Electricity
-
మీటర్ రీడర్లకు షాక్!
విద్యుత్ మీటర్ రీడర్లకు కూటమి ప్రభుత్వం షాక్ ఇస్తోంది. టీడీపీ నేతలు, నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలో పాల్గొన్న కార్యకర్తలకు ఉపాధి కల్పించేందుకు చాలా సంవత్సరాలుగా పని చేస్తున్న మీటర్ రీడర్లపై వేటు వేస్తోంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఈ ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10వేల మంది మీటర్ రీడర్లు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తమ కమీషన్లో కోత విధించిందని, ఇప్పుడు తమ ఉపాధికే ఎసరు పెట్టిందని మీటర్ రీడర్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. –సాక్షి, అమరావతిమొదట కమీషన్లో కోత...రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల పరిధిలో అన్ని జిల్లాల్లో కలిపి దాదాపు 1.92 కోట్ల విద్యుత్ సర్వీసులు ఉన్నాయి. వాటిలో 20 శాతం నుంచి 30 శాతం వరకు పారిశ్రామిక, వాణిజ్య, వ్యవసాయ సర్వీసులు ఉంటాయి. మిగతా 70 శాతం సర్వీసులకు ప్రతి నెలా విద్యుత్ బిల్లులను స్పాట్ బిల్లింగ్ రీడర్ల ద్వారా ఇస్తున్నారు. ఇందుకోసం డిస్కంలు కాంట్రాక్టు పద్ధతిలో మీటర్ రీడర్లను తీసుకుంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10 వేల మంది మీటర్ రీడర్లు పనిచేస్తున్నారు. వీరికి గతంలో ఒక్కో బిల్లుకు (పీస్ రేట్) కమిషన్‌గా అర్బన్‌లో రూ.3.49, రూరల్‌లో రూ.3.89 చెల్లించేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక దీనిని అర్బన్‌లో రూ.2.60, రూరల్‌లో రూ.2.89కి కమీషన్ తగ్గించారు. నెలలో మొదటి 10 రోజుల్లోనే బిల్లింగ్ పూర్తిచేసిన తర్వాత మిగతా 20 రోజులు రీడర్లు ఖాళీగా ఉంటున్నారు. ఈ 20 రోజుల్లో విద్యుత్ బిల్లులు వసూలు చేయడం, మీటర్లు మార్చడం, మొండి బకాయిలున్న సర్వీసులను తొలగించడం, వంటి పనులకు అవకాశం ఇవ్వాలని రీడర్లు చాలాకాలంగా డిస్కంలను కోరుతున్నారు. కానీ ఇప్పుడు అసలు వారి ఉపాధి పైనే కూటమి ప్రభుత్వం దెబ్బకొడుతోంది.నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టులువిద్యుత్ మీటర్ల నుంచి రీడింగ్‌ను నమోదు చేసి వినియోగదారులకు ప్రతి నెలా బిల్లు ఇచ్చే స్పాట్ బిల్లింగ్ రీడింగ్ కాంట్రాక్టులను క్లాస్–1 కాంట్రాక్టర్లకే ఇవ్వాలనే నిబంధన ఉంది. కానీ ఇందుకు విరుద్ధంగా డిస్కంలు కేవలం చినబాబు అనుచరులు, టీడీపీ నేతలు అయితే చాలు అన్నట్లు.. జిల్లాల వారీగా నామినేషన్‌పై కాంట్రాక్టులు అప్పగిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో ఇలా కొత్తగా వచ్చిన కాంట్రాక్టర్లు ఇష్టానుసారం వ్యవహరిస్తూ ప్రస్తుతం ఉన్న రీడర్లకు కల్పించాలి్సన ఈపీఎఫ్, ఈఎస్ఐ సదుపాయాలను నిలిపివేశారు. తామిచ్చే రేటు(కమీషన్)కే పనిచేయాలని, లేదంటే వెళ్లిపోవాలని బెదిరిస్తున్నారు. చాలాచోట్ల యువగళం కార్యకర్తలకు మీటర్ రీడింగ్ తీసే పనులు అప్పగిస్తూ ప్రస్తుత రీడర్ల ఉపాధికి గండికొడుతున్నారు. -
ఏపీ ప్రజలకు షాక్‌ల మీద షాక్!
-
బాబూ.. బేల మాటలేల?
‘విశాఖ స్టీల్‌ప్లాంట్ గురించి నేను ఒకటే చెబుతున్నాను.. ఇది ఆంధ్రుల మనోభావాలకు చెందిన ప్రాజెక్టు. ఉద్యోగులు, యాజమాన్యం ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. మంచి మేనేజ్మెంట్ ఏర్పాటు చేసుకోవాలి. సమర్థవంతంగా ప్లాంట్‌ని నడిపించాలి. సెయిల్ మాదిరిగా విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను లాభాల బాట పట్టించాలి? ఇవీ.. పరవాడ పర్యటనలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు. స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు కేటాయింపులో చొరవ తీసుకోవల్సిన ముఖ్యమంత్రి ఇలా మాట్లాడడంపై స్టీల్‌ప్లాంట్ ఉద్యోగ కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సాక్షి, విశాఖపట్నం: ఇటీవల పరవాడ పర్యటనలో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు సెయిల్‌కు, విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు ఉన్న తేడా తెలియదా అంటూ కార్మిక సంఘాలు ప్రశి్నస్తున్నాయి. సెయిల్‌కు సొంత గనులు ఉండటం వల్లే లాభాల బాటలో పయనిస్తోంది. సెయిల్‌కు, స్టీల్‌ప్లాంట్‌కు ఉత్పత్తి వ్యయంలో చాలా తేడా ఉంది. సెయిల్‌తో పోలిస్తే స్టీల్‌ప్లాంట్‌కు మూడు రెట్లు ఉత్పత్తి వ్యయం అవుతోంది. సొంత గనులు లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. ప్లాంట్‌కు గనులు కేటాయించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పలుమార్లు విన్నవించినా పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ కార్మిక సంఘాలు చంద్రబాబు, పవన్ దృష్టికి సొంతగనుల కేటాయింపు విషయాన్ని పలుమార్లు విన్నవించినా.. కేంద్రంతో ఒక్కసారి కూడా సంప్రదింపులు జరపలేదు. ఇప్పుడు మాత్రం.. లాభాల బాట నడిపించాల్సిన బాధ్యత ఉద్యోగులు, కార్మికులదే అన్నట్లుగా చంద్రబాబు మాట్లాడటంపై ఉక్కు పోరాట కమిటీ నాయకులు మండిపడుతున్నారు. మేనేజ్మెంట్ బాధ్యత ఎవరిది బాబూ.? స్టీల్‌ప్లాంట్‌కు మంచి మేనేజ్మెంట్ ఏర్పాటు చేసుకోవాలంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపైనా కార్మికులు మండిపడుతున్నారు. ప్లాంట్‌కు ఉన్నతాధికారుల నియామకం, సీఎండీ నియామకం మొదలైన బాధ్యతలన్నీ కేంద్రం పరిధిలో ఉంటాయి. కేంద్రంలో ఉన్న ప్రభుత్వంతో జతకట్టిన టీడీపీ, జనసేన ఈ విషయంపై ఎప్పుడూ చర్చించిన పాపానపోలేదు. అలాంటిది.. మంచి మేనేజ్మెంట్ను ఉద్యోగులు ఏర్పాటు చేసుకోవాలని చంద్రబాబు అనడమేంటని ప్రశి్నస్తున్నారు. ఐదు నెలల్లో ఉక్కు కోసం ఏం చేశారు.? ప్లాంట్‌ను కాపాడుకుంటామంటూ ప్రగల్భాలు పలికిన కూటమి నేతలు ఈ ఐదు నెలల్లో పట్టించుకున్న పాపానపోలేదు. ఉద్యోగులు, కార్మికులకు ఉన్న సదుపాయాల్ని యాజమాన్యం కోత విధించినా స్పందించలేదు. ఉద్యోగుల వీఆర్ఎస్, మరో ప్లాంట్‌కు బదిలీలకు పూనుకున్నా.. ఉద్యోగుల హెచ్ఆర్ఏ తొలగించినా నోరెత్తిలేదు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా స్టీల్‌ప్లాంట్ క్వార్టర్స్‌లో యూనిట్‌కి రూ.8 చొప్పున విద్యుత్ చార్జీలు పెంచి వసూలు చేసినా మాట్లాడలేదు. లీవ్ ఎన్‌క్యా‹మెంట్, ఎల్‌టీఏ(లాంగ్ ట్రావెల్ అలవెన్స్), లాంగ్‌లీవ్ ట్రావెల్ కన్సెషన్(ఎల్ఎల్టీసీ), ఎల్టీసీ(లీవ్ ట్రావెల్ కన్సెషన్) కూడా నిలిపేశారు. దీనికి తోడు చంద్రబాబు ప్రభుత్వం గోరుచుట్టుపై రోకలిపోటులా రూ.80 కోట్ల విద్యుత్ బిల్లుల బకాయిల చెల్లించకపోతే సరఫరా నిలిపేస్తామంటూ నోటీసులు జారీ చేసింది. అలాగే స్టీల్‌ప్లాంట్‌కు ప్యాకేజీ ఇస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం మొదట ఇచ్చిన రూ.500 కోట్లలో రూ.237 కోట్లు జీఎస్టీకి చెల్లించగా మిగిలిన ధనంతో ముడి పదార్థాలు కొనుగోలు చేశారు. రెండోసారి ప్యాకేజీ పేరుతో రూ.1140 కోట్లు ఇచ్చినట్టే ఇచ్చి.. బ్యాంకులకు రుణాల పేరిట తిరిగి తీసేసుకుంది. ఇలా ప్రతి విషయంలోనూ ప్లాంట్‌ని నిర్వీర్యం చేసేందుకు యతి్నస్తుంటే కూటమి నేతలు నోరుమెదపకపోవడం ఏంటని కార్మిక సంఘాలు ప్రశి్నస్తున్నాయి.నక్కపల్లిలో ప్రైవేట్ ప్లాంట్‌కు సొంత గనులా? అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో మిట్టల్ ప్రైవేట్ స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు చంద్రబాబు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పైగా దానికి సొంత గనుల కేటాయింపులోనూ రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఉన్న స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించకుండా ప్రైవేట్‌కు కొమ్ము కాస్తుండడం చూస్తే.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు విశాఖ ఉక్కుపై ఉన్నది కపట ప్రేమ అని తేటతెల్లమవుతోందంటూ ఉద్యోగ సంఘ ప్రతినిధులు విమర్శిస్తున్నారు.గనుల కేటాయింపులో వివక్ష కారణంగా..? గతంలో వరుసగా సాధించిన లాభాలతో 6.3 మిలియన్ టన్నుల సామర్థ్యానికి, ఆ తర్వాత 7.3 మిలియన్ టన్నుల సామర్థ్యానికిప్లాంట్ విస్తరణ జరిగింది. ఒక రకంగా విస్తరణ స్టీల్‌ప్లాంట్‌కు నష్టం తెచ్చిందని చెప్పవచ్చు. విస్తరణ పూర్తయ్యే నాటికి ఉన్న వనరులన్నీ కరిగిపోగా రుణాలకు వెళ్లాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా దేశంలోని ప్రైవేటు ప్లాంట్లకు గనులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు కేటాయించడంలో వివక్ష చూపుతూ వస్తుంది. దీని వల్ల ఇతర ప్లాంట్లలో టన్నుకు 40 శాతం ముడి పదార్థాలకు వ్యయం అవుతుండగా సొంత గనులు లేని విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు 65 శాతం వ్యయం అవుతోంది. కొన్నిసార్లు ఉత్పత్తి వ్యయం కంటే తక్కువకే ఉత్పత్తులను స్టీల్‌ప్లాంట్ అమ్ముకోవాల్సి వస్తోంది. దీంతో గత నాలుగున్నరేళ్ల కాలంలో మూడేళ్ల పాటు నష్టాలను చవిచూసింది. ఈ పరిస్థితుల్లో ప్లాంట్ రుణాలు రూ.20 వేల కోట్లకు మించిపోయాయి. అయితే స్టీల్‌ప్లాంట్ ఈ 30 ఏళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ పన్నుల రూపేణా రూ. 40 వేల కోట్లు చెల్లించడం గమనార్హం. వీటిని వద్దని చెప్పినా ప్లాంట్ సజీవంగా బతికేది.ఉద్యోగులపై నిందలు వేయడం సరికాదు స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు ఉంటే సెయిల్ కంటే ఎక్కువ లాభాలు సాధించేది. ఉక్కు యాజమాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది కానీ ఉద్యోగులు కాదు. కేంద్ర ప్రభుత్వం ప్లాంట్‌ను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నంలో చేస్తున్న సహాయ నిరాకరణ వల్ల స్టీల్‌ప్లాంట్ ఈ పరిస్థితికి చేరింది.. తప్ప ఉద్యోగుల వల్ల కాదు. సీఎం చంద్రబాబుకి అందిన తప్పుడు సమాచారం వల్లే ఆయన అలా మాట్లాడుతున్నారేమో. – మంత్రి రాజశేఖర్, స్టీల్ ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి -
‘గిరి’ సీమల్లో ‘జుగా’ వెలుగులు
హన్మకొండ: అన్ని గిరిజన గ్రామాల్లో విద్యుత్ కాంతులు విరజిమ్మనున్నాయి. ప్రతీ ఇంటిని విద్యుదీకరించాలని కేంద్ర ప్రభుత్వం తాజగా నిర్ణయించింది. మెజారిటీ గిరిజన జనాభా ఉండి ఇప్పటివరకు విద్యుత్ సౌకర్యానికి నోచుకోని గ్రామాల్లో వెలుగులు నిండనున్నాయి. ప్రతీ ఇంటికి ఉచితంగా విద్యుత్ కనెక్షన్ ఇస్తారు. అవసరమైన చోట నూతనంగా విద్యుత్ లైన్లు వేయడంతోపాటు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తారు. అటవీ ప్రాంతంతోపాటు ఇతర కారణాలతో విద్యుత్ లైన్లు వేయలేని గ్రామాల్లో సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పిస్తారు.తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్) పరిధిలో మెజారిటీ గిరిజన జనాభా కలిగిన 1,049 గ్రామాలు, తెలంగాణ సదరన్ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీఎస్ఎల్) పరిధిలో 229 గ్రామాల్లోని గిరిజన ఇళ్లలో వెలుగులు నింపనున్నారు. ఈ మేరకు ఎన్పీడీసీఎల్ సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)ను తయారు చేసింది. మెజారిటీ గిరిజన జనాభా ఉన్న 695 గ్రామాల్లోని 25,393 గృహాలకు, 732 ప్రభుత్వ, ప్రభుత్వ రంగ కార్యాలయాలకు విద్యుత్ సౌకర్యం కల్పించనున్నారు. మొత్తం రూ.144.42 కోట్ల వ్యయం అంచనాతో డీపీఆర్ రూపొందించగా.. దీన్ని కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి పంపనున్నారు.దేశంలో 5 కోట్ల మందికి లబ్ధిగిరిజనులకు మెరుగైన సామాజిక, ఆర్థిక స్థితిగతులను మెరుగు పరిచేందుకు, గ్రామాల్లో కనీస వసతులు, సౌకర్యాల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధా న మంత్రి జన్‌జాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ (పీఎం జుగా) అమలు చేస్తోంది. దేశవ్యాప్తంగా 63 వేల గ్రామాల్లో 5 కోట్ల మంది గిరిజనులకు ప్రయోజనం చేకూర్చాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని తెచ్చింది. ఈ స్కీమ్ ద్వారా 25 రకాల సహాయాలు అందుతాయి. 17 మంత్రిత్వ శాఖలు అమలు చేస్తున్నాయి. సామాజిక మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, విద్య, జీవనోపాధిలో ఉన్న కీలకమైన అంతరాలను పూడ్చేలా ఈ స్కీమ్‌ను రూపొందించారు.రూ.144.42 కోట్ల వ్యయంతో..ఇప్పటికే ప్రధానమంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ ద్వారా జనసమూహాలకు దూరంగా ఉండి మౌలి క సదుపాయాలకు నోచుకోని కోలం, తొట్టి గిరిజనులు నివా సముండే ఎన్పీడీసీఎల్ పరిధిలోని ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లోని 257 అవా సాల్లో 3,345 గృహాల్లో విద్యుత్ సౌకర్యం కల్పించారు. అదే విధంగా దీన్‌దయాల్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి ద్వారా రూ.125కే విద్యుత్ పంపిణీ సంస్థ సొంతగా ఖర్చులు భరించి పేదలకు విద్యుత్ సౌకర్యం కల్పించింది. అయినా ఇప్పటి కీ విద్యుత్ సౌకర్యానికి దూరంగా ఉన్న మెజారిటీ గిరిజను లున్న గ్రామాలు, గృహాల కోసం కేంద్రం ‘పీఎం జుగా’ను తెచ్చింది.ఎన్పీడీసీఎల్ పరిధిలోని 15 జిల్లాల్లో జగిత్యా ల, పెద్దపల్లి జిల్లాల్లో విద్యుత్ సౌకర్యం లేని గృహాలేమీ లేవు. మిగతా 13 జిల్లాల్లో 1,049 మెజారిటీ గిరిజన జనాభా కలిగిన గ్రామాలు ఉన్నట్లు గుర్తించా రు. ఇందులో 25,393 గృహాలు, 732 ప్రభు త్వ కార్యాలయాలు (మొత్తం 26,125) ఉన్నా యి. కాగా ఆన్ గ్రిడ్ ద్వారా విద్యుత్ సౌకర్యం కల్పించే వీలున్న గ్రామాలు 24,753 ఉన్నా యి. వివిధ కారణాలవల్ల విద్యుత్ సౌకర్యం క ల్పించడం వీలుకాని 640 గ్రామాల్లో సోలార్ ద్వారా గృహాలను విద్యుదీకరించనున్నారు. ఈ గ్రామాలు, గృహాల కు విద్యుత్ సౌకర్యం కల్పించడానికి రూ.144.42 కోట్ల వ్య యంతో 352 కిలోమీటర్ల మేర 11 కేవీ లైన్, 592 కి.మీ. సింగిల్ లైన్, 1,668 కి.మీ. ఎల్టీ లైన్ నిర్మించనున్నారు. 1,565 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు బిగించనున్నారు. ఈ స్కీమ్ అమలుకు కావాల్సిన ఖర్చులన్నీ కేంద్రమే భరిస్తుంది. -
కేసులకు భయపడం.. ఏం చేస్తారో చేస్కోండి
సిరిసిల్ల: ‘మహా అయితే.. ఏం చేస్తారు.. ఏవో తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపుతారు.. ఏం కేసులు పెడుతారో పెట్టుకోండి. ప్రజల కోసం జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇంతకు వందరెట్లు వడ్డీతో సహా బదులు తీర్చుకుంటాం. ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదు. వచ్చేది మేమే.. నేనే.. ’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు అన్నారు. విద్యుత్ సంస్థల చార్జీల పెంపు ప్రతిపాదనలపై రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) శుక్రవారం నిర్వహించిన బహిరంగ విచారణకు హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు.రాష్ట్రంలో త్వరలో రాజకీయ బాంబులు పేలతాయనే మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్యలను ప్రస్తావించగా.. పైవిధంగా స్పందించారు. కేటీఆర్ మాట్లాడుతూ.. ‘ముందు ఆయనపై జరిగిన ఈడీ దాడులు, బీజేపీ వాళ్లతో రహస్య ఒప్పందాలు, సీఎం బామ్మర్దితో కాంట్రాక్టు ఒప్పందాలు ఇవన్నీ చూసుకోవాలి. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు రూ.4,500 కోట్ల వ్యవహారం చూసుకోవాలి. మాపై ఎన్ని కేసులు పెట్టినా భయపడం. చంద్రబాబునాయుడు వంటి వాళ్లతోనే కొట్లాడినం.ఈ చిట్టినాయుడు ఎంత..’అని అన్నారు. తానింకా బీఆర్ఎస్కు రాజీనామా చేయలేదని, కాంగ్రెస్‌లో చేరలేదంటూ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, మరి సీఎం రేవంత్‌రెడ్డితో ఎందుకు కండువా కప్పించుకున్నారని, బీఆర్ఎస్లో ఉంటూ కాంగ్రెస్‌తో కలవడమంటే రాజకీయంగా వ్యభిచారం చేసినట్టేనని అన్నారు. బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరిన వారంతా రాజకీయ వ్యభిచారులేనని వ్యాఖ్యానించారు. పదేళ్లలో పైసా విద్యుత్ చార్జీలు పెంచలేదు ఈఆర్సీ బహిరంగ విచారణ సందర్భంగా మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో పైసా విద్యుత్ చార్జీలు కూడా పెంచకుండా నెలకు రూ.వెయ్యి కోట్లు భరిస్తూ పాలన అందించామని కేటీఆర్ చెప్పారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే కరెంట్ కోతలు, విద్యుత్ చార్జీల వాతలు పెడుతోందని విమర్శించారు. పెద్ద పరిశ్రమలను, కుటీర పరిశ్రమలను ఒకే గాటన కట్టి, కుటీర పరిశ్రమకు రాయితీలను ఎత్తివేసే కుట్రలు చేస్తున్నారని చెప్పారు. అదానీతో సమానంగా సూక్ష్మ, చిన్న, కుటీర పరిశ్రమల యజమానులు ఎలా విద్యుత్ చార్జీలు చెల్లిస్తారని ప్రశ్నించారు.విద్యుత్ చార్జీలు పెంచే ప్రతిపాదనలను తిరస్కరిస్తున్నామని, డిస్కంలపై రూ.18,000 కోట్ల ఆర్థిక భారాన్ని మోపే ప్రయత్నాలను బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. సూక్ష్మ, చిన్నతరహా, కుటీర పరిశ్రమలకు గ్రీన్‌చానల్ ఏర్పాటు చేసి సబ్సిడీ టారిఫ్‌తో విద్యుత్ సరఫరా చేయాలని కోరారు. నేతన్నల సంక్షేమం కోసం 10 హెచ్‌పీల వరకు ఉన్న 50 శాతం విద్యుత్ రాయితీని 30 హెచ్‌పీల వరకు పెంచాలని డిమాండ్ చేశారు. బహిరంగ విచారణలో ఈఆర్సీ చైర్మన్ టి.శ్రీరంగారావు, సభ్యులు మహావీర్రాజు, కృష్ణయ్య, ఎమ్మెల్సీ ఎల్.రమణ, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, నాప్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, ‘సెస్’చైర్మన్ చిక్కాల రామారావు, జెడ్పీ మాజీ చైర్పర్సన్ అరుణ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య తదితరులు పాల్గొన్నారు. దద్దమ్మ పాలనలో దద్దరిల్లుతున్న రాష్ట్రం దద్దమ్మ పాలనలో రాష్ట్రం ధర్నాలతో దద్దరిల్లుతోందని కేటీఆర్ విమర్శించారు. దిక్కుమాలిన పాలనలో ప్రజల జీవితాలు దిక్కూమొక్కూ లేకుండా తయారయ్యాయని శుక్రవారం ‘ఎక్స్’లో ఆయన పేర్కొన్నారు. ‘అలంపూర్ నుండి మొదలు పెడితే ఆదిలాబాద్ వరకు, గ్రామ సచివాలయం నుండి మొదలు రాష్ట్ర సచివాలయం వరకు ధర్నాలు, నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రైతులు మొదలుకుని రైస్ మిల్లర్ల వరకు, కారి్మకులు మొదలు కాంట్రాక్టర్ల వరకు సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.టీచర్ల నుంచి పోలీస్ కుటుంబాల దాకా, అవ్వతాతలు, ఆడబిడ్డలు, విద్యార్థులు, విద్యావంతులు, నిరుద్యోగులు , ఉద్యోగులు రోడ్లెక్కుతున్నారు. కాంగ్రెస్ ప్రజాపతినిధులు, ప్రతిపక్ష నాయకుల నుంచి వృద్దులు, బడి పిల్లలు కూడా ప్రభుత్వ తీరుపై ఆందోళనలకు దిగుతున్నారు. కాంగ్రెస్ పాలన వద్దు అంటూ నినాదాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పాలన ప్రజలకు కష్టాలు తెచ్చి పెట్టింది..’అని కేటీఆర్ మండిపడ్డారు. -
20వేల మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఎందుకు?
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ డిమాండ్‌పై అశాస్త్రీయ, అవాస్తవిక అంచనాల ఆధారంగా గతంలో అడ్డగోలుగా చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల(పీపీఏ)లను విద్యుత్ రంగ నిపుణులు, పారిశ్రామిక, వాణిజ్య సంఘాల ప్రతినిధులు తప్పుబట్టారు. ఈ పీపీఏల ద్వారా వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో పెద్ద మొత్తంలో మిగులు విద్యుత్ ఉండబోతోందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఐదేళ్లలో కొత్తగా 20వేల మెగావాట్ల పునరుత్పాద విద్యుత్ ప్లాంట్ల స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనుక ఉన్న ఔచిత్యం ఏమిటని ప్రశ్నించారు. 2024–25లో 24వేల మిలియన్ యూనిట్లు(ఎంయూ) ఉండనున్న మిగులు విద్యుత్.. 2028–29 నాటికి 43 వేల ఎంయూలకు పెరుగుతుందని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు నివేదించాయని గుర్తు చేశారు. యాదాద్రి విద్యుత్ కేంద్రం పూర్తయితే మిగులు విద్యుత్ ఇంకా పెరిగిపోతుందన్నారు. కొత్తగా 20వేల మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తే మిగులు విద్యుత్ మరింతగా పెరిగి రాష్ట్ర ప్రజలపై అనవసర భారం పడుతుందని హెచ్చరించారు. ఇప్పటికే ఇబ్బడిముబ్బడిగా పీపీఏలకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) అనుమతిచ్చిందని, ఇకపై కొత్త పీపీఏలకు అనుమతి విషయంలో పునరాలోచించాలని సూచించారు. 2024–25లో రూ.1221 కోట్ల విద్యుత్ చార్జీల పెంపును ప్రతిపాదిస్తూ ఉత్తర/దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు(టీజీఎన్పీడీసీఎల్/టీజీఎస్పీడీసీఎల్) సమర్పించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక(ఏఆర్ఆర్) పై బుధవారం విద్యుత్ నియంత్రణ్ భవన్లో ఈఆర్సీ నిర్వహించిన బహిరంగ విచారణలో పెద్ద సంఖ్యలో వక్తలు పాల్గొని మాట్లాడారు. పునరుత్పాదక విద్యుత్ ఒప్పందాలతో ప్రయోజనాలతోపాటే దుష్పరిణామాలూ ఉంటాయని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ ఆథారిటీ(సీఈఏ) ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఓ నివేదిక ఇచ్చిందని సెంటర్ ఫర్ పవర్ స్టడీస్ కన్వీనర్ ఎం.వేణుగోపాల్‌రావు తెలిపారు. అవసరానికి మించి ఈ ఒప్పందాలు చేసుకుంటే జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాలను బ్యాక్‌డౌన్ చేసి ఉత్పత్తిని తగ్గించడం/పూర్తిగా నిలుపుదల చేయాల్సి వస్తుందన్నారు. ఈ ఒప్పందాలతో ఇప్పటికే రాష్ట్రానికి ఏటా రూ.500 కోట్ల నష్టం జరుగుతోందన్నారు. గత ప్రభుత్వం 2022–23లో ఏకంగా రూ.5596 కోట్ల చార్జీలను పెంచగా, ప్రస్తుత ప్రభుత్వం రూ.1221 కోట్ల విద్యుత్ చార్జీల పెంపును ప్రతిపాదించిందన్నారు. వాస్తవానికి ఏటా రూ.3వేల కోట్లకు పైనే చార్జీలు పెరుగుతాయన్నారు. జెన్కో థర్మల్, హైడల్ విద్యుత్ కేంద్రాలకు మరమ్మతు లేక ఉత్పత్తి తగ్గిందన్నారు. ఈఆర్సీ చైర్మన్ టి.శ్రీరంగారావు, సభ్యులు ఎండీ మనోహర్ రాజు, బండారు కృష్ణయ్య ముందు తొలుత టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ తమ ప్రతిపాదనలను ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ నెల 28న ఈఆర్సీ కొత్త టారిఫ్ ఉత్తర్వులను ప్రకటించనుంది. నవంబర్ 1 నుంచి పెరిగిన చార్జీలు అమల్లోకి రానున్నాయి. ఇలా అయితే పరిశ్రమలు తరలిపోతాయి హెచ్‌టీ కేటగిరీలోని 33 కేవీ, 133 కేవీ వినియోగదారుల విద్యుత్ చార్జీలను 11 కేవీ వినియోగదారులతో సమానంగా పెంపుతోపాటు కొత్తగా స్టాండ్‌బై చార్జీలు, గ్రిడ్ సపోర్ట్ చార్జీలు, అన్‌బ్లాకింగ్ చార్జీల ప్రతిపాదనలను ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆప్ కామర్స్(ఫ్యాప్సీ), తెలంగాణ ఐరన్, స్టీల్ మ్యానుఫాక్టర్స్ అసోసియేషన్, ఏపీ, టీజీ ప్లాస్టింగ్ మాన్యుఫాక్టరింగ్ అసోసియేషన్లు వ్యతిరేకించాయి. ఇలా అయితే రాష్ట్రంలోని పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ మెట్రో రైల్‌కు సమానంగా తమ విద్యుత్ చార్జీలను తగ్గించాలని దక్షిణమధ్య రైల్వే సీఈ కె.థౌర్య విజ్ఞప్తి చేశారు. రైతుల ఇబ్బందులపై వక్తల ఆగ్రహంవ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లను మరమ్మతుల కోసం రవాణా చేసేందుకు రైతులు పడుతున్న ఇబ్బందులపై భారతీయ కిసాన్ సంఘ్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షేత్ర స్థాయి విద్యుత్ సిబ్బంది రాకపోవడంతో రైతులే మరమ్మ తులకు ప్రయత్నించి విద్యుదాఘాతంతో మరణిస్తున్నా రన్నారు. విద్యుత్ సిబ్బంది అవినీతి, అక్రమాలు, వేధింపులపై ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. పాడి పరిశ్రమను వ్యవసాయ కేటగిరీ కింద చేర్చి ఉచిత విద్యుత్ వర్తింపజేయాలని యాదవ్ మహాసభ జాతీయ కార్యదర్శి రమేశ్‌యాదవ్ విజ్ఞప్తి చేశారు. చార్జీల పెంపును వ్యతిరేకిస్తాం: మధుసూదనాచారితెలంగాణలో 2015–23 మధ్య కాలం కరెంట్ విషయంలో స్వర్ణ యుగమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి అన్నారు. గత ప్రభుత్వం చార్జీలు పెంచలేదన్నారు. చార్జీల పెంపుతో పరిశ్రమలు తరలిపోతాయని, మూతపడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. రూ.1220 కోట్ల చార్జీలను పెంచకుండా ప్రభుత్వమే అదనపు సబ్సిడీ ఇవ్వాలన్నారు.అక్కడికక్కడే ఎక్స్‌గ్రేషియా చెక్ అందజేత వనపర్తి జిల్లా గోపాలపేట మండలం జైన్ తిరుమలాపూర్లో పొలం వద్ద విద్యుదాఘాతంతో 2022 మార్చి 28న పరగోల యాదయ్య చనిపోయాడు. బహిరంగ విచారణలో ఫిర్యాదు రాగా, అక్కడిక్కడే సీఎండీ రూ.5 లక్షల చెక్‌ను యాదయ్య భార్యకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈఆర్సీ చైర్మన్ టి.రంగారావు, సభ్యులు మనోహర్, కృష్ణయ్య, టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ తదితరులు పాల్గొన్నారు. -
రోజుకు 12వేల కొత్త కార్లు
న్యూఢిల్లీ: వచ్చే దశాబ్దకాలంలో భారత్‌లో విద్యుత్, ఇంధనాల వినియోగానికి, కార్లకు డిమాండ్ గణనీయంగా పెరగనుంది. రోజుకు కొత్తగా 12,000 కార్లు రోడ్డెక్కనున్నాయి. 2035 నాటికి ఎయిర్ కండీషనర్ల (ఏసీ) విద్యుత్ వినియోగం మొత్తం మెక్సికోలో విద్యుత్ వినియోగాన్ని మించిపోనుంది. వరల్డ్ ఎనర్జీ అవుట్‌లుక్ 2024 నివేదికలో ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) ఈ విషయాలు వెల్లడించింది. భారత్‌లో చమురు, గ్యాస్, బొగ్గు, విద్యు త్, పునరుత్పాదక విద్యుత్ మొదలైన అన్ని రూపాల్లోనూ శక్తికి డిమాండ్ పెరుగుతుందని పేర్కొంది. ప్రస్తుతం చమురు వినియోగం, దిగుమతికి సంబంధించి ప్రపంచంలో 3వ స్థానంలో ఉన్న భారత్‌లో చమురుకు డిమాండ్ రోజుకు దాదాపు 20 లక్షల బ్యారెళ్ల మేర పెరుగుతుందని ఐఈఏ అంచనా వేసింది. దీంతో అంతర్జాతీయంగా చమురు డిమా ండ్ పెరిగేందుకు భారత్ ప్రధాన కారణంగా ఉంటుందని తెలిపింది. 2023లో అయిదో భారీ ఎకానమీగా ఉన్న భారత్ 2028 నాటికి మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని వివరించింది.నివేదికలో మరిన్ని వివరాలు.. → భారత్‌లో జనాభా పరిమాణం పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే దశాబ్దకాలంలో మిగతా దేశాలతో పోలిస్తే ఇంధనాలకు డిమాండ్ మరింత పెరగనుంది. → 2035 నాటికి ఐరన్, స్టీల్ ఉత్పత్తి 70 శాతం, సిమెంటు ఉత్పత్తి సుమారు 55 శాతం పెరుగుతుంది. ఎయిర్ కండీషనర్ల నిల్వలు 4.5 రెట్లు పెరుగుతాయి. దీంతో ఏసీల కోసం విద్యుత్ డిమాండ్ అనేది వార్షికంగా యావత్ మెక్సికో వినియోగించే విద్యుత్ పరిమాణాన్ని మించిపోతుంది. → ఆయిల్ డిమాండ్ రోజుకు 5.2 మిలియన్ బ్యారెళ్ల (బీపీడీ) నుండి 7.1 మిలియన్ బీపీడీకి చేరుతుంది. రిఫైనరీల సామర్థ్యం 58 లక్షల బీపీడీ నుండి 71 లక్షల బీపీడీకి పెరుగుతుంది. సహజవాయువుకు డిమాండ్ 64 బిలియన్ ఘనపు మీటర్ల (బీసీఎం) నుంచి 2050 నాటికి 172 బీసీఎంకి చేరుతుంది. బొగ్గు ఉత్పత్తి సైతం అప్పటికి 645 మిలియన్ టన్నుల నుంచి 721 మిలియన్ టన్నులకు పెరుగుతుంది. → భారత్‌లో మొత్తం శక్తి వినియోగం 2035 నాటికి సుమారు 35 శాతం మేర పెరగనుండగా, విద్యుదుత్పత్తి దాదాపు మూడు రెట్లు పెరిగి 1,400 గిగావాట్లకు చేరనుంది. → సౌర విద్యుదుత్పత్తి పెరుగుతున్నప్పటికీ బొగ్గు నుంచి విద్యుదుత్పత్తి దానికన్నా 30 శాతం అధికంగా ఉండనుంది. సోలార్ ఇన్స్టాలేషన్ల సామర్థ్యం తక్కువగా ఉండటమే ఇందుకు కారణం. పరిశ్రమ విద్యుత్ అవసరాలను తీర్చడంలో బొగ్గు కీలకపాత్ర పోషిస్తోంది. 40 శాతం అవసరాలను తీరుస్తోంది. → రాబోయే రోజుల్లో విద్యుదుత్పత్తి, ఇంధనాలకు సంబంధించి భారత్ పలు సవాళ్లు ఎదుర్కొనాల్సి రావచ్చు. శిలాజ ఇంధనాల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలి. వంటకోసం పర్యావరణహితమైన ఇంధనాన్ని సమకూర్చాలి. విద్యుత్ రంగం విశ్వసనీయతను పెంచాలి. వాయు కాలుష్య స్థాయిని నియంత్రించాలి. వాతావరణంలో పెనుమార్పుల కారణంగా వడగాలులు, వరదల్లాంటి ప్రభావాలను కట్టడి చేయడంపై దృష్టి పెట్టాలి. → భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది. 2030 నాటికి ఆయిల్ డిమాండ్ తారస్థాయికి చేరుతుంది. (ఆ తర్వాత నుంచి తగ్గుముఖం పట్టొచ్చు). పరిశ్రమల్లో విద్యుత్, హైడ్రోజన్ వినియోగం క్రమంగా పెరగనున్న నేపథ్యంలో బొగ్గుకు కూడా డిమాండ్ 2030 నాటికి గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. → 2, 3 వీలర్లకు సంబంధించి భారత్ ప్రపంచంలోనే అతి పెద్ద మార్కెట్లలో ఒకటి కాగా, ప్యాసింజర్ కార్ల మార్కెట్ విభాగంలో నాలుగో స్థానంలో ఉంది. → వచ్చే దశాబ్ద కాలంలో భారత్‌లో కొత్తగా 3.7 కోట్ల పైచిలుకు కార్లు, 7.5 కోట్ల పైగా 2,3 వీలర్లు రోడ్లపైకి రానున్నాయి. వీటిలో ఎలక్ట్రిక్ వాహనాల వాటా పెరుగుతున్నప్పటికీ, ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ వాహనాలూ వృద్ధి చెందుతాయి కనుక రహదారి రవాణా విభాగం విషయంలో చమురుకు డిమాండ్ 40 శాతం పెరుగుతుంది. దేశీయంగా ప్రతి రోజూ 12,000 కార్లు రోడ్లపైకి రానుండటంతో రహదార్లపరంగా మౌలిక సదుపాయాలను మరింతగా మెరుగుపర్చుకోవాల్సి ఉంటుంది. వాహనాల వల్ల వాయు కాలుష్యం మరింత తీవ్రమవుతుంది. 2035 నాటికి రోడ్ మార్గంలో ప్రయాణికుల రవాణా రద్దీ వల్ల కర్బన ఉద్గారాలు 30 శాతం పెరుగుతాయి. -
ప్రజలకు విద్యుత్ చార్జీల షాక్
సాక్షి, అమరావతి: అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచబోమని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కూటమి.. ప్రభుత్వంలోకి వచ్చి నాలుగు నెలలు కాకముందే మాట తప్పి రాష్ట్ర ప్రజలపై రూ.8,100 కోట్ల భారం మోపేందుకు సిద్ధమైంది. వంద రోజుల పాలన పూర్తి చేసుకున్నందుకు కానుకగా ప్రజలపై విద్యుత్ చార్జీల పిడుగు వేస్తోంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఇంధన, విద్యుత్ కొనుగోలు ఖర్చు సర్దుబాటు (ఎఫ్‌పీపీసీఏ) చార్జీల ప్రతిపాదనలను సిద్ధం చేశాయి. వాటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీ ఈఆర్సీ)కి సమరి్పంచాయి. ఆ ప్రతిపాదనలపై ఈ నెల 18న బహిరంగ విచారణను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించనున్నట్లు ఏపీ ఈఆర్సీ సోమవారం వెల్లడించింది.ఈ చార్జీలు, ప్రతిపాదనలపై ఎవరికైనా అభ్యంతరాలుంటే ఈ విచారణలో తెలపాలని కోరింది. అలాగే ఆన్లైన్ సూచనలు, అభ్యంతరాలను ఈనెల 14వ తేదీలోగా కమిషన్ చిరుమానాకు పోస్టు ద్వారాగానీ, ఈ–మెయిల్ ద్వారాగానీ పంపాలని కోరింది. అయితే.. ఈ విచారణ నామమాత్రమే. డిస్కంలు ప్రతిపాదించిన మేరకు చార్జీలు వసూలు చేసుకునేందుకు మండలి అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. ఎఫ్‌పీపీసీఏ చార్జీలు ఒక్కో డిస్కంలోనూ ఒక్కో విధంగా ఉండనున్నాయి. వాటికి ప్రసార, పంపిణీ నష్టాలు(టీఆండ్‌డి)లను కూడా డిస్కంలు కలిపాయి. డిస్కంలలో ఈ నష్టాలు 7.99 శాతం నుంచి 10.90 వరకూ ఉన్నాయి. ఈ రెండూ కలిపి చార్జీల రూపంలో అమల్లోకి వస్తే ఒక్కో వినియోగదారునిపైనా నాలుగు త్రైమాసికాలకు కలిపి యూనిట్‌కు రూ.4.14 నుంచి రూ.6.69 వరకూ భారం పడనుంది.చంద్రబాబు పచ్చి మోసం సూపర్ సిక్స్ హామీలను తుంగలో తొక్కి ఇప్పటికే ప్రజలను మోసం చేసిన చంద్రబాబు మరో హామీని తుంగలో తొక్కారు. గత ప్రభుత్వం విద్యుత్ చార్జీలను పెంచకపోయినా పెంచేసినట్టు తప్పుడు ప్రచారం చేశారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు విద్యుత్ చార్జీలనూ పెంచబోమని ప్రకటించారు. చివరకు ఎప్పటిలాగానే ఏరుదాటాక తెప్ప తగలేసిన చందంగా విద్యుత్ వినియోగదారులకు చార్జీలు పెంచుతున్నారు. ఇదే చంద్రబాబు గతంలో సీఎంగా ఉన్నప్పుడు ఏపీ ఈఆర్సీని తప్పుదోవ పట్టించారు.డిస్కంలు ఇంధన సర్దుబాటు చార్జీలను సమరి్పంచకుండా అడ్డుకున్నారు. దాంతో ఆ తరువాత వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఆ భారం పడింది. అప్పటికే డిస్కంలు రూ.వేల కోట్ల అప్పుల్లోకి వెళ్లిపోయాయి. చంద్రబాబు హయాంలో వసూలు చేయని ట్రూ అప్ చార్జీలను డిస్కంలు వసూలు చేసుకుంటే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచేస్తోందంటూ తప్పుడు ప్రచారం చేశారు. అదే చంద్రబాబు ఇప్పుడు ఇచ్చిన మాట తప్పి.. ప్రజలపై సర్దుబాటు పేరిట చార్జీల పిడుగు వేస్తున్నారు. -
విద్యుత్‌కు భారీ డిమాండ్
న్యూఢిల్లీ: విద్యుత్‌కు దేశంలో డిమాండ్ ఏటా భారీగా పెరుగుతోంది. గడిచిన దశాబ్ద కాలంలో ఏటా 11 గిగావాట్ల చొప్పున డిమాండ్ పెరగ్గా.. వచ్చే ఆరేళ్ల పాటు ఏటా 15 గిగావాట్ల మేర అధికం అవుతుందని కేంద్ర విద్యుత్ శాఖ అదనపు సెక్రటరీ శ్రీకాంత్ నాగులపల్లి తెలిపారు. సుమారు 40 గిగావాట్లు స్టోరేజ్ రూపంలో ఉంటుందన్నారు. ‘‘2030 నాటికి రోజులో సూర్యరశ్మి ఎక్కువగా ఉండే సమయంలో (సోలార్ హవర్స్) అదనంగా 85 గిగావాట్ల విద్యుత్ డిమాండ్ తోడవుతుంది. అదే నాన్ సోలార్ హవర్స్‌లో 90 గిగావాట్ల గరిష్ట డిమాండ్ నమోదవుతుంది’’అని శ్రీకాంత్ వెల్లడించారు. 2030 నాటికి స్టోరేజ్ సామర్థ్యంపై ఆధారపడే పరిస్థితి వస్తుందన్నారు. సోలార్ హవర్స్‌లో నిల్వ చేసిన విద్యుత్‌ను, నాన్ సోలార్ హవర్స్‌లో వినియోగించుకోవచ్చన్నారు. ఐఈఈఎంఏ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. బొగ్గు ఆధారిత విద్యుత్ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచడంతోపాటు, సోలార్, పవన (విండ్), స్టోరేజ్, ప్రసారం సామర్థ్యాల విస్తరణ కూడా చేపడుతున్నట్టు చెప్పారు. 300 గిగావాట్ల లక్ష్యం.. 2030 నాటికి శిలాజ ఇంధనేతర మార్గాల ద్వారా (పునరుత్పాదక/పర్యావరణ అనుకూల) 500 గిగావాట్ల విద్యుత్ సామర్థ్యాన్ని కేంద్ర సర్కారు లక్ష్యంగా పెట్టుకోవడం గమనార్హం. ఇప్పటికే పునరుత్పాదక ఇంధన వనరుల రూపంలో 200 గిగావాట్ల విద్యుత్ సామర్థ్యాన్ని సాధించినట్టు శ్రీకాంత్ వెల్లడించారు. వచ్చే ఐదేళ్లలో మరో 300 గిగావాట్ల సామర్థ్యం ఆచరణలోకి వస్తుందన్నారు. ఇందులో 225 గిగావాట్లు కేవలం సోలార్, పవన విద్యుత్ రూపంలో ఉంటుందని తెలిపారు. సోలార్ సామర్థ్యం దండిగా ఉన్న రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్ ప్రాంతాలతో కూడిన ఆర్ఈ జోన్లలో సామర్థ్యం ఎక్కువగా వస్తుందన్నారు. గుజరాత్, తమిళనాడు తీరాల్లో ఆఫ్‌షోర్ (సముద్ర జలాలు) విండ్ ఫార్మ్‌లు, ఒడిశా, గుజరాత్, తమిళనాడు తీరాల్లో గ్రీన్ హైడ్రోజన్ సామర్థ్యాల ఏర్పాటు ప్రణాళికలను సైతం వెల్లడించారు. ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీలు), డేటా కేంద్రాల రూపంలోనూ విద్యుత్‌కు డిమాండ్ గణనీయంగా పెరగబోతోందన్నారు. దేశం మొత్తాన్ని ఒకే ఫ్రీక్వెన్సీతో నడిచే ఒకే గ్రిడ్‌తో అనుసంధానించడం వల్ల 170 గిగావాట్ల విద్యుత్‌ను, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సరఫరా చేయొచ్చన్నారు. పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్టులు, బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టులను ప్రోత్సహిస్తున్నట్టు శ్రీకాంత్ వెల్లడించారు. ‘‘40 గిగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్(బీఈఈఎస్)ను, 19 గిగావాట్ల పీఎస్పీ సామర్థ్యాన్ని ఆరేళ్లలో సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు చెప్పారు. -
పెరుగుతున్న సౌర విద్యుత్ సామర్థ్యం
పునరుత్పాదక ఇందన వనరులను అభివృద్ధి చేసేందుకు భారత ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగా సోలార్ ఎనర్జీకి ప్రాధాన్యం ఇస్తోంది. ఈ రంగంలో తయారీ ప్లాంట్లు ఊపందుకుంటున్నాయి. ఫలితంగా సమగ్ర ఎనర్జీ సామర్థ్యం పెరుగుతోంది. 2024 జులై నెలలో 1,733.7 మెగావాట్ల కెపాసిటీ కలిగిన సోలార్ ఎనర్జీను ఉత్పత్తి చేశారు. దాంతో మొత్తం దేశీయంగా తయారయ్యే స్థాపిత సౌర విద్యుత్ సామర్థ్యం 87.2 గిగావాట్లకు చేరింది.2025 ఆర్థిక సంవత్సరం జులైలో 5,394 మెగావాట్ల సోలార్ ఎనర్జీ తయారవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ అనుకున్న విధంగానే జరిగితే రానున్న ఏడాది మొత్తంగా రికార్డుస్థాయిలో 30-35 గిగావాట్ల సౌర విద్యుత్ తోడవుతుందని చెబుతున్నారు. 2030 వరకు ఇండియాలో 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దానికోసం ఏటా సుమారు 44 గిగావాట్లు సామర్థ్యం కలిగిన విద్యుత్‌ను తయారు చేయాల్సి ఉంటుంది. అందుకోసం 2030 వరకు దాదాపు రూ.16 లక్షల కోట్ల(200 బిలియన్ డాలర్లు) పెట్టుబడులు అవసరం అవుతాయని అంచనా. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2024 బడ్జెట్లో ‘సూర్య ఘర్’ పథకంలో భాగంగా కోటి ఇళ్లలో సోలార్ ఎనర్జీ వాడేలా ఏర్పాట్లు చేస్తామని మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. దానికోసం ప్రభుత్వం 40 శాతం వరకు సబ్సిడీ ఇస్తుందని ప్రకటించారు.ఇదీ చదవండి: ‘ప్రైమ్ కేటగిరీ’లో రూ.11 లక్షల వరకు జీతం -
3,000 అడుగుల ఎత్తయిన విద్యుత్ భవనం!
అత్యంత ఎత్తయిన ఆకాశ హర్మ్యాల నిర్మాణం కొత్తేమీ కాదు. అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్, విల్లీస్ టవర్, దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా వంటివి ఎత్తయిన భవనాలుగా గుర్తింపు పొందాయి. అయితే ఇవన్నీ నివాసాలు, కార్యాలయాలే. వాటిని తలదన్నేలా 3,000 అడుగుల (914.4 మీటర్లు) ఎత్తయిన భవనాన్ని నిర్మించనున్నట్టు స్కిడ్మోర్, ఒవింగ్స్ అండ్ మెరిల్ (ఎస్ఓఎం) కంపెనీ ప్రకటించింది. నివాసానికే గాక విద్యుత్ నిల్వకు కూడా వీలు కల్పించడం దీని ప్రత్యేకత. ఇందుకోసం విద్యుత్ స్టోరేజీ కంపెనీ ‘ఎనర్జీ వాల్ట్’తో ఒప్పందం చేసుకుంది. విద్యుత్‌ను నిల్వచేసే బ్యాటరీలాగా ఇది పని చేస్తుందని కంపెనీ పేర్కొంది. భవనం వెలుపలి భాగంలో అమర్చే ఫలకాల్లో విద్యుత్‌ను నిల్వ చేస్తారు. దాన్ని అవసరమైనప్పుడు ఉపయోగించుకుంటారు. ఈ భవనాన్ని ఎక్కడ నిర్మించాలన్నది ఇంకా ఖరారు చేయలేదు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
‘విద్యుత్’ కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ మదన్ బి.లోకూర్
సాక్షి, హైదరాబాద్: గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో జరిగిన విద్యుత్ నిర్ణయాలపై ఏర్పాటైన విచారణ కమిషన్‌కు కొత్త చైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి.లోకూర్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అనూహ్య పరిణామాల నేపథ్యంలో విచారణ కమిషన్ బాధ్యతల నుంచి తప్పుకున్న జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి స్థానంలో ఆయన్ను నియమిస్తూ రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్ రాస్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. విచారణ నిర్వహించి నివేదిక సమరి్పంచడానికి ప్రభుత్వం జస్టిస్ లోకూర్‌కు 3 నెలల గడువును విధించింది.జస్టిస్ లోకూర్ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, గౌహతి హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తిగా కూడా వ్యవహరించారు. కాగా, నామినేషన్ల ప్రాతిపదికన యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణాన్ని బీహెచ్ఈఎల్ సంస్థకు అప్పగించడంతోపాటు ఛత్తీస్‌గఢ్‌తో 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోళ్లకు ఒప్పందం కుదుర్చుకోవడంపై పట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి అధ్యక్షతన విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గత మార్చి 14న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.ఈ మూడు నిర్ణయాల్లో చోటుచేసుకున్న అవకతవకతలపై విచారణ జరిపి రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని నిర్ధారించాలని, అందుకు బాధ్యులైన వారిని గుర్తించాలని ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించింది. ఇప్పుడు ఇదే మార్గదర్శకాలు జస్టిస్ లోకూర్ కమిషన్‌కు కూడా వరిస్తాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నిర్ణయాల్లో పాత్ర ఉన్న మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, ట్రాన్స్‌కో, జెన్కో మాజీ సీఎండీ డి.ప్రభాకర్ రావు, ఇంధన శాఖ కార్యదర్శులు, ఇతర అధికారులకు జస్టిస్ నరసింహా రెడ్డి గతంలో నోటీసులు జారీ చేసి వారి నుంచి రాతపూర్వకంగా వాంగ్మూలాన్ని స్వీకరించారు.విచారణ ప్రక్రియను దాదాపుగా పూర్తి చేసి నివేదికను సైతం రూపొందించారు. ఈ క్రమంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఓ సందర్భంలో జస్టిస్ నరసింహా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చేసిన వాŠయ్‌ఖ్యలను కారణంగా చూపుతూ విచారణ కమిషన్‌ను రద్దు చేయాలని కేసీఆర్ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించగా, జూలై 1న కేసును కొట్టివేస్తూ హైకోర్టు తీర్పునిచి్చంది.హైకోర్టు తీర్పును కేసీఆర్ సుప్రీంకోర్టులో సవాలు చేయగా, జస్టిస్ నరసింహారెడ్డిని మార్చి విచారణను యథావిధిగా కొనసాగించవచ్చని ఈ నెల 16న మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ మదన్ బి.లోకూర్‌ను నియమించడంతో విద్యుత్ నిర్ణయాలపై విచారణ ప్రక్రియ పునఃప్రారంభం కానుంది. -
'పవర్' ప్రకంపనలు
సాక్షి, హైదరాబాద్: ‘విద్యుత్’ పద్దుపై సోమవారం అసెంబ్లీలో జరిగిన చర్చ ప్రకంపనలు రేపింది. అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం, సవాళ్లు– ప్రతిసవాళ్లు, ఆరోపణలు– ప్రత్యారోపణలు, రాజీనామా డిమాండ్లతో సభ అట్టుడికింది. అదే సమయంలో ఇరుపక్షాల నేతల మధ్య వ్యక్తిగత దూషణలూ చోటుచేసుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఏడాది విద్యుత్ రంగానికి బడ్జెట్లో నిధుల కేటాయింపుపై సోమవారం శాసనసభలో చర్చ జరిగింది. కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చర్చను ప్రారంభించారు. గత ప్రభుత్వ విధానాల వల్లే విద్యుత్ రంగం నష్టాల్లోకి వెళ్లిందని ఆక్షేపించారు. విద్యుత్ కొనుగోళ్లలో భారీ అవినీతి జరిగిందని, ఆ కథంతా వెలికి తీస్తామని పేర్కొన్నారు. అనంతరం బీఆర్ఎస్ సభ్యుడు జగదీశ్‌రెడ్డి మాట్లాడారు. తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తిని పెంచామంటూ పలు గణాంకాలను వివరించారు. అవినీతి అంటూ కాంగ్రెస్ సర్కారు కక్షపూరితంగా రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. ఈ దశలో సీఎం రేవంత్ జోక్యం చేసుకున్నారు. బీఆర్ఎస్ హయాంలోని విద్యుత్ ఒప్పందాలన్నీ అవినీతిమయమంటూ తీవ్రంగా మండిపడ్డారు. దీనికి కౌంటర్‌గా జగదీశ్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రతిగా సీఎం రేవంత్, మంత్రి కోమటిరెడ్డి ఇద్దరూ వ్యక్తిగత ఆరోపణలతో విరుచుకుపడ్డారు. ఈ సమయంలో ఇరుపక్షాల సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో శాసనసభ దద్దరిల్లింది. -
ఎన్టీపీసీ విద్యుత్తు తెలంగాణకు అక్కర్లేదా?
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం ద్వారా రాష్ట్ర ప్రజలకు వీలైనంత ఎక్కువ కరెంట్‌ను అందుబాటులో ఉంచాలనుకుంటున్న కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలకు రాష్ట్ర సర్కారు సహకరించడం లేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఎన్నిసార్లు లేఖలు రాసినా తెలంగాణ సర్కారు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ మేరకు ఆదివారం ఆయన పలు దఫాలుగా కేంద్రం, తెలంగాణ ప్రభుత్వానికి రాసిన లేఖల వివరాలను ఒక ప్రకటనలో వెల్లడించారు.పెద్దపల్లి జిల్లా రామగుండంలో సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటుచేసి 4 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తిని చేపట్టే ప్రాజెక్టుకు ప్రధాని మోదీ ఆమోదముద్ర వేశారని గుర్తుచేశారు. ‘దేశవ్యాప్తంగా విద్యుత్‌కు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో.. ఎస్టీపీపీ–2 ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తిచేసి విద్యుదుత్పత్తిని పెంచాలనేది కేంద్ర ప్రభుత్వం ఆలోచన. దీనికి అనుగుణంగా పీపీఏ విషయంలో త్వరగా స్పందించి సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి 4 సార్లు లేఖలు రాసినా జవాబు రాలేదు’అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.రాష్ట్రం స్పందించని పక్షంలో ఈ ప్రాజెక్టు ఇతర రాష్ట్రాలకు తరలిపోయే ప్రమాదం ఉందన్నారు. ‘గత మేనెల 30న దేశవ్యాప్తంగా 250 గిగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. అలాగే మార్చి 2024లో తెలంగాణలో గరిష్టంగా (పీక్ పవర్ డిమాండ్) 15.6 గిగావాట్ల డిమాండ్ ఎదురైంది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) అంచనాల ప్రకారం.. 2030 నాటికి తెలంగాణలో పీక్ పవర్ డిమాండ్ ఇప్పుడున్న దానికి రెట్టింపు కానుంది.దీనిని దృష్టిలో ఉంచుకుని పెరుగుతున్న పరిశ్రమలు, గృహ అవసరాలకు నిరంతరాయంగా విద్యుత్‌ను అందించేందుకు.. రెండోదశ ఎన్టీపీసీ పవర్ ప్లాంట్‌ను వీలైనంత త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావడం అత్యంత అవసరముంది. తెలంగాణలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌పై తొలి హక్కు రాష్ట్ర ప్రజలదే. కేంద్రం అన్నిరకాలుగా సహకరిస్తున్నా, దానిని అందుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా విఫలమైందని మరోసారి నిరూపితమైంది’అని కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో స్పందించాలని సూచించారు. -
కాలుష్యరహిత చౌక విద్యుత్!
సాక్షి, హైదరాబాద్: కాలుష్య రహిత కరెంటు.. అది కూడా కారు చౌకగా దొరికితే ఎలా ఉంటుంది? బాగుంటుంది కదూ..ఇలాంటి టెక్నాలజీ ఇప్పటివరకు ఏదీ లేదు. కానీ ఇకపై ఇది సాధ్యమేనంటోంది హైలెనర్! ప్రపంచంలోనే తొలిసారి తాము కోల్డ్ ఫ్యూజన్ టెక్నాలజీ సాయంతో అందించే వేడి కంటే ఎక్కువ వేడిని పొందగలిగామని.. దీనివల్ల భవిష్యత్తులో అనేక ప్రయోజనాలు ఉంటాయని హైలైనర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిద్ధార్థ దొరై రాజన్ చెప్పారు.దీని పూర్వాపరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మనందరికీ వెలుగునిచ్చే సూర్యుడు కోట్ల సంవత్సరాలుగా భగభగ మండుతూనే ఉన్నాడు. విపరీతమైన వేడి, పీడనాల మధ్య హీలియం అణువులు ఒకదాంట్లో ఒకటి లయమై పోతుండటం వల్ల ఈ వెలుగు సాధ్యమవుతోంది. ఈ ప్రక్రియను కేంద్రక సంలీన ప్రక్రియ లేదా న్యూక్లియర్ ఫ్యూజన్ అంటారని చిన్నప్పుడు చదువుకున్నాం.ఇదే ప్రక్రియను భూమ్మీద నకలు చేయడం ద్వారా చౌక, కాలుష్య రహిత విద్యుత్తు ఉత్పత్తికి బోలెడన్ని ప్రయోగాలు జరుగుతున్నాయి. అయితే ఇవి ఎంతవరకు విజయవంతమవుతాయన్నది ఇప్పటికీ ప్రశ్నార్థకమే. ఈ నేపథ్యంలో హైలెనర్ ప్రతిపాదిస్తున్న ‘లో ఎనర్జీ న్యూక్లియర్ రియాక్షన్’ టెక్నాలజీ ఆసక్తి రేకెత్తిస్తోంది. గది ఉష్ణోగ్రతలోనే.. న్యూక్లియర్ ఫ్యూజన్‌కు విపరీతమైన వేడి, పీడనాలు అవసరమని ముందే చెప్పుకున్నాం కదా..అయితే ‘లో ఎనర్జీ న్యూక్లియర్ రియాక్షన్’లో వీటి అవసరం ఉండదు. గది ఉష్ణోగ్రతలోనే అణుస్థాయిలో రియాక్షన్స్ జరిగేలా చూడవచ్చు. ఫలితంగా కోల్డ్ ఫ్యూజన్ టెక్నాలజీ సాయంతో అందించే వేడి కంటే ఎక్కువ వేడి అందుబాటులోకి వస్తుంది. హైలెనర్ బుధవారం హైదరాబాద్‌లోని టీ–హబ్‌లో ఈ టెక్నాలజీని ప్రదర్శించింది. వంద వాట్ల విద్యుత్తును ఉపయోగించగా... 150 వాట్లకు సమానమైన శక్తి లభించింది. మిల్లీగ్రాముల హైడ్రోజన్ ఉపయోగంతోనే అదనపు వేడి పుట్టిందని రాజన్ చెప్పారు. టి–హబ్ సీఈవో మహంకాళి శ్రీనివాసరావు ఈ ‘లో ఎనర్జీ న్యూక్లియర్ రియాక్షన్’పరికరాన్ని ఆవిష్కరించారు. 1989 నాటి ఆలోచనే.. హైలెనర్ చెబుతున్న టెక్నాలజీ నిజానికి కొత్తదేమీ కాదు. 1989లో మారి్టన్ ఫైష్‌మాన్, స్టాన్లీ పాన్స్ అనే ఇద్దరు ఎలక్ట్రో కెమిస్ట్‌లు తొలిసారి ఈ రకమైన టెక్నాలజీ సాధ్యతను గుర్తించారు. భారజలంతో పల్లాడియం ఎలక్ట్రోడ్‌ను వాడుతూ ఎలక్ట్రోలసిస్ జరుపుతున్నప్పుడు కొంత వేడి అదనంగా వస్తున్నట్లు వీరు గుర్తించారు. అణుస్థాయిలో జరిగే ప్రక్రియలతో మాత్రమే ఇలా అదనపు వేడి పుట్టే అవకాశముందని వీరు సూత్రీకరించారు. అయితే దీన్ని నిరూపించేందుకు ఇప్పటివరకు చాలా విఫల ప్రయత్నాలు జరిగాయని, తాము విజయం సాధించామని హైలెనర్ అంటోంది. దేశ రక్షణకు అత్యంత కీలకమైన క్షిపణులను అభివృద్ధి చేయడంలో కీలకపాత్ర పోషించిన పద్మశ్రీ ప్రహ్లాద రామారావు ఈ కంపెనీ చీఫ్ ఇన్నొవేటింగ్ ఆఫీసర్‌గా ఉండటం, ఈ టెక్నాలజీకి భారత పేటెంట్ ఇప్పటికే దక్కడం హైలెనర్‌పై ఆశలు పెంచుతున్నాయి.విద్యుత్ ఆదా..ఉత్పత్తివిద్యుత్తు, వేడి అవసరమైన ఎన్నో రంగాల్లో ఈ టెక్నాలజీ ద్వారా లాభం కలగనుంది. అంతరిక్షంలో తక్కువ విద్యుత్తును వాడుకుంటూ ఎక్కువ వేడిని పుట్టించవచ్చు. చల్లటి ప్రాంతాల్లో గదిని వెచ్చగా ఉంచేందుకు ఉపకరిస్తుంది. ఇందుకోసం ఇప్పుడు కాలుష్య కారక డీజిల్ ఇంధనాలను వాడుతున్న విషయం తెలిసిందే. ఇండక్షన్ స్టౌలను మరింత సమర్థంగా పనిచేయించవచ్చు. తద్వారా విద్యుత్తు ఆదా చేయవచ్చు. విద్యుత్తు ఉత్పత్తికీ దీనిని వాడుకోవచ్చు. -
న్యాయవ్యవస్థ గౌరవం కోసమే వైదొలిగా..: జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు వందలాది కమిషన్లు నియమించాయని.. ఏ కమిషన్ ప్రెస్‌మీట్ పెట్టలేదో చెప్పాలని జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి ప్రశ్నించారు. మంగళవారం ‘విద్యుత్’ కమిషన్ బాధ్యతల నుంచి తప్పుకొన్న అనంతరం ఆయన ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఊహాజనిత వార్తలకు అడ్డుకట్ట వేయడానికే తాను మీడియా సమావేశం నిర్వహించాల్సి వచ్చిందని చెప్పారు. తాను మీడియా సమావేశం నిర్వహించకుండా ఉంటే బాగుండేదని సీజేఐ ధర్మాసనం అభిప్రాయపడిందన్నారు. ఏదైనా అంశంపై విచారణ అంటేనే బహిరంగ విచారణ అని అర్ధమని చెప్పారు. ఈ విషయంపై తాను వాదనలు చేయొచ్చని, కానీ ఒక విశ్రాంత న్యాయమూర్తిగా న్యాయవ్యవస్థ గౌరవం కాపాడాలనే ఉద్దేశంతో ఈ అంశం లోతుల్లోకి వెళ్లలేదని వివరించారు. థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి సంబంధించి సూపర్ క్రిటికల్ టెక్నాలజీ కాకుండా సబ్ క్రిటికల్ టెక్నాలజీ వల్ల కాలుష్య ప్రభావం ఉంటుందని అభిప్రాయాలు వచ్చాయని.. దీనిపై విచారణ చేయాల్సి ఉందని మాత్రమే తాను మీడియా సమావేశంలో చెప్పానని వివరించారు. సాధారణంగా కోర్టులో వాదనలు జరుగుతున్న సమయంలో న్యాయమూర్తి కొందరి అభిప్రాయాలతో ఏకీభవించినట్టు కనిపిస్తుందని.. కానీ తుది తీర్పు మాత్రమే పరిగణనలోకి వస్తుందని గుర్తుచేశారు. నోటీసులేమీ ఇవ్వలేదు.. విచారణ అంశానికి సంబంధించి వాంగ్మూలాలు తీసుకోవడం కమిషన్ ఆఫ్ ఎంక్వైరీలో భాగమని జస్టిస్ నరసింహారెడ్డి చెప్పారు. అయినా తానేమీ మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వలేదని, లేఖ రూపంలోనే అభిప్రాయాలు తెలపాలని కోరానని వివరించారు. బీఆర్కేఆర్ భవనంలో జస్టిస్ పినాకి చంద్రఘోష్ కార్యాలయం రోజు విడిచి రోజు ప్రెస్‌మీట్ నిర్వహించడంపై అభ్యంతరాలు ఎందుకు లేవని ప్రశ్నించారు. అక్కడికి వచ్చిన విలేకరులు.. మా కార్యాలయం విషయంలో ఊహాజనిత వార్తలు రాస్తుండటంతో వాటికి అడ్డుకట్ట వేసేందుకే ప్రెస్‌మీట్ పెట్టినట్టు చెప్పారు. కమిషన్ ప్రెస్‌మీట్ నిర్వహించడం తప్పు అయితే చాలా కమిషన్లను కొట్టివేయాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. తన నివేదిక పూర్తి దశకు చేరుకుందని, ప్రభుత్వానికి అందజేద్దామనుకున్నా.. సుప్రీంకోర్టులో కేసు దృష్ట్యా సరికాదని భావించి ఆగానని తెలిపారు. -
‘నాణ్యమైన విద్యుత్‌కు కట్టుబడి ఉన్నాం’
అమరావతి:’రాష్ట్రంలోని అన్ని వర్గాలకు నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ‘మిషన్ లైఫ్’ కార్యక్రమానికి సంబంధించి బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) సలహాదారు చంద్రశేఖర్‌రెడ్డి రూపొందించిన పోస్టర్‌ను సీఎం విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఇళ్లు, పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్తును అందిస్తామని తెలిపారు. ఇంధన సామర్థ్య నిర్వహణకు సాయం చేసే ఉపకరణాల వినియోగంపై ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామని పేర్కొన్నారు -
‘విద్యుత్ కమిషన్’పై సుప్రీంకోర్టుకు కేసీఆర్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం నియమించిన విద్యుత్ కమిషన్‌ను రద్దు చేయాలంటూ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ కేసీఆర్ తరపున న్యాయవాది మోహిత్ రావ్ పిటిషన్ దాఖలు చేశారు.ఇందులో తెలంగాణ ప్రభుత్వం, జస్టిస్ ఎల్.నరసింహారెడ్డిలను ప్రతివాదులుగా చేర్చారు. సోమవారం సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించనుంది. -
ఫోన్ పే, జీపే, పేటీఎం.. ద్వారా విద్యుత్తు బిల్లు చెల్లించకూడదు
ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం..వంటి థర్డ్‌పార్టీ యాప్‌ల ద్వారా ఎలాంటి విద్యుత్తు బిల్లులు చెల్లించకూడదని టీజీఎస్పీడీసీఎల్ తెలిపింది. జులై 1 నుంచి ఈ నిబంధన అమలులోకి వచ్చిందని చెప్పింది. భారతీయ రిజర్వ్ బ్యాంకు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. భవిష్యత్తులో టీజీఎస్పీడీసీఎల్ లేదా ఎస్పీడీసీఎల్ అధికారిక వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా మాత్రమే విద్యుత్తు బిల్లులు చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో వివరాలు వెల్లడించింది.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..‘ఎస్పీడీసీఎల్ పరిధిలో 85 శాతానికి పైగా పవర్ బిల్లు చెల్లింపులు థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ల (టీపీఏపీ) ద్వారానే జరుగుతున్నాయి. ఇందుకోసం కొన్ని యూపీఐ ఆధారిత యాప్‌లను మాత్రమే ఎక్కువగా వినియోగిస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల ప్రకారం..బ్యాంకు యాప్‌లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) ఆధ్వర్యంలోని భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (బీబీపీఎస్)లో నమోదవ్వాలి. కానీ చాలా థర్డ్ పార్టీ యాప్‌లకు సేవలందిస్తున్న బ్యాంకులు ఇంకా ఈ సిస్టమ్‌ను యాక్టివేట్ చేసుకోలేదు. దాంతో సదరు చెల్లింపులను నిలిపేస్తున్నాం’ అని తెలిపారు.Dear Consumers, As per the RBI directions, the Service Providers viz., PhonePe, Paytm, Amazon Pay, Google Pay and Banks have stopped to accept the electricity bills of TGSPDCL w.e.f. 01/07/2024. Hence, all the consumers are requested to make the monthly current bill payments…— TGSPDCL (@tgspdcl) July 1, 2024ఆర్బీఐ నిబంధనలు..జులై 1 నుంచి ఆర్బీఐ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) ఆధ్వర్యంలోని భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (బీబీపీఎస్) ద్వారానే చెల్లింపులు చేయాలని పేర్కొంది. వినియోగదారుల భద్రతకు ప్రాధాన్యం ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. ఇందులో భాగంగా యూపీఐ సేవలందించే బ్యాంకులు బీబీపీఎస్‌ను ఎనేబుల్ చేసుకోవాలి. కానీ ఇప్పటివరకు హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ వంటి ప్రధాన బ్యాంకులు ఈ సిస్టమ్‌ను ఎనేబుల్ చేసుకోలేదు. దానివల్ల ఫోన్‌పే, గూగుల్ పే, అమెజాన్ పే.. వంటి థర్డ్‌పార్టీ యాప్‌ల్లో బిల్లులు చెల్లించలేరు. ఆ యాప్‌ల ద్వారా క్రెడిట్ కార్డుల నుంచి కూడా బిల్లు పేమెంట్ చేయలేరు.ఇదీ చదవండి: హెచ్డీఎఫ్సీ యూపీఐ సేవలు నిలిపివేత.. ఎప్పుడంటే..ఇదిలాఉండగా ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ బ్యాంకులు బీబీపీఎస్ ప్లాట్ఫామ్లో నమోదయ్యాయి. కాబట్టి పైన తెలిపిన బ్యాంక్ కస్టమర్లు థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా చెల్లింపులను కొనసాగించవచ్చు. -
బోనాల ఉత్సవాలకు నిరంతర విద్యుత్
హైదరాబాద్, సాక్షి: నగరంలో బోనాల సందర్భంగా నిరంతరాయంగా, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని.. ప్రముఖ ఆలయాల వద్ద పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం సీజీఎంలు, ఎస్ఈలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. జులై 2 నాటికి సంబంధిత సీఈలు/ఏస్ఈలు ఆలయ ప్రాంగణాలను సందర్శించి 24 గంటల విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతీ దేవాలయానికి ఒక నోడల్ అధికారి/ఏఈని కేటాయించాలన్నారు. ఆర్అండ్బీ, ఆలయ కమిటీలతో సమన్వయం చేసుకోవడంతో పాటు డీటీఆర్లు, అదనపు లైట్లు, ఎయిర్ కండిషనింగ్, సౌండ్ సిస్టంకు తగినట్లు విద్యుత్ లోడ్ ఉండేలా ఏర్పాట్లు చేయాలన్నారు. అవసరమైన చోట ప్రత్యామ్నాయ సామగ్రిని సమకూర్చుకోవాలన్నారు. ప్రజలు గుమిగూడే చోట విద్యుత్ స్తంభాలు షాక్ కొట్టకుండా ముందే చెక్ చేయాలన్నారు. విద్యుత్ లీకేజీలను పూర్తిగా అరికట్టాలన్నారు. అన్ని పంపిణీ కేంద్రాల్లోనూ టంగ్ టెస్టర్ ద్వారా ఎర్తింగ్‌ను చెక్ చేయడంతో పాటు ప్రతి గంటకోసారి రీడింగ్ తీసుకోవాలన్నారు. సమావేశంలో ఇన్చార్జి డైరెక్టర్లు నందకుమార్, డాక్టర్ నర్సింహులు, సీజీఎంలు కె.సాయిబాబా, ఎల్.పాండ్య, వి.శివాజీ, పి.భిక్షపతి, పి.ఆనంద్, కృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
SC STల ఉచిత కరెంటు కట్.. రేషన్ పంపిణీ నిలిపివేత..
-
కమిషన్ నుంచి తప్పుకోండి: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ అంశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ విచారణలో నిష్పాక్షికత కనిపించడం లేదని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆరోపించారు. విచారణ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా వైదొలగాలని కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డికి విజ్ఞప్తి చేశారు. రాజకీయ కక్షతో గత ప్రభుత్వాన్ని, తనను అప్రతిష్ట పాలు చేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేసిందని విమర్శించారు. ఈ మేరకు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ జస్టిస్ నరసింహారెడ్డికి శనివారం సుదీర్ఘ లేఖ రాశారు. ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు, యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై వివరణ ఇవ్వాలని కేసీఆర్‌ను గతంలో ఎంక్వైరీ కమిషన్ కోరింది. దీనికి కమిషన్ ఇచ్చిన గడువు శనివారంతో ముగుస్తున్న నేపథ్యంలో కేసీఆర్ ఈ లేఖ రాశారు. అందులో పేర్కొన్న వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘విద్యుత్ రంగంలో గణనీయ మార్పు చూపించిన మా ప్రయత్నాన్ని తక్కువ చేసి చూపించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. విచారణ కమిషన్ చైర్మన్‌గా మీడియా సమావేశంలో మీరు (జస్టిస్ నరసింహారెడ్డి) ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం నాకెంతో బాధ కలిగించింది. మీ పిలుపు మేరకు లోక్‌సభ ఎన్నికల తర్వాత 2024 జూన్ 15లోగా నా అభిప్రాయాలను మీకు సమర్పించాలని అనుకున్నాను. కానీ ఒక ఎంక్వైరీ కమిషన్ సంప్రదాయాలకు విరుద్ధంగా, విచారణ పూర్తికాక ముందే మీరు మీడియా సమావేశం పెట్టి నా పేరును ప్రస్తావించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో నేను వ్యవధి అడిగితే దాన్ని కూడా ఏదో దయతలచి ఇచ్చినట్టు మాట్లాడటం నాకెంతో బాధ కలిగించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి రిటైరైనప్పటికీ మీ తీరు సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఉంది. విచారణ పూర్తికాక ముందే తీర్పు ప్రకటించినట్టుగా మీ మాటలున్నాయి. మీ విచారణలో నిష్పాక్షికత ఎంత మాత్రం కనిపించడం లేదు. అందువల్ల ఇప్పుడు నేను మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని స్పష్టమవుతున్నది. చట్టవిరుద్ధంగా ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు.. విచారణ ఒక పవిత్రమైన బాధ్యత, మధ్యవర్తిగా నిలిచి నిజాన్ని నిగ్గుతేల్చాల్సిన విధి. అన్ని విషయాలను సమగ్రంగా పరిశీలించి పూర్తి నిర్ధారణకు వచ్చిన తర్వాత, డాక్యుమెంటరీ సాక్ష్యాలతో బాధ్యులకు మాత్రమే నివేదిక ఇవ్వాల్సిన గురుతరమైన పని. కానీ మీ వ్యవహారశైలి అలా లేదని చెప్పేందుకు చింతిస్తున్నాను. ఎంక్వైరీ కమిషన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్టు ఇవ్వాలనే అభిప్రాయంతోనే మీరు మాట్లాడుతున్నట్టు స్పష్టమవుతోంది. ఇప్పటికే తప్పు జరిగిందని, తద్వారా జరిగిన ఆర్థిక నష్టాన్ని లెక్కించడం మాత్రమే మిగిలి ఉందన్నట్టుగా మీ మాటలు ఉంటున్నాయి. రాష్ట్రంలో జరిగిన రాజకీయ మార్పులతో సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్‌రెడ్డి.. గత ప్రభుత్వానికి దురుద్దేశాలు ఆపాదిస్తూ అసెంబ్లీలో విడుదల చేసిన శ్వేతపత్రాలపై చర్చలు కూడా జరిగాయి. అంతటితో ఆగకుండా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ సంస్థలు వెలువరించిన తీర్పులపై విచారణ జరపకూడదనే ఇంగితం లేకుండా రేవంత్‌రెడ్డి ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేశారు. హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన మీరు ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చట్టవిరుద్ధమని సూచించకుండా బాధ్యతలు స్వీకరించడం విచారకరం. అయినా చట్టవిరుద్ధంగా విచారణ ప్రారంభించి జూన్ 11న మీడియా సమావేశంలో మీరు అసంబద్ధ వ్యాఖ్యలు చేశారు. విచారణ అర్హత కోల్పోయారు.. విరమించుకోండి భద్రాద్రి పవర్ ప్లాంటును రెండేళ్లలో పూర్తి చేస్తామనే బీహెచ్ఈఎల్ లిఖిత పూర్వక హామీ మేరకు పనులు అప్పగించాం. ఎన్జీటీ స్టే, కరోనాతో కలిగిన అంతరాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఆలస్యానికి ప్రభుత్వానిదే బాధ్యత అన్నట్టుగా మీరు మాట్లాడారు. ఉభయ రాష్ట్రాల మధ్య ఒప్పందాలను ఎస్ఈఆర్సీ పరిశీలించకూడదని, అందులో ఏదో తప్పు జరిగిందనే భావన కలిగేలా మాట్లాడారు. న్యాయ నిపుణులైన మీరు చట్టాల్లో పొందుపరచబడిన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోకుండా న్యాయ ప్రాధికార సంస్థలపై వ్యాఖ్యానాలు చేశారు. దీంతో ఈ వ్యవహారంపై మీరు విచారణార్హత కోల్పోయినందున ఈ బాధ్యతల నుంచి విరమించుకోవాలి. తమిళనాడు, కర్నాటక టెండర్ పద్ధతిలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకున్న మొత్తంతో పోలిస్తే ఛత్తీస్‌గఢ్ నుంచి నామినేషన్ పద్ధతిలో తెలంగాణ కొనుగోలు చేసిన యూనిట్ విద్యుత్ ధర తక్కువ. కానీ ఎక్కువ ధర చెల్లించారని మీరు చెప్పినందున విచారణ అర్హత కోల్పోయారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలన్నీ (పీపీఏ) ప్లాంట్ల నిర్మాణం ప్రారంభించడానికి ముందే జరుగుతాయన్న వాస్తవాన్ని విస్మరించారు. భద్రాద్రి సబ్ క్రిటికల్ థర్మల్ స్టేషన్ నిర్మాణం విజయవంతంగా పూర్తి చేసినా అప్పటి ప్రభుత్వం ఏదో తప్పు చేసిందనే దురుద్దేశాలు ఆపాదించారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటు నిర్మాణానికి ప్రాంతీయ మౌలిక సదుపాయాల సమతుల్యత, ఆర్థికాభివృద్ధి, లోడ్ డి్రస్టిబ్యూషన్, విద్యుత్ సరఫరా నష్టాలు తగ్గించడం, విపత్తుల నివారణ (డీ రిస్కింగ్) అనేవి కూడా ప్రధాన ప్రాతిపదికలుగా ఉంటాయనే వాస్తవాన్ని విస్మరించారు. ప్రాజెక్టు సకాలంలో పూర్తికాలేదని చెప్పడం అసమంజసం.గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ధోరణిజస్టిస్ నరసింహారెడ్డిగారూ.. మీరు కూడా తెలంగాణ బిడ్డ. 2014కు ముందు తెలంగాణలో కరెంటు పరిస్థితి ఎట్లుండేదో, తర్వాత ఎట్లున్నదో అందరితోపాటు మీకూ తెలుసు. చీకటి రోజుల గతాన్ని వెలుగు జిలుగుల భవిష్యత్తుగా మార్చడానికి అప్పటి ప్రభుత్వం ఏం చేసిందో మీరు కూడా చూశారు. అయినా మీ పరిధి దాటి వ్యవహరించి మాట్లాడటం గత ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే మీ ధోరణికి నిదర్శనంగా కనిపిస్తోంది. తెలంగాణ నిర్ణయాన్ని ఎలాగైనా తప్పుబట్టాలనే తీరులో మీరు కనిపిస్తున్నారు. అందువల్ల విచారణ కమిషన్ చైర్మన్ బాధ్యతల్లో మీరు ఉండటం ఎంత మాత్రం సమంజసం కాదు. స్వచ్ఛందంగా విరమించుకోండి’’ అని కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు. -
సాక్షి టీవీ ఎఫెక్ట్.. ఉరుకొచ్చిన అధికారులు
-
వాస్తవ ఖర్చులే ట్రూ అప్ చార్జీలు
సాక్షి, అమరావతి: ట్రూ అప్ చార్జి.. ప్రతి నెలా కరెంటు బిల్లు రాగానే అందులో ఈ చార్జీని చూసి సంబంధం లేని ఏదో చార్జీ వేసేశారని భావిస్తుంటారు. ఈ అమాయకత్వాన్నే ఆసరా చేసుకుని ప్రతిపక్షాలు, కొన్ని పచ్చ పత్రికలు ప్రభుత్వంపై బురద జల్లుతున్నాయి. వాస్తవానికి ట్రూ అప్ అంటే వేరే ఖర్చులు కాదు. వినియోగదారులకు సంబంధం లేనివి అంతకన్నా కాదు. విద్యుత్ కొనుగోలు చేసి సరఫరా చేసేందుకు పెట్టిన వాస్తవ ఖర్చులే అవి. అది కూడా ఆంధ్రప్రదేశ్ విదుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) అనుమతించినవే.ప్రతి ఏటా విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు వినియోగదారులపై విధించే చార్జీలను ఏపీఈఆర్సీనే నిర్ణయిస్తుంది. ఆ ఏడాది యూనిట్‌కు ఎంత వసూలు చేయాలని ఈఆర్సీ చెబితే అదే రేటును డిస్కంలు వసూలు చేయాలి. కానీ, బహిరంగ మార్కెట్లో ప్రతి రోజూ కొనే విద్యుత్‌కు అదనంగా ఖర్చవుతుంటుంది. ఉదాహరణకు ఈఆర్సీ అనుమతించిన రేటు రూ.6 అయితే కొన్న రేటు రూ.8 అయితే, పైన పడిన రూ.2 భారాన్ని కొనుగోలు సమయంలో డిస్కంలు పవర్ ఫైనాన్స్ సంస్థల నుంచి అప్పులు తెచ్చి కట్టేస్తుంటాయి. ఆ అప్పులు తీర్చడం కోసం రూ.2 తో కొన్న విద్యుత్‌ను వినియోగదారులకే అందించినందున ఆ ఖర్చును వారి నుంచి వసూలు చేసుకునేందుకు అనుమతించాలని డిస్కంలు ఏపీఈఆర్సీని కోరుతుంటాయి. దీనినే ట్రూ అప్ చార్జీగా పిలుస్తున్నారు.ఖర్చు చేసినంతా కాదుడిస్కంలు నివేదికలో ఇచ్చిన మొత్తాన్ని యథాతధంగా ఆమోదించాలని లేదు. ఏపీఈఆర్సీ బహిరంగ విచారణ చేపట్టి, ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరించి, అన్ని అంశాలనూ పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటుంది. 2014–15 నుంచి 2018–19 ఆర్థిక సంవత్సరాలకు దాదాపు రూ.7,200 కోట్లు అదనపు వ్యయం జరిగిందని డిస్కంలు నివేదించాయి. కానీ నెట్వర్క్ ట్రూ అప్ చార్జీలను దాదాపు రూ.3,977 కోట్లుగానే ఏపీఈఆర్సీ నిర్ధారించింది. ఇందులో ఉచిత వ్యవసాయ విద్యుత్ వినియోగంపై ట్రూ అప్ భారం రూ.1,066.54 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే సబ్సిడీగా భరిస్తోంది. 2021–22కు సంబంధించి ప్రతి త్రైమాసికానికి రూ.3,336.7 కోట్లకు నివేదిక సమర్పిస్తే కమిషన్ రూ.3,080 కోట్లకు అనుమతినిచ్చింది.2023–24 ఆర్థిక సంవత్సరం జూన్ నెల నుంచి నెలవారీ విద్యుత్ కొనుగోలు చార్జీల సవరింపును డిస్కంలు అమలు చేస్తున్నాయి. దీని ప్రకారం ప్రతి నెలా సర్దుబాటు తరువాత రెండో నెలలో అమల్లోకి వస్తుంది. నెలవారీ అదనపు కొనుగోలు వ్యయం, విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరిగిపోవడం, మార్కెట్ ధరలు తారస్థాయికి చేరుకోవడం, థర్మల్ కేంద్రాలలో 20 శాతం నుంచి 30 శాతం వరకూ విదేశీ బొగ్గు వాడటం, తగినంత జల విద్యుత్ ఉత్పత్తి లేకపోవటం వలన యూనిట్ దాదాపు రూ.1 వరకూ పెరిగింది. అయినా ప్రస్తుతం డిస్కంలు కమిషన్ ఆదేశాల మేరకు 40 పైసలే వసూలు చేస్తున్నాయి. 2022–23కు రూ.7,300 కోట్ల ట్రూ అప్ చార్జీలను వసూలు చేసుకోవడానికి అనుమతించాలని డిస్కంలు కోరినా ఏపీఈఆర్సీ అనుమతించలేదు. అలాగే 2023–24 ఆర్థిక సంవత్సరానికి డిస్కంలు నివేదించిన రూ.10,052 కోట్ల ట్రూ అప్ చార్జీలపైనా ఏపీఈఆర్సీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.అప్పటికీ ఇప్పటికీ ఎంతో వ్యత్యాసం2014–15 నుంచి 2018–19 మధ్య ఐదేళ్లలో గత ప్రభుత్వం చెల్లించాల్సిన సబ్సిడీలను చెల్లించకుండా విద్యుత్ పంపిణీ సంస్థలను నష్టాల్లోకి నెట్టేసింది. సబ్సిడీ రూ.17,487 కోట్లు మంజూరు చేయగా, అందులో రూ.10,923 కోట్లు మాత్రమే చెల్లించింది. రూ.6,564 కోట్లను చంద్రబాబు ప్రభుత్వం చెల్లించలేదు. అదే విధంగా 2014–19 మధ్య పెరిగిన విద్యుత్ కొనుగోలు, పంపిణీ వ్యయాలను బిల్లుల్లో సర్దుబాటు చేసుకునే అవకాశాన్ని డిస్కంలకు ఇవ్వలేదు. ఏపీఈఆర్సీకి తప్పుడు నివేదికలు ఇచ్చి, విద్యుత్ సంస్థల ఆదాయం బాగానే ఉన్నట్టు చూపించారు. దీంతో 2014–19 మధ్య దాదాపు రూ.20 వేల కోట్లు డిస్కంలు నష్టపోవాల్సి వచ్చింది.ఫలితంగా రాబడికి, వ్యయానికీ మధ్య అంతరం పెరిగిపోయి, పాత అప్పులే సకాలంలో చెల్లించలేని పరిస్థితి వచ్చింది. కానీ ప్రస్తుత ప్రభుత్వం అలా చేయడంలేదు. చెల్లించాల్సిన సబ్సిడీలను పక్కాగా చెల్లించడమే కాకుండా అదనంగా నిధులు ఇస్తూ ఆదుకునే ప్రయత్నం చేస్తోంది. ఖర్చులు పెరిగినప్పటికీ వ్యవసాయ, బడుగు బలహీన వర్గాలకు ఇస్తున్న ఉచిత, రాయితీ విద్యుత్ వినియోగంపై ట్రూ అప్ భారాన్ని ప్రభుత్వమే మోస్తోంది.2020–21 ఆర్ధిక సంవత్సరంలో కోవిడ్ వల్ల విద్యుత్ డిమాండ్ తక్కువగా ఉండటం వల్ల మార్కెట్లో విద్యుత్ కొనుగోలు ధరలు కనిష్టానికి చేరుకున్నాయి. దానివల్ల ఆదా అయిన దాదాపు రూ.4800 కోట్లను 2022–23 టారిఫ్‌లో డిస్కంలు తగ్గించాయి. వినియోగదారుల బిల్లుల్లో సర్దుబాటు చేశాయి. అంటే ఆ మేరకు వినియోగదారులపై చార్జీల భారం పడలేదు. ఇలా ఖర్చులు తగ్గినప్పుడు వినియోగదారులకు ప్రభుత్వం చొరవతో విద్యుత్ సంస్థలు ప్రయోజనం చేకూరుస్తున్నాయి. -
మూడేళ్ల చిన్నారిపై విద్యుత్ చౌర్యం కేసు
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఓ వింత ఘటన వెలుగు చూసింది. ఈ ప్రాంతానికి చెందిన మూడేళ్ల చిన్నారిపై విద్యుత్ చౌర్యం కేసు నమోదైంది. పెషావర్ ఎలక్ట్రిక్ సప్లై కంపెనీ (పెస్కో), వాటర్ అండ్ పవర్ డెవలప్మెంట్ అథారిటీ (వాప్డా) సంస్థల ఫిర్యాదు మేరకు ఈ చిన్నారిపై కేసు నమోదు చేశారు.తరువాత ఆ చిన్నారిని అడిషనల్ సెషన్స్ జడ్జి కోర్టులో హాజరు పరిచారు. ఈ ఉదంతానికి సంబంధించిన అఫిడవిట్‌ను పరిశీలించిన న్యాయమూర్తి కేసును కొట్టివేశారు. కాగా ఆ చిన్నారి ఏమి చేసిందనే దానిపై పెస్కో, వాప్డా అధికారులు స్పష్టత ఇవ్వలేదు. పాక్‌కు చెందిన విద్యుత్ పంపిణీ సంస్థలలో విద్యుత్ చౌర్యం కారణంగా జాతీయ ఖజానాకు భారీ నష్టం వాటిల్లుతోంది. విద్యుత్ పంపిణీ సంస్థల అధిక వసూళ్లపై పాక్‌లోని పంజాబ్ ఇంధన శాఖ ఏప్రిల్ 7న ఆందోళన చేపట్టింది.లాహోర్ ఎలక్ట్రిక్ సప్లై కంపెనీ, ఫైసలాబాద్ ఎలక్ట్రిక్ సప్లై కంపెనీ, ముల్తాన్ ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ, గుజ్రాన్వాలా ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ, ఇస్లామాబాద్ ఎలక్ట్రిక్ సప్లై కంపెనీలు ప్రభుత్వ శాఖల నుంచి అధిక మొత్తంలో చార్జీలు వసూలు చేస్తున్నాయని విద్యుత్ శాఖ పేర్కొంది.