
పగ... ప్రతీకారం
ప్రియుడితో సహజీవనం చేస్తున్న క్లిటెమ్ నెస్ట్రా.. భర్తను చంపుతుంది.
ప్రియుడితో సహజీవనం చేస్తున్న క్లిటెమ్ నెస్ట్రా.. భర్తను చంపుతుంది. ఇది తెలుసుకున్న ఆమె కుమార్తె ఎలక్ట్రా... తల్లిపై పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుంటుంది. గ్రీకువీరుడి సహాయంతో తల్లి ప్రియుడు అగస్తస్‌ను చంపిస్తుంది. క్రీస్తు పూర్వం నాటి ఒక గ్రీకు కథ ఆధారంగా రూపొందించిన ‘ఎలక్ట్రా’ నాటకం నగరవాసులను ఆకట్టుకుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్ పీజీ విద్యార్థులు దీన్ని ప్రదర్శించారు.
అద్భుతమైన అభినయంతో నాటకాన్ని రక్తికట్టించారు. థియేటర్ ఆర్ట్స్ హెడ్ ఎన్‌జే భిక్షు దర్శకత్వం వహించారు. ఎలక్ట్రాగా దీప్‌జ్యోతి గొగోయ్, క్లిటెమ్‌గా ఐశ్వర్య, అగస్తస్‌గా శిరీష్ నటించారు. గ్రీకు నాటకాలు, చరిత్రను పరిచయం చేసే ప్రయత్నమిదని భిక్షు అన్నారు. తొలిసారి స్టేజీపై నటించానని, ప్రదర్శన ఎంతో సంతృప్తినిచ్చిందని దీప్‌జ్యోతి చెప్పింది. స్వతహాగా సాధు స్వభావినైన నేను రాక్షస తల్లి పాత్రలో చేయడం ఓ కొత్త అనుభూతని ఐశ్వర్య తెలిపింది.
జి.రాజు