయం చేస్తారు. బంధువులు, స్నేహితులు ఆ బాధ్యతలు తీసుకుంటే ఫలితం ఉండేది. ఇలాంటి సమస్యలతో సతమతమయ్యే వారిని వదిలేయకుండా తగిన వైద్యం చేయించాలి. -డాక్టర్ కె.నరసింహారెడ్డి, మానసిక వైద్య నిపుణుడు ఇవీ పరిష్కారాలు.. ►నమ్మిన వారి నుంచి సలహాలు తీసుకోవాలి. ► సైకాలజిస్టులు/సైక్రియాట్రిస్టులను సంప్రదించాలి. ►సానుకూల దృ క్పథంతో మసలుకోవాలి. ఆవేశాలను అణచుకోవాలి. ►తల్లిదండ్రులు ప్రేమానురాగాలు పంచాలి. పిల్లలకు దన్నుగా నిలవాలి. పెద్దలపట్ల ఆదరణ పెరగాలి. ►మానసిక సమస్యలు గల విద్యార్థినీ, విద్యార్థుల పరిస్థితిని వారి గురువులు గుర్తించి సరిదిద్దవచ్చు. ►వారు రోజూ స్కూలు/కాలేజీలకు వస్తున్నారా? లేదా? నలుగురితో కలుస్తున్నారా లేదా? గమనించాలి. హాస్టళ్లలో ఉంటున్న వారిని పట్టించుకునే బాధ్యత వార్డెన్లు తీసుకోవాలి. -
కోర్టు ఆదేశాలు పాటించినా రోహిత్ దక్కేవాడు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో నిమ్న వర్గానికి చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం ఇదే మొదటిసారి కాదు. ఇంటీగ్రేటెడ్ ఎంఏ (లింగిస్టిక్స్) చదువుతున్న 21 ఏళ్ల పీ. రాజు 2013లో యూనివర్శిటీ ప్రాంగణంలో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన అప్పట్లో విద్యా వ్యవస్థలోనే ప్రకంపనలు సృష్టించింది. టీచర్ల కమ్యూనిటీ ఒక్కటై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అదే ఏడాది ప్రజా ప్రయోజిత వ్యాజ్యం (పిల్) దాఖలు చేసింది. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్శిటీ, ఇంగ్లీష్, విదేశీ భాషల యూనివర్శిటీసహా పలు యూనివర్శిటీ క్యాంపస్‌లలో అప్పటి వరకు జరిగిన 24 మంది విద్యార్థుల ఆత్మహత్యల గురించి ఆ పిల్లో పేర్కొంది. విద్యార్థులు వచ్చిన సామాజిక పరిస్థితుల గురించి అవగాహన చేసుకోకుండా యూనివర్శిటీ అధికారులు, అధ్యాపకులు విద్యార్థులను ఒత్తిడికి గురిచేయడం వల్లనే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆ పిల్లో ఆరోపించారు. ఆరు సెమిస్టర్లలో మంచి గ్రేడ్ తెచ్చుకున్న రాజు ఏడవ సెమిస్టర్లో గ్రేడ్ దిగజారినందుకు మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడిన విషాయాన్ని అందులో వివరించారు. తాను మానసిక ఒత్తిడికి గురవుతున్న విషయాన్ని రాజు ఆస్ట్రేలియాలోవున్న స్నేహితురాలికి చెప్పుకున్నారు. యూనివర్శిటీ అధికారుల నుంచి, అధ్యాపకుల నుంచి సాయం తీసుకోవాల్సిందిగా ఆమె రాజుకు సూచించారు. అయితే ఈ యూనివర్శిటీలో సాయం చేసేందుకు తనకు ఎవరూ లేరంటూ రాజు బాధపడ్డారు. ఎన్నో రోజులుగా ఇలా మధనపడుతున్న రాజు చివరకు ఆత్మహత్యనే ఆశ్రయించారు. దీనికి ప్రేమ విఫలమే కారణమంటూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటి అధికారులు సమర్థించుకున్నారు. రాజు మరణానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు జరిపిన నిజ నిర్ధారణ కమిటీ మాత్రం అధికారుల మాటల్లో వాస్తవం లేదని తేల్చింది. మొత్తం నగరంలోని కాలేజీల్లో చోటుచేసుకున్న 24 మంది విద్యార్థుల మరణంపై ఓ సమగ్ర నివేదికను సమర్పించింది. ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థుల్లో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ముస్లిం విద్యార్థులేనని కమిటీ పేర్కొంది. వారంతా కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారవడం వల్ల పట్టణ సంస్కృతికి అలవాటుపడలేక సతమతమవడం, ఇంగ్లీషు నైపుణ్యం, కంప్యూటర్ నాలెడ్జ్ లేకపోవడం, ఆర్థిక స్తోమత లేని కుటుంబాల నుంచి రావడం, స్కాలర్షిప్పులు, ఫెల్లోషిప్లపైనే ప్రధానంగా ఆధారపడి బతకాల్సి పరిస్థితుల్లో కొన్ని కళాకాలలు వీటిని అర్ధాంతరంగా ఉపసంహరించడం, కళాశాలల్లోనూ కులాల మధ్య తేడాలు ఉండడం తదితర అంశాలన్నీ విద్యార్థుల ఆత్మహత్యలకు హేతువవుతున్నాయని నిజ నిర్ధారణ కమిటీ తన నివేదికలో వెల్లడించింది. ముఖ్యంగా ఇంగ్లీషులో వెనకబడిన విద్యార్థులను ముందుకు తీసుకెళ్లేందుకు టీచర్లు అదనపు క్లాసులు తీసుకోవాల్సిందిపోయి అవమానించడం కూడా విద్యార్థుల ఆత్మహత్యలకు ఒక కారణమేనని కూడా నివేదిక తెలిపింది. ఈ నివేదికలోని అంశాలను కూడా పరిగణలోకి తీసుకున్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2013, జూలై ఒకటవ తేదీన విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు అమలు చేయాల్సిన మార్గదర్శకాల గురించి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థులు తమ సమస్యలు చెప్పుకునేందుకు వారితోని ఓ కమిటీని వేయాలని, వాటిని ఎప్పటికప్పుడు విచారించి పరిష్కరించేందుకు అకాడమిక్ కమిటీ ఒకటి ఉండాలని, వీలైతే ప్రతి విభాగానికి ఒక అకాడమిక్ కమిటీని ఏర్పాటు చేయాలని కోర్టు సూచించింది. రెండు కమిటీల మధ్య సమన్వయం కోసం అంబూడ్్లమేన్ ఉండాలని చెప్పింది. రాష్ట్రంలోని అన్ని యూనివర్శిటీల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, అంగవికలురకు ప్రత్యేక ప్రిపేటరీ కోర్సులు, బ్రిడ్జ్ కోర్సులు ప్రవేశపెట్టాలని, విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచేందుకు కౌన్సిలర్లను నియమించాలని హైకోర్టు సూచించింది. ‘నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ సర్వీసెస్ అండ్ రీసర్చ్ (నల్సర్)’ యూనివర్శిటీ అనుసరిస్తున్న ‘రెస్టోరేటివ్ జస్టిస్ టెక్నిక్స్ ( బాధితులు, నేరస్థుల అవసరాలను, వారి సామాజిక నేపథ్యాలను పరిగణలోకి తీసుకొని తీర్పు చెప్పడం)’ను పాటించాలని, అందుకు ఓ కేంద్రాన్నే ఏర్పాటు చేయాలని, అవసరమైతే ఈ విషయంలో నల్సర్ లా యూనివర్శిటీ సహాయం తీసుకోవాలని చెప్పింది. కాలేజీల్లో అన్ని వర్గాల విద్యార్థులకు సమానావకాశాలను కల్పించేందుకు యూజీసీ మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని హైకోర్టు సూచించింది. ఇంకా ఇలా చాలా సూచనలే చేసింది. వాటిని అమలు చేసి ఉన్నట్లయితే రోహిత్ వేముల మనకు మిగిలేవారు. -
హెచ్‌సీయూకి హెచ్ఆర్డీ ఏం చెప్పింది?
హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ)లో దళిత విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో వెలుగులోకి వచ్చిన ఆరు లేఖలు కీలకంగా మారాయి. ఇందులో ఐదు లేఖలు స్మృతి ఇరానీ నేతృత్వంలోని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ (హెచ్చార్డీ) రాయడం గమనార్హం. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలలో హెచ్చార్డీ రాసిన ఈ లేఖల్లో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఫిర్యాదుపై మీ ప్రతిస్పందన ఏమిటో తెలియజేయాలని కోరింది. అయితే ఈ వ్యవహారంలో తాను ఎలాంటి జోక్యం చేసుకోలేదని హెచ్చార్డీ మంత్రి స్మృతి ఇరానీ చెప్తున్నారు. పరిపాలన నియంత్రణ పూర్తిగా యూనివర్సిటీ చేతిలో ఉందని, దానిలో ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర లేదని ఆమె అంటున్నారు. తనతోపాటు మరో నలుగురు విద్యార్థులను యూనివర్సిటీ నుంచి బహిష్కరించిన నేపథ్యంలో వేముల రోహిత్ ఆదివారం హెచ్‌సీయూలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బీజేపీ విద్యార్థి విభాగం ఏబీవీపీ కార్యకర్తపై దాడి చేశారనే అభియోగంతో ఈ ఐదుగురిని హెచ్‌సీయూ బహిష్కరించింది. ఈ వ్యవహారంలో ఏబీవీపీ విద్యార్థిపై దాడికి సంబంధించి ఎలాంటి ఆధారం లభించలేదని పేర్కొన్న వర్సిటీ కమిటీ.. దత్తాత్రేయ లేఖ తర్వాత ఐదుగురు విద్యార్థులపై బహిష్కరణ చర్య తీసుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. హెచ్‌సీయూ కులవాదులు, ఉగ్రవాదులు, జాతి వ్యతిరేకులకు అడ్డాగా మారిందంటూ కేంద్రమంత్రి దత్తాత్రేయ హెచ్చార్డీ మంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాశారు. దత్తాత్రేయ ఫిర్యాదును యూనివర్సిటీకి పంపించిన హెచ్చార్డీ ఏం చర్యలు తీసుకున్నారో తెలుపాలని ఓ ఈమెయిల్తోపాటు నాలుగు లేఖలను హెచ్‌సీయూకి రాసింది. 'వీఐపీ రిఫరెన్స్‌గా కేంద్ర కార్మిక, ఉపాధి శాఖమంత్రి బండారు దత్తాత్రేయ లేఖపై కామెంట్స్' కోరుతూ సెప్టెంబర్ 3న హెచ్చార్డీ యూనివర్సిటీకి ఈమెయిల్ పంపింది. సెప్టెంబర్ 24, అక్టోబర్ 6, 20, నవంబర్ 19 తేదీల్లో మరో నాలుగు లేఖలు యూనివర్సిటీకి పంపింది. ఈ లేఖల్లోని సారాంశం దత్తాత్రేయ రాసిన ఉత్తరంలోని అంశాలను ప్రతిబింబిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత ఏడాది డిసెంబర్ 21న ఏబీవీపీ విద్యార్థిపై దాడి వ్యవహారంలో హెచ్‌సీయూ ఐదుగురు విద్యార్థులపై చర్య తీసుకుంది. -
యూనివర్సిటీల్లో అణిచివేత విధానాలు
- నిష్పాక్షిక విచారణ జరగాలి - ఆత్మహత్య కారకులను కఠినంగా శిక్షించాలి హైదరాబాద్: సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని విప్లవ రచయితల సంఘం(విరసం) రాష్ట్ర కార్యదర్శి వరలక్ష్మి, సీనియర్ సభ్యులు వరవరరావు, కార్యవర్గ సభ్యులు మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. దేశంలో విశ్వవిద్యాలయాలన్నీ మైనార్టీ, నిమ్న, దళిత విద్యార్థుల పాలిట కబేళాలుగా మారుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయాలను మత రాజకీయాలకు కేంద్రంగా మలుచుకోదలుచుకున్న బీజేపీ చర్యలే రోహిత్ మృతికి కారణమని వారు పేర్కొన్నారు. జ్ఞాన భండాగారాలుగా విలసిల్లాల్సిన విశ్వవిద్యాలయాలు బ్రాహ్మణీయ ఆధిపత్య శక్తుల కబంధ హస్తాల్లో నలిగిపోతుండడానికి నిదర్శనమే దళిత విద్యార్థుల సస్పెన్షన్, బలవన్మరణాలని వారు వివరించారు. మద్రాస్ ఐఐటీలో అంబేద్కర్ పెరియార్ స్టడీ సెంటర్‌ని బ్యాన్ చేయడం మొదలు హెచ్‌సీయూలో ఐదుగురు విద్యార్థుల బహిష్కరణ దాకా బ్రాహ్మణీయ ఆధిపత్యమే కనిపిస్తుందని వారు పేర్కొన్నారు. గత కొంత కాలంగా యూనివర్సిటీల్లో సాగిన, సాగుతున్న అణచివేత విధానాలపై నిష్పాక్షిక విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని విరసం ఈ సందర్భంగా డిమాండ్ చేసింది. -
సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత
-
సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తం
-
నిన్న జింక.. మొన్న నెమలి
-
సెంట్రల్ యూనివర్సిటీలో జింక కాల్చివేత
-
‘కమ్యూనిటీ మీడియా’ కొనసాగించండి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి మరోసారి అరుదైన అవకాశం దక్కింది. యునెస్కో ప్రపంచవ్యాప్తంగా వివిధ అంశాలపై వివిధ దేశాల్లో తమ పరిశోధన ప్రాజెక్టులను చేపడుతోంది. ఇందులో భాగంగా కమ్యూనిటీ మీడియా ప్రాజెక్టు హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్సిటీకి 2011లో అప్పగించింది. ప్రస్తుతం ఆ ప్రాజెక్టును సెంట్రల్ యూనివర్సిటీ విజయవంతంగా నిర్వహిం చినందుకుగాను మరో నాలుగేళ్లు కొనసాగించేం దుకు యునెస్కో అనుమతి చ్చింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ అప్పారావు వెల్లడిం చారు. హైదరాబాద్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ ప్రాజెక్టు కింద వివిధ మాధ్యమాలు, కార్యక్రమాల ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేయడం, వారు స్వయం సమృద్ధి సాధించేందుకు తోడ్పాటును అందించడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఇందులో భాగంగా మారుమూల గ్రామీణ ప్రజల కోసం కమ్యూనిటీ రేడియోను రూపొందించామన్నారు. దాంతోపాటు వివిధ అంశాల్లో ప్రజలను ప్రోత్సహించేందుకు, పౌర నియంత్రణకు, కమ్యూనిటీ పత్రికల ద్వారా ప్రజలను చైతన్యవంతులుగా ఎదిగేందుకు పరిశోధనలు చేసి టూల్స్ రూపొందించినట్లు వెల్లడించారు. అలాగే విధానాల రూపకల్పన, శిక్షణ ఇవ్వడం వంటి కార్యక్రమాలను నిర్వహించినట్లు వివరించారు. కమ్యూనిటీ మీడియా విభాగంలో జరిగే పరిశోధన ఫలాలు ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకు యునెస్కో కృషి చేస్తోందన్నారు. పొరుగు దేశమైన భూటాన్‌లో ప్రొడ్యూసర్స్, టె క్నికల్ స్టాఫ్, స్టేషన్ మేనేజర్ల కోసం ఇటీవల కమ్యూనిటీ రేడియోపై పది రోజుల పాటు వర్క్‌షాప్ నిర్వహించామని తెలిపారు. ఆఫ్రికాలోని ఐదు దేశాల వారు కమ్యూనిటీ రేడియో టూల్‌ను వినియోగించుకునేందుకు ముందుకు వచ్చారని, వారికి ఐదు భాషల్లో అందించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో కౌమారదశ బాలికలకు సమాజ స్థితిగతులు, మసలుకోవాల్సిన తీరుపై శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. ఇందులో ముఖ్యంగా మహిళల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. బంగ్లాదేశ్ కూడా తాము రూపొందించిన కమ్యూనిటీ రేడియో విధానాన్ని అనుసరిస్తోందన్నారు. ఈ సమావేశంలో కమ్యూనిటీ మీడియా ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్న ప్రొఫెసర్ వినోద్ పావరాల, డాక్టర్ కంచన్, మాలిక్, వాసుకి బెలవాడి, నిర్మల్ విశ్వనాథ్ మాట్లాడారు. -
పరిశోధనల్లో మేటి.. సెంట్రల్ వర్సిటీ
17 అంశాలకు పేటెంట్లు.. త్వరలో మరికొన్నింటికి.. వందల కోట్ల నిధులతో కొత్త పరిశోధనలు సెంట్రల్ యూనివర్సిటీ: ‘వర్సిటీలు విద్యార్థులను తయారు చేసే కార్ఖానాలు కాదు.. దేశ కీర్తిని చాటే ప్రగతి కిరణాలు’ అని ఓ రచయిత చెప్పిన ఈ మాట అక్షరాలా నిజం చేస్తోంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. తెలుగు రాష్ట్రాల్లో ఏకైక కేంద్రీయ విశ్వ విద్యాలయమైన హెచ్‌సీయూ పరిశోధనల్లో సత్తా చాటుతోంది. హెచ్‌సీయూలో చేపట్టిన 42 పరిశోధనా అంశాలపై దరఖాస్తు చేయగా ఇప్పటికి 17 పేటెంట్లు లభించాయి. వీటిలో 12 విదేశీ, ఐదు స్వదేశీ పేటెంట్లు కావడం గమనార్హం. వీటిలో అమెరికా, యూరోప్, కెనడా వంటి దేశాలు కూడా ఉన్నాయంటే వర్సిటీ ప్రగతి ఏ స్థాయిలో ఉందో అంచనా వేయవచ్చు. సైన్స్, ఇంజినీరింగ్ విభాగాల్లో అత్యధికంగా పేటెంట్లు దక్కాయి. హెచ్‌సీయూలో ప్రస్తుతం రూ. 230 కోట్ల విలువ చేసే 240 ప్రాజెక్టులపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ యూనివర్సిటీ పరిశోధనల్లో చేస్తున్న కృషికి గాను అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ (సీడబ్ల్యూయూఆర్) సంస్థ అంతర్జాతీయ ఉత్తమ పరిశోధనా సంస్థ గౌరవాన్ని ఇచ్చింది. పేటెంట్లు పొందిన ప్రొఫెసర్లు వీరే.. సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు చేపడుతున్న పరిశోధనలకు కేంద్ర జీవ సాంకేతిక విభాగం, డీఎస్టీ, కేంద్ర ప్రభుత్వం, హెచ్‌సీయూ ఆర్థిక సహకారం అందించాయి. పొందిన 17 పేటెంట్లలో స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ అశ్విని నాంగియాకు 5, బయోటెక్నాలజీ ప్రొఫెసర్ ఎ.కె. కొండపికి మూడు దక్కాయి. కెమిస్ట్రీ ప్రొఫెసర్ టి.పి. రాధాకృష్ణన్, ఫిజిక్స్ ప్రొఫెసర్ నిర్మల్ కుమార్ విశ్వనాథన్ రెండేసి పేటెంట్లు పొందారు. లైఫ్ సైన్స్ ప్రొఫెసర్లు పి.రెడ్డన్న, దయానంద, ఫిజిక్స్ ప్రొఫెసర్లు ఎస్. దత్తగుప్త, ఘనశ్యాం కృష్ణ, స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ సెన్సైస్ ప్రొఫెసర్లు కె.ఎ. పద్మనాభన్ ఒక్కో పేటెంట్‌ను సాధించారు. మరి కొన్ని పరిశోధనలకు పేటెంట్లు రావాల్సి ఉంది. పరిశోధనల్లో ప్రత్యేకత చాటుతున్న ఈ వర్సిటీకి తాజాగా రాష్ట్రపతి అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. కంపెనీల సాయం నిల్ కొత్తగా చేపట్టే పరిశోధనలకు సాయం అందించేందుకు భారతీయ కంపెనీలు ముందుకు రావడంలేదు. ముఖ్యంగా ఔషధ పరిశోధనల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. సరైన నిధులు, ప్రోత్సాహం ఉంటే దేశ ప్రతిష్టతను చాటే నూతన ఆవిష్కరణలను హెచ్‌సీయూ నుంచి అందించగలం. - ప్రొఫెసర్ ఆనంద్ కె. కొండపి, (బయోటెక్నాలజీ విభాగం) కేంద్రం సహకరిస్తే.. హెచ్‌సీయూలో పరిశోధక వాతావరణం, ప్రోత్సాహం బాగా ఉంటుంది. విదేశాలకు దీటుగా భారత్‌ను నిలపాలంటే యూనివర్సిటీలు నిరంతర పరిశోధనలు చేపట్టాలి. విద్యార్థులకు పరిశోధనలపై ప్రోత్సాహం అందిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తే మరికొన్ని పేటెంట్లు సాధిస్తాం. - ప్రొఫెసర్ అశ్విని నాంగియా, ఫిజిక్స్ విభాగం -
హెచ్‌సీయుూలో ‘ఫేస్బుక్’ వార్
విద్యార్థి సంఘాల పోటాపోటీ ధర్నాలు ఆందోళనలతో అట్టుడికిన వర్సిటీ హైదరాబాద్: తమ సంఘ నాయకులను దూషిస్తూ ఏబీవీపీ నాయకుడు ఫేస్బుక్లో కామెంట్లు చేశారని ఓ సంఘం.. తమపై దాడి చేశారని మరో సంఘం నాయకులు పోటాపోటీగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మంగళవారం ఆందోళనలు చేపట్టాయి. ఏబీవీపీ అధ్యక్షుడు సుశీల్‌కుమార్‌పై అంబేడ్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ నాయకులు దాడి చేశారని ఆరోపిస్తూ వర్సిటీ ప్రధాన ద్వారం వద్ద ఏబీవీపీ విద్యార్థులు ధర్నా చేపట్టారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించడంతో పాటు వర్సిటీ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అనంతరం వీసీ కార్యాలయం ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. బీజేపీ నేత, ఎమ్మెల్సీ రామచందర్‌రావు అక్కడికి వచ్చి ఏబీవీపీకి మద్దతు పలికారు. కామెంట్లు చేసినవారిపై చర్యలు తీసుకోవాలి.. అంబేడ్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ నాయకులను గూండాలుగా పేర్కొంటూ ఫేస్బుక్లో కామెంట్స్ చేసిన వర్సిటీ ఏబీవీపీ అధ్యక్షుడు సుశీల్‌కుమార్‌పై చర్యలు తీసుకోవాలని ఏఎస్ఏ, ఇతర విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. దాడికి పాల్పడకున్నా.. అకారణంగా పోలీసులు అదుపులోకి తీసుకొన్న ఏఎస్ఏ సంఘం నాయకులు ప్రశాంత్, విన్సెంట్, అశోక్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దళితులను, అణగారిన వర్గాలను కించపరిచేలా ఏబీవీపీ నాయకులు వ్యవహరిస్తున్నారని, కామెంట్లు దానిలో భాగమేనని విద్యార్థి సంఘం నాయకులు ఆరోపించారు. ఏఎస్‌ఏకు మద్దతుగా ఎస్ఎఫ్ఐ, డీఎస్‌యూ, ఎంఎస్ఎఫ్, బీఎస్ఎఫ్, టీఎస్ఎఫ్, ఓబీసీఏ, టీఆర్ఎస్వీ సంఘాల నాయకులు ఆందోళనలో పాల్గొన్నారు. విద్యార్థి సంఘాల ఆందోళనతో పోలీసులు అదుపులోకి తీసుకున్న ఏఎస్ఎ నాయకులను విడుదల చేశారు. ఇరువర్గాల మధ్య జరిగిన వివాదంపై అధికారులు, అధ్యాపకులతో కూడిన కమిటీ ఏర్పాటు చేసి నిజానిజాలను నిర్ధారణ చేస్తామని వర్సిటీ వీసీ ఆర్పీ శర్మ విద్యార్థి నాయకులకు హామీ ఇచ్చారు. ఈ గొడవపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
టాటా.. వీడుకోలు..
-
హెచ్‌సీయూలో విద్యార్థుల ఆందోళన
హైదరాబాద్ సిటీ: కేరళకు చెందిన పీహెచ్డీ విద్యార్థి కిరణ్ కిషోర్‌పై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) ప్రొఫెసర్ రమేష్ కుమార్ మిశ్రా వేధింపులకు పాల్పడుతున్నాడని ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. యూనివర్సిటీలోని పరిపాలన విభాగంలోని వైస్ ఛాన్స్లర్ కార్యాలయం ఎదుట గురువారం విద్యార్థులు బైఠాయించారు. ప్రొఫెసర్ రమేష్ కుమార్ మిశ్రాను వెంటనే సస్పెండ్ చేయాలని విద్యార్థులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకుడు మట్లాడుతూ... స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్స్‌లోని న్యూరల్, కాగ్నెటివ్ సైన్స్ విభాగాధిపతి రమేష్ కుమార్ మిశ్రా పీహెచ్డీ విద్యార్థి కిరణ్ కిషోర్‌ను కొంత కాలంగా వేదిస్తున్నాడని పేర్కొన్నారు. విద్యార్థి రాసిన పరిశోధన ప్రాజెక్టును వేరే విద్యార్థిగా చూపించి గందరగోళం సృష్టించాడని విద్యార్థి నాయకుడు ఆరోపించాడు. పరిశోధనలో ఆటంకాలు కల్పిస్తున్న ప్రొఫెసర్ మిశ్రాను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై నియమించిన కమిటీ ఇప్పటి వరకు నివేదిక అందించలేదని తెలిపారు. సంఘటన స్థలానికి హెచ్‌సీయూ వైస్ ఛాన్స్లర్ హరిబాబు చేరుకుని విద్యార్థులతో చర్చించి వెంటనే కమిటీని ఏర్పాటుచేసి చర్యలు తీసుకుంటామని హామిచ్చారు. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. -
ఉత్తమ వర్సిటీగా హెచ్సీయూకు అవార్డు
న్యూఢిల్లీ: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ) ‘ఉత్తమ విశ్వవిద్యాలయం’ విభాగంలో విజిటర్స్ అవార్డుకు ఎంపికైంది. ఈ మేరకు గురువారం రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో తెలిపింది. కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు సందర్శకునిగా వ్యవహరిస్తున్న రాష్ట్రపతి ‘ఉత్తమ విశ్వవిద్యాలయం’, ‘నవీకరణ’, ‘పరిశోధన’ విభాగాలలో వాటికి విజిటర్స్ అవార్డులు అందజేస్తారు. తక్కువ సమయంలోనే టీబీ నిర్ధారణ చేసే పరీక్షను కనుగొన్న ఢిల్లీ వర్సిటీకి చెందిన ప్రొఫెసర్లు విజయ్ కే చౌదరి, డా.అమితా గుప్తాలకు ‘నవీకరణ’ విభాగంలో ఈ అవార్డు దక్కింది. అలాగే ‘పరిశోధన’ విభాగంలో జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలోని కాస్మోలజీ, ఆస్ట్రోఫిజిక్స్ రీసెర్చ్ గ్రూపు దీనికి ఎంపికైంది. ఈ అవార్డులను రాష్ట్రపతి భవన్లో వచ్చే నెల 4, 5 తేదీల్లో నిర్వహించనున్న కేంద్రీయ విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్లర్ల మూడో సమ్మేళనంలో రాష్ట్రపతి ప్రదానం చేయనున్నారు. వర్సిటీని విజిటర్స్ అవార్డుకు ఎంపిక చేయ డం హర్షణీయమని, ఈ అవార్డుతో వర్సిటీ ప్రతిష్ట మాత్రమే కాదు.. బాధ్యత కూడా మరింత పెరిగిందని హెచ్‌సీయూ వీసీ ఈ.హరిబాబు పేర్కొన్నారు. -
సేవా ప్రవీణుడు
చదువు కోసం బాలకార్మికుడిగా మారి వేసిన ఆ బుడతడి అడుగులు.. విద్యార్థిగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీవైపు నడిపించాయి.. అక్కడితో ఆగకుండా.. దిల్లీలో జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌లో పాలుపంచుకునే అవకాశాన్ని అందించాయి. నిరుపేద కుటుంబంలో వికసించిన ప్రవీణ్.. ఇప్పటి వరకు ఎన్ఎస్ఎస్ (జాతీయ సేవా పథకం) ద్వారా జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచాడు. అదే స్ఫూర్తితో రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొనే అరుదైన అవకాశం దక్కించుకున్నాడు. తెలంగాణ సిద్ధించిన తర్వాత రాష్ట్రంలోని యూనివర్సిటీల తరఫున ఎంపికైన తొలి విద్యార్థి ప్రవీణ్ కావడం విశేషం. ..:: జిలుకర రాజు, సెంట్రల్ యూనివర్సిటీ బాల్యంలో ఆటలు లేవు. స్కూల్‌డేస్‌లో పుస్తకాలతో కుస్తీ.. సాయంత్రాలు పౌల్ట్రీ ఫామ్‌లో కూలి. ఇదీ రంగారెడ్డి జిల్లా కందుకూరు గ్రామానికి చెందిన ప్రవీణ్ నేపథ్యం. తండ్రి రోజు కూలి చేస్తేగానీ పూటగడవని పరిస్థితి. ఆర్థిక ఇబ్బందులు తన చదువును అటకెక్కిస్తాయన్న బెంగతో.. తనూ కూలీగా మారాడు. ఉదయం పాఠశాలకు వెళ్తూనే.. సాయంత్రాలు పౌల్ట్రీ ఫామ్‌లో పనికి కుదిరాడు. కోళ్ల వ్యర్థాలను ఎత్తి.. తన బతుకును అర్థవంతంగా మలుచుకునే ప్రయత్నం చేశాడు. తన సంపాదనకు తండ్రి సహకారం తోడవడంతో విద్యార్థిగా ఉన్నత ఫలితాలు సాధిస్తూ ముందుకుసాగాడు. గచ్చిబౌలి నవోదయ విద్యాలయంలో పాఠశాల విద్య పూర్తి చేసిన ప్రవీణ్.. ఒక్కో మెట్టు ఎక్కుతూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ సీటు (ఎం.ఏ చరిత్ర) కొట్టి పట్టుదల ఉంటే కానిది లేదని నిరూపించాడు. అలా దిల్లీకి.. కళాశాల స్థాయిలో ఎన్ఎస్ఎస్ కార్యక్రమాల్లో ముందు వరుసలో నిలిచిన ప్రవీణ్.. చదువుతో పాటు సాంస్కృతిక, సేవ కార్యక్రమాల్లో తనదైన మార్క్ చూపించాడు. ఇటీవల రాజమండ్రిలో నిర్వహించిన ఎన్ఎస్ఎస్ సౌత్‌జోన్ రిపబ్లిక్ పరేడ్‌లో తన ప్రతిభ చాటాడు. తాజాగా రిపబ్లిక్ పరేడ్‌లో భాగంగా రాష్ట్రపతికి గౌరవ వందనం అందించే అవకాశం పొందాడు. తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థుల ప్రతినిధిగా తాను ఎంపికవ్వడం ఆనందంగా ఉందంటూ దిల్లీకి చేరుకున్నాడు ప్రవీణ్. -
రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే
విరసం నేత వరవరరావు హైదరాబాద్: రాష్ట్రంలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావు పేర్కొన్నారు. ప్రొఫెసర్ ఆర్ఎస్ రావు స్మారక సదస్సు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆదివారం నిర్వహించారు. ‘వ్యవసాయ రంగంలో మార్పులు’ అనే అంశంపై జరిగిన సదస్సులో వరవరరావు మాట్లాడుతూ వ్యవసాయం లాభసాటిగా లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో విద్యుత్ కోతలు మరింత నష్టాన్ని మిగిల్చాయన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో పాలకులు విఫలమవుతున్నారని దుయ్యబట్టారు. గ్రామాల్లో భూమి ఉన్న రైతులు సైత ం కూలీలుగా మారే పరిస్థితి నెలకొందన్నారు. పౌరహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ వ్యవసాయానికి అనుసంధానంగా ఉండే చేతి వృత్తులు పూర్తిగా నాశనమయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. వీక్షణం ఎడిటర్ ఎన్.వేణుగోపాల్ మాట్లాడుతూ గ్రామాల్లో ఇసుక, గ్రానైట్, కలప, ఫైనాన్స్, సారా వంటి వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయన్నారు. గ్రామాల్లోని వనరులపై వారికే హక్కులేని పరిస్థితి వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్‌సీయూ రిటైర్డ్ ప్రొఫెసర్ నరసింహా రెడ్డి, విరసం కార్యదర్శి వరలక్ష్మి, హెచ్‌సీయూ అధ్యాపకులు జి.విజయ్, ఆర్.విజయ్, భారతి, మురళి, రామచంద్రం తదితరులు పాల్గొన్నారు. -
పగ... ప్రతీకారం
ప్రియుడితో సహజీవనం చేస్తున్న క్లిటెమ్ నెస్ట్రా.. భర్తను చంపుతుంది. ఇది తెలుసుకున్న ఆమె కుమార్తె ఎలక్ట్రా... తల్లిపై పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుంటుంది. గ్రీకువీరుడి సహాయంతో తల్లి ప్రియుడు అగస్తస్ను చంపిస్తుంది. క్రీస్తు పూర్వం నాటి ఒక గ్రీకు కథ ఆధారంగా రూపొందించిన ‘ఎలక్ట్రా’ నాటకం నగరవాసులను ఆకట్టుకుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్ పీజీ విద్యార్థులు దీన్ని ప్రదర్శించారు. అద్భుతమైన అభినయంతో నాటకాన్ని రక్తికట్టించారు. థియేటర్ ఆర్ట్స్ హెడ్ ఎన్జే భిక్షు దర్శకత్వం వహించారు. ఎలక్ట్రాగా దీప్జ్యోతి గొగోయ్, క్లిటెమ్గా ఐశ్వర్య, అగస్తస్గా శిరీష్ నటించారు. గ్రీకు నాటకాలు, చరిత్రను పరిచయం చేసే ప్రయత్నమిదని భిక్షు అన్నారు. తొలిసారి స్టేజీపై నటించానని, ప్రదర్శన ఎంతో సంతృప్తినిచ్చిందని దీప్జ్యోతి చెప్పింది. స్వతహాగా సాధు స్వభావినైన నేను రాక్షస తల్లి పాత్రలో చేయడం ఓ కొత్త అనుభూతని ఐశ్వర్య తెలిపింది. జి.రాజు -
ఠాణాకు చేరిన ‘ముద్దు’ల రగడ!
గచ్చిబౌలి: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రగులుతున్న ‘ముద్దుల’ రగడ గచ్చిబౌలి ఠాణాకు చేరింది. హెచ్‌సీయూ రిజిస్ట్రార్ రామబ్రహ్మం ఫిర్యాదు మేరకు ఇరు వర్గాలపై సోమవారం రాత్రి కేసు నమోదు చేశామని గచ్చిబౌలి సీఐ రమేశ్ తెలిపారు. ‘కిస్ ఆఫ్ లవ్’ పేరుతో విద్యార్థులు అశ్లీలంగా వ్యవహరించారని, క్యాంపస్ లోపలికి బయటి వ్యక్తులు ప్రవేశించారని రిజిస్ట్రార్ ఫిర్యాదులో పేర్కొన్నారని చెప్పారు. నాలుగు రోజుల క్రితం కిస్ ఆఫ్ లవ్ యూనివర్సిటీలో వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. విద్యార్థులు బహిరంగంగా ముద్దులు పెట్టుకోవడంతో దీనిని నిరసిస్తూ బీజేవైఎం కార్యకర్తలు క్యాంపస్ లోపలికి వెళ్లి నిరసన తెలిపిన విషయమూ విదితమే. ముద్దులు పెట్టుకున్న విద్యార్థులతో పాటు ఇటు క్యాంపస్ లోపలికి అక్రమంగా ప్రవేశించిన బీజేవైఎం కార్యకర్తల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. సీసీ కెమెరాలతో పాటు వివిధ చానళ్ల ఫుటేజీలను పరిశీలించి బాధ్యులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఇరు వర్గాలపై ఐపీసీ 297, 447 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిజ నిర్ధారణ కమిటీ.. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు వ్యతిరేకంగా ‘కిస్ ఆఫ్ లవ్’ నిర్వహించారని ఏబీవీపీ, బయటి వ్యక్తులు క్యాంపస్ లోపలికి ప్రవేశించి ప్రశాంత వాతావరణానికి భంగం కల్గించారని ఎస్ఎఫ్ఐతో పాటు ఇతర విద్యార్ధి సంఘాలు ఆందోళనకు దిగడంతో ఘటనపై విచారణకు నిజ నిర్ధారణ కమిటీ నియమించారు. కమిటీ ఛెర్మైన్‌గా స్కూల్ ఆఫ్ కమ్యూనికేషన్ డీన్ ప్రొఫెసర్ అనంత కృష్ణన్, సభ్యులుగా ఫ్రొఫెసర్లు ప్రకాశ్ బాబు, మీనా హరిహరన్, వాసంతి, స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడు విన్సెంట్లు ఉన్నా రు. విచారణ జరిపి 20 రోజుల్లో వీసీ రామకృష్ణ రామస్వామికి నివేదిక అందజేస్తారు. కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకుంటామని సీఐ ర మేశ్ తెలిపారు. -
ఎలెక్ట్రా..
గ్రీక్ విషాద గాథ ఆధారంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ‘ఎలెక్ట్రా’ నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ నెల 6, 7 తేదీల్లో ప్రదర్శించే ఈ నాటక రిహార్సల్స్ యూనివర్సిటీలోని థియేటర్ ఆర్ట్స్ ఆడిటోరియంలో మంగళవారం జరిగాయి. గ్రీక్ రచయిత సోపోక్లస్ రచించిన ‘ఎలెక్ట్రా’ ఆధారంగా ఈ నాటకాన్ని యూనివ ర్సిటీలో ప్రదర్శిస్తున్నారు. థియేటర్ ఆర్ట్స్ విభాగాధిపతి డాక్టర్ ఎన్జె.భిక్షు ఈ నాటకానికి దర్శకత్వం వహిస్తున్నారు. పీజీ మూడో సెమిస్టర్ విద్యార్థులు ఈ నాటకంలో పాత్రధారులు. రిహార్సల్స్‌లో విద్యార్థుల నటన,హావభావ విన్యాసాలను నిపుణులు పర్యవేక్షించారు. ఈ నాటకానికి సంగీతం ఏసునాథ్ రాథోడ్ సవుకూరుస్తుండగా, అరుణాభిక్షు నృత్య దర్శకత్వం వహిస్తున్నారు. ప్రొడక్షన్ మేనేజర్‌గా రహమతుల్లాలు వ్యవహరిస్తున్నారు. -
హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో ఉద్రిక్తత
హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆదివారం సాయంత్రం నిర్వహించ తలపెట్టిన 'కిస్ ఆఫ్ లవ్' కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. కేరళకు చెందిన విద్యార్థులు క్యాంపస్ లోని క్యాంటీన్ వద్ద గుమిగూడారు. 'నైతిక పోలీసింగ్'కు నిరసనగా 'కిస్ ఆఫ్ లవ్' కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సమయాత్తమయ్యారు. మిగతా రాష్ట్రాల విద్యార్థుల కూడా వీరికి మద్దతు పలికారు. ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ఏబీవీపీ, బీజేవైఎం కార్యకర్తలు ప్రయత్నించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కార్యక్రమాన్ని జరగనీయబోయమని వర్సిటీ గేటు వెలుపల బైఠాయించారు. 'కిస్ ఆఫ్ లవ్' వ్యతిరేకులు, మద్దతుదారుల నినాదాలతో క్యాంపస్ దద్దరిల్లింది. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. 'కిస్ ఆఫ్ లవ్' ఎటువంటి అసభ్యత లేదని మద్దతుదారులు అంటున్నారు. -
మౌనంగానే ఎదిగాడు
‘మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది...’ అనే పాటలోని వాక్యాన్ని అక్షరాలా నిజం చేశాడు ఆ యువకుడు. అతడు పుట్టిన మూడేళ్లకే తల్లి కన్నుమూసింది. వేలు పట్టి నడిపిస్తాడనుకున్న నాన్న ఐదో ఏటే దూరమయ్యాడు. ఆసరాగా ఉంటారనుకున్న అన్నలూ మద్యానికి బానిసలై కాలం చేశారు.. ఓ బాలుడికి కళ్లముందే ‘నా’ అనుకున్న వాళ్లందరూ దూరమయ్యారు. బంధువులు చేరదీయలేదు.. తినడానికి తిండి లేదు.. ఒంటిమీద సరైన దుస్తులూ లేవు.. పనిచేసి సంపాదించే వయసూ కాదు.. పట్టించుకునే దిక్కులేదు. అలాంటి స్థితి నుంచి ఆ కుర్రాడు కష్టాలకు ఎదురీదాడు. దారి తెలియని వయసులోనే తనకు తానే మార్గనిర్దేశం చేసుకున్నాడు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డీ చదివే స్థాయికి ఎదిగాడు. కాలం చేసిన గాయాలను తట్టుకుని నిలిచిన ఆ యువకుడి పేరు వెంకటేశ్ చౌహాన్. ఇటీవల రాజీవ్ గాంధీ నేషనల్ ఫెలోషిప్‌కు ఎంపికై ఔరా అనిపించాడు. బుధవారం జరగనున్న హెచ్‌సీయూ స్నాతకోత్సవంలో పీహెచ్డీ పట్టా అందుకోనున్న వెంకటేశ్‌పై ప్రత్యేక కథనం... నల్గొండ జిల్లా కోదాడ మండలం కూచిపూడి తండాలో 1989లో వెంకటేశ్ చౌహాన్ జన్మించాడు. చిన్నప్పుడే తల్లిదండ్రులను, రక్తం పంచుకు పుట్టిన అన్నలను కోల్పోయాడు. దీంతో కాలమే వెంకటేశ్‌ను చేరదీసింది. సమాజమే బతుకు పాఠాలు నేర్పింది. ఐదో తరగతి వరకు కూచిపూడి తండా, రామాపురంలో చదువుకున్నాడు. ఆరు నుంచి ఇంటర్ వరకు కోదాడలో విద్యాభ్యాసం సాగింది. 8వ తరగతిలో ఉండగా చేతిలో చిల్లి గవ్వ లేదు. ఆకలితో ఉన్న వెంకటేశ్ కోదాడ సమీపంలో ఉన్న అరుణాచలం ట్రాన్స్‌పోర్టు వద్ద నిల్చొని ఓ లారీని ఆపాడు. నన్ను పనిలోకి తీసుకోండన్నా, ఆకలిగా ఉందంటూ అడగడంతో వారు కాదనలేక పోయారు. క్లీనర్ నుంచి పీహెచ్డీ వరకు.. వెంకటేశ్ రాత్రంతా లారీ క్లీనర్‌గా పనిచేస్తూ, ఉదయం పాఠశాలకు వెళ్లే వాడు. 9వ తరగతిలో కోదాడలోని ఓ హోటల్లో పాత్రలను కడిగే పనికి కుదిరాడు. అలా సంవత్సరం నెట్టుకొచ్చాడు. 10వ తరగతి నుండి ఇంటర్ దాకా ఎస్టీడీ బూత్ బాయ్‌గా, పండ్లు అమ్మే వ్యక్తిగా పనిచేస్తూ వచ్చాడు. మిత్రుల సహకారంతో డిగ్రీ కోసం హైదరాబాద్‌లోని నిజాం కాలేజీలో సీటు సంపాదించాడు. ఉదయం తరగతులు వినటం రాత్రి అపార్ట్మెంట్ సెక్యూరిటీ గార్డుగా పనిచేయడం చేసేవాడు. ఇలా పనులు చేయగా వచ్చిన డబ్బుతోనే జీవన ప్రయాణం సాగించేవాడు. అయితే ఏనాడు చదువును అశ్రద్ద చేయలేదు. ప్రతినిత్యం బతుకు పోరాటంలో ఎదుర్కొంటున్న సమస్యల ముందు చదువు ఎప్పుడూ కష్టమనిపించలేదు. చిన్ననాటి నుంచీ ప్రథమ శ్రేణిలోనే ఉత్తర్ణుడవుతూ వచ్చాడు. ప్రొఫెసర్ సహకారంతో.. ఓ సెమినార్లో ఉపన్యాసం ఇచ్చిన ఉస్మానియా యూనివర్సిటీ అసిస్టెంట్ ఫ్రొఫెసర్ సూర్య ధనుంజయ్‌ని కలిసి తన పరిస్థితిని వివరించాడు. చలించిన ఆ ప్రొఫెసర్ దుస్తులు, పుస్తకాలు ఇచ్చి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రవేశ పరీక్షకు సిద్దం చేశారు. దాంతో వెనుతిరగకుండా 2010లో హెచ్‌సీయూ ఎంఏ తెలుగులో సీటు సాధించి కృతజ్ఞత చాటుకున్నాడు. పీజీ పూర్తికాగానే రీసెర్చ్ ఫెలోషిప్ (ఆర్‌జీఎన్‌ఎఫ్)కు ఎంపికై, ఎంఫిల్ అదే యూనివర్సిటీలో పూర్తి చేశాడు. హెచ్‌సీయూ ప్రొఫెసర్ పిల్లలమర్రి రాములు పర్యవేక్షణలో ‘మత్తడి కవిత సంకలనం’పై పరిశోధన పూర్తి చేశాడు. ప్రస్తుతం ఇదే యూనివర్సిటీలో పీహెచ్డీ ద్వితీయ సంవత్సర విద్యార్థిగా కొనసాగుతున్నాడు. నేడు పట్టా ప్రదానం ‘మత్తడి కవిత సంకలనం’పై చేసిన పరిశోధనకుగాను వెంకటేశ్‌కు సెంట్రల్ యూనివర్సిటీ పట్టాను అందించనుంది. ఇన్నాళ్లుగా తాను పడ్డ కష్టాలను పట్టా అందుకుని మరిచిపోతానని వెంకటేశ్ చెబుతున్నాడు. అనాథనని బాధ పడకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే.. కష్టాలు కూడా తలవంచి విజయాన్ని అందిస్తుందని వెంకటేశ్ నిరూపించాడు. చదువులోనే కాక ఉత్తమ మిమిక్రీ కళాకారుడిగా, గాయకుడిగా రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబర్చాడు. భవిష్యత్తులో అనాథాశ్రమం స్థాపించి తనలాంటి వారికి సాయపడాలన్నదే తన లక్ష్యమని వెంకటేశ్ చెమర్చిన కళ్లతో తన గతాన్ని.. మనోగతాన్ని చెప్పుకొచ్చాడు. -
సెంట్రల్ వర్సిటీలో కుక్కల వీరంగం
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో పిచ్చికుక్కులు శనివారం స్వైర విహారం చేశాయి. కుక్కలు దాదాపు 30 మంది విద్యార్థులను కరిచాయి. ఆ ఘటనలో విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. దాంతో యూనివర్శిటీ సిబ్బంది వెంటనే అప్రమత్తమై గాయపడిన విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. కుక్కల వీరంగంపై సమాచారం అందుకున్న మీడియా ప్రతినిధులు యూనివర్శిటీలో వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే వారిని యూనివర్శిటీలోకి వెళ్లనీయకుండా భద్రత సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో మీడియా ప్రతినిధులు యూనివర్శిటీ ప్రవేశ ద్వారం వద్ద నిరనసకు దిగారు. -
గోప్స్..c/o కబుర్స్ - గాసిప్స్
క్యాంపస్ కహానీ: ఈ సంభాషణలేవీ ఒకదానికొకటి పొంతన లేనట్లనిపిస్తోంది కదూ! సంభాషణలు పలికిన పాత్రలన్నీ అపరిచితంగా కనిపిస్తున్నాయి కదూ!... అలానే అనిపిస్తుంది. ఎందుకంటే, ఇవేవీ నాటకంలోని సంభాషణలు కావు. పలికిన వారు పాత్రధారులూ కారు. వారంతా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు. తరగతులు ముగిశాక క్యాంపస్‌లోని ‘గోప్స్’ వద్ద కాలక్షేపం చేస్తారు. చాయ్, కాఫీ, బిస్కట్, సమోసా వగైరాలను ఆస్వాదిస్తూ కబుర్లు చెప్పుకుంటారు. విద్యార్థులంతా ఒకచోట గుమిగూడాక ఇక చెప్పేదేముంటుంది? అంతా సందడే సందడి. వారి మాటల్లో అన్ని విషయాలూ దొర్లుతాయి. ‘గోప్స్’ అంటే చెప్పనేలేదు కదూ! సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్‌లో చాలాకాలంగా నడుస్తున్న గోపాలరావు షాపునే ఇక్కడి స్టూడెంట్స్ ముద్దుగా ‘గోప్స్’ అని పిలుచుకుంటారు. ‘గోప్స్’లో చాయ్ బడ్డీ, బేకరీ, జ్యూస్ సెంటర్, బ్యూటీ పార్లర్, కిరాణా దుకాణం ఉన్నాయి. ఇదే సెంట్రల్ వర్సిటీ స్టూడెంట్స్ అందరికీ అడ్డా. జిలుకర రాజు, సెంట్రల్ వర్సిటీ తమిళనాడు గవర్నమెంట్ స్టూడెంట్స్‌కు లాప్‌టాప్‌లు ఇస్తుంటే, ఇక్కడ డెస్క్‌టాప్‌లు ఇచ్చే దిక్కులేదు. రీసెర్చ హాస్టల్లో ఫుడ్ చెత్తగా ఉందిరా అశోక్.. నిన్న సూపర్‌వైజర్‌కీ నాకు పెద్దగొడవరా బాబు! స్నేహితులు పరిచయమయ్యేది ఇక్కడే. సెంట్రల్ వర్సిటీలో ఏ పరిచయాలైనా ఎక్కువగా ‘గోప్స్’లోనే ఏర్పడతాయి. - స్వాతి, ఇంటిగ్రేటెడ్ ఎంఏ సీనియర్స తమ అనుభవాలను చెబుతుంటారు. ఏయే పోటీ పరీక్షలకు, ప్రవేశ పరీక్షలకు ఎలా సిద్ధపడాలో సూచనలిస్తారు. రాజకీయాలు, ధరల పెరుగుదల వంటి విషయాలపై కూడా ఇక్కడ చర్చించుకుంటుంటాం. -గురజాడ, ఇంటిగ్రేటెడ్ ఎంఏ వివిధ విభాగాల అమ్మాయిలమంతా ఒకేచోట చేరి చాయ్ తాగుతూ కబుర్లు చెప్పుకుంటాం. ఆలోచనలు పంచుకోవడానికి ఈ ‘గోప్సే’ మా అడ్డా. -శిరీష, ఇంటిగ్రేటెడ్ ఎంఏ పాగల్గాని లెక్క మాట్లాడకు. ఆమె నిన్ను ఇష్టపడుతోంది రా... .... ఏమోరా నాకైతే ఏమీ సమజైతలేదు. స్కార్ఫ కట్టుకుని మా గైడ్ సార్ పక్కనే నిలబడ్డా.. నన్ను గుర్తుపట్టలే తెలుసా! .... ఆయన మనల్ని మామూలుగానే గుర్తుపట్టడు.. స్కార్ఫ కట్టుకుంటే ఏం గుర్తుపడతాడు! నాలుగు సమోసాలు, మూడు ఎగ్‌పఫ్‌లు, పది చాయ్‌లు చెప్పు కాకా!.... మీదేం పోతుందిరా భయ్!... నా జేబుకే చిల్లు. ‘నెట్’ ఎగ్జామ్‌ని ఆబ్జెక్టివ్ చేసి ఆగం చేశారు. ...... ఏమీ ప్రిపేర్ కాకుండా రాసే మాలాంటి వాళ్లకు ఇలాంటి పద్ధతే బాగుంటుంది. అధికారంలోకి ఎవరొచ్చినా ఏంజేస్తరు... నిరుద్యోగం మాత్రం పెరుగుతూ పోతుంది. -
ఉత్సాహంగా.. ఉల్లాసంగా
-
క్యాన్సర్ నివారణపై ముగిసిన పరిశోధనలు
సెంట్రల్ యూనివర్సిటీ, న్యూస్‌లైన్: క్యాన్సర్ నివారణకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(ఎన్ఐఎన్), ఐకేపీ నాలెడ్జ్ పార్క్ సంస్థలు సంయుక్తంగా చేపట్టిన పరిశోధనలు ముగిశాయి. రెండు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఈ పరిశోధనల్లో క్యాన్సర్ నివారణ కోసం ‘టెమోజొలోమైడ్’ అనే ఔషధాన్ని కనుగొన్నారు. పరిశోధనల్లో భాగంగా పలు జంతువులపై ఈ ఔషధాన్ని ప్రయోగించారు. ‘టెమోజొలోమైడ్’ ఔషధాన్ని క్యాన్సర్‌తో పాటు బ్రెయిన్ ట్యూమర్‌కు సైతం ఉపయోగించవచ్చని పరిశోధకులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ ఔషధాన్ని కనుగొన్నవారిలో హెచ్‌సీయూ రసాయనశాస్త్ర ప్రొఫెసర్ అశ్వనీనాంగియా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ శాస్త్రవేత్త దినేష్‌కుమార్ ఉన్నారు. యూనివర్సిటీలోని టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబెటర్‌లో పరిశోధనలు జరిగారుు. -
పరిశోధనలతోనే దేశ ప్రగతి
నోబెల్ గ్రహీత వెంకట్రామన్ రామకృష్ణన్ సాక్షి, హైదరాబాద్: మౌలిక విజ్ఞానంపై మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని నోబెల్ అవార్డు గ్రహీత వెంకట్రామన్ రామకృష్ణన్ అన్నారు. పరిశోధనల ద్వారానే దేశం ప్రగతి సాధించగలదని అన్నారు. ప్రముఖ గణిత శాస్త్రవేత్త సీఆర్ రావు పరిశోధనలపై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ఆర్ట్‌గ్యాలరీని రామకృష్ణన్ ఆదివారం ప్రారంభించారు. ప్రాచీనకాలంలో దేశం పరిశోధనలకు పుట్టినిల్లుగా వెలుగొందిందని, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా దిగజారిపోతుందని గణితవేత్త సీఆర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో శాస్త్రవేత్త సారస్వత, హెచ్‌సీయూ వీసీ రామకృష్ణ రామస్వామి, అల్లం అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
అంధుల రాష్ర్ట స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం
హుడా కాంప్లెక్స్, న్యూస్‌లైన్: అంధుల రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు శుక్రవారం సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. వికలాంగుల కళ్యాణ వేదిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతున్నాయి. బొబ్బిలి, విశాఖపట్నం, ముసారాంబాగ్ టీవీ టవర్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, తిరుపతి, అనంతపురం, ఈస్ట్‌గోదావరి, సమన్వాయి సంస్థ జట్లు బరిలో ఉన్నాయి. ఈ పోటీలు శనివారం సాయంత్రం ముగుస్తాయని నిర్వాహకులు సుభాష్ గుప్తా తెలిపారు. -
ఆత్మహత్యలకు కేరాఫ్‌గా సెంట్రల్ వర్సిటీ
హైదరాబాద్: ప్రొఫెసర్ల వేధింపులతో కొందరు... ప్రేమ విఫలమై మరికొందరు...ఆర్థిక సమస్యలతో ఇంకొందరు.. ఇలా సెంట్రల్ యూనివర్శిటీలోని విద్యార్థులు క్షణికావేశంలో తమ బంగారు జీవితాలను బలి చేసుకుంటున్నారు. ఆత్మహత్యలకు పాల్పడి అటు తల్లిదండ్రులకు.., ఇటు సమాజానికి తీరని వేదన మిగులుస్తున్నారు. సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేస్తున్న మందారి వెంకటేశ్ ఆదివారం ఆత్మహత్య చేసుకోవడంతో వర్సిటీలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఉన్నత లక్ష్యాలను చేరుకునేందుకు పట్టుదలతో శ్రమిస్తున్నప్పటికీ, మానసిక ఒత్తిడికి గురై బలవన్మరణానికి పాల్పడం విస్మయానికి గురి చేస్తోంది. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థుల బలవన్మరణాలకు కేంద్రంగా మారుతోంది. అధ్యాపకుల వేధింపులు, ప్రేమ తదితర కారణాలతో ఒత్తిడికిలోనై కొందరు చావే శరణ్యంగా భావిస్తున్నారు. సెంట్రల్ యూనివర్సిటీలో ఇప్పటికే 11 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇందులో ఐదురుగు పరిశోధక విద్యార్థులు కాగా మరో ఇద్దరు పీజీ విద్యార్థులున్నారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల వివరాలు.. ప్రేమ విఫలమై... * 2006లో: ఆశిన్దావన్ 2007లో: కేశవాచారి, 2007లో: సునీత, 2012లో: స్వాతిరాణి, 2012లో: స్వరణ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. వీరంతా ప్రేమవిఫలమై ఆత్మహత్య చేసుకున్నారు. వేధింపులతో... * 2008లో: సెంథిల్‌కుమార్, 2009 బాలరాజు, 2012లో: నరేష్‌కుమార్‌రెడ్డి, 2013 మార్చిలో: పుల్యాల రాజు ఆత్మహత్య చేసుకున్నారు. వీరు డిపార్ట్మెంట్ వేధింపులతో బలవన్మరణానికి పాల్పడుతున్నట్టు ఆరోపణలున్నాయి. * 2013 ఆగస్టులో ఇంటిగ్రేటెడ్ విద్యార్థిని మోహినీ మిశ్రా అనుమానాస్పదస్థితిలో నిర్మాణంలో ఉన్న భవనంపై నుంచి పడి మృతి చెందింది. -
సెంట్రల్ వర్సిటీలో పీహెచ్డీ విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్: కేంద్రీయ విశ్వవిద్యాలయంలో మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన పీహెచ్డీ ఎం వెంకటేష్(26) గత అర్థరాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. పురుగుల మందు తాగి హాస్టల్ రూములో బలవన్మరణానికి పాల్పడ్డాడు. నిర్జీవంగా పడివున్న వెంకటేష్‌ను ఈ ఉదయం 7 గంటల ప్రాంతంలో అతడి స్నేహితులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. ప్రొఫెసర్ వేధింపులు భరించలేకే వెంకటేష్ ప్రాణాలు తీసుకున్నాడని అతడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. తనకు గైడ్‌ను కేటాయించకుండా కొన్ని నెలలుగా వేధిస్తుండడంతో వెంకటేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని అతడి స్నేహితులు తెలిపారు. వెంకటేష్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి అతడి కుటుంబ సభ్యులకు అప్పగించామని చందానగర్ ఎస్సై ఎన్ వాసు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని చెప్పారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతుండడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. -
ఆహారం కోసం...ఆధునిక మానవుల వేట
ఒకరి నుంచి ఒకరు స్ఫూర్తి పొందుతారు. ఒకరి కోసం ఒకరు అన్వేషణ సాగిస్తారు. పరస్పరం ప్రణాళికలు రచిస్తారు. పక్కా ప్లానింగ్‌తో కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. ఇదంతా ఎందుకంటారా? నచ్చింది తినడానికి! జస్ట్... తినడం కోసం ఇంత అవసరమా? ఇదేనా మీ సందేహం? అయితే మీరు.... ‘హైదరాబాద్ ఫుడీస్’ సభ్యుల్ని కలవాల్సిందే. నగరాల్లో రోజుకో రెస్టారెంట్ వెలుస్తోంది. గంటకో మెనూ మారుతోంది. నెక్ట్స్వీక్ ఫలానా చోట లంచ్ చేద్దామనో, డిన్నర్ చేద్దామనో ప్లాన్ చేసుకునేలోపే లే‘టేస్’్టకి అడ్రెస్ మారిపోతోంది. అలా నచ్చిన రుచితో జిహ్వ చాపల్యం తీర్చుకున్నామో లేదో ఇలా సరికొత్త రుచుల వాసన నాసికకు రాసుకుంటోంది. ఈ నేపథ్యంలో తినే ప్లేస్‌లను ఎంచుకోవడంలో కన్ఫ్యూజన్కు చెక్‌పెట్టడానికి, విభిన్నరుచులను ఆస్వాదించడంలో ముందుండడానికి హైదరాబాద్‌కు చెందిన ఆహారప్రియులు చక్కని మార్గం కనిపెట్టారు. రుచుల వేటలో గజి‘బిజీ’గా ఉన్నవారందరినీ కలుపుకుని ‘హైదరాబాద్ ఫుడీస్’ను ప్రారంభించారు. బిర్యానీని తెల్లవారుఝామున మూడుగంటల సమయంలో తినాలంటే ఎక్కడని వెతకాలి? హైదరాబాద్ ఫుడీస్ని అడగండి. దాదాపు పది సమాధానాలకు తక్కువరావు. అడిగినవారు సిటీలో ఇన్ని ప్లేస్లుఉన్నాయా అని ఆశ్చర్యపోవాల్సిందే. ‘‘ఎంత రాత్రయినా, పగలైనా మంచి ఫుడ్ తినాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయవచ్చు’’ అని ధీమాగా చెప్తారు హర్షిత్. ఆయన హైదరాబాద్ ఫుడీస్ నిర్వాహకుల్లో ఒకరు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థి బెన్నీసమర్ యాంథాన్ ఆలోచనతో గత ఏడాది ఈ గ్రూప్ ప్రారంభమైంది. స్థానికురాలు కాని బెన్నీ... తక్కువ ధరలో రుచికరమైన ఆహారం దొరికేచోటు కోసం పడిన కష్టాల నుంచి పుట్టిన ఆలోచనే హైదరాబాద్ ఫుడీస్. అందుబాటు ధరల్లో రుచికరమైన ఆహారం దొరికే ప్రాంతాలకు సంబంధించిన సమాచారాన్ని అందరికీ అందించాలనే ఉద్దేశ్యంతో ఆమె ఈ వేదికకు రూపకల్పన చేశారు. ఒకరొకరుగా ఈ గ్రూపులో సభ్యుల సంఖ్య నాలుగు వేలకు పైగా పెరగడంతో... నెలకోసారి కలిసేవారు కాస్తా వారానికోసారి కలవడం మొదలైంది. దీనిని సభ్యులంతా ‘ఫుడ్ మీట్’ అని పిలుస్తారు. ఒక్కో మీట్‌కి కనీసం 40 నుంచి 80 మంది హాజరవుతారు. ‘‘ఎక్కడికి వెళ్లాలో ప్లేస్ ఫైనలైజ్ చేసిన తర్వాత దాన్ని ఫేస్బుక్లో పోస్ట్ చేస్తాం. ఫస్ట్ కమ్ ఫస్ట్ తర హాలో సీట్స్ ఆఫర్ చేస్తాం. రెస్టారెంట్ నిర్వాహకులతో మాట్లాడి సీట్లు రిజర్వ్ చేసుకుంటాం’’ అని చెప్పారు క్లబ్నిర్వాహకుల్లో ఒకరైన సంకల్ప్. అది ఫైవ్‌స్టార్ రెస్టారెంట్ కావచ్చు లేదా ఫుట్‌పాత్ మీది పానీపురి బండి కావచ్చు.. కాదేదీ విజిట్‌కు అనర్హం అన్నట్టుంటుంది వీరి శైలి. ఈ గ్రూప్‌లో కనీసం 12 నుంచి 60 దాకా విభిన్న వయసులున్న సభ్యులున్నారు. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చి చిరుద్యోగాలు చేసుకుంటూ ఉండేవారు, చదువుకోవడానికి వచ్చినవాళ్లు... తక్కువధరలో మంచి ఫుడ్ కోసం రోజుల తరబడి చేసే అన్వేషణకు ముగింపు పలకడం కూడా ఈ గ్రూప్ ఏర్పాటుకు దోహదం చేసిందంటారు సంకల్ప్. ‘సరసమైన’ రుచులు... ఈ మీట్లకు ఎంపిక చేసుకున్న రెస్టారెంట్‌కు ఒకేసారి గ్రూప్‌గా వెళతారు కాబట్టి ధరల్లో చెప్పుకోదగ్గ తగ్గింపు లభిస్తుంది. దాంతో నగరంలో ఈగ్రూప్కు గౌరవ మర్యాదలు కూడా పెరుగుతున్నాయి. తమ ఫుడ్ రుచి చూడమంటూ పలురెస్టారెంట్ల నుంచి వీరికి ప్రత్యేక ఆహ్వానాలు అందుతున్నాయి. ‘‘మాకు ఈ విషయంలో అనుభవం ఎక్కువ అనే భావనే దీనికి కారణం. అలాగే మేం మా అభిప్రాయాన్ని చాలా నిక్కచ్చిగా చెబుతాం కూడా’’ అని సంకల్ప్ చెప్పారు. ఈ ఫుడీలకు ఆహారంతో పాటు అందులో కలిపే ముడిపదార్థాలకు సంబంధించి కూడా అవగాహన బాగా ఉంటుంది. ‘‘మన ఆంధ్రా క్విజీన్ను మించిన రుచుల సంపద ఎక్కడా ఉండదు. ఏ విదేశీ క్విజీన్ను దీనితో పోల్చలేం’’ అని సంకల్ప్ తేల్చేస్తారు. రాష్ట్రవ్యాప్త టూర్లకూ రెడీ... వివిధ రంగాల్లో ఉన్న వర్గాబ్ భక్షి, సంకల్ప్, రాహుల్ బోస్, హర్షిత్ జైన్, సవ్యసాచి రాయ్ చౌదరిలతో కూడిన ఐదుగురు సభ్యుల బృందం దీన్ని నడిపిస్తోంది. రెస్టారెంట్ రివ్యూస్ మీద చర్చలు, సరికొత్త రుచుల అన్వేషణ వీరి బాధ్యత. అనాథాశ్రమాల్లో, ఓల్డేజ్హోమ్లలో ఉన్నవారికి చక్కని రుచులను ఆస్వాదించే అవకాశం ఇవ్వడానికి వీరు నెలకోసారి చారిటీ ఈవెంట్‌ను సైతం ఏర్పాటు చేస్తున్నారు. తమ కార్యకలాపాలను మరింత విస్తృతం చేయడానికి ఈ గ్రూప్ రాష్ట్రవ్యాప్త ఫుడ్టూర్లు నిర్వహించబోతోంది. ‘‘పసందైన విందుతో పాటు పర్యటనలను కూడా ప్రేమించే వారి కోసం వైవిధ్యభరితమైన ఆహారపు రీతులను ఈ టూర్లలో పరిచయం చేయాలని ప్లాన్ చేస్తున్నాం’’అని సంకల్ప్ చెప్పారు. అదే విధంగా వైన్ టేస్టింగ్ కమ్యూనిటీని కూడా ఏర్పాటు చేయాలని వీరు నిర్ణయించారు. వెల్డన్ ఫుడీస్... ‘ఫుడీస్’ చెప్పిన విశేషాలు... హైదరాబాద్, ఫిలిమ్నగర్లో ఉన్న థియా కిచెన్‌లో మెడిటరేనియన్ (ఇటలీ, నార్వే, యూరప్‌లో కొంత భాగంగా ప్రవహించే మెడిటరేనియన్ సముద్రం చుట్టూరా ఉండే దేశాలు) ఫుడ్ లభిస్తుంది. హైదరాబాద్, మాదాపూర్ దగ్గరున్న చాట్ బజార్లో నగరంలోనే ఎక్కడా లేనంత తక్కువ ధరకు చాట్ లభిస్తుంది. అక్కడికి దగ్గర్లోనే ఉన్న అయ్యప్ప సొసైటీ దగ్గర్లో మామా చికెన్ అనే తోపుడు బండి ఉంటుంది. మన ముందే బొగ్గుల మీద కాల్చి ప్లేట్లో వేసి ఇస్తారు. అద్భుతమైన రుచి... అత్యల్పమైన ధర. హైదరాబాద్ మొజంజాహీ మార్కెట్ దగ్గర ఫేమస్, బిలాల్ ఐస్‌క్రీమ్ పార్లర్స్‌లో హ్యాండ్ మేడ్ ఐస్‌క్రీమ్స్ లభిస్తాయి. సీజనల్‌గా లభించే సీతాఫలం ఐస్‌క్రీమ్, సపోటా ఐస్‌క్రీమ్... వంటివి అద్భుతంగా ఉంటాయి. అత్యంత సహజమైన పద్ధతుల్లో తయారయే వీటి ధర రూ.25 నుంచి మొదలని తెలుసా? - ఎస్. సత్యబాబు ‘ఫుడీస్’కి ఆఫర్లే ఆఫర్లు... రూ.1600 ఖరీదు చేసే ఫుల్ 5 కోర్స్ మీల్‌ను ఓ రెస్టారెంట్ రూ.450కే వీరికి అందించింది. ఓ రెస్టారెంట్ వాళ్లు ప్రస్తుతం గ్రూప్ సభ్యుల్లో కొందరికి ఉచితంగా గ్రీకు దేశపు వంటకాల తయారీలో శిక్షణ ఇస్తున్నారు. గచ్చిబౌలిలో ఉన్న ఓ ఐస్‌క్రీమ్ పార్లర్లో ఈ గ్రూప్‌కి రూ.200కే అన్లిమిటెడ్ ఐస్‌క్రీమ్స్ అందించారు. అక్కడ ఒక్కో ఐస్‌క్రీమ్ ధర రూ.150కి తక్కువ వుండదు. -
ఓటుకు బిర్యానీ, బీరు!
మద్యం, డబ్బు ఎర వేసి ఓటర్లను ప్రభావితం చేయడం రాజకీయ పార్టీలకు అలవాటుగా మారి చాలా కాలమయింది. సాధారణ ఎన్నికల నుంచి స్టూడెంట్ ఎలక్షన్స్ వరకు ఇది పాకింది. పవర్ పాలిటిక్స్‌లో ఆధిపత్యం చెలాయించేందుకు రాజకీయ నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఓటర్లను అన్నిరకాలుగా ప్రలోభాలకు గురిచేస్తున్నారు. గెలుపు కోసం నానాగడ్డీ కరుస్తున్నారు. విద్యార్థి ఎన్నికలకూ ఈ రోగం అంటుకుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(యూఓహెచ్) విద్యార్థి ఎన్నికలు నేడు(అక్టోబర్ 30) జరిగాయి. ఈ నేపథ్యంలో రాజకీయ రాబందులు క్యాంపస్‌లో వాలిపోయాయి. బిర్యానీ, బీర్ సీసాలు ఎర వేసి విద్యార్థులను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నించాయి. రాత్రి విందులు ఏర్పాటు చేసి విద్యార్థులకు చికెట్, మటన్ బిర్యానీ ప్యాకెట్లు పోటాపోటీగా పంచాయి. అలాగే తాము మద్దతిచ్చే వారికి ఓటు వేసేందుకు స్టూడెంట్స్‌కు లెక్కకు మిక్కిలి బీరు సీసాలు ఆఫర్ చేశారు. యూఓహెచ్‌లో విద్యార్థి ఎన్నికలు కొత్తేం కాదు. తమకు ఓటు వేయమని అభ్యర్థులు ఓటర్లను అభ్యర్థించడం గతంలోనూ జరిగింది. అయితే ఈసారి రాజకీయ పార్టీలు రంగప్రవేశం చేయడంతో ఎన్నికల ముఖ'చిత్రం' మొత్తం మారిపోయింది. ప్రలోభాల పర్వం తారాస్థాయికి చేరింది. గడిచిన మూడు రోజుల్లో పదుల సంఖ్యలో జరిగిన విందులే ఇందుకు నిదర్శనం. కొత్తగా క్యాంపస్‌లో అడుగుపెట్టిన విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ఆ ప్రలోభాల పర్వం కొనసాగింది. ప్రచారానికి, ఓటర్లను ఆకర్షించేందుకు ఒక్కో అభ్యర్థి రూ. 50 వేలు పైగా ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. ప్రధాన రాజకీయ పార్టీలు తమ విద్యార్థి విభాగాలకు చెందిన వారు పోటీ చేసేందుకు రూ. 4 లక్షల వరకు కేటాయించినట్టు సమాచారం. లింగ్డో కమిటీ ప్రతిపాదనల ప్రకారం విద్యార్థి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి తన ప్రచారానికి రూ. 5 వేలు మించి ఖర్చు చేయరాదు. కొంత అభ్యర్థులు తమ మేనిఫెస్టోతో 20 వేల కరపత్రాలు ప్రింట్ చేయించినట్టు విద్యార్థులు చెబుతున్నారు. మొత్తానికి రాజకీయ పార్టీలు విద్యార్థి ఎన్నికలను వదల్లేదు. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా విద్యార్థులు విజ్ఞతతో వ్యవహరిస్తేనే ఇటువంటి రాజకీయ పార్టీలు తోక ముడిచేది. -
భవనంపై నుంచి పడి విద్యార్థిని మృతి
హైదరాబాద్, న్యూస్‌లైన్: పుట్టినరోజు నాడే ఓ విద్యార్థిని మరణం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)లో విషాదాన్ని నింపింది. వర్సిటీలో నిర్మాణంలో ఉన్న భవనంపై నుంచి పడటంతో ఉత్తరప్రదేశ్ లక్నోకు చెందిన మోహినీ మిశ్రా(19) మృతి చెందింది. మోహినీ హెచ్‌సీయూలో ఎంఏ ఇంటిగ్రేటెడ్ భాషాశాస్త్రం ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఆదివారం ఆమె పుట్టినరోజు. దీంతో శనివారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో తన స్నేహితులతో కలిసి సౌత్ క్యాంపస్ రోడ్డు పక్కనే ఉన్న బండపై కేక్ కట్ చేసింది. అనంతరం మోహినీ, మరో ఆరుగురు(ముగ్గురు యువకులు, ముగ్గురు యువతులు) 8వ హాస్టల్ సమీపంలో నిర్మాణంలో ఉన్న భవనం నాలుగవ అంతస్తులోకి వెళ్లారు. ‘అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఫోన్ రావడంతో మాట్లాడేందుకు మోహినీ పక్కకు వెళ్లింది. నాలుగైదు సార్లు తరచుగా ఫోన్ రావడంతో స్నేహితుల నుంచి దూరంగా వెళ్లి, మాట్లాడేందుకు ప్రయత్నించింది. బిల్డింగ్‌పై అంతస్తుకు పిట్టగోడ లేకపోవడం, చీకటిగా ఉండటంతో కాలుజారి కింద పడింది’ అని పోలీసులు తెలిపారు. వెంటనే ఆమెను నగరంలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స ప్రారంభించేలోపే మరణించింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పదమేనా.. మోహినీ, ఆమె మిత్రులు లైట్లు, సెక్యూరిటీ లేని భవనంలోకి వెళ్లడంపై పోలీ సులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సంఘటన స్థలంలో ఆధారాల కోసం గాలిస్తున్నారు. ప్రేమ వ్యవహారమా? స్నేహితులతో ఘర్షణ పడిందా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన జరిగిన సమయంలో మోహినీతోపాటు ఉన్న విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. పుట్టినరోజు సందర్భంగా తాము మద్యం తాగామని.. అయితే, మోహినీ, మరో విద్యార్థిని మాత్రం తాగలేదని వారు చెప్పినట్లు తెలిసింది. విద్యార్థుల ఆందోళన.. నిర్మాణంలో ఉన్న భవనంపై పిట్టగోడ నిర్మించకపోవడం వల్లేమోహినీ మృతి చెందిందంటూ వర్సిటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా సంఘటనా స్థలానికి వచ్చిన హెచ్‌సీయూ చీఫ్ ఇంజనీర్ సిద్ధార్థ వారితో వాగ్వాదానికి దిగారు. అసలు మీరు హెచ్‌సీయూ విద్యార్థులేనా.. మీ గుర్తింపు కార్డులను చూపించాలని అడిగారు. దీంతో విద్యార్థులు సిద్ధార్ధపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీలాంటి అధికారుల అలసత్వం వల్లే విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారంటూ మండిపడ్డారు. -
హెచ్‌సీయూలో విద్యార్థిని అనుమానాస్పద మృతి
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థిని మోహిని మిశ్రా గత అర్థరాత్రి అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. యూనివర్శిటీ ప్రాంగణంలోని నిర్మాణంలో ఉన్న భవనంపై నుంచి కింద పడి మోహినిమిశ్రా మరణించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దాంతో వారు చందానగర్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని విద్యార్థిని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీసులు యూనివర్శిటీ విద్యార్థుల నుంచి సమాచారం సేకరించారు. ఇద్దరు యువకులతో కలసి పార్టీ చేసుకుంటుండగా ఆ ప్రమాదం చోటుచేసుకుందని వారు పోలీసులకు వివరించారు. పోలీసులు ఆ ఇద్దరు యువకులును అదుపులోకి తీసుకుని చందానగర్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థిని మోహిని మిశ్రా మృతదేహన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.