ఎలెక్ట్రా.. | Electra drama at Hyderabad Central University | Sakshi
Sakshi News home page

ఎలెక్ట్రా..

Published Tue, Nov 4 2014 11:55 PM | Last Updated on Sat, Sep 2 2017 3:51 PM

ఎలెక్ట్రా..

ఎలెక్ట్రా..

గ్రీక్ విషాద గాథ ఆధారంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ‘ఎలెక్ట్రా’ నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ నెల 6, 7 తేదీల్లో ప్రదర్శించే ఈ నాటక రిహార్సల్స్ యూనివర్సిటీలోని థియేటర్ ఆర్ట్స్ ఆడిటోరియంలో మంగళవారం జరిగాయి. గ్రీక్ రచయిత సోపోక్లస్ రచించిన ‘ఎలెక్ట్రా’ ఆధారంగా ఈ నాటకాన్ని యూనివ ర్సిటీలో ప్రదర్శిస్తున్నారు.

థియేటర్ ఆర్ట్స్ విభాగాధిపతి డాక్టర్ ఎన్‌జె.భిక్షు ఈ నాటకానికి దర్శకత్వం వహిస్తున్నారు. పీజీ మూడో సెమిస్టర్ విద్యార్థులు ఈ నాటకంలో పాత్రధారులు. రిహార్సల్స్‌లో విద్యార్థుల నటన,హావభావ విన్యాసాలను నిపుణులు పర్యవేక్షించారు. ఈ నాటకానికి సంగీతం ఏసునాథ్ రాథోడ్ సవుకూరుస్తుండగా, అరుణాభిక్షు నృత్య దర్శకత్వం వహిస్తున్నారు. ప్రొడక్షన్ మేనేజర్‌గా రహమతుల్లాలు వ్యవహరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement